Skip to content
Transcript తెలుగు
అధ్యాత్మ సాధనలో కూడా గురువు ఇచ్చే మంత్ర దీక్షతో నీకు ముక్తి రాదు. తత్వదర్శనం కాదు. అలాగే గురుబోధలు వింటూ వింటూ ఎన్నో ఏళ్ళు వినగా వినగా వినగా విషయం తెలుస్తున్నదే తప్ప అసలు విషయం తెలియటంలేదు. అన్నీ బోధపడుతున్నాయి తప్ప తత్వం బోధపడటం లేదు. ఏది ఎరగవలసి ఉన్నదో, దేనిని తెలియవలసి ఉన్నదో అది ఇంకా చాలా సుదూరంలో ఉన్నట్లు అనిపిస్తున్నది. Knowledge Information బాగా పెరిగిపోతున్నది. కానీ, దాని మూలం మాత్రం తెలియటంలేదు. మూలంలోకి వెళ్ళాలి. మనకో దుఃఖం కలిగింది, మనం ఏమంటామంటే "ఫలానా వాడి వలన నాకు దుఃఖం కలిగింది" అంటాం. ఎవరో మనకు దుఃఖాన్ని కలిగించలేరు. వాళ్ళకి శక్తి లేదు. మన స్వభావమే మనల్ని బాధిస్తుంది. ఇది సత్యం. కారణాలు Cause and Effect బయటవి అయినప్పటికీ, పడుతున్న బాధకి కారణం మాత్రం మనం అవుతున్నాం. ఎవరైనా విమర్శించినప్పుడు, ఎవరైనా పొగిడినప్పుడు మూలంలోకి వెళ్ళాలి. మూలంలోకి వెళితే మనకి సత్యం బోధపడుతుంది. మూలాన్వేషణే ఆత్మాన్వేషణ, మూలాన్వేషణే చిత్తాన్వేషణ, మూలాన్వేషణే తత్వాన్వేషణ. తత్వం అంటే గుణం కాదు Aspect కాదు అనుకున్నాం. తత్వం అంటే సత్యం. తత్వం అంటే ఏది నిజమో అది. దేనిని పొందితే, దేనిని తెలుసుకుంటే, దేనిని అందుకుంటే ఇక పొందవలసినది, తెలుసుకోవలసినది, అందుకోవలసినది లేదో అది తత్వం. దానికే-కోసమై వాడు యోగి కావాలి. యోగి వేషభాషలలో లేడు. ఇది పరమాద్భుతమైనటువంటి యోగించిన మానసిక స్థాయి. రెండు ప్రజ్ఞల యొక్క మేలు కలయికే యోగత్వం. అది జీవ ప్రజ్ఞ, రెండవది దైవ ప్రజ్ఞ. మాటలు కూడా మనం పదే పదే వాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మంచి విషయాలు ఆకళింపు అయ్యేదాకా పునరుక్తి దోషం లేదు. ఒట్టి జీవ ప్రజ్ఞ ప్రయోజనం లేదు. అలాగే ఒట్టి దైవ ప్రజ్ఞ కూడా ప్రయోజనం లేదు. శుద్ధ బంగారంతో వస్తువు తయారు కాదు, రాగి కాస్త కలపాలి. అప్పుడే అది ఆకారాన్ని సంతరించుకుంటుంది. దానికి దృఢత్వము, ఒక బలము ఏర్పడుతుంది. ఇవన్నీ ప్రాపంచికంగా ఎంత సత్యమో ఒట్టి జీవ ప్రజ్ఞ Logical Conclusion కి తీసుకు వెళ్ళదు. అలా పని చేస్తూ ఉంటాం జీవితకాలం అంతా. దానికి భక్తి జ్ఞానాలు రెండూ కలపండి, కర్మలు బలపడతాయి. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు దాటి వైరాగ్యంలోకి వెళ్ళండి, అవి ఏవీ మనల్ని బాధించవు. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. దీనిని మనం గమనించుకోలేక "ఇంత కష్టపడుతున్నాను, దేవుడికి దయలేదు" అంటాం. "ఇంత పూజ చేస్తున్నాం, కష్టాలు తీరటం లేదు" అంటాం. జ్ఞాని ఇవేం అనటం లేదు, వింటున్నాడు అంతే. సాక్షిభూతంగా ఉంటున్నాడు. పైగా కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు మూడు భిన్నమైనటువంటివి కావు. మూడు ఒకటే. They operated different planes. మాట్లాడుతున్నాం ఇందాకటి నుంచి, ఇదంతా కర్మ. కర్మ యోగమే ఇది. కానీ ఇది భక్తి యోగం కూడా. ఎందుకని అంటే దేనితో కూడి ఉండి మాట్లాడాలో దాంతో మాట్లాడుతు-అది మాట్లాడుతున్నాం. దాంతో కూడి ఉండి మాట్లాడుతున్నాం. కనుక భక్తి యోగం. దేనిని చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో ఒక విచక్షణ కలిగి ఉన్నాం, అది జ్ఞాన యోగం. మూడు భిన్నంగా ఎక్కడున్నాయి? కర్మ లేని భక్తి, కర్మ భక్తులు లేని జ్ఞానం, జ్ఞానం లేని కర్మ భక్తులు, భక్తి లేని కర్మ జ్ఞానాలు ఉన్నాయా అంటే లేనే లేవు. అన్నీ మిళితమై ఉన్నాయి, సమ్మిళితమై ఉన్నాయి, సమ్మేళనమై ఉన్నాయి. అందుకనే భగవద్గీతలో కృష్ణ భగవానుడు భగవద్గీతని తొలి ఆరు అధ్యాయాలని కర్మ యోగంగా, మధ్యలో ఉన్న ఆరు అధ్యాయాలను భక్తి యోగంగా, చివర ఆరు అధ్యాయాలని జ్ఞాన యోగంగా మనకు ఉపాసనా మార్గాన్ని బోధించాడు ఆయన. అందుకనే దానిని భక్తి గీతం అనలేదు. యోగశాస్త్రం అన్నాడు. యోగశాస్త్రం ద్వారా తత్వాన్ని ఎరగటం. ఇవాళ భగవాన్ మనల్ని అక్కడికే తీసుకువచ్చారు. హృదయ స్థానంలో హృదయంతో చేరి మనోలయానికి అలవాటు పడిన మనస్సు మనోనాశనాన్ని పొంది విభూతి స్థాయికి వెళ్ళి యోగత్వాన్ని పొంది, పొందినదేదో ఇది ఆఖరి అని అనుకోకుండా తత్వదర్శనం వైపు వెళ్ళాలి, వెళుతున్నది. తత్వదర్శనమే చిత్తదర్శనం అనేది పదే పదే చాలా స్పష్టంగా చెప్తూ నిజ స్వరూపాన్ని గ్రహించాలి, నిజాంతర్గతంగా వెళ్ళాలి, నిజ భావనలో నెలకొల్పి చెందాలి అని మనకు బోధిస్తున్నటువంటి భగవాన్ ఇవాళ ఒక పూర్ణాద్వైత మూర్తిగా. ఇది యోగశాస్త్రం, ఇది ప్రాణాయామం, అష్టాంగ యోగాలు ఇట్లా చెప్పలే. మనకి ఎంతవరకు కావాలో సాధనా మార్గాన్ని ఉపదేశ సారంగా మనకు అందించారు. అందుకనే ఉపదేశ సారాన్ని నోటికి వచ్చేదాకా పారాయణం చేయాలి. పారాయణం చేస్తూ చేస్తూ ఆచరణాత్మకమైన మహాద్భుతమైన సాధనా ప్రక్రియగా చేయాలి. ఇవాళ దానిలో ఉన్నటువంటి పారాయణంలో ఉన్నటువంటి ప్రభావం అందరూ కూర్చుంటారు, చక్కగా అనుకుంటారు. అనుకుంటున్నప్పుడు లయాత్మకంగా హాయిని కలుపుతుంది. అది మాత్రమే కాదు, ప్రతి శబ్దానికి శబ్దానికి శబ్దానికి మధ్య...పదానికి పదానికి మధ్య శ్లోకానికి శ్లోకానికి మధ్య ఉన్నటువంటి వారధి సేతువు connectivity ఏముందో దానిని గమనించుకోకపోయినట్లయితే తత్వశోధనకు మనం ఇంకా చాలా దూరంలో నిలబడిపోతాం. ఇవాళ [గొంతు సవరించుకుంటూ] ఉపదేశ సార పారాయణం చేసుకున్నాం ప్రసాదం తయారు చేశాం భగవాన్ కి నైవేద్యం పెట్టాం మనం తిన్నాం పది మందికి అన్నం పెట్టాం ఇది బాహ్యరకమైనటువంటి ఒక బాహ్యమైన చర్య. చెడ్డది కాదు మంచిదే కానీ అది అంత్యం కాదు ఆరంభమే. ఎక్కడ మొదలైనామో ఎక్కడికి ప్రస్థానమవుతున్నామో ఎక్కడికి చేరుకున్నామో అక్కడ నుంచి భగవాన్ ఒక్కసారి తత్వదర్శనంలోకి వెళ్ళమంటున్నారు. తత్వదర్శనం గనక జరగకపోతే ఇప్పటిదాకా మాట్లాడుకున్నది కూడా ఉరికే కష్ట విచారణ we to have some information with us. భగవాన్ ఏం చెప్పారు కొంత వరకు అర్థమైంది కానీ తత్వ విచారణలోకి వెళ్లాలంటే మళ్ళీ ఆచరణాత్మకమైన సాధక విధానాన్ని మనం ఆచరించవలసి ఉన్నది గనుక పూజలు చేస్తూ కొంతకాలం parallel గా దానాలు చేస్తూ వ్రతాలు చేస్తూ ఆపై అనేక మాటలు అంటూ అనేక మాటలు వింటూ స్వాధ్యాయం చేస్తూ సంకీర్తన చేస్తూ సదాచారాన్ని పాటిస్తూ సంస్కారాన్ని సంస్కృతిని నిలబెట్టుకుంటూ సనాతనమైనటువంటి ఒక వైదిక ధర్మాన్ని సనూతనం చేసుకుంటూ పూర్ణ మనస్కులం కావలసినటువంటి ఒక అవసరం ఉన్నది. అని చెప్తూ తత్వంలోకి వెళ్ళాలి మనం అంటాం ఇంకా తత్వంలోకి వెళ్ళలేదు తత్వంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఏం లేదు తత్వం ఎరిగిన తర్వాత తానేమి ఎరుగు అన్నాడు అన్నమాచార్యుల వారు. తనను తాను తెలుసుకున్న తర్వాత తత్వం అక్కర్లేదు తత్వాన్ని తెలుసుకోవటం అంటే తన మూలాన్ని తెలుసుకోవటమే. నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం ఇది చాలా కీలకమైనటువంటి స్థానంలోకి భగవాన్ మనల్ని నడిపించారు. చూడండి మనస్సును గురించి చెప్పారు దేహాన్ని గురించి చెప్పారు ఏడు శరీరాల గురించి చెప్పారు ప్రణవ శబ్దాన్ని గురించి చెప్పారు ద్వంద్వాల గురించి చెప్పారు త్రిగుణాల గురించి చెప్పారు చతుర్విధ పురుషార్థాలు చెప్పారు పంచకోశాలు చెప్పారు. షడ్వర్గములు షడ్వికారములు షడంగములు చెప్పారు సప్తజ్ఞాన భూమికలు చెప్పారు అష్టాంగ యోగాలు చెప్పారు నవ్వు విధ భక్తులు చెప్పారు యోగత్వంలోకి వెళ్ళమన్నారు చిత్తాన్ని-- మనస్సును పట్టుకో మనోలయం చేయి ఆపై మనో నాశనం చేయి యోగత్వాన్ని పొందు యోగివికా యోగివి అయినావు గనుక ఇప్పుడు తత్వదర్శనం వైపు రా అని. పూజలో మునిగిన వాడికి తత్వదర్శం అర్థం కాదు చెప్పినా అదేదో తెలియదు కదా నాకెందుకు ఇది హాయిగా ఉంది అంటాడు. కానీ నెమ్మది నెమ్మదిగా మనస్సును గనక అధ్యాత్మ మార్గంలో ప్రవేశపెట్టుకున్నట్లయితే ఇప్పుడు అనుకున్న స్థాయిలన్నీ కూడా మన జీవితంలో మనల్ని చాలా ముందుకు తీసుకుని వెళతాయి.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -55

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -55

Source: TFC Spiritual on YouTube

0:00 / 10:51

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

    Now playing
  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77