Skip to content
Transcript తెలుగు
పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం జగదానంద కారకుడైన శ్రీరామచంద్రుడు జగత్తుకు ధర్మ స్వరూపమై వచ్చాడు. ధర్మ శాస్త్రాలలో, పురాణాలలో, వేదాలలో ఒక సాహిత్య వ్యాసంగంగానో ఒక భావనా పరిధిగానో ఉన్నట్లయితే ఒక తలపుగా ధర్మం అప్పటి వరకు అనుకోబడితే అంటే అందరూ అనుకుంటూ ఉంటే ధర్మం అంటే ఇట్లా ఉంటుంది. ధర్మాన్ని ఆచరించగలిగిన శక్తి కేవలం మానవుడికి మాత్రమే ఉన్నది. అసలు ధర్మాన్ని ఆచరించటానికే మానవ జన్మ ఇవ్వబడింది అని చెప్పటానికి వచ్చినటువంటి ఒక పూర్ణ పురుషుడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై యొక్క అవతారాలలో ఇది ఒక అద్భుతమైన అవతారం. అందునా ప్రధానమైనటువంటి దశావతారాలలో రామచంద్రుడిది ఏడవ అవతారం. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం అది ఏడవ నక్షత్రం. ఎన్ని రకాలుగా చూసినా శ్రీరామచంద్రుడు మానవుడిగా జీవించటానికి వచ్చాడు. మానవుడిగా ఒక మహత్తర సందేశాన్ని తన జీవన విధానం ద్వారా, ధర్మాచరణ ద్వారా కలిగేటువంటి లాభాలు ఏమున్నాయి, ప్రయోజనాలు ఏమున్నాయి, అది కడగా ఎటువైపు దారి తీస్తుంది అని చెప్పటానికి అరవైనాలుగవ రాజుగా తొంభై తొమ్మిది మంది ఇక్ష్వాకు రాజులలో రామచంద్రుడు అరవైనాలుగవ వాడు. అంటే రాముడి కంటే ముందు అరవై మూడు మంది ఇక్ష్వాకు రాజులు ఉన్నారు. రాముడు తర్వాత ముప్పై ఐదు మంది పాలించారు. తొంభై తొమ్మిది మంది ఉన్నా దైవంగా పరదైవతంగా భావించబడినటువంటి పురాణ పురుషోత్తముడు ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి. తాటక సంహారంతో తామస సంహారం చేసుకొని అహల్యా శాప విమోచనంతో రాజసాన్ని వదిలిపెట్టి సీతా కల్యాణంతో తనను పరిపూర్ణ మానవుడిగా ఆవిష్కరించుకొని పరుశురాముడి నుంచి విష్ణు ధనుస్సును అంటే విష్ణు శక్తిని కూడా పొంది శివ ధనుస్సును విరవటంలో శివుడి యొక్క శక్తిని రుద్ర శక్తిని కూడా తన యందు నింపుకొని కాంతార వాసం ద్వారా అంటే అరణ్య ప్రయాణం ద్వారా ఎన్నెన్ని అనుకూ-- అననుకూలాలు ఏర్పడ్డప్పటికీ కూడా విధి ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తాను అన్నటువంటి రామచంద్రుడు విధిని ఎదు-- ఎదురించలేదు విధిని దాటలేదు విధికి లోబడి జీవితాన్ని గడిపాడు ఆయన. కనుకనే రామచంద్రుడి కథ ఎవరో ఒక రఘురాజు కథ కాదు మన కథ అది. మనక్కూడా జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, అననుకూలాలు, అవమానాలు ఎన్నో ఏర్పడతాయి. మన శక్తులన్నీ ఒక్కొక్కసారి ఎందుకు వినియోగపడటం కూడా-- అయిపోతాయి. వీటన్నింటినీ అధిగమించి ధర్మాన్ని ఆశ్రయించినట్లయితే నీకు జయం సిద్ధిస్తుంది. మానవ జన్మ ఎత్తింది ఎందుకు అంటే వేదోద్ధరణ, ధర్మ పరిపోషణ, దీనజనోద్ధరణ చేయటం కోసమే అని చెప్పటానికి వచ్చినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క జన్మ నక్షత్రము, జన్మదినము, కళ్యాణ దినము, పట్టాభిషేకము ఏకకాలంలో అభిజిత్ లగ్నంలో చేసేటువంటి మహత్పూర్ణమైనటువంటి పర్వదినాలలో శ్రీరామ నవమి ఒకటి. అంటే నవమి నాడు రాముడు జన్మ ఎత్తినప్పుడు, కళ్యాణం చేసుకున్నది అప్పుడు, పట్టాభిషేకం కూడా అప్పుడే. పట్టాభిషేకం ఏది అంటే సుమారు పదకొండు వేల సంవత్సరాల ధర్మబద్ధమైనటువంటి రామరాజ్య సంస్థాపనకి నాంది పలికినటువంటి రోజు. అలాగే సీతా కల్యాణంతో మానవుడి జీవితం ఒక వివాహ బంధంలో వైవాహిక సంస్కృతిలో అది పరిపూర్ణతను సిద్ధించుకుంటుంది అని చెప్పటానికి శ్రీరామనవమి మళ్ళీ జగత్తులో "ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అన్నట్లుగా అదిగో శ్రీ మహావిష్ణువే రామచంద్రుడై సామవేదమే రాముడై "శ్రీరామో లలితాంబికే" అని శంకర భగవత్పాదుల చేత సంభావింపబడినటువంటి లలితా శక్తియే రామ రూపమయ్య ప్రపంచంలోకి వచ్చి "రమయతీతి రామః" రమణీయమైనటువంటి రూపంతో, రమణీయ భావంతో, రమణీయ తత్వంతో, రమణీయ శక్తితో, రమణీయమైనటువంటి ఉదాత్తమైనటువంటి త్యాగ భూమికలో నెలకొంది చెందినటువంటి శ్రీరాముడి యొక్క విజయ గాథని ఆ-ఆ జీవితమే పర్యంతము సాగినటువంటి ధర్మ ప్రవాహాన్ని ఒడిసి పట్టుకునేటువంటిదే ఇవ్వాళ మనకు పానక రూపంలో వస్తున్నది. వడగట్టినటువంటి రామానుభవమే మనకు వడపప్పు అయి చేతికి వస్తున్నది. వీటన్నింటినీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి సామాగ్రిగా మనం భావన చేసి జీవితమంతా కూడా రామనామ తారక మంత్రాన్ని చక్కగా మనం ఉపాసన చేస్తూ పాప, తాప, శాప రామ శబ్దం రకారము, అకారము, మకారము రకారము రవిబీజం, అకారము అగ్ని బీజం, మకారము చంద్రబీజం. పాప, శాప, తాపాలు మూడు నశించిపోయేట్లుగా రామ నామాన్ని మనం స్మరిస్తూ ఉన్నట్లయితే "శ్రీరామ రామ రామేతి" మనకు తెలుసు కదా. మూడు సార్లు రామా రామా రామా అంటే అది సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అటువంటి శ్రీరామనవమి మనందరి యందు కూడా ఆనందారామమై, శాంతిధామమై, ప్రశాంతి నిలయమై, సర్వ ప్రకృతి, సర్వ ప్రపంచము కూడా రామాంచితమై భాసించు గాక అని మంగళాశాసనం చేస్తూ శ్రీరామచంద్ర పద పద్మాధీన చేతస్కమైనటువంటి మనసుతో శ్రీరామచంద్రుడికి శ్రీరామచంద్రుడు సీతాదేవితో, సీతాదేవి రాముడితో, ఇద్దరితో హనుమతో, ఇద్దరితో భక్తులతో కూడినటువంటి ఒక సమగ్రమైనటువంటి పూర్ణత్వానికి మరొక్కసారి ప్రణమిల్లుతూ శ్రీరామనవమికి సాధారణంగా మనం ఆహ్వానం పలుకుదాం. స్వస్తి.
YouTube · audio

Sri Rama Navami Special | Sreepeetam | 20108 | Happy Srirama navami

Home

Sri Rama Navami Special | Sreepeetam | 20108 | Happy Srirama navami

Source: Sreepeetam on YouTube

0:00 / 6:14