No transcript for this section.
Transcript begins at 1:16.
నిజంగా మిమ్మల్ని చూసి మేము చాలా సార్లు అనుకుంటాం అండి అవును ముఖ్యంగా మీ శ్రీమతి ఆ ఆ మరి ప్రపంచాన్ని వదిలినప్పుడు అవును ఆ మీరు తీసుకున్న ఆ stability ని చూసి ఆ చాలా ఆశ్చర్యపోయాం అవును అంటే నిజంగా తా-- అది చెప్పడం సులువుగా అనిపిస్తుంది కానీ ఆ పరిస్థితిలో అవును చాలా balance అంటే missing feeling ఉంటుంది ఉంటుంది కానీ మీ the way you took it is like really ఆ అదే మీరు పన్నట్టుగా అది గురువు అనుగ్రహం ఒకటి ఉమ్ ఆ సంఘటన జరగటానికి కూడా అంటే కారణం లేని departure ఆమెది. ఆ రోజున ఇది చెప్పాలి చెప్పాలని ఉందులో ఇది తప్పకుండా చెప్పాలి though personal అందరూ అలా ఉండగలిగే స్థాయికి రావాలి తప్పకుండా అండి అవును తెల్లవారుజామున three thirty కి ఇద్దరం లేచాం. ఎందుకు లేచాము early గా లేచాం. ఆమె గదిలో నుంచి ఆమె నా గదిలో నుంచి నేను ఆమెకు AC పడదు కాబట్టి ఆమె పడుకుంది. ఎలాగూ లేచాం ఇంకో గంట అయితే first cup of coffee తాగుతాం కదా పడుకోవటం ఎందుకు అందులో రమణ మహర్షి "ఇటువంటి సమయంలో లేవటమే ఒక ఉదాత్తమైనటువంటి అనుగ్రహం" అన్నారు ఆయన. లేచి ప్రాపంచికమైన విషయాలు మాట్లాడుకునే కంటే అంటూ రమణ మహర్షి గురించి మాట్లాడుతున్నా. ఆమె వింటూనే మధ్యలో ఏమడిగారంటే మీరు రామాయణ కల్పవృక్షంలో సీతా రామ కల్యాణ ఘట్టంలో ఓ పద్యం చదివారు. ఆ పద్యం ఒకసారి చదువుతారా? "పరసుఖ దేశౌ పరిపాక రమణీయకమ సంగు కచ సాన్నిధ్యాత్త రమణ ప్రథమ స్పర్శ ప్రరూఢి నడనులిచ సూత్రబంధన వేళన్" అంటే ఏం లేదు శ్రీరామచంద్రుడు మూడు ముళ్ళు వేసేటువంటి సమయంలో రామచంద్రుడి యొక్క చిటుకన వేలు యొక్క గోలు అమ్మవారి జడ దగ్గర తగిలింది అది ఆమెకు రమణ ప్రథమ స్పర్శ. దాంతో లోక లోకాంతర ప్రాణాలన్నీ అమ్మవారికి ఒక్కసారి లేచి అను మహాలక్ష్మి అని మహావిష్ణువు మళ్ళీ కలుసుకున్నామా అన్నటువంటి ఒక అద్భుత భావన అంటే నిజమే విశ్వనాథం వారు రాశారు ఇది అని ఇట్లా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే గదా పద్యానికి సార్ధకత. ఆ పద్యం ఎందుకో నాకు చాలా గుర్తొస్తున్నది అని అంటూ ఉన్నప్పుడు నేను దాన్ని కొనసాగింపుగా ఏమన్నానంటే ఇదే విశ్వనాథ ఆయన ముప్పై మూడవ ఏట ఉమ్ మొట్టమొదట ఆయన భార్య వరలక్ష్మి గారు పోయినప్పుడు బెజవాడలో కృష్ణా తీరంలో దహన కార్యక్రమాలు పూర్తి చేసి వెనక్కి వస్తుంటే ఆయన శిష్యుడు ఒకడు "మీరు నిబ్బరంగా ఉండాలి. ఊ. ఆ మనసును అటు ఇటు చెదరగొట్టుకోకండి మీది చిన్న వయస్సే" అని ఇట్లా అంటూ ఉన్నప్పుడు "నిజంగా ఓ మాట చెప్పనా విను జాగ్రత్తగా నిజము నా శరీరాస్తి కృష్ణార్పణం. ఈ శరీరానికి ఆస్తి ఉంటే అది కృష్ణార్పణం చేసి వస్తున్నా అంతే" అన్నాడాయన అబ్బా అది రాయగలడు ఇది రాయగలడు అంటూ మామూలుగా చెప్తూ ఉండటం అలా చెప్తూ ఉండగా ఆమె ఒరిగిపోవటం ఒరిగిపోతూ నా ఒళ్ళో ఆ తల పడటం తల పడగానే సాయిరామ్ అంటూ ఉమ్ దేహం వదిలిపెట్టడం అంతా ఇటు happened ఒక మూడున్నర నిమిషాల్లో అసలు కారణమే లేదు. సరే తర్వాత కారణాలు వెతుకుతాం ఏదో ఇంకేదో cardiac arrest ఏదో చెప్పేవైదో చెప్తారు but. అందుకని నేనేమంటానంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. so ఇవన్నీ కూడా మనకి మనస్సు లోపల పొరలలో దాగి ఉంటాయి ఉమ్ కన్నీటిని ఆపేస్తాయి. తర్వాత ఏమిటి జీవితం? ఏం భయపడక్కర్లేదు. ఉమ్ ఇరవై ఏళ్ళ ముందు ఆమె లేదుగా ఇరవై ఏళ్ళగా జీవితంలోకి వచ్చింది మరి చివరి ఇరవై ఏళ్ళు ఇలా గడవాలి కాబోలు గడుస్తుంది ఏమవుతుంది. అంటే ఆవిడ అంత పుణ్యజీవిలా అలా వెళ్ళిపోవడం అనేది చాలా ఆశ్చర్యం అండి చాలా నిజంగా మీరన్నట్టు అంత అనాయాసంగా అనాయాసంగా వెళ్ళిపోవడం అసలు అంటే వారితో ఎలా మీ ఆ ఆ మాకు మా Arranged marriage అదా Arranged marriage ఉమ్ మా పెద్దవాళ్ళు చేసినటువంటి సాంప్రదాయబద్ధంగా జరిగింది ఉమ్ చక్కగా చేదోడు వాదోడుగా కలిసి బాబా వారు ఆ ఆ మా నాతో వచ్చిన interviews ఎక్కువ interviews ఆమె పాల్గొనలేదు కానీ ఉమ్ ఆమె కూడా ఒకసారి అన్నీ ఆయనకే చెప్తున్నారు నేనేం చేయాలి స్వామి అని అడిగితే ఉమ్ "మూర్తికి సేవ చెయ్ అంతకంటే గొప్ప విశేషం ఉన్నదా" అని అనటం ఉమ్ ఆమె కూడా ఆమెకు వస్తు సృష్టి ఇచ్చారు ఉమ్ ఎందుకంటే ఆమె ఆయనకు పరీక్ష పెట్టింది నువ్వు దేవుడివైతే అంటూ ఆ కాబట్టి పరీక్ష ఆయన pass అయ్యారు భక్తురాలి పరీక్షలో pass అయ్యారు ఆ ఆయన pass అయ్యారు ఉమ్ Pass అయ్యి ఆయన అడగటం కూడా ఆమె మనసులో ఏమని అనుకున్నదో అదే ఇచ్చారు. ఒకవైపు షిరిడి బాబా రెండోవైపు రామపట్టాభిషేకం అదే ఆయన డ-- మన dollar note create చేసి ఇచ్చారు అప్పటికప్పుడు. ఇవన్నీ కంటితో చూసినప్పుడు ఆర్ఈసి వరంగల్లో ఇట్లాగే ఒక తర్వాత నేను పెద్దవాడినయ్యాక ఉపన్యాసం ఇస్తుంటే ఒక student అడిగాడు "Is it possible?" Exactly అదే అం అడుగుదామనుకుంటున్నానండి మీరు ఆ భౌతిక శాస్త్రం చదువుకున్నారు చదువుకున్నాను అవును ఈ స్వామివారి సృష్టేమో భౌతిక శాస్త్రాన్ని పరిధులను చాలా మించిపోయి ఉంటుంది దా దాటిపోయింది దాన్ని ఎలా సంబంధించుకోవాలి అంటే ఇంతే Man creates energy out of matter. Matter బొగ్గు. నేను science చదువుకున్నా దానిలో నుంచి నేను నిప్పును సృష్టించగలను వెలిగించి అంతే కదా ఉమ్ But God creates matter out of energy. ఉహుహు అయిపోయింది answer వచ్చింది ఉహు M is equal to E c square అయి అదంతా the science matter అంటే E c square అయి అది ఆయన నిరూపించారు. అంటే ఇప్పుడు మనం కూడా మనలో ఉన్న సర్వశక్తులు గనక ఒకచోట కూడబెట్టగలిగితే ఉమ్ నిస్వార్థంగా సంకల్పం చేసినట్లయితే దేనినైనా సృష్టించగలం. అదే సంకల్ప శక్తి అదే ఆత్మ శక్తి. దానికే ఆత్మ ప్రజ్ఞ అని పేరు పెట్టాం. మీరు చాలా ఉపన్యాసాలు అవి కూడా చాలా ఆ చోట్ల తర చాలా తరచూ ఇంకా ఇస్తూ ఉంటారు ఆ బాబా వారి ముందు కూడా కొన్ని interviews అంటే కొన్ని ఉపన్యాసాలు ఇచ్చారా? ఆ వారి ముందు కొన్ని ఉపన్యాసాలు వేను ఇచ్చాను ఇచ్చాను చాలా సార్లు ఉహు చాలా సార్లు ఇచ్చాను ఉమ్ తర్వాత ఇక్కడ interview room లోకి పిలిచినప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళునాకు పి. సుశీల, ఆది-- ఆది నారాయణ రావు, అంజలి దేవి. వీళ్ళు అంటే ప్రముఖులైన పేర్లుగా చెప్తున్నాను నేను. ఎం. ఎస్. సుబ్బలక్ష్మి, పండిట్ రవిశంకర్, శివకుమార్ శర్మ ఘంటసాల వారు కూడా ఘంటసాల వారు. వీళ్లంతా వచ్చినప్పుడు ఉమ్ స్వామి నన్ను తప్పకుండా ఆ room లోకి పిలిచేవారు. అంటే ఆ తెలుసుకోవటానికి. అప్పుడు కొంతమంది north Indian ఇప్పుడు పండిట్ శివకుమార్ శర్మ తెలుగులో మాట్లాడరుగా. ఉమ్ అప్పుడు స్వామి నన్ను translate చేయమనేవారు. ఆ room లోనూ ను-- నుంచొని translation చేసేవాడిని. ఉమ్ చిన్న చిన్నవి. ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ అది. మీరంటే ఆశ్రమంలో ఉండేవారా అండి లేకపోతే job చేస్తూ లేదు లేదు లేదు. నా పని ఆయన చెప్పేశారు నాకు. ఉమ్ నా సాయి రమణీయం అనేటువంటి పుస్తకంలో అది ఖచ్చితంగా రాసేశా. ఉమ్ నీవు పదే పదే పుట్టపర్తికి రావద్దు. ఉమ్ నీవు ఉన్నచోటనే నేను ఉంటాను. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. అంతే. ఉమ్ కాబట్టి నాకు వీలైనప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా నాతో మాట్లాడారు. నన్నెన్నడూ ఆయన దూరం పెట్టిందో లేకపోతే ఇవాళ మాట్లాడక్కర్లేదు అని అనుకోలే. ఉమ్ ఎంతమందిలో ఉన్నా పిలిచారు. పిలిచారు, మాట్లాడారు. [పాట] మూర్తి గారు మరి అక్కడి నుంచి రమణ మహర్షి వారి ఆశ్రమానికి అంటే పరిచయం మీకు ఎలా వచ్చిందండి? పరిచయం అంటే బాబా ఒకరోజున ఉమ్ నాకు స్వామి main, ప్రధానం. ఆ formative years నుంచి ఆ adult stage దాటి దాటి ఉమ్ ఒక age వచ్చిన తర్వాత కూడా ఆయనేమన్నారంటే, మానవ జన్మ ఎత్తినందుకు ప్రతివాడు అరుణాచలానికి చేరుకోవాలి ఏదో ఒకరోజున. ఆహా! ఉమ్ అరుణాచలం highest pinnacle అది. అది శిఖరాగ్ర స్థాయి. అక్కడికి చేరిన తర్వాత మాటలు లేవు, శాస్త్రాలు లేవు, కావ్యాలు లేవు, ప్రతిభలు లేవు, కీర్తి లేదు, జననం లేదు, దేహం లేదు, దేహాత్మ భావన లేదు. ఆ దేహి లోపల ఎవడైతే ఉన్నాడో వాడి ఆ స్పర్శ కావాలి అంటే అరుణాచలానికి వెళ్ళాలి. అంటే అరుణాచలం అరుణాచలేశ్వరుడిని ఉద్దేశించా లేకపోతే రమణాశ్రమానికి రమణాశ్రమాన్ని గురించి రమణాశ్రమాన్ని గురించి రమణ-- రమణ మహర్షి గురించి గురించి ఉమ్ ఉమ్ చెప్తూ వారు చెప్పారన్నమాట. ఆ point చెప్పి రమణాశ్రమానికి తరచూ వెళుతూ ఉండాలి అని అన్నారు. ఉమ్ నాకు దాంతో సంబంధం లేదు కదా అనుకున్నా లోపల. కానీ తదనంతర కాలంలో ఆ నేను Bombay లో work చేసేటప్పుడు రాయచూరులో ఒక ఏడు projects లు ఒక at a time వస్తున్నాయి. దానికి నన్ను in charge గా వేశారు. మధ్యాహ్నం మూడు గంటలకి Bombay నుంచి హైదరాబాద్ కు flight లో రావాలి. ఇక్కడి నుంచి నేను by road వెళ్ళాలి. ఇంకొక గంట time ఉందనంగా board meeting జరిగింది, directors meeting. వాళ్ళు అందులో chairman అడిగారు, "ఎవరు వెళ్తున్నారు రాయచూరు projects కి?" అని. ఇలా మూర్తి గారు వెళుతున్నారండి. లేదు లేదు లేదు మనకి తమిళనాడులో projects అన్నీ మధ్య మధ్యలో అయిపోతున్నాయి. వాటికి వారిని in charge గా వారిని ఉమ్ regional manager గా పంపండి. ఇవి ఎప్పుడో నెమ్మదిగా వస్తూ ఉంటాయి అన్నందువల్ల ఆ ticket cancel కావటం, నేను రాణిపేట వెళ్ళటం, రాణిపేటలో ఉండగా ఒక telegram రావటం, తిరువణ్ణామలైలో ఒక World Bank project నడవటం లేదు, నత్తనడకన వెళుతుంది, కారణాలేమిటి? వెతకమనప్పుడు అక్కడికి నేను వెళ్ళటం, అప్పుడు ఒక IAS officer విజయ రాఘవన్ అని మా దగ్గర ఉండిపోండి అన్నప్పుడు నూట ఎనభై ఎనిమిది రోజులు నేను అరుణాచలం లో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ నూట ఎనభై ఎనిమిది రోజుల్లో తొంభై గిరి ప్రదక్షిణలు నేను చేసుకోవాల్సి వచ్చింది. హాయిగా. చేసుకోవాల్సి వచ్చింది అంటే ఏంటి అంటే చేసుకోవలసి వచ్చింది అంటే ఆ attraction అటువంటిది. అంతేనా! ఆ అంటే inescapable అంటాం చూడండి. ఆ ఇక దాన్ని చేసుకున్నాను అంటే ఏముంది మామూలే. చేసుకోవలసి వచ్చింది అంటే లోపల నుంచి అంత తీవ్రంగా ఉండి ఆ తీవ్రమైన ఆ తోరిక ఆ జ్ఞా-- లోపల ఉన్నటువంటి కాంక్ష అనండి ఉమ్ ఆ బలమైన ఆకర్షణ శక్తి అనండి ఉమ్ ఆ స్కందాశ్రమం, విరూపాక్ష cave. అందుకనే ప్రతి square inch of అరుణాచలా అండ్ రమణాశ్రమం is in my heart. ఉమ్ కనుకనే తర్వాత నేను సాయి రమణీయం అను పుస్తకం రాశా. ఉమ్ దర్శన పూర్ణం రాశా రమణ మహర్షి మీద. అవును ఉమ్ ఆ కొన్ని వందల వేల ఉపన్యాసాలు రమణ మహర్షి మీద ఇచ్చాక ఉమ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో January fifth I remember అరుణాచలం నుంచి పుట్టపర్తి మీదిగా నేను Bombay వెళ్ళాలి. ఉమ్ బెంగళూరులో flight తీసుకుని ఉమ్ ఉహు ఆ రోజు నేను వెళ్ళగానే స్వామి నన్ను లోపలికి పిలిచారు. పిలిచి చాలా సేపు మాట్లాడారు. ఇంకెవరో ఇద్దరు ముగ్గురిని పిలిచారు. వాళ్ళతో వాళ్ళకెంగాలో చెప్పి వాళ్ళని పంపించేశారు. నన్ను కూడా సాగనంపేటప్పుడు ఆ గడప దగ్గర నుంచుంటారు బాబా. మనం ఊరికే వెళ్ళిపోండి అనరు. ఆయన మనల్ని సాగనంపుతారు. ఆయన switch light on చేస్తారు, ఆయనే off చేసుకుంటారు. కావలసినంత సేపే light ఉంటుంది, తర్వాత అది off చేయవలసిందే. ఉమ్ అలా వెళుతూ ఉంటే నన్ను నా shirt ఇలా పట్టుకొని ఇట్లా నెమ్మదిగా లాగి, "రమణులంటే ఎవరినికున్నావు? సాక్షాత్తు ఈశ్వరుడు, మరచకు బంగారం." అన్వేషణ ముగిసింది. కాబట్టి రమణాశ్రమానికి వెళ్ళినా, రమణ మహర్షి గురించి కొన్ని ఆలోచనలు కలిగినా ఉమ్ ఆయన స్కందుడా, దక్షిణామూర్తా మనకు అనవసరం. అది ఆత్మ స్వరూపంగా భావన చేయటానికి మళ్ళీ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి గురు స్వరూపం మరొక దైవాన్ని చూపించినటువంటి గురువు ఎవరంటే దేవో భూత్వా దేవం వయజేత్ అని దేవుడైన వాడే దేవుని గురించి మాట్లాడగలడు. దేవుడైన వాడే దై-- దైవం ఇది అని చెప్పగలుగుతాడు. కాబట్టి నా బాబా గారు నన్ను రమణాశ్రమం వైపు నడిపించింది ఎవరు అంటే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారే. చాలా అసలు అంటే ఆ అంటే ఒళ్ళు గగుర్పొడిచే అనుభవాలండి అది. అవును సాయిబాబా వారు ఆ మాట అన్నా వారు సాక్షాత్తు ఈశ్వరుడన్నారు ఈశ్వరుడు ఈయనొక ఈశ్వరాంశ అయితే మళ్ళీ ఆయన ఈశ్వరుడని చెప్పడం చెప్పడం చాలా చాలా ఉమ్ వాళ్ళెప్పుడన్నా అసలు భౌతికంగా కలుసుకోవడం జరిగిందా అండి? బాబా వెళ్లారు. బాబా వెళ్లారా బాబా వెళ్లారు. ఆ కానీ చరిత్రలో మనకి దురదృష్టవశాత్తు మనకి ఒక fervor ఒక emotion ఈ రెండూ ఏర్పడ్డప్పుడు తీవ్ర భక్తులు ఏర్పడతాయి. ఉమ్ అన్నప్పుడు మా గురువుగారు అక్కడికి వెళ్ళలేదనుకో వెళ్ళకపోతే బాగుండేనోమా గురువుగారు exclusive అనో మిగతా వాళ్ళకంటే superior అనో ఇటువంటి అల్ప భావాలు మనిషిలో కలుగుతాయి భక్తులు బంధించేద్దాం అనుకుంటారు Posessiveness Posessiveness తర్వాత వాళ్ళు own చేసుకుందాం అని ఉమ్మ్ కానీ బాబా అట్లా చెప్పలే చెప్పారు. వారు పదహారవ ఏట అరుణాచలానికి వెళ్లారు. అందుకనే భజన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టుకున్నటువంటి వేళ "మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర చరణం" అనే ఒక భజన రాశారు బాబా. "ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమ బాబా" అంటూ "అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోహం". ఊహూ అందువల్ల అరుణాచలం పరముక్తిని ఇస్తుంది కాబట్టి ఆ బాబా కి highest regard అరుణాచలం అన్నా భగవాన్ రమణ మహర్షి అన్నా హూ యామ్ ఐ అన్న ప్రశ్నకి జవాబులు వెతకమన్నారు మమ్మల్ని. ఉమ్మ్ ప్రశ్న వేసుకోండి. ఎంతవరకు చూటి లేచి spoon feeding కాదు మీ అంతట మీరు ఈదండి పట్టుకునే ప్రయత్నం చేయండి మూర్తి గారు ఒక మిమ్మల్ని మాత్రం అడగగలిగే ఒక ప్రశ్న ఈ హూ యామ్ ఐ అంటున్నారు ఇది మీకు అనుభవంలోకి వచ్చిందా? నేను ఆ అనుభవంలోనే ఉంటాను ఎప్పుడూ. ఎప్పుడూ, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా హూ యామ్ ఐ అన్న స్పృహ పూర్ణంగా ఉంటుంది నాకు. ఈ మాట్లాడుతున్నది కూడా నేను కాదని నాకు తెలుసు. మాట్లాడిస్తున్న ఎవరో మన యందు ఉన్నాడు. అడుగుతున్నది కూడా మీరు కాదని తెలుసు నాకు. మీ చేత ఎవరో అడిగిస్తున్నారు. ఈ అడగబెట్టం అంటే అడగాలని ఉంది, చెప్పాలని ఉంది కూడితే వినాలని ఉంది కి అది కర్ణపేయంగా ఉంటుంది అంతే కదా. ఉమ్మ్ ఆ అడగాలని ఉంది లో నుంచి ఒక ప్రశ్నలో నుంచి జవాబు రావాలి. ఆ జవాబు శుద్ధ చైతన్యంలో నుంచి యధావాక్కుగా యదార్థంగా గనక రాగలిగితే అది లోకానికి ఉపయోగిస్తుంది. కాబట్టి మనం దైనందినకంగా ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా అనేకమైనటువంటి ప్రాపంచికానుభూతులు ఓ వాటికి లోనవుతున్నా ఆకర్షణకి లొంగకుండా ఉదాత్తమైన స్థాయిలో గనక మనస్సుని సంచారం చేయించగలిగితే, ఏ రకమైనటువంటి చెడు భావన మనసుకు రాకుండా ఉంచుకోగలిగినట్లయితే దానిని మించిన ఆత్మనిష్ఠ ఏముంది? నేను నా శరీరం ఉండదు, నేను ఉండబోవటం లేదు కానీ నేను ఉండబోతున్నాను. నా నేను ఈ శరీరాన్ని సంపాదించుకున్నా, తీసుకుని నేను వచ్చా. ఎట్లాగైతే ఇవాళ పొద్దున కట్టినటువంటి బట్ట సాయంకాలం విప్పి బయట పడేస్తున్నానో ఈ శరీరాన్ని ఇప్పుడు తెచ్చుకున్నా, ఇటువంటివి ఎన్ని తాల్చానో ఇంకా ఎన్ని తాల్చవలసి ఉన్నదో కాబట్టి దీంతో నాకు ఎట్టి సంబంధం లేదు అన్న భావన బలపడినప్పుడు మనం ఆత్మ స్వరూపులుగానే ఉంటాం. ఆత్మ స్వరూపం అంటే ఒక ఆత్మకి స్వరూపం అయినప్పుడు ఈ ఆత్మ దేన్నీ అంటించుకోదు. అంటించకున్నట్లుగా ఉంటుంది అంతే. అన్నిటా ఉన్నట్లు ఉంటుంది. ఇందాక చెప్పిన bio data లో అది చేశాం, ఇది చేశాం, అది చేశాం అవన్నీ ఉంటాయి. లోకం కోసం చెప్పాలి గనుక చేశామా అంటే ఇవన్నీ నా ద్వారా చేయబడ్డాయి. [background music] మూర్తి గారు అది ఒక్కొక్కసారి ఆ భావన ఉమ్మ్ ఆ disappointing గా కూడా అనిపిస్తుంటుంది. ఉమ్మ్ అది లేనప్-- అది నేను కాదు చేస్తుంది అనుకోకపోతే ఒక రకమైన ఉత్సాహం లేనట్టుగా ఉంటుందండి సామాన్యులకి. ఉమ్మ్ దాన్ని ఎలా అధిగమించడం అంటారు? ఆ కచ్చితంగా ఇది చాలా మంచి ప్రశ్న. సామాన్యులు అనేటువంటిది లేదమ్మా. ఉన్నది ఒకడే. ఏ వాడు ప్రయత్నం చేసిన వాడు అందుకుంటున్నాడు, ప్రయత్నం చేయని వాడు ఆగిపోతున్నాడు. ఇది దొరుకుతుందో దొరకదో అన్న ఒక సందేహంలో ఉన్నవాడు ప్రయత్నమే ప్రారంభించటం లేదు. ప్రారంభించగానే వచ్చేటువంటి అనేకమైనటువంటి ఒత్తిళ్లు అనండి, ఆ అశాభంగాలు అనండి, నిరాశక్తత అనండి, అలసత్వం అనండి వీటన్నింటి వల్ల అడుగు వెనక్కి వేస్తున్నాడు తప్ప చొచ్చుకొని దాన్ని గనక ఒక ఏక అభిప్రాయంగా తీసుకుని, ఒక ఏక సాధనగా తీసుకుని వెళ్లగలిగినట్లయితే దానిని కచ్చితంగా పొందుతాడు. మూడు మాటలు ఉన్నాయి కదా శరీరం ఉంది దానికి సుఖమే తెలుసు, మనసు ఉన్నది దానికి సంతోషమే తెలుసు, హృదయం ఉంది దానికి ఆనందమే తెలుసు. ఈ మూడు ఎక్కడున్నాయి? మన యందే ఉన్నాయి కదా. ఉమ్మ్ సుఖం దగ్గర ఆగిపోతే సంతోషం దొరకదు. సుఖ సంతోషాలు రెండూ అనుభవిస్తే ఆనందం వైపు మనసు వెళ్ళదు. మనకి సంతోషానికి ఆనందానికి పెద్ద తేడా లేనట్లుగా అనిపిస్తుంది. సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. దాన్నే పాశ్చాత్యులు body, mind, soul అని మూడు మాటలు పెట్టుకున్నారు. ఉమ్మ్ మనం soul అనే మాట వాడం self అనే మాట వాడతాం. ఊహూ అంటే ఉన్నదంతా ఆత్మే "సర్వం ఖల్విదం బ్రహ్మ" ఇది కొంత సాధన ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సత్సాంగత్యం ద్వారా, సమ్యక్ సంకీర్తన ద్వారా, సదాచారం ద్వారా, విధివిధానాల ద్వారా ఒక ధర్మాన్ని ఉమ్మ్ ఆచరించి ఆ ధర్మ మార్గంలో గనక వెళితే ప్రధానంగా ఒక హైందవ ధర్మం ఉంది. హైందవ ధర్మం మనకి ఒక విస్తృతమైన canvas చిన్న కర్చీఫ్ లాంటిది కాదది. ఆకాశం అంత విస్తృతమైంది. దానిలో ఎక్కడి నుంచైనా మనం ప్రారంభించవచ్చు, ఎటు నుంచైనా వెళ్ళొచ్చు. ఈ పోగులన్నీ central point కి తీసుకెళ్తాయి. ఉమ్మ్ ఆ central point ఏ ఆత్మ దర్శనం. కాబట్టి హైందవ ధర్మం సనాతన ధర్మం. హైందవ మతం లేదు. హైందవ ధర్మం ఉంది. ఆ హైందవం అన్నా సనాతనం అన్నా రెండూ synonyms with each other. కాబట్టి ఆ సనాతనమైనటువంటి దాన్ని కాస్త సనూతనంగా ఇవాల్టికి కావలసినట్లుగా కాస్త మార్పు చేసుకుంటూ మార్పు చేసుకుంటూ ఉమ్మ్ ధర్మాన్ని మార్చలేం అది మౌలికం. ఉమ్మ్ కానీ అవసరాలు మారుతాయి. ఉమ్మ్ ఆ అవసరాలని విలువైన అవసరాలుగా మార్చుకుంటూ వెళ్లినట్లయితే మనకు కచ్చితంగా ఈ హూ యామ్ ఐ అన్న ప్రశ్న ఉమ్మ్ ఆ మీరు మీకు కలిగిందా అని అడిగినప్పుడు నేను నిజంగా చెప్పాలనుంది లో చాలా honest గా చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే ఈ ప్రపంచంలోనే ఉన్నా, ఇన్ని పనులు జరుగుతూ ఉన్నా ఎక్కడా అతిశయించిన ఆనందము లేదు.నిరాశలో కూరుకుపోయే దుఃఖము లేదు ఒక మహా సమస్తితి భారతీయ అధ్యాత్మ నా వరకు అనుగ్రహించింది. ఉమ్ నేను దాన్ని హూయామై అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు నేను గాని నా రూపం గాని నా పేరు గాని నేను సాధించినటువంటి విషయాలు గాని ఏవి కానివ్వండి లేదు నా వైఫల్యాలు గాని అవి ఏవీ నాకు చెందవు. నేను నేనైన నేను. నేను నేనుగానే ఉంటా. ఉమ్ అనేటువంటిది ఆ స్ఫురణే హూయామై. ఉమ్ మూర్తి గారు అంటే ఇప్పుడు ఒక మనిషి జన్మించినందుకు purpose ఈ హూయామై అనేది realize అవడమే అంటారా మీరు అన్నట్టుగా నేను ఎవరిని ప్రశ్నించుకోవడమేనా కాకుండా భౌతికంగా మనకంటూ ఒక purpose ఉంటుందా? ఎందుకంటే చాలా సార్లు ఈ సందేహం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు పుట్టాం? మనం కరెక్ట్ గా మనం నిర్దేశించబడిన పనే చేస్తున్నామా లేదా మనసేవో అడిగింది కదా అని చెప్పి ఈ పని చేస్తున్నానా? నాకంటూ నిర్దేశించబడిన పని ఏది నాకు ఎలా తెలుస్తుంది? అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు అన్ని యుగాలు మొదలయ్యే యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ. ఉమ్ అరయ నారాయణాన్వేషితం. నిజంగా ఆలోచిస్తే నారాయణున్ని అన్వేషించటానికై ఈ జన్మ ఇవ్వబడింది. భగవద్గీతలో కూడా జగద్గురువైనటువంటి కృష్ణుడు ఏమన్నాడు బహునాం జన్మనామంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత జ్ఞానం అంటే ఏమిటి అని అడుగుతున్నాం అట. అంటే ఇంతకుముందు ఎన్నో ఎత్తేసాం. ఇప్పటికి అడగగలుగుతున్నాం జ్ఞానం అంటే ఏమిటి హూయామై అంటే ఏమిటి? ఇదంటే ఏమిటి? అదంటే ఏమిటి? ఇది ఏదైనా సరే మానవ జీవితం మూడు అంతస్తుల మేడ. మొట్టమొదటి అంతస్తు భౌతికం. ఉమ్ రెండవది ఆదిభౌతికం. మూడవది ఆధ్యాత్మికం. ఏ విషయమైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికం. అంటే physical, metaphysical, spiritual మూడు స్థాయిల్లోనే ఈ ప్రపంచం నడుస్తుంది. ఉమ్ భౌతిక అవస్థలో మీరు కానీ నేను కానీ ఒక కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చాం. మనకు తెలియదు ఒక designated duty ఏదో ఉంది మనకి. అవి నెమ్మదిగా కాలం unfold చేస్తూ మనకు తెలియజెప్తూ ఉంటుంది. ఇదిగో ఈ వయసులో ఈ పని చెయ్, ఈ పని చెయ్, ఈ పని చెయ్ దీని తర్వాత, దీని తర్వాత, ఇది అయిపోయింది కదా దీని తర్వాత ఇట్లా మనకు ఒక ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. ఉమ్ ఈ అంతఃప్రేరణ వలన మనం కర్మానుష్టానం చేస్తాం. ఈ కర్మానుష్టానం ఒక సంస్కారం వల్ల ఒక జీవుడి సాధన వలన ఒక పరిమితమైన మనస్సు వలన ఇటువంటి భావాలు కలుగుతాయి. ఇవి లేని వాడి సామాన్యుడు. ఈ పండిత భాష పక్కన పెట్టి నేను సామాన్య మానవుడిని. ఏమీ చదివే లేదు మరి నేను ఏం చేయాలి? అంటే నేను చేయాల్సిన కర్తవ్యాలు నాకు నిర్దేశింపబడ్డాయి. కర్తవ్యం ప్రథమం అది కర్మ యోగం. ఉమ్ యోగించి చేయాలి కర్మ. ఎవరితో యోగించి? జీవ ప్రజ్ఞ మనదైతే దైవ ప్రజ్ఞ ఈశ్వరుడు ఒకడున్నాడు అనేటువంటి నమ్మకం పెట్టుకుంటా రెండు కలిపితే దాని పేరు కర్మ యోగం. ఉమ్ మనకి ఒక కర్తవ్యం వల్లనే ఇక్కడికి వచ్చాం. ఉమ్ మనకి ఇవ్వబడినటువంటి విధిని డ్యూటీని perfect గా చేయాలి. ఉమ్ ఆ perfection కోసం ఏం చేయాలి? దాని యందు శ్రద్ధ. తర్వాత మనం చేసే పనిని మనం ప్రేమించాలి, గౌరవించాలి, ఆదరించాలి, అనుభవి చేసినప్పుడు అది ఒక ఆనందాన్నిస్తుంది. అది అది ఇందాక చెప్పిన spiritual ఆనందం కాదు అది. ఆ ఈ ఆనందాలు మనుష్య ఆనందం అని, మనీష ఆనందం అని ఓహో ఆ గంధర్వ ఆనందం అని, దేవగంధర్వ ఆనందం అని ఆహా ప్రజాపిత ఆనందం అని ఉమ్ హిరణ్యగర్భ ఆనందం అని అది spiritual స్థాయి ఆధ్యాత్మిక స్థాయి ఏ కానీ ఇక్కడ కూడా కొన్ని ఆనందాలు కలగాలి కదా. ఉమ్ ఉమ్ భగవంతుని యొక్క శక్తిని మన శక్తిగా మార్చుకొని లేదా మన శక్తితో దాన్ని జోడించుకొని జనహితం కోసం, సమాజహితం కోసం, మన ఎదుగుదల కోసం మనం గనక ప్రయత్నం చేసినట్లయితే మనకి కచ్చితంగా ఆ నారాయణ అన్వేషణకి ఇదంతా దారితీస్తుంది. ఉమ్ మళ్లీ ఆ నారాయణుడు ఎక్కడున్నాడు? మనలోనే మనలోనే ఉన్నాడు. ఉమ్ ఉమ్ ఈ మాట మనలోనే ఉన్నాడు అని అనుకోవడానికి అన్నమాచార్యుల వారు ముప్పై మూడు వేల కీర్తనలు రాయాల్సి వచ్చింది. [నవ్వు] యాతన పడిపోయినాడు ఆయన. పడిపోయి చివరికి ఏమన్నాడు చిత్తజగురుడా నీకు శ్రీమంగళం అన్నాడు. ఆ నువ్వు భవుడన్నాను, శివుడన్నాను, మాధవుడన్నాను ఉమ్ ముప్పై మూడు వేల కీర్తనల తర్వాత వెతికి వెతికితే ఎక్కడున్నావ్ అంటే నాయందే ఉన్నాను అది. ఉమ్ కాబట్టి మనందరికీ కచ్చితంగా జీవితానికి ఒక purpose ఉంది. ఒక meaning ఉంది అర్థం ఉంది. జనహితం అయినప్పుడే అది successful. ఉమ్ అంతే. ఉమ్ మనకోసమే ఈ ప్రపంచం లేదు మనం ప్రపంచం కోసం ఉన్నాం. ఉమ్ అంతే కల్పవృక్షం అంతా ఒకే ఎత్తు అందుచేత రామాయణ కల్పవృక్షం ఇవాళ యువత చదవాలి. కైలాసాచల సానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి అది నేను అది అవుతానని దాని అర్థమే తెలియని రోజుల్లో అన్నప్పుడు అన్నప్పుడు అవును నేను ఆయన అన్న మాటకు అనుగుణంగా నేను జీవిస్తున్నానా లేదా జీవితం అలాగే మలుచుకున్నారు మీరు. మలుచుకున్నాను. ఉమ్
YouTube · audio
Cheppalani Undi | Part-2 | Medapati Ramalakshmi | Bhaarat Today
Cheppalani Undi | Part-2 | Medapati Ramalakshmi | Bhaarat Today
Source: Bharat Today on YouTube
0:00 / 24:24
More in this series