Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విషత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంవేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్ఫురతాం మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ స్వామి కరుణా విశేషం చేత మళ్ళీ ఉపనిషత్ వాహినీ స్వామి స్వయంగా రచించి భారతీయ వాంగ్మయాన్ని భక్తులందరికీ చేరువ చేసినటువంటి ఒక మహా సన్మంగళ వేళ ఉపనిషత్తులు అంటే ఏమిటి? వాటిని ఎందుకు చదవాలి? చదివితే మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? దాన్ని ఎట్లా అన్వేషించుకోవాలి? అని అనేకమైన రీతులలో స్వామి స్వయంగా రచన చేశారు అందుకు జాతి పరాత్పరుడైనటువంటి సత్యసాయి భగవానుడికి సర్వదా సర్వదా కృతజ్ఞతా బద్ధమై ఉంటుంది ఎందుకంటే వేద మంత్రాలు అనేకమైనటువంటి మంత్ర పూరితమైనటువంటి వ్యాఖ్యానాలు, వాక్యాలు అలాగే సూక్తులు, సూక్తాలు అతి గంభీరమైనటువంటి విషయాలు అన్నీ కూడా గుదిగుచ్చి ఉన్నటువంటి ఉపనిషత్ మాట ఏదైతే ఉన్నదో అది అఖండమై, అనంతమై, అవ్యయమై, అచ్యుతమై, నిరంతరమై చింతనా భూమికలోకి మానవుడిని నడిపిస్తుంది గనుక ఉపనిషత్తులు అనగానే వాటి గాంభీర్యం వేరు, వాటి వైశాల్యం వేరు, వాటి లోతులు వేరు. దాన్ని వేళ సరళంగా, హాయిగా మనమందరం చక్కగా అర్థం చేసుకునేటువంటి రీతిలో ఒక్కొక్క ఉపనిషత్తులో విషయాలు చెప్పబడ్డాయి? మహర్షులు, మహాత్ములు, జ్ఞానులు వారి వారి దర్శనాలతో వేద విభజన జరిగిన తర్వాత వేదాలు అర్థం కావటం లేదు వీటిని ఏం చేయాలి అని అనుకున్నప్పుడు వేదముల యొక్క సారము ఏదైతే ఉన్నదో, వేదముల యొక్క శిరోభాగము ఏదైతే ఉన్నదో, వేదముల యొక్క చివరి భాగము ఏదైతే ఉన్నదో అంటే వేదముల యొక్క అంతము దానికే వేదాంతం అని పేరు. వేదాంతం మనంతట మనం ఒక పుస్తకం పట్టుకుని చదివితే వచ్చేది కాదు. గురు ముఖతః సజ్జనుడు, సద్గురువు అయినటువంటి శుద్ధ మనస్కుడు అయినటువంటి ఆచార్య చట్టముడి దగ్గర కూర్చొని గనుక విన్నట్లయితే మనలో ఉన్నటువంటి సంస్కార ధారలు ఉవ్వెత్తున ఉప్పొంగి, గురు వాఖ్యానికి, ఆచార్యుడి యొక్క భావనకి మన భావం కూడా సమన్వయమై విషయాలు సుబోధకం అవుతాయి, అర్థం అవుతాయి. కాబట్టి దగ్గరతనంతోనే ఇది సాధింపబడాలి విద్య. అంటే ఎవరికీ ఎవరు దగ్గర ఉండాలి అని. సాధకుడు బోధకుడికి దగ్గరగా ఉండాలి. భక్తుడు పరమాత్మకు దగ్గరగా ఉండాలి. మన మనస్సు మన హృదయానికి దగ్గరగా ఉండాలి. మన మనస్సు మన హృదయము ఆత్మకు దగ్గరగా ఉండాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం ఉపనిషత్తులలో ఉప అంటే సమీపంలో, దగ్గరగా నిషత్ అంటే కూర్చొని. బోధకుడు చెప్తూ ఉంటాడు సాధకుడు ఆయన చెప్పినటువంటి వాఖ్యాలని, ఆయన విశ్లేషిస్తున్నటువంటి వైనాన్ని, విధానాన్ని, విశ్లేషణని సమగ్రంగా, సమ్యక్ దృష్టితో, చిత్త ఏకాగ్ర స్థితిలో దాన్ని గనుక విన్నట్లయితే ఉపనిషత్తులు మనకి చక్కగా అర్థమవుతాయి. అయితే ఒకనాడు అవి సంస్కృత భాషలోనే ఉన్నాయి గనుక నిజానికి ఆనాడు ఉన్నది కూడా సర్వ భాషలకు మాతృమూర్తి అయినటువంటి సంస్కృతం గనుక భాషలోనే మహాత్ములంతా కూడా చెప్పారు అవి వారి దర్శనాలు. అయితే ఉపనిషత్తులు ఎటువంటి గురువు దగ్గరకు వెళ్ళాలి అని చెప్పాం. కానీ అటువంటి ఇద్దరు గురువులు ఉన్నారు అనుకున్నాం లేదా ఒకే గురువు రెండు-రెండు చోట్ల చెబుతున్నాడు అనుకున్నాం అది చెప్పింది మళ్ళీ ఇక్కడ చెప్తాడా అంటే చెప్పడు చెప్తే అతడు సమున్నతమైనటువంటి గురువు కాదు. రోజుకు రోజు, క్షణానికి క్షణం తన అంతరంగంలో, తన మేధలో జరిగేటువంటి మధనంలో నుంచి ఉత్పన్నమయ్యేటువంటి అమృత భావాలన్నీ కూడా మహర్షుల యొక్క తత్వానికి అనుసంధానమై చెప్తున్న వారి వాక్కు దానితో కలవాలి అప్పుడు మాత్రమే ఉపనిషత్తుకు పూర్ణత్వం వస్తుంది. అందుకనే ఉపనిషత్తులు ఇంతే, ఇట్లా ఉంటాయి అని చెప్పగలం గానీ ఇవి ఇంతే అనటానికి లేదు. ఎందుకని అంటే మన ఆలోచన నిజానికి అభివ్యక్తి అంటే manifestation ఇప్పుడు మాట్లాడటం ఒక అభివ్యక్తి. మాట ఎక్కడ ఆలోచనలో నుంచే మాట పుట్టింది కదా! మరి ఆలోచన వాక్కుగా మారుతున్నటువంటి సమయంలో మళ్ళీ వాక్కు బయట ప్రపంచానికి వినపడేటప్పుడు చెప్తున్న వారిలో జరిగేటువంటి process ఏమిటి? అదొకటుంటుంది, ఏదో ఆలోచన రాగానే చెప్పరు కదా! అది వాక్కుగా రూపాంతరీకరణం జరగాలి. అది ఏమిటి అంటే తన ఆలోచన ఇవాళ కొన్ని English పదాలు వాడుతున్నాం అందరం చదువుకున్న వాళ్ళే, ఇవాళ English రాని వాళ్ళు లేడు perception plus interpretation అది విజ్ఞానం. perception ముందు దాని పట్ల ఒక ఊహ, ఒక భావన, ఒక అంచనా ఇది ఇదై ఉండవచ్చును అని అనుకోవటం. తర్వాత ఇది ఇట్లా కాబోలు అని interpret చేసుకోవటం, సమన్వయం చేసుకోవటం. So perception and interpretation is knowledge.ఈ knowledge ని perception ని interpretation ని ఎవరు guide చేస్తున్నారు అంటే లోపల ఉన్నటువంటి intellect మేధాశక్తి. మేధాశక్తిని మళ్ళీ ఎవరు guide చేస్తున్నారు అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ. పరమాత్మ సత్యసాయి స్వరూపంలో ఉంటే మనబోటి వాళ్ళందరం జీవాత్మలుగా ఆయన దగ్గర ఉన్నాం. అరే ప్రశాంత నయమ్ము జీవహంసల దేవి పరమహంస పరమాత్మ సాయి అని మనం అనుకుంటాం. మనమందరం హంసల వలే ఉంటాం ఆయన పరమహంస. పరమహంస అంటే అన్నీ తెలిసినవాడు ఏమీ తెలియనట్లు ఉండేవాడు. హంసలు దానికి భిన్నం. హంసకి కొంత తెలుసు కానీ అంతా తెలుసు అని భ్రమలో ఉంటాడు. భ్రమను విచ్ఛిన్నం చేయడానికి నీవు తెలుసుకున్నది మాత్రమే కాదు అని చెప్పటానికి పరమహంస మన మధ్య నడయాడిన అటువంటి ఒక సందర్భంలో మనమందరం కూడా ఉన్నాం గనుక రకంగా మనం అదృష్టవంతులం. ఇవాళ సత్యసాయి భగవానుడు ఉపనిషద్ వాహిని, వాహిని అంటే ఒక ప్రవాహం. వాహినికి ఒక వేగము, ఆవేగము రెండు ఉంటాయి. That is called speed of thought. కానీ speed of thought ఎప్పుడొస్తుందంటే అగ్గం పట్టి గుర్రాన్ని ఆపినట్టుగా మన మనస్సును గనుక ఆపగలిగితే కాసేపు ధ్యాన ముద్రాంకితమైన స్థితిలో ఉండగలిగితే స్వామి చెప్పినటువంటి వాక్యాలు మనకి తలకి ఎక్కుతాయి. అది. లేకపోయినట్లయితే ఉపనిషత్తులు మూలంలోకి వెళ్లి చదివినా అర్థమయ్యే విషయం కాదు. ఇది గంభీరమైన విషయమే దాంట్లో సందేహం లేదు. కానీ, ఇవాళ ఉపనిషత్తులు ఏ, బి, సి, డి నలుగురు చెప్పారు అనుకుందాం. చెప్పినట్లు బి చెప్పడు, బి చెప్పినట్లు సి చెప్పడు, డి కూడా చెప్పడు. ఎందుకని? ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని ఒక మాట ఉంది కదా! సత్యం ఒకటే కదా! నలుగురు ఒకే సత్యాన్ని చెప్పాలి కదా అంటే ఒకే సత్యాన్ని చెప్తారు కానీ It is told differently by the wise. చదువుకున్నటువంటి వారందరూ ఉన్నటువంటి దాన్ని భిన్న భిన్నమైనటువంటి రీతులలో చెప్తూ ఉంటారు. మనం మార్గంలోకి వెళ్ళకుండా సత్యసాయి భగవానుడు ఏం చెప్పారో, వారి ఆలోచనా ధారను మనం ఉడిసి పట్టి రకమైనటువంటి మార్పులు, కూర్పులు, చేర్పులు లేకుండా స్వామి భావనని మనం అర్థం గనుక చేసుకున్నట్లయితే ఉపనిషద్ వాహిని మనకు జీవితంలో చాలా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక ఉపనిషత్తులు అంటే వేదాంతం అన్నాం కదా. వేదాంతం అంటే philosophy కాదు. వేదముల యొక్క అంతము, వేదముల యొక్క చివరి భాగం అది. చివరి భాగం అంటే వేదముల యొక్క సారమే ఉపనిషత్తు అని అర్థం. దానిలో పాట ఉంది, మాట ఉంది, ఆట ఉంది, త్రయీ విద్య అంతా ఉంది, బ్రహ్మవిద్య ఉంది, శ్రీ విద్య ఉంది, కడగా ఆత్మవిద్య ఉన్నది గనుక, ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి విభూతి యోగానికి ముందు మనకు కలిగేటువంటి ఒక విజ్ఞాన శాస్త్రం ఏది అంటే అది ఉపనిషత్తు. అందువలననే Intellectual interpretation is not జ్ఞాన it is only విజ్ఞాన. ఎందుకంటే, ఇవాళ ప్రపంచంలో ప్రవచనం చెప్పేవాడిని జ్ఞాని అంటున్నాం. ప్రవచనాలు ఎక్కువ చేస్తే వాడు మహా జ్ఞాని అంటున్నాం. ఇంకా ఎక్కువ చేస్తే వాడు ఇంతటి వాడు లేడని మనం అంటుం-అనుకుంటున్నాం. ఇది సత్యం కాదు. ఒక శాస్త్రాన్ని, ఒక విషయాన్ని తనదైనటువంటి రీతిలో విశ్లేషించి చెప్పగలుగుతున్నాడు అంటే అతడు విజ్ఞాని మాత్రమే. మరి జ్ఞాని పాత్ర ఏమిటి అని. జ్ఞాని విశ్లేషించడు, transmit చేస్తాడు. దానిలో ఉన్న సారాన్ని one to one వెంటనే స్వామి ఉన్నారు ఉదాహరణకి మనకు అర్థం కావటానికి. వారు రోజూ ఉపన్యాసం ఇవ్వలే, వచ్చినప్పుడల్లా ఒక ఉపన్యాసం ఇవ్వలే. కానీ వచ్చి కూర్చునేవారు. కూర్చున్నప్పుడు మన మనస్సులన్నీ స్వరూపం మీద నిలకడ చెంది ఉండేవి. అక్కడ కూర్చున్న ఇరవై వేల మందికి ఒకటి అర్థమయ్యేది. ఒకటి ఏమిటంటే ప్రతి వాడు నా మనసులో ఉన్నటువంటి సందేహాలకు వాళ్ళ స్వామి సమాధానం ఇచ్చారు. ఇది స్వామి అవతార వైభవంలో అత్యద్భుతమైనటువంటి Miracle. ఉంగరం, బొంగరం, గొలుసులు ఇది కాదు. ఆయన వచ్చింది అందుకు కాదు. ముందు మనం అది అర్థం చేసుకోవాలి. మౌనంలో నుంచి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం అని స్వామి మౌనంగా ఉన్నారంటే దక్షిణామూర్తి స్వరూపమై మన ముందు కూర్చొని ఉన్నారు. ఉన్నప్పుడు మన మనస్సులు వారి మనసుతో, వారి హృదయంతో అనుసంధానమై ఉన్నాయి గనుక మనకి కలిగేటువంటి ప్రతి సందేహానికి అంటే ఇరవై వేల మంది ఉంటే, ఇరవై వేల సందేహాలు ఉంటే, ఇరవై వేల సందేహాలకి స్వామి నుంచి సమాధానం దొరికింది. అది ఉపనిషత్తు బోధించేటువంటి అత్యుత్తమమైనటువంటి రీతి. ఏదో ఉపనిషత్ వాక్యం ఒకటి తీసుకుని దాని మీద మనం అనేక రీతుల్లో గనుక మాట్లాడుకుంటూ వెళ్లినట్లయితే ప్రయోజనం లేదు గనుక స్వామి భావానికి అనుగుణంగా మనం ఉపనిషద్ వాహినిని చక్కగా మంగళవారాలు ఆరు నుంచి ఎనిమిది దాకా చక్కగా మాట్లాడుకున్నాం. స్వామి ఎందుకు చెప్పారు? ఉపనిషత్తు వాహిని అసలు ఎందుకు రాశారు? మనకు అర్థం కాదంటూనే మరి ఉపనిషద్ వాహిని ఎందుకు రాశారు? అంటే, అధ్యాత్మ సాధకుడికి ప్రస్థానత్రయం ఉంది. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు మూడు కలిపితే ప్రస్థానత్రయము. ప్రస్థానము అంటే ఏమిటి? మనం ఉన్న చోటు నుంచి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉదాత్త స్థితికి, ఉదాత్త స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి, సర్వోన్నతమైన స్థితికి వెళ్లి కడగా యదార్థ స్థితిలో మనం నిలకడ చెందాలి. నిలకడ చెందాలి అంటే ఇగో నిచ్చెన మెట్లు కావాలి. వేదాలు అపౌరుషేయాలు కాబట్టి మరి ఉపనిషత్తులు కూడా అపౌరుషేయ, అపౌరుషేయం అంటే ఎవరో కూర్చొని రాసినవి కాదు అని అర్థం. మరి ఉపనిషత్తులు కూడా అంతేనా అంటే వేదాలను విభజించిన తర్వాతవేదవ్యాసుల వారు అనేక మంది మహర్షులు ఉపనిషత్తుల గురించి చర్చ చేసుకున్నారు. అంటే వాళ్లలో వాళ్ళు మన study circle లాగా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నవన్నీ కూడా decode అయిన తర్వాత మనకి లిపి, భాష ఇవన్నీ ఏర్పడిన తర్వాత వాటిని consolidate చేసి మనకు ఉపనిషత్తులు ఇచ్చారు. మరి స్వామి వేదోద్ధరణలో ప్రధానంగా వేదాన్ని ఉద్ధరించటం సత్య సాయి అవతారంలో ప్రధానమైన ఉద్దేశం అదే. అది తర్వాత మామూలుగా మన విద్యను కూడా అభివృద్ధి చేయటం, విద్యను సంస్కరించటం, మానవతా విలువలతో కూడిన విద్యను జాతికి నేర్పటం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న under current అంతర్వాహిని ఏమిటి అంటే అదిగో దానిలో ఉన్నటువంటి వేదాలని, ఉపనిషత్తులని, ఇతిహాసాలని అంటే రామాయణాన్ని అలాగే భాగవతాన్ని, ప్రబంధాలని వీటన్నింటినీ కూడా సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి దివ్యమైనటువంటి భావనతో, మధురమైనటువంటి కంఠంతో, స్పష్టమైన ఉచ్చారణతో, విలంబితం కానటువంటి ఒక దివ్య జీవన విధానంలోకి స్వామి దానిని ప్రవేశపెట్టి మన జీవితాల్లోకి ఉపనిషద్ వాహినిని ప్రవాహ వేగంతో నడిపించారు. అది, దాని వెనుక ఇది తెలియకపోతే తర్వాతవి చదవలేం. మనకు అర్థం కాదు. ఉపనిషత్తులు తెలియకుండా భగవద్గీత అర్థం కాదు. ఉపనిషత్తులు తెలియకుండా వశిష్ఠ గీత అర్థం కాదు. అంటే వశిష్ఠ గీత గానీ, భగవద్గీత గానీ in the correct light మనకి తెలియాలి అంటే ఉపనిషత్తులు basis అని అర్థం అవుతున్నది. ఇది తెలుసుకుంటే భగవద్గీత లో ఉన్న శ్లోకాలకి మనకి సరైన అవగాహన ఏర్పడుతుంది. ఉపనిషత్తులు తెలీదనుకుందాం, చదవలేదనుకుందాం, అది వేరు ఇది వేరు అనుకుందాం. భగవద్గీత బాగా చదువుకోండి మంచిది అని చెప్తున్నారు గనుక మనం కూడా మొదలు పెట్టాం. అర్థం కాదు. కాకపోగా అనర్థం తెలుస్తుంది. ఏది తెలియకూడదో తెలుస్తుంది. ఎందుకని అంటే శ్రీకృష్ణుడు ఎదుగుల కృష్ణుడైనటువంటి కృష్ణుడు చెప్పలా అది, యోగీశ్వరుడైన కృష్ణుడు చెప్పాడు. యోగీశ్వరత్వం అంటే పరమాత్మ తత్వంలో నుంచి ఆత్మ స్వరూపుడుగా ఉన్నటువంటి అర్జునుడికి చెప్పాడు. కాబట్టి పరమాత్మ నుంచి అందుకుంటున్న వాడెవరంటే జీవాత్మలో సర్వోత్కృష్టుడైనటువంటి అర్జునుడు. "యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ" అక్కడ శ్రీ అనేటువంటి పదం శ్రీ అంటే సరస్వతి. శ్రీ అంటే జ్ఞానం. జ్ఞానానికే కదలని శ్రీ అని అష్ట తెలివిలో పదం ఉంది. అంటే కదలని శ్రీ జ్ఞానం, కదిలే శ్రీ మన దగ్గర ఉండే cash. మన దగ్గర ఉన్న currency జేబులు మారి వెళ్లిపోతే ఎటు వెళ్తుందో మనకు తెలియదు. కాబట్టి మూడవది హాలాహలం. జీవితం అనేటువంటి దాన్ని క్షీరసాగరం గనుక మనం అనుకున్నట్లయితే పాలకడలిని చిలికిన వేళ అమృతము అక్కడే పుట్టింది, హాలాహలము అక్కడే పుట్టింది. కాబట్టి శ్రీ అనే పదానికి హాలాహలము అని. అందుకనే శివుణ్ణి మనం శ్రీకంఠుడు అని అంటాం. హాలాహలాన్ని గరళాన్ని కంఠస్థం చేసి ఉంచాడు, కంఠగతి చేసి ఉంచాడు. కనుక ఆయనకి శ్రీకాంఠుడు అని పేరు. శ్రీని ధరించి ఉన్నాడు, శ్రీకి భర్త అయి ఉన్నాడు గనుక విష్ణువుని శ్రీకాంతుడు అన్నాం. చూశారా? ఆయన శ్రీకాంతుడు, ఈయన శ్రీకంఠుడు. అభిన్నమైనదే, అద్వయమైనదే, అద్వైతమైనదే. కానీ విచార ధార కావాలన్నా, ప్రశ్నలు పుట్టాలన్నా, సందేహాలు కలగాలన్నా, కలిగిన సందేహాలు తీరాలన్నా, సందేహాలకు ఒక విశ్లేషణాత్మకమైన దివ్యమైనటువంటి ఒక విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం కావాలన్నా సద్గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. మన అందరి అనేకానేక కోటానుకోట్ల మానవ జన్మలు ఎత్తిన ప్రతివాడి యందు ఉన్న కరుణ చేత సత్య సాయి భగవానుడు ఉపనిషద్ వాహిని రాశారు. దీని నేపథ్యం ఇది. ఇక ఇది ఎందుకు చదవాలి? ముక్తి వస్తుంది, స్వర్గ లోకానికి వెళ్తాము, విష్ణులోక ప్రాప్తి సాధ్యము అనే మాటలు మనం నమ్మకూడదు. ఉపనిషత్తులు అవేమీ మనకు promise చేయవు. ఏం చెప్తాయంటే జీవితాన్ని ఒక absolute reality లో అంటే స్పష్టంగా జీవించే ఒక నేర్పు మనకిస్తుంది అది. మనం అనుభవిస్తున్నాం ఒక జీవితం కదా! దానిలో కష్టాలున్నాయి, నిష్ఠూరాలున్నాయి, మానవమానాలున్నాయి, జయాపజయాలున్నాయి, రావటాలు పోవటాలు ఉన్నాయి, పుట్టటం పోవటం ఉంది, దుఃఖం ఉంది, పక్కనే ఆనందం ఉంది, దాని పక్కనే సంతోషం ఉంది. ఇవన్నీ ఉన్నాయి గనుక వీటన్నింటినీ సమన్వయం చేస్తూ జీవితాన్ని ఎలా గడపాలో చెప్పేటువంటి పరమాద్భుతమైనటువంటి వైదిక విజ్ఞానము, వేద విజ్ఞానము ఏంది అంటే అది ఉపనిషత్తుల నిండా ఉన్నది. ఇది కేవల విజ్ఞాన శాస్త్రం మాత్రమే కాదు. ఇక్కడ ఉపనిషత్తులు మనం పదార్థ వాదం ఒక పద్యం, దానికి టీకా, దానికి తాత్పర్యం, దానికి అన్వయం, దాని వెనక ఒక గాథ, దానికొక కావ్యం, దానికొక కల్పన, అనల్ప కల్పన, చాతుర్యం ఇవన్నీ ఉంటే పద్యం అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ పద్యాలు లేవు, పాటలు లేవు, కల్పనలు లేవు, కథలు లేవు. వ్యధాభరితమైనటువంటి మానవ జీవితాన్ని వ్యధ నుంచి బయట పడేసి నువ్వు సర్వోత్తమమైన దివ్యాత్మ స్వరూపుడివి. మామూలుగా నువ్వెవరలా. ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సర్వోన్నతమైన మానవ జన్మ నువ్వెత్తావు. ఎత్తినప్పుడు నువ్వెలా ఉండాలి? పరమాత్మకి సన్నిహితంగా ఉండాలి. పరమాత్మతో కూడి ఉండాలి. పరమాత్మ నాలో ఉన్నాడే అనుకుని జీవించాలి. కనుక మన ఆలోచనలు, మన చేష్టలు, మన చేతలు, మన చూపులు, మన భావనలు, మన కార్యకలాపాలు, మన వ్యవహారాలు, విహారాలు అన్నీ కూడా పరమాత్మకి సమర్పించబడిన తర్వాతే జరగాలి. అంటే పరమాత్మతో కూడి గనుక చేస్తే కర్మలన్నీ కర్మ యోగాలు అవుతాయి. పరమాత్మను తలచుకొని గనుక ఒక పువ్వు అక్కడ పెడితే అది భక్తి యోగం అవుతున్నది. పరమాత్మ నాకు అనుగ్రహాన్నివ్వు, అష్ట తెలివినివ్వు అని గనుక అడిగితేపరమేశ్వరుని అడిగి చేసినట్లయితే విజ్ఞానం జ్ఞానం అవుతుంది కాబట్టి ఉపనిషత్తులు మనకి స్పష్టంగా ఒక విషయాన్ని బోధిస్తాయి. విజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? జీవాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? పరమాత్మ జీవాత్మ కంటే భిన్నంగా ఉన్నదా? వాళ్ళిద్దరూ ఇద్దరుగా ఉన్నారా? అందుకనే సత్య సాయి భగవానుడు మనకి అనేక సార్లు వ్యక్తిగతంగా చెప్పినా, ఉపన్యాసాల్లో చెప్పినా, వాక్యములలో రాసినా నువ్వు నేను ఒక్కటే అని చెప్పారు ఆయన. మనమే ఒప్పుకోలే, ఏమన్నాం అంటే అట్లా ఎట్లా అవుతుంది స్వామి మీరు పరమాత్మ మేమేదో జీవ మేమేదో మనుషులం అనుకున్నాం. కానీ ఆయన మన యందు ఉన్నటువంటి దివ్యమైన ఆత్మని స్వామి చూశారు. మనము స్వామిలో మనిషిని చూశాం ఇంతే తేడా ఇందువల్లనే మన వైఫల్యాలు, మన అధ్యాత్మ సాధన ముందుకు సాగకపోవటానికి కారణం స్వామిని ఈశ్వరమ్మ కొడుకుగా చూశాం, పుట్టపర్తి బాబా గా అనుకున్నాం, మనలాగా మహాపురుషుడు అనుకున్నాం కానీ నా యందు ఉన్నటువంటి ఆత్మ హృదయ కువర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యః మాహామితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది నిశ మనసా స్వం చింతతా మధ్తా వా పవనచరణ రోధాత్ ఆత్మ నిష్ఠూ భవత్వం అంటే ఏం లేదు. నేను నేను నేను అని అఖండంగా నిరంతరంగా మనలో వెలుగుతున్నటువంటి మనలో వినపడుతున్నటువంటి దానిని స్వామి ఏమన్నారు? శ్రీమయము, చరాచరమయము, వాంగ్మయము, జ్యోతిర్మయము అని స్వామే వర్ణించారు. ఇదంతా ఎక్కడ ఉన్నది అంటే బయట లేదు మన అంతరంగంలో హృదయ స్థానంలో ఉన్నది గనుక హృదయ స్థానంతో గనుక ఉన్నటువంటి ఆత్మని సత్య సాయి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్థితిలోకి దీనిని సమన్వయం చేయగలిగితే అప్పుడు మాత్రమే సత్య సాయి భగవానుడు మనకు అర్థమవుతారు. లేకపోయినట్లయితే అనేకం సృష్టించిన వ్యక్తిగా అనేకమైన కార్యకలాపాలు చేయించిన వ్యక్తిగా అంటే వ్యక్తిగా కనపడతారు. వ్యక్తి అంటే వ్యక్తమైన వాడిగా కనపడతారు. మనం-- మనం ఇవాళ పట్టుకోవాల్సింది వ్యక్తమైన స్వామి మనందరికీ తెలుసు, రోజూ దర్శనం ఇచ్చారు, మనతో పాటు భజనలు చేశారు, మన చేత చేయించారు, పనులు తానూ చేశారు, చేయించారు అది వ్యక్త రూపం. అవ్యక్తమైనటువంటి రూపమే అసలు సత్య సాయి. ఇవాళ మనం చేయవలసింది ఏది? ఫామ్ అండ్ ఫామ్ లెస్ వాడుతున్నాం కదా, ఫామ్ లెస్సే సత్యం. ఎందుకంటే ఫామ్ గా ఉన్నప్పుడు మనవలనే సర్వాంగీణమైన దేహంతో ఉన్నారు, మనలాగే మాట్లాడారు, మన భాషే మాట్లాడారు, మా-- ఆయన ఆహార విహారాలు మన సుమారుగా మన కంటే ఉన్నతంగా ఉన్నాయి కానీ ఒక మానవ జాతికి సంబంధించి ఉన్నాయి. కానీ సత్య సాయి భగవానుడు పరాత్పరుడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ స్వరూపం కాబట్టి స్థాయికి మనం వెళ్ళటానికి ఉపనిషద్ వాహిని మీరన్నీ ఇక్కడికి వచ్చి నన్ను చూడండి, స్థాయిలో నన్ను అనుభవించండి, స్థాయిలో నన్ను ఇంటర్ప్రిట్ చేసుకోండి, స్థాయిలో నన్ను ఎక్స్పీరియన్స్ చేయండి. నన్ను ఎక్స్ప్లోర్ చేయకండి మీ వల్ల కాదు. నన్ను ఎగ్జామిన్ చేయకండి మీ సాధ్యం కాదు. కానీ నన్ను ఎక్స్పీరియన్స్ చేయండి ప్రేమ ద్వారా, సేవ ద్వారా, ఆవరణ ద్వారా, నేను చేయిస్తున్న పనుల ద్వారా సత్య సాయి యొక్క దివ్యమైనటువంటి స్వరూపం ఏమిటో మనకు అర్థం అవుతుంది అని స్వామి మనకు చెప్పి ఉపనిషద్ వాహినిని మనకి అప్పజెప్పారు. ఇక రెండవది, ఎప్పుడైతే మనం పరమాత్మతో కూడి ఉన్నాము అని అనుకున్నామో, పరమాత్మ నేను అభిన్నంగా ఉన్నామని అనుకుంటున్నామో ఆలోచన చేయండి స్వామితో కూడి చేసిన పనులు ఎప్పుడూ మనకు ఆనందాన్ని ఇచ్చినాయి. స్వామిని తలచుకొని చేసిన పనులు ఎప్పుడూ విజయాన్ని సాధించి పెట్టినాయి. స్వామికి సమర్పించి చేసిన ప్రతి ఆలోచన దివ్యమైన ఆలోచనగా రూపాంతరీకరణం చెందింది. టైం లేదు స్వామి కూరిక అట్లా దండం పెట్టుకొని వెళ్ళిపోయి స్వామి ఏదైనా అడుగుతున్నాను నీవు వీలైతే నువ్వు చేయన్నాడు అవి ఎప్పుడూ ఫలించలే. అంటే సమర్పణ, శరణాగతి, వినయము అనేటువంటి మూడు ఉన్నటువంటి సాధకుడు పరమాత్మని ఎట్లా గ్రహించాలో, ఆత్మ యొక్క చలనాలు ఎట్లా ఉంటాయో, అసలు జగత్ అంటే ఏమిటో, జగత్, ప్రపంచం వేదాంతుల్ని పిలవండి ఇది మారిపోయేది, ప్రపంచం అంతా మాయ, ఇది జగత్తు మిధ్య, అసలేం లేదు ఇక్కడ అన్నప్పుడు అన్ని వస్తువులు కనబడుతున్నప్పుడు లేదు అని ఎట్లా అనుకోవాలి అన్నదానికి ఉపనిషత్తులు సమాధానం ఇస్తాయి. అందుకనే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని ఇది ఎప్పుడూ కూడా ఉపనిషత్తుల గురించి చెప్పుకోబోయే ముందు ప్రతిసారి, ప్రతిరోజూ, ప్రతి సన్నివేశంలో చెప్పుకోవాలి. కంటికి కనబడని ఈశ్వరుడు, ఎప్పటికైనా అనుభూతి పొందవలసిన ఆత్మ రెండూ కలిస్తే ఒక సద్గురు స్వరూపమై జగత్తులోకి వస్తుంది గనుక గురువే దైవం. బృహదారణ్యకోపనిషత్ ఏమన్నదో తెలుసునా? మామూలుగా సినిమా పాటలు రాసేటువంటి కవులు మనసుని దయ్యంగా వర్ణించినయి. బృహదారణ్యకోపనిషత్ పని చేయలే, మనసే దైవము అన్నది. ఎందుకని? బంధానికి అదే కారణం, మోక్షానికి అదే కారణం. మోక్షం అంటే ఏం లేదు మోహ క్షయం కావటమే మోక్షం. మోక్షం అనగానే స్వర్గ ప్రాప్తి కాదు. స్వర్గ నరకాలు రెండూ ఇహమేవా ఇక్కడే ఉన్నాయి. రెండింటిని ఇక్కడే మనం అనుభవించాలి గనుక ఒడుపు, నేర్పు, పాట్లు అవన్నీ కూడా మనకి నేర్పుతుంది గనుక ఉపనిషత్తులను మనం కోణంలో అధ్యయనం చేయాలి. సరే, ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి ఉపనిషత్తులు చదివిన తర్వాత మనకు కలిగే లాభం ఏమిటి? ఏడు వారాలు అయిన తర్వాత మనకు కలగవలసిన లాభం ఏమిటి? అని అంటే జాగ్రత్తగా వింటే, అర్థం చేసుకుంటే, ఆచరించే ప్రయత్నం చేస్తే, శ్రవణం చేసిన తర్వాత మననం చేస్తే.మరణం తర్వాత నిధిధ్యాసనం గనుక చేస్తే అంటే నిశ్శబ్దంగా కూర్చొని తనలో తాను తనతో తాను ఉండి విన్నదన్నీ అంటున్నదనీ ఆకళింపు చేసుకుని తనలో తాను వాటిని విశ్లేషించుకుంటూ గనుక ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అని స్పష్టత ఏర్పడుతుంది. జీవితం అంటే తెలిసిపోతుంది. జీవితం యొక్క యాదార్దిక స్థితి Absolute Reality అధివాస్తవికత ఇది చాలా ప్రధానమైన పదం. ఉపనిషత్తులను గురించి చెప్పేటప్పుడు అధివాస్తవికత వాస్తవంగా, నిజంగా, సత్యంగా పదాలు చాలా లూజ్ గా వాడతాం మనం. అధివాస్తవికంగా It is much deeper much greater and much more intense than మనం చెప్పుకునేటువంటి reality. reality అంటే Absolute Reality దింతే అంతే. పుట్టాము అంటే ఖచ్చితంగా పోతాము ఇది సత్యం కాదా? పోతాము ఖచ్చితంగా పుడతాము ఇది సత్యం. ఇది చెప్పగలం పుట్టిన వాడు పోతాడు అనేది సత్యమే గాని పోయిన వాడు మళ్లీ పుడతాడు అనేది ఎట్లా సత్యం? అనే దానికి ఉపనిషత్తు సమాధానం ఇస్తుంది. బహూనాం జన్మనామంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని ఒకటి. శంకర భగవత్పాదులైతే పునరపి జననం పునరపి మరణం ఇటువంటివన్నీ కూడా హైందవ సాంప్రదాయంలో, హైందవ భావనలో, సనాతన ధర్మంలో ఇమిడి ఉన్న ఒక మహా పరిసత్యం ఏమిటంటే, ఇవాళ మనం శరీరాన్ని వదిలిపెడితే ఇవాళ్టి వరకు చేసిన కర్మలను మళ్లీ చక్కగా అనుభవించటానికి మరొక్క జన్మ ఇవ్వబడుతుంది. మరి అన్నీ మంచి పనులే చేశాం అయినా జన్మ వస్తుందా అంటే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే జన్మ ద్వారా మళ్లీ నీవు ప్రపంచంలోకి వచ్చి అనేకమైనటువంటి విషయాలు ప్రపంచానికి ఇదిగో ఇవన్నీ ఇట్లా ఉన్నాయని చెప్పాలి. చూడండి రాముడు వచ్చాడు అంతటితో అవతారాలు అయిపోవలా వాళ్లకు కూడా జన్మలు ఉన్నాయి. కృష్ణుడు వచ్చాడు అంతటితో ఆగలా శిరిడి బాబా వచ్చారు భగవాన్ సత్యసాయి వచ్చారు రేపు పొద్దున వెళ్లుండగా ప్రే-ప్రేమసాయి వస్తారు. అంటే ఏమిటి? అవతార మూర్తులు కూడా జగత్తుని చక్కగా బాగు చేయటానికి వాళ్లకి ప్రపంచంతో రకమైన సంబంధాలు ఉండవు బాంధవ్యాలు ఉండవు. దేనికి కొంగరు, తొంగరు, లొంగరు, వొంగరు అయినా మళ్లీ పంచభూతిక దేహాన్ని తీసుకుని ఎందుకు వస్తారు అంటే మరి ప్రపంచాన్ని నడిపించాలి. దీన్ని ధర్మ మార్గంలో ధర్మ ప్రతిష్ఠితం చేయాలి. మానవుడి ఆలోచనలు ఒకే నిమిషంలో కొన్ని వేల మైళ్ల దూరం పరిగెత్తే దాన్ని ఆపాలి, నిగ్రహింపజేయాలి. ఇవన్నీ కూడా ఉపనిషత్తులు బోధిస్తాయి గనుక అవతార మూర్తులు కూడా వచ్చి-- అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఏమిటంటే రామకృష్ణాది అవతారాలు ఉపనిషత్తుల గురించి భారతీయ వాఙ్మయాన్ని చెప్పలే. రాముడు యోగ వాశిష్టం విన్నాడు అంటే వింటూ వింటూ ఆయన కూడా అన్నాడు కాబట్టి ఆయన కూడా వాఙ్మయాన్ని చెప్పాడు మాట్లాడుకున్నారు వాళ్ళు. కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల యొక్క సారాన్ని భగవద్గీతగా ఆయన అందించాడు. ఆయన పని చేశాడు. కానీ కూర్చొని రాసి యదార్థంగా ఒక కాగితం కలం పట్టుకొని అచ్చ తెలుగులో రాసినటువంటి ఒక అర్చా మూర్తి సర్వ దేవతలకీ అతీతమైనటువంటి తేజో రూపం భగవాన్ శ్రీ సత్యసాయి. కనుక స్వామి అందరికంటే భిన్నంగా, ఉదాత్తంగా మనకు ఎందుకు కనిపిస్తారు అంటే ఆయన ఉపనిషత్తులు ఎవరినో పిలిచి నువ్వు రాయి వ్యాఖ్యానం అని ముందుమాట రాయచ్చు ముందుమాట రాయలే. మొదటి నుంచి చివరి వరకు ఆయనే రాసుకుంటూ వెళ్లారు. ఎప్పుడు రాశారు? వయస్సు వచ్చిన తర్వాత కాదు ఇంకా వయస్సు రాకముందే పిన్న వయస్సునే వాహినులన్నీ కూడా పూర్తి చేశారు. అంటే అతి చిన్న వయస్సులోనే వాఙ్మయం మనం నేర్చుకోవాలి. అందుకే స్వామి బాల వికాస్ పెట్టింది అసలు దీనికి. ఇటువంటి వేదార్థాలు, ఉపనిషత్తులు, శ్లోకాలు, ఉపధ్యాలు భారతీయమైనటువంటి ఒక వాఙ్మయ సంపదని మన కడుపున పుట్టినటువంటి బిడ్డకి సరైన రీతిలో అందించాలి అనేది ఆయన భావన. ఉపనిషత్తులను కూడా ఉపనిషద్ వాహిని కూడా అట్లాగే రాశాడు. భావనలో రకమైన తేడా లేదు. కనుక ప్రపంచమంతా వేదాంతులు మిధ్య, ఇదంతా పోయేదే అంటున్నప్పుడు ప్రపంచం ఎక్కడ పోతున్నది? ఎక్కడికి పోవటం లే మార్పు చెందుతున్నది. ప్రపంచంలో సృష్టింపబడిన జగత్తులో మనం ఎట్లాగైతే వ్యక్తిగా ఉన్నామో మనం కూడా బయట కనిపిస్తున్న ప్రపంచమంతా మనలో ఉన్నది. మన లోపల ఉన్న ప్రపంచం అంతా బయట ప్రపంచంగా అభివ్యక్తమవుతున్నది. దీనికి కొద్దిగా విచారణ కావాలి. ఈశ్వరో గురురాత్మేతి కి ఇది కొనసాగింపుగా మనం చెప్పుకోవాలి. ఏమిటి అంటే సృష్టి ఎవరు సృష్టించారు అంటే బ్రహ్మ సృష్టించాడు అంటాం కానే కాదు. సృష్టింపబడటానికి ముందు ఒకేఒక వస్తువు ఉందది. వస్తువు పేరు సత్. సత్ ఒకరోజు సంకల్పించింది దాని పేరు సత్ సంకల్పం. అవును నేను ఒకటిగా ఉన్నాను నేనే అనేకమైపోతే ఎంత బాగుండును అని సంకల్పం. దాని వలన సృష్టి జరిగింది. అంటే Creator సత్ అయినట్లయితే Created ప్రపంచం అయి-- అవుతోంది. ఇంకా కాలా? కాబట్టి ఆయన ఏం చేశాడు? సృష్టించాడు. సృష్టించినటువంటి దాంట్లో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు సృష్టింపబడిన తర్వాత అవి ఎక్కడో చోట ముద్దగా ఉండటానికి వీల్లేదు. కాబట్టి ఇవి ప్రవేశించాలి. ఎక్కడికి ప్రవేశించాలి? సృష్టి అంతా ప్రవేశించాలి. ప్రవేశించినప్పుడు దాని పేరు విశ్వము అని పేరు పెట్టాడు. ముందు సత్, తర్వాత సృష్టి, తర్వాత విశ్వము. విశ్వము అంటే ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అదే సంసారము అయింది. సంసారం అంటే దాని సంక్షిప్త స్వరూపం. సంసారమే వ్యక్తి అయింది, సమష్టి అయింది, వ్యష్టి అయింది. దానినే స్వామి వ్యష్టి, సమష్టి, సృష్టిఇష్టమైన నాలుగు భాగాలు నాలుగు సోత్త అవి అంచ ప్రాసలు శబ్దాలంకారాలు కావు పరమాద్భుతమైనటువంటి వేద వాక్యాల నాలుగు మాటలు ఎస్టీ నువ్వు ఒక్క వ్యక్తిగా ఉన్నావు అని అనుకుంటున్నావు కానీ నీ అంగాంగములు నీ పది ఇంద్రియాలు నీ మనస్సు నీ బుద్ధి నీ చిత్తము నీ అహంకారము నీలో ఉన్న ఆత్మ ఇన్ని కలిపితే పదకొండు నీ యందున్నయే నీవు అసలు అది అంటే శరీరానికి నవరంధ్ర కాయము అని పేరు తొమ్మిది దారులు exit gates ఉంటాయి శరీరానికి ప్రాణం తొమ్మిదిలో ఏటో ఒకటి పోతుంది అది అట్లాగే లోపల ఉన్నటువంటి ఆత్మకి ఉపనిషత్తులు ఇచ్చినటువంటి పేరు ఏమిటంటే ఏకాదశ పురవిహారి ఏకాదశ అంటే పదకొండు ఇప్పుడు మనం ఏకాదశ రుద్రాభిషేకం చేస్తున్నాం అది external గా చేస్తున్నాం మరి internal గా మానసిక పూజలో ఏమిటి అని అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనస్సు పదకొండు కలిపితే ఐదు plus ఐదు plus ఒకటి పదకొండు ఇవి ఏకాదశ రుద్రాభిషేకం రుద్రుడు అంటే జీవుడు అని అర్థం రుద్రుడు అంటే శివుడు కాదు రుద్రుడు అంటే జీవుడు జీవాత్మగా ఉన్నటువంటి వీడు పరమాత్మ అనబడేటువంటి జంగమ స్థావరమైనటువంటి శివ లింగానికి తాను అభిషేకిస్తున్నాడు అంటే తాలో ఉన్నటువంటి ఒక్కొక్క భావనని పరమేశ్వరార్పితం చేసి దాని నుంచి తాను శక్తిని పొంది తన ప్రయత్నాన్ని తాను అధ్యాత్మ సాధనని మొదలు పెడుతున్నాడు ఇది ఉపనిషత్తులు చెప్తాయి సరే ముందు జగత్తును గురించి గనుక మనం విచారణ చేసినట్లయితే అంటే పుట్టేది గత్ అంటే పోయేది పుట్టేది పోయేది నిజంగా మనం ఉన్నాం ప్రపంచాన్ని కాసేపు పక్కనబెట్టి మనంతట మనల్ని విచారణ చేసుకున్నట్లయితే మనం పుట్టాం బాల్యం పోయింది కౌమారం పోయింది యవ్వనం పోయింది మధ్య వయస్సు పోయింది వృద్ధాప్యం వస్తున్నది లేదా వచ్చింది అంటే అన్నీ పోతే తప్ప ఏదో ఒకటి రాదు ఒక్కటి పోయినా అన్నీ రావు అన్నీ పోతే గాని ఒక్కటి రాదు అంటే అహంకారం పోవాలి మమకారం పోవాలి మమత్వం పోవాలి శిథిలం అయిపోవాలి లోపల అన్నీ చూర్ణం అయిపోవాలి అంటే నిశ్శేషం కావాలి ఏం మిగలకుండా ఉండాలి అటువంటి సమయంలో జగత్తు మనం ఒక మహర్షి ఒక దార్శనికుడు ఒక స్వామి మన స్వామి ఉదాహరణకు మన స్వామినే తీసుకుందాం ఆయన ఇంతమందిని ఎలా ప్రేమించగలిగారు ఇది ప్రశ్నే కదా మనమందరినీ ప్రేమించగలుగుతున్నామా లేదు మనం ప్రేమించటానికి అవసరాలున్నాయి సందర్భాలున్నాయి ప్రయోజనాలున్నాయి వ్యక్తిగత లాభాలున్నాయి ఇది గనక చేస్తే అదేదో వస్తుంది గనక వాణ్ణి ప్రేమిద్దామనుకుంటాం గనక మనం ప్రేమించటానికి కారణాలు వెయ్యి సత్యసాయి భగవానుడు మనల్ని ప్రేమించడానికి ఒక్క కారణం లేదు అందుకనే ఆయన్ని అవ్యాజ కరుణామూర్తి అన్నారు వ్యాజం లేదు కారణం లేదు ఎందుకు ప్రేమించారు అంటే ప్రేమ ఆయన స్వభావం గనుక ప్రేమించారు మరి ప్రేమ స్వభావాన్ని ఆయన ప్రేమించి మనకు చెప్పకపోతే ప్రేమ అనేది ఒకటుందని దాన్ని స్వామి వలె మనం అందరినీ కూడా ప్రేమించాలని అందరి యందు రాగ అనురాగాలు దాటి దివ్యమైనటువంటి ప్రేమభూ-అభూ- అనుభూతిలో మనం నిలకడ చెందాలని ఎవరు చెప్తారు మనకి రాగము అనురాగము ప్రేమ మూడు మూడు స్థాయిలు గనుక మొదటి రాగము రక్త బంధం మన తోబుట్టువులు మన తల్లిదండ్రులు మ-మన పిల్లలు పిల్లల పిల్లల పిల్లల పిల్లలు ఇవి రక్త బంధం ఎవ్వరూ చెరిపేది కాదు స్థితిగతులను బట్టి కాస్త ముందు వెనకగా మారినా అది అక్కడే ఉంటుంది దానికి రక్త సంబంధం అని పెట్టాం దానికి రాగ బంధము ఇక అనురాగ బంధం మనకు పరిచయస్తులు ఉంటారు ప్రపంచంలో వృత్తి ద్వారా ప్రవృత్తి ద్వారా సాధన ద్వారా కదాచి తకస్మాత్తుగా ఇట్లా అనేక మంది పరిచయం అవుతారు వాళ్ళు కూడా మన స్థితిగతులను బట్టి వాళ్ళు కూడా మారిపోతుంటారు మనకి ఎంతమంది పరిచయస్తులు నిలకడ చెంది ఉన్నారు లేరు మరి మనతో నిలకడ చెంది ఉన్నటువంటి వారు రాగ అనురాగములకు అతీతమైనవారు ఎవరు అంటే ఈవేళ సర్వ ప్రపంచము సత్యసాయి భగవానుడిని చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ఇంకా చూసిన వాడికి ప్రశ్నలున్నాయి చూడని వాడికి ప్రశ్నే లేదు ఇది the total surrender రెండువేల పదకొండు ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత జన్మ ఎత్తినటువంటి ప్రతి వాడికి స్వామితో ప్రత్యక్ష పరిచయం లేదు అవకాశమే లేదు కానీ స్వామితో నాకు ప్రత్యక్ష పరిచయం చాలా ఉన్నది అనుకున్నటువంటి వాడు కూడా మాయలో ఉన్నాడు అసలు స్వామిని చూడని వాడు సంపూర్ణ శరణాగతి చెంది ఉన్నాడు ఇది యదార్థం this is called absolute reality అంటే ఇది కాబట్టి ఇక్కడ మనం ఆయన సీనియర్ devotee అని చెప్పడానికి ఏం లేదు కాబట్టి ప్రపంచం మన-మన శరీరంలో ఎట్లాగైతే మనం అనుకుంటాం ఇవాళ అయిపోయింది ఇవాళ అయిపోలే మన ఆయుష్షులో ఒక ప్రమాణం ఒక unit పోయింది అట్లా కొన్ని సంవత్సరాల units అన్నీ పోతున్నాయి పోతున్నదానికి మనం birthday చేస్తున్నాం అది అరవై రెండు నిండి డెబ్బై రెండు నిండి నిండిందానికి పో-నిండిందంటే పోయిందని అర్థం రాబోయేదా ఏమో రేపు పొద్దున ఉంటామో ఉండమో ఎవరికి తెలుసు కానీ రాబోయే దాన్ని ఊహించి చేయం పోయిన దానికి చేస్తాం ఇది అజ్ఞాన భూమి కదా ఇది reality కాదు కదా కాబట్టి ఉపనిషత్తులు నీకు సాధకుడికి మనకు బోధించేది ఏమిటంటే జీవితాన్ని జగత్తుని స్పష్టంగా చూడు నీ వాకిట్లో ఒక చెట్టు ఉన్నది చెట్టు ఎండాకాలం రాగానే ఆకులు రాలుస్తున్నది అదేదైనా ఎండిపోతున్నదా మళ్ళీ చిగురాకులు మోసలు ఎత్తుతున్నాయి మళ్ళీ దాని మీద మొగ్గలు వస్తున్నాయి మొగ్గలలో నుంచి పూలు వస్తున్నాయి పూలల్లో నుంచి పండు కాయ వస్తున్నది కాయలో నుంచి పండు వస్తున్నది కానీ ఇవన్నీ నేను ఇస్తున్నానంది అని అనటం లేదా జగత్తు నిరపేక్షంగా ఇస్తున్నది శంభుజ్ఞాన వసంత సంగిని హృదారామేక జీర్ణచ్ఛదా స్రస్తా భక్తి రతాచ్ఛటా విలసితా పుణ్య ప్రవాళ శ్రుతాఃదీష్యంతే గుణ కోరకా జప వచః పుష్పాస్య సద్వాసనా జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్ ఫలాభ్యున్నతి అంటారు శంకర భగవత్పాదులు, ఎక్కడ? శివానందలహరిలో. స్వామి కూడా అదే చెప్తారు. ఏం చెప్తారంటే, "ఈ జగత్తు పుట్టి పోయేదే నీలాగా" అంటారు నెమ్మదిగా. మనం పుట్టి పోయేదే వినపడుతుంది నీలాగా మర్చిపోతాం. మనం కూడా అంతే, ఎన్ని మార్పులు వచ్చినాయి. మన పాత ఆల్బమ్స్ తీసుకుని చూడండి. "ఎంత బాగున్నాన్నా! ఇట్లా ఉండేవాడిన్నా! ఇప్పుడు ఎంత బాగున్నాను, అప్పుడే బాగాలేదు" ఇవన్నీ కూడా comparisons వస్తాయి. అంటే ఏంటి? ఋతువు వెంట ఋతువు ప్రకృతి పరిణామ దశలో తనను తాను మార్చుకుంటూ వెళుతున్నది, మాయ కారణంగా తనను మార్చుకుంటూ వెళ్ళిపోతున్నది. It is deceiving itself. deception కి, మాయకు లోను కాకు అని చెప్పడానికి నీకూ, జగత్తుకి ఒక సంబంధ బాంధవ్యం ఉంది. ఏమిటంటే సర్వ జగత్తు ఒక్క రూపమైతే నువ్వు. నువ్వు గనక విస్ఫోటనం చెంది విస్తృతమైతే సర్వ జగత్తు నువ్వే. ఇది అభేద, అద్వయ, రమణీయమైనటువంటి మనోజ్ఞ భావనా భూమిక. వాటిని మనం అట్లాగే వర్ణించుకోవాలి. కాబట్టి ప్రకృతి మనకంటే భిన్నం కాదు అని తేలిపోయింది. జగత్తు, కదా. ఇహ అట్లాగే ఒక చెట్టు ఉంటుంది, వంద ఏళ్ళు ఉంటుంది, రెండు వందల ఏళ్ళు ఉంటుంది, ఎప్పుడన్నా రోజున అది పో-- అది కూడా కూకటి వేళ్ళతో చెకలింపబడి కాల, కార్య, కారణ, కర్తవ్య, నిమిత్తమై మనలాగే అది కూడా మన వాకిట్లో పుట్టింది. అది మన ఇంట్లో మూడు, నాలుగు తరాలు చూస్తుంది, రోజున కూలిపోతుంది. కదా? అట్లాగే మనం కూడా పుట్టినది మొదలు కన్నుమూసే దాకా జీవితం ఏదో మనకి ఇస్తుందని, ఇవాళ మన దగ్గర ఉన్న డబ్బు, మనకున్న కీర్తి, మనకున్న popularity, ఇవన్నీ సత్యమని గనక నమ్మితే అది అజ్ఞాన భూమిక. ఇది ఉపనిషత్తు మనకి చెప్తుంది. అన్ని ఉపనిషత్తులు. కాబట్టి మనం దేని గురించి కూడా attachment పెట్టుకోకూడదు. మరి attachment లేకుండా ఎట్లా? "నేను మరి పుస్తకాలు రాశాను కదా, నేను కొన్ని పాటలు పాడాను కదా, కొన్ని భజనల్లో నన్ను మించిన వాళ్ళు లేరు కదా" అనుకుంటామే, అదే వద్దు అని చెబుతుంది ఉపనిషత్తు. నీవు మ-- మాట అనుకున్న మరుక్షణము you become zero. శూన్యం అయిపోతావు, ఏం కాకుండా అయిపోతావు. కాబట్టి నిన్ను నీవు సంభాలించుకొని నిన్ను నీవు నిలబెట్టుకునేటువంటి స్థితిలో ఉండటానికి జగత్తుని ఆదర్శప్రాయంగా, నీకు ఒక role model గా ప్రపంచాన్ని తీసుకో. గాలి వీస్తున్నది, కంటికి కనపడదు, అది పరమాత్మ. మనకు కావలసినప్పుడు ఎండ కాస్తున్నది, భూమికి చైతన్యాన్ని ఇస్తున్నది, అది పరమాత్మ. నీరు పారుతున్నది, ప్రవహిస్తున్నది, నిలకడగా ఉన్నది సముద్రంలో, సముద్ర ఉపరితలంలో నుంచి మళ్ళీ ఆవిరి ఏర్పడి, మేఘాలు మళ్ళీన త్రిళ్ళి మళ్ళీ నీరు వచ్చి మళ్ళీ సముద్రం అంతా నిండుతున్నట్టుగా వస్తున్నది, పోతున్నది, మార్పు చెందుతున్నది, నిలకడగా ఉన్నది, ప్రవహిస్తున్నది, వేగ, ఆవేగాలతో సాగిపోతున్నది, నీవు కూడా అంతే. నీవు నీ జీవితంలో వచ్చే ప్రతి మలుపునూ ఇది పరమాత్మ ఇచ్చిన అనుగ్రహంగా భావించాలి. నువ్వు శాశ్వతం కాదు కానీ నువ్వు చేసే పనులు శాశ్వతం. స్వామి చెప్పారు, "దేవుడనగా వేరు దేశమున లేడు, పాము చేయు పనుల యందు తగిలి ఉండు." మనకే చెప్పారు, నువ్వు పనిలో దివ్యత్వంతో చేస్తావో అక్కడ దేవుడున్నాడు. దేవుడంటే ఎక్కడ వెతుకుతావు నువ్వు? దేవుడు అనగానే చెయ్యి ఆకాశం వైపు పెలుతున్నావ్, అక్కడ ఏం లేదు. అంతా వ్యాపించి ఉన్నటువంటి సర్వే సర్వత, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ జగత్తు యొక్క వ్యక్త స్వరూపం. దానిని ఉపనిషత్తులు అశ్వత్థ వృక్షము అని వర్ణించారు. దాని మూలాలన్నీ వేరు పైకి ఉంటుంది, చెట్టు తెరగబడి ఉంటుంది. అంటే తెరగబడిన చెట్టు భూలోకమైనట్లయితే దాని మూలము బ్రహ్మ లోకమన్న నాడి అంటాం, బ్రహ్మ నాడి. అలాగే ఉపనిషత్తులు ఇవన్నీ మనకి చెప్తాయి నెమ్మదిగా. ఇవాళ జగత్తుని, "ఈ ప్రపంచం చెడ్డది" అని మనం అనటానికి లేదు. "ఈ ప్రపంచం చాలా గొప్పది" అని చెప్పడానికి అసలు వీలే లేదు. అది మంచి కాదు, చెడు కాదు, మనలాగానే. అది అంతే. మనందరమూ we are all unique. ఒక్కరూ ఇంకొకరితో పోల్చుకోవటానికి వీల్లేదు. ఎవరి ధోరణి వారిది, ఎవరి శక్తి వారిది, ఎవరి చూపు వారిది, ఎవరి అంతరంగ స్పర్శ వారిది, ఎవరు జీవితాన్ని చూస్తారో చూపు భిన్నభిన్నంగా ఉంటుంది గనుక ప్రకృతి ఎలా ఉండాలో అట్లాగే ఉంటుంది. మనం చెప్పినట్లు అది వినదు. ఎప్పుడైతే మనిషి ప్రకృతి మీద ఒక యాజమాన్యాన్ని, అధికారాన్ని సంపాదించి ప్రకృతిని శాసించటం మొదలు పెడతాడో ప్రకృతి ఒక్కసారి ఒళ్ళు విదుల్చుతుంది. ఒక్కసారి కదుపుతుంది. దానిలో నుంచి భూకంపాలు పుడతాయి, సునామీలు సృష్టింపబడతాయి. అనేకమైనటువంటి విషయాలు, ఇవాళ మనం, కోవిడ్-19 అనొద్దు, కోవిడ్-20 కి వచ్చేసాం గా, దానికి కూడా birthday జరుపుతాం డిసెంబర్ కల్లా. కాబట్టి కోవిడ్ అనేటువంటిది ఎలా వచ్చింది అంటే ప్రకృతిలో సంభవించిన పరిణామం. మనము ప్రకృతి మీద అధికారం సంపాదించటానికి మనకున్నటువంటి శాస్త్ర భౌతిక విజ్ఞానాన్ని, పదార్థ విజ్ఞానాన్ని convert చేసి దాని ద్వారా అనే అనంతమైన సంపద సంపాదించాలన్న దురాశ వలన మనకు దుర్దశ ఏర్పడింది. ఇదే సత్యం. ఇవాళ ఎంత డబ్బున్నా రేపు పొద్దున ఏమవుతానో అనే భయం వచ్చింది. వైరాగ్యం నేర్పుతుంది ఉపనిషత్తు. కాబట్టి జగత్తు పదార్థం అయితే మరి మనిషి ఏం చేయాలి? పుట్టినప్పటి నుంచి కనుము-- కనురెప్ప మూసే దాకా అంటే పారమార్థిక జీవితాన్ని గడపాలి. పరమార్థం, జీవిత పరమార్థం ఏమిటి? జీవన సాఫల్య పురస్కారాలు అందరికీ ఇస్తారు. అవి వింటూ ఉంటాం. "ఆయన జీవన సాఫల్య పురస్కారం వచ్చిందండి" అని. జీవన సాఫల్యం అంటే it's only a success.జీవన పరమార్థం ఏమిటని purpose ఏమిటి అని success వేరు purpose వేరు success అనేది నేను ఏదన్నా గనక సాధిస్తే అది నాది ఇంకెవరికీ చెందదు. ఎప్పుడైతే purposeful జీవితం నేను గడుపుతానో నా జీవితం పది మందికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడేట్లుగా జీవిస్తే దాని పేరు పరమార్థం. జీవిత పరమార్థం జీవిత లక్ష్యం ఏమిటని అన్ని శబ్దాలు పుట్ట నిశబ్దమందు అన్ని యుగాలు మొదలాయ యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాం వేషితం. నారాయణున్ని అన్వేషించాలి జీవిత పరమార్థం అంటే ఉపనిషత్తులు నేను అంటే ఎవరు? దేవుణ్ణి చూశావా? ఆత్మసాక్షాత్కారం అయిందా? అని ప్రశ్నలు తర్వాత వస్తే అసలు ముందు ఆత్మ అంటే ఏమిటో తెలుసుకో, దేవుడంటే ఏమిటో తెలుసుకో, సాక్షాత్ అంటే ఏమిటో తెలుసుకో, ఆకార నిరాకార నిర్గుణ పరబ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకో అని ఇన్ని విధాల విస్తృతమైన జ్ఞానాన్ని మనకిస్తుంది గనుక ఉపనిషత్తులన్నీ కూడా విజ్ఞాన మహా సముద్రాలవి. విజ్ఞాన మహాంభోధి అంటాడు అంభోధి అంటే సముద్రం. సముద్రానికి అంచులు కనపడినట్లు ఉంటాయి. ఎంతగా కనపడతాయి అంటే ఆకాశం వంగి సముద్రాన్ని తాకినట్టుగా దగ్గరకు వెళుతున్న కొద్ది రెండు రెండుగా గోచరిస్తాయి. ప్రపంచం కూడా మనకంటే భిన్నంగా మనకంటే ఉదాత్తంగా కానీ మనకంటే వైపరీత్యంతో వైవిధ్యంతో కూడి ఉన్నది. వైవిధ్య సుందరభరితమైన జీవితమే పారమార్థిక జీవితం. ఇవ్వాళ సత్యసాయి భగవానుడు ఆయన కంటే ముందు వచ్చిన కృష్ణుడు కృష్ణుడు కంటే ముందు వచ్చిన రాముడు పారమార్థిక జీవితాలు గడిపారు. ఎలా గడిపారు? రాముడు రాజకుమారుడై ఉండి అరణ్యవాసానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? తపస్సులని యజ్ఞయాగాదులని రక్షించడానికి వెళ్ళి పారమార్థిక జీవితంలో అధర్మ వినిర్మూలనం చేసి ధర్మసంస్థాపన చేసి ఆయన వెనక్కి వచ్చాడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ కూడా అట్లాగే మాయావరణంలో పుట్టి లోకమాయని వెంబడి పెట్టుకొని వ్రజభూమికి వెళ్ళాడు. యోగమాయని తన కన్నతల్లి అయినటువంటి దేవకి దగ్గర పెట్టి బయటకు వచ్చాడు. వచ్చి లీలాకాండ మహిమాకాండ అద్భుత కాండ అన్ని కాండలు పూర్తి చేసి జీవితాన్ని పారమార్థికంగా ఉండేట్లుగా కలకాలం నిలబడేట్లుగా అవతారానికి ఒక శిఖరస్థాయిని ఏర్పరిచి భగవద్గీతని చివరగా మనకు అనుగ్రహించి ఆయన అవతార పరిసమాప్తి చేశారు. ఇక సత్యసాయి భగవానుడు ప్రపంచంలోకి మనందరికీ ఆయన జీవిత చరిత్ర మనకు తెలియని వాళ్ళు లేరు. కానీ ఎవరైనా స్వామి గురించి ఇంకా తెలియని వారు ఉంటే వారి యొక్క నేపథ్యం ఎటువంటి కష్టాలలో పుట్టారు? చాలా కఠినమైనటువంటి ప్రదేశంలో పుట్టారు? రకమైన అవకాశాలు లేని ప్రదేశంలో పుట్టారు? ఎటువంటి నేపథ్యంలో జన్మ ఎత్తుకొచ్చారు? కానీ ఎట్లా ఒక పరమాత్మగా ప్రపంచం చేత కీర్తింపబడి దైవం అంటే సత్యసాయి అని అనిపించుకునేట్లుగా చేశారే అందువలన స్వామిది జీవన సాఫల్యం కాదు స్వామిది జీవిత పరమార్థం. అది అవతార పరమార్థం అని చెప్పాలి. అవతార పరమార్థంలో నుంచి మనం కూడా జీవిత పరమార్థాన్ని ఏర్పరచుకోవాలి. అవును నేను పుట్టాను ఏదో engineer నైనాను doctor నైనాను actor నైనాను అన్నీ బానే ఉన్నాయి. సంపదలన్నీ వచ్చినాయి సుఖాలన్నీ ఏర్పడ్డాయి అన్నీ అననుకూలాలు ఉన్నాయి అంతా బాగుంది కానీ నా వలన ఎవరికైనా ఒక్కడికైనా ప్రపంచంలో లాభం కలిగిందా? నేను ఎవరి కన్నీరైనా తుడవగలిగానా? ఎవరికన్నా ఒక ఆప్తవాక్యాన్ని ఇవ్వగలిగానా? ఒకరి వాత్సల్య స్పర్శను ఇవ్వగలిగానా? అని మనకి నేర్పడం కోసమే సేవ అనేటువంటి యోగాన్ని మనకిచ్చాడు. సేవ అంటే అది సేవ అంటే చాకిరీ కాదు. ఇరవై నాలుగు గంటలు కష్టపడి చేయటం కాదు. స్పందన హృదయ స్పందనలో నుంచి పుట్టేది సేవ. అది ప్రేమతో కూడి it must be laced with love. ప్రేమతో కూడిన సేవ సేవతో కూడిన ప్రేమ ఇటువంటి దాన్ని ఏదో పది మందికో ఇరవై మందికో దగ్గరున్న వాళ్ళకో చెప్పలా. ప్రపంచం మొత్తానికి చెప్పేసి ఇదిగో జీవిత పరమార్థం ఇదే. ఒక అవతారం వచ్చిందంటే దాని పరమార్థం కూడా ఇదే. దానికి సాఫల్యాలు అపజయాలు లేవు. అలాగే స్వామికి కూడా జయంతులు వర్ధంతులు లేవు. జయంతులు ఆరాధనలు లేవు. ఆది మధ్యాంత రహితుడైనటువంటి ఒక పరాస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు జగత్తులోకి సత్యసాయి భగవానుడిగా వచ్చినప్పుడు వారు జీవించి ఉన్నటువంటి కాలం కంటే శరీరాన్ని వదిలిపెట్టినటువంటి యుగమే సత్య యుగానికి నాంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆలోచనా రీతిని మనకున్న పరిధిని విస్తృతం చేస్తూ వెళతాయి కాబట్టి ఉపనిషత్తులను మనం కోణంలో చదవాలి. అంతేతప్ప ఉపనిషత్ వాక్యాలు నాలుగు పట్టుకొని నాలుగింటిని మనం తిరగ మరగా చెప్పుకుంటే ఏం ప్రయోజనం లేదు. అది ఆత్మవంచన ఆపై జగత్వంచన. కాబట్టి ఉపనిషత్తులలో జగత్తును గురించిన విశ్లేషణ ఉంది. పదార్థాన్ని గురించి ఉంది. పరమార్థం ఇప్పుడే తెలుసుకున్నాం. స్వామి కూడా ఇదే జగత్తులోకి వచ్చాడు. ఆయన ప్రత్యేకమైన ప్రపంచంలో ఆకాశానికి ఇన్ను భూమికి మధ్యలో లేరు మనతోనే ఉన్నారు. మన మధ్యలో ఉన్నారు. మన ముందే ఆయన జీవితాన్ని చక్కగా గడిపారు. మనతో పాటే జీవించారు పూర్ణంగా. ఎట్లా జీవించారంటే పదార్థంలో ఇక్కడ వచ్చినా పుట్టపర్తి అనే గ్రామంలో పుట్టినా పారమార్థిక జీవితాన్ని సంపాదించి మనందరికీ నేర్పి తద్వారా యదార్థం ఏమిటో మనకు చెప్పారు. అందుకనే స్వామి ఏమన్నారు? "ఇంతకుముందు చెప్పిన వారి మాటనూ నేను ఖండించటానికి రాలేదు" మొట్టమొదటి మాట. రెండవది "అది తప్పని నేను చెప్పబోయేది ఒప్పు అని చెప్పటానికి రాలేదు. జరిగిపోయినదంతా మంచిది కాదని చెప్పటానికి రాలేదు. ఏది మన మహర్షులు, మహాత్ములు, దార్శనికులు వీళ్ళందరూ కూడా ప్రపంచానికి చెప్పారో.దాని వెనుక దాగి ఉన్న సత్యాన్ని చెప్పడానికి నేను వచ్చాను "అహం సత్య బోధకః" ఇది సత్య సాయి భగవానుడి యొక్క అవతారంలో principle అది. సత్యాన్ని సత్యము గురించి చెప్పడానికి వచ్చారు మన రోగాలు, మన భోగాలు, మన యోగాలు, మన అవసరాలు వాటితో ఆయనకి ఏం నిమిత్తం లేదు కానీ నిమిత్తం లేనట్లుగా ఉంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళం కాబట్టి మన నిమిత్తాన్ని ఆయన ఆధారం చేసుకున్నట్లు ఉండి మన కష్టం కాగానే అయ్యో పాపం అని అభినయించి కానీ రకమైన attachment లేకుండా పోన్లే వీణ్ణి కష్టంలో నుంచి బయట పడేస్తే మంచి మార్గంలోకి అధ్యాత్మంలోకి వేగం పుంజుకుని వెళ్తాడని అనుకుని అన్నింటినీ సహిస్తూ అంటే సహిష్ణుత, క్షమా, దయా, ఔదార్యము, కరుణా ఇవన్నీ దైవీ గుణాలు. దైవీ సంపత్తులో స్వామి అవతారంలో కరుణ అనేది ప్రస్పుటమైపోయింది. అనంత మహాసాగరం గా ఉంది కరుణ కనుక పారమార్థిక జీవితం ఎటువైపు తీసుకెళ్లారు అంటే మన బోటి వాళ్ళని ఇది ఏది సత్యం కాదు దేహము పాంచభౌతికము కూలక తప్పదెప్పుడున్ దేహి నిరామయుండు గణుతింపగా దేహియే దేవదేవుడౌ. పద్యం మనం ఎప్పుడూ ప్రతిక్షణము గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనిషికి భ-- మరణ భయాన్ని మించిన భయం ఇంకొకటి లేదు. నేను పోతానేమో పోతా ఉంటాను అన్న ఆలోచన కంటే పోతానేమో అన్న ఆలోచన ఉంటుంది కనుక పోక తప్పదు కూలక తప్పదెప్పుడున్ అంతే. కాబట్టి స్వామి పదార్థంలో నుంచి పరమార్థంలో నుంచి పరమార్థంలో నుంచి యదార్థంలోకి తీసుకు వెళుతూ మనకి అనేకమైనటువంటి విషయాలు మనందరికీ కూడా చెప్తూ స్వామి ప్రపంచాన్ని ఉపనిషత్తుల భావనలో ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే ఒకటి. జగత్తు, జీవుడు, జగదీశ్వరుడు ఒక్కటే ఇది రెండవ ప్రతిపాదన. ఇక మూడవది ఏమిటయ్యా అంటే బ్రహ్మము పదార్థము అంటే ఏమిటి? బ్రహ్మము వేరా పదార్థము వేరా అంటే బ్రహ్మమే పదార్థము. అది మామూలు ఏది. కానీ పదార్థము కూడా బ్రహ్మమే అని చెప్పడానికి ఉపనిషత్తులు ఉన్నాయి. అది మనకి ఈశావాస్యోపనిషత్ మనం వచ్చే మంగళవారం నాడు చెప్పుకోబోయేటువంటి ఈశావాస్యోపనిషత్ ని చెప్పుకుంటూ ఇవాళ స్వామి దాన్ని ఎలా ఎంత అందంగా చెప్పారో ఒకసారి అనుకొని చుక్కలన్నియు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, వాళ్ళభ్యమది బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాళ్ళభ్యమది బ్రహ్మ, జీవులన్నియు బ్రహ్మ, జీవరాశియు బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, విట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, ప్రకృతి అంతయు బ్రహ్మ, ఆదిశక్తియు బ్రహ్మ, సర్వమును తెలియు సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు సాయి బ్రహ్మ అని తనతో సహా ఇది బ్రహ్మమే. పదార్థంగా కనిపిస్తున్నప్పటికీ ఇది బ్రహ్మమే. ఇది బ్రహ్మముగా ఊహించినప్పటికీ పదార్థంగా ఉండకపోతే మనకు అనుభవంలోకి రాదు గనుక ఒక తీయటి లడ్డు తింటే తప్ప అది తీయది అని తెలియదు. అంటే అధ్యయనము, ఆచరణ, అనుభవము, అనుభూతి తడగా విభూతి. వీటన్నింటినీ కూడా ఉపనిషత్తులు మనకి చాలా చాలా స్పష్టంగా ఒక వైజ్ఞానిక భూమికలో అంటే science ప్రకారంగా చెప్తాయి అవి. ఆశ్చర్యపోతం ఉపనిషత్తుల్లో ఉన్న మహర్షులకు ఉన్నటువంటి జ్ఞానం అంటే విజ్ఞానం మా-- మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్నది చాలా తక్కువ. కాస్తలో ఏదో కాస్త కుస్తూ పట్టుకుంటాం. దాన్ని మనకు PhD ఇచ్చేస్తుంది కదా! మరి మహర్షులకు ఏమిద్దాము అని. వాళ్ళకేం అక్కర్లేదు. వాళ్ళు ఇవన్నీ నేర్పడానికి ఇంత విజ్ఞానం ఉన్నదీ పదార్థము ద్వారా పార-- పారమార్థిక జీవితాన్ని గడుపుతూ యాదార్ధికమైనటువంటి absolute reality ఏదున్నదో దాన్ని గమనించుకోండి. అది మీ ద్వారానే మీ శరీరం ద్వారానే కూలేదాకా ఇది సత్యం, పేలేదాకా నీటి మీద బుడగ సత్యం. పేలేదాకా అది బుడగగా కనిపిస్తుంది కదా, పేలిపోతుంది ఖచ్చితంగా. గాలి వాటు రావాలి దానికి చిల్లు పడాలి అప్పుడే-- మళ్ళీ ఎక్కడికి పోతున్నది, ఎక్కడికి పోవటం లేదు. స్వామే చెప్పారు నీటి యందు పుట్టినటువంటి బుడగ ఎట్లా మళ్ళీ పగిలి నీటిలో కలిసి పోతున్నదో జీవుడు కూడా ప్రపంచంలో పుట్టి ఎక్కడికి వెళ్ళటం లేదు మళ్ళీ ఇక్కడే ఉంటున్నాడు. పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని పంచభూతముల యందు కలుపుతున్నాడని ఒక వైజ్ఞా-- అంటే వైజ్ఞానిక భూమికలో చాలా realistic గా చాలా rational గా రకమైనటువంటి సందిగ్ధం లేకుండా చెప్పినటువంటి వేద విజ్ఞానమే ఉపనిషత్తులు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే దీంట్లో science ని కూడా గనుక చెప్పినట్లయితే science ద్వారా spirituality ని spirituality ద్వారా science యొక్క పరిమితులని మనం రెండింటిని సమన్వయం చేసుకోగలిగితే that is called the spiritual science. Science వేరండి spirituality, spirituality అనంగానే మనకి భక్తి, పూనకము, ఆవేశము, పూజా, దానము, వ్రతము, ప్రదక్షిణ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. మానసికంగా మనం అలవాటు చేసుకున్నాం కానీ అది మాత్రమే కాదు. సత్యం ఏమిటంటే పదార్థ విజ్ఞానంలో నుంచి యదార్థ జ్ఞానంలోకి నువ్వు వెళ్ళాలి. That is a beautiful transmission from materialistic to the spiritual level. రెండింటిని సమన్వయం చేయటానికి ఇవాళ ఉపనిషత్తులనేటువంటివి మనకు వారధి, మనకి instruments, మనకి tools. వాటిని అనేక కథలున్నాయి ఉపనిషత్ కథలు అని ఉన్నాయి. కథల దోలికి మనం వెళ్ళొద్దు. స్వామి వాహినీ ఎలా రాశారు, వాహినీలో దేనిని ప్రతిపాదించారో, వాటి మూల సూత్రాలను మనం గనుక తీసుకుని వెళితే స్వామి కూడా చూడండి ఎన్నెన్నో ఉపనిషత్తులున్నాయి.శంకర భగవత్పాదులు చెప్పినటువంటి దశోపనిషత్తుల వరకే స్వామి కూడా పరిమితం చేశారు. ఎందుకండీ? ఈశావాస్యోపనిషత్ అంటే జగత్తుతో ప్రారంభమై బృహదారణ్యకంలోకి అంత్యంగా యదార్థం దాకా నడిపించే ఇది ఒక అద్భుతమైనటువంటి మాల. దానికో ఈశా, కేన, కఠ ఇట్లా వరుసగా వెళ్తుంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క గది దాటుతూ దాటుతూ వెళితే మనం పదవ స్థాయికి బృహదారణ్యకానికి వెళ్ళినప్పుడు ఇందాకే చెప్పాను ఒక చిన్న clue అదేమిటంటే మనసు దైవము. మనసు దయ్యం కాదు. అది half-baked knowledge తో రాసే మాటలు అవి. ఏది మోక్షం ఇవ్వటానికి సిద్ధమై మన యందున్నదో, ఏది ప్రపంచాన్ని చక్కగా తరచి పరచి మనకు దర్శనం చేయిస్తున్నదో, ఏది మనకు అనుభవాలనిస్తున్నదో, నీవు కన్నీరు కారుస్తున్నావు తుడుచుకోమంటున్నది. అందుకనే రుద్రం కూడా చూడండి, కన్నీరు తెప్పించే పరమాత్మ కన్నీరు తప్పించవయ్యా అని చెప్తుంది. అందుకే స్వామి రుద్రం చదవండని చెప్పింది. కనుక ఉపనిషత్తులు కూడా మన యొక్క స్థితిని, చూడండి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకే తల్లి గర్భంలో నుంచి వస్తారు. ఇద్దరో ముగ్గురో వస్తారు. ముగ్గురిని మీరు ఒక్కసారి పరిశీలిస్తే ఎవడి దారి వాడిదే, ఎవడి శక్తి వాడిదే, ఎవడి ఊహ వాడిదే, ఎవడి సంస్కారం వాడిదే. అంటే మాలలు మూటలని ఎవరిది వాడే తెచ్చుకున్నారు source తల్లి యొక్క గర్భాలయం ఒక్కటే అయినప్పటికీ కూడా. అట్లాగే ఉపనిషత్తులు కూడా ఒక పండితుడు ఒకరీతి చెప్తాడు, వైజ్ఞానిక వేత్త ఇంకో రకంగా చెప్తాడు, quantum physics లో చెప్తాడు, quantum mechanics లో చెప్తాడు. అవేమీ వాటి జోలికి ఎక్కువ వెళ్ళకుండా సత్యసాయి భగవానుడు ఆధ్యాత్మిక భావనా భూమికలో, నేపథ్యంలో మన బోటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాటిని చెప్పారో వాటిని మనం చక్కగా సమన్వయం చేసుకుంటూ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇది ఎవరు, ఇవన్నీ ఇష్టపడి మనం చేయాలి ఒకటి, బాధ్యతతో చేయాలి రెండు, మనకి బోధించినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క కీర్తి ఇనుమడించే రీతిలో మనం మాట్లాడుకోవాలి. కనుక దీనిని ఒక అత్యద్భుతమైనటువంటి విజ్ఞాన వేదికగా దీన్ని మనం భావిస్తూ విజ్ఞాన, జ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానముల వైపు మన అడుగులు వడివడిగా వెళ్ళాలి. వెళ్ళటానికి కావలసినటువంటి స్ఫూర్తిని, అవకాశాన్ని పరమేశ్వరుడు మనకు ఎలాగూ ఇచ్చారు. మనం మళ్ళీ మంగళవారం నాడు కలుసుకున్నప్పుడు ప్రప్రథమమైనటువంటి ఈశావాస్యోపనిషత్ కు వేళ introduction చెప్పుకున్నాం. ఏది? ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే జగత్తు జీవుడు జగదీశ్వరుడు ఒక్కటే. పదార్థం, పరమార్థం, యదార్థం ఇదంతా ఈశావాస్యోపనిషత్తే. దీనిని కాస్త expand చేసుకుంటూ వెళ్ళి వచ్చే వారం ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు రెండూ కూడా మనం సమన్వయించేసి చెప్పుకుందాం. అటువంటి అనుగ్రహాన్ని, యోగాన్ని, అవకాశాన్ని, సదవకాశాన్ని సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి స్వామి మన యందు మహా అమృత వృష్టి వలె కురిపించు గాక! అని స్వామిని మనసా, వచసా, శిరసా ప్రార్థిస్తూ సాయిరాం.
YouTube · audio

Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 1

Home

Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 1

Source: Sai-Showers on YouTube

0:00 / 1:07:25

More in this series

Upanishad Vahini — Samagra Vyakhyanamu

3 episodes · 3 hr 26 min

  1. 58 min 1

    Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 1

    Now playing
  2. 1 hr 1 min 2

    Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 2

  3. 51 min 3

    Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 3