No transcript for this section.
Transcript begins at 0:00.
ఎక్కువగా మాట్లాడుకుంటాం కాయకర్మలో కాబట్టి మూడుగా కనిపిస్తున్న నిజానికి మూడు కూడా ఒక్కటే మరి సాధన ఎలా చేయాలి నేను చేస్తున్నా కదా భజన చేస్తున్నాం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ కూడా భక్తి కిందనే వస్తాయి కదా ఇట్లా ఆధ్యాత్మిక కిందనే వస్తాయి కదా ఇంకా ఏమిటి అన్నప్పుడు ఒక ఆలోచన ప్రతి వ్యక్తి యందు కలగాలి మరి ఆధ్యాత్మిక సాధన ఎక్కడ ప్రారంభించాలి ఇలా సామూహికంగా ఒక మంది వారు కొందరు ఈ విన్న దాంట్లో నుంచి గ్రహించేవారు కొందరు ఇదేదో మనకు సంబంధించింది కాదనుకుంటూనే నిలబడాలి వ్యక్తిగత సాధనలో మనం గనక వెనకబడి పోయినట్లయితే ఆధ్యాత్మిక సాధన దానికి నిజంగా అర్థమే లేదు మన పూర్వీకులు మన తల్లులు తండ్రులు తాతలు ముత్తాతలు పరస్పరానుభూతిగా మనకు నేర్పింది ఏమిటంటే మరి ఆ భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఒక దేవాలయం గనక ఉన్నట్లయితే దేవాలయానికి వెళ్లడం భారతీయమైనటువంటి కలివిని పెంచుకోవడం కలివిని పంచుకోవడం అలాగే సమాజహితంగా జీవించడం సమాజానికి ఆదర్శప్రాయంగా జీవించడం ఇది ఈ జాతి కొత్తగా నేర్చుకునే విషయాలు కావు ఇవన్నీ మన తాతలు తండ్రులు ముత్తాతలు అన్నీ మనకి ఆ సంపద ఇచ్చారు మార్గం కూడా ఏర్పరిచారు దానికి తోడు మనకు ఋషులున్నారు జ్ఞానులున్నారు తత్వవేత్తలున్నారు అనేకమైన ప్రకరణాలకి వ్యాఖ్యానం, భాష్యం చెప్పిన వాళ్ళున్నారు. ఇవన్నీ కూడా ఒక వైదిక వాంగ్మయం అంటాం. అంటే వేదము చుట్టూ తిరిగే వాంగ్మయం అంతా వైదిక వాంగ్మయం కాబట్టి ఆ వాంగ్మయం అంతా చేరవలసినంతగా చేరని కారణంగా ఇంకా ఈ జాతి అందుకోవలసి ఉన్న కారణంగా 1926 నవంబర్ 23న వృక్షమాకృతి యజుర్ముర్తిగా అవతరించినటువంటి ఒక విశిష్ట అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి. అది ఆ అవతారం బ్రహ్మ స్వరూపం ఆ అవతారం వేద స్వరూపం ఆ అవతారం నాద స్వరూపం ఆ అవతారం సంఘ స్వరూపం సంఘం శరణం గచ్ఛామి అంటారు బుద్ధుడు ధర్మం శరణం గచ్ఛామి అంటారు ఈ రెండిటికీ సహకారంగా బుద్ధుడు తర్వాత ఏదైనా ఉన్నదా అని ఆలోచిస్తే ఆ మాటలు అనకుండా ప్రపంచానికి అసలు ఉన్నదంతా ఒక్కటే రెండంటూ లేవు అని చెప్పినటువంటి బుద్ధుడి తర్వాత వచ్చిన శంకర భగవత్పాదులు వాగ్మయ సరస్వతీ ప్రవాహం అయినట్లయితే ఆ సరస్వతీ ప్రవాహాన్ని ముడిసి పట్టి సర్వ ప్రపంచానికి తనదైనటువంటి భాషలో ప్రధానంగా సుమధురమైనటువంటి తెలుగు భాషలో అనేకమైనటువంటి ఉపన్యాసాల ద్వారా అంటే దివ్యోపన్యాసాల ద్వారా ప్రజా బాహుళ్యంలోకి వేద వాంగ్మయాన్ని చాలా సులువుగా అందించినటువంటి స్వరూపం ఏందీ అంటే భగవాన్ శ్రీ సత్యసాయి. స్వామిని చూసిన వాళ్ళు స్వామిని దర్శించిన వాళ్ళు స్వామితో amekమైనటువంటి వారు స్వామి Organizationలో సంస్థాగతంగా అనేక సేవా కార్యక్రమాల్లో దశాబ్దాలుగా దశాబ్దాలుగా జీవితం సాగిస్తున్నటువంటి వారు ఇంకా వారి యందు ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది మేము చేస్తున్నది అంతా సాధన కాదా ఇప్పుడు మేము ఎట్టి గనక సాధన ఏం చేయాలి. ఇవ్వాళ YouTubeలాంటి వేదికల మీదకి పెడితే ధ్యానం మీద ఒకరు, ప్రాత్మన మీద ఒకరు, గానం మీద ఒకరు, జ్ఞానం మీద మరొకరు ఇట్లా చీలికలు బీలికలుగా పాయలు పాయలుగా ఆధ్యాత్మిక సాధనని అనేక రీతులలో ఆవిష్కరిస్తున్నటువంటి వేళ సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచం మీద ప్రసారించినటువంటి ఆ వెలుగు రేఖలో ఆ జ్ఞానసిరిలో ఆ మార్గంలో మనం కొన్ని విషయాలు పట్టుకోవాలి. నవసూత్ర ప్రణాళిక స్వామి devoteesందరికీ తెలుసు. నేను దాని ప్రస్తావన ఒక్క క్షణం కూడా ఉండదు. ఎందుకంటే ఏది నువ్వు ఆచరించావో, నీ ఆచరణ ద్వారా ఒక అనుభూతిని పొందామో, ఈ అనుభూతి ఆచరణ జరగటానికి ముందు నువ్వు ఏమి అచేతన చేశావో, అచేతన చేసిన దాన్ని ఎలా అర్థం చేసుకున్నామో, అర్థం చేసుకున్న దాన్ని స్వాధ్యాయంగా ఎలా మార్చుకున్నామో, ఇవన్నీ గనక క్రమంగా అర్థం చేసుకోగలిగితే వ్యక్తిగత సాధన చాలా సులువైపోతుంది. ఎలా చేయాలి? ఇది సంవత్సరాల గురించో, నెలల గురించో నలభై రోజులు చేయండి అవే అలవాట్లు అవుతాయి, ఆరు నెలలు చేయండి అలవాట్లు అవుతాయి అంటే ఆరు నెలలు చేయటానికి ముందు మన ప్రణాళిక ఒక్కటి రోజు ఎలా-- ఒక spiritualize ఎలా చేయాలి ఒక రోజుని. నిద్రలేచాం పడుకుంటున్నాం మళ్లీ లేస్తున్నాం మళ్లీ పడుకుంటున్నాం. ఈ రోజుల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయవలసినవన్నీ చేస్తున్నాం. సంసారాన్ని ఏలుతున్నాం. విద్యార్థులంతా చదువుతున్నారు, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. అనేక కార్యకలాపాలు సాగుతుంటే ఎక్కడా ఆధ్యాత్మిక అనేదానికి చోటే లేదు, సాధనకు చోటే లేదు. మీరు ఎవరినైనా ఇవ్వాళ ఒక వంద మందిని గనక మీరు చేస్తున్న సాధన ఏమిటి అని అడిగితేఏమీ లేదండి. తెలియక అంటున్నారా? చేస్తున్నదంతా సాధనే అనే అనుభవం లేక అంటున్నారా? ధ్యానం అంటే ప్రత్యేకంగా ఉన్నదా? సాధన అంటే ప్రత్యేకంగా ఉన్నదా అంటే అది గనక మనం మాట్లాడుకుంటే ఒక రోజుని గనక చక్కగా దాన్ని ఒక unit గా తీసుకుని గనక schedule చేసుకోగలిగినట్లైతే ఆ వ్యక్తిగత సాధన ప్రారంభం అవుతుంది. పెద్ద వాన కురవాలి అంటే ఆకాశం నుంచి కొన్ని చినుకులు ముందు పడతాయి. ఒక నది పుట్టాలి అంటే ఒక చినుకుతో ప్రారంభం అవుతుంది. మనిషి తన లక్ష్య గమ్యాల వైపు వెళ్లాలి అంటే ముందు ఒక్క అడుగే వేస్తాడు పది అడుగులు పరిగెత్త చేయడు. కాబట్టి ప్రారంభం ఎక్కడ కావాలి? ముందు ఒట్లో ప్రారంభం కావాలి ఆ తర్వాత ఇంట్లో ప్రారంభం కావాలి. చూద్దాం. ఇవాళ నిద్దాం రేపటి నుంచి ఒక-ఒక రోజుని మీరు model చేసుకొని ఒక laboratory లో ప్రయోగంగా-ప్రయోగాత్మకంగా ఆలోచించి గనక చేసినట్లయితే ఇది spiritualize ఎలా చేయొచ్చు అనేది ఒక బాట show మనం మాట్లాడుకోవచ్చు. ముందుగా మనం వేకువనే నిద్రలేవాలి అని చిన్నప్పటి నుంచి విన్నాం. వేకువనే అంటే ఎప్పుడు వేకువ? ఇది ప్రశ్న కదా! IT రంగంలో ఉన్న వానికి తెల్లవారు 12 గంటలకు అది వేకువ మనకు కాదు. మరి అధ్యాత్మ సాధన ప్రత్యేకమైంది కాబట్టి ఏ సమయంలో నిద్రలేవాలి అంటే పెద్ద పదం బ్రహ్మే-బ్రహ్మ ముహూర్తం అంటారు. అది ఏమిటో మనకి తెలియదు. ఒకడంటాడు అత్యంత తెలివిగలవాడు ఏమంటాడంటే, "నేను లేచిందే బ్రహ్మ ముహూర్తం అండి" అంటాడు. కాదంటా. మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు దాటిన తర్వాత మనం గనక ఆ సమయంలో లేస్తే అది నిజమైనటువంటి బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ అంటే ఇక్కడ బొమ్మలు వేసే బ్రహ్మ కాదు, సృష్టికర్త అయిన బ్రహ్మ కాదు. ఈ ప్రపంచం కనబడబోతున్న ప్రపంచానికి అప్పటి వరకు నిద్రావస్థలో కనబడని ఈ ప్రపంచమంతా బ్రహ్మమై ఉన్నప్పుడు ఆ బ్రహ్మము యొక్క ముహూర్తం అంటే నువ్వు నిద్రావస్థలో ఉండి అప్పటి దాకా నిద్రపోయి మళ్లీ లేచి ప్రపంచంలోకొచ్చి పనులు చేయాలి గనక ఆ సంధి కాలానికి మనం బ్రహ్మ ముహూర్తం అని పేరు పెట్టుకున్నట్లయితే ఆ మూడు గంటల ఇరవై ఎనిమిది ఏదో technical గా మూడున్నర గంటలండి. ఇవాళ మూడున్నర గంటలకి ఎంతమంది నిద్ర లేస్తున్నారు అని గనక ప్రశ్న వేస్తే, మీరెవరూ చేతులు ఎత్తకండి నాకు ఎంతమంది లేస్తున్నారో తెలుసు. ఎంతమంది అంటే ఒక్కడు కూడా లేవటం లేదు ఇదే స్వభావం. ఎందుకని అంటే పూర్వకాలంలో తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఎవరూ నిద్రపోయేవారు కాదు. గనక మూడున్నరకి లేవగలిగేవారు. ఇప్పుడు అరచేతిలో cell phone ఉంది కదా! టీవీ పెట్టేకి పైన అరచేతిలో టీవీ అరచేతిలో ఉన్న cell ప్రపంచం మొత్తాన్ని మన చుట్టూ తీసుకొచ్చి ఒకటిన్నర ఆ ప్రాంతంలో కళ్ళు, మనస్సు అలసిపోయి మనకున్న సమస్యలు కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యల్ని మెదడులోకి ఎక్కించుకొని నిద్రపో అంటే నిద్రపోయేది ఎవరు మనమా? మన మనస్సా? కాదు కదా! కాబట్టి ఇవాళ సాధనా మార్గంలో కంచె తొలి పెట్టి ఏంటి అంటే రేపటి నుంచి ఆ తర్వాత అనద్దు మళ్ళీ నేను వస్తున్నా August లో అప్పుడు మళ్ళీ review చేస్తాం. మూడు గంటల ముప్పై నిమిషాలకి కొద్దిగా అలారం పెట్టుకొని మీరు లేవండి. లేచి లేవగానే ఏం చేయాలి? మనకి ఎలా ఉంటుందంటే లేవగానే ఏదోటి చేసేయాలి. అంటే నిన్న మిగిలిపోయిన పనులు, చేయాలనుకొని చేయలేని పనులు, రేపు చేయవలసిన పనులు, దానికి ప్రణాళికలు అవి ఏవీ చేయకండి. మూడున్నర గంటలకి మీరు నిద్ర లేచినప్పుడు సుమారుగా ఒక అరగంట సేపు three thirty to four మీతో మీరు ఉండండి. మీ-మీతో మీరు ఉండటానికి మళ్ళీ పద్మాసనం వేసుకోవాలా, జింక చర్మం మీద కూర్చోవాలా లేకపోతే విటారంగా- అవన్నీ వదిలేయండి. మీ ఇంట్లో sofa ఉంటే హాయిగా, ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకని కూర్చోవాలి అంటున్నానంటే ఆ సమయంలో ప్రపంచం మిమ్మల్ని గుర్తుపెట్టుకోదు, మీ అవసరం దానికి లేదు. అలాగే మీకు అవసరం ఉన్నా ప్రపంచం ఇంకా మేల్కోలేదు. కా-కాబట్టి మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా నిద్రలో ఉన్నారు. కాబట్టి మీకు ఎవరితోనూ సంబంధం లేని అద్భుతమైనటువంటి కాలమే బ్రహ్మ ముహూర్త కాలంగా భావించి ఒక అరగంట కూర్చోండి. కూర్చొని మళ్ళీ ఏం చేయాలి? ప్రతిసారి ఏం చేయాలి అనే ప్రశ్న కదా! కూర్చొని ఏమీ చేయకండి. ఇది బాగుంది కదా! కూర్చొని మళ్ళీ ఏదో ఆహ్ సంకీర్తన చేద్దాం, గైడ్ ఇది వేద్దాం, కరకరా వస్తం ఏమీ చదవకండి, ఏమీ చేయకండి, మీతో మీరు ఉండండి. మీతో మీరు ఉండేది అసాధ్యం ఈ అవస్థలో. ఇప్పుడు నాతో నేనుండలేను, నేను మీతో ఉండాలి, నేను నా మనసుతో ఉండాలి, నా బుద్ధి, చిత్తము, నా భావనా, నా శక్తి వాటితో కుడిబడి ఉండాలి అప్పుడు మాత్రమే నేను మాట్లాడగలను. కానీ ఆ సమయంలో మూడున్నర గంటలకి లేచినప్పుడు మీతో మీరు ఉండటం చాలా తేలిక. మిమ్మల్ని ఎవరు disturb చేసేవాళ్ళు లేరు. మీతో మీరు ఉండటం ప్రారంభించినప్పుడు నెమ్మదిగా మీలో మీరు ఉండటం కూడా మీకు అలవాటైపోతుంది. ఆ మీలో మీరు ఉండటానికి ప్రయత్నం చేసేటప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పెరుగుతాయి. ఆ ఆలోచనలన్నీ మిమ్మల్ని కొన్ని నిమిషాలు ఉత్తిరి బిత్తిరి చేస్తాయి. గతమి, వర్తమి, రాబోయేటి గత దాని వల్ల బాధ, రాబోయే దాని వల్ల భయం ఈ రెండు వర్తమానాన్ని బాధిస్తాయి గనుక మీరు మీతో ఉండి మీలో ఉండే ఆ అరగంటని మీ జీవిత కాలంలో ఆ ఇరవై నాలుగు గంటల్లో చాలా ప్రముఖమైనటువంటి కాల-కాలికగా భావించండి.ఆ అరగంట అయిన తర్వాత మీరు ఉన్న చోట నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు తెలియని శక్తి మీలో ప్రవేశిస్తుంది మీకు తెలియదు అది అనంత శక్తి ఇంద్రియాలన్నీ కూడా మేలుకొని నిద్రలో నుంచి మేలుకొని కళ్ళు కాళ్ళు చేతులు చెవులు అన్నీ మళ్ళీ నెమ్మదిగా తమ కార్యకలాపానికి చేరువయ్యేటువంటి సమయంలో పడుకున్నప్పుడు మీరు ఎంత హాయిగా నిద్ర పోయాము అనుకుంటారో ఆ హాయితనంలో నుంచి ఒక ఆనందంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి మీ సోఫా నుంచి మీరు దిగుతారు ఇది మొదటి పాఠం అంటే మూడున్నర గంటలకు లేవాలి నాలుగు గంటలకు ఈ ధర్మము ఇంకో ఏమీ పేరు పెట్టక్కర్లేదు దానికి పేరే వద్దు మీతో మీరు ఉండండి దాని ఫలితమేంటో ఒక ఐదారు రోజులు అయిపోయిన తర్వాత అలారం క్లోక్ పెట్టవలసిన పనిలేదు శరీరానికి biological clock ఉంటుంది మనతోనే ఉంటుందండి అది మనల్ని మేలుకొలుపుతుంది నిన్న లేచావు ఇంత ఆనందాన్ని అనుభవించావు చూడు ప్రకృతితో సంబంధం లేదు ఇంటితో సంబంధం లేదు మాటలతో సంబంధం లేదు ఏమీ లేదు అసలు ఏమీ లేకుండా ఉండగలిగే స్థితి అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి ఆ ఏమీ అక్కరలేని స్థితి ఏమీ లేని స్థితి ఆ రెండు ఎవరికివ్వాలంటే మంత్రతంత్రాలతో వచ్చేది కాదు సాధనతో వచ్చేది వ్యక్తిగత సాధనలో ఇది మొట్టమొదటి లింకుగా మీరు భావన చేయండి నాలుగు గంటలకు లేచారు కార్యకలాపాలు మామూలుగా జరిగే దేహపరంగా జరిగేవి అవన్నీ అయిపోద్ది మీ పనులన్నిటినీ చేసుకుంటూ ఉండండి అయిపోయిన తర్వాత కొంత సమయం మీకు గనక టైం ఉన్నట్లయితే వైదికమైనటువంటి సంస్కృతి విలాసాన్ని మళ్ళీ మనం గనక తెచ్చుకోవాలి పండగనాడే దేవుడికి దీపం పెట్టడం పండగనాడే ఆయనకి నైవేద్యం పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం అలవాటు చేసుకోకుండా ప్రతిరోజూ భగవంతుడికి మనం ప్రార్థన చేయాలి ఏం ప్రార్థన అనంగానే ఇంతలో స్తోత్రాలు రన్నా వాళ్ళ పుస్తకాలు మన చేతిలో పెడతారు అది చూడగానే దీంట్లో ఏదన్నా లేకపోతే ఆ పుస్తకాన్ని తలతిరుగే వాడుకుంటాం ఒక స్తోత్రం చదువుతాం మరి ఏమి చదవాలి ఏది ప్రార్థన అంటే సత్యసాయి భగవాన్ మనకి ఒక గొప్ప ప్రార్థన ఇచ్చారు అనుగ్రహించారు ఏమని ప్రార్థించాలి ఇదిగో నేను ఈ వేళ వ్యాపారానికి వెళ్తున్నా ఓటి రూపాయలు రావాలి లేదు మా పిల్లవాడు competitive exam కు వెళ్తున్నాడు వాడికి rank రావాలి ఇది కాదు సమస్త లోకాః సుఖినోభవంతు ఇది మొట్టమొదటి ప్రార్థన ప్రపంచమంతా బాగుంటే ఆ ఆనందంతో మనకు భాగస్వామ్యం దొరుకుతుంది ప్రపంచం ఏదన్నా కానీ నేను ఒక్కడినే నా కష్టము నా సుఖము నా ఇల్లు నా సంసారం అన్నప్పుడు ఏమవుతుందంటే అది అసహజమైనటువంటి ప్రకృతి వ్యక్తిని అనుగ్రహించదు వ్యవస్థని అనుగ్రహిస్తుంది అందరం మనందరం ఒక సామూహికంగా ప్రార్థన చేయవలసింది ఈ ఫలానా స్తోత్రం ఈ గురు స్తోత్రం ఈ గాయత్రి ఇవన్నీ పక్కన పెట్టండి practical గా rational గా ఆలోచిస్తే ఇదిగో నేను మళ్ళీ ఇద్దరు లేచాను తెలుసా కరోనాలో ఎవరైనా ఏ ఒక్క వ్యక్తి అయినా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తెల్లవారేప్పటికి నేను ఖచ్చితంగా లేచి మళ్ళీ సూర్యుడిని చూస్తాను అనుకున్న వాడు ఎవరన్నా ఉన్నాడా అంటే ఒక్కడు లేడు అయిపోయింది కలిగింది కానీ ఇక్కడ ఎప్పుడైతే సమస్త లోకాః సుఖినోభవంతు అంటామో మీ మనస్సంతా కూడా విశాల భావనలోకి వెళ్ళిపోయింది ప్రపంచం అంతా బాగుండాలని అనుకోవటమే గొప్ప విన్యాసం ఆత్మ విన్యాసం ఈ ప్రపంచం నాకంటే భిన్నం కాదు నేను ఈ ప్రపంచానికి కంటే భిన్నం కాదు ప్రపంచంలో ఏమున్నదో నాలో అదే ఉన్నది నాలో ఏమున్నదీ అదే బహిర్గతంగా ప్రపంచమే కనిపిస్తున్నది దీనికి దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చెప్తారు అది మీరు చదువుకోక్కర్లా ఇప్పటికే మాట్లాడుతున్నా గనుకే చెప్తున్నా విశ్వం తర్వణ దృశ్యమాణ నగరీ తుల్యం నిజాంతః జటామన్ద్రితే ప్రబోధ సమయే స్వాత్మానమైవావతయం తస్మై శ్రీ గురుమూర్తయే నమై శ్రీ దక్షిణామూర్తయే ఇది ఇప్పటికే అనుకుంటాం మీరేమీ అనొద్దు సమస్త లోకాః సుఖినోభవంతు తర్వాత మనకు పనులున్నాయి ఆ పనులేవి ఉన్నాయి మీ అందరికీ కనీసం మీలో ఎక్కువ మందికి ఇంటి పని వంట పని అవన్నీ ఉంటాయి పురుషుడికి సంపాదించాలి facilitate చేయాలి తనకు ఇవ్వబడిన ఇచ్చినటువంటి విచింత ధర్మాలను తాను నెరవేర్చాలి ఆ ఎప్పుడైతే ప్రపంచం అంతా బాగుండాలి అని ప్రార్థన చేశామో మనలో స్వార్థం నశించిపోతుంది నాకు ఈ లాభం కలగాలి అనేటువంటి ప్రార్థనకి గరగధర వస్తవం చదువుతూ మొదలు పెట్టినట్లయితే నా చుట్టూ నా ఆశ చుట్టూ నా దురాశ చుట్టూ నా పేరాశ చుట్టూ నా ఆలోచనలు సాగి సాగి నన్ను ఎదగనివ్వవు కాబట్టి అది ఆధ్యాత్మికం సంబంధించింది కాదు అది కేవలం ritual కి సంబంధించింది కాబట్టి ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నిర్మలమైనటువంటి మనసుతో మనం ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మన కర్తవ్యాలన్నింటినీ కూడా నిస్వార్థంగా చేస్తాం అతిశయించిన మమకారాలు లేకుండా చేస్తాం నిజానికి ఇంకో వేదంలో ఇంకో శ్లోకం ఉంది శ్లోకార్థం ఏంటంటే ఏనకేన ప్రకారేణ ఏష కశ్చాపి తే జినా సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం ఇది మాటార్థం అంటే ఏంటంటే సమస్త లోకాః సుఖినోభవంతు అన్నాం బానే ఉంది నేను ఎవరు నేను అసలు ఎందుకు వచ్చాను వచ్చి ఏం చేయవలసింది ఉద్యోగమా అరవై ఏళ్ళు అయింది retire అయిపోవాలి కదా వ్యాపారమా ఎనభై ఏళ్ళు అయింది చెప్పండి ముడుచుకుపోయి చెప్పాలి కదా మరి ఇంకేదోనా ఇంకేదోనాచేసినా చేయకపోయినా శరీరానికి వయస్సు ఏర్పడుతుంది. వయోధర్మం ప్రకారం చిన్నప్పుడు చేసినంత వేగంగా ఇప్పుడు చేయలేము. ఇవన్నీ కూడా మనకు ఏర్పడతాయి. అన్నీ తెలిసినవే. అటువంటి సందర్భంలో ఎప్పుడైతే మనం నిస్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో మంచి పనులు చేయడం మొదలు పెడతామో, ఆ పనులన్నీ కూడా మన ప్రజ్ఞ ద్వారా జరుగుతాయి. అంటే మనకి skill ఉంది. అదే ఈ శ్లోకంలో చెబుతుంది. ఏమంటుందంటే, నేను ఎందుకు వచ్చా? ఎవరికోసం వచ్చా? వచ్చి ఏం చేస్తున్నాను? అని అనుకుంటూనే తన ప్రజ్ఞ ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి వారికి గనక ఆనందం కలిగించగలిగినట్లైతే దాని పేరు ఈశ్వర పూజ, తత్ దేవ ఈశ్వర పూజనం. ఈ ఈశ్వర పూజనం అనేటువంటి దాన్ని సేవ చేయడం ఉంది కదా! కనుక సత్య సాయి భగవానుడు మనకిచ్చింది ఏమిటంటే సేవ చేయడం. ఇవాళ చేస్తున్న సేవ యొక్క స్వరూపం వేరు. నేను దాని గురించి అనొచ్చు. దానికి మనం సర్వదా సిద్ధమై ఉండాలి. అందుకే స్వామి చెప్తారు, హింకరులైన వాళ్ళు మాత్రమే శంకరులు కాగలుగుతారు. హింకరులు అంటే Him కరు నేను ఏం చేయాలి? నేను ఏం చేయాలి? అంతే తప్ప వీళ్ళందరూ నాకేం చేస్తారు అన్నప్పుడు వాడు ఎదగలేడు. ఎప్పుడూ పరాన్నభూతుడు. అంటే ఇంకొకడి మీద ఆధారపడి ఏ total dependence తో వాడు బతుకుతాడు. అది ప్రయోజన శూన్యమైన జీవితం. ఇట్లా గనుక మనం ఒక రోజుని spiritualize చేయగలిగితే మరి ఈ మధ్యలో అంతా వ్యాపారమే చేస్తున్నామా? అంతా ఉద్యోగమే చేస్తున్నామా? మనం పది గంటలు ఉద్యోగం చేయాలి. మధ్యలో friends తో మాట్లాడటానికి ఒక గంట పోయింది. తర్వాత YouTube లో కొంత పోయింది. WhatsApp లో కొంత పోయింది. ఉద్యోగం మాంచేర్-- నిత్య జీవితంలో మన కోసం వ్యక్తిగతమైన సాధన కోసం ఏం చేయాలి? అంటే ముందు మొట్టమొదటిది reading the summary చదవాలి. scriptures చదవాలి. scriptures అనగానే అమ్మో వాడేవడో పండితుడు వాడు మాట్లాడే భాష మాకు తెలియదు అంటాం. ఇవాళ ఈ పుటకి ఒక మాట, భగవద్గీత ఉంది. భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలున్నాయి. అంటే మీరు మొదటిది పోతుంది, మూడోది చదివితే మొదటి రెండు పోతాయి. కాబట్టి ఒక శ్లోకాన్ని ఒకరోజున మననం చేయండి. చదవండి. చదువుతూ చదువుతూ అర్జునుడికి మాత్రమే చెప్పింది కాదు. ఒక యోగీశ్వర స్థాయికి చెందిన ఒక వ్యక్తి ఒక పై దిక్కు వైనము తెలియని వాడికి బోధించిన భగవద్గీత పాడుకునే పాట కాదు. మానవ జీవితాన్ని, మానవ దేహాన్ని, మానవుడి మనోవైజ్ఞానిక యోగశాస్త్రమే భగవద్గీత. ఆ కోణంలో చదవండి. చదివితే భగవద్గీత చదవండి మీకు రోగాలు పోతాయి. అదేమీ నమ్మకంటే రోగాలు ఎక్కడికి పోతాయి, దానికి మందు వేసుకోవాలి మనం. ఆకలేసింది అన్నమే తినాలి. ఆకలేసినప్పుడు శ్లోకం చదవండి. చదవలేని వాడు చదవగలిగిన వాడితో చదివి వినిపించుకోండి. దాని అర్థం తెలుసుకోండి. అట్లా స్వాధ్యాయము ఒక పార్ట్ కావాలి ఇరవై నాలుగు గంటల్లో. మరి అన్నీ బానే చెప్తున్నారు మాకు వినోదం కనీ-- అనేక దశాబ్దాలుగా తిష్టవేస్తున్నటువంటి టీవీ కదా! టీవీ ఒకప్పుడు వచ్చినప్పుడు మన ఇంట్లో సినిమా చూశాం. మరి ఒక బ్రహ్మ రాక్షసి ఏందంటే, ఇవాళ నా వరకు మా ఇంట్లో అది గోడ మీద బొమ్మ. దాని మీద ఎప్పుడూ బొమ్మలు పడవు. ఎందుకనంటే Criminal Waste of Sky is watching it. YouTube లో వార్తలు తెలుసుకోండి, ప్రపంచంలో general knowledge సంపాదించుకోండి. వస్తువుల ప్రమాణాలు తెలుసుకోండి. ఏది అవసరమో, ఏది సమాజ పరమైనటువంటి inputs ఇస్తున్నదో వాటి కోసమే నిజంగా YouTube ని positive గా వాడుకోగలిగితే అది కూడా ప్రపంచంలో ఉన్న కొత్త దారులను చూపిస్తుంది. ఇట్లా ఒక పుస్తకం. అందుకనే నేను ఎప్పుడూ కాలేజీలకు వెళ్ళినప్పుడు చెప్తుంటాను. మా life లో మా యవ్వన దశలో నిజానికి ఇగో పది పదిహేను ఏళ్ల క్రితం వరకు మా దగ్గర book ద్వారా మేం knowledge సంపాదించాం. ఇవాళ bookish knowledge ఎప్పుడో దారిసారిపోయింది. ఇవాళంతా lookish knowledge వచ్చింది. చూడటం, వాడెవడో చెప్పటం, ఆ message వినటం, అదే నిజమనుకోవటం, అలా వెళ్ళటం. ఆనే కాదు. మూలమైనటువంటి భగవద్గీత శ్లోకం, భగవద్గీత ఉదాహరణగా చెప్తున్నా, చాలా ఉన్నాయి. ముందు ఎక్కడో ప్రారంభమైతే అది నెమ్మదిగా అలవాటైపోతుంది. కాబట్టి మనకి స్వాధ్యాయం ఉంది, ప్రార్థన ఉంది, అభ్యంతరమున్నది, సమాజం బాగుండాలన్న కోరిక ఉంది, నిస్వార్థ ప్రవృత్తి ఏర్పడింది, ప్రపంచానికి సేవ చేయాలన్న ఒక మంచి ఆధ్యాత్మిక భావన కలిగింది. ఇవన్నీ కలిగి రాత్రి పది గంటలకి మనం పడుకోపోయేటప్పుడు ఇక్కడ మూడున్నరకి లేవండి అని ఎలా గట్టిగా చెప్తున్నానో, మీరు ten o clock కి మీకున్న cell మీ hand లో పడేయండి. అది లేకుండా నా వరకు నేను అరవై ఏళ్ళు వెళ్ళిపోయా. అది లేకుండా చాలా హాయిగా. ఇప్పుడు అది పెద్ద అడ్డంకి అయిపోతున్నది. నిజానికి ఇక్కడికి మీ దగ్గరికి వచ్చేటప్పుడు cell రూమ్ లో పడేసి వచ్చా. నాకు దానికి సంబంధం లేదు. అవసరం లేదు. అలాగే మీరు కూడా రాత్రి పది గంటలకి ఏం message వస్తుందో, ఏం విషయాలు వస్తాయో, నాకు miss అయితే వాడికి మనకర్థంకా? చేసిన వాడికి miss అయింది. కాబట్టి వాడికి అవసరం ఉంటే మళ్ళీ వాడు తెల్లవారి చేస్తాడు. మనం దాని కోసమే ఆందోళన పడవలసిన పనిలేదు. వెంటనే instant గా చేయవలసిన పనిలేదు. మనస్సును ఉద్విగ్నతకి, ఒక అక్కరలేని వేగానికి గురిచేయకుండా cell phone నుంచి మనస్సును దూరంగా పెట్టండి. పది గంటలకి ఆ hall లో dining table మీద పడేసి మీ దారి మీరు పడుకోండి. మోగితే మోగుతుంది లేదా silent mode లో పెట్టుకోండి. చక్కగా నిద్రపోండి. Ten to three అంటే కేవలం ఐదున్నర గంటలు. అంతే కదా!పిల్లలకి చిన్నవాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి కనీసం ఆరేడు గంటలు నిద్ర పడుతుంది. మధ్య వయస్సు వాళ్ళకి ఐదున్నర గంటలు కచ్చితంగా పడుతుంది. మరి పెద్దవాళ్ళ సంగతి వదిలేద్దాం. వాళ్ళు పాపం లేస్తూ ఉంటారు పడుకుంటూ ఉంటారు. రేపు ఏమవుతుందో అనే భయం ఆందోళనలు ఉంటాయి. వాళ్ళ గురించి నేను చెప్పటం కాదు. ఇవాళ ఈ దేశానికి అరవై ఎనమిది నుంచి డెభై పర్సెంట్ ఉన్నటువంటి యువకులు యువతులు గనుక జీవితమంతా రాత్రులంతా గనుక YouTube లో గనుక గడిపినట్లైతే మూడు నష్టాలున్నాయి. ఒకటి దేనిని విశ్లేషించగలిగిన శక్తిని వాళ్ళు కోల్పోతారు. రెండు గుర్తుపెట్టుకో గలిగిన శక్తిని కోల్పోతారు. ఏది అక్కర్లేదో మనసులో మాత్రమే నిలుపుకునేటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. కనుక ఏ జీవితాన్ని మనం గడపకూడదో, ఏ జీవితాన్ని నడపకూడదో, ఏ జీవితాన్ని జీవించాలో, ఇవన్నీ కూడా మర్చిపోతాం. కాబట్టి జీవితాన్ని గడపద్దు నడపద్దు జీవించాలంటే ten o clock switch off the lights. మూడున్నరకి లేవండి. ఇది ఒక రోజుని spiritualize చేయటానికి. ఈ మధ్యలోనే పుస్తకం చదవమన్నాం, శ్లోకం చదవమన్నాం, మంచి ఆలోచనలు చేయమన్నాం. ఒక్కొక్కసారి మహాత్ముల సందర్శనం చేస్తాం. ఎవరో మంచివాడు వస్తారు ఊర్లోకి వాళ్ళని చూస్తాం. సంసారం అన్న తర్వాత బంధువులు వస్తారు, అతిథులు వస్తారు. వాళ్ళకి చేయవలసిన మర్యాద గౌరవం వాళ్ళకిద్దాం. ఇవన్నీ కూడా జరుగుతూనే ఎలా ఉండాలంటే ఎప్పుడు భయమవుతుందో, ఎప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోగలనో, మళ్ళీ ఆ పడుకోపోయేటప్పుడు మనకు ప్రార్థన ఉంది. అది ఈ ప్రార్థన కంటే చిన్నదైన ఇంకో ప్రార్థన కాదు. అయ్యా! నేను పడుకోబోతున్నాను, కళ్ళు మూసుకుంటున్నాను, నా కాలు ఎక్కడుందో, చెయ్యి ఎక్కడుందో, నాకే తెలియదు. నా శరీరం నా అధీనంలో లేదు. నేను సుమారుగా వృద్ధాప్యంగానే ఉంటాను. వచ్చే కాలంలో ఏదో లోపాలు వస్తాయి కానీ బయట పని ఏమీ లేదు. కానీ నేను తెల్లవారి లేచి ఈ ప్రపంచానికి ఉపయోగపడే జీవితాన్ని గడపాలి గనుక నేను అలా గడపాలి అంటే ప్రపంచం ఉండాలి. ప్రపంచం ఎలా ఉండాలి అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ సమస్త లోకాః సుఖినోభవన్తు. అంటే మొదటి ప్రార్థన అదే. రాత్రి పడుకోపోయేటప్పుడు ప్రార్థన అదే. నిద్రలేవండి అరచేతిలో మంత్రం చదువుకోండి, అరకాలులో మంత్రం చదువు-- అవన్నీ అయిపోయాయి. అవి వేరు. అవన్నీ ఎప్పుడంటే ఆధ్యాత్మిక లోతున ప్రయాణం చేశాక. ఇవాళ అసలు ప్రయాణమే చేయని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇష్టదేవతా ప్రార్థన అని ఒకటి, ఇలదేవతా ప్రార్థన అని ఒకటి, గురు ప్రార్థన అని ఒకటి, అనేకంగా మనం విభజించుకుంటూ వెళ్ళిపోతే మూడున్నరకి మనం లేవటం మనం మర్చిపోతాం. simple సమస్త లోకాః సుఖినోభవన్తు. ఇది ఆధ్యాత్మిక వ్యక్తిగత సాధన. ఇది ఒక పార్ట్. ఇక రెండవది స్వామి ఇవాళ కాదు సుమారుగా ఒక డెభై ఆ అరవై డెభై సంవత్సరాల క్రితం రెండు మాటలు చెప్పారు. ఆధ్యాత్మిక సాధనలో ఇవి చాలా అందరికీ ప్రధానమైనవి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే gossip అనేటువంటి దానిలో అంటే పుకారు, అక్కర్లేని న్యూస్, అక్కర్లేని విషయాల పట్ల ఒక్క క్షణం కూడా దాని కోసం మీరు నిచ్చించకండి అన్నారు. ఎందుకని అంటే పుకారుని నమ్ముతూ గనుక జీవించినట్లయితే మనసు తన స్థిరత్వాన్ని కోల్పోతుంది. నిగ్రహం ఉండదు. అన్నీ నశించిపోతాయి. ఇక రెండవది ఏ వ్యక్తిని కూడా ఆతని వెనుక విమర్శించకండి. ఎవరినీ మీకు నచ్చలేదు, ప్రశాంతంగా ఉండండి, దూరంగా ఉండండి. నచ్చిన వ్యక్తితో ఆధ్యాత్మిక భావాలు పంచుకుంటూ ఉండండి. జీవితానుభవాలు చెప్పుకుంటూ ఉండండి. మీరు విన్న మంచి మాట మాట్లాడుస్తూ ఉండండి. ఇవన్నీ కూడా వ్యక్తిగత సాధనలో చాలా ప్రధానమైనటువంటివి. మూడవది ఏమిటంటే మనకి ప్రతి వాళ్ళము సంపాదిస్తున్నాం. దాన్ని X అనుకుందాం. ఆ సంపాదనలో ఒక వంద రూపాయలు సంపాదించాం. వంద రూపాయలు మనకు కాదు. కుటుంబానికి చాలా భాగం ఉంది. అందులో కేవలం two percent అంటే వంద రూపాయల్లో రెండు రూపాయలు సమాజహితం కోసం ఖర్చు పెట్టండి. తొంభై ఎనిమిది మీ దగ్గరే ఉంచుకోండి. మీరు తొంభై ఎనిమిది charge చేసి స్వామి చెప్పిన ప్రకారం మేం చేశాం ఇలా అయిపోయాం అనకండి. స్వామి ఆ మాట ఎన్నడూ చెప్పలేరు. two percent of your savings సమాజహితం కోసం మీరు ఖర్చు పెట్టండి. అది medical కావచ్చు, education కావచ్చు లేదా ఏదన్నా ఎవరికన్నా అవసరానికి కావచ్చు, ఆహ్ ఎవరికన్నా ఆరోగ్యం కోసం వచ్చి, దేనికైనా two rupees మనం ఆదరముందాం. పదివేల రూపాయలు వచ్చినాయి two percent మనది కాదు. పది లక్షలు వచ్చాయి two percent మనది కాదు. ninety eight percent మనది అయినప్పుడు మనకేం ఢోకా లేదుగా. ఆ two percent ఎవరికి అంటే కలిగిన ప్రతి వాడు నలిగిన వాడిని కాచుకోవాలి. నలిగిన వాడు మన పక్కనే ఉంటాడు. మన ఎదురుగా ఉంటాడు. దూరంగా ఉంటాడు. ఎవరో వచ్చి చెప్తారు. రాముడికి కష్టం వచ్చిందండి. ఆ పిల్ల పెళ్లి అయిపోతున్నదండి. ఏదో ఆ తండ్రికి పదివేల రూపాయలు తక్కువ పడింది అన్నప్పుడు పదివేలు మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకపోతే నలుగురిని కలుపుకొని పదివేలు తీసుకెళ్లి ఇవ్వండి. స్వామి అన్నది వ్యక్తిగత చాగాలు ఈ ప్రపంచాన్ని నడిపించవు. సామూహికమైన చాగమే సర్వోత్తమమైనది. అందరం కలుస్తాం. పదివేలు కావాలంటే తలా పది రూపాయలు ఇక్కడ వేస్తే పది, పదివేలు ఐదు నిమిషాల్లో వస్తాయి. మీరు పదివేలు ఇవ్వండి, మీరు పదివేలు ఇవ్వండి అంటే పదివేలు ఎక్కడినుంచి రావు. అక్కర్లేదు. కాబట్టి ఒక కష్టాన్ని గట్టెక్కించే ఒక ప్రయత్నం ఆధ్యాత్మిక సాధనలో చాలా చాలా ముఖ్యం. ఆ అవతల వాడు ఎవరో మనకు తెలియదు. మనకి అతనితో ఎటువంటి రక్తసంబంధం లేదు, రాగుబంధం లేదు, అనురాగ బంధం లేదు. ఉన్నది ఏమిటంటే ప్రేమబంధం మాత్రమే.మనలాగానే ఒక మానవ జన్మ ఎత్తు వచ్చినటువంటి వాడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో మనం చేయగలిగి గనుక చేయకపోతే దానికించిన అరాచకం, రాక్షసత్వం మనకు లేదు. మనలో ఆరు ఆంబిషన్స్ ఉన్నాయి. ప్రధానంగా దానవత్వం ఎక్కువ భాగం. దాని పక్కనే దీనత్వం రెండవ భాగం. మూడవ భాగం మానవత్వం. ఆదికముది దివ్యత్వం. మనలో దివ్యత్వం ఉన్నది అని మనకు తెలియదు. నీలో ఉన్నది అని స్వామి డబ్ల్యు.టి. అంటే ఏంటి చెప్పారు? దివ్యత్వం వైపు మనం వెళ్లలేం. దివ్యత్వం అంటే ఆత్మ, పరమాత్మ అదేదో వేదాంతం అంటే అంటారు. దివ్యత్వం అంటే యాన్ inner light. మన ఆలోచన, మన భావన, మన సంకల్పాలు, మనం ఆలోచించేటువంటి తీర్మానాలు, ప్రపంచం పట్ల మనకున్న అవుదార్యం, ఇవన్నీ కూడా వ్యక్తిగత సాధనలో చాలా ప్రధానమైన అంశాలు. ఇవేమీ లేకుండా మీరు మూడు వందల ప్రదక్షిణాలు చేసినా లేదంటే వేరే దేవాలయాలకు వెళ్లి రోజు కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చినా ఏం మిగులుతుంది అంటే ఏమీ మిగలదు. ఏం ఎప్పుడు మిగులుతుంది అంటే ప్రేమతో కూడిన సేవ, సేవతో కూడిన ప్రేమ ఈ రెండూ సమష్టిగా సంఘటితంగా గనుక మనం చేయగలిగినట్లయితే ఆధ్యాత్మిక సాధన మరమ్మत, బలీయంగా మారుతుంది. అందుకనే సంస్కరింపని యెడల సఖమంతటినీ సజ్జనుల వలె స్వార్థమునికి ఒక నీచుడప్పుడు ఉరిలో తడులు. సమాజం మొత్తాన్ని మనం మార్చలేం. redefine చేయలేం. refine చేయలేం. ఏమీ చేయలేం. ఏది? సమాజం మొత్తాన్ని. కానీ సమాజం అంతా మారాలి అంటే అది వ్యక్తిగతమైనటువంటి స్థాయి నుంచి ప్రారంభం కావాలి గనుక ఒక వ్యక్తి గనుక మారితే వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ గనుక మారితే సమష్టి మారుతుంది. సమష్టి గనుక మారితే సృష్టి మారుతుంది. సృష్టి అద్భుతమైనటువంటి రూపాంతరీకరణ చెంది గనుక అయినట్లయితే మార్పు చెందినట్లయితే అది పరమేశ్వర స్వరూపంగా మనకి అనుభవంలోకి వస్తుంది. ఈ సమాజం అంతా కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే. మనం విశ్వరూప దర్శనం సినిమాల్లో చూశాం. కదా. ఆ నాటకాల్లో కూడా చూశాం. కావ్యాల్లో చదివాం. పౌరాణిక వంశంలో అనేక మంది పౌరాణికులు, హరికథకులు వాళ్లు చెప్తే విన్నాం. ఈ విశాలమైనటువంటి ఈ విరాట్ స్వరూపం ఏమిటి అంటే అది seventy mm మీద కనిపించేది కాదు. gross గా ఉండేది కాదు. subtlest of the subtle. అణువుని యా-- అణువు కంటే, పరమాణువు కంటే కూడా సూక్ష్మ సూక్ష్మైతరికంగా ఉంటుంది. దానిని అది ఎక్కడ ఉన్నది, ఆ spark ఎక్కడ ఉన్నది అంటే మనలో ఉన్నది. దానినే స్వామి ఈ వేదాంత పరిభాషని కాస్త పక్కన పెట్టి మీలోనే ఆత్మ శ్రీమయంగా, చరాచరమయంగా, వాగ్మయంగా, జ్యోతిర్మయంగా ఉన్నది అని చెప్పారు. ఇది స్వామి మాట. శ్రీచరము శ్రీ-- శ్రీమయము అంటే శ్రీ అంటే బుద్ధి, శ్రీ అంటే సంపద, శ్రీ అంటే ఆహారం, శ్రీ అంటే స్థానేశ్వరుడు. చూశారా! కాబట్టి అనేక అర్థాలు ఒక్కొక్క అక్షరానికి ఉంటాయి. కాబట్టి ఈ శ్రీమయంగా ఉన్నది మనలోనే ఉన్నది. ఆహారం మనలోనే ఉన్నది. అమృతం మనలోనే ఉన్నది. ఆహారాన్ని వదులుచుకోవాలి. ఆహారం అంటే ఇంగ్లీషులో negativity. అమృతము అంటే positivity. ఎప్పుడైతే positivity మనలో పెరుగుతూ ఉంటుందో negativity మన నుంచి దూరమైపోతుంది. అంతే కదా. light వెయ్యగానే torch light వెయ్యగానే చీకటి వెళ్లిపోయింది అంటున్నాం. చీకటి ఎక్కడికి వెళ్ళలా వెలుగు వచ్చింది. చీకటి కనబడటం లేదు. చీకటి పోయింది కాదు, వెలుగు వచ్చింది కాదు. వెలుగు మనం సృష్టించుకున్నాం. అట్లాగే చరాచరమయంగా ఉన్నది. చరంగా, అచరంగా, నడుస్తున్నట్లుగా, నడవనట్లుగా, ఉంటున్నట్లుగా, లేనట్లుగా, కనిపించినట్లుగా, కనిపించనట్లుగా చరాచరమై. అది ఒక అర్థం. రెండోది విస్తృతంగా సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఇది అఖండమై, చిత్తనమై, అనంతమై, అవ్యయమై, అద్వితమై, అప్రమేయమై, అపరిమితమై ఉన్నటువంటి ఒక స్థితి ఏంటంటే దాని పేరే ఆత్మ. దాని పేరే వెలుగు. ఆ వెలుగు మనలో ఉన్నది. ఇక శ్రీమయమైంది, చరాచరమయమైంది, వాగ్మయంగా ఉన్నది. ఆ వాగ్మయం అంటే మాట. ఇప్పుడు ఈ మాటలన్నీ వినబడుతున్నాయి, అనబడుతున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాక్కుకి అగ్ని స్వరూపం అని పేరు. లోపల అనేక భావాలు పుట్టి అనేక ఆలోచనలు పుట్టి అవన్నీ రగిలి రగిలి, ముగిలి ముగిలి అనేకమైనటువంటి పరిణామాలను తోలుచుకొని అది నెమ్మదిగా అధోస్థానం నుంచి అనాహత చక్రం ఎక్కడిదాకా వచ్చి ఇది కూడా దాటి కంఠస్థానం వరకు వచ్చేప్పటికి ఇవన్నీ కూడా ఒక మాటగా నిలకడ చెందుతాయి. ఆ మాట మాట్లాడాలి అంటే ఒక భాష కావాలి. అది తెలుగా, ఇంగ్లీషా, ఆరబికా, ఏది కానివ్వండి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడిలోనూ మాట పుట్టడం అనేది లోపల నుంచి, భావనలో నుంచి, ఆలోచనలో నుంచి పుడుతుంది గనుక దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే అది విశుద్ధ చక్రం అంటారు. అంటే దీనిని మించి ఇంకో శుద్ధ చక్రం లేదు. ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఇది మర్యాద, పురుషోత్తముడు ఉండే place. ఇది స్వయంగా స్వామి ఇక్కడ గురువు అయినటువంటి place. అంతే కాదు మనందరం వచ్చిన purpose వేరు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణ ప్రదేశం, ఆవరణ దోషం లేని ఈ ప్రదేశంలో ఎలాగైతే అంటే మందిరంలో ఇప్పుడు ఎలా నిశ్శబ్దంగా, highly disciplined గా, highly focused గా concentration తో ఉన్నామో ఈ మందిరం దాటి...మనం మైదానంలోకి వెళ్తాం. ఆ మైదానంలో కూడా ఇలాగే ఉన్నట్లయితే వ్యక్తి సాధ-వ్యక్తిగత సాధనలో మనం hundred percent సాధించినట్లు. ఈ గంట బాగుంది ఇరవై మూడు గంటలు గనక ఇంకో రకంగా ఉన్నట్లయితే వ్యక్తిగత సాధనే పదానికి అర్థమే లేదు. కాబట్టి ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇక్కడే ప్రారంభం. ఇక కడగా ఇదంతా ఈ దివ్యత్వం ఎక్కడ ఉన్నది అంటే జ్యోతిర్మయంగా ఉన్నది. ఒక వెలుగుగా ఉన్నది. మనకి స్వామి చెప్పిన జ్యోతి జ్యానం అనే ఒక ప్రక్రియ ఉంది. అంటే ఏం లేదు మనల్ని మనం తెలుసుకోవడానికి. మొట్టమొదట చెప్పిన మనలో మనం ఉండటానికి, మనతో మనం ఉండటానికి, ఎదురుగా కనిపి-కనిపిస్తున్న వస్తువు దాని శక్తిని మన లోపలికి తీసుకుని ఈ బయట ఏది కనిపిస్తున్నదో అది ఆయందే ఉన్నది అది నేనై ఉన్నాను అనుకోగలిగితే అది అపూర్వమైనటువంటి వ్యక్తిగత సాధన. ఇక్కడ వ్యక్తిగత సాధనలో జాగాలు, పరిజాగాలు, చందాలు, దందాలు, ధనాలు ఇవి ఏవీ కావు. వీటి స్థానమే లేదు. నేను ఒక వ్యక్తిగా నాలో ఉన్న దివ్యత్వాన్ని గనక గ్రహించాలని నేను ప్రయత్నం చేయటం మొదలు పెడితే దాని పేరు మాత్రమే అధ్యాత్మ సాధన. ఈ అధ్యాత్మ సాధన వ్యక్తిగత సాధనలో నుంచి ప్రారంభమై నేను ముందై, నేను ముందు దారి చూపించి, నేను కట్టుకున్న ఇల్లాలుని కూడా ఆ దారిలో నడిపిస్తూ, నేను కన్న బిడ్డలను కూడా అదే దారిలో నడిపిస్తూ, మేం నలుగురమో, ఐదుగురమో, పది మందిమో, నా అన్నలు, తమ్ముళ్లు, స్నేహితులు అందరం కలిసి సామూహికంగా గనక సమష్టిగా ఒక కోహెసివ్ గా, సంఘటితంగా, శక్తివంతంగా మనం గనక వ్యక్తిగత సాధననే సమష్టి సాధనగా గనక చేయగలిగినట్లయితే అది ఒక అధ్యాత్మ సాధనై అది నెమ్మదిగా సంఘ వికాసానికి దారి తీస్తుంది. సంఘము అనేది మనందరం కలిస్తే సంఘం. మనందరం కూడి ఉంటే దాని పేరు సంఘం అంతే. ఇది ఘం అది ఘం. సంఘం ఇప్పుడు మనందరం కూడి ఉన్నాం. మనందరం ఎవరి వైపు ఎవరి ఇంటి వైపు మనం వెళ్ళిపోతున్నప్పుడు దేనితో కూడి ఉంటున్నాం? సంఘంతో కూడి ఉన్నాం. అక్కడ సంఘం లేదు. మన చుట్టూ సంఘం ఏర్పడింది. దాని మర్యాదలు వేరు, దాని పరిమితులు వేరు, దాని అవకాశాలు వేరు, అక్కడ మనం చేయవలసినటువంటి తీరుతెన్నులు వేరు కాబట్టి వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని ఆ మూడున్నర గంటలకు లేచి మనం ఎప్పుడైతే వ్యక్తిగత సాధనని ఆ లేవటంతో మొదలు పెడతామో దీనిని మీరు నేను time ఏం పెట్టను కొంతమంది అయితే నాలుగు రోజుల్లోనే దీన్ని అందుకోగలిగిన వాళ్ళు ఉంటారు. ఎవరి ఇంటి వారు ఈ ప్రయత్నం గనక చేసినట్లయితే సమాజం విశ్లేషించాలి. వ్యక్తి లేకుండా సమాజం లేదు. సమాజం లేకుంటే వ్యక్తి కూడా లేడు. వ్యక్తి అంటే వ్యక్తమైన వాడు manifest అయిన వాడు వాడి పేరు వ్యక్తి. ఆ అవతలి వ్యక్తి అంటాం. ఆ అవతలి వ్యక్తికి మనం ఒక అవతలి వ్యక్తి. అవతలా ఇవతలా అంటూ లేదు ఉన్నదంతా ఈ భూమండలం మీదే ఉన్నది గనుక వీటన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకుని సమాజాన్ని క్షుణ్ణంగా చదువుతూ ఉండాలి. సమాజ అవసరాలను గమనించాలి. సమాజం అనేక రీతిలో అది ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ఒక దారి ఇంకనూ ఎందుకు లేదంటే ఒక నాటి సమాజం రుజుమార్గంలో ఉండి ఆ రుజుమార్గానికి రెండు మాటలు ఉండేవి. సత్యం వద, ధర్మం చన అంతే. సత్యం వద అంటే సత్యమే పలుకు అని. కానీ మా వాళ్ళు ఏం చెప్పారంటే అబద్ధం చెప్పకపోతే అది సత్యమేనని చెప్పారు. చాలా ప్రాథమికమైంది. సత్యం వద అంటే సత్యము అంటే సతతము ఉండేది. అన్నివేళలా ఉండేది. ఇప్పుడు మనం ఉన్నాం. నేనే ఉన్నాను. ఈ దేహం నేను ధరించి వచ్చాను. ఈ దేహాన్ని నేను భరిస్తున్నా. దీనిని భరించాను, ధరించాను, దీన్ని నిలబెట్టుకుంటున్నాను. దీనికి ఒకానొక సమయం ఏర్పడినప్పుడు దీనిని ఒక కాసు పువ్వు పౌర్ణమి నాడు కొదళ్ళలో తన పైన పొద ఎట్లాగైతే ఏర్పడి కుబుజం విడిచేసి మళ్ళీ కొత్త చర్మాన్ని తనంతట తాను తెచ్చుకుంటున్నదో అట్లాగే పుట్టిన ప్రతి వ్యక్తి ఈ దేహాన్ని వదిలి పెట్టవలసిందే. అంతే కదా! No exception. మరి ఈ వదిలిపెట్టేటువంటి దీనిని మన నుంచి దూరం అయ్యేటువంటి దాన్ని సత్యంగా భావిస్తాం. చూశారా? సత్యం ఏంటంటే దేహం పోవచ్చు గాక మన లోపల ఉన్నటువంటి ఇందాక చెప్పిన ఆ వెలుగు ఏదైతే ఉన్నదో ఈ కంటైనర్ లో నుంచి, ఈ పాత్రలో నుంచి ఇంకో పాత్రలోకి వెళ్తుంది. అది గనక మనం గ్రహించగలిగితే ఇది అధ్యాత్మ సాధన. వ్యక్తిగానే ఇలా అయినప్పుడు మరి ప్రపంచమంతా ఏమిటంటే మనం ఎలా మార్పు చెందాం చెప్పండి? బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్యమయస్, వృద్ధాప్యం ఇన్ని దశలు ఎప్పుడైనా బాల్యం మనకి వీడ్కోలు చెప్పిందా? చెప్పలే. కౌమార, యవ్వన దశలో నువ్విమ్మే నుంచి వెళ్ళిపోతున్నావ్ టాటా అన్నయ్యా అనలే. మనకి చెప్పకుండానే మన నుంచి వెళ్ళిపోయిని వృద్ధాప్యం లోపల అడుగు పెట్టింది. ఈ వృద్ధాప్యం ద్వారా, ఈ ద్వారం ద్వారా మనిషి తన జీవయాత్రను ముగిస్తాడు. ఇది వేదాంతం. ఈ వేదాంత భూమికలో మనం ఏమి చేయాలి అంటే నేను ఆత్మనై ఉన్నాను. నేను పోవచ్చు గాక. ఈ శరీరం పోవచ్చు గాక. నేను చేసిన పనులన్నీ ఈ ప్రపంచంలో ఉన్నాయి. నేను చెప్పిన మాటలన్నీ నా రాముడు రామో విగ్రహవాన్ ధర్మః. రాముడు ఎప్పటి రాముడు, ఎప్పటి త్రేతాయుగం ఇంకా ఆయనకి సీతారామ కల్యాణం చేస్తున్నాం. ఇంకా రామరావణం చేస్తున్నాం. గోకులాష్టమి చేస్తున్నాం. ఈ-ఈ పేరు మీద వారి స్మృతి వారు ఈ ప్రపంచానికి వదిలిపెట్టినటువంటి ఆ మార్గాలని ఇంకా పట్టుకొని మనం నడుస్తూ వెళ్తాం. మరి ఒక రాముడు, ఒక కృష్ణుడు, మరొకరు, మరొకరు శరీరాలుచైతన్యం మిగిలిపోయింది కదా! స్వామి దేహం వదిలిపెట్టి పదకొండేళ్లు అయిపోయింది. పన్నెండో ఏట ప్రవేశించాం. మరి ఆ చైతన్యం ఉండబట్టేగా నేను అంత దూరం నుంచి వచ్చినా, మీరందరూ అన్నీ వదిలిపెట్టి రాగలిగినా, ఎవరికోసం వచ్చామంటే ఒక్క సత్య సాయి భగవానుడి కోసం వచ్చాం. [కప్తాళ్] ఆ అదేమి కనపడదు. కనపడనక్కర్లేదు. మరి ఆ చైతన్యం ఎక్కడ ఉంది? అప్పుడు ఆ శరీరం వలనే పరిమితమైన ఆ చైతన్యం ఇవాళ విశ్వవ్యాప్తమైపోయింది. నదులలో, కానలలో, కొండలలో, బిడ్డలలో అన్నింటా, అంతటా ఒక చైతన్యం ఏర్పడింది గనుక ఆ చైతన్యానికి మనం పెట్టవలసిన పేరు ఏమంటే ఒక అద్భుతమైనటువంటి consciousnees అంట. దానికి ఇవాళ స్వామి చైతన్యాన్ని నమస్కరిస్తున్నాం అంతే కదా! స్వామి యొక్క దివ్య మహా స్మృతికి ప్రాణాలింకేటిస్తున్నాం. కనుక మనం కూడా ఒక స్వామి, ఒక రాముడు వదిలిపెట్టినట్లుగా మనం కూడా ఈ ప్రపంచ యాత్రలో కాలం అనేటువంటి ఒక ఇసుక ఎడారి మీద మనం నడుస్తూ ఉన్నాం. కాలంలో తప్పు నిత్తించే శక్తి లేదు దానికి. అది ఎంత దయామయో అంత కఠినమైనది. అది ఎవరినీ అపేక్షించదు, ఎవరినీ ఉపేక్షించదు. ఒక కాలంలో ఒక మనిషిని ఉత్తానం చేస్తుంది, అదే కాలం అదే మనిషిని పతనం చేస్తుంది. మనిషిని విశ్వవిఖ్యాతం చేస్తుంది, అదే కాలం అపఖ్యాతి కూడా తెచ్చేస్తుంది. కాబట్టి కాలం ఎవరికన్నా బంధువు అంటే ఎవరికీ బంధువు కానీ, పరమాద్భుతమైన శక్తి ఏదైతే ఉన్నదో అది కాలమైనప్పుడు ఆ కాలం ఎడారిగా ఉన్నప్పుడు మన మన పదముద్రలని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంటే వెనక్కి తిరగం. మన దగ్గర గోడ గడియారం ఉంటుంది గోడ గడియారంలో ఎనిమిది గంటల పది నిమిషాలు చూపిస్తుంది అనుకుందాం. కాదండీ నాకు ఏడు యాభై అయితే బాగుండు అంటే నువ్వు దాన్ని ముల్లు వెనక్కి తిప్పగలవు గానీ కాలాన్ని వెనక్కి తిప్పలేవు. అంతే కదా! నదీ ప్రవాహాన్ని వెనక్కి తిప్పలేవు. జీవితంలో కుట్టిన ఒక ఆలోచనను మళ్లీ వెనక్కి మళ్ళించలేవు. కానీ దేనినీ మళ్ళించలేని, వెనక్కి మళ్ళించలేని మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. మేము బాలున్నైపోవాలి, ఇదిగో ఈ పిల్లలు వయసుకు రావాలంటే మానసికంగా కాజాలమేమోగానీ దైహికంగా కాదు, శారీరకంగా నేను ముందుకు వెళ్ళాలి. అందుకే ఒకసారి ప్రశాంతి నిలయంలో ఒక పెద్దాయన వచ్చాడు. ఆయనకి అప్పటికి తొంభై నాలుగు ఏళ్ళు. వస్తే స్వామి ఆయనకి కుర్చీ తెప్పించి వేశారు. ఇలాంటిది ఒక కుర్చీ వేశారు వరండాలో. స్వామి రూమ్ నుంచి బయటకు వచ్చారు. వస్తూనే ఆరోజు ఎవరినీ పరిగణించలేదు డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆయన తొంభై రెండు ఏళ్ళు, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, స్వామి కనిపిస్తున్నారు, ఆనందంగా నమస్కారం చేశారు. స్వామి ఆ దయా హృదయం ఉంది కాబట్టి ఆ ఒక విభూతిని సృష్టించి పక్క వాళ్ళ దగ్గర ఒక పేపర్ అడిగి తీసుకొని కొంత పొట్టు పెట్టి కొంత ఆయన కొట్లో వేసి కొంత ఆయన ఇందెలకు రాసి ఇందెలు తుడుచుకోమని ఆ మిగిలిందంతా కూడా ఆ పేపర్లో వేసి మొత్తం జేబులో పెట్టారు. ఇదంతా చాలా బాగుంది కదా! అప్పుడు స్వామి ఆయనను ఏమడిగారంటే "ఏం చేస్తున్నావు?" అని అడిగారు. ఏదో కాలక్షేపం చేస్తున్నాను. ఇక చేయడానికి ఏముంది? తొంభై నాలుగు. ఇప్పుడు మనం డెబ్బై అయ్యాం అంటున్నాం. ఎవరినన్నా డెబ్బై వాళ్ళని పరికించండి. ఏముందండీ అంటే ఏమి? ఏమై-ఏమైపోయిందంటే మీ పిల్లలు పెళ్లిళ్లయ్యాయి. వాళ్ళు మనవోళ్ళు పుట్టారు. వాళ్ళ సంసారం ఏర్పడింది. ఇంకా అదే నీలని అనుకుంటున్నాం అది యాతన. ఆ రేఖ. సరే స్వామి మళ్ళీ-మళ్ళీ మరొక ప్రశ్న వేశారు. "కాలక్షేపం అంటే ఏం చేస్తున్నావు?" ఏదో కాలం గడిచిపోతున్న స్వామి అని. "నువ్వు కాలాన్ని గడుపుతున్నావా? కాలమే నిన్ను గడుపుతున్నదా? ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా?" అన్నారు. ఎంత అద్భుతమైన ప్రశ్న చూడండి! కాలమే మనల్ని గడుపుతుంది. కాలమే మనల్ని ముందుకు నడుపుతుంది. కాలమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆ సత్యం వదా అంటే ఇలా అంటా. వదా అంటే అను లేదా నేను అంటా. ఎలా అంటాం అంటే మీరు అనుకునే ఈ వి.ఎస్.ఆర్ మూర్తి ఆహ్ ఇవాళ ఇట్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎంతో ఇంకో యాభై ఏళ్ళు బతకచ్చు. అది మన చేతుల్లో లేదు. దాన్ని పక్కన పెడితే నేను ఒక వి.ఎస్.ఆర్ మూర్తినో, ఒక శుభారావు గారినో, ఇంకొకరినో ఎవరినో ఆత్మ స్వరూపుడిగా గనక నేను భావించినట్లయితే నేను కూడా నా మనసుకి, బయటికి కాదు మనసుకి ఏం చెప్పాలి అంటే సత్యం వదా, నేను ఆత్మనే అని చెప్పాలి. దాని అర్థం అసలు అది. ఇవాళ అది కూడా పోలింది. నువ్వు ఎవరూ తెలుసుకోవాలి అని గనక ఎవరు నన్ను అడిగితే, ఆ వెళ్ళి ఎందుకండీ రమణ మహర్షి ఎందుకు? సత్య సాయిబాబా వారు ఎందుకు? ఈ వేదాంత గ్రంథాలు ఎందుకు? Just give me your ఆధార్ కార్డు I will tell everything about you అంటున్నారు. అవునా? ఆ ఆధార్ కార్డు గనక పెట్టేస్తే మన జీవిత విశేషాలు వస్తాయి కదా. కానీ మనం ఎవమో చెప్పలేం. సత్యాన్ని ఆవిష్కరించలేం. ఇవన్నీ మనం సృష్టించుకున్న అనుకూల విశేషాలు తప్ప మరొకటి కాదు. రెండవది ధర్మం చల. చల అంటే నడవడి. ధర్మ మార్గంలోనే నేను నడుస్తాను. ఏంది ధర్మ మార్గం? వ్యక్తిగతంగా నాకు ధర్మం ఉంది. నేను ఎలా behave చేయాలి? నా character ని నేను ఎలా నిలబెట్టుకోవాలి? నా సంస్కారాన్ని నా తల్లిదండ్రులు, నా జాతి, నా దేశము, నా గురువులు, నా ఋషులు, నా మహర్షులు వారందించినటువంటి ఒక సంస్కృతి ఏదేది ఉన్నదో దానికి వారసుడిగా నేను పుట్టాను. నేను దానికంటే భిన్నమైన ప్రదేశంలో పుట్టలా. వాటి మధ్యనే పుట్టాను. కాబట్టి వాటన్నింటినీ పరిరక్షించేటువంటి మార్గం ఏమిటి అంటే ధర్మ మార్గాలంపిక. ధర్మ మార్గాన్ని మాత్రమే అనుసరించి నేను జీవిస్తాను. అలాగే అది వ్యక్తి ధర్మం. ఇక రెండవది కుటుంబ ధర్మం ఉంది. మనందరికీ కుటుంబాలున్నాయి. సంసారాలున్నాయి. భార్య, పిల్లలు, తల్లులు, తండ్రులు, బాత్తలు, మనవళ్ళు అందరున్నారు అందరికీ. వాళ్ళ పట్లఏమిటా ధర్మం అంటే గడచిపోతున్న కాలం నుంచి రాబోతున్న భవిష్యత్తులోకి వర్తమానం ఒక bridge అయినట్లయితే మన నుంచి వచ్చినటువంటి మన బిడ్డలందరూ నెమ్మదిగా ఎదుగుతూ ఎదుగుతూ వాళ్ళ జీవితాలు ఏర్పరచుకుంటూ ఉన్నప్పుడు వారి జీవితాలను గనుక మనం సాక్షిగా చూడగలిగినట్లయితే without interfering and without intervening మనం అడిగాతల్లి ఎవరు? దాని పేరు ధర్మం. ధర్మ మార్గంలో. ఇది అయిన తర్వాత ఒక భర్తకి తన భార్య పట్ల ఒక ధర్మం ఉంది. ఏమిటంటే తాను ఉన్నంత కాలము తన భార్యని ప్రేమించాలి అభిమానించాలి గౌరవించాలి. మూడోది చాలా ప్రధానం. అందరూ అభిమానిస్తారు ప్రేమిస్తారు కానీ గౌరవించాలి. ఒక వ్యక్తి తన భార్యని గనుక తన ఇంట్లో తాను గౌరవించకపోయినట్లయితే అధ్యాత్మ లేదు సాధన లేదు వికాసము లేదు జన్మ వృథా. అలాగే ఒక స్త్రీమూర్తి తన భర్తని కాచుకోవాలి. తన భర్త క్షేమాన్ని కోరుకోవాలి. ఎందుకనంటే he is a facilitator. అదే మూల శక్తి. మూల శక్తికి నీళ్ళు పోస్తూ స్త్రీ ఉండాలి. ఆ శక్తి వలన సంసార వృక్షం పెరుగుతున్నప్పుడు ఆ భర్త ప్రతి వాకుని ప్రతి కోపాన్ని ప్రతి భ్రాంతిని సమృద్ధంగా ఉదారంగా కాపాడుకోవాలి. ఇది కుటుంబ ధర్మం. అలాగే ఈ కుటుంబానికి రెండు పరిస్వాలు ఉన్నాయి. ఒకటి బంధువులున్నారు. ఆ బంధువులకి నిజానికి ఒక నిజమైనటువంటి ఒక కష్టం ఏర్పడినట్లయితే ఆ కష్టాన్ని పంచుకోగలిగిన ఔదార్యం ఉండాలి. అలాగే వాళ్ళకి ఆనందం కలిగితే వాళ్ళ ఆనందంలో కూడా అసూయ పడకుండా భాగస్వామ్యం వహించాలి. అది ఒక ధర్మం. వ్యక్తి ధర్మం ఏంటి? కుటుంబ ధర్మం ఏంటి? ఇంకా సంఘ మర్యాదలు సంఘ ధర్మాలున్నాయి. సంఘ నీతిని దాటి మనం వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి సంఘానికి ప్రతి సమాజానికి కొన్ని సీమ రేఖలుంటాయి. లేదా లక్ష్మణ రేఖలుంటాయి. వాటిని దాటి ప్రవర్తించడానికి వీల్లేదు. ఒక పురుషుడు పురుషుని మధ్య కూడా మర్యాద పూర్వకమైన దాన్ని వాడు English వాడు ఏమన్నాడంటే respectable distance అన్నాడు. మనం ఒక చేతి దూరం మోచేతి దూరం ఉండాలి అన్నాడు. ఈ మోచేతి దూరం ఎలా ఉంటాడో కరోనా మనకు బాగానే చూపింది. కదా. మోచేతి కాదు ఇక్కడ వీడుంటే అక్కడ భార్య ఉంటుంది. భార్య అక్కడుంటే వీడు అక్కడున్నాడు. అది కాదు. ఆ దూరం కాదు. మానసికంగా మనం మర్యాదగా ప్రవర్తించాలి. ఇవాళ మీరు అనేక organizations చూశారు. వాటిని పక్కన పెడితే సత్యసాయి organization లో ఒక డెబ్బై రెండు సంవత్సరాల క్రితం స్వామి భార్యాభర్త కలిసి అయినా ప్రశాంతి నిలయానికి వెళ్ళినప్పటికీ కూడా స్త్రీ స్త్రీలలోనే ఉండాలి. పురుషుడు పురుషుడిగానే ఉండాలి. ఎందుకంటే అధ్యాత్మ వ్యక్తిగత సాధనలో అక్కడ భార్యాభర్తలు కలిసి చేయటం లేదు. యజ్ఞం కలిసి చేయాలి. కానీ సాధన వైయక్తికం అంటాడు. అంటే individual. మీ సాధన మీరు చేయాలి. పురుషుల సాధన పురుషులు చేయాలి. దీనిని సూచించడం కోసమే ఎవరి మార్గంలో ఎవరి దారిలో వాళ్ళు ఉండాలని స్వామి నిర్దుష్టంగా దాన్ని ఆ ఆచరించి చూపించారు. మీరు విడివిడిగా ఉండండి. ఇది అయి సాధన అయిపోయిన తర్వాత మీరు మీరు భార్యే మీరు భర్తయే. మిమ్మల్ని ఎవరూ విడదీసేవాళ్ళు లేరు. మీ పెళ్ళిలో మీరు ఉండండి. కాబట్టి సమాజ ధర్మంలో మనం అన్నీ పాటించాలి. సమాజ అవసరాలను గుర్తించాలి. ఆ తర్వాత రాజ్య ధర్మం ఒకటుంది. రాజ్య ధర్మం ఏంటంటే ఈ భారతదేశానికి అంటే భరతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ఇక్కడ మనకి అద్భుతమైన రాజ్యాంగం ఒకటి ఏర్పడింది. రాజ్యాంగానికి లోబడే President of India కూడా ప్రవర్తించాలి. దాటి వెళ్ళడానికి వీల్లేదు. మరి రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే ఏమవుతుంది అంటే వెంటనే ఏం కాదు. తర్వాత అయ్యేది మనకు గుర్తుకు వస్తుంది. మా వల్ల కాదు. కాబట్టి నన్ను ఎవరు ఏమీ చేయటం లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. రాజ్యాంగం నాకు సంబంధం లేదు అంటే ఆ రాజ్యాంగమే నీకు చదువు చెప్పించింది. ఆ రాజ్యాంగం రాజ్యాంగంలోనే ఉద్యోగం చేశావు. ఆ రాజ్యాంగంలోనే నువ్వు అన్నీ కూడా నేర్చుకున్నావు. ఆ రాజ్యాంగమే నిన్ను రక్షించింది. కాబట్టి ఇవాళ ఈ భారతదేశానికి శిక్షా స్మృతిలో శిక్షా స్మృతికి కూడా మూలమైనటువంటిది ఏది అంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి మనం నమస్కరించాలి. ఎందుకంటే అది ఆ గోత్రులు, వెనుగోత్రులు, ఏనుగులు, మదపు ఏనుగుల పట్ల అది అంకుశంగా ఉన్నది కాబట్టి రాజ్యాంగానికి నమస్కరించాలి. మనలో ఇవాళ దురదృష్టవశాత్తు students ని ఎవరైనా students ఏముంది ఒక అరవై ఏళ్ళు దాటిన ఆయన్ని కూడా భారత రాజ్యాంగం ఎప్పుడన్నా చదివారా అంటే అత్యధికంటేతే జైల్లో చదువుతారంట. ఆ అట్లయితే గీత ఎలా చదివామో భారత రాజ్యాంగాన్ని అలాగే చదవాలి. స్వామి చూడండి tax evasion ఎప్పుడూ చేయకండి. మీరు tax లు కట్టండి. tax planning చేసుకోండి. ఇదే రాజ్యాంగం ఇవేటి చేయటానికి దారి చూపించలా? తప్పు అది నేరం అని చెప్పింది. కానీ tax planning చేసుకోవడానికి పదును చేసుకోవడానికి అదే రాజ్యాంగం నీకు ఒక positive అవకాశం ఇచ్చింది. ఏ మార్గం? ధర్మ మార్గంలో వెళ్ళినవాడు tax కడతాడు tax planning చేస్తాడు. అధర్మ మార్గంలో వెళ్ళిన వాడు tax evade చేస్తాడు. సంపదని గుప్తధనంగా మారుస్తాడు. కాబట్టి వీటన్ని మనమే ఎవరికీ ఇచ్చో కాదు. మనమే we have to pay the taxes. ఆ దానికి చేసేయాలి. అవన్నీ facilitate చేసినాయి. కాబట్టి ఈ ధర్మం చెడలా. దాని ఆ మార్గంలో నేను నడుస్తా అన్నప్పుడు అధర్మంలోకి వెళ్ళిన వాడుమాత్రమే శిక్షిస్తారు అంతే కదా! ధర్మ మార్గంలో ఉన్న వాడికి పోలిస్తు పని లేదు. స్వామి ని అడిగారు స్వామి ఇంత చెడ్డ వాళ్ళు అందరూ ఉన్నారు కదా! వీళ్ళందర్నీ ఎట్లా మీ మీ దగ్గర ఉన్న వాళ్ళల్లో కూడా చాలామంది ఆలోచనలో చెడ్డవాళ్ళు ఉన్నారు కదా! వీళ్ళందర్నీ ఎందుకు మీరు మీ దగ్గర పెట్టుకున్నారు అంటే, అసలు నేను వచ్చిందే వాళ్ళ కోసం అన్నారట. మీకోసం మీకు నేను మంచి వాళ్ళే already మీకు దేవుడు ఉన్నాడని నా భక్తి. స్వామి దేవుడని నా భక్తి. మంచి భార్యలుగా భార్యలుగా ఉన్నారు, చక్కని సంసారం నడుపుతున్నారు ఇంకా మీకు దేవుడు ఎందుకయ్యా మీరు లేని వాడి కోసం నేను వచ్చాను. దానిలో ఇంకా మితిమీరిన వాళ్ళు అందర్నీ నా దగ్గర పెట్టుకున్నాను అన్నారట. బాగుంది కదా! మంచి వాడికి దేవుడు అక్కర్లా. రావణాసురుడి కోసమే రాముడై వచ్చాడు. హంసుడికై కృష్ణుడు వచ్చాడు. అఘూరుడి కోసం కృష్ణుడు అక్కర్లా. విదురుడి కోసం కృష్ణుడు అక్కర్లా. కాబట్టి మనం సత్యం వద ధర్మం చర అనేది మన ఆధ్యాత్మిక మార్గంలో వ్యక్తిగత సాధనలో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, నేర్పాలి. మొన్న ఈ మధ్యనే నంచి స్వామి వారితో నేను ఒక గంట మాట్లాడినప్పుడు ఆయన అన్నారు text books మళ్ళీ రాయాలి అని గొప్ప పెద్దబాల శిక్ష రాయాలి అని చెప్పారు. ఆయన అన్నారు. పెద్దబాల శిక్ష సంస్కృతం మీద సంగీతం మీద నాట్యం మీద అదంతా మీకు ఆ YouTube లో దొరుకుతుంది. అక్కడ విశేషం ఏమిటంటే నేను ఏమన్నానంటే స్వామి వారి దగ్గర మా చిన్నప్పుడు పెద్దబాల శిక్ష అని ఒక పేరుతో ఒక పెద్ద బుక్కు ఉండేది. అది ఏమిటో తెలుసా? పెద్ద బాల శిక్ష. చాలా పెద్దది ఎవరికంటే మా వాళ్ళకి, మా వాళ్ళకి శిక్షణ. ఇప్పుడు కావలసింది ఏమిటంటే పెద్ద బాల శిక్ష కాదు పెద్దబాల శిక్ష కావాలి. పెద్దవాళ్ళకి కూడా తెలియాలి. ఇవ్వాళ ప్రబల విప్రల మరి చెప్పగలిగిన వారు ఉన్నారా అని నేను ప్రశ్నించాను. లేదు చైత్ర మాస శాసనం లేదు. మరి ఎన్ని మాసాలు ఉన్నాయి January February March December వరకు తరిచేస్తారు. అంటే భారతీయమైనటువంటి మూలాలు మనం పోగొట్టుకున్నాం. అంటే మళ్ళీ మీరు క్లాక్ వెనక్కి తిప్పుకున్నారంటే ఒకసారి వెనక్కి తిరిగి చూడండి జీవితాన్ని కూడా వెనక్కి తిరిగి చూడాలి కదా. ఏదన్నా ఆలోచన కలిగినప్పుడు వెనక్కే తిరిగి చూస్తాం ముందు చూసి ఆలోచించేయము కదా! కాబట్టి ఇది వెనక్కి తిరిగి ఎప్పటికప్పుడు review చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ వ్యక్తిగత సాధనలో ఉన్న అనేకమైనటువంటి మార్గాలు. ఇట్లా ఒక వ్యక్తి ఒక సంపూర్ణమైనటువంటి నిర్మాణం జరిగినప్పుడు దాని ద్వారా సమాజం వికసిస్తుంది తప్ప సమాజ వికాసానికి ప్రత్యేక మార్గాలు లేవు. వ్యక్తితో ప్రారంభమై సమష్టిగా ఏర్పడి సమాజం వికాసమానం చెందినప్పుడు ఒక సభ్య సాంస్కృతిక నాగరిక ఆరుష భారతీయమైనటువంటి ఒక వేద పరిపూతమైనటువంటి సమాజ నిర్మాణం జరిగినప్పుడు ఈ దేశంలో అశాంతికి తావు లేదు, అభద్రతకు తావు లేదు, అనాచారానికి తావు లేదు, అస్పష్టతకు తావు లేదు, అవిద్యకు తావు లేదు, అహంకారానికి తావు లేదు. కాబట్టి ఎక్కడ ప్రారంభం కావాలి అంటే వ్యక్తిగా మన నుంచి ప్రారంభం కావాలి. ప్రపంచానికి అది విస్తృతమై శాఖోపశాఖలై ఈ ప్రపంచం మొత్తానికి ఆరంభమై ఊడలై నీడలై సాచి తన అనంత బాహువులతో ఈ ప్రపంచానికి ఒక ధర్మార్థోపదేశం చేయగలిగినటువంటి ఒకామొక శక్తి ఎక్కడ ఉన్నదంటే కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నది. [అందరూ ఒకేసారి చప్పట్లు] దీనికి కారణం ఏమిటి? అంటే భగవంతుడు ఎప్పుడైనా ఈ సమాజాన్ని ప్రపంచాన్ని సృష్టిని సంస్కరించాలి అని ఒక అవకాశం ఏర్పడినప్పుడు, అవసరం ఏర్పడినప్పుడు మానవ దేహం తీసుకొని వచ్చినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఇంకెక్కడా దేవుళ్ళు రాలే. అనేక మంది వచ్చారు. దేవుళ్ళంటూ పుట్టిన దేశం ఏదన్నా ఉంటే, అవతార పురుషులంటూ వచ్చారా ఎక్కడ అంటే అది కేవలం భారతదేశం. అది ఆసేతు సీతాచలం కూడా యోగ భూమిగా తపో భూమిగా కర్మ భూమిగా ధ్యాన భూమిగా కాణ్య భూమిగా అనేక రకాలుగా భారతదేశం మీద ఎన్ని దండయాత్రలు జరిగినా ఎవరు ఎంతెంత కొల్లగొట్టుకొని వెళ్ళిపోయినా ఆధునిక గజనీలు ఇంకా దోచుకొని పోసుకొని వెళ్తున్నా ఈ దేశానికి మాత్రం ఢోకా లేదు. ఎట్లా ఉంటదండి? అన్ని ఇంట్లో వాణ్ణి పట్టుకుపోతే ఇల్లు ఖాళీ అవదా అంటే ధర్మో రక్షతి రక్షితః. ఈ దేశాన్ని ఏది రక్షిస్తున్నది అంటే ఒక వంద మందిలో నలుగురు ధర్మ మార్గంలో ఉంటే ఈ దేశం రక్షింపబడుతుంది. వందలో తొంభై మంది గనక అయితే ఈ దేశం రక్షింపబడుతుంది. వందకి వంద ధర్మ మార్గంలో ఉంటే ఈ దేశం గురు స్థానంలో నిలబడి ప్రపంచాన్ని శాసిస్తుంది. [అందరూ ఒకేసారి చప్పట్లు] ఇవాళ సత్య సాయి భగవాన్ జీ యొక్క అవతార విలాస వైభవంలో ఆయన చెప్పిన సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటి మార్గం గాని help your partner never గాని అవేవి English భాషలో చెప్పారు గాని అవన్నీ వాటి మూలాలు అన్నీ వేద శాస్త్ర ఉపనిషత్ ప్రమాణమైనటువంటి మాటలే. అట్లా చెప్తే అర్థం కాదు గనుక మనకి English లో చెప్పారు. వేద వ్యాసులు వారు చెప్పిన సంస్కృత శ్లోకాన్ని help your partner never అన్నారు. love all serve all అన్నారు. అట్లాగే ఈ ప్రపంచాన్నంతా చదవ అన్నారు. అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమీ ఎవరు స్నేహితుండు ఈశ్వరుండే. ఎవర్రా? నీ గురువు ఎవరంటే అక్షత కట్టినవాడా, రుద్రాక్షం మెడలో వేసుకున్నవాడా, ఆయుధం పించేవాడా? కాదు. నీ అంతరంగనికి ఇచ్చిన గురువు లేడు. కాలమే నీకు గురువు. పరమ గురువు ఎవరంటే కాలం. కాలం ఏం నేర్పుతుందో, కాలం ఎన్నెన్ని విశేషాలు ఆవిష్కరిస్తుందో, జీవితాన్ని సతత త్రసుదలక ఆవిష్కరిస్తుందో.ఎన్ని రకాల మనుషులను పరిచయం చేస్తుందో, ఎన్నెన్ని సందర్భాలు సృష్టిస్తుందో, ఎన్నెన్ని సన్నివేశాలను రచిస్తుందో, ఎక్కడ కాలం పడదమేసి ముగిసిపోతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి కాలం గతికి పరవదు. మరి, నువ్వు ఏ పుస్తకం చదవాలిగా నేను చెప్పా భగవద్గీతలో రోజుకు అది practice కోసం. అసలు పుస్తకం ఏమిటి అంటే స్వామి అద్భుతమైనటువంటి పెంచెలి. గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే. నీ కంటి ముందు ఉన్నటువంటి ఈ సమాజాన్ని మించిన గ్రంథం మరొకటి లేదు. సమాజం భిన్నంగా, వ్యవస్థలు భిన్నంగా, వ్యక్తులు భిన్నంగా, జరుగుతున్న పరిణామాలు మనకిట్టే భిన్నంగా చూసినంత కాలం మనం ఎదగలేం, ఎరగలేం, మనల్ని మనం ఎలదొప్పుకోలేం. అవన్నీ నా నుంచి ఏర్పడినవి. ఎవరి నుంచో ఏర్పడిన దానిలో నేను కూడా ఉన్నాను. దీనిని నేను నెమ్మదిగా నా శక్తి కొద్దీ సంస్కరించాలి అని గనక మీరు అనుకున్నట్లైతే ఇందాక చెప్పిన వ్యక్తి సాధన, వ్యక్తిత్వ సాధన, వ్యక్తిత్వ పరిణామం ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి ఈ మార్గాలన్నీ కూడా ఉపదేశించేదానికి వచ్చినటువంటి మహా పరిపూర్ణ అవతారమే భగవాన్ శ్రీ సత్య సాయి. కాబట్టి వీటన్నింటినీ మనం జాగ్రత్తగా గమనిద్దాం. స్వామి ఏర్పరచినటువంటి ఆ నగర సంకీర్తన, భజన సాంప్రదాయం, కాస్త వేద పఠణం, వేద శ్రవణం అందరూ పట్టించలేరు. వేదం వినొచ్చు, రుద్రం వినొచ్చు, నమక చమకాలు వినొచ్చు, భగవద్గీత శ్లోకాలు వినొచ్చు. ఇవాళ technology మన చేతిలో ఉంది. ఏదైనా ఇట్లా బటన్ తొక్కగానే ఏది కావాలంటే అది వస్తుంది వినండి. మనస్సుని ప్రతిరోజూ మన ఇంటిని ఎలా శుభ్రం చేస్తున్నామో, ప్రతి గదిని మనం అనేక chemicals పెట్టి clean చేసి మన ఇల్లు బాగా ఉండాలి అని అనుకుంటున్నామో, చీమలు దోమలు రాకూడదని కోరుకుంటున్నామో మన మనస్సులోకి కూడా పాములు, తేళ్లు రాకుండా చూసుకోవాలి. మన మనస్సు గనక నిర్వీర్యమైతే, నిస్సత్తువతో ఉంటే, అలసత్వంతో ఉంటే, శక్తిహీనంగా ఉన్నట్లైతే మనకి మనము సాయం చేసుకోలేము. మనది దేశానికి సేవ చేయలేం. దేశమంటే ఈ సమాజం. మన చుట్టూ ఉన్నవారికి కూడా చేయలేం. కాబట్టి దానికి స్వామి ఇచ్చిన జవాబు ఏమిటంటే ఎవడు స్నేహితుండు అని. నీకు ఎవడు స్నేహితుడు అంటే ఒకడంటాడు, "ఇట్లా నేను ఒక్కసారి పిలుపిస్తే యాభై వేల మంది వస్తారు." వాళ్లందరూ నీ స్నేహితులా? పని చేయిస్తురేమో. నీకు వాళ్ళు తెలుసు, వాళ్లకి నువ్వు తెలుసు అంతే. సరే ఇంకాస్త ఆలోచిస్తే ఓ వెయ్యి మందికి నువ్వు బాగా తెలుసు. ఓ పది మందికి దగ్గరగా తెలుసు. ఒకరిద్దరికి నువ్వు బయట ఏమిటో తెలుసు. నీ లోపల ఎవరికి తెలుసు అంటే, నీ లోపల ఎవరికి తెలుసు అంటే ఆ తెలిసిన వాడివి నువ్వే తప్ప రెండో వాడు కాదు. ఇంకొడి మనసు మనకు తెలియదు. మన మనసే మనకు అప్పుడప్పుడు తెలియదు. కాబట్టి ఈ శరీరం మనం వదిలిపెట్టేదాకా ఎవరయ్యా మనకి స్నేహితులు అంటే ఒకాయనన్నాడు పంచ ప్రాణాలు మనకి మన శరీరం తోడు అన్నాడు. సహస్ర ప్రణవాఖర్ భగవత్పాదు. మనం ప్రాణం వదిలిపెట్టేదాకా మనతో ఉన్న నిజమైన స్నేహితులు ఎవరంటే మనలో ఉన్న పంచ ప్రాణాలు. మనం అది వదిలిపెట్టినప్పుడు ఆ ఐదు ఒక్కసారి ఎగిరిపోతాయి కాబట్టి ఈ ప్రాపంచికమైన స్నేహాలన్నీ, అవసరాలన్నీ, అవకాశాలన్నీ, అనేక సందర్భాలకి లోబడి ఏర్పడతాయి. ఆ మిత్రుత్వంలో దాతృత్వము, ఒక నమ్మకము, విశేషమైనటువంటి సంస్కారం అన్నీ ఉన్నట్లయితే స్నేహాలు నిలబడతాయి. కానీ వీటితో ఏ ప్రమేయం లేకుండా నీతో నెలకొలది చెంది ఉన్నటువంటి పరమేశ్వరుడు మాత్రమే నీకు స్నేహితుడు. రప్పించిన వాడు ఆయనే, నడిపించిన వాడు ఆయనే, తప్పించేవాడు ఆయనే, తెప్పించిన వాడు ఆయనే, వదిలించి పెట్టేవాడు కూడా ఆయనే గనుక ఎవడు స్నేహితుండు అని ఆగి ఈశ్వరుంటే అనుకోగలిగితే అది నిజమైనటువంటి వ్యక్తిగత సాధన. ఆ వ్యక్తిగత సాధనలో నుంచి సమాజం విస్తృతం కావాలి. ఇవాళ ముక్కు నగరంలో ఈ మందిరం నిర్మాణం వెనక అనేక మంది యొక్క కృషి, అనేక మంది చేసిన తపస్సు అది నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. మీకులో, మీకెవరికీ అంటే ఈ తరానికి కొంచెం కొంత వాళ్ళు ఉంటే, ఉన్నారు. వాళ్ళకి ఈ కోణంగా చెప్తాను. ఇక్కడే కూర్చొని స్వామి సత్సంగం పగలు ఎప్పుడో పదకొండు గంటల వేళ చేస్తున్నప్పుడు ఆ ఎదురుగా గులాబీ చెట్లు చాలా ఉన్నాయి. ఆ గులాబీ చెట్లు చాలా వికాసమాన స్థితి ఉంటాయి. మనకి ప్రపంచంలో ఒకే ఒక్క పువ్వు సూర్యుని గమనాన్ని బట్టి తిరుగుతుంది. అదే కదా! దాని పేరు పొద్దు తిరుగుడు పువ్వు. అంటే పొద్దును బట్టి తన తిరుగుడు తను తూర్పుతో ప్రారంభిస్తుంది. నెమ్మదిగా తిరిగి తిరిగి సూర్యాస్తమయం అయ్యేప్పటికి వాడిపోతుంది. అది కూడా పడమటి దిక్కు చూస్తుంది. దాంట్లో ఎక్కడా mechanism లేదు. కానీ ముక్కు నగర మందిరంలో ఉన్న పరమాద్భుతం ఏంటంటే సత్సంగం ప్రారంభించి సత్సంగం అయ్యేదాకా గులాబీ చెట్లన్నీ ఇటు తిరిగినాయి పొద్దుతో. అది ఎవరు చూశారో తెలీదు. ఇది సత్యం. అది ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. రాజు గారు వీళ్ళందరికీ తెలుసు, నాయుడు గారు వీళ్ళందరికీ. కాబట్టి మన భావాన్ని బట్టి ప్రకృతి మనతో సహకరిస్తుంది. ప్రకృతి మన మీద కరాళకృత్యం చేయదు. ప్రకృతితో సహజీవనం చేయాలి. దానితో పాటు నడవాలి. ప్రకృతి మీద మనం ఆధిపత్యం చేయించాలి అన్నప్పుడు, భూమిని తవ్వినప్పుడు భూకంపం వస్తుంది. నదులను ఎండబెట్టినప్పుడు, మళ్ళించినప్పుడు భూమి అంతా ఎడారిగా మారిపోతుంది. కనులను తవ్వుతున్నప్పుడు మన ecology అంతా దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా నిరోధించి ప్రకృతితో సహజీవనం చేయడం కూడా అధ్యాత్మ సాధనలో చాలా గొప్ప వ్యక్తిగత సాధన. మనం చర్మకూడదు. మనం ఏ రకమైన దుష్కార్యాలుపాల్పడకూడదు. మనం చేయగలిగినంత positive గా మనం చేయగలిగినంత రీతిలో మన జీవితాన్ని కేవలం spirituality అనే పేరు మీద కేవలం భక్తి మార్గం కాదు, కర్మ మార్గంలో కూడా జ్ఞానాన్ని. మొన్న ఏదో ఒక interview లో చెప్పాను. కర్మ, భక్తి, జ్ఞానం ఈ మూడు యోగాలు ఉంటే ఒక కర్మయిష్టి నెమ్మదిగా భక్తుడై ఆ తర్వాత జ్ఞాని అయి ఏం చేయాలి? ఏం చేయకూడదా? నేను జ్ఞాని అయిపోయినానండి, నన్ను interview కి పిలవొద్దు, నేను ఇంక వైజాగ్ కి రాను, నేను మా ఇంట్లో కాళ్ళు చేతులు కట్టేసి కూర్చుంటాను అంటే నువ్వు ఎవరికి ఉపయోగం? నేను ఆ జ్ఞానాన్ని మళ్ళీ భక్తిగా మార్చుకోవాలి నేనే. ఆ భక్తిని నేను మళ్ళీ కర్మ మార్గంలో ప్రవేశపెట్టాలి. తెలియనప్పుడు కర్మని కర్మగా చేశాను. జ్ఞానం సిద్ధి పొందిన తర్వాత అదే కర్మని జ్ఞానంతో చేశా. అదే భక్తిని విశేషమైనటువంటి ఒక rational approach తో, సార్వజనీనమైనటువంటి భావనతో, విశ్వభావనతో, సమర్పణ భావనతో, శరణాగతితో, వినయంతో మనం గనక చేసినట్లయితే అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక భూమిక దాన్ని సమాజ వికాస ధారలో పుడిపడిది. ఇవాళ అనేక సంస్థలకి నేను speaker గా వెళ్తా. సత్యసాయి సంస్థకి seeker గా వస్తా. అంతే తేడా. అక్కడ మాట్లాడతాము, ఇక్కడ తెలుసుకుంటాము. అవన్నీ ఇది కర్మ క్షేత్రం. ఇక్కడ పని చేయాలి. విశేషమైన బుద్ధితో చేయాలి, భక్తితో చేయాలి, ఏకాగ్రతతో చేయాలి. ఈ కార్యకలాపాలన్నీ స్వామి ఇక్కడ వింటున్నాడు అన్న భావనతో మన నుంచి మాట బయటకు రావాలి. స్వామి ఇవన్నీ వింటూ ఆనందిస్తున్నాడు అన్న ఆనందంతో మనందరం కూడా ఈ ఆనందాన్ని పంచుకోవాలి. దీన్ని మించి ఇంక మరొకటి లేదు. అనేకమైన సంస్థలకి నేను వెళ్ళినప్పుడు వాటిని చాలా తీవ్రంగా, చాలా లోతుగా అధ్యయనం చేసినప్పుడు నాకు కలిగే ఒక భావన. నేను సత్యసాయి organization ని ఎక్కడో ఒక highest pedestal లో పెట్టడానికి several emotion ని నేను ఆవిష్-- ఆవాదించకుండా rational గా ఒక యదార్థంగా absolutely reality తో చెప్తున్నా. అదేంటంటే వ్యక్తిగత సాధనకి అనువైనటువంటి ఒక సం-- సంఘం ఏదన్నా ఉన్నదా, ఒక సంస్థ ఏదన్నా ఉన్నదా అని నన్ను ప్రశ్నిస్తే దాని పేరు సత్యసాయి సేవా organization. [కప్స్ కొట్టడం] భగవత్ తత్వాన్ని తెలిపేటువంటి మార్గం సూచించే సంస్థన్నా ఉన్నదా అంటే మళ్ళీ సత్యసాయి సేవా organization. కాదండి మాకండి మా దగ్గర సంపద ఉంది, ఆలోచనలు ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడ నేను ప్రవర్తించాలో సేవ నాకు తెలియట్లేదు అంటే దానికి మార్గం సూచించేటువంటి ఒకే ఒక్క ప్రపంచ విఖ్యాతమైన సంస్థ సత్యసాయి సేవా organization. [కప్స్ కొట్టడం] దీన్ని మనం ఎంత అదృష్టమో! ఎన్ని జన్మల తపస్సు చేసి ఒక పరిపూర్ణ మహా అవతారికి సమకాలినులమైన ఒక జన్మ ఎత్తి వారు వేసినటువంటి మార్గంలో అడుగులు వెడివెడిగా వేస్తూ వెళుతూ జీవితాలను శుభ్రపరుచుకుంటూ ఒక నది ఎక్కడో పుడుతుంది. ఎక్కడో ఎత్తులో పుడుతుంది. నెమ్మదిగా పల్లానికి జారుతుంది. మూలపట్టాలని అనేకమైన ప్రాంతాలని చక్కగా శుభ్రపరుస్తూ తనను తాను శుభ్రపరుచుకుంటూ తనలో ఉన్న మాలిన్యాలను వదిలిపెడుతూ నెమ్మది నెమ్మదిగా వెడివెడిగా వెళ్ళి, వెళ్ళి, వెళ్ళి నిష్కళంకమంత రంగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, హాయిగా సాగర సంగమం చేసి తన మూల స్థానంలోకి తాను వెళ్ళి పొందుతుంది. మనకు కూడా సత్యసాయి సేవా organization లో అడుగు పెట్టిన నాడు ఒట్టి raw diamond గా వస్తాం. వజ్రాలమే raw diamond దానికి polish లేదు. కొన్నాళ్ళు ఈ సంస్థతో ముడిపడి స్వామి చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని గనక ఆశ్రయించినట్లయితే, నేను ఆత్మ స్వరూపుడినన్న భావనతో నిలకడ చెంది ఉండగలిగినట్లయితే సాగర సంగమ వేళ కొన్నేళ్ళకి మనం ఏమవుతామో తెలుసునా? సానబట్టిన వజ్రాలమనే వెలిగిపోతాం. అద్భుతమైన అందాన్ని ఆస్వాదిస్తాం. మనకి external cosmetic సవసరం లేదు. అనంతమైనటువంటి అంతర్గతమైనటువంటి ఒక వెలుగు, ఒక విభూతిమయమై మన శరీరాన్ని, బుద్ధిని, మనస్సుని, చిత్తాన్ని, అహంకారాన్ని, ఆనందాన్ని అన్నిటినీ కూడా ఆవహించి, ఆవహించి, ఆవేశించి మనల్ని సర్వోన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళుతుంది గనుక ప్రతి చోట ఎక్కడైతే స్వామి మందిరాలు కట్టారో తరినోళ్ళలో మీ మందిరాలేమో, తరినోళ్ళలో మీ స్వామి temples ఏమో ఇవాళ నా దృష్టిలో అవి కేవలం గుడు రూపాలు, బడు రూపాలు. మరి ఏమిటంటే అవి గుణ మందిరాలు. మనకు ఉన్నటువంటి గుణాలే మందిరాలుగా రూపాంతరించినాయి. [కప్స్ కొట్టడం] ఈ గుణ మందిర నిర్మాణంలో సత్యసాయి భగవాన్ యొక్క అనుగ్రహ విభూతిని ఇన్నేళ్లుగా, ఇన్నాళ్లుగా అనుభవించిన మనం జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపి ఒక ఆనందాన్ని మూటగట్టుకున్న మనం పరస్పరమైనటువంటి ఏ రకమైన వైషమ్యం లేకుండా ఇవాళ నిజానికి సుమారు తొమ్మిది సంవత్సరాల తర్వాత నేను వైజాగ్ వచ్చా. తొమ్మిదేళ్ళు. నాకు ఎట్లా ఉన్నది అంటే నిన్ననే రాజు గారిని చూసినట్లు, నిన్ననే మా నాగేశ్వరరావు గారిని తెలిసినట్లు, నిన్ననే మా రామకృష్ణ గారిని చూసినట్లు, నిన్ననే నాకు తెలిసిన వాళ్ళందరినీ, మా నారాయణ ముర్తి గారిని చూసినట్లు ఉన్నదే తప్ప తొమ్మిదేళ్ళ ఒక ఎడబాటు ఉన్నదన్న భావనే లేని స్థితి ఎవరు కల్పించారంటే ఈ తొమ్మిదేళ్లలో మీరందరూ నా గురించి ఆలోచించారు. నేను కూడా మీ అందరి గురించి ఆలోచించా. [కప్స్ కొట్టడం] మనందరం కలిసి ఒకరిని ఆలోచించుచాం. ఆయన భగవాన్ శ్రీ సత్య సాయి. [కప్స్ కొట్టడం] కనుక మన అందరి యందున్నటువంటి సర్వాత్మనుడైనటువంటి స్వామి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇదే ప్రాంగణంలోఇట్లాగే ఇంత ప్రసన్నంగా ఇంత ప్రశాంతంగా ఈ వ్యక్తిగత సాధన నుంచి సమాజ వికాసం వైపు ఎలా వెళ్ళాలో ఒక ఆలోచన చేసేటువంటి సందర్భాన్ని సృష్టించినటువంటి సర్వదేవతా అతీతమైనటువంటి ఒక స్వరూపమే తేజమే తల్లే పెడతాయి గురువై దైవమై సర్వము తానై అన్నీ తానై అంతా తానై ఉన్నటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మీ అందరికీ miracles చెప్పలేదని అనుకోకండి miracles నేను ఎప్పుడూ చెప్పను ఎందుకంటే స్వామి doesn't represent miracle అసలు స్వామి ఈ ప్రపంచంలోకి వచ్చి ముప్పై ఎనిమిది కోట్ల మందిని తన భక్తులుగా మార్చినటువంటిది అది మొదటి miracle నూట ఎనభై ఏడు దేశాలలో తన వాణి తన భావం తనని చూడని వారితో ఎక్కువగా చేరిచటం అన్నదే అది miracle మనందరం ప్రశాంతి నిలయం కి వెళ్ళినప్పుడు స్వామిని దర్శనం చేసుకొని హాలులో నుంచి బయటకు వస్తున్నప్పుడు అక్కడున్న ఇరవై ఐదు వేల మంది అనే ఒక మాట ఏమిటంటే ఇవ్వాళ స్వామిని అన్నే చూశారని చూసిన ఆయన ఒక్కరే సత్యసాయి చూడబడిన వారు ఇరవై ఐదు వేల మంది అది నా దృష్టిలో miracle ఇటువంటి ఒక పరమాద్భుతమైన స్థాయిలో స్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మన జీవితాన్ని ఇవ్వాళ అనుకున్న spiritualisation అనేటువంటి దానిని మనం గనక ఒక ఆధ్యాత్మిక మార్గంగా స్వీకరించినట్లైతే స్వామి మనల్ని ఎంత దూరం తీసుకెళ్తారో ఏ వైపుగా మళ్ళించి తీసుకెళ్తారో కానీ ఒకాయన వైజాగ్ లోనే ఒకాయన నాకు ఉత్తరం రాశారు అయ్యా జీవితంలో నేను చరమాంకానికి వచ్చేసాను స్వామి నన్ను అల్పుని చేర్చుకుంటారా అని భయంతో ఉత్తరం రాశారు నేను దానిలో బాధ ఉన్నది కాస్త ఉత్తుత్తో కాదు అనే సంశయం ఉన్నది నేను ఆయనకి ఒక ఏకవాక్య ఉత్తరం రాశాను ఆ ఉత్తరంలో ఏం రాశానంటే సర్వ జగత్తుని ఎత్తుకున్న భర్తృహరి వాసుకి మేల ఎత్తుకొనుడు అని రాశాను ఈ ఒక్కటి వదిలేస్తాడా ఆయన కాబట్టి ప్రపంచాన్ని పట్టుకోలేడా కాబట్టి ఇటువంటి అమృత భావనలన్నీ మనం పునః పునః వింటూ ఉండాలి మరణం చేసుకుంటూ ఉండాలి నిద్రిచ్చాసనంలో నిలబెట్టుకోవాలి సేవా మార్గంలో మన జీవితాలను ధన్య వంతం చేసుకోవాలి మగా కార్పణ్యము భేదము ఇవన్నీ వదిలిపెట్టి ప్రేమైక జీవులుగా ఉండగలిగేటువంటి స్థాయికి మనందరం గనక ఎదగగలిగినట్లైతే అది నిజంగా మనం స్వామికి ఇచ్చేటువంటి నివాళిగా భావన చేస్తూ మీ అందరూ స్వామి మాట ప్రకారమే ఎవరు సత్య సాయి భగవానుడి యొక్క నామాన్ని అంటారో ఎవరు నిరంతర చింతనా భూమిక లో నిలకడ చెంది ఉంటారో వారి ఆ ఒక్క తరాన్ని మాత్రమే కాక వారి రాబోయే ఇరవై యొక్క తరాలను నేను కాచుకుంటానని స్వామి ప్రతిజ్ఞ చేశారు ఇవాళ మనకి ఈ తపస్సు ఈ పూజ ఈ భావన ఈ వ్రతము ఇదంతా కూడా కేవలం మనతో ఆగదు మన కన్న బిడ్డలు రాబోయే ఇరవై యొక్క తరాలు స్వామి కాచుకుంటారు ఆయన నుడుగై మనకి ఆ ఆరాక్షణగా నిలబడతారు అని స్వామి మాటల్ని మీ ముందు మళ్ళా ఒకసారి ఉంచుతూ మీ అందరికీ శుభ కామనలు తెలియజేస్తూ పాడగలిగిన వాళ్ళు బాగా పాడుతూ ఇంకా బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఇక్కడే ఈ center లోనే speakers ను తయారు చేశాం తర్వాత వాళ్ళంతా ఎటు వెళ్ళిపోయినారో తెలియదు బాగా మాట్లాడండి బాగా చదవండి స్వామిని అనుభవించండి స్వామిని అనుభవంలోకి తెచ్చుకోండి స్వామి దైవమని గోడకు బొమ్మ పెట్టి ఫోటో పెట్టి దానికి పూల దండ వేస్తే ప్రయోజనము లేదు ఏమిటి ప్రయోజనం అది గౌరవం ఎలా ఉండాలి గురు వాఖ్యని పాటించడమే గురువుకి ఇచ్చే గురు దక్షిణ మన దగ్గర డబ్బు కావాలా మన డబ్బు ఆయనకి స్వామి అన్నారు అల్పమైన తుచ్ఛమైన మీ సంపదలు నాకెందుకు అన్నారు ప్రపంచంలో చెయ్యి చాపని గురువు ఎవరన్నా ఉన్నారా చెయ్యి చాపని ఆకలి విష్ణువు కూడా చెయ్యి చాపాడు అది లోకాద్ధరణ కోసం కానీ చెయ్యి చాపని అవతారములు ఎవరన్నా ఉన్నారంటే కేవలం ఒక్క సత్య సాయి భగవానుడు మాత్రమే కాబట్టి ఇవన్నీ మనం తలచుకుంటూ మనందరి జీవితాలు ధన్య వంతం కావాలని మళ్ళీ ఉక్కు నగరంలో మనం ఇన్ని విశేషాలు మాట్లాడుకునే ఈ విలువైనటువంటి సమయాన్ని అనుగ్రహించిన కాల వరదాయి అయినటువంటి జ్ఞాన వరదాయి అయినటువంటి సత్య సాయి భగవానుని దివ్య శ్రీ చరణాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ భజన మందిరాలు భజనలతో అనేకమైన సమితులన్నీ కూడా సాంస్కృతిక కార్యకలాపాలతో ఆధ్యాత్మిక వేదికలుగా ఈ ప్రపంచ అకలాంతరమైపోతున్న ఈ సమాజానికి నిర్దేశము దిశానిర్దేశము మార్గోపదేశం చేసే దిశగా సత్య సాయి సంస్థలు leadership తీసుకుంటాయని అవే role model గా ఉండాలని స్వామిని నేను మనసా వచసా చిరసా ప్రార్థిస్తూ మరొక్కసారి మీ అందరికీ శుభ కామనలు తెలియజేస్తూ సాయిరాం.
YouTube · audio
Steel plant SathyaSai Mandir Visakhapatnam
Steel plant SathyaSai Mandir Visakhapatnam
Source: SAI BROTHERS on YouTube
0:00 / 1:18:20