No transcript for this section.
Transcript begins at 7:47.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శీలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విశప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్బ్రహ్మ స్పురతాం మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఇవాళ స్వామి ఆదేశానుసారం మనందరం కూడా BHL మందిరంలో కలుసుకొని నిత్య జీవితంలో ఈ అధ్యాత్మ అనేటువంటి ఒక మంచి topic ఇది. ఎందుకంటే, దీనిలో మూడు ఉన్నాయి. ఒకటి నిత్య, రెండవది జీవితం, మూడవది అధ్యాత్మ. ఈ నిత్య జీవితం అంటే English word day to day life అని. కానీ భారతీయ తత్వంలో day to day life కాదు నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన జీవితం అని అర్థం. ఆ జీవితంలో ఈ అధ్యాత్మని ఎలా మనం celebrate చేయాలి? ముందుగా అసలు అధ్యాత్మ అంటే ఏంటో తెలిస్తే, దాన్ని ఎలా celebrate చేయాలో తర్వాత మాట్లాడుకుందాం. అధ్యాత్మ అనేటువంటి ఆ పదంలోనే ఆత్మ పరమైనటువంటి ఒక భావన. ఈ కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి మూలమైనటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి నా యందు కూడా ఉన్నది. నేను దాని నుంచే వచ్చాను. నేను నా జీవితంలో ఈ చలత్-చలితమైనటువంటి ఈ జగత్తులో కంటికి కనిపిస్తూ నిరంతరము మార్పు చెందేటువంటిది. ఈ మార్పు చెందే దానిలో మార్పు చెందకుండా నేను ఎలా ఉండాలి? అనేటువంటి అనేకానేక ప్రశ్నలు అనేక కోణాల్లో ఆవిష్కరించుకున్నట్లయితే, దాన్ని ఇవాళ English లో అధ్యాత్మ అంటే తెలుగు వాడికి అర్థం కాదు spirituality అనే పదం మనం ఎక్కువ వాడుతున్నాం. Spirituality in day to day life అంటే అందరికీ అర్థమైపోతుంది. అంతే కదా? అది. అయితే Spirituality is a way of life అని ఒకరు, Spirituality is a way of living అని మరొకరు ఎవరికి తోచిన ఒక ఆ statement వాళ్ళు ఇచ్చుకొని వెళుతూ ఉన్నారు. అసలు మనకి రెండు పాయలున్నాయి అంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి religion మతం, రెండవది spirituality ఇదిగో అధ్యాత్మ అనుకుందాం. నిజానికి spirituality కి religion అక్కర్లేదు. Religion లో ఉన్నవాడికి spirituality ఒంటబట్టదు. ఎందుకంటే, Religion is a cult, spirituality is a culture అది. మనం cult లో ఉంటే ఆ బావిలో ఉండిపోతాం. బావిలో ఏముంటాయి? నీళ్లుంటాయి. నీళ్లల్లో ఏముంటాయి? కప్పలుంటాయి. అంతే కదా! అవి బయట ప్రపంచం తెలియదు, బాహ్య ప్రపంచం దానికి తెలియదు. అక్కడే తిరుగాడుతూ తిరుగాడుతూ పూజ, వేడుక, ఊరేగింపు, జాతర, ఉత్సవం ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాం. spirituality లో ఇవేవీ ఉండవ్. మరి ఏమీ లేకుండా ఎట్లాగండి, ఏదో ఒకటి ఉండాలి కదా? ఏదో ఒక అద్భుతమైనది జరగాలి కదా? స్వామికి అలంకారం చేయాలి, అర్చన చేయాలి, ఆరాధన చేయాలి, అభిషేకం చేయాలి, ఊరేగింపు చేయాలి, జాతర చేయాలి, వేడుక చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా! అంటే, అవన్నీ కూడా cult లో వస్తాయి తప్ప culture లో ఉండవ్. అది మానవుడి యొక్క సహజ-సహజమైనటువంటి culture ఏమిటి? అంటే, మానవుడు తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళాలి. ముందు తనను తాను తెలుసుకోవాలి. తనని తాను తెలుసుకోవటానికి మార్గం spirituality. తనను తప్ప అన్నీ తెలుసుకోవటానికి మార్గం religion మతం. మతం ఒక మార్గం. ఖాళీ బాటనండి, తారు వేసిన BT road అనుకోండి, ఏదన్నా అనండి. అది బాట అయితే spirituality రాచబాట. రాచబాట అంటే యథేచ్ఛగా, హాయిగా, స్వేచ్ఛగా ఎక్కడ ప్రారంభం అవుతుందో, ఎక్కడ ముగించాలో అక్కడిదాకా ఎట్టి అడ్డంకులు లేకుండా, ఒకవేళ ఏర్పడినా వాటిని పట్టించుకోకుండా, ఒకవేళ పట్టించుకోవలసి వచ్చినా వాటిని అధిగమిస్తూ ఎవరైతే తమ గమ్యం వైపు వెళతారో అది నిజానికి spiritual path. religion ని కాసేపు పక్కనబెడితే, ఇవాళ మనకి rituals బాగా ఎక్కువైపోయినాయి. rituals లో ఉన్నంత కాలం ఇందాక ఉన్నవన్నీ ఉంటాయి. spiritual లోకి వెళ్ళినప్పుడు మనం, మనము అనబడేటువంటి ఈ దేహము, ఈ ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవుతాయి. అది ఇవాళ మనకు కావాలి. నేను చాలా పుస్తకాలకి titles చూస్తూ ఉంటా. Indian spirituality అని ఒక పదం ఉంది. Indian spirituality అంటే ఏం లేదండి, ఉన్నదంతా Universal spirituality యే. Indian spirituality ఏమిటి అర్థమే లేవు దానికి. ఇండియాలో celebrate అయిన spirituality ఇది ఒక మార్గం కావచ్చు. కాబట్టి, దీన్ని నిజానికి ఇంత ఆలోచన చేయాలా, ఈ వాహీలు అన్నీ చదవాలా లేదా ఈ పారాయణం చేయాలా అంటే, చేస్తే మంచిది. ఏం మంచి? అసలు అర్థమే కావట్లేదే, కాకుండా ఎలా చదవాలి అంటే, చదువుతూ చదువుతూ చదువుతూ వెళ్ళినట్లయితే, ఆ విషయాలన్నీ మనకి అవగాహనలోకి వచ్చినట్లయితే spirituality అనేటువంటిది మనకి అర్థమవుతుంది.అర్థమైనప్పుడు దాన్ని ఎలా practice చేయాలో మనకు ఆలోచన కలుగుతుంది. ఆలోచన ఎప్పుడు కలుగుతుందో అవకాశము కలుగుతుంది. అవకాశం ఎప్పుడు కలుగుతుందో ఆచరణ లభ్యమవుతుంది. ఆచరణ ఎప్పుడు దొరుకుతుందో అనుభవం కలుగుతుంది. అనుభవం ఏర్పడుతున్నప్పుడు అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఇంత మార్గం జరగాలి గనుక ఈ spirituality ని ఆ ఎలా నిర్వచించాలి? ఇది పెద్ద విషయం. అందరు spirituality అనగానే చాలా గంభీరమైనది అని. నేను ఈవేళ ఒక ప్రత్యేకమైన కోణంలో దీన్ని ఆవిష్కరించాలని అనుకుంటున్నా, ఈ క్షణాన. spirituality ని గురించి చెప్పినటువంటి రాముడు త్రేతాయుగంలో spirituality ని అనుభవించాడా? ఆయన జీవిత కాలంలో ఆయన ఎప్పుడన్నా celebrate చేశాడా? ఎనిమిది సంవత్సరాల వయస్సు రాకుండా శ్రీరామచంద్రుడికి ఒక రథం ఇచ్చి "అయోధ్య నగరం అంతా తిరిగిరా, ఎలా ఉందో చూసిరా ఊరు" అని ఎనిమిదేళ్ల పిల్లవాడికి రథము, ఒక సారథి ఇచ్చి పంపించారు. కొన్ని రోజులు తిరిగి వచ్చాడాయన. తిరిగి వచ్చి అంతఃపురం మధ్యలో విషాదంగా కూర్చున్నాడు. ఏదో పోగొట్టుకున్న వాడిగా కూర్చున్నాడు. రోజు సభకు వచ్చినట్లే వశిష్ఠులవారు వచ్చారు. రాముడిని చూశారు దూరం నుంచి. ఎవరైనా పిల్లవాడు, ఆ రోజుల్లో రథం ఇవాళ car అనుకోండి Mercedes-Benz అనేదేగా ఇవాళ ప్రమాణం మనకి. "ఆ car ఒకటి ఇచ్చిన ఊరు తిరిగి రా" అన్నాడు. అంటే వాడేం చెప్తాడు? అంతఃపురంలో ఉన్న ఒక కొలను ఒకటే చూశాను, అంతఃపురంలో ఉన్న నాలుగు చెట్లు చూశాను, అంతఃపురంలో ఉన్నటువంటి అలంకారం చూశాను. కానీ బయట ప్రపంచం ఇంతకంటే పరమాద్భుతంగా ఉంది. నన్ను రోజూ car ఇచ్చి పంపండి, రథం ఇచ్చి పంపండి అని అడగాలి. కానీ రాముడు అలా లేడు. ఒక విషాద హృదయంతో కూర్చుని ఉన్నాడు. వశిష్ఠులవారు చూసి రాముడిని అడిగారు. "నాయనా! ఊరంతా తిరిగి వచ్చావు కదా హాయిగా, ఎందుకిలా కిన్నుడివై కూర్చున్నావు? ఎందుకింత దిగులుగా ఉన్నావు?" అని అడిగాడు. "గురువుగారు! నాకిదంతా కూడా, ఈ ప్రపంచం అంతా దుఃఖారామంగా కనిపిస్తున్నది. ఇది ఆనందారామం కాదు. దీనిలో సుఖము, సంతోషము నాకు ఎక్కడా కనపడలేదు. అన్నీ ఉన్నాయి, వస్తువులన్నీ ఉన్నాయి ప్రపంచంలో. కానీ శాంతి, సుఖము లేదు. ఇదా ఈ ప్రపంచంలోకి నేను వచ్చాను?" అన్నాడు. వశిష్ఠులవారు ఒక్కసారి నిశ్చేష్టులైనారు. అయి, రాముడు, ఎనిమిదేళ్ల రాముడితో కొన్ని శతాబ్దాలు బతికినటువంటి వశిష్ఠులవారు మాట్లాడటం మొదలు పెట్టారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అవి ముప్పై మూడు వేల శ్లోకాలయినాయి. అదే వశిష్ఠ గీతగా, యోగ వశిష్ఠంగా ప్రపంచంలోకి వచ్చింది. ఇది బీజముగా ఏర్పడింది. అది ఒక ఆ విత్తనం చల్లాడు, జ్ఞానిగా ఉన్నటువంటి వశిష్ఠులవారు. ఇక రాముడి ముందున్న కర్తవ్యం ఏమిటి? "జగతి యెల్ల మధుర సౌందర్యమయమంచు కన్నుమూసి కలలు కాంచినాను. కన్ను విప్ప తెలిసే కర్తవ్యమును చేయ వాసయోగ్యమగును వసుధ యెనుచు". ఈ ప్రపంచంలో కళ్ళు మూసుకుంటే నాకేం పని లేనట్టుగా ఉంటుంది. అంతే కదా. నిద్ర పోయేటప్పుడు మనకేం పని లేదు. కన్ను తెరవగానే అనేకమైన పనులు గుర్తొస్తాయి. రాముడికి అన్నీ గుర్తొచ్చినాయి. గుర్తొచ్చినాయి గానీ, ఏదో జరగాలి. అదే సమయంలో విశ్వామిత్రులవారు అక్కడున్నారు. విశ్వామిత్రులవారు దశరథుడిని అడిగాడు, "రాముడిని నాతో పంపిస్తే నేను కొన్ని పనులు చేసి వస్తాను" అంటే వాడు చిన్నవాడు. ఆయుధాలు ఎలా చేయాలి, ఎలా ప్రయోగించాలి తెలుసుకున్నాడు గానీ ఇంకా practical గా వాడు రాలేదు. నన్ను తీసుకెళ్ళమన్నాడు ఈయన. ఆయనన్నాడు, "నాకు రాముడితోనే నాకు పని" అన్నాడు. అంటే ఒక అవతారమూర్తికి ఏకకాలంలో ఒక జ్ఞాన గురువైనటువంటి వశిష్ఠుడు, ఆయన బ్రహ్మర్షి. లోకగురువైనటువంటి విశ్వామిత్రుడు, ఈయన బ్రహ్మర్షే. ఇద్దరు బ్రహ్మర్షులు గురువైనటువంటి ఏకకాలమే త్రేతాయుగం. అందునా అవతారమూర్తి అయినటువంటి రామచంద్రుడికి. సరే వెళ్ళాడు. వెళుతూ ఉంటే spirituality రాముడిలో నుంచి ఎలా బయటకు వచ్చిందో మనం ఆలోచించాలి. అందుకని ఈ పాయను మనం ఎంచుకోవాలి. బల, అతిబల విద్యలన్నీ నేర్పాడు. ఆకలిదప్పులు లేకుండా చేశాడు. మంత్రదీక్షా గురువై విశ్వామిత్రుడు హక్కును చేర్చుకున్నాడు. పిల్లలిద్దరూ, రామలక్ష్మణులిద్దరూ కూడా చిన్నపిల్లలు కాబట్టి మార్గాయాసం, అంటే మార్గంలో నడిచి వెళుతున్నప్పుడు అలసట లేకుండా ఆయన ఏం చేశాడంటే కథలు చెప్తూ వెళ్ళాడు. ఎవరి కథలు చెప్పారంటే ఇక్ష్వాకు వంశ కథలు చెప్తూ వెళ్ళాడు. గంగానది ఎలా వచ్చింది? ఆ గంగా ప్రవాహం ఎలా వచ్చింది? సగరులంతా కూడా ఎలా ప్రాణత్యాగం చేశారు? అరవై మూడు వేల మంది ఈవేళ ఆ వారణాసిలో ప్రవహించే గంగా అనే చుక్క నేలకు దిగి రావటానికి కారణం ఎవరంటే మీ వంశపు వాళ్ళు సగరులు. ఇది ఇట్లా ఇట్లా కథలు చెప్తూ ఆ కథా కథనంలో వెళుతున్నాడు. ఇంతలో తాటక వచ్చింది. తాటక బ్రహ్మ రాక్షసి. ఆకాశాన్ని ఆవరించి ఉన్నది. తాటకని వధించమన్నాడు. తాటకని వధించాడు గురువుగారు చెప్పగానే. spirituality లో ఒక పార్శ్వం ఏంటంటే మానసిక శాస్త్రం ప్రకారం ఎంత గురువు చెప్పినా, ఎంత దైవతం చెప్పినా మానవుడి మనస్సు ప్రశ్నిస్తూనే ఉంటుంది ఎక్కడో అక్కడ. తాటక మరణించింది. మరణించగానే రాముడు విశ్వామిత్రుడిని అన్నాడు, "క్షత్రియ వంశంలో పుట్టి దశరథ మహారాజు కుమారుడినై ఉండి నేను ఒక స్త్రీని చంపటంతో నా కథ మొదలైందా?" అని అడిగాడు. "రామా! నువ్వు అవతారమూర్తివి కావచ్చు గాక, నీలో నారాయణ స్మృతి ఉండవచ్చు గాక, కానీ ఎప్పుడైతే నువ్వు పాంచభౌతిక దేహం తీసుకుని మావంటి శరీరాన్ని ధరించి వచ్చావోనీకు-- నీలో కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడు ఉంటాయి. తాటక సంహారంతో నీలో ఉన్న తామస గుణం నశించిపోయింది. బయలుదేరు అన్నాడు. కొంత ముందుకు వెళ్ళాడు. వెళ్ళగానే అహల్య కనిపించింది. మనకు తెలుసు అహల్య శాపవిమోచనం. రాముడు దగ్గరకు వెళ్ళగానే ఆ రాతిలో నుంచి అహల్య దేవి రావటం, శాపవిమోచనం కావటం, ఆశ్చర్యపోయినాడు, ఆనందపడ్డాడు. ఆ స్త్రీమూర్తిని చూడగానే తన తల్లి కౌసల్య గుర్తొచ్చింది. ఆ కౌసల్య దేవితో ఆయనకి మమేకమైనటువంటి భావన ఉంది గనుక, "ఇది ఏమిటి?" అని అడిగాడు. "అక్కడ సంహారం అయింది, ఇక్కడ సంస్కరణ జరిగింది రామా" అన్నాడు. సంస్కరణ అంటే ఒక రాయి జడత్వంలో నుంచి చైతన్యంలోకి వచ్చింది. కనుక నీలో రాజస గుణం కూడా పోయింది. ఇక ముందు నడువు అన్నాడు. ఆ నడవబోయే సమయంలోనే మిధిలా నగరం నుంచి వర్తమానం తీసుకొని వచ్చారు భటులు. జనక మహారాజు దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. ఆ ఆహ్వానం వచ్చినప్పుడు ఏముందంటే, జనక మహారాజు ఒక స్వయంవరం ప్రకటించాడు. ఆయన కూతురు సీతాదేవిని స్వయంవరంలో శివధనుస్సుని విరిచి ఎవరు గెలుచుకుంటారో ఆమెని ఆయనకిచ్చి వివాహం చేస్తాడు. మీరు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారని మాకు వేగుల వారు చెప్పారు. కనుక మీరు కూడా రావలసింది అని ఆహ్వానం పంపారు. విశ్వామిత్రుడు సానందంగా రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళాడు. శివధనుర్భంగం అయిపోయింది. సీతా కల్యాణం అయిపోయింది. అయిపోయినప్పుడు మళ్ళీ ఇదేమిటి అని అడిగాడు రాముడు. చూశారా, మళ్ళీ ఇదేమిటి? ఇలా ఎలా జరిగింది? నా తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరు లేరు, నేను కబురు పెట్టమనే దాకా. ఎవరో ధనుస్సు తెచ్చారు, విరవమన్నారు, విరిచాను, ఎత్తుకున్నాను, విరిగిపోయింది. నాకు ఆమెని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇదంతా ఏమిటి? అని అడిగాడు. తాటక సంహారం నాడు జరిగినది నీలో తామస సంహారం జరిగింది. అది సంహారము. రెండవది అహల్య శాపవిమోచనంతో నీకు కలిగింది ఏమిటంటే సంస్కార ధార కలిగింది. సంస్కారంలో నుంచి రాజసం నశించింది. ఇదిగో ఒక పరిపూర్ణమైనటువంటి గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టాలి గనుక ఈ సీతాదేవి అనబడేటువంటి ఈమెను నీవు పరిణయమాడి, నీవు రజస్తమో గుణాలను అధిగమించి, నీవు పూర్ణ సత్వాన్ని పొందావు. గృహస్థాశ్రమానికి నీవు అర్హుడివైనావు రామా! నీవు పూర్నుడివైనావు అన్నాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడి కథే లేదు రామాయణంలో. అంటే ఒక వ్యక్తి క్షత్రియ వంశంలో పుట్టినటువంటి ఒక బాలుడు జ్ఞాన గురువు దగ్గర బోధ పొంది, లోక గురువు వెంట నడిచి ఇద్దరూ బ్రహ్మర్షులు కాగా తనలో ఉన్నటువంటి మూడు గుణాలలో అప్రధానమైనటువంటి తామసాన్ని వదిలిపెట్టి అంటే అజ్ఞానాన్ని వదిలిపెట్టి, రాజసాన్ని వదిలిపెట్టి అంటే అహంకారాన్ని వదిలిపెట్టి, పరిపూర్ణమైనటువంటి పూర్ణ మానవుడిగా, మర్యాద పురుషోత్తముడుగా, సీతారాముడుగా ఆయన బయటకు వచ్చాడు. ఇది అక్కడ జరిగినటువంటి ఒక పరమాద్భుతమైన చర్య. మరి ఇందులో spirituality ఏమున్నది అని, అసలు ఉన్న spirituality అంతా దాంట్లోనే ఉంది. ఎందుకంటే మనం కూడా సంహారం చేసుకోవాలి. మనలో అనేకమైన అల్పమైన ఆలోచనలు ఉంటాయి. అనేకమైన నీచ భావాలు ఉంటాయి. అనేకమైన భయాలు ఉంటాయి. అనేక ఆందోళనలు ఉంటాయి. అనేక అలసత్వాలు ఉంటాయి. అనేకమైన విరుద్ధమైనటువంటి భావజాలాలు మనను చుట్టుముట్టి లోపల తారాడుతూ, పారాడుతూ ఉంటాయి. వాటిని అనేకమైనటువంటి సంస్కరణల ద్వారా మనల్ని మనం సంస్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ వెళ్ళటానికి ఏం కావాలి అంటే ముందు చమత్కారం కావాలి. తర్వాత సంస్కారం కావాలి. తర్వాత పరోపకారం జరగాలి. ఆ తర్వాత ఆత్మసాక్షాత్కారం కావాలి. చమత్కార, సంస్కార, పరోపకార, సాక్షాత్కార. ఈ నాలుగు ఇలా జరగాలి అని చెప్పింది ఎవరు అంటే త్రేతాయుగం నాటి రాముడు చెప్పలే, కలియుగంలో అవతరించినటువంటి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు చెప్పారు మనకు. [కప్ తట్టడం] ఇవన్నీ జరగాలి. సంస్కరణ జరగాలి. సంస్కరణ జరక్కపోతే ఎట్లా? నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండి, ఇప్పుడు ఎలానో ఉన్నానో కన్నుమూసే టైములో కూడా అట్లాగే ఉన్నట్లయితే, పరిణామం గనుక లేకపోయినట్లయితే transformation జరక్కపోయినట్లయితే మానవుడి జీవితం వృధా అయిపోతుంది. ఈ సందర్భంలో మనకి అహంకారాలు ఉంటాయి. నాకు degrees ఉంటాయి ముందు, వెనక. అలాగే నాకో ఇరవై pages bio data ఉంటుంది కదా. నా గురించి చెప్పాలి అంటే ఓ ఇరవై pages ఉంటుంది. కానీ అవన్నీ జరిగిపోయిన కథ. దానిని ఆధారం చేసుకొని నేను ఇవాళ జీవించకూడదు. కదిలిపోయినటువంటి, కరిగిపోయినటువంటి ఆ స్మృతుల అన్నింటి నుంచి స్ఫూర్తిని పొందాలి. ఇంత చేయగలిగాం అంటే ఇంకెంత చేయగలమో, ఇంకా ఏం చేయాలో అనేటువంటి భావనలోకి వెళ్లగలిగినట్లయితే అది సంస్కారం అవుతుంది. ఆ సంస్కారంలో నుంచి నన్ను నేను ఉద్ధారణ చేసుకోవాలి. ఈ చేసుకుంటూ వెళ్ళినప్పుడు శ్రీరాముడు చేసింది నిజానికి అయోధ్యా నగరంలో, మిధిలా నగరంలో శ్రీరాముడి వివాహం అయిపోయిన తర్వాత అయోధ్యా నగరానికి వెళ్తున్నప్పుడు శ్రీరాముడు ఎక్కినటువంటి రథము సీతమ్మతో కాదు, తన తల్లి పక్కన కూర్చున్నాడు. కౌసల్యాదేవి పక్కన కూర్చున్నాడు. కౌసల్యాదేవి అప్పుడు చేతికందొచ్చిన కొడుకు, వివాహం అయిపోయినటువంటి కొడుకు ఒక సంస్కారాన్ని అప్పటికే శివధనుర్భంగం ఓ చమత్కారం, తాటక సంహారం ఓ చమత్కారం, అహల్య శాపవిమోచనం ఇంకో చమత్కారం. ఈ చమత్కారం నుంచి ఒక సంస్కారంలోకి వచ్చాడు రాముడు. ఎట్లా ఇద్దరు బ్రహ్మర్షుల చూటి లేజంటాం, సుశ్చరికం చేత. భావనావరణంలో ఉన్నాడు గనుక సంస్కరణ జరిగిపోయింది. అప్పుడు పరోపకారం కూడా చేశాడు. ఏమిటి ఆ పరోపకారం అంటే, పరోపకారం అంటే help చేయటం కాదు. ఇంగ్లీషు పదం చాలా చిన్న పదం help అనేది.పర ఉపకర, పరా ఇతరులకు ఉపకర దగ్గరగా ఉండి నేను ఏం చేయాలి అనేటువంటి దాంట్లో లోకోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నప్పుడు కౌసల్యాదేవి ఒక మాట అడిగింది. "రామా! నువ్వు పెద్దవాడివి అయినావు, వివాహం చేసుకున్నావు. ఇక మీ తండ్రిగారు నన్ను సమాధరించేట్లుగా నువ్వు కూడా ఉండు నాయనా, నువ్వు యువరాజువి కదా" అని అడిగింది. అంటే సమాధరించ లేదా దశరథుడు అంటే సమాధరించాడు, ఆదరించాడు ప్రేమగా ముగ్గురినీ సమానంగా చూశాడు అంతా బాగుంది. కానీ రాముడు ఏం చేశాడంటే ఆ మాట విన్నాడు. తన తల్లి మనస్సు కష్టపడుతున్నది అని తెలుసుకున్నాడు. ఒక్క మాట అన్నాడు, "అమ్మా అహల్య దేవి నన్ను మళ్ళీ వివాహం చేసుకొని వెనక్కి రమ్మనమని చెప్పింది." "అంటే ఆమెకు ఎలా తెలుసు నీకు వివాహం అవుతుందని?" అని అడిగింది కౌసల్య. అప్పుడన్నా-అన్నాడాయన, "ఆ రాత్రి లో నుంచి అహల్య దేవి బయటకు రాగానే నేను ఆమెకు నమస్కరించాను. అప్పుడు నన్ను ఆమె ఆశీర్వదించింది. ఎలా ఆశీర్వదించింది అంటే కళ్యాణరామ, జగదభిరామ, పట్టాభిరామ, జగద్వంజరామ అంటూ ఏడు శ్లోకాలలో నన్ను ఆశీర్వదించిందమ్మా. పైగా వివాహం చేసుకొని మా ఆశ్రమానికి రమ్మన్నది, రథం అటు మరలిస్తాను" అన్నాడు. మర్యాద పురుషోత్తముడు కనుక పెళ్లి అయిపోయింది మన ఊరు మనం వెళ్ళిపోదాం అని అనుకోలా అహల్య దేవికి ఇచ్చినటువంటి మాట ప్రకారం గౌతమాశ్రమంలోకి రథాన్ని నడిపించాడు. నడిపించి మళ్ళీ ఆయన దశరథుడి రథం ఎక్కాడు తర్వాత. ఎక్కి తన తల్లి పడుతున్నటువంటి మానసిక పరివేదన ఏదైతే ఉన్నదో అది తన తండ్రి చెవిలో చెప్పాడు. వివాహం అయినటువంటి భారతీయ సంప్రదాయంలో పధ్నాలుగు, పదహారు ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక తల్లి తన ఆడపిల్లని కౌగలించుకుంటుందేమో కానీ తండ్రి తన కుమారున్ని కౌగలించుకోడు. సంప్రదాయం లేదు ఈ భారతీయ దాన్లో ఆ దూరం ఉంటుంది దాన్ని respectable distance అంటాం. అది ఉన్న కారణంగా రాముడు దశరథ మహారాజు చెవిలో తన తల్లి పడుతున్న యాతనని చెప్పినప్పుడు దశరథ మహారాజుని సంస్కరించిన వాడు ఎవరంటే శ్రీరామచంద్రుడు. చూశారా చమత్కారం నుంచి సంస్కారంలోకి వచ్చాడు. సంస్కారంలో నుంచి పరోపకారంలోకి వెళ్ళాడు. ఇక మిగిలిన సాక్షాత్కారానికి చాలా time ఉంది. అంటే శ్రీరామచంద్రుడి కథలు ఇవన్నీ జరిగినప్పుడు ఆయన కూడా కథాంతంలో వారధి కట్టిన, కథ మొదట్లో శివధనుర్భంగం చేసిన, తాటక సంహారం చేసిన, కబంధుడనే రాక్షసుడిని చంపిన, ఎన్ని రకాలుగా ఎన్నెన్ని విపరీతాలు ఎన్నెన్ని అద్భుతాలు జరిగిన వాటి పట్ల ఏ రకమైన అపేక్ష లేకుండా జీవించాడు రాముడు. అంటే పరిపూర్ణమైనటువంటి మానవీయ స్థాయిలో సంచారం చేసినటువంటి వాడు రాముడు. ఎవరాయన? నారాయణుడు. ఏ నారాయణుడు? శ్రీమన్నారాయణుడు. శ్రీమహావిష్ణువే రాముడై వచ్చాడు కానీ ఆయన అన్నాడు, "నేను మూడు ప్రమాణాలతో వస్తా." ఎప్పుడు? మహావిష్ణువుగా ఉండగా చెప్పాడు. ఆ మూడు ప్రమాణాలు ఏమిటంటే దశరథుడు ఇంట పుడతా, దశకంధరుడి కుత్తుకలు ఉత్తరిస్తా, దశకంధరుడు అంటే రావణ బ్రహ్మ. దశయుగాల వరకు నామం వినపడేట్లుగా శ్రీరామచంద్ర నామంతో జన్మ ఎత్తుతా. ఆ మూడు సాధించాడు ఆయన. చూడండి. సాధించి అక్కడి నుంచి ఇక రేపే నీకు పట్టాభిషేకము అన్నారు. అనగానే మామూలుగా rituals అన్నీ జరిగినాయి. "ఇవాళ రాత్రికి నువ్వు ధ్యానంలో ఉండాలి. నువ్వు మన కులదైవం, ఇలదైవం అయిన శ్రీరంగనాథుడిని సేవించు. సీతాదేవి ఆ గదిలో నువ్వు ఈ గదిలో ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. తెల్లవారుగానే పట్టాభిషేకము" అన్నారు. మలిజాములు సుమారు మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఈవేళ మన ప్రమాణంలో చూసినట్లయితే ఆయన-- ఆయనకు ముగ్గురు తల్లులు కౌసల్య దేవి, సుమిత్ర, కైక. ఆయన ఆ జామువేళలో కైక దగ్గరికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు, "అమ్మా నా మనస్సుని ఎంత ధ్యానంలో నిలబెట్టాలని అనుకున్నా మనస్సు నిలవటం లేదు. నాకు తెలియని, నాకు అనుభవంలో లేని, నాకు పరిచయం లేని అనేకానేక గొంతుకలు హాహాకారం చేస్తున్నాయి. ఏమని అంటే నువ్వు రాజ సింహాసనం ఎక్కద్దు అని నన్ను నా ధ్యానాన్ని భగ్నం చేస్తున్నాయి. నన్నేం చేయమంటావ్ అమ్మా?" అని అడిగాడు. అడిగితే "అవన్నీ మర్చిపో నాన్నా, ఏవో జరుగుతూ ఉంటాయిలే. ధ్యానంలో ఉన్నావు కదా అవన్నీ మామూలే" అనలా. ఆమె ఏమన్నదంటే "దైవ నిర్ణయానికి శిరసు వంచి రామా! నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు" అన్నది. ఆ దైవ నిర్ణయం ఏమిటో ఆమె చెప్పలేదు. ఆ దైవ నిర్ణయం ఏమిటని రాముడు అడగలేదు. తెల్లవారింది. అప్పటికప్పుడే వార్త ఏం వచ్చిందంటే రాజ్య సింహాసనం మీద నీవు కూర్చోవటం లేదు, పట్టాభిషేకం నీకు జరగటం లేదు, పధ్నాలుగు సంవత్సరాలు నువ్వు అరణ్యవాసం చేయాలి, నువ్వు వెళ్ళాలి అన్నారు. లక్ష్మణున్ని, సీతని వెళ్ళమని దశరథుడు చెప్పలా. ఒక్క రాముడికే చెప్పాడు. చెప్తే రాముడు ఏమనాలి? "అదేమిటి నన్ను రాత్రంతా ధ్యానంలో కూర్చోబెట్టారు. నేను ఉన్న నలుగురిలో పెద్దవాడిని నేను. మరి మా తండ్రి తర్వాత నేనే రాజ్యానికి అభిషేకంకా-- అభిషిక్తుడిని కావాలి." అని అనలే. "నేను శిరసావహిస్తున్నాను తండ్రి ఆజ్ఞని" అన్నాడు. ఇది సంస్కారంలో కలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి సంస్కృతి విలసనం. అది అయిపోయిన తర్వాత పట్టు బట్టలు కట్టుకోవలసిన రాముడు నారచీరలు ధరించాడు. కోదండం పట్టుకున్నాడు. కానీ కిరీట ధారణ చేయవలసిన వాడు కొప్పు ధరించాడు. ఆ సమయంలో చూడండి అత్యద్భుతమైనటువంటి ఒక మానసిక పరిణితి ఈ దీనిలో కలిగింది ఏమిటంటే సీతాదేవి "నేను కూడా వస్తాను" అన్నది. "నువ్వెందుకు? మా అమ్మ దగ్గర ఉండు. ముగ్గురు అమ్మలు నిన్ను తల్లిగా చూసుకుంటారు." "నేను వెళ్తాను. నన్నే కదా వెళ్ళమన్నాడు మా తండ్రి. నేను వెళ్తాను, వస్తాను."పద్నాలుగు ఏళ్లు అంటే పరిణితి చెందిన అటువంటి సీత ఏమన్నదో తెలుసునా? "నీవు లేని ఈ అయోధ్య నాకు అరణ్యం. నీతో ఉంటే, నీతో ఉన్న ఆ అయోధ్య నాకు, ఆ అరణ్యమే నాకు అయోధ్య. నీతో రాణి" అన్నది. అప్పుడు ఆయన భయపెట్టాడు. చిన్నపిల్ల కదా సీత. "రాక్షసులుంటారు, కామ రూపాలలో వస్తారు, నిన్ను ఎత్తుకొని పోతారు" అని అంటాడు. "నిన్ను ఎత్తుకొని ఎవరో తీసుకెళ్ళిపోతారు, ఆహ్ పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి" అని అంటే ఒక స్త్రీగా ఒక చిన్న బాలిక సీతాదేవి రాముడితో అంటుంది "నువ్వు ఇంత పిరికివాడివా రామా? ఇంత భయపడుతున్నావే? భయమెరిగని ధీరవీర గంభీర మూర్తివి అని కదా. నన్ను నీకు మా తండ్రి అయిన జనక మహారాజు పెళ్లి చేశాడు. నీవు ఉండగా నన్ను పులులేమీ చేయవు. నన్ను ఎవరూ ఎత్తుకొని వెళ్ళరు. నువ్వు లేనప్పుడు ఎత్తుకొని వెళ్తారేమో కానీ నువ్వు ఉండగా నన్ను ఎవరూ ఎత్తుకొని వెళ్ళరు. నీతో గనక నేను లేకపోతే నా-- ఇక్కడ నేను ఉన్నప్పటికీ నా మనస్సు అరణ్యవాసమే"నన్నది. అంటే ఒక సంస్కారగతమైనటువంటి గృహస్థ ధర్మంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో, పువ్వు తావి వలె ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా ప్రకటన చేస్తూ వెళుతున్నప్పుడు శ్రీరాముడు ఇక్కడ ప్రదర్శించింది ritual కాదు. మామూలుగా గనక అయితే ఏమో జీవితకాలంలో మళ్ళీ ఆ సింహాసనం ఎక్కగలనో లేదో, వచ్చిన అవకాశమే పోయింది అనుకోలేదు. తండ్రి ఆజ్ఞను శిరసావహించాడు. That is called spirituality అధ్యాత్మ. ఏది రాని, ఏది పోని, దేనికి లొంగక, పొంగక, కుంగక, వంగక మనిషి తనను తాను నిలబెట్టుకుంటాడో దాని పేరు అధ్యాత్మ. జీవితం అనంగానే సవాళ్లు ఉంటాయి, ఒత్తిళ్లు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, అననుకూలాలు ఉంటాయి, అనేకమైన వర్షాలు ఉంటాయి, అనేకమైన వేసవి తాపాలు ఉంటాయి. ఏమీ ఇన్నేళ్లు వీటన్నింటినీ దాటి మనం రాలేదా? అనుకుంటూనే గడిచి వచ్చామే. కనుక ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటి మధ్యలో నేను నేనైన నేనుగా ఉండగలిగితే అది నిజమైనటువంటి అధ్యాత్మ. అలాగే శ్రీరామచంద్రుడు పగలంతా రాక్షస సంహారం చేశాడు. మరి రాత్రిపూట ఏం చేశాడు? రాత్రిపూట ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ఋషి ఆశ్రమాలలోకి వెళ్లి వాళ్లు చెప్పేటువంటి జ్ఞానబోధ అంతా కూడా విన్నాడు. ఆ జ్ఞానబోధ ద్వారా, ఆ spirituality ద్వారా, ఆయన చూడండి అరణ్యవాసం లో ఒక్క యజ్ఞం చేయలా, ఒక్క యాగం చేయలా. ఇటేమో శత్రు సంహారం చేశాడు. రెండవది, తన మనసులో ఏర్పడినటువంటి అనేకమైనటువంటి వైరుధ్య భావాలు. "అయ్యో! ఇలా చంపేశానే, ఎందుకు చంపానా, ఎందుకు వచ్చానా" అనుకున్న రాముడు మానసిక పరితాపాన్ని జ్ఞాన తృష్ణ చేత చల్లార్చుకోగలిగాడు రాముడు. ఎప్పుడైతే గురువులందరూ కూడా రాముడికి మామూలు విద్య కంటే అత్యద్భుతమైనటువంటి విద్యాబోధ చేశారో అది మనస్సుకి శాంతిని కలిగించింది. అందుకనే "చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు". ఈ చావులేని చదువు రాముడు లోకానికి కావలసిన చదువంతా విశ్వామిత్రుడు చెప్పాడు. లోకాతీతమైన జ్ఞానకాండంతా వశిష్ఠులవారు చెప్పారు. కానీ practical గా అనుభవించడానికి ఏర్పడినప్పుడు పట్టాభిషేకం నుంచి మరలి అరణ్యవాసానికి వెళ్ళటం, అరణ్యవాసంలో అనేకమందిని సంహారం చేయటం, అలాగే ఋషులందరినీ కూడా కలవటం, వాళ్లతో బోధ ద్వారా, శ్రవణం ద్వారా, ధ్యానం ద్వారా, నిధిజాస ద్వారా, వీట-- మననం ద్వారా అనేక విధాలుగా తనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ప్రవృద్ధమానం చేసుకుంటూ వెళ్ళాడు. This is called spirituality. మళ్ళీ ఆ అయోధ్య నగరానికి వచ్చేదాకా ఆయన అశ్వమేధయాగం చేయలా, ఆయన ఎన్నడూ రాజసూయ యాగం చేయలా, రాజుల్ని జయించలా, కానీ ప్రజా హృదయాలను జయించినటువంటి జగదభిరాముడు రాముడయినాడు. అంటే రాముడిని నడిపించింది ఏమిటి? అంటే అది కేవలము ఇంగ్లీష్ పదమైనటువంటి spirituality. అదే దాని పేరే అధ్యాత్మ. ఇవాళ ఆ రాముడు మనలో-- మనందరం ఆ రాముడు అనుకుందాం. ఆ సీతమ్మలు మీరందరూ అనుకోండి. అనుకుంటే సీతమ్మ పడ్డ కష్టాలు మనము పడ్డాం. రాముడు ఎదుర్కొన్న కష్టాలు, నిష్ఠూరాలు మనము అనుభవించాం. కానీ ఎక్కడైనా మనల్ని మనం నిలబెట్టుకున్నామా, లేదా, లేదు మనకంటే ఉన్నతమైన శక్తికి దాన్ని surrender చేశామా, శరణాగతి పొందామా? అంటే శరణాగతి పొందుతూనే మనం నెమ్మది నెమ్మదిగా ఇంతకాలం ఇంత దూరం రాగలిగాం. ఇది త్రేతాయుగంలో జరిగినటువంటి కొన్ని, ఆహ్ ప్రధానంగా spirituality లో సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి చేసిన సహాయాన్ని మర్చిపోయి వాలి సంహారం అయిపోయిన తర్వాత రాజ్యం మళ్ళీ చేతికొచ్చిన తర్వాత తన గుహలోకి తాను వెళ్ళిపోయినప్పుడు హనుమంతుడు అన్నాడు, "కృతజ్ఞతాపూర్వకంగా, కృతజ్ఞత కాదు, కృతజ్ఞతతో సుగ్రీవుడు వెళ్లి గుహలో మళ్ళీ భోగంలో పడిపోయినాడు రామా! నేను వాడిని చంపి వస్తాను" అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, "చంపినందువలన పరివర్తన రాదు, శిక్ష వేస్తే పరివర్తన రాదు. నువ్వెళ్లి సుగ్రీవుడు మనకిచ్చినటువంటి మాట గుర్తు చేసిరా" అన్నాడు. just-just reminder అంటామే, gentle reminder. ఆ gentle reminder ఇచ్చాడాయన. ఆ reminder ఇవ్వగానే హనుమంతుడు దూసుకొని వెళ్ళాడు లోపలికి. వెళ్ళి ఏం చేశాడు? మనం రామచంద్రమూర్తికి మనం మాట ఇచ్చాము. మనమంతా కూడా నిలబడి ఆయన సీతాన్వేషణలో మనం సహాయం చేస్తాం అని చెప్పాము. ఇంత భోగలాలసుడివైపోయినావ్ ఏమిటన్నప్పుడు చటాలున పశ్చాత్తాపంతో బయటకు వచ్చినప్పుడు సుగ్రీవుడు రాముడితో అన్నాడు, "నన్ను క్షమించమ్" అన్నాడు. నేను చేసింది పొరపాటు. నన్ను క్షమించమంటే రాముడికి ఆగ్రహం రావాలి. వాడిని చంపాను. చంపబడటానికి వీలులేని వాడిని చంపాను. నీ భార్య తారని తీసుకొని వచ్చాను. నీ రాజ్యాన్ని కిప్పించాను. నాకు బాగా చేశావులే అని నిష్ఠూరం ఆడలేదు.ఆయన ఏమన్నాడో తెలుసా? జరిగినదేదో జరిగిపోయింది. ఇక జరగవలసి ఏది ఉన్నదో ఆ పని చేద్దాం. ఇది spirituality లో మనకు కలిగేది. అంటే మనస్సు ఎంత తల్లడిల్లినా, ఎవరు ఎంతగా మనల్ని కష్టపెట్టినా, ఎవరు ఎంతగా మనల్ని ప్రపంచంలో అధోగతి స్థాయికి తీసుకువెళ్ళినా క్షమని హృదయం-నిండా నింపేది, దాని పేరు అధ్యాత్మ. అది spirituality. ఇది ఒకటి. ఇది రామకథలో ఇటువంటి సందర్భాలు చాలా, చాలా ఉన్నాయి. కడగా ఒక్క విషయం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు భగవంతుడు ఎంత కృతజ్ఞతా మూర్తిగా ఉంటాడో ఆ ఆలోచించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అంతఃపురం అంతా కూడా అలంకారం చేశారు. రాముడు కిరీటధారణ చేశాడు. పట్టాభిషిక్తుడు అయిపోయినాడు. అందరూ ఆయన్ని అభినందిస్తున్నారు. హితులు, పురోహితులు, సన్నిహితులు, అంతఃపుర స్త్రీలు, అయోధ్యా నవిర ప్రజలు, కిష్కింధ నుంచి వచ్చిన వానర సమూహం, ముప్పై ముక్కోటి దేవతలంతా కూడా పుంసా మోహన రూపాయ అన్నటువంటి శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తున్నారు. కానీ రాముడి కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. ఆ గబగబా సింహాసనం దిగి వచ్చాడు. రెండు సింహాసనాల మధ్య తాదాత్మ్యం చెంది రామనామంతో నిండిపోయినటువంటి ఒక హనుమంత్ అక్కడ కూర్చుని ఉన్నాడు. "హనుమా లే" అన్నాడు. ఎక్కడా చలనం లేదు. "నేనే వచ్చాను, నీ రాముడినే వచ్చాను" అన్నాడు. అప్పుడు ఒక్కమాటన్నాడు, "నిరంతర రామనామ స్మరణాంచితమైన నా కళ్ళన్నీ కూడా ఆనంద భాష్పాలతో నిండిపోయినయి ఉన్నాయి రామా! నువ్వు గనక అనుగ్రహిస్తే ఆ కన్నీళ్లు తప్పి కనురెప్ప ఎత్తగలుగుతాను. అప్పటివరకు నా స్వాధీనంలో లేదు నా కనురెప్ప" అన్నాడు. అంటే రుద్రం యొక్క మూలం ఏమిటి అంటే కన్నీరు తెప్పించేది పరమాత్మే, కన్నీరు తప్పించేది కూడా పరమాత్మే అనేది హనుమ అక్కడ ప్రకటిస్తాడు. ఇదే రుద్రం. ఇంతకు మించి ఏం లేదు దాంట్లో. కాబట్టి అనే పట్టికి "సరే, సరే ఏ" అన్నాడు. ఆయన నా సామాన్య మానవుడిగా ఉండదలచుకున్నాడు కదా, అందువలన "రా, రా" అన్నాడు. చిటికెన వేలు ఇచ్చాడు. శ్రీరామచంద్రుడి చిటికెన వేలు ఇచ్చినటువంటి ఒకే ఒక్క వ్యక్తి సీతమ్మవారు కాకుండా ఆయన పేరు హనుమ. అలా పట్టుకొని తీసుకెళ్లాడు. అందరూ "ఏమిటి? ఎవరి ఇతను? ఎవరీ కోతి? మనకేం పరిచయమే లేదే! అందరినీ వెతుక్కుంటూ ఈయన వచ్చాడే" అనుకున్నారు. అప్పుడు రాముడు spirituality లో కృతజ్ఞత ఒక భాగం అని చెప్పడానికి ఇది ప్రధానమైన సన్నివేశం. ఏదో చేశారులే, ఏదో సేవ చేశాడు, ఎంతో మందితో పాటు ఆయన కూడా కాసేపు ఎక్కువ చేసి ఉంటాడేమో అని అనుకోలా. కృతం హనుమతా కార్య సమవిద్విహు దుష్కరం మనసాపి యదన్యేన న శక్యం ధరణీతలే అన్నాడు. అంటే అసలు ఈయన చేసినట్లు ఎవరూ చేయలేరు. ఒకవేళ హనుమ వలె సేవ చేద్దాము అని గనక అనుకున్నట్లయితే అది ఈ భూమండలం మీద ఎవరికీ సాధ్యం కాదు అని ఎట్లాగైతే చిటికెన వేలు శ్రీరామచంద్రుడు అమ్మవారికి ఇచ్చాడో అలాగే హనుమ కి ఇచ్చాడు. అలాగే హనుమని కౌగలించుకున్నాడు. అభేద, అద్వితీయ, అద్వయ, రమణీయ, మనోజ్ఞ భావనా భూమికలో సీతారామాంజనేయమైనటువంటి సందర్భం అది. సీతారాముడు ఎప్పుడూ ఒకటే. ఇక్కడ ఆంజనేయుడు అనే third dynamics కూడా వచ్చి కలిసింది. అంటే ఇక్కడ spirituality లో hallmark ఏమిటంటే కృతజ్ఞత. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు విద్య నేర్పారో, ఎవరైతే మన కన్నీరు తుడిచారో, ఎవరైతే మనల్ని అక్కున చేర్చుకున్నారో, ఎవరైతే మన క్షేమాన్ని కోరుకున్నారో, ఎవరైతే మనం బాగా ఉండాలని నిరంతరమూ అనుకున్నారో అటువంటి వాళ్ళందరి పట్ల కృతజ్ఞత చూపించటం మానవ ధర్మం. ఒక కృతజ్ఞతాభావం గనక లేకపోయినట్లయితే ఎన్ని చదువులున్నా, ఎన్ని degrees లు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా ఆ మనిషి విలువ గుండుసున్నా. కాబట్టి కృతజ్ఞత ప్రకటించమని చెప్పేది spirituality. ఇది అధ్యాత్మ. ఇది నిజంగా నిత్య జీవితంలో అధ్యాత్మ అంటే ఇవాళ మనం గురుపూర్ణిమ వస్తుంది. వ్యాసుల వారిని మనం చూడలే. నేనైతే చూడలే. కృష్ణున్ని చూడలే. తర్వాత అనేక మంది గురువులు అనేక పేర్లు ఉంటాయి. Galaxy ఎవరినీ మనం చూడలే. కానీ మనకి బోధ చేసినటువంటి ఒక గురువు, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుకి మనం వందనం చేయాలి కదా. గురువు అంటే రూపం కాదు, గురువు అంటే భావం. ఆ భావన గురువైనప్పుడు ఆ గురువు ఎక్కడ ఉన్నాడంటే చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. నీలో ఉన్నటువంటి ఆత్మే గురువు అనే భావన గనక రాగలిగినట్లయితే ఈ గురువుల రూపాలన్నీ సమసిపోగా నీలో నిరంతరమూ ఒక చైతన్య స్థానంలో ఉన్నటువంటి నీ గురువుకి గనక నీవు నమస్కరిస్తే అది నిజమైనటువంటి గురుపూర్ణిమ, అది. గురుపూర్ణిమ అనంగానే మనకు అనేకమైన head master లు, వాళ్ళు, వీళ్ళు కారు. వాళ్ళు మాత్రమే కాదు. కాబట్టి ఇది రామాయణ కథా కాలం. అలాగే కృష్ణుడి పరంగా కూడా ఈ సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ రాముడు ఏం చేశాడు? కృష్ణుడు ఏం చేశాడు? భారతం నిండా కర్మయోగం పెట్టుకున్నాడు. భాగవతం నిండా భక్తియోగం రస ప్రవాహం చేశాడు. భగవద్గీత నిండా జ్ఞాన యోగాన్ని సాధించాడు కృష్ణ పరమాత్మ. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు మూడింటినీ కూడా తన జీవిత కాలంలో celebrate చేసినవారు ఎవరంటే కృష్ణ పరమాత్మ. ఆయన ఎంత కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వ్యక్తి అంటే spirituality ని ఎలా celebrate చేశాడు కృష్ణుడు అంటే అంతరించిపోతున్నటువంటి ద్వాపరకు కాక అవతరించబోతున్నటువంటి కలియుగానికి భగవద్గీతను ఇచ్చాడు. అది ఈ ప్రపంచం పట్ల ఆయన చూపించినటువంటి కృతజ్ఞత. ఇవాళ త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర అయిపోయింది.ఇదిగో కలియుగం వచ్చింది కలియుగంలో మనకి పందొమ్మిది వందల ఇరవై ఆరు నవంబరు ఇరవై మూడు వరకు జరిగినదంతా ఒక కథ అయితే మనం పుట్టినప్పటి నుంచి ఇంకా మనం ఈ లోకంలో ఉన్నాం గనుక మన కనురెప్ప వాలే వరకు ఉన్నటువంటి ఒక తల్లిదనాన్ని ఒక తండ్రిదనాన్ని ఒక గురువుని ఒక దైవాన్ని ఒకే మూర్తిలో దర్శనం చేయించిన అటువంటి పరమ కారుణ్యమూర్తి ఎవరంటే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. [కప్లులు] తల్లి తండ్రి గురువు దైవం ఈ నాలుగు aspects మనం అక్కడ చూడొచ్చు మరి రాముడి గురించి మాట్లాడుకున్నాం కృష్ణుడి గురించి మాట్లాడుకున్నాం ఇదిగో ఇటువంటి ఈ జగత్తులోనే మనమున్న ఈ ప్రపంచంలోనే మనందరి మధ్య నడయాడినటువంటి స్వామి అధ్యాత్మని ఎలా ప్రపంచానికి పరిచయం చేశారు అది గనుక తెలుసుకుంటే అసలు అధ్యాత్మ అంటే ఏమిటో తెలుస్తుంది. ఒక విషయం అధ్యాత్మ అంటే మరణానంతరం వచ్చే సుఖం కాదు. మరణానంతరం అనేటువంటి దానికి సుఖం ఎవరికి ఉన్నది ఆత్మకు సుఖము తెలియదు దుఃఖము తెలియదు పోనీ శరీరం అనుభవిద్దామా అది ఎప్పుడో పోయి నేలమీద పడిపోయి ఉన్నది కాబట్టి ఈ మరణానంతరం ఏర్పడే సుఖం సుఖం కాదని అదంటూ నిజానికి లేదని కన్నుమూసేదాకా మనం ఈ కృతజ్ఞతని ఎలా ప్రకటించాలి అధ్యాత్మని ఎలా ఆచరణాత్మకం చేయాలి how to practice this spirituality ఆ ritual అంటే దీపం వెలిగించడం ritual clean గా ఉంచుకోవటం ritual ఇవన్నీ కూడా rituals ఏ what is spiritual అనే ప్రశ్న వచ్చినప్పుడు మనందరి జీవితాలలో స్వామి ఎలా spirituality ని చూపించారో చెప్తాను. మొట్టమొదటగా ఈశ్వరమ్మ గారు కన్నతల్లి. కరణం సుబ్బమ్మ కనుగొన్న తల్లి స్వామి దైవం అని తెలుసుకున్నది ఈశ్వరమ్మ గారు కాదు కరణం సుబ్బమ్మ గారే కాబట్టి కరణం సుబ్బమ్మ గారు ఆమె శరీరం వదిలిపెట్టినప్పుడు స్వామి వచ్చి నన్ను ఒక్కసారి ఆ సమయంలో చూస్తే బాగుండును అని అనుకున్నప్పుడు ఆమె మరణించినట్లుగా ఉన్న సమయంలో పెదవుల మీద ఈగలు వాలుతున్నప్పటికీ కూడా సత్యసాయి భగవానుడు ఆమె దగ్గరకు వచ్చి సుబ్బమ్మ నేను వచ్చాను అన్నారు ఆమె కళ్ళు అలా తెరిచి చూసి కళ్ళు మూసుకున్నది హాయిగా ఐక్యం శివైక్యము సాయి లోనో కలిసిపోయింది అంటే ఇక్కడ ఎవరు కృతజ్ఞత అంటే కరణం సుబ్బమ్మ ఆనాడు పుట్టపర్తి లో స్వామి తొలినాళ్లలో దైవంగా ప్రకటితం అవుతున్నటువంటి వేళ దగ్గర హక్కున చేర్చుకొని స్వామితో పాటు స్వామి కోసం వచ్చిన అందరికీ కూడా వండి వడ్డించి ఆ అవతారం యొక్క ఆ పునాదిని స్థిమితం చేసిన కారణంగా ఒక కృతజ్ఞత ప్రకటించిన అటువంటి వారు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. [కప్లులు] నాకున్న వేలమంది భక్తుల్లో కరణం సుబ్బమ్మ ఒకతే అనుకోలేదు ఆయన కృతజ్ఞత ఎలా ప్రకటించారు ప్రాణ నిర్గమన వేళ స్వయంగా వచ్చి ఆమెను పలకరించి మళ్ళీ ఆమెలో చైతన్యాన్ని కలిగించి ఒక ఆనందానుభూతిని వరదానం చేసి కృతజ్ఞతని ప్రకటించారు. అలాగే అనేకమైనటువంటి సందర్భాలలో ఆ స్వామి sixtieth birthday సందర్భం వెళుతూ ఉంటే కరణం సుబ్బమ్మ నగర్ అనేది foreigner అడిగినప్పుడు తెలుగులో రాసింది ఆ బోర్డు అది ఎవరు అని అడిగారు అడిగితే కరణం సుబ్బమ్మ నగర్ అని చదివినప్పుడు స్వామి ఒక్కసారిగా అప్పటికి స్వామి ప్రపంచ ప్ర-ఖ్యాతి పొందినటువంటి అవతారమూర్తి ఈశ్వరమ్మ కనుగొన్న తల్లి ఆ కన్నతల్లి కరణం సుబ్బమ్మ స్వామిని కనుగొన్న తల్లి అన్నారు ఆ కనుగొన్న తల్లి పట్ల ఆయన కృతజ్ఞతాపూర్వకంగా కరణం సుబ్బమ్మ నగర్ సృష్టించారు అంటే ప్రతి అంగుళంలోనూ స్వామి కృతజ్ఞతను ప్రకటిస్తూనే వచ్చారు ఉదాహరణకి మన బోటి వాడు ఏదైనా చిన్న చాలా చిన్న సేవ చాలా చిన్న పని మనం గనుక చేస్తే స్వామికి కలిగినంత ఆనందం ఎవరికీ కలగలేదు ఈ ప్రపంచంలో. ఆయన ప్రకటించేవారు ప్రకటించి ఇదిగో మన doctor మన వాడు ఇలా అయినాడు అలా అయినాడు అని ఆ రోజుల్లో చెప్పేవారు దగ్గరికి తీసి పది మందికి పరిచయం చేసేవారు అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు అద్భుతమైన భజన చేశాడు ఇట్లా ప్రతిచోటా తన కృతజ్ఞతను ప్రకటించేవారు ఎందుకనంటే సత్యసాయి అవతార వైభవం ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు ఆ రోజుల్లో. కానీ స్వామికి ఆ వైభవం తెలుసు గనుక ఆ mission లోకి ఆ అవతార స్ఫూర్తి లోకి మన బోటి వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చుకొని మనం ఏ చిన్న సహాయం చిన్న సేవ చేసినా ప్రేమ కురిపించినా సత్ప్రవర్తన కలిగి ఉన్నా సచ్ఛీలంగా ఉన్నా స్వామి కృతజ్ఞతా మూర్తిగా ఉన్నారు. అవన్నీ కథా కథనంగా ఎన్ని ఉన్నా water project అయిపోయిన తర్వాత ఎనభై ఏడు గ్రామాల నుంచి స్వామికి కృతజ్ఞత చెప్పుకుందాం అని అందరూ కూడా వచ్చారు ప్రశాంతి నిలయానికి. వస్తే స్వామికి చెప్పారు ఇలా ఎనభై ఏడు గ్రామాల నుంచి ఎనభై ఏడు మంది వచ్చారు అని సరే సుమారుగా మూడు గంటల ప్రాంతంలో మధ్యాహ్నం స్వామి అంద-వాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళు అందులో ఒక్కళ్ళకి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు ఆయన ఇచ్చిన ప్రకారం లేచి నించోబోతుంటే కూర్చోమన్నారు ఆయన ఏదో చెప్పబోతున్నాడు కూర్చోమన్నారు అప్పుడు ఏమన్నారంటే స్వామి మీ ఎనభై ఏడు గ్రామాలకు నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ స్వామి కృతజ్ఞుడు అని చెప్పారు. [కప్లులు] ఇది this is real సత్య సాయి అది అంటే మనం ఇవ్వాల నేర్చుకోవలసినవి దీనిలో చెప్పక్కర్లేదు విడమరచి వీటన్నింటితో పాటుగా కొన్ని కొన్ని చాలా సూక్ష్మ సూక్ష్మేతరమైన విషయాలు స్వామి ఎలా celebrate చేశారు అనంటే సాయి గీత పట్ల సాయి గీత మరణానికి ముందు స్వామి చూపించినటువంటి ఆ ఉదార్యం.సాయిగీత స్వామి పట్ల చూపించినటువంటి ప్రేమకి కొడైకెనాల్ నుంచి పరిగెత్తుకొని వచ్చారు. ఆ సాయిగీత కోసం. సాయిగీత ఎప్పుడైనా వెళ్ళాలి అంటే తన తొండంతో బోనెట్ మీద వేసేసేది మీరు వెళ్ళడానికి వీల్లేడు స్వామి అంటే విడిచి ఉండలేను అని. ఆ ప్రేమకి కరిగిపోయినటువంటి స్వామి సాయిగీత ప్రాణం వదిలిపెట్టే సమయానికి అక్కడ చేరుకున్నారు. ఇట్లా అనేక భక్తులునండి వీళ్ళు అనేకమైనటువంటి విషయాలు జరిగిన మనము ఎలా celebrate చేయాలి చూద్దాం. ఆ నలభై ఏళ్ల క్రితం, ముప్పై ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ లోని AG's office లో ఇలాగే ఒక సత్సంగం చేస్తూ ఒక మాట చెప్పాను. ఆ మాట ఏంటంటే మనం ఇల్లు వదిలిపెట్టి office కి వచ్చేస్తూ ఉంటాం. మన pocket లో కొన్ని పూల మొక్కలుంటాయి, మీరు ఏం చేయొద్దు మీరు వస్తూ వస్తూ ఆ ప్రతి మొక్కని తాకుతూ మీరు మీ పనికి లోకి వెళ్ళండి. అదేంటి? దాన్ని తాకితే ఒక నీళ్ళు పోస్తే పూలు పూస్తుంది, ఎరువు వేస్తే ఇంకా పెరుగుతుంది దాన్ని తాకటం ఎందుకు అని. ఒక నలభై యాభై రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు చెప్పను గాని సుమారుగా ఒక ఇరవై మందిలో ఒక పద్దెనిమిది మంది నాతో ఏం చెప్పారంటే, మేము ఈ తాకటము పలకరించటం అనేది చేసిన తర్వాత నాలుగు పూలు పూసేటువంటి ఒక మొక్క నలభై పూలు పొయ్యటం మొదలు పెట్టింది. ఎందుకంటే just touch ఒక స్పర్శ దానిని కింపురుష లోకం అని మనలో ఉన్నది. ఆ స్పర్శతో గనుక చెట్టుని తాకితే భద్రత కలుగుతుంది. ఎందుకంటే చెట్టు కూడా ఒక living being కాబట్టి. కాబట్టి ప్రతి చెట్టుని, ప్రతి పుట్టని, ప్రతి పిట్టని అన్నింటినీ కూడా మనం సమాధరించడం నేర్చుకోవాలి ఒకటి. ఇక రెండవది, ఈ మధ్యనే ఈ మూడు నాలుగు రోజుల క్రితం మాకు ఒక బాల్కనీ, ఆ బాల్కనీకి ఒక window door ఉంటుంది. ఆ window glass door ఇలా వేసేస్తే lock అయిపోతుంది అది. కానీ దాన్ని ఆనుకొని మాకు ఒక నేరేడు చెట్టు ఉంది. నేరేడు చెట్టు కొమ్మలు లోపలికి వస్తాయి, నా బాల్కనీలోకి వస్తాయి. నేను మామూలుగా ఏం చేస్తానంటే ఆ కొమ్మని బయటకు నెట్టి తలుపు వేస్తా. ఎందుకనంటే దానికి అప్పుడే పుట్టినటువంటి చిగురాకులు ఉన్నాయి. అవి ఇట్లా లాగేస్తే ఆ మధ్యలో అవి నలిగిపోతాయి. నలిగిపోతే ఆ నేరేడు చెట్టు పడేటువంటి యాతన ఏమిటో మనకు తెలియదు. అది ఏమనుకుంటుందో మనకు తెలియదు. ఎంత వేదన పడుతుందో తెలియదు. కనుక నేను ఆ జాగ్రత్తగా మీకు చెప్పేటువంటి వాణ్ణి అవన్నీ నేను జాగ్రత్త తీసుకుంటా. సో నిన్న ఇలాగే వర్షం పడుతుంటే మా పని అమ్మాయిని పిలిచా. కొద్దిగా తలుపు వెయ్యి అన్నాను. ఆమె ఆ చెట్టు కొమ్మని ఇలా విరవపోయింది ఎందుకంటే ఆ ఆకు అడ్డం వస్తోందని. ఆ పని నేను చేయలేకనా నువ్వు పక్కకి తప్పుకో అని ఆ చెట్టు కొమ్మని వెనక్కి నెడితే ఆ చెట్టు తర్వాత ఈ రెండు రోజుల్లో ఇంకో నాలుగు ఆకులు వచ్చినాయి. అంటే వాటిని వాటి కంటే మనం అధికులమని, మనకి చాలా degrees ఉన్నాయి బాగా చదువు బాగా వచ్చని, వేదాలు ఉపనిషత్తులన్నీ కంఠోపాఠమని అహంకరించడానికి వీలులేనిది కృతజ్ఞతాభావం. స్వామి కూడా అంతే. మీకిక్కడ ఎన్నడూ చెప్పని ఒక విషయం మీకు చెప్తాను. కృతజ్ఞత అంటే ప్రేమ అంటే ఎలా ఉంటుంది? నిత్య జీవితంలో స్వామి అధ్యాత్మని ఎలా ఆచరించారు అంటే, ఆయన dress చూడండి అద్భుతంగా ఉంటుంది. పద్నాలుగవ ఏట ఏ dress వేసుకున్నారో శరీరం వదిలిపెట్టే సమయంలో ఎనభై ఆరవ ఏట కూడా అదే dress. మారిందా? మారలే. ఆయన కూడా ఏదైనా రోజుకో dress వేసుకొని రావచ్చు మన దగ్గరికి. అలాగే డెబ్బై రెండు సంవత్సరాలు సమయ పాలన చేస్తూ ప్రతిరోజూ పొద్దున, సాయంత్రం మన దగ్గరకు వచ్చి దర్శనం ఇచ్చారు. మనం ఎక్కడైనా గుడికి వెళితే దైవ దర్శనం అవుతుంది. అసలు దైవమే మన దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చిన అపురూప సందర్భం. అంటే ఇది అధ్యాత్మని practical గా మనకు చూపించడం. అలాగే ప్రాపంచికమైనటువంటి అన్ని విషయాలని address చేస్తూ వాటన్నింటి పట్ల నేనున్నాను అనేటువంటి ఒక అభయాన్ని వరదానం చేస్తూ అన్ని సంవత్సరాలుగా ఏ రకమైన మార్పు లేకుండా ఉండగలగటం అధ్యాత్మ. అలాగే ఏదైనా ప్రతి చిన్న విషయం, నేను ప్రకాష్ వచ్చారు ఆయనకు కూడా చెప్తుంటాను. మీ ఇంట్లో మీరు నిద్ర లేవగానే మీ గదిని శుభ్రం చేసుకొని, మీ దుప్పటి మడత పెట్టుకొని, మీరు pen రాస్తే ఆ pen ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచుకొని, పుస్తకం ఉ-ఉంటే నలక్కుండా చదువుకొని, బట్టలుంటే మాయకుండా వేసుకొని, మీ దగ్గర గనక పది రూపాయలుంటే ఒక రూపాయి త్యాగం చేయగలిగితే వీటిని మించిన అధ్యాత్మ ఎక్కడున్నది? ఈ జీవితంలో celebrate చేయనటువంటి అధ్యాత్మని మరణించిన తర్వాత అధ్యాత్మ అంటే దానికి అది దారి కాదు. ఇందాక చెప్పినట్లుగా religion అనేటువంటిది అనేక మార్గాలలో అనేక diversions దానికి exit gates బోలెడుంటాయి. spirituality కి అట్లా ఉండదు సరళ రేఖ. రాజమార్గంలో ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే end అయిపోతుంది. కాబట్టి లక్ష్యము, గమ్యము కలబోసుకున్నది spirituality. కేవలం లక్ష్యంతో మాత్రమే ఉండేది religion. అందుకని ఒక హైందవ ధర్మం అదే spirituality is a way of living కాదు it's not even a way of life కాదు. అది spirituality కాదు. సనాతన ధర్మము way of living. సనాతన ధర్మం ఒక life. దానిని మనం గనక అధ్యాత్మ అనబడేటువంటి ఈ భావంతో celebrate చేసుకోగలిగినట్లయితే అది నిజమైనటువంటి అధ్యాత్మ. దానినే స్వామి మనందరికీ కూడా కృతయుగం నాటి ఒక సత్యాన్ని, త్రేతాయుగం నాటి ధర్మాన్ని, ద్వాపర యుగం నాటి శాంతి ప్రేమని, కలియుగానికి కావలసిన అహింసను తీసుకొని నాలుగు యుగాల ఒక ధర్మాన్నిసత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనబడేటువంటి five dynamics లో మానవుడు ఉత్తీర్ణుడు ఎలా కావాలి? అధ్యాత్మని ఎలా ఆధారం చేసుకుని జీవించాలి? అనేటువంటి దాన్ని త్యాగం ద్వారా యోగం ద్వారా పరిమితమైనటువంటి అనేకమైన సుఖాల ద్వారా పరిమిత సుఖం ఉండాలి, అపరిమిత ఆనందాన్ని కలగాలి. అపరిమిత ఆనందంలో నుంచి బ్రహ్మానందం పుడుతుంది. అది పరమ చరమమైనటువంటి ఆనందం కాబట్టి నిత్య జీవితంలో అధ్యాత్మ అంటే punctuality మీరు four D's five D's మూడు F's నాలుగు T's అవన్నీ పక్కన పెట్టండి. ఇవాళ చేయవలసింది ఏమిటంటే మనం మనకిచ్చిన time కి మనం ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలి అంటే నన్ను ఐదున్నరకి రండి అన్నారు అనుకోండి, నేను మా ఇంటి దగ్గర ఐదింటికి బయలుదేరకూడదు. ఎందుకంటే నేను రాలేను impossible. కాబట్టి నేను ఆ time calculate చేసుకొని కచ్చితంగా on dot రావాలి. మరి మధ్యలో బోలెడు అడ్డంకులు ఉంటాయి, అవన్నీ calculate చేసుకొని రావాలి. మరి ఇవాళ ఇన్ని అడ్డంకులు, ఇంత traffic, ఇంత distance ముప్పై ఆరు kilometer లు అయినా ఐదు గంటల ఇరవై నిమిషాలకి ఇలా ఎక్కడికి ఎలా రాగలిగాం అంటే ఆ మూడున్నరకి బండి ఎక్కగలిగిన కారణం. ఇది అధ్యాత్మ. ఇక రెండవది మన mind control లో ఉన్నదా లేదా? మనం అధ్యాత్మలో ఉన్నామా లేవా అనటానికి ఉదాహరణలు ఏమిటంటే, ఓ paper తీసుకొని దానిమీద మీరు కాగితంలో గనుక pen తో రాయటం మొదలు పెడితే గజిబిజిగా రాస్తున్నారు అంటే మీ మనస్సు మీ అధీనంలో లేదు. చాలా అందంగా చక్కగా line ప్రకారం రాసుకుంటూ ఎక్కడా కొట్టివేతలు లేకుండా చేస్తే మీ మనస్సు మీ అధీనంలో ఉన్నట్లు. మీరు మనసుకు లొంగి ఉంటే మీరు అధ్యాత్మలో లేనట్లు. మనస్సుని మీరు అధీనంలో గనక పెట్టుకోగలిగితే అది అధ్యాత్మ. ఏట్-ఏమైనా సరే వాన రాణి, పోని ఏమైనా కానీ ఎక్కడైనా ఎట్లాగైనా ఇవాళ అక్కడికి చేరుకోవాలి అనుకుంటే అది అధ్యాత్మ. నేను కూడా ఏమోనండి వర్షం వస్తుందేమో అసలు ఎవరూ రారేమో, ఏదో నా బోటి వాడు వస్తే చాలామంది రావాలని అనుకుంటాం కదా అని గనక అనుకుంటే అది అధ్యాత్మ కాదు. ఇద్దరే ఉంటారు, ముగ్గరే ఉంటారు, నలుగురే ఉంటారు ఉండనివ్వండి. ఆ నలుగురు వింటారు. నీ పని నువ్వు చెప్పటమే నీ పని. దానికి నువ్వు కట్టుబడి ఉన్నావా లేదా అది అధ్యాత్మ. ఏ కారణమైనా ఏదైనా ఎలిబి చూపించి తప్పించుకోవచ్చు. కానీ అధ్యాత్మలో నిర్దుష్టమైనటువంటి మార్గంలో వెళ్ళాలి. నిజ మార్గంలో, ఋజుమార్గంలో వెళ్ళాలి. ఆలోచనలు కూడా సరళ రేఖగా ఉండాలి. తర్వాత అధ్యాత్మలో మరొకటి ఆ చాలా అందరికీ ఉపయోగపడేది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా మనం ఎవ్వరినీ కూడా పరోక్షంగా కూడా comment చేయకూడదు. ఎవరినీ judge చేయకూడదు. మనం ఎందుకంటే మనకా హక్కు లేదు, శక్తి లేదు. లేని శక్తిని ఆపాదించుకొని వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు, వీడు పనికొస్తాడు, వీడు పనికిరాడు, వీడు జ్ఞాని, వీడు ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉన్నాడు ఈ మాటలన్నీ వింటూ ఉంటాం. ఇవన్నీ అజ్ఞాన పరిధిలో లోబడి ఉన్నటువంటి పదాలు. అధ్యాత్మని అనుభవించేటువంటి వాడికి తర తమ భేదం ఉండదు. స్త్రీ పురుష భేదం ఉండదు. సామాజిక ధర్మాన్ని పాటిస్తూ తన నిత్య జీవితాన్ని ప్రయోగశీలమైనటువంటి భావనతో దానిని ప్రదీప్తం చేసి వెలిగించుకోగలిగినట్లయితే అది అధ్యాత్మ. దేనిని మనం అర్థం చేసుకున్నామో, దేనివలన మనం ఆనందం పొందగలుగుతున్నామో, దేనిని ఎలా అనుభవించగలుగుతున్నామో దానిని మళ్ళీ పక్కవాడికి కూడా దానిలో గనక భాగం ఇవ్వగలిగినట్లయితే అది అధ్యాత్మ. జీవితం ఎప్పుడూ కూడా straight line కాదు. It is a transitional. ఎందుకంటే ఒక sound wave లాగా ఎత్తు పల్లం, ఎత్తు పల్లం music లాగా ఉదాత్త, అనుదాత్త పైకి వెళ్ళటం, కిందకి రావటం జీవితం కూడా అంతే. ఆ ఎగిరినప్పుడు మనం కిందకి వెళ్తామని తెలుసుకోవాలి. కిందకి పడిపోయిన తర్వాత ఎప్పటికైనా వెళ్తామని తెలుసుకోవాలి. ఈ రెండింటి మధ్య మూడు పదాలున్నాయి Equanimity, Equilibrium and Equipoise. ఈ మూడు ఎవరు సాధిస్తారో వాడు అధ్యాత్మలో ఉన్నట్టు లెక్క. ఒక్కసారిగా మనం కూర్చున్న చోట ఆకాశం బళ్ళున త్రెళ్లి ఏదో వచ్చి మన ఒళ్ళో పడిపోయింది, నిబ్బరంగా ఉండాలి. దాన్నే స్వామి అదరక, బెదరక, కదలక, చెదరక ఎవరైతే నిలకడ చెంది ఉంటారో వాళ్ళు అధ్యాత్మలో pass అయినట్లే అన్నారు. మహాదుఃఖం వచ్చి ముంచెత్తుతుంది మనల్ని, అనుకోనిది ఇవాళ దాకా ఉన్న మనిషి రేపు పొద్దున్నుంచి లేదు, కాదు ఇంకో గంటలో లేదు, లేదో లేడో, ఉన్నవాడు వెళ్ళిపోయినాడు, ఉన్న ఆమె వెళ్ళిపోయింది అని అనుకున్నట్లయితే ఆమె వచ్చింది, ఆమె వెళ్ళింది. నేను వచ్చాను, నేను ఒకనాడు వెళ్తాను. అనే భావనలో గనక ఉంటే అది spiritual hallmark. అంతేగాని గతించిన స్మృతులతో జీవించినంత కాలం అధ్యాత్మ పరిపక్వం కాదు. ఆ నీడలు ఎందుకంటే ప్రతిదీ జరిగిపోయినదంతా స్మృతి. స్మృతి అంటే ఒక జాడ, అదొక నీడ. నీడ ఎంతసేపు ఉంటుంది? మనం ఉంటే మన నీడ ఉంటుంది కానీ ఆ నీడలో మనము లేము, మన నీడలో వారు లేరు. ఎవరి నీడలో ఎవరి object లో నుంచి ఆ నీడ పుట్టిందో ఈ నీడ, ఆ జాడ, ఈ తోడు ఇవన్నీ ఒకటిగా ఉన్నాయి గనుక ఇటువంటి విశ్లేషణాత్మకమైన బుద్ధి బలం గనక మనకున్నట్లయితే దాని పేరు అధ్యాత్మ. అలాగే చక్కగా dress చేసుకో- ఖరీదైనవి కాదు చక్కగా dress చేసుకోవాలి. ఆనందంగా ఉండాలి. ప్రతి శరీరానికి ఒక language ఉండాలి. ఆ language లో మర్యాద ఉండాలి, పవిత్రత ఉండాలి, గాంభీర్యం ఉండాలి, ఉదాత్తత ఉండాలి, ఉత్కృష్టత ఉండాలి, ఉన్నతమైన స్థితి ఉండాలి, ఉత్సవ పూర్ణంగా జీవితం సాగాలి. ఉత్సవము అంటే వేడుక కాదు. It's not a festival. ఉత్సవము, సవము అంటే యజ్ఞం.ఉన్నతమైన యజ్ఞమే మన జీవితం అదే జీవితమే చైతన్యోత్సవంగా జీవితాలు జరగాలి. ఇవన్నీ కూడా నిత్య జీవితము లో అధ్యాత్మ అనేటువంటి topicే కొద్దిగా defective. ఎందుకంటే అసలు నిత్య జీవితమే అధ్యాత్మ కావాలి. మళ్ళీ దానిలో అంటే కాసేపు పూజ, కాసేపు ప్రసంగం, కాసేపు పద్యం పాటం, కాసేపు వ్యాపారం చేయటం. మీరు వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి doctor అవ్వండి engineer అవ్వండి teacher అవ్వండి. నీ profession ఏమైతేనేమి ఆ వృత్తి లో నుంచి నీ ప్రవృత్తి ఏమిటో తెలుసుకో. ఆ ప్రవృత్తి నుంచి నువ్వు నివృత్తి మార్గంలోకి వెళ్ళు. అంటే నీ మూలంలోకి నువ్వు గనక వెళ్ళగలిగితే అది నిజమైనటువంటి నిత్య జీవితమే అధ్యాత్మగా మారాలి. లేదా అధ్యాత్మే నిత్య జీవితంగా ఉండాలి. అంతేగాని నిత్య జీవితంలో అధ్యాత్మ అనేది కాదు. నిత్య జీవితాన్ని అధ్యాత్మమయం చేసుకోవచ్చు. అధ్యాత్మ అలవడిన తర్వాత నిత్య జీవితం అలాగే మారిపోతుంది. దానికి ప్రయత్నమే అవసరం లేదు. కాబట్టి ఈ నిత్య జీవితం ఏముంది? పుట్టటం, పెరగటం, పోవటం, లేవటం, తినటం, పడుకోవటం, మళ్ళీ లేవటం. ఇది జరుగుతూనే ఉంది కదా! దీన్లో మార్పేం లేదే! మరి దీనిలో అధ్యాత్మ అనే కోణాన్ని ఎలా తేవాలి అంటే ఇదిగో ఇందాక ఆ రాముడు, ఆ కృష్ణుడు, ఆ సత్యసాయి భగవానుడు వాళ్ళంతా కూడా జీవితాన్ని ఎలా చూశారు? ఎలా దర్శనం చేశారు? వాళ్ళకి ఏమి ఒరిగింది? వాళ్ళు ఏమన్నా వచ్చి మన దగ్గర రాముడు చేయి చాపాడా? కృష్ణుడు చేయి చాపాడా? సత్యసాయి భగవానుడు చేయి చాపారా? మీరందరూ వచ్చారు తలా ఒక రూపాయి ఇక్కడ కట్టండి అని ఎప్పుడన్నా అడిగారా? ఇంకా పైగా మన బోటి వాళ్ళందరికీ ఆ కావలసిన దానికంటే అత్యధికంగా ఇచ్చి, "నీకు ఈ అత్యధికమైనది ఎందుకు ఇస్తున్నాను అంటే సత్కర్మలతో నీ తోటి వారిని సాకి కాపాడు, రక్షించు. కలిగిన ప్రతి వాడు నలిగిన వాడిని చూచుకోవాలి" అని చెప్పేటువంటి ఒక ఉదాత్తమైన అధ్యాత్మని practicalగా స్వామి మనకి చేసి చూపించారు. అలాగే నారాయణ సేవ, నిత్య నారాయణ సేవ అనేక రకాలు ఆ సేవలన్నీ ఇవాళ మళ్ళీ మనం చెప్పుకో మనందరికీ తెలుసు అవి. కానీ అది కేవలము వైరాగ్య భావంతో కాక స్మశాన వైరాగ్య భావంతో ఎవరో convener గారు message పెట్టారు. మనం ఆ నారాయణ సేవలో పాల్గొందాం లేదా అందరితో పాటు ఉందాం, వెళ్దాం అంటే convener గారికి వచ్చే పుణ్యమూ లేదు, పాపమూ లేదు. వచ్చేదంతా ఉంటే నీకు ఉంటుంది. నువ్వు సంసిద్ధుడువై, శుద్ధుడువై సిద్ధత్వాన్ని పొంది రావాలి. సేవను కూడా ఒక యోగంగా భావించాలి. ఈ అవకాశం మళ్ళీ ఈ జీవితంలో రాదు అనుకోవాలి. కింకరః కింకరో శంకరః. నిద్ర లేవగానే నేనేం చేయాలి? నేనేం చేయాలి? అనుకుంటూ వెళితే వాడే శంకరుడు అన్నారు స్వామి. శం అంటే శుభం. ప్రపంచానికి మంచి చేయాలి, మంగళం చేయాలి అనేటువంటి ఈ భావనలన్నింటినీ కూడా మనం చక్కగా గుదిగుచ్చి చేసుకోగలిగినట్లయితే నిత్య జీవితమే అధ్యాత్మ, అధ్యాత్మే నిజ జీవితం అనేటువంటి ఒక ఈ సారి నుంచి పిల్లలకి లేదా ఇలాగే నన్ను నా బోటి వాళ్ళని ఎవరన్నా పిలిస్తే నిజ జీవితము అధ్యాత్మ, అధ్యాత్మే నిజ జీవితము అది ఎట్లా? అని ప్రశ్న వేయండి. నిత్య జీవితంలో అధ్యాత్మను మాత్రం పెట్టకండి. అది correct కాదు. ఉమ్ కాబట్టి ఇవాళ ఇంకోటి కూడా అనుకున్నాను. నేనేదో వచ్చి కాసేపంతా మాట్లాడి వెళ్ళిపోవటం కాకుండా ఇందాక వారు అన్నట్లుగా వాహినిలంతా మీరంతా చదువుకున్నారు. ఎనిమిది వాహినులు, ఎనిమిదో వాహిని నడుస్తున్నదని చెప్పారు. ఏవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే అది చదివినవే కాదు, కానివి కూడా మీరు ఏవైనా ప్రశ్నలు వేయాలి అని గనక అనుకుంటే, మీ దగ్గర ఆ ప్రశ్నలు ఉంటే మీరు కూడా ఒక mic అక్కడే కూర్చొని, కూర్చున్న చోటే ఎవరైనా వాళ్ళే వెయ్యాలని కాదు ఎవరైనా, ఏదైనా ఒక ప్రశ్న సమయానికి లోబడి అందరికీ ఉపయోగించే ప్రశ్న, పదుగురికి ఒక పరిష్కారం చేయించగలిగినటువంటి ప్రశ్న ఉంటే మీరు అడగండి. మనం ఆ దిశగా ఇవాళ ఈ సత్సంగాన్ని కొనసాగిద్దాం. సాయిరాం. సాయిరాం, సాయిరాం అందరికీ సాయిరాం సాయిరాం ఈ ప్రసంగం విన్న తర్వాత అడగాలనే ఆశ లేకపోయినప్పటికీ కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాసుతో ఎవరైనా ప్రశ్నిస్తే ఏదైనా నేను కూడా చెప్పగలనన్న భావంతో మాత్రమే అడుగుతున్నట్లుగా భావించి నన్నందరూ నా సన్నిధిలోనికి వచ్చి అడగాలని తపన పడ్డారు. స్వామి చెప్పిన పద్యంలో ఆ నందవాడుడే ఆనందవాడుడై తనవారిని దుఃఖింప రగిలివచ్చె అనే పద్యం మొత్తం చెప్పడం లేదు నేను. ప్రతిష్టోపన్యాసం. ఆ మహావిష్ణువే ఈ మity విష్ణువై తన ఆయుధములను కనుగొనగా వచ్చె. అక్కడ ఆ సందర్భం ఆ ఒక్కటి మూడు slokas చదువుకున్నప్పుడు నాకు అర్థమైంది. ఈ ఆయుధములనే విష్ణువు దగ్గర చేగొనగా వచ్చె అనే విష్ణువు దగ్గర నాకు అనుకోలేదు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. దానికి నేను ఆ సందేహాన్ని నివారించవలసి వస్తుందా? కదా? కనుగొన కాదు, చే-చేగొన వచ్చె. కనుకో-కనుక్కోవడానికి ఆయనేమి కనుక్కొనే ఆయన ముందు వచ్చాడు. స్వామి మనందరినీ కనుక్కొని ఇక్కడికి తెప్పించుకున్నారు. అంటే ఈ యుగంలో ఏ రకమైన ఆయుధము license, permission లేకుండా ధరించకూడదు. అంతే కదా! మరి ఆయుధాలంటే శంఖము, చక్రము, గద రోడ్డు మీద ఉన్నాయా? లేవే! మరి ఎవరంటే కలియుగంలో ఉన్నటువంటి కలిమల భంజనం చేయాలి అంటేకలి ప్రభావాన్ని దూరం చేయాలంటే పరిపూర్ణమైనటువంటి ఒక భగవత్ తత్వాన్ని ఈ జగత్తులోకి చాటాలి. చాటాలి అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడికి మాత్రమే మాట్లాడగలిగిన అభివ్యక్తి చేయగలిగిన ఒక శక్తి ఉన్నది. Only a human is endowed with the power of discretion and reason కాబట్టి ఈ మానవ జాతిని తన ఆయుధాలుగా చేసుకొని, చేకొని ఎన్ని కొన్ని కోటానుకోట్ల జీవరాశులు మనం మనందరం మానవ జాతే అనుకుందాం. హయా మన భారతదేశంలోనే నూట నలభై ఏడు కోట్ల మంది ఉన్నారని స్వాతంత్రం వచ్చేనాటికి ఒక డెభై ఎనిమిది కోట్లు ఉన్నారని మనకు లెక్కలు ఉన్నాయి. మరి వీటన్నింటిలలో ఆ చే కొనగా, చేత్తో కొనగ అంటే పట్టుకొని తన దగ్గర పెట్టుకోవటానికి నేను వచ్చాను మహీవిష్ణువునై వచ్చానంటే విష్ణువు అంటే మహావిష్ణువు కాదు. ఈ భూమండలం మొత్తాన్ని నేను ఆక్రమించబోతున్నాను విష్ణువు అన్నా విశ్వం అన్నా ఒక్కటే. విశ్వము విష్ణువు ఒక్కటే. విష్ణువు యొక్క లక్షణం ఏమిటంటే విశ్వం సమస్తాన్ని ఆక్రమించటం. కనుకనే ఏ రాముడైతే భారతదేశానికి అంతర్గతంగా సంచారం చేశాడో, ఏ కృష్ణుడైతే వింధ్య పర్వతాలు దాటి రాలేదో కానీ ఏ సత్యసాయి భగవానుడు దక్షిణాపథంలో జన్మ ఎత్తిన ఈ దేశాన్ని ఎల్లలు దాటి సీమోల్లంఘనం చేసి నూట ఎనభై ఎనిమిది దేశాలలో సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైన ఒక ధర్మాన్ని విస్తృతం చేసిన కారణంగా స్వామి తనను తాను ప్రకటించుకున్నట్లుగా ఆయన మహీవిష్ణువై అందులో ఆంధ్రుడినే తీసుకోవాలి అరబ్ వాడిని తీసుకోను లేకపోతే అరబ్ వాడిని తీసుకోను అనుకోలేదు. మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడిని అందులో యోగ్యత ఉన్నవాడికి యోగ్యత లేని వాడికి యోగ్యతనిచ్చి శక్తిలేని వాడికి శక్తినిచ్చి యుక్తి లేని వాడికి యుక్తినిచ్చి భక్తినిచ్చి మళ్ళీ నా ఆవరణంలోకి తీసుకొని వచ్చి నేను చేకొనగ వచ్చాను అన్నారు ఆయన చేకొన్నారు అంతే. [సలాం] చాలా సూక్ష్మమైన అటువంటిది ఖాండవ దహనం. ఖాండవ దహనంలో జరిగింది ఏమిటి? ఔషధులతో కూడినటువంటి ఆ వనాన్ని దహింపజేశాడు ఎవరు అగ్ని. ఆ అగ్ని మానవ దేహం అంతా కూడా వనం అయినట్లయితే ఖాండవ వనం గనక అయినట్లయితే దానిలో ఉన్నటువంటి అగ్ని జఠరాగ్ని వైశ్వానర రూపంలో ఉన్నది. స్వామికి ప్రసాదం నివేదనం చేసినప్పుడు "అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం" అని అంటూ వైశ్వానర రూపంలో అంటే వైశ్వానర అంటే ప్రకటితమైనటువంటి తేజస్సు అంటే illumination ప్రాజ్ఞత అంటే జ్ఞానము. ప్రాజ్ఞుడికి ఇది అక్కరలేదు అలాగే తేజస్సుడు ఎప్పుడూ లోపలే ఒక illumination గా ఉన్నాడు కానీ వైశ్వానరుడు మాత్రం జఠరాగ్ని స్వరూపంగా ఉన్నాడు గనుక నా లోపల ఉన్నటువంటి ఈ దేహము ఖాండవ వనం గనక అయినట్లయితే దానిని అగ్ని ఈ జఠరాగ్నిగా ఉన్నటువంటి వైశ్వానరుడు గనక దహించివేసినట్లయితే నాకు కావలసిన physical, metaphysical and spiritual ఈ మూడు అంటే భౌతిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక ఈ మూడు శక్తులు ఔషధీకృతమై, బలవత్తరమై, వజ్ర సమానమైనటువంటి కాయం అవుతుంది గనుక దానిలో నుంచి ఏర్పడేటువంటి ఆ ఫలాన్ని మళ్ళీ ఈ ప్రపంచానికి దుష్ట సంహార క్రీడకి ఈ దౌష్ట్యము, దీనిలో ఉన్న కాలుష్యము దీని నివారణ చేయటం కోసం నేను దీనిని చేస్తున్నానని భాగవతం లోపల వ్యాసులవారు ప్రకటించినటువంటి ఒక ఉప ఆఖ్యానం అది అంతే. సాయిరాం మానస భజరే గురు చరణం అంటే స్వామి నిజానికి అధ్యాత్మ తత్వాన్ని ఆ పాటలో, ఆ కీర్తనలో, భజనలో పొదిగారు. రే అంటే సంస్కృతంలో ఒరే అని అర్థం. మానస భజరే భజ అన్నారే తప్ప భజన రే అనలేదుగా. మనం చేస్తున్నది భజన. భజ అంటే స్మరణ అని అర్థం. ఆ స్మరణ మానసికంగా చేసుకోండి అన్నారు మొట్టమొదట. మానసికమైనటువంటి భజన సర్వోత్కృష్టమైనటువంటిది. శంకర భగవత్పాదులు ఎన్ని ప్రకరణాలు, భాష్యాలు, వ్యాఖ్యానాలు రాసినా చివరికి మానస పూజే అత్యున్నతమైనదని ప్రకటించారు శంకర భగవత్పాదులు. ఇక్కడ స్వామి మానస భజరే ఎవరిని ఎవరిని స్మరి-- ఎవరిని భజ చేయాలి? భజన కాదు. భజన అంటే మనం పాడుకునే పాట, సంకీర్తన ఇది వేరు.దేనినంటే గురు చరణం. గురువు యొక్క పాదాలను స్మరించుకోండి. గురు చరణం ఎందుకు? ఇంకేదో శ్రీ చరణం, నా చరణం అనచ్చు కదా, సాయి చరణం అని రాయచ్చుగా, రాయలే. శ్రీ భూయుత శ్రీహరి చిన్హితాభ్యం అగస్త్య రేఖాదభిరంచితాభ్యం నమో నమో సత్ గురు పాదుకాభ్యం అని గురు పాదుకా స్తవంలో ఒక పాట ఉంది, ఓ మాట. ఆ మాట ఏమిటంటే గురు పాదములని, గురు పాదుకలని ఎందుకు పూజ చేయాలి? అంటే గురువు పాదాల అడుగున అగస్త్య రేఖలు ఉంటాయి. మనిషి యొక్క అరచేతిలో కర్మ రేఖలు ఉంటాయి. ఇవి మన కర్మను బట్టి, జన్మను బట్టి, సంస్కారాన్ని బట్టి, ప్రాప్తిని బట్టి, అర్హతను బట్టి ఈ కే ఈ గీతలు ఏర్పడతాయి. గురు పాదాన్ని గనుక మనం తాకినట్లయితే అప్పటి వరకు చేసినటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా ఉన్నవన్నీ తగ్గుతాయి, క్షమిస్తాయి కానీ నశించవు. కానీ మరి గురువు గారి పాదాల అడుగున అంటున్నారే, మరి అడుగున మన అరచెయ్యి ఎలా దోపాలి? కుదరదు కదా అని అంటే గురువు యొక్క రెండు బొటనవేళ్ళ కింద మన చేతి కొసలు తాకి నమస్కారం చేసుకున్నట్లయితే శ్రీ భూయుత శ్రీహరి చిన్హితాభ్యం అగస్త్య రేఖాదభిరంచితాభ్యం అంటే దాని యందు శ్రీదేవి, భూదేవి అనబడేటువంటి రెండు లక్ష్ములు గురు పాదముల యందు ఉంటాయి. శ్రీ, భూ వాటితో కూడి ఉన్నాయి. తర్వాత బీజాక్షరాలు దాని యందు ఉంటాయి. ఆ బీజాక్షరాలు ఏమిటంటే ఐం హ్రీం క్లీం అనేటువంటి మూడు అకార, ఉకార, మకారాలు కూడి ఉన్నాయి. అకారోకార మకార యుక్తమగు ఓంకారాభిధానం అంటే ఓంకారము అనేటువంటి ఆ నిశ్శబ్దము, ఆ నిర్గుణము, కేవలము శబ్దమయమైనటువంటి ఆ ఓంకారము ఎక్కడ ఉన్నది అంటే గురు పాద పద్మముల యందున్నది గనుక దానికి నేను నమస్కరిస్తున్నాననే భావనని స్వామి మానస భజరే గురు చరణం. ఎందుకని? ఆ గురు పాదాలు ఎందుకని అంటే దుస్తర భవసాగర తరణం. జన్మ అనేటువంటి మహాసాగరాన్ని దాటాలి అంటే ఆయనే మనకి దిక్కు. గురువే దిక్కు, గురువే దిక్సూచి. He is the navigator. He will tell you how in which direction we have to proceed to reach the destination. ఆవలి గట్టుకు ఎలా వెళ్ళాలి చెప్తాడు గనుక అని. అన్న తర్వాత మానస భజరే అనే పదం ఎందుకు వాడారు అని అంటే, తర్వాత చెప్పబోతున్నారు. స్వామి! మీ తల్లిదండ్రులు ఎవరు? స్వామి ఎక్కడ పుట్టారు? వారి పుట్టిన ముహూర్తం ఏమిటి? పుట్టినప్పుడు ఏమైంది? అదంతా మనకి వ్యవహారరీత్యా చెప్పాలి. కానీ స్వామి ముందే declare చేశారు. మనం పట్టుకోలేక పాట పాడుతూ గడిపేసాం. ఓంకారంభవ ఓంకారంభవ ఓం నమో బాబా. నేను పుట్టింది ఎక్కడ అంటే నిశ్శబ్ద మూలమైన, అద్వితీయమైన, అక్షరమయమైన ఓంకారమే నా పూర్వ స్థానము, నా మూల స్థానం అని చెప్పారు అది. ఓంకారంభవ దానిలో నుంచి నేను పుట్టా. అంతేగాని మీరు చదువుకునే సత్యం, శివం, సుందరం అవన్నీ మీరు చెప్పుకోండి. అందుకనే స్వామి ఎప్పుడూ కూడా చాలా ఉదాత్తమైన గీతిక అది. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే. ఓంకారంభవ ఓంకారంభవ ఓం నమో బాబా. అయిన తర్వాత మానస భజరే ఎందుకు చెప్పారంటే అరుణాచలం తప్ప మిగతా అన్ని చోట్ల అన్నీ ఉంటాయి. కావ్యకంఠ వాశిష్ట గణపతి అని రమణ మహర్షిని ఓ మాట అడిగారు. ఇన్ని hill stations ఉన్నాయి, ఇన్ని గొప్ప గొప్ప హిమాలయాలు లాంటివి ఉన్నాయి, అవన్నీ కాకుండా నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగు డిగ్రీలు ఉండే అరుణాచలం లాంటి ఇంత వేడిమి ఉండే చోటికి ఎందుకు వచ్చారు మీరు? అని అడిగితే ఆయన తెల్లకాయితం మీద రాసి ఇచ్చారు. స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలమిది అని. అంటే అరుణాచల అనగానే నీకు పరముక్తి లభిస్తుంది, జన్మ రాహిత్యం ఏర్పడుతుంది అని ఒకటి. అందుకనే స్వామి మిగతావన్నీ ఒక ఎత్తు, కడగా మీరు చేయవలసింది మానస పూజ చేసుకోండి, మానస స్మరణ చేసుకోండి, మాన మానసికమైనటువంటి భావనలో నెలకొల్ల్చండి అని అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోహం అని ఏ మౌనభూమికైతే ఈ ప్రపంచంలో అరుణాచలంగా స్థిరపడిందో దానిని దృష్టిలో పెట్టుకొని మానస భజరే అనేటువంటి కీర్తన స్వామి చెప్పి మనల్ని ధర్మ ధర్మము, శాంతి, ప్రేమలతో జీవితాన్ని గడపండి. అది మామూలుగా చెప్పినటువంటి మరో భజన. మనందరికీ వ్యక్తి ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, సమాజ ధర్మం ఉంది, దేశ ధర్మం ఉంది, వాఙ్మయ ధర్మం ఉంది, దైవ ధర్మం ఉంది. అంటే ధర్మం అంటే ధర్మం మాట్లాడుకునేది కాదు, ఆచరించవలసినటువంటిది. దేనిని నీవు నమ్మి ఆ మార్గంలో నువ్వు ప్రవేశించి వెళుతూ ఉంటావో, నీవు ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి సమాజాన్ని ప్రభావితం చేయాలి. సమాజం చేత ప్రభావితుడు కాకూడదు, అది ప్రమాదకరం. ఒక వ్యక్తి నుంచి radiance వెళ్ళాలి. ఋగ్వేదంలో కూడా ఒక మాట ఉన్నది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దిక్కుల నుండి నా యందు అమృత భావనలు ప్రవేశించు గాక. అది మొదటి మాట. Let noble thoughts come unto me. అది మొదటి మాట. రెండవది అట్లే, నా నుంచి ఉదాత్త భావనలు మళ్ళీ ప్రపంచానికి అందుగాక, చెందు గాక. ఇది ఋగ్వేద భాగం. కాబట్టి ఇవాళ మనం ధర్మబద్ధమైన జీవితం గడపాలి అంటే రాముడు తన తమ్ముళ్ళని ఎలా ప్రేమించాడో, తమ్ముళ్ళు రాముడైన అన్నని ఎలా ప్రేమించి గౌరవించారో, రాముడు వచ్చి ఆ సింహాసనం ఎక్కేదాకా నేను అయోధ్య నగర ప్రవేశమే చేయనని భరతుడు నందిగ్రామంలో ఉన్నాడో, అటువంటి ఆ ఉదాత్త భావనలు ఇవాళ ఇక్కడ ఉన్నాయా? ధర్మమే లేదే. నందిగ్రామంలో ఉన్నాడు. రాముడు అరణ్యవాసంలో ఉన్నాడు. రాముడిని నెగ్గదీసి అడిగాడు. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు. ఏ సమయానికి వస్తావో చెప్పు. మళ్ళీ నువ్వు వెళ్ళేదాకా సింహాసనం వైపు నేను వెళ్ళను. నువ్వు వచ్చినువ్వు నేను కలిసి అయోధ్యా నగర్ ప్రవేశం చేద్దాం అంతవరకు నేను నంది గ్రామంలో ఉంటాను అన్నాడు అని అట్లాగే ఎందుకు ఇంత కష్టపడతావు నువ్వు తండ్రి ఆజ్ఞ పాలించి తల్లి కోరిక తీర్చి నువ్వు ఆ సింహాసనం మీద కూర్చో ఏమవుతుంది అన్నాడు రాముడు జేష్ఠ కుమారుడిగా ధర్మ బుద్ధితో చెప్తున్నాను రామా! నీవు మాత్రమే అర్హుడివి అని సరే రాముడు రెండు చెప్పులు వేసుకుని వెళ్ళాడు దానివేళ మనం పాదుకలు అంటాం గౌరవంగా. ఈ భరతుడు వెళ్ళి ఏం చేసాడంటే ఆయన అరణ్యవాసం ఇంకా లోపలికి చొచ్చుకుని వెళ్ళక ముందే నాకు ఆ రెండు పాదుకలు ఆ రెండు చెప్పులు నాకు ఇవ్వమన్నాడు. ఆ రెండు పట్టుకుని అవి కూడా తీసుకురా రాజ్యము పోయింది అన్నీ పోయినాయి కాలికున్న చెప్పు కూడా పోయింది కానీ ఆయన ఏం చేసాడంటే నంది గ్రామంలోకి రాజుగా ఒక సింహాసనం తెప్పించాడు ఆ సింహాసనం మీద ఈ రామ పాదుకలు ఉంచాడు. జంకారమ్మగు సామగానములతో శైవాలిని గీతికలం కర్మీణ మనోజ్ఞ గానములతో శైవాలిని గీతికాలం కర్మీణ మనోజ్ఞ దానములతో ఏం చేసాడట సింహాసనం మీద కూర్చోబెట్టి రోజూ సామవేదం చేదాడట. జంకారం చేస్తూ పాడాడట. అలాగే ఆ శ్రీరామచంద్రుడు అప్పటివరకూ నడిచినటువంటి ఆ పాదుకలు అంటుకున్నటువంటి ఆ మట్టి రేణువులని దానంగా ఇచ్చాడట విభూతిగా ఇచ్చాడట. లావణ్య రేఖా నితాంతంబై చను పాదుకాయుగమున్ ప్రోజ్యత్ సింహపీఠంబుపై శంఖాపేతముగాగవుంచి రఘువంశ స్వామిగా చూచుచున్. ఆ రెండు పాదుకలు ఎలా ఉన్నాయంటే నా రామస్వామి నా అన్న అయినటువంటి రాముడు ఇక్కడ కూర్చున్నాడా అన్నట్లు ఉన్నవిట. ఇది ఈ భావన ఎక్కడిది అంటే భరతుడు రాముడిని చూడటానికి వెళ్ళినప్పుడు రాముడు ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాడు ఒక చిన్న పుల్ల తీసుకుని అరణ్యం కాబట్టి ఆ పుల్లతో రాముడి దేహాన్ని ఒక outline గనక గీసినట్లయితే అది ఎట్లా ఉన్నదిట అంటే రాముడి పాదుకలు పడుకుంటే పాదుకలు ఎట్లా ఉన్నాయో అట్లా రాముడి దేహం అట్లా ఉన్నదట. లావణ్య రేఖా నితాంతంబై చను పాదుకాయుగమున్ ప్రోజ్యత్ సింహపీఠంబుపై శంఖాపేతము గాక undoubtedly it is Rama అని నమ్మాడు. అంటే తమ్ముడి పట్ల అన్న అన్న పట్ల రాముడు కున్నటువంటి అపూర్వమైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి ఒక బాంధవ్యం ఇది ఈ ధర్మాన్ని ఇవాళ ఈ యుగం పాటిస్తున్నదా అంటే మన కళ్ళ ముందు రోజూ print అయ్యి వస్తాయి అన్నని తమ్ముడు చంపాడు తమ్ముడు అన్నని చంపాడు కొడుకు తల్లిని చంపాడు తల్లి కొడుకుని చంపేసింది. ఏమిటి అసలు ఇది? ఈ ధర్మం ఎక్కడికి పోయింది? ఎందుకు మర్చిపోయినాం మనం? ఈ జాతి ఇవాళ ఉన్నన్ని సుఖాలు త్రేతాయుగంలో లేవు. ఇవాళ ఉన్న సౌకర్యాలు అనుకూలాలు ద్వాపర యుగంలో లేవు కానీ ఇవాళ మానవుడికి సుఖాలున్నాయి సౌఖ్యాలున్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆనందం మాత్రం లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్తావో దానివలన నీకు శాంతి కలుగుతుంది. రామ ధర్మాన్ని పాటించిన భరతుడు శాంతిమయంగా పదమూడు సంవత్సరాలు జీవితాన్ని నంది గ్రామంలో గడిపాడు. అలాగే శతృఘ్నుడు అయోధ్యలో రాముడు లేడు భరతుడు లేడు లక్ష్మణుడు లేడు కట్టకడపటి వాడు శత్రువులని లోపలికి ఒక అంగుళం కూడా రాకుండా కాపాడిన అటువంటి వాడు శతృఘ్నుడు. శ్రీరాముని యందు రతి కలిగినటువంటి వాడు భరతుడు. లక్షణము, గుణము, లక్ష్యము, సేవ, కైంకర్యము ఉన్నటువంటి వడు లక్ష్మణ స్వామి. ఆయన రామస్వామితోనే కూడి ఉన్నాడంటే ఏ ఒక కష్టం వచ్చినప్పుడు ఎవరెవరి పాత్రని వాళ్ళు ఎంత నిర్దుష్టంగా మూడు వందల అరవై డిగ్రీలలో పాటించారో దానివలన శతృఘ్నుడు శాంతిగా ఉన్నాడు భరతుడున్నాడులే అని రాముడు శాంతిగా ఉన్నాడు రాముడున్నాడని హనుమా హనుమ ఉన్నాడని సీత సీత ఉన్నదని అందరూ అంటే ఒక ధర్మాన్ని ఆలంబనం చేసుకుని గనుక మనం వెళ్ళినట్లయితే మన జీవయాత్ర ఇంత సుఖంగా ఉంటుంది అని స్వామి ఆ భజనలో మనకు రాసి వినిపించారు అంతే. [అందరూ ఒకేసారి] స్వామిని రామదాసు ఒక కీర్తనలో అంటాడు రామ యోగి మందుకొనరే అంటాడు. రాముడు రాజుగా వదిరిపెట్ల ఎప్పుడైతే తాను వచ్చినటువంటి కర్తవ్యం పూర్తయిపోయిందో రావణ వధ అయిపోయిందో శైవ వైష్ణవ మతాలలో శైవులకు ఉన్నటువంటి వీర శైవయాన్ని వీర శైవాన్ని అణిచాడో మళ్ళీ ధర్మోద్ధరణ చేశాడో ఎప్పుడైతే తన వారసులైనటువంటి కుశ లవులలో కుశుడు పెద్దవాడు గనుక కుశుడికి రాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశాడో ఆ రాజ్యం ఎలా సాగుతున్నదో దూరం నుంచి గమనించి ఒకానొక రోజున నిర్లిప్తుడైన రాముడు యోగి అయిన రాముడు భవ బంధాలను విడిల్చుకున్న రాముడు అన్నింటినీ వదిలిపెట్టినటువంటి రాముడు అప్పటికే ప్రజారంజకమైనటువంటి రామరాజ్య సంస్థాపన చేసిన శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో అరవైనాలుగవ రాజు. అరవైనాలుగు తర్వాత ఇంకా ముప్పై ఐదు మంది రాజులు రాజ్యమేలారు కానీ శ్రీరామచంద్ర ప్రభువు ఒక్కడే. యోగత్వంతో అంటే మహాపురుషులు అవతార పురుషులు అలాగే అనేక మార్గాలు ఎన్నుకుంటారు ఉదాహరణకి శ్రీరామచంద్రుడు యోగ మార్గాన్ని ఎంచుకున్నాడు.యోగ మార్గం అంటే ఆయన వచ్చిందే పాయసం లో నుంచి వచ్చాడు. వచ్చేటప్పుడు నీరే వెళ్తున్నప్పుడు నీరే. కనుక సరయు నది ప్రవేశం చేసి తన దేహాన్ని వదిలిపెట్టి పాంచభౌతిక దేహాన్ని ఇక్కడే పంచభూతాలు కలిపి తనలో ఉన్నటువంటి పరమాత్మనే పరంజ్యోతిని తన మూల స్థానం అయినటువంటి వికుంఠానికి తీసుకుని వెళ్ళాడు. కనుక సరయు నది జలాలలో ఏమున్నది అని అంటే శ్రీరామచంద్రుడు యజ్ఞ పురుషుడు నుంచి పాయస ప్రవేశం చేసి జన్మ ఎత్తుకొని వచ్చి మళ్ళీ నీరము నీరు అయినటువంటి ఆ సరయు నది ప్రవేశం చేసి శరీరాన్ని వదిలిపెట్టాడు. ఇది వాల్మీకి ప్రామాణికమైనటువంటి ఒక మహా పరిసత్యం అంతే. ప్రేమసాయి ఎప్పుడొస్తారని అడగకండి నాకు తెలియదు. [నవ్వు] చాలా మంది వచ్చేశారు అక్కడ తిరుగుతున్నారు ఆయనే ఈయనే అవన్నీ వదిలేయండి అవేం జరగవు. మైక్ ఇవ్వండి మైక్ ఇవ్వండి ఇక్కడికి రండి ఇక్కడికి రండి. ఆహా మా దగ్గర జవాబు లేదు అబద్ధం చెప్పం. ఫలానా రోజు వస్తారంటే ఏవో ఎప్పుడోస్తారో ఎవరికి తెలుసు. షిరిడి బాబా చెప్పారు నిజమే కానీ స్వామి డేట్ చెప్పలే. షిరిడి బాబా షిరిడి బాబా వచ్చినప్పటికి కూడా ఆయన శరీరానికి ముప్పై తొమ్మిది ఏళ్లు వచ్చే వరకు ఆయన ఎవరో తెలియదు. కాబట్టి సత్యసాయి భగవానుడు ప్రేమ సాయిగా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ తనను తాను ప్రకట-స్వామి కూడా పధ్నాలుగు ఏళ్ల వరకు తాను ఏమిటో ప్రకటించలేదుగా. కాబట్టి ఆయన పుట్టాలి పెరగాలి ఐదో ఎట్ల చెప్తారా యాభైయో ఎట్ల చెప్తారో తెలియదు. ఏ రూపంలో వస్తారో తెలియదు. ఆనాటి సమాజం ఎలా ఉండబోతుందో మనం ఊహించలేము. ఆ ప్రేమ సాయి లో ప్రేమ చాలా ఉంటుందని అనుకోవద్దని మాత్రం చెప్పారు. ఆ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ప్రేమ సాయి లో ప్రేమ అంతే ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని క్షమించి అన్నింటినీ అర్థం చేసుకుని వదిలి పెడుతున్నాను. ప్రేమ సాయి లో అటువంటిది ఉండదు పొరపాటు చేస్తే శిక్ష తప్పదు అని చెప్పేశారు. మరి ఇప్పుడు ప్రేమ సాయి రావాలా వద్దా మనం తెలుసుకోవాలి. అమ్మ అది ఒక indication ఇచ్చారు చూద్దాం అప్పటికి మనం ఉంటే చూద్దాం లేకపోతే మన తర్వాత తరం చూస్తారు అది. నేను ముందేదో నాకు ఊహించా ఈ ప్రశ్న వస్తుందని. [నవ్వు]
YouTube · audio
Talk on , at Sri Sathya Sai Seva Mandir- BHEL Township,Sangareddy Dist
Talk on , at Sri Sathya Sai Seva Mandir- BHEL Township,Sangareddy Dist
0:00 / 1:30:22