Skip to content
Transcript తెలుగు
గమనించండి తపోవనాలు భక్తిభావంతో ఊరికే పారాయణాలు చేయకండి. ప్రయోజనం లేదు. ప్రయోజనం ఒక్కటే స్వామి జీవితాన్ని గమనించుకోండి. ఆయన ఎనభైవ ఏట వరల్డ్ కప్ క్రికెట్ గవాస్కర్, తర్వాత-- తెందుల్కర్ తెందుల్కర్ ఇటువంటి వాళ్ళంతా స్వామి పిల్లలు వాళ్ళు. వస్తే మేం ఏం చేయాలి స్వామి? మేము ఏదో ఆడుతున్నాం, డబ్బులు తెస్తున్నాం, బురుదలు వస్తున్నాయి, ఇవన్నీ మీ దయవల్లే అంటే ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ స్పిరిట్ తో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడండి శాంతి వేదికలో ఆడించారు స్వామి. అంటే విశ్వకల్యాణం కోసం అనుసంధానం చేశారు. మీరందరూ అంత డబ్బు సంపాదించారు అన్నారు కదా, ఇక్కడ డబ్బు కట్టి జమ కట్టి రసీదు తీసుకు పొమ్మనలా. మీరు చేయగలిగింది క్రికెట్ ఆడటం. క్రికెట్ అంటే అప్పుడే స్వామి చెప్పారు "life is a game, play it" దాన్ని ఆడండి. గెలవడం కోసం ఆడండి. గెలుపు వచ్చేదాకా ఆడుతూనే ఉండండి. జీవితం కూడా అట్లాగే. సంగ్రామం అనుకోకండి, గెలిచేదాక యుద్ధం చేయండి. ఇవన్నీ కూడా స్వామి చాలా practicalగా చెప్పినటువంటివి. సేవా మార్గంలో బహు క్లిష్టమైన different dynamicsలో మనం సేవ అనగా అన్నీ చీరలు పంచిపెట్టడం, అరిటి పండ్లు పంచిపెట్టడం, ఎవడికో బ్రేక్ ఫాస్ట్ చేయటం, ఎవడికో రూటులో పాలు ఎత్తడం, ఆను మందులు ఇవ్వడం ఇది కాదు. దాన్ని సేవా ధర్మాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఒక యోగంగా, ఒక సాధనగా మనం మార్చుకోవాలి. అలాగే planetaryium కట్టారు. Americans వచ్చి అడిగినప్పుడు ఖగోళం ఎక్కడా లేదు. ప్రశాంతి నిలయంలో ఉన్నటువంటి planetaryium భారతదేశంలో ఎక్కడా లేదు. అక్కడ నుంచి ఖగోళం అంతా మనం చూడొచ్చు. అలాగే విశ్వవిద్యాలయం, దాన్ని buildingని మనం చూస్తే అరే ముందు పుట్టి ఉంటే అక్కడ చదువుకునేవాళ్ళం కదా అనిపిస్తుంది. అది చూడగానే స్వామి పిల్లలు అందర్నీ చూసినప్పుడు ఇంకొద్దిగా నాలుగేళ్ల ముందు స్వామి భర్తీ ఇచ్చి ఉన్నట్లయితే, అంటే వెనక, ఇచ్చి ఉన్నట్లయితే పిల్లలతో పాటు మనం కూడా వేదం నేర్చుకునే వాళ్ళం చూడండి. ప్రశాంతి నిలయంలో జరిగే అద్భుత సేవల్లో ప్రతి నిత్యము వేదం వినపడేటువంటి ఏకైక ప్రదేశం ప్రశాంతి నిలయం. ఇంకెక్కడా లేదు. అప్పుడప్పుడు వేదం వినిపిస్తుంది. వేదాన్ని ఎవరో పండితులు చెప్పరు, స్వామి పిల్లలు చదువుతారు. స్వామి దగ్గర ఉన్నటువంటి ఆచార్యుడు దాన్నే lead చేస్తారు. నూట ఎనభై ఏళ్ళ దేశాల్లో వేదం వినపడుతుంది, భజన వినపడుతుంది, ఒక నిశ్శబ్ద భూమికలో స్వామి దర్శనం అయిపోతుంది. అయిపోయినా మరుక్షణం ఏం చేయాలి? చాలా కార్యక్రమాలు చేస్తాం. సేవ చేస్తాం. ప్రతి వేళ team of doctors వస్తారు. వాళ్ళంతా మనకిక్కడ appointment కూడా దొరకని వాళ్ళు. impossible వాళ్ళని మనం కలవలేం. అక్కడికొచ్చి వినమ్రంగా ఏం కావాలో చేస్తారు. surgeries freeగా చేస్తారు. ప్రేమగా చేస్తారు. మనం భదకాలి అని చేస్తారు. మేము చేస్తున్నాము అని చేయరు. ఒక doctorని నేను అడిగినప్పుడు ప్రశాంతి నిలయం hospital దాటి బయటకు వెళ్ళిన తర్వాత, "మేము మా ఇంట్లో కూడా మేము చెప్తాం, ఇవాళ ఒక అద్భుతమైన operation చేశారు, మాకు చాలా ఆనందం కలిగింది, ఒకడిని save చేశారు" అని చెప్తారు. కానీ ప్రశాంతి నిలయంలో operation అయిన తర్వాత నా భార్య అడుగుతుంది ఎన్ని operations చేశారని, "అక్కడ నేను ఏం చేయలే, అన్నీ స్వామి చేశారు, నేను చూశాను" అంటాడు. అంతే చెప్తాడు. అదే doctorని, అదే degree నా దగ్గర ఉంది. కానీ సేవలో ఇక్కడ పరమాత్మ చేయిస్తున్నాడు. ఆయన చేతిలో నా చేతిలో scalpel, నా చేతిలో ఇంకో సూది needle ఎట్లా ఉందో పరమేశ్వరుడి చేతిలో నేను అయిపోయినా. నాకు తెలీదు. నేను చేద్దాం అనుకున్న దానికంటే అద్భుతంగా చేసి వచ్చారు. అతను బదరటనా, రెండు నూరేళ్ళు బతుకుతాడు. అంటూ ఆనందాన్ని పంచుకుంటారు. అక్కడ ఏమీ ఉపాధి కూడా రాదే, దబ్బిచ్చేవాడే లేదే కానీ ఆనందం ఎక్కడ డబ్బుకి ఆనందానికి రకమైన సంబంధం లేదు. అలాగే ఉజ్వల దానం, మీరు ఏది చూడండి అక్కడ సేవా మార్గంలో భారత, భాగవత, రామాయణ గాథలన్నీ కళా స్వరూపాలై, డ్రామాలై, skitsలై మన ముందు వాటిని ప్రదర్శిస్తున్నప్పుడు ఎవరికి వీళ్ళకి ఇంత ప్రజ్ఞ వేళ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మన మనస్సుని భగవదర్పితం చేసి చేస్తాం. అంతయు ఈశ్వర ప్రీతికే అన్న భావంతో చేస్తాం కాబట్టే అవి అక్కడ రాణిస్తాయి. ఇవాళ మనం ఉపాధి నాడులు వెళితే తులోంత హాలులో ఇరవై ఎనిమిది వేల మంది హాయిగా కూర్చుంటారు. ప్రశాంతంగా, ప్రసన్నంగా, రకమైన దర్శనం లేదు. సూది పడితే శబ్దం వినపడేంత హాయిగా ఉన్నారు. అంటే ఇది ఎక్కడి నుంచి సేవా తృప్తి. అందులో ఎనభై percent కొత్త వాళ్ళు. స్వామిని చూడలా పారరు. కానీ స్వామి కోసం వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మా జీవితం మొత్తం ఇక్కడే, మేము hospitalకి వెళ్ళలే. ఇదొకటి share చేయాలి మీతో. ఏదో ఒక operation గురించి మాట్లాడటానికి ఒకటి, రెండవది hospitalకి వెళ్ళి చాలా రోజులైంది అని నన్ను ఒక doctorగారు తీసుకెళ్లారు. "నీతి గారు చాలా రోజులైంది మీరు వచ్చి నాతో వెళ్ళండి" అని తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత స్వామి దేహం రోజు గురువారం అయింది. స్వామి దేహం వదిలినటువంటి ప్రదేశంలోకి మామూలుగా సేవా దళ్లకు మాత్రమే పరిమితం. మీరున్నారు కదా. అదే. నేను రోజు నన్ను వెళితే అక్కడ వాళ్ళు ఏమన్నారు అంటే "ఇక్కడ స్వామి సన్నిధిలో పది నిమిషాలు స్వామి గురించి మాట్లాడండి" అని అడిగారు. కొన్ని లక్షల చదరపు అడుగులు స్వామి కట్టించారు building. మీరు మూలన్నా పెట్టండి, నేను వచ్చి మాట్లాడతా. నాకేమీ fan కూడా అక్కర్లా. నేను వస్తా మాట్లాడతా. ఇది స్వామి దేహం వదిలినటువంటి. ఇక్కడ మన మనస్సుని స్వామి దివ్య పాదాల మీద, తలపుల యందు మనం ఆయనతో గడిపిన క్షణాలతో ముడిపెట్టుకోవాలి. ఆత్మానందాన్ని ఇక్కడ మనం ప్రశాంతంగా అనుభవిద్దాం. పది, పదిహేను నిమిషాలు నన్నేమీ అడగకండి అని నేను ఉండిపోయా. పదిహేను నిమిషాలలో లోకలోకాంతర ప్రాణాలు తగ్గిపోయినాయి. అసలు స్వామి లేరు అన్న భావన నా మనస్సు నుంచి ఎన్నడూ లేని అసలు ఇంకా భయదొరిగిపోయింది. అయితే బయటకు రాగానేసేవాదళ్ళు మన వాళ్ళంతా ఉన్నారు ఉన్న తర్వాత అందరూ కూర్చున్నారు శ్రీకాకుళం నుంచి ఎక్కడినుంచి అందరూ వచ్చారు. ఏదో మాట్లాడమన్నారు సేవ గురించి ఫాస్ట్ ఒక అరగంట మాట్లాడి వచ్చాము. మాట ఎందుకు చెప్తున్నాను అంటే పరిమిత దేహం నుంచి అపరిమిత చైతన్యం గా స్వామి ఉన్నారు కదా. ఇవాళ ఇక్కడ నిజానికి నెలలో డేట్ ఎప్పుడో నాకు చెప్పండి అని నేను ఫోన్ చేశా శర్మ గారికి. వాళ్ళు పాపం ఏం ఆలోచించారంటే ఎండాకదా కాస్త రెండు నెలలు ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళు అనుకున్నారు. కానీ నా commitment స్వామికి కదా! one year వస్తానని ఆయనకే నేను చెప్పాను. కాబట్టి మే నెలలో పిడుగులు పడని date చెప్పండి నేను వస్తా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తా అంతే [అందరూ ఒకేసారి చప్పట్లు వాక్యం] కాబట్టి దీనికి ఎండ లేదు, చండాలేదు. మనం చేయవలసింది పరమేశ్వరుడు గనక ఒక్క క్షణం అట్లా అనుకుంటే మనకి ఏదన్నా ఒంట్లో బాగాలేకపోతే పోనీలే వీడి సంగతి రేపు చూద్దాం అని గనక అనుకుంటే మన సంగతి చూసే తిక్కే లేదు మనకి. మనకేమో రావే వరదా రక్షింపవే భద్రా ఆత్మకాయ భజ్యాలు పాడుతాం పాడుతాం మన వాళ్ళందరినీ ఓంకారంచేండి సైగా ఎత్తి చేయండి అని బతికాలో అరుస్తుంటాం. ఆయన గనక తాత్సారం చేస్తే మనం ఏమైపోతాం అనని ప్రశ్న వేసుకున్నట్లయితే సేవా చైతన్యం మనం తాత్సారం చేయకూడదు. ఎందుకంటే స్వామి చెప్పారు రేపుకి నువ్వు పని లేదు ప్రసాద్ ఇప్పుడే క్షణమే అది నీది. నీకున్న సమయంలో నువ్వు చేయగలిగినంత కాలం నువ్వు చేయి, చేస్తూ ఉండు, నీ అనుభవాన్ని చెప్పు. అనుభవం లేకుండా కవిత్వం చెప్పొద్దు. అది ప్రయోజన శూన్యం అయినటువంటిది. దానివలన నీకు రకమైన మోక్షం లభించదు. అం-అందునా అసలు ఆనందం లభించదు అని కాబట్టి సేవ అనేటువంటి ఒక పరమాద్భుతమైన వస్తువు ద్వారా retire అయిన అటువంటి వాళ్ళు ఇవాళ నిజానికి కొక్కట్ పల్లి phase three లో ఎంతమంది retire అయినారు అని గనక KCR ఒక survey పెట్టినట్లయితే దీంట్లో పెద్దవాళ్ళందరికీ నేనేదో ఇది free గా ఇవ్వబోతున్నాను అని ఆయన ఒక మాట గనక అంటే సుమారు ఒక లక్ష మంది బయటికి వచ్చేస్తారు. దేనికి? ఆయన ఇవ్వబోయే వస్తువు కోసం అంతే కదా. [నవ్వు] మరి లక్ష మందిలో ఈవేళ అధ్యాత్మ కావాలి, సాధన కావాలి, శాంతి కావాలి. పైగా మనమున్న ప్రదేశానికి మనం ఏం చేయగలం అనేటువంటి ఒక ప్రశ్న మనయందు కలగకపోయినట్లయితే అధ్యాత్మ ఒక శుష్క ప్రసంగం కాకూడదు. అది గంభీర ఉపన్యాసం గా అయిపోకూడదు. అది సేవా ధర్మంగా, ఆత్మ ధర్మంగా, ఆత్మవిద్యా విలాసం గా అది ప్రపంచానికి మనం అందించాలి. అందుకనే సత్య సాయి అవతారం కేవలం మోక్షం ఇవ్వటానికే నేను రాలేదన్నాడు స్వామి. అది నా పని కాదన్నాడు. మీకు కష్టం కలిగితే దాన్ని భరించండి. at the most మీరు ఏమనాలంటే స్వామి కష్టాన్ని దాటగలిగిన శక్తిని నాకు ఇవ్వు స్వామి అంతే. అది నేను చూసుకుంటా. నేను చూసుకుంటా అంటే నేను వచ్చి చెప్పను. ఏర్పడుతుంది. అసలు నాకు కష్టమే వద్దు అన్నట్లయితే నీకు నాకు సంబంధమే లేదు. ఎందుకంటే అది నీ కష్టం, నా కష్టం తీర్చు అంటున్నావ్. నా కష్టం అంటే నీదే అది కూడా నీ ఆస్తే దా-దాంట్లో నా ప్రమేయం లేదు. ప్రతి కష్టాన్ని కర్మ నిష్ఠగా మార్చుకోండి. ప్రతి అననుకూలతని అనుకూలం చేసుకోండి. ప్రతి దుఃఖాన్ని సుఖమయం చేసుకోండి. మీకు కలిగేటువంటి ఒక విషాదాన్ని ఒక opportunity గా మార్చుకోండి. దానిలో నుంచి మీ అంతట మీరు బయటపడే ప్రయత్నం చేయండి. చేస్తే భగవంతుడు సహాయం అడిగితే చేస్తాడా? అడగకపోతే చేయడా? మాత్రం విచక్షణ లేదా? అంటే భగవంతుడు అడిగిన వాడికే చేసి అడగని వాడిని వదిలేస్తాడు అంటే అడగని వాడికి నేను ముందు చేస్తా అన్నారు స్వామి. [అందరూ ఒకేసారి చప్పట్లు] అడిగేవాడు రాడు వాడు ఆశీస్సులు అంటాడు, రోజూ లిస్టు పెడుతుంటాడు అక్కడ. చీటీలు వేస్తుంటాడు. చీటీ వేస్తున్న దేవుడు వెంటే అంటుంటాడు మనిషి. వాడికి యాభై ఏళ్ళ experience ఉంటుంది. అయినాను దేవుడు వెంటే అంటాడు. పాపం ఆయన్ని దేవుడివి దేవుడివి అని చెప్పుకోవాలి. prove చేసుకోవాలి అందుకని చీటీలు వేస్తుంటాడు. కావలసింది ఇది కాదు. మౌఢ్యంలో నుంచి, మూఢత్వంలో నుంచి, భావనలో నుంచి మనల్ని మనం బయట పెట్టుకోవాలి, బయట పడాలి. కాబట్టి సేవా ధర్మాన్ని ఆధ్యాత్మిక సాధనగా మార్చుకోండి. It is a need a spiritual సాధన. దానిలో అనేకమైనటువంటివి ఉన్నాయి. మేము పారాయణం చేశాం. నెల నుంచి నెల దాకా ఏవండీ సర్వేశం. ప్రయోజనం ఏవీ లేవు. చేయవలసింది కర్తవ్యమే. కర్తవ్యంలో నుంచి మనల్ని మనం redeem చేసుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి సేవ ద్వారా మన మనస్సును మనం శుభ్రపరుచుకోవాలి. మనల్ని మనం శరణాగతి పొందాలి. వేదాంత భూమికలో ఉన్న పదజాలంతో మనం నోటికి వచ్చినా మన character మంచిది కాకపోతే మనం ప్రపంచానికి బరువే తప్ప బరువు కాదు. కాబట్టి ఏమి ఆలోచిస్తున్నామో అది అనాలి. ఏ-ఏర్ని అంటున్నామో దాన్ని చేయాలి. మూడింటి మధ్య ఒక సమన్వయం అయినటువంటి రీతిలో గనక సాగినట్లయితే అది నిజమైనటువంటి ఆధ్యాత్మికత. అట్-అదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గము. తర్వాత మోక్షాన్ని కోరకండి. జన్మలు కావాలి అని కోరుకోవాలి మనం. ఎందుకంత కూడా? మళ్ళీ సేవ చేయొచ్చు. మళ్ళీ ఆనందంగా ఉండొచ్చు. ఏముంది ఒకసారి పుడతాం ఒకరోజున పోతాం అంతే కదా. మధ్యలో గొడవంతా hundred years time ఉంది మన దగ్గర. hundred years నాకు వద్దు మళ్ళీ జన్మ లేకుండా చేసేయ్ అంటే బ్రో అని చేశాడు. అక్కడ ఏం చేద్దాం అని అక్కడ పనే లేదే. వాడు రోజూ అమృతం పోస్తాడట. చావు లేదు, దుఃఖం లేదు, సుఖం లేదు, నిద్ర లేదు, శరీరం కరగదు. బాల్య కౌమార యవ్వన దశలు లేవు. త్రిదశలుగా ముప్పై ఏళ్ళు వచ్చినా, మూడు వందల ఏళ్ళు వచ్చినా ఒకలానే ఉంటాడట. అంటే రాతి బొమ్మలనై పోతామా మోక్షం తర్వాత? చైతన్యశీలం అయినటువంటి మానవ దేహాన్ని మనం తీసుకొని రావాలి. పరమేశ్వరుడిని అడగాలి నాకు మరొక్క జన్మ ఇవ్వమని అడగాలి. ఒక్క జన్మలో నేను ఇక్కడ చేసుకోవాల్సినవి నేను చేసుకుంటా. ఇక్కడ అన్నీ చేయలేకపోతే.చేసి ఉండారు కానీ ఉత్తమ జన్మ మంచి జన్మ సత్సంగంలో ఉంచు సజ్జన మైత్రి తోను సద్గురువుల సమాశ్రయాన్ని సేవ యోగాన్ని అనుగ్రహించి అందుకనే కర్మ భక్తి జ్ఞాన యోగాలు కలిస్తే దాని పేరు సేవ సేవ యోగాన్ని స్వామి ప్రపంచానికి అలౌకికగా నెరపేశారు ఇవాళ ఎవరు దాని మీద ఉపన్యాసాలు ఇవ్వడానికి మీరు ఆఫ్రికా వెళ్ళండి చిన్న చిన్న బహమా తీపానికి వెళ్ళండి న్యూజిలాండ్ లాంటి country కి వెళ్ళాను ఇట్లాగే ఒక సల్వాన్ లో ఒక ఇంట్లో ఒక terrace మీద స్వామి పటం పెట్టి అనేకమైనటువంటి విషయాలు మనం వచ్చేవారం ఏం చేద్దాం వచ్చే నెల ఏం చేద్దాం నవంబర్ ఏం చేద్దాం దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమిటి అన్ని ప్రసన్నంగా రకమైన దర్శనం లేకుండా ఎంతో ప్రేమగా ఒక్కమాటగా ఇంత training స్వామి ఇవ్వన్నీ ఆయన examples పెట్టారా శిబిరాలు ఏర్పాటు చేశారా రోజూ మనకు ఉపన్యాసాలు ఇచ్చారా printed matter ఇచ్చారా ఇవ్వలే ఒక IAS ఆఫీసర్ ని అడిగా మీరు first second batch లో ఉన్నారు కదా white field లో స్వామి నుంచి ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు మీకు చెప్పారా అని అడిగాను ఒక్కమాట చెప్పలేదండి ఆయన్ని చూసి మేము నేర్చుకున్నాం time కి లేవటం time కి brush చేసుకోవటం అన్ని ఇవాళ మనం ఒక ఉత్తమమైన జీవితం ఇది అని అంటే అది స్వామి నిరూపించారు నిరాడంబరమైన జీవితం గడిపారు మనందరం కూడా ఇవాళ గమనించుకోవలసింది ఒకటి ప్రగల్భము గర్వము అహంకారము మనం వదిలిపెట్టాలి మూడు ఉన్నంత కాలం అధ్యాత్మలో ఉన్నావు ఒకటే లేకపోయినా ఒకటే రెండవది మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చేయాలి దాన్ని దాచి పెట్టుకునే హక్కు మనకు లేదు స్వామి చెప్పారు దాచిపెట్టావా అది పాచిపోతుంది ఎవరికీ ఉపయోగం లేదు పంచిపెట్టే వెళ్ళు కావలసినంత వస్తూ ఉంటుంది మనం ఏమంటాం అంటే వస్తే ఇస్తాం అంటాం వచ్చిన తర్వాత అసలు కదా వచ్చేదాకా అంటాం కానీ వచ్చాక ఇస్తా ఇస్తూ వెళ్తుంటే వస్తూ ఉంటుంది అన్నారు చిన్న మాటలు ఇవన్నీ కూడా అధ్యాత్మలో అతి సరళమైనటువంటి మాటల్లో సనాతనమైనటువంటి ధర్మాన్ని వైదిక ధర్మాన్ని సేవా మార్గం వైపు జాతిని నడిపించినటువంటి మహాద్భుతమైనటువంటి అవతారపు స్ఫూర్తి స్వామి మూర్తి అంటే ఒకటి బొమ్మే అది స్ఫూర్తి నిన్న స్వామి ఆరాధన ఉత్సవానికి అనేక ప్రదేశాలకు నేను ఒకే రోజున వెళ్ళినప్పుడు trend మార్చుకున్నారు మన వాళ్ళు ఇది వరకు ఒక చోట tent వేసి వచ్చిన వాళ్ళందరికీ tiffin లో పెడితే అందులో ఆకలి అయిన వాడికి అందని భోజనం అక్కరలేని వాడు రెండు భోజనాలు చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నుంచి ఎక్కడ అవసరాలు ఉన్నాయో అక్కడ గమనించుకొని decentralize అయిపోయి వాళ్ళ వాళ్ళకి correct గా అందరికీ ఏకకాలంలో పన్నెండు గంటలకు స్వామి ప్రసాదం ఇవ్వటమనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది ఎప్పుడూ ఎక్కడా జరగలేదు అంటే ఎక్కడికి ఎక్కడ కాలానుగుణంగా మన సేవా కార్యక్రమాలను కూడా redefine చేసుకోవాలి అప్పుడు ఆనాడు స్వామి చెప్పారు గనుక స్వామి చెప్పారు మార్గం చూపించారు కానీ ఇవాళ కాలానికి అనుగుణంగా మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎంతవరకు చేయగలం నేను నలభై వేల మందికి చేశాను అనేకంటే నాలుగు వందల మందికి తృప్తిగా చేశాము ఇది ఆనందాన్ని కలిగిస్తుంది నాలుగు వేల మందికి చేశాము vanity నాలుగు వందల మందికి తృప్తిగా చేశాము అది చాలదు స్వామి vanity మార్గం వైపు వెళ్ళొద్దన్నారు మీరు దాని చొప్పుకు వెళ్ళకండి మీరు మొయ్య లేదు మొయ్య లేనిది మీరు ఎన్ని తెచ్చుకుంటున్నారు నలభై మందికి అన్నం పెట్టండి నలుగురికి అన్నం పెట్టండి నాలుగు ఇళ్లలో అన్నం చేర్చండి ప్రసాదం చేర్చండి అది తృప్తిగా చేయండి అవసరమైన వాళ్ళకి చేయండి అది సేవాదళానికి మన సాయి భక్తులకి ఇవాళ నేను హృదయపూర్వకంగా ఒక compliment ఇవ్వదలుచుకున్నాను నారాయణ సేవ జరిగినా ఇటువంటి నలభై వేల మందికి ప్రసాదం పంచిపెట్టినా చిట్టచివరికి భోజనం చేసేవారు ఎవరు అంటే వాళ్ళు మన సేవాదళం మాత్రమే వాళ్ళు ముందు కొంచేసి పంచిపెట్టరు మిగిలితే పంచిపెట్టారు తింటారు లేకపోతే ఒక మెతుకు బట్టా రోడ్ లో వేసుకుని స్వామి సాయిరాం అనక Prasanthanga ఇంటికి వెళ్ళిపోతారు ఇవాళ అతలాకుతలమైనటువంటి ప్రపంచం డబ్బు అనేటువంటి జబ్బుతో వ్యాధిన పడినటువంటి జాతి విలువలు దిగజారి పోతున్నటువంటి ఒక జాతి వైదిక ధర్మానికి దూరంగా వైదొరిగినటువంటి ఒక జాతి అంతా డబ్బు చుట్టూ భ్రమిస్తున్నటువంటి ఒక జాతి మళ్ళీ ధర్మం వైపు న్యాయం వైపు సత్యం వైపు శాంతి వైపు మళ్ళీ తిరిగి మరలి రావాలి అంటే అది చేయగలిగినటువంటి అఖండ చైతన్య శక్తి కేవలం సత్యసాయి organization దానికి మాత్రమే ఉన్నది మరెవరికీ లేదు. [అప్లాజ్] నలుగురికి scholarship ఇస్తారు నాలుగు వేల రూపాయల భోజనం తింటా ఏం ప్రయోజనం నేను ఎక్కడో ఒక board వాయి-వాయి వేయిస్తారు paper లో వచ్చేట్లుగా చూసుకుంటారు ఎక్కడైనా సాయి సేవా సంస్థలు ప్రచారం కోసం వెళ్ళినాయా ఎవరైనా photos వేయించుకున్నారా చేసిన వాడు వెనక ఉంటాడు ఎవరో వచ్చి అక్కడ నిల్చుంటారు they don't bother అట్లాగే ఉండాలి అది స్వామి నెలకొల్పిన సాంప్రదాయం వాళ్ళు చెప్పిన ఒక మాట ఎప్పటికీ నాకు గుర్తు ఏముంది ఇవాళ కాదు హందొమ్మిది వందల అరవై ఎనిమిది లో చెప్పిన మాట ఒక hall లో ఒక బెల్లం ముక్క విసిరేసి పడుకోండి మీరు తెల్లవారిప్పటికి ఏమవుతుందో చూడండి చీమలన్నీ వచ్చి బెల్లం ముక్కను తిని వెళ్ళిపోతాయి చీమలు ఎవరో వాటి address ఏమిటో మీకు తెలియదు మీరు చేసే సేవ అలా ఉండాలి ప్రచారం లేని సేవ చేయండి ప్రచారం చేసేట్టుగా చేయండి మీకు పది బట్టలు పది చీరలు లేదు పది dresses.కొనుక్కునే అవకాశం ఉంటే ఎనిమిది బ్రష్లు కొనుక్కోండి. కొనుక్కోవద్దని నేను చెప్పను. ఎనిమిది కొనుక్కోండి. రెండికయ్యే డబ్బు పక్కన పెట్టండి. అవి కూడా లేని వాడెవడో వెతుకు వాడిని వెంబడి పెట్టకండి. స్వామి! నా అనుభవంలో మాములుగా బయటికి చెప్పను గాని ఇవాళ ఒక విషయం చెప్తాను. ఎప్పుడు నాకు స్వామి బట్టలు పెట్టినా, నాకొక కవర్లో కుట్టు కూలి దర్జీకి ఇవ్వాలి కదా బంగారు. ప్యాంటు ముక్కలు నుంచి ప్యాంటు రాదు కదా, ట్రౌజర్ రాదు కదా. దర్జీ కోసం నేను డబ్బు పెట్టాను. టైలర్ ఫీ ఇచ్చేసేయండి అని అంటే స్వామివారు డబ్బు ఇచ్చారని యధాతథంగా కవర్లో ఇస్తే అటువంటి టైలర్స్, డబ్బు అందుకున్న టైలర్స్ వాళ్ళు మాములుగా కుట్టిన ప్యాంటుల కంటే కొన్ని వేల రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నారు. అంటే దర్జీకి ఆయన అనుగ్రహం రూపంలో ఇచ్చారు. [అందరూ ఒకేసారి చప్పట్లు] ఆయన చుట్టూ తిరగరాదు. అంటే వాడి శ్రమని మనం దోచుకోకూడదు. ప్రతి చిన్న విషయం చూసుకోవాలి. అలాగే చాటలంత విస్తరాకులు వచ్చేవి, అక్కర్లేదు చిన్న విస్తరాకులు. మనం తినేది ఎంత? అలాగే నారాయణ సేవ విషయంలో ఇవాళ అనేక మార్పులు వచ్చినాయి. సంస్థాగతంగా కూడా నా సూచన ఒకటి ఏంటంటే అఖండ నామ-- నామం జరుగుతుంది. జరుగుతుంది. నవంబర్ పదకొండు. ప్రశాంతి నిలయంలో కరెక్ట్ గా ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి మూడు కుండీకలు వచ్చేవి. మూడు కుండీకల్లో మూడు దరిద్రలు ఉండేవి. దగ్గర ఉన్నటువంటి వారికి స్వామి స్వయంగా ఆకు తీసుకొని దాంట్లో మూడు ముద్దలు పెట్టేవారు. ఏమున్నాయంటే సబ్జోజనం, పులిహోర, చక్కెర పొంగలి. వీటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా రాలేదేమి అనేవారు. అంటుండగా వారు ముగ్గురు వచ్చేసేవారు. ఇవాళ మనం మిరపకాయ బజ్జీలు వేద్దామా, జిలేబీలు పెడదామా? ఇది మన అహాన్ని పెంచుకోవటమే. స్వామి దేనిని ప్రారంభించారో దాని వెనక ఉన్న నిరాడంబరత, దాని వెనక ఉన్నటువంటి వినమ్రత, దాని వెనక ఉన్న economic principles. ఇవాళ మనం ఒకళ్ళ ఇంటికి భజనకి-- భజనకి వెళ్తాం. బాగా డబ్బున్నవాడు క్రిస్టలే సంఘం పెడుతున్నాడు. డబ్బు లేని వాడు గుండు పోస్తున్నాడు. వాడికి భజన చేయించుకోవాలని ఉంటుంది. మూర్తి గార్ని నిలవాలి, కాశీష్ మాట్లాడించుకోవాలని ఉంటుంది. మనం గనక వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు అక్కడికి? నువ్వు నాకు ఐదు వేలు డబ్బు ఇవ్వవా మాట్లాడతానని అనొచ్చా? మహా పాపం కదా! కాబట్టి మనం ఏం చేయాలి? బాగా డబ్బున్నటువంటి వాళ్ళు డబ్బంతా పూలప్ చేసి యూనిఫామ్ గా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మళ్ళీ మీరు ప్రవేశపెట్టండి. ఊరికే విస్తరాలు వేసి పంచిపెట్టే పని తాము అవసరం లేదు. మనకి కావలసిన ప్రసాదం కూడా ఎందుకని అంటే, భజన అయిన తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు. మళ్ళీ వాళ్ళకింత ప్రయాణం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కాస్త అన్నం పెడితే వాళ్ళ ఇంటి వాళ్ళు "వాళ్ళు ఎందుకన్నా ఉన్నాయి" అని మళ్ళీ మనం ఇక్కడ ఇవ్వక్కర్లేదు. అంటే ఎంత economic principles స్వామి సేవలో అహంకారాన్ని తగ్గించడానికి, మన ఆడంబరాలు తగ్గించడానికి, మనలో వినయాన్ని నేర్పడానికి సేవా మార్గాన్ని మహాయోగ్యంగా తీర్చిదిద్ది మనకి అప్పజెప్పారు. గనక ఇవాళ స్వామికి మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి గురు దక్షిణ ఏది అంటే స్వామి ఎట్లా జీవించారో మనం అలా జీవించే ఒక ప్రయత్నం చేద్దాం. చాలా తేలిక. మనం అనుకుంటే చాలా తేలిక. ఆయన అనుకున్నారు. తేలికగా సాగించారు. ప్రశాంతి నిలయంలోనే ఉన్నారాయన. ప్రశాంతి నిలయంలో ఒక గదిలో ఎంత చిన్న గది అయితే ఒక చిన్న మంచం వేసుకొని అక్కడే నిల్చారు. బండి నెట్టారు. ఇవాళ త్రీ బెడ్రూం, టూ బెడ్రూం అయిపోయింది. ఇప్పుడెవరూ మాట్లాడటం లేదు. ఇల్లు కొచ్చాం. ఇల్లు కొనుక్కున్నానంటే పక్కనే సత్సంగానికి వచ్చేవాడు "నిన్ననే మా అబ్బాయి డబ్బా కట్టేయండి. ఫైవ్ బెడ్రూం కొనేసాము" అంటాడు. ఇంక వీడు మూడు బెడ్రూంలో ఉండలేడు. దుఃఖం వాడికైదు ముద్ద. అని మళ్ళీ ఐదు కోసం ఏడుస్తూ ఉంటాడు. చివరికి ఏమవుతుంది? సిక్స్ బై త్రీ వింటే కదా ఎవరికైనా. అరవై బై మూడు, అరవై బై మూడు గుర్తుపెట్టుకుందాం. అరవై బై మూడు మనకున్నా అంతా కట్టేసి అరవై మూడు చేస్తారు. కాబట్టి వైరాగ్యం వల్ల వచ్చిన ఒక వైభోగాన్ని, వైభోగంగా భావించే ఒక తృప్తిని, ఒక శాంతిని, ఒక హాయిని సేవా మార్గంలో చేద్దాం. ముఖేశ్వరి సమితి ఇలాగే చక్కగా తమ కార్యకలాపాలు చేయాలని, చేసుకుంటూ తమ కార్యకలాపాలని ఇంకా దృఢతరం చేయాలని, ఎన్ని వేల మంది వచ్చారనేది ప్రశ్న పెట్టుకోకండి. వచ్చిన వాళ్ళు వస్తారు. రాని వాళ్ళు రారు. దాని గురించి బెంగే లేదు. ఎవ్వరూ రాకపోయినా శర్మ గారు, శర్మ గారి యశస్సు అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు నా ముందు కూర్చున్నారు. ఇదే మాటలు చెప్పి నేను మా ఇంటికి వెళ్ళి ఉండేవాడిని. కాబట్టి కావలసినది ఏమిటంటే స్వామి చెప్పేది మనం ఆచరిస్తున్నామా లేదా? స్వామి దేవుడు దేవుడు దేవుడు. చేసాం మనం. ఆయన దేవుడైనాది. ఇంకా మన దేవుడు అక్కడే ఆగిపోతే ప్రయోజనం లేదు. దేవుడై ఆయన ఏం చేసాడో, మానవులై మనం ఏం చేయగలుగుతున్నామో రెండింటినీ సమన్వయం చేసుకుందాం. అలాగే మంచి భజనలు, భజనలు చాలా బాగా practice చేయాలి. భజన గురించి...
YouTube · audio

Sathasangam_4 Service - Social Responsibility part 2

Home

Sathasangam_4 Service - Social Responsibility part 2

Source: SathyaSai Seva Sadan on YouTube

0:00 / 23:40

More in this series

Service & Social Responsibility

2 episodes · 1 hr 10 min

  1. 47 min 1

    Sathasangam_4 Service -Social Responsibility part 1

  2. 23 min 2

    Sathasangam_4 Service - Social Responsibility part 2

    Now playing