Skip to content
Transcript తెలుగు
[ back ground music ] యువత యువత సనాతన భావం సనాతన రూపం యువత యువత [ back ground music ] ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం, సనూతన రూపం కార్యక్రమానికి సాయి ప్రసాద్ మీకు స్వాగతం పలుకుతున్నాడు. ఇందులో శ్రీ గణేష్ కూడా పాల్గొన్నారు. ఈనాటి మన భాగంలో వి.ఎస్.ఆర్. మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో యువదశ ప్రాముఖ్యాన్ని గురించి ఇప్పుడు మీరు వింటారు. మానవతా విలువలతో కూడిన విద్యని గనక అభ్యసనం చేస్తే మనకు తెలియకుండానే మనం ఒక మంచి గురువులో పడతాం. అవును. మంచి గురువులో పడ్డప్పుడు మన మన దగ్గర ఉన్నటువంటి ప్రజ్ఞ correct గా వాడతాం. చాకు ఉంది. పండు కోస్తాం, కంఠం కోసుకుంటాం అంటారు కదా. అవును. కంఠం ఎవడైనా కోసుకోవాలని అనుకుంటాడా? ఎవరు? తెలివిమాలిన వాడు అనుకుంటాడు. తెలివిగలవాడు పండు కోసి కడిగి దగ్గు-- మళ్ళీ చక్కగా జాగ్రత్త పెట్టుకుంటాడు. అంటే how you use... ఇది విధంగా ఉన్నదంటే- ఉమ్ ...డబ్బు పాపిష్టిది కాదు. కానీ పాపిష్టి వాడి చేతిలో డబ్బు పడితే- Exactly ...పరిస్థితులు మారతాయి. పరిస్థితులు మారతాయి. ఇవాళ అలా అయిపోయింది. కాబట్టి డబ్బు వెంట మనిషి ప-- పరిగెత్తుతున్నాడా? మనిషి వెంట డబ్బు పరిగెత్తుతున్నదా? అంటే రాత్రిపూట మనం ఒంటరిగా ఏదో మనకు తెలియని వీధిలోకి ప్రవేశించాం. వెళుతూ ఉంటాం. కుక్క మనల్ని చూసి అరిచింది. మనకు భయం వేస్తుంది కదా. ఉమ్ ఏం చేస్తాం మనం? పరిగెత్తడం మొదలు పెడతాం. ఉమ్ పరిగెత్తడం మొదలు పెట్టగానే వీడు నన్ను కొట్టటానికో, చంపటానికో వచ్చినవాడు పారిపోతున్నాడని అది మన వెనక పరిగెత్తుతుంది. [ నవ్వు ] అది వెనక పడుతోంది, మనము ముందుకు పరిగెత్తుతున్నాం. లంగరు అందటం లేదు. కాబట్టి ఎక్కడో స్థిమితంగా మనం ఎందుకు వచ్చాం? యవ్వనాన్ని ఏం చేయాలి? ఇప్పుడు యువత ప్రధానంగా విద్యార్థి దశ అనండి, యవ్వనం అనండి రెండే ప్రధానం. బాగా చదువుకోవటం, జీవితంలో చక్కగా స్థిమిత పడటం-- స్థిరపడటం. బాగా సంపాదించటంలో ధర్మంతో కూడిన డబ్బు కావాలి. ఉమ్ చక్కగా స్థిరపడటంలో ప్రశాంత జీవితాన్ని కోరుకోవాలి. రెండింటి మధ్య అర్థం గనక తెలియకపోతే బాగా డబ్బు సంపాదిస్తాం. Tons of money ఉంది మన దగ్గర. కానీ దాని utility- Utility ...తెలియదు. ఏముంది ఇవాళ ప్రపంచంలో ఇది వస్తు వినిమయ ప్రపంచం ఇది. ప్రపంచంలో market లో ఉన్న ప్రతి వస్తువు కొనేంత డబ్బు వీడి దగ్గర ఉంది. వీడి ఉన్న-- దగ్గర ఉన్న డబ్బుకు అనుగుణంగా ప్రపంచంలో అన్ని వస్తువులున్నాయి. మనం ఏం కావాలని డబ్బు సంపాదించాం? ఏం చేయబోతున్నాం? అందుకే స్వామి చారిటీని ఎప్పుడూ నమ్మి ఉండండి, vanity ని వదిలిపెట్టండి బంగారు. అయి ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇవాళ యవ్వన దశలో మనం చారిటీ గనక అంటే ఏముంది sharing and caring. Caring Sharing and caring మళ్ళీ ఇవాళ కొత్త మాటలుగా అనుకుంటున్నాం ఈనాటి భాషలో. సహనావవతు సహనౌ భునక్తు. అర్థం చేసుకోగలిగినట్లయితే మన దగ్గర ఉన్న జ్ఞానం గానీ, physical energy గానీ, mental capabilities గానీ, perceptions గానీ, interpretations గానీ ఇవన్నీ కూడా ఒక సమతుల్యాన్ని పొందుతాయి. పొందినప్పుడు మనకు ఒక ఓర్పు మనకు వచ్చేస్తుంది. మనకు ఓర్పు కావాలనుకున్నాం. అవును Skill, నేర్పు, orientation, ఏది ఎప్పుడు చేయాలి, ఏది చేయాలి, అసలు ముందు ఏది చేయకూడదు, ఎంత కావాలి, ఎంత అక్కర్లేదు, ఇవన్నీ కూడా మనం పదహారు, పద్దెనిమిది ఏళ్లలో ఆలోచన మొదలుపెట్టి ఇరవై, ఇరవై రెండు సంవత్సరాలు అంటే సుమారుగా నాలుగు సంవత్సరాలు గనక జీవితాన్ని practical గా సాధించినట్లయితే ఇరవై రెండవ ఏట నుంచి మధ్య వయసులోకి వెళ్ళేప్పటికీ He becomes number one in the world. ఇది మార్గం. మరి మేము స్వామి కళాశాలలో చదువుకున్న విద్యార్థులం. స్వామి భక్తులుగా ప్ర-ప్రధమంగా యువతగా స్వామి ఎంతో దిశానిర్దేశం చేశారు మాకు. ఇది ఒక మహత్భాగ్యం అనే మనం అనుకోవాలి. కానీ ప్రపంచంలో చాలామందికి స్వామి అనే ఒక anchor లేకుండా పోతున్నారు. అలాంటి వాళ్ళకి స్వామి తాలూకా బోధలు మనం విధంగా ఒక యువతగా మనం follow చేస్తూ వాళ్ళకి నిరూపించగలం? భావాన్ని మనం ఎలా అందించగలం? చాలా మంచి ప్రశ్న ఇది. ఇది మంచి ఆలోచన ముందు. ఎందుకంటే, ఎప్పుడైనా సరే భగవంతుడి నుంచి ఎటువంటి లాభాన్ని పొందాము, ఎటువంటి ప్రేమని, ఆనందాన్ని మనం పొందాము, దాన్ని గనక మనం ప్రపంచానికి ఇవ్వటం మొదలుపెడితే అత్యంత సహజంగా We become the messengers of Sai. స్వామికి ప్రచారం లేదు, అక్కర్లే. కానీ స్వామి యొక్క భావాలని, స్వామి ఆలోచనలని అది సాక్షాత్తు భగవంతుడు గనుక, మనం దాన్ని అనుభవించాం గనుక, ఇవాళ మనం అనుభవించి చెప్తున్నాం, ఊహించి చెప్పటంలే. అనుభవంలో నుంచి ఇదిగో మేము ఇక్కడికి వెళ్ళాం, స్వామి దగ్గరికి వెళ్ళాం. మాలో అట్లా ఉండేది, అపరిపక్వత ఉండేది. కానీ ఇవాళ ఇట్లా తయారయ్యానం, ఇవాళ మాత్రం నిలబడగలిగాం అంటే స్వామి కారణం అని చెప్తూ చెప్తూ ఉన్నట్లయితే అది ఒక పద్ధతి. రెండవది, మన జీవన విధానం ద్వారా ఒక critical సన్నివేశం ఏర్పడింది. అప్పుడు మనం ఎట్లా ఉన్నాం? మనకు తెలియకుండానే ఒక మహా ఆనందం వచ్చి ఒళ్ళో పడిపోయింది. time లో మనం ఎలా ఉన్నాం? ఇక్కడ బాగా దుఃఖించామా? దుఃఖం వచ్చినప్పుడు ఆనందంలో మనం అసలు పరవశులం అయిపోయి ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నామా? లేదు మామూలుగా దుఃఖం వచ్చినప్పుడు ఎలా సంయమనంతో ఉన్నాం?ఆనందం వచ్చినప్పుడు కూడా అదే సమయమనంతో మనం ఉన్నామా లేదా అని బేరీజు వేసుకున్నట్లయితే మన జీవితాన్ని చూసి మరొకడు నేర్చుకుంటాడు అక్కడ మనం చెప్పక్కర్ల మనం విషయం information అంతా మన దగ్గర ఉంది స్వామి అన్నారే information I2I, I2I అని అరుస్తుంటాం I2I లో బానే ఉంది information కి transformation కి ఇది link IT అని కూడా చెప్తుంటాం కదా స్వామి IT కాదు వేళ్లంతా IIT అంటున్నారు కదా information implementation and transformation అది IIT real IIT implementation గనక మన దగ్గర లోపించినట్లయితే రాముడు బాణాలు వేయటం నేర్చుకున్నాడు నేర్చుకో పోయి ఉన్నట్లయితే విశ్వామిత్రుడితో వెళ్లిన విశ్వామిత్రుడే బాణం వెయ్యాల్సి వచ్చింది అవునా ఎక్కడ నేర్పే అవకాశం లేదు నేర్చుకున్నాడు గనుక తాటక సంహారం చేశాడు శ్రీ కృష్ణ పరమాత్మ కాళీయ మర్ధనం చేశాడు గనుక చాణూర ముష్టికుల్ని మర్ధనం చేశాడు అక్కడ అంటే ఏమవుతున్నది ముందే ఒక preparation అవుతున్నది ముందే ఒక training అవుతున్నది it is a physical, metaphysical and spiritual training physical ok metaphysical intellect spiritual intelligence వీళ్ళకి కావాలి youth కి అన్నీ ఉన్నాయి intelligence ఉంది intelligence quotient ఉంది తర్వాత economic quotient ఉంది వాళ్ళ దగ్గర లేనిది ఏం లేదు ఏమి లేదయ్యా అంటే spiritual quotient లేదు spiritual quotient అంటే మళ్ళీ దేవుడు దాని వ్యవహారం కాదు ఉన్నదంతా బ్రహ్మమే there is nothing separate from me we are all one అనేటువంటి భావనే spirituality అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క అవతారంలో మరొక ప్రత్యేకత ఏంటంటే ఆయన మతం గురించి అసలు మాట్లాడలే డీమిస్టిఫై చేసి పారేశారు స్వామి మతాన్ని చేసేసే ముందు మీరు అధ్యాత్మంలోకి రండి spiritualise అయిపోండి అన్నారు spiritualise ఎప్పుడైతే అవుతామో religion నుంచి మనం దూరం అవుతాం religion మనల్ని ఎక్కడ ఆపదు spirituality లో మనిషి expand అవుతాడు అంటే ముందుగా ఉన్న మనిషి ఒక మరొక గొప్ప మనిషిగా మారాలి transform అవ్వాలి transform కావాలి ఉన్నత స్థితికి చేరాలి చేరాలి అంటే యవ్వనాన్ని మించింది లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చిన్నప్పుడు నా వరకు నేను pre university చదివేటప్పుడు మా college కి ఒక great personality వచ్చారు ఆయన some governor like person చాలా అద్భుతంగా మాట్లాడారు మంచి అందగాడు మాట్లాడటం కూడా బాగా మాట్లాడారు మేమంతా చిన్నపిల్లలం కాబట్టి ఆయన మాకు గంటసేపు ఒక అద్భుతమైన role model లా కనిపించాడు కాబట్టి మేము ఏం చేశాము ఆయన ఉపన్యాసం అయిపోగానే autographs కోసం వెళ్ళాం వెళితే అందరికి ఆయనేదో రాసిస్తున్నారు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నా వరకు నా autograph వచ్చేప్పటికి ఆయన తీసుకుని రాసి నా చేతికి ఇచ్చి నేను అట్లా అడుగు వెయ్యబోయేలోగా మళ్ళీ ఒకసారి వెనక్కి తీసుకున్నారు తీసుకుని మళ్ళీ ఏదో రాశారు ఇప్పుడు చదువు అన్నారు అది నా ఒక్కడికే దక్కింది college లో ఏమిటది అంటే youth shall reshape the world అన్నాడు అది మొదటి line అయిపోయింది అని తీసుకున్నా మళ్ళీ పిలిచారు చూడు అప్పుడు చిన్న comma పెట్టి of course with the help of adults అని పూర్తి చేశాడు ఆయన చూశారా అంటే యవ్వనారంభ దశలు దాటి యవ్వనం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ సమాజం వాళ్ళని spent force గా చూస్తున్నది తప్పు అది వాళ్ళ దగ్గర ఏముంది అంటే మన దగ్గర లేనటువంటి అనుభవం వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఏం లేదంటే physical reasons కారణంగా మన దగ్గర ఉన్నంత energy వాళ్ళ దగ్గర లేదు అందుకనే మానవుడు ఎప్పుడూ కూడా సమాజానికి సంక్షిప్త స్వరూపం it's a condensed form సమాజంను వ్యక్తి భిన్నం కాదు వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి అన్నారు స్వామి చూసావు కదా కాబట్టి వ్యష్టి సమష్టి అవుతున్నాడు సమష్టి సృష్టి అవుతున్నదని సమాజం అనుకోండి సమాజంలో రెండు దశలు మన దగ్గర experience ఉండాలి energy కూడా ఉండాలి time లో గనుక మనకి energy తో పాటు energy ఎట్లాగూ ఉంది experience కూడా గనుక జీవితానుభవాన్ని గనుక చక్కగా సంపాదించుకున్నట్లయితే మన ఆలోచనలు perversion వైపు వెళ్ళవు ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న అండి చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం మీరు చెప్పినట్టు ఉమ్ యువతకు ఉన్న energy అవును పెద్దలకు ఉన్న అనుభవం అవును రెండూ కలిస్తేనే output అనేది ప్రపంచానికి ఒక positive energy గా మనకు బయటకు వస్తుంది కరెక్ట్ కానీ కొన్ని పరిస్థితుల్లో మనం ఏం గమనిస్తున్నాం అంటే పెద్దవాళ్ళు వాళ్లకు ఉన్న అనుభవాన్ని next generation వాళ్ళకి pass చేయడానికి చాలామంది ముందుకు రావటం లేదు ఉమ్ పరిస్థితుల్లో యువత వాళ్ళంతట వాళ్ళు వెళ్లి వాళ్ళని అర్థించి particular skill నేర్చుకోవడమా లేకపోతే వాళ్ళ కోసం వేచి ఉండడమా ఏం చేయమంటారు? ఇక్కడ వేచి ఉండే యుగం కాదు ఇది ఉమ్ అసలు ఎవరికీ waiting అనేది లేదు అందరూ పరిగెత్తటం ప్రవహించడమే ఇక్కడ ఏం చేయాలంటే గణేష్ మీరు చెప్పినట్లుగా పెద్దవాళ్ళు experience ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఔదార్యంతో ఉమ్ పిల్లలు తమ దగ్గరకు వచ్చి చెయ్యి జాపే ముందే మా అనుభవం ఇది మేము సమస్యకి ఇలా పరిష్కారం మేము చెప్తున్నాం మీరు వినండి వాడుకోండి అని ఇస్తే అది చాలా గౌరవప్రదం ఉమ్ ఎందుకంటే యవ్వనంలో ఉన్నవాడు వెళ్ళి చెయ్యి చాపడు ఎందుకంటే ఇందాక అనుకున్నాం adolescent arrogance ఉందిగా కాబట్టి అడగడు అందువల్ల వీళ్ళు ఏం చేయాలి అంటే పెద్దవాళ్ళే ముందుకు రావాలి అవును వచ్చి మా జీవితానుభవం ఇది ఒకవేళ implement చేద్దాం అన్నా మా దగ్గర energy లేదు ఉమ్ అనుభవాన్ని ఇదిగో రంగరించి తీసుకోండి వాడుకోండి వాడుకోండి సమస్యలు వస్తాయి జీవితంలో దీని పరిష్కార మార్గాలు ఇవి వశిష్టుల వారు జ్ఞాన వృద్ధుడు, వయోవృద్ధుడు రాముడికి యోగ వశిష్టం చెప్పాడా లేదా? అవును అర్జునుడు చిన్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించాడా లేదా ఉమ్ మనందరం చాలా చిన్న పిల్లలం పన్నెండేళ్ళు పదకొండేళ్ళు అప్పుడు స్వామి దగ్గరికి వస్తే స్వామి అరవై ఏళ్ళు మనకు బోధ చేశారా లేదా ఆయన అనుభవాన్ని దాచిపెట్టేసుకుని దివ్యత్వాన్ని మరుగున పరుచుకున్నారా బహిర్గతం చేశారు ఉమ్ ఎప్పుడు ప్రారంభించారు యవ్వనంలో ఏం దాచుకోలేదు పైగా ఇంకో మాట కూడా చెప్పారు దాచి పెట్టావా పాచిపోతుంది ఎవరికీ పనికిరాదు అన్నారు circulation circulation కాబట్టి దీన్ని మనంఆ అందరికీ పంచే దిశగా పెద్దవాళ్ళు కూడా పెద్ద మనసుతో అందుకే వాడాన్న ఔదార్యంగా పిల్లల్ని దగ్గర తీసుకోవాలి వాళ్లతో కొంతసేపు గడపాలి. generation వేరు ఇది చెడిపోయింది ఇది బాగుపడదు మాటలు మాట్లాడకూడదు. నీకు అనిపిస్తోంది కదా వాళ్ళకి ఏదో కావాలి మన నుంచి అని ఒక అడుగు ముందుకేసి యువతకు గనక అది ఇచ్చినట్లయితే యువత చాలా శీఘ్రంగా దాన్ని అందుకో గలుగుతుంది. It's like a blotting paper imprint చాలా fast మంచిగాని చెడు గాని Absorbs everything Everything and anything కాబట్టి దాన్ని తీసుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి యువత వైపు వెళ్లినట్లయితే యువత ఎవరి ముందు చెయ్యి చాపనక్కర్లేదు నా దృష్టిలో నా అనుభవంలో చెయ్యి చాపకూడదు. కూడదు. అదే అనిపించింది ఇంతకు ముందు గణేష్ చెప్తున్నప్పుడు కూడా. ఉమ్ మేమంతా స్వామి దగ్గర ఉన్నాం కాబట్టి ఇన్ని విషయాలు అంటే ఇది మంచి ఇది చెడు అనే విషయాన్న తెలుసుకోగలిగాం. నిజానికి సమయంలో బయట చూస్తే గనుక simple thing మానవతా విలువలు అంటే అవేంటి అని అడిగే వాళ్ళున్నారు. ఉమ్ మీరు చెప్పినట్లుగా పెద్దవాళ్ళు ముందుకొచ్చి చెప్పకపోవడం వల్లొ లేదంటే వాడు పెరిగే పరిస్థితులు కూడా అలా లేకపోవడం వల్లొ తెలియదు అలాంటి వాడికి మంచి అనే జ్ఞానం ఎలా వస్తుంది? simple గా చూసుకుంటే విషయాన్ని చూసినా దాంట్లో మనం ఏం తీసుకుంటున్నాం అన్నది వయసులో చాలా ముఖ్యం అని నా ఉద్దేశం. దాని పైన మనిషి ఎలా ముందుకెళ్లగలడు? అవును ఖచ్చితంగా అందుకే స్వామి మనకి అన్నింటికీ స్వామి దిక్కు ప్రతి దానికి సమాధానం ఇచ్చారు ఆయన. అంతా దృష్టి లోపమే గాని సృష్టి లోపం లేదు బంగారు అన్నారు. అంటే whatever is created it is not faulty. ఉమ్ నీ attitude నీ outlook నీ approach నీ assessment నీ understanding నీ evaluation ఇవన్నీ కూడా దానిలో ఉన్న మంచిని చూపిస్తుంది. చెడుని చూపి-- బురుసు చెడుని చూపిస్తుంది. మనం మంచి కావాలి అనుకుంటాం మంచి కనపడుతుంది. అవును దాన్లో technical values ని appreciate చేస్తాడు. ఉమ్ కళాత్మక దృష్టిని appreciate చేస్తాడు. కథలో అంతర్లీనంగా సాగిన నీతిని పట్టుకుంటాడు. అవును రెండో వాడు వైభవాన్ని తళుకుని బెళుకుని పట్టుకుంటాడు. రెండు మార్గాలు చీలిపోయి ఉన్నాయి అందుకే స్వామి అంటారే మానవ జన్మే తరించటమా? అంతరించటమా? అక్కడ వచ్చింది రెండు చీలికలు అన్నారు ఆయన. ఉమ్ తరించే మార్గంలోకి వెళితే వాడు హాయిగా తరించడం అంటే refining himself అన్నమాట. అది అయితే దీనిలో ఒక ఉప ప్రశ్న ఏమిటంటే చెప్పేవాళ్ళు లేనందువలన ఇవాళ తరానికి మానవతా విలువలు అంటే ఏమిటి? అది సాయి ప్రసాద్ చెప్పింది hundred percent అనే వాళ్ళు ఉన్నారు. ఉమ్ అందుకనే స్వామి సనాతనమైనటువంటి ఒక భారతీయ ధర్మాన్ని మొత్తం ఐదు పదాలతో ముగించేశారు దాన్ని సంక్షిప్తం చేశారు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. ఐదు మాటలు సత్యసాయి భక్తులందరికీ అసలు కంఠోపాఠం కానీ వాడికి అసలు వాటి ఐదు ఉన్నాయని కూడా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఎలా అందించాలి? అంటే స్వామి మరి ఇప్పుడు స్వామి physical గా లేరు కదా మాట కూడా వింటుంటాం. ఉమ్ రాముడు ఉన్నాడా? [నవ్వు] కృష్ణుడు ఉన్నాడా? రామాయణం ఎందుకు చదువుతున్నాం? రాముడి గుణాలు ఎందుకు చదువుతున్నాం? వేదాలన్నీ మనం రాసిన వాళ్ళంతా ఋషులంతా ఉన్నారా? ఉండక్కర్లేదు. కాలం తన గమనంలో అనేకమైన విషయాలను వెనక్కి నడుతుంది. ఉమ్ అక్కడ కావలసింది విషయమే content ప్రధానం container కాదు. content ని గనక మనం పట్టుకోగలిగితే ఇవాళ స్వామి అనేకమైనటువంటి విషయాలని youth తో మాట్లాడే చెప్పినప్పుడు మనం వాళ్ళ గనక భావాలన్నీ నిష్పక్షపాతంగా రకమైనటువంటి ముసుగు వేయకుండా చెప్పగలిగినట్లయితే ఉమ్ వాళ్ళు దీన్ని చక్కగా అర్థం చేసుకోగలరు. నా అనుభవంలో చాలా తీవ్రమైనటువంటి అనుభవంలో ఉమ్ ఇవాళ యువత చెడిపోలేదు. చెడిపోయింది అని పెద్దవాళ్ళు ఇంకొకళ్ళు అంటూ అంటూ ఉంటే అవునేమో అనిపిస్తోంది గాని no. ఎందుకంటే మీరు వాడికి gadget చేతికివ్వండి ఐదు నిమిషాల్లో పట్టేస్తున్నాడు. ఉమ్ అవును దాన్ని సాధిస్తున్నాడు. ఉమ్ మామూలుగా knowledge లేనటువంటి వాడు ఐదు గంటలు time తీసుకుంటే ఐదు secondలలో చేసి చూపిస్తున్నాడు. ఉమ్ దీన్ని channel ache చేయవలసిన బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉన్నది అనేది సుస్పష్టం. యువత వేదిక ద్వారా ఇవాళ మనం Radio Sai శ్రోతలు గాని మరొకరు గాని మరొకరు గాని ఒకటే నేర్చుకోవాలి. జీవితంలో మనం ఏమి సంపాదించామో అది ఇతరులకి రకమైన అపేక్ష లేకుండా ఇవ్వగలిగే స్థాయికి వెళ్ళాలి. అవును అందుకనే స్వామి అంటారు spirituality అంతా నమ్మకం మీద ఆధారపడింది బంగారు అది అమ్మకం మీద ఆధారపడి లేదు. ఉహు నమ్మకం చాలా ప్రధానం. We must have faith. Faith ఒట్టి faith కుదరదు దానికి practice ఉండాలి. faith and practice ఎవరు faith పెద్దవాడిది practice ఎవరిది? చిన్నవాడిది younger man. ఇద్దరూ గనక కలిసి సమన్వయంగా వెళ్లగలిగినట్లయితే యువత అద్భుతమైనటువంటి రీతిలో తన జీవితాన్ని గడపగలదు. particular point of time లో నాకు స్వామి చాలాసార్లు ఉపన్యాసంలో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఉమ్ యువతకి అంటే ఇలాగ స్వామి తన అత్యంత ముఖ్యమైన సమయం అంతా యువతతోనే గడిపారు. అవును మనం చూసినట్లయితే అవును దాంట్లో స్వామి "students are my property, students are my property" అని ఎన్నోసార్లు తన ఉపన్యాసాల్లో చెప్పారు. దాంతోపాటు ఇంకొక అడుగు ముందుకెళ్లి మీ కోసం ఏం చేయడానికన్నా నేను ready గా ఉన్నాను. ఉమ్ నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి ready గా ఉన్నానన్న భావన తెలిపారు. అవును సో దాంతో స్వామి అట్లాగ ఒక mirror లాగా మనలో ఉన్న భావాలన్నీ reflect చేస్తూ మనకోసం తనను తానే త్యాగం చేసుకునే అంత స్థితికి ఎదిగారన్నమాట. అవును సో దాంతో సాయి యువతకి ఎంతో confidence వచ్చింది వచ్చింది సో faith స్వామి మాకు ఇవ్వగలిగిన తర్వాత మేము state కి rise అవ్వగలిగాం అని నా opinion సార్ అవును నిజం ఎందుకంటే స్వామి విద్యాసంస్థలు పెట్టనంత వరకు విద్యార్థులు లేరు లేరు విద్యార్థులు వచ్చాక మీతో మాట అన్నారు ఉమ్ మరి విద్యాసంస్థలు లేని రోజుల్లో ఉన్న మాతో ఏమన్నారంటే ఉమ్ "నా భక్తుల ఆనందమే నాకు ఆహారము" అన్నారు ఆహ్ "నా భక్తులే నాకు ఆస్తి" అన్నారు తర్వాత "విద్యార్థులే నా ఆస్తి" అన్నారు అప్పుడు భక్తుడు మీరు విద్యార్థులు రాకముందు భక్తులంతా ఎవరు యవ్వనంలో ఉన్నవాళ్లే అంతే అవును రియాలిటీకి వాళ్ళకి యాభైలు అరవైలు వచ్చినాయి గాని ఇప్పుడున్న వయసులో నలభై ఏళ్ళు minus చేస్తే అప్పుడు వాళ్ళు యువ-యువకులే కనుకనే స్వామి కార్యక్రమం అంతా కూడా ఆయన వృద్ధుల మీద నెట్టలేదు ఉమ్ ఇంకో విశేషం ఉంది అసలు స్వామి జీవితంలో నుంచి చాలా విషయాలు మనం గమనించి నేర్చుకోవాల్సినవి స్వామి 2003 చైర్ కి పరిమితమైనారు ఉమ్ ఉమ్ కదా అంతకు ముందు చక్కగా నడిచి వచ్చేవారు సరే మనందరికీ విషయం తెలుసు మళ్ళీ చెప్పుకోనక్కర్లే 2003 కంటే స్వామి చేసిన పనులు ఒక ఎత్తయితే 2003 అంటే తానీకి నడవకుండా కదలకుండా ఎక్కడికి వెళ్ళకుండా కేవలం చైర్ లో నిమిత్త మాత్రంగా కూర్చొని స్వామి సాధించిన పనులు జగజ్జేగీయమైనటువంటివి అవును అక్కడ పోనీ మామూలు స్వామి మామూలు మనిషి అని ఒక క్షణం కనుక అనుకున్నట్లయితే మరి ఎనభై ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి దేహంలో ఉన్న స్వామి sports meet పెట్టడం ఏంటి? స్టేడియా కట్టడం ఏంటి? world cricket match పెట్టడం ఏంటి? ఏమిటి ఆలోచన అంటే శరీరానికి వయసు వచ్చినది గాని మనసు యవ్వనమే మనసు యవ్వనం నిత్య యవ్వనమైనటువంటి భావంతో మనిషి బతకాల అది యవ్వనం యొక్క శక్తి శ్రీ కృష్ణ పరమాత్మ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన వయస్సు ఎనభై తొమ్మిది అర్జునుడి వయస్సు ఎనభై ఐదు ఇద్దరూ యుద్ధానికి వెళ్లారు అందులో మహాభారత యుద్ధం ఉమ్ మరి ఎనభై తొమ్మిది ఏళ్ళ ఒక వృద్ధ కృష్ణుడా అంటున్నామా? అనటం లేదుగా అసలు వాళ్ళ వయస్సు చూస్తున్నామా అంటే వాళ్ళలో ఉన్న ధీశక్తి వాళ్ళ వయస్సును దాటింది కాబట్టి ఇవాళ మనం అనుకుంటాం యవ్వనంలో ఉండి నేనేం చేయగలను ఉమ్ నా వల్ల ఏమవుతుంది నేను అనుకున్నది జరగలేదు నేను అనుకున్నట్లుగా నడవటలేదనే నిరాశ చెందిన యువకులకి యువతులకి ఒక్కటే మాట నిరాశ చెందకండి మీలో ఉన్న అంతర్గత శక్తులను బయట పెట్టుకోండి ఉమ్ మహాత్ముల మాటలు వినండి పెద్ద పెద్ద వాళ్ళ biographies చదవండి ఉమ్ దాని నుంచి స్ఫూర్తిని పొందండి వ్యక్తి కూడా మీరు మహాత్ముడి జీవిత చరిత్ర చూడండి వాళ్ళు బాల్యంలో యవ్వనంలో అనేక కష్టాలు పడ్డారు అవును యవ్వనం అంటే ఏమిటో తెలియకుండా వాళ్ళకి దశ గడిచిపోయింది ఇవాళ యవ్వనము అంటే భోగము అనే స్థాయికి వచ్చేసింది సుఖం సంతోషం self centered self loving అవి కూడా పరమాత్మ అనుకొని ఉన్నట్లయితే ప్రపంచం ఏమై ఉండేది? [నవ్వు] స్వామి త-తన యవ్వనారంభ వేళ పద్నాల్గవ ఏట తల్లిని తండ్రిని కుటుంబాన్ని ఉన్నవాళ్ళని కాదనుకొని బయటికి ఎలా రాగలిగారు ఎంత ధైర్యం ఉమ్ ఇక్కడ ఏముంది? పుట్టపర్తిలో మీకు నాకు మాయ తెగిపోయింది సంబంధమే లేదు అని అనటానికి ఎంత ధైర్యం కావాలి ఇవాళ నలభై ఏళ్ళు వచ్చిన వాడు కూడా మా నాయన డబ్బు పంపితే బాగుండు [నవ్వు] మా నాయన నన్ను చూస్తే బాగుండు అంటున్నాడా లేడా? అవును మరి దీనికి ఎక్కడ దానికి ఎక్కడ? అమ్మో విశ్వామిత్రుడు వచ్చాడు నాకు బాణాలు అంటే భయం నేను ఇంట్లోనే ఉంటాను నేను రాజు కొడుకుని కావాలంటే సైన్యాన్ని పంపమన్నాడా రాముడు? ఉమ్ అనలేదే అక్రూరుడు వచ్చి మీ మేనమామ కంసుడు పిలుస్తున్నాడు అంటే పరమాత్మ కాబట్టి అయినా వయస్సు చిన్నదైనా ఉమ్ అక్రూరుడి వెంబడి వెళ్ళాడా లేదా అంటే ఒక ధైర్యం ఉండాలి ఆత్మ స్థైర్యం ఉండాలి మనోబలం ఉండాలి ఇంద్రియ నిగ్రహం ఉండాలి స్పష్టత ఉండాలి ఏం కావాలో ఏం అక్కర్లేదో perfect demarcation గనక ఉంటే ఇవాళ యువత వాళ్ళు రాబోయేటువంటి రోజులలో వాళ్ళ తర్వాత వచ్చేటువంటి యువతని పరమాద్భుతంగా నడిపించగలదు ఇవాళ స్వామి మాటలు స్వామి చేసిన పనులు మనకి స్ఫూర్తిని కలిగిస్తున్నాయి కదా ఉమ్ మనం అంటున్నాం కోటానుకోట్ల మందికి స్వామి చేసినంత పని కోటానుకోట్ల మంది కలిసి స్వామికి చేయలేం అని నిర్ణయానికి వచ్చేసాంగా మరి అప్పుడు ఆయన ఒక వ్యక్తేగా ఉమ్ మరి ఒక వ్యక్తి ఒక వ్యవస్థని ఒక ప్రపంచాన్ని ఒక సృష్టిని ఎలా చేయగలిగారు? స్వామి గనుక తన పద్నాలుగో ఏట కాకుండా యాభై ఏళ్ళు వచ్చిన తర్వాతనే సాయిబాబా అని ప్రకటించి ఉంటే ఏమై ఉండేది? time చాలేది కాదు అవును ప్రణాళికాబద్ధమైన జీవితం మనం గడపాలి మన యవ్వన దశలో ప్రతి క్షణాన్ని positive గా వాడుకోవాలి అందుకే స్వాధ్యాయం చేయాలి బాగా చదవాలి మంచి మాటలు వినాలి మనంతట మన బుద్ధి కుశలతతో ఆలోచించాలి ఉమ్ ఇవన్నీ ఒక ఎత్తయితే practical గా మనం చేయాలి dignity of labour చాలా చాలా important ఇది ఇవాళ మనం ఇక్కడ మంచినీళ్ళ glass ఎవరో తెచ్చి ఇవ్వాలని car door ఎవడో తెరవాలని మనం ప్రత్యానికి ఇంకొకడి మీద ఆధారపడుతున్నాం వాడు తేకపోతే మనం చికాకు పడుతున్నాం ఉమ్ లేదు మన పని మనం చేసుకోవాలి చేయగలం కానీ అహం మనకు తెలియని arrogance వల్ల మనం పని చేయటం లేదు కాబట్టి యవ్వనం అనేటువంటిది పెద్ద అద్దం ఉమ్ మనం యవ్వనంలో గడిపినంత ఎక్కువ time అద్దం ముందు గడపాం ఉమ్ ఎందుకంటే తర్వాత మనల్ని చూసుకోవటం మనకి పెద్ద ఇష్టం ఉండదు [నవ్వు] ఎందుకంటే మనం బావుండం కదా కానీ అద్దం ముందు నుంచు-నుంచుంటారు ఆయన నుంచినవాడు అక్కడి నుంచి రాడు దాని మీద దువ్వి దువ్వి సర్ది సర్ది నేను బాగున్నానా లేదా బాగున్నానా లేదా time అంతా అక్కడే గడుపుతున్నాడు ఉమ్ నో ప్రపంచంలోకి మనం కర్మ యిస్టులుగా వెళ్ళాలి We have to be very practical We must be pragmatic We must be prudent practical pragmatic and prudent మూడు ఎక్కడైతే ఉన్నాయో యువతకి ఢోకా లేదు ఇంకొక్క పాయింట్ కూడా నేను add చేద్దామనుకుంటున్నా తప్పకుండా pragmatic prudent తో పాటు ఉమ్ proactive గా కూడా యువత ఖచ్చితంగా రెండూ ఉంటే వాడు proactive అయిపోతాడు అయిపోతాడు automatic గా proactive is inclusive ఉమ్ it is not exclusive రెండూ లేని proactive వల్ల ప్రయోజనం కూడా లేదుగా కాబట్టి మూడు సమన్వయం చేసుకోవాలి అలాగే యవ్వన దశలోవచ్చేటువంటి ఇబ్బందుల్ని జీవిత పాఠాలుగా నేర్చుకోవాలి. కాకపోతే మనకంటే పెద్దలు ఏం చేశారంటే గుణపాఠం బాగా నేర్చుకున్నావా అనే దాంట్లో ఒక వ్యంగ్యం ఉంది. వ్యంగ్యం [నవ్వు] గుణపాఠం అంటే పాపం చేసినట్టు పాపం నుంచి మనం బయటపడ్డట్టు. కాదు, జీవిత పాఠం నేర్చుకున్నావా లేదా? నాకో చిన్న ఉదాహరణ చెప్తాను. నేను కాస్త అప్పుడే యవ్వనం దాటిన సమయంలో నేను ఒక మొట్టమొదటి పుస్తకం రాశా. రాశాను గానీ పుస్తకం మరి స్వామికే ఇవ్వాలనుకున్నప్పుడు స్వామికి సమర్పించుకోవాలని నేను తాతాలాడా. వైట్ ఫీల్డ్ కి వెళ్ళా. త్రయీ బృందావనంలో రోజు ఎవరో గవర్నర్ ని పిలిచారు దాంతో పాటు నన్ను కూడా స్వామి పిలిచారు. ఉమ్ క్రితం రాత్రి గోకులంలో కూర్చొని అంతా కూడా దిద్దుకుంటూ కూర్చున్నా. ఉమ్ స్వామికి ఇవ్వబోతున్నా, ఆయన పిలుస్తారు పిలవరో తెలియదు కానీ పిలిస్తే మనం రెడీగా ఉండాలి అని. తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రపోయా. ఉమ్ మళ్ళీ మామూలు దర్శనానికి వెళ్ళిపోయి స్వామి పిలిచారు. పిలిచిన తర్వాత వచ్చిన డిగ్నిటరీస్ ఎవరో వాళ్ళని సాగనంపిన తర్వాత "ఏమి రాత్రంతా ఏం చేస్తూవీ?" అని అడిగారు. ఉమ్ స్వామి ఇదిగో బుక్కు రాస్తున్నాను. బుక్ అంతా ప్రూఫ్ రీడింగ్ చేశాను రాత్రి కూర్చొని. స్వామి అన్న మాట నాకు అది పెద్ద పాఠం. ఉమ్ మనందరికీ కూడా. ఉమ్ ఏమన్నారంటే "జీవితమే ప్రూఫ్ రీడింగ్ కదా బంగారు." అవును రాస్తాం పొరపాటు చేస్తాం దిద్దుకుంటున్నాంగా ప్రూఫ్ రీడింగ్ జీవితమే ప్రూఫ్ రీడింగ్ కదా అన్నారు సాలోచనగా. ఒక simple sentence చిన్న statement దాంతో మనం ఆలోచనలో పడిపోతాం. తప్పు చేయనే కూడదు. తప్పు చేశాంగానక అచ్చు తప్పు పడిందే గనకనే దిద్దాం గా. మనం కొమ్ము సరిగ్గా ఒత్తు సరిగ్గా ఇవన్నీ కనేగా మనం దిద్దాం. పని చేయకూడదు. That is how the master teaches you. అక్కడ మరి స్వామి మనకంటే వయసులో అప్పటికి పెద్ద. జీవితానుభవం తర్వాత మా పరమాత్మ యొక్క శక్తి అన్నీ సమన్వయం చేసి "బాగుంది పుస్తకం నువ్వు అచ్చు చేసుకో" అని అనలే. [నవ్వు] ప్రూఫ్ రీడింగ్ అంటే జీవితమే ప్రూఫ్ రీడింగ్ కదా. ఆయన గుణపాఠం అనలే, జీవిత పాఠం అన్నారు. అది. నిజానికి ఉమ్ మరి మనిషికి అంటే యువదశలో ఉన్న మనిషికి చెప్పటానికి పెద్దవాళ్ళు ఉన్నారా? వాళ్ళు చెప్పట్లేదా? లేదంటే యువత పెద్దవాళ్ళని approach అవ్వట్లేదా? అని అనుకున్నప్పుడు నిజానికి తెలిసో తెలియకో చిన్నప్పటి నుంచి పాఠాల ద్వారా కానీ simple గా వేమన పద్యాలు ఇలాంటివి కానీ అవన్నీ చెప్తూనే ఉన్నారు. కానీ మనిషి దాన్ని పట్టించుకోకుండా అంటే పద్యం రాస్తే marks వస్తాయో లేకపోతే exam రాస్తే నాకు ఏదో ఉద్యోగం వస్తుందో అన్నట్టుగా వెళ్తున్నాడు. సో అంటే దాన్-దాంట్లో తీసుకోవాల్సింది తీసుకోవట్లేదు అనిపిస్తుంది. విన్నదాన్ని correct గా అర్థం చేసుకుని తీసుకోవట్లేదు అనిపిస్తుంది. అది నిజం. అది దాంట్లో సందేహం ఏం లేదు. మా-- అందుకే స్వామి మళ్ళీ ఇదే సందర్భంలో ఏమన్నారంటే marks వచ్చే చదువు చదవండి తప్పదు remarks రాని జీవితం కోసం చదవండి అది. అదే అనిపించింది. ఛాన్సలర్ గా ఉండి స్వామి "marks important కాదు బంగారు remarks లేకుండా చూసుకోండి" అన్నారు. university లోనూ విద్యాసంస్థలోనూ ఇలా చెప్పరు. చెప్పరు. సో బయట ఉన్న విద్యార్థులు కానీ బయట చదువుతున్న విద్యాసంస్థలో ఉన్న విద్యార్థులు కానీ దీన్ని ఎలా తీసుకోగలరు? దీనికి ఒకటే మార్గం. ఉమ్ చూడు స్వామి కూడా అవతారాలను గురించి చెప్తూ మానవుడి యందున్న కరుణ చేత పరమాత్మ దిగి వస్తాడు దాని పేరు అవతారం అని ఒక statement ఇచ్చారు. అవునా? మనందరికీ తెలుసు. ఉమ్ మానవుడి యందున్న కరుణ చేత వస్తాడు. అంటే ఆయన దిగి వస్తున్నారు. ఆయనే దిగి వస్తున్నప్పుడు మెట్టు ఎక్కాలిగా మనం. మనం ఎక్కుతూ ఉంటాం, ఆయన దిగుతూ ఉంటారు, మనం చోట కలుస్తాం. దాని పేరు యోగం. దిగి రావటానికి పరమాత్మ ఎప్పుడూ సిద్ధమే. ఎన్ని సార్లు వచ్చాడు, ఎన్ని రూపాలలో వచ్చాడు. మానవుడు ఎక్కే ప్రయత్నం చేయాలి. మెట్టు ఎక్కాలి. మెట్టు ఎక్కే ప్రయత్నమే సాధన. అంటే మనం పెద్దవాళ్ళ దగ్గరికి మనం కూడా వెళ్ళాలి. వాళ్ళంతట వాళ్ళు రావాలని ఎట్లా అనుకున్నామో మనంతట మనం కూడా వెళ్ళాలి. మహాత్ముడు ఉంటాడు. ఆయన మనకు రోజూ పాఠాలు చెప్పక్కర్లే. వెళ్లి ఆయన దగ్గర కాసేపు కూర్చుంటే, ఆయన మిగతా వాళ్ళతో ఎట్లా interact అవుతున్నారు, మిగతా వాళ్ళు ఆయనతో ఎలా interact అవుతున్నారు, అందరూ ఒకే భావంతో రారు కదా. ఉమ్ ఒకడు కష్టంలో వస్తాడు, ఒకడు సుఖంలో వస్తాడు, ఒకడు ఆశ్రయించి వస్తాడు, ఏదైనా ఆప్త వాక్యం కోసం వస్తాడు, వాత్సల్య స్పర్శ కోసం వస్తాడు. మరి వీళ్ళందరినీ ఆయన సంతృప్తి పరచి పంపుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది quality అని గమనించినట్లయితే ఉమ్ మనకు అవన్నీ అలవాటు పడతాయి. మనం ఊరికే అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళాం లేదా మహాత్ముడి దగ్గరికి వెళ్ళాం. మేము కూడా రెండు మూడు గంటలు కూర్చున్నామంటే ఆయన కూర్చున్న కుర్చీ కూడా కూర్చుంది. ఉమ్ ఏం ప్రయోజనం? అందుకే స్వామి అన్నారే పాయసం లో గరిటకి పాయసం రుచి ఏం తెలుస్తుంది? దాని పని వడ్డించటంతో అయిపోతుంది. తిన్న వాడికి తెలుస్తుంది రుచి. తిన్న వాడికి తెలుస్తుంది. మనం తినటం అంటే ఏమిటి? practical గా తీసుకోవాలి. ఏది గమనించామో మనం దాన్ని practical చేయాలి. ఉమ్ ఎప్పుడైతే ఆచరణలో పెడతామో మనం దాని ఫలితాన్ని రుచి చూస్తాం, అనుభవిస్తాం. కాబట్టి ఇవాళ youth ఏం చేయాలి అని సమప్ మనం చేసుకోవలసి వస్తే ఉమ్ ముందు బాగా చదవండి. number one. బాగా వినండి. రేడియో సాయి ఎలాగూ ఉండనే ఉంది. ఉమ్ ఎన్ని విషయాలు కొన్ని కోకొల్లలుగా చెప్తూనే ఉంది. వినండి ముందు. ముందే opinion, prejudice form చేసుకోకండి. వినండి. open minded తో వినండి. ఇర్రేషనల్ గా, హాయిగా, radical గా ఆలోచిస్తూ ఉండండి. విన్న దాన్ని మననం చేసుకోండి. ఉమ్ మననం చేసుకున్న దాన్ని కావలసిన point గుర్తు పెట్టుకోండి. అది మనకు రేపు పొద్దున సాధన అవుతుంది. ఇదొకటి. మంచి సద్గోష్ఠిలో like minded నలుగురు friends ఉంటారు. ప్రాపంచికమైన విషయాలు ఎలాగూ మాటలు వస్తాయి. వాటికంటే కూడా జీవితానికి పరువు తెచ్చే మాటలేవన్నా ఉన్నాయేమో గమనించుకోవాలి. ఉమ్ వాటిని గురించి కూడా చక్కగా నిష్పాక్షికంగా చర్చించుకోవాలి. మనం మెట్లు ఎక్కుతున్నాం, నిచ్చెన ఎక్కుతున్నాం, ఆకాశం వరకు వేస్తున్నాం. ఆకాశం దాకా వేసే నిచ్చెన నిలబడుతుందా? నిలబడదా? ఒకవేళ అది నిలబడినా కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే మనం అక్కడ నిలబడగలమా లేదా? ఉమ్ ఇవన్నీ ఎవరికి వాళ్ళే బేరీజు వేసుకోవాలి. నువ్వు పనికి సమర్థుడివి, నువ్వు అసమర్థుడివి అని ప్రపంచం చెప్పదు. సమర్థత, అసమర్థత మనల్ని మనం self evaluation చేసుకోవాలి. నాలుగవదిబయోగ్రఫీస్ చదవాలి. బాగా! చదివితే మంచి స్ఫూర్తి కలుగుతుంది. అంతటి వాడు ఇన్ని ఇబ్బందులు పడ్డాడా? మన ఇబ్బంది ఏముంది nothing. అనేటువంటి భావన రాగానే మన బలహీనతలన్నీ బలాలుగా మారిపోతాయి. కాబట్టి you have to convert the negative into positive. అది కష్టం అనిపిస్తే positive ఎలాగో ఉంది negative ను వదులుచుకునే ప్రయత్నం చేయాలి. రెండింటిలో ఏదో ఒక మార్గం మాత్రం యవ్వనదశలో అర్థం చేసుకోవాలి. అలాగే ప్రపంచానికి ఏం కావాలో, వాటి అవసరాలు ఏమిటో కూడా ఒక కంట కనిపెట్టాలి. లేదు నా దగ్గర ఉన్న వస్తువు కొను అంటే కొనేవాడు ఉండడు. కొనేవాడికి కావలసిన వస్తువు మన దగ్గర ఉంటే మన దగ్గరికి వాడు వస్తాడు. అవును సార్ అంతే. Business principle ఇది. ఉమ్ ప్రపంచం కూడా జీవన వ్యాపారం కనుక అయినట్లయితే ప్రపంచానికి ఏం కావాలి? అది మన దగ్గర ఉంటే ప్రపంచం మనల్ని అక్కరకు దగ్గర తీసుకుంటుంది. మన దగ్గర చాలా knowledge ఉంది కానీ context లేదు దానికి. ఏం చేద్దాం? బూజు పట్టిపోతుంది. ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి ఎక్కడికక్కడ update చేసుకుంటూ వెళ్ళాలి. ఉమ్ సమయానికి, కాలానికి, అవసరానికి విలువను మనం ఎట్లా attach చేయగలం. విలువ ద్వారా దాన్ని, విలువ మాత్రం పోగొట్టుకోకూడదు. విలువల ద్వారా దీన్ని ఎట్లా మనం సాధించుకోగలం అన్నప్పుడు విలువలే మానవతా విలువలు. మానవుడు మాత్రమే ఆచరించగలిగిన ఐదు విలువలను గనుక మనం జాగ్రత్తగా మన friends ద్వారా, మన పిల్లల ద్వారా, మన చుట్టూ సమాజంలో ఉన్న అనేకమందికి మనం చెప్తూ చెప్తూ వాటిని మనం ఆచరించినప్పుడే చెప్పే హక్కు ఉంటుంది. ఉమ్ ఆచరించనప్పుడు బోధించే హక్కు ఉండదు. ఒకవేళ మనం బోధించినా వినేవాడు ఉండడు. స్వామి మాట ప్రపంచాన్ని ఒక వేదవాక్కుగా ఎందుకు భావించింది? ఆయన ఏం చెప్పారో అది చేశారు. ఏం చేయాలనుకున్నారో అదే చెప్పారు. దాంట్లో తేడా లేదు. కాబట్టి success mantra అనేవేళ కొత్త మాటలు వింటున్నాం [నవ్వు] success ఏమో English, మంత్ర ఏమో సంస్కృతం. success మంత్ర. విజయానికి ఐదు మెట్లు, అపజయానికి ఆఖరు మెట్టు. ఇవి కాదు కావలసింది. అవి బుద్ధికుశలతను పెంచవు. మన పురాణాలు, కథలు, త్యాగమూర్తుల యొక్క త్యాగ గాథలు, వీరగాథలు, అలాగే దీనగాథలు, భాగవతం అంతా భాగవతంలో అన్నీ దీనగాథలే. ఉమ్ పరమాత్మ ఎలా వచ్చాడు? ఎట్లా ఆపన్నుడై రక్షించాడు? ఇవన్నీ మనం గమనించినప్పుడు ఉమ్ There is one force which is beyond human comprehension. అది that is called god అని గనుక మనం నిర్ణయించుకుంటే మనమే అధికులమనేటువంటి భావన ముందు adolescent arrogance లో పోతుంది. పోతుంది Arrogance ఎప్పుడైతే పోతుందో కాస్త ignorance ఇంకా ఉండనే ఉంది. ignorance మంచి. అందుకే స్వామి అంటారే.. సత్సంగం సత్సంగం. ABC, ABC అంటే A for apple, B for battle, C for cattle కాదు. [నవ్వు] apple తిండి, battle కొట్లాట, cattle పశుత్వం. ఇది కాదు. ABC అంటే Avoid Bad Company. చిన్నమాటలు చూడండి. స్వామి సనాతన సారథి. ఒక, ఒక శతాబ్దానికి చెందినటువంటి మానవుడిగా అనుకుంటే he belongs to the last century. But ఆయన మాటలు అట్లా లేవు. నిత్య నూతనంగా నిత్య నూతనం. ఇవాళ ABC కి ఏం చెప్పాలో చెప్తున్నారు ఆయన. కాబట్టి స్వామిని multi-dimensional లో మనం అర్థం చేసుకుంటే, రాముడి యవ్వన కాలాన్ని, కృష్ణుడి యవ్వన కాలాన్ని, స్వామి యవ్వన కాలాన్ని అలాగే మహాపురుషుల యవ్వన కాలమంతా మనం కూడా సమతుల్యంగా చక్కగా evaluate చేసుకున్నట్లయితే ఇవాళ మనం ఏం చేయాలో తెలుస్తుంది. With the same force, in the same tempo ఏం చేయకూడదో కూడా తెలుస్తుంది. అది. [背後 music] ఇంతవరకు మీరు యువత కార్యక్రమంలో ఈనాటి మన భాగంలో వి.ఎస్.ఆర్. మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో యువదశ ప్రాముఖ్యాన్ని గురించి విన్నారు. వచ్చే వారం మరో అంశంపై చర్చా కార్యక్రమాన్ని వింటారు. Sai Ram. [背後 music]
SSSMC · audio

Yuvatha - Discussion on the importance of the Youthful stage of life - 02

Home

Yuvatha - Discussion on the importance of the Youthful stage of life - 02

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 34:56

More in this series

Yuvatha — Importance of the Youthful Stage of Life

2 episodes · 1 hr 6 min

  1. 31 min 1

    Yuvatha - Discussion on the importance of the Youthful stage of life - 01

  2. 34 min 2

    Yuvatha - Discussion on the importance of the Youthful stage of life - 02

    Now playing