No transcript for this section.
Transcript begins at 1:33.
నమస్కారం! మనతో పాటు వి.ఎస్.ఆర్. మూర్తి గారు ఉన్నారు. వారు Spiritual Scientistగా ఎన్నేళ్ల నుంచి చాలా మందికి తెలిసిన వ్యక్తి. ఇంజనీరింగ్ చదువుకున్నారు. Spirituality, Literature వీటన్నింటినీ కూడా ఎప్పటినుంచో అధ్యయనం చేశారు. అంతమందికి బోధిస్తున్నారు. అనేక సంస్థలను నిర్మించారు. అనేకమంది వ్యక్తులని వికాసం వైపు నడిపించారు. శ్రీ లలితా మూడమ్మ, పుట్టపర్తి సత్యసాయిబాబా, సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు, అబ్దుల్ కలాం ఇలా అనేక మందితో వారికి వ్యక్తిగతమైన ఆత్మీయమైన అనుబంధం ఉంది. వారి నుంచి ప్రేరణ పొందారు. వారి నుంచి నేర్చుకున్న అంశాల ద్వారా ప్రపంచానికి, సమాజానికి కూడా ప్రేరణ ఇస్తున్నారు. ఒక మనిషి, ఒక సమాజం, ఒక దేశం విజయవంతంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, శాంతియుతంగా ఉండాలన్నా ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇలా అనేక అంశాలు వారి దగ్గర మనం తెలుసుకోవచ్చు. ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము అలా Businessలో Success, Failure అలా వ్యక్తిగత జీవితంలో Leaderగా ఎదగాలంటే ఎలా ఏం చేయాలి? ఇలా Personality Developmentకి మళ్ళా ఒక సమాజ నిర్మాణానికి, దేశం యొక్క అభివృద్ధికి Multipleగా వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. అందులో భాగంగా ముందు మనం వ్యక్తితో మొదలు పెడదాం. ప్రతి మనిషి-- కొంతమంది వ్యక్తులైతే ఒక సమాజము, కొన్ని సమాజాలైతే ఒక రాష్ట్రము, కొన్ని రాష్ట్రాలైతే ఒక దేశము. ఇదంతా కలిపితే ఒక మానవాళి, ప్రపంచం అవుతుంది కాబట్టి వ్యక్తి నుంచి మొదలు పెడదాము. వారి నుండి, వారి ద్వారా తెలుసుకుని మన వారి ద్వారా గుణపాఠాలు, పాఠాలు నేర్చుకుని గొప్ప వ్యక్తులుగా తయారై గొప్ప దేశాన్ని, గొప్ప-గొప్ప ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నంలో వారి జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం, తీసుకుందాం, పంచుకుందాం. నమస్కారం మూర్తి గారు. నమస్కారం అండి. ప్రతి మనిషి కూడా ఈ మధ్య బాగా వినపడే మాట, ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు కాదు. నేను చాలా Disappointmentలో ఉన్నానని, ఒత్తిడిలో ఉన్నానని, Lowలో ఉంటున్నానని ఈ మాటలు ఎక్కువ వినపడుతున్నాయి. తర్వాత Psychologist యొక్క పాత్ర కూడా పెరిగింది. సంఖ్య పెరుగుతోంది. కానీ Consultancies పెరుగుతున్నాయి. Motivation ఒక మనిషి ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? దీన్ని చాలా లోతుగా గనక విచారణ చేస్తే, ఈ Lowగా ఉండటం, Disappoint అవటం, Frustrate అవటం, Distressed అవటం ఈ పదాలన్నీ కూడా భారతదేశానికి పెద్ద పరిచయమైన పదాలు ఒకప్పుడు కావు. ఇప్పుడు బాగా పరిచయమైన పదాలు. Modernize కావాలే గాని Westernize కాకూడదనేది ఒక సిద్ధాంతం. Westernize అయినప్పుడు మన ఆశలు ఎక్కువగా పెరుగుతాయి. మనకున్నటువంటి శక్తి ఏమో ఉన్నదేమో బాతు రెక్కలు, అందుకోవాలనుకుంటున్నది ఆకాశం. గగనగగనాంతరాలు దాటాలి అనుకున్నప్పుడు ఆశ ఉండాల్సిందే. ఆశతో పాటు ఆశయాలు ఉండాలి, ఆదర్శాలు ఉండాలి, ఆచరణ ఉండాలి. ఆచరణలో నుంచి కొంత అనుభవం కావాలి. అనుభవంలో నుంచి అనుభూతి పుట్టాలి. అనుభూతిలో నుంచి కడగా విభూతి స్థాయికి వెళ్ళాలి. ఇది ఒక క్రమ పరిణామమైనటువంటి ఒక భారతీయ సిద్ధాంతం. ఇది లేనప్పుడు ఏమవుతుంది అంటే తనలో తన శక్తిని మించి తనను ఊహించుకోవటం ఒక కారణం అయితే, అవతల వాడికి అవకాశాలు వస్తున్నాయి మనకు రావట్లేదనేటువంటి ఒక న్యూనత, ఆత్మన్యూనతాభావం. ఇవాళ నిజంగా యువతే కాదు ప్రతి మనిషిని కూడా తన గుప్పిట్లో పెట్టుకుంది. ఏం చేయాలి అంటే, 'అంతయున్ ఈశ్వర ప్రీతికే' అని ఒక మాట ఉంది కదా! ఏది చేసినా ఈశ్వర ప్రీతికే, ఏ దుఃఖం కలిగినా అది ఈశ్వర ప్రీతికే, సుఖము, ఆనందము, సంతోషం కలిగినా అదే అని గనక అనుకున్నట్లయితే దాన్నే మనం Doership లేదు అనుకుంటాం. అయితే Doership లేకుండా పని ఎలా చేస్తాం? అంటే పని చేసేంత సేపు Doership చేసుకో, పని అయిపోయిన తర్వాత Doership నుంచి వైదొలుగు. ఆ-ఆ ఆవరణ నుంచి బయటకు గనక వచ్చేస్తే మనం చేయగలిగింది చేశాం, మనం ఏం చేయాలో చేశాం, ఎంతవరకు చేయాలో చేశాం. అది 'కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన' భగవద్గీతలోనే చెప్పబడింది కదా! దీంతో పాటు భగవాన్ రమణ మహర్షి కూడా చెప్పారు. 'కర్తృరజ్ఞయా ప్రాప్యతే ఫలం'. ఇది మనిషి మామూలుగా కొద్దిగా Rationalగా ఆలోచించేవాడు, 'అవునండి అన్నీ ఆయనే చేస్తున్నప్పుడు మనదేం లేదా?' అని కాదు. మనం అంతా చేస్తే ఆ ఆయనో, ఆవిడో, ఆమెో, అదో, అదో, ఏదో దానికి నిర్వచనం లేదు. ఆ అనుభూతి పొందిన వాడు అసలు మాట్లాడటంలే. అనుభూతి అనేటువంటిది ఒకటి ఉందని, దాన్ని పొందాలని, దీనికి మార్గం ఉందని తెలియని వాడు భౌతిక పదార్థము, భౌతిక విజ్ఞానము, భౌతికమైనటువంటి స్థాయిలో అంటే Only at Materialistic Levelలో గనక మనం మనస్సుని Apply చేస్తే ఇగో ఈ పరిణామాలన్నీ ఏర్పడతాయి. ఇవి ఏర్పడటానికి ఇదే కారణం. కాబట్టి ఆదిభౌతిక, భౌతిక ముందు ఆదిభౌతిక, ఆధ్యాత్మిక. భౌతిక లేకుండా ఆధ్యాత్మికత లేదు. ఎందుకని? ఇది Real Ground. అతి వాస్తవికమైనటువంటి ఒక దృష్టితో మనం గనక విచారణ చేసినట్లయితే నిజానికి సుఖము లేదు, దుఃఖము లేదు. అన్నీ మన మనోకల్పితాలే. మన మనస్సు కల్పిస్తుంది. ఒకడికి ఒక కోటి రూపాయలు లాభం వస్తే, "చాలా బాగుందండి" అంటాడు Instantగా. ఐదు నిమిషాలు అయిన తర్వాత "ఇంకొక్క కోటి వస్తే బావుండేది కదా" అని అంటాడు. ఆ అన్నది ఎవరు? మన మనస్సే. కాబట్టి మన మనస్సును నియంత్రించుకుంటూ, ఆలోచనలను నిగ్రహించుకుంటూ, ఏది ఏ పని ఎంతవరకు ఎట్లా చేయాలో with Prudence and Diligence. ఈ రెండింటినీ మనం Intelligenceని ఆధారం చేసుకున్నాం. Prudence లేదు, Diligence అస్సలు లేదు. కాబట్టి ఈ పరిణామాలకు మూలాలు ఇవని నేను గట్టిగా నమ్ముతూ పెద్దవాళ్ళు గాని, యువకులు గాని మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడు చేయవలసింది ఏమిటంటే తన కర్తవ్యాన్ని తాను చేయాలి. ముందు వ్యక్తిగతంగా చేసుకోవాలి. 'తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము' అని ఒకటి ఉంది కదా! ముందు వ్యక్తిగా తాను Equip కావాలి. తన ద్వారా ఆ శక్తిని తన కుటుంబానికి ఇవ్వాలి. తన కుటుంబం ద్వారా సమాజానికి ఇవ్వాలి. ఏ సమాజం ప్రపంచం అవుతుందో, సృష్టి అవుతుందో అది ఇక అది పెద్ద Canvas. దాని జోలికి వెళ్ళకుండా అసలు సంస్కరింపనేల సంఘమంతటినీవు.సజ్జనుండ విగం స్వార్థముడిగి, ఒక్క నీచుడప్పుడు విలువు తగ్గును. ఇటువంటి చిన్న చిన్న పదాలతో మనం గనక సాహిత్యాన్ని బాగా చదువుకున్నట్లయితే సాహిత్యంలో రాహిత్యము ఉంది. రాహిత్యంలో సాహిత్యం లేదు. రాహిత్యంలో absolute pure knowledge అది మన ముందు ఉంటుంది కాబట్టి ఈ భౌతిక ప్రపంచాన్ని దాటుతూ దాటుతూ మనం వేటినైతే ఎదుర్కుంటామో, encounter అవుతాముంటామో వాటన్నింటినీ కూడా సమర్థవంతమైనటువంటి శీలం, character, conduct, ప్రవర్తన. తర్వాత ఒక విస్తృతమైనటువంటి ఒక భావ సంపద. వీటన్నింటినీ సంతరించుకొని చేసినట్లయితే మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ మన నుంచి దూరం అవుతాయి. మాయమవుతాయని చెప్పను, దూరం అవుతాయి. దూరం అయిపోయిన తర్వాత అది నెమ్మదిగా మాయమవుతుంది. ముందే మాయం కాదు. ఆ దూరం జరగటానికి మన నుంచి దాన్ని దూరంగా నెట్టివేయటానికి సంగీతము, సాహిత్యం, సద్గోష్ఠి, సత్సంగం, సత్సాంగత్యం, సదాచారం, సమ్యక్ భావన. ఇవన్నీ ఎవరి యందు ఉంటాయో వాడు నిత్య తృప్తుడై నిత్యసుఖి అయి ఉంటాడు. ఈ tough times అనేవి అసలు ఎందుకు వస్తాయి? tough times అనేవి అసలు ఉంటాయా? మన perception అండి. ఊ.. Time is never tough. దానికి రుచి లేదు, రంగు లేదు, వాసన లేదు. వేగం ఉందేమో, అది కూడా మనం మనస్సు కల్పించేదే. కానీ time is a constant factor. అది ఒక్కసారి దాన్ని ముందుకు వెళ్లడమే తప్ప వెనక్కి తిరిగి రావటం లేదు. ఆ పరిగెత్తుతున్నటువంటి ముందుకు వెళుతున్నటువంటి కాలంతో మనం పోటీ పడ్డప్పుడు మన దగ్గర అంత శక్తి లేనప్పుడు ఏది అందుకోవాలో దానిని అందుకోలేని స్థితిలోకి మన మనస్సు వెళ్ళినప్పుడు మనకు వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకోనప్పుడు ఆ సమయాన్ని మనం tough time గా మార్చుకుంటాం. Time is not tough, time is time. అంతే. Mind is everything. ఆ Mind is everything. ఊ.. ప్రతి వాడు తాను గొప్పవాడు అవ్వాలనుకుంటారు, great person అవ్వాలనుకుంటారు. ఊ.. Great life చూడాలనుకుంటారు కదా. ఊ.. దీన్ని ఎలా చూడాలి? నిజంగా great ఎలా అవ్వాలి? ఓ మాట చెప్పనా? All great men are not necessarily to be good. But all good men are great. నా ఉద్దేశంలో. మంచితనాన్ని మించినటువంటి గొప్పతనం లేదండి. అది ఉంటే వాడి ఆలోచన ముందు humanize అవుతుంది. Humanize అయింది divinize అవుతుంది. తర్వాత spiritualize అవుతుంది. ముందు spirituality రాదు. ముందు humanize చేయాలి. మానవతా పరిమళాన్ని దానికి అద్దాలి. మా-మన మనసులో ఆలోచన పుట్టగానే. కాబట్టి వాడు great man ఏమైనా అంటే ప్రాపంచికమైనటువంటి దృష్టిలో వాడు మన great man. ఎవరూ achieve చేయలేనిది వాడు చేశాడు. He is great. కానీ అది comprehensive కాదు కదా. అది three sixty degrees కాదు కదా. ఒక, ఒక విషయంలో great. great అయినాడు. humanism ఏ లేదు. దయలేని హృదయం ఉన్న ఓ doctor గారు, నిజాయితీ లేని ఓ engineer గారు, adequate గా చదవవలసింది చదవకుండా వచ్చేటువంటి ఒక ఉపాధ్యాయుడు, preparedness ఏ లేనివాడు, exactness అంటే తెలియనవాడు. వీళ్లందరూ great men ఎలా అవుతారు? అవుతారు. ఎలా అవుతారంటే, ఇవాళ ఆధునిక ప్రపంచాన్ని చూస్తే popularity ఎవరికుందో వాడిని మనం great man అంటున్నాం. అన్యాయం అది. popularity వేరు, ప్రతిభ వేరు, యుత్పత్తి వేరు, ప్రజ్ఞ వేరు, ఉపజ్ఞ వేరు. ఇన్ని ఉన్న తర్వాత ఆ greatness గా ఎవరినైతే మనం great man అని అంటున్నామో అతను ప్రపంచానికి హితమైంది ఏదన్నా చేశాడా? అతని రంగంలో అతను great అయినాడు. ఆ goodness ఎప్పుడొస్తుందంటే, నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని సంపద కానివ్వండి, విజ్ఞానం కానివ్వండి, లేదు ultimately గా ఆ అద్వైత దృష్టే జ్ఞానం కాబట్టి అటువంటి జ్ఞానాన్ని గానీ, ఏ రకమైన లాభాపేక్షని కోరుకోకుండా, అవతలి వ్యక్తి వికాసంలో మన మాట ఒక పాత్ర వహిస్తుందన్నప్పుడు నిరపేక్షంగా, నిర్మమంగా ఇవ్వగలిగినట్లయితే that is a real sacrifice and he is a great man. ఒక్కసారి ఒక యాభై ఏళ్ల క్రితం మనం సంగీతంలో గానీ, సాహిత్యంలో గానీ, వైజ్ఞానిక రంగంలో గానీ, inventions లో గానీ, research లో గానీ, innovations లో గానీ స్వర్ణయుగంగా మనం చెప్తాం. అది స్వర్ణయుగం ఎందుకైందంటే they were all good men. వాళ్లకు వచ్చింది-- ఇప్పుడు పోతన గారు భాగవతం రాశారు. ఆ వ్యాసుల వారు సరే ఆయన చేసింది, ఆయన సరస్వతీ ప్రవాహమే అది. ఆ, ఆ వాటికి దేనికి copyright లేదు కదండీ. దేనికి copyright లేదు. ఇవాళ మనం నలభై pages చిన్న పొత్తము అంటామే, ఆ పొత్తము రాస్తే copyright సర్వ హక్కులు నావే అని రాస్తాడు. అంటే నేనంటాను వాళ్లది right to copy, మనది copyright. Copy to write. ఆ, right to copy. అంతే. మనది copyright. మనది copy. అట్లా మనిషి ఏం చేస్తాడంటే ఎక్కడికక్కడ ఒక తన పరిధిని కుంచించుకుంటూ, ఆ కుంచించినటువంటి దాంట్లో తాను ఉంటూ, అదే తాను సృష్టించిన ప్రపంచమని భ్రమిస్తూ తన చుట్టూ జరుగుతున్నటువంటి అనేకమైన పరిణామాలు వేటినీ గమనించకుండా నాకు తెలిసిందే final అని ఎవరైతే అనుకుంటారో వాడికేమీ తెలియదని నా ఉద్దేశ్యం. తెలుసుకుంటూ ఉండాలి మనస్సుని. అందుకనే అంతరంగము కన్నా జాపకుడు లేడు. అరయ కాలమే మీకు పరమగురువు. గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే. ఆ ప్రత్యక్ష లోకమే పెద్ద పుస్తకమిది. దానిలో నుంచి మనకు కొన్ని విషయాలు తెలిసి మనకి నచ్చి ఆ మనం ఎప్పుడో అవి పొంది మళ్ళీ వాటిని మననం చేసి, ధారణ చేసి మళ్ళీ ప్రపంచానికి మనం ఇస్తున్నాం తప్ప మనది మనంగా original గా contribution ఏదైనా ఉన్నదా? వాళ్లవన్నీ original. అందుకే they were all good and great. అవును. Now we may be great but may not be really good. We are great by popularity. That what I say. ప్రతిభ వెనక్కి వెళ్ళిపోయింది అండి. అవును. ఊ.. ఇప్పుడు ఒక సామాన్యుడు అనుకుండేవాళ్ళు ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలి?నిరంతరము స్పృహలో ఉండాలి అండి. స్పృహ చాలా గొప్పది అది. అంటే Constant Consistent Integrated Awareness అంటాం. నేను ముందు నేను, నేనుతో ప్రారంభమైన నేను, తర్వాత ఆలోచనాత్మకమైనటువంటి ఒక నేను, ఆచరణాత్మకమైన మరొక నేను, అనుభవాన్ని పొందిన నేను. ఈ నేనులు ఎన్నెన్నో ఒక్క మేనులో ఇమిడిపోయి ఉన్నాయి కదా! వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ, సంఘటిత పరుచుకుంటూ, తన శక్తి కొంత అయినట్లయితే తాను అందుకోవలసిన దానిని అందుకోవటానికి తన శక్తి చాలదు అని అనుకున్నప్పుడు సమాజం యొక్క శక్తిని తను తీసుకుని, సమాజంతో మమేకమై తన శక్తిని సమాజానికి, సమాజం యొక్క-- దాని శక్తిని తనకి రెండింటిని గనక Align Attune చేసుకోగలిగితే సామాన్యుడు అసామాన్యుడు అవుతాడు. ఖచ్చితంగా ఇదే మార్గం ఇంక వేరే మార్గం లేదు. దానికి ఆహ్ విద్య Basic. అంటే విద్య అంటే కేవలం మార్కులు వచ్చేవి కాదు Remark than విద్య కావాలి. చదువులన్నీ చదివి చావంగానేటికి చావులేని చదువు చదువాలి. అది Spiritual కోణ-కోణంలో. భౌతికమైనటువంటి కోణంలో కూడా ఒక చాలా సామాన్యమైనటువంటి వాడు నేను దానిని అందుకోవాలి, ఆ స్థాయికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు జీవితాన్ని పణం పెట్టాలి. కాలంలో తనను తాను పుటం పెట్టుకోవాలి. తనలో ఉన్నటువంటి అనేక చీకటి కోణాలు Negativities అన్నీ కూడా దగ్ధం చేసుకోవాలి. తనను తాను అందరూ అంటారు కడిగిన ముత్యంలా వచ్చాడు అంటే అప్పటికే ముత్యానికి మాలిన్యం అంటుందన్నమాట. కడి- అంతే కదా! ముత్యమే గాని మాటి మాలిన్యం ఉంది దానికి. ఉంది. కాబట్టి అసలు ముత్యం లాగానే ఉండాలి. ఎలా ఉండాలి అంటే ముందు తనను తాను సంస్కరించుకోవాలి. ఆ సంస్కరణలో నుంచి సమాజానికి-సమాజంలోకి వెళ్ళినప్పుడు నెమ్మదిగా సామాన్యంగా ప్రారంభమైన ఒక చినుకు అండి, ఎక్కడో ఒక చినుకు పడుతుంది అది వర్షం అవుతుంది. వర్షం నెమ్మదిగా వరద అవుతుంది. వరద నదిలో ప్రవహిస్తుంది. నదులన్నీ పోయి సముద్రంలో కలుస్తాయి. సా-సాగర గంభీరుడు అన్నారు గాని నదీ గంభీరుడు అనలేదుగా! అవును. ఆ సాగర గంభీరత్వం అంటే గంభీరము, గభీరము రెండు దాంట్లో ఉన్నాయి. లోతుగా ఉంటుంది. లోతు ఉండాలి. లోతు Expansion. విస్తృతం కావాలి. Shell పగలగొట్టుకొని మనకున్నటువంటి పరిధిని ఎవరైతే విస్తృతం చేసుకుంటూ వెళతారో వాళ్ళు వీటన్నింటినీ పాటించాలి. అంటే అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలంటే విద్య ఉండాలి. విద్య అంటే తెలుసుకోవటం అంతే. విద్య అంటే Education కాదు. విద్య అంటే తెలుసుకోవటం. జ్ఞానం. ఆ మార్గం ఏమిటో తెలుసుకోవాలి. అంటే మన Continuous Learning అలాగే Up-gradation మన Qualitiesని, నైపుణ్యాలు పెంచుకోవటము అనేది అది చాలా Important కదా Actual గా? ఆ ఖచ్చితంగా. ఏవి ఏవి నేను ఎప్పుడూ చెప్తాను ఒక మాట "Teacher must be a constant learner". విద్య- నలభై మంది విద్యార్థులకు బోధించేటువంటి ఒక ఆ ఉపాధ్యాయుడు నలభై మంది ఆలోచనలకి Attune చేయగలిగిన శక్తిమంతుడై ఉండాలి. అంటే ఆ Subject మీద ఆయనకు Authority ఉండాలి. ఏది రా అని ఏది పో అని, వాడికి కీర్తి వస్తుందా? ఉత్తమ ఉపాధ్యాయుడు Award వస్తుందా? జీవిత సాఫల్యం వస్తుందా? ఇది కాదండి కావాల్సింది. తన ముందు నలభై మంది విద్యార్థులు తెలుసుకోవాలని కూర్చున్న వాళ్ళకి తెలియజెప్పాలి. ఊ. తెలియజెప్పాలి అంటే తాను దాని మీద అధికారాన్ని సంపాదించాలి. ముందు తాను బాగా తెలుసుకోవాలి. బాగా తెలుసుకొని, బాగా అధ్యయనం చేసి అనేక కోణాల్లో Physical, Metaphysical and Spiritual. భౌతిక స్థాయిలో చెప్పాలి, అదిభౌతిక స్థాయిలో చెప్పాలి, Intellectual level లో చెప్పాలి. ఆ తర్వాత Spiritual level వైపు వాడిని నెమ్మదిగా తీసుకుని వెళ్ళాలి. ముందే Spiritual అంతా Spiritual అయితే ఇంకా రెండు Altitudes లేవు. అవును. కాబట్టి Start from Physics-- Physical level. అదే. Then apply your intellect. ఈ రెండూ అయిపోయిన తర్వాత స్లో గా అది వయస్సు కావచ్చు, అనుభవం కావచ్చు, జీవితాన్ని దర్శించే- జీవితాన్ని చూడటం అనేది ఏం లేదు దర్శించాలి. అవును. చూడటం Very Physical. దర్శనం ఆంతరంగికం. అంటే మనోనేత్రంతో చూడటం, జ్ఞాన నేత్రంతోటి. ఊ. అనుభవించటం. దానికి మనం ఏ పేరు పెట్టుకున్నా స్పష్టంగా చూడటం. ఊ. అది తెలియాలి అది. తెలియాలి. తెలుసుకునే ప్రయత్నం గట్టిగా చేయాలి. ఇప్పుడు మనోనేత్రం అనేది, అంతర్నేత్రం అనేది మనం వాడతాం పదాలు. ఊ. మనస్సుకి నేత్రం ఉందా? అవును. లేదుగా! లేదు. ఉరికే అదేదో కనపడదు కాబట్టి దానికి ఒక పేరు పెట్టాం. తరుడయ్య అన్నారు. ఆ? తరుడయ్య అని. తరుడయ్య అని. జ్ఞాన నేత్రం. అవన్నీ, అవన్నీ ఇవాళ Commercial పదాలండి. అవును. తరుడయ్య అనేది ఈ రెండు కళ్ళతో ఈ ప్రపంచాన్ని- ఇప్పుడు బ్రహ్మము బ్రహ్మము అంటాం అండి. ఊ. ఇది దీనికి చాలా సంబంధించినటువంటి విషయం. ఊ. భగవద్గీత నిండా భ-బ్రహ్మం గురించి మాట్లాడాడు ఆయన. మనం కూడా చెప్తాం. బ్రహ్మ పదార్థం అంటాం. అసలు నిజానికి పదార్థము బ్రహ్మము అని వేదం చెప్పింది. అవును. అర్థం కానందువల్ల బ్రహ్మ పదార్థం అంటున్నారు. అని దానికి ఇట్లా కొన్ని కొన్ని ఏర్పరిచారు. అయితే ఏమిటి ఆ బ్రహ్మం అంటే దేనిని ఈ కనులు చూడలేవో కానీ దేనివలన ఈ కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మం. చూపించేది అన్నమాట. అన్నింటికీ తాను కర్త అయి ఉంటుండు. మనము కర్మ-కార్మిక భూమిలో ఉంటాం. అంటే అణుక్షేత్రం నుంచి ఆధ్యాత్మిక క్షేత్రంలోకి వెళ్ళటం ఒక ప్రస్థానం, అదో మంచి ప్రయాణం. అంటే ఆ క్షేత్రంలో మనం ఉంటాం. ఉంటాం. ఊ. ఆ చూడగలగాలి మనం. అదొకటుందని ముందు తెలియాలి. ఆ తెలియాలి. తెలి-తెలి- తెలియాలంటే గురువు ఉండాలి. గురువు ఉండాలి. గురువు ఉండాలి. ఇందాక చెప్పిన అనేకం. అనేకం. సత్సంగత్యం అలాంటివన్నీ కూడా ఉన్నట్లయితే మనకు మన దగ్గర కూడా కొంత విషయం ఉంది. ఊ. దాన్ని మనం Expand చేసుకుంటూ Bracing చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అవును. ఈ ఇంగ్లీష్ పదాలు చాలా ఎక్కువగా ఎందుకు చెప్తున్నానంటే అవును. యువతకి అలా చెప్తే తప్ప అర్థం కావట్లేదు. అవును. స్పష్టమైనటువంటి అచ్చ తెలుగు గనక మాట్లాడితే ఊ. ఏదో చెప్పారు, బానే చెప్పారు గానీ మాకు పెద్దగా తెలియదు. అదే మన భాషలో మా-మాట్లాడి అదే భాషలో మాట్లాడాలని. ఇప్పుడు కరికులం కూడా మారిపోయింది కాబట్టి ఆ మారిపోయింది. కమర్-కమ్యూనికేషన్ కూడా పెరిగింది కాబట్టి ఊ. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు మనమన వాక్యాల్లో శ్రీశ్రీ గారు అన్నట్టుగా ఇంగ్లీష్ వాక్యాలే తెలుగు పదాలు ఏరుకోవాల్సి వస్తుందన్నాడు ఆయన భవిష్యత్తు. నిజం. సరి తర్వాత మన వ్యక్తి నుంచి మనం టీం బృందాలు నిర్మాణం చేస్తాం. టీం, టీం నిర్మాణం చేస్తాం. ఒక టీం ఒక బృందం బాగా strong గా ఉండాలంటే, ఆ, ఎలా ఏం చేయాలి సార్? టీం ని మనం తయారు చేసుకోవాలి. ఉమ్ టీం మీకు strong టీం దొరకదండి. ఎప్పుడూ దొరకదు. ఏ సంస్థలోనూ దొరకదు. ప్రతి వాడిని తీసుకోవాలి. తన ఆశయాలు, తన ఆదర్శాలు, తన లక్ష్యాలు, తన గమ్యాలు, ఇవి కదా! ఈ నాలుగే కదా! ఈ నాలుగు ఏమిటో వాడికి రోజూ ఉపన్యాసం ఇవ్వక్కర్లే. అవును. వాడిని అలా mould చేయాలి. చేసి మీకు శక్తివంతమైనటువంటి పరికరంగా తయారు చేసుకొని, ఆ, అతను ఏ పనిలో ప్రజ్ఞ చూపించగలడు, తన ప్రజ్ఞ ద్వారా ఏ ఆనందాన్ని ఇవ్వగలడు. ఆనందం అంటే ఏంటి? మంచి పని జరిగింది అనుకోండి. ఆ అది ఆనందం ఇస్తుంది. ఉంటా చాలా బావుంది వేళ అంటాం. result result oriented, target ori-- target oriented నుంచి result oriented కి వెళ్ళాలి. అవును వెళ్ళాలి అంటే ఆ team ని మనం తయారు చేసుకోవాలి. వీడు పనికిరాడు, వీడు disqualify అయినాడు, వీడు మన ఆవరణలో లేడు అని అనుకోవద్దండి. రానివ్వండి. వచ్చాక he may become your asset. ఇది అది management ఎవరైతే head ఉంటారో ఆయన గనక ఈ కోణంలో వెళితే team ను తయారు చేయటం పెద్ద కష్టం కాదు. head ఉన్నవాడికి brain ఉండాలి. ఆ అది important కదా అదే కదా! రెండు కా-combination చేతులు ఉండాలి మళ్ళీ. అవును. చాలా వారికేంటంటే teams team కొంతమంది leaders లో లోపం ఉంటుంది team building లో. మీరన్నట్టుగా head ఉన్నోడికి brain ఉండాలి అన్నట్టుగా. తర్వాత ఈ కింద తయారైన ఆ కింద team individuals లో కూడా లోపం ఉంటుంది. ఉమ్ దాన్ని ఎలా బే-- ఆ gap ని ఎలా maintain చేస్తాం? చెప్తా, చెప్తా. ఇప్పుడు ఇలాగే అనుకుందాం. మీరు మంచి ఆదర్శంతో ఓ మంచి team తయారు చేశారు. మీ ఆదర్శాలకు mirror reflection లో ఉన్నారు వాళ్ళు. అద్దంలో బొమ్మలా కనిపిస్తున్నారు మీకు. కానీ at the end of the game వాళ్ళ contributions ఉన్నా అయిపోతాయి. అంతా మీరే బండి లాగాల్సి వస్తుంది. మరి ఆ team ను redundant ఉంచాలా? వద్దా? అంటే నైతిక, భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక ఈ మూడు కోణాలు మీ team కి చెప్పాలి. honesty of purpose చెప్పాలి వాడికి. వాడి role ని మీరు distinct గా define చేయాలి. వాడిని ఎంతవరకు మీరు వాడుకోవాలో అంతవరకే వాడాలి. వాడికి శక్తికి మించిన పని వాడికి మీరు చెప్తే ఆ team బలహీనపడిపోతుంది. చూడండి ఆ team ని అనేక విధాలుగా స్పృశించాలి, అనేక కోణాల్లో చూడాలి. దాన్ని constant monitoring చేయాలి. check, trust but have a check. trust your team but have a check over them. ఈ రెండింట్లో ఏది miss అయినా మీకు-- మీరే తయారు చేశారు, ఆ team మీద మీకే trust లేదు. your result will be ze-zero. అవును కదా! మరి ఆ వాడికి ఏం చేయాలంటే but have a check. ఉమ్ smart గా ఉండాలి over smart గా ఉండకూడదు. అవును తర్వాత company యొక్క లక్ష్యాలు వాడికి చెప్పాలి. ఇది మనం profit oriented గా వెళుతున్నాం. మన లక్ష్యం ఏంటంటే ఒక వంద కోట్లు touch చేయాలి. దానిలో మీ పాత్ర ఇది. మీరు చేయవలసింది ఇంతే. అని గనక head కి ఆ స్పష్టత ఉన్నట్లయితే ఖచ్చితంగా team చాలా strong team తయారవుతుందండి. దానికి కావలసింది commitment కావాలి, నిబద్ధత కావాలి. నిబద్ధతతో పాటు కొంత sacrifice చేయాలి. వాళ్ళు ఏమి sacrifice చేయగలరు? time time ని sacrifice చేయాలి. time ఏ time ఇచ్చేస్తే చాలండి. ఉమ్ గంట అవగానే ఇలా watch చూసుకుని అయిపోయిందా అనకూడదు. ఉమ్ అయిపోయింది అనకూడదు. చేస్తూ వెళ్ళాలి అవసరమైతే. ఇట్లా team ని నిరంతరం కూడా నేనంటాను motivation చాలా చిన్న పదం అండి అది. ఆ పదం మనం అలా వాడి వాడి నిజంగా ఒక జాతి వెనక్కి వెళ్ళిపోయింది. ఉమ్ inspire చేయండి. అవును ముందు ignite చేయండి. ఉమ్ వాళ్ళకి kindle a thought. దాన్ని వెలిగించాలి. వెలిగించి, ఈ organization నాది. ఉమ్ అనేటువంటిది ఆ team కి ఉండాలి. team leader కి కూడా ఉండాలి. ఉమ్ ఆ, down below వాళ్ళకి కూడా ఉండాలి. అది అయిన తర్వాత inspire చేయాలి. ఉమ్ తర్వాత illustrate చేయాలి, demonstrate చేయాలి. తర్వాత illuminate చేయాలి. ఉమ్ అంటే ఏడు stages. ఆ different stages. అంటే individual గా ఒక team ఉంటే- ఉమ్ ఆ team లో individual గా result సాధించాలి. individual గా ప్రతి వాడు result oriented గా ఉండాలి. ఒక ఫలితాన్ని result ని సాధించాలి. తర్వాత వీళ్ళందరూ కలిపిన ఆ team కలిపి ఒక అద్భుతమైన result ని ఇవ్వాలి. ఆ result orientation ఉండాలి అంటే from individual to team leader వరకు కూడా ముందు వాళ్ళకంటూ కొన్ని basic qualities ఉండాలి కదా. qualities లేకపోతే మన inputs ఇవ్వాలి. ఉమ్ అంటే ఏమివ్వాలి సార్? అంటే మన-మన దగ్గరే ఉన్న inputs అతనికి ఇవ్వాలి. ఉమ్ అతని దగ్గర inputs ని మనం కూడా తీసుకొని రెండింటినీ balance చేయాలి. అంటే basic qualities ఏముండాలి? ఏమివ్వాలి అంటే అతన్ని motivate అదే inspire చేయాలి. ఉమ్ చేయాలి. commitment వచ్చేట్టుగా చేయాలి. అతను చేసిన పనికి appreciation ఇవ్వాలి. ఉమ్ ఆ, అది motivation కాదు appreciation ఇవ్వాలి. అవును appreciation తో పాటు compensation ఇవ్వాలి. compensation తో పాటు recognition ఇవ్వాలి. ఏవండీ ఎక్కడికక్కడ ఇవన్నీ గనక రోజూ ఈ మాటలన్నీ చెప్పుకోవల్-కర్ల silent గా గనక జరిగిపోతే team automatically becomes very strong. సర్ చాలామంది వాళ్ళకి చాలా talent ఉంటుంది, brilliance ఉంటుంది, knowledge ఉంటుంది, academic records ఉంటాయి, excellence ఉంటుంది. కానీ వాళ్ళు fail అవుతుంటారు, ఎందుకు? రెండు కారణాలండి. ఉమ్ prudence, pragmatism అనే అతివాస్తవిక దృష్టి లేకపోవడం main కారణం. ఉమ్ నా దగ్గర డబ్బుంది. ఒక hundred crores డబ్బుంది. దీన్ని hundred దాకా తెచ్చా కదా thousand I can just multiply అనుకుంటాడు. అవదండి. అట్లా అవదు. మరి ఏం చేయాలి? ఎందుకని fail అవుతున్నారు అంటే idealism తో business నడవదు. ఉమ్ ఆదర్శవాదానికి వ్యాపారానికి సంబంధమే లేదు. వ్యాపారం అంటే వ్యాపారమే. దానికి అక్కడ ఇవ్వాళ చెప్తున్నాం కదా అంకెలే లంకెలు అంటాం.అంకెలు అంటే figures ఆ figures can be in terms of you know మీ తెలివితేటలు కావచ్చు డబ్బు కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా సరే achievements కావచ్చు కానీ అసలు ముందే ఎందుకు fail అవుతున్నాం అంటే ఏం చేయదలుచుకున్నానో అతనికి స్పష్టత లేదు clarity ఉండాలి clarity and conviction ఉండాలి. ఈ రెండు లేకపోతే అసలు మనిషి జీవితం వ్యాపారం వదిలేయండి మానవ జీవితంలో కూడా clarity and conviction ఈ రెండు ఉండాలి స్పష్టత I repeat ఆ స్పష్టత లేకపోతే నేను ఏం చేస్తున్నానో తెలియకపోతే ఏం మాట్లాడాలో తెలియకపోతే ఏది మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటే ఇదిగో ఈ కారణాల వల్ల వాళ్ళు fail అవుతారు ఈ మధ్య mentor అనే మాట బాగా వినపడుతుంది, వినపడుతుంది కదా ఏంటి వాటి he is the best mentor mentor అంటే ఎవరు మనం కూడా mentor గా మామూలు వ్యక్తి కూడా mentor గా leader become mentor గా మారొచ్చా ఇప్పుడు leader వేరు mentor వేరు person to leader leader to mentor ఆ person ఉన్నాడు వాడు ఎలాగో ఉన్నాడు వాడే కావాలి వాడు ఇదన్నా కావాలి అదన్నా కావాలి లేకపోతే రెండూ కావాలి అదే అంతే కదా leader is always a greater state than mentor mentoring అంటే వాడి మనస్సుని వాడి ఆలోచనని కొంత channelize చేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు వాడు మనకు mentor mentor leader కాలేడు impossible అది తర్వాత step కాదు leader can be always a mentor ఉమ్ నేను సర్వ సమర్థుడిని అనుకోండి నా దగ్గర అత్యుత్తమమైన నాయకత్వ లక్షణాలున్నాయి నేను mentor గా వంద మందిని motivate చేయగలుగుతా inspire చేయగలుగుతా నేను mentor నే అనుకోండి ఐదు ఆరుగురిని పది మందిని వంద మందిని mentoring చేయగలుగుతా ఆ mentoring అంటే ఏమిటంటే ఒకానొక subject లో ఒకానొక విషయంలో వాణ్ని వాడికున్నటువంటి పరిమిత శక్తిని channelize చేసి proper గా ఇలా వాడుకుంటే బాగుంటుందని చెప్పేవాడే mentor ఒకప్పుడు ఓ నలభై నలభై ఏళ్ళ క్రితం సమాజంలో mentoring లేదు మనకి తల్లి mentor తండ్రి mentor teacher mentor స్నేహితుడు mentor అవునా కాదా అవి మనం అనుభవించాం ఎడ్యుకేటరే mentors ఉండేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళకి ఆ mentor title ఏ లేదు కానీ they could do all that expecting nothing from the other side సమాజంలో వాడెవరైనా కానివ్వండి జాతి లేదు మతం లేదు కులం లేదు వర్గం లేదు వర్ణం లేదు mentoring చేస్తూ వచ్చారు ఆ మనం కూడా నెమ్మదిగా ఆ పదాన్ని వదిలేద్దాం [కొడుకు] ఎందుకంటే అది అది ఏమిటో తెలియక he is my mentor అంటాడు ఇంకోడు he is my peer అంటాడు ఏమిటో ఆ పదాలు ఉమ్ శ్రేయోభిలాషి అంతే మంచి మార్గంలో నడిపించేవాడు మంచి మాట చెప్పేవాడు మంచిని ఆచరించేవాడు తాను ఆచరించి బోధిస్తాడు గనుక ఆయన్ని మాత్రమే ఆచార్య అంటాం అవును అంతేగాని professor ఆచార్య కాదు కదా అవును ఉమ్ పాఠాలు చెప్పేవాళ్ళందరూ గురువులవరూ కాదు అట్లా అవుతారు teacher అవుతాడు గాని గురువు అవ్వడు teacher అవుతాడు ఉపాధ్యాయుడు అవుతాడు అధ్యాపకుడు అవుతాడు అంతేగాని అంతే ఉమ్ మార్గదర్శనం చేసుకునే వాళ్ళే గురువులు అవుతారు అంతే అది తండ్రి కావచ్చు స్నేహితుడు కావచ్చు తల్లి కావచ్చు school లో పాఠాలు చెప్పేవాడు కావచ్చు పక్కింటి అంకుల్ కావచ్చు మార్గదర్శనం జీవితంలో చేసే ప్రతివాడు గురువు కానక్కర్లే అవును నా దృష్టిలో అవును సన్మార్గదర్శనం చేసినవాడు మాత్రమే గురువు అదే మార్గం అంటే సన్మార్గం అని అదే అదే మార్గాలు బోలెడున్నాయి అవును చాలా దుర్మార్గాలు ఎక్కువున్నాయి you must be very cautious cautious అంటే you must be clear clear అవును తరవాత health and discipline యొక్క పాత్ర మనిషి యొక్క success లో ఎలా చూడాలి sir ఖచ్చితంగా అది basic అండి ఉమ్ చూడండి మనం చిన్నప్పుడు elementary school లో కూడా గోడల మీద రాసి ఉండేది ఆరోగ్యమే మహాభాగ్యం అని తర్వాత తర్వాత materialism ప్రబలినప్పుడు భౌతికవాదం పెరిగినప్పుడు globalization and liberalization లో ఉన్న ఈ కాలంలో ఆరోగ్యమే మహాభాగ్యం తిరగబడిందండి మహాభాగ్యమే ఆరోగ్యం అనే స్థాయికి వచ్చేశాం మనం కానీ మన దగ్గరున్న currency నోట్లు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వవండి మనకున్న పట్టు మంచాలు పట్టు పురుపులు నిద్రనివ్వవండి మనకున్న అవకాశాలు అధిరోహించిన మెట్లు అహంకారాన్ని పెంచుతాయే తప్ప ఆత్మానందాన్ని ఇవ్వలేవండి తృప్తే ముక్తి మన దగ్గర నేను contented person అనగానే నాకు కోట్లతో పనిలేదండి ఒక్క రూపాయి బిళ్ళ చాలు తృప్తి పిడికెడు అన్నం చాలు ఒక మంచి ఆప్తవాక్యం నా కన్నీరు తుడవొచ్చు ఒక వాత్సల్య పూరితమైన ఒక స్పర్శ నాకు అమితమైన బలాన్నివ్వొచ్చు నేను చీకట్లో గునారు ఇల్లుతున్నప్పుడు నీకెందుకు ఆ light వేసుకో చీకటి పారిపోతుందని చెప్పగలిగినటువంటి ఒక ఉత్తమ స్నేహితుడు ఉంటే చాలు కాబట్టి ఇవన్నీ మనకు ఎక్కడున్నాయంటే మన చుట్టూనే ఉన్నాయి మనం వాడుకోవటం తెలియదు అదే అదే కాబట్టి ఆరోగ్యం శరీరం మాధ్యం ఖలు కర్మ సాధనం శరీరం మాధ్యం ఖలు ధర్మ సాధనం ధర్మబద్ధమైన కర్మలు చేయాలంటే మంచి శరీరం కావాలి వీణ తీగలన్నీ గనక గట్టిగా లాగి బిగిస్తే దానిలో నుంచి ఆ తంత్రీ నాదం పుడుతుంది వీణ ఉంది కానీ అవన్నీ కూడా తీగలన్నీ కూడా loose గా పడి ఉంటే ఎంత వైణికుడైనా దాంట్లో నుంచి నాదాన్ని పుట్టించలేడు అలాగే శరీరమే గనక ఒక వీణ ఒక వీణ అయినట్లయితే దీనిలో ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులకి మనకి శక్తి ఉంది దానిని మనం ప్రచోదనం చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలంటే యుక్తాహార విహారస్య ఏ వయస్సులో ఎప్పుడు ఏ సమయంలో ఎంత ఏది తినాలి ఈ స్పృహ ఉండాలి రెండవది యుక్తమైన విహారం చేయాలి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళితే మనం ఇతరులకు ఆనందం కలిగించగలమో అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళితే మనకు ఆనందం కలుగుతుందో అక్కడికి వెళ్ళాలి మనకి ప్రజ్ఞలున్నాయి కదా చాలా ఉన్నాయి ప్రతి వ్యక్తికి ఒక ప్రజ్ఞ ఉంది ఏనకైనా ప్రకారైన యస్య కశ్యాపి దేహిన సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం ఇదొక కవి పండితుడు రాయలేఏమిటి అసలు ఈశ్వర పూజ అంటే? నీకున్న ప్రజ్ఞ ద్వారా అందరికీ ఆనందాన్ని కలిగించు. ఆ ప్రజ్ఞ భౌతిక విజ్ఞానమా? ఆధ్యాత్మిక విజ్ఞానమా? జ్ఞానమా? యోగమా? యాగమా? ధ్యానమా? ఏమిటి? ఇవన్నీ అనేక వందల వేల మార్గాలు మన భారతీయమైనటువంటి వాంగ్మయ నిందన్ ఉన్నాయి అంటే theory and practice ల నుంచి ఆ చెప్పిన వాక్యాలే వచ్చిన వాక్యాలు అంతేగా ఆ practical గా వచ్చిన దాని నుంచి theory పుట్టింది theory పుట్టింది It's just reverse అంటే theory makes ఆ theory for practicality అదే కాదు కాదు మహాఋషులకు theory యే లేదు అవును మహాఋషులకు ఉన్నది జ్ఞానం ఆ ఆ జ్ఞానాన్ని theory చేసి మనకిచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అది దాన్ని మనం execute చెయ్యాలి Execute ముందు అవగాహన ఉమ్ పూర్తిగా చదవాలండి. ఎట్లా అంటే లోలోత లోనారసి అంటారే అవును లోపలికి చూడాలి లోపలికి చదవాలి అంతా ఉన్నదంతా లోపలే అని. ఆ లోపల ఏదుందో దాని గనక గమనించినట్లయితే ఈ సంసారాన్ని మీరు చెప్పిన ఈ business ని వ్యాపారాన్ని లేదు ఏ కళారంగంలో కానీ వాడు number one ఎలా అవుతాడు? అంటే తన శరీరాన్ని యోగం ద్వారా, ధ్యానం ద్వారా తర్వాత ఏకాగ్రత ద్వారా చిత్తైకాగ్ర స్థితిలో వీటన్నింటినీ పెట్టుకొని తన శరీరానికి కావలసిన పోషణ ఇచ్చి ఆ పోషణలో నుంచి అనేకమైన కార్యకలాపాలు చేసి ఎందుకంటే కర్మానుబంధి మనుష్య లోకే. మనంతా కర్మ చేసి తీరాల్సిందే అవును కనురెప్ప వాలేదాకా పని చేయాల్సిందే అది అంటే పనే కదా అంతే అది ఆ కర్మ కానివ్వండి కర్మయోగం కానివ్వండి భగవంతుడి శక్తితో కూడి చేస్తే దాన్ని కర్మయోగం అన్నాం. మన అంతట మనమే చేస్తే కర్మ అన్నాం. మనం ఏమి చేయకపోతే కర్మ అన్నాం అంతే అది negative shade negative shade కాబట్టి let us think positive, act positive and be positive. అంటే ఈ క్రమంలో ప్రతి మనిషి కూడా ఏదో వృత్తితోనో, ఏదో రంగంతోనో, ఏదో వ్యవహారంతోనో, ఏదో వ్యాపారంతోనో link అయి ఉంటాడు ఉమ్ జీవితం జీవితం అలా సాగుతుంది ఉమ్ అది చాలా సహజమైన అంశం ఉమ్ ఉమ్ సో ఈ ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగతమైన జీవితాన్ని రెండింటినీ career and personal life ని ఎలా balance చేసుకోవాలి? చేయాలి ఇక్కడ చాలామంది fail అవుతున్నారు వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. కడగా చేరవలసిన మార్గం నివృత్తి. వృత్తి, ప్రవృత్తి, నివృత్తి కదా! వృత్తిలో మీరు ఉన్నప్పుడు మీ ప్రవృత్తిని అణచుకొని ఉంచుకోండి. మీ అభిలాషలు దాచుకొని ఉంచుకోండి. వృత్తిని వృత్తిగా స్వీకరించండి. మీ ఆ దాన్నేమంటాం అంటే కర్మ సుకౌశలం. మీ దగ్గర ఉన్న సమస్తమైనటువంటి talent ని వాడి మీ వృత్తిలో రాణించండి. వృత్తిలో ఉండగా నా ప్రవృత్తి సాహిత్యం పద్యాలు రాసుకుంటానంటే మీరేమీ చేయలేరు. పద్యాలు రాసుకునే time వేరే చోటుంది. మాట్లాడే చోట్లు వేరే ఉన్నాయి management of time management కాదు utilization అది utilization ఆ utilization ఎలా చేయాలి? ఉమ్ ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఒక beautiful discretion ఉండాలి ఉమ్ prioritize చేసుకోగలగాలి. నేను నా వృత్తిలోకి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చా, మా ఇంటి నుంచి మీ దగ్గరికి వచ్చా. ఇక్కడ నా ప్రవృత్తులతో మీకేం సంబంధం లేదండి. నా hobbies తో మీకేం సంబంధం? నేను వచ్చి మీరు అడిగిన వాటికి చెప్పగలుగుతున్నానా లేదా? అవును నేను వెళ్ళి ఏదన్నా మంచి చెప్పగలనా లేదా? మంచి అంటే సత్యం చెప్పగలనా లేదా? దానికి ఏ రకమైన ముసుగు వేయకుండా చెప్పగలనా లేదా? భారత, భాగవత, భగవద్గీతాది గ్రంథాలన్నింటినీ రామాయణంతో సహా వాటిని ఈనాటి మానవుడికి, ఈనాటి యువతకి దానిలో ఉన్నటువంటి మానవీయ భావమే చెప్పగలరా? దాని interpretation, perceptions ఎలా ఉన్నాయి? అనేదే ఇప్పుడు నా వృత్తి. ఇక్కడ నా ప్రవృత్తితో మీకు సంబంధం లేదు అవును కాని ఈ రెండింటినీ నేను సమన్వయం చేసుకోగలిగితే, ఈ కించిత్ స్ఫూర్తి నాకున్నట్లయితే నా మార్గమే నివృత్తి మార్గం ఇప్పుడు ప్రతివాడు నాకు time లేదంటాడు ఉమ్ తర్వాత చాలా tension కు గురి అవుతుంటాడు. ఇంటికొచ్చి నానా హడావుడి పడతాడు లేదా office కొచ్చి కంగారు పడిపోతుంటాడు. ఈ అదే ఆ వృత్తి అండ్ వ్యక్తి వ్యక్తిగతం, వృత్తిగతం మధ్య ఎందుకంత మనిషి suffer అవుతున్నాడు? అది grammar దానికి solution ఏంటి? grammar versus grammar అది ఉమ్ ఆ లోపల సంఘర్షణ సృష్టించుకుంటున్నది మీరే ఉమ్ ఇప్పుడు నేను తాళం వేసి వచ్చానండి, నేను దాని గురించి ఆలోచించను. ఇక్కడి నుంచి మెట్లు దిగి కారు ఎక్కి వెళ్ళానండి, దీని గురించి నేను ఆలోచించను. ఈ దీనికి పెద్ద జ్ఞానం ఏం కావాలండి? ఆలోచించకుండా ఉండటమే జ్ఞానం దీన్ని గురించి ఉమ్ ఈ క్షణాన అవును మళ్ళీ మీరు పిలిచారు. ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు దీనిని గురించే ఆలోచించాలి. ఈ సమయాన్ని దాని మీదనే ఏకాగ్రం చేయాలి. ఈ ఇది తెలియక ఆరు గంటల దాకా office లో ఉంటాడు. eighty to ninety percent ఇవాళ. office లో ఉంటాడు ఇంటిని గురించి ఆలోచిస్తుంటాడు. ఇంటికి వెళ్ళిపోతాడు office గురించి ఆలోచిస్తాడు ఇప్పుడు జరుగుతున్నది అది ఎక్కువ ఇందువల్లనే ఘర్షణ ఉమ్ దేనిది దేనిగా ఆరు గంటలు అయిపోయింది నీ duty just empty your mind and get back. Emptying the mind is very very important. I don't say shut the mind you cannot shut the mind అది అవును అవును అది open gate అది. ఒక second కి ఆరు వేల ఆలోచనలు పుట్టించగలిగిన ఒక శక్తివంతమైన brain ఒక విషయం మనది. దాన్ని ఆరు వేలు మనకు అక్కర్లేదు. ఆరు వేల ఆలోచనలు ఏం చేసుకుంటాం? కాబట్టి తలుపులు రెండు కిటికీలు తీసి ఉంచండి గాలి వస్తుంటుంది పోతుంటుంది. అట్లాగే మన మనసులో కూడా ఆలోచనలు పుట్టనివ్వండి, పోనివ్వండి. ఏం కావాలో దాన్ని ఒడిసి పట్టుకొని దానిలో కూడా మళ్ళీ prioritize చేసుకొని నే నా వృత్తిలో వీటిని ఎట్లా వాడుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, తద్వారా నేను ఆరు గంటలు, ఎనిమిది గంటలు చేసే పని అరగంటలో ఎలా చేయగలను, నేను adapt ఎలా కాగలను smart work అన్నట్టు అది అది చేసి adopt, adapt and adept అని మూడు మాటలున్నాయి adept అంటే skill A D E P T skill A D E P T ఉమ్ adapt, adopt A D O P T, A D A P T, A D E P T ఈ మూడు పదాలు గనక ఉమ్ ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా, ఏ యువకులే అనే మాటల్లేదు ఉమ్ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మనిషి మనిషి అనేటువంటి వాడు వీటిని గనక ఆ తన జీవితంలో ఆ adopt చేసుకోగలిగినట్లయితే ఉమ్ దాంట్లో మూడు విషయాలు పుడతాయి. Equanimity పుడుతుంది ఉమ్ అంతవరకు వీళ్ళందరూ నాకంటే తక్కువ వాళ్ళని ఉమ్ నేను అందరికంటే తక్కువ వాడిననేటువంటి ఆత్మ న్యూనత నుంచి నేను బయటపడి ఉమ్ ఒక Equanimity ఏర్పడుతుంది అంటే no inferiority, no superiority Nothing ఉమ్ What you are you are that's all. దాని నుంచి equilibrium ఏర్పడుతుంది ఉమ్ సమతుల్యత ఆ సమతుల్యతలో ఏమవుతుందంటే మనస్సు అటు ఇటు ఊగదు. మీ మీరు మొదట్లో చెప్పారు highs and lows అని ఉమ్ There is nothing called high you are taking it to a height and you are falling into a pit called low అంతా నీ మనసు, నీ mind ఏ. ఎవరైనా గాని గొప్పవాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా number one అవ్వచ్చు అవ్వచ్చు వ్యక్తిగతంగా వాళ్ళు అవ్వచ్చు, ఆ రాష్ట్రం అవ్వచ్చు, ఆ దేశం అవ్వచ్చు. దీన్ని నువ్వు తెలుసుకో, దీన్ని నువ్వు మలుచుకో అంతే కదా దీని సారాంశం. ముందు మలుచుకో తర్వాత తెలుసుకో తెలుసుకో [laughing] తెలుసుకుంటేనే కదా మలుచుకుంటాం ఆ [laughing] ఆ రెండూ [laughing] end point Yeah yeah thank you
YouTube · audio
Truth about Life Changing Secrets | Best MOTIVATIONAL Podcast Telugu
Truth about Life Changing Secrets | Best MOTIVATIONAL Podcast Telugu
0:00 / 39:06