Skip to content
Transcript తెలుగు
[సంగీతం] దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ ని అని తెలుగువారు నోరారా పాడుకునేటటువంటి పాట. దేశం వెళ్ళినా వెళ్లకపోయినా ఎక్కడ కాలిడినా పెట్టకపోయినా భారతదేశంలో అంటే ఆసేతు సీతాచలంలో ఉన్నటువంటి భారతీయులందరికీ ఈరోజు అతి పవిత్రమైనటువంటి రోజు. దీనికి కారణం ఆజాదీకా అమృత మహోత్సవ్ పేరు మీద జాతి ఒకటై ముక్తకంఠంతో జాతి సాధించిన విజయాలని, జాతి ఔన్నత్యాన్ని, జాతి భవిష్యత్తుని పరమానందంగా తలుచుకునేటువంటి మధుర క్షణాలు ఇవి. కారణం ఏంటంటే స్వాతంత్రం వచ్చి పందొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనందరికీ తెలిసిందే. అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు. అయితే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచే భారతదేశం ఉన్నదా అన్నట్లుగా మనం మాట్లాడుకుంటున్నాం. పందొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు సుమారు ఒక లక్షా ఇరవై వేల సంవత్సరాల ఒక సంస్కృతి ఒక దేశం అయినట్లయితే దేశం భారతదేశం. ఇది అఖండ భారతావని. ఇది కేవలం దేశం మాత్రమే కాదు ఇది ఉపఖండం. ఉపఖండం నైసర్గికంగా అనేకమైనటువంటి మార్పులకి ఒడుదుడుకులకు లోలైనప్పటికీ కూడా హిమాలయ పర్వతాల నుంచి కన్యాకుమారి వరకు పరివ్యాప్తమైనటువంటి పవిత్ర భూమి. ఇది ధ్యాన భూమి, యోగ భూమి, తపో భూమి, కర్మ భూమి, ధర్మ భూమి, యోగ భూమి. కనుక దీనిలో లేనిదంటూ లేదు. ప్రాచీనమైన ఒక భారతీయమైనటువంటి ఒక ఆత్మ అనేకమైనటువంటి రూపాల్లో ఆవిష్కృతమైనటువంటి దేశం ఇది. ఆత్మ కేవలము మనుషులు మాత్రమే కాక నదీనదాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు, దేశం మీద గొడుగు వలే ఉన్నటువంటి పవిత్ర ఆకాశం, మనల్ని నడిపించేటువంటి పవిత్ర ధరిత్రి, ఇవన్నీ కూడా ఒక పవిత్రమైనటువంటి అంగాలు. దీనికి కంటికి కనబడని అవ్యక్తమైనటువంటి ఒక మహా శక్తికి ఇవి ప్రతిరూపాలుగా మనం భావన చేస్తాం. అందుకనే దేశంలో పసరానికి, పాముకి, చెట్టుకి, పుట్టకి అన్నింటికీ కూడా నమస్కరిస్తాం. ఇది దేశ సంస్కృతి. సనాతన ధర్మం అయితే వెయ్యేల సంవత్సరాలుగా అఖండ భారతావనిని ఆక్రమించి, ఆవహించి, ఆవేశించి, సమస్తమైనటువంటి జాతులకి వర్గ వర్ణ భేదాలు లేనటువంటి స్థాయిలో ధర్మ ప్రబోధం చేసినటువంటి మహత్పూర్ణమైనటువంటి దేశం ఇది. దేశం ఎంత పవిత్రమైనది అంటే భగవంతుడు ఎప్పుడైనా ఒక మానవ దేహాన్ని తీసుకునే రావాలి అనుకున్నట్లయితే ఆయన నిర్ణయించుకున్నటువంటి ఏకైక దేశం మహా సృష్టిలో కేవలం భారతదేశం. భారతదేశం అంటే భగవంతుని యందు రతి గల అంటే ప్రేమ కలిగినటువంటి దేశం. భగవంతుడు ఉన్నాడు అని నమ్మి జీవితాన్ని సాగించేటువంటి దేశం సర్వ భాషల, సర్వ జాతుల, సర్వ భావాల, సకల ఊహల సమన్వయ స్ఫూర్తి దేశం. అందుకనే దేశానికి మనం ఇవాళ నమస్కరించుకుంటున్నాము అంటే దేశం ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ప్రతి వ్యక్తి అవసరాన్ని తీరుస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తికి భౌతిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక స్థాయిలో విజ్ఞాన వరదానం చేస్తుంది. జ్ఞాన సముపార్జనం చేయటానికి కావలసినటువంటి అనేక మార్గాలని సూచిస్తూ ఉంటుంది. అందులో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అంటే ప్రస్థానత్రయం వంటి అనేకమైనటువంటి రచనలు మాత్రమే కాక మహా సాహిత్య సృష్టి భారత, భాగవత, రామాయణాదులు అన్నీ కూడా దేశంలో పుట్టినాయి. కనుక దేశం ఒక సాహితీ స్వరూపం. ఇది సంగీతమయం. ఇది ఒక ఆహ్లాదవనం. నిజానికి భారతదేశం కేవలం పుణ్యభూమి alone అంటే మానవులందరూ గనుక పుణ్యాన్ని ఆచరించు ముందుకు వెళ్లినట్లయితే ఇది నిజానికి పుణ్యభూమి. ఇవాళ ఆజాదీకా అమృత మహోత్సవ్ సందర్భంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలని మనం స్పృశించాలి. అంటే అది ఒక పతాకం. దేశ పతాక దానిలో ఏమున్నాయి? మూడు చారాలున్నాయి. ఒకటి ముందుగా కాషాయం అది జాగానికి గుర్తు. మధ్యలో తెలుపు అది శ్వేత విప్లవానికి శుద్ధ చైతన్యానికి గుర్తు. కింద ఆకుపచ్చ రంగు ఉన్నది అది హరిత విప్లవానికి సంకేతం. ఇవన్నీ గమనించినప్పుడు వీటన్నింటినీ కూడా సమన్వయం ఎలా చేయాలి అంటే మూడింటినీ ఆక్రమించి ఉన్నటువంటి అనుసంధానం చేసే సమన్వయ చక్రమే ధర్మ చక్రం. ఇది-- "ఏవం ప్రవర్తితం చక్రం" అంటాడు కృష్ణ పరమాత్మ దేనిలో భగవద్గీతలో. ప్రవర్తితం చక్రం అంటే చక్రం అంటే ఆద్యంత రహితమైనటువంటి ధర్మానికి ఆది ఏది అంటే వేదోఖిలో ధర్మమూలం. అఖిల వేదాలకి మూలమైనటువంటి ధర్మమే గనుక ధర్మ చక్రాన్ని మనం ఆశ్రయించి...ఇరవై నాలుగు రేఖలతో కూడి ఉన్నటువంటి అశోక ధర్మ చక్రం సత్యానికి ఒక ధర్మానికి శాంతి ప్రేమ అహింస అనబడేటువంటి ఐదు అంశాలతో కూడి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి దిక్సూచిగా దీన్ని మనం భావన చేయాలి. అయితే భారతదేశం యొక్క జెండా ని ఇవాళ మనం తెలుగు వాళ్ళంగా చాలా గర్వించదగిన ఆనందించదగిన అభినందించదగిన అభివందనం చేయదగిన క్షణం మనకు వచ్చింది. రూపకర్త తెలుగువాడు, పింగళి వెంకయ్య గారు. ఆయన జెండా ని తయారు చేసినప్పుడు రూపకల్పన చేసినప్పుడు సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి చూపించినప్పుడు ఒక్క సవరణ కూడా లేకుండా దీనిని అంగీకరించి జాతి ఔన్నత్యాన్ని జాతి యొక్క నైసర్గిక భౌగోళిక సాంస్కృతికమైనటువంటి విధానాలన్నింటినీ కూడా దీని యందు పొం-పొందుపరిచారు అనేటువంటి ఒక భావనతో జాతీయ జెండాకి ఆమోద ముద్ర లభించి ఇవాళ మనందరం స్వాతంత్ర్యానికి ముందు పుట్టినవారు స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన మన బోటి వాళ్ళందరం కూడా జాతీయ జెండాకి నమస్కారం చేస్తాం. నమస్కారం చేసి జాతీయ గీతాలాపన చేస్తాం. తెలుగువారుగా మనం గర్వించదగిన మరొక అంశం ఏంటంటే జాతీయ గీత రచన చేసింది రవీంద్రనాథ్ టాగూర్ బంగ్లాదేశ్ లో అంటే ఇవాళ వెస్ట్ బెంగాల్ అంటాం. కానీ దానికి స్వరకల్పన చేసింది ఆంధ్రదేశ్ లో మదనపల్లె లో. అంటే జాతీయ జెండాకి రూపకల్పన జరిగింది ఆంధ్రదేశ్ లో, జాతీయ గీతానికి స్వరకల్పన జరిగింది కూడా ఆంధ్రదేశ్ లో. అలాగే జాతీయ గీతాలాపన అవగానే నూట నలభై రెండు కోట్ల భారతీయులు జైహింద్ అనేటువంటి ఒక ఆవేశ పూరితమైన ప్రేమ పూరితమైన ధర్మ ప్రచోదితమైనటువంటి ఒక వందనం చేస్తాం. జైహింద్ పుట్టింది ఎక్కడ అంటే ఇదిగో హైదరాబాద్ లో. జైహింద్ అని మనకి నినాదం ఇచ్చిన అటువంటి వారు. నమస్కారాన్ని ఇలా చేయాలని చెప్పిన వారు సఫ్రా. ఆయన ఇక్కడి వారే. కాబట్టి జెండా ఇక్కడే పుట్టింది, జాతీయ గీతం ఇక్కడే సంగీత రూపాన్ని ధరించింది, జైహింద్ అనేటువంటి ఒక నమస్కారాన్ని కూడా సంస్కారధారతో ముడితమై ఇక్కడ ఏర్పడింది గనుక తెలుగు వారిగా ఇవాళ ఆంధ్ర తెలంగాణ అంటురు రెండు నైసర్గికంగా ఉన్నాయి గాని మనందరం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరము కూడా గర్వించదగిన విషయం దీన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత స్వాతంత్రం వచ్చింది అంటున్నాం. ఆజాదీ అంటే స్వం-- మన స్వాతంత్రం వచ్చింది దానికి డెభై ఏడు ఏళ్ళ పండగ చేసుకుంటూ ఉన్నాం. స్వాతంత్రం అది ఆర్థిక స్వాతంత్రము, రాజకీయ స్వాతంత్రము, వ్యక్తి స్వాతంత్రము, సమాజ స్వాతంత్రము ఇట్లా అనేక పార్శ్వాలు ఇమిడి ఉన్నాయి గనుక వీటిలలో మనం ఎన్ని సాధించగలిగాము ఎన్ని సాధించలేకపోయినాము ఏమి కోల్పోయాము దేనిని నెమ్మదిగా కోల్పోతున్నాం అని కాస్త విచారణ చేసుకోవాల్సినటువంటి సమయం కూడా ఇదే సందర్భమే. అయితే డెభై ఏడు సంవత్సరాలలో భారతదేశం భూగోళం నుంచి ఖగోళం దాకా ప్రపంచ దేశాలతో సంపన్న దేశాలతో పోటీ పడుతూ కేవలం తన మేధాశక్తితో అంతరిక్షం దాకా వెళ్లగలిగింది. అంటే దేశంలో మనం పూర్వరంగంలో ఉన్నటువంటి మేధావులు, ఇంజనీర్లు, వైద్యరంగంలో ఉన్నటువంటి వారు వీరందరూ కూడా జాతికి మాత్రమే గాక ప్రపంచానికి మహోపకారం చేశారు. ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కావచ్చు, యల్లాప్రెడ సుబ్బారావు గారు పెన్సిలిన్ కనిపెట్టిన ఆయన కావచ్చు, అలాగే ధీరోదాత్తుడు అయినటువంటి ప్రజా నాయకుడైన టంగుటూరి ప్రకాశం పంతులు గారు కావచ్చు, వీరంతా కూడా తెలుగువారు. కేవలం తెలుగువారు మాత్రమే కాదు భారతీయమైనటువంటి ప్రతి రాష్ట్రంలోనూ ఇటువంటి వారందరూ కూడా దేశ సౌభాగ్యానికి, సార్వభౌమత్వానికి, దీని సమగ్రత్వానికి అన్నింటికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి తమదైన స్వీయమైన కృషితో అతీత మేధాశక్తితో అద్భుతమైనటువంటి కార్య-సాధించారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దేశం చేసుకున్నవే. పోస్టల్, రైల్వే, హిల్ స్టేషన్స్, రోడ్లు ఇటువంటివన్నీ బ్రిటిష్ వాళ్ళు చేసి వదిలిపెడితే డెభై ఐదు సంవత్సరాలలో కాలానుగుణంగా జాతి అవసరాలకు అనుగుణంగా డెభై ఐదు సంవత్సరాలుగా ఎవరు పాలించనివ్వండి అందరూ తమ-తమ పాత్రని చాలా నిష్ఠుష్టంగా నిజాయితీగా పోషించి అనేక రంగాలలో, వైజ్ఞానిక రంగాలలో, పరిశోధనా రంగంలో అన్నిటా అంతటా భారతీయమైనటువంటి ముద్ర వేయగలిగారు. అంతేకాదు డెభై ఐదు సంవత్సరాలలో తొలినాళ్ళు కొన్ని గడిచిపోయినా పందొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఇదిగో క్షణం వరకు దేశం నుంచి మేధాశక్తి బయటకు వెళ్ళి ప్రపంచ దేశాలలో తమ ఉనికిని చాటి తమ మూలాలను మళ్ళీ స్పృశించుకుంటూ తమకు వారసత్వంగా వచ్చినటువంటి సంస్కృతిని తమ జాతి యొక్క ధర్మాన్ని దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా తమ తమ విధిక్త ధర్మాన్ని నెరవేరుస్తూ జాతితో మమేకమై సమాంతరంగా జీవిస్తున్నటువంటి ఒక అద్భుత సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రత్యేకంగా ఆధ్యాత్మిక రంగంలో ఒక చైతన్య మహాప్రభు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందులు, ఒక శిరిడి బాబా, ఒక రమణ మహర్షి, ఒక అరవింద యోగి, ఒక జల్లిల్లమూడి అమ్మ...అన్నింటినీ దాటి ఒక భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. వీరందరూ కూడా భారతీయమైనటువంటి ఆత్మను జాగృతం చేస్తూ జనకల్యాణం చేస్తూ వెళ్లారు. అలాగే శంకర ఆమాయ పీఠాలుగా ఉన్నటువంటి నాలుగు పీఠాలలో [కొట్టు] ప్రధానంగా దేహం, దేశం, దైవం అనే మూడు భావాలని కూడా విస్తృతంగా జన బాహుళ్యంలోకి తీసుకు వెళ్ళిన వారు కంచి పీఠాధీశ్వరుడు అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. వారినే మనం నడిచే దేవుడుగా పిలుస్తాం. ఆయన భారతీయ సంస్కృతిని, భారతీయమైన సదాచారాన్ని జాతికి చక్కగా పరిచయం చేస్తూ శాస్త్రాలలో ఉన్న విషయాలన్నింటినీ కూడా నిత్య నైమిత్తిక జీవితంతో అనుసంధానం చేస్తూ సుమారు నూరు సంవత్సరాల తమ అవనీ సంచారంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను తయారు చేశారు. వారి తర్వాత వచ్చినటువంటి విజయేంద్ర సరస్వతి స్వామివారు జన జాగరణ, జన కళ్యాణ అనేటువంటి ఒక భావనను తీసుకుని పీఠాన్ని ప్రపంచం యావత్తు అర్థం చేసుకునేలాగా దాని ఆదర్శాలను అవగతం చేసుకుని ఆచరణీయం చేసేటువంటి దిశగా వెళ్తే ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు చరిత్ర, వాస్తు, జ్యోతిష్యము, శిల్పము అనేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ పునర్వైభవ వికాస మార్గంలో జాతిని నడిపిస్తున్నారు. అంటే మహాస్వామి వారు నడిచే దేవుడైతే, జయేంద్ర సరస్వతి స్వామివారు నడిపించిన దేవుడైతే, విజయేంద్ర సరస్వతి స్వామివారు నడిపిస్తున్న దైవంగా జాతి భావిస్తున్నది. కాబట్టి ఆధ్యాత్మిక గురువులంతా కూడా ప్రధానంగా అరవింద యోగి, వారు ఏమన్నారు? "నా జన్మదినమైనటువంటి ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్య్రం రావాలి అని నేను కనపించనటువంటి దేవతలందరినీ ధ్యానిస్తున్నాను" అన్నారు. సంకల్పం శక్తివంతమైతే అది సిద్ధిస్తుంది. అలాగే స్వాతంత్ర సిద్ధి కూడా అలాగే జరిగింది. ఈవేళ మనం ఇవన్నీ పునశ్చరణ చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో, ఉదాహరణకి సత్య సాయిబాబా వారు సనాతన ధర్మాన్ని కేవలం ప్రాదేశికంగా పరిమిత స్థాయిలో కాకుండా అపరిమిత అనంత స్థాయిలో నూట ఎనభై ఎనిమిది దేశాల్లో భారతీయమైనటువంటి ఒక ఔన్నత్యాన్ని, భారతీయ మహాఋషుల్ని, జాతీయ నాయకులని, కర్మవీరులని, ధర్మవీరులని, త్యాగవీరులని నిత్యమూ స్మరిస్తూనే ప్రబోధం చేస్తూ జాతిని జాగృతం చేశారు. అయితే ఉత్సవము అంటే ఉత్ అంటే ఉత్కృష్టమైన, ఉన్నతమైన సవము అంటే యజ్ఞము. ఉత్సవము అంటే వేడుక కాదు, జాతర కాదు. అది మాత్రమే కాదు. ఇది మహాయజ్ఞం. యజ్ఞం అనేది ఒక అనాహత యజ్ఞం ఇది. ఆగే యజ్ఞం కాదు. కాబట్టి గతించినటువంటి కాలం నుంచి స్ఫూర్తిని పొందుతూ వర్తమానాన్ని సమృద్ధం చేసుకుంటూ భవిష్యత్తులోకి తొంగిచూస్తూ ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో మనందరం కూడా పాత్రధారులం కావాలి. ఎవరికి తోచిన రీతి వారి వారి ప్రజ్ఞల ద్వారా ప్రపంచంలో భారతీయమైనటువంటి జెండా సమున్నత స్థాయిలో రెపరెపలాడుతూ ఎగురుతూ ఉండాలని అలాగే భారతీయమైనటువంటి ఒక గీతాలాపను గురించి సమస్తమైనటువంటి రాష్ట్రాలు ఒక దేహంలో సర్వ అవయవాలు ఎట్లా సమన్వయంతో పనిచేస్తున్నాయో అలాగే అన్ని రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని నాయకులు జాగబుద్ధిని అలవరచుకొని నిస్వార్థపూరితమైనటువంటి అంటే స్వార్థమే ఎరుగని ఒక మహా స్థితిలో జాతి యొక్క ఆదర్శాన్ని, సంస్కారాన్ని జాతి అందించినటువంటి అన్ని భాషలని కూడా చక్కగా వాడుకుంటూ మాటను మంత్రంగా మార్చుకుంటూ దేశం చాలా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. దానిని నడిపించవలసిన బాధ్యత కూడా నాయకుల యందే ఉన్నది గనుక సర్వోత్తములైనటువంటి ప్రజా నాయకులని ఇప్పటికైనా మనం ఎన్నుకోవలసిన, ఎంచుకోవలసిన అవసరం ఇప్పుడు ఉన్నది. జాతి తన విలువలను పోగొట్టుకుంటూ ఉన్నప్పుడు జాగృతం కావాలి. ఏమి పోతున్నదో తెలిసిపోతున్నప్పుడు దానికి అడ్డుకట్ట వెయ్యాలి. దేనిని కోల్పోతున్నామో తెలుస్తున్నప్పుడు భవిష్యత్తుని మనం ఊహించాలి, భావన చేయాలి, సంభావన చేయాలి. దానికి ఉత్కృష్టమైనటువంటి ఆదర్శవంతమైన భవిష్యత్తు యొక్క నిర్మాణాన్ని మనం సనుజ్వలంగా ఆలోచనా స్థాయి నుంచి ఆచరణ స్థాయి దాకా దాన్ని తీసుకొని వెళ్ళాలి. నేను, నాది అన్న భావన నుంచి మనము అనేటువంటి భావనలోకి వెళ్ళాలి. టీం వర్క్ అంటే అందరి కోసం ఒక్కడు, ఒక్కడి కోసం అందరు. దేశం అనేక రంగాల్లో ప్రధానంగా మధ్య కోవిడ్ అనేటువంటి ఒక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు వ్యాక్సిన్స్ తయారు చేసినటువంటి శాస్త్రజ్ఞులకి దేశం శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. అది కేవలం వాణిజ్యపరమైనటువంటి విషయం కాదు. కమర్షియల్ యాంగిల్ ఉన్నటువంటిది కాదది. జాతి పట్ల ఒక నిబద్ధత కలిగిన వారందరూ కూడా తమ తాను సృష్టించగలిగినటువంటి వా-వ్యాక్సిన్స్ ని సృష్టించి ఇదిగో మనందరికీ కూడా మళ్ళీ ప్రాణం పోశారు. జాతికి, వైద్య రంగానికి, పరిశోధనా రంగానికి మనం నమస్కరించాలి. అలాగే ISRO కి నమస్కరించాలి. ఎందుకంటే దేశాన్ని, భూమండలాన్ని దాటి అంతరిక్షంలో ఉన్నటువంటి అనేక సంగతులన్నింటినీ కూడా మళ్ళీ మానవజాతి యొక్క వికాసానికి, పురోగమనానికి, వారి ఐశ్వర్యానికి, వారి ఆలోచనకి పదును ఎక్కించేటువంటి రీతిలో విషయ సేకరణ చేయటానికి సాగుతున్నటువంటి అణు శాస్త్రం కూడాఆ శాస్త్రజ్ఞుల కూడా మనందరం నమస్కరించాలి. ఒకరేమిటి ఎవరు ఎవరు దేశంలో పుట్టి దేశం పట్ల ప్రేమను, భక్తిని, గౌరవాన్ని ప్రకటించి దేశం ఏర్పరచినటువంటి ఒక రాజ్యాంగ పరిధిలో జీవిస్తూ rule of law ఏదైతే ఉన్నదో దానికి తలవూకి మనమందరం కూడా జీవించినట్లయితే ఒక అంబేద్కర్ రాసినటువంటి లేదా అంబేద్కర్ అధ్యక్షతన మనం రచించుకున్నటువంటి భారత రాజ్యాంగం భారతదేశానికి మాత్రమే కాదు అనేక దేశాలకి మార్గదర్శనం చేసినటువంటిది. కాలం మారుతుంటుంది, అవసరాలు మారుతుంటాయి కానీ విలువలు మారిపోకూడదు. ధర్మం మారనిది. అది ఎప్పటికీ మాయనిది, మారనిది, మాపెరగనిది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ధర్మబద్ధులవై ఉండాలి. భారత పార్లమెంటులో మనం పైన చూస్తాం మూడు సింహాల పైన మూడు సింహాల దగ్గర "సత్యమేవ జయతే" అని ఉంటుంది. సత్యమే జయిస్తుంది అని. అసత్యం రాజ్యం ఏలుతున్న అనాచారము, అవిద్య, అస్పష్టత, అహంకారము, దంభము, గర్వము, ప్రగల్భము ఇవన్నీ కూడా జాతిని అప్పుడప్పుడు అతలాకుతలం చేసినా కడగా విజయం సాధించేది సత్యమే. అంతేకాదు "యతో ధర్మస్ తతో జయః" ధర్మం ఉంటే విజయం ఉంటుంది. సత్యం ఉన్నట్లయితే విజయం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సత్య ధర్మాలు రెండూ ఎక్కడైతే ఉంటాయో అక్కడ శాంతి ఉంటుంది. శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ పురోగతి ఉంటుంది. శాంతి అంటే ఇవాళ మన భాషలో law and order. అక్కడ పురోగమనం ఉంటుంది. అనేకమైన పెట్టుబడులు వస్తాయి, విస్తృతమవుతుంది, సంపద సృష్టింపబడుతుంది, సంపద పంచబడుతుంది. పైన మానసికమైనటువంటి హింసా ప్రవృత్తి నుంచి మనిషి దూరమై అహింసా ప్రవృత్తితో ఋషులు, తత్వజ్ఞులు, మోక్ష పథగాములు, సాధకులు, శోధకులు అనంతమైనటువంటి గురు సమూహాలు వీరందరూ బోధించినటువంటి అహింసా మార్గమే శరణ్యం అన్న భావనలో జాతి అంటే భారత జాతి ఇంతవరకు దేశం మీద యుద్ధం ప్రకటించలేదు. యుద్ధం ప్రకటించని, యుద్ధం చేయని ఏకైక దేశం భారతదేశం. యుద్ధానికి లోబడి, యుద్ధ ప్రభావానికి లోబడిన దేశం భారతదేశం. అంటే మన సంస్కృతి ఒకరిని ఇబ్బంది పెట్టేది కాదు. ఒకరిని కష్ట పరిచేది, పెట్టేది, నష్ట పరిచేది కాదు. అందరి సౌభాగ్యాన్ని కోరేది. "మైత్రి భజతాం" అంటారు కంచి మహాస్వామి వారు. అంటే స్నేహం కావాలి, ప్రేమ కావాలి, గౌరవం కావాలి తద్వారా ఆనందాన్ని పొందాలి అని అద్భుతమైనటువంటి అమృతమైనటువంటి అమృతం అంటే చావు లేని [దగ్గు] మార్పు ఎరగని, నిర్మలమైన, నిశ్చలమైన, నికరమైన, నిష్ఠాపూర్వకమైనటువంటి ఒక భావ సంపదని భారత జాతి అలవర్చుకునేటువంటి ఒక మహత్తర దశ ఇది. దశలో దిశానిర్దేశం చేయడానికి గురువులున్నారు, ప్రాచీన వాంగ్మయం ఉంది. అనేకమైన మహాత్ములు ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు నడిపించడానికి సమసిద్ధత వహించి, సారధ్యం వహించి నడిపిస్తున్నప్పుడు ప్రాజ్ఞులైన వారు వెళ్తున్నటువంటి మార్గంలో మనం కూడా నడుస్తూ వెళ్లినట్లయితే కాలం మీద మనం కూడా ఒక పదముద్ర వేయగలుగుతాం. ఆజాదీ అమృత మహోత్సవ్ సమయంలో దేశ సౌభాగ్యాన్ని కోరి, దేశ సౌభాగ్యంలో పాలు పంచుకొని దానికే తమ ధన, తన, మాన, ప్రాణాలని అన్నింటినీ కూడా పరిత్యాగం చేసినటువంటి స్వాతంత్ర సమర యోధులందరికీ కూడా ఇవాళ మనం శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేయాలి. వా-అలాగే దేశంలో నేలలో, బురదలో, మట్టిలో ఆకాశం వైపు నీటి చుక్క కోసం ఎదురుచూస్తూ మన కడుపు నింపటానికి అహర్నిశము, అహోరాత్రాలు పనిచేసేటువంటి రైతులకి మనం నమస్కారం చేయాలి. వారు లేకపోతే "అన్నం బహుకుర్వీత" అన్న ఉపనిషత్ వాక్యం ఇవాళ బయటికి వచ్చేది కాదు. మనం పండించలేం. పండించిన దానిని మనం కొనుక్కొని తినగలం. మరి పండించే వాడికి ఎవరు వాడు? వాడు ఒక సృష్టికర్త. రైతు ఒక బ్రహ్మ స్వరూపం. రైతు బీదవాడా? సంపన్నుడైన రైతా? ఎవరైతేనేమి "వసుంధరా బ్రహ్మదత్త". వసుంధరా, భూమండలం బ్రహ్మము ఇచ్చినటువంటిది గనుక దానిని ఆధారం చేసుకుని జాతి సంపదని కొన్ని వేల సంవత్సరాలుగా వ్యవసాయీకరణ చేసినటువంటి రైతులకి నమస్కరిద్దాం. అట్లాగే మనం ఇవాళ మన ఇంట్లో మనం ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా గుండె మీద చెయ్యి వేసుకుని నిద్ర పోగలుగుతున్నాము అంటే సరిహద్దులను కాపలా కాస్తున్నటువంటి నిద్రాహారాలు వదిలి, తాము పుట్టిన ప్రదేశాన్ని వదిలి, కట్టుకున్న ఇల్లాలిని, కన్న బిడ్డలని వదిలి మంచులో, అన్ని అననుకూల వాతావరణాల్లో నిత్య భయంతో కానీ నిత్య ధీరత్వంతో ఒక గంభీరమైన స్థాయిలో మనలందరినీ కాపాడుతున్నటువంటి జవాన్లకి, సైనిక సమూహానికి మనం నమస్కరించాలి. కనుక రాజ్యాంగానికి నమస్కరించాలి, భగవద్గీతకి నమస్కరించాలి, మంచి మతాన్ని బోధించే గ్రంథాలకు నమస్కారం చేయాలి. జాతి ప్రతి వ్యక్తి మరొక వ్యక్తి పట్ల ఉదారమైన, సమున్నతమైనటువంటి ఒక భావం ప్రకటిస్తూ ప్రపంచంలో చేదోడు వాదోడుగా ఉంటూ అంటే "సహనావవతు సహనం భునక్తు సహవీర్యం కరవావహై" అన్నటువంటి వాక్యానుసారంగా ఆజాదీకా అమృత మహోత్సవ్ మనందరి యందు కూడా ఒక నిత్య నూతన నవ్య చైతన్యాన్ని నింపాలని, దివ్య భావనలతో మన హృదయాలను నిండిపోవాలని అట్లాగే మన పూర్వీకులందరినీ కూడా ప్రాతఃస్మరణీయులుగా మనం మార్చుకొని వారందరి యెడల కృతజ్ఞతాభావంతో ఉండాలని, వర్తమానంలో ఒకరినొకరు చేయి చేయి కలిపి నడవాలని, అడుగులో అడుగు వేస్తూ నడవాలని, అందరం ఒకటిగా ఉండాలని, ఐక్యతను మించినటువంటి బలం మరొకటి లేదని జాతి ఎన్నడో గ్రహించింది గనుక మత, కుల వ్యవస్థ ద్వారా జాతులు విడిపోకూడదు. జాతి ఉన్నది ఒక్కటే ఒక్క జాతి. జాతి నా భారత జాతి.దేశం ఒక్కటే అది నా భారతదేశం అంటే నేను ఉన్నటువంటి ప్రదేశం ఇది నాకు తల్లి నా తల్లికి కూడా తల్లి ఎవరంటే భారతదేశం అటువంటి మాతృమూర్తి కి నేను వందనం చేస్తూ ఆజాదీ కా అమృత మహోత్సవ్ అనేటువంటి సందర్భంలో ఇటు పార్లమెంటేరియన్స్ అసెంబ్లీ లో ఎన్నిక అయ్యేటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా తమని తాము చక్కగా సంస్కరించుకొని తమ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని తమను సభలకు చట్టసభలకు పంపిన వారందరి పట్ల ఒక గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి రాజ్య స్థాపన జరగాలని అది ప్రజారాజ్యం అనబడేది అంటే ప్రజల రాజ్యమే democracy అంటే అటువంటి స్థాపన జరగాలని ప్రజల ప్రమేయంతోనే ప్రజల ఆమోదంతోనే ఎందుకంటే జన వాక్యంతూ కర్తవ్యం అని ఒక మాట జనులు ఏం చెప్తారో అది రాజు కర్తవ్యంగా భావించాలి రాజు ఏమి చెప్తాడో జనులు అది గనుక చేసినట్లయితే అది రాచరిక వ్యవస్థ దానిలో నిరంకుశత్వము క్రూరత్వము విషాదము కూడుకొని ఉంటాయి కానీ జనుల మాట మనం గనక పాలకుడు గనక వినగలిగినట్లయితే పాలకుడు కూడా సమర్థవంతమైన పాలన అందించగలడు కాబట్టి రాబోయేటువంటి తరాలన్నీ కూడా వారు దేశంలో ఉండనివ్వండి దేశంతో పాటు సమన్వయంగా సాగాలి కానీ మూలాలు అయినటువంటి భారతీయ సంస్కారాన్ని సంస్కృతిని అన్నింటినీ మించి భారతీయ ఆత్మని నిత్య జాగృతం చేసుకుంటూ ఆత్మైక శక్తితో రాబోయేటువంటి ప్రతి క్షణము కూడా వసంతోత్సవం కావాలని అలాగే జాతి గర్వపడేలాగా మనందరం జీవించాలని కనురెప్ప వాలి వరకు జాతి సౌభాగ్యాన్ని కోరుకోవాలని మనసారా కోరుకుంటూ సత్య సాయి బాబా వాళ్ళు ఒకానొక సందర్భంలో నా పన్నెండు పదమూడు ఏళ్ళ వయస్సులో ఒక మాట చెప్పారు "మానవ జన్మ ఎత్తినందుకు ముందు చేయవలసినది తల్లిదండ్రులకు గౌరవాన్ని తీసుకురండి మీరు పుట్టిన దేశానికి గౌరవాన్ని తీసుకుని రండి దేశం మీస్-- మీకిచ్చినటువంటి సంస్కృతి విధానంలో మీ జీవితాన్ని నిర్మాణం చేసుకోండి" అన్నటువంటి మహత్తర సందేశం మనల్ని అన్నివేళలా నడిపిస్తుంది అటువంటి ఆ-ఆ నడక నడక జాతి యొక్క వైభవాన్ని ద్విగుణీకృతం చేయాలని నేను భావన చేస్తూ మీ అందరికీ ఆజాదీ అమృత మహోత్సవ్ సందర్భంగా శుభకామనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ జైహింద్. [నవ్వు]
YouTube · audio

Independence Day Message -Spiritual Scientist I Azadi Ka Amrit Mahotsav I

Home

Independence Day Message -Spiritual Scientist I Azadi Ka Amrit Mahotsav I

Source: SATHYA PEETHAM on YouTube

0:00 / 28:38