Skip to content
Transcript తెలుగు
ఏది సత్యం అంటే, నువ్వున్నావన్నది సత్యం. నువ్వు అంటే శరీరం కాదు. ఎందుకంటే, నీ శరీరం కూడా పోయేదే. నీవు పోయినా నీవు ఉంటావే అది నేను. నేను, నేనైన నేను అన్నది జలల్లమూడమ్మ. నేను, నేనైన నేను. నేనుగా మేనులో ఒక అనసూయాదేవిగా కనిపిస్తున్న నేను. నేనైన ఆత్మనైన అసలు నేను సత్పదార్ధాన్ని నేను. ఎంత అందమైన మాట చూడండి. నేను, నేనైన నేను. మనం మన ఆలోచనలన్నీ మేను దగ్గర, ఇంద్రియాల దగ్గర ఆగిపోయినటువంటి కారణంగా మనం ముందుకు వెళ్లలేకపోతున్నాం. చింత కట్టిపడేస్తున్నది. చదువుకుంటున్నాం, చదువు పూర్తవుతుందో కాదో, distinction లో pass అవుతామో కామో, ఉద్యోగం వస్తుందో రాదో, పెళ్లవుతుందో కాదో, పిల్లలు పుడతారో పుట్టరో, ఇల్లు కట్టుకుంటామో లేదో, ఆనందం ఎక్కడుంది? ఇది ఒక చింత ప్రవాహం ఇది. దీనికి అడ్డుకట్ట వెయ్యాలి అంటే మార్గం ఒకటే. చింతకు విరుగుడు చింతనే. ఇవేవీ నాకు కావాల-- కావాలంటే అవి ఏర్పడతాయి, అక్కర్లేదు అనుకుంటే ఏర్పడవు. అంతే కదా. అట్లా ఎప్పుడైతే మన మనస్సుని మనం నియంత్రించుకోగలుగుతామో, పూజ వలన, వాక్కు వలన, భావన వలన, జపతపాదుల వలన, నిత్యపూజ వలన, సమర్పణ వలన, శరణాగతి వలన, వినయం వలన, నిరంతర చింతనా భూమికలోకి వెళ్ళిన కారణంగా మనకి ఒక మనస్సు ఏర్పడుతుంది. మనస్సు తహతహ ప్రపంచం వైపు ఉండదిక. ఎటువైపు ఉంటుందంటే అంతర్ముఖం కావాలి అని చెప్తుంది. ఇది చింతనకి కడమెట్టు. చిట్టచివరి మెట్టు. మొదటి మెట్టు మాత్రం చింతనలోకి వెళ్ళాలి. నిరంతర చింతనాత్మకమైనటువంటి భావ పరిధిలోకి మనల్ని మనం నడిపించుకుంటూ సానందంగా, అద్భుతంగా గనక మనం వెళ్లగలిగితే, దానిని మించిన మరొక వస్తువు లేదు అని అంటూ భగవాన్ శ్రీ రమణులు క్రమాత్ చేయండి. పూజలు వద్దని గానీ, స్తోత్రాలు చదవద్దని గానీ, జపతపాదులు మానమని గానీ ఆయన చెప్పలే. ఇవన్నీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని మెట్లు మెట్లుగా మీరు భావన చేసి దాటుతూ గనక వెళ్లినట్లయితే, చింతన వైపు మీ మనస్సు వెళ్లినట్లయితే, అక్కడ మీ మనస్సు ఆగినట్లయితే, చింతనా భూమికలో అనేకమైన సమాధానాలు మీ అంతట మీరే పొందగలరు అని భగవాన్ మనకి చాలా చక్కగా, చాలా స్పష్టంగా చెప్తూ, ఇంకో మాట ఏమంటున్నారంటే, అసలు జగత్తుని ఈశ్వరుడిగా భావించు. జగత్తు వేరు, ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు అనుకోకు. ఎందుకని అంటే, జీవుడు జగత్తులో ఒక పరమాద్భుతమైనటువంటి సృష్టికి సంకేతంగా నిలబడ్డాడు. ప్రతీకాత్మకం మనమంతా. సృష్టికి మూలం ఏంటంటే వ్యష్టి. వ్యష్టికి మూలం ఏంటంటే సృష్టి. ఇది రెండూ బింబ-ప్రతిబింబ భావనలు. అంటే మనము మన ప్రతిబింబం. మనము మన ముందున్న అద్దం. అద్దంలో మన బొమ్మ. అద్దంలో మనం అద్దం ముందు నిల్చుంటే మన బొమ్మే మనకు కనపడుతుంది. ఇంకొకరి బొమ్మ కనపట్టలే. కాకపోతే అది బొమ్మ. అచేతనమైన బొమ్మ. అద్దానికి ఇవతల నుంచున్న మనం మాత్రం సజీవమైన, చైతన్యవంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మ. కాబట్టి బొమ్మ, బ్రహ్మల నడుమ ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని, జగత్తుని ఈశ్వరుడిగా నువ్వు భావించు, అభేదంగా భావించు. ఎందుకనంటే, ఈశ్వరుడు జగత్తును సృష్టించాడు. ఇక్కడ ఒక చిన్న విచారణ చేయాలి మనం. సృష్టికి ముందు ఒక వస్తువు ఉంది, ప్రపంచంలో. వస్తువు పేరు సత్తు. సత్తులో నుంచి ఒకటి సృష్టింపబడింది గనుక, ఒకటి నిర్మితమైంది గనుక దానికి సృష్టి అని పేరు పెట్టారు. సృష్టిలో నుంచి ఒకటి బయటకు ప్రవేశించింది గనుక దానికి విశ్వము అని పేరు పెట్టారు. అంటే సత్తులో నుంచి సృష్టి, సృష్టిలో నుంచి విశ్వము ఏర్పడింది. విశ్వంలో నుంచి ప్రపంచము ఏర్పడింది. ప్రపంచము పంచభూతాత్మకంగా ఏర్పడింది. గాలి, నీటి, నింగి, నిప్పు, ఆకాశం ఇవన్నీ కూడా. ఐదింటితో కూడి ఉన్నది గనుక దాన్ని ప్రపంచం అన్నారు. five elements జడంలో అవే ఉన్నాయి, అజడంలో కూడా అవే ఉన్నాయి. దాటిన తర్వాత సంసారం ఏర్పడింది. సంసారం అంటే ప్రపంచం యొక్క సంక్షిప్త స్వరూపం. సంసారంలో వ్యక్తి ఏర్పడ్డాడు. మళ్ళీ వ్యక్తి ఏమవుతున్నాడు, వాడి మూలం ఎక్కడ అంటే సత్తు మూలం అవుతున్నది. కాబట్టి సత్తులో నుంచి సృష్టి, సృష్టిలో నుంచి విశ్వం, విశ్వంలో నుంచి ప్రపంచం, ప్రపంచంలో నుంచి సంసారం, సంసారంలో నుంచి ఒక వ్యక్తి ఏర్పడ్డారు. ఇది చింతనలో మనకు కలిగే భావం. మామూలుగా చింతనకు రాకముందు ఉన్నటువంటి మనసులో ఇవేమీ అర్థం కావు. ఇవి అసలు లేనట్లు, అసలు వీటి గురించి ఆలోచన చేయవలసిన పని లేనట్లుగా మనకి తోస్తుంది. కానీ ఎప్పుడైతే సమర్పణ భావంతో, వినయంతో, శరణాగతితో, పూజతో, వాక్కుతో, జపంతో, అజపంతో, మనసుతో చింతనాత్మకమైన స్థాయికి మనం వెళ్తామో మూలాన్వేషణ ప్రారంభమవుతుంది. ప్రతి దానికి మూలం ఉండాలి. ఉదాహరణకి మనకు ఆనందం కలిగింది. ఎందుకో? "ఇవాళ కారణం తెలియదండి, చాలా ఆనందంగా ఉన్నాను" అంటాడు. కారణం లేకుండా ఆనందం కలగదు. కానీ కారణం నీకు స్పురించటంలే. ఒక్క నిమిషం గనక స్థమితంగా ఉంటే, "ఓహో! ఇవాళ నేను అనుకున్న పని అయిపోయింది."పెద్ద శ్రమ పడకుండా అందువల్ల ఆనందం కలిగింది అంటున్నాడు. దుఃఖం కలిగింది ఇదేమిటి హాయిగా ఉన్నాను ఎందుకు దుఃఖం కలిగింది అంటాడు మొదట్లో కొద్దిగా విచారణ చేసి వెనక్కి తిరిగి చూస్తే ఇవ్వేళ ఆలోచన చెడ్డ ఆలోచన చేశాను చెడ్డ పని చేశాను దుఃఖం కలిగింది అంటున్నాడు కాబట్టి ఇవన్నీ కలిపి ప్రపంచాన్ని నిన్ను అభేదంగా చూసుకో బింబ ప్రతిబింబ భావంగా చూసుకో నీకు ఈశ్వరుడికి జగత్తుకి రకమైన జీవ జగత్ జగదీశ్వరులు ముగ్గురు ఒక్కటే ఇది ఒక మహా త్రిపుటి అని చెప్తూ శంకర భగవత్పాదులు చెప్పినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం యొక్క మూల రహస్యాన్ని రసాన్ని భగవాన్ రమణులు ఉపదేశ సారంలో చాలా అందంగా ఆవిష్కరిస్తూ మామూలు పొడి మాటలు కాక గంభీరమైనటువంటి భావాన్ని సరళంగా చెప్తూ ఉన్నారు. ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం మే భగవాన్ శ్రీ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ భగవాన్ ఉపదేశించిన ఉపదేశ సారంలో జగత్తుని ఈశ్వరుడిగా భావించమన్నారు. ఈశ్వరుడితో కూడే ప్రపంచం ఉన్నదని అనుకోమన్నారు. ఇది అనాత్మ గా ఉన్నదని ఆత్మగా పరమేశ్వరుడు ఉన్నాడని ఇవ్వాళ రాత్రి మనం నిద్ర పోతున్నాం తెల్లవారేప్పటికి పూల కుండీలో ఉన్నటువంటి మొగ్గ వికాసమానం చెందుతున్నది మన ప్రమేయం ఏమి లేదు. ఋతువు వెంట ఋతువు కాలం మారుతూ ఉన్నది మన ప్రమేయం లేదు. కాలానుగుణంగా పగలును వెలిగించటానికి సూర్యోదయంతో సూర్యుడు వస్తున్నాడు. రాత్రిపూట మనకు తెలియకుండానే సూర్యాస్తమయం అవుతున్నది చంద్రుడు ఆగమిస్తున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు కింద రాకుండా మింటను అంటుకొని ఉన్నాయి. నదులన్నీ తమ ప్రవాహ వేగాన్ని అదుపులో పెట్టుకుంటూనే సాగర సంగమం వైపు వెళుతూ ఉన్నాయి. జీవులు పుడుతున్నారు ఉంటున్నారు జీవయాత్ర ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. చలత్ చలితమైనటువంటి ప్రపంచం యొక్క పోకడ మనకు అర్థం కావటం లేదు. ఇటువంటి పరమాద్భుతమైనటువంటి భావనా స్థితిని మన కట్టెదుట ఉన్నటువంటి ప్రపంచాన్ని కాదని కళ్ళకు కనపడని మనసు పట్టుకోలేని మరొక లోకాన్ని గురించి విచారణ ఎందుకు? ఉన్నదంతా ఇక్కడే ఉన్నది జరగవలసినదంతా ఇప్పుడే జరుగుతున్నది. ఇప్పుడే అంటే power of presence. అష్ట మూర్తులుగా దీనిని భావించు. అష్ట మూర్తులు అంటే ఎనిమిది మంది బొమ్మలు లేదా ఎనిమిది స్వరూపాలు లేదా అష్ట శక్తులు అష్టసిద్ధులు ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. నువ్వు ఏది కావాలంటే అది కావటానికి ఎట్లా ఉండాలంటే అట్లా ఉండటానికి ప్రపంచం నీకు అవకాశం ఇస్తున్నది. అలాగే నీవు క్రమక్రమంగా ఉన్న స్థితి నుంచి యదార్థ స్థితికి వెళ్ళే దాకా అనేక సోపానాలు ఏర్పడి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దాటటానికి నీకు మార్గం దొరుకుతూనే ఉంది. మార్గోపదేశనాన్ని భగవాన్ రమణులు పరమ రమణీయంగా ఆవిష్కరిస్తున్నారు. ప్రపంచాన్ని కాపాడుకోండి అంటున్నారు భగవంతుడికి ఎట్లాగైతే మీరు పూజ చేసి శుభ్రపరచి గది అంతా పూజ గది దేవాలయం ఎట్లాగైతే ఒక నిర్మలత్వాన్ని పరిశుభ్ర వాతావరణాన్ని చేస్తున్నారు కల్పించుకుంటున్నారు అట్లా నీ మనస్సుని కూడా ఇప్పటికే నువ్వు శుభ్రపరుచుకున్నావు. పూజ చేత వాక్కుల చేత ఇందాక విచారణ చేశాం అనేక చింతనల చేత మరి చింతన ఏర్పడినప్పుడు ఇవ్వాళ ప్రపంచాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవ్వాళ మనం పర్యావరణాన్ని రక్షించాలి అని అరుస్తున్నాం పక్కన చెడగొట్టుకుంటున్నాం కానీ బాగు చేయాలని మాత్రం స్ఫూర్తిలో ఉన్నాం చేయలేకపోతున్నాం. ఎందుకంటే అసలు ప్రకృతి అంతా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే. రూపమూ నామమూ లేనటువంటి ఒక ఈశ్వరుడు తనను తాను అభివ్యక్తం చేసుకోవటానికి ఆవిష్కరించుకొని ప్రపంచాన్ని సృష్టించాడు. ఇది సృష్టింపబడింది. సృష్టించిన వాడు కర్త ఆయన సంగతి కాసేపు పక్కన పెడదాం. మరి ఇక్కడ లేనిది లేదు నేత్రాంచలాలలో దాగినటువంటి అద్భుత సౌందర్యమంతా అక్కడే ఉంది ఆనందమంతా ఇక్కడే ఉంది ఇక్కడ లేనిది ఇంకెక్కడో ఉన్నది అంటూ రెండు లేవు అని చెప్తూ ఇక్కడ దూర్జటి పద్యం గుర్తొస్తున్నది. కృష్ణ రాయల ఆస్థానంలో రాజుగారి మీద రాజుగారి భార్య మీద దర్బారు నర్తకి మీద అనేక పద్యాలు రాసి అగ్రహారాలు పొంది అవే నిజమనుకొని చీని చీనాంబరాలు సంపాదించుకొని రత్నాల హారాలు మెడ నిండా వేసుకొని భోగ స్థితిలో ఒక అనుభవాన్ని నిత్యమూ సత్యమూ చేసుకున్నటువంటి ఒక దూర్జటి ఒకరోజున ఇందాక అనుకున్న చింతన ఏర్పడింది ఆయనకి. చింతనా భూమికలో ఏమనుకున్నాడంటే రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారిచ్చు అంభోజాక్షి చతురం తయాన్ తొరగి భూషాదులు ఆత్మం యధా బీజముల్ తదపేక్ష చాలు పరితృప్తిం యెందతిన్.జాగ్రత్ పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా అన్నాడు. అంటే ఇప్పటివరకు పొందిన వస్తువులన్నీ ఆత్మవ్యధా బీజముల్. నా ఆత్మకి కలుగుతున్న దుఃఖానికి ఇది కారణం అవుతున్నాయి తప్ప నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు. సుఖాల్ని ఇచ్చినాయి కానీ సుఖానికి అంతు ఉండాలి. సంతోషం కూడా తాత్కాలికమే. నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఆనంద అతిశయ రేఖ నాకు ఎప్పుడు కలగాలి అంటే జాగ్రత్ పరిణామ మిమ్ము. జాగ్రత్ అవస్థ లో ఉండగానే పరిణామం ఎటువైపు దారి తీయాలంటే జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామ మిమ్ము. ఇప్పటివరకు లక్ష్మిని ఇచ్చావ్ అది కదిలే సిరి. కదలని సిరి కావాలయ్యా అది జ్ఞానలక్ష్మి. జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా అన్నాడు. అన్నదే తడవుగా ఎన్ని పద్యాలు రాశాను, ఎన్ని బహుమతులు పొందాను. ఆడ గుర్రాలు, మేనాలు అంటే పల్లకీలు, రాజాభరణాలు అద్భుతమైనవి పొందాను. చీని చీనాంబరాలు, బంగారాలు, అగ్రహారాలు. ఇవి నాకు ఆనందాన్ని కలిగించటం లే అని ఏం చేయాలి అనుకున్నాడు. కాళహస్తీశ్వర శతకం అంటే పరమేశ్వరుడి మీద ఏదన్నా రాయాలి. దాని ద్వారా అంటే మనం అనుకునే చింతనా భూమిక ఎట్లా ఏర్పడుతుంది అంటే వెలుగు మూలం ఏదంటే చీకటే. చీకట్లోని చీకటి గర్భంలో నుంచి వెలుగు బయటికి వస్తున్నది. అట్లాగే ధైర్యం పిరికితనంలో నుంచి పుడుతున్నది. ఒక పట్టుదల అపజయంలో నుంచి పుడుతున్నది. చూశారా! మూలాలు అన్నీ negative గా ఉన్నాయి, వచ్చేవి అన్నీ positive గా ఉన్నాయి. అటువంటి దూర్జటి సువర్ణముఖి నది తీరానికి వెళ్లి ఒక పద్యం రాద్దాం అని కూర్చున్నాడు. కొన్ని వేల పద్యాలు అలవోకగా రాసినటువంటి దూర్జటి కి భగవంతుడి యొక్క చింతన తెలియని కారణంగా పరిచయం లేని కారణంగా ఇంతవరకు రకమైన చిత్తశోధకం గాని ముక్తిదాయకమైనటువంటి సమర్పణ, శరణాగతి, వినయం మూడు లేని కారణంగా పద్యం పుట్టటంలా. ఆరోణి
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -16

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -16

Source: TFC Spiritual on YouTube

0:00 / 15:45

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

    Now playing
  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77