Skip to content
Transcript తెలుగు
[మృదువైన సంగీతం] వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగాన్ని శాసించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. మానవ దేహాన్ని తీసుకుని వచ్చి, అంశగా వచ్చి పరిపూర్ణమైనటువంటి ఒక మహా స్థితిలో జగత్తుకి కర్తవ్యబోధ చేసి మానవుడిలో దాగిన మాధవత్వాన్ని ఎట్లా అనుభవించాలో చెప్పినటువంటి జగద్గురు స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఆయన కంటే ముందు వచ్చినటువంటి శ్రీరామ, పరశురామ ఒక అవతారం అయితే, కృష్ణావతారంలో తాను తెచ్చుకున్న మరొక అంశ బలరామ అంశ. బలరాముడి ఆయుధం హలం అంటే నాగలి. అది వ్యవసాయ విప్లవానికి సంకేతం. పరశురాముడి చేతిలో ఉన్నది గొడ్డలి అంటే ఇంద్రియాలను నరుకుతూ అంటే ఇంద్రియాలను జయిస్తూ సంపూర్ణమైనటువంటి తపస్విగా మారటానికి పరశురామ గాథ అవతారం మనకు బోధిస్తుంది. ఇక శ్రీరాముడు సాక్షాత్తు నారాయణ మూర్తి అయినప్పటికీ కూడా మానవుడిగా ఉండటానికి దశరథ నందనుడిగా ఉండటానికి నిర్ణయించుకొని వచ్చినటువంటి మహత్పూర్ణ అవతారం రామావతారం. అయితే ఇవాళ శ్రీకృష్ణ అవతార వైభవంలో ఉన్నటువంటి తాత్వికత ఏమిటి? కృష్ణుడి కథ మనందరికీ తెలుసు, అది చెప్పుకోనక్కర్లా. తాత్వికత ఎక్కడ ప్రారంభమైంది? అవతార లీలా వైభవం ఎక్కడ ప్రారంభమైంది అంటే జన్మ ఎత్తగానే అసలు ఒక అతిమానుషమైనటువంటి శిశువుగా జన్మ ఎత్తాడు కృష్ణుడు. నాలుగు చేతులతో సకల సర్వ ఆభరణాలతో దేవకి హృదయంలో నుంచి పుట్టాడు. అంటే హృదయంలో నుంచి అంటే సంకల్పంలో నుంచి, భావనలో నుంచి, తలపులో నుంచి, తపస్సులో నుంచి, తితీక్షలో నుంచి, ఎదురుచూపులో నుంచి వచ్చినటువంటి అవతారమే కృష్ణావతారం. అయితే అప్పటికే ఏడుగురు పిల్లలను పోగొట్టుకున్నటువంటి దేవకి "మామూలుగా పుడితేనే నీ మేనమామ బతకనివ్వలేదు, నువ్విట్లా అతిమానుష్యంగా ఉంటే ఎట్లాగ? ఉపసంహరించుకో నీ రూపాన్ని, నీ ఒంటిమీద ఉన్న ఆభరణాలని" అని అన్నది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ప్రదర్శించినటువంటి తొట్టతొలి విశ్వరూపం ఏది అంటే దేవకి దేవికి. విశ్వరూపం అంటే విష్ణు రూపం అని అర్థం. విశ్వం అన్నా విష్ణువు అన్నా ఒకటే అని మనకు విష్ణు సహస్రనామం చెబుతుంది. కనుక విశ్వరూపంగా అంటే విశ్వము, ప్రపంచముగా ఒక రూపాన్ని తీసుకున్నవాడు కృష్ణుడు అని అర్థం. అంటే జగదీశ్వరుడు జగత్తులోకి వచ్చాడు అని మరొక అర్థం. సరే తల్లి కోరిక మీరకు, దైవ నిర్ణయం ప్రకారం అవతార వైభవంలో ఒక ప్రథమ స్పర్శ ఏమిటంటే తనలో తాను తెచ్చుకున్నటువంటి, తనలో ఉన్నటువంటి, తనతో ఉన్నటువంటి దైవీ శక్తులన్నింటినీ కూడా ఉపసంహార కాండ చేశాడు. అది ప్రప్రథమ లీల. లీలా అదే, విశ్వరూప అవతార విభూతి కూడా అదే. అయితే ఆయన అక్కడ ఉండటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? జగత్తులోకి రావాలి. అప్పటికప్పుడే కంస సంహారం జరగకూడదు. కనుక ఆరోజు రాత్రి అది శ్రావణ బహుళాష్టమి. బహుళాష్టమి నాటి రాత్రి కాలరాత్రి, భయంకరమైన రాత్రి. కాలరాత్రి అంటే చెడ్డ రాత్రి అని కాదు, కాలము రాత్రిగా కనిపిస్తున్నది కాలరాత్రి. కాబట్టి చెరసాల తలుపులన్నీ తెరుచుకొని యమునా నది పాయలు చీలి శ్రీకృష్ణ పరమాత్మకి దారి చూపించింది. ఆకాశం మేఘావృతమై వర్షం పడుతున్నది. పైన ఆయన వెళుతున్నటువంటి ప్రదేశం ఏమిటి అంటే వ్రజభూమి. నందుడికి ఆనందాన్ని కలిగించటానికి యశోతా, యశోదా దేవికి పుత్ర ప్రేమను పంచటానికి వెళుతున్నటువంటి తొట్ట తొలి అడుగు. అడుగు ప్రకారమే శ్రీకృష్ణుడు వ్రజభూమికి చేరుకున్నాడు. తదనంతర కాలంలో మహాభారత సంగ్రామానికి ముందు అర్జునుడితో కృష్ణుడు ఒక మాట అన్నాడు, అది మనం గుర్తు చేసుకోవాలి. "ఆయుధం పట్టుకోను, నేను యుద్ధం చెయ్యను, అంతే. నన్ను కోరుకునేటట్లయితే రెండు conditions apply" అంటానే అలా అన్నాడు. మరి ఆయుధము ధరించక, యుద్ధము చేయక కృష్ణుడు నాకెందుకు అనుకోలే అర్జునుడు. ఆయన ఏమన్నాడో తెలుసా అర్జునుడు? "నువ్వు అవన్నీ పట్టుకోనక్కర్లా, ఊరికే నాతో రథంలో ఉండు, అవన్నీ చేసేది నువ్వే"నన్నాడు. కనుక మనం కోణంలో గనక ఆలోచించినట్లయితే వ్రజభూమికి వచ్చాడు. చూడండి, పూతన, వృతాసురుడు తదదిగా గలిగినటువంటి రాక్షసుల సంహారం అంతా కూడా ఆయుధం ధరించకుండానే చేశాడు. శకటాసురుడ్నైతే గాలిలో చంపేశాడు. అంటే వాడంతట వాడు చనిపోయేట్టుగా చేశాడు. ఒక బాలుడు కదా గాలిలో పైకి ఎగిరి శకటాసుర సంహారం చేశాడు. పూతనకి, పూచిన తలువు పూతనఆ పూతన దగ్గర పాలు తాగుతూ ప్రాణమే పీల్చాడు. అంటే ఆయుధం ధరించనటువంటి ప్రమాణాన్ని ఆయన లీలా కాండలోనే, దీనిని వ్రజలీల అంటాం. వ్రజలీలలో పరమాద్భుతమైనటువంటి వైభవాన్ని ప్రదర్శన చేసి తాను చేయబోయేటువంటి ధర్మ సంస్థాపన, ధర్మ రక్షణ, ధర్మ ఆచరణ జమిలిగా చేసినటువంటి ఉదాత్తమైన వైఖరి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. ఇది తొలి ఘట్టం. ఇక తర్వాత మథురాలయంలో ఉంది. మథురకు వెళ్ళాడు. అక్రూరుడితో పాటు వెళ్ళాడు. అక్రూరుడు అంటే క్రూరుత్వం మరుగైన సాధు జంతువు, సాధువు వ్యక్తి అనుకోండి. అక్రూరుత్వం తెలియని జంతువు అంటే మానవుడు కూడా జంతువే కాకపోతే బుద్ధి చేత మానవుడయినాడు. కంసవధం చేశాడు. అప్పుడు ఆయన వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలు. బలరాముడితో కలిసి వెళ్ళాడు. బలరాముడు చూస్తూ ఉన్నాడు. ఆయనకి-- ఆయన అవసరం అక్కడ లేదు. మరి ఎవరు చేయాలి అంటే కంస చాణూర మర్దనం ఇప్పుడే అనుకున్నాం. చాణూరుడు అనేటువంటి వాడిని, వీళ్లందరినీ కూడా అక్కడ ఆయుధం ధరించకుండా కేవలం ముష్టిఘాతంతో సంహారం చేశాడు కృష్ణ పరమాత్మ. రెండు, ఇక మథురా అయిపోయింది. మథుర లీల-- లీలా కాండ అయిపోతున్నటువంటి వేళ ఆయన గోప గోపికలందరికీ కూడా తన సాంగత్యాన్ని, సాలోక్యాన్ని, సామిప్యాన్ని, సాన్నిధ్యాన్ని అనుగ్రహించి అక్కడ ఆయన ఎత్తిన పర్వతం గోవర్ధన పర్వతం. ఇది ఒక అద్భుత లీల. 'గో' అంటే జ్ఞానము అని, వర్ధించడం అంటే వృద్ధి చేయటం అని ఆమర జీవనం సాగిస్తున్నటువంటి వ్రజ బాలకులందరికీ కూడా జ్ఞాన వరదానం చేయాలని నిర్ణయించుకొని ఇంద్రుడికి భయపడి జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఇక భయం లేకుండా, అంటే ఇంద్రుడు అంటే భయం లేకుండా, వరుణుడు అంటే భయం లేకుండా జీవించటానికి చేసిన పరమాద్భుత లీల గోవర్ధన పర్వత-పర్వతాన్ని ఎత్తడం. గోవర్ధన పర్వతాన్ని, గిరిని ఎత్తాడు వాడు. ఎందుకు ఎత్తాడు అంటే గురి ఎవరు అంటే గురువే గిరి. గిరియే గురువు. అంటే మనకి ఒక గురి చూపించేవాడు గురువు గనుక గురుతత్వాన్ని, గురుభావాన్ని, గోవర్ధన పర్వతాన్ని లీలా మానుషంగా ఎత్తాడు. అక్కడ ఆయుధం లేదు. గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలు మీద నిలబెట్టాడు ఆయన. దాని కింద అందరూ కూడా వచ్చి తమను తాము రక్షించుకున్నారు. ఇక మిగిలింది కాళింది. అంటే కాళీయ మర్ధనం. కాళింది నదిలో విష పూరితమైనటువంటి జలాలలో ఒక్కసారి లంఘించి పడగల మీద బాలుడైనటువంటి బాలకృష్ణుడు నృత్యం చేస్తూ పడగలలో దాగినటువంటి విషాన్ని, నృత్యం చేయాలంటే పాదం వేసి తొక్కాలి. తొక్కుతూ విషాన్నంతా పోగొట్టి ఒకే ఒక్క వరం ఇచ్చాడు. చూడు ప్రపంచంలో జీవుడికి అంటే మానవుడికి విషము తలకెక్కుతుంది. వాడు పాము కావక్కర్లేదు, అహంకారం మనిషికి తలకెక్కుతుంది. గర్వం, దంభం, ప్రగల్భం ఇవన్నీ కూడా అలాగే కక్ష, కార్పణ్యం, బగ, వగ వీటన్నింటినీ కూడా సంహారం చేయాలి అని చెప్తూనే కాళీయ మర్ధనం చేసి విషము లేనటువంటి కాళీయుని మడుగు వదిలిపెట్టి వెళ్లిపొమ్మన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ లీలా కాండ అంతా కూడా కథా కథనంగా చెప్పుకోవటమే కాదు, దీని వెనుక ఇంత దివ్యమైనటువంటి విశేషాలున్నాయి. ఇక తర్వాత శ్రీ కృష్ణ పరమాత్మ మరొక లీల వైపు ఆయన సాగి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కంసవధ అయిపోయిన తర్వాత ఉగ్రసేన మహారాజు కృష్ణుడికి తాత. కనుక మథురాను గల సామ్రాజ్యాన్ని ఉగ్రసేన మహారాజుకు పట్టాభిషేకం చేశాడు. ఏది? ఎనిమిదేళ్ల వయసులో. అంటే రాజు కాగలిగిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నేను రాజుగా ఉండదలుచుకోలేదన్నది కృష్ణావతారం. మరి ఏం చేస్తాడాయన అంటే ఆయన రాజులను తయారు చేస్తాడు. King maker is always greater than a king అని ఒక మాట ఉంది. అంతే కదా! కింగ్ అంటే మొయ్యాలి. కింగ్ మేకర్ కి ఆయనకేం భయం లేదు. చంద్రగుప్తుడిని చాణక్యుడు చేసినట్టుగా అట్లాగే మహాత్ములంతా కూడా ఎవరినో ఎన్నుకొని, ఎంచుకొని, ఎన్నుకొని వాళ్ళకి తమ శక్తిని, బుద్ధిని ఇచ్చి వాళ్ళని రాజుల్ని చేసి ధర్మ సంస్థాపన చేస్తారు. నిజానికి కృష్ణుడు చేసింది కూడా అంతే అదే. ఇక జీవుడికి అహంకారం, మమకారాలు రెండూ జీవ లక్షణాలు. రెండింటినీ ఎలా పోగొట్టాలి అంటే నలకూబరుడు, శాపవశాత్తు వచ్చినటువంటి గంధర్వుడు. వాళ్ళిద్దరినీ రెండు తాటి చెట్లుగా భావన చేసింది యశోద. మాట వినటం లేదని తాడు కట్టింది పొట్టకి. కడదామని అనుకున్నది. పరిగెత్తుతున్నాడు. ఆయన వెనక తాడు తీసుకుని ఆవిడ పరిగెత్తుతున్నది. ముడి వేద్దామంటే ముడి దాకా తాడు వస్తున్నది. ముడి వేయటానికి వీలు లేకుండా ఉన్నది. అప్పుడు ఆవిడ అడిగింది, "నాయనా! నిన్ను కట్టేయకపోతే నేను ఇంట్లో పని చేసుకోలేను. చాలా అల్లరివాడివి నువ్వు. నిన్ను నేను కట్టలేకపోతున్నా. నిన్ను ఎలా కట్టాలో నాకు చెప్పమని" అడిగింది. ఎవరైనా చెప్తారా? అన్నాడు, "అమ్మా! నీ ముందున్నటువంటి వాడు కేవలం మానవుడు అనేటువంటి భ్రాంతిని, కృష్ణుడు నా వాడే అన్నటువంటి మమకారాన్ని రెండు వదులుచుకో. రెండు అగుడాలు తెగిపోతే నేను నీకు ముడి పడతా" అన్నాడు. అంటే చుక్కుతా అన్నాడు.ఎట్లా కంటికి కనిపిస్తూ పారాడు తారాడు ఒక శైశవ అంటే బాల్యం ద్వారా ఆత్మానుభూతి నిస్తున్నటువంటి కృష్ణుడిని కాదు అని ఎలా అనుకోగలదు అప్పుడు బలరాముడు "మను తింటున్నాడమ్మా నువ్వు ఎంత వెన్న పెట్టినా" అని ఫిర్యాదు చేసినప్పుడు నోటి తెరవమన్నది. పద్నాలుగు లోకాలు దర్శనం ఇచ్చాడు తాను ఎవరో చెప్పాడు. చెప్పినప్పుడు అది రెండవ సారి చేసినటువంటి విశ్వరూపం అయినా మాయావరణంలో ఉన్నటువంటి యశోద "నాయనా! నువ్వు నాకు బాలకృష్ణుడిగానే కనిపించు ఇదేమిటి నాకు భయమేస్తున్నది" మనకందరికీ తెలుసు పద్యం "కలయో వైష్ణవ మాయయో" కదా ఇదేదైనా విష్ణు మాయలా ఉన్న తప్ప నీ నోట్లో పద్నాలుగు గొనుగులు ఎంత వాడివి నీ నోరు ఎంత అన్నది కానీ అది రెండవ విశ్వరూప దర్శనం ఇచ్చాడాయన. ఎవరెవరికి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇస్తే శ్రీకృష్ణ తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలరో ఆయా సందర్భాల్లో కృష్ణుడు తనను తాను దాచుకోలేదు ఇది రెండవది. అప్పుడు ఆమె కృష్ణుడికి "మహానంద సర్వస్వ మే తన్ నమస్తాత్" అంటూ పిల్లవాడి వెనక నమస్కారం చేయకుండా దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని లాలించి పాలించి తాడేసి కట్టింది. అంటే కట్టకూడదు కదా మరి ఆయన విష్ణువు అని తెలిసి కూడా ఎందుకు కట్టింది అంటే విష్ణువు అని తెలియటం తత్వం స్థితి నుంచి బయటపడి పోవటం మళ్ళీ భౌతిక మాయావరణం. మాయావరణంలో ఒక్కసారి ముడి వేసింది రోటి కట్టింది రోలు తీసుకుని రెండు తాటి చెట్ల మధ్య నుంచి వెళ్లిపోతున్నప్పుడు రెండు చెట్లు పడిపోయి వాళ్ళ శాపవిముక్తి జరిగింది. అంటే శ్రీకృష్ణుడి యొక్క లీల ప్రతి లీల వెనుక మనకి పైకి రాక్షసుడిని చంపాడు మనిషిని చంపాడు పూతను చంపాడు అంటాం చంపలేదు వాళ్ళకి విదేహ విముక్తి కలిగించాడు మళ్ళీ ఇక జన్మే లేనటువంటి ఒక మహా స్థితిని కృష్ణ పరమాత్మ అతి బాల్యంలో ప్రదర్శన చేసి నిరూపణ చేశాడు కృష్ణున్ని మనం అలా అర్థం చేసుకోవాలి. ఇక పాండవులు కౌరవులు ఇదంతా మనకు తెలుసు. ఇక్కడికి వస్తే కృష్ణుడు తదనంతర కాలంలో యోగీశ్వర కృష్ణుడిగా రూపాంతరీకరణం చెంది అంటే తనను తాను ఆవిష్కరించుకొని ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలి అది కృష్ణుడి యొక్క అవతార లక్ష్యం లక్షణం కూడా. బాల్య క్రీడ అయిపోయింది ప్రౌఢ క్రీడ అయిపోయింది ఆయన ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు అని అంటే అణిమాది అష్టసిద్ధులను తన దగ్గర ఉంచుకున్నాడు పెంచుకున్నాడు తనతోనే వాటి ద్వారా జగత్తును నడిపించాడు అని అర్థం. ఎనిమిది కూడా సిద్ధులవి. అలాగే పదహారు వేల మంది గోపికలతో ఏకకాలంలో దర్శనం ఇచ్చాడు పరమాత్మ. పదహారు వేల మంది ఎవరంటే షోడశ కళా పూర్ణుడు అంటే పదహారు కళలతో పరిపూర్ణంగా శోభిల్లుతున్నటువంటి కృష్ణ పరమాత్మ పదహారు వేల అంశాలుగా ఒక్కొక్క గోపికకి వాళ్ళు చేసుకున్నటువంటి తపస్సు వాళ్ళు ఎదురు చూసినటువంటి సామీప్యం పరమాత్మకి దగ్గరగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారో ఏకకాలంలో అనుభవంలోకి తెచ్చినటువంటి రాసలీల వైభవ స్ఫూర్తిలో వాళ్ళంతా పునీతులైనారు. ఇక రాధా, రాధా మాధవం అయినటువంటి కథంతా కూడా అది ఊహాజనితమైన కాదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ చెరసాలలో నిశ్శబ్దంగా పుట్టాడు. కెవ్వున కేక వెయ్యలేదు ఏడుపు లేదు చిరంకరమైనటువంటి మందహాసం తో జన్మ ఎత్తాడు. మరి ఎట్లా ప్రపంచానికి ఆయన ఆగమించాడు వచ్చాడు అని తెలిసేది ఎట్లా? అంటే శబ్ద బ్రహ్మం కావాలి. నిశ్శబ్దం చీల్తే తప్ప శబ్దం బయటకు రాదు. శబ్దము బ్రహ్మము కావాలి అంటే అంటే manifest కావాలి unfold కావాలి unveil కావాలి తెలియాలి అంటే ఏం జరగాలి అంటే శబ్దము బ్రహ్మమై రావాలి. ఎవరు శబ్దం ఎక్కడ ఉన్నది చూడండి శబ్దం ఎప్పుడూ కూడా ఒక ప్రవాహంలో ఉంటుంది sound wave అంటాం. sound wave పేరే రాధ. రాధని మనం తిప్పి చదువుకున్నట్లయితే సంస్కృత భాష ప్రకారం అది ధార అయింది. ధార అంటే అనాహత ధార అంటే నిశ్శబ్దానికి మూలమైనటువంటి ఆకాశం నుంచి శబ్ద మూలమైనటువంటి బ్రహ్మాండం వరకు కూడా నిరంతరము సాగేటువంటి శబ్ద బ్రహ్మ స్వరూపమే రాధ. అంటే శబ్దము లేకపోతే కృష్ణ పరమాత్మ యొక్క చైతన్యం ప్రపంచానికి అర్థం కాదు. వాక్యే లేకపోతే మానవుడు అభివ్యక్తి చేయలేడు. మానవుడు అభివ్యక్తి చేయాలి అంటే మాట్లాడాలి అంటే వాక్కు కావాలి. వాక్కు కావాలి అంటే మూలాధారం నుంచి అగ్ని స్వరూపమైనటువంటి ఒక చేతన బయటకు రావాలి. చేతన విశుద్ధ చక్రం కంఠ స్థానం వరకు రావాలి. కంఠ స్థానం వరకు వచ్చినప్పుడు దానిలో లయ ఒక శృతి ఒక శుభ సుందరమైనటువంటి ఒక ప్రవాహ వేగము అతివేగము మిత వేగము అమిత ఆవేగము ఇవన్నీ కలిస్తే తప్ప అది వాక్యం కాదు. మరి దీనికి ఎవరు ఆధారం కావాలి అంటే శబ్దమే ఆధారం కావాలి. శబ్దము నాదంలో నుంచి పుట్టింది నిశ్శబ్దంలో నుంచి పుట్టింది structured గా అయినప్పుడు దానికి మనం సంగీతం అని పేరు పెట్టుకున్నాం. అది పక్కన పెడితే శ్రీకృష్ణుడి యొక్క వేణుగానము అంటాం వేణునాదము అంటాం వేణు సంగీతము అంటాం ఎందుకనంటే అది పరమాత్మ పెదవుల నుంచి ఉద్భవించేటువంటి అనాహతమైన నాదామసందోహం కాబట్టి దాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి జీవుడిని మేల్కొలిపేది కాబట్టి జాగ్రదవస్థలో తురీయ అని అంటే పరమోన్నతమైనటువంటి సమన్యాస స్థితిని ఇవ్వగలిగినటువంటిది వేణువు కనుక వేణునాదం వేణువు ఒక్కటే ఆయన ధరించాడు వేణువు ఒక్కటే ఆయన ఊదాడు ప్రపంచానికి అంటే ధారా సమన్వితమైనటువంటి కృష్ణ తత్వం ఉన్నదో తనను తాను శబ్ద బ్రహ్మముగా తనలో లీనం చేసుకుని లయం చేసుకొని దానిని వేణువు ద్వారా ప్రపంచానికి సమ్మోహనమైనటువంటి నానాద సందోహాన్ని నాదమయం చేశాడు అందుకే మనం ఎప్పుడూ ఒక శ్లోకం చదువుతాం 」「జిహారం జిహారం సుజనేన మౌధ్యం దుహారం దుహారం సుధాం వేణునాదైహి లిహారం లిహారం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమేతన్ నమస్తాత్」 ఇది లీలాశకుడి పాడుకున్నాడు అయ్యా ఎన్ని వేల లక్షల సార్లు విన్నాను నీ వేణుగానాన్ని వేణునాదాన్ని ఎప్పుడూ విన్నా అమృతం తాగినట్లుగా ఉన్న తప్ప దీనికి ఏమన్నా ఒక అలుపు అలసట కాసేపు ఆగుదామని అదేమీ ఉండదా అని ఆశ్చర్యపోతున్నాడు అలాగే 」「జిహారం జిహారం సుజనేన మౌధ్యం」 బాలకృష్ణుడిగా ఉన్నటువంటి మౌధత్వమే నీకు ఎన్నేళ్ళు వచ్చినా అట్లాగే ఉంటావా? త్రిదశుడుగా ఉంటావా? అని అడుగుతున్నాడు అంటే ఆనంద పడుతున్నాడు ఆశ్చర్య పడుతున్నాడు ఇది భక్తి పారమ్యంలో కలిగేటువంటి ఒక భావావేశం అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రాధని శబ్ద బ్రహ్మం చేసుకుని తనను తాను ఆవిష్కరించుకుని రాధాకృష్ణ మైనటువంటి అద్వైత ప్రతిపాదనతో జీవితాన్ని కొనసాగించాడు కృష్ణుడు లీలా క్రండ చేసి సుమధుర మాధుర్య సుందరమైనటువంటి నాద ప్రవాహంతో జనానికి అంటే జనావళికి ఆనందాన్ని కలిగించడమే అవతార పరమార్థం కాదు ప్రేమ శక్తి మహావిష్ణు యొక్క అంశ ఇవన్నీ కూడా పరిపూర్ణంగా జగద్రక్షణ కోసము ధర్మ రక్షణ కోసం వినియోగపడాలి మనం అనుకున్నాం తదనంతర కాలంలో మనం ఆయన్ని యోగీశ్వరుడిగా భావన చేశామని యోగం అంటే ఏమిటి? కర్మ, భక్తి, జ్ఞానం మూడు ప్రధానమైనటువంటి యోగాలు గనుక ఒక్కసారి ఐతిహాసికంగా చారిత్రకాత్మకంగా చూసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ మూడు విభాగాలుగా మూడు విధాలుగా తనను తాను ఆవిష్కరించుకుని మూడు యోగాలను పరిపూర్ణం చేశాడు అవతారం చేయలేదట్లా ఎట్లా అంటే భారతం తీసుకుండి మహాభారతం నిండా ఉన్నటువంటి కృష్ణుడు లౌకిక కృష్ణుడు యుద్ధ రచన చేస్తాడు, రాయబారం చేస్తాడు, మంచి మాట చెప్తాడు, శత్రు సంహార క్రీడ చేస్తాడు, ఎవరెవరిని ఇక్కడ కూడా మళ్ళీ ఆయుధం ధరించడు ఎవరెవరిని ఎప్పుడూ ఎవరి చేత చంపించాలో ఆయనకు తెలుసు తాను చేయవలసిన పని లేదు జీవుడికి కర్మ ఉన్నది పరమాత్మకి కర్మ లేదు కర్మ లేదు గనుక కర్మానుభవం లేదు కర్మానుభవం లేదు గనుక కర్మ ఫలమూ లేదు కర్మ ఫలం లేదు గనుక ఉన్నదంతా కర్మఫల త్యాగమే అదే మనం అంటాం 」「వాసాంసి జీర్ణాయ యథా విహాయ」 మనం చదువుకుంటాం అంటే కర్మఫల త్యాగం సర్వోత్కృష్టమైనది కాబట్టి పాండవులు అనబడేటువంటి ధర్మ స్వరూపుల వైపు కృష్ణ పరమాత్మ నిలబడ్డాడు ఎవరితోనూ ఆయన కలవబడలేదు ఐదుగురు కలబడేట్టుగా చేశాడు వాళ్ళకి కావలసినటువంటి ధర్మరాజుకు కావలసినటువంటి జూత వ్యసనాన్ని, భీముడి ఆవేశాన్ని, అర్జునుడి సవ్యసాచిత్వాన్ని, నకురుడి యొక్క దూరదృష్టిని, సహదేవుడి యొక్క దివ్యత్వాన్ని అంటే అనేక శక్తులు కలిగిన వాడు సహదేవుడు ఇక నకురుడు జ్యోతిషశాస్త్రంలో అఖండమైనటువంటి ప్రజ్ఞా గలవాడు అంటే సర్వ శాస్త్రాలని సమన్వయం చేసుకొని వాటిని ఆధారం చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ తన లీలా క్రండ నుంచి సుమధుర మాధుర్యమైనటువంటి గాన నాద వైభవంలో నుంచి కర్మయోగంలోకి ప్రవేశించాడు కర్మయోగము అంటే యోగించి చేశాడు ఎవరితో? జగత్తుతో జగత్తుతో కూడి పాండవులతో కూడి ధర్మంతో కూడి జరుగుతున్నటువంటి అనాచారము, అస్పష్టత, అవిద్య, అహంకారము, దంభము, గర్వము, ప్రగల్భము వీటన్నింటినీ కూడా జయించేటువంటి దిశగా మహాభారత సంగ్రామం వరకు ఆయన నడిపిస్తూ వెళ్ళాడు అంతేకాదు భీష్ముడైతే పితామహుడిగా కురుపీతామహుడిగా కీర్తింపబడుతున్నాడో అతని యందు దాగినటువంటి అనేకమైనటువంటి Negativities అన్నింటినీ కూడా శరీరంలో ఉన్న రక్తం పోయేదాకా అంపశయ్య మీద పడుకోబెట్టి శ్రీకృష్ణ పరమాత్మ తన మూలమైనటువంటి విష్ణు దర్శన మహావిష్ణు దర్శనాన్ని ఇచ్చి 」「త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప」 అని పోతనామాత్యులవారు దర్శనం చేస్తాడు అంటే భీష్ముడు కృష్ణుడు మామూలు కృష్ణుడు కాదు ఈయన విష్ణువే అన్న భావన కలిగినప్పుడు విష్ణు సహస్ర నామాన్ని చదివాడు అంటే చదివించాడు కృష్ణుడు చూడండి ఎక్కడా విష్ణు సహస్రనామం కృష్ణుడు రాయలా వ్యాసవారు రాశారు రాసేవాడిని ఒకడిని పెట్టుకున్నాడు ఆయన చెప్పటానికి ఒకడిని పెట్టుకున్నాడు అంతా తనకేమీ తెలియనట్టుగా వినమ్రంగా చేతులు కట్టుకుని విన్నాడు ఇది విష్ణు సహస్రనామ వైభవం వెనుక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కర్మ యోగం 」「అంతా నిమిత్తమాత్రం మదస్వయసాచిన్」 నువ్వు నిమిత్త మాత్రుడివి అని చెప్తూ ఉంటూ తాను ఎంత నిమిత్త మాత్రుడో మహాభారత సంగ్రామంలో ప్రధాన భూమిక వహించాడుపంచభీములందరూ ఏదో ఒకరి చేతిలో మరణించాలి గనుక ఆయన ఎంచుకున్న మహా దివ్య ఆయుధం భీముడు. భీముడి ద్వారా పంచ-- మిగతా నలుగురు భీముల్ని, భీముడు అంటే ఏం లేదు పరాక్రమం ఉన్నవాడు అని. దుర్యోధనుడు, కీచకుడు ఇలాంటి జరాసంధుడు వీళ్లంతా కూడా. అయితే శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని ఎంత పరిపుష్టం చేశాడంటే రాయబారానికి వెళ్ళాడు. రాయబారానికి వెళ్ళినప్పుడు చెప్పవలసిన మంచి మాటలు నాలుగు చెప్పాడు. గురుస్థానంలో అందరూ పెద్దవాళ్ళే. భీష్ముడు పెద్దవాడు, దృతరాష్ట్రుడు పెద్దవాడు. మామూలు లౌకిక వ్యవహారంలో దృతరాష్ట్రుడు మామ. ద్రోణాచార్యులు వీళ్లంతా గురుస్థానీయులు. భీష్ములవారు పితామహుడు. అయినా ప్రౌఢమైనటువంటి కృష్ణ పరమాత్మ గురుస్థానాన్ని తీసుకుని చెప్పవలసిన అన్ని మాటలు చెప్పినా చెవికెక్కనప్పుడు తన శక్తి ఏమిటో, తాను ఎవరి వైపు ఉన్నాడో, తాను ఎక్కడ ఉంటే అధర్మం నశిస్తుందో చెప్పటానికి మళ్ళీ మరొక్కసారి విశ్వరూప దర్శనం ఇచ్చాడు. ఎక్కడ? కురుసభలో. సభాంతరాళంలో తాను ఇచ్చినటువంటి విశ్వదర్శనాన్ని అంటే విశ్వరూప దర్శనాన్ని అనుభవించిన వాళ్ళు ఇద్దరు. ఒకడు పుట్టు గుడ్డి అయినటువంటి అంటే జనుశాంధ్రుడు అంటాం దృతరాష్ట్రుడు ఒకడు. అతడికి కళ్ళు ఇచ్చాడు. మంచో చెడో ఆచార్య స్థానము, పితామహ స్థానము, లోపల భగవంతుని యందు భక్తి కలిగిన వాడు గనుక భీష్ముడికి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ దర్శనం చేశారు. కానీ దృతరాష్ట్రుడికి ఇచ్చిన దర్శనంలో భీష్ముడికి ఇచ్చిన దర్శనం సమయం చాలా తక్కువ. చూశాడు, కళ్ళు మూసుకున్నాడు. దృతరాష్ట్రుడు చూస్తూనే ఉన్నాడు, ఆనందపడ్డాడు. కానీ మాయావరణ విశేషం చేత తన రాజ్యమూ, తన స్థానమూ, తన సింహాసనమూ, తన కొడుకులు, తన తమ్ముడి కొడుకులైనటువంటి పాండవులు శత్రువులుగా భావన చేసి జీవ భావన చేత, "పరమాత్మ! నిన్ను చూసిన కళ్ళతో నేను ప్రపంచాన్ని చూడను. మళ్ళీ నాకు అంధత్వాన్ని ఇవ్వమని" అడిగాడు. ఇది మరొక విశ్వరూప దర్శనం. అంటే ముందు చెరసాలలో ఇచ్చాడు, యశోదకి ఇచ్చాడు, చెరసాలలో దేవకికి ఇచ్చాడు. అది one to one అంటాం. ఏకాంతంలో ఇచ్చాడు. యశోదకి ఏకాంతంలో ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేప్పటికి సభలో ఇచ్చాడు. సభలో ఏకాంతం నించి ఇద్దరికీ ఇచ్చాడు. కథ అయిపోయింది రాయబారం. తర్వాత మహాభారత సంగ్రామం. ఇదంతా జరుగుతున్నటువంటి వేళ జ్ఞానం చెప్పాలి ప్రపంచానికి. ఎంతసేపు కథలూ, మహిమలూ, లీలలూ, అది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, మాయమైపోయింది, అది అట్లా వచ్చేసింది. ఇది కాదు కదా కృష్ణ పరమాత్మ. జ్ఞానయోగాన్ని చెప్పటానికి ఆయన ఎంచుకున్న ప్రదేశం రణరంగం. అక్షౌహిణి సేనలన్నీ మోహరించు ఉన్నటువంటి వేళ భగవద్గీత అంతా చెప్తూ చెప్తూ అనేక విషయాలు మాట్లాడుతూ ఏడు వందల శ్లోకాలు చెప్పినప్పుడు విశ్వరూప దర్శనము ఇచ్చినది ఎవరికంటే మళ్ళీ ఏకాంతంలో అర్జునుడికే ఇచ్చాడు. అనంత బాహువులతో అనంతమైనటువంటి సమస్త జీవులు కూడా తన యందు ఎట్లా పుట్టి, మెట్టి, నశించి పోతున్నారో దివ్య రూపమైనటువంటి దర్శనాన్ని ఇస్తే అర్జునుడు కూడా ఏమన్నాడో తెలుసా? "ఈ విశ్వరూపాన్ని నేను ఎక్కువ సేపు చూడలేకపోతున్నాను. నీవు ఉపసంహరించుకొని మామూలు మా బావ కృష్ణుడిగా గడిపించమని" అడిగాడు. చూశారా, భగవంతుడు వరం ఇచ్చినా తీసుకోగలిగిన శక్తి మనకుండాలి. యోగం ఉంది గనుకనే అర్జునుడికి ఇచ్చాడు. మళ్ళీ ఎక్కడ ఇచ్చాడు? జన సమూహంలో ఇచ్చాడు. సభలో నుంచి రణరంగంలో, రణరంగంలో లక్షల కొలది సైనికులు. విచిత్రం ఏమిటంటే, అనుగ్రహం ఏమిటంటే, విభూతి ఏమిటంటే, మామూలు మాటల్లో మహిమ ఏమిటంటే ఒక అర్జునుడికి తప్ప విశ్వరూపం అక్కడున్న ఎవరికీ కనబడలేదు. అందరూ ఒక పెయింటింగ్ లో ఉన్నటువంటి బొమ్మల్లాగా నిశ్చలమై, నిశ్చేష్టులై, అసలు జవసత్వాలు లేనివారై బొమ్మలై నుంచున్నారు. అటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ జ్ఞానయోగ వరదానం చేశాడు. "యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ" అనే శ్లోకంతో భగవద్గీతను మొత్తం కూడా పూర్తి చేశాడు. తర్వాత అర్జునుడికి ఉత్తర గీత చెప్పాడు. తర్వాత ఉద్ధవుడు, తన స్నేహితుడు ఉద్ధవుడికి గీత చెప్పాడు. కేవలం భగవద్గీత మాత్రమే కాదు ఉత్తర గీత, ఉద్ధవ గీత ఇవన్నీ కూడా చెప్పి కృష్ణ పరమ-- గీత అంటే పాడుకోవటానికి వీలైనది అని ఒక అర్థం. గాన భావంతో కూడి ఉన్నది అని అర్థం. సంగీత లయాత్మకమైనది అని మూడవ అర్థం. నాల్గవది, సర్వేంద్రియాలకి లోపల ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగ నాడులకి ఒక ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి స్వరూపం గనుక దానికి గీత అని పేరు పెట్టారు. పాడుకోదగినది, పాడవలసినది, పాడుకుంటూ అర్థం చేసుకోవలసినది అని అర్థం. ఇక్కడ మహాభారత సంగ్రామం అయిపోయింది. ద్వాపరకు వెళ్ళిపోయినాడు. ద్వాపర యుగంలో ద్వారకకి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి ముందు బలరాముడు అంతర్ధానమైనాడు. యదువంశంలో కూడా ఎవరూ కూడా మిగలకుండా తన కోసం "అయ్యో" అని అనేవాడు కూడా లేకుండా తెలుగులో అంటామే, పోతే ఏడిచేవాడు లేడు, బయట ఈడిచేవాడు లేడు అంటాం. అటువంటి స్థితిని తాను కల్పించుకున్నాడు. తన కోసం ఒక్క, అంటే దేహాత్మ భావన లేదు. వీళ్లంతా నా వాళ్ళు, ఇది నా కులము అన్న భావన లేకుండా యదుకులాన్ని కూడా పూర్తిగా సముద్రంలో ముంచేసేట్టుగా చేసి తాను ఒక నిర్మలమైన, నిశ్చలమైన ఏకాత్మ భావనలో ఏకాంతంగా తాను ఇచ్చిన అవతారాన్ని పరిసమాప్తం చేసుకొని కర్మయోగానికి, జ్ఞానయోగానికి ఒక అద్భుతమైనటువంటి సంయోగాన్ని, దానికి యోగము అని పేరు. రెండు యోగాలని ఏకకాలంలో ప్రపంచానికి ప్రదర్శితంగా అంటే demonstrate చేసినటువంటి మహా పరిపూర్ణ అవతారమే శ్రీకృష్ణావతారం.క యోగము, జ్ఞాన యోగము రెండు అనుకున్నాం మరి ఇంకా భక్తి యోగం లేదా కృష్ణ పరమాత్మ కంటే? ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయన ఎనిమిదవ ఏట మధురా నగర్ ప్రవేశం చేస్తున్నప్పుడు ఆయన కుబ్జ అనేటువంటి ఒక దివ్యాంగిని అంటే ఆవిడ శరీరం కురూపి ఆమెకు రూపం లేదు. అవయవం ఎక్కడ ఉండాలో లేదు. అటువంటి ఆమెకి ఒక వృత్తి ఉండేది. వృత్తి ఏమిటంటే పూలమాల చేసి కంసుడి అంతఃపురంలో ఇచ్చి రావడం ఆవిడ వృత్తి. అటువంటి కుబ్జ ని ఈయన చూశాడు. ఈయన జగన్మోహనుడు ఆవిడ కుబ్జ. జగన్మోహనుడు ఎప్పుడూ పరమాత్మే. జీవుడు ఎప్పుడూ కుబ్జే. స్థాయి నుంచి జగన్మోహన స్థాయికి వెళ్ళాలి అని చెప్పటానికి అంతమంది సౌందర్యవంతులైనటువంటి స్త్రీమూర్తులందరూ కూడా ఒక బారులు కట్టి అంతఃపురం లోకి అనేకమైన పరిచర్యలు చేయడానికి వెళ్తుంటే పూలమాలలు కట్టుకొని వెళుతున్న కుబ్జ మీద శ్రీకృష్ణ పరమాత్మకు ఒక అనుగ్రహం కలిగింది. దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఏదో ఒక మిష-- మాట్లాడాలి కదా. మాట్లాడటం మిష, మిషన్ వేరే ఉంది. మిషన్ ఏమిటంటే పూలమాల తాకినట్టుగా కుబ్జను తాకాడు. స్పర్శ ఇచ్చాడు. అంతవరకు వెళ్ళినటువంటి స్త్రీమూర్తుల అందరికంటే సౌందర్యము రాసిపోసినట్టుగా ఆమె శరీరం మారిపోయింది. అంటే కృష్ణ పరమాత్మ దేహ పరమైనటువంటి అంగవైకల్యాన్ని వదిలిపెట్టి, అది అందం. అందంగా లేదు అంటాం. అందం వేరు మళ్ళీ చెప్పుకోవాలి సౌందర్యం వేరు. అందం దేహంతో పాటు మారిపోతుంది, మాసిపోతుంది, ఏదో ఒకరోజు జారిపోతుంది. కానీ సౌందర్యం మారేది కాదు. మారనిది సౌందర్యం. అది దానిని వస్తువును చూడగానే లోపల ఒక దివ్యమైనటువంటి భావన కలిగించేది. అంటే ఇంద్రియాలను అన్నింటినీ శమింపజేసి మనస్సుని ఆపి కేవలం ఆత్మానుభూతిని కలిగించేటువంటి దాని పేరు, యోగం పేరే సౌందర్యం. ఇంద్రియాలను రెచ్చగొట్టి ఇది నాకు కావాలి అనిపించేది అందం. జీవుడు అందగాడుగా ఉండాలా? సౌందర్యవంతంగా ఉండాలా? నేర్చుకోమని చెప్పటానికి శ్రీకృష్ణ పరమాత్మ కుబ్జకి దివ్యమైనటువంటి శరీరాన్ని, సౌందర్యవంతమైన శరీరాన్ని అనుగ్రహించినటువంటి ఒక లీల. అది లీలాకాండలో ఒక భాగమే. ఇక్కడ కృష్ణ పరమాత్మ తన శరీరాన్ని ఒక అడవిలో ఎవరూ గుర్తించడానికి, ఎవరూ రావటానికి వీలు లేని ప్రదేశంలో తనమీద తాను తనతో తాను యోగించి శరీరాన్ని వదిలిపెట్టాడు. సందర్భాలన్నీ ఆయనే సృష్టించుకున్నాడు. కాలి బొటనవేలు నీలమేఘశ్యాముడు కదా! కాలి బొటనవేలు ఆడిస్తున్నాడు. ఆడిస్తున్నటువంటి వేళ వేటగాడు వచ్చాడు. ఒక నీలిరంగు పిట్ట ఏదో కదులుతున్నట్టు వానికి కనిపించింది. అక్కడ కృష్ణుడు కనిపించలా. బొటనవేలు కదలికలను బట్టి బాణం వేశాడు. బాణం వెళ్లి బొటనవేలును గుచ్చుకున్నది. శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తికి కారణభూతమైనటువంటి వేటగాడు. వేటగాణ్ణి తానే తెచ్చుకున్నాడు. బాణాన్ని తానే తెచ్చుకున్నాడు. బొటనవేలు తానే ఆడించాడు. తన శరీరాన్ని తానే వదిలిపెట్టాడు. నిజానికి భారతంలో ఇచ్ఛామరణం పొందినటువంటి వారు అంటే తన ఇచ్ఛతో తాను అనుకున్న సమయంలో తన శరీరాన్ని వదిలిపెట్టిన వాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ. రెండూ అయినాయి కదా! మరి ఇక భక్తి యోగం ఎక్కడున్నది? ఇదంతా భక్తి యోగమే. కుంతిది భక్తి, భీష్ముడిది భక్తి కాస్త ముందు వెనకలుగా ఎట్లా ఉన్నా, అలాగే ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు ప్రధానంగా వీళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి దైవాంశగా, దైవంగా, పరదైవతంగా భావన చేశారు. అయితే కేవల లౌకిక వ్యవహారంలో మునిగిపోయిన కారణంగా కౌరవ సంస్థానంలో వాళ్ళు పరాణ భుక్కులుగా అక్కడ పరిచర్యలు చేసేటటువంటి వారుగా, ఆస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులుగా వాళ్ళు కృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోయినారు. ఆయన శక్తిని తెలుసుకోగలిగారు అంతే. కానీ ఒక్క విదురుడు మాత్రం భక్తి యోగంలో కృష్ణుణ్ణి తన ఆంతరంగికంగా ఆవిష్కరించుకున్నాడు. అందుకనే రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు, "నా ఇంటికి ఎందుకు రావాలి? అవేవో మాటలు జరుగుతుంటే దానికి, దీనికి సంబంధం ఏముంది? మనమంతా బంధువులం మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యాలి" అన్నప్పుడు ఆయన, "కాదు, కాదు నేను పాండవుల పక్షాన వచ్చాను. నేను ఎట్లా వచ్చినా నేను మీకు చెందని వాడిని క్షణంలో." "మరి ఎవరికి చెందాలి? పాండవులక్క ఇక్కడ ఇల్లు లేదు. వాళ్ళే లేరు. నీ ఇంటికి రాకూడదు. కాబట్టి భక్తుడైనటువంటి విదురుడి ఇంటికి వెళ్తాను" అన్నాడు. విదురుడి ఇంటికి వెళ్ళాడు. కుంతిది భక్తి, విదురుడిది భక్తి, ద్రౌపదిది భక్తి, పాండవులది భక్తి. ఇవన్నీ ఆయా సన్నివేశాలను బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, అర్హతను బట్టి కృష్ణ పరమాత్మని భక్తి యోగంలో అనుభవించారు భారతంలో ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది. మరి భక్తి యోగంలో కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎక్కడ కనిపెట్టాలి? భారతంలో లేదు. ఇక్కడ భగవద్గీత అంతా యోగంలో ఉన్నది. భక్తి అంటే ఏమిటో చెప్పాడు గానీ దాన్ని అనుభవించే స్థితిని చెప్పలేదు. దాన్ని మనం జాగ్రత్తగా విచారణ చేయాలి. ఎనిమిది పురాణాలు రాసి, వేద విభజన చేసి, చతుర్వేద సారాన్ని ప్రపంచానికి ఇచ్చి, ఐదు వందల యాభై ఎనిమిది బ్రహ్మసూత్రాలు ఉన్నాయి అని చెప్పివిష్ణు సహస్ర నామాన్ని ఒక ఆత్మగీతంగా, ఆర్త గీతంగా, సుషుమ్నా గీతంగా భీష్ముడు అంపశయ్య మీద మనోగతంగా పాడుతూ అనుకుంటూ ఉన్నప్పుడు దానిని వ్రాసి, వ్యాసులవారైతే ఒక పరమాద్భుతమైనటువంటి ఆనంద రేఖాని అనుభవించారో ఆయనకు ఒకానొక సమయంలో చింత కలిగింది. చింత ఏమిటంటే, "ఇంకేదో చేయాలి, ఇంకా చేయవలసింది మిగిలి ఉన్నది అని అనిపిస్తున్నది. మరి నాకు సమయం ఉండకపోవచ్చు కదా, అది ఏమిటి? ఎందుకని పరతత్వాన్ని నేను సంపూర్ణంగా అనుభవించలేకపోయినాను?" ఏది రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏడు వందల శ్లోకాలలో ఉన్నటువంటి భగవద్గీతని transmit అంటే ప్రసారం చేసినప్పుడు దానిని ఉడిసిపట్టి భగవద్గీతగా "వ్యాసేన గ్రథిత పురాణమునినా మధ్యే మహాభారతం" ఒక గ్రంథ రూపంలో ఇవ్వగలిగాను గానీ, కృష్ణుడి యొక్క పూర్ణత్వాన్ని, భగవంతుని యొక్క తత్వాన్ని, ప్రేమని నేను అనుభవించలేదు అని చింత కలిగినటువంటి సమయంలో నారదులవారు వచ్చి చింతను గ్రహించి "వ్యాస మహర్షి, మీరు లోకోత్తరమైనటువంటి వాఙ్మయ స్వరూపులువి, లోక గురువులు. మీరు చేయవలసిన పని ఒకటున్నది. కృష్ణ తత్వాన్ని చెప్పారు, కృష్ణ శక్తిని చెప్పారు, కృష్ణుడి సౌందర్యాన్ని చెప్పారు, కృష్ణుడి యొక్క ఆనంద స్వరూపాన్ని లోపల అనుభవించారు. కానీ శ్రీకృష్ణుడి యొక్క ప్రేమను మీరు ఇంకా పొందలేదు, ఇంకా మీ అనుభవంలోకి రాలేదు గనుక అటువంటి అనుభవాలు పొందిన వారందరి కథలు కలిపి ఒక భాగవతం వ్రాయాయి" అని చెప్పారు. అప్పుడు మా సరస్వతీ నదీ తీరం పక్కన ఉన్నటువంటి రేగు పళ్ళ తోటలో కూర్చొని ఆయన భాగవత రచనకు ఉపక్రమణం చేశాడు అంటే ప్రారంభం చేశాడు. భారతాన్ని ఒక్కడు రాయలా. గణేషుడు, వినాయకుణ్ణి ఇవాళ భాషలో stenographer వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడేవరూ లేరు. కాబట్టి రాయసగాడుగా ఆయన్ని పెట్టుకొని భారతం రాశాడు. కానీ ఇక్కడ మళ్ళీ చూడండి ఏకాంతంలో, రేగు పళ్ళ తోటలో భాగవతంలో ఉన్నటువంటి పరమ రహస్యాలని సృష్టి రహస్యంతో ప్రారంభించి అనేకమైనటువంటి ఏకాదశ స్కంధం అంటే కల్పవృక్షానికి పదకొండు శాఖలు, పదకొండు స్కంధాలు ఉన్నాయి. పదకొండు స్కంధాలలో మొదటి నుంచి సృష్టి పరిణామం ఎలా వచ్చింది, జీవుడు, పుట్టుక ఇవన్నీ చెప్తూ చెప్తూ చెప్తూ వెళ్లి అనేకమైన భాగవత కథలని అంటే మనకు పరిచయమైన గజేంద్ర మోక్షణం. మోక్షము అన్నా, మోక్షణము అన్నా, మార్గము, మార్గణము అన్నా అన్నీ రెండు పర్యాయపదాలే, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అది. ప్రహ్లాద చరిత్ర, వామనావతార ఘట్టం ఇటువంటివన్నీ భక్తుల కథలన, అంబరీషుడి కథ ఇవన్నీ చెప్తూ చెప్తూ వెళ్లి దశమ స్కంధం దగ్గర ఇగో ఇవన్నీ చెప్పి "దశమ స్కంధము కృష్ణ మూలము శుకాలాపాభిరామం". శుకము అంటే చిలుక. ఒక రాచిలుక పలికినట్లుగా, వేదమూర్తి పలికినట్లుగా లలితమైన, లలిత స్కంధం అది. మంచి చిగురుగా ఉన్నటువంటి లేలేత కొమ్మ. కొమ్మ మీద భక్తి అనేటువంటి దాని మీద పరమాద్భుతంగా ఆవిష్కరించాడు కృష్ణ, వ్యాసులవారు. దేనిని? కృష్ణ తత్వాన్ని. ఏకాదశ స్కంధంలోకొచ్చేప్పటికి మన వాళ్ళంతా దశమ స్కంధం చేసి భాగవత పారాయణం చేశామంటారు. ఏకాదశ స్కంధం అసలుది, అక్కడ ఉన్నది. దానిని చదవాలి. అప్పుడు శ్రీకృష్ణ తత్వం, జీవుడు అందుకోవలసిన శిఖరం ఇవన్నీ కూడా తెలుస్తాయి గనుక ఇదంతా భాగవతం రాశాడు. 'భా' అంటే భక్తి, 'గ' అంటే జ్ఞానం, 'వా' అంటే వైరాగ్యం, 'త' అంటే తత్వం, 'ము' అంటే ముక్తి. భాగవతం గనుక చదివినట్లయితే భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తులని జీవుడు ఏకకాలంలో కానీ క్రమంగా సాధించుకోగలడు అని చెప్తూ భాగవతుల కథల సంపుటి భాగవతం అయితే శ్రీ మహావిష్ణువు, కృష్ణుడికి మూలమైనటువంటి మహావిష్ణువు ఎలా వచ్చి భక్తుణ్ణి ఆదరించాడో, రక్షించాడో, ప్రపన్నుడయినాడో ఇవన్నీ కూడా మనకి కథా కథన రూపంలో ద్వైతాద్వైత మార్గంలో భక్తి పారంయాన్ని అంచులకి తీసుకువెళ్లి ఒక శిఖర స్థాయిలో మనల్ని ముంచెత్తినటువంటి ఒక భక్తి రస ప్రవాహమే భాగవతం. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదించినటువంటి భక్తి యోగంలో ఒక ఆర్తజన రక్షణ ఉన్నది. భక్త పరిపాలకుడయినాడు. ఒక ఉత్సాహం ఉన్నది, ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది, ఆర్తంత్రణ పారాయణత్వం ఉన్నది. అన్నిటా ఒక విరాట్ మూర్తిమత్వమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యత్వాన్ని పూర్ణంగా ఆవిష్కరించినటువంటిది భాగవతం. కనుక భారతమంతా కృష్ణుడు కర్మయోగం యొక్క demonstration. భాగవతమంతా శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించిన భక్తుల యొక్క భక్తి రస ప్రవాహం. అది భక్తి యోగం. మూడవది భాగవతం. మూడవది భగవద్గీత. భగవద్గీత అంతా మూడింటినీ కలిపి యోగ ప్రవాహంగా, యోగ త్రివేణిగా ఆవిష్కరించిన శ్రీకృష్ణ పరమాత్మని ఈవేళ మనం స్మరించాలి. కృష్ణుడికి వెన్న నైవేద్యం పెట్టాము అంటాం. కాస్త లోకంలోకొచ్చి విచారణ చేద్దాం. కృష్ణుడికి వెన్న ఇష్టము అంటాం. కదా? తిన్నాడో లేదో మనకు తెలియదు. ఎందుకని ఇష్టము? దాని సంకేతార్థం ఏంటంటే అరచేతిలో గనుక వెన్నని పెట్టుకున్నట్లయితే ఎట్లా నెమ్మదిగా కరిగిపోతుందో, భక్తుడి హృదయం కూడా అలాగే కరగాలి భగవంతుడి పట్ల. భగవంతుడికి కరగటమే లక్షణం, కదలటమూ లక్షణమే. మాట అన్నది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. భగవంతుడికి రెండే లక్షణాలు ఉంటాయి. ఒకటి కదలటం, రెండవది కరగటం.ఈ రెండింటి-- ఇది రెండూ జరిగేటువంటిది వెన్న పరంగా గనుక కృష్ణుణ్ణి వెన్న దొంగ అని మనం అంటాం. వెన్న దొంగ అంటే ప్రతి ఇంటికి ఇంటింటికీ కే వెళ్లి గోప స్త్రీలందరినీ కూడా భౌతిక అవస్థ నుంచి బయట పడేసి ఒక ఆధ్యాత్మిక స్థాయిలో నిలబెట్టాడు. అలాగే చీరలు దొంగిలించాడు అంటారు. అదేం చెప్తాం మనం? అంటే మానాభిమానం దాటి మీరు ఆత్మ స్వరూపులుగా నిలకడ చెందండి అని చెప్తారు. అలాగే ఇక్కడ దొంగిలించాడు, వస్త్రాలను ద్రౌపదికి అవసరమైనప్పుడు ఇచ్చాడు. అంటే ఇచ్చేవాడు ఆయనే, తప్పించేవాడు కూడా ఆయనే. అది రుద్రాంశంలో ఉన్నటువంటి అంశం గనుక శ్రీకృష్ణ పరమాత్మని బహుముఖీనమైనటువంటి స్థాయిలో మనం కేవల లీలా కాండ మాత్రమే కాక, కృష్ణుడి యొక్క పాటలే కాక, కృష్ణుడి భజనలే కాక, శ్రీకృష్ణ తత్వాన్ని, దానిలో దాగిన మాధుర్యాన్ని మనం అనుభవించాలి. జీవుడిగా, సాధకుడుగా ప్రపంచం విసిరే ప్రతి సవాలుని ఎదుర్కొని జీవితాన్ని అధ్యాత్మ వైపు నడిపించుకోవాలి. గమ్యమైనటువంటి ఆత్మ స్థితి వైపు జీవుడు నడవాలి. ప్రస్థానంలో ఎన్నో అవమానాలు, అవహేళనలు, అననుకూలాలు ఎన్నో ఏర్పడతాయి. అన్నింటినీ అధిగమించాలి. కృష్ణుడిది మనం అనుకున్నంత మధుర గాథ మాత్రమే కాదు. అది మధుర విషాద గాథ. ఆయనను అవమానించినట్లు ఎవరినీ ఎవరూ అవమానించలేరు. ఆయనను కులం చేత, గుణం చేత, రూపం చేత, భావం చేత, తత్వం చేత అనేక విధాలుగా ఎన్ని అవహేళనలు చేసినా తన లక్ష్య గమ్యాన్ని సిద్ధించుకున్నటువంటి పరిపూర్ణ శిద్ధావతారం. ఇక్కడ కొసమెరుపుగా ఒక్క మాట. ఆయుధము ధరించను అన్నాడు. యుద్ధము చేయను అన్నాడే మరి శిశుపాలుడి విషయంలో సుదర్శన చక్ర ప్రయోగం ఎందుకు చేశాడు అనేది ఒక ప్రశ్న. కదా? అక్కడ కూడా ఏదో చూస్తూనో చూపుతూనో ఎట్లాగో చంపవచ్చు కదా? మరి సుదర్శన చక్రాన్ని ఎందుకు పంపించాడు అంటే సుదర్శన చక్రం యొక్క శక్తి ఏమిటో కౌరవులకు తెలియాలి. నిజంగానే కృష్ణుడు గనుక సుదర్శన చక్రం ధరించి రణరంగంలో రథసారథ్యం వహిస్తూనే దానిని ప్రయోగిస్తే శిశుపాలుడి తల తెగి ఎట్లా నేల మీద పడిందో అన్ని అక్షౌహిణీ సేనల యొక్క అలాగే కౌరవులందరి యొక్క తలలు తెగి నే-- నేల మీద పడతాయి అని demonstrate చేయటానికి మాత్రమే ఒక్క శిశుపాలుడి యొక్క ఆహ్ మరణంలో కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని వాడాడు. అది కూడా తాను వెళ్లి దాన్ని ప్రయోగించలే. ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం దూషిస్తామో అనేకమైన శక్తులు భగవంతుని చుట్టూ ఉన్నటువంటి శక్తులన్నీ కూడా వనగూడి శక్తివంతమై దుష్ట సంహార క్రీడకి అవే ఆహ్ శ్రీకారం చుట్టి వెళతాయి. అంటే సుదర్శనము కంటికి కనబడకుండా ఉన్నది. ఎందుకు? కృష్ణుడు మానవుడిగా ఉన్నాడు. సుదర్శన చక్రం విష్ణువు అయితేనే అది కనబడుతుంది. కానీ ఇక్కడ శిశుపాలుడు దూషిస్తూ ఉన్నాడు. వాడు ప్రపంచంలో ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఒక అనాచారాన్ని గనుక సహించినట్లయితే అటువంటి శిశుపాలురు ఎందరో పుడతారు. ఇక భగవద్ దూషణ జరుగుతుంది గనుక దూషణ ప్రక్రియను ఆపటం కోసం సుదర్శన చక్రం అనే ఒక రూపాన్ని, శక్తిని, ఒక speedని, ఒక centrifugal force ని తనను తాను సంతరించుకొని వెళ్లి శిశుపాలుడి యొక్క కంఠాన్ని తెంపింది. కంఠం అంటే విశుద్ధ చక్రం నుంచి వాడు అక్కడి దాకా వెళ్ళాడు. భగవంతుడు వాక్కు ఇస్తాడు. కంఠం ఇస్తాడు. భగవంతుని సంకీర్తన చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, సత్యాన్ని బోధించాలి, సత్యాన్ని ఆచరించాలి, అంతేగాని కంఠం వచ్చింది కదా అని, భగవంతుడు ఇచ్చాడు కదా, బాగుంది కదా అని పరదూషణకు దానిని వాడకూడదు అని చెప్పటానికి విశుద్ధ చక్రం దాకా వెళ్ళిన శిశుపాలుడికి ఆహ్ మరణాంతం చేసింది సుదర్శన చక్రం. అక్కడ కూడా ఆయన ఆయుధాన్ని ధరించలే. వెళ్ళబోతుంటే కృష్ణ పరమాత్మ అనుజ్ఞ కోరింది సుదర్శన చక్రం. ఆయన కంటి చూపుతో ఒక సరే అన్నట్టుగా ఒక అనుజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆయుధం ధరించను, యుద్ధము చేయనన్నటువంటి కృష్ణ పరమాత్మ పరస్పర విరుద్ధమైనటువంటి రెండు శక్తుల మధ్య, రెండు ప్రాపంచిక శక్తుల మధ్య అధర్మము కౌరవులు, ధర్మము పాండవులు మధ్యలో యోగీశ్వరుడై శ్రీకృష్ణ పరమాత్మ స్థిమితుడై, త్రికూట నాముని స్థిమితే అంతరంగే అంటాం. త్రికూటంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నాడుల మధ్య యోగ స్థితిలో యోగా రూఢులై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తాను తీసుకున్నటువంటి అవతారాన్ని లీలా కాండతో ప్రారంభించి జ్ఞాన కాండతో ముగించి భక్తి యోగంలో భక్తి రసాయనంలో దానిని రసమాలయం అన్నాడు వ్యాసులవారు. శుకదేవుడి చేత పరీక్షిత్తుకి భాగవతం చెప్పించాడు. ఇవన్నీ కూడా ఒక్క జాతి మాత్రమే భారత జాతి మాత్రమే సంపాదించుకున్నటువంటి ఒక పురా వైభవం కాబట్టి, ఈవేళ శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణ తత్వాన్ని అనేక రీతుల మనం అనుభవిస్తూ మనం కూడా మన జీవిత రణరంగాన్ని దాని మధ్యలో జ్ఞాన యోగాన్ని, భక్తి యోగాన్ని, నిరంతరమైనటువంటి కర్మ యోగాన్ని ఆచరిస్తూ మనం కూడా యోగమూర్తులమై త్రిమూర్తులమై సంపూర్ణమైనటువంటి జ్ఞానము మూర్తులమై ఇక్కడ మన జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలి, పరిపూర్ణం చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మని కృష్ణం వందే జగద్గురుం. జగత్తుకు గురు స్వరూపంగా ఎన్ని యోగాలు తన జీవితం మొత్తం పణం పెట్టి demonstrate చేశాడు. నూట ఇరవై ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం జీవించినప్పుడు జీవన కాలంలో కృష్ణ పరమాత్మ రథసారథి అయినప్పుడు అంటే భారత సంగ్రామ వేళకు ఆయన వయస్సు ఎనభై తొమ్మిది సంవత్సరాలు. అర్జునుడి వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరాలు. అప్పటికే భీష్ముల వారి వయస్సు నూట ఇరవై ఏళ్ళు. నూట ఇరవై ఏళ్ళకి ఆయన అయిపోయింది. కానీ సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఈవేళ మన లెక్కలో నూట ఇరవై ఆరు ఏళ్ళు మానవ దేహంలో ఉన్నాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి మనసా, వచసా, శిరసా మరొక్కసారి ప్రణమిల్లుతూ ఈవేళ ఆహ్ ప్రపంచమంతా కృష్ణ జయంతి అంటే కృష్ణుడు అంటే ఆనందం, కృష్ణుడు అంటే ఆకర్షణ, కృష్ణుడు అంటే శక్తి. నిరంతరం వ్యవసాయం. ప్రపంచం వ్యావ-- భారతదేశం ప్రధానంగా వ్యావసాయిక దేశం కాబట్టి ఆయన అన్నగారైనటువంటి బలరాముడి యొక్క హలాన్ని ఆశ్రయిద్దాం. మంచి మాటలు చెప్పటానికి గళాన్ని ఆశ్రయిద్దాం. మంచి వాక్యాలు రాయటానికి కళాన్ని ఆశ్రయిద్దాం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య శక్తిని మన యందు కూడా ఆవాహనం చేసుకోవటానికి మన జీవితాన్ని మహా సుదర్శన చక్రం వలె మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలని భావన చేస్తూ అటువంటి యోగాన్ని, ప్రాప్తిని భగవంతుడు మనందరికీ కూడా అనుగ్రహించాలని, మళ్ళీ శాంతి ప్రేమలు ప్రపంచంలో ఉండాలని, యతో ధర్మస్తతో జయః. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఎప్పుడూ జయమే ఉంటుంది అన్న భావనతో మీ అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభ సందర్భాన శుభకామనలు తెలియజేస్తూ మంగళాశాసనం చేస్తూ కృష్ణం వందే జగద్గురుం. [outro jingle]
YouTube · audio

Krishnam Vande Jagathgurum

Home

Krishnam Vande Jagathgurum

Source: SATHYA PEETHAM on YouTube

0:00 / 50:32