No transcript for this section.
Transcript begins at 0:00.
[సంగీతం] వందే గురునాం చరణారవిందే సందలిశ్యత స్వాత్మ సుఖాబోధే జనశ్శయే జంగలికాయమానే సంసార హాలాహల మోగశాని. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పర్దామే. అనంతకోటి గురు స్వరూపాల మహా స్ఫురతికి ప్రణజలి ఘటిస్తూ, ఈ వేళ గురువు అంటే ఎవరు? ఈ గురు పరంపర విధానం భారతీయ ఆధ్యాత్మిక ఎట్లా ప్రారంభమైంది కొంత విచారణ చేద్దాం. నిజానికి కృతయుగంలో దేవగురువులు, రాక్షస గురువులు అని మాత్రమే ఉండేవారు. మరి దేవలోకంలో ఉండేటువంటి ఆ గురువుల సంగతి ఎట్లా ఉన్నా, మరి లోకానికి ఒక గురువు అవసరం కదా? అంటే, అవసరమే ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య గనుక. ఆ క్రమంలోనే, ఆ భావనలోనే, ఆ నేపథ్యంలోనే ద్వాపర యుగంలో వచ్చినటువంటి తొట్ట తొలి గురువు ఎవరు అంటే వ్యాసులవారు. వ్యాసమహర్షి. ఎట్లాగైనా మనం పిలవవచ్చు. వ్యాసుడు అంటే విస్తృతంగా చెప్పేవాడు అని అర్థం. ఒక విషయాన్ని తీసుకుని సర్వజనామోదంగా, సర్వజన సమ్మతంగా అందరికీ అర్థం అయ్యేట్లుగా చెప్పేటువంటి వాడు నిజానికి వ్యాస గురువు అవుతున్నాడు. ఈవేళ మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ వ్యాస గురువు ఎవరంటే వేదవ్యాసులవారు. అంతా కలిపి ఒక ముద్దగా ఉన్నటువంటి వేదాలనన్నింటినీ కూడా ఋక్ సామ యజుహు అనేటువంటి మూడు వేదాలుగా విభజించి, ఋక్ అంటే మాట, సామ అంటే పాట, యజుహు అంటే ఆట అంటే కర్మకాండ. ఆట, పాట, మాట ఈ మూడింటిని కూడా ప్రపంచానికి అందించినటువంటి వేదవ్యాసులవారేనండి. వ్యాసులవారు వచ్చి ఆయన వేదవ్యాసుడు అయినారు. మరి వ్యాసులవారు చెప్పినందువలన వ్యాసుడు అయినాడు గానీ ఆయన అసలు పేరు ఏమిటి అని? ద్వీపంలో పుట్టాడు గనుక ద్వైపాయనుడు అయినాడు. అది నిజమే మరి అసలు పేరు ఏమిటని? ఆయన పేరు కృష్ణ. ద్వాపర యుగంలో ఒక విచిత్రం ఏంటంటే గురువు కాబోతున్నటువంటి వ్యాసులవారు కృష్ణ నామంతో వచ్చారు. ద్వాపరయుగాన్ని శాసించి నడిపించినటువంటి యాదవ కృష్ణుడు అంటే మనకు తెలిసిన జ్ఞానం ఆమ్ స్వరూపం అయినటువంటి కృష్ణుడు కృష్ణ నామంతో ఎలాగు వచ్చాడు? మరొక పార్శ్వం ఉన్నది. మహాభారత సంగ్రామానికి మూలమైనటువంటి ద్రౌపది పేరు కృష్ణ. అంటే కృష్ణుడు, ద్రౌపది, వ్యాసుడు ముగ్గురి పేర్లు కృష్ణ అనేటువంటి నామంతో వచ్చారు. ఈ వేదాలు విభజన చేసిన తర్వాత పద్దెనిమిది పురాణాలు ఈ ప్రపంచానికి అందించారు ఆయన. ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించాడు కనుక పైగా ఈ ఆషాఢ పౌర్ణమి నాడే పద్దెనిమిది పురాణాల రచన పూర్తి చేశాడు. పూర్తి చేస్తూ ఐదు వందల యాభై ఐదు బ్రహ్మసూత్రాలు ఉన్నయ్యే అని చెప్పాడు. ఉన్నయ్యే అని చెప్పటంతో వ్యాసులవారి పనైంది. దానికి భాష్యం రాయటానికి తర్వాత కాలంలో శంకర భగవత్పాదులు వచ్చారు. అంటే ఈ అవిచ్ఛిన్నమైనటువంటి గురు సాంప్రదాయం ఎంత ఉదాత్తమైనదో, ఉత్తమమైనదో చూడండి. అన్నింటికీ భాష్యం రాశారు. పద్దెనిమిది పురాణాలు, వేదాలు అంతేకాదు భగవద్గీత "వ్యాసేన గ్రథితా పురాణమునినా మధ్యే మహాభారతం" కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఏడు వందల శ్లోకాలని transmit చేస్తే అంటే ప్రసారం చేస్తే దాన్ని గుప్తంగా ఉండి ఒక astral body లో దానికి ఒక వాంగ్మయ స్వరూపాన్ని ఇచ్చిన వాడు ఎవరు అంటే వ్యా-వ్యాసులవారు. అందుకనే "వ్యాసేన గ్రథితా" ముడి వేస్తూ వెళ్ళాడు ఒకదాని వెంట ఒకటి. ఇక విష్ణు సహస్రనామం మనకు తెలిసిందే. మహాభారత సంగ్రామ వేళ భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుడి ముందు ఒక సుషుమ్నా గీతంగా, ఆత్మగీతంగా పాడాడు. అదే విష్ణు సహస్రనామం. గుణగణ వైభవాన్ని విశ్వంతో ప్రారంభమై బ్రహ్మముతో ముగించినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఆ గీతాన్ని అందించిన వాడు వ్యాసులవారు. అట్లాగే లోకోత్తరమైనటువంటి భారతాన్ని "లోకంలో ఏవి ఉన్నదో నా భారతంలో అవే ఉన్నది, భారతంలో మీరు ఏమి చదువుతూ ఉంటారో అవన్నీ లోకంలో జరుగుతూనే ఉంటాయి" అని ప్రమాణం చేశారు. అలాగే పద్దెనిమిది పురాణాల యొక్క సారాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరిస్తూ మానవ జీవిత పరమార్థం ఏమిటంటే ఎవరినీ పీడించకుండా, తాడించకుండా, ఎవరినీ అవమానించకుండా, వారి వారి గౌరవాన్ని నిలబెడుతూ మానవ జీవితం సాగటమే అది సర్వోత్తమమైనటువంటి మానవ జీవన దివ్య విధానం అని ప్రపంచానికి ప్రకటించినటువంటి వాడు. అంతేకాదు ఇన్ని పనులు చేసినప్పటికీ కూడా వ్యాసులవారు చింతాక్రాంతులై ఉన్నప్పుడు ఎందుకు ఇంకా చింత? చేయవలసినవన్నీ చేశారు కదా, ఇంతకంటే ఏం చేయాలి? అని మనం అనుకుంటాం. కానీ వ్యాసులవారు నేను ఇంకేదో చేయాలి అనుకున్నాడు. అప్పుడు నారదులవారు వచ్చినప్పుడు "వ్యాసమహర్షి ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు?" అని అడిగినప్పుడు మన-ఆయన ఆ విషయమే చెప్పారు. "ఇవన్నీ కూడా చేసినా ఎక్కడో ఒక వెలితి, ఒక లోటు ఉన్నది. ముని నాకేదన్నా మార్గం చూపించండి" అని అడిగారు వ్యాసులవారు. అప్పుడు ఆయన అన్నారు "భారతంలో అటు భాగవత-ఆ భారతంలో మిగతా అన్ని చోట్ల కూడా...నువ్వు కృష్ణ తత్వాల్ని చెప్తూ వెళ్ళావు కృష్ణలీలలు నువ్వెప్పుడు అనుభవించావు కాబట్టి భాగవతము అనేటువంటి పేరున శ్రీకృష్ణలీలా తరంగిణిని జగత్తుకు నువ్వు అందించవలసింది అని చెప్పాడు. అప్పుడు సరస్వతీ నదీ తీరంలో రేగు పళ్ళ తోటలో కూర్చుని భాగవతాన్ని రాశాడు. అంటే అప్పుడు ఆయనకొచ్చిన పేరు వ్యాసుడైంది, కృష్ణ అయింది, వేదవ్యాసుడైంది. ఇవన్నీ అయిపోగా ఆయన్ని బాదరాయణుడు అని పిలిచారు. ఇన్ని నామాలతో ఇన్నిన్ని బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞతో వ్యావాన్మయ స్వరూపుడై లోకానికి అనేకమైనటువంటి విషయాలను సూత్రీకరించాడు గనుక ఆయన తొట్ట తొలి లోక గురువు. ఈ గురువులు అనేకమైనటువంటి రకాలు సూచక గురువులు, మోచక గురువులు, వాచక గురువులు, నిషిద్ధ గురువులు, మంత్ర గురువులు, దీక్షా గురువులు, విహిత గురువులు, విశుద్ధ గురువులు, కారణ గురువులు. వీళ్ళందరిలోకి ఇవన్నీ కలిపితే ఒక లోక గురువు అవుతున్నాడు గనుక ని-నిజానికి ఆషాఢ పౌర్ణమి ఆయన పుట్టినరోజు, పద్దెనిమిది పురాణాలు పూర్తయినరోజు, బ్రహ్మసూత్రాలు ఉన్నాయని లోకానికి తెలిసినరోజు. కనుక ఈ ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా తొలి గురువుగా తొలి లోక గురువుగా మనం ఆరాధించేటువంటి వ్యాసులవారి పరంగా మనం ఈ గురుపౌర్ణమి చేసుకుంటాం. అదే విశేషంతో అంతే విశేషంతో ఒకవైపున లోక గురువైన వ్యాసుల వారు రెండవవైపు జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ ప్రాపంచికమైనటువంటి అనేకమైన దశలు దాటి దాటి చరసాలలో జన్మించి ప్రజా భూమిలో ప్రవేశించి మధురా హస్తినాపురాలకు వెళ్ళి ధర్మం మీద ఒక కాంక్షతో పరిత్రాణాయ సాధురాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం తన జీవితం మొత్తం పణం పెట్టాడు కృష్ణ పరమాత్మ. ఎన్నెన్ని అవమానాలకు గురైనా, అవహేళనలకు గురైనా దేనికి లొంగకుండా తన కర్తవ్య దీక్షని తాను నిర్వర్తిస్తూ గురు స్వరూపమై అంతరించబోతున్నటువంటి ద్వాపరకి ఆ అవతరించబోతున్నటువంటి కలియుగానికి సంధి యుగమైనటువంటి మహాభారత సంగ్రామ వేళలలో భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించాడు. కనుక గురుపౌర్ణమి అనేది బహు విశిష్టమైనటువంటిది. అయితే కేవలం వ్యాసులవారి పూజకే ఇది నిర్దేశింపబడిందా అంటే మనందరం కూడా ఇందాక చెప్పిన అందరు గురువులు ఎలిమెంటరీ స్కూల్ గురువు, హై స్కూల్ గురువు, కాలేజీ గురువు, యూనివర్సిటీ గురువు, పిహెచ్డి గురువు, ఆధ్యాత్మిక గురువులు వీళ్ళందర్నీ కూడా మనం కూడా అనుభవించాం. కాబట్టి వీళ్ళందరికంటే ముందు మనకు మొట్టమొదటి గురువు ఎవరు అంటే భారతీయ ఆధ్యాత్మిక ఏం చెప్తున్నది అంటే నీ తల్లే నీకు తొలి గురువు. నీవు సక్రమ మార్గంలో వెళుతున్నప్పుడు నిన్ను ఏ రకమైనటువంటి disturb చేయకుండా నీ గమనాన్ని, నీ చరణాన్ని, నీ సంచారాన్ని, నీ వ్యవహారాన్ని, నీ విహారాన్ని, నీ ఆహారాన్ని అన్నింటినీ ఒక క్రీగంట గమనిస్తూ మంచి చెడు సుద్దులు చెప్తూ బుద్దులు ఆ అనుగ్రహించేటువంటి మాతృమూర్తికి ఆ ప్రథమ తాంబూలం ఇవ్వాలి ఆవిడ ప్రథమ గురువు. ఆ ప్రథమ గురువుకి నమస్కరించుకుంటూ గురుపౌర్ణమి నాడు ఇందాక చెప్పిన మనం teachers, preachers అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆ అలాగే అనేకమైనటువంటి స్థితుల్లో మనకు ఆప్తవాక్యం చెప్పిన వాడు కూడా గురువే. కష్టంలో ఉన్నప్పుడు ఈ మార్గంలో వెళ్ళు కష్టం తీరుతుందని చెప్పేటువంటి వాడు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టేవాడు, ఈ కనిపిస్తున్న చలచలితమైన ప్రపంచాన్ని దాటి ఉదాత్తమైన ఒక లోకం ఉందని అది నీలో ఉన్నదని చెప్పేటువంటి కారణ గురువు వీళ్ళందరికీ కూడా మనం నమస్కరించుకోవలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజే గురుపౌర్ణమి. ఈ ఆషాఢ పౌర్ణమి నాడు ఆకాశంలో చంద్రుడి నుంచి వచ్చేటువంటి సుషుమ్నా కిరణాలు అంటే చంద్ర కిరణాలలో ఔషధలు అన్నీ ఉంటాయి. విజ్ఞానం ఉంటుంది, సుజ్ఞానం ఉంటుంది, ప్రజ్ఞానం ఉంటుంది కడగా జ్ఞానం ఉంటుంది. కనుక గురుస్మరణ చేత, గురుభావన చేత, గురు దర్శనం చేత, గురు స్పర్శ చేత, గురువుతో మాట్లాడే విధానం వలన మనలో అనేకమైనటువంటి పరివర్తనలు జరుగుతాయి. మనలో ప్రకాశమానమైనటువంటి ఒక తేజస్సు, ఒక ఓజస్సు, ఒక రజస్సు, ఒక మహస్సు ఇవన్నీ కూడా గురు సంస్పర్శ చేత ఏర్పడతాయి. అందుకనే భారతీయ అధ్యాత్మలో గురువుది ప్రత్యేకమైన స్థానం. "గురు గోవింద్ దోనో ఖడే కాక లాగో పాయే, బలిహారి అప్నే గురు గోవింద దియో బతాయే" అంటాడు కబీర్. అంటే గురువుని చూపించినటువంటి, దైవాన్ని చూపించినటువంటి వాడు గురువైనట్లయితే మనకు తెలియకుండా గురువుని చూపించేవాడు కూడా దైవమే. కాబట్టి ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేదం విభాగినే. ఈశ్వరుడన్నా, గురువు అన్నా, ఆత్మ అన్నా ఒక్కటే అని సప్రమాణికమైనటువంటి సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఈ ధర్మానికి, ఈ సూచనకి కట్టుబడి మనం ప్రతి నిమిషము కూడా గురు స్మరణ చేయాలి. కంచి పరమాచార్య మహాస్వామి వారు చెప్పారు "నీవు నిద్రలేవగానే చేయవలసిన రెండు పనులున్నాయి. ఒక పని నీ గురువుకి నమస్కరించు." మనమున్నాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు మనకు గురువు. స్వామికి నమస్కరిస్తూ నిద్రలేవాలి. మరి ఏం ప్రార్థన చేయాలి? నాకదివ్వు ఇదివ్వు అని కాదు సమస్త లోకా: సుఖినోభవంతు ఏక వాక్య ప్రార్థన సత్య సాయి భగవానుడు మనకి ఈ ప్రపంచానికి అందించారు. అంటే గురు దర్శనంతో ప్రారంభమై, గురు ప్రార్థనతో ప్రారంభమై, అన్నిటా అంతటా వ్యాపించి ఉన్నటువంటి గురుతత్వమే మన జీవితానికి ఆధారమై, ఆలంబనమై, అదే మనల్ని నడిపించే దిక్సూచి అయి ఉండటానికి ఇటువంటి పవిత్రమైనటువంటి భావాలన్నీ మనయందు ప్రచోదితం కావాలని, అలాగే ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ఒక మాట "నలుదిక్కుల నుండి నాయందు ఉదాత్త భావనలు ప్రతిక్షణము ప్రవేశించు గాక" అట్లే నా నుండిఉదాత్తమైన ఉన్నతమైన ఉత్కృష్టమైన మహత్ పూర్ణమైనటువంటి భావనలు మళ్ళి ఈ ప్రపంచానికి తరంగ స్వరూపంగా అందాలి అని మనం కోరుకుంటూ గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే అన్ని ఉన్నట్లే ఎందుకంటే కోపించే వాడు గురువు కాదు శపించే వాడు గురువు కాదు కోరికలు కోరే వాడు గురువు కాదు ఏమి అక్కరలేని నిరామయ నికేత నిరంజయ నిర్మమైన స్థాయిలో తనకు తానుగా తనలో తానుగా తనంతట తానుగా అన్ని తానుగా ఉండేటువంటి వాడు గురువు కాబట్టి అటువంటి గురు సమూహానికి మనం చక్కగా నమస్కరిస్తూ ఈ గురుపూర్ణిమ నుంచి మనం అనేక భావాలు అనేక ఉదాత్త భావనలు మనకి ప్రత్యక్ష గురువు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు వారు పేరున వారి పరంగా మనం సాగించబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి భజన కార్యక్రమాలకి మళ్ళీ మంచి క్షణాలలోని స్వీకారం చుట్టుకొని అనేకమైనటువంటి విషయాలని నామ రూప భావ తత్వాత్మకమైనటువంటి భజన సాంప్రదాయంలో మన శరీరము మనసు ఆత్మ పరిపూర్ణమైనటువంటి శుద్ధత్వాన్ని పొందే దిశగా మన అధ్యాత్మ సాధన కొనసాగాలని సర్వ దేవతా తీర్థ స్వరూపులైన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారిని మనం ప్రార్థిస్తూ స్వామికి నమస్కరిస్తూ మళ్ళీ మరొక్కసారి మనల్ని మనం సంస్కరించుకునే దిశగా ఉన్నత స్థితికి వెళ్ళే దిశగా మన అధ్యాత్మ ప్రయాణం కొనసాగు గాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం. [అంతు లేని సాయి బాబా సంగీతం]
YouTube · audio
వందే గురూణాం!!
వందే గురూణాం!!
Source: SATHYA PEETHAM on YouTube
0:00 / 14:58