No transcript for this section.
Transcript begins at 3:22.
నమస్కారం ఆధ్యాత్మిక మతం అవసరం లేదు మతానికే ఆధ్యాత్మిక అవసరం మతం ఎప్పుడూ మౌఢ్యం కాకూడదు అని చాటి చెప్పిన అవధూతలు చాలామంది ఉన్నారు వారందరూ మన జీవితంలో శాశ్వతంగా ఒక ముద్ర వేసి ఈ భూమి మీద నడవాలి వారి సందేశాన్ని ఇచ్చి భౌతికంగా వెళ్ళిపోయినప్పటికీ వారి ఆత్మ స్వరూపం ఎప్పుడూ మన మధ్యనే మనతోనే ఉంటుంది అటువంటి గొప్ప అమ్మ అమ్మత్వాన్ని బోధిస్తూ అమ్మత్వమే జీవితం అని తన జీవితం ద్వారా అందరికీ చాటి చెప్పిన గొప్ప మాతృశ్రీ జిల్లేలు ముడి అమ్మ. [ backgroud music playing] ఈ గడ్డలు కూడా నాలో పుట్టిన బిడ్డలు బిడ్డలే అనే అతి తాత్వికమైన ఈ విషయం ఉమ్ ప్రపంచానికి లేదు మీతో చెప్పడం ద్వారా ఉమ్ అమ్మ మనసులో ఏముంది అంతరంగంలో ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా ఒక వ్యాధి గాని ఒక ఒక ఇబ్బంది వస్తే అది తొలగించేవారా అమ్మ లేక దీంతోనే నువ్వు ఇదే జీవితంగా దీన్ని దీనిలో లీనమైపోయి దీన్ని నువ్వే పరిష్కారం వెతుక్కో అంటారా ఏమనేవారు అమ్మ? దీనికి ఉప ఉప సమాధానం ఉప ప్రశ్నగా అది ఏంటంటే అమ్మా నీకు కూడా తాపత్రయాలు ఉంటాయా అని అడిగారు ఆ ఊ ఆ ఎందుకు లేవు నాన్న నాకు కూడా ఉంది కదా నీకు తాపత్రయమా ఆశ్చర్యపోయినాడు అడిగిన వాడే మీరందరూ బాగా ఉండాలనేది నాకు తాపత్రయమేగా నేను మాత్రం ఎక్కడ తప్పించుకున్నాను ఊహూ కాబట్టి ఈ తాత్వికమైనటువంటి బిడ్డలు గడ్డలు సందర్భం ఏంటంటే మీరు దేహం మాత్రమే కాదనే భావనలో ఉండండి అవును దేహం అన్న తర్వాత అన్నీ పుడతాయి పుట్టిన ప్రతిదీ మీకు ఏది అక్కర్లేనిది పుడుతుందో దాని పేరు వ్యాధి ఏ మీరు సంసార జీవితంలో ప్రాపంచికంగా ఇంకా అధ్యాత్మ స్థాయికి చేరలేదు గనుక భౌతిక స్థాయిలో మీరు చేయవలసిన పని మీరు శరీరాన్ని మరమ్మత్తు చేసుకోవాలి ఊ ఆమె ఎన్నడూ కాదని అనలేదుగా అవును అలా వెళ్లి ఆపరేషన్ చేయించుకో నాన్న అంది మందు వేసుకో నాన్న అంది కొందరికి ఇవి వస్తుంటాయిరా అన్నది లేదు కానీ నేను చూస్తాననే మాట మాత్రం ఒక్కనాడు కూడా ఆమె ప్రపంచానికి చెప్పలేదు. అంటే నేను రక్షిస్తానని గా లేదు నేను రక్షిస్తానని చెప్పలేదు మిమ్మల్ని ఉద్ధరిస్తానని కూడా చెప్పలే ఊ ఊ ఆ రెండూ చెప్పలేదు ఊ కానీ ఎక్కడో అక్కడ గురువు గారు అమ్మ ఏదో ఒకటి ఆశించే అంటే అంతర్లీపుడన్న మీరన్నట్టు ఏ తాపత్రయం లేపోయినా ఈ తాపత్రయం ఉందన్నట్టు ఉన్నతమైన ఒక భావనో ఒక ఆశో ఒక కోరికో లేకుండా కూడా భక్తులు వచ్చేవారా బిడ్డలు వచ్చేవారా అమ్మ దగ్గరికి భగవద్గీతలో ప్రమాణం ఉందమ్మా ను కృష్ణుడు అంటాడు ఒక కోటి మంది నన్ను చూడటానికి వచ్చారు అనుకో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పని మీద వస్తారు కామ్యసిద్ధి కోసం వస్తారు ఏ ఒక్కడో నన్ను కోరి వస్తాడు ఆ నన్ను అంటే కృష్ణుడిని కాదు ఆత్మవిచార మార్గంలోకి వెళ్ళాలని ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలని అనేకమైనటువంటి ప్రశ్నలతో వస్తాడు వాడు ఒక్కడే ఉంటాడు అన్నాడు. అంటే అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అందరిలో జ్ఞానులు ఉన్నారా అంటే ఉన్నారేమో మనకు తెలియదు కానీ ఆమెతో ఆ level లో interact అయిన వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు ఊహూ ఆ ఎందుకు కనిపిస్తారు అయితే ప్రపంచంలో జ్ఞాన స్థాయిని దాటి వెళ్ళినటువంటి వాళ్ళు అమ్మ దగ్గరికి కొన్ని వచ్చారు అందులో కొన్ని పేర్లు చెప్తా రఘువరాదాస్ గారు ఊహూ సంకీర్తనాచార్యుడు తర్వాత లక్ష్మణ యతీంద్రుడు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారు ఇట్లా మనం గనక ఈ number అన్ని చెప్పుకుంటూ వెళ్లినట్లయితే ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక స్థాయిలో గురువులుగా అనిపించుకున్న వాళ్ళు కూడా అమ్మ దగ్గరికి వచ్చారు ఆహా ఎందుకు వచ్చుంటారు ఎందుకు వచ్చుంటారంటే అమ్మ యొక్క ఆ లాలన అమ్మ యొక్క ప్రేమ దివ్యత్వం గురించి నేను మాట్లాడను దివ్యత్వం అనేది abstract ఊ ఊ పరిమళించిన అటువంటి పరిపూర్ణ మానవతా స్వరూపమే అమ్మ నా దృష్టిలో ఊ కాబట్టి వీళ్ళందరూ అప్పటికే లబ్ధప్రతిష్టులు అన్నాం కదా వాళ్ళ వాళ్ళ స్థాయిలో బోధలు చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళని ప్రపంచం గురువులుగా గుర్తించి ఆమోద ముద్ర వేసుకుంది మరి వాళ్ళు అమ్మ దగ్గరికి వచ్చింది దేహ పరమైనటువంటి మానసిక పరమైనటువంటి ఒక మమతానుబంధాన్ని మళ్ళీ నెమరువేసుకోవటానికి వచ్చారు వాళ్ళు ఊ ఊ మమత లేని జీవితం లేదు కదమ్మా అవును దివ్యత్వం కంటే నా దృష్టిలో మానవత్వం గొప్పది మానవత్వం నిలబడాలి అంటే మమత్వం ఉండాలి అవును అంటే నాది నేను అమ్మ నాది ఫలానా వారు నా వారు అవును అనుకోకపోతే జీవితం గడవదు అందుకని అత్యంత సాధారణమైనటువంటి స్థాయిలో వాళ్ళందరినీ కూడా దగ్గర చేసుకుంది ఊ ఊ అంటే నేను ఇంకా కూడా ఆ ఇది మళ్ళీ మళ్ళీ అడుగుతున్న ప్రశ్న గురువు గారు ఆ అందరూ వెళ్ళిన భక్తులందరికీ గాని ఊ బిడ్డలందరికీ గాని ఊ అమ్మ అనుబంధం ఆత్మీయత అను ఆ అనురాగం వీటితో పాటు ఇంకా ఏఏ అంశాలని అంటే జీవన మార్గానికి బోధించారు అంటే ఏదో ఒక ఒక విధమైన enlightenment అంటారు ఏదో ఒక విధమైన జ్ఞానం అయినా పొందడానికి ప్రయత్నిస్తారు అమ్మ చెప్పిన ఆ జ్ఞానం ఏంటని అర్థం చేసుకునే ప్రయత్నం శాస్త్ర పరమైనటువంటి జ్ఞానాన్ని ఆమె ఎక్కువ విశ్లేషించలే ఊ శాస్త్రానికి అతీతమైన హృదయానికి సంబంధమైన అంటే హృదయంగమమైనటువంటి ఒక జ్ఞానాన్ని ఆమె ఇది జ్ఞానము అని చెప్పకుండా ప్రేమే జ్ఞానము అని చెప్పింది ఊ ఆ ప్రేమే ప్రేమే జ్ఞానం ఊ జ్ఞాని ప్రేమికుడు ప్రే ప్రేమ గలవాడు కాకపోతే ఆ జ్ఞాని ఈ ప్రపంచానికి బరువు అవునుజ్ఞాని కూడా ప్రపంచాన్ని ప్రేమించాలి ఎంత గొప్ప వాక్యం జ్ఞాని ప్రేమికుడు కాకపోతే ప్రపంచానికి బరువు అవును ఖచ్చితంగా ఆయన మనల్ని ప్రేమించడు మనం వెళ్తాం వాడు రాతి బొమ్మలా కూర్చుంటాడు మనవైపు కన్నెత్తి చూడడు ఏ స్పందన స్పురణ కలగదు ఏ స్పందన లేదు ఏమ్మా ఎలా ఉన్నావు అని అడగడు ఎందుకు ఆ గురువు మనకి? ఆ గురువు వద్దు నీకేం ఫరవాలేదు నేనున్నా అన్న గురువు కూడా నాకు వద్దు. ఆయన అక్కడే ఉంటాడు మనం ఇక్కడే ఉంటాం అదే కాబట్టి అమ్మ ఏం చేసిందంటే లాలన ఆలన పాలన పరిపోషణ ఇవన్నీ కూడా మాటలు చెప్పకుండా demonstrate చేసింది అదే ఆచరణ ప్రధానమైనటువంటి ఒక ప్రేమ ఎట్లా ఉంటుందో ఉమ్ అమ్మ జీవితాన్ని గనక చూస్తే మనకు అర్థమవుతుందమ్మా ఉమ్ అది అది ఆచరణ ప్రధానమైనది అది అది ముఖ్యం మానవత్వం మానవత్వం అలాగే మనిషి మామూలుగా అంటే అన్నిటికీ అతీతంగా అందరూ highest common factor అంటారు అది HCF Yes అలా బోధించిన అమ్మ బోధించింది ఆ అమ్మ రాజరాజేశ్వరి దేవి అని ఎన్ని దేవత రూపాలుగా అందరూ కొలుచుకున్నా మనకి అమ్మ చేసిన miracles గురించి ఏమైనా తెలుసా గురువు గారు? ఇది అడగవచ్చునా ఈ ప్రశ్న? అడగొచ్చు అంటే నేను miracle చేస్తున్నానని ఎవరూ చెయ్యరమ్మా అదే రమణ మహర్షిని సత్యసాయి బాబా వారి విషయంలోనే ఇద్దరూ రమణ మహర్షిని ప్రశ్నించారు జల్లెడ మూడ అమ్మని కూడా ప్రశ్నించారు సమాధానం భిన్నంగా ఉంటుంది ఉమ్ రమణ మహర్షిని పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారు మహిమలు చేస్తున్నారట అని అంటే రమణ మహర్షి answer ఏంటంటే "అలా చేస్తున్నాను అని వారు ఎప్పుడైనా చెప్పారా? చేస్తున్నాను అన్న స్ఫురణ వారికి ఉన్నదా? అది అలా జరగబడింది" అంతే అయిపోయినారు. అమ్మని కూడా పుట్టపర్తి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అమ్మని అడిగారు "అమ్మా మరి మహిమలు ఏంటి ఇట్లా" ఏదో మామూలు అడుగుతారు కదా ఆవిడా ఏమందో తెలుసా? "నాన్నా మనం చేయలేనిది ఆయన చేయగలుగుతున్నారు కదా ఛ్ ఆ అవన్నీ మనం చేయగలమా? అంటే అక్కడ ఏదో ఒక మహా శక్తి ఉండబట్టే జరుగుతున్నాయి కదా ఆ శక్తికి నమస్కరించుకొని నీ పని నువ్వు చేసుకో నాన్నా" ఆహా అయిపోయింది ఇందులో అనేక అర్థాలున్నాయ్ అనేక అర్థాలున్నాయి అదే ఉమ్ ఎంత గొప్పగా ఉంది గురువు గారు అమ్మా మరి అమ్మ ప్రయాణంలో మీరు ఆ తర్వాత ఎన్నిసార్లు కలవవలసి వచ్చింది గురువు గారు కలిసి- మూడేళ్ళు అమ్మా మూడేళ్ళు ninth standard ninth అంటే అప్పుడు ఎస్ ఎస్ ఎల్ సి అనుకో ఉమ్ ఆ ఎస్ ఎస్ ఎల్ సి మూడేళ్ళు అంటే quarterly, halfway, annual. అమ్మ చెప్పిందిగా సెలవులకి రమ్మనమని. సెలవులకెల్లా వెళ్ళేవాడిని దగ్గర్లో అక్కడ ప్రకాశం జిల్లాలో ఇంకొల్లు అనే ఊళ్ళో చదువుకునే వాడిని. ఉమ్ కాబట్టి చాలా దగ్గరే. వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు నేను అమ్మ దగ్గరే ఉండేవాడిని నాకు మిగతా వాళ్ళు ఎవ్వరితో సంబంధాలు లేవు. ఉమ్ అస్సలు లేవు. పెట్టుకోలేదు నేను. ఉమ్ నేను వెళ్ళి రెండు మూడు రోజుల కంటే ఉండేవాడిని కాదు వచ్చి చదువుకునే వాడిని బాగా ఉమ్ అక్కడ కూర్చుని ఊరికే ఖాళీగా ఉండకూడదు అది తప్పది. అమ్మని చూసాం దర్శనం చేసుకున్నాం ఏదో కాసేపు ఉన్నాం అమ్మ దగ్గర ఉన్నాం వచ్చేసాం. అయిపోయింది కదా. వచ్చి నా పని నేను చేసుకోవాలి. ఉమ్ ఇక్కడ ఒకటి చెప్పాలమ్మా నేను అప్పుడే ఆ సందర్భంలోనే బాపట్లలో Salvation Army School అని దాంట్లో ఒక నేషనల్ science fair జరిగింది. ఉమ్ జరిగితే అప్పుడు నాకు పన్నెండేళ్ళ వయసులో వరాహమిహిరుడి బృహత్ సంహిత మీద నేను ఒక article రాశా. నేను paper present చేశా. అప్పుడు Delhi, Pune universities నుంచి professors వచ్చారు judges గా. ఉమ్ నేను present చేసింది భిన్నంగా ఉంది మిగతా వాళ్ళంతా ఏదో రసాయన చర్యలు అంటే ఏంటి Potassium అంటే ఏంటో ఏవో రాసుకొచ్చారు. ఇది భిన్నంగా ఉంది. నా వయసుకి ఆ article కి సంబంధం లేదు. వాళ్ళ అందరి conclusion ఏమిటంటే ఇది వీళ్ళ master రాసిచ్చి ఉంటారు ఆ వచ్చి బాగా బట్టి బట్టి చదువుతున్నాడు అనుకొని ఉండొచ్చు. అయిపోయిన తర్వాత ఒక గంట అయిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచారు. ఉమ్ "ఇందాక చెప్పిన article చెప్పగలవా" అని అడిగారు. ఉహు యధాతథంగా ఆ అంతకంటే బాగా explain చేసి చెప్పా. ఉమ్ సరే naturally I won the first prize. నాకేదో చాలా books ఇచ్చారు. అందులో Dictionary of Science అనే ఒక book తీసుకుని అమ్మ దగ్గరే ఉంది కదా బాగా చదువుకోమని చెప్పింది. అప్పటికి అమ్మ దర్శనం అయింది నాకు అది రెండవ సారి. ఈ book తీసుకుని బాపట్ల నుంచి జల్లెడమూడి వెళ్ళా. వెళ్తే సుమారుగా పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతం. అమ్మ అక్కడే ఆ మంచం మీదే కూర్చుని ఉంది. అప్పటికే నన్ను అమ్మ లోపలికి రమ్మంటం దగ్గర తీసుకోవటం చూసిన వాళ్ళు నన్ను ఎవరూ ఆపలేదు. ఉమ్ నేను లోపలికి వెళ్ళా. వెళ్ళగానే ఆ పుస్తకం అమ్మ చేతిలో పెట్టా. చే ఇప్పుడు చెప్పిన విషయాన్ని చెప్తే ఆ పుస్తకం అలా browse చేసింది అటు ఇటు. "నీకు కాకపోతే ఎవరికొస్తుంది నాన్నా" ఆహా అంటే ఏమిటి? ఆ లోపల ఉన్నటువంటి ఒక spark ని జ్వాల- జ్వలనం చేసింది. "నీకు కాకపోతే ఎవరికొస్తుంది" అంటే అవును నాకు కాకపోతే నేను కాకపోతే ఎవరు చేయాలి ఇవి నేను చేయాలి కదా. అది ఏ పనైనా నేను కాకపోతే ఎవరు చేయగలరు? అహం కాకుండా అంటే designated duty నేను perform చేయాలి అనే message నేను ఒక backward integration తీసుకున్నా. ఇట్లా అన్యాపదేశంగా ఉండేవి అమ్మ మాటలు అది అప్పుడే స్పురించిందా గురువు గారు? అప్పటికప్పుడే అప్పుడే స్పురించింది ఇవేళ కాదు అది. ఉమ్ అప్పుడే. ఎందుకంటే- అట్లా మూడు మూడు సంవత్సరాలు మూడు into మూడు తొమ్మిది. తొమ్మిది ఆ సార్లు అమ్మని చూశా. maybe తొమ్మిది into రెండు రోజులు పద్దెనిమిది సార్లు చూసుంటా. అంతే. మొత్తం life లో. ఉమ్ పద్దెనిమిది సార్లు అంతే ఉమ్ కానీ గురువు గారు ఉమ్ ఉమ్ మనము ఒక ఒక ఇటువంటి ఒక ఆత్మ స్వరూపమైన ఒక శక్తిని చూస్తే మానవ రూపంలో మనం కూడా ఆ possibility highest possibility వైపు మనం అందరం ప్రయాణిస్తున్నాం మనుషులుగా అని మనకు చెప్పబడింది. మీకు ఇంత జాగృతం అయింది చిన్నప్పుడే చిన్న వయసులోనే మీకెప్పుడూ అలా అవ్వాలి నేను అనే ఒక తపన కలగలేదా? నేను ఒక "I have the same power within me, we all have" అనే ఒక తపన కలగలేదా గురువుగారు? కలిగి ఉంటేనే పతనం అయిపోయేవాడినమ్మా గురువు గారు నేను నేనుగా ఉండాలిLet there be only one జిల్లేల మూడమ్మ, Let there be only one రమణ మహర్షి, Let there be only one సత్యసాయి. నేను సత్యసాయిలా అయిపోవాలనుకున్న మరుక్షణం నేను కాలేను, కాకూడదు. ఉమ్ కాగలిగిన శక్తి ఉన్నా నేను కాకూడదు. He is already there. కాబట్టి నాకు ఏమనిపించింది ఏం-- అప్పుడు అమ్మ జీవన విధానం simple గా ఉండటం ఉమ్ హాయిగా ఉండటం ఆ అందరితో ఉండగలగటం, అందరినీ ప్రేమించగలగటం. ఆ కన్నబిడ్డలున్నారు. ఈ కన్నబిడ్డలు లేని వాళ్ళు ప్రేమించటం ఒక ఎత్తు, కన్నబిడ్డలు ఉన్నా అందరినీ తన కన్నబిడ్డలుగా చేసుకోవటం ఒక ప్రత్యేకమైన విషయం. నా మీద ప్రభావం ఏంటంటే ఇందాక చెప్పిన కొన్ని మాటలు. అన్నం పెట్టగలిగితే వదుకో ముద్ద పెడదాం, ప్రేమిద్దాం అందరినీ చక్కగా హాయిగా. ప్రేమించటం అంటే అంగీకరించడం నా దృష్టిలో. అవును, అవును Unconditional గా అంగీకరించగలిగితే దాని పేరు ప్రేమ నా దృష్టిలో. Acceptance unconditional acceptance Unconditional. నాకు-- నేను కొన్ని conditions ఇలా పెట్టుకొని ఇలా ఉంటే బాగుండు అలా ఉండదు ప్రపంచం. కదా అవును ప్రపంచం ఎలా ఉందో దాన్ని నేను గనక ఆ unconditional గా accept చేసినట్లయితే ఉమ్ నాకు ప్రపంచంతో స్పర్ధ లేదు. ప్రపంచంలో ఉన్న ఏ మనిషితోనూ నాకు స్పర్ధ లేదు. ఉమ్ అది నేను అమ్మ విషయంలో నేను చూశా స్వయంగా. ఉమ్ ఆ ఇది ఓ కోరిక. కోరిక అంటే అలా ఒక ఆలోచన కలిగింది ఉమ్ అంతే. Unconditional acceptance గురువు గారు Yes ఇది గొప్ప ప్రశ్న ఆ మళ్ళీ మనం తప్పకుండా మీరు ఇతరుల మీద ఏ విధమైన ఆంక్షలు పెట్టరు లేదు వాళ్ళ మీద ఏ విధమైన rules, conditions-- ఎవరైనా మనపై పెట్టినప్పుడు మనం ఎలా తిరిగి స్పందించాలి అనే విషయం. మనం ప్రేమించ-ప్రేమించాలి లేకపోతే మన-మనందరం సమానం అని అనుకుంటాం. ఇతరులు ఇబ్బంది కలిగించే ఆంక్షలు మన మీద పెట్టినప్పుడు మనం ఎలా మన ధర్మం, స్వధర్మం పాటిస్తూ ఎలా ఉండాలి అనే విషయంలో అమ్మ ఏం చెప్పారు గురువు గారు? ఇది It's a wonderful question అమ్మా. ఇది general గా ఈ-ఈ దేవీదేవతల ప్ర-ప్రస్తావన పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు అమ్మని accept చేయని వాళ్ళున్నారు. నువ్వు ఇలా ఉండాలని చెప్పిన వాళ్ళున్నారు. కానీ వాళ్ళ తమ ఘర్షణకు దిగలా. కానీ తాను ఎలా ఉండాలో మాత్రం నిర్ద్వందంగా ఉండగలిగింది. నిర్ద్వందంగా. ఇవాళ ప్రపంచంలో feminism అని స్త్రీవాదం అని మనం మాట్లాడుకుంటాం కదా, దానికి గనక ఏదన్నా గుర్తు మీ జీవితంలో ఉన్నదా అంటే నా మనసుకు చెటానుగా గుర్తొచ్చేది అమ్మ. ఎంత గొప్ప మాట అంత అసలు సంప్రదాయాన్ని ఆవిడ ధిక్కారం చేయలే సమన్వయం చేసుకుంది. తనని ఎవరైనా ఇలాగే ఉండాలి అన్నప్పుడు తాను ఎలా ఉండాలో అలాగే ఉన్నదంతే. ఎందుకని ఆమె లక్ష్యం వేరు, ఆమె వచ్చిన పని వేరు. ఆ పనిలో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఎవరో నిబంధన పెడితే లొంగిపోతే ఆ అది అమ్మత్వం కాదు. అమ్మత్వంలో అదొక గంభీరమైనటువంటి పారుష్యం అది. ఉమ్ ఎంత గొప్పగా చెప్పారు గురువు గారు అంతే మనం కూడా అలాగే ఉండాలి. ఉమ్ మనం-మనని మనం ఎవరికీ condition పెట్టనప్పుడు మనల్ని ఎవరన్నా గనక condition పెట్టినట్లయితే ఉమ్ మనం ఏం చేయాలి? అసలు దాన్ని ignore and proceed. అంతే అంతే. దానికొక్కసారి సఖం బాయినామా మన అస్తిత్వము, ఉనికి, వ్యక్తిత్వము అంటే personality, inner persona అవన్నీ disturb అయిపోతాయి. అవును అవసరం లేదు. ఉహు ఆమెలా ఉంది. ఉహు ఉమ్ చాలా చాలా ఇది పెద్ద సందేశం ఈనాటి ఈ తరానికి అవును ఆ గురువు గారు అమ్మ ఆ అవధూత లేదు అమ్మ ఒక అవతార ఉమ్ స్త్రీ ఉమ్ స్త్రీమూర్తి ఉమ్ అని చిన్నప్పుడే గ్రహించి ఉంటారు. ఉమ్ మరి అమ్మ వివాహం చేసుకున్నారు కదా గురువు గారు ఉమ్ మరి వారి వివాహం జరిగినప్పుడు ఉమ్ ఇది ఈ ఎరుకతోనే వారి వివాహం జరిగి ఉంటుందంటారా? వారికి గానీ వారి కుటుంబానికి గానీ సంపూర్ణమైన ఎరుకతో అమ్మ వివాహం చేసుకుంది. ఉమ్ ఆమె సన్యాసిని కాలే, యోగిని కాలే, తర్వాత ఆవిడ మీద ఏదో ఏదో possess అయి ఆమె అయిపోలే. మేనబావనే marriage చేసుకుంది ఆమె. చేసుకుని సంసారంలో పిల్లల్ని కన్నది ఆమె. అవును అయితే దీనికినూ మిగతా సంసారాలకి ఏమిటి తేడా అని అన్నప్పుడు ఉమ్ తన సంసారం మాత్రమే ప్రధానం అని కాకుండా దాన్ని ఆ గడప దాటి విస్తృతం చేసుకుంటూ వెళ్ళింది. కనుక ప్రపంచంలో ఉన్న అందరూ నా వాళ్ళే అనుకున్నప్పుడు తన సంసారం తన గృహస్తాశ్రమానికి ఆమె ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువ. అందుకనే ఎక్కడో అమ్మత్వం అనే పుస్తకంలో గృహస్తాశ్రమానికి కట్టిన పచ్చ తోరణమే అమ్మ అని రాశా. ఉమ్ అది-అది వసివాడని పచ్చ తోరణం. అంటే ఏమిటి గృహస్తాశ్రమం అంటే గృహస్తే లేకపోతే ప్రపంచంలో ఆదరణ ఎక్కడ? ప్రేమ ఎక్కడ? మమతానుబంధాలు ఎక్కడ? ఒకరిని ప్రేమించటం ఎట్లా? అనేక వైరుధ్యాల మధ్య మనల్ని మనం నిలుపుకునే స్థాయి ఎక్కడ? మనలో ఉన్నటువంటి fire అంటామే ఆ fire extinguish కాకుండా ఉండాలి అంటే అపురూపమైనటువంటి సాధనా స్థలం నా దృష్టిలో గృహస్తాశ్రమం. అది పెద్ద బండరాయి మీద ఒక మనిషి బట్టలు ఉతుక్కున్నట్లే లెక్క. ఆ To cleanse oneself. అది అమ్మ దాన్ని అంగీకరించింది. అయితే ఒక్కసారి వెనక్కి తిరిగితే అమ్మా, పురాణ కాలం ఉమ్ పురాణాలలో లేకపోతే మన రామాయణ, భారత, భాగవతాలలో వర్ణిస్తే మునులందరినీ చూడు ముని పత్నులు అనేది విన్నాం. మునులంతా సన్యాసులు కారు. గార్గి, మైత్రేయి, అరుంధతి, అను-అనసూయ, అహల్య వీళ్లంతా సంసారులే. వీళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. గౌతమ మహర్షిని అహల్య పెళ్లి చేసుకుంది. అరుంధతి వశిష్టులు ఒక జంట. వీళ్లున్నారు కదా! మరి గృహస్తాశ్రమం ఏ రకంగా వాళ్లకు అడ్డమైంది? నిజానికి అటువంటి వాళ్ళు గనక ఒక వివాహం చేసుకున్నట్లయితే ఒక ఆదర్శవంతమైనటువంటి వివాహ వ్యవస్థకి వాళ్ళు ఉదాహరణగా నిలిచారు. అమ్మ గృహస్తాశ్రమం కూడా అంత గొప్పది. ఉమ్ ఖచ్చితంగా. అమ్మ తరఫు నుంచి. రెండు మూడు ఉదాహరణలు ఇవ్వగలుగుతారా గురువు గారు? ఉమ్ఆదరణ, ఆదరణ తన ముగ్గురు నలుగురు పిల్లలు కాకుండా మూడు వేల మంది ఆమె ఆ రోజుల్లో రోజుకి పది వేల మంది ఆమె దర్శనానికి వచ్చేవారు. పది వేల మందికి ఆవిడ అన్నం పెట్టింది. ఉమ్ ఆమె సంపన్నురాలు కాదు. కరణం గారి భార్య. మరి ఎక్కడి నుంచి ఇది వచ్చింది? అని అంటే సంకల్ప శక్తి. ఇందాకా ఒక ప్రశ్న వేసావమ్మా, అమ్మ ఏమన్నా Miracles చేసిందా అని. నేను ఒక-ఒకటి చెప్తాను. అది నా పరమైంది కాదు. అమ్మ కుమారుడు ఇప్పుడున్నారాయన, రవీంద్రరావు అని, ఆయన చెప్పారు. ఒకసారి అమ్మ ఓ మట్టి బెడ్డ ఆ నేల మీద తీసి చేతిలో పెట్టింది. దివ్య పరిమళాలు వచ్చినాయి. మనలాగే ఆయనకు కూడా ఒక doubt వచ్చింది. అమ్మ నేను రావటానికి ముందే అక్కడ ఏవన్నా సెంట్ పోసిందేమో ఓ బెడ్-బెడ్డ తీసి చేతికి పెట్టింది, ఇచ్చింది అనుకున్నాడు. ఒక చెత్త కుప్పలోకి వెళ్ళి మళ్ళీ ఆయన, ఆయన friends ఇద్దరు వెళ్ళి ఇలా మట్టి తీసుకెళ్ళి ఇది నీ చేత్తో ఇవ్వమ్మా అన్నారు. మొదటి దానిలో ఎటువంటి వాసన వచ్చిందో అటువంటి వాసనే వచ్చింది. ఆహా! ఇది నేను ఆయన చెప్పగా విన్నది. నాకు అటువంటివేవీ లేవు. కానీ నేను ఒకటి మాత్రం చెప్తాను. అందరూ ఆమె గురించిన ఈ మిత్తు చాలా create అవుతుంది కదా వీళ్ళ చుట్టూ. అవును. ఊహ, అసలు మన ఊహ కందనమే రాసేస్తుంటారు. అలా ఒక article నేను చదివా. ఆ article ఏంటంటే, అమ్మ నడుస్తూ ఉంటే వెనక ఒక పాము నడుస్తూ ఉంటుంది అని ఒకాయన చెప్పాడు. ఉహు పాము-- ఏమో పాములు ఉంటాయి జల్లెళ్ళమూడి కుగ్రామం. చుట్టూ పొలాలు. ఏమో పాము అక్కడ ఆహ్ అక్కడ పెరుగుతున్నదేమో, ముని ఆశ్రమాల్లో ఉంటాయి కదా. అటువంటి సాత్వికమైన ఒక పాము ఉంటుందేమో నా పదమూడో ఏట ఇది. కానీ నేను అమ్మని అడిగా, "అమ్మా ఇట్లా అంటున్నారు ఆ పాము నాకు ఎక్కడా కనిపించలేదే" అని అడిగా. అలా ఒక్క క్షణం ఆగిందమ్మ. "నన్నా! పాము అంటే అది కాదురా. పాము అంటే కుండలినీ శక్తి. అమ్మ దగ్గరే కుండలినీ శక్తిలే-ఉందని అనుకోకు. నీ దగ్గర కూడా ఉంది. ఇక్కడ ఎవేకన్ అవుతుంది, ఇంకో చోట ఎవేకన్ కాకుండా ఉంటుంది. అయినచోట కనిపిస్తుంది, కానిచోట అనిపిస్తుంది" అన్నది. ఎంత గొప్ప మాట! ఎంత... కుండలినీ. అంటే claim లేదు ఆమెకి. అవును కుండలినీ ఇప్పుడు ఇవాళ ఎవరినన్నా అడగండి కుండలినీ నాకు నా మూడో ఏట జాగృతం అయిపోయింది. అవును ఆహ్ మీరు ఇవాళ ఎవరినన్నా మీరు గనక అడిగితే ప్రతి వాడు నేను హిమాలయాలకు వెళ్ళి పధ్నాలుగు ఏళ్ళు తపస్సు చేసి వచ్చానంటాడు. అది గొప్పా? సంసారంలో ఉంటూ, ఇంట్లో ఉంటూ, ఈ ప్రపంచంలో ఉంటూ ఒక ఉదాత్తమైన స్థాయికి చేరుకోవటం ఏ-ఏది సాధనమ్మా నిజానికి? ఖచ్చితంగా ఆ ప్రపంచంలో ఉండి చేసేదే సాధన. చేసే-- అది అమ్మ సాధించింది. ఈ సాధన అనేదానికి కూడా అమ్మ మాట చాలా బాగుంటుంది అది. అది అందరికీ ఎంత relief అంటే, "సాధన అంటే ఏంటి?" అని అడిగాడు ఒకాయన. "నీకేది సాధ్యమో అది సాధన" అన్నాంది. [నవ్వు] నీకేది సాధ్యమో అది సాధన.
YouTube · audio
అమ్మ గొప్పతనం ఇది.. | On Jillellamudi Amma | iDream Devotional
అమ్మ గొప్పతనం ఇది.. | On Jillellamudi Amma | iDream Devotional
Source: iDream Devotional on YouTube
0:00 / 24:43
More in this series