No transcript for this section.
Transcript begins at 10:40.
[పఠిస్తున్నాడు] పరమా మాహేశ్వర స్వరూపుడు, సచ్చిదానంద గురుమూర్తి అయిన శ్రీరామ్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా సత్యసాయి సేవా సంస్థలు తలపెట్టినటువంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే మహదవకాశాన్ని, ఒక పూర్ణ యోగాన్ని అనుగ్రహించిన స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ సత్యసాయి వైభవాన్ని ఎన్నేళ్లు ఎన్నాళ్లుగానో చెప్తూ వస్తూ ఉన్నా, మళ్లీ ఎందుకు అని ప్రశ్న వేస్తే విశ్వనాథ సత్యనారాయణ గారిని రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు ఇదే ప్రశ్న వేశారు. ఇన్ని రామాయణాలు ఉండగా మళ్లీ రామాయణమే ఎందుకు రాశారు అని. [పఠిస్తున్నాడు] మరల ఇదేల రామాయణంబన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎలవేళల తినుచున్నన్నమే తినుచున్నదిన్నాళ్లు తన రుచి బ్రతుకులు తనవిగాన, చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన, తలచిన రామునే కొలుతును నేనును నా భక్తి రచనలు నావిగాన, కవి ప్రతిభయుండును కావ్య శతాంశమున తొంబదియైన పాండు, కావ్య పశ్చిమ్మంతంబున రసము వెయ్యి రెట్లు గొప్పది నలకదాద్రుతని మించి అని ఆయన సమాధానం ఇచ్చారు. ఇవాళ సత్యసాయి అవతార వైభవాన్ని ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని విధాలుగా చెప్పుకున్నా, ఎందరెందరు చెప్పుకున్నా, ఎన్నేళ్లుగానో వింటూ ఉన్నా అది నవన్-నవోన్మేషం నిత్య నూతనం. ఈ సత్యసాయి భగవానుడి అవతార వైభవాన్ని కాస్త లోతుగా విచారణ చేసే ముందు భగవంతుడు ఎందుకు అవతరిస్తాడో ముందు మనం తెలుసుకోవాలి. మనకి ప్రధానమైనటువంటి పురాణ పురుషోత్తములు ఇద్దరున్నారు. ఒకరు రాముడు, మరొకరు శ్రీకృష్ణుడు. శ్రీరామచంద్రుడు ఈ జగత్తులోకి రావటానికి గల కారణాలు నేపథ్యాలు చాలా ఉన్నాయి. ఆ నేపథ్యాలలో ప్రధానమైనటువంటిది మిథిలా నగరము, అయోధ్య నగరము, లంకానగరము ఈ మూడు ముగ్గురి చేత ఏలబడుతున్నాయి. మిథిలా నగరానికి రాజు జనక మహారాజు. అయోధ్యకి దశరథ మహారాజు. లంకకి రావణ బ్రహ్మ. ఇది సత్వ రజస్ తమో గుణాలకి సంకేతంగా ఈ త్రిపురాలు మూడు కూడా ఏర్పడి ఉంటే విష్ణుడు లేడు శివుడు మాత్రమే దేవుడు అన్నటువంటి ఒక మత వైరుధ్య భావం ఏర్పడినప్పుడు, దాన్ని ప్రధానంగా రావణ బ్రహ్మ ఆచరించినప్పుడు విష్ణు భక్తులంతా తల్లడిల్లిపోయిన కారణంగా తపస్స్వాధ్యాయ సంపన్నులంతా దీనుల పడిన కారణంగా యజ్ఞయాగాదులు ఆగిపోయిన కారణంగా అందరూ వెళ్లి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారని. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారికి ఒక అభయమిస్తూ, నేను దశరథుడి ఇంట పుడతాను, దశకంధరుడి కుత్తుకలు ఉత్తరిస్తాను, దశ యువాల వరకును నా నామం వినపడేట్లుగా శ్రీరామచంద్ర నామంతో జగత్తులోకి వస్తానని ప్రకటన చేశారు. అంటే, అవతార ప్రకటన చేశారు. కానీ, ఎప్పుడొచ్చేది చెప్పలేదు, ఎందుకొచ్చేది మాత్రం చెప్పారు, ఎట్లా వచ్చేది చెప్పారు. తన పేరు తానే పెట్టుకొని జగత్తులోకి వచ్చాడు. అది మహావిష్ణువుగా ఉండగా. రాముడై వచ్చిన తర్వాత ఆయన మానవుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు గనుక ఇటువంటి ప్రకటనలు ఆయన ఏవీ చేయలేదు. ఒక సాధారణమైనటువంటి మనిషి జీవితాన్ని తల్లి గర్భాలయం నుంచి సమాధి వరకు సాగిస్తున్నప్పుడు జీవితంలో ఏర్పడేటువంటి అనేకానేక ఆఘాతాలు, సంయోగ వియోగాలు, చీకటి వెలుగులు, ఈ ద్వంద్వాలు, ఇవన్నీ ఉంటే వీటన్నింటి మధ్య ఒక మనిషి ఎట్లా మెలగాలో, మెలిగి తనకు తానే ఎట్లా వెలగాలో, తాను వెలుగుతూ ఈ జగత్తాన్ని-జగత్తుని ఎట్లా వెలిగించాలో సూచించి మార్గోపదేశం చేయడానికి వచ్చిన అవతారమూర్తి శ్రీరామచంద్ర ప్రభు. అదట్లా ఉంచుదాం. అంటే, ఆయన అవతార declaration ఇవాళ మనకు అలవాటైన పదం కాబట్టి దాన్ని వాడుతూ చెప్పుకుందాం. ఆయనేం declaration మహావిష్ణువుగా చేశాడు, రాముడిగా ఏమీ చేయలే. కృష్ణ పరమాత్మ, ఆయనా మహావిష్ణువు యొక్క అవతారమే, కానీ ఆయన మహావిష్ణువుగా ఉండగానని చెప్పలేదు. కృష్ణుడిగా వచ్చిన తర్వాత చెప్పలేదు. కానీ ఎప్పుడు చెప్పాడంటే, ద్వాపరయుగం అంతమై కలియుగం ఆరంభం కావటానికి మధ్యనున్న విరామ కాలంలో మహాభారత సంగ్రామం జరిగింది. ఆ యుద్ధ వేళలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశనం చేస్తూ రెండు శ్లోకాలలో తనను తాను ప్రకటించుకున్నాడు. [పఠిస్తున్నాడు] అంటే ధర్మజ్ఞానం జరిగినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటాను అన్నాడు. అంటే అవతార ధర్మాత్ అని చెప్పాడు.ధర్మానికి జ్ఞాని ఎట్లా జరుగుతుంది? అది నిప్పువంటిదే, చెదపట్టదే మరి అటువంటి ధర్మానికి కూడా జరుగుతుందంటే? జరుగుతుంది. ఎప్పుడంటే మనిషి తన స్వధర్మాన్ని మర్చిపోయి పరధర్మం వైపు మనస్సును మరల్చుకుని తనను తాను పోగొట్టుకుంటూ తాను ఆచరించవలసిన సనాతనమైన, ఆర్యషమైన, భారతీయమైన, వైదికమైనటువంటి ఒక విజ్ఞాన రేఖని తన నుంచి తాను దూరం చేసుకుంటున్నప్పుడు మళ్ళీ మహత్తరమైన మానవ జాతిని ఒక మార్గంలో పెట్టడానికి, ఆ మార్గము సనాతనమైన ధర్మ మార్గం కావటానికి పరమేశ్వరుడు తనను తాను సృష్టించుకుని వస్తాడు. అంతే కాదు, వచ్చి ఏం చేస్తాడు? ఇది కూడా చెప్పాడు. "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అన్నాడు. ప్రతి యుగంలోనూ వస్తాను. అప్పుడెట్లా వచ్చానో ఇప్పుడట్లా. ప్రతి యుగంలో, ప్రతి క్షణంలో వస్తూ ఉంటాను అన్నాడు. ఒక ఆలోచనై, ఒక భావమై, ఒక వాత్సల్యమై, ఒక అనురాగమై, రాగమై, ప్రేమై అనేకమైనటువంటి దివ్య రీతుల్లో ఈ పరమాత్మ ఒక అవతారాన్ని తీసుకుని వస్తాడు. అది కృష్ణ పరమాత్మ సుమారుగా మహాభారతం అంతా అయిపోయి కలియుగ ప్రారంభ వేళలకు ముందు ప్రకటన చేశాడు. ముందు ఏమీ ప్రకటన చేయలే. కానీ రామకృష్ణ అవతారాలలో రాముణ్ణి నాటి సమాజం దైవంగా గుర్తించింది, గౌరవించింది, ప్రేమించింది, ఆరాధించింది. నువ్వు తప్ప దైవం లేదు అన్నది. రాముడు అన్నాడు, "నేను కేవలం దశరథ రాజు కుమారుడిగా వచ్చా. దశరథ రాజనందనుడిగా, రాముడిగా వచ్చాను. నేను మనిషిగా ఉండదలుచుకున్నాను" అన్నాడు. అంటే లోకమంతా ఆయన్ని దైవం అంటే "కాదు, కాదు నేను మానవుణ్ణేని" అన్నాడు. కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి ఆయనని జాతి చేత, కులం చేత, రూపం చేత, సౌందర్యం చేత, భావన చేత, చేష్ట చేత, చూపు చేత అనేక కార్యకలాపాల కారణంగా నువ్వు దైవం కావడానికి వీల్లేదు అన్నది సమాజం. చూడండి! అప్పుడు ఆయన అన్నాడు, "దైవం అంటూ ఉంటే ఆ దైవాన్ని నేనే, వేదములలో సామవేదాన్ని నేనే, మాసములలో మార్గశిర మాసాన్ని నేనే, పక్షులలో గరుడ పక్షిని నేనే, అంతెందుకు మీరు ప్రపంచమంతా గాలించి వెతికి ఒక వ్యక్తిని పట్టుకొనిచ్చి ఇతడు ఉదాత్తుడు, ఉత్తముడు అని గనుక నా ముందు ఉంచబడితే ఆతడు కూడా నేనే, సర్వమూ నేనే" అని ప్రకటన చేశాడు. లోకం ఆయన్ని దైవం కాదన్నది కానీ తన దివ్యత్వాన్ని లీలాకాండతో ప్రారంభించి మహిమాకాండతో విస్తృతం చేసి ఇటు లౌకికపరంగా భారతాన్ని అంతా పరుచుకొని మహాభారత మహా కావ్యాన్ని పరుచుకొని భాగవతంలో భక్తి యోగాన్ని, భారతంలో కర్మ యోగాన్ని, కడగా భగవద్గీతలో జ్ఞాన యోగాన్ని, ఆ జ్ఞాన యోగాన్ని కర్మ, భక్తి, జ్ఞాన యోగాలతో సమన్వయం చేసి యోగ త్రివేణి పారించినటువంటి యోగీశ్వరుడు కృష్ణుడు. అది కృష్ణావతారం. ఆ కృష్ణావతారం మధుర విషాద గాథ. ఎందుకంటే ఆయనను ప్రేమించిన వారు తక్కువ ఆ రోజుల్లో, అనుమానించిన వారు ఎక్కువ, అవమానించినవారు ఎక్కువ. కేవలం విష్ణువు, విదురుడు, కుం-- అక్రూరుడు, పంచపాండవులు, ద్రౌపది వంటి వేళ్లమీద లెక్కబెట్టదగిన సంఖ్యలో కృష్ణుణ్ణి దైవంగా మాత్రమే భావించారు. మిగతా వారు మామూలుగానే ఆయన్ని సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావన చేశారు. అవమానం చేశారు. శశుపాలుడు ఒక ఉదాహరణ. అయినప్పటికీ తాను ఈ జగత్తులోకి "ఆ పరిత్రాణాయ సాధూరాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ" ధర్మాన్ని సంస్థాపన చేయడానికి మానవుడు మరిచిపోయినటువంటి, జాడ మరచిపోయినటువంటి తన విచ్యుక్త ధర్మాన్ని మరొక్కసారి గుర్తు చేసి మానవుడు మానవుడిగానే కాక మానవుడు మాధవుడు కావలసిన అవసరం ఉన్నది అని చెప్పటానికి వచ్చినటువంటి అవతారమే కృష్ణావతారం. కాబట్టి రామకృష్ణావతారాలు రెండు యుగాలను శాసించినవి. త్రేతాయుగం అంతా కూడా ఇక్ష్వాకు వంశం పాలిస్తే అందులో రాముడు అరవై నాలుగవ రాజు. రాముడి తర్వాత ఇంకా ముప్పై ఐదు మంది రాజులు త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశాన్ని పాలన చేశారు. కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ రాజు అయినప్పటికీ తను రాజుగా ఉండటానికి ఇష్టపడలేదు. ఒకరిని తయారు చేయడానికి వచ్చాడాయన. ఇవాళ మనం వాడే భాష కింగ్ మేకర్. ఆయన కింగ్ గా లేడు కింగ్ మేకర్ గా ఉన్నాడు. కాబట్టి దీంట్లో వైరుధ్యం లేదు వైవిధ్యం ఉన్నది. ఈ రెండు అవతారాలని కూడా మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఏ అవతారాన్ని గురించి మనం మాట్లాడుకోవాలన్నా ఆ అవతారానికి కంటే ముందు వచ్చిన అవతారాల గురించి మనకు అవగాహన లేకపోతే ఈ అవతారాన్ని గురించి మనకి సంపూర్ణంగా అవగాహన కాదు గనుక ఆనాటి దేశకాల పరిస్థితులు, ఆ అవతారం రావడానికి గల కారణాలు, వాటి నేపథ్యాలు, వాటి అవసరాలు వీటన్నింటినీ కూడా ఒక్కసారి స్థాలీపులాకన్యాయ విశేషంతో తడిమి పరామర్శ చేసి స్పృశించి మనం సత్యసాయి అవతార వైభవంలోకి ప్రవేశం చేయాలి. సరే. సత్యసాయి అవతారం రామకృష్ణ అవతారాల కంటే కూడా భిన్నమైనది మాత్రమే కాదు సర్వోన్నతమైనది, సర్వోత్తమమైనది. ఎట్లా?రాముడు కంటే గొప్ప కృష్ణుడు కంటే గొప్ప అని కాదు భిన్నమైనటువంటిది విశిష్టమైనటువంటిది వరిష్టమైనటువంటిది పరిపూర్ణమైనటువంటిది ఈ అవతారం సత్య సాయి భగవానుడి యొక్క అవతారం సరే అసలు సత్య సాయి అవతారం రావడానికి కూడా ఒక కారణం ఏమిటి కాస్త అంతఃశోధన చేసినట్లయితే పరిశోధనాత్మక దివ్య విధానంతో దానిని గనుక ఆలోచన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువుకి అవతారాలు ఎత్తవలసిన పని ఉంది అది ఆయన బాధ్యత ఇరవై రెండు అవతారాలు ఎత్తాలి సనక సనందనాదులతో మొదలు పెట్టి ఇరవై యొక్క అవతారాలు అయిపోయినాయి ఇరవై రెండవ అవతారం కల్కిగా కలియుగాంతంలో వస్తాడు ఇంకా నాలుగు లక్షల పద్దెనిమిది వేల సంవత్సరాల తర్వాత వస్తాడు ఇప్పుడు మనం ఐదు వేల నాలుగు వందల తొంభై మూడవ సంవత్సరంలో ఉన్నాం కలియుగే ప్రథమ పాదే అంటాం ఇంకా ఎన్ని పాదాలు ఉన్నాయో ఈ ప్రపంచంలో అయితే ఆయన అవతారాలు మళ్ళీ కలియుగం అయ్యే దాకా ఆయన రావటానికి వీలు లేదు గనుక విష్ణువు రాడు బ్రహ్మకి అవతారాల పనే లేదు ఆయన పని సృష్టి రచన చేయటం మాత్రమే శివుడు కూడా పూర్ణ అవతారంగా రాడు ఎప్పుడైనా కేశవుడి జగత్తులోకి వచ్చి అనేకమైనటువంటి కార్యకలాపాలలో నిమగ్నుడై ఉన్నప్పుడు ఆయనకి ఏదైనా గనుక విపత్కరమైన పరిస్థితి లౌకికంగా ఏర్పడినట్లయితే ఒక అంశావతారంగా తాను వచ్చి మళ్ళీ శ్రీ మహావిష్ణువు తాను అభిన్న అద్వయ అద్వితీయ రమణీయ మనోజ్ఞమైనటువంటి రూపాలుగా ఈ ప్రపంచానికి అందించటానికి శివుడు అప్పుడప్పుడు వస్తాడు కనుక ఆయన పూర్ణావతారం కాదు కానీ కనిపిస్తున్నటువంటి సమస్త ప్రపంచము కూడా జంగమ స్థాయిలో ఉన్నదే అది శివాత్మకమై మంగళాత్మకమై ఉండనే ఉంటుంది కానీ మానవ దేహంతో వచ్చే అవతారాలు చాలా తా చాలా తక్కువ సరే మరి బ్రహ్మకి అవతారాలు లేవు విష్ణువు చే ఎత్తవలసిన అవతారాలు అయిపోయినాయి శివుడు అప్పుడప్పుడు గాని రాడు మరి ఎట్లా అనంటే ఈ మీమాంస జరిగినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలమైనటువంటి మహాశక్తి పరాశక్తి ఎవరైతే ఉన్నదో కోటి సూర్య మండల మధ్యస్థ అయినటువంటి మహా త్రిపురసుందరి దేవి ఒక మాట చెప్పింది కలియుగానికి నేను అధిష్టాతని దాన్ని నేను నడిపిస్తాను అన్నది అయితే కోటి సూర్య మండల మధ్యస్థ అయిన అమ్మవారు ఇక్కడికి వస్తే ఈ మండలమంతా భస్మం అయిపోతుందే భూమండలి దీన్ని భరించ గలదా అని అంటే నేను ఇట్లా వస్తానా నేను స్త్రీ స్వరూపంగా వచ్చి శ్రీ లలితా దేవిగా నేను ఈ జగత్తులో శక్తిని ప్రవేశపెడతా ఆ శక్తి ద్వారా ఈ కలియుగాన్ని నేను నడిపిస్తా ఇక పుంస్వరూపంగా పురుష స్వరూపంగా దత్త స్వరూపంగా కూడా వస్తాను అంటే కలియుగానికి రెండు పారిశ్రాములు ఉన్నాయి ఒకటి పురుష రూపంలో ఉన్న దత్తుడు స్త్రీ రూపంలో ఉన్నటువంటి శ్రీ లలితా దేవి ఈ ఇద్దరూ కలిసి ఈ జగత్తును నడిపించాలి ఎందుకంటే ఒక్క స్త్రీ ఒక్క పురుషుడు అంటూ లేరు అసలు మానవ జన్మే అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నది మనందరికీ తెలుసు ప్రతి పురుషుడిలో ఒక స్త్రీ ఉంది ప్రతి స్త్రీలో ఒక పురుషుడున్నాడు ఈ ఇద్దరూ కలిసి సంసార యాత్ర చేసి ఈ సర్వ జగత్తుని కూడా మంగళాత్మకం చేసి సర్వానందమయమైనటువంటి ఒక మహా స్థితికి తీసుకు వెళ్ళాలి గనుక ఈ రెండు aspects అంటాం ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ దత్త సంప్రదాయం అనండి దత్త అవతారాలు అనండి పురుష రూపంలో వస్తాయి స్త్రీ రూపంలో లలితాదేవి ఒక్కరే ఉంటారు ఆమెకి అంశావతారాలు లేవు సరే ఈ దత్తుడు అంటే ఎవరు మళ్ళీ ఈ దత్తుడు అంటే రెండు అర్థాలున్నాయి అసలు అర్థం ఏమిటంటే ముదాత్తుడు అని అర్థం ఉదాత్తమైనటువంటి స్థాయికి చెందినవాడే దత్త స్వరూపుడు అంటాడు ఈ దత్త స్వరూపాలన్నీ కూడా అంశావతారాలుగా వస్తాయి పూర్ణ అవతారాలుగా రావు ప్రధానంగా ఈ అంశావతారాలు అన్ని ఏకకాలంలో ఇరవై నాలుగు అంశాలతో వస్తాయి ఇరవై నాలుగు గురు స్వరూపాలుగా జగత్తులో ఉంటాయి ఈ ఇరవై నాలుగు చాలా ప్రధానమైనటువంటి అంశ అంటే వాళ్ళు యతులుగా అవధూతలుగా యోగులుగా పరమయోగులుగా అనేక రూపాలుగా అనేక భావాలుగా వస్తారు అట్లా దత్తుడు ఈ ప్రపంచానికి దత్తము అవుతాడు తనను తాను దత్తం చేసుకుంటాడు గనుక దత్తుడు అయినాడు రెండవది జగత్తుని తాను దత్తం చేసుకుంటాడు అధీనం చేసుకుంటాడు జగత్తు ఆయన చేతిలో ఉంటుంది ఆయన కూడా జగత్తుతోనే కూడి ఉంటాడు గనుక ఈ దత్త స్వరూపాలు కలియుగాంతం వరకు నడిపిస్తూనే ఉంటాయి శ్రీ లలితా దేవి కలియుగాంతం వరకు ఇట్లాగే మనల్ని ఆనంద పరుస్తూ శక్తినిస్తూ అనేకమైన వైక్లవ్యాలు వైరుధ్యాలు అవన్నీ ఏర్పడ్డా కూడా ఆ అన్నిటినీ జయించి మనల్ని మనంగా జీవించగలిగిన స్థాయిలో నిలబెట్టడానికి భౌతిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక స్థితుల్లో ఈ జగత్తులోకి అంశావతారాలుగా ఈ దత్త స్వరూపాలన్నీ కూడా వస్తాయి కనుక కలియుగానికి అధిష్టాత పరంపరం ఎవరంటే శ్రీ లలితా దేవి ఆమె ఆచరణ ఆలోచన దత్త ప్రభువు కనుక ఈ దత్తుడు ఎలా ఉంటాడు అంటే గురు స్వరూపంగా ఉంటాడు ఈ దత్తదాయం అనేదంతా కూడా గురు సాంప్రదాయం గనుక మానవుడిలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను షడూర్మములను షడ్ వికారములను షడ్ ద్వంద్వములను నిరోధించి నిగ్రహించి మాన-వలసిన ఒక ఆత్మ విధానాన్ని అనేకమైనటువంటి విధానాలుగా ఈ దత్త గురువులంతా కూడా అంటే ఇరవై నాలుగు మంది వారు వశిష్టులు, వనిష్టులు, విశిష్టులు అయి పూర్ణులై ఉంటారు గనుక ఆ అంశాలన్నీ కూడా సాగుతూ ఉన్న సమయంలో ఈ దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం బౌద్ధం కూడా వచ్చింది. ఆ బౌద్ధం వచ్చినప్పుడు పరమ ఉదారమైనటువంటి భావనతో అహింసను మించిన పరమోత్కృష్టమైన ధర్మం లేదని "అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ" అంటూ సమాజాన్ని సంఘాన్ని చైతన్యమైన స్థితిలోకి తీసుకెళ్ళిన బుద్ధభగవానుడు వస్తే ఆయనకు ఆత్మావిష్కరణ జరిగి భగవంతుడు వేరే లేడు మనలోనే ఉన్నాడు మీలోనే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయనకు చివరగా మిగిలిన పన్నెండు మంది శిష్యులు ఏమనుకున్నారంటే దేవుడు వేరే లేడు అన్నమాటని దేవుడే లేడు అనుకున్నారు. నిరీశ్వరవాదం ప్రారంభమైంది. ఈ జాతి ఒక్కసారి ఒక కుదుపుకు గురైంది. దేవుడు లేడు అనే భావన రాగానే మనిషిలో విచ్చలవిడితనం ఏర్పడిపోయింది. దేనిని లక్ష్యపెట్టని ఒక స్థితి ఏర్పడిపోయింది. ఏదైనా చేసేటువంటి ఒక తిరుగుబాటుతనం ఏర్పడిపోయింది. స్వేచ్ఛ అన్ని సంకెళ్ళు కూడా తెంచుకొని బయటపడిపోయింది. మనిషి తన ప్రవృత్తిని రాక్షస ప్రవృత్తిగా అసాంఘిక ప్రవృత్తిగా మార్చుకొని దేశానికి ద్రోహం చేయటం మొదలుపెట్టిన సమయంలో దేవాలయాలు ముంతబడి శ్శిబిరాలయాలు అయ్యేటువంటి సమయంలో, ఇదంతా బుద్ధుడు వలన జరగలా బుద్ధుడి శిష్యుల వలన జరిగినాయి. బుద్ధుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞాని మహా జ్ఞాని. ఆయన చెప్పింది ఒకటి అనుయాయులు చేసింది ఒకటి. కానీ జరిగిన ప్రమాదం జరిగిపోయింది. ఈ అవక తలకలన్నీ సరిదిద్దటానికి ఇందాక అనుకున్నాం కదా శివుడు ఈ జగత్తులోకి రావాలి. ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమన్వయం చేయాలి గనుక "శంభోర్ మూర్తి శరది భోనయ శంకరాచార్య రూపా" మార్కండేయ పురాణంలో ఒక ప్రమాణం ఉన్నది. ఏమని అంటే ద్వాదశాదిత్యులు పన్నెండు మంది ఆదిత్యులు ఎవరైతే ఉన్నారో అందులో ఒకాయన జ్ఞానాదిత్యుడు. ఆ జ్ఞానాదిత్యుడే శంకర భగవత్పాదులై ఈ లోకంలోకి శంకరాచార్యుల వలె వచ్చి ఇటు శివాత్మకమైన భావము అటు జ్ఞానము అనబడేటువంటి సూర్యుడు చైతన్యము అంటే చైతన్యము జ్ఞానము ఒకేసారి సమంగా ప్రవహించేటువంటి ఒక మహా సరస్వతి ప్రవాహముగా వచ్చినటువంటి వారు శంకర భగవత్పాదులు. "శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం" ముప్పై రెండు సంవత్సరాల తమ అవనీ సంచారంలో శంకర భగవత్పాదులు మళ్ళీ అనేకమైనటువంటి విషయాలకు భాష్యం రాసి నిరీశ్వర వాదం నుంచి మానవుణ్ణి వైదిక వాదంలోకి అంటే ఈశ్వరుడు ఉన్నాడు కానీ ఈశ్వరుడు నీకంటే భిన్నంగా లేడు సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని చెప్పటానికి శంకర ఆచార్య రూపంలో సచ్చాచార్యులై జగత్తులోకి వచ్చి నూట నలభై మూడు పైగా ప్రకరణాలు రాసి మళ్ళీ మానవుణ్ణి జ్ఞానం వైపు, విజ్ఞానం వైపు, సుజ్ఞానం వైపు, ప్రజ్ఞానం వైపు, వైదిక కర్మకాండ వైపు, పండగలు పబ్బాల వైపు, ఆరాధన వైపు, విగ్రహారాధన వైపు, స్తుతి, నృతి, గతి, గమనము, గమకములతో కూడినటువంటి సంగీత ప్రవాహంగా ఒక కవితా ప్రవాహంగా ఆయన శివానందలహరి, సౌందర్యలహరి ఇవన్నీ కూడా రాసి మళ్ళీ కవిత్వం ద్వారా సాహిత్యం ద్వారా ప్రాహిత్యం వైపు ఎట్లా వెళ్ళాలి? అంటే మోక్షాన్ని ఎలా పొందాలి? సాహిత్యంలో ఉన్నటువంటి బీజాక్షరాల వెనక ఉన్నటువంటి అధిష్ఠాన పరదైవతాలను దర్శనం చేసుకొని, ఆవాహన చేసుకొని నిత్య జీవితాన్ని గనుక పరమోన్నతమైనటువంటి ఆదర్శ భావంతో నిజాయితీతో ప్రగల్భం గనుక లేకుండా నడపగలిగినట్లయితే మానవుడు మళ్ళీ జ్ఞాన మార్గం వైపు వెళతాడు అని చెప్పటానికి శంకర భగవత్పాదులు ఈ జగత్తులోకి వచ్చారు. సరే అక్కడికి ఆయన దత్తావతారం ఏం కాదు ఆయన శివావతారం. అందే, అందుకనే "శంభోర్ మూర్తిహి చరతి భువనే శంకరాచార్య రూపా" శివుడు శంకర రూపంలో వచ్చి ఈ జగత్తును నడిపించాడు అట్లా వచ్చాడు అని మనకి వైదిక ప్రమాణం ఉన్నది. ఈ పరంపర సాగుతూ ఉండగా సంత దేశమైనటువంటి మహారాష్ట్ర దేశంలో హిందువు ముస్లింల మధ్య ఒక వైరుధ్యం ఏర్పడింది. హైందవ సాంప్రదాయంలోని అనేకానేకమైనటువంటి మార్గాలు ఏర్పడ్డాయి. ఆ మార్గాలలో ప్రధానంగా శివ, రామ, కృష్ణ, మారుతి, ఖండోబా, విఠోబా, నాథ అనేటువంటి సాంప్రదాయాలు ఏర్పడి ఇవన్నీ కూడా జాతిని విభజించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అవతరించినటువంటి ప్రప్రథమ పూర్ణ దత్తావతారం ఏది అంటే అది షిరిడి మహాస్వామి. ప్రప్రథమ పూర్ణ అన్నాం కానీ ప్రప్రథమ దత్తావతారం ఏది అని అది విఠాపురంలో ఆంధ్రదేశంలో విఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడుగా వచ్చినటువంటిదే ప్రప్రథమ దత్త అవతారం. అది కూడా అంశావతారంగానే వచ్చింది. అంటే కాల కార్య కారణ నిమిత్తమై వచ్చిన వచ్చి కర్తవ్యాన్ని నిర్వహించి మళ్ళీ ఎవరికీ కనబడనంత దూరంలో సర్వాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో తన మూలంలోకి మళ్ళీ ప్రవేశించినటువంటి పరమాద్భుతమైన ప్రథమ దత్తావతారం ఏది అంటే శ్రీపాద శ్రీవల్లభుడు.కానీ ఇందాక చెప్పుకున్న అనేకమైనటువంటి వైరుధ్యాలతో కూడిన విభిన్నమైనటువంటి మత సంప్రదాయాల మధ్య ప్రధానంగా సంతృ దేశమైన మహారాష్ట్రలో ఈ మహాస్వామి షిరిడి స్వామి ఏర్పడితే ఆయన జన్మ ఎత్తితే నిజానికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. అతడు అవధూతా? యతియా? బ్రాహ్మణుడా? అబ్రాహ్మణుడా? హిందువా? ముస్లిమా? ఎవ్వరూ-- అంత చిక్కనటువంటి ఒక వైభవంగా సాగింది షిరిడి బాబా తొలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు. ముప్పై తొమ్మిదవ సంవత్సరం వచ్చేప్పటికి ఈ మతాల మధ్య వైరుధ్యాన్ని తగ్గిస్తూ తనను తాను ప్రకటించుకుని చేదు విత్తనాలు మాత్రమే పంచగలిగినటువంటి ఒక వేప చెట్టు కింద కూర్చొని అంటే జీవితం గనక ఒక వృక్షం సంసార వృక్షం అయినట్లయితే పదుర పలాలను కిందకు రాల్చదు గనక దాన్ని వేప చెట్టుగా పోల్చి ఎందుకంటే వేప చెట్టు, మేడి చెట్టు ఇవన్నీ కూడా రావి చెట్టు అధ్యాత్మలో అత్యున్నతమైనటువంటి దేవతా వృక్షాలుగా మనం చెప్తాం. ఆయన ఎంచుకున్నది "సదా నింబ వృక్షస్య మూలాధివాసం" అని మనం కీర్తిస్తాం. సదా ఎల్లప్పుడూ ఇటర్నల్ గా ఉన్నటువంటి వాడు ఎవరు అంటే షిరిడి సాయినాథ్. కానీ ఆయనే షిరిడి అని అంటున్నాం షిర్ది అంటున్నాం ఈ రెండు పదాలు తప్పు. ఈ రెండింటి కంటే అసలు పదము ఏది అంటే షిలాధి. అసలు పదం అది. మరాఠీలో షిలాధి అంటే చెరుకు తోట అని అర్థం. ఆ చెరుకు తోట మధ్యలో ఈ వేప చెట్టు. ఆ వేప చెట్టు కింద ఒక యువక స్వామి కూర్చొని ఉంటే ఆయన్ని జనాంతికంగా నెమ్మది నెమ్మదిగా పదాలు ఎట్లా మారిపోతాయో అది షిలాధి వల్ల షిరిడి అయిపోయింది. షిరిడి యెల్లా ఇవాళ మనం సిద్ధిగా మార్చేసుకున్నాం. ఆ ఈ సిద్ధి సాయినాథుడు సాయిబాబా కాదాయన సాయినాథుడు. ఎందుకనంటే నాథ సంప్రదాయంలో ఒక పరిపూర్ణమైనటువంటి వైరాగ్య విభూతిని ఈ జగత్తుకు అందించినటువంటి పరప్రథమ పూర్ణ దత్తావతారము షిరిడి సాయినాథుడు. కనుక సాయి ఆ నాథ శబ్దము కేవలము షిరిడి స్వామికి మాత్రమే వర్తిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు పెట్టుకోలేరు. అఖిల్ కోట మహారాజ్ ఇటువంటి వాళ్ళంతా కూడా ఆయన చుట్టూ ఉన్నారు. ఇందాక చెప్పిన ఇరవై నాలుగులో ఇరవై మూడు విడివిడిగా ఉన్నారు. కానీ ఇరవై నాలుగు ప్రధానమైనటువంటి అంశతో పూర్ణ అంశతో వచ్చినటువంటి వారు షిరిడి సాయినాథుడు. అయితే షిరిడి సాయినాథ్ అని సమయంలో మత వైరుధ్యాలు రెండు మతాల మధ్య మాత్రమే ఉండేవి. ఉన్నవి కూడా ఆ మతాలే. ఆయన వచ్చే కాలానికి. కానీ కాలం గడుస్తుంది షిరిడి సాయినాథ్ యొక్క అవతారం పరిపూర్ణం కావాలి. ఆయన రాముడికి రహీముకి, ఖాన్ కి గోపాల్ కి ఏం తేడా లేదని సర్వమత సమన్వయ-- నిజానికి సర్వమత కాదు రెండు మతాల మధ్య ఒక సమన్వయ స్ఫూర్తిగా షిరిడి సాయినాథ్ నిలకడించింది. అనేకమైనటువంటి పరీక్షలు సాధకులకు పెట్టి సాధన ద్వారా పరీక్షలో ఉత్తీర్ణుడిని చేసి వారి భౌతిక లౌకికమైనటువంటి సర్వ కష్టాలని తాను ఆదుకొని తాను కొన్ని అనుభవించి తన దివ్యత్వాన్ని రూపు-- లీలాకాండ చేసి ఎట్లా నీతితో దీపాలు వెలిగించి చట్కా నేల మీద కొట్టగానే పాతాళ గంగ ఊయెత్తున పైకి వచ్చినట్టుగా ఇవన్నీ కూడా మనం చరిత్రలో విన్నాం. అంటే ఈ మహాత్ములన్నీ కూడా లీలాకాండ చేస్తారు, చెయ్యాలి. లీలాకాండ చేయకపోతే సాధారణమైనటువంటి సాధకుడు ఆ పరమాత్మ వైపు వెళ్ళలేడు. బెల్లపు గడ్డలో తీయదన గనక లేకపోతే తీయదనము లేని బెల్లపు గడ్డ మన పాకెట్లో పడేస్తే ఒక్క చీమ కూడా రాదు. దాని యందు ఆ తీయదనాన్ని ప్రవేశపెట్టి ఒక చిన్న రేణువుని నేల మీద పడేసినట్లయితే ఆ ఆ రేణువుని నెమ్మదిగా చీమ మోసుకొని వెళ్తుంది. అంటే తన ఆవరణంలోకి తీసుకోవాలి. ఆకర్షించాలి. ఆ ఆకర్షణ ప్రదర్శనగా కనిపిస్తుంది మన బోటి వాడికి, సాధన తెలియని వాడికి. సాధన తెలిసిన వాడికి అది నిదర్శన పూర్వకం. శ్రీరామచంద్రుడు ధనుస్సు విరిచినా, శివధనుస్సు వంచినా, విరిచినా, సుబాహుని, తాటకిని ఆకాశంలో కాల్చి చంపినా, వారధి నిర్మించినా, ఏడు చెట్ల వెనక నించి భార్యని వధించినా రామకాండ అంతా కూడా రామాయణం అంతా కూడా మనకి తెలిసి తెలియని విధంగా సాగిన లీలాకాండ. లీలాకాండ తోనే ప్రారంభమైంది కృష్ణ పరమాత్మ యొక్క జన్మ. అది అశాంతము విరాట్ స్వరూపమై మహాభారత సంగ్రామ వేళ తనను తాను ఆవిష్కరించుకున్నటువంటి ఆ విరాట్ స్వరూప దర్శనం దాన్నే విశ్వరూప దర్శనం అన్నాం. ఆ విశ్వరూప దర్శనం ఇచ్చేదాకా జరిగింది అది లీలాకాండ, మహిమాకాండ ఇట్లా జరుగుతూ ఉండగా షిరిడి మహాస్వామి యొక్క అవతారం పరిపూర్ణమయ్యేటువంటి ఒక సమయం ఆసన్నమైనప్పుడు ఈ దేశంలో ప్రధానంగా దక్షిణాపథంలో వింధ్య పర్వతాల కిందట ఆంధ్రదేశంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? బాగా వెనకబడినటువంటి ఒక జిల్లాలో అధ్యాత్మ అంగడి సనుకు అయిపోయింది. మత మార్పిడులు జరుగుతున్నాయి. వర్షాలు లేవు. తినటానికి ఒక్క గింజ లేదు.తాగటానికి ఒక్క చుక్క నీరు లేదు అటువంటి ప్రదేశాన్ని పరమాత్మ ఎన్నుకున్నాడు ఎవరు ఆ ఎన్నుకున్న పరమాత్మ ఎవరు అంటే షిరిడి సాయినాథుడు తన దేహాన్ని వదిలిపెట్టేటువంటి వేళ ఆయన ఈ ప్రపంచానికి ఒక అభయాన్ని ఇచ్చాడు మళ్లీ ఎనిమిది సంవత్సరాలకి ఆంధ్రదేశంలో నేను రూపు దాల్చి వస్తాను అని. పందొమ్మిది వందల పద్దెనిమిది నుంచి ఇట్లా లెక్కపెట్టుకుంటూ ఉంటే పందొమ్మిది వందల ఇరవై ఆరు నవంబరు ఇరవై మూడవ తారీఖున గొల్లపల్లి అనేటువంటి ఈనాడు పుట్టపర్తిగా సుప్రసిద్ధమైనటువంటి ఆ ప్రదేశంలో అదే అంటే ఆ ప్రదేశం ఎందుకట్లా అన్నారు ముందు గొల్లపల్లి అని ఎందుకు అన్నారు పుట్టపర్తి అని ఎందుకు అన్నారు ఆ పేర్లు ఎందుకని వచ్చినాయి అంటే పుట్టలు ఎక్కువ ఇల్లు తక్కువ పాములు ఎక్కువ మనుషులు తక్కువ దుర్భరమైనటువంటి ప్రాంతం ఎడారితో సమానమైనటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో ప్రాదుర్భవించినటువంటి షిరిడి సాయినాథుని యొక్క అంటే పూర్ణ దత్తావతారము యొక్క లక్షణ లక్ష్య లక్ష్యాలతో వచ్చినటువంటి మహా పరిపూర్ణ అవతారమే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. ఈ సత్య సాయిబాబా వారు వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి రామకృష్ణ అవతారాలతో పోల్చుకున్నట్లయితే ఇందాకే అనుకున్నాం రాముడు అరవై నాలుగవ రాజు అని అంటే రామావతారం వచ్చేసరికి అరవై మూడు మంది ఇక్ష్వాకు రాజులు రాజ్యం ఏలారు అంటే రాజ్యం ఉంది ఏలటానికి రాజులు ఉన్నారు కోశాగారం ఉంది జనావాసాలు ఏర్పడ్డాయి పట్టణాలు ఏర్పడ్డాయి కర్మ భక్తి జ్ఞాన అన్ని యోగాలు కూడా అక్కడ ఉన్నాయి కోశాగారం నిండుగా ఉన్నది అది శ్రీరాముడి నేపథ్యం. తర్వాత కృష్ణుడు కూడా మధుర ఉగ్రసేన మహారాజు మనవడిగా ఆయన కూడా రాజే యదురాజుగా వచ్చాడు ఆయన నేపథ్యము గొప్పదే భౌతికంగా కూడా చాలా గొప్పది ఆయన వెనుక రాజ్యం ఉంది ఆయన మేనమామే కంసుడు మహారాజు కాబట్టి వారి ఆర్థిక నేపథ్యం సర్వోన్నతంగా ఉన్నది సత్యసాయి భగవానుడి వెనుక ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్యము లేదు రమణ లేదు కోశాగారం లేదు మంత్రాంగణం లేదు తంత్ర యంత్రాంగాలు లేవు కానీ రత్నాకర వంశం చేసుకున్నటువంటి ఒకానొక తపస్సు ఫలితంగా ఏ ఒక్కరూ చేయలే రత్నాకర వంశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మహా తపస్సు చేసి ఉన్న కారణంగా సత్యసాయి భగవానుడు అంటే ఈ దత్తా స్వరూపము సత్యసాయి స్వరూపంగా ఈ జగత్తులోకి వచ్చింది. కనుక సత్యసాయి అవతారాన్ని మనం ఆ వైభవాన్ని ఇంకా విశ్లేషించుకోవటానికి ముందుగా కొన్ని ప్రధానమైన విషయాలు మనం తెలుసుకోవాలి అందులో ఒకటి చదువు వెనకబడి పోయింది విద్య లేదు బ్రిటిష్ రాజ్యం ఏలుతున్నది ఆ సమయంలో సత్య సాయి భగవానుడు జగత్తులోకి వచ్చారు పర దేశం పాలిస్తూ ఉన్నటువంటిది వైదిక విద్య వెనకబడి పోయింది ప్రాదేశిక విద్య లేదు మాతృభాష లేదు మాతృమూర్తుల యెడల ఏ రకమైన గౌరవ భావాలు లేవు మాతృదేశం అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి దేశాభిమానం కూడా త్వరబడినటువంటి వేళ మాతృభాష మాతృమూర్తి మాతృదేశము ప్రధానమైనటువంటి అంశాలుగా సత్యసాయి భగవానుడు ఈ జగత్తులోకి వచ్చారు అంటే తల్లిని ప్రేమించాలి తల్లిని ఆరాధించాలి తల్లిని గౌరవించాలి మన బాల్యంలో మనం మనల్ని తల్లి ఎట్లా పోషించి లాలించి పాలించి ఆలించి అదలించి ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిందో మనం పెద్దవాళ్ళమైన తర్వాత మాతృమూర్తి యెడల ఇటువంటి భావనే ఉండాలి అనేటువంటి ఆ మాతృ భక్తిని మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేయాలని అట్లాగే మాతృభాషను మించినటువంటి భాష లేదు తల్లి చనుబాలలో నుంచి తల్లి శ్వాస నాధులలో నుంచి తల్లి వీణాదండంలో నుంచి తల్లి భావనలో నుంచి తల్లి స్పర్శలో నుంచి తల్లి తలుపులో నుంచి ఏర్పడినటువంటి ఒక భాష అది మాతృభాష అది మరాఠీయా గుజరాతీయా ఈ దేశంలో అనేక భాషలు ఉన్నాయి కానీ ప్రతి వాడు తన మాతృభాషని మాతృమూర్తిగా మాతృదేవతగా భావించాలి అని చెప్పటానికి వచ్చినటువంటి ఒక అవతార మూర్తి భగవాన్ శ్రీ సత్య సాయి. తర్వాత పరిపూర్ణమైనటువంటి ఒక విశేషము మాతృదేశము ఈ దేశం అంటే కేవలం ఒక జెండా కాదు ఈ దేశం అంటే నదీ నదాలు మాత్రమే కాదు కొండలు కోనలు వాగులు వంకలు ఎన్నో అన్నీ కలిపి ఒక దేశం అయితే ఈ దేశము మన దేహంతో సమానం సర్వాంగీణమైనటువంటి ఈ దేహం అంతా కూడా ఒకదానితో ఒకటి సహకరించుకొని ఎట్లా నడుస్తూ ఉన్నాయో జీవిత జీవన ప్రస్థానాన్ని ఎట్లా పవిత్రీకరించుకుంటాడో అదేవిధంగా మనకు నీడనిచ్చి గూడునిచ్చి మన కడుపున ముద్ద పెట్టినటువంటి ఈ భరత జాతి ఈ జాతి మాతృదేశం అనేటువంటి భావనతో మాతృభాష మాతృమూర్తి మాతృదేశము అనేటువంటి మూడు దివ్య భావనలని కూడా తమ జీవిత కాలంలో దివ్యాత్మకంగా ప్రకటన చేసి ప్రబోధించి ప్రసాదించినటువంటి దివ్యమూర్తి భగవాన్ శ్రీ సత్య సాయి.స్వామి అసలు ఎందుకు వచ్చారు? ఆయన purpose? ఆ అవతార పరమార్థం ఏమిటో? ఇదంతా స్వామి ఉంగరం ఇచ్చారు, బంగారం ఇచ్చారు, రోగం పోగొట్టారు. దానికై ఆయన రాలేదు. ఇది మనం ముందు నిర్ణయించుకోవాలి. అవన్నీ జరిగిపోయినాయి, గురువు అనుగ్రహంతో జరిగిపోయినాయి. దానిలో ఇవన్నీ నేను చేశానని ఆయన అనలేదు. మనం అడుగుతూ వెళ్ళాం. కానీ ఆయన వచ్చిన ఆ అవతార పరమార్థం మాత్రం ఇది కాదు అని గ్రహించాలి. అట్లాగే స్వామి [కొవ్వు] పందొమ్మిది వందల నలభై మే ఇరవై మూడుకు ముందు అంటే పధ్నాలుగు సంవత్సరాలు తన చుట్టూ ఉన్నటువంటి పరిమిత ప్రాంతాన్ని దివ్య లీలా వైభవంతో ప్రభావితం చేసి అపమార్గంలో వెళ్ళిపోతున్నటువంటి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సవ్యమార్గంలోకి తెచ్చారు. అతి చిన్న వయసులోనే నాటకాలు రాసి, పాటలు రాసి, పద్యాలు రాసి మంచి మంచి మాటలు నే-నేర్చి, నేర్పి అన్నింటినీ కూడా సమాజాన్ని ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైన, గంభీరమైనటువంటి ఉదాత్త స్థాయిలో చేస్తూ ఉంటే ఏమిటి సాధారణమైనటువంటి ఓ కుటుంబంలో పుట్టిన ఈ వ్యక్తికి ఈ జ్ఞానం ఏమిటి? ఈ మాటలు ఏమిటి? ఆశ్చర్య ఈ పద్యశోభ ఏమిటి? ఈ అతిమానుషమైన విద్యలు ఏమిటి? వస్తు సృష్టి ఏమిటి? అందరి పేరల ఒకే రకమైన భావన ఏమిటి? ఈయన వయస్సు ఎంత? అని అనేక ప్రశ్నలు పుట్టి ఆయన్నే అడిగారు. "నువ్వు ఎవరో చెప్పు, మాకు అర్థం కావటం లేదు" అన్నారు. ఆ రోజు పంతొమ్మిది వందల నలభై మే ఇరవై మూడవ తారీఖున గుప్పెడు మల్లెపూలు నేల మీద విసిరారు. ఆ మల్లెపూలు "ఐ యామ్ సాయిబాబా" అని చక్కగా ఒక వాక్యం ఏర్పడినప్పుడు ఈ సాయిబాబా అన్న పేరు ఆంధ్రదేశంలో అంతవరకు ఎవరూ వినలే. అప్పటి వరకు రామకృష్ణ అవతారాలు రెండు ఆరాధ్య-ఆరాధనీయమైనటువంటి పురాణ పురుషోత్తములు వారిద్దరు కూడా. దక్షిణాపథంలో ప్రధానంగా ఆంధ్రదేశంలో రామాలయం లేని గ్రామమే లేదు. కానీ సాయిబాబా ఎవరు? ఎవరికీ అర్థం కాలే. బట్ ఎవరికీ అర్థం కాలేదు గానీ మల్లెపూలు విసిరినప్పుడు ఆ పదం ఎట్లాగైతే వాక్యం ఏర్పడిందో దానికి విభ్రాంతి చెందారు. అయితే అనతికాలంలోనే మళ్ళీ అదే సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తారీఖున తన కన్నతల్లిని, తానున్న ప్రదేశం అంటే తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అన్నింటిని కూడా వదిలిపెట్టి "నేను సాయిబాబాను, నా అవతార కార్యక్రమం ఇకపై ప్రారంభమైంది. వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ ప్రధానాంశాలుగా ఈ అవతారం కొనసాగుతుంది" అని చెప్పి స్వామి ప్రాపంచిక బంధాలు అన్నింటినీ క్షుణికాలంలో తెంచుకొని బయటకు వచ్చారు. దాన్ని వేళ మనం అవతార declaration day అన్నాం. అంటే శ్రీరామచంద్రుడు అవతార declaration మహావిష్ణువుగా చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం పూర్ణమయ్యే సమయంలో కాస్త ముందుగా చేశాడు. జీవితాంతం ఆయన ఎక్కడా ప్రమాణం చేయలే. కానీ సత్యసాయి భగవానుడు చాలా అత్యంత ప్రత్యేకమైనటువంటి విషయంగా తొలి దశ మానవుడికి తొంభై ఆరు సంవత్సరాలు మనందరికీ కూడా ఆయుష్షు ఇచ్చాడు భగవంతుడు. అవి ఆరు దశలుగా ఆరు కాండలుగా సాగుతాయి. అందుకనే రామాయణాన్ని వాల్మీకి ఆరు కాండలలో రాశాడు. ఒక్కొక్క కాండంలో పదహారు కళలు ఉంటాయి. ఈ పదహారు కళలు అంటే పదహారు ఏళ్లు వచ్చే వరకు ఒక కళ. పదహారు నుంచి ముప్పై రెండు వరకు రెండవ కళ. అట్లా ఆరు పదహారులు. తొంభై ఆరు తర్వాత మనం కూడా దేహాన్ని వదిలిపెట్టవలసిందే. కాస్త అటూ ఇటూగా. సరే సత్యసాయి భగవానుడు ఈ పదహారవ ఏడు రాకుండానే తొట్ట తొలి కాండంలోనే పధ్నాలుగవ ఏట ఈ పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవైవ తారీఖున అవతార declaration చేశారు, అవతార ప్రకటన చేశారు. ఆ ప్రకటన అత్యంత నిర్దుష్టమైనటువంటి ప్రకటన. ఏ రకమైన ambiguity లేదు దాంట్లో. ఏమున్నది అంటే సత్యమే శక్తిగా, సంకల్పమే శక్తిగా, దివ్యత్వమే శక్తిగా ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా పుణ్యభూమిగా మార్చడానికి వచ్చినటువంటి మహా పరిపూర్ణ అవతారం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అంటే సత్యసాయి భక్తులమైన మనందరం కూడా సత్యసాయిని సత్యసాయి పరమాత్మని ఇట్లా వాడం. మనకి స్వామిని ఆయనని [కొవ్వు] ఒక అందమైన ఆత్మీయమైనటువంటి ఒక పిలుపు మనకుంది. కనుక స్వామి ఈ పరిపూర్ణ మహా పరిపూర్ణ అవతారిగా వచ్చారు అనటానికి ఆ విశ్లేషణ ఎలా సాగాలి? మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళదాం. త్రేతాయుగంలోకి గనక వెళ్ళినట్లయితే శ్రీరామచంద్రుడు ఉన్నాడు. ఆయన రాజు చెప్పుకున్నాం. ఆయన కూడా సీతాన్వేషణ కారణంగా అయోధ్యను వదిలిపెట్టి దక్షిణాపథంలోకి దండకారణ్యం ద్వారా వచ్చి శ్రీలంక ద్వారా ఆయన ప్రయాణం చేశారు. పైకి సీతాన్వేషణ, రావణ వధగా కనిపిస్తూ ఉన్నా కేవలం అయోధ్యలో మాత్రమే ఉండకుండా తాను కూడా ఒక పధ్నాలుగు సంవత్సరాల అరణ్యవాసాన్ని స్వీకరించి దానిని పితృ ఆజ్ఞగా స్వీకరించి వాక్య పరిపాలన పితృవాక్య పరిపాలన చేయాలనేటువంటి పధ్నాలుగు సంవత్సరాల దీక్షలో ఆయన ముందుగా పోగొట్టుకున్నది ఏమిటేంటే రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు.సుమారు పదమూడు సంవత్సరాల అనంతరం రమణిని పోగొట్టుకున్నాడు సీతమ్మవారిని పోగొట్టుకున్నాడు కానీ మధ్యకాలంలో జరిగినదంతా అధర్మం ఎక్కడ ఉంటే దాన్ని దండించాడు ఖండించాడు ధర్మం ఎక్కడ కాస్త మొగ్గగా ఉన్నదో దానిని వికాసమానం చేశాడు శంభుజ వసంత సంగిని హృదారామయ జీర్ణ చదా సస్త భక్తి లతాక్షతా విరసిత పుణ్య ప్రవాళ శ్రితాః దిశ్యంతే గుణ కోరక జపవచః పుష్పాస్య సద్వాసనా జ్ఞానానంద సుభామరందర హరి సంవిద్భావభ్యన్నతి అంటారు శంకర భగవత్పాదులు శివానంద లఘు లో ఖచ్చితంగా రామచంద్రుడు చేసింది అంతే-అదే అందుకనే రాముడిని దండకారణ్యంలో ఉన్నటువంటి తపస్సులు మునులు ముముక్షువులు తాత్వికులు ఏమన్నారో తెలుసా దండకారణ్యంలోకి ఈ రాముడు ఎలా వచ్చాడు ఎలా మా అందరికీ ఆనందాన్ని ఇచ్చాడు జ్ఞాన పరాకాష్ఠను ఎలా పంచాడు అంటే దండక వన పారిజాతం గా పరిణమించుకున్నారు వాళ్ళు పారిజాత మహాపృష్టం గా వారు [వాయిస్ వెర్బల్] పరిణమించుకున్నారు అది నేల మీద వాల-- కింద పడ్డా అది అతి పవిత్రమైనటువంటిది కాబట్టి శ్రీరాముడు రాజ్యాన్ని కోల్పోయినా ఒక భక్తి సామ్రాజ్య నిర్మాణం చేయడానికి తన జీవితంలో పద్నాలుగు సంవత్సరాల కౌమార యౌవన దశలని మహత్తర త్యాగం చేశారు గనుకనే శ్రీరామ్-- అందుకనే త్యాగేనైకే అమృతత్వమానశుః త్యాగం మనకుండాలి త్యాగం లేకపోతే మనం బతికిన బతుకుతాం ఒకరోజున శరీరం వదిలిపెడతాం త్యాగం గనక చేసినట్లయితే మరణించిన తర్వాత ఎక్కువ కాలం జీవిస్తాం. ఇది శ్రీరామచంద్రుడి యొక్క కథ ఇది వాల్మీకి అన్నాడు రామాయణ కథ రాము-రాముడి యొక్క అయం అంటే ప్రయాణం రాముడి ఆ ట్రావెలోగ్ అంటాం ఇవేళ అది కథగా నేను చెబుతున్నాను అన్నాడు కానీ అంతటితో ఆగకండి దీనిని సీతాయాశ్చరితం మహత్ మహత్పూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క చరిత్రయ్యా ఇది రామాయణం అన్నాడు అంతటితో ఆగలా మనమందరము రావణాసురుడిని రాక్షసుడిని చేస్తే వాల్మీకి దాన్ని పౌలస్త్య హృదయము అన్నాడు లేదా పౌలస్త్య వధ ఈ రెండింటిని ఈ మూడు సమన్వయం చేస్తూ వాల్మీకి చెప్పాడు కాబట్టి శ్రీమద్రామాయణము మానవ జీవన విధానానికి ఒక బృహత్తరమైనటువంటి గ్రంథంగా పరిణమించింది ఇది రాముడి కథ. చివరగా ఆయన పట్టాభిషిక్తుడు అయినాడు మళ్లీ పిల్లలకు అబ్బయకాడు తన ఇక్ష్వాకు వంశ పరిపాలన తర్వాత ముప్పై ఏడు మంది రాజులు రాజ్యం ఏలినట్టుగా అది సాగింది అది ఒక కథ. కృష్ణ పరమాత్మ ఇది చాలా విచిత్రమైనటువంటి విచారధార శ్రీకృష్ణ పరమాత్మ వింద్య పర్వతాలు దాటి రాలా ఆయన వింద్య పర్వతాల ఉత్తరే హస్తినాపురము మధుర బృందావనము ఇటువంటి చోట ఆయన కార్యకలాపాలన్నీ కూడా సాగినాయి భారతమంతా పరుచుకున్నాడు ఆయన లౌకిక కృష్ణుడైనాడు భాగవతమంతా పరుచుకున్నాడు భక్తి యోగంలో పరాకాష్ఠలోకి తీసుకుని వెళ్ళాడు ఈ రెండింటిని సమన్వయం చేసి హరి డైనమిక్స్ ఏదైతే జ్ఞాన యోగం ఉన్నదో దానిని కర్మ భక్తి జ్ఞాన యోగాలుగా భగవద్గీతలో మనకి ప్రమాణంగా నిరూపణ చేసి అక్కడ యోగీశ్వరుడు అయినాడు బాలకృష్ణుడైనాడు రౌద్ర కృష్ణుడైనాడు భారత కృష్ణుడైనాడు లీలా కృష్ణుడైనాడు జ్ఞాని అయిన యోగేశ్వర కృష్ణుడైనాడు కానీ కృష్ణ కథ అంతా కూడా వింద్య పర్వతాలకి అవతల సాగింది రాముడిది అటూ ఇటూగా సాగింది షిరిడి బాబా ది మాత్రం మహారాష్ట్ర దేశానికి పరిమితమైంది నిజానికి సత్య సాయి భగవానుడు అవతారం తాల్చి వచ్చిన సమయానికి ఆంధ్రదేశంలో షిరిడి బాబా పేరే సాయి నామమే ఎవరికీ తెలియదు అటువంటి ప్రదేశంలో నేను సాయిబాబాను అని ప్రకటించి సత్య సాయి భగవానుడు వింద్య పర్వతాల ఇవతల ఒక ఆరాధనా స్ఫూర్తిగా ఇవేళ అర్చా మూర్తిగా సర్వదేవతా అతీత స్వరూపంగా తనను తాను ఆవిష్కరించుకొని జన జగత్తులతో సమన్వయం చేసుకొని పూర్ణమైనటువంటి దత్త స్వరూపంగా సత్య సాయి భగవానుడు జనుల మధ్య ఉన్నారు జగతిని నడిపించారు జగతి మధ్యలో ఉన్నారు జనులతోని చక్కగా ఓపెన్ గా ఎంత చక్కగా విశాలంగా విస్తృతంగా గంభీరంగా ఉదాత్తంగా మర్యాదగా కార్మికంగా కార్మికంగా ఎట్లా ఉండాలో అవన్నీ కూడా స్వామి చేశారు గనుక ఈ సత్య సాయి భగవానుడి యొక్క అవతారం ఒక అయోధ్యకో ఒక శ్రీలంకకో లేకపోతే మధుర బృందావనాలకు పరిమితమైనది కాదు అలాగే షిరిడి స్వామి వలె మహారాష్ట్ర దేశానికి పరిమితమైనది కాదు మరి దేనికి పరిమితమైనది అపరిమితమైనది ఇది అనంతపూర్ జిల్లాలో ఉన్న పుట్టపర్తిని దాటి ఆంధ్రదేశాన్ని దాటి భారతదేశాన్ని దాటి నూట ఎనభై ఎనిమిది రెండు వందల ఎనిమిది దేశాలలో సనాతనమైన వైదికమైనటువంటి ఒక ధర్మాన్ని సుప్రతిష్ఠం చేసినటువంటి పరమ విస్తృతమైనటువంటి వ్యాపక అవక-అవతార మూర్తి ఎవరు అంటే సత్య సాయి భగవాన్ అది విష్ణు తత్వానికి సంకేతం విష్ణువు ఒకచోట ఉండడు సర్వవ్యాపకుడ విష్ణు శబ్దానికే ఆ-అర్థం అది ఏది సర్వవ్యాపకమై ఉంటుందో సర్వే సర్వత్రా సర్వాణువుల యందు నెలకడ చెంది ఉంటుందో ప్రతి అణువుని శక్తి మంతం చేస్తుందో దానికి విష్ణువు అని పేరు. శివుడు జంగముడు స్థిరుడు ఒకచోటే ఉంటాడు తాను ఎక్కడికి వెళ్ళడు కానీ తాను ఉన్నచోటికి అందరినీ రప్పించు-కుంటాడు కనుక ఆయన రుద్రుడు అయినాడు శివుడు అయినాడు సత్య సాయి భగవానుడు కూడా చూడండి రాముడు ప్రయాణించిన పద్నాలుగేళ్ళుకృష్ణుడు కూడా అనేక ప్రదేశాలకి వెళ్ళాడు యమునా తీరానికి వెళ్ళాడు వేణువు ఊదాడు రాసలీల సాగించాడు అనేకమైనటువంటి కార్యకలాపాలన్నింటిలో కూడా దివ్యత్వాన్ని ప్రకటన చేశాడు అగ్రపూజలు అందుకున్నాడు అన్ని అందుకున్నాడు కానీ అది చరముగా ఉన్నాడు ఆయన కూడా విష్ణువు గనుక కానీ సత్య సాయి భగవానుడు ఎవరు అంటే రుద్ర గ్రంథి విష్ణు గ్రంథి రెండు భేదనం చేసుకుని వచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారం కనుకనే తాను కదలకుండా తాను ఎక్కడికి వెళ్ళకుండా మాన్యుడి దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి అసామాన్యుడి వరకు జ్ఞానులు శాస్త్రవేత్తలు అంటే ప్రాపంచికంగా ఎన్ని రంగాలు ఉన్నాయో ఆ రంగాల్లో శిఖర స్థాయికి చెందిన వారందరినీ కూడా తన దగ్గరకు ఆకర్షించినటువంటి అవతార మూర్తి భగవాన్ శ్రీ సత్య సాయి ఇది ఒక విలక్షణమైనటువంటి అవతారం ఇది విలక్షణమే కాదు విశిష్టమైనటువంటి అవతారం ఎందుకంటే ఇది శివాత్మకమై ఉన్నది సుందరాత్మకమై ఉన్నది ఈ రెండింటిని సమన్వయించే చేసి ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి ఏం కావాలో ముందు ధర్మ ప్రతిష్ఠాపన చేసి ధర్మం అంటే తెలుసుకునే విద్యను నేర్పి ఆ విద్యని వైదిక విద్యగా నిరూపణ చేసి మళ్ళీ తానే అనేకమైనటువంటి విద్యాలయాలు ప్రారంభించి మానవతా విలువలతో కూడినటువంటి ఒక విద్యా ప్రదానం చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానమూర్తి భగవాన్ శ్రీ సత్య సాయి అంటే మన స్వామి. ఆయన కాలేజీలు స్కూల్స్ యూనివర్సిటీలు మామూలు చదువు లౌకిక విద్య నేర్పడానికి పెట్టలా మనిషి పూర్ణమానవుడు కావాలి complete man complete persona దివ్యత్వము శతసహస్ర రేఖులుగా దళాలుగా విప్పారాలి అని అట్లాగే సాగాలని దానిని అనుభవించాలని మానవుడిలో దాగి ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని బయటకు తేవాలి అని విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి తద్వారా ఈ జగత్తుకి కొన్ని లక్షల మంది విద్యార్థుని పూర్ణ మానవులుగా తయారుచేసి ఈ జగత్తుకి అందించారు. ఇవాళ సత్యసాయి విద్యార్థులు అంటే దేవతలతో సమానంగా మారిపోయినారు కారణం వారి యందు ఉన్నటువంటి శీలబలం సంకల్ప శక్తి వాళ్లకు ఉన్నటువంటి దార్శనికత వాళ్లకు ఉన్నటువంటి commitment నిబద్ధత అంటే ఒక మనిషి ఒక లక్ష్యాన్ని గమ్యాన్ని చేరటానికి ఏ లక్షణాలు కావాలో ఆ లక్షణాలన్నింటినీ కూడా పొదిగి అలది సత్యసాయి భగవానుడు ఒక్కొక్క విద్యార్థిని కూడా శిల్పీకరించాడు అంతేకాదు ఇవన్నీ ఉన్నా మానవత్వం గనుక లేకపోయినట్లయితే అది రాక్షసత్వం వైపు ఎడుతుంది గనుక దానిలో మానవతా వాదాన్ని ప్రవేశపెట్టి కరుణ అనేటువంటి ప్రవాహాన్ని ప్రతి వ్యక్తి యందు నింపి భారతీయమైన మౌలికమైన విలువలన్నింటినీ కూడా సమన్వయం చేశారు భగవాన్ శ్రీ సత్య సాయి. రాముడికి ఏలకాన రాజ్యం ఉంది కృష్ణుడికి తయారు చేయడానికి రాజులు ఉన్నారు సత్యసాయి భగవానుడు చేసింది ఈ రెండూ కాదు మానవుణ్ణి తయారు చేశారు ఆయన man making process మొదలు పెట్టారు. మనిషి ఎక్కడో పుట్టి కొన్నాళ్ళు ఉండి ఎక్కడో దేహం వదిలేస్తే ఏం ప్రయోజనం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పరమోన్నతమై పరమోత్కృష్టమై పరమ పరిపూర్ణమైనటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి ఒక వ్యక్తి కేవలం ఒక తల్లి గర్భాన జన్మ ఎత్తి ఏదో సంపాదించి మళ్ళీ తన వారసులకు దాన్ని అప్పజెప్పి కాల గర్భంలో కలిసిపోతే ఆ జన్మకు పరమార్థం ఏమిటి అని ఒక ప్రశ్న వేసి చేసి అటువంటి దివ్యమైనటువంటి విద్యా విధానాన్ని ప్రపంచానికి స్వామి అందించారు ఇది చాలా అత్యంత విశిష్టమైనటువంటి విద్యా విధానం దీనిలో మతం లేదు మానవత్వం తప్ప. దీనిలో ఏ రకమైన ism లేదు నిజం తప్ప. దీనిలో సత్యము మాత్రమే ఉన్నది అదే విద్యా విధానం పరిపూర్ణ మానవుడు కావటం మానవత్వం గనుక శిఖరం అయినట్లయితే ఇవాళ సత్య సాయి విద్యార్థులను గనుక మనం చూసినట్లయితే. వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా ప్రపంచంలో number one గా ఉంటారు సందేహం లేదు ఉండటానికి ఇంకో రకంగా ఉండటానికి వీల్లేదు ఉంటే వాడు స్వామి స్టూడెంట్ కాదు దాని అర్థం అది ఇక రెండవది అన్ని విషయాల్లో వాళ్ళు పరిపూర్ణతను సాధిస్తారు. ఏ వస్తువుని ఏ శాస్త్రాన్ని వాళ్ళ చేతికి అప్పజెప్పండి ఒక నలభై ముప్పై సంవత్సరాలు పనిచేసిన వాడు చేయలేని పని నాలుగు నెలల్లో చేసి చూపిస్తారు అంటే ఒక skill development ఒక పరిపూర్ణత వాడు మనిషి బతకాలి ఎవరి సంపాదన వాడు సంపాదించుకోవాలి పరాన్నభుక్కుల వలె ఇతరుల సంపాదన మీద మానవుడు జీవన యాత్ర చేయకూడదు ఎవరిది వాడే సంపాదించుకోవాలి అట్లాగే అధ్యాత్మలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి సత్యసాయి భగవానుడు ఎవ్వరికీ కూడా ఈ మోక్షం నేను ఇస్తానని చెప్పలా ఈ విద్యార్థులందరికీ మీరు ఉత్తమ మానవులకండి మీలో ఉన్నటువంటి ప్రజ్ఞలన్నింటినీ కూడా బయటకు తీసుకురండి ఈ ప్రజ్ఞని సమాజహితం చేయండి అని చెప్పినప్పుడు నా వరకు నా అధ్యయనంలో నా అనుభవంలో నా తలంపులో నా సంస్పర్శలో సత్యసాయి భగవానుడి యొక్క అవతారం భౌతికంగా షిరిడీ సాయి అవతారానికి కొనసాగింపు అయినప్పటికీ భగవద్గీతలో చిట్టచివరి శ్లోకం అయినటువంటి.యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అనేటువంటి యోగేశ్వర కృష్ణుడి యొక్క ప్రమాణానికి అనుగుణంగా సాగిన అవతారమే సత్యసాయి భగవానుని యొక్క అవతారం. అంటే నీకు ఎన్ని ప్రజ్ఞలు ఉన్నా, నీకు ఎన్ని శక్తులు ఉన్నా, నీ దగ్గర ఎంత సంపద ఉన్నా, నీకు అంగబలము, అర్థబలము, జనబలము వీటికి ఆవిష్కరణ కాకపోయినట్లయితే మానవ జన్మకి అర్థమే లేదు అని. మానవ అంటే నేను కొత్త వాడిని కాదు అని. నేను పాతవాడిని, జీవుడు సనాతనుడే, దైవము సనాతనమే. ఈ జీవ-జీవ దైవ సంబంధాలు రెండు సనాతనమై ఉన్నప్పటికీ అవి సనూతనంగా ఎప్పటికప్పుడు ఆవిష్కరింపబడుతూ ఉండాలి గనుక దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా స్వామి ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి దాన్ని అంతర్తో కేవలం ఒక curriculum, ఒక syllabus, ఒక scheme తయారు చేయలే, దాని యందు అనేకమైన ప్రజ్ఞలు. మీకు సత్యసాయి అవతార వైభవంలో ఈవేళ ఒక విషయం మీకు చెప్పాలి. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, 1971లో స్వామి అనంతపూర్ మహిళా కళాశాల ప్రారంభం చేశారు. ప్రారంభోపన్యాసంలో విద్యకి సంబంధించి ఒక మాట చెప్పారు. ప్రతి ఆడపిల్ల ఈ కళాశాలలో విద్యాభ్యాసనం చేసి, విద్యను ఆర్జించి, అన్ని శక్తులు నేర్చి, ప్రపంచంలోకి ఎలా వెళ్ళాలి అంటే భారతీయమైన స్త్రీత్వానికి ప్రతిరూపంగా మళ్ళీ జగత్తులోకి వెళ్ళాలి, ఇది ఒకటి. రెండవది మాతృమూర్తులుగా మెలగాలి. మీరు you are not mere housewives. మీరు ఏం చేస్తున్నారు అంటే నేను housewife అనకండి. నేను మా ఇంటి గృహలక్ష్మిని అని గట్టిగా చెప్పండి. గృహలక్ష్మి వలే జీవించండి. దీపం వెలిగించండి. విజ్ఞాన జ్యోతిని వెలిగించండి. కన్న బిడ్డలను ఉదాత్తమైన స్థాయిలో పెంచండి అని స్వామి ఇక ఛత్రపతి శివాజీ ఇటువంటి మహాత్ముల యొక్క తల్లులందరినీ గురించి కూడా చెప్తూ అట్లా నా పిల్లలందరూ కూడా ఈ college నుంచి తయారై వెళ్ళాలి, అన్ని రంగాలలో సంపూర్ణమైనటువంటి శక్తితో ఉండాలి అని చెప్పినప్పుడు అది స్వామి చాలా గంభీరమైన మధుర ఉపన్యాసం. అది విన్నాం. కానీ ఆ మధ్య అనంతపూర్ మహిళా కళాశాలకు వెళ్లి మూడు రోజులు ఒక seminarలో నేను పాల్గొన్నప్పుడు ఆశ్చర్యపోయినాను. అంటే స్వామి కేవలం చెప్పి బోధకుడు మాత్రమే కాదు అని చెప్పటం కోసం ఈ అవతార వైభవంలో ఈ ప్రసంగం తేవాలి. ప్రస్తావన కూడా తేవాలి. ఎవరు మాకు breakfast serve చేశారో మేము చేతులు కడుక్కుని hallలోకి ప్రవేశించటానికి వెళ్తున్న సమయంలో వాళ్ళే మంగళ వాద్యాలు వాయిస్తూ ఉన్నారు. ఓహో మంగళ ధ్వనితో స్వాగతం పలుకుతున్నారని మేము వెళ్లి కుర్చీలో కూర్చునే సమయానికి ఈ ఐదుగురే వేదిక మీదకొచ్చి వేదం చదివారు. ఏంటిది? ఈ పిల్లలేనా? ఈ ఐదుగురేనా? ఇది ఎంత అద్భుతంగా ఉన్నది అనుకునే వేళకి సాయంకాలం అయ్యేసరికి వాళ్ళు drama వేశారు. అంటే నీతిని బోధించే drama వేస్తే దానిలో ప్రధాన పాత్రధారులు అంతా కూడా వీళ్ళే ఉన్నారు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఎప్పటి 1971, స్వామి ఒక్క మాట అంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల అనేక రంగాలు కేవలం వంటో ఇటువంటి చిన్న చిన్న పనులు కావు. ప్రతి పనియందు ఒక మాతృత్వాన్ని, ఒక మృదుత్వాన్ని, ఒక లాలిత్యాన్ని, ఒక నిరహంకార స్ఫూర్తిని, ఒక భక్తి ఆవేశాన్ని, పరిణితమైన మనస్సుని, విస్తృతమైనటువంటి హృదయాన్ని ఈ ప్రపంచానికి అందించే దిశగా స్వామి కొన్ని లక్షల మంది విద్యార్థులని ఈ సమాజంలోకి పంపారు. ఆ కాపరాలన్నీ చల్లగా, హాయిగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా సాగిపోతూ ఉన్నాయి. అంటే విద్య మానవుడికి కేవలం డబ్బులు సంపాదించి పెట్టేటువంటి సాధన మాత్రం కాదు. సాధన ఆంతరంగికము, వ్యక్తిగతము, అది బహిరంగము, సము-సామూహికము, సార్వకాలికము, విశ్వజనీనము కావాలి. అటువంటి ఆ దివ్యమైనటువంటి భావనా గలిమని విద్యా విధానంతో తీసుకుని వచ్చి వీళ్ళందరినీ విద్యార్థులందరినీ కూడా చక్కగా తయారు చేయటం మాత్రమే కాకుండా సరే ఈ మామూలు విద్యా విధానం నడుస్తూ ఉన్నది, మానవతా విలువలతో కూడిన విద్య కొత్తగా వచ్చింది, దీని వల్ల అందరికీ లాభం కలిగింది అని మాత్రమే కాకుండా స్వామి మరొక్కటి చేశారు. ప్రపంచంలో అంటే ఈ భూమండలం మొత్తం మీద ఒకే ఒక్క ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం ప్రతిరోజూ సూర్యుడైనా తన గడియారం ఆయనకుంటే దిద్దుకోవాలి. వేద పఠనము, వేదాధ్యయనము, వేద భాష్యము ప్రధానంగా వేద పఠనం జరిగే ఏకైక ప్రదేశము ప్రశాంతినగర్. ప్రపంచం మొత్తం మీద ఎక్కడా జరగదు. అట్లాగే సంకీర్తనా స్వరూపంగా సాగేటువంటి భజన మానవుడి యొక్క మనస్సు రాగ భావ తాళ లయాత్మకంగా ఎట్లా ఉండాలో, పుట్టిన ఆలోచన ఎంత స్వాదువుగా ఉండాలో, ఎంత మృదువుగా ఉండాలో, ఎంత చల్లగా ఉండాలో, ఎంత వాత్సల్యంతో ఉండాలో, ఎంత అర్థవంతంగా ఉండాలో, ఎంత గంభీరంగా ఉండాలో, ఎంత పరిపుష్టంగా ఉండాలో చెప్పేటువంటి ఒక భజన సాంప్రదాయానికి తెరలేపి దానిని పరిచయంచేసి భజన సాంప్రదాయవాదులు కొన్ని కోట్లు ఉండి ఉంటారు ఈ ప్రపంచంలో ఇప్పటికి. అంటే భజన రానివాడు అసలు స్వామి devoteeగా ఉండడు. స్వామి devotionలోకి ఆ ఆవరణలో రాగానే కనీసం ఒక్క భజన అన్నా నేర్చుకొని ఉంటాడు.అదే నా వలన మన మనస్సు నిర్మల మవుతుంది ప్రశాంతమవుతుంది ప్రసన్నమవుతుంది మానవ సంబంధాలలో ఒక పరిపూర్ణమైనటువంటి సరైన అవగాహనా స్థితి కలుగుతుంది గనుక వీటన్నింటినీ కూడా సమన్వయం చేసిన ఒక comprehensive education విధానం ఈ ప్రపంచానికి ఇచ్చినప్పుడు ఈ సర్వ ప్రపంచంలోనూ అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ కూడా అనేక విద్యాలయాలలో ప్రమాణాలు పతనమై పోతున్నప్పటికీ కూడా సత్యమే ప్రమాణంగా అధ్యాత్మ అంతర్వాహినిగా విజ్ఞాన ప్రజ్ఞానములు రెండు ఒక చేతులుగా దాని యందు హృదయమే ఒక దివ్యమైన అనాహత నాదంగా సాగేటువంటిదే సత్యసాయి institute of higher learning అది స్వామి సంకల్పం నుంచి వచ్చింది ఒక పల్లెటూరులో ఒక డీమ్డ్ యూనివర్సిటీ రావటం స్వామి సంకల్పం తప్ప అసాధ్యమైనటువంటి విషయం దీనిలో స్వామి సంకల్ప శక్తి ఎంత గొప్పది స్వామిని ఒక్క క్షణం మానవ దేహంలో ఉన్నాడు కదా అనుకుంటే ఆ సంకల్ప శక్తి ఇన్ని పనులు చేయించింది కనుక స్వామి నుంచి మనం పొందవలసినటువంటి స్ఫూర్తి స్వామి అందించిన స్ఫూర్తి ఏమిటంటే ఈ రెండు రంగాలని కూడా పరిపూర్ణం చేయండి విద్యా రంగము రెండవది వైద్య రంగం. వైద్యో నారాయణో హరి అన్నటువంటి ఈ దేశంలో దురదృష్టవశాత్తు వైద్యం విత్తు సంపాదించేటువంటి ఒక మౌలిక ఆధార భూమికి అయినప్పుడు స్వామి అట్లా కాదు మీరంతా నారాయణ స్వరూపులు పరమాత్మ స్వరూపులు మీరు రండి మీరు ఉచితంగా సేవ చేయండి ప్రేమతో చేయండి ధర్మంతో చేయండి మీ ప్రజ్ఞ అంతా కూడా ఎవరు అందుకోలేరో ఎవరు కలిగినవారు ఎవరికి అవకాశం లేదు వారి కోసం రండి స్వామి ఇక్కడ మీ కోసం ఒక యూనివర్సిటీ పెట్టి దానికి మళ్ళీ ఒక అనుబంధంగా వైద్యాలయాన్ని కూడా పెడతానన్నప్పుడు ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి నెంబర్ వన్ శ్రేణికి ప్రథమ శ్రేణికి చెందినటువంటి వైద్యులంతా తమ ఖర్చుతో తమ దేశం నుంచి సంవత్సరానికి ఒక నెల రోజులు వచ్చి స్వామి ప్రారంభించిన స్థాపించినటువంటి వైద్యాలయంలో సర్వీస్ చేయడమనేది ఇది ఎక్కడా న భూతో న భవిష్యతి ఇంతవరకు జరగలేదు జరుగుతుందనే ఆశ కూడా లేదు ఎందుకంటే నాయకుడు కేవల నాయకుడే కాక ఆపై కేవల లోక నాయకుడే కాక ఇది ఇదంతా నడిపించిన వాడు జగన్నాయకుడు గనుక పరమాత్మ జగత్పిత గనుక ఆయన సంకల్పాలన్నీ కూడా ఇంత ప్రవాహ వేగంతో ఇంత విర్దుష్టంగా పటిష్టంగా బలిష్టంగా బరిష్టంగా సంపూర్ణంగా ఆవిష్కృతమవుతూ ఉంటాయి కాబట్టి సత్యసాయి భగవానుడిని కేవలము మహిమా స్వరూపుడిగా చూడటానికి వీల్లేదు కాబట్టి మొదటి తొలి పదహారు సంవత్సరాలు ముగియకుండానే పద్నాలుగు సంవత్సరాలకి అవతార ప్రకటన చేసిపోయి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ ఇవన్నీ చేయటానికి వచ్చిన మధ్య కాలంలో సుమారు ముప్పై రెండు సంవత్సరాలు ఎటు చూసినా ఎటు విన్నా ఎవరిని కదిపినా ఎవరిని కుదిపినా ఎవరిని కలిసినా వాళ్ళు చెప్పేది సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచంలో ప్రదర్శించినటువంటి మహిమా ప్రదర్శనలు. మహిమా స్వరూపంగా ఆ అటు పాశ్చాత్యులు ఇటు భారతీయులు ఈయన మహిమలు చేస్తారు అని వాళ్ళకి ఒక గట్టి నమ్మకము తద్వారా స్వామిని చూడటం మొదలు పెట్టారు అయితే ఆ మహిమాలన్నీ కూడా దివ్యత్వానికి దివ్య శక్తికి నిదర్శనాలుగా మాత్రమే భావించమని నా ద్వారా జరిగేటువంటి ఈ మహిమాలన్నీ ఏనుగు మీద వాలిన దోమలని ఆ దోమలను పట్టించుకోకండి ఏనుగును పట్టుకోండి అని స్వామి ఎంతో హితబోధ చేసినా మహిమలతోనే మహిమలు అంటూనే వింటూనే కాలం ചെല గొట్టుకున్నాం మనం కూడా అలా చేయకూడదు మహిమలు ఒక భాగం అది స్వామి యొక్క ప్రమాణికలో ఒక భాగం తర్వాత ఆయన ఏ మహిమలు చేయలేదు దాని అవసరం లేదు ఆయన చేసిన చేయవలసిన మహిమ ఏమిటంటే భారతీయమైన ఈ సనాతన ధర్మాన్ని ఏ జెండా ఎజెండా లేకుండా ఏ ఉద్యమం లేకుండా నిస్తంద్ర బందంగా ఈ ప్రపంచం మొత్తానికి కూడా సనాతన ధర్మాన్ని పరిచయం చేసి మీరు దీన్ని గనుక ఆచరణాత్మకం చేసుకోగలిగితే మీలో ఉన్నటువంటి ఉదాత్త మానవుడు ఉన్నత మానవుడు బయటకు వస్తాడు తద్వారా సమాజం అంతా కూడా అద్భుతమైనటువంటి యుగంగా రూపాంతరీకరణం చెందుతుంది అని చెప్పినటువంటి మహా మహిమాన్విత మూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి కనుక సత్యసాయి అవతారంలో అది వైభవం అంటే వైభవి శ్రీరామ వైభవాన్ని అయోధ్యా నగర ప్రజలు ఆ కాలం ప్రజలు మాత్రమే చూడగలిగారు కానీ రాముడి మీద వచ్చినటువంటి మహా కావ్యాలు ప్రధానంగా శ్రీమద్రామాయణం తెలుగునాట విశ్వనాథ వారు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన శ్రీమద్రామాయణ కల్పవృక్షం వంటి వాటి ద్వారా శ్రీరాముడి యొక్క దివ్య శక్తి మానవత్వం ప్రధానంగా మానవీయమైనటువంటి గుణాలు చమత్కారాలు దానిలో సంస్కారాలు అనేకమైనవని కూడా అర్థమై రాముణ్ణి మన ఆత్మ రాముణ్ణి చేసినాయి. శ్రీకృష్ణ పరమాత్మని जिहानं जिहानं सुजानेन मौध्यं दुहानं दुहानं सुधां वेणुनादैर्हि निहानं निहानं सुदीर्घैरपांगैः महानन्द सर्वस्वमेतन्नमस्ताद అని వీణాసుకుడు శ్రీకృష్ణ పరమాత్మని ఏమయ్యా నీకసలు వయస్సు రాదా? నువ్వు ముసలివాడివి కాదా? సరే ఎన్నిసార్లు విన్నయ్యా ఈ వీణా వాదాన్ని నీ ఆ వీణుగానాన్ని ఎన్నిసార్లు నేను విను ఎప్పుడు అది అట్లాగే ఇంత సుందరంగా ఇంత హాయిగా ఉంటుందా? అవనిని ఆకాశాన్ని కలుపుతున్నటువంటి వీణా మూర్తిని నేను దర్శనం చేసినాఅవును నిజమే నువ్వు ఎవరివి నందుడు అనే నీ పెంపుడు తండ్రికి మహానంద సర్వస్వవుడివి నువ్వు అది లౌకికం అది భౌతికం కానీ అధ్యాత్మలో మహానందము అనే పరమానందము పరమ చరమమైన బ్రహ్మానందం ఏదన్నా ఉంటే అది ఒక మానవ దేహాన్ని తీసుకొని వేశేది నువ్వు కాదా అని అన్నప్పుడు అది కృష్ణ పరమాత్మ అయినాడు రామకృష్ణులతో పాటు సత్య సాయి భగవానుడు ఔపధేయమునకు సత్య నామమునిచ్చి ఔపధేయం అంటే ఉపాధి ఉపాధి అంటే శరీరం జగతి నెల్ల ధర్మ నిరతి నెరపి సత్యము రెండవది ధర్మము సృష్టిని సందికాంతుల వెలాంచి స్వామి స్వామి భద్రమై వచ్చారు సహస్ర సమానులైన అటువంటి ఆ.. కృతయుగనాటి సత్యం త్రేతాయుగ ధర్మం శాంతి ప్రేమలు సత్య ధర్మ శాంతి ప్రేమ కలియుగంలో వచ్చేటువంటి హింస ఈ ఐదు అంశాలు కలిపితే అది నిక్కమైన ఒక్క రూపమే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు అంటే మన స్వామి ఇంతకంటే ఇంత పరిపూర్ణమైన ఇంత విస్తృతమైన ఇంత విశాలమైన ఇంత గాఢమైన గంభీరమైన గభీరమైన ఉదాత్తమైన అనంతమైన అవ్యయమైన అద్భుతమైన అనంతమైనటువంటి స్వరూపాన్ని మనం ఎతోకకు చూడలే మానవ దేహంలో మనం చూడలే ఇది సత్యసాయి అవతార వైభవం ఎవరో వచ్చారు ఓ అంగవరం ఇచ్చారు ఓ పుంగవరం ఇచ్చారు ఓ గొలుసు ఇచ్చారు ఇదే మనం స్వామిని దర్శనం చేసే తీరు నైన్ పోయింట్స్ కాంటాక్ట్ అధ్యాత్మలో మనకి చెప్పారు ఆ అధ్యాత్మలో నుంచి మనం పరిపూర్ణమైనటువంటి మానవతావాదాన్ని మనం చక్కగా ఆవిష్కరించుకుంటూ పరిపూర్ణమైనటువంటి మహదానందాన్ని పొందుతూ అవతార వైభవాన్ని మనం ఇంకా లోతుగా అంటే ఏ విషయమైనా ఒక అవతారాన్ని గురించి చెప్పాలంటే బై కం-కంపారిసన్ అండ్ కాంట్రాస్ట్ చెప్పాలి లేకపోతే అర్థం కాదు మా స్వామి దేవుడు కాదన్న దేవుడు ఎట్లా దేవుడు ఎందుకు దేవుడు ఎవరికి దేవుడు ఎప్పుడు దేవుడు అని తెలుసుకోవాలి మా స్వామి దేవుడు గోడకి ఫోటో పెట్టాం అయిపోయింది స్వామి మీ దారి మీది మా దారి మీది అది కాదు స్వామి మీ దారే మా దారి నీవు వేసిన అడుగులే మాకు కాలం మీద నువ్వు వదిలిపెట్టిన పద-పదముద్రలు ఆ అడుగుల్లో మేము నడుచుకుంటూ వెళ్లిపోతాం నువ్వు నేర్పిన శుద్ధులన్నీ కూడా మేము చక్కగా అర్థం చేసుకుంటాం వాటిని జీవితంలో కేవలం చిలక పలుకులుగా కాక జీవితాన్ని ఆచరణాత్మకం చేసుకుంటాం దాని నుంచి ఒక అనుభవాన్ని మేము పొంది ఆనందమూర్తులుగా మమ్మల్ని మేము తీర్చిదిద్దుకుంటాం జీవితం ఎన్ని సవాళ్లు విసిరిని ఎన్ని కష్టాలు రాని ఎన్ని నిష్ఠూరాలు రాని అన్నింటినీ నీవు ఉన్నావన్నటువంటి ఒక్క దివ్యమైనటువంటి భావనతో శక్తితో సంకల్పంతో సమర్పణతో మా జీవితాలని ఈ గట్టు నుంచి ఆ గట్టుకి నడిపే నావికుడుగా నీవు ఎలాగో ఉన్నావు గనుక మేము నిర్భయంగా మా ప్రయాణాన్ని కొనసాగిస్తాం అని చెప్పటానికి ఈ అవతార వైభవాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి ఈ అవతారం దీన్ని మూడు స్థాయిల్లో మనం మాట్లాడుకోవాలి ఒకటి ఫిజికల్ లెవెల్ రెండవది మెటా ఫిజికల్ లెవెల్ మూడవది స్పిరిట్యుయల్ లెవెల్ మూడు రోజులు మనం మాట్లాడుకోబోతున్నాం గనుక ఇప్పటివరకు చెప్పింది పురాణ నేపథ్యంలో అలాగే మనం అనుభవించి మనం అర్థం చేసుకుని మనం గ్రహించిన రీతిలో ఆ వైనంలో మనం చెప్పుకున్నదంతా కూడా ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్ లెవెల్ స్వామి ఆసుపత్రి కట్టారు నీళ్లిచ్చారు వి-విద్యాలయాలు కట్టారు అన్నీ చేశారు ఇవన్నీ దే ఆర్ ఆల్ ఫిజికల్ లెవెల్ భౌతిక స్థాయిలో కూడా మనకి సంపూర్ణమైన భద్రత కావాలి లోకమును వీడి రసము లేదు ఉన్నదంతా ఇక్కడే ఉన్నది వేదం ఏం చెప్పింది ఇహమేవా ఇక్కడ మాత్రమే ఉన్నది ఇక్కడే ఉన్నది వేరే ఏమీ లేదు సత్యసాయి భగవానుడు మనకి మరొక విశాలమైనటువంటి భావన ఈ ప్రపంచానికి ఏం నేర్పారంటే సేవాభావాన్ని ఒక యోగంగా అనుగ్రహించారు ఈ సేవ అనేటువంటి మూలాలు ఎక్కడ ఉన్నాయి అని విచారణ చేస్తే మిగతా వారందరూ సేవలు అందుకున్నారు సత్యసాయి భగవానుడు ప్రపంచానికి సేవలందిస్తున్నారు ఏనకేన ప్రతాయేన యస్య కశ్యాం deహినా సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం ఇది ప్రధానంగా స్వామి యొక్క సేవా కార్యక్రమాలు సాగుతాయి వాటిని మనం మెటా ఫిజికల్ లెవెల్ లో అంటే ఆది భౌతిక స్థాయిలో మళ్ళీ కాస్త ప్రాపంచికమైనటువంటి విషయాలు కూడా మాట్లాడుకుంటూ నెమ్మదిగా మూడవ రోజుకి కంప్లీట్ గా ఒక స్పిరిట్యుయల్ సాధనగా ఈ స్వామిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి స్వామిని మనం గురువుగా ఎలా భావించాలి దైవంగా భావించడం చాలా తేలిక ఎందుకంటే రోజూ ఆ దైవంతో మనకు పని ఉండదు గురువుగా భావించడం కష్టం ఎందుకంటే ప్రతిరోజూ గురువుగారితో మాట్లాడాలి లేకపోతే గురువు మన పక్కన ఉండి మనల్ని హెచ్చరిస్తుంటాడు కాబట్టి వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకునేటువంటి విధిలో అఖండంగా స్వామి మనయందు ప్రవేశించి తాము ఈ ప్రపంచానికి ఏం చెప్పాలని అనుకున్నారో వాటిని వారే చెప్తూ ఉండగా మనం కేవలం ఉపాధి స్వరూపంగా ఇక్కడ కూర్చొని మనందరం కూడా కలిసిమెలసి సత్యసాయి యొక్క ఈ వైభవ కాంతురని ప్రపంచం మొత్తానికి అందించే దిశగా సాగుతున్న ఈ ప్రయత్నానికి నేను సైన్స్ మ్యాన్ ని గనుక ఈ టెక్నాలజీకి నేను నమస్కరిస్తూ ఎందుకంటే అందరూ కోవిడ్ కోవిడ్ కోవిడ్ నామా అని చేస్తే ఎవరికో చెప్పాను గోవింద నామం జపించేయండి పుణ్యం వస్తుంది కోవిడ్ భయపెడుతుంది గోవిందుడు భయం తీరుస్తాడని చెప్పా కాబట్టి ఆ దిశగా మన అడుగులు ముందుకు సాగాలని స-సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి మనందరినీ ఆ దశగా-దిశగా నడిపిస్తారని సర్వదేవతా తీర్థ స్వరూపుడైన స్వామిని మనసా వచసా శిరసా ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయిరాం.
YouTube · audio
Sri Sathya Sai Avatara Vaibhavam | Day-1
Sri Sathya Sai Avatara Vaibhavam | Day-1
Source: Sri Sathya Sai Seva Organisations, West Godavari on YouTube
0:00 / 1:25:35
More in this series