No transcript for this section.
Transcript begins at 0:00.
[సాయి భజన] సౌందర్య సార సర్వస్వం నంద స్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తురీయాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాం మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ సత్యసాయి భగవానుడి తొంభై ఆరవ జన్మదినోత్సవ సంరంభ వేళ ఇది ఒక అనంత ఆనంద హేల ఇది ఎందుకు అంటే పరమ పరాత్పరుడు అయినటువంటి ఈశ్వరుని గురించి పరమాత్మను గురించి సర్వ దేవతలకు అతీతమైన తేజో రూపమైనటువంటి స్వామిని గురించి మనం విశ్లేషణాత్మకమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడుకోవటం అనేది ఈశ్వరానుగ్రహం గా నేను భావన చేస్తూ స్వామి ధర్మ సత్యము ధర్మము ఇది రెండవది ఈ ధర్మ అనేటువంటి ధర్మ ధర్మము రెండు ఒకటే ఈ ధర్మాన్ని ఎలా నిర్వచించారు రాముడు ధర్మ అనంగానే మనకు రాముడు గుర్తొచ్చేస్తాడు మళ్ళీ పునః రామో విగ్రహవాన్ ధర్మః ఇంక తెలుగు లేని మాట అది అయితే సత్యసాయి భగవానుడు ఈ ధర్మాన్ని ఏ ఏ స్థాయిలలో నిరూపణ చేశారు తమ జీవిత కాలంలో అంటే తమ అవనీ సంచారంలో వాటిని ఎట్లా celebrate చేశారు ఆ ధర్మాన్ని మన వంటి వారికి ఎట్లా చక్కగా ప్రతిపాదన చేశారు ప్రబోధం చేశారు వీటన్నింటిని గనుక గమనించినట్లయితే ఈ ధర్మ శబ్దం అనేది ఏమిటి అంటే ధర్మము అంటే correct way of living. దానిలో correct గా ఉండాలి purpose success meaningful meaningless అవేమీ లేవు ఉన్నదంతా ధర్మం ఏమిటి ఆ ధర్మం అంటే రెండు ధర్మాలు ఉన్నాయి ఒకటి లౌకిక ధర్మము రెండవది పారమార్థిక ధర్మము లౌకిక ధర్మంలో అనేకమైనటువంటి అంశాలు కూడి ఉన్నాయి ఒక వ్యక్తిగా మనందరికీ వ్యక్తి ధర్మము ఉంది మన చుట్టూ అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు ఇవన్నీ కలుపుకుంటే అది కుటుంబ ధర్మం అవుతున్నది. ఈ కుటుంబం గడప దాటితే సమాజమై ఇది సమాజ ధర్మంగా రూపాంతరీకరణం చెందుతున్నది. అంటే వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మం లేదా సాంఘిక ధర్మం. ఈ మూడింటిని దాటి ఒక రాజధర్మం ఉన్నది. రాజధర్మంతో పాటుగా ఆర్థికమైనటువంటి ఒక ధర్మం ఉంది. వీటన్నింటిని దాటి పారలౌకికమైనటువంటి ధర్మం వైపు జీవుడు ప్రస్థానం చేయాలని చెప్తూ ఇటు లౌకిక అటు పారలౌకిక ధర్మ సిద్ధాంతం మనకు ఇవ్వబడింది గనుక సనాతన ధర్మము అంటే ధర్మము సనాతనము అని అర్థం చేసుకోవాలి మనం. సనాతన ధర్మం అంటే ఒకప్పటి syllabus అని కాదు ధర్మము సనాతనం. సనాతనమైనటువంటి ఒక ధర్మాన్ని మనం సనూతనంగా మాట్లాడుకుంటాం. ఇవాళ భాషలో మాట్లాడుకుంటాం అప్పట్లో వాళ్ళు సంస్కృతంలో మాట్లాడుకున్నారు. బుద్ధుని కాలంలో పాలి భాషలో మాట్లాడుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇంగ్లీషులో మాట్లాడుకున్నారు. ఒక తెలుగు జాతిగా పుట్టిన మనం చక్కని అచ్చమైన తెలుగులో మనం మాట్లాడుకుంటున్నాం. అటువంటి ఈ ధర్మాన్ని సత్యసాయి భగవానుడు ఎలా నిర్వచించారు? వారు దానిని ఎలా పాటించారు? ఇది ప్రధానం. ఈ ఈ అంశాలనే మనం మాట్లాడుకోవాలి. మహాకవి నండూరి రామకృష్ణమాచార్యుల వారు స్వామి గురించి ఒక పద్యం రాశారు. "అవతరించ నేడు ఆంధ్రదేశము నందు జగతిన్ ఉద్ధరింప సత్యసాయి ఆతడుపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాషయై తెలుగు నేడు" అని రాశారు. చూశారా జగత్తుని మొత్తాన్ని ఉద్ధరించటం కోసమని ఆంధ్రదేశంలో పుట్టారు కాబట్టి ఆయన కేవలం ఆంధ్రదేశానికి పరిమితమైన దేవుడే కాదు. పైగా ఆయన తెలుగులోనే మాట్లాడిన కారణంగా ఇప్పటిదాకా దేవీదేవతలందరూ కూడా మాట్లాడింది సంస్కృత భాష అయితే సత్యసాయి భగవానుడు తెలుగులో మాట్లాడినందువలన ఇది దేవభాష అయింది అంటే వాడు దేవుడే అని చెప్పారు. అది "అవతరించ నేడు ఆంధ్రదేశము నందు జగతిన్ ఉద్ధరింప సత్యసాయి ఆతడుపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాషయై తెలుగు నేడు" అది. అంటే ఇలా తెలుగు భాషకు ఒక ధర్మం ఉంది. తెలుగు గడ్డకి ఒక ధర్మం ఉంది. తెలుగు గాలికి ఒక ధర్మం ఉంది. అలాగే సత్యసాయి భగవానుడు తమ ఎనభై ఆరు సంవత్సరాల ఈ అవతార సమయంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రతి దానిని ధర్మబద్ధంగా నిర్వర్తించారు. ఎట్లా? ధర్మబద్ధంగా గడిచి నడిపితే ఉద్యోగం చేయలేమండి. ధర్మబద్ధంగా గనక వెళితే అసలు వ్యాపారమే చేయలేమండి. ధర్మబద్ధంగా వెళితే వైద్యమే చేయలేమండి. ఇక్కడ చే ఉండవలసినదంతా అధర్మమే అనేటువంటి ఈ రోజులలో ధర్మబద్ధంగా ఎలా జీవించాలో వారు జీవించి మనకు చూపించారు. కొన్ని ఉదాహరణలు. ఎప్పుడైతే ఒక అవతారమూర్తిగా జగత్తులోకి వచ్చారో వారు నిర్వర్తించిన ప్ర ప్రథమమైనటువంటి ధర్మం అంటే అవతార కార్యక్రమానికి ముందు బయట పడటానికి ముందు తన చుట్టూ ఉన్నటువంటి పుట్టపర్తి చుట్టూ తన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఒక సాంఘిక వాతావరణాన్నిఒక ధర్మ బద్ధమైనటువంటి ఆధ్యాత్మిక పరిమళంతో దానిని విస్తృతం చేశారు. మానవ జన్మ పుట్టి మె-మెట్టి గిట్టి నశించటానికి కాదు, పరమాత్ముని దర్శనం చేయాలి, సాంఘిక ధర్మాన్ని పాటించాలి, చెడుదారి పట్టకూడదు, మంచి ఆలోచనలు చేయాలి, మార్పు రావాలి మనిషిలో transformation జరగాలి. మోక్ష సంగతి తర్వాత ముందు మనిషి చెడ్డవాడు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ కార్యక్రమాలు ఉన్నవాడు నెమ్మదిగా మంచి వైపు రావాలి, రావటానికి ధర్మాన్ని ఆశ్రయించాలని చెప్పి స్వామి చిన్న చిన్న నాటకాలు రాసి, వేసి తాను స్వయంగా dance చేసి ఆ-అక్కడ నుంచి అంటే అనేకమైనటువంటి కళా స్వరూపాలను ఆవిష్కరించి బీజప్రాయంగా ఉన్నటువంటి ఒక అవతార వైభవాన్ని ఒక్కసారిగా ఆవిష్కరించి, "ఇదంతా కేవలం ధర్మం మూలంగానే జరగాలి, దీనికి ధర్మమే ఆలంబన కావాలి" అని చెప్పారు. అది ఒక ఎత్తు. రెండవది, తాను ఒక అవతార వ్యక్తి వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రణాళికను తీసుకుని ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఈ సమాజం అంతా కూడా అనేకమైనటువంటి విరుద్ధ భావజాలాలతో అతలాకుతలమై పోతున్నటువంటి వేళ ఏ మాత్రము ఉపన్యాసం ఇచ్చిన ఏ వేదాంత బోధ చేసినా మానవుడు మారడు. కనుక పరిత్యాగం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అంటే ముందు తన నుంచి ప్రారంభం కావాలి. Charity begins at home అని వాడు ఇంగ్లీషులో చెప్తే మనం చక్కగా బోర్డులో రాసేసుకున్నాం. ఇది కూడా ఇక్కడ కూడా స్వామి తన స్వధర్మం. ఎందుకని? స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. మనం చేయవలసిన పని మనం చేయాలి. ఇంకొకరు చేయవలసిన పని మనం తలకెత్తుకుని చేయకూడదు. చేసిన పరాభవం ఎదురుంటుంది. కాబట్టి ఒక ఆనందము, ఒక విభూతి, ఒక సంతృప్తి, ఒక ఉత్సాహము, ఇవన్నీ ఎక్కడ కలుగుతాయి అంటే స్వధర్మాన్ని ఆశ్రయించినప్పుడు. స్వధర్మం అంటే నీవు నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాన్ని నీవు ధర్మబద్ధంగా చేసినట్లయితే అది స్వధర్మాచరణ. ఏమిటి స్వామి చే-చేసిన రెండవ త్యాగం అంటే తన కుటుంబంతో బంధం తెంచుకోవటం. పదునాలుగేళ్ల పిల్లవాడు తన కుటుంబంతో చిన్న కుగ్రామమైన పుట్టపర్తిలో మీకు నాకు సంబంధం లేదు అని పరిత్యాగం చేయటం పరివ్రాజకుల కంటే కూడా ఉదాత్తమైనటువంటి స్థాయి. అదే ఊర్లో ఉంటూ, అక్కడే ఉంటూ, తాను పుట్టిన ప్రదేశాన్ని, కన్న తల్లిని, కుటుంబాన్ని మొత్తం వదిలేసి ఈ ప్రపంచం నాకోసం ఎదురు చూస్తున్నది అన్నారే, ఆ ఎదురు ఎందుకు చూడాలి అంటే ఈ ముగ్గురు నలుగురిని గనక మార్చితే ప్రయోజనం లేదు. సమాజం మొత్తాన్ని, సమాజాన్ని కాదు దేశాన్ని, దేశాన్ని కాదు సర్వ ప్రపంచాన్ని, సమస్త సృష్టిని కూడా ధర్మమార్గం వైపు నడిపించేటువంటి సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఒక సంస్కృతి ధారని ఈ ప్రపంచానికి నెమ్మదిగా పరిచయం చేయాలి అని స్వామి ధర్మబద్ధమైనటువంటి ధర్మాచరణలో ధర్మ స్వరూపులై వచ్చారు. ఇ-ఇందాక అనుకున్నాం "నడతకెల్ల ధర్మ నిరతి నేర" ఇక్కడ నడక కాదు నడత. నడత is character and conduct. మనందరికీ స్వామి devotees ఇంకొల్లరి devotees పక్కన పెడితే మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడికి శీలం ప్రధానము. శీలం అంటే character. character అంటే ఏమిటి? కపటం లేనిది character. ఎవరినీ మోసం చేయనిది character. తాను నమ్మిన సిద్ధాంత రథ్య మీద తాను నిలబడి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అననుకూలాలు ఏర్పడినా, ఎన్ని ఒత్తిళ్లు పెరిగినా నిబ్బరంగా, నిలకడగా దానిని ఎదుర్కొని జయించగలగటమే ఒక అద్భుతమైనటువంటిది గనుక దీనికి బలం ఏమిటి అంటే ధర్మమే బలం. నీవు ఆ స్వధర్మంలో వెళుతున్నప్పుడు రామచంద్రుడు అరణ్యవాసానికి వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు సహజంగానే ముగ్గురు తల్లులున్నారు. ముందు కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళాడు, కన్నతల్లి గనుక. "అమ్మా! పదునాల్గు సంవత్సరాలు నేను అడవిలోకి వెళుతున్నాను. కాబట్టి నీ ఆశీర్వచనం కావాలి" అని ఒక మాట అన్నాడు. ఆమె-- అడిగాడు. అంటే కౌసల్య ఓ మాట అన్నది. "యతో ధర్మస్థతో జయః" ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం కలుగుతుంది నాయనా అంది. అంటే నువ్వు ధర్మాన్ని ఆచరించు జయం నీ పక్కనే ఉంటుంది. రెండవది "ధర్మో రక్షతి రక్షితః" ధర్మాన్ని నువ్వు రక్షించే ప్ర-- ధర్మాన్ని రక్షించటం అంటే ధర్మాన్ని ఆచరించటం. ధర్మాన్ని తెలుసుకుని పాటించటం. కాబట్టి అది-దాన్ని గనక నువ్వు రక్షిస్తే నిన్ను అది రక్షిస్తుంది. ఎండ, బాగా ఎండ కాస్తున్నది, చేతిలో గొడుగు ఉంది. మనం ఏం చేయాలి? గొడుగును చంకలో పెట్టుకుని రోడ్డు మీదకి వెళితే తీరదు, తెరవాలి. దానిని రక్షించుకుంటూ నడవాలి. అది మనల్ని రక్షిస్తుంది. వానలో కూడా అంతే. ఈ ధర్మం ఒక గొడుగు లాంటిది. ఎండలోనూ అదే పని చేస్తుంది, వానలోనూ అదే పని చేస్తుంది. అంటే అన్ని కాలాలలో అది పని చేస్తుంది గనుక, అది ఉపయుక్తంగా ఉంటుంది గనుక ధర్మం కూడా సత్యములే కాలాంత విచ్ఛిన్నమైనది. ధర్మం మారదు, విలువలు మారతాయి, అవసరాలు మారతాయి, ఆశలు మారతాయి, ఆకాంక్షలు మారతాయి, ఆలోచనలు మారతాయి, ఆదర్శాలు మారతాయి కానీ ధర్మం మారదు. ధర్మం ఒక అంతర్వాహిని, ఒక అఖండ ధార అది. దానిలో గనక మనం అడుగుపెట్టి ఆ ధర్మం మనల్ని ఎటువైపు నడిపిస్తున్నదో అటువైపు వెళ్లినట్లయితే ఇందాక చెప్పే వ్యక్తి ధర్మం మనందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యక్తిగా భావించి అవును నేను engineer కావచ్చు, doctor కావచ్చు, మహా విద్యావేత్తని కావచ్చు, జ్ఞానిని కావచ్చు లేదా ఏ-ఏ వృత్తిలో ఉండండి, ప్రవృత్తి ఏమిటి? ధర్మమే ప్రవృత్తి కావాలి. మన ప్రవృత్తి అంటే మన ఆలోచనలన్నీ ధర్మబద్ధమై ఉండాలి. ప్రవృత్తి అంటే thought process.ఎవరికీ హాని కలిగించకూడదు అదే help ever hurt never స్వామి చెప్పారు ఇంగ్లీషులో చెప్పారు అదే. ధర్మాన్ని గనుక మనం అనుసరిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, సామాజికమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తూ అంటే ముందు కుటుంబ ధర్మాన్ని సమన్వయం చేసుకొని కట్టుకున్న భార్యని పొందిన భర్తని అంటే భార్యాభర్తలిద్దరూ పరస్పరమైన అవగాహనతో, ప్రేమతో, ఉత్సాహంతో, ఆనందంతో ధర్మాన్ని గనుక ఆచరిస్తే వారి కడుపున పుట్టినటువంటి బిడ్డ ఆ ధర్మాన్ని ఆచరిస్తుంది. ఇవాళ youth సరిగ్గా లేరండి, పిల్లలు ఎవరూ మాట వినటం లేదంటే ఎవరి కారణం అంటే తల్లిదండ్రులే కారణం ఇదే సత్యం. మనం ఈ మాత్రం ఇలా బతకగలుగుతున్నాం అంటే దీనికి కారణం మన తల్లిదండ్రులే. ఇది నిజమైనప్పుడు ఇప్పుడు జరుగుతున్నది కూడా అంతే నిజం. కాబట్టి ఇవాళ భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు parents వాళ్ళు ధర్మాన్ని ఆచరించాలి. ఏ ధర్మాన్ని? సనాతనమైన ధర్మాన్ని. ఒక కోడలు తన అత్తగారిని తల్లిగా చూసుకోవాలి ఇది ధర్మం. ఒక అత్తగారు తన కోడలిని కూతురుగా చూసుకోవాలి ఇది ధర్మం. అలాగే కొడుకు ఇటు తల్లిని అటు భార్యను సమన్వయం చేసుకొని తల్లి పట్ల గౌరవాన్ని, ఆదరాన్ని చూపిస్తూ జీవించాలి. భార్య పట్ల అపేక్షని, గౌరవాన్ని, ప్రేమని, వాత్సల్యాన్ని చూపిస్తూ సంసారాన్ని నడపాలి. ఇటువంటి ఉదాత్తమైనటువంటి భావనలు, ధర్మాచరణ కలిగినప్పుడు ఆ కలిగిన బిడ్డ కర్మమూర్తి కాక ఏమవుతుంది? లేదా ఏమవుతాడు? అయి తీరాలి. ఎందుకని? బంగారాన్ని కొస్తే బంగారమే వస్తుంది. ధర్మంలో నుంచి పుట్టింది ధర్మమే అవుతుంది తప్ప అధర్మం కానేరదు కాబట్టి సత్య సాయి భగవానుడు ధర్మాన్ని ముందు వ్యక్తి ధర్మాన్ని, సామాజిక ధర్మాన్ని బాధ్యత తీసుకుని సమాజమంతా కూడా ఈశ్వర సృష్టి. ఈ ప్రపంచమంతా కూడా మనందరం కొద్ది రోజులు ఉండటానికి వచ్చినటువంటి ప్రదేశం. ఈ ఉన్నన్నాళ్ళు మనం జీవితాన్ని చక్కగా నడపాలి. ఆశలు ఉండాలి, దురాశలు ఉండకూడదు. ఏ స్వామి చెప్పిన కొన్ని వేల వందల మాటలన్నీ గనుక గమనించినట్లయితే అవన్నీ కూడా సనాతన ధర్మానికి అంటే ధర్మము సనాతనమై ఉన్నటువంటి దానిలో నుంచి పుట్టినటువంటి మాటలే. కాబట్టి ఆ పదాలు, ఆ వాక్యాలన్నీ కూడా దివ్య పదాలయినాయి గనుక ఈ ధర్మం అనేది స్వామి సామాజిక ధర్మాన్ని ఎలా నిర్వర్తించారో చూడండి. మనకుంటుంది కులభేదం ఉంది, మతభేదం ఉంది. ఇంకో మతాన్ని మనం అంగీకరించం. ఇంకోడి ఆలోచనకి మనం గౌరవం ఇవ్వం. కానీ స్వామి ఆ పని చేయలే. తాము ఉండగానే సత్యసాయి Organisation పెట్టినప్పుడే, వారు ప్రారంభించినప్పుడే, దానికి ఒక emblem తయారు చేసినప్పుడు సర్వమత సమన్వయ స్ఫూర్తిని దాంట్లో నింపారు. అంటే అన్నీ దీంట్లో ఒదిగి ప్రయాణం చేయండి. ధర్మం భిన్న రూపంలో ఉండొచ్చు గాక కానీ ధర్మం మౌలికంగా, ప్రాథమికంగా rudimentary గా primordial గా ఒక్కటే. కాబట్టి ఈ ధర్మం ఆ ఒక్కటిగా ఉన్నటువంటి ధర్మం అనేక రూపాలు తీసుకుంటున్నప్పుడు వాటిలో మనం ఒదిగిపోవాలి. సనాతన ధర్మము సహనాన్ని నేర్పింది. సనాతన ధర్మము, సనాతన మతం లేదు. అలాగే హిందూ మతం లేదు. హిందూ ధర్మమే సనాతన ధర్మం. ఈ రెండూ ఒక, రెండే పదాలు. సనాతన ధర్మం అన్నా, హిందూ ధర్మం అన్నా it is one and the same. ఏమిటి అంటే, ఈ హైందవ లేదా సనాతన ధర్మంలో ఇమిడి ఉన్నది ఏమిటంటే వసుధైక కుటుంబ నిర్మాణం. ఈ సమస్త జగత్తు ఒక్క కుటుంబం వలే మెలగాలి, వెలగాలి. అలాగే మనం చదువుకుంటాం సహనావవతు సహనౌభునన్తు సహవీర్యం కరవావహై. ఏమున్నది దాంట్లో? ఉన్నదంతా అదే. కలిసి పెరుగుదాం, కలివి పెంచుదాం, ఉన్నదాన్ని పంచుకుంటూ వెళ్దాం, అందరం ఒకటిగా ఉందాం అన్నటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావన ధర్మబద్ధమైనది కనుకనే స్వామి ఆ emblem ని సృష్టించి మతాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని మొత్తం తొలగించేశారు. తొలగించి మీరందరూ ఒక్కటి మానవజాతిగా బతకండి. మానవుడికి ఆకలి, అమెరికా మానవుడికి ఒక ఆకలి, ఇండియా మానవుడికి రెండో ఆకలి, అది ఆకలి అంటే ఆకలి. దానికి తగిన పదార్థం మీరు తీసుకొని దానికి ఔషధంగా మీరు ఇవ్వాలి అని అనేకమైనటువంటివి నిత్య నైమిత్తిక జీవితంలో ఉపయోగపడేట్లుగా ఈ ధర్మాన్ని సర్వమతాలని సమన్వయం చేసినటువంటి ధర్మ స్ఫూర్తి ఎవరంటే సత్యసాయి భగవానుడు. ఇక అది ఒక దశ అయిపోయింది. దశ అయిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో శరీరం ఆజం ఖరు కర్మ సాధనం, శరీరం ఆజం ఖరు ధర్మ సాధనం. ధర్మబద్ధమైన కర్మలు చేయాలంటే ఇదిగో ఈ శరీరం కావాలి. ఈ శరీరానికి రోగాలు రాకుండా ఒకవేళ వచ్చినా దాన్ని బాగు చేసుకొని మళ్ళీ మరమ్మత్తు చేసుకొని పని చేయటానికి వీలుగా ఒక వైద్య విధానం కావాలి. వైద్యం అది ప్రధానం. ఎందుకు? ఈ శరీరాన్ని రక్షించేది వైద్యశాస్త్రం. మనసును రక్షించేది విద్య. కాబట్టి ఈ విద్య, వైద్య అనేటువంటి రెండు రంగాలని కూడా ధర్మబద్ధం చేసి human values తో కూడినటువంటి విద్యను ఒకవైపు ఒక త్యాగంతో, ప్రేమతో, అనురాగంతో, వాత్సల్యంతో, ఆప్యాయతతో వైద్యాన్ని అందించగలిగినటువంటి ఒక వైద్య విధానాన్ని సృష్టించి స్వామి ఈ రెండింటిని సమన్వయం చేశారు. ఏది body and mind. body medical. తర్వాత మనస్సు విద్య. ఈ రెండూ గనుక సమన్వయ అయిపోయినట్లయితే మిగిలింది ఏమిటంటే soul ఆత్మ. కాబట్టి విద్యా వైద్య విధానాల ద్వారా ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి ఆత్మను తాను ఎరుగు ఎరుకలోకి అధ్యాత్మ ప్రస్థానం చేయటానికి మళ్ళీ ఆలంబన ధర్మమే అవుతున్నది గనుక సత్యసాయి భగవానుడు ధర్మాన్ని ఆవిష్కరించారు.ఇక వారు చేసిన అనేక కార్యక్రమాలు మనందరికీ తెలుసు గనుక ఇంకా ఏం చేశారు? ధర్మాన్ని ఎలా అంగీకరించారో మనం, ఆచరించారో, అంగీకరించారో demonstrate చేశారో మనందరికీ కనువిప్పు ఎలా కలిగించారో తెలుసుకున్నట్లయితే స్వామి ఒక సాధారణమైన ఒక మానవుడు. అంటే మన వంటి వాళ్ళు. ఎట్లాగైతే అన్ని వయస్సుల్ని దాటుకుంటూ శరీరంలో వచ్చే మార్పులన్నింటినీ కూడా అనుభవిస్తూ ఒక దశకు చేరుకుంటారో స్వామి కూడా బాలుడై, యువకుడై, కౌమార దశలోకి వెళ్లి మధ్య వయస్కులై, ప్రౌఢత్వాన్ని దాటి ఇది పరిపూర్ణమైనటువంటి వృద్ధాప్యం వైపు ఎంత చక్కగా ఆ transcend అవుతూ వచ్చారో చూసినప్పుడు ఏమి ఆయన పదహారేళ్ళు పదహారేళ్లుగానే ఉండి పోవచ్చు కదా అంటే ఉండగలరు. కానీ సత్యసాయి భగవానుడి యొక్క ఒక ధర్మం ఏంటంటే ప్రకృతి యొక్క మూల ధర్మాన్ని ఎక్కడా వారు విచ్ఛిన్నం చేయలే, దాన్ని alter చేయలే. అది తనకు కావలసినట్టుగా ప్రకృతిని వారు మార్చుకోలే. ప్రకృతికి అనుగుణంగా తమ శరీరాన్ని మార్చుకుంటూ వెళ్ళమని తన శరీరం ద్వారా ధర్మకార్య యజ్ఞాలు, యాగాలు, కళా స్వరూపాలు, నాటకాలు, పాటలు, మాటలు, ఉపన్యాసాలు, సేవలు ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలుగా నిర్వర్తించి "మీరు ఏది చేసినా ధర్మాన్ని ఆశ్రయించి చేయండి. ఇదిగో నేను ఇక్కడ పుట్టపర్తిలో చేసి చూపిస్తున్నాను. దీన్ని చిన్న model గా తీసుకోండి. మిమ్మల్ని inspiration గా భావించండి" అని చెప్తూ సత్యసాయి భగవానుడు ధర్మాచరణం చేశారు గనుక ఆయన ధర్మమూర్తి అయినారు. అంతేకాదు, "నడతకెల్ల ధర్మ Neleti Nelapi". ఆ ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటి? దాని గౌరవం ఏమిటి? దాని depth ఏమిటి? దాని dynamics ఏమిటి? ఇవన్నీ కూడా తమ జీవితంలో తాము ఆచరించారు. ప్రకృతికి అనుగుణంగా శరీరం మారుతూ వచ్చినా, ప్రకృతికి అనుగుణంగా అనేకమైన సంఘటనలు సంభవించినా, అనేకమైన మార్పులు తన చుట్టూ ఏర్పడుతూ ఉన్నా, ఒక కుగ్రామమైన పుట్టపర్తి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచ ఖ్యాతి పొందుతూ ఉన్నా, తాము ఎలా ధర్మాన్ని ఆశ్రయించి జీవించాలని నిర్ణయించుకున్నారో వారు అలాగే జీవించారు. కాబట్టి మన ధర్మాలు అర్థాన్ని బట్టి మన ధర్మాలు మారిపోతాయి. డబ్బున్నప్పుడు ఒక రకంగా ఉంటాం, డబ్బు లేనప్పుడు ఒక రకంగా ఉంటాం. జయాపజయాలలో మన మనస్థితి మారిపోతూ ఉంటాయి. కానీ జయమూ, అపజయమూ, మానమూ, అవమానమూ ఇవి ఏమీ పట్టించుకోకుండా కేవలము ధర్మమార్గంలోనే స్వామి ఎనభై ఆరు సంవత్సరాలు పరమాద్భుతంగా ప్రతిక్షణము కూడా జీవించి demonstrate చేసి, "ఇదిగో ధర్మాన్ని ఆచరిస్తే అన్నీ వాటంతట అవే ఏర్పడతాయి. మీరు పెద్దగా శ్రమ పడవలసిన పని లేదు. ఏదైనా సృష్టికి ప్రతి సృష్టి చేయాలన్నా, ఏదైనా మనము నిర్మాణం చేయాలన్నా చాలా కష్టపడాలి. కష్టపడ్డ ఆ ఫలితం చేతికి రావచ్చు, రాకపోవచ్చు. సంకల్ప రాహిత్యంతో లేదా సంకల్పించినా అది ధర్మబద్ధమైన సంకల్పం గనక అయినట్లయితే వాటంతట అవి ఏర్పడతాయి" అనేది మనకు పుట్టపర్తి గ్రామం ఈవేళ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా, షడశాకర్షణ శక్తి నిలయంగా ఎలా మారిందో మన కళ్ళ ముందే మనందరం ఉన్నాం. అరవై ఏళ్లుగా దాంట్లో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ గమనించినప్పుడు స్వామి ధర్మాన్ని ఎలా ఆచరించారు? punctuality ఒక ధర్మం. ఆయన ఏనాడూ ఒక్క నిమిషం అటూ ఇటూ లేదు. అట్లా ఉన్నారు కదా, ఒక పదివేల మంది ఆరు గంటలకు ఇక్కడే కూర్చుందామని కూర్చోలా. ఎంతవరకు ఉండారో అంతవరకు ఉన్నారు. తాము సామాజికంగా చేపట్టిన అనేక కార్యక్రమాలని ప్రతిక్షణమూ ధర్మబద్ధంగా ఆవిష్కరించారు. అధర్మ వర్తనులైనటువంటి వాళ్ళని ధర్మమార్గం వైపు మళ్ళించారు. అప్పటికే ధర్మమార్గంలో ఉన్న వాళ్ళని జ్ఞానమార్గం వైపు నడిపించారు. ఇవన్నీ కూడా "ఔపదేయమునకు సత్యనామంబిచ్చి నడతకెల్ల ధర్మ Neleti Nelapi". మనందరం బాలవికాస్ దగ్గర నుంచి ఇదిగో ఈ మాట్లాడుతున్న ఈ క్షణం వరకు "end of education is character" ఎన్నిసార్లు రాసుకున్నామో, ఎన్ని dairy లో రాసుకున్నామో. కాబట్టి ఈ మన చదువు, మన విజ్ఞానం, మన శాస్త్రాధికారం, మనకున్న అనేక ప్రజ్ఞలు ఇవన్నీ ఎక్కడికి దారితీయాలంటే illumination, ఆత్మవికాసం వైపు దారితీయాలి గనుక స్వామి ఆత్మవికాస మార్గాన్ని, దానికి ఆయన courses పెట్టలా. మీ అందరికీ personality development చెప్తాను, భగవద్గీత for management, భగవద్గీత for health అవేమీ చెప్పలా. సనాతన ధర్మాన్ని యథార్థ దంగా సత్యసాయి భగవానుడు సనాతన సారథి అయి, చూడండి ఆయన పత్రిక పెడితే ఆయనకి ఏ పేరైనా పెట్టొచ్చు కదా. కానీ సనాతన సారథి అని పేరు పెట్టమన్నారు. అంటే స్వామి వాంగ్మయ రూపంలో, అక్షర రూపంలో కూడా సనాతన ధర్మానికి ఆయన సారథి అయినారు. సారథి అంటే నడిపించేవాళ్ళు, నడిపించాలి. కాబట్టి నడిచే దేవుడి కంటే నడిపించే దేవుడు ఈ లోక-, జగత్తుకి అవసరం. దేవుడు ఎలాగో నడుస్తాడో, ఉంటాడో, పడుకుంటాడో మనకు తెలియదు. కానీ నడిపించే ఒక దేవుడు అంటే ఆట, ఆట ఆడించే వాడు ఒకడు కావాలి. ఆ ఆడించేవాడు గనక సక్రమంగా, ధర్మబద్ధంగా ఉన్నట్లయితే, సత్య స్ఫూర్తితో గనక నిండి ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు ఎనభై ఆరు ఏళ్ళలో వారు సాగించినటువంటి కార్యక్రమాలన్నీ ధర్మబద్ధమైనటువంటివి. అందుకే మరి English లో ఈవేళ యువకులు అసలు నేర్చుకోవలసినటువంటిదంతా స్వామి వాంగ్మయంలో ఉంది, స్వామి మాటల్లో ఉంది. "vanity వదిలిపెట్టండి charity ఒక్క దాన్ని పట్టుకోండి" అన్నారు. charity simple గా కనిపిస్తుంది. vanity చాలా large scaleలో seventy mm అంటారే, చాలా expensive గా కనిపిస్తుంది. కావలసింది అది కాదు charity కావాలి. charity అంటే renunciation అంటే త్యాగం. నా కర్మణాన ప్రజాయాన ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు.మనం అమృతత్వాన్ని సిద్ధింపజేసుకోవాలి అంటే త్యాగము అలవాటు చేసుకోవాలి. త్యాగము అంటే Doling out డొనేషన్ రెండూ కావు. ఏమిటంటే అహంకారం, అవకారాలు రెండు వదిలిపెట్టాలి. వినయంగా ఉండాలి, వినమ్రంగా ఉండాలి, ఒదిగి ఉండాలి, ఎరుకతో ఉండాలి, స్పృహలో ఉండాలి, నిత్య చైతన్య వేస్తతమైనటువంటి ఒక ఉత్సాహంతో జీవితాన్ని గడపాలి. వస్తుంటాయి కష్టాలు వస్తాయి రానివేంటి? వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సుఖాలు అలాగే ఎన్ని వచ్చినయో ఎన్ని పోయినయో మనకి లెక్కే లేదు. అప్పుడు ఎట్లా ఉన్నాం, ఇక్కడ ఇట్లా ఉన్నాం కానీ మనం మనంగా ఎట్లాగైతే నెలకొల్పి చెందామో స్వామి కూడా తన అవతార కార్యక్రమ విశేషాలన్నింటినీ కూడా పూర్తి ధర్మమైనటువంటి మార్గంలో నడిపి, ఆ ధర్మ అనేటువంటి ఆ రెండవ దివ్య పదానికి ఉదాహరణ ఎవరు? Role model ఇవాళ ఎవరు? Reference ఎవరు అంటే కేవలం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారే. ఇంకో మాట చెప్పారు, ఇది కొత్త మతాన్ని కొత్త భావాలని ప్రపంచంలో వ్యాపింప చేయటానికి నేను రాలేదు. సనాతనమైనటువంటి ఒక ధర్మాన్ని మళ్ళీ మీకు గుర్తు చేసి జాగృతం చేసి ధర్మమార్గంలో నడిపించటానికై నేను వచ్చాను. "అహం సత్యబోధకః" అని ధర్మాత్మకంగా చెప్పినటువంటి స్వామి సాక్షాత్తు పరబ్రహ్మమూర్తే కాదు, అది ధర్మ స్వరూపం. సాయిరాం. [పాట] సత్య ధర్మ ప్రేమ నిత్యమై యుండిన ఉడమి తల్లి ఎంతో ఉలకరించు. విశ్వశాంతినిచ్చు. వివిధ సౌఖ్యము హెచ్చు. వినుడు భారతీయ వీరసుతుడా వినుడు.
YouTube · audio
దివ్యపద వైభవమ్ - సత్య , ధర్మ , శాంతి, ప్రేమ ! (ధర్మ)
దివ్యపద వైభవమ్ - సత్య , ధర్మ , శాంతి, ప్రేమ ! (ధర్మ)
Source: SATHYA PEETHAM on YouTube
0:00 / 26:21
More in this series