Skip to content
Transcript తెలుగు
[ backgroud music] This video is brought to you by Bharati cement పరమాత్మవైన మా అమ్మ నీ రాజనమ్ముగై కొమ్మ పరమాత్మవైన మా అమ్మ నీ రాజనమ్ముగై కొమ్మ సుడిగాలిలో సొక్కి సోలి సరిలేని నీ ఒడిలో వ్రాలి జడ ప్రాయమైన జీవాళి దరిచేర్చు తల్లి నివాళి భేదమెరుగని నీ విధానాలు బోధించు మాకు వేదాలు వేదాలు తెలుపు సారాలు మానుదుట నీ చేతి వ్రాలు అమ్మ అమ్మ అమ్మ అమ్మ గురువు గారు అమ్మత్వం ఉండే గొప్ప వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం కానీ దివ్య పురుషుల్ని చూసినప్పుడు ఏదో ఒక emotional release అంటారు ఒక ఉద్వేగం అలా పొంగుకొస్తుంది వీటికి మీరు తావిస్తారా గురువు గారు మీ ప్రయాణంలో మీరు చూసిన అనేక విషయాల ద్వారా నా జీవితానుభవంలో నుంచి ఒక మాట చెప్తానమ్మ [background music] దానిలో నుంచి ఏర్పడేటువంటి భావ స్థిరంగా ఉంటుంది అనేక జన్మలుగా ఏర్పడి ఉంటుంది అందరూ వెళ్ళిన భక్తులందరికీ గాని బిడ్డలందరికీ గాని అమ్మ అనుబంధం ఆత్మీయత అనురాగం వీటితో పాటు ఇంకా అంశాలని అంటే జీవన మార్గానికి బోధించారు శాస్త్రానికి అతీతమైన హృదయానికి సంబంధం [background music] ప్రేమే జ్ఞానం అని చెప్పేసి అమ్మలో ఒక feminist ఉన్నారు అమ్మలో ఒక విప్లవాత్మకమైన ఆలోచనా ధోరణి ఉంది అని చెప్పారు మీరు గురువు గారు ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తారా శ్రీపాద గోపాలకృష్ణమూర్తి వారి పేరు తీసుకోవచ్చు [background music] వాళ్ళ అమ్మాయి చేయించండి కడుపున పుట్టిన బిడ్డే కదా [background music] అమ్మ జీవిత సారాన్ని కుద్దో గొప్పో గ్రహించి తరం అందుకోవాలంటే మంచి పనులు చేయడం అవన్నీ ఒక ఎత్తయితే నాకు ప్రపంచానికి ఉండే అనుబంధం ఏమిటి అమ్మ ప్రేమ అందరిలో ప్రవహిస్తే మరి అంతకంటే మించినది ఏమన్నా ఉంటుందా గురువుగారు [background music] అది అమ్మ demonstrate చేసింది తన life లో గురువు గారు అమ్మ భౌతికంగా వెళ్ళిపోయినప్పుడు వాతావరణం ఎలా ఉండేది అంటే ఎంత అంతా నేనే నేను అన్ని చోట్లా మీలో ఉన్నానని అమ్మ చెప్పిన అమ్మ వెళ్ళిపోతే మరి బిడ్డలకు కష్టం కదా ఇవాళ అందరూ తెలుసుకోవలసినటువంటి పొందవలసిన జవాబు [background music] ప్రతి ఆశ్రమంలో జరిగే ఘర్షణలు ఎక్కడ జరిగాయి [background music] అందరికీ నమస్కారం ఆధ్యాత్మికీ మతం అవసరం లేదు మతానికే ఆధ్యాత్మిక అవసరం మతం ఎప్పుడూ మౌఢ్యం కాకూడదు అని చాటి చెప్పిన అవధూతలు చాలామంది ఉన్నారు వారందరూ మన జీవితంలో శాశ్వతంగా ఒక ముద్ర వేసి భూమి మీద నడయାడి వారి సందేశాన్నిచ్చి భౌతికంగా వెళ్ళిపోయినప్పటికీ వారి ఆత్మ స్వరూపం ఎప్పుడూ మన మధ్యనే మనతోనే ఉంటుంది అటువంటి గొప్ప అమ్మ అమ్మత్వాన్ని బోధిస్తూ అమ్మత్వమే జీవితం అని తన జీవితం ద్వారా అందరికీ చాటి చెప్పిన గొప్ప మాతృశ్రీ జిల్లేలుముడి అమ్మ [background music] అసలు అన్నిటికీ మించి గురువు గారు అమ్మ చెప్తున్న విషయాలు అమ్మ ఉంది చూసుకుంటుంది అమ్మ చూసుకుంటారు అనే ఒక భావనే ఎంతో సొలేస్నిస్తుంది ఒక example అటువంటి భౌతికంగా ఆవిడని కలిసిన ఎంతో మంది ఎంత ధన్యులు గురువు గారు నిజంగా నిజంగా గురువు గారు ఇక్కడ ఒక విషయం అడగాలి అమ్మ ఇప్పుడు కరణం గారి భార్య అమ్మ అవును అంత పదివేల మందికి అన్నం పెట్టే ఆర్థికంగా అలా లేకపోయినా అది సాధ్యం అయ్యేలాగా చేశారు కరణం గారు కూడా చాలా గొప్పవారే అయి ఉంటారు కదా ఇంకో మాట చెప్పాలి అమ్మ శతజయంతి నాడు తలచుకోవలసినటువంటి మొట్టమొదటి వ్యక్తి నా దృష్టిలో అమ్మ పటం కంటే గొప్ప పటం ఆమె భర్తది ఎందుకంటే ఆయన పురుషుడు కదా పురుషుడు తన భార్య అనబడేటువంటి ఒక అమ్మ ఒళ్లో పరాయి పురుషులు కొన్ని వందలు వేల మంది వచ్చి ఒళ్లో పడుకుంటే ఎంత అద్భుతంగా ఆయన తనను తాను నిగ్రహించుకోగలిగారు ఎవరన్నా tolerate చేయగలరా కనుక నాకు అందరూ అమ్మని పూజించండి అమ్మని ఆరాధించండి కానీ ఆమె భర్తను కూడా equal గా గౌరవించండి. ఇదంతా మనం మన కల్పన కందడానికి అవతార ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అవతరించాడు అనే అనేక విధాల మనం అన్వయించుకోవచ్చు గురువు గారు కానీ చాలా clean గా just factual గా చూస్తే two dimensional గా అమ్మకి తగినట్టుగాఆ వారు ఎవరికి సహధర్మచారిణిగా అవ్వాలో వారికి ఎవరు ఏం పదం వాడాలో అర్థం కావట్లేదు. భర్త అనే పదము చిన్నగా అయిపోతోంది contextలో. అటువంటి వ్యక్తి రావడం కూడా చాలా గొప్ప ఒక కలయిక చిన్న రహస్యం చెప్తా. చెప్తాను గురువుగారు వ్యక్తి రావటం కాదు వాళ్ళు తెచ్చుకుంటారు అదే అమ్మ తెచ్చుకుంది ఆయన్ని. తెచ్చుకొని ఆయన్ని కూడా సాధనా మార్గంలో పెట్టినప్పుడు ఉమ్ తొలినాళ్లలో ఆమె భర్త కూడా "అనే మరి ఏముంటుంది ఎందుకు ఇంతమంది వస్తున్నారు" అని ఆశ్చర్యపోయేవారు. తొలినాళ్ళలో ఆమె అన్నం వండి పెట్టేది పట్టుమని పది మందికి. కానీ పదివేల మందికి మిగతా వాళ్ళంతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు అందులో అమ్మ ఉంది. అమ్మ వల్ల వ్యవస్థ, వ్యవస్థ వల్ల అమ్మ. ఇది సినానిమైంది. ఉమ్ అయితే ఆయన పరిణామ క్రమంలో ఇట్లా ఏదో ఒక కష్టం వచ్చింది అనేచేత అమ్మకి జ్వరం గా ఉంది ఇవేళ వాళ్ళు నాన్నగారిని పిలుస్తారు. "నాన్నగారు అమ్మకి చాలా జ్వరం గా ఉంది లేవటం లేదు ఇవేళ జని ఏమో చాలామంది వచ్చేశారు" అంటే "మీ అమ్మగారికి ఏముందయ్యా జ్వరాన్ని కొక్కేయానికి తగిలించి వెళ్ళిపోతుంది ఆమె. మళ్ళీ కావాలంటే తగిలించుకుంటుంది" అది స్థాయి. అటువంటి ఆయన తర్వాత తర్వాత అందరితో పాటు కలిసి భుజించేశారు, భక్తులతో పాటు. ఆమెలో ఉన్నటువంటి divinityని ఆయన experience చేశారు, గౌరవించారు అది గొప్ప అపారమైన గౌరవాన్ని ఆమెకిచ్చారు. అట్లాగే equally అమ్మ కూడా ఆయనకి ఆయన పుట్టినరోజునాడు ఏదో ఒక సందర్భంలో ఆయనకి నమస్కారం చేసేది. "నేను ప్రపంచం మొత్తానికి ఏవైనా కావచ్చు గాక కానీ నేను ఆయనకి భార్యని" అని. అంటే వివాహ వ్యవస్థనమ్మ ఇవేళ యువతరం జిల్లేళ్ళమూడి ఎందుకళ్ళా మోక్షానికి వెళ్ళక్కర్లా, భోజనానికి వెళ్ళక్కర్లా. ఒక వివాహ వ్యవస్థ ఎంత బలీయమైనదో, భారతీయ ఆత్మకది ఎంత సంకేతమో, దాన్ని నిలబెట్టగలిగినటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి సంపూర్ణ స్త్రీమూర్తి నా దృష్టిలో జిల్లేళ్ళమూడి అమ్మ. ఎన్ని వైరుధ్యాలున్నాయి, వైవిధ్యాలున్నాయి. అన్నింటి మధ్య తన అవతార కార్య-- అవతారాన్ని ఎందుకు వాడుతున్నానంటే మనమెవ్వరం చేయలేని పని ఆమె చేయగలిగింది. అవును అవతార కార్యక్రమాన్ని ఒక పాయలో సాగిస్తూనే కుటుంబాన్ని కూడా కాపాడుకుంటూనే తన భర్తని తాను గౌరవిస్తూనే పది మందికి చెప్పింది. మీరు మీ భర్తల్ని గౌరవించండి, మనుధర్మ శాస్త్రం చెప్పలా. మీరు మీ భార్యలను ప్రేమించండి మామూలుగా చెప్పలా. అవన్నీ తాను చేసి చూపించి అనుష్ఠాన భూమికలో నిలబెట్టింది. అందువల్ల ఆమెంటే నాకు చాలా గౌరవం. ఉహు. ప్రపంచమంతా అమ్మగా ఉంటూ ఉమ్ అమ్మ సంతానానికి ఉమ్ అమ్మ ఎలా ఉండేవారు? అందరితో కలిపేనా లేక? దీన్లో రెండు మూడు పరిష్వాలున్నాయి. ఇది, ఇది కూడా చాలా ఖచ్చితమైన ప్రశ్నే. దానిలో ఇప్పుడు ఆమె ఒక సంతానం రవీంద్రరావు, ఆయన ఉన్నారు ఇంకా. అందరూ రవీ అన్నయ్య అని పిలుస్తారు. ఆయన్ని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. జగజ్జనని, విశ్వజనని, రాజరాజేశ్వరి ఆమె కడుపు నుంచి పుట్టినటువంటి వాడు. ఆయన function జరిగిందనుకో, అందరూ భోజనం-- వాళ్ళు పదివేల మంది కాదు, ఐదువేల మంది కాదు. వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత The last person to take food is అమ్మ కొడుకు. అబ్బా ముందు తీసుకోరు ఆయన. last. ఆయనకి ఆకలి వేసినా సరే అలానే ఉంచుంటారంతే. రెండు, సభ జరుగుతుంటుంది. మాములుగా అమ్మ కొడుకు అంటే ముందు కూర్చోబెట్టాలి. ఆయన lastలో కూర్చుంటారు. నిరామయంగా కూర్చుంటారు. ఇది this is one good thing. అది మనం అమ్మ పరంగా చూసినట్లయితే తన బాధ్యతలు తాను చక్కగా వాళ్ళకి ఒడుగులు చేసింది, పెళ్ళిళ్ళు చేసింది, మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంది, వాళ్ళతో carrom board ఆడుకుంది Down to earth ఉమ్ అది. అది అమ్మని కేవలం మళ్ళీ ఇంటి వాళ్ళతో మాత్రమే కాదు, నా నలుగురు, ఐదుగురు భక్తులతో కూడా అమ్మ carrom board ఆడుకునేది. ఉమ్ ఉమ్ ఎంత అంటే అమ్మ చేసేవన్నీ అమ్మ ఎలా అయితే పిల్లలతో అమ్మ ఎలా చేస్తుందో అవును నక్సలైట్లు వచ్చి అమ్మ మీద అమ్మ ఆశ్రమం మీద దాడి చేశారు ఆహా దాడి చేసి, ఎందుకంటే ప్రపంచం ఎంత చెడ్డది, ఎంత అపరిపక్వంగా ఉంటు-- చెడ్డదని నేను అనను. ఎంత అపరిపక్వంగా ఉమ్ అసమగ్రమైన సమాచారంతో ఉంటుందో మనందరికీ తెలుసు. అది ఎలా అనుకుంటుందో అలా అనిస్తుంది. వాళ్ళకేం తెలీదు. ఉమ్ ఇంతమందికి అన్నం పెడుతున్నది అంటే అమ్మ దగ్గర బోలెడు డబ్బులు ఉండి ఉండాలి. అంతే కదా. అనుకొని న-night దాడి చేశారు నక్సలైట్సే. ఉమ్ చేస్తే అది తప్పిపోయింది, ఏం జరగలేదు. వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొచ్చి "అమ్మా వీళ్ళిద్దరూ main. వీళ్ళని ఏం చేయమంటావు?" అని అడిగారు. "ఏం లేదు నాన్నా, బాగా చనువున్నవాడు ఏం చేస్తాడంటే అడిగి అమ్మా అని తీసుకుంటాడు. ఇంకాస్త ఎక్కువ చనువున్నవాడు అఘాయిత్యం చేసి తీసుకుంటాడు. వీళ్ళు అఘాయిత్యం చేశారు వదిలిపెట్టండి" అంది. ఆహా "వాళ్ళేం చేయలేదు. వాళ్ళేదో అనుకున్నారు వచ్చారు. వాళ్ళు ఎలా చేశారు? అఘాయిత్యం చేశారా" అంది. ఊహు అది toleranceకి height అది. చాలా అసలు ఉమ్ వాళ్ళలో పరివర్తన వచ్చి ఉంటుందో వచ్చింది వచ్చింది కథలు మనకు తెలీవు గానీ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే "అసలు అమ్మని చంపటానికో ఆస్తుల కోసమో ఏం రాలేదు. అమ్మని defame చేయమని మమ్మల్ని ప్రయోగించిన కారణంగా మేము వచ్చాము" అన్నారు. ఊహు. అటువంటివి కూడా జరిగాయా అలాంటివి జరిగినాయి జరిగినాయి మరి అందరికీ అన్నం పెట్టి విధమైన వివాదాలలో లేని అమ్మకి అమ్మకి కష్టం రావడం ఏమిటి? కష్టం వస్తుంది. రాముడికి కష్టం రాకపోతే భార్యను వాడు ఎలా ఎత్తుకుపోయినాడు? కృష్ణుడికి కష్టం రాకపోతే ద్వారక ఎందుకు పరిగెత్తుకొని వెళ్ళిపోయినాడు జరాసంధుడి చేతిలో? ఇవన్నీ భౌతిక స్థాయిలో అంటే వీటి, ఇవన్నీ జరుగుతాయి. జరిగినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్నది ప్రశ్న. అది ప్రశ్న. వాస్తవం గురువుగారు. అంతే కదా అద్భుతం అవి కూడా జరుగుతాయి అమ్మలో ఒక feminist ఉన్నారు. అమ్మలో ఒక ఒక విప్లవ-వి-విప్లవాత్మకమైన ఆలోచనా ధోరణి ఉంది అని చెప్పారు మీరు అవును గురువు గారు ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తారా? అంటే విషయాలని ఇది కాదు పద్ధతి అని అమ్మ చెప్తాశ్రీపాద గోపాలకృష్ణ మూర్తి వాళ్ళ పేరు తీసుకోగలరు చరిత్రలో ఉన్న విషయమే ఇది ఉమ్ వారు scientist ఉమ్ ఆయన అమ్మని చాలా పరిశోధించి అమ్మ మీద పుస్తకాలు రాసి ఆయన పని ఆయన చేశారు. ఆయన పోయారు. పోతే దహన కార్యక్రమాలు చేయాలి. ఉమ్ సంప్రదాయం ప్రకారం మగవాళ్లే చితి అంటించాలి. ఉమ్ అమ్మ ఏమన్నదంటే "వాళ్ళ అమ్మాయి చే చేయించండి కడుపున పుట్టిన బిడ్డే కదా, దాని కంటే ఉత్తమమైన మార్గం ఏముంది" అన్నది. ఇది ఆనాడు సంప్రదాయ విత్తారం. ఇవేళ జరుగుతున్నాయి. అవును ఇవేళ జరుగుతున్నాయి. ఉమ్ కాబట్టి అది ఒక సంప్రదాయం నుంచి పక్కకి తీసుకెళ్ళింది అమ్మ. రెండవది ఒకాయన వచ్చారు. వచ్చి అమ్మ బట్టలన్నీ తెచ్చుకున్నాడు ఆయన. రుద్రాక్షలు, పావు కొళ్ళు తర్వాత దాని కాల సామాన్లు అన్నీ తెచ్చుకున్నాడు ఆయన. ఎందుకు వచ్చాడు మూడు రోజులు ఉన్నాడు. "ఉండి అమ్మా నాకు సన్యాసాశ్రమం అనుగ్రహించు నువ్వు నాకు పేరు పెట్టి ఇస్తే నేను బట్టలు బయట పడేసి అవి కట్టుకొని బతుకుతాను" "సన్యాసాశ్రమం తీసుకోవటం ఏంటి అన్న సన్యాసిగా ఉండటం ప్రధానం కదా" అబ్బా "దీన్లో ఏముంది? నువ్వు ఎట్లా ఉన్నావ్ అట్లా ఉండు సన్యాసం-- సన్యసించినట్లు ఉండు. నీకు ఏది కావాలో అది దాని ప్రకారం బతుకు, ఏది అక్కర్లేదో అది సన్యసించు. అంటే వదిలిపెట్టేసేయ్ నీకేం కావాలో అది దక్కుతుంది కదా" అన్నది. ఉమ్ Highest philosophy అవును ఉమ్ దీనికి ఎక్కడా నీకు పడికట్టు మాటలు లేవు. ఉమ్ మరి రోజుల్లో అమ్మ చెప్పే ఇ-ఇటువంటి విషయాలకి కొంత resistance వచ్చిందా గురువు గారు? Resistance అంటే direct గా చేయలేదు గాని resistance ఉన్న వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళలే. ఆహా వెళ్ళకుండా దూరంగా ఉండిపోయారు. ఉమ్ ఆమెది ఏదో ఒక కొత్త దారి అనుకొని వెళ్లారు. అయితే ఇటువంటి చింతనాత్మక స్థాయిలో వెళ్ళిన వాళ్ళు నా దృష్టిలో నా అనుభవంలో అధ్యయనంలో చాలా తక్కువ మంది. ఉహు వెళ్ళిన వాళ్ళంతా ప్రాపంచికమైన కష్టాలు లేదు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లాలని అనుకున్న వాళ్ళు, దుఃఖం భరించలేని వాళ్ళు, భర్తలను పోగొట్టుకున్న స్త్రీలు లేదు భార్యలు లేనటువంటి పురుషులు ఇక బయట ప్రపంచంలో బతకడానికి అవకాశం లేని వాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ మంది వెళ్లారు. ఉహు అందువల్ల వాళ్ళందరినీ ఆదరించింది అమ్మ. ఉమ్ ఆదరించింది తర్వాత ఇంకోటి చెప్పాలమ్మా ఇక్కడ చెప్పాలి సందర్భంలో, ఇవాళ అని ఎవరు ప్రత్యేకమని కాదు గురువు స్థానంలో ఉన్నానని అనుకున్నవాడు ఉమ్ నేను గురువునే అనుకున్నవాడు ఉమ్ పరిచయం కాస్త పెరిగితే "మీకు రెండు ఫ్లాట్లు ఉన్నాయని విన్నాను ఒక ఫ్లాట్ మాకు ఇచ్చేయండి" అని అడుగుతున్నారు కదా. అవును అమ్మ ఏం చేసిందో తెలుసా? ఒక కరణం గారి భార్య అయి ఉండి ఆయనకు ఏడు రూపాయల జీతంలో ఉన్నప్పుడే జీవితం ప్రారంభించి తనకున్న చిన్న ఇల్లుని అందరి ఇల్లు అని పేరు పెట్టింది. అబ్బా She gave it away కొడుకులకు రాయలా will నామా. ఉహు అందు ఇంటికి దాని పేరే అందరి ఇల్లు Anybody can come. Anybody can have food. ఉమ్ అబ్బా ఆమె ఉన్న time లో కూడా. ఉన్న time లో ఉన్న ఇంటిని అందరి ఇల్లు అన్నది ఆమె. చిన్న నవారు మంచం మీద కూర్చొని ప్రపంచంలో ఉన్న ప్రేమను పంచింది. ఆమెకేం వింజామరలు లేవు. వీళ్ళేదో ముచ్చట పడి దసరాల్లో త్రిశూలాలు అవి పెట్టారు గాని ఆమె మామూలుగా అత్యంత సాధారణమైన స్త్రీ. ఒక సందర్భం చెప్పాలి. ఉమ్ నేను అమ్మతో కూర్చున్న సందర్భాల్లో ఒక చెన్నై నుంచి అప్పుడు మద్రాస్, మంచి ఖరీదైన పట్టుచీర తెచ్చారు. తెచ్చి వాళ్ళు పదే పదే అమ్మకి దిస్తూనే అమ్మ తీసుకుంది. చేతులు ఇట్లా ఒళ్ళో పెట్టుకుంది. "అమ్మా నువ్ ఇది కట్టుకుంటే చూసి వెళ్లాలని ఉంది కట్టుకొని వస్తావా" అని అడుగుతున్నారు. దానికి ఆమె answer ఇవ్వటంలా. కాసేపు అయింది. అలా చూసింది బయటికి. చూస్తే ఎవరో ఒక కుక్కని మూతి మీద కొట్టారు. అది ఏడుస్తోంది మూలుగుతూ వెళ్తోంది పాపం. అమ్మ లేచింది. లేచి చీర అక్కడ పక్కన పెట్టి తను కట్టుకున్నటువంటి పట్టుచీర ఉంది రోజున అది చింపేసి దాని మూతికి గుడ్డ కట్టేసి "ఇది దీని మూతికి నీళ్ళు తగలకుండా చూసుకోండి లేకపోతే వాతం వచ్చి పోతుంది" అన్నది. తను కట్టుకున్న చీర అలా చింపేసింది. చింపేసింది, ఆహా ఇది ఒకటి. రెండోది పట్టుచీర తెచ్చి అలా పెట్టుకుంది కదా ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి పెళ్లి శుభలేఖ. మామూలుగా అక్షింతలు వేసి ఏదో ప-పళ్ళు ఇచ్చి పూలు ఇచ్చి పంపాలి. ఇదిగో అని పెళ్ళికి చీర కట్టుకోమని ఇచ్చేసింది. అసలు వెనక నుంచి ఒక ఆమె "అమ్మా బీరువాలో ఇంకా చీరలు లేవు నీకు" అని. "లేవా పోనీలే ఇప్పుడు బిన్నీ చీర" రోజుల్లో బిన్నీ చీరలు అనేవాళ్ళు. అవునవును "బిన్నీ చీర కట్టుకున్నాను దొరకన్నాడు గన్నీ చీర కూడా కట్టుకుంటాను" అని. అబ్ба! Humor humor. ఏముంది అక్కడ ఒక-ఒక చుట్టు చుట్టుకుంటాను వెళ్తాను అంది. అసలు మాటలు రావట్లేదు గురువు గారు. అంటే ప్రపంచంలో సంపూర్ణంగా ఉండే ఒక అమ్మ. అంతకంటే మించిన అసలు వర్ణన అవసరం కూడా లేదనిపిస్తోంది. ఎందుకంటే దేవత అంటే మళ్ళీ మనము మనకంటే దూరం. చాలా దూరం ఒక-ఒక దూరం పెరిగిపోయి ఒక గౌరవ భావం ఏర్పడుతుంది తప్ప మన అమ్మ ఉమ్ అనే ఒక అసలు మాటలు రావట్లేదు గురువు గారు. గురువు గారు ఉమ్ అమ్మ ఉమ్ ఇతర విషయాలలో ఉమ్ మతం, ధర్మం విషయాల్లో ఏం చెప్పేవారు? అంటే అన్య-అన్యమతస్తులు కూడా అమ్మ దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఇక్కడ నువ్వు ఎంత అందమైన ప్రశ్న వేశావంటే జవాబు శతజయంతిలో అమ్మ భక్తులు కూడా గుర్తు పెట్టుకోవాలి. నామ జపం చేస్తారు అమ్మది जय हो माता श्री अनसूया राज- రాజరాజేశ్వరీ శ్రీ పరాశక్తి చదువుతారు కదా. ఉమ్ అది రాసింది ఎవరో తెలుసా? అది అన్నది ఎవరో తెలుసా? ముస్లిం. ఆహా తర్వాత అమ్మ తొలినాళ్లలో ఇంకా అమ్మగా ప్రపంచానికి ఆ-ఆవిష్కరణ జరగని రోజుల్లోనే ఆమె చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా ముస్లిమ్స్.ఆహా ఉమ్ ముస్లిమ్స్ అనేక జాతుల వాళ్ళు ఆమెకసలు జాతి భేదం లేదు. నా చుట్టూ బ్రాహ్మణులే ఉండాలని ఆమె ఏం కోరుకోలేదు. అసలు ఆమె స్-- స్థాయిలో ఆమె ఆలోచనలో దానికి place లేదు. angle లో అట్లా మనం అర్థ-- ఇంకోటి ఇప్పుడు హోమాలు చేస్తారు ఇప్పుడు శతజయంతి కూడా చాలా హోమాలు పెద్ద, పెద్ద చాలా పెద్ద programs ఉన్నాయి. ఒక్కోసారి అనిపిస్తుందమ్మా, అవతారమూర్తుల ఆలోచనలకి, ఆశయాలకి, ఆదర్శాలకి అనుగుణంగా మనం బతకలేమేమో, బతకమేమో అట్లా ఉంటే మనకు పుణ్యం రాదేమో అని మనకు అనిపిస్తుందేమో. ఆమె ఏమన్నదో తెలుసా? "గాడిపోయి నాకు యజ్ఞశాల" ఆహా "చీటా, చాపురు-- చాట, చీపురు, రోలు, రోకలి నా ఆయుధాలు" అన్నది. "ఇవి లేకుండా అన్నం ఎక్కడి నుంచి తెచ్చి పెట్టను నాన్న?" అంది. [నవ్వు] అవి ఉండాలి కదా, గాడిపోయి ఉండాలి కదా అవును కానీ ఇవాళ మనం దానికి తద్భిన్నంగా మనం హోమ కార్యక్రమాలు విపరీతంగా చేస్తున్నాం. అవును దేనిని ఆశించి? అమ్మ వేమీ చెయ్యకుండా అట్లా అని మీరు చెయ్యొద్దని చెప్పలే. మీకు కావాలంటే చేసుకోండి అంది. అంటే she is too rational. Very rational. ఇంకేం చెప్పాలి? దాని ద్వారా direct గా మనుషులకి, సమాజానికి నేరుగా ఒక, ఒక మంచి చేసే అది సహజంగా వచ్చిన సంకల్పం. వచ్చిన సంకల్పం అంతే నిజంగానే గురువు గారు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇన్ని యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. ఇవన్నీ దేని ఆశించి చేస్తారు అంటే కామ్యసిద్ధే కదమ్మ. పధ్నాలుగు ఏళ్ళు ఘోర తపస్సు అని మనం పుస్తకాల్లో చదువుతాం. పధ్నాలుగు ఏళ్ళ తర్వాత దేవుడు వస్తాడు. వాడు అనుకున్న దేవుడు ఎవరో వస్తారు. శివుడో, విష్ణువు వస్తారు. రాగానే "నీకేమిటి కోరిక? ఎందుకు చేస్తున్నావు తపస్సు?" అని ఆయన అడుగుతాడు అని చదివాం. పధ్నాలుగు ఏళ్ళు తపస్సు చేసిన వాడు పధ్నాలుగు ఏళ్ళ నాటిదే అడుగుతాడు. అంటే వాడు తపస్సు చేసినట్టా, చెయ్యనట్టా? అదే [నవ్వు] ఏకీ సమాధానం లేదు గురువుగారు. లేదు చెయ్యలే అవును చెయ్యలే. ఇహ వాడు పధ్నాలుగు ఏళ్ళు అయినా వీడి కోరిక తీరలేదు కనీసం ఒకసారి కలిసి వెళ్దాం అని ఆయన వస్తాడు. దొరికాడు కదా అని పధ్నాలుగు ఏళ్ళనాడు సంకల్పంతో కూర్చున్నాడో అదే అడుగుతున్నాడు. కాబట్టి దానికంటే మానసికమైనటువంటి ఒక తపస్సు, తపస్సు అంటే నా దృష్టిలో మా తమస్సుని వదిలిపెట్టగలిగితే దాని పేరు తపస్సు. ఆహా Negativity మనం వదులుకోగలిగితే అది వెలుగు. అంతే కదా. చీకటి పోయి వెలుగు అంటాం మనం. చీకటి పోలే. చీకట్లో వెలుగు ఉంది, వెలుగులో చీకటి ఉంది. Simultaneous గా alternate గా అది అభివ్యక్తమవుతూ ఉంటుంది. మన అవసరాన్ని బట్టి మన వినియోగాన్ని బట్టి. సంకల్ప బలం అలాగే పూర్తి స్పష్టత స్పష్టత ఇవి అమ్మ, అమ్మలో కని-- పొట్ట వచ్చినట్టు కనిపిస్తున్న అతి, అతి గొప్ప, గొప్ప ఏమి గో-- గుణాలు అతి గొప్ప విషయాలు. విషయాలు అంత స్పష్టత వారికి రావడానికి మరి అది పూర్వజన్మ సుకృతమా వారికి లేక వారికి కలిగిన ఒక-- ఎందుకంటే మనం కథలు ఎన్నో చదివాం అవధూతులవి. ఎక్కడో ఒక మదనం జరిగి నేను ఫలానా time లో రాయి మీద వెళ్లి కూర్చున్నాను. సమయంలో నాలో నుంచి కాంతి పుంజం వచ్చి ఏదో జరిగింది అని ఇలా రకరకాలు చెప్తూ ఉంటాం. గురువు వచ్చి ఏదో ఇంకేదో జాగృతం చేశారని. అదే చెవిలో చెప్పాడని ఏదో అమ్మ, అమ్మ విషయంలో మరి సహజసిద్ధంగా అత్యంత సహజసిద్ధి ఇందాక చెప్పాను కదా స్వయంభు స్వయంభు. మూడేళ్ళకి, మూడు సంవత్సరాలకే ఆమెకి అతిమానుషమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. కానీ తన దివ్యత్వాన్ని తాను మరుగుపరుచుకొని మానవీయమైన సంచారం చేసిందమ్మ. ఉన్నాయి, ఆమెకు కూడా శక్తులు ఉన్నాయి. కానీ వాటిని, వేటిని కూడా ప్రాపంచికమైన సుఖాల కోసం గానీ, ఇంకొకరిని ఆకర్షించడానికి మధ్య పెట్టడానికి గానీ, ఇంకొకరికేదో ఒక కొత్త నేను దైవీ శక్తులతో ఉన్నానని చెప్పడానికి గానీ ఆమె చేయలేదు. అది స్పష్టం. ఆమె దాన్నంతా కూడా ఒక దివ్యమైనటువంటి ఒక ప్రేమని భౌతిక ప్రేమలోకి ఇమర్చగలిగిందమ్మ. దివ్యమైన ప్రేమ justifiable manifestable manifestable and it is very, very practical Reasonable reasonable. ప్రపంచానికి ఇది కావాలి. ఇప్పుడు నేనున్నాను అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నాతో మాట్లాడలేదు, నన్ను గుర్తుపట్టలేదు. లేదు నేను పరీక్ష పాసవ్వాలి, నాకు తొంబై ఎనిమిది మార్కులు రావాలని వెళ్లి కూర్చున్నాను. నాకు ముప్పై ఎనిమిది వచ్చాయి. అమ్మకి దానికి ఏంటి సంబంధం? లేదు అనుకున్నాను నాకు తొంబై ఎనిమిది వచ్చాయి అనుకున్న ప్రకారమే. అమ్మకి ఏంటి సంబంధం? రాసింది నేను. ఊహూ చదువుకున్నది నేను. ఊరికే ఒక గురి పెట్టుకొని వెళ్ళా. అంతే. అనుకుందాం. అంతే తప్ప అక్కడ "నీకు నా వల్ల తొంబై ఎనిమిది వచ్చిందన్నా" అనుంటే నేను జల్లెడ ముడి వెళ్లేవాడిని కాదు. ఊహూ ఊహూ ఆమె అనలేదు. గురువు గారు అమ్మ అమ్మ సత్సంఘాలలో ఏం మాట్లాడేవారు? ఆమె ఉపన్యాసాలు ఇవ్వలే. ఎప్పుడూ? ఎప్పుడూ ఇవ్వలే. సంభాషణల్లో, చర్చల్లో పాల్గొనేది. అది కూడా చాల ఇద్దరు, ముగ్గురితో. ఒక విషయం చెప్తా. ఒక communist leader, ఒక బాగా మేధావి అనబడేటటువంటి ఆయన ఇద్దరు అమ్మ దగ్గర కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఏమీ అమ్మని అడగటంలా. అమ్మ తనంతట తాను ఏమన్నదంటే, "నాన్న నా గడియారం చూడటం చేతకాదురా" అంది. అనగానే క-కవి, పండితుడు ఒకాయన ఉన్నారు కదా. ఆయన అన్నాడు, "అమ్మా నువ్వే కాల స్వరూపాణివి. నీకు time తో పనేముంది?" అని ఏదో మామూలుగా ధోరణిలో మాట్లాడాడు. "కాదు నాన్న నిజాయితీగా చెప్తున్నా గడియారం చూడటం చేతకాదురా" అంది. అంటే ఆయన నమ్మాడు. పాపం తెలియకే అడుగుతున్నది అనుకొని "ఏం లేదమ్మా గడియారం ఉంది కదా. ముళ్ళు, ముళ్ళు తిరుగుతున్నాయి. ఇదిగో ఇది గంట, ఇది seconds, అది minutes" ఇట్లా అని చెప్తున్నాడు గడియారం దాని mechanism. అంతా విన్నది. విన్న తర్వాత ఏమన్నదంటే, "ఇది ఇలా చూపించటానికి కాలం, కాలం ఇలా ఉన్నదని చూపిస్తున్నదా?"కాలం ఇంతే అని చూపిస్తున్నదా? ఏమీ జ్ఞానమే లేనిది అది కాలాన్ని ఎలా కొలవగలుగుతున్నది నాన్న? [నవ్వు] "చెప్పు" అన్నది. ఉమ్ స్టన్ అయినాడు ఈయన. "అయ్యి కాదమ్మా గడియారాలు అలా తయారు చేస్తారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది." "అవన్నీ సరే నాన్న సరే మూడు పైన తిరుగుతున్నాయి కదా అవి ఎలా తిరుగుతున్నాయి వాటంతట అవి?" "ఆ వాటంతట అవి తిరగటం లేదు లోపల రోజుల్లో వేళ వచ్చే ఎలక్ట్రానిక్ వాచెస్ కి కీ ఇవ్వాలి. ఒకటి కీ ఇస్తే అవి తిరుగుతాయన్నమాట." ఉమ్ "అంటే కీ ఇస్తే తిప్పేది ఏదో ఉందన్నమాట లోపల. అదేంటి దాని పేరు?" అన్నది. అంటే mechanism చెప్పాడు. చెప్పిన తర్వాత "కీ-కీ ఇవ్వటం అయిపోయింది అనుకో ఏమవుతుంది?" అన్నది. "గడియారం ఆగిపోతుందమ్మా" అన్నాడు. "ఓహో! అంటే లోపల ఉన్న పరమాత్మ జీవులన్నీ కీలుబొమ్మల్లా ఆడిస్తున్నాడన్నమాట. వాళ్ళు కాలబద్ధులే జీవిస్తున్నారన్నమాట." ఉమ్ "ఈ పన్నెండు గంటలు, పదకొండు గంటలు మన కోసమే కాని కాలాన్ని ఎవరు కొలవగలర్రా? ఇది అనంత కాల ప్రవాహం కదా! దాని పేరే ప్రవాహం కదా?" ఉమ్ అన్నాడు. ప్రతి అంటే తరం లో అమ్మ అందుబాటులో ఉండటం అందరికీ చాలా అదృష్టం. ఎందుకంటే- చాలా కావలసి-- చెప్తున్న చెప్తున్న ప్రతి విషయం ఆచరణ సాధ్యం. అలాగే అవసరం. అవసరం ఎంతో అటువంటి విషయాలు చెప్పారు అమ్మ. గురువు గారు అమ్మ ఇతర జ్ఞానుల గురించి- ఉమ్ గురువుల గురించి ప్రస్తావించే వారా? వారిని కలిసిన సందర్భాలు ఉన్నాయి? అంటే వారి వద్దకు వచ్చిన కొంతమంది వారు కాకుండా. ఉదాహరణకి సత్య సాయిబాబా వారు. ఉమ్ వాళ్ళిద్దరూ కలుసుకోలే ఎప్పుడు కలుసుకోలేదు? కలుసుకోలే అసలు కలుసుకో- అమ్మ గురించి బాబా వారు ఎప్పుడైనా అన్నారా? చాలా. సౌత్ ఇండియన్ కాంటీన్ ప్రారంభించినప్పుడు ప్రపంచంలో అందరూ అన్నదానం చేసే రోజుల్లో అన్నాన్ని వితరణ చేసింది జెల్లెళ్ళ మూడమ్మ. అందరికి అన్నం పెట్టాలి, అన్నం పెట్టిన తర్వాతే అధ్యాత్మలోకి తీసుకుని వెళ్లాలని చెప్పింది అమ్మ అని. ఆయనకి చాలా గౌరవం ఉండేది. అలాగే అమ్మకు కూడా బాబా గారంటే చాలా గౌరవం. ఎందుకంటే విప్లవమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఒక భావనని అతి సున్నితంగా అతి సరళంగా ప్రపంచం మొత్తం వ్యాపింపజేయగలిగిన మహాశక్తి స్వరూపమే బాబా అని ఆమె చెప్పారు. రెండు, ఆమె రమణాశ్రమానికి వెళ్ళింది. వెళ్ళింది. ఉమ్ రమణాశ్రమానికి వెళ్ళింది. ఇంకా అందరికీ ఆశ్చర్యం కలిగి ఆనందం కలిగించే ఒక విషయాన్ని నేను చెప్తా. ఉమ్ ఆశ్చర్యం ఎందుకంటే ఇంత అమ్మాయి ఎందుకు ఇలా choose చేసుకుంది? సంఘ బహిష్కృతుడైనటువంటి చలం ఇంటికి వెళ్ళి ఒళ్ళో పడుకోబెట్టుకుంది. అప్పటికి చలం వృద్ధుడు అయిపోయినాడు. ఉహు ఉమ్ సంఘం నన్ను వదిలిపెట్టినా అమ్మ నన్ను వదిలిపెట్టదని వలవల ఏడ్చాడు చలం. ఆ! అది ఇది చాలా గొప్ప-- ఇది చాలా మందికి తెలియదనుకుంటా తెలియదు చెప్పరు. ఇది సత్యం. ఆమె చరిత్రలో ఉంది. అది నిజం కూడా. అది nineteen seventy eight నాటి మాటే కదా ఇది. ఏమిటి గురువు గారు సందర్భం? ఆమె చూద్దామని వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళిందని నేను ఆలోచించా. చలం భావాలు అమ్మకి చాలా ఇష్టం. స్త్రీ liberation. స్త్రీ మనసుకు కూడా ఒక వ్యాయామం కావాలి. స్త్రీ శరీరాన్ని మాత్రమే స్త్రీ అంటే మనస్సు ఆయన ఉద్దేశం. వాక్యం నాకు చాలా-- నాతో చలం గారు మాట్లాడినప్పుడు కూడా స్త్రీ అంటే శరీరం అనుకోకండి స్త్రీ అంటే మనస్సు, స్త్రీ అంటే భావం, స్త్రీ అంటే స్పందన, స్త్రీ అంటే ప్రేమ. అది. అబ్బా! ఇవి అమ్మకి చాలా ఇష్టమైనవి. ఆయనను చూట్టానికి వెళ్ళింది. అమ్మ సాహి-- అమ్మ చలం సాహిత్యాన్ని చదివింది. ఉమ్ ఉమ్ రోజుల్లో చలం గారి పుస్తకాలు ఆడవాళ్ళు చదివే వాళ్ళు కాదు. దినుసు కింద పెట్టి చాటుగా చదువుకునే వాళ్ళు. అవును ఎందుకంటే కానీ అమ్మ నిర్భీతి, నిర్భయంగా వెళ్లి వచ్చింది. ఒళ్ళో తీసుకుంది. ఆయన ఏడ్చాడు. పసివాడివలె ఏడ్చాడు. ఉమ్ అంటే రమణాశ్రమానికి ఎట్లా వెళ్ళిందో అలాగే వెళ్ళింది. అట్లాగే కంచి వెళ్ళిందమ్మ. ఉహు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని చూసి వచ్చింది. చూట్టానికి వెళితే ఆయన లోపల అనుష్ఠానంలో ఉన్నారు. అయితే వాళ్ళు ఎత్తి సాంప్రదాయంలో వారు అమ్మని receive చేసుకోవటం లాంటివి ఉండవ్. చుట్టుపక్కల వాళ్ళు "అమ్మ ఆయన ఎంత సేపటి బయట రావటం లేదు. వెళ్ళిపోదాం" అంటే "వారి సంప్రదాయం ప్రకారం వారు వచ్చినప్పుడు మనం చూడాలి" అన్నదమ్మ. ఆహా ఆయన వచ్చారు. నుంచున్నారు. అమ్మ నుంచుంది. వాళ్ళేం మాట్లాడుకోలేదు. "అమ్మ వెళదాం" అన్నక్కడే. అయిపోయింది. అంటే ఒక అవతల సంప్రదాయం, అవతల ఉన్నటువంటి భావం, అవతల ఉన్నటువంటి వ్యక్తుల పట్ల అమ్మ చూపించినటువంటి ఆదరణ. ఉమ్ ఉమ్ ఇప్పుడు అమ్మ రమణాశ్రమానికి వెళ్ళిందంటే రమణ మహర్షి గొప్పవారని భక్తులు అంటారు. అవును అమ్మే వెళ్ళింది గనుక ఇంకా గొప్పవారని మళ్ళీ మన వాళ్ళే చెప్తారు. అమ్మ అసలేం అనుకోలా రమణాశ్రమం వెళ్ళొచ్చింది అంతే. వెళ్లాలని వెళ్లాలని స్ఫూర్తి కలిగి ఉంటుందో వెళ్ళా-- చూడాలని ఆయన జ్ఞానం-- జ్ఞానమూర్తి కదా ఆయన. అందువల్ల వెళ్ళింది. ఉమ్ ఇంకా ఇప్పుడు ఇందాక మనం అనుకున్న తెలుగు మాటలన్నీ ఇన్ని చెప్తే అమ్మ మహా జ్ఞాని అని అనుకుంటే అమ్మ ఇంకోటి ఏమన్నదో తెలుసా? "గీతాని దాటి నేనేం చెప్పాను నాన్న? చెప్తున్నవన్నీ భగవద్గీతలోవే కదరా" అంది. ఉమ్ "గీతాని దాటి నేనేం చెప్పాను?" అది రెండు రకాలు రెండు అర్థాలు. అవును అది చాలా అమ్మలో అంటే sense of humor ఉండటం అన్నది- ఉండాలి అది అందరికీ immediate అమ్మే మీరు చెప్పినట్టు- అమ్మే ఇందాక అనేక నేను పదాలు వెతుక్కుంటున్నాను. ఎటు తిప్పినా మళ్ళీ అమ్మ అని వస్తుంది. అమ్మ ఎందుకంటే అమ్మ ఎలా ఉండాలో అమ్మ అలా ఉన్నారు. అదే ఎలా ఉండాలని కోరికలు- కోరికలు ఎలా పోగొట్టుకోవాలమ్మా అని అడిగితే ఆమె జవాబు ఏమిటో తెలుసా? "నాన్న ఇది కావాలి అనుకోవటం కోరికే కదా?" అంటే "అవునమ్మా" అన్నాడు. "వద్దు అనుకోవటం కూడా కోరికే కదరా?" అబ్బా! ఎంత గొప్పగా ఉంది గురువు గారు. ఇది సందర్భం కూడా ఇది నాకు అనిపిస్తోంది. ఇది ఎన్నో విషయాలు ఇవాళ న-నాతో మొదలు పెట్టి ఎంతో మందికి తెలియాలి.అందుకే సంభాషణ జరుగుతోందని ఒక ఒక ఆనందం అంతే అవును ఎందుకంటే మీరు చెప్తున్నది ప్రతిదీ ఒక రెవలేషన్ ఎదురుకుతోంది అవును రెవలేషన్ లాగా రెవలేషన్ అది. గురువుగారు అమ్మ పూజలు చేసేవారా? లేదు. అమ్మ ఏం పూజలు చేసుకునేది కాదు. అంటే ఇది ఇదే ఒక విప్లవం కదా గురువు గారు. ఒక అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పుట్టి పూజలు చేస్తూ అని అనుష్టానాలు చేస్తారు అవన్నీ ఉంటాయి కొన్ని పద్ధతులు. అవి కాదు వీటికి అతీతంగా నా నా నా మతం నా ధర్మం నా ఆధ్యాత్మిక అంతా ప్రేమే అని చెప్పడమే ఒక పెద్ద విషయం. చెప్పటం ప్రేమని demonstrate చేయటం అది Irrespective of caste and colour ఉమ్ అందరినీ. అలాగే ఆమె చిన్నప్పుడు అంటే ఆమె ఇప్పుడిప్పుడే జిల్లేళ్ళమూడి అమ్మగా బయటకు వస్తున్న టైంలో రాజమ్మ గారిని ఒకామె కబురు పెట్టింది. నా దగ్గరికి వస్తే కొన్ని ఉపదేశాలు చెప్తాను, చేస్తాను ఆమెకు పనికొస్తాయి అని. అమ్మ చాలా వినయంగా వెళ్ళింది అక్కడికి. వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు జరిగినయి. తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియదు గానీ అన్నీ అయిపోయిన తర్వాత "నీకు ఉపదేశం ఇద్దాం అనుకున్నాను, నేను ఉపదేశం పొందాను, నన్ను ధన్యం చేశావమ్మ" అంది. ఆహా! అప్పటికి ఆవిడ చాలా advanced age లో ఉంది ఆమె ఉహు అమ్మ చిన్నది. అంటే దేశకాలాలకి అతీతమైన who transcend time and space మనం అంటాం కాలాతీత వ్యక్తులు అంటామే, అమ్మ నా దృష్టిలో కాలాతీత వ్యక్తి. ఇవాళ మనం ఇందాక చెప్పుకున్నవన్నీ ఒకనాటి సాంఘిక నేపథ్యం అమ్మ. ఉమ్ దానికి పరిపక్వత లేదు, ఇంత ఆలోచించగలిగిన శక్తి లేదు. తర్వాత సనాతనమైనటువంటి ఒక ఛాందస భావాలతో ఉన్నటువంటి ఒక సమాజంలో ఇంత rational గా వెళ్లటం అనేది అది ఒక అవతార లక్ష్యం. అవును లక్షణం కూడా. చాతా ఖచ్చితంగా గురువు గారు ఎందుకంటే అంటే చాంద్-- ప్రతి పద్ధతికి ఒక ఒక కారణం ఉంది అని వెతికి మనం justify చేసుకుంటున్న పరిస్థితులు కూడా చూశాం. అవును అసలు justify చేయొద్దు, ఖండించొద్దు, వద్దనొద్దు, కావాలనొద్దు అది కానీ ఏది అవసరమో దాని మీద దృష్టి పెట్టు అని చాటి చెప్పారమ్మ. అండ్ ఎలా ఉండాలో అలాగే ఉండు. అట్లా తను ఉన్నది. ఉమ్ నువ్వు ఎలా ఉండాలని ఇందాక అనుకున్నావ్? conditions పెడితే ఆవిడ వాటిని పాటించలేదు. తనకు తాను condition పెట్టుకోలేదు. She is too open. కానీ మీరు ఇందాక చెప్పిన మాట మాత్రం కదిలించేసింది గుండెని. ఉమ్ అమ్మ భర్తగారు ఉమ్ చాలా వారు అర్థం చేసుకోవడం వీరి స్వభావాన్ని వీరి అంటే జీవితానికి వీరికి ఉన్న లక్ష్యం ఏంటి? గమ్యం గమ్యం లేకపోయినా కూడా లక్ష్యం ఏంటి అని అని గ్రహించుకోవడం అన్నది. గ్రహించి ఆయన తన క-కళ్ళ ఎదురుగ్గా public గా ఎవరెవరో వచ్చి ఆవిడలో పడుకున్నప్పుడు ఆమె లాలించినప్పుడు వాళ్ళకి ముద్దులు పెట్టినప్పుడు బహుశా పురుషుడు యొక్క స్వభావమో దాన్ని అంగీకరించదు. అందుకని అమ్మని గురించి మాట్లాడాలని అనుకున్నప్పుడు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు గానీ నాకు ఆయన మహోన్నతమైన వ్యక్తిగా గోచరిస్తాడు. ఖచ్చితంగా గురువు గారు కదా అవును ఖచ్చితంగా ఇవాళ పురుషులు నేర్చుకోవాల్సింది కూడా అదే. అవును ఉమ్ అదే. స్త్రీని స్త్రీగా ఉండనివ్వడం. స్త్రీని స్త్రీగా ఉండనివ్వండి. ఆమె ఏం చేయదు. ఆమెన్-తనను తాను రక్షించుకోగలదు. మనం చెప్పేటువంటి మన నీతిబోధలన్నీ కూడా ఉమ్ స్త్రీకి తెలియదా? తన మానం ఆమె మానం మనం రక్షించడానికి మనం వచ్చామా? కాదు కదా. తన మానాన్ని, తన ప్రాణాన్ని, తన esteem ని తను దిగజార్చుకుంటుందా? కాదే. మరి అంత తల్లి అంటున్నాం మాతృదేవోభవ అంటున్నాం ఇది స్త్రీని ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని మనం మాట్లాడుతూ ఉంటాం మరి కాళ్లు చేతులు కట్టేస్తాం కట్టేస్తాం. కాళ్లు చేతులు కాదు కళ్ళు మూతి మొత్తం కట్టేసి ఊపిరి సలపకుండా చేస్తాం. ఇది ధర్మం కాదు. అట్లా ఉండి ఉంటే ధార్మికమైన మైత్రేయి గానీ, గార్గి గానీ వీళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు కాదు. మాతృస్వామ్య వ్యవస్థలో పరమాద్భుతమైనటువంటి వైదిక విజ్ఞానాన్ని జాతికి అందించిన వాళ్ళు స్త్రీమూర్తులు. దానిని ఆధునీకరించి అధునాతన కాలంలో ఇలా కూడా ఉండవచ్చు, మీరు గృహస్తాశ్రమంలో ఉండి కూడా మీరు ఎన్ని గొప్ప పనులు చేసుకోవచ్చు, ఎన్ని మంచి పనులు చేసుకోవచ్చు, అందరినీ ఆదరించవచ్చు, అందరినీ ప్రేమించవచ్చు అని తన జీవిత కాలంలో తను demonstrate చేసిందమ్మ. నిస్సందేహంగా. ఉమ్ అమ్మకి ఎప్పుడైనా కష్టం వచ్చిన సందర్భం మనకు తెలుసా? ఉన్నాయి. ఆమె కూడా చాలా కష్టాలు పడింది, చాలా పడింది. ముఖ్యంగా తొలినాళ్లలో సమాజం ఆమెను అర్థం చేసుకోలే. అర్థం కాలేదు ఎవరికీ. ఉమ్ చేసుకునే ప్రయత్నము చేయలేదు. అది it remained an enigma for a long time. I use the word enigma. ఎందుకంటే బ్రహ్మము పదార్థం తెలుస్తుండగానే బ్రహ్మం తెలియదు కదా. బ్రహ్మ పదార్థం అని అయితే చెప్పగలం. బ్రహ్మాన్ని గురించి చెప్పమంటే మీరు అనుభవిస్తే తప్ప చెప్పలేరు. కాబట్టి అమ్మ సమాజాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఆమెకు వచ్చినాయి. వచ్చినా తన లక్ష్యగమ్యాల నుంచి ఆమె వైదలగలేదు. తర్వాత చాలా చాలా ఇప్పుడు దివిసీమ ఉప్పెన వచ్చింది. రాజకీయ నాయకుల ఫోటోలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, అమ్మ వెళ్ళింది అక్కడికి. శవాల మధ్య నడుచుకుంటూ వెళ్లి అక్కడ బతికున్న వాళ్ళందరికీ అన్నం పెట్టి వచ్చింది. ఉహు ఉమ్ అబ్బా! జాలర్ల ఇళ్ళకి వెళ్ళింది. ఉమ్ అక్కడ వాళ్ళు వండుకున్నటువంటి అన్నం ఉంటుంది కదా జాలర్లు. ఈమె వెళ్తే "అమ్మా ఏం లేదు నీకు పెట్టటానికి" అన్నప్పుడు ముంతలో నుంచి మెతుకులు తీసుకుని నోట్లో వేసుకుని "చాలు నాన్న నాకు" అంది. అబ్బా! అంటే ఆమె బోధించలే, ఆచరించింది. ఉమ్ ఉమ్ And highest philosophy Highest philosophy
YouTube · audio

అమ్మ అవతార వైభవం ! Remembering Jillellamudi Amma on her Birth Centenary Celebrations

Home

అమ్మ అవతార వైభవం ! Remembering Jillellamudi Amma on her Birth Centenary Celebrations

Source: iDream Media on YouTube

0:00 / 36:35

More in this series

Remembering Jillellamudi Amma — Birth Centenary

2 episodes · 1 hr 8 min

  1. 28 min 1

    అమ్మ వాత్సల్యం... | Remembering Jillellamudi Amma on her Birth Centenary Celebrations

  2. 36 min 2

    అమ్మ అవతార వైభవం ! Remembering Jillellamudi Amma on her Birth Centenary Celebrations

    Now playing