No transcript for this section.
Transcript begins at 2:05.
ఈ గురుసన్నిధి కార్యక్రమంలో మనము వల్లూరు శ్రీరామచంద్రమూర్తి గారితో ఈనాటి గురుసన్నిధి కార్యక్రమం మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు సామాన్య జనానికి గురువు అంటే ఏ విధంగా ప్రభావితం చేస్తారండి? సామాన్య జనుడు, మాన్యుడు, అసామాన్యుడు వారు ఎవరైనా మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడికి ఒక గురువు కావాలి. ఆ గురువు ఎందుకు అంటే మనం నడిచే అటువంటి ఒక మార్గాన్ని నిర్దేశించి నువ్వు ఈ మార్గంలో గనక వెళితే సమాజహితమైన పనులు చేయొచ్చు ఒకటి. రెండవది కుటుంబ వ్యవస్థని, వివాహ వ్యవస్థని, సామాజిక స్థితిని చక్కగా భద్రంగా నడపవచ్చు అని అనేక రీతుల బోధించటానికి మనకంటే బాగా చదువుకున్న, బాగా అనుభవం ఉన్న, ఆ సౌశీల్యం ఉన్న, ఇన్ని గుణగణాలు ఉన్నటువంటి ఒక గురువు గనక ఉన్నట్లయితే మన మాన్యుడు అసామాన్యుడు అవుతాడు. అందుకనే గురువు కావాలి. ఉదాహరణకి శ్రీరామచంద్రుడు సాక్షాత్తు నారాయణ స్వరూపం. ఆయనకి ఇద్దరు గురువులు. అవును లోకగురువైన విశ్వామిత్రుడు ఒక బ్రహ్మర్షి. జ్ఞాన గురువు అయినటువంటి వశిష్ఠుల వారు రెండవ బ్రహ్మర్షి. కృష్ణ పరమాత్మకి సాందీపుడు గురువు కదా. ఇట్లా ఈ గురు స్వరూపాలుగా ఈ ప్రపంచంలో ఉన్నవారికి కూడా గురువులున్నారు. అవతార మూర్తులకు కూడా గురువులున్నారు. గురువు లేకపోతే ఆ విద్య గుడ్డి విద్య అన్నాడు వేమన. అంటే విద్య నేర్చుకుంటాం కానీ దాని ప్రయోజనం ఏమిటి? దాన్ని సమయోచితంగా ఎట్లా వాడాలి? ఔచిత్యం ఏమిటి? ఎంత మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? ఇవేమీ గురువు మనకి చెప్పీ చెప్పకుండా చెప్తాడు. అది. పూర్వకాలం గురుకులాలు ఉండేటివి. అవును శిష్యుడు అనే అతను అన్నీ నేర్చుకునేవాడు. తన వృత్తే కాకుండా చదువే కాకుండా ఉమ్ అన్ని పనులు కూడా గురుకులాల్లో గురుపత్ని గాని అన్నీ నేర్పించేవారు. ఉమ్ ఇప్పటి కాలంలో అది లేదు మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే కాలం అనేటువంటిది పరిణామశీలమైనటువంటిది కాలం. కృతయుగంలో ఉన్నట్లు త్రేతాయుగం లేదు త్రేతాయుగం ఉన్నట్టు ద్వాపర యుగం లేదు ద్వాపర ఉన్నట్టుగా ఇదిగో ఈవేళ కలియుగం కూడా ఉండదు. ఉమ్ అయితే గురుకులాలు ఒక మంచి ప్రస్తావన చేశారు మీరు. ఇవేళ లోక విద్య చెప్పబడుతున్నదే కానీ అధ్యాత్మ విద్య చెప్పబట్టలేదు. తర్వాత ప్రకృతిలో నుంచి ప్రకృతిలో ఉన్నటువంటి గురువు గురువు యొక్క పత్ని తల్లితో సమానం గురువు తండ్రితో సమానం ఎందుకని ఎనిమిదేళ్లు వచ్చిన పిల్లవాడిని ఆ గురువు గారికి అప్పజెప్పి వాళ్ళు వెళ్లిపోతారు ఆ విద్య ఏ దాకా రారు వాళ్ళు కాబట్టి తల్లీ తండ్రీ గురువై దైవమై ఆ ఒక్క గురువు లేదా గురు కుటుంబం కాపాడేది. కనుక ఆ విద్యలు లోక విద్యలు, అధ్యాత్మ విద్యలు, శాస్త్ర విద్యలు, వేద వేదాంతాలు, వ్యాకరణం ఏది నేర్చుకోవాలో ఆ ఎనిమిదవ ఏట నుంచి సుమారు పదహారు సంవత్సరాలు వచ్చే వరకు ఎనిమిదేళ్లు గురుకులావాసంలో మనిషి తన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుంటాడు. గురువే రోల్ మోడల్ ఆదర్శం. గురుపత్ని ఆమె ఉగోపికతో ఎవరో బిడ్డను తన బిడ్డగా భావించి ఆ అన్నం పెట్టి లాలించి పాలించి ఆలించి అదలించి వాణ్ని వ్యక్తిత్వ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర పోషించేది. అయితే బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళ పాలకులు అయిన తర్వాత మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత ఆ మనం మన మూలాలు మర్చిపోయాం. కనుక అక్కడక్కడ గురుకులాలు అనబట్టి చెప్తున్నా మళ్ళీ విద్య మాత్రం అదే చెప్పబడుతున్నది వేద విద్య వెనక్కి వెళ్ళిపోయింది. వేద వేదాలలో ఉన్న విజ్ఞానం ఎక్కడా లేదు. ఇవాళ మనం విజ్ఞానం అనుకునేది ఆ వేదాల నిండా ఉన్నది అది వేదాల్లో ఉన్న విజ్ఞానం కూడా చెప్పాలి. వేదాలు కేవలం మంత్రాలుగా ఆశీస్ పూర్వకమైనటువంటి ఆశీర్వచనాలుగా కాకుండా దానిలో దాగి ఉన్నటువంటివన్నీ ఆ గురుకులాల్లో చెప్పేవాళ్ళు. అందువల్ల ఇక్కడ కూర్చొని ఖగోళంలో ఏం జరుగుతున్నదో చెప్పేవాళ్ళు. అందుకని మనమేమో చూట్టం నేర్చుకున్నాం వాళ్ళేమో దర్శించటం నేర్చుకున్నారు. అంత తేడా ఉంది. గురువు గురించి ఎవరికైనా తల్లి మొదటి గురువు అవును మీ తల్లి తండ్రుల గురించి చెప్తారా? ఇది ఇంతవరకు ఎవరూ వేయని ఒక అద్భుతమైన ప్రశ్న అండి. ఎవ్వరూ వేయలేదు ఎందుకంటే నేను పుట్టిన ఇరవై ఒక్కవ రోజున మా తాతగారు మా అమ్మమ్మ నన్ను పెంచుకోవటానికి తీసుకెళ్లిపోయారు. ఆహా బారసాల అయిపోయింది కాబట్టి నేను మా తల్లిదండ్రుల దగ్గర పెరగలే ఆహా మరి అమ్మ అమ్మమ్మ ఎవరు అంటే నాకు అమ్మమ్మే అమ్మమ్మ ఆవిడ నాకు గురువే కాదు నా దృష్టిలో జగజ్జనని ఆమెకు నాలుగు చేతులు ఉండకపోవచ్చు ఎందుకని ఇంత అద్భుతమైనటువంటి మాట అన్నారంటే రామాయణ భారత భాగవతాలు పుక్కిట పట్టింది ఆమె పద్యాలు చదివేది పద్యాలకు అర్థం చెప్పేది ఇదిగో దశరథుడితో రాముడు ఇట్లా ఉన్నాడు సీతతో ఇట్లా ఉన్నాడు వాళ్ళ తమ్ముళ్లతో ఇట్లా ఉన్నాడు సమాజంతో ఇట్లా ఉన్నాడు రాజు అయినప్పటికీ కూడా ఇలా ఉన్నాడని ఆ క్యారెక్టర్స్ అన్ని చెప్తూ ఒక్కొక్క పద్యం శ్లోకం అన్ని చెప్తూ ఆ పొత్తిళ్ళనాటి నుంచి నాకు నిజంగా ప్రప్రథమ గురువు ఎవరంటే మా అమ్మమ్మ అమ్మమ్మ ఇవేళ చాలా ఈరోజు సాహితీ ప్రపంచానికి ఆరోజే బీజం వేసింది వేసింది వేసింది వేసి ఒక్కొక్క పద్యము పోతనగారి పద్యాలు ఉమ్ ఆ నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూత దయు తపస మందార నాకు దయచేయకదేని ఆవిడ అట్లా చెయ్యి ఆ ఒక్కొక్క భావాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఇటువంటి ఈ భక్తుల దగ్గరికి వెళ్లగలమా? ఇటువంటి స్నేహాలు దొరుకుతాయా? అంటే దొరికితే అటువంటి స్నేహాలు దొరకాలి అని ఆ బీజం వేసింది. తాతగారు? తాతగారు నాకు నాలుగు మూడేళ్లు వచ్చేప్పటికి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ హెడ్లైన్స్ చదివేవాళ్ళని. ఉమ్ ఆయనకి ఆయన బాగా పొలాలున్నాయి ఆయనకి అయితే ఆయనను నమ్మింది విద్యఫలాలు కాయకష్టం చేయాలి. విద్య గనక ఉంటే అదొక జ్యోతి ఒక్కొక్క దీపాన్ని వెలిగించుకుంటూ వెళ్లొచ్చు. ఈ ఆస్తులు వీటిని మర్చిపో, బాగా చదువుకో అని నాకు English workbooks alphabets నేను చెప్పా మూడో class వచ్చేప్పటికి మూడేళ్ళకి. ఆ నేను Indian Express headlines చదివేవాడిని. కూడా పలుక్కుని చదివేస్తూ వెళ్లిపోయే వాడిని. కాబట్టి ఆయన పరోక్షంగా ఉమ్ ఆయన అనేక పనులు మరి ఆ పొలం వ్యవసాయం చూసుకోవాలి. అవన్నీ చూసుకున్న నా క్షేమం, నా వ్యక్తిత్వం తర్వాత ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంఘిక ఆచారం ప్రకారం పంటలో తనకు కావలసినది మాత్రమే ఉంచుకొని మిగతాది ఊళ్ళో అందరికీ ఇచ్చేసే వాళ్ళు. వీళ్ళు తీసి పక్కన పెట్టుకునేవారు మిగతాది మీరే పంచుకోండి అనేవారు. వీళ్ళు పెంచేవారు కూడా కాదు. కాబట్టి ఈ పంచటము, పెంచటము ఉమ్ ఇవన్నీ కూడా వాళ్ళిద్దరినీ ఇవాళ స్మరించుకోవటానికి మీరు మంచి అవకాశం. అందుకనే ఈ ప్రశ్న చాలా ఉదాత్తమైన ప్రశ్న. ఎవరైనా మీకు తల్లి గురువు అంటే నాకు అమ్మమ్మ గురువు, తాత కూడా గురువు. ఒకరు ఒకటి నేర్పిస్తే ఇంకొకరు ఇంకొకటి నేర్పించారు. అంతే రెండు పార్శ్వాలు. రెండు పార్శ్వాలు. ఆ అంటే- ఒకరు జీవితంలో మనం ఎలా ಬೆಳಗాలి అనని ఒకటి నేర్పిస్తే ఒకరు సాహితి ప్రపంచానికి బీజం వేసుకు- వేసి ఆ ఈ పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఇచ్చి శతకాలు సుమతీ శతకం, శ్రీకృష్ణ శతకం, నరసింహ శతకం ఇవన్నీ కూడా శీష పద్యాలతో సహా కంఠస్తం. నువ్వు చదువు సాయంకాలం కల్లా నీకు ఏదో అరిష్ట ఇస్తాను, బూరి ఇస్తాను, గారి ఇస్తాను. ఏ పిల్లలకి అదే కదా చాక్లెట్లు ఇప్పుడు ఇచ్చే అప్పుడు లేవుగా. ఇప్పుడు చాక్లెట్లు ఇచ్చే అప్పుడు లేవుగా. అట్లా నేను. మీ ఈ అమ్మమ్మ తాతగారు తర్వాత మీ జీవితంలోకి వచ్చిన గురువు ఎవరంటారు? గురువు అవధూతేంద్ర సరస్వతి స్వామి. ఆయన సంకీర్తనాచార్యులు. నిజంగా ఒక గురువు అంటూ ఉంటే గురువుకి స్థితి ఉంటే ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేను నేర్చుకున్నా. ముద్ర పడిపోయింది. ఆయన అన్నం మెతుకు కింద పడనిచ్చేవారు కాదు. అసలు ఒక అద్భు అత్యద్భుతమైన అనుభవం ఉంది నాకు ఆయనతో. మా మమ్మీ మళ్ళీ మనవడికి ఆశీర్వచనం ఇప్పించాలని నేను తురుమెళ్ళ తెనాలికి దగ్గర eight miles అక్కడి నుంచి నన్ను తెనాలి తీసుకెళ్ళి స్వామి మీ మనవడు నా దగ్గర పెరుగుతున్నాడు. ఉమ్ ఆశీర్వచనం కావాలి. హనుమాన్ చాలీసా చేతిలో పెట్టారు. సాయంకాలం లోగా చదివితే నీకు అరటి పండు ఇస్తా. అరటి పండు ఇస్తా. సరే నేను తీసుకున్నాను వెళ్ళాను ఒక అరగంట ముప్పై నలభై నిమిషాల్లో ధారణ చేశా. వెళ్ళి వారి ముందు నుంచుని చేతులు కట్టుకుని చదివా. ఆనందపడిపోయారు. చాలా అజానుబాహులు. తన భుజాల మీద నన్ను ఎక్కించుకుని ఆ సాయంకాలం భక్తుల కోసం ఇవ్వవలసిన అరటిపళ్ళ గెలలు ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళితే చాలా పెద్దది ఒక కొమ్ము ఉంది. దాంట్లో one fourth కూడా లేను నేను చిన్న. చిన్న నాలుగేళ్ళ పిల్లోడిని. నాలుగేళ్ళ పిల్లోడిని. నీకు ఒక అరటి పండు ఇద్దామనుకున్నాను. ఈ ಗೆಲంతా నీదే అన్నారు. ఆ రోజు సాయంత్రం నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని two and half hours సంకీర్తన చేశారాయన. ఆయన నుంచి ఆ సన్నిధి నాకు ఏమి నేర్పిందంటే అన్నం తినేటప్పుడు మెతుకు కింద పడకూడదు number one. రెండవది రుచి ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది నాకిష్టము, అయిష్టము చెప్పకూడదు. ఆయన చెప్పినారు మధ్య మధ్యలో రామ వాసుదేవ అనుకుంటూ తినాలి. దానివల్ల ఆ పదార్థంలో ఉన్న దోషాలన్నీ పోతాయి. తర్వాత ఒక discipline ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రతిదానినీ భగవాన్ నామంతో లోపలికి తీసుకుంటావో వండినప్పుడు అది సాధం. భగవాన్ నామంతో కూడినప్పుడు- ಪ್ರಸಾದం ಪ್ರಸಾದం ఇది. తర్వాత వారు ఎవరినుంచి డబ్బు తీసుకునేవారు కాదు. ఎవరన్నా వచ్చి కొంత డబ్బు ఇస్తే హనుమాన్ చాలీసా లు print చేసి అందరికీ ఉచితంగా ఇచ్చేసేయండి. నాకిం నేనేం చేసుకుంటాను ఆ డబ్బు అనేవారు. ఆశ్చర్యపోతాం. చాలా ఒక అద్భుతమైనటువంటి సంకీర్తనాచార్యులవారు. వారు ఏం చేసేవారంటే సంకీర్తన చేస్తూ వెళుతూ ఉంటే ఆ ప్రకాశం జిల్లాలో ప్రధానంగా మన పొగాకు తోటల్లో- అవును పని చేసే వాళ్ళు ఉంటారు కదా. అవునవును కొడవళ్ళు పక్కన పారేసి ఆయనతో నడిచి ఊరు చివరిదాకా సాగనంపి అప్పుడు మళ్ళీ వచ్చి పనిలో పడేవారు. అల్లనాడు బృందావన్లో కృష్ణుడు వేణువు గానము- వేణువు గానము తోటి అందరూ వెళ్ళిపోయేవాళ్ళండి. ఇంట్లో పనులన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. వదిలేసి. వీళ్ళు కూడా అట్లాగే వెళ్లి ఆ కృష్ణ గోవింద గోపాల గాథే చలో అని పాడుతూ ఆయన వెళ్ళిపోతూ అరుణాచల శివ అరుణాచల శివ అని పాడుకుంటా ఆయనకు తోచినదల్లా పాడుతూ వెళ్ళేవారు. కానీ ఎవరినుంచి ఏది ఆశించకుండా, ఎవరికీ ఏ విధమైన మభ్యపెట్టకుండా, జ్యోతిష్యం చెప్పినట్టుగా చెప్పకుండా భగవంతుడున్నాడు. వాసుదేవుడున్నాడు. నాకెలా ఉన్నారో మీక్కూడా అలాగే ఉన్నాడు. మీకెలా ఉన్నాడో నాక్కూడా ఒక ఆయన కావాలి నేను దేవుణ్ణి కాదు అని ఆ ఆ గురుతత్వంలో ఉన్నటువంటి గాంభీర్యాన్ని ఒక ఉదాత్తతని ఒక మర్యాదని పరమాద్భుతంగా ఆవిష్కరించారు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన్ని కలుసుకున్నది చాలా తక్కువ కాలం. కానీ ఆయన imprint ఈ క్షణానికి కూడా మా ఇంట్లో ఒక మెతుకు కింద పడటానికి వీల్లేదు. వీల్లేదు. ఎంత కావాలో అంతే యోగికి life ఆయన గడపగలిగినప్పుడు నేనెందుకు గడపలేను? అంతే కదా అనేది ముద్ర. కాబట్టి నన్ను నేను నిర్మాణం చేసుకోవటంలో ఇవాళ అవధూతేంద్ర స్వామి వారికి ఇక్కడి నుంచి నేను నమస్కరిస్తున్నా. మహానుభావుడు ఆయన. ఉమ్ ఆయన తర్వాత మీ జీవితంలోకి వచ్చినవారు- ఆయన తర్వాత అప్పటికి నాకు నాలుగు నుంచి ఇప్పుడు ఇది అయ్యేప్పటికి ఇవన్నీ కాస్త అటూ ఇటూ అయి ఆ fourth form కి వచ్చా. పది పన్నెండు సంవత్సరాలు. పన్నెండు ఏళ్ళు. fourth form కి వచ్చేప్పటికీ నన్ను పెంచుకున్న ఈ పెద్దవాళ్ళు నన్ను పెంచుకోవటానికి తీసుకెళ్ళినప్పుడు ఆయనకి డెబ్బై ఎనిమిది. ఆహా ఆమెకి డెబ్బై ఐదు. కాబట్టి ఎలా పెంచాలి? పగటి పూటేమో గేదె పాలు, రాత్రిపూట ఆవు పాలు. ఉహు దాంతోనే పెరిగా. ఉహు ఆ వెన్న, పెరుగు ఇంట్లో పుష్కలం ఆ రోజుల్లో మీకు తెలియని సంపదే పశుసంపద. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళు ఉన్న ఊరు వదిలిపెట్టి రాలేరు. పొలాలు, ఇల్లుఒక Guardian మా పెద్ద నాయన ఇంకొల్లులో teacher గా ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్లి అక్కడ జ-జాయిన్ చేశారు ఆ మొదట్నుంచి మంచి merit student ని బాగా చ-చదువు అంటే ఇష్టం నాకు మహా శ్రద్ధగా చదువుకున్నాను మార్కుల కోసం కాదు ఈ జ్ఞానం నాకు కావాలి దీని మీద authority సంపాదించాలి అది పట్టుదల అప్పుడు ఈ జిల్లెళ్ళ మూడి అమ్మ ఆ ప్రకాశం జిల్లా కాబట్టి బాపట్ల దగ్గరేగా జిల్లెళ్ళ మూడి అవును అప్పుడు చూస్తూ చూస్తూ వింటూ ఆమెను గురించి అందరు అమ్మ అమ్మ అంటారు ఏమిటి అని నేను ఒకసారి వెళ్ళితే ఆమెనేమో రాజరాజేశ్వరి అంటున్నారు లలితా దేవి అంటున్నారు వీళ్ళల్లో ఒక్కడు కూడా రాజరాజేశ్వరిని చూడలేదు లలితాదేవిని చూడలేదు చదివారే తప్ప ఆమెని చూడలేదు మరి కనిపిస్తున్నా అని ఇలా ఎందుకు అంటున్నారు అని జిజ్ఞాసతో రెండు రూపాయలు టికెట్టు ఇంకొల్లు నుంచి ఆ ఇంకొల్లు to బాపట్ల బాపట్ల బాపట్ల నుంచి ఆ ఇంకొక అర్ధన అట్లానే బేడ ఏదో ఉంది ఆ seventh mile లో దిగి వెళ్తే వెళ్ళటం వెళ్ళటమే అమ్మ ఒక చిన్న room లో మంచం మీద కూర్చుని ఉంది నేను వెళ్ళబోతున్న ఒకాయన పెద్దాయన ఎవరో ఉన్నారు నేను నిన్ను పిలుస్తాను అక్కడ కూర్చోమన్నాడు మర్యాద ఉంది కదా కూర్చున్నా లోపల్నుంచి ఒక పెద్దగా వాణ్ని నేను పిలుచుకున్నాను లోపలికి తీసుకురా అంది అప్పుడు ఆమె నన్ను చూసే అవకాశం లేదు I was thrilled ఏంటి ఈమె నన్ను చూడని నేనే ఇంకా చూడలేదు ఆమెని అనుకున్న అప్పుడు ఆయన ఎప్పుడైతే order వచ్చిందో లోపలికి పంపించటం మంచం మీద కూర్చుంది నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని నాన్న నువ్వు నా కోసం వచ్చావ్ నా దగ్గరే ఉండు అన్నది నాలుగు గంటల దాకా ఉన్న నాలుగు గంటలకి నాకు ఒక ఆ రోజుల్లో నల్ల ద్రాక్ష పళ్ళు ఒక పది రూపాయల నోటు పది రూపాయల నోటు అప్పటి వంద రూపాయల నోటు అంత పెద్దగా ఉండే పెద్దదే పెద్దది చాలా పెద్దది అది ఇచ్చి బాగా చదువుకో ఉమ్ చక్కగా వృద్ధిలోకి రా నీకు ఎప్పుడు సెలవులు ఉంటే చదువు మాన ఇక్కడికి రావద్దు నువ్వు చదువుకోవటమే నీ ప్రధానం అని bless చేసి అక్కడ అరటి పండు ఉంటే అరటి పండు ఇలా తొక్క తీస్తూ నాన్న ఏదన్నా పైది తీసేస్తే గాని లోపలది తెలియదు ఉమ్ లోపలది తింటే గాని అనుభవం రాదు అనుభవం కాదు అనుభవం అయితే గాని ఆనందం కలగదు అని అలా నెమ్మదిగా మొట్టమొదటి ఆధ్యాత్మిక సూత్రం చెప్పింది అమ్మ అరటి పండు ఒలిచినట్లుగా ఒలిచినట్లే చెప్పింది ఉమ్ సో అట్లా నాకు సెలవులు రాగానే ఎందుకని మరి మా అమ్మమ్మ పెద్దది అయిపోయింది మా అమ్మ దగ్గర నేను పెరగలేదు కాబట్టి ఇక్కడ ఏదో ఒక మాతృచ్ఛాయలు నాకు ఉన్నాయి నేను పో-పోగొట్టుకున్నవో దొరకనివో ఇక్కడ ఏదో ఉన్నాయని అనిపించి ఆమె పట్ల నాకు ఆమెను నేను దేవి దేవతగా చూడలా ఉహు అమ్మగానే చూశా just like mother ఒక మామూలు biological mother ఎట్లాగో నాకు కూడా అట్లాగే అనుకుని వెళ్ళాను ఆ వెళ్ళినందుకు నేను చాలా లాభ పడ్డాను అంటే ప్రేమగా ఎలా ఉండాలి పవిత్రంగా ఎలా ఉండాలి ఏది ఆ బాహ్య రకమైంది కాదు ఆంతరికంగాడు పవిత్రంగా ఉండాలి ఆ రోజు చూసిన తర్వాత మళ్ళీ అమ్మని చూశారా లేకుంటే ఆ లేదు లేదు మూడేళ్ళు ఉన్నాగా మూడేళ్ళు ఉన్నా SSLC దాకా చదువుకున్నా మూడేళ్ళు ఆ మూడేళ్ళు అంటే మూడు quarterly మూడు half yearly మూడు annual exams ఆ holidays holidays అంటే తొమ్మిది పది సార్లు వెళ్ళి ఉంటా వెళ్లారు పది సార్లు నాకు ఇటువంటి అనుభవం proximity చాలా దగ్గరగా అసలు నన్ను ఎవరితో కలవనిచ్చేది కాదు ఉమ్ నా దగ్గర ఉండు నాన్న అనేది నేను పిలుచుకున్నాను అంటే ఆమె ఆమె కోసం పిలుచుకుంది కదా ఆమె కోసం పిలుచుకున్నది అంతే అదే అసలు అందరూ ఆశ్చర్యపోయే వాళ్ళు అప్పుడు నేను ఆమె దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు వీళ్ళందరినీ తాము ఒక్కతే ఎలా manage చేస్తున్నది ఎలా చూస్తున్నది బాగా డబ్బున్న వాళ్ళు వచ్చారు ఏమి డబ్బు లేని వాళ్ళు రోజు గడవని వాళ్ళు దుఃఖంతో ఉన్నవాళ్ళు ఆ అన్నీ కూడిన వాళ్ళు ఏమి లేని వాళ్ళు వీళ్ళందరితో ఆ equation ఏమిటి నేను study చేయటానికి దీనికి నేను పెట్టుకున్న పేరు ఏమిటంటే అపరోక్షానుభూతి అని పేరు పెట్టుకున్నా ఉహు చాలా మంచి పేరు మంచి పేరు ప్రత్యక్షంగా ఉంది కానీ కానీ అపరోక్షం అపరోక్షంగా ఉన్నది ఆ నాన్న నువ్వు ఇలా ఉండాలిరా అలా ఉండాలి అని చెప్పలా ఆ చూస్తూ చూస్తూ నన్ను నేను నిర్మాణం చేసుకున్నా నేను పెరుగుతున్న కొద్ది నేను కూడా ఇలాగే మర్యాదగా ఉండాలి సో మీ అవుదోతన్న స్వామితో ఒకరోజే గడిపారు ఆ కానీ అమ్మతో ఇన్ని సంవత్సరాలు holidays ఇన్ని సార్లు ఆ మీరు ఆ గురు సన్నిధి అనేది అనుభవించారు అనుభవించా ఆ గురు సన్నిధి ఆవిడ ఏమన్నది అంటే మొన్న ఈ మధ్యనే ఆమె గురించి మాట్లాడుతూ ఆమె గురువు కాక ఏమైందని ఆమె గురువు ఎవరు ఎట్లా అయిందో మాట్లాడాను కానీ ఆమె ఏందీ నేను గురువుని కాదు మీరు సృష్టులు కాదు నేను అమ్మని మీరు బిడ్డలు అంది నిజమే కానీ నేను అమ్మని బిడ్డగా నేను ఆ relation కూడా పెట్టుకోలా ఆమె గురువు అందరూ చెప్పినట్లుగా గంభీరమైన పదాలు వాడకుండా నాన్న ఆదరంగా పెట్టుకో నలిగిన ప్రతి వాడిని కలిగిన వాడు చూడాలి తృప్తిని మించిన ముక్తి లేదు ఇటువంటి కొన్ని వందల మాటలు నేను విని ఇది గురుత్వంలో ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పగలరు చెప్పగలరు కాబట్టి నా దృష్టిలో అమ్మ ఓ గురువు అంటే మీరు ఆ అమ్మని మీ అమ్మని మీ చూడకపోయినా గాని ఉమ్ ఈ అమ్మలో అమ్మతనము చూశారు గురుతనము చూశారు రెండు రెండు రెండు చూశాను మిగతా వాళ్ళు అనుకున్న ఆలోచించిన సంభావన చేసిన ఆ ఆ లలితా దేవి రాజరాజేశ్వరి నేనైతే చూడాలని నాకు అనిపించల ఎందుకంటే ఒకవేళ ఆ లలితాదేవి ఆ రాజరాజేశ్వరి వచ్చి నా ఎదురుగా కూర్చున్నా అలానే ఉంటుంది ఇట్లానే ఉంటుందిగా మరి ఇదే దొరికినప్పుడు మళ్ళీ అది ఎందుకు అవసరం లేదు అమ్మ అనుకుంటే అంటే ఆ analytical mind అది శ్రీ మాత్రే నమః అమ్మ అనుకుంటే అంతే మొదలే అసలది శ్రీ మాత్రే నమః అంటూనే శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే అది తర్వాత వస్తది ఆ శ్రీమత్ సింహాసనేశ్వరి తర్వాత తర్వాత వస్తది దానిలో ఏమిటంటే ఆ సింహాసనం ఆ మంచం చిన్న ఆవురు మంచం మీరు అమ్మ తర్వాత ఉమ్ మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు మీరు సత్యసాయి బాబా ఆ సంవత్సరాల పట్ల ఆ మే తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండు అమ్మని చూశా ఒక నెల ఆంధ్రప్రభలో చిన్న paper note small news paper news item వచ్చింది ప్రభలు కడతాం కదా ఆ ఆ ప్రభల మీద సత్యసాయి బాబా వారి బొమ్మఉండి ద్వాపర యుగం నాటి కృష్ణుడే మళ్ళీ వచ్చాడు అని రాసింది. మరి మనస్సు చిన్నది అది ప్రశ్న వేస్తుంది కృష్ణుడు వస్తే కృష్ణుడిలా లేడు ఏంటి ఈయన? ఫ్లూట్ లేదు, పించం లేదు, కిరీటం లేదు మరి ఈయన కృష్ణుడు ఎలా? అన్నా ఓహో ఆమెను లలిత అన్నట్టు, రాజా రాజేశ్వర అన్నట్టు ఈయనను కూడా అంటున్నారేమో. ఏమంటున్నారేమో అంటున్నారు. అయినా చూద్దాం అనిపించింది. సంశయం తీర్చుకోవాలి కదా. తీర్చుకోవాలిగా జిజ్ఞాసి ఎప్పుడూ కూడా సందేహాన్ని పొట్టలో పెట్టుకోకూడదు. సంశయం తీర్చుకొని వెళ్ళాలి అప్పుడు నేను అక్కడి నుంచి బయలుదేరి గుంటూరు వచ్చి ఆహ్ గుంతకల్ passenger ఎక్కి పెనుగొండలో దిగి బుక్కపట్నం మీదుగా నడుచుకుంటూ ప్రశాంత నిలయానికి చేరుకున్నా. ఉహు ఒక నెల గ్యాప్. ఒక నెల. అంతే సరే వెళ్ళిన సమయంలో ఆ ఒక చిన్న నిక్కరు white shirt ఓవల్ టీం colour నిక్కరు వేసుకుని వెళ్ళాను ఇంకో జుత్త అలాంటిదే ఉంది చేతిలో. అంతేలే ఆయనన్నాడు స్వామి అక్కడే ఉన్నారు బాబా వెళ్ళండి అన్నాడు. కాళ్ళు చేతులు కడుక్కుని నేను వెళ్ళా. వరండాకి ఆ చివర ఉన్నారు. ఓ ఈయన రావటానికి కొద్దిగా time పడుతుంది కాబట్టి అని permission లేకుండా వరండాలోకి చొచ్చుకుని వెళ్ళకూడదు కదా అని నుంచున్నాను. అలా నిద్ర ఒక మాగన్నుగా కనురెప్ప వాలింది. ఇలా వాలిందో లేదో నా ఎదురుగా నిల్చున్నారు. ఇది అతిమానుషమైన చర్య ఆయన గాలిలో వచ్చారా? పరిగెత్తుకు వచ్చారా? తెలీదు. తెలీదు కానీ వచ్చారు. మీరు కూడా సుషుప్తావస్థలో ఉండారు. అద్భుతమైన అవస్థ అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? కాచుకు కూర్చుంటిని. రెండర్థాలున్నాయి కాచుకు మన రాయలసీమ కాచుకు కూర్చుట అంటే waiting Waiting అవును Waiting for you అన్నారు అది నా అహంకారాన్ని పెంచి పోషిస్తుందని భయపడి నన్ను కాచుటకు ఆయన ఉన్నారు అని అనుకున్నా. అవును రెండు రకాలు వస్తాయి. రెండు రకాలు వచ్చినాయి అని ఇలా చిటికెన వేలు పెట్టుకుని వరండాలోకి తీసుకెళ్లి తరువాత ఆయన నన్ను ఆమె తల్లి ఈశ్వరమ్మ గారికి అప్పజెప్పి మూడు రోజులు అక్కడ నేనున్నాను మూడు రోజుల్లో భగవద్గీత, భజగోవిందం అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అది నాకు వారు చెప్పిన మొట్టమొదటి శ్లోకం. ఉహు అది నిత్యాభియుక్తుడవై ఉండాలి. ఏదో కాసేపు చూసి వచ్చి కాసేపు కలిసి వెళ్ళిపోయేది కాదు మాధవుడితో భగవంతుడితో సంబంధం ఎలా నిత్యం ఉండాలో మానవ సంబంధాలతో కూడా అట్లాగే ఉండాలి కాకపోతే ఇక్కడ అపరిమితమైన మమకారంతో ఉండాలి భగవంతుడితో. అవును జీవుడితో పరిమితమైన మమకారంతో ఉండాలి పరిమిత మమకారం అద్భుతమైన మాట దాని వల్ల స్పర్ధలు రావు కానీ లోపల మమకారము, మమత, అపేక్ష, వాత్సల్యం, అనురాగం, ప్రేమ ఇవన్నీ ఉండాలి. గుణాలన్నీ ఉండాలి. ఉండాలి కానీ పరిమితంగా పరిమితంగా ఉండాలి అట్లా మూడు రోజులు అద్భుతమైన ఉపన్యాసాలు మాకు ఎంతమందివి ముప్పై మంది ఉన్నాం just thirty తరువాత మూడు లక్షల మందిలో కూడా ఆయన్ని చూశా. అట్లా బాబాగారితో ఆ సాన్నిహిత్యం ఏర్పడటం తరువాత ఈ నా చదువు చదవ-చదువుకోవాలి కదా చదువు, వివాహం తరువాత దేశదేశాంతరాలు వెళ్ళటం ఇవన్నీ కూడా ఆయన సన్నిధానంలో జరిగిపోయినయి కాబట్టి గురు సన్నిధి తీవ్రమైన ప్రభావం ఏమిటంటే రఘువరదాసు గారు ఆ చిన్న ఛానల్ ని కొద్దిగా open చేసి వదిలేశారు. ఉహు అమ్మ దాంట్లో విత్తనం వేసింది. విత్తనం వేశారు బాబాగారు మహావృక్షం చేసినని ఇలా వదిలిపెట్టేశారు. ఉహు అది మీరు ఆ తరువాత లౌకిక విద్యలోకి వచ్చా అన్నారు కదా ఉమ్ ఈ లౌకిక విద్యలో మీకు గురువు ఎవరండీ? లౌకిక విద్యలో యోగం, యోగం ఏంటంటే ఎవరు ఆయా రంగాలలో సమున్నతమైనటువంటి వ్యక్తులో ఎవరు ఆదర్శ పురుషులో ఎవరు కేవలం degrees వలన కలిగిన పాండిత్యం కాక ఒక మానవ మేధ ఒక విశాలమైనటువంటి హృదయం ఇవన్నీ ఉన్నటువంటి గురువులే నాకు నా engineering విద్యలో గాని లౌకిక విద్యలో గాని వాళ్ళు ఒకళ్ళని కాక చాలామంది ఈ మధ్యనే వాళ్ళ గురించి ఆహ్ కృతజ్ఞతాపూర్వకంగా ఒక పుస్తకం రాశా. ఉహు దాని పేరు స్ఫూర్తి స్ఫూర్తి ఆ స్ఫూర్తిలో వాళ్ళు వారు మమ్మల్ని ఎలా తీర్చిదిద్దారో ఎట్లా మమ్మల్ని మా నడవడికని, నడతని, ఆలోచనని, జీవన దృక్పథాన్ని తరువాత ఆ సృజనాత్మక శైలిని ఏదో master చెప్పిన పాఠం notes రాసి ఎవడో ప్రశ్న వేస్తే పా పరీక్ష రాసిన పద్ధతి కాకుండా సృజనాత్మకంగా మనదైన రీతిలో అవి రాసుకుంటూ వెళితే అన్నీ ninety eight percent ఎప్పుడూ ninety eight ఎప్పుడూ తగ్గలేదు. కానీ మీరు ఈ సాహితీరంగంలో ఉమ్ కూడా ప్రవేశించారు అవును ఈ సాహిత్యరంగంలో మీకు ప్రేరణ గురువు ఎవరండీ? సాహిత్యరంగం చాలా ఒక అద్భుతమైన ప్రయాణం ఈ ప్రస్థానంలో అదొక పాయ ఆ పాయ ఏంటంటే మరి మా అమ్మమ్మ గుర్తుపెట్టుకోవాలి కదా మోడల్ ఆ రామాయణం అన్న నేర్పించింది. అమరేంద్రాసు పుర్ణచంద్రుడు దితుండైనట్లు నారాయణాంశమును బుట్టె మదాంధ రావణ శిరః సంఘాత సంచేదన క్రమణోద్దాంలు రాముడా గరితకున్ కౌసల్యకున్ అని ఈ అద్భుత సంస్కృత సమాసానికి కౌసల్యానందనుడు రాముడు ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు ఆ పద్యమంతా చెప్పేది అవును దాని వల్ల లోపల ఇటువంటి పద్యాలు ధారణ చేయాలి అవి ఎక్కడున్నాయి అని రామాయణం అంతా చదవటం అది క్రమంగా మన high school level నుంచి మొదలు పెడితే ఆ ఒక పాయ సాహిత్యమంతా చదవటం సాహిత్యంలో నా నన్ను తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు శాన పూజ్యులు అద్భుతం వారిని నండూరి రామకృష్ణమాచార్యుల వారు తత్ సమానమైనటువంటి గురు స్వరూపం నాకు. 1969 ఆంధ్రోద్యమం జరుగుతున్నప్పుడు ఒక letter రాసిచ్చి నండూరి వారు విశ్వనాథ వారికి ఇచ్చిరమన్నారు. ఉమ్ ఇచ్చిరమంటే వారు విజయవాడ నేను విజయవాడ వెళ్ళా అందరూ ఏమన్నారంటే చాలా జాగ్రత్త ఆయన చాలా పెద్దవాడు నువ్వు చిన్న వయస్సు పద్దెనిమిది ఏళ్ళు అప్పటికి 12th నుంచి 18 కి వచ్చానాకేముంది మాస్టారు ఉత్తరం ఇవ్వమన్నారు. ఓ మహానుభావుడిని చూడబోతున్నాను. అప్పటికే నేను వేయి పడగలు, ఏకవీర, ఆంధ్ర ప్రశస్తి, ఆయన రాసిన కొన్ని కొన్ని పద్యాలు, అవన్నీ కూడా ధారణ అయిపోయినయి. సరే వెళ్ళాను ఉత్తరం ఇచ్చాను. ఆ ఉత్తరం చూశారు. కింద పీట మీద కూర్చున్నారు. ఆ రోజుల్లో కుర్చీలు ఏమీ లేవు. అవును అందరూ పీట మీదే కూర్చునేవారు. పీట మీద నేను చిన్నవాడిని నేను నిల్చున్నాను. అలా చదువుతూ ఉన్నారు. కిందికి పైకి, కిందకి పైకి చదువుతూ "ఏమోయ్ మీ మాస్టారు ఆచార్యుల వారు నీ గురించి ఏం రాశారో తెలుసునా?" అన్నారు. "నాకేం తెలుసు?" [నవ్వు] "మిమ్మల్ని దర్శించడానికి మా రామచంద్రమూర్తికి అన్ని అర్హతలు ఉన్నాయి" అది ఆయన రాసింది. చదివి "చాలా అదృష్టవంతుడివి" అంటే ఆయన మంచి ఉత్సాహంగా ఉన్నారు ఆ time లో. నేను అన్నాను "మీరంటే నాకు ఇష్టము" అన్నా. ఠక్కున "అంటే?" అన్నారు. ఉమ్ ఇవి ఇష్టము అనేదానికి అంటే ఏముంది? ఏం చెప్పలేము. లేదు ఇష్టం అంటే ఇష్టం. అప్పుడే ఆయన ఒక lead question ఏం వేశారంటే "ఇష్టమంటే, నేను రాసిన ఒక పద్యం అన్నా వచ్చా నీకు?" అని అడిగారు. అంతే కదా ఇష్టమంటే ఇష్టమంటే అదే కదా పారాయణం చేసి ఉండాలి కదా. అదే కదా. అప్పుడు నేను చేతులు కట్టుకొని ఇరవై రెండు పద్యాలు చదివా. ఆయన రాసినవి. అలా అలా చూస్తున్నారు. నేను పద్యం చదు-- ఆయన పద్యాలు కొన్ని వేలు రాశారు కదా. చదువుతుంటే కంఠం కిందికి పైకి ఊగుతున్నది. ఆనందపడిపోతున్నారు. కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి ఆయనకి. "అంతా అయిపోయింది. నేను పోతాను. నా పద్యాలు ఎక్కడికి పోతాయి? అవి శాశ్వతం. నువ్వు ఆ స్పష్టత, ఎంత బాగున్నాయో నా పద్యాలు, ఇంత గొప్పవా?" అని ఆనందపడిపోయి "నువ్వు ఇవాళ ఇక్కడ భోంచేసి వెళ్ళాలి" అన్నారు. వాళ్ళింట్లో ఒక బావి. ఆ బావి పక్కన అరటి చెట్టు. ఉమ్ మార్కెట్లు లేవు కదా. ఆ అరటి ఆకు కోసి ఆయన కూడా స్నానం చేసి వచ్చి నాకు ఆయన వడ్డించారు. ఇది దీని వల్ల నాకు ఏమైందంటే తెలుగు భాష సంస్కృతము రెండూ కలిసి ఉంటాయి. తెలుగు భాషకి సంస్కృతం మూలం కాదు. అవును ఆ రెండూ భిన్నమైనవి. భిన్నమైనవి. భిన్నమైనవి. కాబట్టి ఈ సంస్కృత సమాసాలు వచ్చినప్పుడు మనం సంస్కృతము చదువుకోవాలి. తెలుగు తెలుగు చదువుకోవాలి. చదవాలి అంటే ఎవరో రాసిన చదవాలి అంతే కదా. అవును ఆ రాయాలి అంటే ఒక పద్యం రాయాలంటే మనం కనీసం పదివేల పద్యాలు చదివి ఉండాలి. కాబట్టి సాయంకాలం అవగానే నా వృత్తి పరిచయ engineer గా నేను చేయవలసిన పనులు చేసి, ఆ తర్వాత ఏం చేయాలి? సినిమాకి వెళ్లి కాలం చెల్లగొట్టకూడదు, అటు ఇటు వెళ్ళకూడదు, ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళకూడదు, కావ్య పఠనం చేయాలి అని విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షాన్ని ఆపోసన పట్టుకున్నా. నా interest కొద్ది. అందులో ప్రధానమైన కొన్ని కొన్ని పద్యాలు శైలి ఇది. దాంతో పాటుగా నేను కడప. అవును కడప వెళ్ళా ఈ factory కట్టడానికి. ఉమ్ చిన్న చౌక్ అని ఉంది కడపలో. అవును అక్కడ ఒక సినిమా theatre దగ్గర చిన్న చౌక్ లో ఒక solvent plant కట్టవలసి వచ్చింది. అప్పుడు నేను బొంబాయి నుంచి అక్కడికి వచ్చి ఉన్నా. ఉంటే ఆ Seven Road Center అని ఒకటుంది కదా. అవునండి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఏడు రోడ్ల కొండలు. ఆ? ఉంది. ఆ ఉంది. ఉంటే అక్కడ ఒక అయ్యర్ హోటల్ ఉండేది. ఆ అయ్యర్ హోటల్ కి మరి breakfast చేసి factory కి వెళ్ళేవాడిని. రోజూ ఒకాయన very tall ఆరడుగుల పైన ఉండేవారు సన్నగా. ఆయన వచ్చి అక్కడ కూర్చుంటే ఆయన రాగానే counter వదిలేసి ఎదురెళ్ళేవాడు ఆయన అయ్యరు. ఆ అయ్యవారు రండని. ఏంటి ఇంత మర్యాద ఈయన ఎవరో పెద్దాయన గొప్ప వ్యక్తి అయి ఉంటారు పెద్దాయన అని అనుకున్నా. కానీ ఆయన table వేరు నా table వేరు. మీరెవరన్నా అడగలేదు నేను చిన్నవాడిని చాలా. మూడు రోజులో నాలుగు రోజులో చూశారు. ఆయన ఆ time కి వచ్చేవారు. "చాలా ముచ్చట వేస్తోంది. నేను గడియారం దిద్దుకోవలసిన పని లేకుండా అద్భుతంగా eight fifteen కి మీరు ఇక్కడ ఉంటున్నారు eight thirty కి మీరు వెళ్ళిపోతున్నారు. ఎవరు మీరు?" అని అంటే "సరే నా గురించి నేను చెప్తున్నా" అప్పుడు ఆయన్ని కలిపించుకొని "నేను నిన్ను అడిగాను కదా మీరెవరు అని అడగరే" అని అడిగారాయన. [నవ్వు] అడిగితే నేను ఏమన్నానంటే "మీరు చాలా గొప్పవారని తెలుస్తున్నది" అని అన్నా అంతే. "నన్ను నా-- పుట్టపర్తి నారాయణాచార్యులు అంటారు" అని పరిచయం చేసుకున్నారు. ఆ పరిచయం పరిచయం ఆయన నన్ను ఒకరోజు వాళ్ళ ఇంటికి పిలిచారు. పిలిచి "మీ కోసం నేను శివతాండవం చదువుతానన్నారు. చాప వేసుకుని ఆయన చదువుతుంటే నేను ముందు కూర్చున్నా. అది ఒక అద్భుతం అలౌకికమైనటువంటి అనుభూతి. సరే అట్లా ఆ పెద్దవారితో స్నేహం కడపలో ఏర్పడింది. "మరి నేను బొంబాయి వెళ్ళిపోవాలి నా పని అయిపోయింది గదా" పని అయిపోయింది. ఒకరోజు అడిగారు "ఎన్ని రోజులు ఉంటున్నారు?" అని "next week వెళ్ళిపోతున్నా" "అయితే ఈలోగా మళ్ళీ మా ఇంటికి రండి" అన్నారు. పెద్దవారు మనం అలా ఖాళీ చేత్తో వెళ్ళకూడదు అని అక్కడ ఒక దుకాణం ఉంటే వెళ్ళి ఆయనకి రెండు ధోవతులు ఒకటి పట్టుది ఒకటి మామూలు కట్టు తీసుకున్నా. ఆయన అన్నారు "మీకెందుకండీ మీరు చిన్నపిల్లలు మంచి ప్యాంట్లు ఉన్నాయి వచ్చినయి బొంబాయి నుంచి తెచ్చాం. నాకు కాదు పంచెలు పుట్టపర్తి నారాయణాచార్యులకు" "వారు తీసుకోరండి" అన్నారు. "ఏం తీసుకుంటారో తీసుకోరు నేనైతే ఇవాళ వెళ్తున్నా" అని తీసుకుని వెళ్ళా. ఆయన అదే మా సంప్రదాయం పెద్దల దగ్గరికి గాని పిల్లల దగ్గరికి గాని ఖాళీ చేత్తో వెళ్లకూడదు. పెద్దల దగ్గరికి గాని ఖాళీ చేత్తో వెళ్ళకూడదు కదా. వెళ్ళాను. వెళ్ళేసరికి ఆయన అత్యంత ప్రేమగా, ఇవాళ నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు ఆయన. "రండి రండి ఏమిటి వెళ్ళిపోతున్నారా?" అన్నారు. "ఆ అవును మరి పని అయిపోయింది చక్కగా వాళ్ళ వాళ్ళది వాళ్ళకి అప్పజెప్పిన వెళ్ళాలి. ఈ రెండూ మీ కోసం తీసుకొచ్చాను" అన్నా. అనేప్పటికీ "ఇలా ఇవ్వండి" అన్నారు. రెండు తీసుకున్నారు. "silk ది ఇది సభలకు కట్టుకుంటా, నూలుది ఇంట్లో కట్టుకుంటా, రెండూ తీసుకోనా?" అన్నారు. "రెండు మీ కోసమే" అన్నా. అట్లా సాహిత్యం మీద ఇటువంటి మహానుభావులు మామూలు వాళ్ళు కారు. అలాగే నెండూరు రామకృష్ణమాచార్యుల వారు.ఆయన మన అధికార భాషా సంఘానికి చైర్మన్ చేశారు. ఆయన మహాభారతాన్ని ఇంగ్లీషులో రాశారు. రాస్తే రామకృష్ణ మఠం రంగనాథానంద ఎదురొచ్చి ఆయనకి పాద నమస్కారం చేసి ఆ లోపలికి తీసుకెళ్లి చాలా గౌరవించారు ఆయన. అంటే అంత అద్భుతమైన ఇంగ్లీషు తెలుగు వాళ్ళు రాయగలరా అని. అలాగే గాంధీ మీద ఒక బుక్కు రాస్తే మన రాజ్ భవన్ లో ఆ కృష్ణకాంత్ గారు అప్పుడు గవర్నర్. అవును అయితే బుక్ రిలీజ్ కని నన్ను కూడా వెంబడి పెట్టుకెళ్లేవారు. వెళితే ఆ రాజ్ భవన్ లో రిలీజ్ చేద్దాం అన్నాడు ఆయన. ఇక్కడైనా ఏర్పాట్లు చేశాను ఎంత సేపు పడుతుంది అన్నారు. ఈయన అన్నారు గాంధీగారు రాజ్ భవనాలకు వ్యతిరేకం బయట చెట్టు కింద చేద్దాం అన్నాడు ఈయన. You are a true Gandhi అని. ఇంకొవళ్ళు ఇంకొవళ్ళు అయితే ఆ బ్యాక్గ్రౌండ్ లో చేయాలనుకుంటారు బయట చెట్టు కిందే ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసి వీళ్ళంతా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తారమ్మా. Knowledge ఒకవైపు character రెండోవైపు. ప్రపంచంలో బతకటానికి అందరికీ అవకాశాలు కావాలి, ఆశ ఉండాలి. ఆశలత్తే ఆశయా బద్ధతే లోకే కర్మణా బహు చింతయా అంతే కదా! ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. Knowledge అందరూ నేర్చుకుంటారు. ఈ గురు సన్నిధిలోనే మనం మా... గురు సన్నిధిలో ఇప్పుడు వీళ్ళందరూ ఈ characters అప్పుడే నేర్చుకుంటాం మా, మా దగ్గరనుంచి నండూరి వారు, విశ్వనాథ్ వారు ఆ మన పుట్టపర్తి నారాయణరావు వాళ్ళు చెప్పకనే చెబుతారు అన్నీ నేర్చుకుంటాం. మనకు తెలియకుండా చాలా నేర్చుకొని ఇలా ఉండాలి ఒక హోటల్ కి వెళ్తే కౌంటర్ దగ్గర వాడు వాడి దృష్టి ఏమిటి? వాళ్ళ ఎంత బిల్లు అయింది? ఎంత డబ్బు సంపాదించాం? అంతేనా? అంతే మరి అయ్యవారు రాగానే ఎదురు-- ఎదురెళ్లిపోతున్నారు కదా ఎందుకు వెళ్ళాడు? కొసరి కొసరి అయ్యవారు మీరు తినటం లేదు సరే ఇంకొకటి తినండి ఇంకా అంటే ఎంత ప్రేమ సంపాదించకపోతే గౌరవం దక్కుతుంది. ఇవన్నీ మన వ్యక్తిత్వ నిర్మాణంలో సాహిత్యంలో ఇటు ఇంగ్లీష్ సాహిత్యం కూడా నేను బాగా చదువుకున్నా. ఆ ఇంగ్లీష్ ఆంగ్ల సాహిత్యంలో కూడా ముఖ్యంగా ప్రధానంగా Shakespeare ఏ కాదు అవి నాటకాలు అనుకోండి మిగతా వాళ్ళందరివి కూడా చదివాను. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎలా చూశారు? వాడు foreigner అయి ఉండొచ్చు కానీ వాడు మనిషే కదా! అదే ప్రకృతిలో మనము ఉన్నాం ఉన్నాం వాళ్ళు ఉన్నారు ఇద్దరూ ఉన్నారు మరి వీళ్ళ ఈ దర్శనం ఏమిటి అన్నప్పుడు ఓహో ఈ రెండింటికీ పెద్ద తేడా లేదు. మనం దాన్ని భగవంతుడు అన్నాం అతడు ప్రకృతి అన్నాడు అంతే తేడా. కాబట్టి దీనివల్ల ఏమైంది అంటే ఒక rational approach ఏదో ఒక మూఢత్వం, ఒక fervor, ఒక emotion కాకుండా ఒక ఉదాత్తమైన సమస్థితిలో దేనినైనా అర్థం చేసుకోగలిగినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఈ గురు సన్నిధిలో అనుగ్రహించును. తర్వాత మీకు రమణ మహర్షి సాహిత్యం అవన్నీ ఎలా అలవాటు అయ్యాయి? నా పద్దెనిమిదవ ఏట సత్యసాయిబాబా వారు ఆ రోజుల్లో one and half hours మాట్లాడేవారు. నేను చాలా అదృష్టవంతుడిని మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారేమో తెలియదు నాకు సుమారుగా అరవై ఎనిమిది డెబ్బై సార్లు నాతో మాట్లాడారు ఆయన one and half hours. ఏనాడు నీ కుటుంబం ఏమిటి? నీ పిల్లలు ఏమిటి? నీ ఉద్యోగం ఏమిటి? ఇవి అడగలా. ఎప్పుడు మాట్లాడిన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమేనా అప్పుడు ఆయన అన్నారు మానవ జన్మ ఎత్తినందుకు తిరువణ్ణామలై అరుణాచలానికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా ప్రపంచం చాలా ఉంది అక్కడ అసలుది ఉంది. నువ్వు ఎప్పటికైనా వెళ్ళు అన్నప్పుడు ఎలా వెళ్తాం మనమిక్కడ గురువు ఉన్నారు. మళ్ళీ అరుణాచలం ఈ గురువుల్ని ఇలా మార్చుకోవటం ఏంటి నా కాదా లేదు వస్తారేమో ఆయన లేరు దేహంలో. వాళ్ళు దేహం వదిలియాకనే పుట్టా కాబట్టి అవకాశం లేదనుకున్నా కానీ trust with destiny అని ఒక మాట ఉంది. విధి మనల్ని ఎటు నడిపిస్తుందో మనకి తెలియదమ్మా. మనకి తెలియదు రాయచూరులో ఏడు ప్రాజెక్టులకు నన్ను incharge గా చేసి నా air tickets నా check book లు అన్నీ ready చేసి drawing లు నా చేతికి ఇచ్చారు. అంటే రాయచూర్ లో ఐదేళ్ళు ఉండి హాయిగా బండి నడపొచ్చు. అవును కానీ board of directors meeting లో వాళ్ళు ఏమన్నారంటే మూర్తి గారిని అలా waste చేయకూడదు మనం time తమిళనాడులో మన ప్రాజెక్టులు పూర్తిగా నడవటం లేదు వారిని అక్కడికి పంపిద్దాం అని ఒక నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా నేను తిరువణ్ణామలై లో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు కోసం అని వెళ్ళా. వెళ్లి నూట ఎనభై ఎనిమిది రోజులు అక్కడ ఉన్నా. మొన్న ఫిబ్రవరి ఆరుకు వంద గిరి ప్రదక్షిణాలు చేసుకున్నా. అవునా! అప్పుడు ఈ, ఈ సాహిత్యం రమణ మహర్షిది పాల్ బ్రంటన్ కోహెన్ చాడ్విక్ వీళ్ళందరివి బాగా తీవ్రంగా అధ్యయనం చేయటం అధ్యయనం చేయటం కంటే కూడా ఆత్మానుభూతే నన్ను నడిపించింది. అవన్నీ వాళ్ళ అనుభవాలు అవి నావి కావు. నాకు కలిగింది ఏమిటంటే అవసరమైనప్పుడు మాట్లాడాలి అక్కర్లేనప్పుడు పూర్ణ మౌనంలో ఉండాలి. జీవితం మన వైపు అది ఎట్లా వస్తే దాన్ని అట్లా accept చేయాలి. Accept చేయాలి మనం ఏదో కూర్చొని నా జీవితం ఇలా ఉండాలి no మనం చేయలేము. ఈ విధికి ఆ ఎదురెడ్డి పోరాడిన వాడు లేనే లేడు ఇంతవరకు. విధి ఎట్లా నడిపిస్తే అట్లా అట్లా నడుస్తుంది మా జీవితాలు అందరివి అలా నడుస్తాయి కాబట్టి ఏముంది ఇక్కడ వచ్చాం చాలా ఖాళీగా వచ్చాం ఏదో కొంతకాలం ఇక్కడ ఉన్నాం ఓ రోజు నీ దేహాన్ని వదిలి పెడతాం. దేహం వదిలి పెడుతున్నానే గాని నన్ను నేను వదిలి పెట్టలేనుగా నువ్వు ఉండవు soul అట్లానే ఉంటుంది Soul ఇంకోటి ఇక్కడి నుంచి ఇంకో రూపంలో వస్తాను. వస్తాను, రాను దాంతో కూడా నాకు సంబంధం లేదు. అసలు ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్న విరామ కాలమే మరణం అదే ధ్యానం అదే space మనం దీన్ని గనక అర్థం చేసుకుంటే చాలు అని అట్లా అప్పుడు రెండు వేల సంవత్సరంలో సత్యసాయిబాబా గారి గురించి ఒక ఉపన్యాసం ఇచ్చి కిందికి వస్తుంటే మాకు రమణ మహర్షి ఆ మధ్య మధ్యలో రమణుల గురించి చెప్పేవారు ఆయన. రమణ మహర్షి గురించి పూర్తిగా మాకు అర్థం అయ్యేట్టు చెప్పండి మాకు ఆయన ఏం మాట్లాడలేదు కదా ఏం చెప్పలేదు కదా అంటే అప్పుడు రమణ మహర్షి సత్సంఘాలు ప్రారంభమై అది సాయి రమణీయ రమణీయం ఇద్దర్నీ పోల్చారు పోల్చాను. పోల్చి సమన్వయం చేస్తూ ఆ గురువులందరూ ఒక్కటే అనుభవించగలిగితే మనం రూప నామ భేదాల వల్ల ఈయన గొప్పవాడు, ఈయన తక్కువ వాడు, ఈయన భోగి, ఈయన యోగి అనుకుంటాం తాత్విక భూమిలోకి వెళ్ళినప్పుడు ఒకటే గురుతత్వం అంతా ఒకటే ఒకటే. అందుకనే నాకు ఒక శ్లోకం గుర్తొచ్చి ఇప్పుడు అమ్మవారు ఉంటుంది అమ్మవారికి ఒక విగ్రహం ఉంటుంది అక్కడ నుంచుని ఉంటాం కూర్చుని ఉంటాం అర్చా కాలంలో ఎలా ఉంటుందిరూపగతంగా ఉంటుంది బొమ్మ కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తుంది బ్రహ్మ కనపడదు కదా తర్వాత సన్నిధికాలే మనమేదో పాట పాడుతాం సంకీర్తన చేస్తాం అవును ఆ సమయంలో రూపం పోతే శబ్దగతం అయిపోతుంది తర్వాత మూడవది చింతనే కాలం ఉంటుంది రాముడు గురించి కృష్ణుడు గురించి ఆలోచిస్తూ ఉంటాం అక్కడ ఏముంటుందంటే ప్రాణగతం అయిపోతుంది నాలుగవది తత్వ విచార సమయంలో సర్వగతి ఉహు చాలా బాగా చెప్పారు అద్భుతం అంటే ఒక సగుణ ఉపాసన లో నుంచి శబ్ద నిర్గుణ ఉపాసనలోకి ప్రాణంలోకొచ్చి ప్రాణం నుంచి నా నానందు మాత్రమే కాదు సర్వ ప్రపంచంలో ఉన్నది అదే అనే భావన రాగానే మహదానందం కలిగిపోతుంది అంటే మనం graduate అయిపోతాం ఉ మనం నేర్చుకోవాల్సింది కూడా సహకారం నుంచి నిరాకారంలోకి వెళ్ళాలి కదా వెళ్లి తీరాలిగా అప్పుడు దర్శన పౌర్ణమి అని ఒక book రాశా ఉళ్ళాదు నార్పదు అని ఉన్నది నలభై అధ్యాత్మలో ఏమిటంటే పౌర్ణమి దర్శనాలు చేస్తారు కదా సహస్ర చంద్ర దర్శనం దాని పెద్ద ఉత్సవం మన బంధువులందరినీ పిలవటం ఉంది అంటే మన తాతగారు ఓ వెయ్యి పౌర్ణములు చూశాడు ఆకాశంలో అవును అది కాదు చూడవలసింది లోపల ఉన్నటువంటి దర్శన పౌర్ణమి పౌర్ణమి దర్శనం కాదు అని అదొక book అట్లాగే అంతర్ముఖం ఇట్లా ఈ సాహిత్యం చదివినందువలన చెప్పటానికి కావలసిన భాష భావ సంపద దాంతో పాటు భగవాన్ రమణులు వైరాగ్యంలో అద్భుతమైనటువంటి స్థితి అది అవును ఈ ప్రపంచంలో ఉంటూ తాను పొందవలసినటువంటి ఆత్మానుభవాన్ని ఆయన పదహారేళ్ళకే పొందేశారు పొంది అరుణాచలానికి వచ్చారు అరుణాచలానికి వచ్చి ఆయన పొందిందేమీ లేదు ఇవ్వటానికి వచ్చారు వచ్చి యాభై నాలుగు ఏళ్ళు అదే దేహంలో అదే స్థితిలో ఉండటం మామూలు విషయం కాదు అని అప్పుడు నేను ఆ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి ఐదు ఆ తిరువణ్ణామలై నుంచి ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు స్వామి నాతో చాలా సేపు మాట్లాడి నేను ఆ room లో నుంచి బయటకు వస్తుంటే నా shirt ఇలా పట్టుకుని కొద్దిగా ఆ చనువుతో లాగి రమణులంటే ఎవరినికున్నావు సాక్షాత్తు ఈశ్వరుడు మరసకు బంగారు అన్వేషణ ముగిసింది భగవంతుడు అనేటువంటి వాడు ఆ నిజానికి రమణుల్ని నేను చూడలే చూడలే కానీ చూడకుండా కానీ ఆయన దాన్ని ఇందులో చూసేశారు మీరు పూర్తిగా పూర్తిగా ప్రతి అణువులో మా మహర్షిని ఆ ఇప్పుడు ఈ క్షణాన కూడా అనుభవిస్తూనే ఉంటా కనుకనే ధైర్యంగా సత్యసాయిబాబా వారి మీద సాయి రమణీయం రాసినప్పుడు అందరూ అన్నారు మీరు స్వామి మీద book రాసి ఇవ్వాలి గాని రమణుల book వారికి ఇస్తారేమిటి వారు తీసుకోరన్నారు చూద్దాం ఏం జరుగుతుందో అని ఆ సాయి రమణీయం అనేటువంటి పుస్తకాన్ని ఆయన పరమా ఆనందంతో తీసుకుని లోపలికి తీసుకెళ్లి ఈనాటికి అది ఎదురు మందిరంలో ఉంచేశారు దాన్నట్లా అది పిల్లలతో చదివించేవారు లోపల ఆ తర్వాత మీరు ఉపదేశ సారం కూడా రాసినట్టున్నారు రాశాను ఉపదేశ సారం టీవీలో ఆ రోజుల్లో మాట్లాడా. మాట్లాడిన తర్వాత అట్లా కాదు సత్సంగం చేయాలని అనుకొని సత్సంగలు చేశా చాలా elite బాగా చదువుకున్నటువంటి వాళ్ళ మధ్య అది అయిన తర్వాత ఈ మధ్య covid time లో ఆ అమెరికా నుంచి ఒక దంపతులు ఉపదేశ సారం మాకు అర్థం కావట్లేదు దాన్ని మాకు అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పాలి అంటే పది రోజులు చెప్పా. రోజుకి ఆ మూడు చొప్పున చెప్పుకుంటూ వెళ్ళా. ఆ చెప్పినదంతా english లో book గా రాయటం print కూడా అయిపోయింది అట్లా english లో Hindi లో తర్వాత తెలుగులో Hindiలో కూడా మాట్లాడా. ఉపదేశ సారం గురించి రెండు వాక్యాలు శ్రోతలతో పంచుకుంటే ఓ wonderful అసలు ఉపదేశ సారం అనేటువంటి దానికి ముందు రమణుల యొక్క భక్తుడు మురుగనారనే Tamil వాఙ్మయంలో చాలా గట్టివాడు కానీ ఆవేశపరుడు emotion భక్తి పారంయం ఉంటుందిగా దాంతో రమణుల మీద అద్భుతమైన కవిత్వం రాస్తుండేవాడు ఎన్ని రకాలుగా ఆయన్ని చెప్పొచ్చో అన్ని ఆ ఓ రోజున ఒక పుస్తకం పట్టుకొని వచ్చాడు భగవాన్ దగ్గరికి ఇది నేను రాశాను ఒకసారి మీరు ఏదన్నా తప్పులుంటే దిద్ది పరిష్కారం చేస్తే సంతోషిస్తానని ఆయన చూశారు ఆ పుస్తకానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే అనుభూతి సారము అని పేరు పెట్టారు పెడితే భగవాన్ దానికి ఇలా ఎంటూ పెట్టారు ఎందుకంటే అనుభవాన్ని చెప్పగలుగుతామో చెప్పలేము అనుభూతిని చెప్పలేము కాబట్టి అనుభూతి కంటే ఉపదేశం చేద్దాం ఇది ఉపదేశ సారం అంటూ కర్తృ రజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం ఫలం కర్మ తజ్జడ అని మొదలుపెట్టి అంటే ఒక అధ్యాత్మ సాధకుడు ఆ అధ్యాత్మ సాధకుడు కర్తవ్యం నుంచి కర్త నుంచి ప్రారంభమై చివరికి ఎట్లా వెళ్ళాలి తనను తాను ఎరుగు ఎరుకలోకి ఎలా వెళ్లాలనేది ముప్పై సూత్రాలతో ఉపదేశ సారం చెప్పారు అది magnum opus అద్భుతం అంటే మనం చాలా మంచి పనులు చేస్తున్నాం చాలా దానాలు చేశాం చాలా మంచి పనులు చేశాం మనకేమి ముక్తి లభిస్తుంది వద్దన్నారాయన కృతి మహోద్ధదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం చాలా స్పష్టంగా ఇవన్నీ ఇది వివేక చూడామణిలో శంకరులు చెప్పిందే కాబట్టి ఏమిటి మనం ఇవన్నీ చేశాం కనుక మనం సర్వ సర్వోన్నతమైన స్థాయికి వెళ్తామని లేదు నిజానికి ఒక్కొక్కసారి ఇన్ని మంచి పనులు చేస్తున్నానన్న భావన లేకుండా ఎవ్వడికీ ఉండదు దానివలన అహంకారం వస్తుంది ఆ పతన కారణం ఉన్న మనం ఉన్న స్థాయి నుంచి పడి కింద అహంకారం వస్తుంది నేను ఇన్ని చేశానని అహంకారం వచ్చి పతనమవుతుంది వస్తుంది వస్తుంది దానివలన గతి నిరోధకం నువ్వెళ్ళేదానికి speed breaker అయిపోతుంది ఆహా చాలా చేశాం స్వర్ణదానం చేశాం ఇంకో దానం చేశాం అవి చేశాం అంటాం కానీ చేయవలసింది ఏంటంటే కాలదానం చేయాలి ఎవరూ చేయరు కాస్త time ఇవ్వండి అంటే రేపు రండి అంటాం అవునా అవును ఆ కాలదానం ఇవ్వటానికి ఎవడూ సిద్ధంగా లేడు వాడి దగ్గర ఇంత కాలం ఉన్నప్పటికీ కూడా ఆ కాలదానం కూడా ఎవరికో ఇచ్చేది కాదు ఈ స్వాధ్యాయంలో ఇట్లా ఉపదేశ సారం ఉళ్ళాదు నార్పడుఆ దక్షిణామూర్తి స్తోత్రం వీటన్నింటినీ అధ్యయనం చేయటానికి మనం ప్రతిరోజూ కొంత సమయాన్ని గనక పెట్టుకున్నట్లయితే ప్రపంచాన్ని ఉద్ధరించడానికైతే మనం రాలే, మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి అది ఉపయోగపడుతుంది అని ఆ క్యారి-- పరిణామ క్రమాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. అది its a wonderful ఆ book ఏది ఉపదేశ సారం. దక్షిణామూర్తి తత్వం రాశానంటున్నారు కదా ఆ దక్షిణామూర్తి తత్వం గురించి కొంచెం చెప్తారా? మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం. ఓ చెట్టు, ఓ చెట్టు కింద యువకుడైనటువంటి గురువుగారు. ఆయన ముందు సనక సనందనాదుల వంటి జ్ఞాన సంపత్తి కలిగిన శిష్యులు. వాళ్ళంతా ప్రశ్నలు అడుగుతున్నారు. అడుగుదామని వచ్చారు. అడగలేకపోతున్నారు. చెబుదామని ఆయన కూర్చున్నారు. ఆయన మాట్లాడటం లేదు. మరి ఏం జరుగుతున్నది అంటే transmit అవుతున్నది. ఇటు నుంచి అటు ప్రసారం అయిపోతున్నది. ఇలా ప్రశ్న లోపల పుట్టగానే దక్షిణామూర్తి ముఖమండలంలో నుంచి ఒక రేణువు, ఒక రేఖ వచ్చి సమాధానం ఇస్తున్నది. చిన్న సంశయా అంటాడు. సంశయాలన్నీ చిన్నవైపోతున్నాయి. అన్నీ సమసిపోగా ఏం మిగిలిందంటే సర్వానందమయమైన ఆ భావనా భూమిక నెలకొంది చెందింది అని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్తూ దానిలో కూడా మళ్ళీ ప్రపంచమూ, మనస్సు బీజప్రాయంగా ఎలా ఉన్నదీ, అది వటవృక్షం ఎలా అవుతున్నదీ, మళ్ళీ వటవృక్షం అయిన తర్వాత దాని మూలం ఏమిటో కనుక్కుంటే చిన్న బీజం అవుతున్నది. బీజమే భూజం అవుతున్నది. భూజమే బీజం అవుతున్నది. కాబట్టి విరాట్ మూర్తిగా కనిపిస్తున్న ఈ మహా సృష్టి అంతా కూడా ఒక వ్యక్తి ఒక చిన్న సంకల్పంలో నుంచి సృష్టి పు-పుట్టింది. నిజానికి సృష్టి అంతా ముగిసిపోయిన తర్వాత ఏం మిగులుతుందంటే ఒక సత్ మిగులుతుంది. eternal గా సర్వశాస్-- శాశ్వతమైన స్థితిలోని ఆ భావాన్ని దక్షిణామూర్తి స్తోత్రం దానికి సురేశ్వరాచార్యుల వారిని ఆయన శిష్యులు వ్యాఖ్యానం రాశారు. వ్యాఖ్యానం రాసి దానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే మానసోల్లాసం. మనసుకు ఉల్లాసం కలిగించుతుంది గనుక మానసోల్లాసం. ఆ మానసోల్లాసమే దక్షిణామూర్తి స్తోత్రం. ఈ ప్రపంచమంతా అశాశ్వతమూ, మిథ్యా ఇవి చెప్పలేదు ఆయన. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయా బహిరివోద్భుతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది మొదటి శ్లోకం. అంటే ఈ ప్రపంచం అంతా ఎలా ఉంది అంటే రాత్రిపూట మనం కలగన్నాం. ఓ కల వచ్చింది. ఆ కల్లో మనం పడుకున్న చోటికి ఒక ఏనుగు వచ్చింది. వస్తుందా? వస్తుంది కల్లో వచ్చింది. ఆ వచ్చి ఇట్లా ఒక చిన్న ప్యాక్ టేబుల్ పక్కనే ఉంది. దానిమీద అది కూర్చుంది. కూర్చుని మానవ భాషలో ఏదో చెప్పింది. నేను రాసుకున్నా. ఇది కల అయిపోయింది. పళ్ళును తెల్లవారింది. తెల్లవారేప్పటికి ఏనుగు లేదు, చెప్పిన విషయాలు లేవు, ప్యాక్ టేబులు లేదు, ఏమీ లేదు. అంటే ఈ ప్రపంచం కూడా ఉన్నది అని అనుకున్నంత కాలం అది ఉన్నది. కానీ నువ్వు వస్తు దృష్టితో చూస్తే ఉన్నది. ఆత్మ దృష్టితో చూస్తే ఏమీ లేదు. అనేటువంటి దాన్ని ఆయన వర్ణిస్తూ ఇదంతా కూడా ఇదే enlightenment ప్ర-ప్రబుద్ధమానమైనటువంటి స్థితికే మనం ప్రయత్నం చేయాలి. మోక్షము తర్వాత చూద్దాం. మోక్షానికి సత్యసాయిబాబా వారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మోహక్షయమే మోక్షం. మోక్షం అనేది మనం తెచ్చుకునేది కాదు కదా. అక్కడినుంచి రావాలి రావాలి ఇవ్వబడాలి అది ఆ ఇవ్వబడటానికి మనం prepare అయి ఉండాలి prepare అయి ఉండాలి నీకు రేపు పొద్దున్నుంచి నీకు భాగవతంలో ప్రమాణం ఉందమ్మా. ఆ ప్రమాణం ఏంటంటే, అట్లా అంటే ఎవడు భాగవతం చదవాడు అసలు. ఎవరినైతే నేను నా సద్భక్తుడిగా, నా నిజమైన భక్తుడిగా నేను అంగీకరిస్తాను, నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే శిరిని తప్పిస్తా. శిరిని తప్పిస్తే తప్ప హరి మిగలడు. హరిని గనక పట్టుకున్నట్లయితే హరి శిరి కలిసి ఉంటారు. ముందు test pass అవ్వాలి. అవ్వాలి. ముందు హరి ఉన్నాడనుకోవాలి. ఆయన్ని నమ్మాలి. హరి వెంబడే శిరి ఉంటుంది. శిరి వెంబడి హరి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది అద్భుతమైన వ్యాఖ్యానం. కాబట్టి ఇట్లా శాస్త్రాధ్యయనంలో కూడా అనేక కోణాలు ఉంటాయి. పైకి కనిపించే కేవల శబ్దార్థం, శ్లోకం, దానికి అర్థం, తాత్పర్యం కాదు. దానికి అనేకమైన విశేషార్థాలు ఉన్నాయని మానసోల్లాసం అదే దక్షిణామూర్తి స్తోత్రం. అట్లానే మీరు భజగోవిందం కూడా రాశారు కదా ఆ రాశాను భజగోవిందంలో మీరు ఏవిధంగా ప్రభావితమయ్యారు, ఏవిధంగా రాశారంటారు? భజగోవిందం ఈ కల్పాంతం వరకు ఉండేటువంటి పుస్తకం అది. అదే, అందుకనే అడుగుతున్నా, ఏవిధంగా ప్రభావితం అయ్యారు ప్రభావితం అంటే జీవితంలో మనం అనుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి నన్ను వదిలేసేయ్, నాకేదో అదృష్టవశాత్తూ యోగం మీకు యోగం ఉంటే ఎన్నో గురువులు నాలుగవ ఏళ్ల నుంచి వచ్చేసేవారు వచ్చేసారు. నేను example గా మిగలను. మరి మిగతా వాళ్ళు ఏమంటారు? ఏవండీ సంసారం ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది. అరవై ఏళ్ళు రాగానే నేను ఇవన్నీ వదిలిపెడతా అంటాడు. అరవై ఏళ్ళ దాకా ఉంటామని నమ్మకం ఉందా? లేదు. సరే అరవై ఏళ్ళు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత అప్పుడు భాగవతం తీస్తే ఏం అర్థమవుతుంది? కాబట్టి అందుకనే ఆయన చెప్పేది ఆయన శంకరాచార్యుల వారి నలుగురు శిష్యులతో వెళుతూ ఉంటే చెట్టు కింద ఓ ముసలాయన వ్యాకరణం చదువుతున్నాడు. చదువుతుంటే పాపం ఈయనకి జాలి కలిగింది. యాభై ఏళ్ళు దాటిపోయినట్టున్నాయి. పండు వృద్ధు, ఈ అడురు కుంకరనై. ఏమిటీనా అని దగ్గరికి వెళ్లి పాపం యువకుడైనా ఎందుకు ఇప్పుడు నేర్చుకొని ఏం చేస్తారని ఏదో అడిగారు. అడిగితే వ్యాకరణం నేర్చుకుంటున్నా అని. ఇప్పుడు నేర్చుకొని ఏమిటి ప్రయోజనం అన్నారు. అని అయినా ఈ ప్రశ్నలన్నీ నన్నెందుకు అడుగుతున్నావు, నీ దారి నువ్వు వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆయన మోహముద్గర రాశారు. ద్వాదశ మంజరీక స్తోత్రం దాని పేరంటే పన్నెండు శ్లోకాలే. మిగతావన్నీ ఆయన శిష్యులు రాశారు. కాబట్టి అది జీవితం, బంధువులు, తర్వాత మనకుండేటువంటి గౌరవాలు, మనకుండేటువంటి సంపద, మనకుండే ప్రాపంచిక సంబంధాలు, ఇవన్నీ ఎంత అశాశ్వతమో, ఎంతగా రూపు మారిపోతూ ఉంటాయి. నిన్నటి ఉన్నట్లు ఉండదు. వీడు నా అచ్చమైన స్నేహితుడని మనం నమ్మి ఉంటాం. రేపు పొద్దున వాడు మనకి శత్రువు అవుతాడు.కాబట్టి ఈ అశాశ్వతమైన, అనిశ్చితమైనటువంటి ఈ ప్రపంచంలో పద్మపత్ర నివాంభస తామరాకు మీద నీటి బొట్టు వలే ఉండాలి అని బోధించేదే భజగోవిందం. తర్వాత ఈ ప్రశ్నలో ఒక అందమైన సమాధానం ఏంటంటే భజగోవిందం అంటే గోవిందుడిని స్మరించు అని చెప్తున్నారు కానీ అర్థం అది కాదు. శంకర భగవత్పాదులు ఆ మకుటం ఎవరి కోసం పెట్టారంటే తన గురువైనటువంటి గోవింద భగవత్పాదుల పేరు మీద రాశారు. భజ అంటే స్మరించు ఎవరిని? గురువుని స్మరించు. మళ్ళీ ఇక్కడ కూడా. గురుస్మరణ, గురు సన్నిధి శంకర భగవత్పాదుల సాక్షాత్తు శంభోర్ మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఆయన పరాశివ-శివావతారం అయినప్పటికీ గోవింద భగవత్పాదులు వారి గురువు కాబట్టి ఆ గురువుని స్మరిస్తూ భజగోవిందం చెప్పారు. ఆ పన్నెండు శ్లోకాలు. అది. గురువు గారు అమ్మ చాలా బాగా. అంటే మీకు యోగము కలిసింది మీ జీవితంలో అవును గురు సన్నిధి అద్భుతంగా కలిసింది. ఉమ్ మీ జీవితం ఒక వరప్రసా-వరప్రసాదం అనుకోవచ్చు. నిజం అందుకని అన్నీ చాలా బాగా విపులీకరించి చెప్పారు గురు సన్నిధి గురించి. ఇది ఈనాటి గురుసన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశ. శంకరాచార్యుల గురించి కొన్ని విషయాలు చెప్తారా? ఆ, శంకరాచార్యుల వారు, ఆయన మూడవ ఏట. అసలు శంకరాచార్యుల వారి ఆవిర్భావానికి కారణం వేళ మనం గట్టిగా చెప్పుకోవాలి. కలియుగం వచ్చిన తర్వాత కలియుగం పాప యుగంగా చెప్తారు అందరూ. కానీ ఇది కలిమి బలిమి కలిగినటువంటి యుగం ఇది. ఈ కాలంలో జరుగుతున్నంత భగవద్ దర్శన గాని, భగవన్నామస్మరణ గాని, భగవంతుని విశేషాల గురించి మాట్లాడుకోవటం గాని ఏ యుగంలోనూ జరగల. అది దాని ప్రశస్తి. అయితే శ్రీ మహావిష్ణువు ఇరవై రెండు అవతారాలు ఎత్తాలి. శివుడు పూర్ణావతారంగా రాడు. ఆ, బ్రహ్మ గారికి అసలు అవకాశము, అవతారము రేలే లేదు. మరి ఇరవై రెండులో ఇరవై ఒకటి అయిపోయినయి ద్వాపర యుగం వచ్చేప్పటికి. సనక సనందనాదిని మొదలుపెట్టి కృష్ణ పరమాత్మ దాకా. మరి ఈ కలియుగానికి ఎవరుండాలి? ఒక అవతార మూర్తి కావాలి కదా అంటే కోటి సూర్య మండల మధ్యస్థైన మహా త్రిపురసుందరి దేవి "ఆ బాధ్యత నేను తీసుకుంటాన"ంది. అమ్మా ఒక్క కోటి సూర్య మండలంలో నుంచే లక్షా ఇరవై వేల మైళ్ళ దూరంలో ఉన్న ఆ కిరణం నేల మీద పడితే మేము అల్లాడిపోతున్నాం. నువ్వు ఎలా వస్తావ్ అంటే "ఇలా వస్తాన, లలితా రూపంలో వస్తాన"న్నది. అందువల్లనే శ్రీ లలితా కలియుగానికి అధిష్టాన పరదైవతం. [సంగీతం] గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా
YouTube · audio
Gurusannidhi | Smt Y Swarna Latha Reddy | EP10
Gurusannidhi | Smt Y Swarna Latha Reddy | EP10
Source: SVBC TTD on YouTube
0:00 / 53:51
More in this series