No transcript for this section.
Transcript begins at 2:51.
మంత్ర మహిమ కార్యక్రమంలో ఉపనిషత్ వాహిని క్రమంలో మనం ఉపనిషత్తులు చర్చించుకుంటున్నాం. ఆ క్రమంలో భాగంగా ఈ రోజు ముండకోపనిషత్ గురించి ఆధ్యాత్మిక వేత్త వి.ఎస్.ఆర్.మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నమస్కారం అమ్మ ఈ ఆత్మవిద్య ఈ సన్యాసం తీసుకుని వీళ్ళు ఉండే వాళ్ళే చేస్తారా? మామూలు వాళ్ళు కూడా చేయొచ్చా? సన్యాసం అంటే అసలు ఏంటి? సన్యాసం అంటే ఏంటనేది ఎంత అందమైన ప్రశ్నంటే, ఇవాళ సన్యాసం యొక్క అర్థమే మారిపోయింది. నేను ఈ బట్టలు వదిలేసి కాషాయం రెండు జతాలు కొనుక్కుంటే నేను కూడా సన్యాసినే. సన్యాసం అంటే వదిలిపెట్టటం కాదమ్మా. సమన్యాసమే సన్యాసం. అన్నింటినీ సమానంగా చేయగలగటం. ప్రపంచంలో ఉండే సుఖదుఃఖాలు, దీనిలో ఉండే మానవమానాలు, దీనిలో ఉండేటువంటి సంపదలు, జయాపజయాలు, పేదరికము, ఇవన్నీ కూడా భౌతిక అవస్థలో వీటన్నింటినీ సమన్యాసం చేయాలి. ఇది ఒక స్థాయి. రెండవది మనసులో పుట్టేటువంటి ఆలోచనలుంటాయి. కొన్ని వేల ఆలోచనలు పుడతాయి. వాటినన్నింటినీ సమన్యాస-- న్యాసము అంటే చలనం. న్యాసం అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఇట్లా అంటాం. అదొక న్యాసం. అంతేగా? ఆ ఇలా అంటాం. అదొక న్యాసం. ఒక న్యాసం ఇవన్నీ-- అంటే బాడీ లాంగ్వేజ్ అంటామే, ఆ బాడీ లాంగ్వేజ్ కే న్యాసం అని పేరు. కాబట్టి క-కరన్యాస అంటాం. కరన్యాసం చేతితో అది. కాబట్టి ఈ సం-సంన్యాసం కాదు. వీళ్ళు మధ్యలో సున్నా తీసేశారు అలవాటు ప్రకారం. సంన్యాసం సంన్యాసం అని రాయాలి. రాసేటప్పుడు సన్యాసం అనే పదమే లేదు. అర్థమేందానికి? సంన్యాసం అంటే సమన్యాసం. అన్నింటిలో సమంగా ఉండగలిగినటువంటి ఒక-- ఇంగ్లీషులో కొన్ని పదాలున్నాయి చాలా అందమైన పదాలవి. Equanimity, equality, equilibrium. ఇవి అంటే సర్వసమస్థితి. దాని పేరు సమన్యాసం. తర్వాత సన్యాశాశ్రమ స్వీకారం కాదు. స్వీకారం అంటే ఒక ఎత్తు. అసలు సన్యాసిగా ఉండాలి. యోగవాశిష్టంలో అవును ముప్పై మూడు వేల శ్లోకాలు అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళు మాట్లాడుకుంటే ముప్పై మూడు వేల శ్లోకాలయినాయి. అంతే కదా! వశిష్టులవారు రాముడిని అడుగుతాడు, "రామా! ఇప్పుడు నీ మనస్సు ఎట్లా ఉన్నది నాయనా?" అని అడుగుతాడు. "ఆచార్యా! ఇప్పుడు నేను మనస్సన్యాసిని" అంటాడు. ఎంత అందమైన మాట అది. ఏ మనస్సు నన్ను బాధించిందో, ఏ మనస్సు ఈ అయోధ్యానగరం ఇంత-ఇంత వింత వింత పోకడలతో ఉన్నదని అనుకున్నానో, ఈ ప్రపంచం దుఃఖారామమని నేను భావించానో, ఎందుకీ జన్మ ఎత్తు వచ్చానని బాధపడ్డానో, ఇవన్నీ విన్న తర్వాత నా-- నేను మనస్సుని సమన్యాసం చేసుకున్నా. ఆ సమన్యాసం వలననే రేపు పట్టాభిషేకం అన్నప్పుడు, "కాదు, నువ్వు అడవులకు వెళ్ళాలి" అంటే అవధలు దాల్చాడు. పట్టుబట్టలు రెండు సమానంగానే తీసుకున్నాడు. పట్టుబట్టలు కాదు, నువ్వు ఆరచేరలు ధరించాలి. అంతే నువ్వు ఒక్కడివే వెళ్ళాలి, నీ భార్యతో వెళ్ళమని ఆయన ఏం అడగలా. నీ తమ్ముడిని వెంబడి పెట్టుకెళ్ళమని ఆయన ఏం చెప్పలా. నీకు అరణ్యవాసం, అంతే. అన్నప్పుడు ఏ రకమైనటువంటి ఒక నికామంగా, నిర్మమంగా, హాయిగా ఎట్లా పట్టాభిషేకానికి మనస్సును సిద్ధపరచుకున్నాడో అదే రాముడు అరణ్యవాసానికి సిద్ధపరచుకున్నాడు. నా దృష్టిలో ప్రపంచంలో సర్వోన్నతమైనటువంటి సమన్యాసి ఎవరంటే శ్రీరామచంద్రుడు. ఆయనకేం మళ్ళీ వెనుతిరిగి చూడలా. అయోధ్యా నగర ప్రజలంతా "నీ వెనక వస్తాం" అన్నారు. ఆయన అన్నారు "మీరు రాకూడదు అలాగ. అక్కడేవో అడవిలో ఉండే జంతువులు అక్కడ పుట్టినవి పెరిగినవి తిని బతుకుతాయి. మీరందరూ నాతో పధ్నాలుగు ఏళ్ళు వస్తే అరణ్యాలన్నీ విధ్వంసం అయిపోతాయి. మీకు బతకటానికి ఓ నగరం ఉంది, మీరు ఇక్కడే ఉండండి. నేను ఒకవేళ ఊర్లో ఉన్నా, రోజూ మీకు దర్శనం ఇవ్వను. మీరు రోజూ నా దగ్గరికి రాలేరు. పధ్నాలుగు ఏళ్ళు అంతఃపురంలో ఉన్నానని అనుకోండి, మీ పనిలో మీరు ఉండండి" అన్నాడు. అంటే సమన్యాస-- ఆయన maturity, ఆ age ఎంత? ప్రహାରే అండి. అటువంటి ఆ వయస్సులో నిజమైన సన్యాసికి వయస్సు లేదమ్మా. అది వాళ్ళేదో ఒక వృత్తిపరంగా లేదు ఒక ధర్మపరంగా, వృత్తి కంటే కూడా ధర్మపరంగా సన్యాసం తీసుకోవటం వేరు. సన్యాసి అంటే కోరికలు లేనివాడు కాదు. యోగవాశిష్టం లోనే చెప్తాడు. రాముడికి "లోకే విహర రాఘవా" అని, ఆ, ఆ వశిష్టులవారు అంటారు, "రామా! నాయనా! విను జాగ్రత్తగా. నువ్వు రాజువు అవుతావు. యువరాజువు అవుతావు. ఇక్ష్వాకు వంశాన్ని నడిపించబోతున్నావు నువ్వు. కానీ, నీ దగ్గరికి రోజూ ఎవరొస్తారో తెలుసా? కోరికలు ఉన్నవారే వస్తారు నీ దగ్గరికి." సరి "కోరికలతోనే వస్తారు." నీ దగ్గరికి కోరికలుండే వాళ్ళే వస్తారు. వస్తారు. "కానీ, నువ్వు కోరికలు లేనివాడివై ఉండు." కోరికలు లేకపోతేనే కోరికలుండే వాళ్ళని తీర్చగల- తీర్చగలుగుతాడు. వీడికి కోరికలుంటే అది నాకే కావాలి అనుకుంటాడు. అనుకుంటాడు. కనుక మనస్సు యొక్క-- మనస్సన్యాసం అంటే అది. మనస్సు వదిలిపెట్టేసి ఉన్నట్లయితే రావణ వధ చేసేవాడు కాదు ఆయన. అంతేనా? వానరులందరినీ నే-- leadership తీసుకొని నడిపించేవాడు కాదు. అంటే ఆ కించిత్ మనస్సు మనం మాట్లాడుకున్నామే, దానితో దాన్ని ఆయన పధ్నాలుగు ఏళ్ళు సాధించాడు. కాబట్టి ఈ పరాప్రకృతి, ఈ పరావిద్య, అపరావిద్య, సన్యాసము అనేటువంటివన్నీ కూడా, వాటిని చాలా లోతైనటువంటి స్థాయిలో విచారణ చేస్తుంది ఉపనిషత్తు. ఈ లోకాలు అంటారు. ఊ ఆ యశోదా దేవి కృష్ణుడి- ఊ అవును ...నోట్లో అవును లోకాలు చూసింది. పద-పద-పధ్నాలుగు లోకాలు ఆ ఇటు ఏడు ఏదో లోకాలు, అటు ఏడు లోకాలు అని. ఆ ఏడు ఏడు లోకాలు ఆ ఏడు ఏడు లోకాలు. ఆ ఇస ఈ లోకాలంటే ఏంటి? ఈ లోకాలల్లో ఉండేదేంటి? ఇయా కొంచెం చెప్తారా? ఆ ఇప్పుడు యశోదకి కృష్ణుడు తన నోటిలో పధ్నాలుగు భువనాలు చూపించాడు. అది ఒక అబ్బురమైన, ఆశ్చర్యకరమైన ఒక మాయగా భావించింది. ఇది కలయో, వైష్ణవ మాయయో అన్నదిగా? అది కల కాదు, వైష్ణవ మాయ కాదు. మన దేహమే ఒక విశ్వంభర. మన దేహమే ఒక ప్రకృతికి మూల స్థూలం. ఇప్పుడు చూడండి, ఆ విరాట్ స్వరూపం దర్శనం చూపిస్తారు. చూపిస్తారు దేని మీద చూపిస్తారు? seventy mm మీద చూపిస్తారు పెద్దదిగా. అది అసలు కాదు. విశ్వరూప దర్శనం అది కాదు. సూక్ష్మమైందే విశ్వరూప దర్శనం. అది gross. ఇక్కడ కూడాపద్నాలుగు లోకాలు ఒకసారి మన శరీరాన్ని మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి లోకము బ్రహ్మ రంధ్రం. అది మొట్టమొదటి opening అది. అది ఒకటి. తర్వాత కొద్దిగా కిందకు రావాలి వస్తే రెండు కళ్ళు, రెండు చెవులు, ఒక నోరు అక్కడికి ఎన్ని అయినాయి? ఒకటి ప్లస్ రెండు ప్లస్ రెండు ఐదు అయిపోయినాయి. కర చరణాది అవయవాలు మొత్తంగా ఎత్తి ఒక తొమ్మిది దాకా పది దాకా అవి ఉన్నాయి. అంటే రెండు చేతులు రెండు కాళ్ళు ఒక పెద్ద పొట్ట. ఆ పొట్టలో అన్నీ ఉన్నాయి అది laboratory దాని నిండా ఒకటి ఉంది అదొక లోకం. ఈ లోకంతో పాటుగా ఇవన్నీ లెక్కబెడితే మనకు పదమూడు లోకాలు వస్తాయి. ఈ పదమూడు లోకాలు కానీ ఇంకొక లోకం ఉంది పద్నాల్గవది దానికి కింపురుష లోకం అని పేరు. కింపురుష కింపురుష లోకం. కింపురుష లోకం అంటే దానికి మామూలు అర్థంలో స్పర్శా లోకం అని పేరు. స్పర్శ. ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డని దగ్గర తీసుకుంటుంది ఏడుస్తూ ఉంటుంది దానికి భాష రాదు. తల్లికి ఎందుకు ఏడుస్తున్నదో నిజానికి మొదట్లో అర్థం కాదు ఏదో ఏడుస్తోంది ఆకలేస్తుందేమో పాలు పట్టాలో ఏదో చేయాలని ఎత్తుకుంటుంది. ఈ తల్లి అలా తాకగానే ఆ బిడ్డ ఏడుపు- ఏడుపు మానేస్తుంది ఎందుకు మానేస్తుంది? స్పర్శ స్పర్శ. ఒక రోగి దగ్గరికి మనం వెళ్ళాం ఓ hospital కి మనకి సంప్రదాయం ప్రకారం ఏదో పళ్ళు అవి తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆయనకు బాగుంటావని చెప్పి వస్తాం. మీరు పళ్ళు పెట్టండి నువ్వు లేచి వచ్చిన తర్వాత నీకు ఇదిగో ఇదంతా నీకిస్తాం అని ఎన్ని ప్రలోభాలు పెట్టండి వాడికి ఆనందం కలగదు. ఆనందం లేదు కానీ ఆయన భుజం మీద చేయి పెడితేనే ఆ ఓదార్పు ఆ చేయి పెట్టగానే ఆ ఓదార్పు చేయి పెట్టగానే వాడు ఆనందపడిపోయి నాకు ఈ లోకం ఉన్నది. ఈ ఆస్తులు కాదు ఎవరో నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారు. స్పర్శ. అందుకని ఈ పద్నాలుగు లోకాలు ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించినప్పుడు మామూలుగా భౌతికంగా వర్ణించటానికి అష్టావని ఉంది. భౌ-- మన ఖగోళ శాస్త్రం. అది కాదు ఇక్కడ అధ్యాత్మలో పద్నాలుగు లోకాలు మన శరీరంలో ఉన్నాయి. అందుకనే మన తలస్నానానికి మంగళ స్నానం అని పేరు పెట్టారు. అంతే కదా అవును రోజూ తలస్నానం చేస్తాం చేస్తాం చేసినప్పుడు మొట్టమొదట తల మీద నీళ్ళు పోసుకుంటాం పోసుకోగానే బ్రహ్మ రంధ్రానికి పూజ చేసుకుంటాం. అలాగే ఈ రెండు కళ్ళు చక్కగా స్పష్టంగా కనపడాలి లోకాన్ని చూడాలి లోకంలో చూస్తూ చూస్తూ ఈ ఆనందాన్ని అనుభవిస్తూ మనం కూడా ఎవరికైనా లోకాన్ని చూపించాలి. అలాగే శ్రవణపేయంగా మంచి మాటలు మధురోక్తులు వినాలి. అలాగే మంచి మాటలే మనం చెప్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ పద్నాలుగు లోకాలలో మన విహారం ఇది. కళ్ళు చూడకుండా ఉన్నాయి ఎప్పుడన్నా? మూసుకుని పడుకున్నప్పుడు తప్ప పడుకున్నప్పుడు మాత్రమే చెవులు వింటూనే ఉన్నాయిగా వింటూనే ఉన్నాయి పడుకున్నప్పుడు కూడా వింటూనే ఉన్నాయి వింటూనే ఉన్నాయి అది. అలాగే కరచరణాది అవయవాలు ఉన్నాయి కాళ్ళు నడుస్తూనే ఉన్నాయి ఏమీ లేకపోయినా అటూ ఇటూ నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలോ అక్కడికి తీసుకువెళ్తున్నాయి దేవాలయానికి తీసుకుపోతున్నాయి లేకపోతే ఒక మంచి దృశ్యం చూపించడానికి ఒక సెలయేరు దగ్గరికి పట్టుకెళ్తున్నాయి తీసుకు వెళ్తూ ఉన్నాయి. అలాగే ఈ చేతులు రెండు అవి చేయవలసిన పనులు రెండు చేతులా సంపాదిస్తున్నాం రెండు చేతులా ఖర్చు పెడుతున్నాం అంటే ఈ చేతులు శక్తివంతమైనవి కదా కాబట్టి ఈ లోకాలన్నీ మనలోనే ఉన్నాయి. అలాగే లోపల ఉన్నటువంటి లోకానికి మనం ఆహారం ఇవ్వాలి. ఆ లోకంలో ఉన్న అధిపతి ఎవరంటే వైశ్వానరుడు. "అహం వైశ్వానరో భుక్తా ప్రాణినాం దేహమాశ్రితః | ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం ||" భగవద్గీత. అంటే ఆ ముద్ద లోపలికి వెళ్తున్నది ఎవరు తింటున్నారు మన చెవియా? మన కాలా? మన చెవియా? మన కళ్ళు ముక్కు ఇవి తింటున్నాయా? ఏం తినట్లే. ఈ నోరు దాటి లోపలికి వెళ్ళిన తర్వాత దానికి మనకు సంబంధం లేదు. బాగుందో లేదో చెప్తున్నది నాలిక, పాచమ్యం చేయమని అంటే అరిగించేట్టుగా చూడమని దంతాలు చేస్తున్నాయి. మనం మింగుతున్నాం దాంతో మనకు సంబంధమే లేదు. అదికి అయిపోయింది కదా అక్కడికి అయిపోయింది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసా? తెలీదు. కానీ ఏం జరుగుతుంది జరగవలసింది అంతా అక్కడే జరుగుతున్నది. ఆ జరుగుతున్న ప్రయోగశాల laboratory లో తిన్న దానిని ఒక శక్తిగా మార్చి ఆ శక్తిని రక్తానికిచ్చి రక్తమంతా ప్రవహింపజేసి లోపల ఉన్నటువంటి అంగాంగములన్నీ కూడా ప్రచోదితమై మనకు ఒక శక్తిని అనుగ్రహ వర్ధానం చేస్తున్నాయి. కాబట్టి త్రిశక్తుల యొక్క మూలం కూడా ఇక్కడే ఉన్నది. ఈ పద్నాలుగు లోపా-- లోకాలు మన దేహంలో ఉన్నాయి. అందుకే ఆ త్రిశక్తులు ఏంటి గురువుగారు? అమ్మా ఆ త్రిశక్తులు ఏంటి? మూడు మూడు త్రిశక్తులు అదే అది ఇచ్ఛ, క్రియ, జ్ఞానం. జ్ఞానం ఇచ్ఛ, క్రియ, జ్ఞానం. జ్ఞానంతో క్రియ చేయాలి. క్రియ వలన ఏది ఇచ్ఛ ఏది ఇచ్ఛ కాదు నేర్చుకోవాలి అది ఒక క్రమం. మామూలు క్రమంలో ఇచ్ఛ ఒక కోరిక ఉండాలి ఏదన్నా చేయాలని అనిపించాలి దానికి చేయగలిగిన శక్తి క్రియ చేసే విధానం క్రియ అది విచక్షణతో చేయాలి అది జ్ఞానం. మూడు శక్తులు కూడితేనే ఒక పని అవుతుంది. మూడు ఉండాలి. ఇవంతా ఈ మూడు శక్తులు ఈ మూడు శక్తులు ఈ పద్నాలుగు లోకాలు ఉన్న ఈ దేహంలో ఉన్నది కాబట్టి ఇవాళ body is perishable నీటి మీద బుడగ ఎప్పుడైనా పేలిపోవచ్చు ఇది వేదాంతం. అసలు సత్యం ఏమిటంటే శరీరమే కర్మ సాధనకు సాధనం ఇది. ఇది మనకు instrument. ఇవాళ శరీరమే లేదు మనం ఎక్కడి నుంచి మాట్లాడతాం? ఏం చేయగలం? ఏమీ చేయలేం. అట్లాగే ధర్మాన్ని నేను ఆచరించాలని నాకు ఉన్నది ఎట్లా ఆచరిస్తాను? శరీరం ఉండాలి శరీరం ఉండాలి కాబట్టి శరీరాన్ని మనం ఒక ఆయుధంగా మార్చుకోవాలి ఒక పరికరంగా మార్చుకోవాలి దాన్ని పటిష్టంగా పెట్టుకోవాలి ఆరోగ్యవంతంగా పెట్టుకోవాలి. ఆయుష్ష అది మన చేతుల్లో లేదు ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కాబట్టి వీటన్నింటినీ సమన్వయించేసి చెప్పేటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపనిషత్తు మాండూక్య. మీరు ఇందాక పరా, అపసుంది, మధ్యమ, వైఖరి వాక్యం గురించి చెప్పారు అవును ఈ ప్రవచనం చెప్పే చెప్పేటప్పుడు ఉమ్ ఇవి ఏ విధంగా మనకి ఇదవుతాయి ఉపయోగిస్తాయి. ప్రవచనకారులలో మూడు విధాలు. ఒకాయన transport చేస్తాడు. అంటే ఒక గ్రంథం పెట్టుకుంటాడు ఆ గ్రంథం open చేస్తారు దాన్లో శ్లోకం చదువుతారు శ్లోకానికి అర్థం చెప్తారు అర్థం కాస్త వివరంగా చెప్తారు. ఇదిగో ఇలా ఇలా ఇదిగో ఈ పురాణంలో ఇలా ఉంది ఈ ఉపనిషత్తులో ఇలా ఉంది ఇలా చెప్పబడింది.అంటే నేను చెప్తున్నాను అనుకోడు ఆయన. ఇదివరకే చెప్పబడింది మళ్ళీ మీకు అందిస్తున్నాను. ఆయన ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. రెండో స్థాయికి చెందిన ఆయన ట్రాన్స్లేట్ చేస్తాడు. ఆ ఉన్నదానికి మెరుగులు దిద్దుతూ అనేకమైనటువంటి విషయాలు క్రోడీకరించి అవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేసి ఉన్నదానిని మామూలు మన భాషలో మనకు అర్థం అయ్యేట్లుగా చెప్పుకుంటూ వెళ్తారాయన. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? రూపాంతరం ఇక్కడ. రూపాంతరం ఇంగ్లీషులో ఉంటే తెలుగులో రాస్తే ట్రాన్స్లేషన్ అంటాం. సంస్కృతంలో ఉన్నదాన్ని ఆయన చదివి అర్థం చేసుకుని అప్పటివరకూ చెప్పినటువంటి దాన్ని ఇంకాస్త విస్తృతంగా చెప్తాడు ట్రాన్స్లేటర్. అది ఆయన రెండవ స్థాయి. మూడు, ట్రాన్స్మీటర్. మనది thirty three KV ట్రాన్స్మీటర్ ట్రాన్స్ఫార్మర్ బయట ఉంది. అదిగా? ఆ ట్రాన్స్ఫార్మర్ లో నుంచి transmit మన pocket లోకి zero watt కి అదే ఇస్తుంది. hundred watts కి అదే ఇస్తుంది. TV కి అది-- అంటే ఎన్ని విధాలుగా ఎంత wattage కావాలి voltage అన్నీ ఇచ్చేది అది. కాబట్టి ఈ గురువు ఎట్లా ఉంటాడంటే ఎక్కువ మాట్లాడడు. అవసరమైనప్పుడు తప్ప. అవసరమైనది తప్ప ఇంకోటి చెప్పడు. చూసారా, "మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం" దక్షిణామూర్తి స్తోత్రంలో. దక్షిణామూర్తి ఏం మాట్లాడడు. ఆయన ఏ శాస్త్రం చెప్పడు. ఎవరితో ఉలుకు పలుకు రెండూ ఉండవు. కానీ శిష్యుల యొక్క సందేహాలను పటాపంచలైపోతాయి. నవనమాశ్చర్య దగ్గర కూడా అంతే ఎవరొచ్చినా గాని వాళ్ళ సందేహం సందేహం తీరిపోయేది. కాబట్టి ఈ వీడు అత్యున్నతమైనటువంటి గురువు. ఇందులో ఈ ముగ్గురిలో ప్రవచనం చేసిన వాడు ఎవరైనా ఉన్నారా? లేరు. వచనం చేశారు. అంతేనా? పుస్తకంలో ఉన్నది చెప్పినవాడు వచనం చెప్తున్నాడు. అవును. translation మామూలుగా poetic గా చెప్తున్నాడు. రెండో ఆయన దాన్ని వ్యాఖ్యానం చేసి చెప్తున్నాడు. అయింది వచనమే. transmit చేసేవాడు అసలు ఏమీ చేయటంలే. ఊరికే అలా కూర్చుంటున్నాడు. మనకి సందేహాలు పోతున్నాయి. మరి ఈ ప్రవచనం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఉపన్యాసాలు పోయినాయి, దివ్యోపన్యాసాలు పోయినాయి. అయినా దివ్యోపన్యాసం అంటే కాస్త ఒక స్థాయికి చెందిన ఆయన చెప్తే దివ్యోపన్యాసం అన్నాం. ఊ? ఆయన్ని పరమాత్మగా భావించాం అటువంటి వాళ్ళని. ఆ అభిభాషణం అన్నాం. ఇవన్నీ పెట్టాం. మరి ఈ ప్రవచన అనేటువంటిది ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? దీని వల్ల ఏమిటి లాభం? దీని వల్ల ఎవరికి లాభం? రెండు. ఇవాళ ప్రపంచంలో ప్రవచనాలే ఉన్నాయి. కదా అవును ప్రవచనాలు ప్రవాహవేగంతో వెళ్ళిపోతున్నాయి. ప్రవాహం. ఇప్పుడన్నీ చోట్ల ప్రవచనాలు జరుగుతున్నాయి. ప్రవచనాలు. అసలు ఈ ప్రవచనం అనేదానికి అర్థం ఏంటి అంటే ఏ వచనము, ఏ మాట, ఏ సూక్తి, ఏ సూక్తము, ఏ వేదము, ఏ ఉపనిషత్తు తాను అనుభవించాడో దానికి దగ్గరగా ప్రాంతమైన దానికి 'ప్ర' అంటే అది. 'ప్ర' అంటే రెండర్థాలున్నాయి. 'ప్ర' అంటే పాపసంహారం అన్నది వేదాంత భాష. ఇక్కడ 'ప్ర' వచనం అంటే అత్యంత ప్రముఖమైన నిర్దుష్టమైనటువంటి వచనం. ప్రవాహం మాత్రం కాదు. ప్రవాహం వచనం కాదు. అందుకోలేము. మీరు జలపాతం కొద్ది దూరం పారిన తర్వాత చెంబుతో నీళ్ళు తీసుకోగలరు. అది మహా జలపాతం కింద చేతులు పెట్టండి దోసిళ్ళలో పడగానే ఎగిరి బయట పడిపోతాయి. ఎగిరిపోతాయి. ఇది కూడా అంతే. ప్రవచనం కూడా అంతే. కాబట్టి ఈ, ఈ ప్రవచనం ఎవరికి లాభం అంటే చెప్పేవాడికి నెమరు వేసుకుంటున్నాడు. తానంతవరకు ఏం చదువుకున్నాడో దానిని నలుగురి మధ్యలో కూర్చొని తను నెమరువేసుకుంటూ ఉన్నాడు. అది ఆయనకు ఆనందం కలిగిస్తుంది. ఆయనకు అంతవరకు లాభం. మరి దీనివల్ల మోక్షాలు, ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం లభిస్తుందా అంటే లభించదు. ఎప్పుడు లభిస్తుంది అంటే ఎవరైతే నేను నిజమైన ప్రవచనకారుడిని అని అనుకున్నాడో ఆ ప్రవచనం చెప్తున్నట్లుగా తాను జీవించగలిగితే అట్ అదే మోక్షం. అదే ఆత్మజ్ఞానం. అంటే నేను కాదు ఈ మాట్లాడుతున్నది. ఎవడో, ఇంకెవరో నాతో మాట్లాడిస్తున్నారు. ఆయనెవరో నాకు తెలియదు. ఇలా మాట్లాడే శక్తిని ఎవరో ఇచ్చారు. ఆయనెవరో నాకు తెలియదు. ఇదంతా నా మహర్షులు వాళ్ళందరూ చెప్పినవే. నేను కొత్తగా ఒక్క అక్షరం కనిపెట్టలా. వాళ్ళు చెప్పినవే మళ్ళీ పునః పునః చెప్పుకుంటూ నేను ఆనందం పొందుతున్నాను అనే భావనతో చెప్తే దానికి ప్రవచనం అని పేరు పెట్టాలి. ప్రవచనంలో ప్రబోధం ఉంది. బోధ ఉంది. అది తక్కువది కాదు. నాయనా ఇదిట్లా, ఇదిట్లా, ఇదిట్లా. తెలియక కావలసిన వాడికి అది అక్కరకు వస్తుంది. ప్రచారం తెలుసుకోవాలనుకున్న వాడికి అక్కరకు వస్తుంది. అక్కరకు వస్తుంది. ప్రచారం ఉంది దాంట్లో. ఒక సనాతనమైన, వైదికమైన ఒక ధర్మాన్ని ప్రచారం చేయటం అంటే నలుగురికి చెప్పటం. నలుగురికి తెలియజెప్పటం. ప్రబోధమైంది, ప్రచారమైంది, మూడోది ఇందాక transmission అన్నామే అది జరగాలి ఎక్కువ. అంటే అది ప్రసారము కావాలి. ప్రబోధము వేరు, ప్రచారము వేరు, ప్రసారము వేరు. ప్రసారం ఎప్పుడవుతుందంటే, నీవు పుంజీభూతమైనటువంటి మూర్తీభవించినటువంటి జ్ఞాన స్వరూపాన్ని గనక అయితే, పురాణాకృతి గనక నీవు తాల్చి ఉన్నట్లయితే, నీ మనస్సు స్థిమితమై, సంస్థితమై ఏ ప్రలోభానికి లోను కాకుండా, నీవు ఏ జగత్తులో, ఈ ప్రపంచంలో, ఈ భాషని, ఈ భావాన్ని ఇవ్వాలని నిర్ణయించుకొని కూర్చున్నావో అప్పుడు నీకు ఆత్మజ్ఞానం వైపు మార్గం చూపిస్తుంది. కానీ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు. స్ఫూర్తి కలిగిస్తుంది. ఇవన్నీ నిజమే కానీ నేనెవర్ అనే ప్రశ్న అక్కడ ఉండనే ఉంది. ఆ నేనెవర్ అన్నది పరిశోధ చేయటానికి, దాన్ని follow చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళటానికి ఈ ప్రవచనం మనకు లాభం కలిగిస్తుంది. ప్రవచనం అవసరం. కానీ ఎలా చెప్పాలి? సత్యం చెప్పాలి. ధర్మం చెప్పాలి. దానిలో మన మహర్షులు, వాళ్ళు కవులు గారు, వాళ్ళు పండితులు గారు చమత్కారం చెప్పేవారు కాదు. ఒక ఘనీభవించినటువంటి ఒక జ్ఞానాన్ని మనకు ముద్దగా చేసి విజ్ఞాన స్వరూపంగా అందించారు. దాని పట్ల ఒక గౌరవాన్ని ప్రదర్శిస్తూ మన ప్రవచనం సాగించాలి. అది మళ్ళీ సమకాలీన సమాజానికి అందుబాటులో ఉండాలి. సమన్వయమై ఉండాలి. రామాయణ కాలంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ ఈవేళ నువ్వు పాటించకపోతే, నీ తల వెయ్యి వక్కలైపోతుందంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే మనకి నిజాం నవాబు దగ్గర నాణేలున్నాయి. ఆ? ఓ బస్తా ఉన్నాయి మా ఇంట్లో అనుకుందాం. అది తీసుకెళ్ళి కిందకి వెళితే పప్పు చెక్క అమ్మేవాడు కూడా ఏమంటాడంటే, "ఇది చెల్లదని మీకు తెలియదా సార్? నాకెందుకు ఇస్తున్నారు?" అంటాడు. ఎందుకు? ఒకప్పుడు నవంబర్ ఎయిత్ లో మన దగ్గరున్న వెయ్యి రూపాయల నోటు పనిచేయదంటే పోయింది కదా. ఇప్పుడు రెండు వేలు పోయిందిగా. అంటే మన కళ్ళ ముందే రూపం మారిపోతున్నది. కాబట్టి విలువ మారిపోతుంది. విలువలను నిలబెడుతూ సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడుతూ, ఆ లోపల చెప్పినటువంటి, ఇంతకు ముందే చెప్పినటువంటి విషయాలని లోనారసి అంటారు. లోతుగా చూసి, లోపలికి చూసి, దర్శించి, అనుభవించి, అనుభూతి చెంది, విభూతి స్థాయికి గనక నువ్వు వెళ్లగలిగి చెప్పగలిగితే అది అచ్చమైనటువంటి ప్రవచన ధార. లేకపోతే మనకి హరికథలు లేవా? ఇదివరకు ఉన్నాయి కదా. ఉన్నాయి. హరికథ బుర్రకథలు లేవా? కళా స్వరూపాలేగా. ఇవన్నీ వాళ్ళు చెప్పేవాళ్ళు కదా. రామాయణ ప్రవచనాలు దేవాలయాల్లో చెప్పేవారు. దేవాలయాలలో మాత్రమే చెప్పేవాళ్ళు. గ్రామగ్రామం వచ్చి అక్కడ కూర్చునేది రాత్రిపూట తొమ్మిది గంటలకి. ఆ 12:00, 1:00 దాకా. కాబట్టి ప్రవచనం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే చెప్పేవాణ్ణి బట్టి ఉంటుంది, స్వీకరించే వాణ్ణి బట్టి కూడా ఉంటుంది. ఆ పరిస్థితుల్ని బట్టి కూడా ఉంటుంది. పరిస్థితుల్ని. ఆ ప్రభావం అంతవరకు ఉంటుంది. అంతే. గురువుగారు చాలా విపులీకరించి చాలా బాగా ఈ ముండకోపనిషత్తు గురించి చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. శుభం. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. చూశారు కదా ముండకోపనిషత్తు. సన్యాసం అంటే ఏంటి? పద్నాలుగు లోకాలు మనలోనే ఉన్నాయి. ఆ పద్నాలుగు లోకాల్లోనే మనం పరావిద్యలు అనుసరించి సన్యాసం అంటే సం-న్యాసం. స్వీకరించి ఎప్పుడైతే పరావిద్యను అవలిస్తామో మనం ఆ బ్రహ్మవిద్యను, ఆ పరావిద్య ద్వారా ఆ ఆత్మను చేర్చుకుందాం అని తెలుస్తోంది. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.
YouTube · audio
Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 134
Manthramahima | Y.Swarna Latha Reddy garu | EP 134
Source: SVBC TTD on YouTube
0:00 / 24:40
More in this series