No transcript for this section.
Transcript begins at 0:00.
హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దైవాంశ సంభూతులు శ్రీ శ్రీ శ్రీ పరమాచార్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కంచి కామకోటి పీఠాధిపతిగా కాక మహా యోగి, మహర్షి, యతీశ్వరులు, నడిచే దైవంగా కూడా వీరు ఎంతో సుప్రసిద్ధులు. మరి మహిమల కాసారమైన వీరి జీవితం గురించి మనకి ఇవాళ్టి కార్యక్రమంలో ఎన్నో విశేషాలను తెలియజేయడానికి మరి మనతో పాటు ఉన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎంతో సుపరిచితులు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.ఎస్.ఆర్. మూర్తి గారు. వారితో మాట్లాడి చక్కని విషయాలను మనం తెలుసుకుందాము. నమస్కారమండి. అలాగే స్వామివారు తమిళనాడు విల్లుపురంలో పుట్టిన తెలుగు నేల అంటే ప్రత్యేకమైన ఇష్టమని విన్నాము అది నిజమే నండి? ముందుగా గురు వందనం చేయాలి. ఒక మహాత్ముడు ఒక పరమాచార్యుని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు "వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనశయే జంగలికాయమానే సంసార హాలాహల మోహర్షాన్యే" అది ముందు గురు వందనం. ఈ గురువులలో గురునాం గురువు అయినటువంటి శంకర భగవత్పాదుల గురించి చెప్పినప్పుడు ఆచార్య పరంపరలో వారిని ఎలా స్తుతిస్తాం అంటే "శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం" అని శంకర భగవత్పాదుల దివ్య మహా స్మృతికి మరొక్కసారి మనం ప్రాంజలి ఘటిస్తూ దైవాంశ సంభూతులైనటువంటి పరమాచార్య విల్లుపురంలో పుట్టిన తెలుగు నేల అన్నా తెలుగు భాష అన్నా ఇష్టమా అని అడుగుతుంటంలోనే వారిని ప్రాంతీయతకు పరిమితం చేస్తున్నాం అలా చేయకూడదు. ఓకే ఎందుకంటే ఒక విశ్వ గురువుగా సమస్త సృష్టికి గురువుగా ఉండి శంకర భగవత్పాదుల తర్వాత నిజానికి ఒక వైదికమైన భారతీయమైన ఆర్షమైనటువంటి ఒక సనాతన ధర్మాన్ని ఆసేతు సీతాచలము ఖాళీ నడకన ప్రయాణించి మళ్ళీ ధర్మోద్ధరణ చేసినటువంటి ఆ ధర్మమూర్తి ఎవరు అంటే కంచి మహాస్వామి వారు. ఓకే ఈ కంచి మహాస్వామి వారు శంకర పరంపరలో వచ్చినటువంటి అరవై ఎనిమిదవ పీఠాధిపతి కంచి పీఠానికి. అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఓకే వారు నిజానికి హోయసల అంటే కర్ణాటక దేశానికి సంబంధించి ఉన్నటువంటి బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వచ్చినటువంటి ఒక అవతార స్ఫూర్తి అది. వచ్చినటువంటి వారు ఏం చేశారు అంటే తెలుగు నేల ఇష్టమేనా అంటే తెలుగు నేల నాటి తెలుగు నేల ఒక ఆర్ష ధర్మానికి ఒక భారతీయమైనటువంటి ఒక సంస్కృతికి సంస్కారానికి మూల మట్టంగా ఉండేది అంటే ఇప్పుడు లేదు అని అర్థం అంతే కదా అవును కాబట్టి అప్పటికి బాగా ఉన్నదాన్ని ఇంకా బాగా చేయడానికి వచ్చినటువంటి వారు పరమాచార్య అంటే ఆచార్య అంటేనే ఆచరించి చూపించిన వాడు ఆచార్యుడు మిగతా వాళ్ళంతా బోధకులు ఓకే కాబట్టి ఇందులో పరమాచార్య ఇక వారిని మించినటువంటి ఆచార్య స్థానంలో ఎవరిని ఊహించలేదు ఈ జాతి గనుక వారిని మహాస్వామి అని మహా పెరియవా అని అలాగే ఆ నడిచే దేవుడని అనేక రకాలుగా వారిని ఈ జాతి గుర్తించి అనుభవించి గౌరవించి ఆరాధించి ఆనందతాండవం చేసింది ఈ జాతి. వీరు మరో ఆది శంకరులని కూడా ఆ విశ్వాసం కదా గురువు గారు. శంకర పీఠాలు ఆమ్రాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేటువంటి పీఠాధిపతులు అందరూ కూడా ఆ శంకర వాంగ్మయాన్ని శంకర భావనని శంకర ఆదర్శాన్ని శంకరుల బోధని ప్రబోధాన్ని ఆ ప్రసారాన్ని వీటన్నింటినీ కూడా ఒక అనూచానంగా సాంప్రదాయకంగా వచ్చినటువంటి దానిని మళ్ళీ సమాజహితం చేయడానికి వచ్చారు కాబట్టి ఆచార్య పీఠంలో ఉన్నటువంటి వారందరినీ శంకర స్వరూపంగానే భావన చేస్తాం. ఇక్కడ శంకర అంటే కేవలం ఆదిశంకర అనే కాదు శంకర అంటే మన మనం అనుకునే పురాణగతమైన శంకరుడు మహేశ్వరుడు ఇట్లా కాకుండా శంకర శబ్దానికి ముప్పై రెండు aspects ఉన్నాయి కోణాలు. ఈ కోణాలకి మూలం ఒకటి ఉన్నది. ఆ మూలం ఏంటంటే సదాశివుడు అని అంటే ఎప్పటికీ ఉండే మంగళాత్మకమైన ఒక భావ స్వరూపం ఏది అంటే అది సదాశివ స్వరూపం కాబట్టి "సదాశివోక్తాని సపాదలక్షలయవధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం" అంటారు శంకర భగవత్పాదులు. అయితే శంకర భగవత్పాదులు ఈ జాతిని మళ్ళీ ఉద్ధరించి ధర్మోద్ధరణ చేసి సనాతనమైనటువంటి ధర్మానికి ఒక పునఃప్రతిష్ఠ చేసి వైదికమైనటువంటి సదాచారాల్ని, సమ్యక్ సంకీర్తనని, సదాలోచనని అన్నింటినీ కూడా ప్రపంచానికి అందించిన మహనీయ మూర్తి గనుక వారిని ఆ కాలంలో ఏమన్నారంటే "శంభోర్ Murti హి చరతి భువనే శంకరాచార్య రూపా" అంటే శంభు అంటే శివుడు ఒక రూపం తీసుకుని గనుక ఈ లోకానికి వచ్చినట్లయితే ఆయన శంకరాచార్య రూపంలో ఉంటారు అని. కనుక ఆంనాయపీఠాలలో ఉన్నటువంటి సర్వోత్తములైనటువంటి ఈ ఆచార్యులందరూ కూడా శంకర అంశాలుగా వచ్చారు. ఇక్కడ ఒక చిన్న తేడా ఏమిటంటే శంకర భగవత్పాదులు ప్రతిష్టించినటువంటి స్థాపించినటువంటి ఒక మోక్షపురిగా పిలవబడేటువంటి ఈ కంచి అంతకు ముందు నిజానికి శక్తి పీఠం శక్తి పీఠాన్ని వారు అద్వైత పీఠం చేశారు. అంటే శక్తి పీఠం అంటే ఒక aspect దగ్గర ఆగిపోతుంది కామాక్షి దేవి, త్రిపురసుందరి దేవి వీళ్ళంతా మూలం కానీ వారు ఏం చేశారంటే దీన్నుంచి బయటపడేసి విస్తృతమైనటువంటి అద్వైత భావనా భూమికలో దీన్ని నిలబెట్టి కాలినడకన శంకరుల తర్వాత కాలినడకన ఆసేతు సీతాచలము పర్యటించి సంప్రదాయాన్ని కాపాడుతూజనులకి సంప్రదాయాన్ని గురించి చెప్తూ లోకవిద్యలో బ్రహ్మవిద్యని ఎలా సమన్వయం చేయాలని చెప్తూ సుమారుగా ఎనభై ఏడు సంవత్సరాలు ఆచార్య పీఠం మీద నిలబడినటువంటి ఒక సర్వోత్తములైనటువంటి వారు గనుక ఆదిశంకర స్వరూపమా అంటే ఆదిశంకరుల యొక్క భావనా స్వరూపము ఆలోచనా స్ఫూర్తి సాంప్రదాయకమైనటువంటి వైదికమైనటువంటి తపస్సుకి ఒక సహకారం ఏదైనా ఉంటే వారు కంచి మహాస్వామి వారు పరమాచార్య అలాగే కంచి కామాక్షి క్షేత్రం అన్నా అలాగే శ్రీశైల క్షేత్రం అన్నా కూడా వీరికి అమితమైన ఇష్టమా అండి వారికి చాలా ఇష్టాలు మనం ఆపాదిస్తున్నాం వారికి ఇష్టాలు అయిష్టాలు రెండు ఉండవ్ అద్వైతంలో ఇష్టం ఏమిటి అయిష్టం ఏమిటి అసలు కానిదేమిటి ఉన్నదంతా బ్రహ్మమే అని చెప్పినటువంటి ఒక వేద సారాన్ని సాక్షీభూతంగా కాక తాను స్వయంగా ఆచరించి అనుభవించి అనుభూతి చెంది మళ్ళీ జగత్తుకు విభూతి స్థాయిలో అందించినటువంటి వారు గనుక వారు శ్రీశైల క్షేత్రం అన్నా మరొక శైవ క్షేత్రమైన విష్ణు క్షేత్రమైన వీటన్నింటినీ ఒక అద్వైత భావనా భూమికలో నెలకొలి చెందించిన సమన్వయం చేసినటువంటి అద్వైత స్ఫూర్తి పరమాచార్య అది వేదాలు ఉపనిషత్తులు గురించి స్వామి వారి యొక్క అభిప్రాయం ఏమిటండి? వేదోఖిలో ధర్మమూలం అని ఒక మాట ఉందమ్మా ఏ ధర్మాన్ని గురించి ఇవాళ మనం మాట్లాడుతున్నామో ఆ ధర్మాలన్నీ కూడా వేదాలలో ఉన్నాయి నాలుగు వేదాలుగా మనం చెప్పుకున్నా దానికి త్రయి విద్య అని పేరు సామవేదం అంతా కూడా పాట గానం ఋగ్వేదం అంతా మాట ఋక్ అంటే మాట యజుర్వేదం అంతా కర్మకాండ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కాబట్టి ఆట మాట పాట తెలుగులో ఈ మూడు దాటిన తర్వాత మిగిలిపోయినాయి కొన్ని మంత్రాలు ఇవి ఏం చేయాలి అని ఒక అథర్వణ మహర్షి వచ్చి వేదవ్యాసుల వారిని అడిగితే వీటిని మీ పేరు మీద వేదంగానే ప్రజల్లోకి తీసుకువెళ్ళండి దానిలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు అది అధర్వణ వేదము అయింది కాబట్టి పరమాచార్య ఏం చేశారంటే వేద గానాన్ని సామ గానాన్ని వేద వాదాన్ని దాన్ని ఒకవైపున చెప్పారు వేదాలు చదివి అర్థం చేసుకోలేని వాళ్ళు డీకోడ్ చేసుకోలేని వాళ్ళ కోసం వేదాలు ఎలా చదవాలి ఎవరు చదవాలి ఎప్పుడు చదవాలి ఎట్లా చదవాలి ఎందుకు చదవాలి చదివితే ఏమవుతుందని ప్రబోధాత్మకంగా ఆ వేదాల ప్రస్తావన వారు చేశారు అయిన తర్వాత ఈ ఉపనిషత్తులకు వచ్చేప్పటికీ ఉపనిషత్ అనంగానే అది ఏదో మనకు అర్థం కానిదని మనం అందుకోలేనిదని మనం భయపడకుండా ఏమీ లేదు ఉప అంటే దగ్గరగా నిషత్ అంటే కూర్చొని గురువుగారికి దగ్గరగా కూర్చొని సందేహాలకు సమాధానాలు పొందుతూ లేదా నీకు లేనటువంటి విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞాన యదార్థ జ్ఞానాలు అన్నీ గ్రహించి దానిని లోకజ్ఞానంతో గనక సమన్వయం చేసుకుంటే జీవితాలు చాలా అద్భుతమైనటువంటి ప్రవాహంగా సాగిపోతాయి అని చెప్తూ ఉపనిషత్ వాక్యాలని శంకర భగవత్పాదులు ఏదైతే చెప్పారో దశోపనిషత్తులు అంటే కేన కఠా కేన ఇట్లా పది నూట ఎనిమిది ఉపనిషత్తులను శంకర భగవత్పాదులు ఈ లోకంలోకి తీసుకొచ్చి దశశ్లోకి అంటే దశ శ్లోకాలుగా దశ ఉపనిషత్తులను చేశారు ఈ దశ ఉపనిషత్తులని వీరు లోకానికి మరింత చేరువగా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు తెలుగువారంటే ఇష్టం తెలుగు ఈ తెలుగు నాటికి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడారు కన్నడ దేశానికి వెళ్ళినప్పుడు కన్నడ భాషలో చెప్పారు ఉత్తర దేశానికి వెళ్ళినప్పుడు చక్కని హిందీలో మాట్లాడారు ఏది యూపీ వారణాసి ప్రాంతంలో ఉన్న హిందీ పర్ఫెక్ట్ హిందీ కాబట్టి అది అద్భుతంగా వాళ్ళు ఆవిష్కరించి వారి దగ్గరికి జపాన్ నుంచి వచ్చారు జపాన్ లో ఒకరోజు అర్ధరాత్రి పూట స్వామివారు వారికి ఇంటర్వ్యూ ఇస్తే ఆ జపాన్ లో ఉన్నటువంటి ఒక పండితుడు స్వామివారు ఇద్దరూ కూర్చున్నారు ఒక వెన్నెల రాత్రి వీరు పీఠం మీద కూర్చున్నారు వారు ఎదురుగా కూర్చున్నారు వచ్చినవారు మా దగ్గర ఒక ఇరవై రెండు సెంటర్స్ ఉన్నాయి సంస్కృత సెంటర్స్ అని అంటే కాదు కాదు డెబ్బై రెండు ఉన్నాయన్నారు ఈ ఇరవై రెండు అనే చెప్పిన ఆయన జపాన్ నుంచి వచ్చారు అప్పుడు అతను ఆశ్చర్యపోయి ఆయన ఏమడిగారంటే మీరు జపాన్ ఎప్పుడూ రాలేదు కదా డెబ్బై రెండు ఉన్నాయని ఎలా చెప్పగలుగుతున్నారని ఆశ్చర్యంతో అడిగాడు మనస్సు పరిశుభ్రమైనటువంటి ఒక తెల్లని వస్త్రంలా ఉన్నప్పుడు ఏ రంగులు దానిమీద పడనప్పుడు ఏ రకమైన వాసనలు అంటుకోనప్పుడు ప్రపంచం మొత్తం తెరమీద బొమ్మ వలే కనిపిస్తుంది కనుక మీ దగ్గర డెబ్బై రెండు ఉన్నాయి మేము గర్విస్తున్నాం ఆనందిస్తున్నాం మీరు వాటిని పోషించండి అని సంస్కృత భాషకి జపాన్ వాళ్ళు ఎటువంటి పెద్ద పీట వేశారో చెప్తూ భారతీయులు సంస్కృత భాషని ఎలా పోగొట్టుకున్నారో దానికి విచారం కూడా వెలిబుచ్చుతూ ఒక సూచన ఒక హెచ్చరిక ఏకకాలంలో చేశారు కాబట్టి వారికి అది భాషాతీతమైనటువంటిది తే పదం వేద విద్యా విరోహు భాషా దేశ సముద్భవ అని అమ్మవారిని అంటాం అంటే భాషా దేశము ప్రాంతము వ్యక్తులు స్త్రీలు పురుషులు బాలురు వృద్ధులు జ్ఞానులు ప్రాజ్ఞులు అజ్ఞానులు ఇవేమీ ఉండవమ్మ ఆ ఎదురుగా ఉన్నటువంటి వాడిని ఆత్మ స్వరూపంగా పరమాచార్య దర్శనం చేస్తారు చేసి వారి వారి స్థాయిని బట్టి ఉపదేశం ఇస్తారు కాబట్టి ఆ ఉపదేశము నెమ్మదిగా ప్రపంచానికి సందేశం అవుతుంది ఉపదేశం వ్యక్తికిస్తారు సందేశం జాతికిస్తారు ఆదేశం సృష్టికిస్తారు కాబట్టి ఉపదేశ సందేశ ఆదేశాల యొక్క మీకు బాగా సుపరిచితులు ఆయనతో మీకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి మాకు తెలియజేయండి పందొమ్మిది వందల అరవై ఆరు నేను ప్రీ యూనివర్సిటీ చదువుతున్నప్పుడు ఏలూరులో వారు చాతుర్మాస్య దీక్ష చేపట్టారువారిని చూద్దామని వెళ్ళాను. అప్పటికి నాకు పదహారేళ్ళు. ఉమ్ Correct గా పదహారవ ఏట వారిని మొదటి రోజు దర్శనం చేసుకున్నా. అంటే ఎవరి ద్వారా అన్న తెలుసుకొని వెళ్ళారా అండి? లేదు నాటు మీద ఏదో ఊళ్ళోకి పెద్దవారు వచ్చారంటే ఇక ఒక తోటలో, పూ తోటలో ఒక పువ్వు ఇలా వికసించగానే ఉమ్ పరిమళం ఎవరికి చెప్పక్కర్లా. పరిమళం అవునవును నాది వచ్చింది. college అయిపోయిన తర్వాత ఉమ్ నేనున్న room కి వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని స్వామి వారి దగ్గరికి వెళ్ళా. ఉమ్ చాలా మంది ఉన్నారు స్వామి వారు వచ్చారంటే పది, పదిహేను వేల మంది ఉండేవారు. ఉమ్ అందులో నేను అతి చిన్నవాడిని. ఉమ్ వారు నన్ను పిలిచారు. ఉమ్ పిలిచినప్పుడు నేను స్వామి వారి దగ్గరికి వినయంగా వెళ్ళాను. ఉమ్ పిలిచి వారు ఏమన్నారంటే, నన్ను నువ్వు అనలేదు మీరు అన్నారు. ఉమ్ మీరు college అయిపోయిన తర్వాత ఉమ్ మీరున్న ప్రదేశానికి వెళ్లి స్నానం చేసి ఉమ్ బట్టలు మార్చుకొని ఉమ్ మేము ఉన్నంత కాలము ప్రతి సాయంకాలము మా దగ్గరికి రండి అన్నారు. ఎందుకు పిలిచారు నన్ను? ఉమ్ ప్రతిరోజూ ఆ చాతుర్మాస్యం అంటే నాలుగు నెలలు ఉమ్ నేను వెళ్ళగలనా? ఉమ్ ఏది, ఏ అవాంతరమైనా రావచ్చు కదా? అవును సరే అవన్నీ పెద్ద ఆలోచనలు లేవు. ఉమ్ పిలిచారు వెళ్లాలనుకున్నాను వెళ్ళాను. ఆనందం కలిగింది. ఉమ్ ఓహో నన్ను పిలిచారు కదా అని. అప్పుడు స్వామివారు ఒక సూచన అక్కడ నిర్వాహకులకు ఏం చెప్పారంటే, ఆ అంటే నాకు, ఆ అబ్బాయి వచ్చినప్పుడు అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక place ఉంచండి ఉమ్ అన్నారు. ఉమ్ కాబట్టి నన్ను ఎప్పుడైతే స్వామి వారి ఆజ్ఞ ఉన్నదో నిర్వాహకులు నేను అలా వెళుతూ ఉండగానే వెళ్లి నన్ను అక్కడ కూర్చోబెట్టేవారు. ఉమ్ నాలుగు నెలలు అదే ప్రదేశంలో కూర్చుని నేను స్వామివారు ప్రతిరోజూ సంభాషణ చక్కగా దివ్యోపన్యాసం చేసేవారు. సరే వెళ్లి అక్కడ కూర్చుంటే ఈ నాలుగు నెలలు అయిపోయింది ఇక రేపు అయిపోతుంది ఉమ్ వారు సీమ దాటాలి సీమోల్లంఘన అంటాం. ఉమ్ అప్పుడు ఆ రోజున నన్ను దగ్గరకు పిలిచారు. ఉమ్ పిలిచి వారు నాకు గంభీరమైన ఉపన్యాసం, శాస్త్రం ఏమీ చెప్పలేదమ్మా. ఉమ్ ఏం చెప్పారంటే ఉమ్ స్పష్టతే జీవితం ఉమ్ అన్నారు. ఉమ్ రెండే పదాలు స్పష్టతే జీవితం ఉమ్ అంటే స్పష్టత లేనప్పుడు ఉమ్ జీవితం మొయ్యలేనిది భారం అయిపోతుంది. ఉమ్ జీవితం అంటే ఉమ్ అనుకోకుండా జరిగేదే జీవితం ఉమ్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం కాదు ఉమ్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ జీవితం మన వైపు ఎలా వస్తున్నదో దాని ప్ర-ప్రకారమే మనం గనక ప్రయాణం చేస్తే అలలు, కలలు, కల్లోలాలు ఉండవు ఉమ్ అని నేను సమన్వయం చేసుకున్నా. ఉమ్ అప్పటికి నాకా maturity of mind వల్ల ఉమ్ అందుకే రెండే పదాలు వాడు వాడింది ఉమ్ వాడింది. సరే అది తీసుకున్నాను. వారికి నమస్కారం చేసుకున్నాను. వారు నన్ను మళ్ళీ పదే పదే వస్తూ ఉండండి ఏం చెప్పలే. ఉమ్ చేయి ఎత్తి ఆశీర్వచనం ఇచ్చారు. పండు ఇచ్చారు. తీసుకొని నేను వెళ్ళిపోయాను. ఉమ్ ఇక ఆ తర్వాత పరమాచార్యతో సాన్నిహిత్యం అంటే ఎ-ఎప్పుడు వారి దర్శనానికి వెళ్ళినా ఉమ్ అన్ని వేళలా అక్కరకు తీసుకున్నారు, దగ్గరికి చేర్చుకున్నారు. ఉమ్ అక్కున చేర్చుకున్నారు. అక్కరకు వచ్చే విషయాలు కొన్ని వేలు మాట్లాడారు. ఉమ్ అవన్నీ సమయాభావం వల్ల చెప్పడానికి లేదు. ఉమ్ అవన్నీ ఏమిటంటే మనిషి ఒక జన్మ ఎత్తిన తర్వాత ఉమ్ ప్రధానంగా మానవ జన్మ ఎత్తిన తర్వాత మానుషంగా బతకాలి. మనిషిగానే బతకాలి. ఉమ్ ఈ మనిషి, చూడండి రామాయణంలో రాముడు పరబ్రహ్మమూర్తి నారాయణ స్వరూపం ఉమ్ ఆయన ఏం నిర్ణయించుకున్నాడు? నేను దశరథ రాజు కుమారుడిగానే ఉంటా ఉమ్ దైవంగా నేను ఉండనన్నాడు. ఉమ్ అది ఆయన resolve ఉమ్ ఆయన నిర్ణయించుకున్న విధానం ఉమ్ కృష్ణుడు మానవుడిగానే వచ్చాడు ఆయన కూడా ఉమ్ లోకమంతా నువ్వు దేవుడివి కాదంటే ఆయనేమన్నాడు దేవుడంటూ ఉంటే ఆ ఒక్కడినే నేనేనన్నాడు. ఉమ్ ఆ రెండు two aspects భారతీయ సనాతన ధర్మం యొక్క aspects అవి. ఉమ్ కాబట్టి వీటిని స్పష్టతే జీవితం అన్నప్పుడు నేను నా జీవితాన్ని అలా చూసుకుంటూ వెళ్ళా. ఉమ్ ఒక పాయగా వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఎక్కడ ఒదగాలో, ఎక్కడ ఒదిగితే నాకు స్వాత్మానందం కలుగుతుందో ఉమ్ ఎక్కడ నేను ఉంటే నా esteem నా గౌరవం మరింతలుగా ఉంటుందో పెరుగుతుందో ఉమ్ ఎక్కడ శాస్త్ర విజ్ఞానము, శాస్త్రీయ విజ్ఞానము, వేద విజ్ఞానము ఇవన్నీ ఒక్కచోట త్రివేణి సంగమమై ప్రవహిల్లుతాయో ఉమ్ ఇవన్నీ కూడా గమనించినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఉమ్ కాబట్టి జీవితం చాలా స్పష్టం. ఉమ్ ఇది absolute clarity తో conviction తో సాగుతుంది. ఉమ్ కాబట్టి పరమాచార్య స్వామివారు తర్వాత తర్వాత నేను అనేక సందర్భాలలో ఉమ్ ఇట్లాగే చాతుర్మాస్యాలనండి, విడిగా అనండి కానీ నేను కాంచీకి కేవలం ఐదు సార్లే వెళ్ళా. ఉమ్ నా జీవిత కాలంలో ఉమ్ స్వామి వారితో వారున్నంత కాలం నేనున్నా. ఉమ్ అయితే ఇక్కడ ఒక సందర్భం చెప్పాలి. ఉమ్ అదేమిటంటే స్వామివారు ఇక దేహం వదిలి పెడతారు ఇంకో మూడు రోజుల్లో అనగా ఉమ్ నేను తిరువణ్ణామలై వెళ్లి రమణాశ్రమంలో అక్కడ ఏదో కొన్ని మాటలు కాసేపు మాట్లాడాను అందరినీ కలుసుకొని ఉమ్ గిరి ప్రదక్షిణం చేసుకొని తిరువణ్ణామలై నుంచి కాంచీకి వచ్చా. ఉమ్ స్వామి వారిని చూద్దాం అని ఉమ్ అది Sunday. Sunday నాడు బెంగుళూరు, చెన్నై, ఆంధ్ర అక్కడి నుంచి చాలా మంది రెండు మూడు కిలోమీటర్ల queue ఉంటుంది. ఉమ్ ఆశ్రమానికి ఉమ్ అప్పటికీ పెద్ద స్వామి వారికి నూరు సంవత్సరాలు దగ్గరకు వచ్చేసినాయి. ఉమ్ అప్పుడు అనిపించింది ఒక్కసారి స్వామి వారిని చూద్దాం, దండం పెట్టుకొని వెళ్ళిపోదాం అని ఉమ్ జన ప్రవాహం ఉంది queue లో నించవలసిందే ఉమ్ అక్కడ ఎవరు ముందు తీసుకువెళ్లేవారు ఉండరు ఉమ్ చీటీలు ఇచ్చేవాళ్ళు ఉండరు wait చేయాలి అస్ wait చేయవలసిందే మనం we have to wait for our turn ఉమ్ అంటామే ఉమ్ ఆ క్రమంలో నేను నించొని ఉన్నా. ఉమ్ స్వామివారు కాస్త దూరంగా ఉమ్ ఒక పడక కుర్చీ లాంటి దాంట్లో కూర్చుని ఉన్నారు. ఉమ్ పెద్దవారైపోయారు. ఉమ్ చాలా పెద్ద కళ్ళ అద్దాలు పెట్టుకొని ఉన్నారు. అసలేం చూట్టలేదు ఎవరినీ పలకరించటంలా ఉమ్ ఇరుకే ఉన్నారు. ఉమ్ నా ఆ queue లో నా వంతు వచ్చింది ఉమ్ నా వంతు వచ్చేప్పటికీ స్వామి వారికి వాళ్ళు కొన్ని signals ఇస్తారు. ఉమ్ ఆ భాష అక్కడున్న పరివారానికి తెలుస్తుంది. ఉమ్ నా దగ్గరికి వచ్చేప్పటికి ఇట్లా ఒకతను అరచేయి, చేయి, మోచేయి అడ్డం పెట్టాడు. ఉమ్ ఓ ఇప్పటికి పూటకి దర్శనం అయిపోయింది అనుకుంటాం మనం. అతను ఏమన్నాడంటే పిరివమ్మ అని పిలుస్తున్నారు.పెద్ద స్వామి వారు పిలుస్తున్నారు అని రెండున్నర మూడు కిలోమీటర్ల క్యూ లో ఉన్న నేను స్వామి వారు నా వైపు చూడలేదు వారు ఇట్లా తిరుగున్నారు నేను ఇక్కడ ఉన్నా ఇలా పిలుస్తున్నారు అంటే నన్ను కాదనుకున్నా ఒక్క క్షణం అప్పుడు నేను దగ్గరికి నన్ను వదిలారు రోప్ ఉంటుంది ఆ రోప్ పైకి తీశారు నేను కింద నుంచి వెళ్ళా వెళ్ళగానే ఈ లోకం మొత్తానికి బాగా పరిచయం ఉన్న వాళ్ళు మూర్తి గారు అంటారు లోకమంతా వి.ఎస్.ఆర్. మూర్తి గారు అంటారు అవునండి రామచంద్ర మూర్తి గారు అని పిలిచారు స్వామివారు ఉమ్మ్ నాది నా ఫుల్ నేమ్ అవునండి నేను ఆశ్చర్యపోలే అప్పటికి నాకు అనుభవం వచ్చింది జీవితం వారికి తెలియందేమీ లేదని సర్వజ్ఞులని సర్వాత్మ పీఠం మీద వారు కూర్చుని ఉన్నారని వారి పట్ల అపారమైన అనన్యమైన అత్యుత్తమైన అవ్యయమైనటువంటి ఆ గౌరవం ఉంది నేను నమస్కారం చేస్తూనే నుంచొని ఉన్నా వారు అలా నా వైపు చూస్తూనే ఉన్నారు ఉన్న తర్వాత క్షేమం అడిగారు చాలా లో వాయిస్ క్షేమం అడిగారు యోగం అడిగారు అప్పుడు నాకు భగవద్గీత లో ఒక శ్లోకం గుర్తొచ్చింది ఉమ్మ్ అనన్యాశ్చింతయన్తో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిచాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం గురువు చుట్టూ తిరగక్కర్లేదు గురు ఆజ్ఞను పాలించాలి గురు వాక్యాన్ని మన జీవితంలో ట్రాన్స్లేట్ చేయాలి గురువుని అనుకరించకూడదు గురువుని అనుసరించాలి గురు సేవ చేయటం అంటే గురువు ఒక్క మాట చెప్పినప్పుడు దాని ప్రకారంగా మన జీవితాన్ని గడపాలి అని ఒక భావన మళ్లీ పునః ఇట్లాగే దర్శనము నిదర్శనము ఇవన్నీ ప్రదర్శన పూర్వకంగా జరగాలి అని మనసులో అనుకుంటూ నేను మా ఇంటికి వచ్చేసాం హైదరాబాద్ చేరుకున్నాం దాని తర్వాత మూడు రోజులకే మహాస్వామి వారు దేహ పరిత్యాగం చేశారు ఒక శక్తి పీఠం అధ్యాత్మ పీఠం అయినటువంటి కామకోటి పీఠానికి ఆచార్యత్వాన్ని వహించి తాము ఉండగానే మరొక ఇద్దరు ఉత్తరాధికారులను నియమించి అందులో రెండవ వారు జయేంద్ర సరస్వతి స్వామి వారు మూడవ వారు వారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు వారు కూడా పదమూడవ ఏటనే తురియాశ్రమానికి వచ్చిన మహాత్ములైన ఆ ఎవరు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మరి మధ్యలో ఉన్న జయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ ముగ్గురు దీనికి ఆచార్య త్రయాన్ని పొందిన ఏకైక పీఠము కంచి కామకోటి పీఠం ఒక ఒకళ్ళకి ఇద్దరు ఉండొచ్చు కానీ ముగ్గురు ఉన్నారు మరి ముగ్గురు ఏం చేశారంటే పరమాద్భుతమైనటువంటి జ్ఞాన యోగాన్ని ఈ ప్రపంచానికి కర్మయోగంగా మార్చి అందించినటువంటి వారు పెద్ద స్వామి వారు మహాస్వామి వారు ఉమ్మ్ ఈ జ్ఞాన యోగాన్ని భక్తి యోగాన్ని పూర్ణమైన కర్మయోగంగా మార్చి దీన్ని సమాజహితం చేసి కేవలము అధ్యాత్మ అంటే పురాణ ప్రవచనం ఏదో దేవాలయాలకు వెళ్లటం మాత్రమే కాదు యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిధి ధ్రువా నీతిర్ మతిర్మమాని యోగాచార్యుడు ఎట్లాగైతే యోగేశ్వర కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడో దానికి అనుగుణంగా కంచి పీఠాన్ని ప్రపంచం మొత్తం వ్యాపింపజేసినటువంటి వారు జనకల్యాణ వేదికగా మార్చారు అలాగే ఆధునిక శాస్త్రవేత్తలు కూడా స్వామి వారిని కలిసి వారికి ఉన్నటువంటి ఎన్నో సందేహాలను కూడా నివృత్తి చేసుకునే వారట కదండీ మనకి అటామిక్ ఎనర్జీ చైర్మన్ రాజా రామన్న గారిని ఉండేవారు మీ తరానికి తెలియదు రాజా రామన్న గారు ఇటువంటి స్వాముల వారన్నా ఇటువంటివన్నా వారికి పెద్ద ఇష్టం ఉండేది కాదు ఇష్టం లేదు ఆయన సైంటిస్ట్ బై టెంపర్మెంట్ అండ్ బై నాలెడ్జ్ దీన్ని మించి ఇంకేం లేదని అనుకున్నారు ఆయన అటువంటి ఆయన ఒకసారి కల్పకం చెన్నై దగ్గర వెళ్ళినప్పుడు ఏదో ఒక డెరివేషన్ మ్యాథమెటికల్ డెరివేషన్ ఆయనకి స్పురణకు రావటంలే ఆయన దగ్గర ఉన్న ఒక క్యాంపు క్లర్కు ఆయన్ని కంచికి తీసుకొని వెళ్లారు ఊరికే వెళ్లేద్దాం రండి సండే కదా అని వెళ్లారు రిలక్టెంట్ గా వెళ్లారు అక్కడ కూడా క్యూలో నించవలసిందే వెయిట్ చేయవలసిందే ఈయనకి టర్న్ వచ్చింది స్వామివారు ఒక పీట మీద ఒక పూరి గుడిసెలో కూర్చుని ఉన్నారు ఈయన ఇలా తొంగి చూశారు అదే సమయంలో మహాస్వామి వారు పైకి చూస్తూ ఋగ్వేదంలో నుంచి ఒక మంత్రం చదివారు చదివి ఆ మంత్రం మేము చదివాము మీకు పరిష్కారం దొరుకుతుందిలెండి అని ఆశీర్వదించి పంపించారు ఆయన రూమ్ కి వచ్చారు రూమ్ కి వచ్చి స్నానం చేసి నేను అడగనే లేదు వారు నాకేమీ పెద్ద డెరివేషన్ చెప్పలేదు ఋగ్వేద మంత్రం అని చెప్పారు గనుక ఇది ఋగ్వేదంలోదని తెలుస్తోంది అని ఆయన అలా ఉండిపోయారు కాగితం మీద కలం ఇలా పెట్టి డెరివేషన్ మొదలు పెడితే డెరివేషన్ పూర్తయిపోయింది అప్పుడు ఆయన పరమాచార్య కి ప్రథమ శిష్యుడు అయినాడు ఆయన ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్పారు జాతీయ జెండా గురించి చెప్పారు ధర్మ చక్రాన్ని ఎందుకు పెట్టారో చెప్పారు ఈ ధర్మ చక్రం అశోకుడిది అని మనం అంటున్నాం ఏవం ప్రవర్తితం చక్రం అంటూ గీతాని అటు లలితా సహస్ర నామాన్ని సమన్వయం చేస్తూ చేసిన ప్రసంగం పరమాద్భుతం ఓకేనండి ఇవాల్టి కార్యక్రమంలో మాకు శ్రీ శ్రీ శ్రీ పరమాచార్య స్వామి వారి యొక్క ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారండి ఇవాల్టి కార్యక్రమంలో ధన్యవాదాలండి శుభం చూశారు కదా ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం
YouTube · audio
శ్రీశ్రీశ్రీ పరమాచార్య గారితో నేను మాట్లాడాను..! | Hindu Dharmam
శ్రీశ్రీశ్రీ పరమాచార్య గారితో నేను మాట్లాడాను..! | Hindu Dharmam
Source: Hindu Dharmam on YouTube
0:00 / 24:00