No transcript for this section.
Transcript begins at 0:00.
[背後音樂] వందేమాతరం! భారతదేశం రెండు వందల సంవత్సరాల బానిసత్వంలో నుంచి తనకు తగిన దాస్య శృంఖలాలను తెంచుకొని స్వాతంత్ర్యాన్ని సిద్ధించుకొని ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు. నిజంగా అది ఒక మనిషి జీవితకాలం. స్వాతంత్ర సంగ్రామ రంగంలో భారతదేశమంతా ముక్తకంఠంతో ఏకనినాదంతో "స్వరాజ్యం మా జన్మహక్కు" అని ప్రకటించిన బాలగంగాధర్ తిలక్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్. వాళ్ళ ముగ్గురినీ "బాల్, పాల్, లాల్" అని తయం అంటే స్వాతంత్రం సిద్ధించి తీరాలి "It's my birthright" అన్నాడు తిలక్. వీళ్ళ తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి ఈ ఉద్యమాన్ని అందుకొని ఏకతాటిపై నడిపించినటువంటి వాడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. మనం మహాత్మా గాంధీగా, జాతిపితగా మనం ఆయన్ని గౌరవించుకున్నాం. ఇది భారతదేశం చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఏమిటి అది అంటే చదువుకున్నవాడు, చదువంటూ తెలియని వాడు, చదువే అర్హతగా ఉన్నవాడు అట్లాగే సమాజంలో ఉన్నటువంటి అన్ని పారిశ్రామవర్గం ఏకకంఠంతో, ఏకవాక్యంతో, ఏకనినాదంతో సత్యాగ్రహ స్ఫూర్తితో నడిపించినటువంటి భారత స్వాతంత్ర సంగ్రామం ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఇతిహాసం. అందుకనే ఈనాటికి ప్రపంచమంతా గాంధేయ వాదాన్ని ఆధారం చేసుకొని వెనకబడిన దేశాలు, బాగా పురోగమించినటువంటి దేశాలు ఇవన్నీ కూడా గాంధేయ స్ఫూర్తిని ఆధారం చేసుకొని తమ తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తూ వెళుతున్నారు ఇప్పటికీ కూడా. భారత స్వాతంత్ర సంగ్రామంలో తెలుగువారి పాత్ర చాలా ప్రత్యేకమైనటువంటిది. తెలుగువారు సంపాదించుకున్న ఖ్యాతి కూడా కాలగమనంలో చెరిగిపోయేది కాదు. ఎందుకంటే ఒక ప్రాదేశికమైనటువంటి ఒక స్ఫూర్తి. అందుకని సంఘ సంస్కర్తలు, సాహితీవేత్తలు, సాంస్కృతిక బృందాలు అలాగే వివిధ రంగాలలో ఉన్నటువంటి నిష్ణాతులు అంటే lawyerలు ఆనాడు. ఉపాధ్యాయులు, వైద్యులు, సామాజిక సంస్కర్తలు వీళ్ళందరూ కూడా ఒక సంఘటితమైన శక్తిగా ఏర్పడి భారత స్వాతంత్ర రణరంగంలో వీరులై, వీరులై, శూరులై, గంభీరులై నిలబడ్డారు. ఇందులో కేవలం పురుషులు మాత్రమే కాదు మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి అనేకమంది స్త్రీమూర్తులు తమ ధన మాన ప్రాణాలని, మానము అంటే తమ ఆత్మగౌరవాన్ని ఆధారం చేసుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి దేశం మన తెలుగునాడు లేదా తెలుగుదేశం. ఇందులో ఇవాళ మనం స్మరించుకోవలసినటువంటి కొందరు వ్యక్తులు ఎవరు అంటే చరిత్ర మనం చాలా విషయాలను వక్రీకరిస్తాం. చరిత్రలో ఉన్నటువంటి సత్యాలను దాచిపెడతాం. వారి వారికి ఇవ్వవలసినటువంటి సముచిత గౌరవాన్ని మనం ఇవ్వటానికి ప్రయత్నం కూడా చేయం. ఇది తెలుగు జాతిలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్య పార్శ్వం. ఏ జాతీయ జెండాగా ఈ దేశాన్ని డెబ్బై ఏడు సంవత్సరాలు అపురూపమైన భావనా స్థితిలో నడిపిస్తున్నదో ఆ జాతీయ జెండా రూపకర్త నిర్మాణకారకుడు తెలుగువాడు పింగళి వెంకయ్య. అది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు. దానిలో మూడు రంగులు. ఒకటి కాషాయం అది త్యాగానికి గుర్తు. మధ్యలో తెలుపు ఆధ్యాత్మికతకు గుర్తు. కింద ఆకుపచ్చ రంగు హరిత విప్లవానికి గుర్తు. అంతేకాదు, ఆ తర్వాత ఈ స్ఫూర్తిని అందుకొని కాషాయము అంటే త్యాగము అని మాత్రమే కాక ఒక అద్భుతమైన అంతరంగిక ధీశక్తికి గుర్తుగా అలాగే నిగ్రహింపబడిన మనసుకు గుర్తుగా తెల్ల రంగు. అలాగే క్షీర విప్లవానికి కూడా సంకేతంగా తెలుపు రంగు. దానితోపాటు ఆకుపచ్చ రంగు అంటే ప్రకృతిని పరమాత్మగా భావించే ఈ దేశం ఆధ్యాత్మికతను కూడా రండి రించుకొని మూడు రంగుల మువ్వన్నెల జెండా. మూడు రంగులన్నా మువ్వన్నెల అన్నా ఒకటే. మనం మూడు రంగుల మువ్వన్నెల అని ఎందుకంటాం అంటే అనడంలో దోషం లేదు. పునః పునః మా మూడు రంగులు ఇవి ఇంత గొప్పవి అని చెప్పడానికి. ఇక జెండా మధ్యలో ఉన్నటువంటి చక్రం చారిత్రాత్మకంగా చూసినట్లయితే కళింగ యుద్ధంతో, పశ్చాత్తాపంతో జీవిత పరమార్థాన్ని ఎరిగిన అశోకుడు ఒక ధర్మ చక్రాన్ని ఇరవై నాలుగు రేఖలతో అంటే spokes అంటాం.వాటితో ఇరవై నాలుగు విధాల ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలో, అదంతా ధర్మబద్ధమైనటువంటి పరిధిలో ఎలా ఇమిడి ఉండాలో, స్వధర్మము, పరధర్మము అనే దాని విచక్షణని గుర్తు చేసుకుంటూ చేసినటువంటి ధర్మ చక్రం మనకి కాలచక్రంగా మారింది. అంతే కాదు "ఏవం ప్రవర్తితం చక్రం" అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. "గేయం చక్ర రథం" అంటుంది లలితా సహస్ర నామం. అంటే ఈ చక్రము అంటే సుదర్శన చక్రము, నిదర్శన చక్రము, ఆంతరంగిక శక్తికి ప్రదర్శన చక్రము కాబట్టి భారతీయమైనటువంటి నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో, అంటే జాతీయ జెండా మనందరికీ కూడా ఒక ఆధారమైనటువంటి చలువ పందిరి. దాని కిందనే మనందరం కూడా సర్వోన్నతమైన స్థాయికి వెళ్ళటానికి ఆకలి ఎరగని, అవమానం తెలియని, అసమానతలు లేని ఒక స్వేచ్ఛా స్వర్గ సృష్టికి మూల కారణమైనటువంటి జాతీయ జెండా సృష్టికర్త మళ్ళీ పింగళి వెంకయ్య గారు. వారిని మరొకవేళ స్మరించాలి. అలాగే చరిత్ర దాచుకున్నటువంటి ఒక పరమాద్భుత సత్యం ఏంటంటే బంగ్లాదేశ్ లో మన జాతీయ గీతం "జనగణమన అధినాయక జయహే" అని రాసినటువంటి ఆ గీతాన్ని దానికి స్వరకల్పన ఎక్కడ జరిగింది అంటే బంగ్లాదేశం నుంచి వచ్చి మదనపల్లి దగ్గర ఉన్నటువంటి హార్స్లీ హిల్స్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా అక్కడ కూర్చొని దానికి స్వరకల్పన చేసుకున్నారు. అంటే తెలుగు నేల రెండు విధాల జాతీయ జెండాకి, జాతీయ గీతానికి పుట్టినిల్లు అయింది. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. అలాగే భారత రాజ్యాంగ రచనలో ఆ రచనా സംവിധానంలో దానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ తో పాటు అనేక మంది స్త్రీమూర్తులు సిగ్నేటరీస్ గా ఉన్నారు. మనం వాళ్ళని కూడా తలుచుకోవాలి. ఎందుకంటే అందులో సుచేతా కృపలాని తెలుగు ఆడబిడ్డ, తెలుగు బిడ్డ. నిజానికి సింహ సమానమైనటువంటి ధీశాలి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్. వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగ తొలి ప్రతి మీద సంతకం చేసి రాజ్యాంగాన్ని జాతికి ఇచ్చినటువంటి మహోదాత్తమైనటువంటి వీరులు వీళ్ళంతా. అలాగే తెలుగునాట ఒక దుగిరాల గోపాలకృష్ణయ్య, ఒక వావిలాల గోపాలకృష్ణయ్య, ఇవన్నీ కొన్ని పేర్లు. ప్రధానంగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సైమన్ కమిషన్ ని ధిక్కరణ చేసి, గాంధీ మహాత్ముడు ఆయనకు ఒక తంతి పంపారు. తంతి అంటే టెలిగ్రామ్. ఏమిటి అదంటే "సైమన్ కమిషన్ ధిక్కరణ ఆపేసేయండి, పర్వాలేదు. వాళ్ళే వెళ్ళిపోతారు. మీరు వెనక్కి వచ్చేయండి" అన్నారు. ప్రకాశం గారి ధీశక్తి ఎటువంటిదంటే సాక్షాత్తు దేవుడిగా కొలవబడుతున్నటువంటి ఏకవీరుడు అయినటువంటి గాంధీ గారికి బారిష్టర్ అయినటువంటి ప్రకాశం గారు ఒక రిప్లై టెలిగ్రామ్ పంపారు. "కమాండర్ ఇన్ చీఫ్ కి ఆజ్ఞ ఇవ్వటం వరకే హక్కు. వితండ్వాదం చేసే హక్కు లేదు. కనుక సైమన్ కమిషన్ ధిక్కరణ సాగుతుంది" అని వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి కాల్పులలో మరణించినప్పుడు శవాన్ని తన రెండు చేతుల మీద మోసుకుంటూ వెళ్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆయన గుండెకి తుపాకీ గుండుని గురిపెట్టి "కాలుస్తాం" అన్నారు. "మీకు ధైర్యం ఉంటే, మీ చేతులలో బలం ఉంటే, మీకు శక్తి గనక ఉన్నట్లయితే బ్రిటిష్ సామ్రాజ్యపు అహంకారమంతా తుపాకీ గుండులో ఉంటే నా గుండ-గుండెలోకి కాల్చం" అని అడిగారాయన. అంటే ప్రకాశం గారు అంటాం. ఊరికే ప్రకాశం అనం. ఆ 'గారు' అనేటువంటి పదం ఎట్లా వచ్చింది అంటే ఈ అద్భుతమైన వీరులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ మాతృమూర్తులు స్ఫూర్తి అయినారు. నిన్ను ఒక లాయరుగా చూడాలి అనుకుంటున్నారు అన్నటువంటి ప్రకాశం గారి తల్లి ఒంగోలు జిల్లా కోర్టు దగ్గర పుల్లట్లు వేస్తూ, రోజూ లాయర్లు వెళ్తూ, వాళ్ళు పొందే గౌరవాలను చూస్తూ కొడుకును పిలిచి "నువ్వు కూడా ఒకరోజున న్యాయవాదివి కావాలి" అని కోరుకున్నరాయు. తన పట్టుచీర తాకట్టు పెట్టి ఆయనకు విద్య చదువుకోమని చెప్పింది. ఆయన కేవలం న్యాయవాది కాదు బారిష్టర్ అయినారాయన. లండన్ వెళ్లారు. భారత రాజ్యాంగం మీద క్రిమినల్, సివిల్ కేసుల మీద ఒక అద్భుతమైనటువంటి చాతుర్యాన్ని సంపాదించి మద్రాస్ నగరంలో నెంబర్ వన్ ప్రాక్టీషినర్ గా నిలకడ చెందారు. కానీ భారత స్వాతంత్ర సంగ్రామంలో వచ్చిన పిలుపుని అందుకొని అప్పటివరకూ తాను కూడగట్టినటువంటి అన్ని ఆస్తుల్ని కూడా ఈ స్వా-స్వాతంత్ర సిద్ధి కోసం పరిత్యాగం చేశారు. ఎక్కడి నుంచి? తమిళనాడులో ఉన్న ఊటీ దగ్గర ఉన్నటువంటి బంగ్లా దగ్గర నుంచి కాశీలో కట్టించినటువంటి సత్రం వరకు మొత్తం ఆయన ఆస్తులన్నీ కూడా ఈ దేశానికి ఇచ్చారు. తలుచుకుంటున్నామా? లేదు. ఎందుకనంటే మనకి నాయకులు అంటే ప్రసంగాలు చేసేవారు నాయకులు, ప్రవచనం చేసేవాళ్ళు జ్ఞానిగా మారిపోయిన దురదృష్టకర సన్నివేశాలు ఇవి. ఇందులో మన చరిత్రని మనం అధ్యయనం చేయాలి. ఎందరెందరో వాళ్ళ జీవితాలని, కుటుంబాలని పణం పెట్టారో, ఎందరో విద్యార్థులు తమ విద్యా అవకాశాలను కోల్పోయారో, ఎవరు అత్యధికమైనటువంటి విద్యా సంపద సృష్టించుకొని తద్వారా ఈ జాతికి ఎలా సేవ చేశారో కవులు గళమెత్తికలం ద్వారా ప్రభావితం చేశారు మనం తలుచుకోవాలి. ఇది ఆంధ్రులు సాధించుకున్నటువంటి ఒక అపూర్వ జాగసిద్ధి. ఇక ఆంధ్రదేశంలో... ఒకానొక స్థితిలో భాషా ప్రయుక్త రాష్ట్రం ఉండాలి, తెలుగు భాషతో కూడినటువంటి ఒక రాష్ట్రం ఏర్పడాలి అనుకున్నప్పుడు, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు చోటే లేదని పెద్దలు ఒక ప్రతిఘటన సూచించినప్పుడు... ఆమరణ నిరాహార దీక్షను చేసి అంటే మరణాంతం వరకు కూడా తన జీవితాన్ని తన ప్రాణాన్ని పణం పెట్టి ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కలిగించినటువంటి ఒక మహాపురుషుడు పొట్టి శ్రీరాములు గారు. తద్వారా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం ప్రాదేశికంగా, భౌగోళికంగా సర్వ సమున్నతమైనటువంటి రాష్ట్రమైంది. ఎందుకంటే "పూర్వాంభోనిధి కాళహస్తినగరి శ్రీమన్ మహేంద్రాచల శ్రీశైల ప్రముఖ త్రిలింగ శిఖరి ప్రాతః నవ ఓషస్విని కృష్ణా కంకణ కింకిణి ఝణఝణత్ గోదావరి కాంచికా ద్రాక్షాపేసల వాగ్మైయి విజయుతాం త్రిలింగ భూధిస్థలి" అంటే భౌగోళికమైనటువంటి ఒక స్వరూపాన్ని మూడు శైవ క్షేత్రాల నుంచి నిరంతరము వినపడేటువంటి అనాహత ఓంకార నాదం ఒకవైపు, కృష్ణా, గోదావరి, పెన్నా వంటి జీవనదులు, ఇవన్నీ కూడా పరిపుష్టం చేస్తున్నటువంటి సస్యశ్యామలమైనటువంటి సుజలాం సుఫలాం అనిపించినటువంటి ఒక ప్రామాణికమైనటువంటి ప్రదేశమే భారతదేశంలో పరమాద్భుతమైన అంతర్భాగమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం. ఈనాడు వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే కోటానుకోట్ల రూపాయలు దాని వెనుక ఖర్చు పెట్టాలి. చాలా సమయాన్ని వెచ్చించాలి. కానీ ఒకానొక సమయంలో ఒక ఇంజెక్షన్ ఉన్నట్లయితే మనిషి ప్రాణం అన్ని విధాలా రక్షింపబడుతుంది అని పెన్సిలిన్ కనిపెట్టినటువంటి వాడు ఎలా ఫ్రేడ్ సుబ్బారావు. గుర్తుంచుకున్నామా? లేదు. ఈవేళ ఫార్మసీ రంగంలో మందులు అమ్మేవాడు శాస్త్రవేత్త అయిపోతున్నాడు, కనిపెట్టిన వాడు ఎక్కడో ఉంటున్నాడు. వాళ్ళు భారతరత్నలు కోరుకోరు కానీ వాళ్ళు భారత జాతి రత్నాలుగా నేను భావన చేస్తున్నాను. అట్లాగే వేదవేదాంత డిండిమ పండితులంతా కూడా తమ కవితా గానంతో, తపస్సుతో, ధ్యానంతో, తతీక్షతో, ధైర్యంతో, శౌర్యంతో, వీర గంభీర స్థాయిల్లో భారత సంగ్రామంలో ముందుకు దూకారు. మా తర్వాత మా పిల్లలు ఏమైపోతారు, మా కుటుంబాలు ఏమవుతాయి అన్న ప్రశ్న లేదు. వారు చేసిన త్యాగాలను మనం ఇవాళ గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు వేసినటువంటి పాట పరమాద్భుతమైనటువంటి పాట. ఎందుకంటే ఈ దేశం వేవేల సంవత్సరాలుగా సంతరించుకున్నటువంటి ఒక మేధాశక్తి లో నుంచి ఇటు వైజ్ఞానిక, భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, పౌరాణిక, వేదాంతిక, వేదవేదాంత రచితమైనటువంటి మహా వాఙ్మయ సృష్టికి పురిటినిలువుగా ఈ దేశం ఉన్నప్పుడు, ఇక్కడ ప్రతి వ్యక్తి ఒక మేధాశక్తితో పుడతాడు. కానీ పాశ్చాత్య నాగరికతా వ్యామోహంలో తనలో ఉన్నటువంటి సంస్కార ధీశక్తిని తానే కోల్పోయి ఇప్పటికీ భావలాస్యం చేస్తున్నటువంటి ఈ జాతి మేల్కొలవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది అవసరం. అయితే ఈ దేశం డెభై ఐదు సంవత్సరాలలో ఏమీ చేయలేదు అనేవారికి ఒక్క సమాధానం. ఈ మాట అంటున్నవాడు డెభై ఏళ్లుగా ఈ గాలే పీల్చాడు, ఈ నీళ్లే తాగాడు, ఇక్కడే తాను పెరిగాడు, ఇక్కడే తాను పదవిని అందుకుంటున్నాడు. తాను ఎవరూ ఏమీ చేయలేదు అన్నటువంటి ఆ భావం మంచిది కాదు. ఎందుకంటే మన పూర్వీకులు మహాత్ములు వాళ్ళు ఏ రకమైన కాపీరైట్ లేకుండా, ఏ రకమైన అపేక్ష లేకుండా, దీని వల్ల నాకేమిటి లాభం అన్న భావన లేకుండా పరిత్యాగం చేశారు. ఆ పరిత్యాగాలను మనం అవహేళన చేయకూడదు. అది ఇవాళ తరానికి ఒక సంకేతం, వ్యతిరిక్త సంకేతం పంపిస్తుంది. అంటే డెభై ఏళ్లలో ఏమీ జరగలేదు అనే భావన కలుగుతుంది. మనం గుర్తు పెట్టుకోవాలి. అంతరిక్షంలోకి మనం ఏనాడో వెళ్లిపోయాం. ఏనాడు అంటే 428 AD లో వరాహమిహిరుడు. ఆ తర్వాత మన భారత స్వాతంత్ర సిద్ధి తర్వాత ఏర్పడినటువంటివి అనేకం ఉన్నాయి. వైజ్ఞానిక రంగంలో, ఫార్మసీ రంగంలో, సాహిత్యరంగంలో ఎక్కడికక్కడ మన తప్పులు మనం సరిచేసుకుంటూ, ప్రధానంగా ఇవాళ మాట్లాడాలంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే కోటానుకోట్లు అభివృద్ధి దాని వెనుక ఉన్నది. కానీ ఆనాడు నాగార్జునసాగర్ మాసనరీ వర్క్ తో మట్టితో కట్టబడింది నాగార్జునసాగర్. దానికి ప్రాదేశికమైన బౌద్ధ నాగార్జునులు ఎవరున్నారో అంటే నాగార్జునాచార్యులు అనబడేటువంటి ఆయన పేరు మీద అది పెట్టారు. ఇంకొక ప్రాజెక్టు కట్టినప్పుడు ఆనాటి రాజకీయ నాయకులు ఎవ్వరూ తమ పేరు పెట్టుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు. అది ఈ దేశం విచ్ఛిన్నమైపోతుందని, ఈ దేశం దురదృష్టవశాత్తు విడిపోతూనే ఉంటుందని వాళ్ళు భావించలేదు. ఈ దేశాన్ని ఒక సమగ్రమైనటువంటి మహా సుదర్శన చక్రంగా భావించి ఎక్కడ అణువైన ప్రదేశం ఉన్నదో, ఎక్కడ ఈ నీరు సముద్ర గర్భంలోకి వెళ్ళకుండా నిరోధించవచ్చునో, తద్వారా సాగునీరు, తాగునీరు, విద్యుత్తు ఎట్లా మనంతట మనం స్వావలంబన అంటాం, అంటే సెల్ఫ్ రిలయన్స్.దానికి దారి చూపిస్తూ అనేకమైనటువంటి projectలు. దానిలో అవినీతి జరిగింది అన్న మాట ఇంతవరకు మనం వినలేదు. ఇప్పుడా నీతిగా ఉన్నది అన్నమాట మనం వినటం లేదు. ఇది గర్వించదగిన విషయం కాదు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఆనాటి నుంచి డెభై ఐదు ఏళ్లలో మన విద్యా విధానంలో వచ్చిన అనేక మార్పుల వల్ల కొన్ని ఆ కొంత మేధాశక్తి పెరిగింది. అంటే intellectual quotient పెరిగింది. British వాళ్ళు ఇచ్చినటువంటి Indian Civil Service ICS ని వదిలిపెట్టి scrap చేసి IAS ని IPS ని IRS ని IFS ని నూట ముప్పై ఏడు కోట్ల మంది ప్రజలలో అతి కొద్దిమంది మాత్రమే అక్కడి దాకా చేరుకోగలిగిన స్థాయికి మన విద్యా విధానాన్ని, ఉద్యోగ కల్పనా విధానాన్ని, పాలనా విధానాన్ని చాలా స్పర్శం చేసుకున్నాం. ఇవాళ మన కళ్ళముందు జరుగుతున్న అనేక అంశాలు చూస్తున్నప్పుడు ఈ జాతి ఒక గుడి ధ్వజస్తంభం కూలిపోతే మనకు ఎంత యాతన కలుగుతుందో, వెన్నుముఖంగా ఉండవలసినటువంటి services అన్నీ bend అయి end అయిపోతున్నటువంటి ఈ కాలంలో మళ్ళీ ఆ పురా వైభవాన్ని, పురా స్ఫూర్తిని మనం పెంపొందించుకోవాలి. వీటన్నింటి మధ్య కేవలం నాయకులు, త్యాగమూర్తులు, విప్లవకారులు మాత్రమే కాదు ఒక కాంచి మహాస్వామి, ఒక రమణ మహర్షి, ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఒక అరవిందుల వారు, ఒక భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. వీళ్ళందరూ కూడా ఈ జాతిని నిత్యము ప్రభావితం చేస్తూ తమ ప్రబోధం ద్వారా జాతిని ఎప్పటికప్పుడు తమను తాము పునర్నిర్మాణం చేసుకునే దిశగా నడిపించారు. నడిపిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపన్యాసాల్లో దైవభక్తి కంటే దేశభక్తి మిన్నగా కనిపిస్తుంది. ఈ దేశమే లేకపోతే నీవు లేవు. అలాగే నీవు కూడా సమర్థవంతమైన వ్యక్తిగా రూపాంతరీకరణం జరగకపోతే ఈ జాతికి భవిష్యత్తు లేదు. జాతి నిర్మాణమంతా జనబలంలో నుంచి, అంగబలంలో నుంచి, సంపాదనలో నుంచి, ఐశ్వర్యసిద్ధిలో నుంచి ఏర్పడతాయని జరిగిపోయిన చరిత్రను మనకి అన్నివేళలా గుర్తు చేస్తూ మనలో ఎక్కడైనా అలసత్వము, నెమ్మదితనము ఏర్పడి ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా ఒక వేగంతో పెరిగెత్తించే దిశగా సత్య సాయి భగవానుడి దివ్యోపన్యాసాలు సాగినాయి. ఆయన కేవలం మోక్షాన్ని గురించి, మరణానంతర సుఖాన్ని గురించి చెప్పలా. నిత్యమైనటువంటి మానవ జీవితం ఒక దివ్య విధానం మీద ఆధారపడి ఎలా జరగాలో, National Character అంటే జాతీయమైనటువంటి ఒక శీల సంపద ఎలా వృద్ధి చేసుకోవాలో, మనో, బుద్ధి, చిత్త అహంకారాలు అన్నింటినీ కూడా ఎక్కడికి అక్కడ redefine చేసుకోవాలో, refine చేసుకోవాలో, ఇవన్నీ కూడా నేర్పుతూ ఇటువంటి మహాత్ములు, అవతారమూర్తులు అందరూ కూడా ఈ జాతిని ప్రభావితం చేస్తూ ప్రబోధం చేస్తూనే ఉన్నారు. మనం అందిపుచ్చుకోవాలి. ఏ ఉదాహరణకి స్వామిని దేవుడు చేయటం చాలా తేలిక. దేవుడే మానవుడై వచ్చి ఎన్ని పనులు చేశారో గమనించుకున్నట్లయితే ఎక్కడ పోల్చుకోవాలి అంటే వారు చేసిన పనులతో మనల్ని మనం పోల్చుకొని మనమేం చేశామ్, చేశాము ఈ దేశానికి అని గనక గమనించుకున్నట్లయితే మనం చేయవలసింది చాలా ఉన్నది. చేసి ఉంటాం. శంకరంబాడి సుందరాచారి తిరుపతి నుంచి ఎలుగెత్తి ఆ రాష్ట్రీయ గీతాన్ని మనకు వరదానం చేశారు. కాబట్టి నైసర్గికం అంటే కేవలం నదులు అంటే నీళ్లు కాదని, కొండలంటే రాళ్ల గుప్పలు కాదని, చెట్లు అంటే కేవలం నీడ ఇచ్చేవి మాత్రమే కాదని, అవన్నీ కూడా పరమాత్మ యొక్క చైతన్యానికి మూర్తులని, ప్రతిబింబాలని, ప్రతిరూపాలని భావించి ప్రకృతితో సహజీవనం చేయవలసినటువంటి మనం ఇవాళ మళ్ళీ ఒక్కసారి ఆ మూడు రంగులని విచారణ చేసినట్లయితే కాషాయము, త్యాగము దానికి గుర్తు అని మనం అనుకున్నప్పుడు మనం ఏం త్యాగం చేయాలి? ఈ దేశం కోసం కాలదానం చేయాలి. ఇరవై నాలుగు గంటల్లో ఈ దేశ పరిస్థితులని, ఈ సంఘంలో జరుగుతున్న అనేకా అనేకమైన అవసరాలని, అనాచారాలని అన్నింటినీ కూడా గుర్తించి మన వంతు పాత్రని సంఘ పునర్నిర్మాణంలో సంఘటిత పరచాలి ఒకటి. ఇక తెల్లదనం అంటే స్వచ్ఛమే, శుభ్రతే. పరిసరాల శుభ్రత clean environment. అలాగే ఒక్క చెట్టుని కూడా కొట్టకుండా చెట్లను కాపాడుకుంటూ తద్వారా మనకు లభించేటువంటి oxygen మనకి సహజమైనటువంటి ప్రాణశక్తిగా స్వీకరించేట్లుగా హరిత విప్లవానికి పెద్దపీట వెయ్యాలి. అలాగే స్వయం సమృద్ధమైనటువంటి, అనేకమైనటువంటి పంటలు, సస్యశ్యామలమైనటువంటి పంటలు. ఈ దేశానికి కావలసినటువంటి ఆహార సృష్టికి నేలతల్లికి మనం నమస్కరిస్తూ పంటలు పండించాలి. అది హరిత విప్లవం. శ్వేత విప్లవం. కాషాయంలో ఉన్నటువంటి విప్లవం అంటే విధ్వంసం కాదు. విప్లవము అంటే మార్పు. ఆ మార్పు నిరంతరము చైతన్యశీలమైనటువంటి మార్పుగా ఉన్నట్లయితే ఈ డెభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ప్రతి వ్యక్తి ప్రధానంగా భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఒక వంతు అయితే ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో చదువుకొని, ఈ దేశ సంస్కృతిని తన రక్తంలో నింపుకొని అనేక దేశాల్లో ఉన్నటువంటి ఇవాళ మనం అంటాం Non Resident Indian. అదేమన్నా గౌరవప్రదమైన మాటేనా మనకి?ప్రవాసమైనటువంటి భారతీయుడు ప్రవాస భారతీయుడు అంటే ఏ దేశంలో ఉన్న ప్ర అంటే దగ్గరగా వాస నివసించే భారతీయుడు. దేనికి దగ్గరగా భారతీయ ఆత్మకు భారతీయ శక్తికి భారతీయ భావనకు భారతీయమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యానికి వాళ్ళు ఆ రకంగా ప్రవాస భారతీయులే తప్ప Non Resident Indian It's not a good title It's an insult. Let us call ప్రవాస భారతీయులు. అంటే ఎక్కడ ఉన్నా వాళ్ళు August పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని ఎక్కడా చోటు లేకపోతే తమ ఇంట్లో తామే ఒక చిన్న జెండా గనక ఎగరవేయగలిగితే తర్వాత తమ కడుపున పుట్టినటువంటి బిడ్డలకి ఒక స్ఫూర్తిని విరదానం చేయగలుగుతాడు. అలాగే చాలా కాలం చాలా ఏళ్ళు చేనేతతో చేసినటువంటి ఖాదీ జెండాలు మాత్రమే మనం వాడేవాళ్ళం. తర్వాత అది Silk అయిపోయింది. డబ్బు వచ్చింది గనుక. Silk అయిపోయిన తర్వాత దానికి అనేక Frills కుట్టడం మొదలు పెట్టాం. దాని ద్వారా Center లో ఉన్నటువంటి ధర్మచక్రం కుచించుకు పోయింది. ఇక మూడవది ఇవాళ చాలా Easy గా చేయగలిగినటువంటి Plastic మీద Digital print. అది గాలికి ఊగదు పైకి సాగదు ఏమి లేదు. కాబట్టి చేనేత అనబడేటువంటి భారతీయ కళ తద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క జెండా ఆ జెండా ఒకసారి వాడేసి చుట్టచుట్టి Locker లో పెట్టి మళ్ళీ వాడేది కాదు. ఆ సాయంకాలం సూర్యాస్తమయంలోగా అవనతం చేయాలి, దింపాలి. అది మన Duty లేకపోతే It is a crime punishable crime. కాబట్టి దాన్ని మళ్ళీ చుట్టచుట్టి ఇది పంతొమ్మిది వందలది, ఇది రెండు వేల సంవత్సరం ది ఆ జెండాలన్నీ ఒక చోట చూస్తున్నప్పుడు మన వయస్సుతో దాంతో పోల్చుకున్నప్పుడు జెండా మారలేదు. నాలో ఉన్నటువంటి భావనా స్థితులు కూడా మారలేదు. నేను కూడా ఒక అఖండమైన చిద్గణ స్వరూపిణి అనే భావన కలగటం కా మాత్రమే కాక మనం పిల్లవాడిని వెంబడి పెట్టుకెళ్ళి ఆ Shop కి వెళ్ళి ఒక జెండా మన శక్తికి తగిన ఒక జెండా కొనుక్కొచ్చి మన ఇంటి మీద మనం ఎగరవేయగలిగితే అది ఒక స్ఫూర్తి, అది ఒక గౌరవం. వీటన్నింటినీ కూడా బహుముఖీనమైనటువంటి స్థాయిలో మనం సాధించుకోవాలి. అలాగే మనకి స్వాతంత్ర సంగ్రామంలో రాయబడినటువంటి కొన్ని దేశభక్తి గీతాలు ఉన్నాయి. అవి కూడా మనం భజనగా చేయాలి. August పదిహేనున స్వామి భజనలలో అనేకమైనటువంటి భజన్స్ ఉన్నాయి. వాటిలలో కనీసం ఒక రెండు భజనలు ఏవీ దొరకకపోతే వందేమాతరం గీతంతో ప్రారంభించి జనగణమన అధినాయక జయహే అనేటువంటి జాతీయ గీతంతో మన భజన సాంప్రదాయాన్ని భజన కార్యక్రమాన్ని ఆరోజు ముగించుకున్నట్లయితే స్వామి ఆశించినటువంటి దేశభక్తి, ఒక శీల సంపద, వినయం ఎవరికైనా తలవంచుతామో లేదో గానీ ఈ జాతీయ జెండా ఎంత ఎత్తంటే దానికి ఎవరైనా తలదించి తలవంచుకొని వినమ్రంగా నుంచవ్వాలి. తల పైకెత్తి ఒక ఆత్మగౌరవ పతాకగా దానికి నమస్కరించాలి. వీటన్నింటినీ కూడా మన బిడ్డలకి చక్కగా చెప్పాలి, చేయించాలి, నేర్పాలి, నేర్పించాలి. వాళ్ళ జీవితం కూడా దేశభక్త పరిపూతం కావాలి అని నేను మనసా, వచసా, శిరసా ఆకాంక్షిస్తూ ఈ దేశం ఎంతో పురోగమించిందని, పురోగమిస్తూనే ఉంటుందని, దీనికి అంతు లేదని ఎందుకంటే కేవలం డెబ్భై ఏడు సంవత్సరాలు మాత్రమే మనం స్వాతంత్య్రం సంపాదించుకొని. కానీ ఇప్పటికి అన్ని రంగాలని మళ్ళీ పునః సమీక్ష చేసుకొని మనకు మన లోపల ఉన్న లోపాలు మనం ఇంకా సాధించుకోవటానికి ఆ రాణి అవకాశాలు అన్నింటినీ కూడా ఒకసారి Review చేసుకొని అంటే పునర్ విమర్శ చేసుకొని ముందుకే అడుగు సాగాలని ఆ ప్రతి అడుగులోనూ ఒక జాతీయత, ఒక భద్రత, ఒక సౌమ్యత, ఒక వినయ సంపద, ఒక సమర్పణ, ఒక శరణాగతి, ఒక వినయము అన్నీ కలిపి దేశభక్తిగా నెలకొని చెందాలని భావన చేస్తూ మీ అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళాశాసనం చేస్తూ Jai Hind. [outtro music]
YouTube · audio
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ!
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ!
Source: SATHYA PEETHAM on YouTube
0:00 / 30:28