Skip to content
Transcript తెలుగు
అయ్యో అన్నది లేదు, బాధ లేదు, కష్టం లేదు, కళ్ళ వెంబడి గిర్రున నీరు తిరిగిన సందర్భం లేదు. నిశ్చలమైన, నిరామయమైన, నికేతనమైనటువంటి స్థాయిలో నిలబడ్డారు. అయిపోయింది. దానికి కట్టు కట్టారు. కట్టు కడితే అది మళ్ళీ లోపల నుంచి నెమ్మదిగా రసి కారటం మొదలు పెట్టింది. రక్తం రావటం మొదలు పెట్టింది. అప్పుడు భక్తులందరూ వారిని ఏమన్నారంటే, "భగవాన్ మేము ఏదో సమస్యలతో, రోగాలతో, రాగాలతో, విరాగాలతో మీ దగ్గరికి వస్తున్నాం. మా సమస్యలన్నీ తీరిపోతున్నాయి, మా కష్టాలు తీరిపోతున్నాయి, మాకు ఆనందము, లాభము కలుగుతున్నది. మీరు కూడా దానిని పో-పోగొట్టుకోవచ్చు కదా?" అని అడిగారు. అప్పుడు భగవాన్ నెమ్మదిగా "మీ అందరినీ నేను రమ్మనమని పిలిచానా? మీరందరూ వచ్చారు ఇక్కడికి. మీలో ఒక్కరినైనా ఇక ఆశ్రమం నుంచి వెళ్ళండి అని అన్నానా? మీరు ఉన్నంత కాలం ఉంటున్నారు, మీ పని కాగానే వెళ్ళిపోతున్నారు. వారు కూడా అలాగే వచ్చారు. వారి పని వీరిని తీసుకెళ్లటమైతే తీసుకెళ్లేదాకా వారిని ఉండనివ్వండి. వారితో మనకేం పని?" అన్నారు. మళ్ళీ భక్తులందరూ కూడా కాస్త గట్టిగా "భగవాన్ మీరు ఇలా అధ్యాత్మ చెప్పి తప్పించుకోకూడదు. మీ బాధ మేము చూడలేకపోతున్నాం. ఒక్కసారి సంకల్పించుకోండి. అది ఎండి మాడిపోతుంది. మీ నుంచి దూరం అయిపోతుంది. భగవాన్ ని మళ్ళీ ఆనందంగా, ఏమి ఆనందంగా లేదా ఇప్పుడు?" అని అంటూ "మీరందరూ సంకల్పించుకోండి, సంకల్పించుకోండి అంటున్నారే! మీ అందరికీ మనసుందప్ప, మీరు సంకల్పించుకోగలరు. ఇక్కడ మనసే లేదే! దేనితో సంకల్పించను?" అన్నారు. ఒక పసిపాపలాగా. అంటే జ్ఞాని అయినటువంటి వాడు, ఉన్మత్తుడైనటువంటి వాడు, పూర్ణుడైనటువంటి వాడు దేనితో సంకల్పించను? ఇక్కడ మనసే లేదే అన్నారు భగవాన్. ఇట్లా మనకు కొన్ని ఉదాహరణలు, అధ్యాత్మ చరిత్రలో కొందరు సత్యపురుషులున్నారు. వారిలో శ్యామాచరణ లాహిరి అని ఉన్నారు. శ్యామాచరణ లాహిరి యోగ ముద్రలో అద్భుతమైనటువంటి వ్యక్తి. ఒక సాయంకాలం పూట ఆయన దగ్గరికి ఒక డాక్టర్ వచ్చారు. శ్యామాచరణ లాహిరి తమ చెయ్యి డాక్టర్ కి చూపిస్తూ, చెయ్యి పట్టుకుని నాడి చూసి "మేము జీవించి ఉన్నామా, మేము మరణించామా?" చెప్పమని అడిగారు. నాడి కొట్టుకోవటంలా. జీరో లెవెల్ లో ఉందది. కానీ ఆయన హాయిగా మాట్లాడుతున్నారు, అందరితో నవ్వుతూ. పలకరిస్తున్నారు, సమాధానాలు చెప్తున్నారు, మహా చైతన్యంతో ఉన్నారు. కాసేపు అయిన తర్వాత చెయ్యి వెనక్కి తీసుకుని డాక్టర్ ని అడిగారు, "మేమున్నామా, లేదా?" అది చెప్పమన్నారు. "అయ్యా! ఇదేదో ఆశ్చర్యంగా ఉంది. మెడికల్ సైన్సెస్ కి అందకుండా ఉన్నది. నాడి ఎక్కడా కొట్టుకోవటం లేదు, ఆడటం లేదు. కానీ మీరు కార్యకలాపాలన్నీ అద్భుతంగా చేస్తున్నారు, మామూలుగా కంటే. ఇదెట్లా సాధ్యం?" అని అడిగారు. చిరునవ్వు నవ్వి వదిలేశారు ఆయన. సదాశివ బ్రహ్మేంద్రుడు మరొక వ్యక్తి. మహాత్ముడు. ఆయన ఒక పొలంలో నుంచి వెళ్ళిపోతున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఒక పొలంలో ఒక గడ్డి వామి దగ్గర ఒక స్త్రీ నుంచుని ఉంది. స్త్రీ భర్త చాలా దూరంగా ఉన్నాడు. ఎవరో తన భార్యను సమీపిస్తున్నాడు అని అనుకుని వెనక నుంచి వచ్చి సదాశివ బ్రహ్మేంద్రుడి చెయ్యి నరికేశాడు. కానీ సదాశివ బ్రహ్మేంద్రుడు నడుచుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వారి వెనక గాలిలో చెయ్యి నడుస్తూ వెళ్తున్నది. పడిపోయింది ఓచోట. ఆశ్చర్యపోయినాడు ఇతను. చెయ్యి తీసుకెళ్ళి సదాశివ బ్రహ్మేంద్రుడి చేతికిచ్చాడు. "ఓహో!" అంటూ మళ్ళీ దానిని చేతికి అతికించుకుని భుజానికి నడిచి వెళ్ళిపోయినారు. మరి కత్తితో నరికితే బాధ లేదా అంటే వారు చిరునవ్వు నవ్వలేదు వారి దారిన వారు వెళ్లారు. ఇదిగో భగవాన్ రమణ మహర్షి ఆపరేషన్ లేకుండా వారు సార్కోమాని ఎదుర్కొన్నారు. అలాగే వీళ్ళంతా కూడా ఎట్లా దీనిని సాధించారు? దీనికి ఏదైనా ఒక మార్గం ఉన్నదా? అంటే యోగ మార్గంలో, యోగశాస్త్రంలో కేవల కుంభక యోగము అని ఒకటుంది. కుంభకము మనస్సు, ప్రాణము, చైతన్యము, శక్తి అన్నీ హృదయంలో లీనమైనప్పుడు, అది ఆత్మగా భావిస్తున్నప్పుడు, భాసిస్తున్నప్పుడు, ప్రకాశమానం చెందుతూ ఉన్నప్పుడు, బాహ్య వస్తువులు ఏవీ కూడా వారిని బాధించవు. వారిని కట్టిపడేయవు. వారు సర్వ స్వతంత్రులై ఆత్మానంద స్థితిలో హాయిగా ఉంటారు. ఇది సత్యం. సత్యాన్ని ఎవరైతే గ్రహించుకొని ఉంటారో అటువంటి పూర్ణ ప్రజ్ఞామూర్తులంతా కూడా ప్రపంచంలో ఉన్నారు. ఇది భారతీయ యోగశాస్త్రం మనకు చెప్తూ ఉన్నది. ఇక్కడ చిత్తవృత్తులు నిరోధించబడిన యోగంతో పాటు, శుద్ధమైన మనసుతో పాటు, కేవల కుంభక యోగంతో పాటు, మనోనాశనం కూడా జరిగింది. మనోనాశనం జరగటం అంటే మనస్సు మరల పుట్టదు. మళ్ళీ దానికి ఆలోచన లేదు, కార్యకలాపాలు లేవు. ప్రాపంచిక కార్యకలాపాలు చేయటానికి కాసేపు మనస్సును బయటకు తెస్తారు.మాట్లాడే కాసేపు మాట్లాడతారు తరువాత గూట్లో పెట్టుకుంటారు. మనం గూట్లో పెట్టుకోవటం మళ్ళీ అలవాటు చేసుకోవాలి. సాధన చేత ఇది అసాధ్యం కాదు సాధ్యమే కాకపోతే దానికి పటాటోపమైన ఆడంబర పూరితమైనటువంటి రకమైన వేషభాషలు వాటికి అక్కర్లేదు. మౌనాన్ని ఆశ్రయించి ఉండవలసిన రీతిలో గనుక ఆత్మ నిష్ఠులై ఉండగలిగినట్లయితే ఇది ప్రధానం. భగవాన్ అదే చెప్తున్నారు మనసుతో ప్రపంచాన్ని చూస్తున్నంత కాలం మనసుతో సంకల్పాలు చేస్తున్నంత కాలం మనసుతో జగత్ వ్యాపారాన్ని నడిపినంత కాలం మనసే ప్రధానంగా సాగుతున్నంత కాలం మానవుడికి ముక్తి లేదు. దానికి అతీతమైనటువంటి ఒకానొక అమనస్క స్థాయిలో మనం నాశనం చేసుకోగలిగినట్లయితే వాడు భగవాన్ అవుతున్నాడు. భగవాన్ శబ్దం భగవాన్ రమణులకి సంపూర్ణంగా అట్లాగే 2003 సమకాలీనంగా సత్యసాయి భగవానుడు బెంగుళూరులో వారికి hip joint విరిగిపోయినప్పుడు వైద్య లోకం ఆశ్చర్యపడేట్టుగా operation జరిగినంత సేపు వారు మెలకువగానే ఉన్నట్లున్నారు. వారిని ఏదీ బాధించలేదు operation అయిపోయిన మరుక్షణం వారు గదిలో తిరగటం మొదలు పెట్టారు. ఇది ఒక అపూర్వమైన అటువంటిది వైద్య శాస్త్రానికి వైద్య భావన కి అందని అటువంటిది. కాస్త వెనక్కి తిరిగి చూస్తే ఇది ఎలా వారు ఎలా ఉండగలిగారు? ఇది ఎలా జరిగింది? అని ప్రశ్న వేసుకున్నప్పుడు భగవాన్ కి క్షణంలో కేవల కుంభక యోగమే అక్కరకు వచ్చింది. అంటే మనసుని శరీరం నుంచి alienate చేశారు దూరం పెట్టేశారు. కనుక శరీరాన్ని కడగా పెడగా ఒక కట్టేగా ఒక జడంగా భావించి అది నేను కాదు అన్నటువంటి భావనలో ఉన్న కారణంగా శరీరానికి జరిగిన దానికి ఆయనకి ప్రమేయం లేకుండా ఉన్నారు. ఇటువంటి పరమాద్భుతమైన కేవల కుంభక యోగం సాధించాలి అంటే ఆత్మ నిష్ఠ లో ఉండాలి. ఆత్మ నిష్ఠ అన్నా బ్రహ్మ నిష్ఠ అన్నా నిజానికి ఒకటే. మనో నిష్ఠ, యోగ నిష్ఠ దాటి ఆత్మ నిష్ఠ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రపంచాన్ని చెడుగానూ భావించదు మంచిగానూ చెప్పదు. నిజానికి అది మంచిది కాదు అది చెడ్డది కాదు అది అంతే. మనసు పరిపక్వం చెందని మనసుతో లోకాన్ని చూస్తున్నప్పుడు ప్రతి క్షణము అది విశ్లేషిస్తుంటుంది. వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు, వీడు గొప్పవాడు, వీడు అల్పుడు, వీడు పామరుడు, వీడు పండితుడు, వీడు జ్ఞాని వాడు అజ్ఞాని, వీడు ఫలానా మతస్తుడు, కులస్తుడు, వీడు అది కాదు. ఆత్మ నిష్ఠ లో ఉన్నటువంటి వాడికి సమస్తము బ్రహ్మిమయంగా ఆత్మగా ఒక ఆనందము వికాసమానం చెందినటువంటి స్థితిలో తాను దేనిని పొంది ఆత్మానందాన్ని పొంది ఆత్మానందం తన శ్వాసగా నిశ్వాసగా ఉచ్వాసగా మార్చుకున్నాడో అటువంటి బ్రహ్మ నిష్ఠ లో ఉండటమే ఆత్మ నిష్ఠ.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -43

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -43

Source: TFC Spiritual on YouTube

0:00 / 10:43

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

    Now playing
  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77