No transcript for this section.
Transcript begins at 0:00.
ఆగవింద సుహుదా సదృశం ప్రసాదే తృయ్యం తథా మహసితో యజ బాంధవేన బ్రాహ్మణ్యం స్థితోతు పితరం వటమూల వాసం సంస్మారయంతమచలం తమనుస్మరామ ఓం నమో భగవతే శ్రీ రమణాయ భారతీయ అధ్యాత్మ చరిత్రలో శంకర భగవత్పాదుల తర్వాత ప్రపంచానికి ఆత్మ దేహంలో ఎక్కడ ఉన్నది అని చెప్పటానికి వచ్చినటువంటి కరుణాపూర్ణ శతాబ్ది భగవాన్ శ్రీ రమణులు భగవాన్ రాకముందు ఆత్మను గురించి ఆత్మ యొక్క స్వభావాన్ని గురించి దాని శక్తిని గురించి దాని సర్వవ్యాపకత్వాన్ని గురించి అనేకమైనటువంటి సిద్ధాంతాలు భారతదేశంలో చెప్పబడ్డాయి ప్రధానంగా శంకర భగవత్పాదులు ఆత్మబోధలో అనేక విషయాలు ఆత్మపరంగా చెప్తూ ఖడగ ఒక మాటన్నారు ఆత్మ అంటే ఏమిటి? అనగానే మనం ఆత్మ అంటే ఇప్పుడు చెప్పిన omni present, omni potent, omni efficient అని మనం ఏదో చెప్తూ ఉంటాం కానీ భగవత్పాదులు పదవిభజన చేసి ఆత్ అంటే ఏమి మా అంటే లేదు. ఏమీ లేకుండా ఏదై ఉన్నదో అది ఆత్మ అని చెప్పారు మరి ఏమీ లేదని చెప్పే ఈ ఆత్మని పట్టుకోవటం ఎందుకు అసలు పట్టుకోవటం ఎట్లా ఎక్కడ ఉన్నదని పట్టుకోవాలి అని విపరీతమైనటువంటి ఆలోచనలు సాధకుడికి కలుగుతాయి దానికి మళ్ళీ కరుణాలయమైనటువంటి శంకర భగవత్పాదులు పరిష్కార మార్గం కూడా చెప్పారు అంటే ఆత్మ ప్రత్యేకంగా ఒక విషయం కాదు సర్వం ఖల్విదం బ్రహ్మ ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా ఆత్మే పదార్థంగా కనిపిస్తున్న ఈ ప్రపంచం అనాత్మ అయితే ఈ అనాత్మకి మూలం గనక కనుక్కోగలిగితే దాని పేరు ఆత్మ. అది జడమై చైతన్యమై ప్రవాహమై నిశ్చలమై అచలమై అనంతమై అవ్యయమై అచ్యుతమై ఏది కనిపిస్తూ ఉన్నదో ఆ కనిపిస్తున్న దాని యొక్క మూలాన్ని కనిపెట్టడమే ఆత్మాన్వేషణ. అంటే ఆత్మ అంటే లేదు అని కాదు ఉన్నది ఎట్లా ఉన్నది అంతా తానే ఉన్నది జడమూ తానే చైతన్యమూ తానే కాబట్టి సర్వవ్యాపకమైన సర్వశక్తిమంతమైన ఈ ఆత్మను గురించి అనేక గుణాలు చెప్పబడ్డాయి భగవత్పాదుల కంటే ముందు భగవద్గీతలో కృష్ణుడు కూడా ఇలాగే చెప్పాడు కృష్ణుడు అంటే భగవాన్ ఆత్మను గురించి చెప్తూ ఇది నీట నానదు నిప్పున కాలదు కొంగదు పొంగదు లొంగదు వంగదు ఇది indestructible అది అవినాశి దానిని ఎవరూ వినుర్మూలించలేరు అని ఊరికే ఒక statement లాగా ఇచ్చి దాన్నక్కడికి ఆయన వదిలేశారు యోగీశ్వర కృష్ణుడు ఆ తర్వాత శంకర భగవత్పాదులు వస్తే మరి భగవాన్ రమణులు ఏం చేశారు ఈ ఆత్మను గురించి ఆత్మ విచార మార్గం చెప్పారని అందరికీ తెలుసు అది కాదు ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది అని చెప్పినది మాత్రం భగవాన్ శ్రీ రమణ మహర్షి హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విష మనసాస్వం చిన్వతా మర్జతావా పవనచరణ రోధాత్ ఆత్మ నిష్ఠో భవత్వం ఇది రమణ భక్తులకి చాలా పరిచయమైనటువంటి ఒక శ్లోకం నిజానికి భగవాన్ రమణులు ఆత్మ విచార మార్గానికి వెళ్ళబోయే ముందు అసలు ఈ ఆత్మ ఎక్కడ ఉన్నదో తెలుసుకోకపోతే విచారణ చేసేది ఎట్లా అని దయచేత కరుణ చేత మన యందు ఉన్నటువంటి విశేషమైనటువంటి గాఢమైనటువంటి ప్రేమ చేత అది ఎక్కడో లేదు నీలోనే ఉన్నది ఎడమ వైపున ఉన్నటువంటి గుండె mechanical heart అయినట్లయితే దానికి ఒకటిన్నర అంగుళాల దూరంలో కుడి రొమ్మున ఒక ఖాళీ గుహ ఉన్నది ఆ గుహ మధ్యలో నేను నేను నేను అని వెలిగిపోతూ ఒకటున్నది అదే ఆత్మ హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం absolute బ్రహ్మం ఎక్కడ ఉన్నది అదే ఆత్మ యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి ఆత్మ గనక సాకారమైనట్లయితే అది నీ యందు కుడివైపున ఉన్నటువంటి హృద్గుహ యందు వెలుగుతూ ఉన్నది అంటే పట్టుకోగలవా లేదా అంటే పరమాత్మ ముందు ఒక దీపం వెలిగించి దానిమీద చిల్లులు ఉన్నటువంటి పాత్ర బోర్లించినప్పుడు చుట్టూ ఎన్ని జంజామారుతాలు వీచినా అన్నీ పడిపోవచ్చు గాక కానీ ఆ దీపపు సెమ్మయ లోపల ఏదైతే జ్యోతి ఉన్నదో అది ఆరకుండా నిశ్చలంగా నిభృతంగా అఖండంగా అనాహతంగా అవినాశంగా వెలుగుతూనే ఉన్నదే అదే ఆత్మ అన్న ఎరుకలో నిలకడ చెంది ఉండు అని ఈ శ్లోకానికి అర్థం ఆత్మ ఏంటో అర్థమైంది అది ఎక్కడుందో అర్థమైంది కనుక భగవాన్ రమణులు చాలామంది ధ్యాన మార్గాలు చెప్తూ నిజానికి పది వందల డెబ్బై ఎనిమిది ధ్యాన మార్గాలు ఈ దేశంలో ఒకానొక కాలంలో చెప్పబడ్డాయి తర్వాత అవి నూట డెబ్బై ఎనిమిదికి మారినాయి తర్వాత వందకి మారినాయి తరతరాలు మారుతూ మారుతూ వచ్చి ధ్యాన ప్రక్రియలన్నీ మారిపోయి కానీ ధ్యానాన్ని ఉపాసించేవారు లేదా అనుసరించేవారు వాళ్ళంతా భ్రుకుటి ధ్యానం చేస్తారు అంటే ఆజ్ఞాచక్రం మీదధ్యానం చేసి మాకు దేవుడు కనిపించాడు అని ఆనందపడుతూ ఉంటారు కానీ యదృశ్యం తన్ నశ్యం ఏది కనిపిస్తున్నదో అది పోవటానికి వచ్చింది ఏది పోవలసి ఉన్నదో అది కనబడుతున్నది గనుక నువ్వు ఎంత తీవ్ర ధ్యానివైనా ఎంత ధ్యాన ముద్రలో నీవు ఉన్నా నీకు కనిపించే ఈ దృశ్యాలు కూడా ధ్యానం ఆగిపోగానే దృశ్యాలు కూడా పోతాయి. ఆ పోకుండా నిలకడ చెంది ఉండేటువంటి ఒక అపురూపమైన స్వస్వరూపానుసంధానం అంటాం. నీ స్వరూపాన్ని నీకు తెలియజెప్పగలిగే ధ్యానములో ఉండాలి అంటే ఏం చేయాలి ఎక్కడ ధ్యానించాలి అంటే కుడి వైపున ఉన్నటువంటి కుడి రొమ్మున లోపల హృద్గుహలో ఉన్నటువంటి ఆ నీను మీద ఏది illumination గా ఏది జ్యోతిర్మయంగా వెలుగుతూ ఉన్నదో దాని మీద గనక నీవు ధ్యానించినట్లయితే ఎందుకంటే ధ్యానం చేయటం అంటూ ఏం లేదు ఎందుకు చేసేది ధ్యానం కాదు గనుక ఏవి చేయకపోవటమే ధ్యానం గనుక కాబట్టి ఆ హృద్గుహలో ఉన్నటువంటి ఆత్మ రూపేన భాతి అన్నారే దానిమీద గనక ఆ ధ్యానించి ఉన్నట్లయితే నీ లోపల ఉన్నటువంటి నీవు అంటే ఏ నేను అసలు నేను ఉన్నదో అది ఒక వెలుగుగా ప్రకాశమానంగా నీకు అనిపిస్తుంది కనిపించడానికేం లేదు అక్కడ అంతా అనిపించడంలో ఉన్నది కనిపించింది అంటే పోతుంది అనిపించింది అంటే ఉండి తీరుతుంది ఇది భగవాన్ రమణులు ఆత్మపరంగా ఈ మానవాళికి చేసినటువంటి మహోపకారం ఇది యోగశాస్త్రానికి షట్చక్ర ప్రయాణానికి అంతిమమైనటువంటి పరమ చరమ స్థాయికి చెందినటువంటి సమాధానం ఇది. ఇది pinnacle అంటాం శిఖరాగ్ర స్థాయి అంటాం ఆ స్థాయిలో నీవు పొందవలసినది నీ యందే ఉన్నది. నీవు బయట వెతికినందువలన బయట వస్తువే కనపడుతుంది గనుక ఈ ఆత్మను ఎరిగేటువంటి ఒక స్థితిలోకి వెళ్ళటమే ఆ ఆత్మ విచార మార్గము ఆ ఆత్మ విచార మార్గానికి భగవాన్ అనుసంధించినటువంటి ఒకే ఒక ప్రశ్న నేను ఎవరు? అది తర్వాత చివరలో మాట్లాడుకుందాం. ఈ నేను ఎవరు కంటే ముందు అందరూ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకోగలరా? అది ఎప్పుడైనా వేసుకుంటారా? అంటే వేసుకుంటాం మనం ఎప్పుడు జీవితం మనకు సహకరించనప్పుడు కష్టాలు తీవ్రంగా ఉన్నప్పుడు అతిశయించిన దుఃఖం కలిగినప్పుడు ఆశలు నెరవేరనప్పుడు ఆదర్శాలు ఆచరించలేనప్పుడు మనం ఈ దృశ్యమాన ప్రపంచాన్ని ఒక యదార్థంగా స్వీకరించినంత కాలం మనకి ఆ నేను ఎవరన్న ప్రశ్న మనం వేసుకోవటం వేసుకోం ఎందుకని అంటే నేను ఎవరు అన్న ప్రశ్న అకాడమిక్ కి సంబంధించింది కాదు అది ఆత్మ విచార మార్గాన్ని వారు ఇంగ్లీషులో చెప్పారంటే నేను ఎవరు. నేను ఎవరైటీ నేను పలానా నేను ఇది చదువుకున్నాను నేను engineer ని నేను doctor ని నాకు ఫలానా పొట్టరా అన్నీ ఉన్నాయి నాకు అఖండమైన కీర్తి ఉంది నేను సౌందర్యవంతుడిని ఇవన్నీ నేనుకు సంబంధించిన నేను విచారణ అది. కానీ అసలు నేను మనకి ఇంకా తెలియదు ఇవన్నీ పైన పై పైన చెప్పుకునేటువంటివి తర్వాత మనం జన్మ ఎత్తి వచ్చిన తర్వాత పొందినవి మనతోనే మనం పోగొట్టుకోబోతున్నవి. కాబట్టి ఏది అసత్యంగా ఉన్నదో అనిత్యంగా ఉన్నదో అశాశ్వతంగా ఉన్నదో ఏది ఈ ప్రపంచంలో మరొక పదార్థంగా ఉన్నదో దానిని అంటే we consider the unreal to be real. భగవాన్ అట్లా కాదు వారు ఏం చెప్తారంటే ఏది real ఓ నీవు గ్రహించగలిగితే ఈ ప్రపంచం అంతా నీకు అలాగే కనిపిస్తుంది ఈ ప్రపంచం unreal అని చెప్పలే ఆయన. కాబట్టి మాయామయ జగత్తుగా కనిపిస్తున్న ఈ ప్రపంచం కూడా ఆ పరమేశ్వరుని యొక్క లేదా ఆత్మ యొక్క స్వరూపమే తప్ప అన్యం కాదు. అందుకనే భగవాన్ తర్వాత తర్వాత కాలంలో ఒకానొక చోట ఒక కుర్రవాడు లేదా మన వట్టి వాడు ఒక సాధకుడు వెళ్లి భగవాన్ ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి అది ఎట్లా ఉంటుంది మాకు చెప్పమని అడిగాడు. అప్పుడు భగవాన్ ఒక చిరునవ్వు నవ్వుతూ ఏమి నువ్వు వేసుకున్నట్టుగా ఒక ప్యాంటు చొక్కా వేసుకుని నీ లోపల నుంచి బయటకు వచ్చి ఆత్మ నిలబడుతుందని అనుకుంటున్నావా కాదు కాదు ఆత్మ సాక్షాత్ ఆకారమై ఉన్నది అంటే ఆ ఆత్మే ఆకారాన్ని ధరించింది అది నువ్వే అన్నారు. అంటే ఆత్మ మన నుంచి భిన్నంగా లేదు అభిన్నమై అద్వయమై అద్వైతమై పరిపూర్ణంగా ఏదైతే ఉన్నదో వికాసమానం చెంది ఉన్నదో అదే ఆత్మ అని చెప్పారు. అయితే ఈ ఆత్మ విచార మార్గానికి వెళ్ళటానికి అందరూ ఎందుకు ముందుకు రారు ఇందాకే వేసుకున్న అందరూ ఈ ప్రశ్న వేసుకుంటారని వేసుకోరు కష్టసుఖాలలో ఇక మనం నిస్సత్తువే ఏర్పడినప్పుడు ఏ జీవితాన్ని మనం నడపలేం అనేటువంటి ఒక నిస్సహాయత మన మనసు కలిగినప్పుడు ఏమిటి ఈ పాడు జన్మ అసలు ఎందుకు వచ్చాం అని మనల్ని మనం నిందించుకుంటూ అం మనం ఒక న్యూనత ఆ న్యూనతా భావంతో మనల్ని మనం మన esteem నుంచి మనం పడగొట్టుకుంటాం. ఇది కాదు మరి ప్రశ్న ఏమిటంటే మరి నేను ఎవరనేది గొప్ప ప్రశ్న అయినప్పుడు పైగా భగవాన్ రమణ మహర్షి అంతటి మహాత్ములు చెప్పినప్పుడు అందరూ ఎందుకు వేసుకోవటం లేదు అని. వేసుకోకపోవటానికి ప్రాపంచికమైన కారణాలు ఇంతకుముందు చెప్పుకున్నవైనట్లయితే జీవుడి యొక్క సంస్కారం వలన కూడా వేసుకోడు. వాడికి ఆ సంస్కారమే లేకపోయినట్లయితే నేను ఎవరన్న ప్రశ్న వేసుకోడు. నేను ఎవరో చెప్పుకుంటూ తిరుగుతాడు వాడు వాడెవరో అని తరిడి పరిస్థితి గురించి చెప్పుతూ బతుకుతాడు కానీ తనను తాను ఎరుగకనే కన్నుమూస్తాడు. ఈ ప్రమాదాన్ని తప్పించడం కోసమే భగవాన్ మనం ఒక్కసారి గనక ఇప్పటిదాకా విన్నాం అక్కడి నుంచి అరుణాచల దేవాలయానికి వచ్చి.అరుణాచలేశ్వర లింగాన్ని ఆలింగనం చేసుకొని వారు చేసిన మొట్టమొదటి పని సమర్పణ చేసుకున్నారు. తండ్రీ! నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను. ఇకపై అంతా నీ ఇష్టం. అది సమర్పణ. అంతేకాదు, నీ ఇష్టం అనటంలో శరణాగతి కూడా ఉన్నది. అంతేకాదు, నేను వెంకట్రామన్ ని, నేను అరుణాచలం వెళ్ళాలి, వెళ్తున్నాను అన్న ఏ స్పృహా లేని ఒకానొక వెంకట్రామన్ నామధేయంగా ఉన్నటువంటి స్వామి శరణాగతి, సమర్పణ, వినయము మూడు ఒక్కసారి అరుణాచలేశ్వర లింగానికి సమర్పించుకున్నారు. కానీ తరువాతి కాలంలో మన బోటి వాడి వారు ఒక ప్రశ్న వేసినప్పుడు, "జీవితంలో గురువు అవసరమా?" అని అడిగినప్పుడు "ఖచ్చితంగా అవసరమే" అన్నారు. "మరి మీ గురువే లేరు కదా!" అన్నాడు. "ఎందుకు లేరు? నేను అరుణాచలానికి వచ్చినప్పుడు అరుణాచలాన్ని నేను గురువుగా భావించలేదా?" అని అక్షరమణమాലలో మొట్టమొదటిది, ఎప్పుడూ కూడా అక్షరమణమాല పారాయణం చేస్తూ భగవాన్ చెప్పినటువంటి తాత్విక దృష్టిని గనక సమన్వయం చేసుకుంటే పారాయణ పరిపూర్ణం అవుతుంది. వారు చూడండి, నేను వెంకట్రామన్ ని, ఆ ఇల్లు వదిలిపెట్టాను, ఫీజు కట్టలేదు, అరుణ నా కోసం వెతక్కండి, అరుణాచలం వెళ్తున్నాను అన్నంతకాలం నేను, నేను ఉన్నది ఆయనలో. ఎప్పుడైతే లింగ ఆలింగనం అయిపోయిందో, తనను తాను అరుణాచలేశ్వరుడికి సమర్పించుకున్నారో, లింగ రూపధారి అయినటువంటి ఈశ్వర తత్వానికి మోకరిల్లారో, దానికి తనకు ఒక అభేద అద్విత-అద్వైత భావాన్ని కలిగారో, కలిగించుకున్నారో లేదా పొందారో ఆ సమయంలో వారు మొట్టమొదట అప్పటిదాకా అహం ఉన్నటువంటి వెంకట్రామన్. అహం అంటే నేను అనేటువంటి భావన. అదేం తప్పు మాట కాదు. నేను లేకుండా ఈ ప్రపంచం నడవదు. కానీ, ఏ నేనుతో బతకాలి, ఏ నేనుతో బతకకూడదు, అసలు ఏ నేనుని పట్టుకోవటానికి వచ్చాం, ఏ నేను పట్టుకుంటే ఈ భ్రాంతులన్నీ తొలగిపోతాయి అనేటువంటి ఒక మహాస్త్రాన్ని సంధించి దానికి హూయామయ్య అని పేరు పెట్టారు. నాన్ యారు అది తమిళంలో అన్నారు. దాన్ని వేళ మనం నేను ఎవరు అనుకున్నాం, హూ యామై అనుకున్నాం. అంటే పాతాళ లింగం దగ్గరకు వెళ్లి వారు సమాధిగతులయ్యే వరకు ఆ సమాధి స్థితిలో దేహ భ్రాంతిని వదిలేసి శరీరాన్ని పాములు, తేళ్లు, కీటకాలు తినివేసినా ఏ రకమైన బాహ్య స్మృతి లేని ఒకానొక సర్వమూ అధీనమైనటువంటి స్థితి, సర్వేంద్రియాలను జయించినటువంటి సమాధి స్థితిలో భగవాన్ ఉండి ఆయన బయటకు రాగానే ఆయనకి ఒక్కసారిగా అరుణాచల అ-అక్షర మణమాల రాస్తూ "అరుణాచలమనుచు స్మరియించు వారల అహము నిర్మూలింపు అరుణాచలా" అక్షర మణమాలలో ఇది మొట్టమొదటిది. పరమాద్భుతమైనటువంటి ద్విపద. రెండు పదాలవి. "అరుణాచల మనుచు స్మరియించు వారల" ఇక్కడి దాకా రానక్కర్ల. ఎందుకని? "స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలమిది" భగవానే రాశారు స్వయంగా. అంటే అరుణాచల శివ అరుణాచల శివ శివన్నా అనకపోయినా అరుణాచల అరుణాచల అనుకున్నట్లయితే పరముక్తి లభిస్తుంది. ముక్తి లభించటం అంటే ప్రాపంచిక బంధనాల నుంచి తెంచుకు పోవడం. ఈ ప్రాపంచిక బంధనం నుంచి తెంచుకుంటే కలిగేది ముక్తి. అసలు జన్మ రాహిత్యమే ఏర్పడితే అది పరముక్తి. అంతే. పరమ అంటే ఈశ్వర. ఆ ఈశ్వరుడు తన మూలంలో తనలో తాను లీనమైపోయినట్లయితే అది పరముక్తి. ఎట్లా కలుగుతుంది ఇది? "స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా" ఆ ఫలాన్ని ఇస్తావయ్యా. అది. కాబట్టి ఈ అరుణాచలంలో భగవాన్ రమణులు తొట్టతొలి ప్రార్థన ఏం చేశారంటే, మీ దగ్గరికి అరుణాచల అరుణాచల అరుణాచల అంటూ వెళ్తాం మనందరం వెళ్తాం. వెళ్తాం ఆ ప్రయాణం ఇంటి దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా అరుణాచల మంత్రమే చేసుకుంటాం. అంతా బాగుంది. కానీ అలా వచ్చేవారికి లోపల అహం ఉంటుందయ్యా. "అరుణాచల మనుచు స్మరియించు వారల అహము నిర్మూలింపు అరుణాచలా" ఇంత జపం చేసినప్పటికీ కూడా నేను అన్నటువంటి దేహాత్మ భావన ఏదైతే ఉన్నదో, ఈ నేనుని నేనుగా భావించి బతుకుతున్నానో అటువంటి అహన్ని వి-నిర్మూలించమని భగవాన్ ని ఎంత వినమ్ర మూర్తిగా అడిగారో చూడండి. అయితే మనందరి, మన బోటి వారందరి అహాన్ని కూడా నిర్మూలించమని మన తరఫున వారు అడిగారు. అక్షర మణమాల అంతా కూడా ఒక భక్తుడు, అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, మరొకడు కావచ్చు, అది కేవలం రమణ మహర్షి యొక్క స్తుతి కాదు. మన అందరి తరఫున, ఇదిగో మీరందరూ అరుణాచలానికి గనక వచ్చినట్లయితే ఏమి కోరుకోవాలి, ఏమి చేయాలి, ఏ బంధనాలలో ఇరుక్కుపోయినామో, దేనిని పొందలేకపోయినామో, దేనిని పోగొట్టుకున్నామో, ప్రాపంచికమైన విషయాల నుంచి ఎలా దూరమైనామో, వీటన్నింటికీ కారణమైన ఓ గురు స్వరూపమా, అదే కదా. అని అరుణాచలాన్ని ప్రార్థన చేస్తూ చేస్తూ మనక్కూడా మన తరఫున భగవాన్ రచించిన లేదా పాడిన, గీతించిన, గమనం చేసినటువంటి పరమాద్భుతమైనటువంటిది అది. మిగతా అన్ని విషయాల మీద మాట్లాడటానికి చాలా సమయం కావాలి. కానీ అహం వదిలిపెట్టకపోతే ఇహాన్నే పట్టుకుని జీవితం వెళ్లిపోతుంది. మరి ఇహం లేకుండా ఎట్లా? ఇహము, అహము, పరము అని మూడు ఉన్నాయి. నూటికి తొంభై ఐదు, తొంభై ఎనిమిది మంది ఇహంలో ఉండటానికి ఇష్టపడతారు. ఇహంలో ఉండాలి అంటే అహం ఉండి తీరాలి. అహం లేకపోతే నేను యుద్ధం చేయలేను. అహం లేకపోతే నేను పుస్తకం రాయలేను.అహం లేకపోతే నేను ఏ కార్యకలాపం చేయలేను అన్నప్పుడు మనంతట మనకు నేను ఎవరన్న ప్రశ్న తర్వాత అసలు ప్రశ్న ఏమిటంటే అహాన్ని నిర్మూలించుకోవటం ఎట్లా అహము నిర్మూలింపు మరుణాచల అని అడిగారుగా అహము నిర్మూలన అహం అంటే ఏమిటో తెలిసేదిగా పట్టుకోవటానికి తెలిసిన తర్వాత పట్టుకోగలం పట్టుకున్న తర్వాత దాన్ని ఎలా వదులుచుకోవాలో నేర్చుకోవాలి కాబట్టి ఈ ప్రశ్నలో రెండు భాగాలున్నాయి ఒకటి అహం అంటే ఏమిటి అహం అంటే నేను నేను అనుకోవటమా అంతేనా దీని మూలాలు ఎక్కడున్నాయి అహము అంటే అహంభో అభివాదయే అంటాం పెద్దవారికి నమస్కరించినప్పుడు నేను నా ప్రవర ఇది నా గోత్రం ఇది నా పేరు ఇది మా నాయన ఇది ఇదిగో నేను నీకు నమస్కరిస్తున్నారు అహంభో అభివాదయే అది ఎటు physical level అది కానీ భగవాన్ చెప్పిన అహం అంత తేలికైన అహం కాదు ప్రాపంచికమైనటువంటి అనేక పాప శాప తాపాల వలన ఏర్పడినటువంటి మానవ దేహమే real గా భావిస్తూ ఉన్నాం శాశ్వతమని భావిస్తున్నాం మన సంపద మనకు ఆనందాన్నిస్తుంది మన సౌందర్యం మన అందం మనకు ఆనందాన్నిస్తుంది మన దేహబలం మనకు ఆనందాన్నిస్తుంది మన popularity మనకు ఆనందాన్నిస్తుంది ఇది ఆనందాన్ని ఇస్తున్నది ఇస్తున్నది అనుకోవటమే అహం కాబట్టి అది పెరుగుతూ పోతుంది బలపడుతూ ఉంటుంది మనల్ని బలహీన పడుస్తూ ఉంటుంది గనుక ఈ అహం అంటే ఏమిటి అన్న ప్రశ్న ముందు మనం వేసుకోవాలి ఈ అహం పుట్టుక ఎక్కడ మనం బయట పుట్టలేదే మన లోపలే పుట్టింది ఎక్కడ పుట్టింది మన ఆలోచనలో నుంచి పుట్టింది ఆలోచన ఎక్కడి నుంచి ఏర్పడింది సంస్కారంలో నుంచి ఏర్పడింది సంస్కారము ఎక్కడి నుంచి ఏర్పడింది వాసనలలో నుంచి వచ్చింది వాసనలు ఎలా వచ్చినయి మూల వాసనలలో నుంచి ఏర్పడినయి మూల వాసనలు ఎక్కడి నుంచి వచ్చినయి జన్మల నుంచి వచ్చినయి జన్మలు ఎట్లా వచ్చినయి కర్మలను బట్టి వచ్చినయి చూసారా కర్మలు జన్మలు మూల వాసనలు వాసనలు సంస్కారము అనేకమైనటువంటి జీవన విధానాలు వీటన్నింటిలో నుంచి నేను ఏర్పడుతుంది అది రూపుదిద్దుకుంటుంది తల్లి గర్భాలయంలో నుంచి బయటకు రాగానే ఆకలి దప్పిక అనేటువంటి రెండు అహానికి రెండు బీజాలుగా ఉంటాయి నాకు ఆకలి వేస్తున్నది మాటలు రాలే ఇంకా కానీ సంజ్ఞల ద్వారా శిశువు చెప్తున్నది నాకు దాహం వేస్తున్నది చెప్తున్నది సంజ్ఞల ద్వారా మౌనం ద్వారా అవతల వాళ్ళందరికీ అర్థం అవుతున్నది కాబట్టి ఈ అహం యొక్క మూలం ఎక్కడ ఉన్నదంటే మన మూల వాసనలలో నుంచి ఇప్పటిదాకా గడిచి వచ్చినటువంటి అనేక జన్మలలోనూ ఏర్పడి ఏర్పడి ఏర్పడి అది వచ్చి ఆ అహం ఈవేళ మనం అయినప్పుడు మనం మన దేహమే మనంగా భావించి దేహం అనేదే శాశ్వతంగా భావించి ఈ దేహం చాలా ఏళ్ళు ఉంటుందని నమ్మి ఏదో అందరూ పోతున్నారు వింటాం మనం ఏదో ఉండబోతున్నట్టు కదా ఇది మాయ కాబట్టి మాయావరణంలో ఉన్నటువంటి జీవుడు తన అహాన్ని గుర్తించలే అహం అంటే దంభము గర్వము dictionary పదాలు కావు అవి అహము అంటే నేను నేను నాది అన్న భావన నేను అనుకున్నంత కాలం అహంకారం అయితే లేదా అహం అయినట్లయితే నాది నాదే అనుకున్నట్లయితే అది మమతా మమకారము కాబట్టి అహంకారం మమకారాలు రెండూ కలిసి ఉంటాయి జమిలిగా ఉంటాయి అందులో మమకారం విస్తృత మమకారం ప్రేమగా మారిపోతే మమత కట్టుదాటని మమత జీవుడికి ఉండాలి because it's a human natural human instinct మమత లేకుండా లేదు ఒక తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది మనం కన్న బిడ్డ మనను కూడా ప్రేమిస్తుంది ఇది మన యందే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఈ లక్షణం ఉంది కాబట్టి మమతా మమకారాల గురించిన ప్రశ్న లేదు సమస్య అంతా అహంతోనే ఉన్నది గనుక ఈ అహం ఏమిటి అంటే దేహాత్మ భావనే అహం నేను నా చదువు నా degree లు ఇప్పుడు చెప్పుకున్నా ఇవన్నీ కూడా నా పరంపరం మా వంశం మా తరాలు తరతరాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం మన గోత్రాలు వాటన్నింటిని చెప్పి చాలా గంభీరంగా మాట్లాడుతూ ఆ అహాన్ని మనం బలపరుస్తూ ఉంటాం we consolidates అది దాని పేరు అహం గనక అయినట్లయితే ఈ అహం గనక పోకపోయినట్లయితే నేను ఎవరి దాకా వెళ్ళం అహమే నేనుగా నేనే అహంగా నా మేనే నేనుగా నా శరీరమే నేనుగా భావించినంత కాలం అహం నిర్మూలన జరగదు అందుకనే భగవాన్ రమణులు అహాన్ని నిర్మూలించమన్నారు ఇక తర్వాతే ఆత్మ విచారణ ఆత్మ విచారణ పుట్టగానే రాదు అహం ఉంది మనలో జాడ్యాలు ఉన్నాయి negativities ఉన్నాయి దుఃఖం ఒంటిమీద ఒళ్ళోకొచ్చి దుఃఖం పడగానే ఎంత శాస్త్రం చెప్పినా ఎంత మహా పండితుడైనా వలవల ఏడుస్తూనే ఉంటాడు అలాగే ప్రాపంచికంగా ఒక చిన్న లాభం కలగ్గానే ఆనందంతో తాండవం చేస్తాడు నృత్యం చేస్తాడు తను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినప్పుడు వాడి ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు ఇది అహంకారం యొక్క shade ఇది దుఃఖం కూడా అహంకారమే మనం అంటాం ఏమిటి నేను ఎంత గొప్ప జీవితం గడిపాను ఎంత పుణ్యాత్ముడిని నాకు కూడా ఈ కష్టం వస్తుందా అంటే are you exclusive are you not indispensable yes you are dispensable ఈ భావం కలగ-కలగనంత కాలం మనలో ఉండేది అహంకారమే అహమే అహంకారము కారం అంటే దాని యొక్క expression అంతే కాబట్టి ఈ అహము దేహానికి సంబంధించింది గనుక దేహము పంచభౌతికము కూలక తప్పదప్పుడున్ దేహి నిరామయుండు అంటారు భగవాన్ సత్యసాయి అంటే ఈ దేహం కూలిపోతుంది ఇల్లు పడ-పాడుబడిపోతుంది దేవాలయాలు శిథిలాలయాలు అయిపోతాయి కానీ శివుడు అక్కడే ఉంటాడు.జీవుడు అక్కడే ఉంటాడు. పోయింది ఏమిటయ్యా? దేహమే పోయింది. ఉండవలసినది నిత్య సత్య శాశ్వతమైన సద్వస్తువు ఏదైతే ఉన్నదో అది నీ యందు నిశ్చలంగా నిరంతరాయంగా వెలుగుతున్నది. అది కేవలం దేహాలు మార్చుకుంటూ ఉన్నది అని మనం సమన్వయం గనుక చేసుకోగలిగినట్లయితే, ఈ అహం యొక్క మూలాన్ని పట్టుకోవటానికి ఆహ్ కొంత ప్రయత్నం చేయాలి. దొంగతనం జరిగింది. అంటే ఎవరో తీసుకెళ్లిన వాడికి దొంగ అని మనం పేరు పెట్టాం. ఆ దొంగ ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. వాడెవడో పట్టుకోలేము. ఒక పోలీసుని ఆశ్రయిస్తాం. పోలీసు పట్టుకోగలుగుతాడు. అప్పుడు వాణ్ని పట్టుకొచ్చినప్పుడు వాణ్ని దొంగ అంటాం. కాబట్టి ఈ అహము మన ఇంటి దొంగ. మన ఇంట్లో ఉన్న ఒక వస్తువు సద్వస్తువు అనే ఆత్మతో పాటు అహం అనేటువంటి ఒక వస్తువు కూడా ఉన్నది. వస్తువు అంటే కొంతకాలం ఉండి పోయేది. సద్వస్తువు అంటే దానికి పోవటం రావటం లేదు. రాకపోకలు లేవు. నిగమాగమాలు రెండూ లేవు. అది దానికి ఉండటమే అసలు స్థితి కాబట్టి దానిని కూడా కాసేపు పక్కన పెట్టినట్లయితే, ఈ అహం స్పురణ, ఈ అహం అనేటువంటిది ఏమిటి? ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే జీవుడి యొక్క సంస్కార ధారను బట్టి, జీవుడు తాను గడచి వచ్చినటువంటి జీవితాలలో చేసుకున్నటువంటి అనేకానేకమైన విచార ధారలలో నుంచి, తనను తాను తెలుసుకోవాలన్న ఒక తాపత్రయంలో నుంచి, జిజ్ఞాసలో నుంచి, శాస్త్రాధ్యయనంలో నుంచి, శాస్త్ర పరిచయంలో నుంచి, శాస్త్రాధికారంలో నుంచి ఏర్పడి అది కూడా మళ్ళీ అహంగా రూపుదిద్దుకుంటుంది. నా వలె పాడగలిగిన వాడు లేడంటాడు ఒకడు. అసలు నేను పాడిందే పాట, నేను ఆడిందే ఆట అంటాడు. ఇది అహం. అంటే సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను గుర్తించకుండా దేహపరమైనటువంటి వస్తువుల ద్వారా కలిగేటువంటి ఒక భద్రత, ఒక అహంకారము, ఒక ప్రగల్భము, ఒక గర్వము ఇవన్నీ కూడా ఇటువంటి అహంలో నుంచి ఏర్పడి ఉంటాయి గనుక మనం అహాన్ని ఎక్కడ పట్టుకోవాలి అంటే అహం బయట లేదు. మళ్ళీ అది కూడా లోపలే ఉంది. లోపల ఎక్కడ ఉన్నది? ఇందాక అనుకున్నాం ఆలోచనలో ఉన్నది. ఆలోచన ఎలా పుట్టింది? సంస్కారంలో నుంచి పుట్టింది. అంటే జీవుడి యొక్క సంస్కారాన్ని బట్టి ఆలోచనలు కలుగుతాయి. ఆ ఆలోచనలు మనస్సులో కలుగుతాయి. నిజానికి ఆలోచనలన్నీ కలిపితే మనస్సు. మనస్సు అంటూ ఏం లేదు. ఈ మనస్సు అనేక ఆలోచనలు కలిగి ఒక మనస్సు అయినట్లయితే, ఈ అహం ఆ మనస్సులో ఉంటుంది. ఆ మనస్సే మనకు చెప్తున్నది, నీ అంతటి వాడు లేడు అని. ఆ మనస్సును గనుక నిగ్రహించగలిగినట్లయితే, అంటే ఆలోచనని నిగ్రహించాలి, మనస్సును నిగ్రహించాలి. మరి ఈ మనస్సే మనస్సుని ఎలా నిగ్రహించాలి? అది స్నేహితుడా అంటే మిత్రుడా? శత్రువా? అది పాజిటివ్ గా గనుక వాడుకోగలిగితే దానిని మించిన మిత్రుడు లేడు. బృహదారణ్యకోపనిషత్తు మనస్సే దైవం అని చెప్పింది. మామూలు ప్రాపంచికమైన కవులు మనస్సుని ఒక దయ్యంతో పోల్చారు. దయ్యమైనా, దైవమైనా, మాయ, ఛాయ, మాయా చైతన్యము ఆ రెండూ ఎట్లా ఉన్నాయో ఇవి కూడా అట్లాగే ఉన్నాయి గనుక ఈ అహం అనేటువంటి ఈ భావన మన ఆలోచనలో, చూడండి ఒక ఆలోచన కలుగుతుంది. ఇవాళ సత్సంగం అనాలి లేదా సత్సంగం వినాలి. మంచి ఆలోచన. కదా. ఆ మంచి ఆలోచనలో నుంచి నేనే చెప్పగలను అని అనుకున్నాను అనుకోండి, నేను కాకపోతే ఇంకొకడు. అనుకుంటే అహం అక్కడే ప్రారంభమైంది. నేను చెప్తూ చెప్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను అనే వినమ్ర భావన మన యందు గనుక ఉంటే అహం అణగి ఉంటుంది. పోలే. అహం మల-మలగలేదు ఇంకా. వెలుగుతూనే ఉంది కానీ అణగి ఉన్నది. కాబట్టి అహం ఆలోచనలో నుంచి పుట్టింది గనుక మన ఆలోచనలని చక్కగా సంస్కరించుకోవాలి. ఏది మాట్లాడబోతున్నా-- అందుకనే మహాత్ముడు అంటే ఎవరంటే ఆత్మను ఎదిగిన వాడు మహాత్ముడు కాదు. మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనః. ఏది ఆలోచించామో అది వాక్కై బయటకు రావాలి. ఏది వాక్కై బయటకు వచ్చిందో అది కర్మగా మారాలి. అంటే ఆలోచన, వాక్కు, కర్మ త్రికరణ శుద్ధి. ఈ మూడింటిని గనక ఏకం చేసుకొని, అంటే మనం ఆలోచిస్తాం. ఆలోచించేది వేరు, అనేది వేరు. ఆలోచించింది వేరు, అన్నది వేరు, చేస్తున్నది వేరు. సమన్వయం లేదు కాబట్టి వాడు మహాత్ముడు కాలేడు. మహాత్ముడు ఎవరంటే ఎవడు ఆలోచించాడో, దేనిని గురించి ఆలోచించాడో, ఏది అన్నాడో దానిని ఆచరించిన వాడు మాత్రమే మహాత్ముడు అవుతున్నాడు గనుక ఈ అహం యొక్క మూలాన్వేషణని ఇట్లా సాగి సాగి ఆ మనస్సు దాకా వెళ్ళినప్పుడు మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. మనస్సును నిగ్రహించుకోవాలి. అదే చాలా కష్టమైపోతున్నదండి. మనస్సే అన్నింటికీ యాతన అని మనం అంటాం. కానీ నిగ్రహించే ప్రయత్నం చేయం. కారణం మనలో ఉన్నటువంటి బలవత్తరమైన మూల వాసనల వల్ల మన ఎస్టీమ్ నుంచి మనం పడిపోతాం. మోహ వ్యామోహ పరవశులం అయిపోతాం. మన లక్ష్య గమ్యాలు రెండూ దూరం చేసుకుంటాం. దేనిని పొందాలని, పట్టుకోవాలని, వదిలిపెట్టాలని, వినిర్మూలించాలని భావించామో అహమే మనంగా మారుతాం గనుక సాధన మొదలుపెట్టిన యాభై ఏళ్ల క్రితం ఎట్లా ఉందో యాభై ఏళ్లు దాటినా అట్లాగే ఉంటుంది. అలా ఉండకూడదు. ఈ అహం, ఈ మనస్సు, మనస్సు ద్వారా అహం విజృంభిస్తూ ఉంటుంది కాక ఈ మనస్సుని ఎలా నిగ్రహించాలి అంటే ధ్యానం ద్వారా, సంస్కారం ద్వారా, ప్రపంచం యొక్క యదార్థ స్థితిని చక్కగా గ్రహించటం ద్వారా, ఉన్నన్నాళ్లు చక్కగా ఉండాలే తప్ప ఎన్నో ఏళ్లు ఉండబోతున్నాననే భ్రాంతిలో ఉండకుండాభ్రాంతిని వదిలి భాతిలో ఉండాలి. భ్రాంతి అంటే ఆ జరుగుతుందో జరగదో లేదు జరిగ తీరుతుంది అన్నటువంటి అహంకారమే భ్రాంతి. భాతి అంటే వెలుగు వెలుగులో ఉండగా మనకు మళ్ళీ ఇంకో వెలుగు అవసరం లేదు. ఆ వెలుగులోకి వెళ్ళకుండా మనల్ని ఆపుతున్నది మోక్ష కారకురాలు మనస్సు ఎట్లా అవుతున్నదో మోక్షం రాకుండా అడ్డుకుంటున్నది కూడా మనస్సే కాబట్టి ఈ దైవముగా ఉన్న మనస్సుని మన మనస్సుని దైవీయం చేయించుకోవాలి. దయ్యము అవన్నీ కవితాత్మకం పక్కన పెట్టాలి మనం. వాటిని ఆలోచించక్కర్లా. అంటే ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను "humanize your thought first" ఒక ఆలోచన కలుగుతుంది. దానికి మానవతా పరిమళాన్ని నువ్వు వద్దు. దానిని నెమ్మదిగా divinize చెయ్. భగవత్పరం చెయ్. ఇది భగవంతుడు నాకీ మంచి సంకల్పం కలిగించాడు, చక్కని ఆలోచన కలిగించాడు అనుకో then spiritualize it. Spiritualize అంటే ఏమీ చేయకుండా ఉండటమా? కాదు కాదు! నీకు కలిగిన ఒక సత్సంకల్పాన్ని దైవశక్తితో కూడి దానిని గనక translate చేయగలిగితే action గా మార్చుకోగలిగితే కర్మయోగంగా మార్చుకోగలిగితే నీ ఆలోచన ఫలవంతమైనట్లు అక్కడ అహం లేదు. సేవ చేస్తాం అహం లేదు. ప్రేమిస్తాం అహం లేదు. కానీ, అవసరార్థమై ఆకర్షణకు లోబడి ప్రేమించినట్లయితే ఆ ప్రేమ దేనికి లోబడి ఉన్నది అంటే, నీ మనసుకు లోబడి ఉన్నది. లోబరచుకున్న మనసుతో గనక ఈ ప్రపంచాన్ని చూడగలిగితే మనకి కలిగేటువంటి భావాలన్నీ కూడా అహం లేని స్థాయిలో ఉంటాయి గనుక వాటిని నిరహంకారము అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి అహం లేని ఒక భావన ఉండాలి. అహం అంటే నేను అనే దేహాత్మ భావన [వెనుకకు జారుకునే శబ్దం] వదిలిపెట్టాలి. దాని మూలంలోకి వెళ్ళాలి. మా మనస్సుని మధనం చేయాలి. ఆ మనస్సుని మధనం చేయకుండా మనలో ఒకడు ఉంటాడు. వాడి పేరు మన్మథుడు. మన్-మనస్సుని మధించేవాడు. "ఎందుకురా ఈ విచారణ అంతా? ఈ ఆత్మ విచారణ చేస్తే ఏమవుతుంది? ఏం జీవితం వెళ్ళదా? హాయిగా భోంచెయ్, హాయిగా సంపాదించు, ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించు. ఏం మళ్ళీ జన్మ ఉంటుందా ఉండదా?" అని ఈ మనస్సు చెప్తుంది మనకి. అప్పుడు దాన్ని మనం ఆపాలి. ఆపి, "అది నువ్వు అట్లా ఆలోచించుకో కానీ, నాకు ఉన్నదే ఒక్క జన్మ. ఈ ఒక్క జన్మలో నన్ను నేను తెలుసుకోకుండా నేను ఎంత హుంకరించు, అహంకరించు ఉన్నానే! దీని నుంచి నేను బయటపడి పూర్ణమైన సాత్విక భావనతో నన్ను నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటానికి నా మనస్సును నేను నిగ్రహించుకుంటున్నాను." దీన్ని సత్యసాయిబాబా గారు అంటే ఈవేళ ఆధునిక కాలానికి అనుగుణంగా చాలా అందమైన పదాలతో ఆ క్రమం చెప్పారు. "నీకు ఒక mind ఉన్నది కదా, ఆ mind ని mild చెయ్. దానికి సాత్వికం చెయ్. నెమ్మదిగా ఉండేట్టు నేర్పు. పరిగెత్తుతుంది, పరిగెత్తిస్తుంది. పరిగెత్తద్దు ఆగు అని చెప్పగలిగిన స్థితికి రా. mild చేసినటువంటి mind తో దాన్ని నువ్వు ఏం చేస్తావంటే mend చెయ్. నీకు కావలసినట్లుగా mend చేసుకో. mend చేసిన mind ని bend చెయ్. bend చేసిన mind ని end చెయ్" అన్నారు. ఎంత అద్భుతమైనటువంటి-- అంటే ఇది సాధనా మార్గం. ఇంగ్లీషులో ఇది శబ్దాలంకారంగా, చమత్కారంగా ఆహా బాబా గారు ఎంత బాగా చెప్పారు! ఎంత బాగా చెప్పాలా? అద్భుతంగా చెప్పారు. mind, mild, mend, bend, mend, end అది. అక్కడ ఆ mind ని end చేయటమంటే మనోలీనం చేయాలి. మనోనాశనం చేస్తే అహం పోదు. మనో లయం చేయకుండా లీనం చేసినట్లయితే, ఆ లీనము అంటే దాంతో కూడి ఉంటుంది. దేనితో కూడి ఉంటుంది? అహం అనేటువంటి భావనతో. నేను ఉన్నా ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నేను, నేను మాట్లాడాలి గనుక మాట్లాడను. మా ఏది మాట్లాడవలసి ఉన్నదో అది మాట్లాడాలి. అక్కడ అహం లేదు. మాట్లాడబడుతున్నది తప్ప మాట్లాడుతున్నది లేదు. అంటే ఎప్పుడూ అన్నట్లే ఆ ఈ జరుగుతున్న దానిలో నేను ప్రథమ శ్రోతని అంతే. అంటే ఈ వ్యక్తి చేత, ఈ మాట్లాడుతున్న వ్యక్తి చేత మాట్లాడిస్తున్న వాడు ఎవడో ఉన్నాడు. అప్పుడు ఇంకా మనకి ఏ రకమైన కర్తృత్వం లేదు, అహం లేదు, నేను మాట్లాడుతున్నాను లేదు, నేనే చెప్తున్నాను గాని ఎవరో మాట్లాడిస్తున్నారు గాని. ఆ ఎవరో మాట్లాడిస్తున్నారు అనగానే అహం విను మూలనకి మొట్టమొదటి బీజం పడుతుంది. లేదు నేనే మాట్లాడుతున్నాను, ఇవన్నీ నాకెప్పుడో రమణ మహర్షి గారి కళ్ళలో కనిపించారు, సత్యసాయిబాబా గారు రోజూ కనపడి చెప్పమని చెప్తున్నారు, ఇదంతా కూడా మాయ, భ్రాంతి, అనాచారము, అస్పష్టత, అవిద్య, అహంకారము యొక్క పరాకాష్ట. ఇదంతా మన్మ మన్మధనం చేస్తూ మనోమధనంలో నుంచి ఆ మనస్సుని ఆపగలిగినట్లయితే ఇంకొక అద్భుతమైనటువంటి లాభం ఉంది. ఆలోచనని సంస్కరించి, సంస్కరించబడిన ఆలోచనలన్నీ ఒక మనస్సు అయినట్లయితే ఆ మనసు కింద కర్మేంద్రియాలు ఐదు పనిచేస్తున్నాయి. ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఈ ఇంద్రియాలకి అధిష్టాత ఎవరు? మనస్సు. యజమాని ఎప్పుడైతే బాగుంటాడో ఇంద్రియాలు కూడా చూడవలసినవే చూస్తాయి. కమలాక్ష నిర్తించు కరములు కరములు. అంతే కదా! పోతనామాత్యుడు భాగవతంలో చెప్పాడు. భగవంతుణ్ణి గురించి ఆయన చేసే అర్చనే అర్చన. ఆయన గురించి పాడే ఆ నాలుకే నాలుక. మిగతావన్నీ కావు. కాబట్టి ఎప్పుడైతే ఇంద్రియాలు కూడా తమ ఆ యజమాని అయినటువంటి మనస్సు సంస్కరింపబడిందో దానికి అనుగుణంగా ఇంద్రియాలు పనిచేస్తాయి. అప్పుడు అహం మన వైపు రాదు. కాబట్టి ఈ అహం యొక్క మూలాన్ని మనం ఎక్కడ గ్రహించాలి, ఎలా పట్టుకోవాలంటే మనం భగవాన్ రమణులు వారి తాత్విక చింతనా విధానంలో ఉన్నది ఒకటే, మూలంలోకి వెళ్ళు అది. ఆ మూలంలోకి వెళ్ళటానికి సహనం కావాలి.ఓపిక కావాలి ఓర్పు, కూర్పు, నేర్పు, మార్పు, తీర్పు ఇవన్నీ ఉండాలి ఉండగలిగితేనే ఆ మూలంలోకి వెళ్ళగలుగుతాం. ఒక్కసారి manifest అయిపోయిన తర్వాత మనం ఇంకా మళ్ళీ మూలాల్లోకి వెళ్ళేది ఏం లేదు. విత్తనం ఉంది చెట్టుకు తెలుసు విత్తనంలో నుంచే బయటికి వచ్చానని మనందరికీ తెలుసు తల్లి గర్భాలయంలో నుంచి బయటికి వచ్చామని మన మూలం అండం అని మనకు తెలుసు పిండంగా ఉన్నామని తెలుసు తర్వాత దేహం తీసుకున్నామని తెలుసు ఈ దేహం ఉండేది కాదని తెలుసు ఇంకా తెలియవలసినది ఏమున్నది? కాబట్టి అహం నిర్మూలన కోసం చేయవలసినటువంటిది మనందరం రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు భగవాన్ కరుణ మన మీద ఉంది అది ఎప్పుడూ ఉందన్నారు ఆయనే చెప్పారు. ఒకడు వచ్చి భగవాన్ మీ అనుగ్రహం కావాలి అని అడిగితే భగవాన్ అటు ఇటు రెండు వైపులా చూసి ఏమి అటువంటి పదార్థం ఇక్కడ ఏం లేదప్పా ఉన్నది అనుగ్రహము ఆత్మే అనుగ్రహం అన్నారు అది నీ యందే ఉన్నది అని చెప్పారు. ఆత్మే అనుగ్రహం అంటే ఆత్మే లేకపోతే మాట్లాడగలమా? ఆత్మే లేకపోతే వినగలమా? కనగలమా? చూడగలమా? చేయగలమా? ఈ చేయిస్తున్నదంతా కూడా ఏదో ఉన్నది అనేటువంటి భావన మనకు కలిగినప్పుడు మనము కర్త్రుత్వ భావాన్ని వదిలిపెట్టడమే అహం నిర్మూలనగా మనం భావన చేయాలి. ఇవాళ ప్రతి దానిలోనూ కర్త్రుత్వం వహిస్తాం. నేను పుస్తకాన్ని రాశాను, నేను మాట్లాడాను, నేను వారిని కలిశాను, నాతో ఇంతమంది ప్రభావితం అయిపోయినారు. అసలు నేను భగవాన్ కి చేస్తున్న సేవ ఎవ్వరూ చేయటం లేదు. భగవాన్ కి మనం ఏం చేయటంలే. సేవ చేయటానికి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. అక్కడ అహానికి తావు లేదు. కాబట్టి అహం నిర్మూలన అనే దానిని భగవాన్ చాలా stress చేశారు. ఇది ఎందుకనంటే ఆత్మను ఎరిగేటువంటి విచార మార్గంలోకి వెళ్ళటానికి హూ యామ్ ఐ అనేటువంటి ప్రశ్న వేసుకోవటానికి we have to prequalify అంతే కదా. prequalification ఏమిటి అంటే మనలో ఉన్న negativity ని మనం కనిపెట్టుకోవటం. ఆ negativity ఒక కోపము, దంభము, ప్రగల్భము, ఆశ, లాలస, భోగము, దురాశ, దుర్దశ, నిరాశ, పేరాశ ఇవన్నీ కలిపితే అహం యొక్క shades ఇవన్నీ కూడా. ఇవి నీడలు. ఈ నీడలన్నింటినీ కూడా ఒక్కొక్క దానిని వదిలిపెట్టుకుంటూ మనం అహం వైపు వెళ్లగలిగినట్లయితే అప్పుడు మనం ఏమంటామో తెలుసునా? అదే ఏ అహం అయితే ఇప్పటిదాకా negative అని మనం అనుకుంటున్నామో ఆ అహం ఆత్మకు మరొక పేరు. అహం వైశ్వానరో భుత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ప్రణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్. యోగేశ్వర కృష్ణుడు అక్కడ ఆయన అహం అనే మాట వాడాడు. ఆ అహం మనలో ఉన్న ఈ అహం కాదు. అహం అంటే దివ్యాత్మనైనటువంటి నేను సత్యమైనటువంటి ఆత్మ పరమాత్మనైన నేను అనేటువంటి అహాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటే మానవీయమైనటువంటి ముసుగులో ప్రాపంచికమైన భావనలో ఈ ప్రాపంచికమైనటువంటి మాయామయ జగత్తు వేసిన ముసుగులో నుంచి ఈ ఆవరణలో నుంచి మన ఇంద్రియాలను సమన్వయం చేసుకుంటూ మన మనసును నిగ్రహించుకుంటూ దానికి మూలమైన ఆలోచనలను సక్రమం చేసుకుంటూ దానిని ఆహ్ మనం ఏమంటాం అంటే రూపాంతరీకరణం చేసుకుంటూ metamorphosis చేసుకుంటూ ఎప్పుడైతే ఆలోచన పుట్టగానే humanized, divinized, spiritualized అని అనుకున్నామో అలా చేయగలిగినప్పుడు ఈ అహం ఏమిటో మనకు అర్థమై ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాం. ఎంత ఎదిగినా భగవాన్ చరిత్రలో అనేక సంఘటనలు అవన్నీ ఇప్పుడు చెప్పుకో అక్కర్ల. ప్రతి సంఘటనలోనూ మనం అహంకరించు ఉన్నామేమో కానీ ఆయన వినయంగా ఉన్నారు నిర్లిప్తంగా ఉన్నారు. భగవాన్ అంతా మీ దయ అంటే వారు ఏమి accept చేయలేదు. భగవాన్ ఎంత ప్రార్థించినా మీ కరుణ నా మీద కలగలేదు అన్నట్లు అయ్యో అట్లాగా ఇవ్వాళ నుంచి ఇస్తానని ఏం అనలే. అంటే doership తీసుకోలేదు. అకర్త్రుత్వమే అహం నిర్మూలనకి సాధన. మనం ఎన్నో పనులు చేస్తాం. ఇగో ప్రతిరోజూ ఇలా మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడటంలే మన చేత మాట్లాడిస్తున్న వాడు ఎవడో ఉన్నాడు. ఏతదధిష్ఠాత ఎవడో యజమానుడనే నాస్తమతనువు వాడు ఆ వాడు వేరే ఉన్నాడు అని మనం అనుకున్నట్లయితే ఈ వింటాము అంటాము దానికి మనకు సంబంధమే లేదు. బాగుందిగా high గా ఉందిగా. నేను ఎంత బాగా చెప్పాను. వాళ్ళు ఎంత బాగా విన్నారు అని వాళ్ళు. మీలాగా చెప్పగలిగిన వాడు ఇంకొకడు లేడని వాళ్ళు. ఇదంతా పరస్పరము మన అహాన్ని మనం పెంచుకునే తత్వమే తప్ప అంటున్న వాడికి అహం ఉండకూడదు వింటున్న వాడికి అస్సలు ఉండకూడదు. అకర్త్రుత్వమే అహంకారము అహం యొక్క మూలం కాబట్టి ఆ అహం మూలాన్వేషణలోకి వెళ్ళటానికి మన ఆలోచనలన్నీ కూడా పవిత్రీకరించుకోవాలి. We have to get them purified. ఎప్పుడో mind కదా. దానికేవో ఒక చెడు ఆలోచనలు, ఏవో రకరకాల దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. పక్కకు నెట్టేయాలి. ఎందుకంటే దుఃఖం మన చుట్టం కాదు మనతో ఉండబోవటం లేదు. అట్లాగే సుఖము చుట్టం కాదు అది మనతో ఉండటం లేదు. ఆనందం మన స్వభావం. ఆనందమే మనం. సత్ చిత్ ఆనంద స్వరూపులమై ఈ జగత్తులోకి అమృతస్య పుత్రాః అని వచ్చాం కాబట్టి భగవాన్ రమణులు అటువంటి అమృతత్వం వైపు అందుకనే మనం భగవాన్ దగ్గర ఏం చదువుతాం. న కర్మణా న ప్రజయా న ధనేన చాగేనైకే అమృతత్వమానశుః. చాగేనైకే అది critical point. చాగేనైకే ఏమి చాగము? చందాయి వేయటమా? దానం చేయటమా? ధర్మం చేయటమా? యజ్ఞం చేయటమా? యాగం చేయటమా? యోగం చేయటమా అంటే చాగేనైకే రెండు త్యాగం చేయాలి. అహంకారం, మమకారాలు రెండు వదిలిపెట్టాలి. ఈ రెండూ జీవుడి యొక్క లక్షణాలు. విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్రామాయణ కల్పవృక్షం రాసి చిట్టచివరగా ఒక పద్యం రాశారు. స్మరించుకోవలసిన పద్యం. అప్పటికి ఆయన తపస్వి అయిపోయినాడు. రామాయణం రాయటంతో పూర్ణ తపస్వి అయినాడు. సజ్జోనిర్జితమైన సర్వ భావనా సంహారంబు ఎల్ల నైవేద్యంబిచ్చితి నీకు రామచంద్ర ప్రభువా! విశ్వాసమున్ పూనవే ఆజ్ఞంబగు జీవలక్షణము సంహారంబు కావింపవే హృద్యంబైతని తోర్చు నీ దివ్య తేజంబు సారింపంగదే గుణియం అన్నాడు.నాలో ఇంకా జీవ లక్షణాలు రెండు ఉన్నాయి రామాయణం రాసినా సరే. ఆ రెండు అహంకారము, మమకారము ఇంకా ఎక్కడో మిణుకు మిణుకుమంటూ నాలో ఉన్నాయి. వాటిని సంహారం చెయ్. ఆ రెండు పోయినంత మాత్రాన నాకు ఆనందం కలిగినట్లు కాదు, పోయినాయి అంతే. దుఃఖం పోయింది అంటే సుఖం వచ్చింది అని కాదు. సంతోషం కలిగి దుఃఖం పోయింది, అదొక పార్ట్ ఇంకా సుఖం రాలా. ఈ దుఃఖం తొలగితే దుఃఖం మాత్రమే పోయింది కాబట్టి నాకు ఆ జీవ లక్షణాలు పోవు-పోవటంతో పాటు ఆద్యంబగు జీవ లక్షణము సంహారంబు కావింపవే పుట్టుకతో వచ్చినయి. నీ దివ్యమైనటువంటి ఆ కరుణా తేజస్సుని నా గుండె మీద, చూడండి ఆయన కూడా నా భ్రుకుటి మీద, నా కళ్ళల్లో, నా శరీరంలో అనలే, నా హృదయం మీద ప్రసారం చేయమని అడిగాడు. హృదయం మీద ఎందుకు ప్రసారం చేయమన్నాడంటే, నేను ఆత్మ స్వరూపుడనన్న ఆ ఎరుకలోకి నన్ను పంపమని రాముణ్ణి వేడుకున్నాడు. ఇవాళ మనం కూడా భగవాన్ రమణ మహర్షి అరుణాచల ఆ అక్షరమణమాల పారాయణం నిండా ఒక భక్తుడు ఏం చేయాలో, ఏమి అడగాలో, ఎందుకు ఏడవాలో, ఎందుకు ఏడవవలసి వచ్చిందో, ఎందుకు ఈ కర్మకాండలన్నీ లేకుండా చేస్తే ఏమంటారు? అంటే చాలా సార్కాస్టిక్ గా దాన్ని వేళ మనం నిందాస్తుతి అంటాం. భగవాన్ అంటారు, "నాకు అసలు ఏ కర్మ లేకుండా చేశావేమయ్యా?" అంటారు అరుణాచలుణ్ణి. అరుణాచలం అనేటువంటి ఆ కొండని. అంటే ఏమిటి? కర్మకాండల నుంచి నాకు ఎఫర్ట్ లెస్ ఎఫర్ట్ ఏమీ లేకుండా నువ్వే అన్నీ తెంపి, తెగ్గొట్టి నన్ను హాయిగా పెట్టావే అని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఒక మణమాల అది. కళ్యాణమాల. ఆ కళ్యాణమాల జీవుడు పరమాత్మ యొక్క సంయోగం కలిగినట్లయితే, కలిగినప్పుడు మాత్రమే అహం నిర్మూలన సాధన జరుగుతుంది. కాబట్టి అహం నిర్మూలనకి తాయత్తులు లేవు, అహం నిర్మూలనకి దీక్షా మంత్రాలు లేవు, అహం నిర్మూలనకి గురువు అనుగ్రహాలు లేవు. కానీ ఆ గురువు ఏ గురువు అంటే చిత్తజ గురుడైనటువంటి ఏ ఆత్మ నీకు ఒక మహా కావ్యంలో ఒక్క పదం చాలు గురువు కావటానికి. అది ఒక్కటి నడిపిస్తుంది జీవితాన్ని. అనేక పంక్తులులో కూడినటువంటి ఒక పుస్తకంలో ఒక్క సా-వాక్యం కావచ్చు, ఒక మలయ పవనం కావచ్చు కానీ దేవునిది. సమస్తము బ్రహ్మమై ఆత్మమయమై ఉండగా నీకు గురువు అంటూ ప్రత్యేకంగా ఒక దేహంలో కనపడాలా? అవసరమే లేదన్నవారు భగవాన్ రమణులు. కాబట్టి ఈ సమస్త ప్రకృతిని గురువుగా భావించగలిగిన స్థితి వస్తే అది మంచిదన్నాడు దత్తాత్రేయుల వారు. వీటన్నింటినీ కూడా మనం గ్రహించి తెలుసుకోవటానికి మూలాన్వేషణ చేయాలి. అహం నిర్మూలన గురువు చేయడు. చేయగలిగినా చేయడు. కానీ చేసుకోగలిగిన మార్గాన్ని మాత్రం స్పష్టంగా మనమాలలో చెప్పినట్లుగా లేదా స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచల మంద అదే అని అరుణాచలం యొక్క గొప్పతనాన్ని చెప్పటం ద్వారా ఇలా చెప్తాడే తప్ప, "నువ్వు రా నా దగ్గరికి, నీ అహం పోగొట్టి నిన్ను పంపిస్తాను" అంటే ఈ అహం పోతే ఇంకో అహం రా-రెడీగా ఉంటుంది దాని వెనకనే. ఎందుకనంటే మనస్సు అంతా కూడా ఈ అహాన్ని పదార్థంగా భావించినంత కాలం అహం మనల్ని వీడదు. ఈ కనిపిస్తున్న దృశ్యమాన ప్రపంచం కూడా పరమార్థమే, పారమార్థికమే, పరమాత్మ స్వరూపమే. నా యందు ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే పశుపక్షాదుల యందు, వృక్షాల యందు, నదీనదాల యందు, కొండలు, కోనలు, వాగులు, వంకల యందు ఏది ప్రవహిస్తున్నదో ఆ ప్రవాహము, ఆ చైతన్యము ఆత్మే అని సర్వే సర్వత్రా ఆత్మను దర్శించగలిగిన ఒక స్థాయికి గనక మన సాధన చేరుకోగలిగితే అప్పుడు మాత్రమే అహం నిర్మూలన జరుగుతుంది. ఇంత జరిగిన తర్వాత మాత్రమే నేనెవరన్న ప్రశ్న వేసుకోవాలి. అందుకే నేను చెప్పినట్లు నేనెవరు అనేది It's not an academic question either for a discussion or deliberation. అది సంపూర్ణమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మహాస్త్రం అది. అది అంత తేలికగా వేసుకునే ప్రశ్న కాదు. ఓ మహర్షి చెప్పారు కదా, దేహం కాకపోతే మిగిలింది నువ్వే అని, కాదు. నేను దేహము మాత్రమే కాదు అనుకోగలగాలి ముందు. ఆ దేహము మాత్రమే కాదు అనుకోవటానికి అహం పోవాలి. అహం పోవాలి అంటే ఏం చేయాలో మనకు ఈ క్రమం అంతా కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే అహం నిర్మూలించబడుతుందో, అహం మన యందు నశిస్తూ, ఒక్కరోజులో నశించదు అది. ఎందుకంటే జాగ్రదవస్థలో మనం మేలుకొని ఉన్నటువంటి ప్రతి క్షణంలోనూ మన పట్ల మన యందు మృత్యువు ఎట్లా నీడవలె ఉన్నదో అహం కూడా మన యందు నీడవలె ఉంటుంది. మృత్యువు బయట ఉంటుంది, అహం లోపల ఉంటుంది. ఈ అహం నిత్య మృత్యు విధి. ఇది మనల్ని బతకనివ్వదు, హాయిగా ఉండనివ్వదు, ఆనందంగా ఉండనివ్వదు, తృప్తిగా ఉండనివ్వదు. ఏ చిన్నది చేసినా ప్రపంచాన్ని గెలిచినట్లుగా ఒక ఆ భ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సుని భ్రాంతి నుంచి బయట పడేసి ఈ సర్వ జగత్తుని కూడా ఈశ్వరమయంగా భావించి అసలు అహంకరించడానికి నా దగ్గర ఏమున్నది గనుక ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త నిరహంకారి వలె ఉన్నాడే, ఈ సమస్త జగత్తునీ జగజ్జననిగా ఉన్నటువంటి ఒక జగదీశ్వరి, ఒక మహా చిచ్ఛక్తి ప్రతిరోజూ మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు తాను మేల్కొని ఈ సూర్యోదయం నుంచి రేపటి సూర్యోదయం వరకు ఈ ప్రపంచం ఖర్చుపెట్టినటువంటి శక్తినంతా కూడా ఎట్లా నింపుతూ ఉన్నదో, ఆమేం చెప్పటంలే. "నువ్ ఇంత ఖర్చు పెట్టుకున్నావ్, మీకింత ఇస్తున్నా" అనటంలా. అష్టదిక్పాలకుల్ని, అగస్త్యుల్ని, లోపాముద్ర వీరు, ఇంద్రున్ని, కుబేరుణ్ణి అందరినీ కూడా శాసించేటువంటి ఒకానొక చిచ్ఛక్తి ఏదైతే ఉన్నదో తన కలాపాన్ని అంటే తాను చేయవలసిన పనినితాను ఎంత నిరహంకారంగా నిర్వర్తిస్తున్నదో, నిరపేక్షంగా నిర్వర్తిస్తున్నదో, ఏది తామరాకు మీద నీటి బొట్టువలె నిర్వర్తిస్తున్నదో మనం కూడా అలా జీవించగలిగిన నాడు మాత్రమే అహం నిర్మూలన జరుగుతుంది. ప్రమాదం ఎక్కడ అంటే జీవుడు తామరాకు మీద నీటి బొట్టువలె జీవించు అని వేదాంతం చెప్తాడు. భగవద్గీతలో పద్మ పత్రం ఇవాంబసః శ్లోకం నలభై రోజుల పారాయణం అని చెప్తాడు. కానీ తాను ఎలా ఉంటాడు అంటే తా-తమలపాకు మీద నీటి బొట్టువలె ఉంటాడు. ఏమిటి తేడా? అంటే తామరాకు మీద నీటి బొట్టు తామరాకు నీటి బొట్టును అంటించుకోదు. అది ఉన్నంత కాలం ఉంటుంది, గాలి వీస్తే మళ్ళీ మూలల్లో పడిపోతుంది. కానీ తమలపాకు అట్లా కాదు, దాన్ని తడుపుతూ ఉంటే అది మెరిసిపోతూ మిసిమితో విరాజిల్లుతూ ఉంటుంది. తమలపాకు తడుస్తూ తడుస్తూ ఉండాలి, తామరాకుకి తడపవలసిన పని లేదు ఎందుకంటే అంటించుకోదు. తమలపాకు అంటించుకోకుండా ఉండలేదు. జీవుడి యొక్క జీవన విధానం అంతా కూడా అంటించుకోవటంలో సగం జీవితం, దానిని వదులుచుకోవటంలో మిగతా జీవితం గడిచిపోయి జీవితం ఒక సున్నా అయిపోతున్నది. సున్నా కాకూడదు పూర్ణం కావాలి. ముందే చక్కగా తామరాకు మీద నీటి బొట్టువలె కృష్ణుడు చెప్పాడు. కృష్ణుణ్ణి మనం దైవంగా భావిస్తాం కదా, ఆరాధిస్తాం కదా, యోగీశ్వరుడు అంటాం కదా, మరి ఆయన చెప్పిన మాట వినకుండా తామ-తమలపాకు మీద నీటి బొట్టువలె ఉండి కృష్ణా కాపాడు అంటే ఆయన ఏం కాపాడడు కదా. అలాగే అహం లోపలే పెట్టుకొని నేను ఫలానా మినిస్టర్ని, లేకపోతే ఫలానా వాణ్ని, ఫలానా వాణ్ని, ఇదంతా నా వల్లనే జరుగుతున్నటువంటి నీవు ఏరోజైతే నా వలన ఎవరో చేయిస్తున్నారన్న భావన కలిగి ఆ పైన ఈ జరుగుతున్న దానిలో ఉండటానికి నాకు అవకాశం ఇచ్చాడనుకొని అసలు ఉండటం ఏమిటి, అవకాశం ఏమిటి, ఆయన ఎవరు ఇవ్వటానికి, నేనెవరు తీసుకోవటానికి, ఇదంతా జరుగుతున్నది అని ఒక సహజ సమాధి స్థితిలో. సమాధి అంటే పూడ్చి పెట్టబడింది కాదు, సర్వమూ అధీనమైనటువంటి స్థితి. ఇంద్రియాలు, మనస్సు, చిత్తము, అహంకారము, ప్రగల్భం అన్నీ కూడా మనం control చేసుకున్నటువంటి ఆ స్థితి పేరే సమాధి స్థితి కాబట్టి ఆ సమాధి స్థితి మానసికంగా చేయాలి, భౌతికంగా కార్యకలాపాలు చేయాలి. ఈ అహం అనేటువంటి మూలాన్వేషణలోకి వెళ్ళి ఆలోచనా రీతిని మనం గమనించుకోవాలి. ఆలోచన ఎప్పటికప్పుడు, ఏ క్షణానికి ఆ క్షణం కోపం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి మీద వచ్చింది, దాని వలన ఎవరికి నష్టం జరిగింది. ఈ కలిగిన నష్టాన్ని నేను పూడ్చగలనా, ఇంకొకరిని నేను అవమానించానే, అది తీర్చగలనా, ఆ దుఃఖాన్ని పూడ్చగలనా అని ఎప్పుడైతే మనకి తాత్వికమైన ఒక విచారము లేదా విచారణ జరిగిందో, ఆలోచనలన్నీ పవిత్రీకరింపబడతాయి, రూపాంతరీకరణం జరుగుతాయి. జరిగి జరిగి మనలో ఉన్నటువంటి సంస్కారాలు ఒక్కసారి పెల్లుబికి మనలో ఉన్నటువంటి ఆ జీవధార జీవనధారై, జీవన మహాచైతన్యమై, రమణులు బోధించినటువంటి ఆ అహం నిర్మూలనా వైఖరి ఏదైతే ఉన్నదో మనంతట మనకు అది లభించాలి తప్ప గురు సమూహాలు అందరూ కలిసి ఒక పెద్ద congregation పెట్టినా మన అహాన్ని వాళ్ళు తుంచలేరు. తుంచగలరేమో కానీ ఆ పని వాళ్ళు చేయరు. ఎందుకని అంటే ఇది "ఉద్ధరేదాత్మనాత్మానం" మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అందుకే ఈ జన్మ ఇవ్వబడింది. అరవయ్యా, డెబ్బయ్యా, తొంబయ్యా, వందా ఎన్నేళ్ళు ఉన్నావని కాదు, ఉన్నన్నాళ్ళు ఏం చేశావన్న ప్రశ్న. ఏం చేయాలన్నా ఆలోచించాలి, ఏమి ఆలోచించావన్నది రెండవ ప్రశ్న. ఎటువంటి ఆలోచనలు నీకు అహంకారం లేకుండా నిన్ను నిలబెట్టినయి మూడవ ప్రశ్న. నిరహంకారమైన, నిర్లిప్తమైనటువంటి, నిరామయ నిర్మమయమైనటువంటి భావనలో జీవితాన్ని గనక గడపగలిగినట్లయితే అహం మన దగ్గరకు రాదు. ఎప్పుడైతే అహం నిర్మూలన-- భగవాన్ రమణులు వారు నిజంగా అహాన్ని నిర్మూలించుకున్నారా? ఈ ప్రశ్న కూడా వేసుకోవాలిగా మరి ఆయన గురువు కదా. గురు స్థానంలో ఉన్నవాడు తాను ఏమి చెప్పాలనుకున్నాడో ముందు అది సాధించి ఉండాలి. భగవాన్ సాధించారా లేదా? మనం మొట్టమొదట చెప్పుకున్నాం. సమర్పణ, శరణాగతి, వినయము అరుణాచలేశ్వర దేవాలయంలో అయిపోయింది. ఇక వారికి ఆ దేవాలయంతో ఎట్టి సంబంధం లేదు. పాతాళ లింగం నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ ఆ పాతాళ లింగంలో ఆ రోజుల్లో ఎలా ఉన్నానో ఒకసారి చూద్దామని అనిపించిందా? లేదు. ఏ రకమైన attachment లేదు. తామరాకు మీద నీటి బొట్టు అంటే అది. అలాగే నిరంజనానంద స్వామిని దొంగలు ఎత్తుకుపోయినారు అన్నప్పుడు మౌనం వహించారు. మళ్ళీ వచ్చి నిరంజనానంద స్వామిని వదిలిపెట్టారన్నప్పుడు, ఎత్తుకెళ్లారు అన్నప్పుడు ఎలా ఉన్నారో, వదిలిపెట్టారన్నప్పుడు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఒక సమస్థితి ఏదైతే మనస్సులో ఉన్నదో ఆ సమస్థితిని ఆయన నిలబెట్టుకొని యాభై నాలుగు సంవత్సరాలు తాను పొందినటువంటి ఒక ఆత్మానుభవాన్ని, ఆత్మానుభూతిని ఈ ప్రపంచానికి అందించడం కోసం తనకు అక్కరలేని ఒక శరీరంలో యాభై నాలుగు ఏళ్ళు ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి, అతి సుందరమైనటువంటి, విశిష్టమైనటువంటి unique అంటామే, విశిష్టమైనటువంటి స్థితి ఎవరిది అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షిది. అంటే యాభై నాలుగు ఏళ్ళు ఆయన ఎందుకున్నారంటే మనకి ఇవన్నీ నేర్పాలి. ఎలా నేర్పుతారు? ఉపన్యాసం ఇస్తే కుదరదు, జీవించాలి. ఆయన అలా జీవించారు. యాభై నాలుగు ప్లస్ పదిహేడు డెబ్బై ఒక్క సంవత్సరాల వారి ఈ భూలోక సంచారంలో యాభై నాలుగేళ్ళు తాము పొందిన ఆత్మానుభవాన్ని తానుగా మార్చుకొని, ఆయన దగ్గరికి వచ్చి "భగవాన్ మీరు మృత్యుంజయులు కదా" అన్నాడు ఒకడు, మన బొట్టు వాడు. "మృత్యుంజయులా? ఆ పదమే లేదే, మృత్యువుని జయించగలిగిన వాడు ఎవ్వడూ లేడు. మృత్యు భావనను జయించవచ్చును" అన్నారు. మృత్యు భావన అంటే అది ఎప్పుడు వస్తుందో, ఏ కిటికీలో నుంచి వస్తుందో, ఆహ్ ఎవరు వస్తారో [శబ్దం] అది వెంటనే ఉన్నది. మన-మన వెంటనే నీడవలె ఉన్నది. ఎప్పుడు వస్తుందో దానికి తెలుసు, ఎందుకు వస్తుందో దానికి తెలుసు.తెలిసి దాన్ని దాని పని చేయనిద్దాం. మనం దాని గురించి ఆలోచించి జీవితాన్ని మనం వృధా చేసుకోకూడదు గనుక హూయామై ఈ ప్రశ్న భగవాన్ తాత్విక చింతనకు ఒక పతాక స్థాయి అయిన దాన్ని మనం మొదటి రోజే మాట్లాడుకోకూడదు. అది మాట్లాడుకోవాలి అంటే ఈ అహం నిర్మూలనా విధానం ఆలోచనను సరిచేసుకుని మనసుని control చేసుకొని ఇంద్రియాలను control చేసుకొని అకట్రుత్వ భావనతో జీవించగలిగినటువంటి ఒక ఉదాత్త వైఖరిలోకి మనం వెళ్లగలిగినట్లయితే ఏదైనా సరే ఉపన్యాసము అయితే అది ఒక కళ. It is an oratorial skill. మనది ఉపన్యాసం కాకూడదు. అది నిరంతరము చేసే కర్మకాండైన మహాన్యాసము కాకూడదు. మరి ఏం కావాలి? నిర్లిప్తంగా ఉండాలి. భగవాన్ దగ్గరికి మన బోటి వారే ఎవరో వారున్న సమయంలో వెళ్లి ఏదైనా ఒక మంత్రం ఉపదేశించండి అని అడిగారు. భగవాన్ తప్పకుండా అని అనకుండా ఏమీ లేదు ఊరకుండండి అన్నారు. ఇదేంటి? ఇది మంత్రం ఎట్లా? మంత్రం అంటే సంస్కృతం ఉండాలి, బీజాక్షరాలు ఉండాలి, గురువుగారు చెయ్యెత్తాలి, ఆ, మీకు నేను ఉన్నాను అని అనాలి. ఏం లేదు, ఏమీ లేదు ఊరకుండండి అన్నారు. ఏమీ లేదు అని ఉండగలమా? ఆ నిర్లిప్త స్థితి మనకు ఎందుకు రాదు అంటే అహంకారం వల్ల రాదు. అహంకారం ఎక్కడ నుంచి పుడుతుంది అంటే అహం లో నుంచి పుడుతున్నది, మన ఆలోచనలో నుంచి పుడుతున్నది. By backward intergration. కాబట్టి ఆ ఊరకుండండి. ఊరకుండగలుగుతామా? ఈ పని కాగానే ఇంకో పని, ఇంకో పని కాగానే ఇంకోటి, రేపు ఏమిటి, ఎల్లుండి ఏమిటి, వచ్చే ఏడాది ఏమిటి, అనంతమైన ఆలోచనలు. జరిగిపోయినవి, మనిషి అరవై ఏళ్ళు బ్రతికితే అరవై ఏళ్ళ స్మృతులు వాడి పేటికలో లోపల ఉన్నాయి. అవి ఎప్పుడప్పుడు బయటకు పాముల వలే పెండోరా బాక్స్ లాగా తొంగిచూస్తూ ఉంటాయి అవి. ఆ బాక్స్ లో నుంచి వచ్చినట్టుగా. అరవై ఏళ్ళ స్మృతులు ఒకవైపు ఉన్నాయి, ఇంకెన్నాళ్ళు ఉంటామో అనేటువంటి భయం అది ప్రతిరోజూ ఉంటుంది. దీని మధ్యలో ఆత్మావిష్కరణకు తావు ఎక్కడ? ఆత్మవిచారానికి తావు ఎక్కడ? నేను ఎవరన్న ప్రశ్నకు చోటు ఎక్కడ? అది క-- పొందగలమా అంటే అహం నిర్మూలన చేసుకున్నవాడు అప్పుడు అనుకుంటాడు, ఇంతకీ నేను ఎవరు? పంచభూతములు దివాకరుండు నిశాకరుడుని తను సప్తకంభయై నీ శరీరంబు నీదే. కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు. ఏతదధిష్టాత ఎవడో యజమానుడైననా శ్రమతనువు వాడు. కెరలి నన్నేమి మిగిల్చితే నా స్వామి బిట్టు నేనన్నది అభిజ్ఞ గాక. ఈ నేను అనబడేటువంటి ఈ శరీరం ఉందే, నేను అనబడేటువంటి ఈ మేను ఉన్నదే, నేను అనబడేటువంటి ఈ అహం ఉన్నదే, నేను అనబడేటువంటి ఈ మాయ ఉన్నదే, ఇదంతా చైతన్యానికి ఛాయ. నేను మాయని పట్టుకొని విలపిస్తున్నాను. చైతన్యాన్ని పట్టుకొని వినోద భూమికలో పరమాద్భుతమైన ఆనంద తారక స్థితిలో ఆనంద రస తుందిలమైన భావనా స్థితిలో నన్ను నేను ఎప్పుడు నిలబెట్టుకోగలను అని ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నలో ముందు అహం నిర్మూలనకి సాధన చేయాలి. ఆ తర్వాతనే నేను ఎవరన్న ప్రశ్న వేసుకోవాలి. నేను ఎవరన్న ప్రశ్నకి జవాబు ఇది లేకుండా అది దొరికినా that is half baked, incomplete and it is unreal. అది కూడా భ్రంతే. నేను ఎవరు నాకు కని-- తెలిసిపోయింది అండి, నేను పలానా వాడిని కాదు, ఈ ఇల్లు నాది కాదు, నా ఇల్లాలి నాది కాదు, అది కాదు భగవాన్ చెప్పింది. అదే చెప్తా ఆయన రమణాశ్రమంలోనే ఉండేవారు కాదు. మన బోటి వాళ్ళందరినీ దగ్గర తీసేవారు కాదు. పుస్తకాలకు proof reading చేసేవారు కాదు, అట్టలు వేసేవారు కాదు, గోవు లక్ష్మి దగ్గరికి వెళ్లి emotional గా దానికి ఆనందాన్ని ఇవ్వగలిగేవారు కాదు. అంటే రమణ మహర్షి యొక్క యాభై నాలుగు సంవత్సరాల ఈ భూలోక సంచారం అంతా కూడా నేను ఎవరన్న ప్రశ్నకు అది సోదాహరణ. నేను ఎవరన్న ప్రశ్నకు జవాబు దొరికినా ఎలా ఉండాలో అహం లేకుండా ఉన్నారు గనుక కడగా అహంకారం ఉండనా గురువు చిక్కడు. గురువు చిక్కెనా అహంకారం ఉండదు. గురువు దొ-దొరికిన తర్వాత నేను పలానా వాడి follower నండి, ఆయన fold లోకి వెళ్లిపోయినానండి, ఆయనకు ఏదో పెద్ద fold ఉన్నట్టు, వీడు వెళ్లినట్టు, ఆయన వీణ్ణి పిలిచినట్టు, ఇవన్నీ భ్రాంతులు. ఇవన్నీ మనం వాడకూడదు. అల్ప పదాలవి. You are already the-- ఆ fold ఈ ప్రపంచం మొత్తాన్ని ఆవరించి ఉన్నది నీ ఒక్కడి కోసమే కాదు. మనందరం కూడా భగవంతుడికి దగ్గరే అనే మానవజాతి హుంకరిస్తుంది, అహంకరిస్తుంది. కానీ మిగతా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడు కాని వాటి యందు కూడా ఆయన ప్రేమ మన యందెట్లా ఉన్నదో అట్లాగే ఉన్నది గనుక ఈ రెండు విభాగాలు మనం చేసుకోవాలి రమణ భక్తులుగా. ఒకటి అహం నిర్మూలనకి సాధన చేయాలి. ఆ అహం నిర్మూలనకి ఇవాళ fundamental గా కొన్ని మాట్లాడుకున్నాం. సాధనలు చాలా ఉన్నాయి. ఇక తర్వాత నేను ఎవరన్న ప్రశ్నకి అది తీవ్ర సాధన. ఈ ముందు దీనిని జయించిన తర్వాత మనం మళ్ళీ ఆ ప్రశ్న వేసుకుని దానివైపు వడివడిగా అడుగులు వేయాలని, లేకపోయినట్లయితే కేవలం ఒక ప్రసంగం, ఏదో ఉపన్యాసం మనము అన్నాం, మన-- ఎవరో విన్నారు అనుకోవటం ప్రధానం కాదు. ఇది మనం ప్రతిరోజూ నిత్య నైమిత్తిక జీవితంలో ప్రతిక్షణము భగవాన్, మీరు చెప్పారు ఇవాళ మనం అరుణాచలం వెళ్లగలుగుతున్నామా, పుట్టపర్తి వెళ్లగలుగుతున్నామా, పక్కవాడి ఇంట్లోకి వెళ్లగలుగుతున్నామా, ఈ పరిస్థితి వస్తుంది అనుకున్నామా. కనుక భగవాన్ చెప్పినట్లు కర్త జీవుడి ప్రారబ్ధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. నువ్వు ఈ పని జరగకూడదు అని ఎంత నిరోధించినా అది జరగక మానదు. ఇది జరగాలి అని ఎంత కోరుకున్నా అది జరక్కపోవచ్చు. కాబట్టి ఏం చేయాలి అంటే మనం నిర్మమంగా ఉండాలి, నిర్లిప్తంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి, హాయిగా ఉండాలి, మనం ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒక సమగ్రమైనటువంటి స్థితిలో విచారణ చేయటానికి ఇవాళ భగవాన్ మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని ఈ విచార ధారలో గడపగలిగినందుకు పరమ యోగ్యంగా నేను భావన చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నానా కోటి దేవతల దివ్య అనుగ్రహం, కృప మన భౌతిక సంపదల మీద మాత్రమే కాక సమస్త మానవాళి, ఒక భారతదేశ ప్రజలు కాదు భూలోకం మొత్తం కూడా మళ్ళీ శాంతిధామమై, ప్రశాంతిలయమై, అరుణాచలమై, అరుణమై, అచలమై, నిరంతరమై ఒక శిఖర స్థాయిలో ఒక ప్రసన్నమై వెలుగొందు గాక అని భగవాన్ శ్రీ రమణ మహర్షిని అనంతకోటి గురు స్వరూపాలని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
YouTube · audio
Aham Nirmulana - Bhagwan Ramanulu Suchinchina Margam
Aham Nirmulana - Bhagwan Ramanulu Suchinchina Margam
0:00 / 1:01:30