Skip to content
Transcript తెలుగు
మనలో మనం ఉండగలిగితే దాని పేరు ధ్యానం అంతే. మనలో మనం ఉండాలి మనతో మనం ఉండాలి. ధ్యాన యోగ సమాధులు మొదటి రెండు ఏర్పడినప్పుడు సమాధులు ఏర్పడతాయి. ధ్యానం కంటే ముందు ధారణ ఉంది. ధారణ బలీయమైనటువంటిది గనుక అయినట్లయితే అనేక విషయాలను store చేసుకునే ఒక computer chip లాంటిది అది. కాబట్టి ధ్యానం ద్వారా ధారణను కూడా నియంత్రించుకోవాలి. అందుకనే ప్రపంచంలో మీరు అవధూతలను గమనించండి. అవధూతలంతా కూడా చిత్తవృత్తి నిరోధం జరగనట్లుగా మనసు సరిగా లేనట్లుగా వారికి తోచిన రీతి ఉంటారు. దీనికి కారణం వారి ఆనందం వస్తు ప్రపంచంలో లేదు. "అమదానందము విమలధామమై వర్తమాన వర్తిత అవ్యధాకారకమై ధ్యాన ధారణాతీత చారణమై తమోరహిత తపోమయమై నెలచు నీ జగతి అవధూత నిర్మల నిశ్చల సచ్చరిత" నిర్మలము ఉంది నిశ్చలము ఉంది సత్తుతో కూడిన చరిత్ర ఆత్మ గతమైనటువంటి కదలికలు మాత్రమే ఉంటాయి అటువంటివాడు అవధూత అవుతున్నాడు. "ధూమ కామ రహిత ధ్యాన ధారణాతీత చారణమై" ఉన్నాడు. అంటే నాలుగు బీజాక్షరాలు. "అ" అంటే అమదానందము విమలధామమై శరీరమంతా అమలధామంగా ఉన్నట్లయితే ఎంత ఆనందం! అది ఇంకా విమలధామం అయితే మరీ మంచిది. యోగంలోకి వెళితే అది కమలధామం అవుతున్నది. కమలధామమై విరాజిల్లుతున్నది. అష్టదళ పద్మాలతో కూర్చొని ఉన్నది లేదా శతపత్రమై ఉన్నది. ఇది అమదానందము మదము లేని ఆనందం. మదము లేకపోతే ధమము ఏర్పడింది. మదముతో కూడిన ఆనందం మనల్ని పాడు చేస్తుంది, పతనం చేస్తుంది. ధమముతో కూడిన ఆనందం బ్రహ్మానందాన్నిస్తుంది. కనుక అమదానందము విమలధామమై అటువంటి చోటు ఉంటాడట. ఆయన హృదయం అక్కడ connect అయి ఉంది. "వర్తమాన వర్తిత అవ్యధాకారకమై" వర్తమానంలో జీవిస్తూనే మనతోనే ఉంటారు ఆయన. సాలోక్య, సామీప్య, సాన్నిధ్యాలతో ఉంటారు. సాయుజ్యం వైపు జీవుణ్ణి నడిపిస్తూ ఉంటాడు. "అవ్యధాకారకమై" వ్యధాకారకుడు కాదు ఆయన అవ్యధకు కారణం. దుఃఖం లేకుండా ఉండటానికి అవధూత కారణం అవుతున్నాడు. "ధూమ కామ రహిత ధ్యాన ధారణాతీత చారణమై" ధూమం లేదు కర్మలు లేవు జన్మలు లేవు. కర్మ జన్మలు లేవు గనుక అతీతమైన స్థాయిలో ఉన్నాడు. ధారణలో ఉన్నాడు గత స్మృతులు, పూర్వ స్మృతులు, సుస్మృతులు, సంస్మృతులు ఆయన్ని నడిపిస్తూ ఉన్నాయి. మామూలుగా చారణ అంటే మామూలు మనల్ని నడిచినట్టు నడవటం లేదు అతీతమైనటువంటి సంచారణ చేస్తున్నాడు. దైహిక మానసికమైన సంబంధాలు దాటి స్థితులు దాటి అలౌకిక ఆనంద ప్రజ్ఞలో ఉన్నాడు ఆనందఘనుడవుతున్నాడు. "వర్తమాన వర్తిత అవ్యధాకారకమై ధ్యాన ధారణాతీత చారణమై" ఇన్ని జరిగినందువలన "తమోరహిత" తమస్సు లేదు. తమస్సు లేదు గనుక తపస్సు ఏర్పడింది. తపస్సు ఏర్పడింది గనుక తత్త్వం ఏర్పడింది. తత్ తత్త్వం విచక్షణ తెలుస్తున్నది. అది నేను అది నేను అన్నది అదే నేనుగా మారుతున్నది. అటువంటి నిశ్చలమైనటువంటి మనసుతో నిర్మలమైనటువంటి మనసుతో విశుద్ధమైనటువంటి చరిత్రతో సచ్చరిత్రతో ఒక అవధూత లోకంలో ఉన్నాడు. మనం కూడా నిజానికి అట్లా ఉండాలి. కమలము, విమలము, అమలము అయినటువంటి శరీరం కాలుష్యంతో అనేక negative భావాలతో ప్రతికూల పవనాలతో జీవితం గనుక ఉన్నట్లయితే దేహం ఉన్నట్లయితే పరమాత్మను పట్టుకునేది ఎట్లా? దేవాలయం ఎంత శుభ్రంగా ఉంచుతామో, మన ఇంటికి ఒక అతిథి వస్తున్నప్పుడు మన drawing room ఎంత clean గా పెట్టుకుంటామో, నిరంతరము మన యందు ఉన్నటువంటి పరమాత్మను నిలబెట్టుకోవాలి అంటే మన మనసుని ఏం చేయాలి? పవిత్రీకరించుకోవాలి. పవిత్రమైనటువంటి భావనలలో నుంచి అమృతమయమైన భావనలు ఉత్పాదన చెందుతాయి. పనిని ఆశించి చేయకూడదు ఆనందిస్తూ చేయాలి. ఆశించి చేయటం మొదలు పెట్టాక చేతికి అందనప్పుడు అశాభంగం జరుగుతుంది. ఆనందంతో చేస్తూ ఉన్నట్లయితే ఆనందమే మిగులుతుంది. ఆనందాన్ని ఆకాంక్షిస్తూ ఆనందాన్ని కోరుకుంటూ ఆనందంతో ఆనందం కోసమే చేస్తే మిగిలేది ఆనందమే మరొకటి రావటానికి వీలు లేదు. కోరుకున్నది ఒకటి చేస్తున్నది ఒకటి కావలసింది ఒకటి ఫలితం ఎట్లా ఉంటుంది అట్లాగే ఉంటుంది. ఆనందం రాదు. ఒక సంతోషం కలుగుతుంది. అప్పుడప్పుడు ఏదో ఇంద్రియాలకు సుఖం కలుగుతుంది అది ఆనందం కాదే. కాబట్టి మనసుని దేహాన్ని ముందు ప్రధానంగా దేహాన్ని పవిత్రీకరించుకోవాలి. మన నడత మన నడక రెండు ప్రధానమైనవి.ఇవ్వేళ దాన్ని మనం body language అంటున్నాం. Body language చాలా ప్రధానం. ఏదైనా విషయం చెప్తున్నప్పుడు వేద సమానంగా భావన చేయాలి. నిష్ఠుర వాక్యాలు, కఠినమైన పదాలు మనం వాడకూడదు. అభివ్యక్తి చేయవలసి వచ్చినా సరే స్వాదువుగా చెప్పాలి, నెమ్మదిగా చెప్పాలి. అనుద్వేగకరం వాక్యం. ఒక వాక్యం ద్వారా ఉద్వేగం కలిగించటానికి మనకి హక్కు లేదు. అనుద్వేగకరం. ఉద్వేగం లేని రీతిలో పరమ ప్రసన్న, ప్రశాంత, గంభీరమైనటువంటి స్థాయిలో మన నుంచి వాక్కు వెలువడాలి. అది మరొకడికి ఆనందాన్ని కలిగిస్తుంది. అసలు నిజానికి మన జన్మంతా ఇంకొకడికి ఆనందం కలిగించటం కోసమే. మనం ఎప్పుడు ఇంకొకడికి ఆనందం కలిగించగలం అంటే మనం ఆనంద స్వరూపులం అయితేనే. ఆనంద స్వరూపులం కావటానికి మార్గం ఏమిటో చెప్తూ ప్రాణవా-- ప్రాణాయామం చేయండి, చిత్తాన్ని నిరోధించండి, యోగత్వాన్ని పొందండి. శుద్ధమైనటువంటి మనస్సు, యోగత్వాన్ని పొందిన స్థితి రెండూ కలపండి. మనస్సును హృదయ స్థానంలోకి తీసుకువెళ్ళండి అని చాలా అద్భుతమైనటువంటి రీతిలో భగవాన్ వ్యాఖ్యానం చేస్తున్నారు. అలాగే వర్తమానంలో జీవించటం మనం నేర్చుకోవాలి. సాలోక్యంగా ఉండాలి భగవద్భావనకి. ఇదే లోకంలో రాముడున్నాడు, ఇదే లోకంలో కృష్ణుడున్నాడు, ఇదే లోకంలో భగవాన్ సత్యసాయిబాబా వారు ఉన్నారు, ఇదే లోకంలో రమణ మహర్షి ఉన్నారు. ఉన్నారా లేదా? మరి వారు అలా ఉండగలగటానికి మనం అట్లా ఉండలేకపోవటానికి కారణం ఏమిటి అంటే వారికి తెలియకుండానే ఇప్పటివరకు ఉన్న విచారణ వారి శరీరంలో జరిగిపోతూనే ఉంటాయి. అది సహజ ప్రక్రియగా జరిగిపోతుంది. అందుకనే ఒకసారి భగవాన్ ని అడిగారు, "భగవాన్! నిజానికి మానవ జన్మ వచ్చేది వంద ఏళ్ళు ఉండటానికి, అది పూర్ణాయుర్దాయం ఉంటే, మరి ఉన్నటువంటి జీవితాన్ని ఆనందం అనుభవించకుండా అసలు జీవితాన్ని జీవించకుండా, ఏదో అర్థంకాని, ఏదో తెలియని, ఏదో అందుకోలేని వస్తువు కోసమై ఇంత విచారణ చేయవలసి ఉన్నదా? దీనివలన చివరికి ఏమిటి లాభం?" అంటే భగవాన్ సమాధానం ఇచ్చారు దానికి. "All these efforts will lead to a state where there is no effort. This is all for an effortless effort" అన్నారత. సహజంగా జరిగిపోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విచారణ ఉపదేశ సారం అంతా అది అందుకోవటానికి. effortless effort కోసం ఇంత effort చేయాలి. ఇది లేకుండా effortless effort నాకెప్పుడో వచ్చిందని అనుకుంటే అది భ్రాంతి. అది జరగదు. శరీరం అంటే తెలియాలి, మనస్సు అంటే తెలియాలి, చిత్తం అంటే తెలియాలి, ప్రాణం అంటే తెలియాలి, ప్రాణ ఆయామం అంటే తెలియాలి, రాకపోకలు ఏమిటో తెలియాలి, కేవల కుంభక, రేచక, పూరకాలు ఇవన్నీ కూడా తెలియాలి. ఇవన్నీ తెలియకుండా, అంటే information, నేపథ్యం లేకుండా అధ్యాత్మలోకి ఎవరో మహాత్ములు వెళ్తారు. వారు వెళ్ళటానికి కారణం జననాంతర సౌహృదం అని. అనేక జన్మలుగా వారు చేసుకున్నటువంటి సాధనా తీవ్రత వలన ఇప్పుడు ఫలించి వారు స్థితిలో ఉంటారు. లేదా నువ్వు గనక ఇట్లా ఉన్నట్లయితే నువ్వు కూడా స్థితికి వెళ్లగలవు. ఇదేమీ నాకు ప్రి-- నా preserve కాదు. నాకు మాత్రమే సాధ్యమైనది కాదు. అందరికీ సాధ్యమైనదే, అయ్యేదే అని చెప్పేటువంటి రీతిలో వర్తమానంలో జీవించాలి. గతించిన కాలాన్ని గురించి మనం ఎక్కువ మాట్లాడాం అనుకోండి, ఎవరైనా సరే. ఒక స్థితికి వచ్చిన వాడు "నేను అప్పుడు ఇట్లా చేశాను, అప్పుడెప్పుడో ఇలా జరిగింది, అది సాధించాను, అది పొందాను, అప్పుడు నన్ను ఫలానా అన్నారు" అని గతాన్ని గురించి చెప్పుకున్నాడు అంటే వాడికి భవిష్యత్తు లేదు అని అర్థం.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -40

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -40

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:18

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

    Now playing
  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77