No transcript for this section.
Transcript begins at 0:00.
పిఠాపురం లో వచ్చింది అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చినవి శ్రీపాద శ్రీవల్లభుడు అలాగే అనేకమైనటువంటి అవతారాలన్నీ ఇందాక చెప్పిన అంశ అవతారాలుగా వచ్చినయి. కానీ వీటన్నింటి మధ్య ఒక అవతారం వచ్చింది. ఆ అవతారమే షిరిడి మహాస్వామి యొక్క అవతారం. మనం ఇవాళ దానిని షిరిడి షిరిడి అని ఒక నానుడిగా ఒక అలవాటుగా అంటున్నాం. దాని పేరు నిజానికి షిరిడి కాదు. దాని పేరు శిలాది. శిలాది అంటే మరాఠీ లో చెరుకుతోట అని అర్థం. ఆ శిలాది మధ్యలో ఈ ప్రపంచం అంతా చెరుకుతోట అయినప్పటికీ కూడా దాని మధ్యలో కూడా అనేకమైనటువంటి చేదు అనుభవాలు కలిగించే అనేక విషయాలు ఉంటాయి గనుక ఒక వేప చెట్టు మొలిస్తే ఆ వేప చెట్టు యొక్క మూలాన్ని ఆవాసం చేసుకొని చేదుని తాను గ్రహిస్తూ ప్రపంచానికి మాధుర్యాన్ని పెంచినటువంటి మమతా మూర్తి ఎవరంటే షిరిడి సాయి నాథుడు. నాగ సంప్రదాయము, విఠోబ సంప్రదాయము, ఖండోబా సంప్రదాయము, శివ మారుతి సంప్రదాయాలని అనేక భిన్నభిన్న సంప్రదాయాలన్నీ ఏకకాలంలో ప్రవర్తిల్లి సమాజం చీలికలు పీలికలై పోతున్న సమయంలో షిరిడి సాయినాథుడు తన దేహానికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు తానెవరో తనను తాను బహిర్గత పరుచుకోకుండా ఒకానొక సమయంలో చిన్న వయస్సులో ఈ షిరిడి గ్రామానికి వెళితే ఆయన ఆ రాత్రి పూట అక్కడ ఉండవలసి వచ్చింది. ఎక్కడ ఖండోబా దేవాలయంలో. ఆ దేవాలయంలో పడుకుంటే ఈయన ఆజానుబాహువు ఆరడుగుల మూడు అంగుళాలు షిరిడి బాబా. అక్కడ ఈయనని ఎవరో పరదేశి వచ్చి ఇక్కడ పడుకున్నాడని నువ్విక్కడి నుంచి వెళ్లిపోవాలన్నాడు మహల్ సాపతి. ఆయన వెళ్లిపోయినారు వినయంగా తలవంచుకొని వెళ్లిపోయినారు. మళ్లీ చాలా కాలం తర్వాత పెళ్లి బృందంతో వచ్చినప్పుడు ఇదే మహల్ సాపతి ఎవరైతే వెళ్లిపో అన్నాడో వాడి చేతనే "ఆవో సాయి" అని పిలిపించుకున్న మహిమాన్విత మూర్తి షిరిడి బాబా. అంతే [చప్పట్లు] ఆ సమయంలో ఆయన తెచ్చుకున్న ఆయన వెంట తెచ్చుకున్నదేదో ఒక శెక్క, ఒక పాత్ర, ఒక ఇటుక రాయి. ఆ ఇటుక రాయి ఏది అంటే వెంకూశ అనే పేరుతో ఉన్నటువంటి గురు స్వరూపం. అంటే గురు శక్తిని ఆ ఇటుకలో నిక్షిప్తం చేసుకొని తలదిమ్మిగా మార్చుకొని గురువుని కాపాడుతున్నట్లు గురువు తనని కాపాడుతున్నట్లు అనుభూతి చెంది షిరిడి బాబా యొక్క అవతారం కొనసాగింది. ఇక అదంతా చరిత్ర. పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి సమయంలో వారు ఒక ప్రకటన చేశారు. మళ్లీ ఎనిమిది సంవత్సరాలకి ఆంధ్రదేశంలో నేను పునః మరొక స్వరూపం తీసుకుని వస్తాను అని. అట్లా వచ్చినటువంటి ఒక అవతారం ఏది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబరు ఇరవై మూడవ తారీఖున పుట్టపర్తి అనేటువంటి గ్రామంలో ప్రభవించినటువంటి మహా పరిపూర్ణ అవతారమే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. [చప్పట్లు] కాబట్టి స్వామి యొక్క పూర్వ స్వరూపం ఏది అంటే షిరిడి పూర్వ స్వరూపం. వారి ఆ అవతార క్రమంలో మూడు అవతారాలు వస్తాయి. ఒకటి షిరిడి బాబా అవతారం, రెండవది సత్య సాయి అవతారం, మూడవది ఎప్పుడో రాబోయే ఒక ప్రేమ సాయి అవతారం. దానికి వ్యాఖ్యానం ఎలా అన్నారంటే షిరిడి బాబా కేవల శివ స్వరూపం అయితే సత్య సాయిబాబా వారు శివ శక్తి స్వరూపం అయితే రాబోయే ప్రేమ సాయి అది కేవల శక్తి స్వరూపము అని ఒక నిర్ణయం జరిగింది. పాతది మనం చూడలేదు. నేనైతే చూడలేదు. రాబోయేదాన్ని ఊహించలేను. అంత శక్తి మనకు లేదు. కానీ కట్టెదుట మీకు ఇప్పుడే చెప్పాను అరవై సంవత్సరాలుగా నేను అనుభవించినటువంటి ఒక మహా పరిపూర్ణ అవతార వైభవ శక్తి స్వరూపాన్ని నేను ఆలంబనం చేసుకోగలిగాను. ఆ అవకాశాన్ని పరమేశ్వరుడైన స్వామి మనకు అనుగ్రహించారు. అటువంటి స్వామి ఆయన చేత గద లేదు, భాషణం లేదు, సుదర్శన చక్రం లేదు. కానీ ఎలా వచ్చారు అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. కృతయుగం అంతా కూడా అస్థిగతం. అస్థిగతం అంటే ఎముకలతో కూడి ఉన్నది. అంటే కృతయుగంలో ఏం చేశారంటే ఆనాడు రాజ్యాలు లేవు, రాజులు లేవు, ప్రకృతి ఉండేది, పరమాత్మ ఉండేవాడు. ఆ ఈ ప్రకృతి ద్వారా అక్కడికి వచ్చిన ఆ జీవుడు పరమాత్మతో అనుసంధానమై నిరంతరము గూడు చెదిరిపోయేదాకా ఎముకలు అరవిపోయే దాకా తపస్సు, ధ్యానము, ధారణ అనేటువంటి మూడింటితో జీవితాన్ని గడిపాడు. కనుక అది అస్థిగతం. అస్థి అంటే ఎముక అని అర్థం. యుగం మారిపోయింది. త్రేతాయుగం వచ్చింది. రాజులు, రాజ్యాలు, ఇక్ష్వాకు రాజ్యం వచ్చింది. అందులో తొంభై తొమ్మిది మంది రాజులు ఆ త్రేతాయుగాన్ని నడిపిస్తే అందులో అరవై నాలుగవ రాజు రాముడు. అంటే రాముడి కంటే ముందు అరవై మూడు మంది రాజులున్నారు. రాముడు తర్వాత ఇంకా ముప్పై ఎనిమిది మంది ఉన్నారు. అంటే రాజ్యాలు ఏర్పడ్డాయి, ఎల్లలు ఏర్పడ్డాయి. రాజ్యాలు ఉన్నాయి అంటే స్పర్ధలున్నాయి, స్పర్ధలున్నాయి అంటే కార్పణ్యాలున్నాయి, కార్పణ్యాలున్నాయి అంటే యుద్ధాలున్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వీటిని సమన్వయం చేయటానికి ఎవరు రావాలి అని అనుకున్నప్పుడు ఆ కాలమంతా కూడా ఇది అస్థిగతం అయితే అది మాంసగతం అయింది. మన శరీరం కూడా అస్థి, మజ్జ, మాంసము, రక్తము ఇదే కదా! దీన్ని మించి ఇంకొకటి లేదు. ఇది చర్మం చేత కప్పబడింది. కాబట్టి త్రేతాయుగం మాంసగతం అయినప్పుడు అంటే ఆహారం కూడా వాళ్ళు మాంసం తినేవాళ్ళు ఆ కాలంలో. గుణాలు కూడా ప్రధానంగా ఏర్పడిపోయినాయి. తపస్సు లేదు తగ్గింది. ధ్యానం తగ్గిపోయింది. కాబట్టి మనుషులలో అనేకమైన గుణాలు బయటకు రావటం మొదలు పెట్టినాయి. వీటికి ప్రతీకాత్మకంగా ముగ్గురు రాజులు, మూడు కురాలు ఉన్నాయి. ఒకటి మిధిలా నగర రాజు జనక మహారాజు సత్వగుణం.దశరథ మహారాజు రజో గుణం శ్రీలంకలో లంకాధీశుడైనటువంటి రావణ బ్రహ్మ తమోగుణం కాబట్టి సత్వ రజస్ తమో గుణాలు మూడు కూడా ఏకకాలంలో ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతున్నప్పుడు ఈ నారదుడు కొంతమంది తపస్సులు శ్రీ మహావిష్ణువు దగ్గర వెళ్లి విన్నవించుకున్నారు ఏమని విన్నవించుకున్నారు అంటే ఇదిగో తపస్సులు పోయినాయి యజ్ఞాలు పోయినాయి ధ్వంస రచన జరుగుతున్నది నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నప్పుడు శ్రీమహావిష్ణువు ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే నేను వస్తా ఎలా వస్తాను అంటే దశరథ నందనుడుగా వస్తా దశరథుడు ఇంట పుడతాను దశకంధరుని కుత్తుకను ముత్తరిస్తాను అంటే రావణ బ్రహ్మ పది తలలు నేను తెగగొడతాను దశన యుగాల వరకు నిలబడేట్టుగా శ్రీరామచంద్ర నామంతో వస్తాను మూడు ఆయన నివర్తించాడు అయితే రాముడు రావటం రావణ సంహారం అది ఇంకా మన కథ రామాయణం కాబట్టి ఇది మాంస గతమైతే ముందుది అస్థ గతమైతే ద్వాపర రానే వచ్చింది అది రక్త గతమైంది కనుక ఆనాడు మాంసం వెనక్కి వెళ్లిపోయింది రక్తము అంటే రాగ బంధానికి మూలమైనది రక్తం కాబట్టి దాయాది కార్పణ్యాలు వాళ్ళందరూ కూడా యుద్ధాలు చేయటం ఐదుగురు లేవమని ఒకడు నేను ఒక్కడిని సూదిమడ ఓపెంది కూడా ఇవని ఇదంతా దాయాది మాత్సర్యాల వల్ల యుద్ధాలు వచ్చి రక్తం పారింది ఆ రక్తం పారినటువంటి ఆ ద్వాపర యుగంలోనే కృష్ణ నామం అంటే కృష్ణ చైతన్యం మూడు భాగాలై వచ్చింది ఒక భాగము వేదవ్యాసుల వారు వేదవ్యాసుల వారి పేరు నిజానికి వ్యాసులవారు కాదు ఆయన పేరు కృష్ణ ద్వైపాయనుడు ఒక ద్వీపంలో పుట్టాడు గనుక కృష్ణ ద్వైపాయనుడు అయినాడు వేదాలు పరిష్కారం చేశాడు గనుక వేదవ్యాసుడు అయినాడు రేగు పళ్ళ తోటలో కూర్చొని భాగవతం రాశాడు గనుక బాదరాయనుడు అయినాడు కాబట్టి అనేకమైనటువంటి పేర్లతో ఉన్న ఆయన పేరు కృష్ణ ఇక రెండవది అగ్ని నుంచి ఉద్భవించినటువంటి ద్రౌపది ద్రౌపది పేరు కృష్ణ ద్రుపద రాజ కుమార్తె గనుక ఆవిడ ద్రౌపదిగా పిలవబడింది గాని ఆమె పేరు కృష్ణ అంటే వేదవ్యాసుడు ఒక కృష్ణ ద్రౌపది ఒక కృష్ణ యోగీశ్వర కృష్ణుడు మూడవ కృష్ణ ఈ మూడు కలిపి కృష్ణ నామంతో ద్వాపర యుగం అంతా కూడా నడిచింది అందుకనే ఆ శపథం చేసినప్పుడు భీమసేనుడు కూడా దుశ్శాసుడి రూము చీల్చి ఆ రక్తంతో నీ కురులన్నీ తడిపి ముడి వేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అస్థి గతమైంది తర్వాత మాంస గతమైంది రక్త గతమైంది ఇదిగో కలియుగం రానే వచ్చింది ఇది అన్న గతమైంది అన్న గతం కాబట్టే మన మెతుకులోనే మన బతుకంతా ఇమిడిపోయి ఉన్నది అంతే కదా అన్నం తినాలి అన్నం మెతుకులో నుంచి అన్నం లోపలికి వెళ్లగానే అన్నమే ప్రాణమే ప్రాణమే మనస్సే మనస్సే విజ్ఞానమే విజ్ఞానమే ఆనందమే అవుతుంది గనుక ఈ పంచ కోశాల సృష్టి అంతా కూడా భోగాలుగా మనం తెచ్చుకున్నటువంటి అనేక సంస్కార ధారలన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి గనుక ఈ శిరిడి సాయి అవతారం తర్వాత 1926 నవంబర్ 23న వచ్చినటువంటి సత్య సాయి అవతారం దేనికి ప్రతీక అంటే మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్లి backward integration చేయాలి పునః ఆలోచన చేస్తే కృతయుగం అస్థి గతమే కానీ అది సత్య యుగం త్రేతాయుగం మాంస యుగమే కానీ అది ధర్మ యుగం మూడవది ద్వాపర యుగం రక్త గతమే కానీ అది శాంతి ప్రేమలతో కూడి ఉన్నది కనుక కృతయుగం నాటి సత్యము త్రేతాయుగం నాటి ధర్మము ద్వాపర యుగం నాటి శాంతి ప్రేమలు ఈ కాలానికి కావలసిన అహింస సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు ఐదు యుగాల ధర్మమే ఒక్క సత్య సాయి బాబా స్వామి అంటే కేవలం సత్యనారాయణ రాజు కాదు ఐదు యుగాల ధర్మం ఒక్క శరీరంలో నింపుకొని వచ్చి 86 సంవత్సరాల అవని సంచారంలో ఈ ప్రపంచాన్ని మొత్తము ఒక్క సనాతన సారథియై నడిపించిన మహా మహిమ స్వరూపమైనటువంటి ఈ అవతారాన్ని చూసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించినప్పుడు కొద్దిగా మన బుద్ధిని మన విశేషమైనటువంటి చాతుర్యాన్ని మన స్వాధ్యాయాన్ని మన అధ్యయనాన్ని మన ఆచరణని మన అనుభవాన్ని మన అనుభూతిని రంగరించి స్వామిని గనుక అర్థం చేసుకోగలిగితే అప్పుడు నిజమైన స్వామి మనకప్పుడు అర్థం అవుతారు లేకపోతే ఒక పురాణ పురుషుడుగా స్వామి is god అని గోడ మీద రాస్తే ప్రయోజనం సున్నా ఎందుకంటే ఆయన దైవము అని చెప్పే శక్తి మన దగ్గర లేదు కాదు అనే శక్తి కూడా మన దగ్గర లేదు గనుక దైవం అని అంగీకరిస్తూనే ఎట్లా దైవము ఎందుకు దైవము ఎవరి కోసమై దైవము ఇవి విచారణ చేయాలి ఈ విచారణ సాగుతూ ఉంటే ఈ సత్య సాయి భగవానుడు ఏం చేశారు స్వామి 1926 అది calendar year వచ్చారు వచ్చినప్పుడు మొదటి 16 సంవత్సరాలు కేవల సాధారణ సామాన్య బాలుడిగా ప్రవర్తించారు ఈశ్వరమ్మ కొడుకుగా గుట్టపర్తి నివాసిగా కాలం గడిపారు గడిపారా జీవితాన్ని నడిపారా అంటే జీవితాన్ని ఆయన ఎన్నడూ గడపలేదు నడపలేదు జీవితాన్ని జీవించారు 16 ఏళ్ళకే తన చుట్టూ ఉన్న చిన్న సమాజంలో చిన్న పరిధిలో జరుగుతున్నటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాల పైన ధ్వజమెత్తి తానున్న ప్రాంతాన్ని సంస్కరించేటువంటి ఒక సంస్కరణ విధానాలని స్వామి స్వీకరించి ఆ వయసులోనే నాటకాలు రాసి నాటికలు రాసి నాట్యమాడి నాటికలలో పాత్ర పోషించి సమాజం మొత్తాన్ని ధర్మం వైపు నడిపించేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్వామి 16వ సంవత్సరం రాగానేతన కార్యక్రమానికి అద్భుత స్వీకారం చుట్టారు. అది ఆ canvas వేరు, ఆ భావన వేరు. "ఐ యామ్ సాయిబాబా" అని ప్రకటించినప్పుడు ఆ సాయి నామం ఎవరికీ తెలియని నామం. మనకి రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి తప్ప సాయి అనే పేరు ఎవరికీ తెలియకపోతే, నేను సాయిని అని ప్రకటించిన సమయంలో కాస్త ఆశ్చర్యపోయారు. ఇది అరబిక్ భాషా? పర్షియన్ భాషా? ఎక్కడుంది ఇది? దాన్ని స్వామి తర్వాత పరిష్కారం చేశారు. ఆ పరిష్కారం ఏమిటంటే, మహామంత్రార్ణవ గ్రంథంలో ఒక మాట ఉన్నది. "సర్వభ్యః సర్వ సర్వభ్యః" అని. పరమేశ్వరుడి పేరు శివుడు, మాహేశ్వరుడు మాత్రమే కాదు, సర్వః. సర్వః. ఆ సర్వః ని మళ్ళీ ఏకవాక్యం గనక ఏక అక్షరం గనక చేస్తే సర్వః is equal to సహ. సహ పక్కన ఆయి అంటే తల్లి మరాఠీలో. సహ ప్ర సాయి, సాయి. అంటే నేను శివశక్తి స్వరూపాన్ని అని స్వామి ప్రకటించిన అద్భుత సన్నివేశమే "ఐ యామ్ సాయిబాబా" అనటంలో. అంటే నేను సాయిని అయినప్పటికీ, అర్ధనారీశ్వర తత్వంతో వచ్చినప్పటికీ, నేను బాబాను. బాబా అంటే తండ్రి అని. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, శక్తి ఆయనే, గురువు ఆయనే, అన్నీ ఆయనే, అంతా తానే అనేటువంటి ఒక ప్రకటన పద్నాలుగవ ఏట. నిజానికి మే ఇరవై మూడు, పంతొమ్మిది వందల నలభై స్వామి అది ప్రకటన చేశారు. అయిన తర్వాత అది తనను తాను ప్రకటించుకున్నారు. అదే సంవత్సరం పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై న తాను ఎందుకు వచ్చారో చెప్పారు. దాన్ని మనం అవతార ప్రకటనగా భావిస్తున్నాం. ఆ అవతార ప్రకటనలో మనందరికీ తెలుసు ఆయన ఏం ప్రకటించారో. ప్రకటించడం తేలికే, కదా. దాన్ని realize చేయడం చాలా కష్టం. Dream, dream, dream అంటాడు ఒకాయన, కదా. ఈయనకు కలలు కనటానికి కాయగా కుర్చీలో కూర్చుంటే బోలెడు కలలు వస్తాయి. కానీ వాటిని realize చేయాలి. అది ఎవరికైనా సాధ్యమైందా అంటే ఒక్క సత్య సాయి భగవానునికి మాత్రమే సాధ్యమైంది. [చప్పట్లు] ఎలా? ఎలా? నిజమేనా? అంటే చూడండి, శ్రీరామచంద్రుడు వచ్చేనాటికి అరవై మూడు మంది రాజులు వచ్చారు. కోశాగారం ఉంది, మంత్రాంగ ఉంది, పురోహితుడైన వశిష్టులవారు ఉన్నారు. ఆ అస్త్రాన్ని ప్రయోగించడము ఎలాగో చెప్పేటువంటి విశ్వామిత్రులవారు ఉన్నారు. కృష్ణ పరమాత్మకి సాందీపురున్నాడు, శాస్త్రం చెప్పాడాయన. మరి ఈ సత్య సాయి భగవానునికి గురువు ఎవరు అని ఆలోచిస్తే, అందరికీ గురువులు ఉన్నారు గాని, గురువే లేని గురువు ఎవరన్నా ఉన్నారా అంటే అది మళ్ళీ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. [చప్పట్లు] స్వామికి గురువు ఎవరు అంటే answer లేదు మన దగ్గర. కాబట్టి తాను "ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేదం విభాగిని" ఈశ్వరుడన్నా, గురువన్నా, ఆత్మన్నా ఒక్కటే అనేటువంటి ఒక వైదిక ప్రమాణాన్ని ఆ స్వీకరించి స్వామి ఈ సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతో వస్తే, స్వామి చూడండి, తొంభై ఆరు సంవత్సరాలు నేను ఈ శరీరంలో ఉంటాను అని చెప్పారు. అది స్వామే ప్రకటన చేశారు. మనం కూడా తొంభై ఆరు రావటానికి ఇంకా ముప్పై ఏళ్ళుంది కదా. మనం తొం-- ఆయనకి తొంభై ఏళ్ళు వచ్చినప్పుడు కుటుంబర్తి వెళ్దాంలే అనుకున్నాం, కదా. స్వామిది గ్రహించారు. ఓ ఇట్లా ఉందా వీళ్ళ సంగతి అని పదేళ్ళు ముందే విత్తనలు రాయించారు, కదా. అంటే ప్రతి సంవత్సరాలు మన అలసత్వం వల్ల స్వామి దర్శనాన్ని మనం పోగొట్టుకున్నాం. మనం గనక ముందే జాగ్రత్తపడి ఏమో స్వామి అన్నారు గాని మనం ఉంటామో ఉండమో ఆయన ఉంటారు. కానీ మనం ఉండకపోతే అని అనుకోలా. ఆయన-- మనము ఉంటాం అని ఎప్పుడూ అనుకుంటాం కదా, రెండొందల ఏళ్ళు ఇక్కడ guarantee గా ఉంటామని, కదా. ప్రతి వాడు అనుకుంటాడు. రేపే ఆ ఇవాళే ఆఖరి రోజని ఎవరన్నా వాడు వచ్చి చూసి ఇక్కడ నుంచొని చెప్పమనండి, అందరూ ఇంటికి వెళ్ళిపోతారు mic వదిలేసి. ఎందుకంటే ఇది ఇంక కొన్ని గంటలే అండి. కాబట్టి వాళ్ళ అవతార ప్రకటనలో గాని, వారు చెప్పేదాన్లో గాని అంతరార్థాలు చాలా, చాలా, చాలా ఉంటాయి. సరే అది నేను ఇవాళ నిరూపించే ప్రయత్నం చేయవలసిన పనిలేదు. Swami lived on this planet earth for only ninety six years, not eighty six. అనే అదంతా కాలగణన, అది మనకిప్పుడు అవసరం లేదు. ఇప్పుడెవరూ దాని గురించి ఆలోచించటంలే. అయిపోయింది. నలభై, పంతొమ్మిది వందల నలభై అంటే పదహారు divide-- ninety six divided by ఆరు is equal to తొంభై ఆరు. అంటే పదహారు. అంటే ప్రతి పదహారు సంవత్సరాలకి ఒక పరిణామం జరగాలి స్వామి అవతారంలో. మొదటి పదహారు రాకుండానే అవతార declaration చేశారు. రెండవ పదహారు, పదహారు plus పదహారు, ముప్పై రెండు ఏళ్ళు వచ్చేప్పటికీ ప్రశాంతలయం నిర్మాణం పూర్తి చేశారు. Nineteen fifty. అయిపోయింది. అంటే తాను ఒక center develop చేశారు. చేసిన తర్వాత అప్పటికి స్వామికి కేవలం ఇరవై, ఇరవై నాలుగు plus పదహారు, అంతే ఇరవై నాలుగు సంవత్సరాలు. అయిపోయింది. అయిపోయిన తర్వాత దాంట్లో ముప్పై రెండు సంవత్సరాలు స్వామి మహిమా స్వరూపంగా ప్రపంచానికి ఆ చాలా దగ్గరైనారు. అలాగే ప్రపంచాన్ని కూడా తన ఆవరణలోకి తీసుకోగలిగారు. ఎలా అంటే భగవంతుడి శక్తి ఇంత అని చెప్పడానికి వీలు లేదు. ఇది అనంత మహాశక్తి. దేనినైనా సృష్టించగలదు అని నిరూపణ చేస్తూ వెళ్లారు. తద్వారా మనందరం సమ్మోహితులమై స్వామి దగ్గరికి వెళ్ళాం. అక్కడే మనల్ని ముంచెత్తకుండా, ఆ మాయలోనే ఉంచకుండా స్వామి నెమ్మదిగా విద్యారంగం వైపు ఒక్కసారి తలతిప్పారు. విద్యారంగం వైపు, వైద్యరంగం వైపు, ఆ తర్వాత వచ్చినటువంటి అంటే స్వామికి, దేహానికి అరవై నాలుగు సంవత్సరాలు వచ్చేప్పటికీ విద్య అయిపోయింది, వైద్యం అయిపోయింది, తాను అనుకున్న కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా చేశారు. ఇక ఏం మిగిలింది? అంటే ఇక ఇరవై రెండు సంవత్సరాలు ఆయనకి తెలుసు. ఇరవై రెండు ఏళ్ళు ఉండాలి. ఆ ఉన్న సమయంలో జాగ్రత్తగా ఇవాళ ఆలోచించినట్లయితే ఈ మొదటి పదహారు సంవత్సరాలు ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఎవరో ఒక మహాత్ముడు, ఓ మహాపురుషుడుఅనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉండి ఇవన్నీ చేస్తున్నారట, కనుచూపుతో రోగాలు నయం చేస్తున్నారట, ఐశ్వర్యాన్ని ఇస్తున్నారట, జ్ఞానాన్ని ఇస్తున్నారట. ముఖం కరువతి వాచాలం పంగం లంఘయతేగిరిం యత్కృపా కమహం వందే అని గురుస్మరణ చేస్తే మాటలు రాని వాడి చేత మాట్లాడించారట. అని ఈ కథా కథనాలన్నీ కూడా ప్రపంచాన్ని ఒక్కసారి చుట్టుముట్టినాయి. అప్పుడు ప్రపంచమే ప్రశాంతలయం వైపు ఒక అడుగు వేసింది. వేస్తే వాళ్ళు కేవలం మాయావరణంలో లేరు, కేవలం ఆ అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవటంలోనే మాత్రమే కాదు మహా పండితులు, శాస్త్రవేత్తలు, విజ్ఞానవేత్తలు, తత్వవేత్తలు, జ్ఞానులు, ముముక్షులు, తపస్సులు వీళ్ళందరూ కూడా స్వామి సన్నిధిలోకి వెళ్లారు. ఎందుకు వెళ్లారంటే ముందు స్వామి ఎవరో తెలుసుకుందామని ముందు వెళ్లారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే స్వామి ఎవరో తెలుసుకోవటం కాదు, సరే ముందు మనమేవరో మనకి తెలిస్తే తర్వాత ఆయన గురించి ఆలోచించవచ్చని జ్ఞాన మార్గంలోకి వాళ్లే ప్రవేశించారు. ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి స్వామి వాళ్ళకి ఉపదేశ సందేశ ఆదేశాలు ఇచ్చారు. ఉదాహరణ, తొలినాళ్లలో ఈ మహాత్ములు పెద్దవాళ్ళందరూ కూడా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామిని అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఏమిటంటే అధ్యాత్మ అంటే ఏమిటి? అని అడిగారు. స్వామి ఏక వాక్యంలో రెండు పదాలతో దానికి నిర్వచనం ఇచ్చారు. ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి రావటమే అధ్యాత్మ అన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు అప్పటికి స్వాధ్యాయం చేశారు. ఈ పదాలు ఏమిటి, ప్రవృత్తి ఏమిటి, నివృత్తి ఏమిటి, ఆ మార్గం ఏమిటి, వెళ్ళటం ఏమిటి, ఇదే అధ్యాత్మ అవుతుందా? వాళ్ళకి అర్థమైంది. మళ్ళీ ఒక పది పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత తలం మారి అదే ప్రశ్న మళ్ళీ వేశారు స్వామి అధ్యాత్మ అంటే ఏమిటి అని. స్వామి మొదటి జవాబు విఫల ప్రభావంలో నుంచి స్వభావంలోకి వెళ్ళటమే అధ్యాత్మ అన్నారు. అంటే ప్రభావం మన ప్రపంచ ప్రభావం మన మీద చాలా ఉంటుంది. దాన్ని బట్టి నీ స్వభావం, నీవు ఆత్మవన్న భావంలోకి రా అని చెప్పటంతో అది అర్థమైంది. ఇంకా జన బాహుళ్యం పెరిగిపోయింది. పనులుగా, ఇరవైలుగా, యాభైలుగా, వందలుగా, వేలుగా ఉన్నది లక్షలుగా స్వామి యొక్క devotees పెరిగిపోయినారు. అప్పుడు అందులో ఒకడు వివేకం ఉన్నటువంటి వాడు మళ్ళీ ఇదే ప్రశ్న వేశాడు. వేస్తే ప్రవృత్తి నుంచి నివృత్తి చెప్పలేదు, ప్రభావం నుంచి స్వభావం చెప్పలేదు. ఏం చెప్పారంటే మానవుడు కనీసం మానవుడిగా బతకగలిగితే అదే అధ్యాత్మ అన్నారు. అంటే మానవుడు తనలో ఉన్న మానవత్వ, దానవత్వ, దీనత్వ, మాధవత్వాలు నాలుగింటికీ దూరమైపోయి మానవత్వం ఎక్కడో ఉందని, మాధవత్వం మనకందదని, దానవత్వంతో ఈ ప్రపంచాన్ని శాసించవచ్చని, దీనత్వంతో చేయి చాపుతూ బతకచ్చని, ఈ రెండింటితో ఆధారపడి ఒక మహత్తరమైన మానవ జన్మను వృధా చేసుకుంటున్నటువంటి వేళ మానవుడిగా బతకండి. పశు తత్వాన్ని వదిలిపెట్టండి. మీలో ఉన్న పశుపతి తత్వాన్ని అర్థం చేసుకోండి. Try to realize that you are God, there is no God other than you. దేవుడనగా వేరు దేశమున లేడు, తాను చేయు పనుల యందు తగిలి ఉండు. చిన్న చిన్న మాటలతో. అలాగే స్వామి అతి చిన్న వయస్సులో చెప్పవలసిన గంభీరమైన ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు. వైరాగ్యం చెప్పారు ముప్పై ఏళ్ళు రాకుండా. దేహము పాంచభౌతికము కూలక తప్పదెప్పుడున్ దేహి నిరామై యుండు. గణుతింపగా దేహియ దేవదేవుడు. ఆ దేహి లోపల ఉన్న ఆత్మే దేవదేవుడు. మీరివన్నీ గ్రహించండి అంటే గ్రహించిన వాడు తల ఊపాడు. తల ఊపాడు గాని practice చేయడు. తర్వాత తర్వాత ఈ లక్షలు ఇంకా లక్షలు అయిపోయాయి. అప్పుడు స్వామి ఉపన్యాస ధోరణిలో మార్పు వచ్చింది. ఏమిటి మార్పు అంటే వీళ్ళకి ఆత్మజ్ఞాన, శుద్ధ జ్ఞానాన్ని గనక బోధిస్తే వీళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రారు. number one. వీళ్ళకిది అర్థం కాదు. IQ levels నెమ్మదిగా పెరిగిపోతున్నాయి. మెకాలే చెప్పినటువంటి విద్యా విధానంలో గ్రెగేరియన్ క్యాలెండర్ లో ఉన్న జనవరి, ఫిబ్రవరి తప్ప మనకి చైత్రం, వైశాఖం పోయినాయి, ప్రభవా, విభవా పోయింది, అన్నీ పోయినాయి. కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించి స్వామి మానవతా విలువలతో కూడినటువంటి ఒక విద్యా విధానాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చి నెమ్మది నెమ్మదిగా చిన్న కథలు దానిలో ప్రవేశపెట్టారు. అవే తర్వాత చిన్న కథలుగా books వచ్చినాయి. ఇప్పటికీ మనం చదువుతూనే ఉంటాం, పారాయణం కూడా చేస్తుంటాం. అంటే కథ చదువుతాంగానే దాన్ని పట్టుకోము. మరి ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసం నలభై నిమిషాలు స్వామి మాట్లాడితే దానిలో ఒక రెండు చిన్న కథలు గనక చెప్తే మనం ఏం చేశామంటే చిన్న కథను పట్టుకున్నాం, అధ్యాత్మను వదిలేసాం. చూశారా, స్వామి ఎంత బాగా చెప్పారండి. దాంట్లో చమత్కారం ఉంటుంది, కాస్త నవ్వు వస్తుంది, ఆహ్లాదం కలుగుతుంది. కథను పట్టుకున్నాం. దీనికి స్వామి చెప్పారు ఒకసారి. ఒక ఇల్లాలు ఇంట్లో వంట చేసుకుంటుందట. భర్త బయటికి వెళ్తున్నాడు. భర్తలకు ఉండే అలవాటు ఏమిటంటే భార్య దగ్గరికి వెళ్ళి నేను బజారు వెళ్తున్నాను, నీకేం కావాలని నెమ్మదిగా అడగడు. ఆమె పని చేసుకుంటూ ఉంటే సంచి తీసుకొని వాకిట్లోకి వెళ్ళి ఇదిగో బజారు వెళ్తున్నాను, ఏం తెమ్మంటావని అక్కడి నుంచి అరుస్తాడు. ఆమె అంటుంది కాకరకాయలు తప్ప ఏవైనా తీసుకురండి అంటుంది. ఆ తప్ప మర్చిపోతాడు, కాకరకాయ register చేసుకుంటాడు. కాబట్టి కావలసినవి వదిలేసి కాకరకాయలు ఒక కిలో తెచ్చి ఇంట్లో పడేస్తాడు. సో అట్లాగే ఏది పట్టుకోవాలో తెలియక, ఏది నిలబెట్టుకోవాలో తెలియక, దేనిని ఆచరించాలో తెలియక, ఆహా స్వామి ఉపన్యాసం పరమాద్భుతం మధురాతురం అన్న పాటలు కూడా ఉన్నాయి. అవన్నీ చేశారు గానీ స్వామి ఒక అధ్యాత్మ శచక్రవర్తి అని యోగశాస్త్రం మీద, తత్వశాస్త్రం మీద, భారతీయ విధానం మీద, భగవద్గీత మీద పదిహేను వాహినులు రాశారంటే మామూలు విషయం కాదది. కూర్చొని మన బోటి వాళ్ళ కోసం రాశారు. కాబట్టి రాముడు యోగవాసిష్ఠం రాయలేదు. వశిష్టులవారు రాముడు మాట్లాడుకుంటే మరెవరో రాశారు అనుకోండి.భగవద్గీత కృష్ణుడు రాయలేదు కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకుంటే వ్యాసులవారు రాసారు కాబట్టి ఈ అవతారం ప్రత్యేకంగా రామకృష్ణ అవతారాల కంటే భిన్నంగా అనంత వాహినీ స్వరూపంగా భారతీయ అమ్మయాన్ని అట్ట తెలుగులో రాశారు మిగతా వాళ్ళంతా ఒక కావ్యాన్ని రాశారు స్వామి భారతీయ తత్వ సిద్ధాంతాన్ని మనకప్పజెప్పారు అంటే ఈ అవతారం కేవలం ఆ ప్రాపంచికమైనటువంటి లాభాలు ఇవ్వటానికి వచ్చింది కాదు స్వామిని ఒకసారి అడిగారు స్వామి అసలు మీరు ఎవరు మాకు చెప్పండి అని ఒకానొక సందర్భంలో ఆయన ఏమన్నారంటే నేను యోగిని కాదు నేను భోగిని కాదు నేను పురుషుడిని కాదు నేను స్త్రీని కాదు నేను బోధకుడిని కాదు నేను సాధకుడిని కాదు నేను నేనైన నేను ఏ అనంతము నేనుగా కనిపిస్తున్నానో ఏ అనంతంగా నేను సంచరిస్తున్నానో ఏ దేనిని అన్నింటినీ కదిలిస్తూ ఏది కదలకుండా ఏమున్నానో ఆ నేను నేను అని నేను పరమాత్మని అని ప్రకటించారు [చప్పట్లు] ఆ నేను నేనైన నేను అంటే అది ఆ నేను నేనైన నేను అయిపోయిన తర్వాత ఇంకొక మాట అన్నారు నేను స్త్రీలలో స్త్రీని పురుషులలో పురుషుడిని కానీ నాలో నేను నేనే అంతా నేను సచ్చిదానంద గురు స్వరూపాన్ని అని ప-ప్రకటించి నేను మోక్షం ఇవ్వటానికి వచ్చిన అవతారం కాదిది మీ అందరికీ మోక్షం ఇచ్చేస్తాను ప్రశాంతి నిలయానికి రమ్మని నేను పిలవలేను అలాగే మీ కష్టాలన్నీ కడిగి మిమ్మల్నందరినీ బయట పడేయటానికి నేను రాలేను నేను ఎందుకు వచ్చానంటే అహం సత్య బోధకః సత్యం ఏమిటో చెప్పటానికి మీకు వచ్చాను ఆ సత్యము అంటే ఏది సతతము ఉంటుందో, ఏది నిరంతరమై ఉంటుందో, ఏది శాశ్వతమై ఉంటుందో, ఏది అన్నింటికీ మూలకందాయమై ఉంటుందో, ఏది అనంతమై ఆది మధ్యాంత రహితమై ఉంటుందో, ఏది వైభవంతో వెలిగిపోతుంటుందో అది చెప్పటానికి నేను వచ్చాను కనుకనే ఔపధేయమునకు సత్య నామం బిచ్చి నడతకెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతి కాంతుల వెలార్చి వచ్చ మా స్వామి మల్హారమై విచ్చమా స్వామి కల్హారమై అంటాం అంటే ఏమిటి ఔపధేయం అంటే శరీరం ఆ శరీరానికి ఒక పేరు ఉండాలి identification ఉండాలి ఆయన పెట్టుకున్న పేరు సత్యం అంతే కదా మనందరికీ తెలుసు తాను నడిచిన దారి అంతా ధర్మ స్వరూపంగా మార్చారు నడకకెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతి కాంతుల వెలార్చి మళ్ళీ చూడండి కృతయుగం నాటి సత్యం వచ్చింది త్రేతాయుగం నాటి ధర్మం వచ్చింది ద్వాపర యుగం నాటి శాంతి ప్రేమలు వచ్చినయి వచ్చ మా స్వామి మల్హారమై మల్హారం అంటే బంగారం బంగారం అంటే not metal శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యమే ఒక సాకారమై, స్వరూపమై, స్వభావమై, సగుణమై, సానందమై, సారోక్యమై, సామీప్యమై, సాన్నిధ్యమై, సాయుజ్య మార్గాన్ని బోధించటానికి వచ్చిందే తప్ప సాయుజ్యాన్ని ఇవ్వటానికి అది రాలేదు అని చెప్తూ వచ్చ మా స్వామి మల్హారమై విచ్చమా స్వామి కల్హారమై సహస్రదళ పద్మాలతో ఉన్నటువంటి ఒక మహా పుష్పం ఎట్లా ఉన్నదో అలా మా స్వామి వచ్చాడనే అవతారాన్ని మనం వర్ణిస్తాం ఇది అనుభవంలో నుంచి పుట్టాలి అనుభవించాలి అంటే ఆచరించాలి ఆచరించాలి అంటే అధ్యయనం చేయాలి అధ్యయనం చేయాలంటే స్వాధ్యాయం చేయాలి స్వాధ్యాయం చేయాలంటే ఏకాగ్రత కావాలి ఏకాగ్రత కావాలంటే ధ్యానించాలి ధ్యానం కావాలంటే ప్రార్థన చేయాలి దానికే మనం నమకము చమకము అని పేరు పెట్టుకున్నాం నమకము అంటే ప్రార్థన చమకము అంటే అభ్యర్థన అంతే కదా ఈ ప్రా-- ఇది ప్రార్థన అది అభ్యర్థన అంటే వెళ్తాం ప్రార్థిస్తాం ఇది కావాలని అడుగుతాం కాబట్టి సత్యసాయి భగవానుడి యొక్క ఈ సనాతన సారథి నామము ఏమిటి అంటే నిజమైనటువంటి సనాతన సారథ్యం వహించినటువంటి వారు భగవాన్ శ్రీ సత్య సాయి ఇక మూడు నాలుగు ప్రత్యేకమైనటువంటి అంశాలు స్వామి పరంగా మనం ఇవాళ అనుకోవాలి ఒకటి స్వామి అవతారంలో అనేక వస్తువులను సృష్టించినప్పుడు ఆ అవతారం మనకు ముందు కలిగించింది ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం అంటే ఎలా వచ్చింది ఇది? ఏమిటి ఇలా కూడా జరుగుతుందా? ఇలా ఒక శూన్యంలో నుంచి దేనినైనా సృష్టించగలరా? నాకు బాగా గుర్తు ఆరిఎస్ఎస్ వరంగల్లులో స్వామి గురించి మాట్లాడుతూ విషయాలు మాట్లాడుతూ స్వామి ప్రస్తావన వస్తే ఒక intelligent boy సడన్ గా లేచి ఒక ప్రశ్న వేశాడు మీరన్నీ చాలా బాగా చెప్పారు కానీ please tell me ఆ వస్తువుల్ని ఎలా సృష్టిస్తారండి సత్యసాయి బాబా గాలిలో నుంచి ఎలా ఇవన్నీ వస్తాయండి? అని అడిగాడు అడిగితే ఈ equation E = mc square అందరికీ తెలుసు కదా ఇది కాబట్టి భగవంతుడు God creates matter out of energy, man creates energy out of matter. ఆ అబ్బాయి ఆనంద పరవశుడైపోయినాడు కాబట్టి science principle కి లోబడి మాత్రమే స్వామి వస్తు సృష్టి చేశారని నిర్ణయానికి వచ్చాడు అతను పరమ భక్తుడు అయినాడు తర్వాత అంటే ఉపనిషత్తులు మనకిచ్చిన అధికారం ప్రశ్నించటం సమాధాన పడొద్దు సమాధానం పొందాలి ఆ సమాధానం పొందేటువంటి హక్కుని స్వామి కూడా మనకు కనిపించారు గనుక ముందు ఈ అవతారం ఆశ్చర్యం కలిగింది కలిగించింది ఆశ్చర్యం తర్వాత ఆయన చేసినటువంటి చాలా అలౌకికమైనటువంటి పనులు అద్భుతం అనిపించినాయి అద్భుతం అంటే మనం చేయలేని ప్రతిదీ అద్భుతమే అంతే కదా మనం చేయలేనిది ఇంకోకడు చేయగలిగింది దాని పేరు అద్భుతం ఆయన అద్భుతంగా పాడాడండి అంటాం అంటే మనకంటే బాగా పాడాడు అద్భుతంగా బొమ్మ గీసాడండి అంటాం మన-మనకంటే బాగా గీసాడు అంటే ఆయన పనులు అన్నీ కూడా అద్భుతం అంటే మనం ఏమి చేయలేమో భగవంతుడి దివ్య శక్తి ఏదైతే ఉన్నదో అది ఈ భూమండలం మీద ఏమి చేయగలదో అది అన్నీ నిరూపించినటువంటి ఏకైక అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి ఎవరూ కాదు రాముడు శవధనుర్భంగం చేస్తే అది నిజానికి మనం స్వామి పరంగా miracle అనే మాటని మన మైండ్ నుంచి తుడిచిపెట్టడం ఎందుకంటే మన-మన పరంగా అది miracle గాని ఆయన పరంగా అది అనుగ్రహంఅక్షర తెలుగు పదం మనకు అనుగ్రహం ఉంది. ఆ అనుగ్రహం ఏమిటంటే మనందరికీ కూడా ఇదిగో దైవం ఉన్నాడు, దైవం ఉన్నాడు. God is no where అని ఎవరో రాస్తే స్వామి దాన్ని పిల్లవాడి చేతిలో ఇలా పలక మీద no where దగ్గర now దగ్గర విడబెట్టారు. God is now here ఇది నేర్చుకో అన్నారు. No where ఏమిటి ఇది everywhere అన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా స్వామి సుబోధకమైనటువంటి విషయాలు. యోగశాస్త్రంలో దాగినటువంటి అనేక మార్మికమైనటువంటి విషయాలు. మన ప్రాణ చైతన్యం ఎక్కడ ఉన్నది? ప్రాణం వందేళ్లు ఎలా నిలబెట్టచ్చు? రెండు నిమిషాలలో దానిని ఎలా పోగొట్టచ్చు? ఏ vertical column space లో ఏది ఉన్నది? అని scientifically prove చేసినటువంటి ఒక వైజ్ఞానిక మూర్తి ఎవరంటే భగవాన్ శ్రీ సత్య సాయి. దానికి యోగశాస్త్ర గ్రంథాలన్నీ చదవక్కర్ల, జీవితం మొత్తం తపించక్కర్ల. కాస్త సూక్ష్మంగా స్వామి మాటలు, స్వామి చెప్పినవి, మనకున్న అనుభవాలన్నీ రంగరించి గనక విచిస్తే ఆశ్చర్యం నుంచి స్వామి మనల్ని నెమ్మదిగా అద్భుతం వైపు నడిపించారు. అద్భుతం మనకెప్పుడూ అపురూపే కదా! ఒక seventy చిన్న sixteen mm camera ల నుంచి మనం ఇవాళ digital camera కు వస్తే మనకిది అద్భుతం కదా. మామూలు thirty five mm నుంచి seventy mm కి వెళితే అదొక అద్భుతం. 3D కి వెళితే అదొక అద్భుతం. ఇవాళ 2G, 3G, 4G, 5G ఇంకెన్ని- ఎన్ని G లు వస్తాయో తెలీదు. వెళ్లే ప్రతిసారి అద్భుతమే. అద్భుతమే గాని అంగీకరిస్తున్నది మన మనస్సు. ప్రాపంచికమైన అద్భుతాన్ని అంగీకరించినప్పుడు దైవీపరమైనటువంటి అద్భుతాన్ని కూడా మనం ఆచరించగలిగితే, అనుభవించగలిగితే మనకు అనేక సమస్యలకి పరిష్కారాలు అక్కడే అప్పుడే దొరుకుతాయి. ఎందుకంటే వేదమే చెప్పింది ఇహమేవా now and here. ఎక్కడో లేదు ఉన్నదంతా ఇక్కడే, ఇప్పుడే. ఆ ఇప్పుడే అనే దాన్ని స్వామి underline చేసుకోమంటారు. రేపు చేస్తాను, నాగేశ్వరరావు గారు పిలిచారు నాకు కుదరదండి జూలైలో పెట్టుకోండి, ఆగస్టులో పెట్టండి అంటే ఏమున్నది రాజా భవిష్యత్తు ఎవరికి తెలుసు. జూలై మన చేతిలో ఉందా? ఇంకో ఆగస్టు మన చేతిలో ఉందా? అంటే ఏమిటంటే ఎవరు మనల్ని ఆ కార్యక్రమానికి పిలిచారో దాని వెనుక ఉన్న భావాన్ని గ్రహించి తదనుగుణంగా మన పా-పాత్ర మనం నిర్వర్తించాలి. ఇది-ఇది ఎవరికి ఎవరు favor చేయటం కాదు. మనకి మనం favor చేసుకోవటం. ఇది యోగం కల్పించడమే. ఈ యోగాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ ఆశ్చర్యం నుంచి, అద్భుతం నుంచి వచ్చిన తర్వాత ఎంతకాలం ఆశ్చర్యం? ఎంతకాలం అద్భుతం? దీనిని ప్రపంచానికి చూపించాలి. ఒక role model సృష్టించాలి. ఎలా సృష్టించాలి అన్నప్పుడు ఇందాక చెప్పిన మెకాలే విద్యా విధానం మనల్ని వేద విద్యకు దూరం చేసింది. ఇవాళ రెండు శ్లోకాలు చెప్పినవాణ్ణి గురువు అంటున్నాం. నాలుగు శ్లోకాలు చేత వాడిని జ్ఞాని అంటున్నాం. కారణం మనకు సంస్కృతం రాలేదు గనుక. మనకి English మాత్రమే వచ్చింది గనుక. మనం సంస్కృతం గనక నేర్చుకున్నట్లయితే వేద విజ్ఞానంలో ఉన్నటువంటి వైజ్ఞానిక విషయాలన్నీ గ్రహించగలిగితే, ఈ దేశం నుంచి వెళ్ళిపోయినటువంటి విజ్ఞానాన్ని మళ్ళీ మనం వెనక్కి రప్పించుకోగలిగితే. సమరాంగణ సూత్రం అని ఉంది బ్రహమీరుడి బృహత్ సంహితలో. సిమెంటు ఎలా తయారు చేయాలో ఉంది. ఇవన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ మనం మర్చిపోయి how to make cement మీద ఏడు వందల pages లు, ఆ how to make iron, steel దాని మీదో వెయ్యి, రెండు వేల pages లు. అవసరం లేదు. వేదాలను క్షుణ్ణంగా, చక్కగా decode చేయగలిగితే Germans చేసినప్పుడు, Americans చేసినప్పుడు, యువ శాస్త్రవేత్తలు చేసినప్పుడు, ఇవాళ ఈ దేశపు యువత తనకున్న సర్వశక్తినీ కూడా వృధా చేసుకుంటున్నది అని చెప్పడానికి ఒక role model ఎవరని నన్ను అడిగారు. మీ యవ్వన దశలో మీకు role model ఎవరు అని అడిగారు. అడిగితే నేను జయంతి విష్ణు నర్లయ్య గారు అనొచ్చు లేకపోతే ఆ టెన్సింగ్ నార్కే అనొచ్చు. ఇంకోడు-ఇంకోడు ఏదో పేరు పెట్టొచ్చు. నేను ఆనాడు, ఈనాడు కళ్ళు మూసే వరకు నాకు role model ఎవరంటే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. [చప్పట్లు] జీవితాన్ని ఎలా గడపాలి, కాలాన్ని ఎలా విభజించుకోవాలి, ఏ కాలానికి దేనిని ఎంతవరకు ఇవ్వాలి, ఏ శాస్త్రాన్ని ఎలా అధ్యయనం చేయాలి, అధ్యయనం చేసిన దాన్ని ఎలా ఆచరించాలి, దానికి ప్రపంచం ఇచ్చే సవాళ్లను నేను ఎలా ఎదుర్కోవాలి, నా యవ్వన, మాధ్యమమైనటువంటి వయస్సునంతా ఎలా చక్కబెట్టుకోవాలి, అటు ఇంటిని, ఒంటిని, ప్రపంచాన్ని సమన్వయం చేసుకుంటూ ఏకరీతి ఎలా సాగాలి, దీనికి నిజమైనటువంటి role model again I repeat it is none other than భగవాన్ శ్రీ సత్య సాయి. ఎందుకని అంటే ఈ అవతారం మిగతా అవతారాలన్నీ ఒక్కొక్క ప్రదేశం నుంచి వెళ్ళినాయి. ఈ అవతారం మాత్రమే ఎక్కడ ప్రభవించిందో అక్కడే ప్రవర్తిల్లింది. ఎక్కడ ప్రవర్తిల్లిందో అక్కడే పరిసమాప్తం కూడా చేసింది. ఏక ప్రదేశంలో ఏకాత్మగా, ఏక భావనతో తాను వచ్చిన అవతార కార్యక్రమాన్ని సర్వ ప్రపంచానికి కూడా పాకించి వాళ్ళకంతా భారతీయ సనాతన ధర్మాన్ని నేర్పించి హాయిగా, ప్రసన్నంగా అవతార కార్యక్రమాన్ని పూర్ణం చేసుకున్న అవతారి భగవాన్ శ్రీ సత్య సాయి. ఇంకా కొన్ని వి-విశేషాలు. ఈ ఆశ్చర్యము, అద్భుతము, ఆనందము దాటి విద్యా రంగంలోకి వచ్చేప్పటికి అప్పటికే మనం వేద విద్యకు దూరం-దూరమైనాం. దాని పక్కన పెడదాం. అసలు విద్య అంటే ఏమిటో తెలియకుండా, విద్య అంటే ఒక degree, degree అంటే ఓ ఉద్యోగం, ఒక ఉద్యోగం అంటే సుఖం, సుఖం అంటే సంసారం, సంసారం అంటే ఖాళీగా ఉండు ఏదో రోజున గుట్టుక్కుని ప్రాణం వదిలేయటం అనుకున్నాం. దీనికి మూలం ఏమిటంటే అత్యంత బలహీనమైన విద్యా విధానం. దానికి స్వామి ఆలోచన చేశారు. మానవతా విలువలతో కూడినటువంటి విద్య గనక ఈ జాతికి నేర్పకపోతే, దాని గనక మౌలికమైన, ప్రాథమికమైనటువంటి సూత్రాలు వాళ్ళకి చెప్పకపోతే ఈ జాతి నిర్వీర్యమైపోతుందని ఏనాడో నిర్ణయించి స్వామి ప్రారంభించినటువంటిదే సత్య సాయి institute of higher learning. ఇవాళప్రపంచ దేశాలన్నింటికీ వాటికి role model ఏది university కి అంటే మన సత్య సాయి institute of higher learning of పుట్టపర్తి alone is the role model చూడండి. విద్యా విధానంలో కానీ, పరీక్షా విధానంలో కానీ, బోధనా విషయంలో కానీ multi-dimensional గా ఒక యువకుడు అక్కడికి స్వామి దగ్గరికి చదువుకోవడానికి వెళితే బయటకు వచ్చేనాటికి మూడు వందల అరవై డిగ్రీలలో తనను తాను సంరక్షించుకొని సమస్త జాతిని రక్షించగలిగిన స్థాయికి ఒక్కొక్క బిడ్డ బయటకు వస్తాడు. ఒక్కొక్కడు ఒక యువశక్తి అయి ఈ ప్రపంచంలోకి వస్తాడు. ఇలా ఎవర్ని తయారు చేశారంటే మళ్ళీ గురునాం గురు అయినటువంటి సత్య సాయి భగవానుడే [దగ్గరగా చప్పట్లు]. పాటలో, మాటలో, అన్నిటా అంతటా. విద్యార్థులను చూసినప్పుడు నాకెప్పుడూ అనిపిస్తుంది స్వామి వస్తూ వస్తూ ఋషులందరూ అక్కడ ఒక్కళ్ళు ఈయన వియోగాన్ని భరించలేక అల్లాడిపోతూ ఉంటే మీరందరూ మళ్ళీ నాతోపాటు వచ్చి విద్య నేర్చుకొని మళ్ళీ మూలంలోకి వెళ్ళండని ఋషులందరూ విద్యార్థులే వచ్చినట్టుగా నేను భావన చేస్తాను. వాళ్ళందరి యందుండే తేజస్సు అటువంటిది. కాబట్టి ఈ విద్యావిధానం అయిపోయిన తర్వాత ఈ జాతి వైద్యుడికి నారాయణ స్వరూపంగా భావన చేసి ఈశ్వరునితో మహావిష్ణువుతో సమానం చేసి నమస్కరించింది. "వైద్యో నారాయణో హరిహి" అని. అది కూడా గాడి తప్పింది. గాడి తప్పి కేవలము తనకున్నటువంటి ప్రజ్ఞ ద్వారా సంపదను సృష్టించుకునే స్థాయికి ఆ రంగం నెమ్మదిగా దిగజారిపోతున్నటువంటి వేళ ప్రపంచానికి వైద్యాన్ని ఎలా అందించాలో, ఎట్లా అందిస్తే మనిషి స్వామి చెప్పారు "ఎంత will power ఉన్నా ఆసుపత్రిలోకి వెళితే ముందు పోయేది రోగం కాదు will power ముందు పోతుంది. రెండవది will power పో- కొద్దిగా నిలబెట్టుకున్నా దాని వెనకే ఇంకోటి నుంచుంటుంది, దాని పేరు bill power" అన్నారు. ఆ bill power తో వాడు అక్కడే గుటుక్కుమంటాడు. కాబట్టి will power, bill power కాదు కావలసింది అంతఃశక్తి కావాలి. కనుక ఈవేళ మీరు ప్రశాంతి నిలయంలో మన super spec ఇక్కడ గాని బెంగళూరులో గాని స్వామికి సంబంధించింది ఎక్కడ మీరు రాయ్పూర్ గాని వెళ్ళండి, భోపాల్ లో గాని వెళ్ళండి ఇంకెక్కడైనా అది ఉండని, ప్రపంచ దేశాల నుంచి ఒక appointment ఇవ్వటానికి వీలులేని సమయమే చిక్కని వైద్యులంతా ఒక నెల రోజులు వచ్చి స్వామి దగ్గర సేవ చేసి ఆ వైద్య విద్యకి అపారమైన గౌరవాన్ని సంపాదించి పెట్టడానికి వెనుక ఏ శక్తి ఉన్నదంటే మహా మహిమాన్వితమైన సాయి శక్తి మాత్రమే ఉన్నది. మరి అందరి దగ్గరికి వెళ్ళటం లేదే. They, they demand price. ఇక్కడ అది లేదు. స్వామి దగ్గరికి రావటమే చాలు అంటున్నారు. కాబట్టి విద్యా వైద్య రంగాలు అయిపోయినాయి. ఈ విద్యా వైద్య రంగాలు స్థిమిత పడే సమయంలో సమయానికి కంటే ముందు మళ్ళీ పురాణోన్మయంలో గనుక వెళ్ళినట్లయితే అన్ని అవతారాలకి ప్రతి వాళ్ళకి ఒక గాయత్రి ఉంది. సరే ఈవేళ నీవు కూడా ఒక గాయత్రిని రాసేసుకోవచ్చు. పెద్ద కష్టం, మూడు నిమిషాలు పట్టదు. ఇప్పటికిప్పుడే గాయత్రి నా పేరు మీద చెప్పేయొచ్చు. నిలబడుతుందా అది? శక్తివంతమైనది అవుతుందా? కనుక పందొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబరు ఇరవై నాలుగవ తారీఖున white field లో గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉపన్యాసం ఇవ్వటానికి లేచారు. లేస్తే ఆయన చెప్పవలసిన ఉపన్యాసం పక్కకు వెళ్ళిపోయి "సాయిశ్వరాయ విద్మహే" గాయత్రి వచ్చింది. రాగానే ఆయన ఒక్కసారి ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోయి "స్వామి రెండు పొరపాట్లు జరిగాయి, ఏమిటవి?" అన్నారు. "తన్నః సర్వః అన్నాను, అలా అనకూడదు కదా. మీ పేరు వచ్చేటట్టుగా తన్నః సత్యః అనాలి కదా" అని అంటే "కాదు కాదు సర్వః అన్నా సత్యః అన్నా రెండూ ఒకటే. సర్వము అయి ఉన్నదే సత్యం అయి ఉంటుంది. సత్యము ఏదైతే ఉన్నదో అదే సర్వము అయి ఉంటుంది. కనుక తన్నః సర్వః కరెక్ట్" అని అన్నారు. "స్వామి ఇలా లెక్కలు పెట్టాను. ప్రతి గాయత్రికి మూడు లైన్లు ఉంటాయి. ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉంటాయి. ఇంకాస్త లెక్కేస్తే నూట ఎనిమిది notations ఉంటాయి. ఈ సత్య సాయి గాయత్రిలో నూట తొమ్మిది ఏదో నాకు కనబడుతున్నది గాని అది ఏమిటో నాకు తెలియటం లేదు" అన్నాను. "ఏమీ లేదు. మిగతా గాయత్రులన్నీ నువ్వు చేసుకున్నప్పుడు ఆరోగ్యం కోసము, ఐశ్వర్యం కోసము, ఆనందం కోసము చేస్తే నువ్వు చేసిన తర్వాత ఫలితం వచ్చి తీరుతుంది. సందేహం లేదు. కానీ సత్య సాయి గాయత్రి చదవాలి అనుకుంటుండంగానే నీకు ఆ అనుగ్రహం లభిస్తుంది. ఆ నూట తొమ్మిదవ బీజాక్షరమే ఆ అనుగ్రహం" అన్నారు. [దగ్గరగా చప్పట్లు] అంటే ఒక అవతారమూర్తి తన దేహంలో ఉండగానే ఒక గాయత్రిని ఆ ప్రపంచానికి అందించటం ఒక అపూర్వమైన సన్నివేశం ఇది. ఇది స్వామి ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి అనుగ్రహం. తర్వాత వేదం అంతా కూడా ఏం చెప్పింది? వేదాలు చదవటం వేరు, అర్థం చేసుకోవటం వేరు, దాని స్వాధ్యాయం చేయటం వేరు. కానీ అసలు వేదం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటి అని ప్రశ్నిస్తే "వసుధైక కుటుంబ నిర్మాణం". వసుధ అంతా ఒకటే. ఈ ప్రపంచం అంతా, సృష్టి అంతా ఒకటే. ఆ ఒక్కటే ఎప్పుడవుతుంది? ఇది అమెరికా, అది ఆస్ట్రేలియా, అది మలేషియా, అది ఇంకోటి ఇంకోటి ఇట్లా రెండు సుమారు రెండు వందల పన్నెండు countries గా ఉంటే ఈ వసుధైక కుటుంబ నిర్మాణం ఎప్పుడు జరిగేను? మన ఇంట్లోనే, ఊళ్ళోనే జరగటం లేదే భారతదేశంలో జరుగుతుందా అని అనుకున్నప్పుడు, ఈవేళ మన మనస్సును ఒక్కసారి కుల్వంత్ హాల్ కి తీసుకెళ్ళితే స్వామి దేహంలో ఉండగా, ఆ తర్వాత కూడా కుల్వంత్ హాల్ ని గనక ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఎంతమంది వచ్చారని కాక ఎవరెవరు వచ్చారు అంటే అక్కడ జాతి లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, వయస్సు లేదు, లింగ భేదం లేదు. అంతా ఒక్కటై సమస్త ప్రపంచము ఆ ఒక్క గొడుగు కిందకి తెచ్చారు చూడండి. అది వసుధైక కుటుంబ నిర్మాణం. [దగ్గరగా చప్పట్లు]
YouTube · audio
శ్రీ వి.ఎస్.ఆర్. ,ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పార్ట్-1 Visakhapatnam
శ్రీ వి.ఎస్.ఆర్. ,ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పార్ట్-1 Visakhapatnam
Source: SAI BROTHERS on YouTube
0:00 / 41:56
More in this series