Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శీలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విషత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి శ్వరం ఆలంబెన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పర్ధాంమే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ సత్యసాయి భగవానుడి జన్మదినోత్సవ సంరంభ వేళ స్వామి ఒక వ్యక్తి మీద చూపించేటువంటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇవాళ మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నా. ఎక్కడెక్కడో ఏయే గ్రంథాలలో వారి వారి అనుభవాల కంటే మన మీద ప్రత్యేకంగా నా మీద స్వామి చూపించినటువంటి ప్రభావము వారు అనుగ్రహించినటువంటి కరుణ వీటన్నింటినీ కూడా కాస్త స్థాలిపులాక న్యాయ విశేషంగా క్లుప్తంగా క్లుప్త సుందరంగా మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. 1962 జూన్ తొమ్మిదవ తారీఖున సత్యసాయి భగవానుడి యొక్క దర్శనం చేసుకోవటం జరిగింది. అంటే సరిగ్గా అరవై సంవత్సరాలు పూర్తయింది అని అర్థం. అంటే ఇది దర్శన షష్టిపూర్తి. ఒక వ్యక్తి జీవితంలో షష్టిపూర్తి దేహానికి రావటం మామూలే కానీ ఒక వ్యక్తి జీవితంలో భగవద్దర్శనానికి షష్టిపూర్తి జరగటం కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప అది అన్యం కాదు. అయితే మహాత్ముని దర్శించినప్పుడు మహాత్ముల్ని స్పర్శించినప్పుడు మహాత్ములతో మాట్లాడినప్పుడు వారు వేసినటువంటి బాటలో నడిచినప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా మానవ జన్మ ఎత్తాక మోక్షం కావాలి అని కోరుకుంటాడు. మోక్షం ఎప్పుడు లభిస్తుంది? మరణానంతరం లభిస్తే దాని పేరు మోక్షం అని వేదాంత భాషలో మనం వాడుతూ ఉంటాం. నిజానికి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అనుగ్రహ విశేషంలో నేను అనుభవించినది ఏమిటంటే మోక్షం అంటే మరణానంతర సుఖం కాదు మానవుడు జీవించి ఉండగానే మోహక్షయం చేసుకోగలిగితే దాని పేరు మోక్షము అన్నారు. అంటే మోహము వ్యామోహము వ్యసనము ఆశ నిరాశ పేరాశ కడగా దురాశ ఇవి కదా మానవుని ఒక మహోన్నతమైన స్థితి నుంచి పాతాళం వరకు పడగొట్టగలిగినటువంటి స్థాయిలు. మరి వీటన్నింటినీ కూడా దేనినీ అనుభవించకుండా ఒక పన్నెండేళ్ళ చిరు వయస్సులో ప్రాయంలో వెళ్లి స్వామి భగవంతుడే అనేటువంటి పూర్ణ విశ్వాసంతో కానీ కర్మానుబంధి మనుష్యులకే కర్మ చేయటానికే మానవ జన్మ వచ్చింది గనుక మనకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాలు అన్నింటినీ కూడా నియమంగా నిష్టగా నీతితో నిర్భీతితో నిష్కళంకమైనటువంటి మనసుతో ఒక ఉదారమైనటువంటి మనసును నిర్మాణం చేసుకొని జీవన యాత్ర సాగిస్తూ ఉన్నప్పుడు భగవంతుని యొక్క కరుణ ఎంత అపరోక్షానుభూతిగా అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్లు ఉన్నా అపరోక్షంగా ఒక అనుభూతిని ఇచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవ సౌరభం అది. దానిని అనుభవించాలి. ఎట్లా? నేను ఎట్లా అనుభవించాను? ఒక్కసారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అప్పుడే స్వామిని చూసి అరవై ఏళ్ళు అయిపోయిందా? అప్పుడే స్వామి దేహం వదిలిపెట్టి పదకొండేళ్ళు అయిపోయిందా? పెద్దగా మార్పులు ఏం లేవే అప్పుడు ఎట్లా ఉన్నదో మనసు ఇప్పుడు అట్లాగే ఉన్నదే. ఆశలు పెద్దగా పెరిగింది లేదే. ఆశయాలు దృఢంగా ఆదర్శాలు నిష్కల్మషంగా అట్లాగే నిలబడ్డాయే అని ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలలో మునిగినప్పుడు మనసు ఇచ్చే జవాబు ఒక్కటే. దీనికి కారణం భగవంతుని యొక్క సాలోక్య సామీప్య సాన్నిధ్యాలు అనుభవించిన కారణంగా జీవితం ఎట్లా వస్తే అట్లా దానిని అంగీకరిస్తూ జీవితం విసిరేటువంటి ప్రతి సవాలుని చక్కగా సమర్ధవంతంగా స్థిర బుద్ధితో సిద్ధత్వంతో శుద్ధత్వంతో సంసిద్ధత్వంతో ఎదుర్కో గలిగినటువంటి ఒక ధీ శక్తి స్వామి వలన కలిగింది. అందువలననే జీవితంలో పరిణామ క్రమం ఏర్పడిందే తప్ప పరిణామం ఒక చెడు నుంచి మంచికి వెళ్ళింది కాదు. మంచిగా ఒక శుద్ధంగా వెళ్ళినప్పుడు శుద్ధత్వాన్ని నేళ్లు నిలబెట్టడమే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి సూచనగా మనం భావన చేయాలి. ఎందుకంటే ప్రపంచం ప్రతిక్షణము ఒక ఆకర్షణని వలగా విసురుతుంది. ఒక ఆశని ఎరగా చూపుతుంది. కానీ వీటికి వీటికి కూడా లొంగక, తొంగక, కుంగక, వంగక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోగలిగి జీవితాన్ని హాయిగా ప్రసన్నంగా Life is beautiful అంటామే ఒక మధురమైనటువంటి గీతికగా మార్చుకోగలిగినటువంటి ఒక ఆంతరంగికమైన పవిత్రతని కర్మణ్యేకం మనసేకం మహాత్మనః కర్మ మనస్సు ఏది ఆలోచిస్తున్నదో అది చేయాలి. ఏమి చెప్పగలమో అది చెప్పి చేయాలి. ఏమి చేయగలమో చెప్పాలి ఏమి చెప్పామో అది చేయాలి. అది మానవ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. వీటన్నింటినీ కూడా సత్యసాయి భగవానుడి యొక్క జీవితం నుంచిప్రబోధం నుంచి స్వామి ఉపన్యాసాల నుంచి అన్నింటిని మించి స్వామి జీవితాన్ని స్పష్టంగా చాలా దగ్గరగా దర్శనం చేసినప్పుడు కలిగే ఒక మధురమైన అనుభూతి ఏమిటి అంటే మానవుడుగా గనక ఒక జన్మ ఎత్తినట్లయితే మానవుడు మానవుడిగా ఎట్లా జీవించాలో వారు సోదాహరణప్రాయంగా జీవితాన్ని మన ముందు పరచి తెరచి ఉంచారు. దానిని చూస్తూ నేర్చుకున్నవి తొంభై percent. విన్నవి విని అర్థం చేసుకుని అంటే ఆకళింపు తీసుకుని ఆచరించి అనుభూతిని పొంది తద్వారా ఒక విభూతి స్థాయికి మనస్సును తీసుకు వెళ్లగలిగినవి మిగతా పది percent. అంటే పరమాత్మ ఒక అవతారమూర్తి యొక్క జీవితాన్ని మనం సూక్ష్మ సూక్ష్మేతరంగా గ్రహించాలి. వారు అది చేశారు ఇది చేశారని కీర్తించడం కంటే వారు ఎన్ని గొప్ప పనులు ఎన్ని పెద్ద పనులు సమాధి హితమైనవి విశ్వకల్యాణకారకమైనవి జగదోద్ధారకమైనవి జగనా-- జగదానంద కారకమైనవి ఇన్ని చెప్పారే వీటిలలో మనం ఎంత వరకు చేయగలమో అని ఎవరికి వారే వారి వారి శక్తి అనుసారంగా ఒక నిర్ణయం తీసుకుని సంపాదనలో one percent సమాజానికి గనక ఇవ్వగలిగితే దృఢమైనటువంటి రెండు చేతులు సమాజంలోకి చాచగలిగితే రెండు పాదాలు ఆహార విహార వ్యవహారాలలో అనేకమైనటువంటి స్థాయిలలో పవిత్రీకరించుకోగలిగితే మానవ జీవితం ధన్యవంతమవుతుంది. అట్లా అని కుటుంబాన్ని వదిలిపెట్టమని అయిన వారిని కాదని దేనినో సన్యసించమని చెప్పేది అది అనుష్ఠాన వేదాంతం కాదు. దేనిని వదిలిపెట్టవలసిన పని లేదు పరమాత్మే దేనిని వదిలిపెట్టల. ఎందుకని ఆయన చూడండి hospitals కట్టారు, విద్యా సంస్థలు పెట్టారు, నూట ఎనభై ఎనిమిది దేశాలలో సత్యసాయి సేవా organization ని నింపారు, కోటానుకోట్ల మందిని భక్తులుగా మార్చారు, సేవాదళంగా నిర్మాణం చేశారు, సేవాకృతులుగా రూపు ది--దిద్దారు. ఇవన్నీ ఒక వ్యక్తి ఎలా చేయగలిగారు అన్నప్పుడు అది వ్యక్తి కాదు అది ఒక శక్తి. శక్తి నుంచి ప్రతి వ్యక్తి కొంత కొంత గనక తీసుకోగలిగినట్లయితే దానిని ఇచ్ఛా శక్తి, క్రియా శక్తి, జ్ఞాన శక్తి అనబడేటువంటి మూడింటిని కూడా సమన్వయం చేసుకోగలిగితే మానవ జీవిత పరమార్థం ఏంటంటే పరోపకారం కోసమే మానవ జన్మ ఇవ్వబడింది. స్వీయంగా బలంగా ఉండాలి, సంపాదన బాగా సంపాదించాలి కానీ అది కేవలం స్వప్రయోజనానికి మాత్రమే కాక సమాజహితంగా సమాజాన్ని ఉద్ధరించగలిగినటువంటి స్థాయిలో దానిని గనక వినియోగించగలిగితే అది పరమోత్కృష్టమైనటువంటి యజ్ఞంగా నేను భావన చేశాను.
YouTube · audio

సత్యసాయిబాబా గురించి ఆధ్యాత్మిక వేత్త గారి మాటల్లో విందాం | Bhagavanji

Home

సత్యసాయిబాబా గురించి ఆధ్యాత్మిక వేత్త గారి మాటల్లో విందాం | Bhagavanji

Source: Bhagavan Ji on YouTube

0:00 / 9:00

More in this series

On Sathya Sai Baba — Bhagavanji

2 episodes · 17 min

  1. 9 min 1

    సత్యసాయిబాబా గురించి ఆధ్యాత్మిక వేత్త గారి మాటల్లో విందాం | Bhagavanji

    Now playing
  2. 8 min 2

    సత్య సాయిబాబా గురించి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త గారి మాటల్లో విందాం