No transcript for this section.
Transcript begins at 45:37.
సార సర్వస్వం మందస్మిత మనోహరం వందార్జన వందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విసత్ప్రాప్తం సద్గురుం సత్య సాయీశ్వరం ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్ఫురతాం మే. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ అనంత కోటి గురు స్వరూపాలకు మహర్షులకు మహాత్ములకు మహనీయులకు తత్వవేత్తలకు వ్యాసాది మహర్షులకు అందరికీ కూడా మరొక్కసారి ప్రణమిల్లుతూ ఈశావాస్యోపనిషత్తులో పరమ చరమమైనటువంటి ఒక భాగాన్ని ఇవాళ మనం స్పృశించబోతున్నాం. ఆత్మ నిత్యమ్ము కలాజ్య విచ్ఛిన్నమ్ము అపరిణామ ప్రాప్తం అప్రమేయం మది అచ్యుత తెలివి. ఈ ఆత్మ మనం అనుకున్నాం జగత్తు, జీవుడు, జగదీశ్వరుడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిణి. ఇవన్నీ కూడా విచారణ చేస్తే కలిగే లాభాలని గడచిన రెండు ఉపన్యాసాలలో మనం వాటిని చక్కగా విచారణ చేశాం. అయితే ఈ కనబడుతున్న జగత్తంతా కూడా బ్రహ్మమయమేనని అది ఈశ్వరమయం అని ఈశ్వర స్పర్శతోనే అది పరిపూర్ణతని సంతరించుకుంటుందని ఒక దివ్యానుభూతిని మనం అనుభవించగలిగితే ప్రతి అణువులోనూ బ్రహ్మమును మనం ఆవిష్కరించుకోవచ్చునని అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం. అట్లాగే శరీరమే కర్మ సాధనమని శరీరం ద్వారానే ధర్మంతో కూడిన కర్మలు చేయటానికి అవకాశం ఉన్నదని అది ఒక్క మానవుడు మాత్రమే పొందిన ఒక మహద్ అవకాశం అని తీవ్రమైనటువంటి విచారణ చేసుకున్నాం. అయితే ఈ కనిపిస్తున్నదంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా ఒక పదార్థ భావని పదార్థంగా కనిపిస్తూ ఉన్నది. మనకి భజన ఒకటి ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఒక భజన ఉంది. దాన్ని కేవలం భజనగా చూడకుండా దాన్ని ఒక ఉపనిషత్ వాక్యాన్ని స్వామి భజనగా మార్చారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కదా! అంటే సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, ఇదంతా కలిపితే బ్రహ్మ. కోటి గ్రంథాలలో దాగినటువంటి పారమార్థికమైనటువంటి సత్యాలని యదార్థంగా మీకు అందించటానికి ఒక అర్ధ శ్లోకంలో రాస్తున్నాను అన్నారు శంకర భగవత్పాదులు. అంటే శ్లోకార్ధేన ప్రవక్ష్యామి ఇది ప్రవచనం. అర్ధ శ్లోకంలో కోటి గ్రంథాల విస్తరి-విస్తరించినటువంటి విషయాన్ని ఒక అర్ధ శ్లోకంలో ఎలా చెప్తారు అంటే బ్రహ్మ సత్యం జగత్తు మిథ్యా అని ముగించారు. దానిని విచారణ చేయటానికి మనం ఒక ఆధార భూమికగా చేసుకున్నట్లయితే, అవును ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచమంతా బ్రహ్మమయంగా ఉన్నదని విచారణ చేశాం. మరి ఈ బ్రహ్మము అంటే ఏమిటి? బ్రహ్మము వేరు, ఆత్మ వేరు, ఈశ్వరుడు వేరు అని అనుకుందామా అంటే నిజానికి ఇవన్నీ కూడా పరమేశ్వరుడికి లేదా బ్రహ్మమునకు ఉన్నటువంటి పర్యాయపదాలు మాత్రమే. They are all one and the same. కాకపోతే అవి భిన్న భిన్న స్థాయిలలో మనకి అనుభవంలోకి వస్తాయి గనుక ఆ స్థాయిలో మనం గనక సాధించకపోయినట్లయితే కేవలం భౌతికవాదంతో అంటే పదార్థ వాదంతో ఆధ్యాత్మిక వాదాన్ని మనం ముడిపెట్టలేము, పెట్టకూడదు. ఎందుకంటే అర్థం కాదు గనుక. ఏ విచారణ చేసినా, ఏ అన్వేషణ చేసినా, ఏ తత్వ జ్ఞానాన్ని మనం మధనం చేసినా ఫలితం ఏమిటి అంటే మనకి సత్యం బోధపడాలి. సత్యం అంటే ఏమిటో, బ్రహ్మం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, అనంతం అనే పదం ఏమిటో ఇవన్నీ తెలియకుండా మనం ఒక్కసారిగా ఒక physical level నుంచి అంటే భౌతిక వాదం నుంచి spiritual level కి అంటే ఆధ్యాత్మిక వాదంలోకి ఒక jump చేయలేం. We can't leap. కాబట్టి నెమ్మది నెమ-నెమ్మదిగా క్రమంగా రావాలి అన్నారు. ఈ క్రమం ఎక్కడ ప్రారంభమైంది అంటే జీవుడు విచారణ చేయలేం మనం. జగదీశ్వరుడు ఇంకా చేయలే. జగత్తును గురించి కొంత చేశాం. ఎంతవరకు చేశాం అంటే ఈ జగత్తంతా ఈశ్వరమయము, ఈ జగత్తంతా బ్రహ్మమయము అని రెండు పదాలు వాడుకున్నాం. రెండూ ఒకటే. ఈశ్వరమయం అన్నా, బ్రహ్మమయం అన్నా ఒకటే గనుక దీనిని ఎట్లా మొదలు పెట్టాలి, అన్వేషణ ఎక్కడ ప్రారంభం కావాలి అంటే మన ఆలోచనలో నుంచి ప్రారంభం కావాలి. మరి ఆలోచన ఎక్కడి నుంచి పుడుతున్నది? ఒక సంస్కారంలో నుంచి పుడుతున్నది. సంస్కారం ఎక్కడి నుంచి పుడుతున్నది? ఒక వాసనలో నుంచి పుడుతున్నది. వాసన ఎక్కడి నుంచి పుడుతున్నది? మూల వాసనలో నుంచి పుడుతున్నది. అంటే మూల వాసన నుంచి వాసనలు, వాసన నుంచి సంస్కారం, సంస్కారం నుంచి ఒక ఆలోచన, ఆలోచన నుంచి ఒక మాట, ఒక మాట నుంచి ఒక చేత, ఒక చేత నుంచి ఒక అనుభవం, ఒక అనుభవం నుంచి ఒక అనుభూతి, ఇవన్నీ కూడా క్రమంగా జరుగుతున్నాయి. నిజానికి ఏకకాలంలో మనకు అనుభవంలోకి వస్తున్నాయి. కాబట్టి ఏది ఉన్నా, ఏది పుట్టినా అది మనలో మన యందే పుడుతున్నది. మనలోనే పుడుతున్నది గనుక మన అన్ని ఆలోచనలకి, మన అన్ని సంస్కారాలకి, మన అన్ని చేతలకి, మన కార్యకలాపాలకి మూలము ఏది అని గనుక విచారణ చేసినట్లయితేమన మూల వాసనలే ప్రధానమైనవిగా భావన చేయాలి. మరి మూల వాసనలు ఏమిటి? వాసనలు ఏమిటి? ఇవి అర్థం చేసుకోకుండా ఈశావాస్యోపనిషత్తు ముగియదు. కనుక మూల వాసనలు అంటే అనేక జన్మలు ఎత్తి మనం ఇక్కడికి వచ్చాము. ఒక్కొక్క జన్మలో కొన్ని పోగొట్టుకున్నాం, కొన్ని మిగిలిపోయినాయి. ఇంకా కొన్ని కొత్తవి దాంట్లో చేర్చుకున్నాం. కాబట్టి ఇవన్నీ మూల వాసనలు వచ్చినాయి. అవి అక్కడే ఉన్నాయి. వాటిని rudimentary factors అంటాం. అలాగే దానితో పాటుగా కొన్ని వాసనలు బయటికి వస్తాయి. అంటే traits and tendencies. Traits మారవు tendencies మారుతూ ఉంటాయి అవి. Tendency మారిపోతుంది. ఇరవై ఏళ్ళ నాడు ఉన్నట్టు ఇప్పుడు మనం లేము. ఇప్పుడున్నట్టు పదేళ్ళ తర్వాత ఉండం కచ్చితంగా. కాబట్టి ఈ చలత్-చలితమైనటువంటి ఆలోచన రీతి మారటానికి కా-కారణం ఏమిటి అంటే ఆ వాసనలు కారణం అవుతున్నాయి. మారకుండా ఉండేటవి కొన్ని ఉన్నాయి మనకి. మనం ఎవరినైనా, "ఏంటయ్యా! కాస్త బుద్ధి మార్చుకో. పెద్దవాడివి అవుతున్నావు. నీ ఆలోచనను విస్తృతం చేసుకో. ఇంకా సంకుచిత పరిధిలో ఆలోచిస్తున్నావు" ఏంటే, "ఏదోనండి నాకు పుట్టు-పుట్టుకతో వచ్చింది" అది పుడకల దాకా ఇట్లాగే ఉంటుందని వాడే నిర్ణయించుకుంటాడు. అది మూల వాసన. That is called trait. Trait వేరు tendency వేరు. ప్రధానంగా, ఇవాళ మనందరం కూడా అంటున్నా వింటున్న అందరం కూడా ninety percent tendencies నడిపిస్తాయి. మన కోపం, మన క్రోధం, మన అహంకారం, మన దర్పం, మన గర్వం, మన సంకుచిత పరిధి, అవిద్య, అస్పష్టత, అనాచారం, ఇవన్నీ కూడా దానిలో నుంచి వస్తాయి. అలాగే సదాచారం, స్పష్టత, విద్య, అభివ్యక్తి, దేనినైనా అన్వేషించగల వివేచనాశీలమైనటువంటి మేధాగతమైన మరొక శక్తి. ఇవన్నీ కూడా మళ్ళీ మన వాసనలలో నుంచి tendencies లో నుంచే వస్తాయి గనుక ఎవరికి వారు ఈశావాస్యోపనిషత్తు ఒక పెద్ద canvas. దానిలో మనం చిన్న particle. Particle గనుక ఒకటి సరి చేసుకుంటే canvas సరిపోతుంది. Canvas అంతా చేయక్కర్ల. ముందు ఇక ఇదేమిటో తెలుసుకున్నట్లయితే ఈశావాస్యానికి ఒక సమర్థనీయమైనటువంటి అర్థం మనకు దొరుకుతుంది గనుక వీటన్నింటినీ మనం గమనించుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి tendencies లో పుట్టినటువంటి negativities ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికి వారే గమనించుకుంటూ ఒక్కొక్క దానిని ఒక్కొక్క దానిని తీవ్రమైనటువంటి సాధన ద్వారా వదుల్చుకోగలిగితే, విదుల్చుకోగలిగితే మళ్ళీ నెమ్మదిగా మనలో ఉన్నటువంటి positivity ఇందాక అనుకున్నాం స్పష్టత, ప్రశాంతత, ప్రసన్నత, ఒక హాయి, ఒక సంయమనం, ఒక నెమ్మదితనం, ఒక గాంభీర్యం, ఒక మర్యాద, ఇవన్నీ కూడా మళ్ళీ మనలోనే ఉన్నాయి. కా-కాబట్టి పాత వాటిని పోగొట్టుకుంటూ ఉండాలి, కొత్త వాటిని నిలబెట్టుకుంటూ ఉండాలి, వాటితో పరిచయం పెంచుకోవాలి. ఇది నిరంతరమైనటువంటి అధ్యాత్మ సాధన. ఈ సాధనా మార్గంలో మొట్టమొదటగా చెప్పినట్లు ఈ జగత్తుని పదార్థంగా చూట్ట మొదలు పెడితే అది పదార్థంగానే ఉండిపోతుంది. పదార్థం నుంచి పరమార్థం నుంచి యదార్థంలోకి వెళ్ళాలి, ఇది ప్రస్థానం. ఈ ప్రస్థానంలో ఇవాళ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కాబట్టి బ్రహ్మమును గురించి విచారణ చేశాం. స్వామి కూడా మనకు చెప్పారు. "చుక్కలన్నియు బ్రహ్మపద్యం" మనందరికీ వచ్చు. అంటే ఉన్నదంతా బ్రహ్మమే, నాతో సహా అన్నారు స్వామి. కాబట్టి ఏ దానికి తిరుగులేదు. ఉన్నదంతా కనబడుతున్నదంతా బ్రహ్మమే. కానీ కనబడుతున్న ఈ బ్రహ్మమును కంటికి కనబడని మరొక బ్రహ్మము, ఏదైతే మూలం ఉన్నదో అది నడిపిస్తున్నది. దాన్ని గమనించాలి. అది అధ్యాత్మలో మనం పట్టుకోవలసిన లోతు, అందుకోవలసినటువంటి అంచు. రెండూ అక్కడే ఉన్నాయి. లోతు అక్కడే ఉంది, శిఖర స్థాయి అక్కడే ఉన్నది గనుక ఎక్కడ అన్వేషణ చేయాలి? మనలో మనమే అన్వేషణ చేయాలి. ఉద్ధరేరాత్మనాత్మానం. దానికి పుస్తకాలు, ఇగో ఇటువంటి ప్రవచనాలు, దివ్యోపన్యాసాలు, ఇవన్నీ కూడా మనకి సహాయపడతాయి గనుక ఈ సత్యాన్ని గ్రహించటం కోసమే మనం వచ్చాం. ఏది సత్యం? ఆయన చెప్పారు శంకర భగవత్తాలు, "బ్రహ్మ సత్యం జగన్మిథ్యా" అంటే సత్యమన్నా, బ్రహ్మమన్నా, ఆత్మ అన్నా మళ్ళీ నిజానికి మూడూ ఒకటే. కాబట్టి చలత్-చలితమైనటువంటి మన కంటికి దుర్గోచరం అవుతున్నటువంటి ఈ ప్రపంచం, దాని వెనుక ఉన్న శక్తిని గురించి ఒక్క క్షణం ఆలోచించగలిగినట్లయితే, దీనిని ఎవరో నడిపిస్తున్నారు. కాలచక్రాన్ని ఎవరో monitor చేస్తున్నారు. ఎవరో దానిని control చేస్తున్నారు. ఏది ఎప్పుడు ఎట్లా ఎంతవరకు జరగాలో అంతవరకు మాత్రమే జరిగేట్టుగా చూస్తున్నారు. ప్రకృతిలో సంభవించే వైపరీత్యాలకు కూడా ఆ శక్తే కారణం అవుతున్నది. మళ్ళీ ప్రకృతి నెమ్మదించటానికి కూడా అదే కారణం అవుతున్నది గనుక ఈ సత్యాన్ని, ఈ బ్రహ్మాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నమే అధ్యాత్మ సాధన కాబట్టి, ఇవాళ ఆత్మ నిత్యం అది మన మనసులో పెట్టుకోవాలి. అనిత్యం ఏది అంటే ఆత్మ. అనాత్మ అంటే ప్రపంచం. ఆత్మ కానిది ఏదో ఆత్మగా కనబడకుండా, ఆత్మగా అనుభవంలోకి రాకుండా, ఏదైతే ఉన్నదో అది అనాత్మ. ఆత్మ కానిదంటూ ఏం లేదు. అనాత్మలో కూడా ఆత్మే ఉన్నది. అందుకనే భగవాన్ రమణ మహర్షి అరుణాచలాన్ని శివుడన్నారు. అంతే. మనమంటే మన ఇంట్లో ఉన్న శివలింగాన్ని శివుడంటాం. ఆయనకు అభిషేకం చేస్తాం. కాబట్టి ఈ బ్రహ్మముగా కనిపించేది పదార్థంగా కనిపించినా, అనాత్మగా కనిపించినా అనాత్మకి వేదాంతులు చెప్పే అర్థం వేరు. ఆత్మ కానిదంతా అనాత్మే అని నేను ఒక మాట అనేస్తారు. తప్పు. అట్లా అనకూడదు. ఆత్మ కూడా ఉన్నాం.ఈ దేహం, ఈ మాట్లాడుతున్న దేహం, వింటున్న దేహాలు, ఇవన్నీ కూడా అనాత్మలుగా ఉన్నాయి. కానీ వారి యందు, ఈ అంటున్న వారి యందు ఆత్మ ఉన్నది కదా! ఆత్మ ఉన్నది కనుకనే ఇది అనగలుగుతున్నది. ఆత్మ ఉన్నది కనుకనే అన్నీ వినగలుగుతున్నాయి ఇది. ఆత్మకి అనాత్మకి ఆ రెండు భిన్నం కావు. ఆత్మగా ఇంకా కనపడలేదు, అనుభవంలోకి రాలేదు. అనాత్మగా నిత్యమూ అనుభవిస్తున్నాం, అందరం అరవై ఏళ్ళు, డెబ్భై ఏళ్ళు అనుభవిస్తూనే ఉన్నాం. కాబట్టి అనాత్మ కూడా ఆత్మ యొక్క మూలమే కాబట్టి, దాని నుంచి వచ్చిందే కాబట్టి, అనాత్మ కూడా మూలం ఆత్మే కాబట్టి, ఈ సత్యాన్ని గ్రహించమని చెప్పడానికి, ఈ బ్రహ్మము సత్యము అంటే మాహేశ్వరుడికి సదాశివ తత్వానికి ముప్పై రెండు aspects ఉన్నాయి. అందులో శివుడు ఒకడు. మాహేశ్వరుడు ఒకడు. కానీ వీటన్నింటిలోకి ఒకటి ఉన్నది. దాని పేరు సత్. సత్ అయిపోయి వేళ మనం సత్యం అంటాం. ఈ సత్తు ముప్పై రెండు మాహేశ్వర aspects లో ఏదైతే ఉన్నాయో, ఒక స్థితులు ఏవైతే ఉన్నాయో, అందులో ఈ సత్తు కూడా ఒక స్థితి. కాబట్టి మాహేశ్వరుడు ఎట్లా పూర్ణుడు, ఎట్లా శాశ్వతుడు, ఈ సత్తు కూడా శాశ్వతమైనదే. నిజానికి సత్తు శాశ్వతము, సదాశివుడు కూడా శాశ్వతమే. It is reverse. ఇట్లా మనం గనక అర్థం చేసుకున్నట్లయితే, ఈసావాస్య అని చెప్పేది ఈ-ఈ కనిపిస్తున్న చెట్లు, పుట్టలు, ప్రపంచమంతా కూడా ఆత్మ స్వరూపంగా భావించమన్నారు. ఆత్మ నిత్యమ్ము ఒకటి. కాలాద్యవిచ్ఛిన్నమ్ము. ఓ అరటిచెట్టు ఉంటుంది మన దొడ్లో. గెల వేస్తుంది. గెల వేయగానే అరటి చెట్టు కొట్టేస్తాం మనం. కానీ పిలకలు ఎక్కడికి పోయినాయి? అడుగున ఉన్నాయి కదా! మళ్ళీ ఒక అరటి చెట్టు వస్తోంది. మర్రిచెట్టు ఆకాశమంత పెరుగుతున్నది. కూల-కూలిపోయే దాకా విత్తనాలను వెదజల్లుతూనే ఉంది. కాబట్టి అది తనను తాను పరిచ్ఛిన్నం చేసుకుంటూ వెళుతున్నది పదార్థంగా. కానీ మూలం ఎక్కడ ఉన్నది అంటే ఆ మర్రిచెట్టు విత్తనం అంటాం. ఆ చెట్టు కాయ అంటాం. అంటే ఏమవుతున్నది? మూలాలు అక్కడే ఉంటున్నాయి. మూలాలు పోవటం లేదు. ఆ మూలము ఆత్మ. ఆత్మ నిత్యమ్ము. కాలాది అవిచ్ఛిన్నమ్ము. కాలము, కార్యము, కారణము, కర్తవ్యము అనే ఈ నాలుగు ఉ-ఉంట వలన విచ్ఛిన్నమయ్యేది ఎవరంటే జీవుడు, మనం, ప్రాణి. విచ్ఛిన్నము కానిది ఎవరంటే మళ్ళీ అనాత్మే, ఈ ప్రపంచమే, ఈ బ్రహ్మమే, ఈ ఆత్మే. కనుక ఆత్మ నిత్యమ్ము కాలాద్యవిచ్ఛిన్నమ్ము. అపరిణామ ప్రాప్తము. అపరిణామం, దానికి పరిణామం లేదు. అంటే మార్పు లేదు. మనం ఉన్నాం తల్లి గర్భంలో చిన్న అండంగా ఉన్నాం. తర్వాత పిండమైనాం. తర్వాత శిశువైనాం. తర్వాత బాలకుడైనాం లేదా బాలిక అయినాం. తర్వాత కౌమార యవ్వన దశలు దాటాం. మధ్య వయస్సు దాటాం. వృద్ధాప్యం దాకా వచ్చాం. దాన్ని దాటుతాం. దాటి దాటి ఏమవుతాం? మార్పు చెందుతాం. అంటే మరణిస్తాం. అంటే ఇది పరిణామం చెందుతుంది ఈ పదార్థం. యదార్థం మన లోపల ఉన్న దేహి ఎవరైతే ఉన్నారో, ఆయన లేదా ఆమె లేదు ఆ రెండూ కాదు అది, అది బ్రహ్మ పదార్థముగా కనిపించే ఈ బ్రహ్మము లోపల అపరిణామంగా ఉన్నది. ఏం మార్పు లేదు. తల్లి గర్భంలో మనం శిశుత్వాన్ని పొంది శైశవ స్థితిని అనుభవిస్తున్నప్పుడు ఏ ఆత్మ ఉన్నదో, మనం సమాధిగతం అయ్యేవరకు కూడా అదే ఆత్మ లోపల ఉన్నది. ఏమన్నా ఆత్మ పెరిగిందా మనలాగా? ఆత్మ తరిగిందా? అది ఎంతవరకు ఉండాలో అంతే ఉన్నది. మరి ఆత్మ ఎక్కడ ఉన్నది విచారణ చేస్తే హృదయ స్థానంలో ఉన్నది. ఎంత పరిమ-ప్రమాణంలో ఉన్నది? ఆ పరిమాణం ఏమిటి అంటే మన కుడివేలు ఉంది కదా, దానికి ఒక బొటనవేలు ఉంది. బొటనవేలు పై కణుపు ఎంత ఉన్నదో అంత ఉంటుంది. ఎవరెవరి బొటనవేలు వారిది. కాబట్టి అంగుష్టమాత్ర పురుషోత్తముడుగా ఆత్మ మన యందు ఉన్నది గనుక ఆత్మ కోసం బయటికి వెళ్లి, దేవుడి కోసం దేవులాడి ఎక్కడా కనిపెట్టలేము. అసలు ఉన్నదంతా బ్రహ్మమే. కానీ బ్రహ్మము యొక్క మూలమైనటువంటి ఆత్మ నా యందే ఉన్నది, అదే నేను అన్నటువంటి భావనకి రావాలి అంటే ఈ పదార్థ పరిస్థితిని దాటి దాటి దాటి ఇది సత్యము. ఈ ప్రపంచం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను మాత్రం ఉండబోవటం లేదు. చూశారా ఇది సత్యం. మనం ఏమంటాం? వాడెవరో పోయినాడు, అయ్యో అంటాం. మనం ఏదో ఉండబోతున్నట్టు, మనం ఇంకా ఓ రెండు వందల ఏళ్ళు ఇక్కడ ఈ భూమ్మీద నడవబోతున్నట్టు, ఇది అజ్ఞాన భూమిక చేత, అహంకారం చేత మనకు సత్యము యొక్క రూపం తెలియని కారణంగా మనల్ని మనం శాశ్వతులుగా భావిస్తాం. కానీ ఒకటి, మన యందున్న మనం శాశ్వతం కాదు గాని మన యందున్నటువంటి ఆత్మ మాత్రం శాశ్వతమే. కాలాద్యవిచ్ఛిన్నమ్ము. అపరిణామ ప్రాప్తము. అప్రమేయమ్మది. అప్రమేయం అంటే దానికి దేనిలోనూ ప్రమేయ-ప్రమేయం లేదు. దుఃఖం వచ్చింది, కళ్ళు ఏడ్చినాయి. మనం-మనం సర్వాంగీణంగా ఉన్నటువంటి మనం యాతన పడ్డాం, బాధపడ్డాం, దుఃఖపడ్డాం, ఆవేదన పడ్డాం, ఆందోళన పడ్డాం, ఆర్తి చెందాం అన్నీ దేహమే పొందుతున్నది. దేహం లోపల ఉన్నటువంటి ఆత్మ నిర్మలంగా, నిశ్చలంగా as a mute witness ఉండిపోయింది. కాబట్టి లోపల ఒక నిశ్శబ్దంగా, నిస్వనంగా, ఏ రకమైన పదధ్వనులు లేకుండా, ఏది ఒక ప్రశాంత స్థితిలో సంస్థితమై ఉన్నదో అది ఆత్మ కాబట్టి అది మనకు దుఃఖం వచ్చింది, ఆత్మ మనలో నుంచి బయటకు వచ్చి "నువ్వు బాధపడకు, ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి" అని బయట వాడు మన బోటి వాడు వచ్చి మళ్ళీ మనకే చెప్పాడు గానీ, మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఏమీ చెప్పలా. మనం ఏడుస్తున్నా చూస్తూనే ఉంది. ఏదన్నా పోగొట్టుకున్నా చూస్తూనే ఉంది. ఎవరూ పొందలేనంత అఖండమైన కీర్తిని, సంపదని పొందినా చూస్తూనే ఉన్నది. చూస్తూనే ఉన్నది కానీ అది చేయిస్తున్నది. కాబట్టి అపరిణామ ప్రాప్తము. అప్రమేయము. అప్రమేయం అంటే interfere కావటం లేదు.ఎక్కడా intervene కూడా కావట్ల, ఎక్కడా మనల్ని influence చేయట్ల, ఎక్కడా మనల్ని inspire చేయట్ల, ఎక్కడా మనల్ని ignite చేయట్ల. మనకి దానికి సంబంధం లేకుండా ఉన్నది. పద్మపత్రమివాంభస, తామరాకు మీద నీటి బొట్టు వలే ఉన్నది. ఆ నీటి బొట్టు ఎంత అంటే తామరాకు అంటించుకుందామన్నా అంటించుకోని స్థితిలో అది ఉన్నది. గాలి నెమ్మదిగా వీచినా, సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత పెరిగినా, తాపం పెరిగినా ఒక్క నిమిషంలో ఈ నీటి బిందువు ఆవిరైపోతుంది. మన జీవితాలు కూడా అంతే. నీటిలో పుట్టిన బుడగ నీటిలోనే సమస్య నట్లుగా తామరాకు మీద నీటి బొట్టు వలే మనం కూడా ఈ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచాతీతమైన భావనా స్థితిలో ఉండాలి అని ఈశావాస్యోపనిషత్ మనకి చెప్తుంది. ఎందుకంటే మన identification అంతా మన శరీరంతోనే, మన మేధతోనే, మనం సంపాదించిన కీర్తితోనే, మనం పొందిన సంపదలతోనే, మన దుఃఖాలు, మన ఆనందాలతోనే మనం మ-మమేకమై ఉన్నాం కాబట్టి ఆ కౌగిలి నుంచి మనం బయట పడలేని ఒక పరిస్థితి వచ్చింది గనుక, నువ్వు కూడా intervene కాకుండా interfere కాకుండా ప్రకృతి ఓ జంజామారుతం వీచింది. మన ఒక్కళ్ళనే పట్టుకుపోతుందా? ఎంతో మందిని పట్టుకుపోతుంది. ఎన్నో చెట్లు కూలిపోతాయి. మనకిష్టమైన చెట్టే కూలిపోతుంది. ఏం చేయగలం? చెట్టుని మళ్ళీ పాతలేమే! కానీ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ దాని మూలంలో నుంచి నేనున్నాను అంటూ a continuation of creation. అది ఈశావాస్యోపనిషత్ చాలా చాలా స్పష్టంగా చెబుతుంది గనుక ఇక్కడ పోయేది లేదు, నిజానికి వస్తున్నది లేదు, ఉండటమే సత్యంగా, నిత్యంగా, శాశ్వతంగా భావన చేయమని చెప్తూ నీ శరీరంతో ప్రారంభించమంటుంది అన్వేషణ. కాబట్టి ఆత్మ నిత్యమ్ము కాలాజ్జవిచ్ఛిన్నమ్ము అపరిణామ ప్రాప్తము అప్రమేయమ్మది అచ్చ తెలివి. అచ్చ తెలివి అంటే ఆత్మజ్ఞానం. దాని జోలికి కాసేపు అయ్యాక వెళ్ళాలి, అప్పుడే వెళ్ళకూడదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అంటే ఇక్కడ ఈ సందర్భంలో నేను కేవలము దేహము మాత్రమే కాదు నేను ఆత్మ స్వరూపుడిని అని ఒక స్ఫురణ కలగటమే ఆత్మజ్ఞానం. అక్కడ ఆగాలి మనం. ఆగినట్లయితే ఇది మళ్ళీ ఒక్కసారి వెనక్కి వచ్చినప్పుడు ఈ బ్రహ్మము అనబడేటువంటిది అంతా కూడా ఈ ప్రపంచం అంతా ఆవరించి, ఆవహించి, ఆవేశించి ఉన్న కారణంగా ఈ బ్రహ్మము ఎట్లా ఉన్నది అని పదార్థంగా ఉన్నది, ఒక నదిగా ఉన్నది, ఒక కొండగా ఉన్నది, ఒక గాలిగా ఉన్నది, ఒక మనంగా ఉన్నది. ఈ ఉన్నదంతా కూడా బ్రహ్మమే. కాబట్టి ఈ ఎరుక మనకు ఎప్పుడైతే కలుగుతుందో మనం కూడా బ్రహ్మమే. అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ కూడా మనకు ఏర్పడతాయి. ఈ మూడు వేద వాక్యాలు ఈ స్థాయిలో మనకు ఏర్పడాలి. కనబడుతున్నటువంటి పరాప్రకృతి అంతా కూడా ఈశ్వర స్పర్శతో ఒక ఆనందానుభూతిని పొందుతున్నది అన్నప్పుడు నిజమే ఈ ఈశావాస్యోపనిషత్ లో మనం ఈ బ్రహ్మమును గురించి తెలుసుకుంటాం. బ్రహ్మమును సత్యం, బ్రహ్మమని తెలిసిపోయింది. జ్ఞానము బ్రహ్మము. మనం భాగ-భారతాలు, భాగవతాలు, రామాయణాలు, పద్యాలు, శ్లోకాలు ఇవొ-ఇట్లాగే మాటలు ఇవన్నీ మనకు వచ్చు అనుకుందాం. వచ్చు. అనుకోవటమేంది? వచ్చు. కానీ అది జ్ఞానం కాదు. అది విజ్ఞాన కోశం మాత్రమే. విజ్ఞానమయ కోశంలో మాత్రమే సంచరించి సంచలించేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రజ్ఞ, అది ప్రజ్ఞాన భూమిక. ఇన్ని విషయాలు తెలుసు అంతే. మరి తర్వాత ఏముంది అని. తరువాత ఏముంది అంటే, ఈ కనిపిస్తున్నదంతా నేనుగా, నేను ఈ కనిపిస్తున్న ఈ విస్తృతమైన ప్రపంచంగా అనుకున్నప్పుడు ఈ ప్రపంచానికి నాకు ఒక అభేదమైన స్థితి ఏర్పడుతుంది. నేను అది ఒకటే. అయమాత్మా బ్రహ్మ. అప్పుడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను. నేను బ్రహ్మమునై ఉన్నానని చెప్తున్నది ఎవరు? ప్రజ్ఞానం బ్రహ్మ. నాలో ఉన్న ప్రజ్ఞానం. ప్రజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రముఖమైన, విస్తృతమైన, గంభీరమైన, ఉదాత్తమైనటువంటి ఒక శాస్త్ర పరిచయంలో నుంచి జ్ఞానం పొటమరించింది. ఈ విజ్ఞానం కూడా ఏం చెప్తున్నది అంటే, నువ్వు తెలుసుకున్నదంతా శాస్త్రమే. అది యదార్థం కాదు. కానీ ఈ శాస్త్రాలన్నీ యదార్థం వైపున నడిపిస్తాయి. ఇవి మార్గదర్శకాలు. నీ చేతిలో ఉన్న టార్చ్ లైట్ లాంటివి. గమ్యం మాత్రం ఇంకా ఉంది. నువ్వు నడవాలి. ఎక్కడిదాకా నడవాలి అంటే తత్తత్వం అసి, అదే నేనై ఉన్నాను అని ఇప్పుడు తెలుసుకున్నా అన్నప్పుడు నాలుగు వేద మహా వాక్యాలు కూడా ఈశావాస్యోపనిషత్ ద్వారా వాటిని మనం సమన్వయం చేసుకోకపోతే తీర్థం తీర్థంగా, ప్రసాదం ప్రసాదంగా ఉండిపోతుంది గనుక ఈ ప్రపంచమంతా కూడా బ్రహ్మమయమై ఉన్నది. ఈ ప్రపంచం ఆ బ్రహ్మము కానిదంటూ ఏమీ లేదనేటువంటి ఒక భావనలో గనుక నెలకొని చెందినట్లయితే మన యందు రెండు విషయాలు పుడతాయి. ఆ రెండు విషయాలు ఏమిటంటే ఒకటి ప్రేమ పుడుతుంది. ఈ ప్రేమ పుట్టటానికి ముందు సత్యం తెలిసింది మనకి, జ్ఞానం తెలిసింది, అనంతం ఇంకా అనుభవంలోకి రాలా. మన-మన అనంతాలన్నీ కూడా ఎంతవరకంటే ఈ రెండు కళ్ళు ఏ ఫ్రేములో చూడగలవో అంతవరకు ఖచ్చితంగా చూస్తాయి. ఇటు rightకి తిరిగినా leftకి తిరిగినా ఈ రెండు కళ్ళు ఏం చూపించవు. కళ్ళు ఎంతవరకు గుడ్డు ఎంతవరకు తిప్పితే అంతవరకు కనిపిస్తాయి, తర్వాత ఏం కనిపించదు, నువ్వు దాంట్లో ఉన్నప్పటికీ కూడా. అంతా చూడాలి three sixty degrees లో అంటే నువ్వు తిరుగుతూ ఉంటేనే, నీ కళ్ళు తిరుగుతూ ఉంటేనే నీతో పాటు ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది గనుక ఇది అనంతమైనటువంటిది, ఆధారమైనటువంటిది కాబట్టి ఈ అనంతమైనటువంటి వస్తువు పేరే బ్రహ్మము.నీ వెనకా బ్రహ్మం ఉన్నది, నీ ముందు బ్రహ్మం ఉన్నది. అందుకే స్వామి quotation ఒకటుంది. quotation అంటే చాలా-- ఆయన చిన్నప్పుడు చెప్పిన మాట "I am before you, behind you, beneath you, above you, everywhere" అని చెప్పారు స్వామి. అంటే ఏమిటి స్వామి అంటే అక్కడ బ్రహ్మము. బ-- స్వామి కూడా బ్రహ్మమే. ఆ బ్రహ్మము సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నది గనుక నీ కంటితో చూడగలిగినది మాత్రమే బ్రహ్మం కాదు. నీవు చూడవలసిన బ్రహ్మము అనంతమై ఉన్నది గనుక "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" ఇది. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఈ ప్రపంచం ప్రేమ పుడుతుంది అన్నాం. ఈశావాస్యోపనిషత్తుని ఈ అధ్యయనం ద్వారా అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా practice చేయాలి అంటే ఒక జీవితకాలం చాలదు. చెప్పుకున్నంత తేలిక కాదు. దీనికి తీవ్ర కఠోరమైన సాధన చేయాలి. ఈ శరీరాన్ని సుఖ పెట్టటం, సంతోష పెట్టటం, దాన్ని కాసేపు చక్కగా ఆహ్ పోషించటం, పరిపాలించటం, దానికి ఆహ్ అలంకారం చేయటం ఇది మాత్రమే కాదు. ఈ శరీరము అనేకమైనటువంటి ధాతువులతో పుట్టింది గనుక శరీరమంతా కూడా ప్రాణధాతువై మనసంతా జీవధాతువై ఉంటుంది గనుక వీటన్నింటినీ మనం చక్కగా సమన్వయం చేసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఈశావాస్యోపనిషత్తు ద్వారా, ఈ సాధన ద్వారా, ఈ సద-- అంటే సత్ అసత్, అనాత్మ ఆత్మ అనేటువంటి విచారధార ద్వారా మనం నెమ్మదిగా గనుక చూసినట్లయితే ఈ ప్రపంచాన్ని మనం రెండవ ఉపన్యాసం లో మనం ఒక మాట అనుకున్నాం. ఇవి ఉపన్యాసాలు కావు, ఇవి ప్రసంగాలు కావు, ఇవి ప్రవచనాలు కావు. మరి ఏమిటివి? అని అంటే ఇది దివ్యమైనటువంటి సత్సంగాలు. ఉపన్యాసం కొనసాగించేది ఏం లేదు. ఉపన్యాసం అంటే అది ఒక కళ అంతే. ఇవి కేవలము సత్సంగాలు. అంటున్నవారు వింటున్నవారు ఒకటి సత్తులు సంగమిస్తాయి. ఆత్మలు సంగమిస్తాయి గనుక ఒక సత్సంగంలో మనం చెప్పుకున్నాం. ఈ ప్రపంచాన్ని నువ్వు మనసుతో చూశావా? ఇది చాలా చెడ్డదిగా కనిపిస్తుంది. ఇదే ప్రపంచాన్ని నువ్వు నీ మనసుతో చూశావా? ఆనంద నందనారామమై తోస్తుందనేటువంటి పదం మనం చెప్పుకున్నాం. నిజంగా నందనారామం. అసలు ఈ ప్రపంచం అంతా ఆనందమయమే. ప్రపంచము పరమాత్మ యొక్క సృష్టి. అందునే, అందుకనే మనిషి దృష్టిలో లోపాలు ఉన్నాయి గాని సృష్టిలో ఎక్కడా లోపం లేదన్నారు స్వామి. మనం చూసే చూపులు, మన ఆలోచనలు, మన విశ్లేషణలు, మన విచారణల్లో, మన ఆచరణలో, మన అనుభవంలో అనేక పరిపక్వ అపరిపక్వ స్థాయిలు ఉంటాయి. వాటిని బట్టి మన అనుభవాలు ఏర్పడి అనుభవాన్ని బట్టి అంచనా వేస్తాం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వృత్తి వేరు, అతని ప్రవృత్తి వేరు. అతను మార్గం అంతా నివృత్తి మార్గంలోకి వెళుతూనే ఉన్నాడు ఇప్పటికే. అతన్ని చూసి ఏమిటి పిచ్చివాడు, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఇన్ని విషయాలు ఈయనకు తెలుసు, దాన్ని తొందరగా cash గా convert చేయడేం అంటుంది లోకం. ఆ వెళుతున్న వాడికి cash తో పని లేదు, ash తో పని ఉంది. ash అంటే విభూతి. ఆ విభూతి అంటే తనను తాను ఆహ్ నిస్సేషన్ చేసుకోవాలి. తాను ఏ జన్మ ఎత్తి ఇక్కడికి వచ్చాడో ఆ జన్మని పరిపూర్ణం, ఫలవంతం చేయాలి. సారవంతము, రసవంతము చేయాలి. కాలమనే ఇసుక ఎడారి మీద పదముద్రలు వేస్తూ, వేస్తూ, వేస్తూ he must pass off into oblivion. మహా శూన్య స్థితిలోకి తనను తాను నెట్టుకుంటూ, నడుపుకుంటూ వెళతాడు గనుక అటువంటి వాడిని మనం గౌరవించాలి. నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వాడికి చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే నివృత్తి మార్గంలోకి అంత తేలికగా ఎవరూ రాలేరు. ఇదిగో ఇటువంటి అధ్యాత్మ సాధన చేస్తే తప్ప, దీన్ని అర్థం చేసుకుంటే తప్ప, ఈ ప్రపంచము, దాని పోకడలు, ముందు మనము, మన పోకడలు, మన ఆలోచనా రీతులు, మనం చూసే చూపులు, మన విశ్లేషణలు ఇవన్నీ గనుక ఒక పరిణితి చెందకుండా, అపరిణితంగా, అపరిపక్వంగా గనుక ఉన్నట్లయితే అవి మనల్ని ఏ విధంగానూ అధ్యాత్మలోకి తీస్కొని వెళ్ళవు. He is a spiritual personality అని మనం అంటాం. ఎలా అనగలం? Unless you are spiritual you cannot say the other is spiritual. దేవో భూత్వా దేవం యజేత్ దివ్యత్వాన్ని, భవ్యత్వాన్ని తాను అనుభవించి అక్కడిదాకా వెళ్ళిన వాడు మాత్రమే దివ్యుడైనటువంటి పరమాత్మను గురించి చెప్పగలుగుతాడు. ఇది అర్థం. దేవో భూత్వా దేవం యజేత్ ఇదొక ప్రమాణం. అంటే ప్రతి వాడు దేవుడి గురించి మాట్లాడటం చాలా తేలిక. కానీ దివ్యత్వాన్ని అనుభవించిన వాడు దివ్యుడి గురించి గనుక చెప్తే అది రసవత్తరమైనటువంటి భూమిక. అక్కడిదాకా వెళ్ళమంటుంది ఈశావాస్యోపనిషత్. కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ బుద్ధిని, నీ చిత్తాన్ని, నీ అహంకారాన్ని, అహంకారం అంటే intelligence, IQ అంటాం. వీటి అన్నింటి ద్వారా నువ్వు చక్కగా విశ్లేషణ చేసుకొని, నీ జీవితాన్ని ఒక వేదికగా మార్చుకొని, నీ నిత్య నైమిత్తికమైనటువంటి జీవితంలో దాన్ని సమన్వయం చేసుకొని, ఆచరిస్తూ, ఆచరిస్తూ, ఆచరిస్తూ వెళ్ళినట్లయితే నీకు ఒక్కటి స్ఫురణ కలుగుతుంది. ఆ ఒక్క స్ఫురణ ఏమిటంటే అనిత్యమైన నేను నిత్యుడిని. నా దేహం అనిత్యతం. ఆ దేహం అశాశ్వతం, అది ఖచ్చితం. కానీ నేను శాశ్వతుడిని. నేను అంటే నాలో ఉన్నటువంటి బ్రహ్మము, నాలో ఉన్న ఆత్మ, నాలో అఖండ చిద్యానంద రసమై వెలుగుతున్నటువంటి నేను, నేను, నేను అంటున్నటువంటి ఆ ఆత్మ నేనే ఉన్నా. ఆ నేను ఎన్ని మేనులు ధరించిందో, ఇదొక మేను. అన్నింటితో పాటు ఇదొకటి. ఇది పోతే మళ్ళీ ఇంకో మేను వస్తుంది. కాబట్టి నేను పోవటం లేదు, మేనులు పోతున్నాయి. ఈ స్ఫురణ రాగానే ఇంత, ఇంతేనా జీవితం?ఈ మే-- ఈ పోయే మేను కోసమా ఇంత యాతన, ఇంత ఆందోళన, ఇంత తాపత్రయం, ఇంత యావ, ఇవన్నీ మనకి శరీరం వల్లే కదా కలుగుతున్నది. దేహాత్మ భావన వల్లనే కదా? అట్లా కాదు. ఈ ప్రపంచమంతా బ్రహ్మమయమే నని చెప్తున్నప్పుడు, నా-నాలోనూ బ్రహ్మమే, ఆత్మే ఉన్నదని అంటు-- అనుకుంటున్నప్పుడు, అనుభవం అవుతున్నప్పుడు, నేను ఈ ప్రపంచంలో ద్వేషించటానికి, శత్రుత్వంతో చూడటానికి, ఒకరిని ఈసడించుకోవటానికి, మరొకరిని తక్కువ చేయటానికి, నాకు అధికారం ఎక్కడుంది? అధికారాన్ని కోల్పోయినా నేను. ఎందుకంటే, నా ఎదుట ఉన్నవాడు నావంటి ఆత్మ స్వరూపుడే. This is where భగవాన్ సత్యసాయి brought a great point to the world. ఏమిటి ఆ, ఆ తీసుకొచ్చారంటే, మీరంతా దివ్యాత్మ స్వరూపులు గుర్తుపెట్టుకోండి. మీరంతా ప్రేమాత్మ స్వరూపులు గుర్తుపెట్టుకోండి. మీరు అలా ప్రవర్తించండి అని చెప్పడానికి ఈశావాస్యోపనిషత్తు భూమిక అయింది. చూశారా? ఎక్కడి నుంచో రావి ఈ మాటలు. అన్నీ ఉపనిషత్ వాక్యాలే. దానిలో నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైతే నేను ఈశావాస్యోపనిషత్ ని అనేక స్థాయిల్లో చక్కగా అర్థం చేసుకుని, జీవితంలో ఆచరించి, అట్లాగే బతకటం మొదలు పెడతానో, నాకు శత్రువులే లేరు. ఉన్నదంతా ఒక్కటే. ప్రాణి, అప్రాణి animate, inanimate అన్నింటియందు నేను బ్రహ్మమును చూడగలుగుతున్నా. సమస్తమూ బ్రహ్మమేనని నాకనిపిస్తున్నది. నాకు ద్వేషించటానికి ఏ వస్తువు లేదు గనుక, ఇప్పటివరకు నా అభిమానం చేత, ఆభిజాత్యం చేత, అహంకారం చేత, అవిద్య చేత, అస్పష్టత చేత, అనాచారం చేత, నేను అంటే ఈ దేహం అనుకున్నాను, అది కాదు అని తెలుసుకున్నాను గనుక, ఈ పోయే దేహం అందరినీ ప్రేమించగలిగిన స్థాయికి వెళితే బాగుండు కదా. నేను-- నన్ను ఈ ప్రపంచం ఎలా ప్రేమించిందో, నేను కూడా ఈ ప్రపంచాన్ని అట్లాగే ప్రేమిస్తాను అని అనుకున్నప్పుడు, ఆ క్షణాన కలిగేటువంటిది మహత్తరమైనటువంటి ఆనందభూమిక అది. కనుక ఈశావాస్యోపనిషత్తు యొక్క వినటం వలన కాదు, మరణం చేసినందువలన కాదు, నిదిధ్యాసనం వలన కాదు, ఆచరణ వలన కలిగే లాభం ఏమిటి? ఇవాళ ఇది నేర్చుకోకపోతే ఏమిటంటే, నేర్చుకోకపోతే ఏమవుతుందో తర్వాత, నేర్చుకుంటే లాభం ఏమిటంటే, నేను ప్రేమమయుడిని అవుతా. అందరినీ ప్రేమించగలుగుతా. కాకి, కోకిల, కుక్క, పిచ్చుక సమస్తమూ, పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ నేను ప్రేమించటం మొదలు పెట్టాను గనుక, నాలో ఏ రకమైనటువంటి negativities ఉన్నా, అవన్నీ వైదొలగిపోయి నేను ప్రేమమూర్తిగా, ప్రేమ స్వరూపుడిగా మారిపోతా. నేను ప్రేమమయుడనైనప్పుడు, ఈ ప్రపంచమంతా నాకు అప్పుడు నందనారమమై తోస్తుంది. అప్పుడు ఇదంతా ఒక అద్భుత బృందావనంగా తోస్తుంది. లేకపోతే, ఇటువంటి దుఃఖమయమైన, దుఃఖపూరితమైన, విషాదభరితమైనటువంటి ఈ ప్రపంచంలోకి రాముడు ఎందుకు వస్తాడు? కృష్ణుడు ఎందుకు వస్తాడు? సత్యసాయి భగవానుడు ఎందుకు వస్తాడు? వీళ్లంతా వచ్చారుగా. ఎందుకు వచ్చారంటే, ఇదిగో! మీరున్న ఈ ప్రపంచంలోనే మేము కూడా ఉన్నాం. కానీ, మేము ఎట్లా నిత్యానంద స్వరూపులవై ఉన్నామో చూడండి. నిత్యమూ మహదానందంతో మేం ఎలా వెలిగిపోతున్నామో చూడండి. దీనికి కారణం ఏమిటంటే, మాకు ద్వేషం తెలియదు, మాకు దుఃఖం తెలియదు, మాకు తరతమ భేదాలు తెలియవు. అని ఒక ప్రేమ అనేటువంటి దానికి ఒక సగుణాన్ని ఆపాదించినటువంటి మూడు అవతార మూర్తులు ఏవి అంటే, సత్యసాయి భగవానుడు, యోగీశ్వర కృష్ణుడు, ధర్మ ప్రభువైనటువంటి రామచంద్రమూర్తి. కాబట్టి, వీళ్ల నుంచి మనం ఈ భావన గనక తీసుకున్నట్లయితే, ఈ ప్రపంచమంతా ప్రేమమయమే, ఇది ప్రేమాలయమే, ఇది అభిన్నం కాదు అనేటువంటి ఒక భావన రాగానే మనకి మూడు విషయాలు ఈశావాస్యోపనిషత్తు మనకి చెప్తుంది. ప్రేమమయుడు కావటంతోనే మనకు కలిగేది ఏమిటో తెలుసునా? అందరియందు ఒక సర్వ సమత్వం ఏర్పడుతుంది. విస్తృత మమకారం ఏర్పడుతుంది. ఐక్యత ఏర్పడుతుంది. ఐక్యత అంటే మనందరం ఒకటే. We are all one అంటున్నాం. నేను ఎక్స్, ఇంకొకడు వై, మరొకడు జెడ్ గా కనిపిస్తున్నాడు. ఈశావాస్యోపనిషత్తుని అర్థం చేసుకుని, ఆచరించిన తర్వాత, ఊరికే identification కోసం వీడు ఎక్స్ అని, వాడు వై అని అంటున్నాం గానీ, అన్నీ ఒకటే అనేటువంటి భావన కలుగుతుంది. తర్వాత సర్వ సమత్వం కలుగుతుంది. నాకంటే అల్పుడు లేడు, నాకంటే అధికుడు లేడు. నావంటి వారే ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇది మనం మానవీయ స్థాయిలో మనమంటే, పరమాత్మ ఏమంటాడంటే, అసలు నువ్వు నేను ఒకటే అని అంటున్నాడు ఆయన. మనమే అంగీకరించలేకపోతున్నాం. కారణం ఏమిటంటే, మనం ఆ స్థాయికి వెళ్ళలేదు గనుక. వెళితే, నాకు, ఆయనకి త్వమేవాహం న సంశయః సంస్కృతంలో ఉన్నా, you are me, I am you అన్నా, నేను, నువ్వు ఒకటే అని తెలుగులో చెప్పినా, భావం ఒకటే కదా. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. Truth is one, it is told differently by the wise. కాబట్టి, వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకున్నప్పుడు, మనకి ప్రేమాంచితమైనటువంటి ఒక భావనా పరిధి మన మనస్సులో ఏర్పడుతుంది. దేనినైనా ప్రేమించగలుగుతాం. దేనినైనా అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులే కాదు, పశుపక్షాదులే కాదు, మన వాకిట్లో మన చెట్టు మీద వాలిన చిన్న పిట్ట యందు కూడా మనం ఆత్మని దర్శనం చేయగలిగిన స్థాయికి వస్తాం. అట్లా వచ్చినవారు ఉన్నారు. ఆ వచ్చిన వారిలో భగవాన్ రమణ మహర్షి ఆ సర్వోత్తముడైనటువంటి స్థాయి, ఆ ఉత్తమమైనటువంటి స్థాయి గనుక వారన్నింటియందు ఆత్మను చూశారు. ఆత్మ కానిదేం ఉన్నదన్నారు. ఎంత తిరిగినా, ఎన్నెన్ని నేర్చినా మళ్ళీ రావలసిన మూల స్థానం అదే కదా అన్నారు. కాబట్టి, ఈ ఆత్మ అఖండము, అవ్యయము, అచ్యుతము, నిరంజనమునికేతనము నిర్మ-నిర్మలము నిర్మమము పూర్ణము ధవళము తరళము సరళము సత్యము కాబట్టి ప్రేమ భావన మనకు ప్రేమించటం అంటే not attraction. అవసరానికో మరొక దానికో ప్రేమించేది అది ప్రేమ కాదు. మనము విచారణ చేశాం రాగ అనురాగ బంధాలను దాటి ఉన్నటువంటిదే ప్రేమ బంధం అని ఆ ప్రేమ బంధం ముందు మనతో మనం ఏర్పరచుకోవాలని తర్వాత మనకి పరమాత్మకి ఒక అభిన్న అద్వయ అద్వైత రమణీయ మనోజ్ఞ భావనా భూమిక ఏర్పడుతుందని విచారణ చేశాం గనుక ఈ ప్రేమ భావన రాగానే సర్వము సమంగా కనిపిస్తుంది. సర్వుల యందు ఒకే రకమైనటువంటి ప్రేమ కనిపిస్తుంది విస్తృత మమకారం కలుగుతుంది ఇది చాలా ప్రధానమైన అంశం విస్తృత మమకారం చూడండి మనమంతా సత్య సాయి devotees కూడా వింటున్నారు గనుక స్వామి భావనావరణం లోకి రాకముందు స్వామి అంటే మనకు పూర్తిగా తెలియని నాళ్లలో అనుకుందాం మన వాళ్ళని మాత్రమే ప్రేమించాం. కానీ మనం స్వామితో కలిసి ప్రయాణం చేసి స్వామి భావనలో ఇమిడి దాని ప్రకారంగా జీవితాన్ని గడుపుతున్నప్పుడు మన మమకారాలు మన కన్న బిడ్డలను దాటి అందరి బిడ్డల యందు అదే రీతి ప్రవహిస్తున్నది ఇది ఒక పరిణామం ఇది మనందరి అనుభవం అందువల్ల చెప్పుకోవాలి. ఈశావాస్యోపనిషత్తు చెప్పేది అదే విస్తృత మమత ఉండకూడదా అంటే it is a natural instinct for any human being నా కడుపున పుట్టిన బిడ్డను నేను ప్రేమించకపోతే నా అధ్యాత్మ ఎందుకు పనికిరాదు నేను ప్రేమించాలి కానీ నీ బిడ్డను మాత్రమే కాదు ఏ బిడ్డనైనా నీ బిడ్డగా భావించి ప్రేమించమంటుంది ఈశావాస్యోపనిషత్తు. ఇది ఉపనిషత్తు మనకు చెప్పేది అంతే తప్ప నీ కన్న తల్లిదండ్రులను గౌరవించు ప్రేమించు నీ భార్యను గౌరవించు ఆమెను కూడా ప్రేమించు నువ్వు బిడ్డల్ని కన్నావు వాళ్ళని ప్రేమిం-- అవి ఎలాగూ చేస్తాం ఎవడు చెప్పక్కర్లేదు కానీ ఏ బిడ్డనైనా మన బిడ్డగా ఏ తల్లినైనా మన మాతృమూర్తిగా మనం గనక స్వీకరించి అట్లా గనక భావనలో నిలుపుకోగలిగినట్లయితే తదనుగుణంగా భౌతిక ప్రపంచంలో జీవించగలిగినట్లయితే అది విస్తృత మమకారం. ఈ విస్తృత మమకారం అది అంచలంచలుగా multiply అవుతూ ఉంటుంది ఎంతగా అవుతుందంటే మనకు తెలియదు అసలు to the power of n అంటాం అక్కడి దాకా వెళుతుంది. మనకి ఎంతమంది తెలిసి ఉంటారు? ఒక వంద మంది, రెండు వందల మంది. ఇవాళ ఎంతమంది తెలిసి ఉంటారు? ఒక లక్ష మంది, నాలుగు లక్షల మంది. ఇంకా గనక నిస్వార్థంగా ప్రేమించగలిగితే ప్రపంచమంతా నీదే అవుతుంది నువ్వు ఈ ప్రపంచానికి చెందిన ఒక అందమైన సొత్తు అవుతావు, సొమ్ము అవుతావు. You become a property of the entire creation. కాబట్టి ఈశావాస్యోపనిషత్తు మనకి చెప్పే expansion theory ఇది. విస్తృతం కావాలి మమకారం విస్తృతం కాకపోతే ఎట్లా? అందరినీ ప్రేమించగల ఒక దివ్య భావనలోకి మనం వెళ్ళాలి కానీ ఆ ప్రేమని ఎలా అభివ్యక్తి చేయాలి, ఎలా ప్రదర్శించాలి, దీనికి మార్గం ఏదైనా ఉన్నదా? అంటే దాని పక్కనే సేవ అనేటువంటిది ఉన్నది. ఈ సేవ కలియుగంలో వచ్చింది మాత్రమే కాదు అనేక యుగాలుగా ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడికి చేసింది చాకిరీ కాదు సేవ. సేవ చేసి చేసి ఏం పొందాడంటే మిగతా వాళ్ళంతా స్వర్గానికి వెళ్లారో వైకుంఠానికి వెళ్లారో మనకు తెలియదు గానీ ఆంజనేయస్వామి హనుమ మాత్రం రామున్నే పొందగలిగాడు అది సేవ అంటే. "కృతం హనుమతా కార్య సమవిద్ధుః దుష్కరం మనసాప్యదన్యేన న శక్యం ధరణీతలే" అంటాడు వాల్మీకి రామాయణంలో అంటే ఏం లేదు ఎందరో హనుమ లాంటి వాళ్ళు ఉండవచ్చు కాక కానీ హనుమ వలె సేవించగలిగిన వాళ్ళు మాత్రం ఈ ఒక్కడే ఈ ధరణీ తలం మీద ఇంకెవ్వడు లేడు లేడు లేడని శ్రీరామచంద్ర ప్రభువు ఆంజనేయస్వామికిని కౌగలించుకొని చెప్తాడు. అంటే మనం చేసే సేవ ప్రేమతో కూడిన సేవ సేవతో కూడిన ప్రేమ ఈ రెండింటికీ అర్థం ఇదే తప్ప twenty four by seven చాకిరీ చేసి నేను సేవ చేస్తున్నానని అనుకోకూడదు అది వృధా అది అహంకారాన్ని ego boost చేసుకోవటానికి ఆ ఒక bloated ego తో బతకటానికే తప్ప మనం మనంగా ఉండాలి నిమ్మ-నిబ్బరంగా ఉండాలి నెమ్మదితనంతో ఉండాలి సంయమనంతో ఉండాలి ముందు మన ఇంద్రియాలు అన్నింటినీ మన control లో పెట్టుకోవాలి ఇంద్రియాలు ఎప్పుడు control అవుతాయో మనస్సు అప్పుడు control అవుతుంది ఇంద్రియాలు మనస్సు control అయిన తర్వాత మన దారి ఆత్మ ఆ లోపలికి మనకి వెళ్ళటానికి ఒక చక్కని passage మనకు దొరుకుతుంది కాబట్టి ఈ ప్రేమ సేవ అనేటువంటి ఈ రెండు భావాలు ఇవాళ దాన్ని మనం love and service is already told in ఈశావాస్యోపనిషత్. అయితే దానికి దాన్ని మంత్రం చేశాం, పాండిత్యం చేశాం, ఎవరికీ అర్థం కాకుండా వాటిని దాచి పెట్టాం. దానిని సత్య సాయి భగవానుడు ప్రపంచంలోకి వచ్చి ప్రేమ సేవ అనే రెండు అద్భుతమైన భావాలు ఆ రెండింటి వలననే ఈ ప్రపంచమంతా ఒక వసుధైక కుటుంబ నిర్మాణ సౌభాగ్యాన్ని, సౌజన్యాన్ని, ఒక ఆనందాన్ని, ఒక అపరిమితమైనటువంటి అనంత మహా శక్తిని, ఒక ఐక్యతని, ఒక పవిత్రతని, ఒక దివ్యత్వాన్ని సంతరించుకోగలిగినై అది సత్య సాయి అందుకై వచ్చారు ఈ ప్రపంచంలోకి. ఆయన అవతారమూర్తిగా రావటానికి గల కారణం ఏమిటంటే ఉపనిషత్తుల యందు వేదముల యందు దాగి ఉన్నటువంటి ఈ ప్రేమ యొక్క మూలాలు అన్నీ మనకు చెప్తూ చెప్తూ "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" అని చెప్తూ అట్లాగే ప్రపంచమంతా బ్రహ్మమయమేనని ఇది పదార్థంగా ఉన్నప్పటికీ నువ్వు యదార్థ స్థాయికి వెళ్లాలని యదార్థంలో అసలు రెండు అంటూ లేవని ఉన్నది ఒక్కటేనని ఆ ఏకమే అనేకమై అవ్యయమై కనిపిస్తున్నదని ఇది నిరంతరమైనదని సత్య నిత్య శాశ్వతమైనదని నవ్యమని భవ్యమని దివ్యమని పరమాద్భుతంగా ప్రకటన చేసి మనల్ని అధ్యాత్మ మార్గంలోకి వెళ్ళమని చెప్పారు స్వామి. మనం వాటిని శబ్దాలంకారాలుగా స్వామి ఎంత అద్భుత ఉపన్యాసం ఇచ్చారు అని ఆగిపోయినాం. ఆయన ఉపన్యాసం ఇవ్వలేదు, ప్రవచనం చేయలేదు, ఆయన దివ్యోపన్యాసం చేయలేదు, సత్సంగం చేశారు.ఎవరైతే ఆత్మ విచార మార్గంలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరు ఈ ఆత్మని ఎరుగవలెననేటువంటి కుతూహలంతో ఉన్నారో, ఎవరు ఆ శక్తిని దైహిక మానసిక శక్తులు సంపాదించుకున్నారో, ఎవరు బలీయమైనటువంటి సర్వ ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్యము, గృహస్తాశ్రమము, తర్వాత వానప్రస్థం ఇటువంటి అన్నింటిలో కూడా ఈ అధ్యాత్మని నిరంతరము ఎవరు ప్రవాహ వేగంతో నడిపిస్తున్నారో వారికోసమే స్వామి ఆ పాదాలు వాడారు. కనుక ఉపనిషద్ వాహిని నిండా ఉన్నటువంటిది ఏమిటంటే ఉపనిషత్తుల యొక్క ఒక dimension ఒక dynamics. ఆ dynamics కేవలం మంత్రాలతో లేకపోతే నాలుగు quotations తో అయిపోయేది కాదు. ఇది నిరంతరమైనటువంటి కఠోరమైన అధ్యాత్మ సాధన. దీనిలో వచ్చేవి తక్కువ, పోయేవి ఎక్కువ. పోవటమే కావాలి. ఎందుకంటే జీవితమే "life is a chain of separation" ఆశ్చర్యపోతాం, నిజమా అనిపిస్తుంది. కాకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మంత్రసాని గొడ్డు కోసినప్పుడు మొదటి separation. తర్వాత బాల్యం నుంచి విడిపోతున్నప్పుడు బాల్యంతో separation. మిగతా అవసరాలతో separation. అన్నింటితో వదులుచుకుంటూ వెళుతున్నాం, అన్నీ పోగొట్టుకుంటూ ముందుకు వెళుతున్నాం. మనం ఏదో అన్నీ రాబట్టుకున్నాం అని అనుకుంటున్నాం. ఏదీ రాబట్టుకోలేదు. రాబట్టుకున్నామని గుప్పెడో, పిడికెడో, చారెడో, మూరెడో, బారెడో మన దగ్గర ఉన్నవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళవలసిందే. కనుక నువ్వు ఈ స్ఫురతో గనుక జీవించినట్లయితే, నువ్వు ప్రేమాస్పదుడివి అయినట్లయితే, నువు ప్రపంచాన్ని ప్రేమించినట్లయితే, ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు యందు ఆత్మని, బ్రహ్మమును, ఆత్మ, బ్రహ్మము భిన్నం కావు. రెండూ ఒకటే. దానిని దర్శనం చేయగలిగినట్లయితే, పండు వెన్నెల కాస్తుంది నిన్న పౌర్ణమి బాల్కనీలో లేదా terrace మీదకు వెళ్లి ఆ చంద్రుడి యొక్క splendour ని మనం చూశాము. ఒక అరగంట సేపు వెన్నెలలో కూర్చున్నాము. అది బ్రహ్మానందం కాక ఇంకేముంది? ఎన్ని వేల ట్యూబ్ లైట్లు మనం ఇదో వేస్తే ఆ వెన్నెల కాంతితో సమానం. కాబట్టి ఇదంతా ప్రకృతి, పరమాత్మ మనకు అనుగ్రహించి అన్నింటియందు బ్రహ్మమును, ఆత్మను, పరమాత్మను, దివ్యాత్మను దర్శనం చేయండి. దర్శనం చేస్తూ, చేస్తూ మీలో ఉన్నటువంటి ఆత్మని కూడా మీరు దర్శనం చేయండి. లోపల ఏది ఆత్మగా ఉన్నదో అది రాత్రి చంద్రుడై వస్తున్నది. ఏది సూర్యుడై పగటిపూట వస్తున్నదో అది నీ యందే ఉన్నది. కాబట్టి వీటన్నింటినీ కూడా అన్నీ నాయందు ఉన్నవి. ఉదాహరణకి చూడండి, ఇడా, పింగళ నాడులున్నాయి, సుషుమ్నా మూడు నాడులు. అవే గంగా, యమునా, సరస్వతి త్రివేణి. ఈ త్రివేణి మన వెన్నుపూసలో ఉన్నాయి. entwine అవుతూ వెళుతుంటాయి. పాము మెలికల వలే వెళుతుంటాయి. వెళ్లి సుషుమ్నా నాడి సహస్రారంతో touch అయి ఉంటాయి. ఇది యోగానుభవం. ఈ యోగత్వంలో మనకు ఉన్నట్లయితే నిత్యమూ ఆనంద బిందువులు, అమృత బిందువులు చక్కగా అనుభవిస్తూ హాయిగా ఏది రాని, ఏది పోని, ఏది జరగని, ఏది జరక్కపోని. జరగటానికి మనం కారణం కాదు. ఒకటి జరక్కపోవటానికి మనం కారణం కాదు. మనమే దేనికైనా కారణం గనుకైతే అన్నీ మన వైపు జరుగుతూనే ఉండాలి కదా, జరగలేదు కదా. ఏదీ జరక్కుండా ఉండాలి కదా, కానీ చాలా జరిగినాయి కదా. అంటే ఈ కంటికి కనిపిస్తున్నా, లేదా నీ మనస్సు అనిపిస్తున్నా, నీవు అనుకుంటున్న-అనుకుంటున్నా, నీవు సంభావిస్తున్నా, నీవు ఊహించినా, నీవు కోరుకున్నా ఇవి ఏవీ నీ వలన జరగలేదు. ఎవరి వలననో జరుగుతున్నాయి. ఏతదధిష్ఠాత ఎవడో యజమానుడనిన అష్టమ తనువు వాడు eighth body మనలో ఉంది. ఆ eighth body ఎనిమిదవ శరీరము తను సప్తకాన్ని దాటి ఎనిమిదవ శరీరము. శరీరము అంటే ఏం లేదు, సరియతీతి శరీరః. ఏది మార్పు చెందుతుందో ఈ తను సప్తకంలో ఉంది. ఏది మార్పు చెందటం లేదో అది ఆత్మ ఒక శరీరంగా, ఒక పూర్ణంగా మన లోపల ఉన్నది. అందుకనే వీటన్నింటి వలన ఆత్మసాక్షాత్కారం అవుతుందా అని అడుగుతూ ఉంటారు. ఆత్మసాక్షాత్కారం అంటూ ప్రత్యేకంగా లేదు. ఆత్మ సాక్షాత్తు ఆకారమై ఉన్నది. నీ లోపల ఏ దేహి ఉన్నాడో వాడు ఒక దేహంగా కనబడుతున్నాడు. కాబట్టి దేహి, దేహాలు రెండూ బింబ- ప్రతిబింబాలుగా ఉన్నాయి. రెండూ ఒకదానికొకటి complementary గా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకుంటూ వెళ్ళమని చెప్తూ దీనికి, మానవ జీవితానికి మనబోటి వాళ్ళందరికీ కూడా మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడి యందు ఉండవలసిన మొట్టమొదటి భావన ఏది అంటే ప్రేమ. తల్లి మనల్ని ప్రేమించింది, తండ్రి మనల్ని ప్రేమించాడు, అన్నదమ్ములు ప్రేమించారు, అక్కచెల్లెళ్ళు ప్రేమించారు, స్నేహితులు ప్రేమించారు, ప్రపంచమంతా ప్రేమించింది. మనము అట్లాగే ప్రేమించగలుగుతున్నామా లేదా ఇది question. ఇది వేసుకున్నట్లయితే చేయలేకపోతున్నాం. ఎందుకని మళ్ళీ వీడు నా వాడా? వీడు నాకు చెందిన వాడా? వీడి వల్ల-వీడితో ఇట్లా ఉంటే నాకేమిటి లాభం? ఇవన్నీ ఉన్నప్పుడు అధ్యాత్మలోకి నువ్వు రానట్లే లెక్క, రాలేవు అని కూడా లెక్క. రావాలి అంటే అన్నీ వదిలిపెడితే తప్ప అధ్యా-అధ్యాత్మ సీమలోకి మనం ప్రయాణం చేయలేం. కాబట్టి ఇది ఒక ఉదాత్త భూమిక. ప్రేమించాలి, ప్రపంచానికి సేవ చేయాలి, సేవించాలి. విస్తృతమైన మమకారం లేనిది సేవ చేయలేం. అలాగే అంతా ఒక్కటే అనుకోకపోతే మనం ఏ సేవా కార్యక్రమంలో ఉండలేం. ఈ విస్తృత మమకారము, సమ్యమనం, ఆత్మ సమ్యమనం లేకపోతే ప్రతి దానికి డీలా పడిపోతాం. ఏవో జరుగుతూ ఉంటాయి జీవితంలో, వస్తు-వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. వాడెవడో ఇరవై ఏళ్ళయింది వచ్చి ఇంకా కనపడలేదు, మళ్ళీ ఎందుకు వచ్చాడు అనుకోకూడదు. ఇప్పటికన్నా మళ్ళీ వచ్చాడుగా. ఇరవై ఏళ్ళు ఎందుకు రాలేదంటే అవసరం లేదు రాలేదు. అవసరం ఉన్నప్పుడే రావాలా అనకూడదు చూడండి. ప్రేమమయుడైనవాడు అధ్యాత్మలో ఉన్నవాడు ఒక డాక్టర్ లా ఉంటాడు. డాక్టర్ ఏం కోరుకుంటాడు? మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మనం ఒక patient ఏదో ఇబ్బందికి వెళ్ళాం.డాక్టర్ గారు చూశారు, మందు ఇచ్చారు, తగ్గిపోయింది. మనం మళ్ళీ రోజు, రోజు ప్రతిరోజూ ఆ డాక్టర్ గారికి evening కనపడి "మీరు ఏమన్నా బాగున్నారా?" అని ప్రతిరోజూ చెప్తామా? చెప్పం. మళ్ళీ అనారోగ్యం కలిగినప్పుడు వెళ్లి కలుస్తాం. ఆ doctor కూడా నిన్న వచ్చిన patient, మొన్న వచ్చిన patient మళ్ళీ రాలేదేమి అని అనుకోడు. ఎందుకంటే ఆ ఆ patient తర్వాత అప్పటికైనా రెండు, మూడు వందల మందిని చూసేశాడు. ఎవరితోనూ emotional quotient లేదు ఆయనకి. ఉండకూడదు. మనక్కూడా అంతే, మన బాస్ తో మనకుండకూడదు. బ-బాస్ అంటే ప్రపంచం. ప్రపంచంతో emotional quotient కాదు ఉండవలసింది. ప్రేమతో కూడిన quotient ఉండాలి. చెట్టుని ప్రేమించాలి, పుట్టను ప్రేమించాలి. ఇదే ఈశావాస్యోపనిషత్తు పదే పదే పదే మనకు చెప్తూ ఉంటుంది. కనుక ఈ బ్రహ్మము అనేటువంటిది అదేమి అందరి బ్రహ్మ పదార్థం కాదు. కాబట్టి ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఒకటే అని ఒక ప్రతిపాదన చేసింది. జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు అని ఒకటి ప్ర-- చేసింది. జగత్తును గురించి విచారణ చేశాం. జీవుడి గురించి కూడా మన గురించి మనం విచారణ చేసుకున్నాం. ఇక చేయవలసింది ఎవరి గురించి అంటే జగదీశ్వరుని గురించి విచారణ చేయాలి. ఈ జగదీశ్వరుడి యొక్క విచారణ రెండు రకాలుగా ఉంటుంది ప్రపంచంలో. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేవాడు ఒకవైపు ఉంటాడు. దేవుడు లేడు అనేవాడు రెండోవైపు ఉంటాడు. ఈ ఉన్నాడు అన్న వాడికి లేడన్న వాడికి సమన్వయం చేస్తూ చెబుతుంది ఉపనిషత్తు. ఉన్నాడన్నవాడు తృప్తిగా ఉంటాడు. లేడు అనుకున్నవాడు కూడా తృప్తి పొందుతాడు. ఎందుకంటే ఉన్నాడు అనుకున్నవాడు దేవుడివలె జీవించాలి. లేడు అనుకున్నవాడు దివ్యత్వాన్ని అనుభవించాలి. ఆ తర్వాత వాడు ఇటు వస్తాడు. కాబట్టి ఇక్కడ రెండు లేవంటూ లేవు. మనస్సు ఉన్నది కనుకనే అది ద్విధాభూతమై అంటే రెండుగా చీలపోయిన కారణంగా ఉన్నది, లేదు, ఉన్నది, లేదు, సత్యము, అసత్యము, ఇవన్నీ కూడా మనోవిచారణ. మనస్సు చేసేటువంటి ఆలోచన రీతి కాబట్టి ఈ ప్రపంచాన్ని మించినటువంటి దివ్యమైనటువంటి భావాలు ఇంకెక్కడా లేవు. ఉన్నదంతా పంచభూతాత్మకమైన, ఈ కనిపిస్తున్నటువంటి మాయావరణంగా కనిపిస్తున్నటువంటి యోగావరణమే ఈ ప్రపంచం కాబట్టి ఇది అణుక్షేత్రము అని దీనికి మనం పేరు పెట్టుకుందాం. ఈశావాస్యోపనిషత్తు చివరికి వచ్చేప్పటికీ మనందరికీ అణుక్షేత్రం కచ్చితంగా అర్థం కావాలి. ఇప్పటివరకు మనం దేనినీ ప్రేమించే శక్తి లేకపోతే ప్రతిదానినీ చక్కగా ప్రేమించగలిగిన ఒక విశాల భావనా స్థితిలోకి మనం వెళ్ళాలి. రెండవది మనమందరికీ సేవ చేయాలి. మన పరిమితులు ఎరిగి, పరిధులు ఎరిగి, మన శక్తిని ఎరిగి, మనకున్నటువంటి సమయాన్ని ఎరిగి సేవ చేస్తూ వెళ్ళాలి. హృదయ స్పందనలే ఉన్నాయి తప్ప మనో స్పందనలు లేవు. మనో స్పందనలన్నీ కూడా వికార భూయిష్టంగా ఉంటాయి. ఇక్కడ ఒక ప్రధానమైన రెండు తెలుగు పదాలు, ఒకటి తెలుగు పదం, రెండోది సంస్కృత పదం. ఇది అర్థం తెలియకుండా మనం వాడతాం. ఎన్నోసార్లు చెప్పుకున్నా మళ్ళీ ఈ సందర్భంలో చెప్పుకోవాలి. అందము వేరు, సౌందర్యము వేరు. అందము ఇంద్రియాలను రెచ్చగొడుతు-- రెచ్చగొడుతుంది. అది మనసుకు సంబంధించింది. సౌందర్యము ఇంద్రియాలను క్షమింపజేస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు సౌందర్య స్వరూపుడు, మానవుడు అందగాడు. అంతే తేడా. లేదా అందగత్తె. ఏమిటి అందగత్తె అంటే ఆమె యందున్న, ఆతని యందున్న అనేకమైనటువంటి ఆకర్షణ వలయాలు, ఏ పరిధులు ఏవైతే ఉన్నాయో అవి ఆకర్షణకు కారణమవుతున్నాయి. దానివలన ఇంద్రియాలన్నీ కూడా విజృంభిస్తూ ఉన్నాయి. ఇది ఒక క్షేత్రం అయితే పరమేశ్వరుడు, మనం సత్యసాయి భగవానుడిని చూశాం. వారి దివ్యత్వాన్ని అనుభవించా, ఆయన సౌందర్యాన్ని, ఆయన అందా-అందాన్ని అనుభవించలే, సౌందర్యాన్ని అనుభవించాం. సౌందర్యాన్ని అనుభవించాం గనుకనే స్వామిని చూడగానే మన ఇంద్రియాలు క్షమించినాయి. మనం అటూ ఇటూ పరిగెత్తే మనస్సు ఓ చోట ఆగింది. ఆగి మనల్ని మనం నిబ్బరించుకోగలిగాం. ఉంటే ఇట్లాగదా ఉండవలసింది అని ఒక ఆలోచన మాత్రం పొటమరించింది. జీవించగలిగితే ఆయన వలె కదా జీవించవలసింది. ఉపనిషత్తు చెప్పేది ఇదే. కాబట్టి శరీరం మాజ్యం ఖలు కర్మ సాధనం. శరీరం మాజ్యం ఖలు ధర్మ సాధనం. శరీరాన్ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. శరీరంలో రెండు components ఉన్నాయి. ఒకటి మనస్సు, రెండవది హృదయం. మనస్సు అంటే mind, హృదయము అంటే heart. అన్నింటికీ మనం ఒకటే పదాలు వాడతాం, అందం ఒకటే, సౌందర్యం వేరే అని. అందం వేరు, సౌందర్యం వేరు, mind వేరు, heart వేరు. అలాగే ఆత్మ వేరు, బ్రహ్మము వేరు కాదు. రెండూ ఒకటే. ఆత్మ, బ్రహ్మములు రెండూ ఒకటైతే ఈ ప్రపంచమంతా కూడా ఆత్మే. ప్రపంచమంతా ఆత్మమయమే. నాలో ఉన్న ఆత్మ ప్రపంచాన్ని ఆవరించి ఉన్నటువంటి పెద్ద ఒక gross గా ఉన్నటువంటి ఒక ఆత్మ నాలో నే-నెట్ గా చాలా subtle గా, సూక్ష్మ సూక్ష్మేతరంగా నాయందు ఉన్నది గనుక నేను ఆత్మ స్వరూపుడినే, నేను ఆత్మనే అని స్థిమితమైన స్థిర భావనలోకి రావాలి. ఈ భావన రావాలి అంటే ఉపనిషత్తులు పది అయితే గాని రావు. కాబట్టి ఇట్లా రావాలి అని అనుకోవాలి. అనుకొని ఆ path ఏమిటి, మార్గం ఏమిటి మనం విచారణ చేయాలి గనుక ఈశావాస్యోపనిషత్తు యొక్క ఇవాళ ఈ మూడవ సత్సంగంలో ఈ మనం చక్కగా చేయవలసినటువంటి రెండు ప్రధానమైన అంశాలు ప్రేమా, సేవా. సరే స్వామి ఎలాగో మనకు చెప్పారు, అది కొంత తెలుసు. కానీ అంతా మనకింకా తెలియదు. సేవా-సేవలు బాగా చేస్తున్నాం అనుకున్నాం. అవి మనం వేసుకున్న ప్రణాళికలు. కానీ సేవ అంటే అసలు అక్షర తెలుగులో భావన అని అర్థం. భావనకే సేవ అని పేరు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని నానా షిరిడీ స్వామి పాదాలు ఒత్తుతూ, కాళ్ళు ఒత్తుతూ ప్రతిరోజూ భగవద్గీత శ్లోకాలు చదువుకుంటూ ఉంటేఒక రోజున చాలా రోజులు అలా ఆ సేవ ఇచ్చారు ఆయన సేవ అనుకున్నాడు ఈన ఆ రాత్రి పూట పాదాలు నొక్కేవాడు భగవద్గీత చదువుకున్నాడు చదువుకున్న వాడు ఆయన సరే ఒక రోజు నానా మనసులో కూడా ఏమొచ్చిందంటే భగవద్గీత ఎంత అద్భుతంగా నాకు శ్లోకాలు కంఠస్తమైపోయినాయి ఎన్ని విషయాలుగా నాకు తెలుసు అని కొంత సాత్వికాహంకారం పొడసూపగానే పడుకున్నట్లుగా ఉన్న షిరిడి బాబా నెమ్మదిగా ఒక ప్రశ్న వేశాడు "నానా ఏం చదువుతున్నావు?" అని అడిగారు. "భగవద్గీత అని ఒకటి ఉందిలే బాబా అది నీకు తెలియదు కదా నీకు సంస్కృతం రాదు కదా నువ్వు పడుకో నేను ఏదో భగవద్గీత చదువుకుంటున్నా" మామూలు casual గా సమాధానం ఇచ్చాడు. గురువు కాఠిన్యం వహిస్తాడు diamond ని diamond తోనే కొయ్యాలి గురువు మాత్రమే శిష్యుడిని correct చేయగలుగుతాడు. "సరే అది పక్కన పెట్టు తద్విద్ధి ప్రణిపాతేన అంటే ఏమిటి?" అన్నాడు. "సర్వాంగీణమైనటువంటి ఈ దేహాన్ని సమర్పించటం ఆ నేలమీద పడుకొని సాష్టాంగ నమస్కారం చేయడమే తద్విద్ధి ప్రణిపాతేన" అన్నాడు. "పాతేన అన్నా కూడా అంతే కదా" అన్నారు బాబా. "ఆ అవును అంతే" అన్నాడు. "మరి కృష్ణుడు ప్రణిపాతేన అంటాడేమి? తద్విద్ధిపాతేన అనొచ్చు కదా ప్రణిపాతేన అంటాడేమిటి?" అన్నాడు. "నాకు తెలీదు బాబా" అన్నాడు. చూశారా? నీకు భగవద్గీత రాదన్న నానా చేత నాకు భగవద్గీత అర్థం కావట్లేదని చెప్పించాడు పరమాత్మ. సరే ప్రణిపాతేన అంటే సమర్పణ కేవలము అంగ సమర్పణ కాదు సాష్ట అంగ ప్రణామం చేయటం అంగములు మాత్రమే ప్రణామం చేస్తున్నాయి అంగములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఆత్మ అన్ని నీకే నువ్వే అనేటువంటి భావనలో చేస్తే తద్విద్ధి ప్రణిపాతేన. ఆ తరువాత అన్నారు బాబా. "ఏముంది పరి ప్రశ్నేన" అన్నాడు. "అంటే ఏమిటి?" అన్నాడు. "అగో ఇట్లాగే నాకేదన్నా తోచకపోతే తెలియకపోతే నీవంటి వారిని అడిగి తెలుసుకోవటం కదా అదే కదా మరి ప్రశ్నేన అనొచ్చు కదా మళ్ళీ ఆ యోగీశ్వర కృష్ణుడు పరిప్రశ్నేన అంటాడేమిటి?" అన్నాడు. అవాక్కవుతున్నాడు నెమ్మదిగా "నాన్న నాకు అర్థం కావట్లేదు బా నాన్న బాబా ఎందుకు ఇవాళ నన్ను ఇలా వెంబడి పెడుతున్నారు మీరు పడుకోండి" "నేను పడుకోవటం కాదు నేను నిద్ర లేపా- నాకు తెలీదు బాబా మీరే చెప్పండి" అన్నాడు. "ఏం లేదు నువ్వు ఒక ప్రశ్న ఒక గురువుని వేస్తున్నావు అంటే గురువు అంటే ఆత్మ. నీకు నీవై వేసుకున్నా బాబా లాంటి వారు నువ్వు ప్రశ్న వేసినా అది పరి ప్రశ్న కావాలి. నీ ప్రశ్నలో ప్రశ్న కారణంగా ఆ గురువు నుంచి వచ్చే సమాధానం ఈ ప్రపంచం మొత్తానికి అందాలి. అటువంటి ప్రశ్న వేయాలి నువ్వు. దేనిని ఏ ప్రశ్న వేస్తే ఇక ప్రశ్నలే ఉండవో అటువంటి ప్రశ్న వేయాలి. అది నేనెవరు అన్న ప్రశ్న వేసుకో దాని పేరు పరి ఆ పరిప్రశ్నేన" "బాగుంది నాన్న మరి తరువాత?" అన్నాడు. "సేవయా" "అంటే ఏమిటి?" అన్నారు బాబా. "ఆ ఇదేం లేదు ఇదంటే నువ్వు నాకు చూడు రోజు కాళ్ళొత్తమని సేవ ఇచ్చావు కదా ఇదే సేవయా?" అంటే బాబా నవ్వుతూ ఒక మాట అన్నారు "సేవ అంటే భావన" ఏమిటి ఆ భావన అంటే స్పర్శ మాత్రమైనటువంటి ఒక స్థితి చేత నేను నువ్వు ఎప్పుడు అవుతావో అవ్వగలనో అనేటువంటి భావన భ్రమర కీటక న్యాయ విశేషంతో నేను ఎప్పుడు బాబా అంతటి వాడిని కాగలను నేను బాబా స్థాయికి నేను ఎప్పుడు వెళ్లగలను ఆయన అందరినీ ప్రేమించగలిగి అందరినీ సేవించగలిగి అందరినీ సమత్వంతో విస్తృత మమకారంతో ఈ ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నారో ఇదే ప్రపంచంలో ఆయన ఎలా ఉండగలుగుతున్నారో నేను కూడా ఎప్పటికైనా అలా ఉండగలనా అన్న భావన కలుగుతుందే దాని పేరు సేవయా అది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఈశావాస్యోపనిషత్తు యొక్క సారం యోగీశ్వర కృష్ణుడు భగవద్గీతలో చెప్తే దానిని జ్ఞానేశ్వరులు యోగ మహాపురుషుడైనటువంటి షిరిడి బాబా ఈ మూడింటి ద్వారా ఆయన అజ్ఞానం అంటే ఏమిటో బోధించారు నానాకి. జ్ఞానబోధ చేయలే ప్రతి పదార్థం చెప్తూ వెళ్ళలే. నీకు తెలిసింది మాత్రమే జ్ఞానం కాదు నీవు తెలియవలసింది తెలుసుకోవలసినది తెలుసుకున్న దానిని జీవించవలసినది జీవించవలసిన దానిని మళ్ళీ ఈ ప్రపంచానికి ఇవ్వవలసినది ఏదైతే ఉన్నదో అదే అధ్యాత్మ జ్ఞానం గనుక ఆ స్థాయికి మనం వెళ్ళాలి అని అనుకోవటమే సేవయా. కాబట్టి ఈ ఈశావాస్యోపనిషత్తు మనకి ఇవాళ స్పష్టంగా ఏం చెప్తుందంటే ప్రపంచంలో ద్వేషించటానికి వస్తువు అంటూ ఏమీ లేదు. ప్రపంచంలో ప్రేమించటానికి ఏ అవసరమూ లేదు అర్హతా లేదు ప్రేమించడం మన సహజ గుణం కావాలి. సేవించటానికి ఎవరినైనా సేవించవచ్చు జాతి మత వర్గ వర్ణాలకు అతీతమైన దివ్య భావనా సీమలో మనమందరినీ భావించవచ్చు. సేవ అంటే అక్కడ భావ భావన. లౌకికంలో service అని మనం వాడేస్తున్నాం కదా service వాడదాం అది లౌకిక కార్యకలాపం అంతే. దానికి చాలా పరిమితమైనటువంటి స్థాయి. కానీ నా ఎదురుగా ఒక చిన్న బాలుడు లేదు ఒక చిన్న ఆడపిల్ల చిన్న పాప పక్కనే కాస్త కౌమారంలో ఉన్నటువంటి ఇద్దరు తర్వాత మధ్య వయస్సు వారు తర్వాత వృద్ధులు అందరూ కూర్చొని ఉన్నారు. ఈమె బాలిక బాలుడు ఈమె యువతి యువకుడు ఈయన వృద్ధుడు వృద్ధురాలు అనే భావన నా యందుంటే అది సేవయా కాదు. ఈ అన్నింటి యందుమణిగణాలు ఎట్లాగైతే ఒక దారం మీద మణులన్నీ గుచ్చబడి ఉన్నాయో, ఈ జీవులందరూ కూడా ఆత్మ అనేటువంటి దారం మీద గుచ్చబడి ఉన్నాయి. పూదండలో దారం కనపడదు పూలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ దండలకు ఆధారం ఏమిటి? పూలకు ఆధారం ఏమిటి? మూలం ఏమిటంటే, ఒక దారం ఆధారం అవుతున్నది. ఆ దారము ఆత్మ. ఆ దారమే మన యందు అవిచ్ఛిన్నమై, అవిశ్రాంతమై, అవ్యయమై, అఖండమై, నిత్యమై అందరి యందు ఉన్నది గనుక నేను చిద్ఘనమైన అఖండమైన ఆత్మను అన్న భావనలో నీవు నిలకడ చెందినట్లయితే, నీకు ఈ జగత్తు అర్థమైనట్లు లెక్క. నిన్ను నీవు కొంత అర్థం చేసుకున్నట్లు లెక్క. ఇక మిగిలిన వారు ఎవరు అంటే ఆయన జగదీశ్వరుడు. జగదీశ్వరుడు అంటే మనకు దశావతారాలు, ఇంకొళ్ళు, ఇంకొళ్ళు అనేక మత ప్రవక్తలు వీళ్లందరినీ దేవుళ్లుగా భావిస్తాం. కానీ, ఆ దేవుడు ఎవరు? ఆ పరమాత్మ ఎవరు? ఆయన్ని ఎలా పట్టుకోవాలి? ఆయనా బ్రహ్మము వేరా? కాదా అంటే, ఆయన పరబ్రహ్మమూర్తి అంటాం. మరి బ్రహ్మము వేరు పరబ్రహ్మము వేరు అని మనకే తెలుస్తుంది. పదాలు ఊరికే వాడేస్తున్నాం అంతే. అలా కాకుండా ఈ బ్రహ్మము నుండి పరబ్రహ్మాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి గనుక, ఇటువంటి ఉదాత్త వైఖరిలోకి వచ్చేవారం మళ్ళీ మనం మరొక్క ఉపనిషత్తులోకి, ఈశావాస్యోపనిషత్తు లో ఉన్న రససారమంతా కూడా ఇంతే, ఇంతే, ఇంతే. చాలా విస్తృతంగా ఉంటాయి. విచారణలు ఉంటాయి. అనేకమైనటువంటి ప్రశ్నోపప్రశ్నలు ఉంటాయి. కథలు ఉంటాయి. భావాలు ఉంటాయి. ఆ అనేక deliberations ఉంటాయి. కానీ ఉన్న సారం ఏమిటి, మూలం ఏమిటంటే, ఇదే జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు ఒకటే. ఈశ్వరో గురుః గురుమవరాత్మేతి మూర్తిభేదవిభాగిని. రెండు, తర్వాత మనకి తృప్తి, ఆనందము అవన్నీ చెప్పుకున్నాం. త్యాగము, తృప్తి, ఆనందము ఒక ఎత్తు. ఆ తర్వాత ఇది తను సత్తకం. కానీ తను సత్తకానికి మూలమైనటువంటి ఆత్మ మన యందే ఉన్నది. అది అఖండమై ఉన్నది. అది బ్రహ్మమై ఉన్నది. అదే సత్యమై, జ్ఞానమై, అనంతమై ఈ ప్రపంచంలో ఉన్నది. కనుక బ్రహ్మము సత్యము, బ్రహ్మము జ్ఞానము, బ్రహ్మము అనంతము. It is endless. It has neither a beginning nor an end. It is a continuous ఒక మహా ప్రవాహమై సాగుతూ ఉంటుంది గనుక, సృష్టినంతా ఆక్రమించి ఉన్నటువంటి ఈ దివ్య భావనా గరిమతో మనం ఈశావాస్యోపనిషత్తుని చక్కగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం దీని నిండా ఉన్నది. దీనినే సత్య సాయి భగవానుడు ఉపనిషద్ వాహినిలో తమదైనటువంటి రీతిలో తాము వ్యాఖ్యానించారు. అయితే అది కూడా మనకు అర్థం అయి అవటానికి చాలా కష్టం గనుక, దానిని ఇవాళ మన స్థాయిలో మనం ఎంతవరకు దానిని గ్రహించగలమో, ఎంతవరకు ఆచరణాత్మకం చేయగలమో, ఎంతవరకు అనుభూతిని పొందగలమో, ఎట్లా మనం విభూతి స్థాయికి వెళ్లగలుగుతామో, ఈ ఆత్మ అనాత్మ మధ్య ఉన్న భేదం ఏమిటో, ఈ బ్రహ్మము ఆత్మ అంటే ఏమిటో, ఇవన్నీ కూడా విచారణ చేసుకునేటువంటి ఒక మహదవకాశాన్ని కల్పించినటువంటి సత్య సాయి భగవానుడికి మనసా, వచసా, శిరసా నమస్కరిస్తూ హిమాయత్ నగర్ సంకల్పించినటువంటి ఈ ఉపనిషత్ వాహిని లేదా ఇది ఒక ప్రవాహం దీన్ని నిరంతరము మనం కొనసాగిస్తూ అనేక రీతులలో దశోపనిషత్తులని మనకి అర్థం అయ్యేటువంటి స్థాయిలో మాత్రమే విచారణ చేసుకుంటూ వెళ్లాలని మీ అందరినీ కూడా అభినందిస్తూ సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి మనందరికీ కూడా తమ అనుగ్రహాన్ని మహా అమృత వృష్టి వలె కురిపించు గాక అని మంగళాశాసనం చేస్తూ స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.
YouTube · audio
UPANISHAD VAHINI - I Part-3
UPANISHAD VAHINI - I Part-3
0:00 / 2:06:33
More in this series