Skip to content
Transcript తెలుగు
మీరంతా వెళ్ళండి జెండాలు పట్టుకోండి అరవండి గందరగోళం చేయండి నినాదాలు ఇవ్వండి స్వతంత్రం వస్తుందని చెప్పలేరు. తరుణాధీనమైనటువంటిది కాలం కాబట్టి సృష్టి right time and ripe time వచ్చేదాకా పని జరగదు ఇది సత్యం. జరిగినప్పుడు అంతా మనదే మన వల్లే జరిగింది అనుకుంటాం జరగనప్పుడు దైవాన్ని నిందిస్తాం. దేవుడికి నా మీదే దయ లేదు అందరి మీద ఉన్నదంటాం అందరి మీద ఉండి మన మీద లేకపోవడం అంటూ లేదు. నిజానికి భగవంతుడు సాక్షిభూతుడు భగవంతుడు సమస్త కార్యకలాపాలని చూస్తూ ఉండేవాడే తప్ప దానిలో interfere కాడు intervene కూడా కాడు. మరి ఇవి ఏవీ కానప్పుడు దేవుడనే concept ఎందుకు? దేవుడంటే ఎవరు అని ప్రశ్నించినప్పుడు భగవాన్ చాలా నిదానంగా చాలా ప్రశాంతంగా చాలా ప్రసన్నంగా ఒక సమాధానం ఇచ్చారు. దైవమా God is nothing but a force and feeling within మనలో ఉన్న అంతఃశక్తే దైవం మనలో ఉన్న భావనే దైవం. దానిలో నుంచి అనేక రూపాలు అనేక భావాలు అనేక తత్వాలు చిత్రించబడినాయి. కనుక లోపల అంతఃశక్తి అయినటువంటి పరమాత్మ మన యందు ఆత్మగా ప్రకాశమానంగా ఉన్నాడు గనుక భగవంతుడంటూ ప్రత్యేకంగా లేడు ఉన్నదంతా భగవంతుడే. కానీ మనకు భగవంతుడు అనగానే ఒక నామం ఒక రూపం ఒక భావం ఒక తత్వం ఇవన్నీ అలవాటైపోయినాయి. భగవాన్ దైవం అనే మాటకి పర్యాయపదం కర్త అని వాడారు అంతే. దైవం అనే మాట వాడలా. దైవము అంటే ఆడించేవాడు అని అర్థం అసలు. దేవ అంటే ఆట దైవం అంటే ఆడించేవాడు. ఎవరిని ఆడించేవాడు? జీవులను ఆడించేవాడు. జీవులను ఎవరు ఆడిస్తాడు? తోలుబొమ్మలాటించేటువంటి తోలుబొమ్మగాడు అన్నమాట. పరమాత్మ అనేటువంటి ఆటగాడు జీవులను ప్రపంచం అనే రంగస్థలం మీద నిలిపి ఒక క్రీడా వినోదం చేస్తూ మన బోటి వారిని సృష్టించి ఆయా సందర్భాలని ఆయన వినోదంగా చూస్తున్నాడు. ఆయనకు విషాదం ఎరగని వాడు ఎవడైనా ఉంటే ఆయన పేరు దైవం. అందుకనే ఉపనిషత్తులు దేవుడికి పేరు పెట్టలే అభీహి అన్నాయి. అభీహి అంటే భీతి లేని వాడు అని. మనకు భయం ఎప్పుడు వేస్తుందో తెలుసునా? మనంతటి వాడు ఇంకొకడు ఉన్నాడు అంటే మనకు నిద్ర పట్టదు. మనంతటి వాడు ఇంకొకడు ఉండటానికి వీల్లేదు ప్రపంచంలో. భగవంతుడికి భావనే లేదు ఎందుకంటే ఆయనంతటి వాడు మరొకడు లేడు గనుక. కనుక భీతి ఎరగని వాడు అభి అలాగే మహా మంత్రాన్వవ గ్రంథంలో పరమేశ్వరుడికి మనం చెప్పుకునే సహస్రనామాల పేర్లు లేవు. సర్వభ్యః సర్వ సర్వభ్యః అని ఉంది. అంటే అన్నీ తానైన వాడు వినాశం ఎరగని వాడు మళ్ళీ ఏకాక్షరంలోకి వస్తే పరమేశ్వరుడి పేరు సహ అంటే కూడి ఉన్నటువంటి వాడు. ఎవరితో కూడి ఉన్నాడు? జనజగత్తులతో కూడి ఉన్నాడు. అందుకనే జగత్తు జనుడు జీవేశ్వరుడు జగదీశ్వరుడు అంతా ఒక్కటే ఇది వేదాంత భూమిక. వేదాంత భూమికలోనే విచారణ చేస్తూ భగవాన్ శ్రీ రమణ మహర్షి మానవజాతికి ఇచ్చిన మహత్తర సందేశం ఏమిటంటే మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి ఫలితాన్ని మీరు ఆశించనవద్దు ఆశించకుండా ఉండనవద్దు ఫలితం వచ్చాక అది ప్రపంచానికి ఇవ్వండి అని చెప్పలే. ఫల త్యాగం చేయమని కృష్ణుడు చెప్పాడు ఇక్కడ భగవాన్ మాట చెప్పలే. ఎందుకంటే వచ్చింది నాది అనుకుంటే త్యాగం చేయాలి. ఇక్కడ నాది అన్నది నేను అన్నది రెండు సమసిపోయినాయి గనుక కర్తృరాజ్ఞాయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. కనుక గందస్వామి చేసినటువంటి కర్మకి కర్త అనబడేటువంటి ఒకడు ఒక శక్తి అతనికి ఆశ్రమానికి పేరు పెట్టడం జరిగింది ఫలితం దరి-దొరికింది. తల్లి అడగమ్మ ప్రాణ నిర్గమన వేళ తన కుమారుడు అయినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి ద్వారా ఒక ఫలితాన్ని పొందింది. అది ఏమిటి అంటే ఉత్తమ లోక ప్రాప్తి. దానికంటే ముందు దేహంలో నుంచి ప్రాణం సునాయాసంగా వెళ్ళిపోయింది. కావ్యకంఠ గణపతి ముని భగవాన్ కి దూరంగా ఉన్నా ఇంకా దేశానికి స్వాతంత్య్రం రావాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కాంక్ష ఒక వాసన బలవత్తరంగా ఉన్న కారణంగా గురువు నిస్సహాయుడు అంటూ తాను అక్కడ ఎక్కడా interfere కాలేదు. చూశారా మూడు స్థాయిలలో మనకి ఇదంతా వింటున్నప్పుడు ఫలితం ఆశించకుండా పని చేయలేము అని ముందు నిర్ణయించుకుంటాం. ఫలితం ఆశించకుండా పని చేయటం మొదలు పెడదాం ఏమవుతుందో చూద్దాం అప్పుడు శ్లోకానికి అర్థం. అలాగే వాడే అంతా చేస్తున్నాడు అని భావించు. వాడు ఎవరంటే పరమాత్మను, రాముడను, కృష్ణుడను, దత్తాత్రేయుడను, నీకు దైవం వెంకటేశ్వర స్వామి అను, కాదన్న వారెవరు? రూపం ఏది గాని నామం ఏది గాని కర్త ఒకడు ఉన్నాడన్న నమ్మకం మనం ఉంచుకోవాలి. మనం అనుకుంటాం మనకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడున్నావురా అని పిలుస్తాం భగవంతుణ్ణి కదా. ఎక్కడో లేడు మన యందే ఉన్నాడు. భగవాన్ సత్యసాయిబాబా వారు దీని మీద చాలా గొప్ప వ్యాఖ్యానం చేశారు. భగవంతుడు అంటూ ప్రత్యేకంగా వేరే లేడు దేవుడనగా వేరు దేశముల లేడు తాను చేయు పనుల యందు తగిలి ఉండు. నువ్వు మంచి పనులు చేస్తే భగవంతుడు అక్కడ ఉన్నాడని అనుకో వాడు ఉండబట్టే ఇంత మంచి పని చేయగలిగాం అని అనుకో మరి చెడ్డ పని చేసినప్పుడు అక్కడ ఆయన లేడు అక్కడ మనం ఉన్నాం. మన వాసనలు ఉన్నాయి మన కార్పణ్యాలు ఉన్నాయి మన పగలు ఉన్నాయి మన జన్మాంతర సంస్కారాలు ఉన్నాయి పరిణితి లేని మన మనస్సు ఉన్నది. control చేసుకోవటానికి అలవికాని ఒక మనసు మన యందున్నది. మరి భగవంతుడు మనసును control చేయవచ్చు కదా అంటే నువ్వు ప్రయత్నం గనుక చేసినట్లయితే తప్పకుండా కర్తృరాజ్ఞాయ ప్రాప్యతే ఫలం. ఆయన ఆజ్ఞాపిస్తాడు. నేను బాగా లేను నేను చెడిపోయినాను నేను ప్రపంచానికి పరువుగా ఉండవలసిన వాడిని ఇవాళ బరువైనాను అని అనుకోండి.నెమ్మదిగా మొదలు పెట్టండి. భావనలో నుంచి ఏదో ఒక రోజున మనం బయటపడిపోతాం. బయటపడిపోయి మనల్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగి మన జీవన విధానాన్ని మనం మార్చుకొని మన ఆలోచనా సరణిని మంచి దారి వైపు మళ్ళించి మనం మన జీవితాన్ని శుభప్రదము శ్రేయోదాయకము శోభస్కరము చేసుకుంటాం. ఇది తజ్యం. కాబట్టి "కర్తవ్య రాజ్ఞ్యయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జ్యం". అయితే శ్లోకార్థంలో ఇందాక అనుకున్నట్లు ఇదంతా వింటూ ఉన్నప్పుడు అయితే మనం ఏం చేయొద్దా? వాడెవడో ఫలితం ఇస్తాడా? ఇచ్చేవాడు మనకు తెలియనక్కర్లేదా అంటే చాలా పనులలో మన జీవిత కాలంలో మనం చేసిన ఎన్నో పనులలో మనకు తెలియకుండానే ఫలితాలు వచ్చినాయి. ఆనందాలు వచ్చి ఒళ్ళో పడిపోయినాయి. ఐశ్వర్యాలు వచ్చి ఒళ్ళో పడిపోయినాయి. మనం పట్టరానంత సంతోషం మన ఒళ్ళో పడిపోయింది. అట్లాగే భరించరాని దుఃఖము ఏర్పడింది. దీనికి కారణం ఏమిటి అంటే మన ఆలోచనా విధానంలో ఉన్నటువంటి positive negative angles కారణం. విషయాన్నైనా ఒక విశాల భావంతో చూడండి. లోతుగా, గాఢంగా దాన్ని మర్యాదగా విచారణ చేయండి ఫలితాలు వేరే ఉంటాయి. దానిని negative గా చూడండి. వినాశకరమైన రీతిలో నీ ఆలోచనలను సాగనివ్వండి. దాని ఫలితాలు వేరే ఉంటాయి. ఫలితం వస్తుంది మంచా చెడా తర్వాత, లాభమా నష్టమా తర్వాత, సుఖమా దుఃఖమా తర్వాత, ఆనందమా అతిశయమా తర్వాత కానీ ఏదో ఫలితం మాత్రం మనకు వస్తుంది. కాబట్టి అది మన చేతుల్లో లేదు గనుక ఫలితం మనం ఆశించినంతగా ఎలాగూ రాదు గనుక ఆశించినంత మనకి ఎవరిస్తారు? మన deservedness ని బట్టి మన desires ఉండాలి. మన ఆలోచనలన్నీ కూడా మన పరిస్థితులు, మన శక్తి యుక్తులు, మన యందున్నటువంటి ప్రజ్ఞ, మనలో ఉన్న బలాలు, బలహీనతలు ఇవన్నీ కూడా అంచనా వేసుకుంటూ తదనుగుణమైనటువంటి ఫలితాన్ని గనుక మనం ఆశించకుండా పొందినట్లయితే ఇది ఇంతే. తృప్తి పడాలి. అంటే జీవితాన్ని మనం ఒక రీతిలో ఒక గతిలో నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు చేయవలసినటువంటి మన కర్తవ్యాలను మనం చేస్తూ ఉన్నప్పుడు చేయబడినటువంటి కర్మల ద్వారా మనకు ఒక ఫలితం ఏర్పడుతుంది. అది పరమేశ్వరుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ప్రసాదంగా లేదా ఒక ఫలితంగా మామూలు శబ్దంలో ఫలితంగా మనం గనుక స్వీకరించగలిగితే మనకు యాతనా లేదు, దుఃఖము లేదు, మనసు కష్టపడేది లేదు. కానీ మానవుడు తాను చేస్తున్న పని చాలా గొప్ప పని అని తాను చాలా ఎక్కువ కష్టపడుతున్నానని, కష్టాన్ని యజమాని గుర్తించటం లేదని, గుర్తించి తగురీతిలో తనకు ఇవ్వవలసిన ఫలితాన్ని ఇవ్వటం లేదని మనం నిజంగా నెపం నెమ్మదిగా పక్కవాడి మీద వేస్తాం. నిజంగా మన ప్రతిభ గనుక మన యాజమాన్యానికి లాభం కలిగించే రీతిలో ఉన్నట్లయితే యజమాని నమ్మకస్తుడు అయినటువంటి వాణ్ని, శ్రద్ధాళువు అయినటువంటి వాణ్ని, ప్రజ్ఞ ఉన్నటువంటి వాణ్ని, ప్రతిభావంతుణ్ణి అది వదులుకోదు. అందుకనే మంచివాణ్ని, మంచివాడి స్నేహాన్ని పది రూపాయలు ఇచ్చి తెచ్చుకోవాలి, నిలబెట్టుకోవాలి. చెడ్డవాణ్ని, చెడ్డవాడి సంగమాన్ని పది రూపాయలు ఇచ్చి వదులుచుకోవాలి. ఇది ఒక moral philosophy. కానీ మన పని మాత్రం మనం చేస్తూ వెళ్ళాలి. ఎవరికైతే మనం మాట ఇచ్చామో మాటకి అనుగుణంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. ఫలితాన్ని నువ్వేమీ ఆశించక్కర్లా. ఖచ్చితంగా నీకు రావలసినది లభించి తీరుతుంది అని చెప్తూ అటు కంద స్వామిని, ఇటు అలగమ్మని రెండు ఉదాహరణలుగా ఒకరు సాక్షాత్తు తన మాతృమూర్తి, రెండవవారు తన కష్టాన్ని ఎరిగి తన కోసం పనిచేసిన ఒక పరిచారకుడు, ఒక భక్తుడు మరి మూడవవాడు ఆయన్ని భగవాన్ సాక్షాత్తు రమణ మహర్షి కావ్యకంఠుడ్ని నాయనా అని పిలిచేవారు. తమిళనాట అరవ దేశంలో నాయనా అంటే గణపతి అని అర్థం. అన్నగారు అని అర్థం. కుమారస్వామికి గణపతి ఎట్లా అన్నగారో రమణ మహర్షికి గణపతి ముని అంటే వాశిష్ఠ గణపతి ముని అట్లా అన్నగారుగా, నాయనగా పిలవబడ్డారు. నాయనా అంటే తెలుగునాట తండ్రి అని అర్థం. మనం మన కడుపున పుట్టినటువంటి పారాడుతున్న బిడ్డ ఏడుస్తున్నప్పుడు నాయనా ఏడవకు, తండ్రీ ఏడవకు అంటాం. వాడు తండ్రి అయినాడా? నాయన అయినాడా? అంటే దాని వెనుక ఉన్న ఆత్మీయత, దాని వెనుక ఉన్న ఒక మానవతా భావన, ఒక తీవ్రమైన మృదులమైన స్వాదువైనటువంటి ఒక భావన. జన్మ జన్మాంతరాలలో నుంచి, సంస్కారాలలో నుంచి ఏర్పడినటువంటి ఒక శుద్ధ వాక్కులో నుంచి ఇది వచ్చింది గనుక ఇటువంటి దివ్యమైనటువంటి అనేకమైనటువంటి భావాలను కలిగిస్తూ జీవితాన్ని ఎలా జీవించాలి? జీవితాన్ని యదార్థంగా జీవించాలి. ఇదిగో సర్వాంగీణమైన దేహంతో ఒక పవిత్రమైనటువంటి మనసుతో ఒక ప్రజ్ఞతో ఏర్పడినటువంటి మనం ప్రపంచంలో మన కర్తవ్యాలన్నీ కూడా చేస్తూ వెళ్ళాలి. దాని ఫలితాన్ని కర్తకు వదిలిపెట్టాలి. అంతేతప్ప నేను చేసిన పని దైవమనో, ఘనమనో, గొప్పదనో, అంతకంటే ఇంకెవరూ చేయలేరనో, లేదు ఇది పాపమనో, అధమమనో మనం అనుకోనక్కర్లేదు. కర్మ కింపరం కర్మ తజ్జ్యం. మనం వస్తాం. ప్రయత్నం చేయడానికి వస్తాం. దేహంలో ఉన్నాం. అనేక ఆలోచనలు కలుగుతున్నాయి. అలాగే ఇవాళ యువత వాళ్ళను ఉద్దేశించి రెండు మాటలు ఇక్కడ చెప్పవలసిన అవసరం ఎంతో ఉన్నది. మనం kite flying అని ఇవాళ వ్యాపారరంగంలో వినపడే మాట. ఎవడు పది రూపాయలు జీతం ఎక్కువ ఇస్తే అక్కడికి పరిగెత్తుకొని వెళుతున్నాం. ఇది ఒక నివారించదగినటువంటి ఒక ప్రయాణం. ఎట్లాగంటే మన ప్రజ్ఞ perfect అయితే మనకి loyalty and trust గనుక కంపెనీ పట్ల ఉన్నట్లయితే మన యజమాని తప్పకుండా ముందో వెనకో వెసులుబాటు చూసుకుని మనల్ని గుర్తిస్తాడు. ఇక గుర్తించటం లేదు అన్న రోజున మాత్రం వెళ్ళాలి తప్ప లాలస కోసం, తాత్కాలిక ఉపశమనం కోసం, తాత్కాలికమైన సంతోషం కోసం ఒక ఎండమావి యందు నీటి చలమ ఉన్నదని పరిగెత్తినట్లుగా మనం వెళుతూ వెళుతూ ఉన్నట్లయితే మన rolling ball gathers no moss మనందరికీ తెలుసు. ఒకచోట ఉండాలి. స్థిమితంగా ఉండాలి. యజమాని మనకు అప్పజెప్పిన కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించాలి. నిర్వర్తిస్తూ ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. గుర్తింపుతో పాటు గౌరవము, మర్యాద, ఆర్థిక లబ్ధి అన్నీ ఏర్పడతాయి. ఇది యువత ఈవేళ పరిగెత్తటం కాస్త ఆపి నెమ్మదిగా వేగంగా నడవటం మాత్రం నేర్చుకోవాలి.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -08

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -08

Source: TFC Spiritual on YouTube

0:00 / 14:57

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

    Now playing
  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77