No transcript for this section.
Transcript begins at 0:00.
అందరికీ నమస్కారం! రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః అడుగడుగునా ఆధ్యాత్మిక వైభవం అణువణువు తారక మంత్రం ముక్కోటి దేవతలు ఎదురుచూస్తున్న శుభముహూర్తం మరో సత్సంకల్ప పనికి అయోధ్యపురం వేదిక అవుతోంది. శ్రీరామచంద్రమూర్తి బాలరాముడిగా భక్తకోటిని కటాక్షించే సమయం మరికొద్ది ఘడియల్లోనే ఆసన్నం కాబోతోంది. రామయ్య జీవితంలో ప్రతి ఘట్టాన్ని చూసిన సరయు నది ఈ కమనీయ రమణీయ వేడుకకు సాక్షిగా నిలవ బోతోంది. అయోధ్యలోని సరయు నది అందరికీ తెలిసిన కొన్ని విశేషాలు గంగ అంత పవిత్రమైనది అన్నది మనందరి నమ్మకం. శ్రీహరి ఎడమ పాదం నుంచి సరయు నది ఉద్భవించిందని చెప్పి విష్ణుపురాణం చెబుతోంది. రాముడు స్నానం చేయడంతో మరింత పవిత్రతను సంతరించుకుందని చెప్పి ఆ భాగవతులు చెబుతారు. శ్రీరామచంద్రుడి జీవితానికి ప్రత్యక్ష సాక్షి సరయు నది. శ్రీరాముడి జీవితంలో ప్రతి ఘట్టాన్ని చూసిన ఈ నది రాముడి అవతార పరిసమాప్తి చేసింది కూడా ఈ నదిలోనే అని చెప్పి మనకు తెలుసు. సరయు నది తీరంలో ఏవేవి ఉన్నాయి ఏం జరుగుతోంది సాక్షి టీం ప్రస్తుతం మీ అందరికీ కళ్ళకు కట్టినట్టుగా ఎన్నో విశేషాలు అందించబోతున్నారు. జరుగుతున్న ఈ మహత్తరమైన ఘట్టాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖులు అందరికీ సుపరిచితులు ప్రొఫెసర్ వి.ఎస్.ఆర్. మూర్తి గారు సాక్షి స్టూడియోస్ లో ఉన్నారు. వారు శాస్త్రవేత్తగా వారి ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా చాలా కాలం కొనసాగి ఎన్నో పురాణ ఇతిహాసాలకు వ్యాఖ్యానం రాశారు. ఉపనిషత్తుల సారాంశాన్ని కూడా అందరికీ అర్థం అయ్యేలా రాసి చూపించారు. గురువు గారు మీకు స్వాగతం నమస్కారం అండి నమస్కారం ప్రపంచం అంతా కూడా రామ మంత్రం తారక మంత్రం అని అనుకుంటున్నాం. ఈ ఘట్టాన్ని చూసి మీకేం అనిపిస్తోంది గురువు గారు? ఎందుకంటే పురాణ ఇతిహాసాల్ని మీరు చాలా దగ్గరగా అన్ని విశేషాలన్నీ గమనించి అర్థం చేసుకున్నారు కాబట్టి. ఇవాళ ఒళ్ళు పులకరిస్తున్నదమ్మ. దేహమంతా పులకాంకుర ప్రకరం అవుతున్నది. ఎందుకంటే రామ అన్నటువంటి ఒక శబ్దమే రమయతీతి రామః అది హాయినిచ్చే శబ్దం రామ శబ్దం. కాబట్టి ఇవాళ జరుగుత ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్లీ అనేక ఒడుదుడుకులు ఎదుర్కొని దాటి జయించి సంకల్ప దీక్షకి సాకార స్వరూపాన్ని సంతరించుకుంటున్నటువంటి ఈ మధుర క్షణం భారతీయ ఆత్మ యొక్క దివ్య స్పందనగా నేను భావిస్తున్నా. గురువు గారు రామ శబ్దం అని అనుకుంటున్నాం కాబట్టి రామ అంటే అర్థం ఏమిటి అసలు? రామ దీని ఉత్పత్తి ఏమిటంటే ఉమ్ శివకేశవులకు అభేద అద్వితీయ అద్వైత రమణీయ మనోజ్ఞ భావనా భూమికి అని ఈ ప్రపంచానికి చెప్పాలని అనుకున్నది ఈ దేశం ఆహా! ఉమ్ అనుకున్నప్పుడు శివ కేశవులు రెండు మతాలకు వైష్ణవ మతానికి శైవ మతానికి ప్రతీకలుగా నిలబడినప్పుడు ఆ రెండు వేరు కాదు రెండుగా కనిపిస్తున్న ఒకటే ఉమ్ అని చెప్పటానికి అష్టాక్షరి మంత్రం అయినటువంటి నారాయణ లో రెండవ అక్షరమైన రా ఉమ్ నమశ్శివాయ లో రెండవదైన మ రెండు కలిపితే రామ అనే శబ్దం ఏర్పడింది. అంతేకా ఇది ఒకటి రెండవది రామ అంటే రకార అకార మకారాలు ఉమ్ రకారము అగ్ని బీజం మకారము చంద్రబీజం ఈ సూర్య చంద్ర బీజాలు రెండు కూడా దాని యందు ఉన్నాయి కాబట్టి రకారము అగ్ని బీజమై మకారము చంద్రబీజమై రామ శబ్దం ఏర్పడింది. పాప తాప శాపాలు మూడింటి వల్ల మానవుడు దేహం తీసుకుని వస్తాడు ఆహా! మనందరం అలా వచ్చాం ఉమ్ కాబట్టి ఈ పాపాన్ని తాపాన్ని శాపాన్ని నశింపజేయగలిగినది ఏది అంటే కేవలం రామ శబ్దం మాత్రమే. అందుకనే రమయతీతి రామః అని ఏర్పడింది. ఈ రామ శబ్దం నిజానికి యోగశాస్త్రంలో ప్రత్యేకత ఏమిటంటే ఆ ప్రాణాయామం ప్రత్యేకంగా చెప్తాం అంటే గాలి తీసుకోవటం గాలి కుంభకం చేయటం గాలిని వదిలిపెట్టడం. మనం ఏదన్నా మాట్లాడాలి అంటే రెండు పెదవులు విచ్చుకోవాలి రా అంటే రెండు పెదవులు విచ్చుకున్నాయి అంటే గాలిని తీసుకున్నాం కదా అవును నిలబెట్టుకున్నాం మళ్లీ మా అన్నాం మా రెండు పెదవులు మూసుకుపోయినాయి కాబట్టి రామ రామ రామ అంటూ ఉంటే ప్రాణాయామం అనాహత నాదంగా సాగిపోతూ ఉంటుంది గనుక నిత్య ప్రాణాయామానికి ఇది పరమార్థమైనటువంటి సంకేతం అది రామ శబ్దం. ఇటు యోగ శాస్త్రము అటు భోగ శాస్త్రము ఉమ్ ఇటు ఆనంద తారకమైన స్థితి దేహాతీతమైన స్థితి దేహంలో కలిగేటువంటి హాయి ఇవన్నీ కూడా కలగాలంటే దేహానికి సుఖం కావాలి రామకథ సుఖం వినటం అవును రాముడి యొక్క చరిత్రను తెలుసుకున్నందువల్ల మనస్సు సంతోషాన్ని పొందుతుంది ఉమ్ హృదయంలో ఆనందం ప్రగులుతుంది పెరుగుతుంది కాబట్టి రామ శబ్దం పూర్ణ శబ్దం ఉదాత్తమైన శబ్దం రామ అంటే రాముడు రామ అంటే సీత అంతే. చాలా గొప్పగా వివరించారు గురువు గారు ఉమ్ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది ఈరోజు ఉమ్ బాలకాండకు ఉండే విశిష్టత ఏమిటి గురువు గారు? రాముడు రావటమే దాని విశిష్టత ఉమ్ అయితే దానికి ఇంకా చాలా అంశాలు చాలా ఉన్నాయి ఉమ్ ఈ రాముడు ఎలా వచ్చాడు అసలు ఎందుకు వచ్చాడు? బాలరాముడై ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఉమ్ వచ్చిన అయోధ్యలో ఎందుకు పుట్టాడు? అందునా దశరథుడి యందే ఎందుకు ప్రవేశించాడు కొడుకుగా? ఉమ్ అంటే నిజానికి శైవమతం ఇటు లంకానగరంలో రావణ బ్రహ్మ మహా జ్ఞాని పండితుడు కానీ వీరశైవుడు ఉమ్ వైష్ణవ మూర్తి కావాలి ఇక్కడ. ఈ మత సంఘర్షణ జరుగుతున్నప్పుడు నారదాది మునులందరూ కూడా వెళ్లి మహావిష్ణువుని అడిగారు. అయ్యా అధర్మం జరుగుతోంది వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి యజ్ఞ కుండాలన్నీ పాడైపోతున్నాయి ఉమ్ ఎవరూ తపస్సు చేసుకోవటం చేయనివ్వటం లేదు పరిష్కారం ఏమిటంటే అప్పుడు ఆయన చెప్పాడు నేను శ్రీరామచంద్ర నామంతో నేను ప్రపంచంలోకి వస్తా దశరథ మహారాజు ఇంట పుడత.దశ యుగాల వరకూ నామం రామనామం వినపడేటట్టుగా ఆ నామంతో వస్తా దశకంధరుడి కుత్తుకలు ఉత్తరించటానికి వస్తారు అంతా దశ అది ఆనాటి త్రేతాయుగం చేసుకున్న అద్భుతమైన దశ ఉమ్ ఆ దశలో ఈ దశరథుడు దశ యుగాలు ఈ నామాలు వీటితో రాముడు వచ్చాడు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు పాయస ప్రవేశం చేసి వచ్చాడు అంటే పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంలో నుంచే జీవుడు పుడతాడు దేవుడు వస్తాడు దేవుడు అంటూ రాడు వచ్చి దేవుడవుతాడు ఎలా అవుతాడు తన కర్మల చేత ఉనికి చేత అస్తిత్వం చేత వ్యక్తిత్వం చేత ధర్మాచరణం చేత ఆ దైవత్వాన్ని సిద్ధింపజేసుకుంటాడు అంటే రాముడు అవతార పురుషుడా? ఉమ్ ఆ మానవ పురుషోత్తముడా? ఉమ్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి గురువుగారు మూడు రకాలమ్మా పురాణ పురుషోత్తముడు ఉమ్ పురాణ అంటే పాతకథ అని ఉమ్ అర్థం అంటే సనాతనమైన వైదికమైన ఆర్షమైన ఒక భారతీయ ధర్మం ఒక ఆకారం తీసుకోవాలని అనిపించింది ధర్మం అధర్మం అవుతున్న వేళ ఉమ్ కాబట్టి ఆయన అవతారమూర్తిగా వచ్చాడు ఆ అవతారమూర్తిగా ఎలా వచ్చాడు అంశావతారంగా వచ్చాడు పూర్ణావతారంగా పరిఢవిల్లాడు ప్రపంచానికి ఆవిష్కృత అవుతున్నాడు అంటే ఒక చిన్న బీజం ఒక విత్తనం ఒక మర్రి చెట్టు ఎట్లా అవుతున్నదో రాముడు కూడా అలాగే వచ్చాడు భాస్కర్ రామాయణంలో ఓ మాట ఉంది "అమరేంద్రాసకు పూర్ణచంద్రుడు దితితుండైనట్లు నారాయణాంశమున పుట్టె మదాంధ రావణ శిరస్ సంఘాత సంచేదన క్రమణోద్దాముడు రాముడు ఆ గరిట కున్ కౌసల్య కున్" ఉహు ఆయన ఆ వచ్చినటువంటి పర్పస్ ఏమిటి లక్ష్యం ఏమిటి గమ్యం ఏమిటంటే లక్ష్యం ఉదాత్తమైనది గమ్యం చేరవలసినది మధ్యలో గమనము ధర్మ గమనం ధర్మ గమనం ధర్మ గమనం ఆ ధర్మ గమనం మానవాళికి చాటి చెప్పటానికి మానవాళికి చాటి చెప్పటానికి రాముడే వచ్చాడు ఇలా వచ్చి ఆ తాను ఒక మానవుడిగా ఉన్నప్పుడు ఒక సామాన్య మానవుడు కానీ మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడు గాని ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి సమస్యల తోరణాన్ని ఛేదించుకుంటూ తనను తాను నిలబెట్టుకుంటూ ధర్మాన్ని నిలబెడుతూ ధర్మాన్ని పరిపోషిస్తూ పాలిస్తూ ఆలిస్తూ లాలిస్తూ అప్పుడప్పుడు అదలిస్తూ రాముడు పూర్ణత్వాన్ని సాధించుకున్నాడు కనుక ఆయన పూర్ణ మానవుడు పూర్ణ మానవుడు పురుషోత్తముడు ఉదాత్త మానవుడు అన్ని విషయాల్లోనూ గంభీరమైనటువంటి వ్యక్తిత్వం ఉంది గనుక మర్యాద పురుషోత్తముడు అది గురువు గారు ఎప్పుడూ కూడా సీతా సమేత రామచంద్రన్నే మనం స్మరించుకుంటూ ఉంటాం ఉమ్ మరి బాలరాముడు అంటే సీతమ్మవారు ఎక్కడున్నట్టు? సీతమ్మ వారు బాలరాముడు రావటానికి ముందే జనకుడి ఇంట ప్రవేశించింది అక్కడ సీత అంటే నాగేటి చాలుకి నాగలి దున్నుతున్నప్పుడు ఒక చాలు ఒక గీత ఏర్పడుతుంది అవును ఆ నాగేటి చాలు పేరే సీత ఉహు కనుక సీత అంటే ప్రత్యేకమైన అర్థం ఏం లేదు మనందరికీ అమ్మవారిని అలవాటైంది అవును నాగేటి చాలు వలన ఆవిడ ఉనికి తెలిసింది అప్పటికే నిక్షిప్తమైనటువంటి ఒక మహా త్రిపురసుందరి దేవి యొక్క శక్తి జనకుడి వాకిట ఉన్నది జనకుడి వాకిట ఎందుకు ఉన్నది అంటే రాజర్షి ఆయన జ్ఞాని మహా జ్ఞాని దాని విలువ తెలిసిన వాడు గనుక పోషించగలిగిన వాడు గనుక పెంచగలిగిన వాడు గనుక అన్ని విధాలా ఆమె అక్కడ రాముడి కంటే ముందు వచ్చింది వివాహం తర్వాత సీతా సమేత అయినాడు రాముడు అప్పటిదాకా మామూలు దశరథ ఆత్మజుడుగా ఉన్నాడు నేటి అయోధ్యపురిని చూస్తున్నారు గురువు గారు ఉమ్ మనకి పురాణాల్లో అయోధ్యా నగరం గురించి ఏం చెప్పబడింది? అయోధ్య నగరం ఒక అద్భుతమైన నగరం అసలు అయోధ్య అంటే ఏమిటి ముందు ఉమ్ యుద్ధం ఎరగనిది అయోధ్య ఆ ఎవరైనా దండయాత్ర చేయటానికి వస్తే పది రథాలను ఏకకాలంలో నడపగలిగిన శక్తిమంతుడు ఎవరంటే దశరథుడు దశ రథుడు దశ రథుడు ఇది ఒక అర్థం రెండవది మనలో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఈ పది ఇంద్రియాలను కూడా శాసించగలిగిన శక్తి సంపన్నుడు తపో సంపన్నుడు ఎవరంటే మళ్ళీ దశరథుడే కాబట్టి ఉత్తమ మానవుడు ఆయన కాకపోతే ఒక అవతార మూర్తికి తండ్రి ఎలా అవుతాడు మళ్ళీ ఈయన ఎవరు ఈయన పూర్వ వృత్తాంతం ఏమిటంటే అదితి కశ్యపులే దశరథ మహారాజును కౌసల్య దేవి కదమ్మా గురువు గారు సరయు నది తీరానికి వెళ్ళబోతున్నాం మనం ఉమ్ సాక్షి ప్రతినిధి హిమబిందు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు సరయు నది తీరంలో అక్కడ రెండు కళ్ళు చాలవు వెయ్యి కళ్ళు కూడా చాలవన్నట్టు అంగరంగ వైభవంగా ముస్తాబయింది ఆ ప్రాంతం అంతా కూడా ఆ బిందు ప్రస్తుతం వేడుకలు ఏ విధంగా కొనసాగుతున్నాయి రేపటి ఘట్టానికి కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? [భక్తి సంగీతం] స్వప్న ప్రస్తుతం నేనున్నది సరయు నది తీరమే సరయు నదికి శ్రీరాముడి చరిత్రకి అవినాభావ సంబంధం ఉందని చెప్తారు శ్రీరాముడి జననం నుంచి పట్టాభిషేకం నుంచి అదేవిధంగా శ్రీరాముని అవతారం చాలించడం వరకు అన్నిటికీ సరయు నది ప్రత్యక్ష సాక్షి అని చెప్తారు సో మనం ఎవరమూ శ్రీరాముని దర్శించలేదు కానీ ఈ సరయు నది మాత్రం రామాయణానికి అదేవిధంగా శ్రీరాముని చరితకి రామకథకి ప్రత్యక్ష సాక్షిగా చెప్తారు అటువంటి సరయు నదిని తాకినా సరయు నది జలాలని తలపైన వేసుకున్నా పుణ్యం అని భక్తులంతా కూడా భావిస్తూ ఉంటారు ఒకవైపున ఆ శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉండగానే ఇక్కడ సరయు నది అంతా కూడా భక్తులతో కిటకిటలాడి పోతోందని మనం చెప్పుకోవచ్చు నా వెనకాల మీకు కనిపిస్తున్నది అతి పెద్ద స్క్రీన్ ఎల్ఈడి స్క్రీన్ మీకు కనబడుతూ ఉంటుంటుంది ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధానంగా ఇక్కడ మనకి ఈ ఎల్ఈడి స్క్రీన్ పైన కనబడుతున్నారు రేపు ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం మొత్తాన్ని కూడా ఈ సరయు నది తీర నుంచి ఈ ఎల్ఈడి స్క్రీన్లో లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు అందరూ ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడలేరు కాబట్టి అవును గర్భగుడి లోపల ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది కాబట్టి ఈ ఎల్ఈడి స్క్రీన్ పైన మొత్తం ఈ సరయు నది తీరంలో కూర్చుని చూడటానికి తగిన ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు మనందరికీ తెలిసిందే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకన్ల నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకన్ల వరకు ఎనభై నాలుగు సెకన్ల పాటు ఏదైతే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తారో ఆ ఎనభై నాలుగు సెకన్లు చాలా కీలకంగా చెప్తున్నారు ఆ టైంలోనే ఏదైతే క్రతువుని మొదలు పెట్టారో ఆ మహా క్రతువు ప్రాణ ప్రతిష్ఠ తోటి పూర్తి కాబోతోంది స్వప్నRight హిమబిందు ధన్యవాదాలు మీరు నిజంగా మీ జన్మ ధన్యం మీరు ప్రస్తుతం జరుగుతున్న అతి అద్భుతమైన ఘట్టాన్ని స్వయంగా వీక్షిస్తున్నారు అలా వెళ్లి చూడలేని వారికి ప్రవేశం లేని వారికి of course TV channels లో ప్రసార మాధ్యమాల్లో కూడా అలాగే మనోదర్శనం చేసుకునే ఆ అవకాశం కూడా ఉంది గురువు గారు అవును సరయు నది ఈ ఈ ప్రస్తుతం ముస్తాబైన ఆ తీరం అంతా చూస్తే ఏమనిపిస్తోంది గురువు గారు మీకు? ఎక్కడో ఉత్తరాఖండ్ లో జన్మ ఎత్తి శారద శారదా నదిగా ప్రారంభమై శారదా నది యొక్క ఉపనది అయినటువంటి సరయు నది సర్జు అంటారు వాళ్ళు ఉమ్ అది సరయు ఉమ్ ఈ సరయు నది శ్రీరామ కథకి ఒక నాగరికతా ప్రవాహం అవును చూడండి అది శారదా ప్రవాహం కదా శారదా నది అంటే శారదా సంస్కృతి నాగరికత ధన-- ధైర్యం ఆనందం సంతోషం పరవశం ఇవన్నీ కలిస్తే శారదా నది దానిలో నుంచి పాయగా వచ్చినటువంటి ఉపనదే. ఈ సరయు నదిలో ఇవన్నీ చూస్తున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి రాముడు పునః సంకల్ప శక్తి చేత ఈ దేశంలో రాబోతున్నాడా? ఎందుకు ఈ సంకల్పం జరగాలి అంటే అతలాకుతలం అయిపోతున్నటువంటి మానవ జీవితాలు ఉమ్ మానవ జీవితంలో ఏర్పడుతున్నటువంటి అనేక అశాభంగాలు ఆదర్శ భంగాలు వీటన్నింటినీ కూడా పునః స్మరించుకొని మళ్ళీ ఆ రాముడి వలె జీవిస్తే ఎంత బాగుంటుంది. అసలు ఒక ప్రయత్నమైనా చేద్దాం రాముడు ప్రవర్తించాడు వేరు మనం కూడా అలా ఉండగలిగితే ఏమవుతుంది అని తెలుసుకోవటానికి ఇది సంకల్పము నిజానికి భారతీయుల యొక్క ప్రకల్పము సంకల్పము ఆలోచన ప్రకల్పము ఆచరణ ఆచరణ అదండీ చాలా గొప్పగా ఉంది గురువు గారు అడుగడుగునా ఆధ్యాత్మిక వైభవంతో శోభతో కళకళలాడిపోతోంది అయోధ్యపురం ఆ పంచభూతాలలో పృథ్వీ క్షేత్రంగా భావించే అయోధ్యపురం విశేషాలు తెలుసుకుంటున్నాం మనతో పాటు ప్రొఫెసర్ వి.ఎస్.ఆర్. మూర్తి గారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రచయిత సాహితీమూర్తి గురువర్యులు ఉన్నారు ఆ ప్రొఫెసర్ వి.ఎస్.ఆర్. మూర్తి గారు అయోధ్య అంటే మీరన్నారు యుద్ధము లేని భూమి అని చెప్పారు ఆ అయోధ్యపురము కాక రామచంద్రుల వారు అనేక చోట్ల నడయాడారు మరి అయోధ్యకు ఉండే విశిష్టత ఏమిటి? ఈ వేడుకకు ఉండే విశిష్టత ఏంటి? దేశంలో ఈ ఆలయం నిర్మించడం వల్ల మనకు కలిగే మేలు ఏమిటి? ఈ వేళ చాలా అవసరం ఎందుకంటే అనేకమైనటువంటి దండయాత్రలు ప్రధానంగా పాశ్చాత్య ప్రభావం మన దేశం మీద ఒక నీడగా పరుచుకుంటున్నటువంటి ఈ వేళ మళ్ళీ మన మూలాలలోకి వెళ్లి ఆత్మాన్వేషణ చేయటానికి ధర్మబద్ధమైన జీవితం గడపటానికి ఒక ఆదర్శ పురుషుడు ఎవరు అంటే రాముడు తప్ప మరొకడు లేడు కాబట్టి అటువంటి రామకథని మళ్ళీ పునః గుర్తు చేసుకొని జీవితాన్ని ఎలా refine చేసుకోవాలి పునర్నిర్మాణం చేసుకోవాలి ఉమ్ అక్కడ పునఃప్రాణ ప్రతిష్ఠ అంటున్నారు అవును ఇక్కడ మనం కూడా పునః మనల్ని మనం ఆ మనలో ఉన్నటువంటి అనేక లోపాలు సరిదిద్దుకుంటూ ఉదాత్తమైన ఉత్తమమైన ఉత్కృష్టమైన యదార్థమైనటువంటి ఒక మానవ జీవితాన్ని మనం జీవించటం ప్రారంభించాలి దానికి ఇది ఆరంభ వేళ ఆ రకంగా ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది అవును రెండవది ఏ రాముడైతే పదకొండు వేల సంవత్సరాలు అని మనం చెప్తాం రాముడు పాలించినటువంటి రామరాజ్యం అవును రామ రాజ్యంలో నిజానికి ఇక్ష్వాకు వంశంలో ఉమ్ తొంభై తొమ్మిది మంది రాజులు రాజ్యం ఏలారు అందులో ఈయన అరవైనాలుగవ వాడు అరవయ్ మూడు దశరథుడు ఈయన కంటే ముందు హరిశ్చంద్రుడు దిలీప మహారాజు రఘు రఘురాజు వీళ్ళందరు ఉన్నారు మరి రాములవారిని అవతార మూర్తి అని ఆ అది తెలిసిన ఆ సందర్భం ఏమిటి? అనేక సందర్భాలు బాల్యంలోనే బాల రామాయణాన్ని గనక చూసినట్లయితే ఇక్కడ మామూలుగా బాల రామాయణం అంటే రాముడి childhood బాల్యం అని అనుకుంటారు ఉమ్ నా perception అది కాదు నా నా అధ్యయనము నా అనుభవము నా దర్శనము ఏంటంటే బాల రామాయణం అంటే మహా త్రిపుర సుందరి దేవే బాల ఆ బాలే ఈ కాలంలో లలితా దేవి అయింది అందుకనే శంకర భగవత్పాదులు అద్వైత ప్రతిపాదన చేసినప్పుడు శ్రీరామో లలితాంబికే అన్నాడు ఉమ్ ఏ లలితా దేవిని నేను ఉపాసిస్తున్నానో ఆ లలితా ఈ రాముడు ఒకటే కదా అంటే శక్తివంతమైనటువంటి లేదా ఒక శక్తి పురుష రూపంలో ఉంటే అది రాముడని స్త్రీ రూపంలో ఉంటే అది లలితాదేవి అని ఈ రెండూ కలిస్తే సీత అని ఒక అత్యద్భుతమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది ఆహా అది సీత సీత కాబట్టి సీతాదేవి శక్తి ఆ ఆవిడనే దుహిత అంటాం అంటే ఆ శక్తి లేకపోతే రాముడు యుద్ధం చేయడు అసలు రైట్ మర్యాద పురుషోత్తములు యుద్ధాలు చేయరు కదా అవును వేదాంత బోధ చేయాలి సాత్విక జీవితం గడపాలి అలా జరగలే ఎలా జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఈ ఈ శక్తి స్వరూపమే పురుష రూపంలో రాముడై స్త్రీ రూపంలో సీత అయి వచ్చింది గనుక ఈ బాల రామాయణం అంటే మనం అలా అర్థం చేసుకోవాలి మాములు సామాన్య అర్థంలో శ్రీరాముడి బాల్యాన్ని గురించినటువంటిది ఈవేళ రామ లల్లా అంటే ఏంటి శిశు రూపంలో ఉన్నటువంటి రాముడు అప్పుడే పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు అత్యద్భుతమైనటువంటి లగ్నంలో పుట్టాడు ఆయన ఆ ఆ లగ్నం జ్యోతిషశాస్త్ర ప్రకారం కూడా అభిజిత్ లగ్నం కదా ఆ అభిజిత్ లగ్నంలో కల్యాణం కల్యాణం కల్యాణం అభిజిత్ అంటే ఆ ఇప్పుడే జయించిన ఆ ఇప్పుడే జయించటం ఎప్పుడో కాదు అప్పుడప్పుడు కాదు అది ఎప్పుడూ జయించేది అభిజిత్ లగ్నం దోషరహితమైనటువంటి లగ్నం కాబట్టి ఈ బాలరా-- బాల ఆ రాముడు రామలల్లా అని ఉత్తరప్రదేశ్ మనం బాలరాముడు అంటాం అవును ఈ బాలరాముడు సరయు నది తీరంలోనే తన జీవితాన్ని ప్రారంభం చేశాడుచేసి అక్కడ ఉన్నాడు గనుక మళ్ళీ దానికి ప్రాణ ప్రతిష్ఠ అంటున్నారు కానీ ప్రాణం ఉన్నది దానికి రాముడు ఇలా పునః ప్రాణ ప్రతిష్ఠ అని పునః మళ్ళీ ప్రాణం దానికి ఆవాహన చేయాలి గురువు గారు ఆ శక్తిని ఆవేశింప చేయాలి తమరు అనుమతితో మరొక్కసారి ఆ అయోధ్య పురము లోకి మనము దర్శనం చేసుకోబోతున్నాం వెళ్లి అక్కడ మా ప్రతినిధి వెంకటేష్ రాజ్ కుమార్ ఇద్దరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరిన్ని విశేషాలు అక్కడి నుంచి అందించడానికి right రాజ్ కుమార్ మొట్టమొదట అసలు రేపు జరగబోయే సంప్రదాయ ఆ కార్యక్రమాలు ఏమిటి ఆ స్వప్న నిజంగా అంటే ఇక్కడ-ఇక్కడ ఈ అయోధ్య పురులకు రావడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ భక్తులంతా కూడా అందరి చూపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులు అందరి చూపు అంతా కూడా అయోధ్య వైపే మనకు కనబడుతుంది right now ఇప్పుడు మీరు discussion కూడా చేస్తున్నట్టు ఉన్నారు సరయు నదికి సంబంధించినటువంటి విశిష్టత గురించి లేదంటే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంటున్నారు కానీ రాముడు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉన్నాడు ఆ తన మనసంతా ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కావచ్చు ఇక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళ కాదు వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం విగ్రహ ప్రతిష్ఠ కి సంబంధించి మాత్రమే ఇప్పుడు క్రతువులు జరుగుతున్నాయి తప్ప రాముడు అనే రాముడు ఆ దేవుడు ఆ సర్వగుణాభిరాముడు ఇక్కడే ఉన్నాడు ఇప్పటికీ ఉంటాడు ఆ ఉన్నాడు అని చెప్తున్నటువంటి ఆ situations మనకు కనబడుతున్నాయి రేపు జరిగేటువంటి కార్యక్రమాలు చూసుకున్నట్లయితే పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట లోపు ఈ క్రతువుకి సంబంధించినటువంటి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది జరుగుతుందని చెప్పేసి పూజారులు చెప్తున్నారు so దానికి సంబంధించి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో ఆ శక్తి పొందేందుకు కావలసినటువంటి ఏవైతే ఆ పూజలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా పన్నెండు గంటల నుంచి ప్రారంభిస్తూ ప్రారంభిస్తారు అని చెప్పేసి ఆ శ్రీ ఆ శ్రీ ఆ శ్రీ అయోధ్య రామ క్షేత్ర తీర్థానికి సంబంధించినటువంటి trust చెప్తోంది so మనం సరయు నది తీరంలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే రాముడు ఆ ఇక్కడ స్నానం చేశారో ఎక్కడైతే ఇక్కడ ఎక్కడైతే ఈ ప్రాంతంలో తిరిగాడో ఆ ప్రాంతం అంతా కూడా ఈ సరయు నది తీర ప్రాంతంలో ఉంటుంది మనం చూసుకోవచ్చు so అందమైనటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంకా మరింత సుందరంగా తీర్చిదిద్దారు so మనతో పాటు వెంకటేష్ ఉన్నాడు వెంకటేష్ అంటే రేపు ఎట్లాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఏంటి ఈ రేపు రేపు కార్యక్రమాలకు సంబంధించి ఏం జరగబోతోంది అయోధ్యకు శుభ ఘడియలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయి. కేవలం పద్దెనిమిది గంటల్లోనే రామ్ లల్లా కు ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం పది గంటలకు ఇక్కడికి రాబోతున్నాడు. పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో ఆయన రామ జన్మభూమికి సంబంధించినటువంటి మందిర ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడి నుంచి దాదాపు ఒంటిగంట వరకు ఆయన రామ మందిరంలోనే ఉంటారు. మన రాజ్ కుమార్ చెప్పినట్లుగా పన్నెండు గంటల నుంచి ఒంటిగంట మధ్యలో ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులు ఉండబోతున్నాయి. so అప్పుడే ఆ రామ విగ్రహానికి సంబంధించినటువంటి ఒక శక్తిని తీసుకువచ్చేటువంటి ఒక ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. so అనంతరం ఆ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీరంతా కూడా public speech ఇవ్వబోతున్నారు. so మొత్తానికి రేపు ఈ schedule ఉంది. ప్రస్తుతం మేము ఉన్నటువంటి సరయు నది తీరంలో కనుక చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున పండుగ వాతావరణం కోలాహలం కనబడుతుంది. నా వెనుక చూస్తున్నారు సరయు నది తీరంలో సరయు నది తీరంలో ఉన్నాం. నది ఎల్లలన్నీ కూడా ఒక భక్తి తరంగాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నది ఎల్లలన్నీ కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తం lighting కాంతులతో కూడా ఇదంతా వెలిగిపోయి దీ-దీప్యమానంగా ఉంది. వెయ్యి కన్నులు చాలవు అన్న తరహాలో ఉంది. మొత్తానికి ఈ వేడుకను చూసేందుకు చాలామంది ఆ కేవలం ఈ అయోధ్యనే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇబ్బందులు లెక్కచేయకుండా వచ్చినటువంటి పరిస్థితి మనం చూశాం కదా రాజ్. ఆ ఖచ్చితంగా వెంకటేష్ అంటే ఆ స్వప్న ఇక్కడ చాలామంది చూసుకున్నాం అంటే ఒక-ఒక ప్రాంతం అంటూ కాదు ఒక రాష్ట్రం అంటూ కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మారీషస్ different యూకే యూఎస్ నుంచి చాలామంది ప్రజలంతా వచ్చారు. so general గా ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించో లేకపోతే వాళ్ళింట్లో ఉన్నటువంటి ఆచార సంప్రదాయాల బద్ధంగా ఒక దేవుణ్ణి పూజించడము అలా లేదా చేస్తుంటారు but ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్కరి మాట ఒకటే జై శ్రీరామ్ అనేటువంటి మాట వినపడుతుంది. ఇంకోటి చాలా interesting things మేము observe చేసింది ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను స్వప్న గారు మీకు అంటే చాలా విషయాలు తెలుసు అక్కడ ఉన్నటువంటి guests లకు కూడా చాలా తెలుసు. ఇక్కడ రాముడికి సంబంధించినటువంటి రామ్ లల్లా విగ్రహానికి సంబంధించి కానీ South India దక్షిణాది సంప్రదాయాలకు అనుగుణంగా ఈ విగ్రహాన్ని ఏక శిలపై ఆ చేసినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఈ రామ్ లల్లా temple కి సంబంధించి చూస్తే almost అంటే ఆంధ్ర తెలంగాణ అంటే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి stones తోటి తయారు చేసినట్టుగా చెప్తున్నారు. ఇది ఒక కొంచెం దక్షిణ భారతదేశానికి సంబంధించి మన తెలుగు people కి సంబంధించి కొంచెం ఆ చాలా అదృష్టంగా భావించవచ్చు అనుకుంటా స్వప్న. right రాజ్ కుమార్ వెంకటేష్ ఎప్పటికప్పుడు ఆ బోలెడు వివరాలు మాకు అందిస్తూ ఉండండి ధన్యవాదాలు. ఆ గురువు గారు ఇమ్మ ప్రస్తావించారు కాబట్టి రాములవారు అందరు చాలామందికి భక్తులందరికీ ఇలవేల్పు. రాములవారి ఇలవేల్పు ఎవరు? రాములవారి ఇలవేల్పు అంటే రాములవారు అంటే ఇక్ష్వాకు వంశపు ఇలవేల్పు ఎవరు? ఎవరు ఈయన సామాన్య మానవుడిగా దశరథ కుమారుడిగా ఉన్నాడు కదా అవును ఆమె పేరు దేవ కాళి దేవ కాళి ఉమ్ ఉహు దేవ కాళి వాళ్ళ కులదేవత, ఇలదేవత కూడా. కులదేవత అంటే వంశం ప్రకారం. కులదేవత అంటే వాళ్ళు ఎంచుకున్నటువంటిది. మనకి ఇలదేవత మనకు కావలసినది. కులదేవత ఎవరు వెంకటేశ్వర స్వామి మనకి. ఉమ్ మన కులం అంటే మన జాతి. అట్లా భారతీయమైనటువంటి ఈ జాతి మొత్తానికి కూడా ఆనాడు ఎట్లాగైతే దేవ కాళి శ్రీరామచంద్రుడి వంశానికి ఉన్నదో మనకు కూడా అట్లాగే మనం భావన చేయాలి. అయి-అయితే కొన్ని పాఠ్యాల్లో ఏముందంటే శ్రీరంగం. శ్రీరంగం కూడా ఆ కౌసल्या దేవి ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ప్రసాదం తిన్నదని అవును యజ్ఞ ప్రసాదం తిని అవి కథా కథనాలు ఉన్నాయి. కానీ ఋగ్వేదంలో చెప్పబడిన మాట ఏమిటంటే శ్రీరంగం ఎవరికి అంటే రావణ కుటుంబానికి సంబంధించినటువంటి దేవత. ఉహు దీంట్లో controversy ఏం లేదు. వేదంలోనే ఉన్నది. మనమెవరు రాసింది కాదు అది. ఉమ్ కానీ ఇక్ష్వాకు వంశానికి మాత్రం దేవ కాళి అంతే. రాములవారి పూజా ఇత్యాది కార్యక్రమాలు నైవేద్యాలు ఆ ఇవన్నీ కూడా ఏ సంప్రదాయం ప్రకారం ఆ కొనసాగబోతున్నాయి గురువు గారు? దీని గురించి మనకి స్పష్టత ఉన్నదా? ఇంకా అది వాళ్ళు ఎలా trust ఎలా నిర్ణయించింది మనకు తెలియదు గానీ మామూలుగా భారతదేశంలో మనం వడపప్పుపానకం ఇదంతా దక్షిణ దేశం. మ్ ఈ రెండు ఇక్కడ ఎందుకంటే ఆ ఋతువును బట్టి నైవేద్యం. ఆ ఋతువు వేసంకాలం గనుక మనకి దాన్ని prescribe చేశారు ఇక్కడ అంటే పెసరపప్పు చలవ కాదా పెసరపప్పు చలవ తర్వాత ఈ బెల్లం పానకం. దీనివల్ల మనిషికి immunity ఉంటుందని వైద్యశాస్త్రం ప్రకారమే నిర్ణయించారు. మ్ కానీ ఇదే ఉండదు కదా ఉత్తర దేశంలో అవును ఏప్రిల్ వచ్చేప్పటికి అక్కడ కూడా మార్పులు వస్తాయి మ్ కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు చేస్తారు. నిజానికి నైవేద్యం ఏం చేయాలమ్మా? హృదయాన్ని నివేదన చేయాలి చాలా గొప్ప అలా ఆత్మ దర్శనం ఆత్మ దర్శనం చేయాలి అవును ఎందుకనంటే ఇవాళ రాముడు ఒక దశరథ మహారాజు కొడుకుగా లేదు ఒక పురాణ పురుషోత్తముడుగా ఇందాక నువ్వన్నట్లు మర్యాద పురుషోత్తముడుగా ఎన్ని చెప్పుకున్నా ఆత్మారాముడై ఉన్నాడు అవును భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి యందు ఈ రాముడు ఆత్మారాముడు. ఆత్మ కృష్ణుడైయన ఎక్కడా లేదుగా మ్ ఆత్మ శివుడన్న మాట లేదుగా. ఉన్నదంతా ఆత్మారాముడై ఉండెనో భయంబయ్యెడునన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే ఆత్మ ఆరామమై ఉన్నది. ఆరామం అంటే స్థలం. మనం ఉండే ప్రదేశం. అది మన హృదయంలో ఉన్నది కాబట్టి ఆ నైవేద్య విధానాలు, పూజా విధానాలు భారతీయమైనటువంటి విధానాల్లోనే అక్కడ సాగుతాయి. మ్ గురువు గారు జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇది ధర్మానికి సంబంధించినవి. ధర్మానికి మారుపేరు శ్రీరామచంద్రులవారు అని చెప్తారు. అసలు ధర్మం అనేది శ్రీరామచంద్రులవారు ఎలా తెలుసుకున్నారు? అంటే ఏ ధర్మంలోకి ఆయన ఆ ఇమిడిపోయారు అన్ని ధర్మాలు కలిపి ఒకే ఒక్క ధర్మం. ఆ ధర్మంలో నుంచి రాముడు అనేక ధర్మాలను ఆవిష్కరించాడు. రామో విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మం అనేది ఒక abstract. మ్ అది ఒక academic subject. అంతే కదా విషయం అది అవును మరి ఇది ఒక సహకారం కావాలి, ఓ రూపం తీసుకోవాలి. అందుకనే వృక్షామాకృతి యజ్ఞమూర్తి అన్నారు రాముడిని. మ్ ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము మూడు కలిస్తే వేద స్వరూపమైన. వేదం ఏంటి? వేదోఖిలో ధర్మమూలం. మ్ వేదాలన్నీ కూడా దేని మూలం? దాని మూలం ఏంటంటే ధర్మమే. ఆ ధర్మమే మళ్ళీ రామధర్మమే, శ్రీరామ ధర్మమై ఈ ప్రపంచంలోకి వచ్చింది. కనుక రామో విగ్రహవాన్ ధర్మః. విగ్రహ స్వరూపం. రాముడు ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని గురించి కాసేపు చెప్పండి అంటే రాముడి కథ చెప్తే చాలు. రాముడు ఆచరించిన ధర్మం ఏంటంటే సర్వోత్తముడైనటువంటి ఒక పుత్రుడు. ఒక తండ్రికి ఎటువంటి కొడుకు ఉండాలో ఉదాహరణ రాముడు. ఒక సీతమ్మ వంటి మహా సాధ్వికి ఒక భర్త ఎలా ఉండాలో అది రాముడు. ఏ అలాగే ఒక సోదరుడిగా ఎలా ఉండాలో రాముడు. ఒక గృహుడికి ఒక యజమానిగా ఒక స్వామిగా ఎలా ఉండాలో రాముడు. అరణ్యవాసం లో ఆ అనేకమంది మహర్షులను ఆయన దర్శనం చేశాడు ప్రతి రాత్రి కూడా. పగలు రావణ వధ చే-- ఆ రాక్షస వధ చేసినా రాత్రిపూట మహర్షుల దగ్గర కూర్చునేవాడు. జ్ఞాన యోగాన్ని ధర్మంగా భావించాడు. మ్ ఆయనకి ఆ శబరి వంటి వాళ్ళు. వారు కలిసినప్పుడు భక్తి యోగాన్ని ఆచరించాడు. తన అమాత్యులు, తన మంత్రులు, సామంతులు వీళ్ళందరితో కర్మ యోగాన్ని సహించాడు. అంటే రాముడికి తమో, రజో ఆ సత్వగుణాలు అన్నీ కూడా ఆ మన దేహం తీసుకొని వచ్చాడు. మ్ పంచభౌతిక దేహం తీసుకొచ్చిన అవతారమూర్తి అయినా సరే ఈ మూడు ఉంటాయి. అయితే ఈ మూడు ఉంటే రాముడు పురాణ పురుషోత్తముడు ఎలా అయినాడు? మ్ అంతేగా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా కదా! ఎలా అయినాడు అంటే తొలినాళ్లలో విశ్వామిత్రుడు వాళ్ళకి రామలక్ష్మణులకి విద్యాభ్యాసనం చేయటానికి తీసుకు వెళ్ళినప్పుడు తాటకని సంహారం చేశాడు మొట్టమొదట. బాధపడ్డాడు. క్షత్ర ధర్మంలో క్షత్ర కులంలో పుట్టి సీత మన తాటక వధతో నా జీవితం ప్రారంభమైందా అనుకున్నాడు. మ్ విశ్వామిత్రుడు చెప్పాడు, "రామా! మానవ దేహంలో ఉన్నావు గనుక నీలో తామసం ఉన్నది. తాటక వధతో తామసం అయిపోయింది, సంహారం అయిపోయింది పదా అన్నాడు. కాస్త ముందుకు సాగిన తర్వాత ఆ అహల్య దేవి యొక్క శాపవిమోచనం అయింది. మ్ అయినప్పుడు ఆశ్చర్యపోయినాడు, అద్భుతం అయింది. అంటే ఆయన అన్నాడు, "నీలో ఉన్న రాజస గుణం దీనిలో పూర్ణం అయిపోయింది. అక్కడ సంహారం అయింది, ఇక్కడ సంస్కారం అయింది పదా" అన్నాడు. మరి తర్వాత జరిగిన ఘట్టాలలో ఆ ఈ గుణాలన్నీ మరోసారి సాక్షాత్కరించుకున్నాయా అవసరమైనప్పుడల్లా వచ్చినాయి, అవసరమైనప్పుడల్లా. కానీ సత్వగుణమే ప్రధానం. అంటే సత్వగుణం నుంచే ఈ తమో, రజో గుణాలని గుణాలు ఉపయోగించడం జరిగింది ఉపయో-- అవసరమైనప్పుడు ఉపయోగించాడు, అవసరమైనప్పుడు విలపించాడు, వ్యధ చెందాడు, బాధపడ్డాడు, రోషం ప్రకటించాడు, ఆత్మన్యూనతకు గురైనాడు. అనేకమైనటువంటి మానవుడు ఏవి అనుభవిస్తాడో అవన్నీ rudimentary గా residual గా ఉండిపోయినాయి. మ్ ఆయన యందు అంశ మాత్రంగా. దాన్ని వెంటవెంటనే జరిగిన ఘటన ఏంటంటే శబరి అనుగ్రహం, సీతా పరిణయం. దాంతో పరిపూర్ణమైనటువంటి మా రాముడు ఏర్పడ్డాడు. అంటే అక్కడికి వచ్చే సరికి వ్యక్తిత్వం సంపూర్ణమైంది. అవును తాటక వధ సంహారం, అహల్య శాపవిమోచనం సంస్కారం ఇది సంపూర్ణం సీతాదేవితో చాలా గొప్పగా ఉంది గురువు గారు ఆమా ఇక రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎవరు అంటే పురాణ ఇతిహాసాలు చదువుకున్న వారికి ఆ కొంత గొప్పో తెలుసుంటుంది తెలుసు, తెలుసు శంఖ చక్రాలు ఆ మనకి కరెక్ట్. ఆ రాముడు సరే అవును లక్ష్మణుడు ఏమో లక్ష్మణుడు ఆదిశేషువు ఆదిశేషువు పక్కనే ఉన్నాడు మ్ తర్వాత భరతుడు శంఖం, చక్రం మ్ శత్రుఘ్నుడు ఇవన్నీ ఎలా ఆవిష్కృతమయ్యాయి గురువు గారు? వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలను బట్టి ఏర్పడ్డాయి. ఉహు రాముడు ధర్మాచరణం చేశాడు. ధర్మం ప్రయాణం చేశాడు. జీవన ప్రస్థానమంతా ధర్మానికి లోబడే చేశాడు ఆయన. చిన్న ఉదాహరణ చెప్తారమ్మా. అయోధ్యా నగరం దాటి వెళుతున్నప్పుడు అయోధ్యా నగర ప్రజలందరూ కూడా రాముడిని వెళ్ళనివ్వలే. మేము కూడా వస్తాం మీతో పాటు. నువ్వు లేకుండా మేము ఉండలేం అన్నప్పుడు ఆయన అన్నాడు, "నేను అయోధ్యలో ఉన్న రోజు మిమ్మల్ని కలుస్తానా?మనం, మనం రోజూ కలుసుకుంటామా? కలుసుకోం. నా పని నన్ను చేయనివ్వండి. పైగా అక్కడ అరణ్యంలో బతకటానికి జంతువులున్నాయి. వాటికి కావలసిన ఆహారం పరమాత్మ ఏర్పరిచారు. మనమందరం కూడా నాతో పాటు మీరు అయోధ్యా నగరమే తరలి వచ్చినట్లయితే ఏమవుతుంది? వాటికి ఆహారం పోతుంది. ఉమ్ వాతావరణం అంతా కూడా పర్యావరణం పాడైపోతుంది. ఇట్టే పధ్నాలుగు ఏళ్ళు నా కర్తవ్యాన్ని నన్ను నిర్వర్తించండి మీరు అయోధ్యకు వెళ్ళండి అంటే రాముడ్ని నమ్మారు వాళ్ళు. వెళ్లారు. మరి ఏం చేశారు? అంటే అయోధ్యా నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా రామా రామా రామా! రామా అంటే రాముడు. రామా అంటే సీత. ఉహు ఈ నామం జపిస్తూ ఉన్నారు. పధ్నాలుగు ఏళ్ళ తర్వాత వచ్చేప్పటికి ఆ ఏ రాజ్యం ఏర్పడిందంటే అప్పటి వరకు ఉన్నది ఇక్ష్వాకు కులంలో ఉన్నటువంటి రాజ్యమే ఉంది. మరి రామరాజ్యం రాముడు ఏలిన రాజ్యం రామరాజ్యం అంటే కాదు. రాముడు లేకుండా పరోక్షంగా ప్రజలందరూ ఆ రాజ్యాన్ని నిలబెట్టుకున్నారే. కేవలం రామ అనేటువంటి నామాన్ని నామస్మరణం చేస్తూ రాముడు లేని పధ్నాలుగు ఏళ్ళలో రామరాజ్యం ఏర్పడింది. ప్రజలు ఏర్పరిచినటువంటి రామరాజ్యానికి రాముడు రాజై వచ్చాడు. అది. అంత అద్భుతంగా అద్భుతంగా భరతుడు పరిపాలించి పరిపాలించి. భరతుడు పరిపాలించలేదుగా అసలు బయటే కూర్చున్నాడు ఆయన. నందిగ్రామంలోనే కూర్చున్నాడు. ఉమ్ రాముడు వచ్చేదాకా ఆయన ఎంటర్ కాలేదు. కాబట్టి ధర్మబద్ధమైనటువంటిది. తన తమ్ముడికి గానీ, సుగ్రీవుడికి గానీ, విభీషణుడికి గానీ, గుహుడికి గానీ శబరికి గానీ వాళ్ళతో ఇవ్వేళ మనం ఇంగ్లీషులో ఇంటర్ పర్సనల్ రిలేషన్ అంటాం. అవును ఆ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ కి రాముడు పెద్ద ప్రతీక. రెండవది HR తాను అయోధ్యా నగరం నుంచి సైన్యాన్ని వెంబడి పెట్టుకు రాలా. తనకు ఏది దొరికిందో వాటిని మేనే-- మేనేజర్ అంటే ఎవరమ్మా? ఏది ఉన్నదో దాంతో మేనేజ్ చేసేవాడు మేనేజర్. మేనేజర్ అవును అంతే కదా And he is the who doesn't manage at all. అందరూ మేనేజ్ చేస్తారు ఆయన అక్కడ ఉంటాడు. అది నిజమైన మేనేజర్. రాముడు నరుడై నారాయణుడు నరుడైనప్పుడు ఆయన ఆధారపడింది వానరుల మీద. వాళ్ళ శక్తి తన శక్తిగా తన శక్తిని వాళ్ళ యందు ప్రవేశింపజేసి ఉమ్ మొత్తానికి ఒక సంఘటిత శక్తిగా మార్చి తన కర్తవ్య నిర్వహణకి ఇందాక చెప్పిన గమనము లక్ష్యము నుంచి గమ్యం వరకు మధ్య జరిగేదంతా రామ గమనం శ్రీరామ గమనం. ఇవ్వేళ కూడా మనకు లక్ష్యాలున్నాయి. అవును ఏమిటి మనకి? నేనెవరు అని తెలుసుకునేటువంటి ఒక లక్ష్యం ఉంది. గమ్యం ఏంటి తెలుసుకోవటం. తెలుసుకోవటానికి తెలుసుకుందామని అనుకున్న దానికి మధ్య మన ప్రయాణాన్ని బట్టి అది సిద్ధిస్తుంది లేదా సిద్ధించదు. అంతే. చాలా గొప్పగా చెప్పారు గురువు గారు. ఇక రేపు జ-- జరగబోయే ఈ అద్భుతమైన మహత్తరమైన ఈ ఘట్టాన్ని ఉమ్ భక్తులు ఎలా వీక్షిస్తే మంచిదని మీ సూచన? అంటే ఇవ్వేళ ఈ మాధ్యమం ఉంది. టీవీ మాధ్యమాలు ఏర్పడ్డాయి. ఇన్నేళ్లుగా అన్నీ అక్కరలేనివి, అవసరం లేనివి, ప్రకోపనం చెంది-చెందించేవి అనేకమైనటువంటి చుట్టం రామ ధ్యానం చేయటం. ఉమ్ రామ ధ్యానం చేయడం. రామ ధ్యానం చేస్తూ లేనవయ్యి అనవసరమైన విషయాల పట్ల [కొట్టుకుంటూ] అగమించకుండా ఒక్క రోజైనా ఉమ్ ఒక్క రోజైనా సంపూర్ణంగా రాముడికి అంకితం చేసి అదృశ్య రాముడి గుణాభి-- సకల గుణాభిరాముడిని ఆయన గుణగణాలన్నిటినీ కూడా స్మరించుకుంటూ రేపటి కార్యక్రమాన్ని అద్భుతంగా భక్తులందరూ వీక్షించబోతున్నారు. ప్రత్యక్షంగా కొంతమంది పరోక్షంగా ప్రసార మాధ్యమాల ద్వారా మరికొంతమంది ఇక భక్తులు ఆ తలుచుకుంటే ఆత్మ దర్శనం కూడా చేసుకోవచ్చు రాముల వారిని. గురువు గారు చాలా అద్భుతమైన విషయాలు చాలామందికి తెలియని విషయాలు మరోసారి ఈరోజు ఆ తెలియపరచి గుర్తు చేశారు కూడా మీకు ధన్యవాదాలు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకోబోతున్నాం. ఈ ప్రత్యక్ష ప్రసారం ఇలాగే కొనసాగుతుంది. అలా అయోధ్యపురం నుండి stay tuned.
YouTube · audio
Exclusive Interview | Ayodhya Ram Mandir @SakshiTV
Exclusive Interview | Ayodhya Ram Mandir @SakshiTV
Source: Sakshi TV on YouTube
0:00 / 34:12