Skip to content
Transcript తెలుగు
ఆరవింద సుహృద సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన బ్రాహ్మణ్యం స్థితోతుపితరం వటమూలవాసం సంస్మారయంతమచలం తమనుస్మరామి ఓం నమో భగవతే శ్రీ రమణాయ అరుణాచల శివా అరుణాచలా భగవాన్ శ్రీ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఆందోళనాయత్తమైన ఆధునిక ప్రపంచానికి ఒక మార్గోపదేశనం చేసి పరమ పవిత్రమూ, పరమ ధార్మికమూ, సనాతన ధర్మ వేదిక అయినటువంటి భారతదేశంలో అనేకమంది మహర్షులు, తాత్వికులు, జ్ఞానులు, ముక్తులు, జీవన్ముక్తులు ఎందరో వచ్చి ఒక జాతిని ప్రభావితం చేసిన సందర్భాలు అనేకం. పరంపరలో అరుణాచల క్షేత్రానికి ఒక ఆత్మానుభవాన్ని పొందిన వెంకట్రామన్ అరుణాచలాన్ని చేరుకొని తనను తాను ఎరుగు ఎరుక ఏదో తెలియవలసి ఉన్నందువలన తెలిసినటువంటి ఆత్మానుభవాన్ని స్వీయమైనటువంటి సాధనతో తన శరీరంలో, తన జీవన విధానంలో, జీవన దృక్పథంలో నిలబెట్టుకునేటువంటి ఒక ప్రయత్నమే రమణుల అరుణాచలానికి ఆగమనం. భగవాన్ శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి చెందినటువంటి భగవాన్ రమణ మహర్షి అసలు పేరు వెంకట్రామన్. పదహారు, పదిహేడు సంవత్సరాల మధ్య కాలంలో తన శరీరం నుంచి ఏదో బయటకు వెళుతున్నట్లు కానీ మళ్ళీ అదే వెనక్కి వస్తున్నట్లు ఒక ఆత్మానుభవాన్ని పొందినప్పుడు, "ఈ పోతున్నది ఏమిటి? ఉంటున్నది ఏమిటి? యద్ దృశ్యం తన్నశ్యం. ఏది కనిపిస్తున్నదో అది పోయేదా? ఏది కనిపించటం లేదో అది ఉండేదా?" అని ఒక తాత్వికమైన చింతన మనస్సులో పొటమరించినప్పుడు, ఆత్మానుభవాన్ని పదే పదే అనుభవించి తన ఇంటికి ఎవరో ఒక బంధువు వచ్చినప్పుడు తన తండ్రి బంధువుని "మీరు ఎక్కడ నుంచి వచ్చారు?" అని ప్రశ్నించినప్పుడు బంధువు "అరుణాచలం నుంచి" అన్నప్పుడు అరుణాచల అనేటువంటి పదం, నామం వెంకట్రామన్ మనస్సులో ఒక ఉద్విగ్నత, ఒక తాదాత్మ్యత, ఒక అన్వేషణ వీటన్నింటికీ బీజ ప్రాయమైంది. ఇక ఆపై ఆయన ఎంతో కాలం అక్కడ ఎదురు చూడలేదు. తరుణం ఆసన్నమైంది. వెంకట్రామన్ అరుణాచలానికి ప్రయాణం కట్టారు. వెళుతూ వెళుతూ ఇంట్లో ఒక చిన్న ఉత్తరం పెట్టారు. "దీనికై ఇక ఎవరూ వెతకవద్దు. అన్వేషణా పథంలో ఇది వెళుతూ ఉన్నది. స్కూల్ కి ఫీజు కట్టలేదు. ఇవ్వబడిన రెండు రూపాయలు అక్కడే ఉన్నాయి." అని తన ఇంటిని వదిలి పెట్టేశారు. అరుణాచలం ఎక్కడుందో ఆయనకు తెలియదు. ట్రైన్ కనబడితే ట్రైన్ ఎక్కారు. ఒకానొక చోట ఇక ట్రైను ముందుకు వెళ్ళటానికి వీలు లేని పరిస్థితిలో అదే కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక మౌల్వీ "ఈ ట్రైను ఇకపై ముందుకు వెళ్ళదు, మీరు దిగవచ్చును" అని అన్నప్పుడు దిగారు. దిగి నడుచుకుంటూ ఎవరో చెప్పినట్లుగా తిరువణ్ణామలై వైపు అడుగులు సాగించారు. విధంగా సుమారు రెండున్నర రోజులు కాలినడకన ఒక మట్ట మధ్యాహ్నం వేళ అరుణాచల దేవాలయ ప్రాంగణానికి చేరుకున్నారు వెంకట్రామన్. విచిత్రంగా దేవాలయ పూజారి రోజు తలుపులు వేయటం మర్చిపోయి వెళ్ళాడు. అంటే రమణులని స్వాగతిస్తున్నట్లుగా తలుపులు తెరుచుకొని ఉన్నాయి. ఎవరో పిలిచినట్లుగా, ఏదో ఒక శక్తి లాగినట్లుగా వెంకట్రామన్ వెళ్లారు లోపలికి. గర్భాలయంలో ప్రవేశించి అరుణాచల లింగాన్ని ఆలింగనం చేసుకొని "తండ్రీ! నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను. ఇకపై అంతా నీ ఇష్టం" అన్నప్పుడు ఒక్కసారి గతాన్ని స్మరించుకుంటే అది శరణాగతి, అది ప్రపత్తి, అది భక్తి. అక్కడ నుంచి ఆలింగనం నుంచి విడివడి బయటకు వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి శిరోముండనం చేయించుకొని కౌపీనం ధరించి దేవాలయంలోనే ఒక కటిక చీకటి, చాలా లోతుగా ఉన్నటువంటి పాతాళ లింగం దగ్గర ఒక స్వాత్మానంద స్థితిలో, ధ్యాన ముద్రాంకితమైనటువంటి భావనలో వెంకట్రామన్ నిలకడ చెందారు. కొన్నేళ్ళు, కొన్నాళ్ళు గడిచిపోయింది. అక్కడే శేషాద్రి స్వామి అనే ఒక మహాత్ముడు, ఒక అవధూత. ఆయన "మళ్ళీ సమయం ఆసన్నమైంది గనుక దేవాలయంలో వెళుతూ వెళుతూ, 'ఇంకా ఎంతకాలం? లోపల ఒక మహాత్ముడు తపస్సులో ఉన్నాడు. ఆయనను బయటకు తీసుకురండి.' అన్నారు.తీసుకు వచ్చినప్పుడు వెంకట్రామన్ శరీరాన్ని పురుగులు తినేసినయి. కానీ దేహ స్మృతిలో లేరు ఆయన. బాహ్య స్మృతి ఎన్నాడో కోల్పోయినారు. అలాగే గోళ్లు పెరిగి ఉన్నాయి. వెంట్రుకలన్నీ కూడా సుదీర్ఘంగా ఉన్నాయి. అటువంటి వెంకట్రామన్ ఒక కట్టె వల బిగుసుకుపోయి ఉన్నటువంటి సమయంలో ఆయనను బయటకు తీసుకువచ్చి స్నానాది కార్యాలు చేయించి సంస్కారం చేసిన తర్వాత ఆయన నిజానికి గుడిలో ఉండలేదు. అక్కడ నుంచి అరుణాచల సానువుల్లోకి ప్రస్థానం చేశారు. అక్కడ అక్కడ అక్కడ ఎక్కడికి వెళితే అక్కడ ఒక బండరాయి మీద కూర్చున్న ధ్యాన ముద్రాంకితమైనటువంటి ఒక భావనలో తనలో తాను లీనమై ఒక తాదాత్మ్య స్థితిని పొందినప్పుడు మళ్ళీ మరొక సమయం ఆసన్నమైనప్పుడు ఆయన జీవితంలో మంత్ర ద్రష్ట, వాఙ్మయ నిధి, మహా తపస్వి అయినటువంటి కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని వారి దర్శనానికి వచ్చారు. ఎట్లా వచ్చారు? హంఫ్రీస్ అనబడేటువంటి ఒక ముస్లిం వేలూరులో ఫలానా మౌనస్వామి బ్రాహ్మణ స్వామి అని పిలుస్తున్నారు అరుణాచలంలో పైన ఉన్నారు వారి దగ్గరికి వెళితే మీకు మార్గోపదేశం జరుగుతుంది అని చెప్పారు. వెంకట్రామన్ ని అన్వేషిస్తూ వచ్చినటువంటి వాడు కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. వచ్చి వెంకట్రామన్ దగ్గరకు వచ్చి, "అయ్యా పధ్నాలుగు సంవత్సరాల చిరంతన తపస్సు చేశాను. సంస్కృత వాఙ్మయాన్ని మధనం చేశాను. అనేక రీతుల వేద వాదాలు చేశాను. భాషా సంక్రాంతాన్ని పండించుకున్నాను. సర్వ శాస్త్రాలు నా వెనక పరిగెత్తుకొని వస్తున్నాయి. నేను తపస్విని. అయినా నాకు చిత్తశాంతి లభించలేదు. కారణం ఏమిటి?" అని ప్రశ్నించాడు. అనేక సంవత్సరాలు మౌనంలో ఉన్న కారణంగా భగవాన్ ఇంకా కాలేదాయన వెంకట్రామన్ తన గొంతుని సవరించుకొని కంఠనాళాలు నెమ్మది నెమ్మదిగా జాగ్రదవస్థ లోకి అంటే మళ్ళీ ఒక అవస్థ లోకి వచ్చే దాకా కంఠనాళాలు సవరించుకుంటూ నెమ్మదిగా మౌనాన్ని వీడి మొట్టమొదటిసారిగా మాట్లాడారు. "నేను అన్నటువంటి భావన దేని నుంచి ప్రారంభమై, నేను తిరిగి నేను లో ప్రవేశిస్తున్నదో" అది గమనించగలిగితే దాని పేరు తపస్సు అని మౌనం వహించారు. జ్ఞాని గనుక కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని మహదానందాన్ని పొంది మరొక్క ప్రశ్న వేశాడు. "అయ్యా తపస్సు చేశానో లేదో నాకు ఎట్లా తెలిసేది? నా తపస్సు ఫలించింది అనటానికి గుర్తేమిటి? కాస్త మార్గం చెప్పండి" అని అడిగినప్పుడు "తపస్సు చేయక ముందు మీరు ప్రపంచంలో ఉంటారు. తపస్సు పూర్ణమైన తర్వాత ప్రపంచమంతా మీలో ఉంటుంది" అని మళ్ళీ మౌనం వహించారు. క్షణంలోనే కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని వెంకట్రామన్ అనబడేటువంటి బ్రాహ్మణ బాలకుడికి లేదా మౌనస్వామికి పేరు పెట్టారు. శాంతిర్నితాంత మహితా పరమాస్య శక్తిహి వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురంచ వృత్తం ఋణాం నిదర్శనమయం రమణో మహర్షిహి అంటూ ఇకపై మీరు భగవాన్ శ్రీ రమణ మహర్షి అయి ప్రపంచానికి జ్ఞాన మార్గోపదేశం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని కావ్యకంఠులు వెంకట్రామన్ కి నామకరణం చేశారు. భగవాన్ అంటే అంటే వెలుగు అంటే జ్ఞానం. వెలుగు ద్వారా జ్ఞానాన్ని జ్ఞానం ద్వారా వెలుగుని ఎవరు దర్శించి ఉంటారో వారు మాత్రమే భగవాన్ అవుతారు. భగవాన్ అంటే దేవుడు కాదు జ్ఞాని అని అర్థం. శ్రీ శకార, రకార, ఇకారములతో కూడినటువంటి శారద అంటే వాక్కు రమ అంటే జ్ఞానలక్ష్మి. ఈశాన శక్తి పార్వతి. మూడు కలిస్తే శ్రీకారమైంది. శ్రీ రమణ. రమణ అనే శబ్దమే రమయతి ఇతి రామః ఒక రమ్యతని, రసజ్ఞతని, రసతుందిలమైన భావనా స్థితిని కల్పించేటువంటి రామ శబ్దమే రమణ శబ్దము రమణీయ శబ్దం కాబట్టి రమణంలో ఒక స్మరణ ఉంది. స్మరణంలో ఒక విచారణ ఉందది. విచారణలో ఒక సంచారణ ఉన్నది. సంచారణలో ఒక చారణమున్నది. చారణలోనే ఒక మరణం ఉన్నది. కాబట్టి రమణ అనేటువంటి శబ్దంలోనే మరణం కూడా ఉన్నది గనుక భగవాన్ శ్రీ రమణ ఆపై మహర్షి. ఎవరు మహర్షి? మనిషి మనీషి కావాలి. మనీషి ఋషి కావాలి. ఋషి బ్రహ్మర్షి కావాలి. బ్రహ్మర్షి మహర్షి కావాలి. అంటే ఎవరు అంతస్సుని ఎరిగి, రోచిస్సుని అనుభవించి, తమస్సుని అధిగమించి, తపస్సుని దాటి, లోక లోకాంతర ప్రాణాలు కదలిపోగా మహస్సుని ఆంతరంగికంగా అనుభవించగలరో అటువంటి వారు మాత్రమే మహర్షులు తప్ప అన్యులు కారు అని ఒక దివ్యమైనటువంటి నామకరణం చేశారు కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. క్షణం నుంచే భగవాన్ శ్రీ రమణ మహర్షిగా లోక ప్రసిద్ధులై, జ్ఞాన వరదాతై, తాను అనుభవించినటువంటి ఆత్మానుభవాన్ని, ఆత్మానుభూతిని అదే పాంచభౌతిక దేహంలో మనం ఉండేటువంటి ప్రపంచంలోనే సుమారు యాభై నాలుగు సంవత్సరాలు నిలబెట్టుకున్నటువంటి ఒక పరమాద్భుత ఆధ్యాత్మిక వైచిత్రి భగవాన్ రమణ మహర్షి జీవితం.అటువంటి భగవాన్ మామూలుగా ఏం మాట్లాడలేదని, ఎప్పుడూ మౌనంగా ఉండేవారని, మౌనాన్ని ఆశ్రయించి ఉండేవారని, వారు ఎవరితోనూ కలిసేవారు కాదని లోకంలో ఒక వాదో అపవాదో ఉండిపోయింది. కానీ నిజానికి భగవాన్ చరిత్రని తీవ్రంగా అధ్యయనం చేసిన వారికి, అవసరమైనప్పుడు మాట్లాడారు. చెప్పవలసినంతే చెప్పారు. ఏది చెప్పాలో, అది ఎవరికి చెప్పాలో, ఎవరికి చెప్తే వాక్కు ప్రపంచానికి అక్కరవుతుందో, ప్రతి సందేహానికి సమాధానంగా రూపాంతరీకరణం జరుగుతుందో వాటన్నింటినీ కూడా భగవాన్ ఆచితూచి మౌనాన్ని ఆశ్రయించినా ఎడనెడ అప్పుడప్పుడు మౌనాన్ని విచ్ఛేదనం చేసుకొని మాటలను ఆశ్రయించి చెప్పవలసిన దానిని చెప్పక చెప్పేశారు. అయితే ఎవరు వెళ్లారు? మాన్యులు వెళ్లారు, సామాన్యులు వెళ్లారు, అతి సామాన్యులు వెళ్లారు, జ్ఞానులు వెళ్లారు, ముముక్షువులు వెళ్లారు, తాత్వికులు వెళ్లారు, శాస్త్రజ్ఞులు వెళ్లారు, భక్తులు వెళ్లారు, కడు బీదవారు వెళ్లారు, అతి ధనవంతులు వెళ్లారు. రాజాధిరాజులు కూడా వెళ్లి వారి దర్శనం చేసుకున్నారు. అయితే వీరిలో సహజంగా ప్రాపంచికమైన కామ్యసిద్ధి కోసం వెళ్లిన వారుంటారు. రోగాల నుంచి, రాగాల నుంచి మనస్సును బయట పడేయమని అడిగేవారుంటారు. ప్రపంచంలో ఉండే ఈసులు, కాసులు చుట్టుముట్టి యాతనలను అధిగమించలేని నిస్సహాయులు దాంట్లో ఉన్నారు. జ్ఞానులున్నారు. శాస్త్రాధికారానికి ఒక ముద్ర వేసుకుని శాస్త్రాలు అన్నీ మాకు తెలుసని ఒక పాండిత్య గరిమతో అహంకరించినటువంటి వారున్నారు. ఏమీ తెలియనటువంటి పామరులు ఉన్నారు. వీళ్లందరూ భగవాన్ సన్నిధిలో ఏం పొందారు అంటే పరమ ప్రశాంతమైన శాంతిని పొందారు.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -1

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -1

Source: TFC Spiritual on YouTube

0:00 / 15:25

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

    Now playing
  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77