Skip to content
Transcript తెలుగు
ధర్మము అంటే ఆచరించదగినటువంటి ఒక కాల పరీక్షకు నిలబడినటువంటి ఒక మార్గం గనుక హైందవ మతం లేదు హైందవ ధర్మం ఉన్నది. హైందవ ధర్మం అంటే జీవన విధానం. నిర్మలమైన విశుద్ధమైనటువంటి ఆత్మ వైపు నడిపించేటువంటి ధర్మం గనుక మత భావాన్ని దాటి అంటే మార్గాన్ని దాటి ఆచరణీయమైనటువంటి వరణీయ స్మరణీయమైనటువంటి ఒక ధర్మాన్ని గనుక జీవుడు ఆశ్రయించినట్లయితే ధర్మము అతనిని నడిపిస్తుంది. అది వ్యక్తి ధర్మమై, కుటుంబ ధర్మమై, సమాజ ధర్మమై, ప్రాదేశిక ధర్మమై, దేశ ధర్మమై, జాతి ధర్మమై, విశ్వధర్మమై అది అంతటా ఆవరించి ఉన్నది గనుక మానవుడు ఏం చేయాలి అంటే ధర్మ మార్గంలో నడవాలి. ఇవాళ ధర్మ మార్గం అంటే కేవలం చాలా పరిమితమైనటువంటి అర్థంలోకి వెళ్ళాలి, వెళ్తున్నాం. మంచి పనులు చేయటం, మంచిగా ఆలోచించటం ఇది మాత్రమే కాదు. ధర్మము అంటే పరంపరానుగతమైనటువంటి ఒక భావనా స్థితిని ఏదైతే మన పూర్వీకులు మనకంటే ముందు వచ్చినటువంటి వారు దానిని ఆచరించి శ్రేష్టులైనారో, వరిష్టులైనారో, మహాత్ములైనారో, మార్గదర్శనం చేశారో అటువంటి వారందరూ కూడా మనకి ధర్మ మార్గ అవలంభనం చేసి మానవుణ్ణి సక్రమమైన మార్గంలో నడవమని చెప్తూ ఉన్నారు. కాబట్టి మతాన్ని దాటి, మతాన్ని దాటుతూ ధర్మం వైపు వచ్చి ఇక అక్కడ ఆగిపోవటానికి వీల్లేదు, నేను సత్కర్మలు చేశాను, నేను మంచివాడిగానే ఉన్నాను, అంతా బ్రహ్మాండంగా ఉంది అని అనుకున్నట్లయితే ప్రయోజనం లేదు గనుక దానికంటే పరమోన్నతమైనటువంటి ఆత్మ భావనలోకి వెళ్ళాలి. ఇదే ఆత్మ విచార మార్గం కాబట్టి ఆత్మ విచార మార్గంలో మనకి ఏవి అడ్డు వస్తున్నాయి అంటే అనాత్మ అడ్డం వస్తున్నది. నిజానికి అనాత్మను గురించి గనక అర్థం చేసుకుంటే మిగిలిందంతా ఆత్మే. అనాత్మ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే చేయబడినది. ప్రకృష్టంగా చేయబడినది ప్రకృతి. అంటే నిర్దుష్టంగా చేయబడినది, perfect గా చేయబడినది. ఒక ఋతువు వెంట ఋతువు, కాలం వెంట కాలం, గమనం వెంట గమనం, దివారాత్రాలు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, ఆకాశంలో ఉన్నటువంటి సమస్త ఖగోళం, నేల మీద ఉన్నటువంటి ఇదిగో మన భూగోళం, ఇదంతా కూడా ఒక సమస్థితిలో నడుస్తూ ఉన్నది గనుక ఇది ప్రకృతి అయింది. ప్రకృతి పరమాత్మ యొక్క ఛాయగా మనల్ని భావన చేయమన్నారు. ఛాయ ఎట్లాగైతే original కాదో, అంటే బింబం original, ప్రతిబింబం original కాదు. దాని యొక్క బొమ్మ. మనము అద్దం. అద్దంలో ఉన్నది మనం కాదు. బొమ్మ మనం కాదు. మనం స్పష్టం, మనం clear, మనమే సత్యం. అద్దంలో కేవలం మనల్ని మనం చూసుకోగలుగుతున్నాం. కాబట్టి బింబ-ప్రతిబింబ భావంతో ప్రకృతిని గనుక మనం చూడగలిగినట్లయితే మనకి అనేకమైనటువంటి భావాలు కలుగుతాయి. అందుకే శంకర భగవత్పాదులు కూడా ప్రపంచాన్ని గురించి చెప్తూ దక్షిణామూర్తి స్తోత్రంలోనే మనకు వ్యాఖ్యానం చేశారు ఆయన. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా, యః సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ ప్రపంచం అంతా కూడా ఒక కదిలిపోయే బొమ్మ, తెరమీద బొమ్మ, అద్దంలో బొమ్మ. ఉండేది కాదు పోయేదే, అదృశ్యం తన్నశ్యం అంటున్నారు. అనేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పటమరిస్తున్నటువంటి వేళ ఆత్మానుభవాన్ని ఎలా పొందాలి అన్నదే జీవుడి యొక్క లక్ష్యం కావాలి. ఆత్మ విచార మార్గంలోకి వెళ్లే ముందు అనాత్మను జాగ్రత్తగా చూసినట్లయితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో ఉన్నటువంటి ప్రకృతి కొండలు, కోనలు, వాగులు, వంకలు, గుట్టలు, మిట్టలు, పిట్టలు అంతా సమస్తము చరాచరమయమై, జడాత్మకమై, కదలనివి కొన్ని, కదిలేవి కొన్ని చరాచర ప్రాణులై, జీవచరాలై, వృక్షాలై, కొండలై మనకి కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా దృశ్యమాన ప్రపంచానికి సంబంధించినవి. వాటిలలో కొన్ని రాలిపోతున్నాయి, కొన్ని ఎండిపోతున్నాయి, ఋతువు వెంట ఋతువు మార్పు చెందుతున్నాయి, రూపాంతరీకరణం చెందుతున్నాయి, భావాత్మకంగా సాగుతున్నాయి. ఇటువంటి పరిపూర్ణమైనటువంటి సిద్ధత్వ శుద్ధత్వాల రెండింటినీ జీవుడు పూర్ణంగా ఆధారం చేసుకొని అట్లాగే తన దేహం కూడా ఇప్పటికీ ఎన్ని రకాల మార్పు చెందిందో మనకి మనమే జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆత్మ విచార మార్గానికి వెళ్ళబోయే ముందు ప్రకృతిని, పరమాత్మని సమన్వయం చేసుకుంటూ మనల్ని మనం గనుక అనుకున్నట్లయితే ఇవాళ మన దేహం కూడా అనేక మార్పులు చెందుతూ ఉన్నది. తల్లి అంటే మాతృ గర్భాలయంలో మనం కేవలం ఒక అండంగా, ఆపై ఒక పిండంగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనం నెమ్మది నెమ్మదిగా విచారణ చేస్తూ వెళితే అనేక మార్పులు చెందాం. శిశువుగా వచ్చాం, కౌమార యవ్వనాలు దాటుతూ ఉన్నాం, మధ్య వయస్సు వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది. మారుతున్నటువంటి దేహం మారుతూనే ఉన్నది. మారని ఆత్మ మారకుండా అక్కడే ఉన్నది. అనాత్మలో ప్రకృతిని చూసినప్పుడు ఋతువు వెంట ఋతువు ఒక్కొక్క చెట్టు ఒక ఋతువులో పూస్తున్నది, మరొక ఋతువులో కాస్తున్నది, ఒక ఋతువులో ఆకులు రాల్లుస్తున్నది, మరొక ఋతువులో నెమ్మదిగా మొగ్గలు, చిగురాకులు మళ్ళీ మోసులెత్తుతున్నాయి, తొడుగుతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, గిడుతున్నాయి, కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి, ఎప్పటికప్పుడు నవనవోన్మేషంగా సాగుతున్నాయి గనుక వీటన్నింటినీ మనం విచారణ చేసినట్లయితే అనాత్మ ఛాయా మాత్రంగా ఉన్నది, ఒట్టి నీడలాగా ఉన్నది. ఇవాళ మన ఆలోచనలన్నీ original గా ఆలోచనలు virgin thought అంటాం.ఆ virgin thought లో నుంచి ప్రాపంచికమైన భోగం వైపు, లౌక్యం వైపు, లౌకికం వైపు ఎప్పుడైతే మన ఆలోచనలు సాగుతాయో, పారలౌకిక భావనలన్నీ వెనకబడిపోతాయి గనుక ఆత్మానాత్మ విచారణని మన దేహంతో ప్రారంభిద్దాం. దేహానికి అనేకమైనటువంటి స్థితిగతులున్నాయి. స్థూల శరీరం కనబడుతున్నది. సూక్ష్మ శరీరం స్వప్నానుభవాన్ని పొందుతున్నది. కారణ శరీరం రెండింటి నుంచి బయట పడుతున్నది. అంటే నిద్రావస్థ లో నుంచి జాగ్రదవస్థ లోకి వస్తోంది. పడుకుంటున్నాం, నిద్ర లేస్తున్నాం. పడుకున్నంత సేపు హాయిగా ఉన్నదంటున్నాం. హాయి దేనికి అంటే అంటున్నది ఎవరు అని ప్రశ్న వేసినప్పుడు తెల్లవారేసరికి మన మనస్సు మాత్రం చెప్తున్నది. హాయిగా నిద్రపట్టింది, హాయిగా ఉన్నాము అంటున్నాం. మనం ఏం పని చేయలేదే, ఏం పుస్తకం చదవలేదే, సంగీతం వినలేదే, మంచి మాట అనలేదే, వినలేదే, వస్తువుని కనలేదే, మరి ఆనందం హాయిగా ఉన్నదని ఏమి చేయనప్పుడు అంటున్నాం, పగలంతా పనిచేసి అలసిపోయాం అనుకుంటున్నాం. దీనికి కారణం స్వాప్నిక అనుభవంలో ఇంద్రియాలన్నీ సమసిపోయి ఉన్నాయి. అనేకమైనవి ఏర్పడుతూ ఉన్నాయి. స్వప్నాల సంబంధించినటువంటి విషయాలన్నీ మనకు తెలియకుండానే ఒక అనుభవాన్ని, మనకు తెలియకుండానే ఒక అనుభూతిని లోపల record చేసి పెడుతున్నాయి. record ని మళ్ళీ మనం retrieve చేసినప్పుడు నిద్ర లేవగానే నేను హాయిగా ఉన్నాను అంటున్నాం. ఇది స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు సంబంధించింది. తర్వాత మనస్సు ఉన్నది. మనస్సు అంటే ఆలోచనల పుట్ట, ఆలోచనల కట్ట. అంటే అనేకమైనటువంటి కట్టెల మోపు ఎట్లాగైతే అడవిలోకి వెళ్ళినటువంటి కట్టెలు కొట్టేవాడు పచ్చి కట్టెలు, ఎండు కట్టెలు, ఎండి ఎండని కట్టెలు అన్నీ తెచ్చుకుంటాడో అట్లాగే మన ఆలోచనలు కూడా పక్వానికి వచ్చినవి కొన్ని, పక్వానికి రానివి కొన్ని, అప్పుడే పుట్టినవి కొన్ని, చాలా బలమైనవి కొన్ని, అత్యంత బలహీనమైనవి కొన్ని, పనికొచ్చేవి కొన్ని, పనికిరానివి కొన్ని అన్ని రకాల ఆలోచనలన్నీ గనక కలిపి దానికి ఏదన్నా కట్టెల మోపుకి, ఆలోచనా సమూహానికి ఏదన్నా పేరు పెట్టాలనుకుంటే దాని పేరు మనస్సు అన్నాం. మనస్సు అంటూ లేదు. ఉన్నది అని మనం అనుకుంటాం. మనలో పుట్టి, మనలో పెరిగి, మనలోనే విజృంభించి మన మీద యాజమాన్యాన్ని, అధికారాన్ని చలాయించేటువంటి మనస్సును గనక మనం నియంత్రించుకోకపోతే తర్వాత వచ్చేటువంటి మన బుద్ధి మనకు అక్కరకు రాదని, బుద్ధి అంటే intellect అని, ప్రబుద్ధమానమైనటువంటి స్థితి ఎక్కడ enlightenment తో కూడిన intellect ఉంటుందో అది ప్రపంచానికి అక్కరకు వస్తుంది. అంటే అనేక quotients ఉన్నాయి. quotients అన్నింటినీ కూడా మానవుడికి emotional quotient ఉంది, intelligent quotient ఉంది. intelligence వల్ల మేధావిగా గుర్తించబడతాడు. emotions వల్ల మానవుడిగా గుర్తించబడతాడు. చెడ్డ emotions గనక అయితే పతితుడుగా గుర్తించబడతాడు. కానీ spiritual quotient ఆధ్యాత్మికమైనటువంటి భావనా భూమిక నుంచి మానవుడు గనక వైదొలగినట్లయితే ప్రకృతిని సత్యంగా, ప్రకృతిని అచ్చంగా, ప్రకృతిని నిజంగా, ప్రకృతే అంతాగా అన్నీగా భావించి అక్కడ జీవుడు తన ప్రస్థానంలో ఆగిపోతాడు గనుక మానవ మేధని దాటినటువంటి, పరమోత్కృష్టమైనటువంటి ఒక భావన ఉన్నదని అది మనస్సు, బుద్ధి, ఆపై చిత్తము.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -70

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -70

Source: TFC Spiritual on YouTube

0:00 / 10:52

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

    Now playing
  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77