No transcript for this section.
Transcript begins at 0:00.
యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతామ్మి పరమమహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణాలకు నమస్ಕಾರాలు ప్రణామ సహస్రం సమర్పిస్తూ కోటి సమితి సత్యసాయి సేవా సమితిలో ప్రధానంగా కోటి సమితికి ఒక విశిష్టమైన ప్రత్యేకమైన పవిత్రమైన స్థానం ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటిది ఒక పవిత్రత అంతరంగిక పవిత్రత ఏ కార్యక్రమం చేపట్టినా ఓ కీర్తి కోసం కాకుండా ఒక పాపులారిటీ కోసం కాకుండా స్వామికి మేము నివేదించుకునేటువంటి ఒక విషయంగా భావన చేస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఒక వినూత్నమైనటువంటి విధానానికి శ్రీకారం చుడతూ అంతా స్వామే చేయిస్తున్నారు అనేటువంటి భావనతో శాస్త్రి గారితో మొదలై సమితి సభ్యులందరూ భక్తులందరూ ఒక్క మాట మీద ఒక్క వాట మీద ఒకే పరమాత్మ సత్యసాయి భగవానుడి మీద మనస్సును లగ్నం చేసి చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఎన్నేళ్లుగానో నేను చూస్తున్నా [గొంతు సవరించిన శబ్దం] ఇంత దివ్య ఆవరణంలో ఇంత సద్భక్తులైనటువంటి సత్సంగుల మధ్య స్వామిని ఏ క్షణాన తలుచుకున్నా అది పవిత్ర యజ్ఞమే కాబట్టి ఆ యజ్ఞంలో నేను ఒక నిరంతర భాగస్వామిని. ఎప్పుడూ ఆనందం కలుగుతుంది ఇక్కడికి రావాలని అనిపిస్తుంది. ఇవాళ దీన్ని ఏదో చాలా బిజీగా ఉన్నాం వద్దులే అని అనాలని అనిపించదు వెళ్లి వచ్చి మిగతా పనులు చేసుకుందాం అని అనిపిస్తుంది అది సమితి సభ్యులందరూ కూడా ప్రదర్శించిన ఇచ్చినటువంటి ప్రేమే కారణం. ఇక రెండవది ముఖ్యంగా బాల వికాస్ యువకులు ఉద్యోగార్థులు బాగా చదువుకున్న వాళ్ళు వీళ్లందరి కోసం ఒక పాయ సంగీత ప్రియత్వం రాసక్యం రెండోవైపు భక్తి భజనలు ఒకవైపు సాయి గాయత్రి విషయాన్ని మహా ఉజ్జమంగా స్వీకరించి దానిని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి వాడవాడలా అనేకమైనటువంటి నూతన గృహాలలో దాన్ని తీసుకు వెళ్లినటువంటి ఒక విశిష్టమైనటువంటి సమితిగా నేను కోటి సమితిని ఎప్పుడూ ప్రేమిస్తాను గౌరవిస్తాను. ఆ [గొంతు సవరించిన శబ్దం] దీని తర్వాత ఇవాళ ఈ పేరెంటింగ్ ఎక్సిబిషన్ లో మనం చేయవలసింది ఒకటే మన తల్లిదండ్రులు గొప్ప వాళ్లే కనుకనే మనం ఈ మాత్రమన్నా స్వామి ఆవరణంలో ఉండగలిగాం. మన పిల్లలకి మన తర్వాత వచ్చే తరానికి ఈ పేరెంటింగ్ నెమ్మదిగా దూరమైపోతున్నది. కుటుంబ వ్యవస్థ పర్చ్చబడిపోతున్నది, విచ్ఛిన్నం అయిపోతున్నది. తల్లికి తండ్రికి బిడ్డకి ఉండవలసిన సమన్వయం నెమ్మదిగా లోపిస్తూ ఉన్నది. ఆర్థిక సంబంధాలే నిజమైన సంబంధాలుగా భ్రమించే రోజులు వచ్చినాయి. అటువంటి సమయంలో తల్లి గర్భంలో బిడ్డ ఉండగానే వాడికి భగవంతుని యందు భక్తి కలిగేలాగా పవిత్రమైనటువంటి స్త్రీమూర్తులంతా కూడా ఆ తొమ్మిది నెలలు ఆ పది నెలలు శిశుదయమయ్యే దాక అతి భయంకరమైనటువంటి టీవీ అనేటువంటి ఒక రాక్షసుని మన వాకిట్లో నుంచి వెళ్లగొట్టగలిగినట్లైతే ఆ తల్లి భజనలలో, సత్సంగాలలో, సంకీర్తనల్లో, భగవన్నామస్మరణలో, పురాణ పఠణంలో మనస్సును నిమగ్నం చేసుకోగలిగినట్లైతే తల్లి తిన్న తిండే ఆ లోపల ఉన్న గర్భస్థ శిశువుకి తిండి. తల్లి ఆలోచనే బిడ్డడి ఆలోచన. తల్లి పీల్చే గాలి, ప్రాణవాయువు అన్నీ కూడా బిడ్డకి సంక్రమిస్తాయి గనుక ఏ రకమైన కాలుష్యం, భావ కాలుష్యం లేనటువంటి ఒక ఉదాత్త స్థితిలో స్త్రీమూర్తులంతా జీవించాలి. ఆ స్త్రీమూర్తులు అలా ఉండటానికి పురుషులంతా సహకరించాలి. ఇంట్లో ఒక పవిత్రమైన వాతావరణాన్ని సాయి రామ నామస్మరణాంచిత దేదులుగా ఉన్నట్లయితే ఒక జాతి ఉత్తమోత్తమమైన జాతి పుడుతుంది, నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే పుట్టిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ తల్లి గర్భంలోనే ఊపిరి పోసుకుంటున్నటువంటి వేళ మనం గనుక ఈ చిన్న చిన్న మెలకువలు పాటించినట్లయితే భగవంతుని యందు భక్తి, పరమేశ్వరుని యందు అపారమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి నమ్మకం ఈ రెండూ గనుక తల్లి నేర్చుకొని అనుభవించగలిగినట్లయితే భగవత్పరమైనటువంటి కీర్తనలు గనక వింటూ ఉన్నట్లయితే లోపల ఏర్పడేటువంటి శ్రవణేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు ఈ పదకొండే ఏకాదశ రుద్రులంటే. పైన బయటపెట్టే పదకొండు లింగాలు కావు ఇవి. ఆ ఏకాదశ రుద్రాత్మకమైనటువంటి ఈ జీవితం రుద్రుడు అంటే రెండు అర్థాలున్నాయి. ఒకటి కన్నీరు తెప్పించేవాడు అని అర్థం. ఆ రుద్రుడికే రెండో పేరు ఉంది కన్నీరు తప్పించేవాడు అని అర్థం అది. ఇది రుద్రాధ్యాయంలో మనం చక్కగా గమనిస్తాం. ఎందుకు తెప్పిస్తాడయ్యా అంటే మాలిన్యాలు పోవాలి గనుక, ఎందుకు తప్పిస్తాడు అంటే మనకు ఆనందం కావాలి గనుక. ఆ రెండూ ఇవ్వగలిగినటువంటి పరమాత్మని అన్నివేళలా మనస్సులో పెట్టుకొని సద్భావనతో గనుక చేయగలిగినట్లయితే ఇవాళ మనం ఈ ప్రాంగణంలో ఒక సరస్వతీ ప్రాంగణంలో మనం ప్రారంభించుకున్నటువంటి ఈ పేరెంటింగ్ ఎక్సిబిషన్ ఇది రెండు రోజులకే పరిమితం అన్నారు. సాధ్యం అయితే వర్కింగ్ డేస్ ప్రతిరోజూ ఆ ప్రిన్సిపాల్ ని అడిగి మిగతా స్కూల్స్ కూడా ఇక్కడికి వచ్చే ఏర్పాటు ఏదైనా చేస్తే, ఎందుకంటే ప్రారంభించాం దాన్ని పది మందికి అందించేటువంటి దిశగా స్వామి ఆ అనుగ్రహాన్ని మనకివ్వాలని నేను కోరుకుంటూ ఇది విజయవంతం అయి తీరుతుంది. ఎందుకంటే సంకల్పం స్వామిది.Execution స్వామిది, విషయం స్వామిది, బుద్ధ స్వామి, పరమాత్మ స్వామి. ఇంకా విజయం ఇంతన్ కాకేమవుతుంది? కాబట్టి ఎంతమంది వచ్చారని కాదు, ఎన్ని వేల మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేశారని కాదు, ఎంతమంది దీని నుంచి లాభం పొందారో. ఒక సమర్ధుడైనటువంటి గురువు గనుక అక్కడుండి ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఒక group గా పది, పదిహేను మందికి ఆ విషయాలన్నీ చెప్తూ నెమ్మదిగా సత్య సాయి భగవానుడి దివ్య ఆవరణంలో కనుక మన ఈ exhibition కనీసం ఒక డజను మందిని పుటపత్తికి వెళ్లేటటువంటి ఒక ప్రేరణ కలిగించినట్లయితే ఈ exhibition ఆ సార్థకత నిలుపుకుంటుంది. మళ్ళీ అతి త్వరలోనే కోటి సమితి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, స్వామి యొక్క అనుగ్రహం అండ దండ అన్నివేళలా ఈ సమితికి ఉండాలని నేను కోరుకుంటూ, ఇది సమితి అంటే స్వామి చెప్పారు, మితిలేనిది, అమితమైనది, పరిమితం ఎరగనిది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్న తర్వాత అదే నడిపిస్తుంది గనుక ఇది కోటి సమితుల పెట్టుగా నేను భావిస్తూ స్వామి అనుగ్రహం, కృతవృషణి అన్నివేళలా అందరిపై ఒక వృష్టిగా కురవాలని కోరుకుంటున్నాను. జాతస్య హి ధ్రువో మృత్యుః శరీరం వచ్చిందంటే ఎందుకొచ్చిందంటే పోవటానికి వచ్చింది. ఎందుకు పోతుందయ్యా అంటే పోవాలి గనుక పోతుంది. అయితే ఎన్నాళ్లున్నామని కాక, ఎన్నేళ్లున్నామని కాక ఎలా జీవించామన్నది ప్రధానం. మన వల్ల ఎవరికైనా హాని జరిగినా, ఎవరికైనా అననుకూలత ఏర్పడినా అది మన లోపమే కానీ మరొకడి లోపం కాదని భావిస్తూ ఒక ఉత్తమమైన జీవితాన్ని గడపాలి. ఇవాళ మన సాయి సోదరులు, వయస్సులో నాకు, ఆయనకి చాలా తేడా ఉంది. డెభై ఆరు సంవత్సరాలు సుమారుగా అయి ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది నారాయణ రావు గారంటే ఎవరో. కృష్ణ. శివంలో ఉంటారు. ఆయన నిన్న రాత్రి పన్నెండు గంటలకి స్వామిలో ఐక్యమైనారని ఇప్పుడే ఒక message వచ్చింది. చాలాకాలం నా కారులో నేను, ఆయన, నేను ఎవరి కారులో వెళ్ళేవాడిని కాదు. నా కారులో నేను వెళ్ళి సత్సంగం చేసి మా ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అది నా అలవాటు, నా నిష్ట. అయితే నారాయణ రావు గారు ఒకరోజున ప్రత్యేకంగా ఎన్నడూ మా ఇంటికి రాలేదు, వచ్చి అడిగారు ఒక మాట. "నేను మీ ఇంటికి దగ్గరలోనే ఉంటాను. ఓ చిన్న సేవ చేసుకోవాలి. రైల్ way సత్సంగనికి నేను మీతో వస్తాను. మిమ్మల్ని నేను తీసుకుని వెళ్ళి ఆ సత్సంగాన్ని నేను అనుభవించాలి. నా కారులో మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని మళ్ళీ ఇంటి దగ్గర దింపుతాను. ఈ ఒక్క సేవ ఇవ్వండి నాకు" అని అడిగారు. అది సేవేముంది, ఇద్దరం కలిసి వెళ్దాం, అంతకంటే ఆనందం ఉందా? అలాగే అన్నాను నేను. అయితే అది కేవలం ఒక రైల్ way station కి మాత్రమే పరిమితం కాలేదు. అది ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా నారాయణ రావు గారు తెలుసుకుని మా ఇంటికొచ్చి గత రెండు సంవత్సరాలుగా ప్రతి చోటికి తన కారులో నన్ను తీసుకెళ్ళి, అయితే నేను ఒక చిన్న condition పెట్టాను. "మీరు పెద్దవారు గనుక driving నేను చేస్తా. నా పక్కన మీరు కూర్చోండి. మీరు నా తండ్రి లాంటి వారు. మీరే drive చేస్తే దేని పెద్ద సేవ అక్కర్లేదు, అంత సేవ అక్కర్లేదు. మీరు రావటమే గొప్ప విశేషం." అలా సాగింది. నిజానికి మొన్న third Thursday నాడు రైల్ way లో సత్సంగనికి వెళ్ళాను. నాకో phone చేశారు. "నేను షిరిడి వెళ్తున్నాను. షిరిడి స్వామి దర్శనం చేసుకొని వస్తాను. ఈ ఒక్కరోజుకి మీరు వెళ్ళకండి. నేను miss కావటం నాకిష్టం లేదు. మళ్ళీ మూడో తారీఖే వస్తుంది. ఆ రోజున నాలుగో ఆ గురువారం అవుతుంది. మనం వెళ్దాం" అన్నారు. కానీ తెలియదు, నిన్న రాత్రి ఒక చాలా చిన్న అస్వస్థత, అది అస్వస్థత కూడా కాదు. నింద లేకపోతే పొందపోదు అని, ఏదో కారణం ఉండాలి కదా. అలా ఒక పది నిమిషాలు ఆయనకి vomitings అయ్యాయట. hospital కి తీసుకెళ్ళారు. He was declared dead. ఇవాళ ఆయన general manager South Central Railway కి ES గా పనిచేశారు. చాలా ఆ బయటపడకుండా స్వామి భక్తులందరికీ ఎంత సేవ చేశారో నాకు తెలుసు. చేసేది ఆయన, మేం చేశామని చెప్పుకునేవాళ్ళు పది మంది ఉంటారు. ఆయన మాత్రం ఎన్నడూ నేను చేశానని అనుకోలేదు. higher ups లో అది ఎట్లా చేస్తే ఆ పని జరుగుతుందో చక్కగా చేసేవారు, బాగా. స్వామి యందు అచంచలమైన విశ్వాసం, స్వామి యందే మనస్సును నిమగ్నం చేసుకున్నందువల్ల స్వామి బహుశా ఈ అనుగ్రహాన్ని ఈ మాఘ మాసంలో శివరాత్రికి ముందు ఈ సాయుజ్యాన్ని ఇచ్చారు. వాళ్ళ కుటుంబం కూడా చాలా చక్కని కుటుంబం. వాళ్ళందరికీ కూడా స్వామి ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని ఆ ఎప్పుడన్నా ఇలాగే కోటి సమితి అక్కడికి, ఇక్కడికి అనేక సమితులన్నింటికీ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అనేవారు, "నేతాజీ అన్నీ ఏమో ఎట్లా ఉన్నా చాలా బాగా జరుగుతాయి. చాలా ఆనందంగా ఉంటుంది అక్కడికి వెళితే" అని అనేవారు. ఇవాళ ఆయన స్వామిలో ఐక్యమైనారు. మనం విషాదం చెందవలసిన పనేం లేదు. ఎందుకంటే అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం. ధైన్యం లేని జీవితం గడపాలి. అనాయాస మరణం పొందాలి. అలా అయ్యో ఏం లేదే, రోగాలు లేవే, ఎలా పోయాడు అని కాకుండా ఏమీ లేకుండా పోతే ఎంత అదృష్టం. కాబట్టి ఆ స్వామి ఆ కుటుంబానికి పరిపూర్ణమైనటువంటి శాంతిని, ఒక ఉత్సాహాన్ని మళ్ళీ తమ, తమ జీవితాలు, తమ యాత్ర కొనసాగించడానికి అవకాశాన్ని స్వామి ఇవ్వవలసిందిగా స్వామిని ప్రార్థిస్తూ, మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ, ప్రపంచంలో ఇదంతా తలమీద జరిగిపోయే అనేక సన్నివేశాలు ఇవి. అందులో ఇది కూడా ఒకటి. కానీ అందరిలో, అందరితో మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, స్నేహంగా ఉండాలి. మనందరి లక్ష్యం ఒకటే సత్య సాయి భగవానుడే. ఆయనను మించి, ఆయనను కాదని ఇక్కడ ఏమీ పొందేది లేదు, పోగొట్టుకునేది లేదు. మనందరం ఈ సామూహికమైనటువంటి స్వామి కార్యక్రమాలలో ఇతోధికంగా పాల్గొంటూ స్వామి యొక్క అవతార వైభవంలో మనం కూడా కొన్ని క్షణాలు నిలవగలిగిన మహాదృష్టానికి ఆ అల్ అన్నివేళలా సంతోషపడుతూ ఈ ఆనంద యాత్రను మనం కూడా చక్కగా కొనసాగించాలని సర్వేశ్వరుడైనటువంటి స్వామికి మనసా, వచసా, శిరసా వందనములు తెలుపుతూ మీ అందరికీ సాయిరాం.
YouTube · audio
Parenting Exhibition - Sandesham
Parenting Exhibition - Sandesham
Source: P V S on YouTube
0:00 / 13:01