Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాం మే. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఉపనిషత్తులలో అత్యంత ప్రధానమైనటువంటి దశోపనిషత్తులు శంకర భగవత్పాదులు ఒక ఆధ్యాత్మిక స్థాయిని భౌతిక స్థాయితో సమన్వయం చేస్తూ సాగించినటువంటి ఒక అపురూప భాష్యమే ఉపనిషత్తుల మీద వారి వ్యాఖ్యానం. ఉపనిషత్తులే కాదు నిజానికి ప్రస్థానత్రయం మీద భగవత్పాదులు చేసినదే అన్ని కాలాలకి కూడా ప్రామాణికం. అది బ్రహ్మసూత్రాలు కావచ్చు, భగవద్గీత, గీతా భాష్యం తర్వాత తర్వాత ఎందరెందరో గీతకు భాష్యం చెప్పినా శంకర భాష్యమే ప్రామాణికమైనటువంటిది. అట్లాగే ఉపనిషత్తులకు కూడా. ఉపనిషత్తులని ఆయన మనం చెప్పుకున్నట్లుగా జగత్తు, జీవుడు, జగదీశ్వరుడు ఇది ఒక త్రిపుటి. మూడుగా కనిపిస్తే ఏక వస్తువు అట్లా కనిపిస్తూ ఉంటాయి మూడు మూడుగా. మనం కూడా మాయావరణ ప్రభావం చేత ఈశ్వరుడు మనకంటే భిన్నమని, జగత్తు కంటే కూడా మనం భిన్నమని, మనకి దైవానికి చాలా దూరం ఉన్నదని అనేక విధాలు మనం అపోహలు పడుతూ ఉంటాం. కానీ మహర్షులు దర్శనాలే ఉపనిషత్తులైనాయి గనుక శంకర భగవత్పాదులు దానికి ఒక క్రమం ఏర్పరచారు. క్రమంలో పది ఉపనిషత్తుల్ని ఆయన మనకోసం అందించి జగత్తుతో ప్రారంభించి బృహదారణ్యంకం అంటే బృహత్తరమైనటువంటి మహా అరణ్యకమే మహోపనిషత్తుగా సంభావన చేసి ఆత్మను ఎరుగు ఎరుకలోకి స్థిమిత పరిచేటువంటి భావన వైపు నడిపించారు భగవత్పాదులు. కాబట్టి శంకరులు వరుస క్రమాన్ని పాటించారో, ఎట్లా చెప్పారో సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి సత్యసాయి భగవానులు కూడా అదే క్రమాన్ని పాటించి ఉపనిషద్ వాహిని రాశారు. కాబట్టి క్రమం తప్పడానికి వీలు లేదు. ఒక ఉపనిషత్తు తర్వాత ఒకటి ఒకటి అర్థం చేసుకుంటూ, ఎందుకంటే నిజానికి ఉపనిషత్తులు ఏడు రోజుల్లో చెప్పడానికి వీలులేని subject అది. సుమారుగా ఒక రెండు సంవత్సరాలు హాయిగా చెప్పుకోవచ్చు. కానీ ఎవరి దగ్గర అంత time లేదు గనుక ఒక్కొక్క ఉపనిషత్తులో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? వాటి స్థూల స్వరూపం ఏమిటి? వాటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకున్న దాన్ని ఎట్లా ఆచరించాలి? ఆచరించి అనుభవాన్ని ఎలా పొందాలి? అనుభవంలో నుంచి ఒక అనుభూతిని ఎట్లా సంపాదించుకోవాలి? అనుభూతి నుంచి విభూతి స్థాయికి వెళ్ళాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ ఈశావస్యోపనిషత్తుతో మనం ప్రారంభం చేద్దాం. ఈశావస్యమిదం జగత్ అంటే సర్వ జగత్తు కూడా ఈశ్వరమయమై ఉన్నది అని ఒక భావన. ఈశ్వరుడు ప్రపంచానికి అతీతంగా ఉండాలి కదా! ప్రపంచం అంతా ఈశ్వరుడై ఎట్లా ఉన్నాడు? అని ఒక ప్రశ్న. ఉపనిషత్తులన్నీ గడ్డి వామిలో సూది వలె ప్రశ్నలే ప్రశ్నలే ప్రశ్నలే. ఒక ప్రశ్నకి సమాధానం పొందుతుండగానే ఒక ఉప ప్రశ్న ఏర్పడుతూ ఉంటుంది. అయితే తర్కంలోకి, వాదనలోకి మనం వెళ్ళకుండా the quint essence అంటాం. దశోపనిషత్తు సార సర్వస్వం ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే మనం చక్కగా విచారణ చేద్దాం. జగత్తు ఈశ్వరమయము అన్నదానికి ఆయన ఏం చేశారంటే, పంచభూతములు, దివాకరుండు, నిశాకరుడుని చనుసప్తకంꯕ యేని శరీరంబు నీదే. కన్ను విప్పుట, కన్ను మూయుట నీవు కలుగ కిట్లు. ఏతత్ అధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమతనువు వాడు అన్నారు. పద్యం విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో ఆయన పరమాత్మను గురించి, జీవాత్మను గురించి విచారణ చేస్తూ ఒక అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో పంచభూతాలను నీరు, నిప్పు, నింగి, నేల ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కలిపితే కదా ఒక మానవ దేహం ఏర్పడింది. దానితో పాటు పంచభూతములు దివాకరుండు, నిశాకరుడు. దివాకరుడు సూర్యుడు. నిశాకరుడు చంద్రుడు. సూర్యచంద్రులు మన దేహంలో ఎక్కడ ఉన్నారు? పంచభూతాలతో దేహం అందు తయారయింది. కానీ ఇంకో రెండు ఉన్నాయి కదా అంటే అవి ఏమిటంటే మన నాసికా రంధ్రం ముక్కు రంధ్రాల్లో కుడివైపున ఉన్నది సూర్య నాడి, రెండవ వైపున ఉన్నది చంద్ర నాడి. సూర్య నాడి నుంచి గాలి పీలుస్తాం, చంద్ర నాడి నుంచి గాలిని బయటకు వదిలి పెడతాం. అంటే లోపలికి తీసుకున్న దాన్ని పూరకము అన్నాం. వదిలిపెట్టే లోగా లోపల నిలబెట్టుకున్న దాన్ని కుంభకము అన్నాం. వదిలిపెట్టే దాన్ని రేచకము అన్నాం.అంటే ఒక గాలిని బయట నుంచి తీసుకుని ప్రకృతిలో నుంచి తీసుకుని శరీరం యావత్తు వాయు సంచారం అయిపోయిన తర్వాత అది శుభ్రమై మిగలగా మనకు అక్కరలేని గాలిని మనం వదిలి పెడుతున్నాం ఒకటి ఉచ్ఛ్వాస రెండవది నిశ్వాస లేదా ఒకటి రాక రెండవది పోక ఇట్లా కాబట్టి ఐదు పంచభూతాలు ప్లస్ సూర్య నాడి ప్లస్ చంద్ర నాడి కలిపితే ఏడు కాబట్టి మన దేహం ఏమిటంటే మన కేవలం కాళ్లు చేతులు కళ్ళు ముక్కు కాదు తను సప్తకంబ యేని ఇది ఏడు ఏడు శరీరాలతో కూడిన ఒక్క శరీరము అని అర్థం తను సప్తకం తనువు ఏడు విధాల ఉన్నది ఏడుగా కూడి ఉన్నది కానీ basis ఏమిటి అంటే పంచభూతాలు ఉన్నాయి దీని యందు ఎట్లా గాలి వీస్తుందో మనలో కూడా గాలి వీస్తూనే ఉంటుంది గాలికే ప్రాణమని మనస్సని చైతన్యమని అనేకమైన పర్యాయపదాలు దాని యందు ఉన్నాయి అట్లాగే మనలో నీరు ఉంది శరీరంలో seventy eight percent మనకి నీరే ఉంటుంది కాబట్టి నీరు ఎక్కడ ఉన్నది అంటే బయట నీరు ఉన్నదో అలాంటిదే మనలో కూడా ఉన్నది నిప్పు కూడా మనలోనే ఉన్నది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అంటాం అంటే వైశ్వానర రూపంలో అగ్ని జఠరాగ్ని రూపంలో మన యందు అగ్ని ఉన్నది ఏది తిన్నా దహించి వేస్తుంది వాక్కు మనలో నుంచి పుడుతున్నది వాక్కు అగ్ని స్వరూపం ఆలోచన అగ్ని స్వరూపం భావనామయ స్థితి అగ్ని స్వరూపం కాబట్టి అగ్ని మన యందే ఉంది నీరు మన యందే ఉంది ఇక నేల అంటారా సర్వానికి ఆధారమైన దానికి నేల లేక భూమి అని పేరు గనుక మనం కూడా రెండు పాదాల మీద మన శరీరాన్ని ఆధారభూతం చేసుకొని మళ్ళీ దీనిని భూమ్మీద నడిపిస్తాం కాబట్టి రెండు పాదముల యందు ఉన్నటువంటి మహా శక్తి ఏదైతే ఉన్నదో దానిని balancing factor అంటాం అది మన యందే ఉన్నది గనుక దాని యందు ఉన్నాయి ఇక వర్షము వర్షం అంటే నీరు తర్వాత ఆకాశం చిత్తాకాశమని దహరాకాశమని హృదాకాశమని వీటి హృదయము అన్నా చిత్తము అన్నా దహరము అన్నా ఆకాశము అన్నా శూన్యము అని అర్థం గగనము అన్న శూన్యమే అని అర్థం అది ఎంత శూన్యమో అది అంత పూర్ణం ఒక glass తీసుకుందాం glass లో అది ఖాళీ glass అంటే ఖాళీ glass గా మనకు కనిపిస్తోంది ఎందుకని దానిలో నీరు లేదు గనుక కానీ దానిలో కూడా గాలి ఉన్నదిగా గాలితో నిండే ఉన్నదిగా ఎప్పుడైతే మనం నీరు పోస్తామో గాలి బయటకు వెళుతున్నది నీరు అక్కడ నిలబడుతున్నది కాబట్టి పైకి శూన్యంగా కనిపించినా దాని స్థితి కూడా పూర్ణమే గురువు యొక్క స్థితి కూడా అంతే మనం కూడా అంతే మనకు ఏం తెలియనట్లు ఉంటాం మనకి చాలా తెలుసు చాలా తెలుసు అని మాత్రం మనకు తెలియదు అది తెలియనిదేదో తెలుసుకోవటం కోసమే ఉపనిషత్తులన్నీ అధ్యయనం చేయాలి కాబట్టి ఆకాశం హృదాకాశంగా చిత్తాకాశంగా ఖాళీగా ఉన్నది ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశానికే హృదయము అని చెప్పుకున్నాం హృదయము అంటే దాని యందు దయ ఉంటుంది కరుణ ఉంటుంది అన్నీ ఉంటాయి అంటాం దాంతో పాటుగా అది మనస్సు యొక్క పుట్టినిల్లు ఆలోచన ఎక్కడ పుడుతుందంటే హృదయ స్థానంలో పుడుతుంది హృదయం అంటే physical గుండె కాదు కుడివైపున ఒకటిన్నర అంగుళాల దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశం ఏదైతే ఉన్నదో అది హృదాకాశం దానిలో ఒక ఆలోచన పుట్టి శిరస్సు ద్వారా విజృంభించి మళ్ళీ పంచేంద్రియాల ద్వారా మళ్ళీ మనం చెయ్యి ఊపినా చెయ్యి ఎత్తినా కన్ను ఎత్తినా కనురెప్ప వాల్చినా ఇవన్నీ కూడా దాని యందు సమన్వయ స్థితిలో సాగిపోతున్నాయి గనుక దేహం జాగ్రత్తగా గనుక ఆలోచించినట్లయితే పంచభూతాలు సూర్య నాడి చంద్ర నాడి సూర్య నాడి అన్నా వెలుగే చంద్ర నాడి అన్నా వెలుగే పగటి వెలుగు పోడిమి వేడిమి తాలిమి ఇవన్నీ ఉంటాయి చల్లదనంతో కూడినటువంటి ఒక ప్రశాన్న ప్రశాంత ప్రసన్నమైనటువంటి భావన చంద్రకాంతి దానికి సుషుమ్నా కిరణము అని పేరు చంద్రకాంతికి సుషుమ్నా కిరణాలన్నీ కూడా ఔషధీ యుక్తంగా ఉంటాయి they are medicinal rays కాబట్టి మనం వెన్నెల్లో కూర్చోవాలి ఎండలో కూర్చోవాలి ఎందుకు కూర్చోవాలి శరీరానికి తను సప్తకంబ యేని ఏడు శరీరాలు ఒక్క శరీరంలో ఇమిడి ఉన్నాయి మనకు విషయం తెలియదు మనము అనగానే కనిపించే స్థూల శరీరాన్ని చూపిస్తున్నాం మన visiting card flash చేస్తున్నాం లేకపోతే మన ఆధార్ కార్డు చూపిస్తున్నాం అవన్నీ నిరాధారమైనవి మన తర్వాత వచ్చినవి అవి అసలు ఆధార భూమిక ఏది అంటే మన యందు ఉన్నటువంటి సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మే గనుక దాని జోలికి వెళ్ళటానికి ముందుగా పూర్వరంగానే ఉపనిషత్తుని మనకి అనుగ్రహించినటువంటి మహర్షులు మహాత్ములు శంకరులు స్వామి వీరందరూ కూడా చక్కగా వ్యాఖ్యానం చేశారు కాబట్టి పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబ యేని శరీరంబు నీదే చూశారా మనం అంటున్నాం నేను నేను నేను నేను అంటున్నాం మనం వాడే నేను మేనుకి సంబంధించింది శరీరానికి సంబంధించిన నేను నేను ఫలానా నేను engineer నేను doctor నేను ఫలానా ఇవన్నీ కూడా మన శరీరానికి మన అస్తిత్వానికి సంబంధించినవి మన ఉనికి ప్రపంచానికి చెప్పాలంటే ఇవన్నీ చెప్పాలి కానీ ఉనికి వ్యక్తిత్వము అస్తిత్వము మూడింటిని దాటిన స్థితిలో ప్రపంచానికిమనల్ని మనం పరిచయం చేసుకోబోయే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి గనుక ఈశావాస్యోపనిషత్తులో పరప్రధానంగా నువ్వు కేవలము ఒక శరీరాన్ని ధరించి లేవు. నువ్వు ఏడు శరీరాలు, ఏడు elements అంటాం. పంచభూతాలు, సూర్యనాడి, చంద్రనాడి కలిసి ఉన్నాయి అని మొదటిది అయితే. కన్ను విప్పుట అంటే పుట్టడం. కన్ను మూయుట మరణించటం. నీవు లేక కలుగుట ఎట్లు? నువ్వు లేకపోతే ఎట్లా? నువ్వు ఎవరు? నేను తెలుస్తున్నా, నేను అంటే జీవాత్మ. నువ్వు అంటే తత్, అది, నువ్వు, పరమాత్మ. నువ్వు లేకపోతే నేను కనురెప్ప ఎత్తేది ఎట్లా, కనురెప్ప వాల్చేది ఎట్లా? రెండింటికీ కారణం నువ్వు అవుతున్నావు కదా పరమాత్మ అని. కన్ను విప్పుట, కన్ను మూయుట నీవు లేక కలుగుట ఎట్లు? ఏతత్ అధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమతనువు వాడు. వాడు అంటే third person. నువ్వు కాదు, నేను కాదు. వాడు ఎవరు అంటే ఇంద్రియాలకి, సూర్యనాడికి, చంద్రనాడికి, సప్త ఆ-ధాతువులతో, పాంచభౌతికమైనటువంటి దేహంతో, సూర్యచంద్రనాడులతో కూడినటువంటి మానవ దేహంలో అధిష్టాత ఒక్కడున్నాడు. అధిష్టాత అంటే master, supreme master. ఎవరు వాడంటే వాడు నీవు. ఆ-ఆ నీవును మనం ఏమంటామంటే వాడు అంటాం. వాడు ఎవరంటే, ఏమో లోపల ఎవడో ఏదో చెప్తున్నాడయ్యా, వాడేదో అంటున్నాడు అంటాం మనం. మనకు తెలియకుండానే. అంటే మనకు తెలియకుండా మనలో ఎవడో ఒకడు ఉన్నాడన్నమాట. వాడిని మనం గమనించం. మనల్ని మనం వాడుకుంటూ ఉంటాం. అసలు వాడిని మనం మర్చిపోతూ ఉంటాం. అసలు వాడిని తెలుసుకోవటం కోసం అధ్యాత్మ యోగంలోకి మనం ప్రవేశిస్తాం కాబట్టి, వాడు మన లోపలే ఉన్నాడు. నేను బయట కనిపిస్తున్నాను. దానికే మనం ఎప్పుడూ చెప్పుకునే నేను నేనైన నేను. నేను అంటే లోపల ఉన్నటువంటి ఒక ఆత్మ. నేనై శరీరాన్ని ధరించి నేనుగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను. అంటే దేహము, ఆత్మ, పరమాత్మ అన్నీ కలిపి ఒక వ్యక్తి అవుతున్నాడు. అంటే ఒక వ్యక్తి అవుతున్నాడు. వ్యక్తి విస్తృతంగానక అయితే వాడు ప్రపంచం. దక్షిణామూర్తి స్తోత్రంలో దీనికి అనుసంధానంగా ఒక విషయం చెప్పాలి. భగవత్పాదులు చెప్తారు, ఒక మహా మర్రిచెట్టు ఉంది. చాలా వటవృక్షం అది పెద్దది. ఊడలు దిగినాయి కిందకి. కొన్ని గింజలు కింద పడి ఉన్నాయి. మనం ఏరుకొచ్చాం. గింజను చూస్తే, విత్తనాన్ని చూస్తే దాంట్లో ఏం కనపట్టಲ್ಲ. విత్తనంగా కనిపిస్తున్నది. విత్తనాన్ని నేలలో పాతి పెట్టాం. కొద్ది రోజులు ఎక్కడో జల్లం. నెమ్మది నెమ్మదిగా భూమిని చీల్చుకొని రెండు దళాలతో బయటికి వస్తున్నది. చూడండి ఎంత మహా శక్తి ఉన్నదో దానికి. భూమి పొరలను చీల్చుకొని బయటికి వచ్చి తలెత్తి రెండు దళాలతో అటు ఒకటి ఇటు ఒకటి లోబ్స్ అంటాం. రెండింటితో వచ్చి ప్రకృతికి అది నమస్కరిస్తున్నది. నమస్కరించి నెమ్మది నెమ్మదిగా అది పెరుగుతున్న కొద్ది రెండూ కూడా వాడి రాలిపోతున్నాయి. దళాలు రెండు వాటిని బీజదళాలు అన్నాం. అట్లాగే రెండు దళాలు ఏంటంటే జీవుడి యొక్క అహంకారం, మమకారాలు. తల్లి గర్భాలయంలో మనం కూడా ఒక చిన్న విత్తులా ప్రవేశించాం. విత్తు నెమ్మదిగా తల్లి గర్భాన్ని దాటి బయటకు వచ్చి, ప్రపంచంలోకొచ్చి ఒక శిశువుగా ఉండి తల్లికి మనకు ఉన్నటువంటి పేగుబంధం umbilical cord అంటాం. అది surgery జరిగినప్పుడు మంత్రసాని బొడ్డు కోసినప్పుడు మనం తల్లి యొక్క తనువు నుంచి విడిపడి పోతున్నాం. విడిపడిన మరుక్షణం ఏడుస్తున్నాం. అనేకమైన ప్రవృత్తులు, ప్రకృతి యొక్క శక్తులు మనల్ని ఆవరించేస్తున్నాయి. వేడి గాలి కొడితే ఏడుస్తున్నాం, చల్ల గాలి కొడితే ఏడుస్తున్నాం, ఆకలైతే ఏడుస్తున్నాం. అది కావాలి, ఇది కావాలని అనేక signals ఇస్తున్నాం. అట్లాగే ఒక చెట్టు లేదా ఒక విత్తనంలో నుంచి వచ్చిన చిన్న అంకురం, ఒక మొలక రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రపంచానికి వచ్చినట్టుగా మనం రాగలిగి ఉన్నట్లయితే మనకి ఇంత యాతన ఉండేది కాదు. చిన్న మొక్క దాని బీజదళాల్ని ఎండగొట్టి వ-వదులుచుకొని బయటకు పెరిగిపోతున్నది. ఎట్లా పెరుగుతున్నది అంటే కాండము, శాఖలు, ఆకులు, పూలు, కాయలు, పళ్ళు, విస్తృతమైనటువంటి ఊడలు ఇవన్నీ ఏర్పరచుకుంటూ వెళుతున్నది ఒక చిన్న విత్తు. విత్తు ఎంత అంటే ఆవగింజలో నాలుగో వంతు ఉంటుంది. మర్రిచెట్టు. అంటే దాని యందు బీజస్యాంతరివాంకురో అంటారు. బీజము యొక్క గర్భంలో దాగినటువంటి ఒక అంకురమే మొక్కై, వృక్షమై, వటవృక్షమై, మానై, మహావృక్షమై ప్రపంచంలో ఉన్నట్లుగా జీవుడు కూడా తల్లి గర్భాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు తనలో ఉన్న అహంకారం, మమకారాల రెండింటినీ వదులుచుకోకుండా ఉండి జీవితాన్ని సాగిస్తున్నాడు గనుక జగత్తు వాడికి ఒక వేదిక అయింది. ఒక ఆడుకోవటానికి తాను నిర్వహించవలసినటువంటి ఒక పాత్రను నిర్దుష్టంగా నిర్వహించటానికి ఏర్పడింది గనుక ప్రపంచం అనేటువంటి ఒక మహానాటక రంగస్థలంలో జీవుడు అమృతలోకం నుంచి తల్లి గర్భం ద్వారా ప్రపంచంలోకి ప్రవేశించిన అహంకారం, మమకారాలు రెండు వదిలిపెట్టని కారణంగా, వదులుకోలేని కారణంగా, వాసనలు మూలవాసనల కారణంగా తాను పెరుగుతున్న కొద్ది అహం పెరుగుతున్నది, తాను పెరుగుతున్న కొద్ది మమకారం పెరుగుతున్నది, తాను పెరుగుతున్న కొద్ది మమతలు పెరుగుతున్నాయి, దానిలో నుంచి బంధనాలు ఏర్పడుతున్నాయి. బాంధవ్యాలలో నుంచి బంధనాలుబంధనాలలో నుంచి మోహాలు, మోహాలలో నుంచి వ్యామోహాలు, వ్యామోహాలలో నుంచి వ్యసనాలు ఏర్పడి జీవుడు తనను తాను మరచిపోయేటువంటి ఒక స్థితికి వచ్చాడు గనుక ప్ర-ప్రథమంగా ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్తుందంటే ముందుగా నువ్వు జగత్తును గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకో. నువ్వే కాదు, నీలాంటి కొన్ని కోటానుకోట్ల జీవరాశులు ప్రపంచంలో ఉన్నాయి. నువ్వొక మానవుడిగా మాత్రం మానవజాతి అహంకరించిన కారణాంతా "నేను" అంటున్నది. మిగతా ఎనభై నాలుగు లక్షలలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు ఒక్కటి కూడా "నేను" అనటంలే. "నేను" అన్నటువంటి అహంకార భావన ఎవరి యందున్నదంటే, మానవజాతి యందున్నది గనుక మానవుడికి విశేషమైనటువంటి ప్రజ్ఞానాలు ఉన్నాయి గనుక వాటిని ఆధారం చేసుకొని ముందు ప్రపంచాన్ని ఎరుగు, దాని గురించి తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ప్రపంచం మంచిదా చెడ్డదా? ప్రపంచం నాకేమిచ్చింది? లేదు నేను ప్రపంచానికి ఏం చేయాలి? ఇవన్నీ అహంకారమే. నేను ప్రపంచానికి చేయుటువంటిది లేదు, ప్రపంచానికి నేను చేయాలి. అది నా ధర్మం. ఎందుకని? ప్రపంచం వలన నేనున్నా. ప్రపంచంలో five elements ఉన్నాయో నా దేహంలో కూడా అవే five elements ఉన్నాయి. ఇదే ప్రపంచంలోకి సూర్యుడు వస్తున్నాడు, నా ఒక్కడి కోసం రావటంలే. అలాగే చంద్రుడు కూడా ప్రపంచం కోసం వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ, మృత్యు ధర్మాన్ని పాటిస్తూ, ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. చూడండి, సమస్త ప్రాణులు కూడా సంతానోత్పత్తి చేసినాయి. ప్రతి చెట్టు, చేమా కూడా అనేకమైనటువంటి expansion జరుగుతూ ఉంది. అది పరిణామ క్రమం. అలాగే నదులు నిరంతరము ప్రవహిస్తూ ఉన్నాయి. ఎంత నీరు ఆవిరైపోయినా పల్లంగా వెళ్లి, వెళ్లి సముద్ర గర్భంలోకి కలిసే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మానవుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే, నాకు చాలా తెలుసని, ఇక నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదని, నేను చదువుకున్న చదువు లోక విద్యను మించిన మరొక ఆత్మవిద్య లేదని, బ్రహ్మవిద్య, స్త్రీ విద్యలు ఊరికే కాసేపు మాట్లాడుకునే విషయాలే తప్ప అవేవీ కాదు అని అనుకుంటూ, అనుకుంటూ డెభై ఏళ్ళు గడిపేస్తాడు. ఎలా గడుపుతాడు? కీర్తి కోసం గడుపుతాడు. సంపద amass చేయటం కోసం జీవితాన్ని గడుపుతాడు. బంధువులందరితో బాంధవ్యాలకు దూరంగా ఉంటాడు. తనను తాను exclusive చేసుకుంటాడు, inclusive చేసుకోడు. చూడండి, ఒక చిన్న ఒక-ఒక కుక్క. అది పిల్లల్ని పెట్టింది. ఒక పిల్లి పిల్లల్ని పెట్టింది. ఏం చేస్తుంది అది? ఒక పిట్ట గుడ్డు బద్దలై దాంట్లో నుంచి బిడ్డ బయటకు వచ్చింది. మూడు, కుక్క, ఒక పిల్లి, ఒక పక్షి. మూడు కూడా వాటికి రెక్కలు వచ్చి వాటంతట అవి నడిచే దాకా సంరక్షణ చేసినాయి. ఇక్కడ మనం కొంత ప్రయాణం కాగానే మనలో ఉన్నటువంటి అహంకార ప్రవృత్తుల చేత నాకు మీ అవసరం లేదు అంటూ మన ప్రయాణం ప్రారంభిస్తాం. ఉపనిషత్తు ప్రకృతి నుంచి నువ్వు చాలా నేర్చుకో అంటుంది. శ్రీ దత్త ఉపాసనలో, సంప్రదాయంలో శ్రీ దత్తుడు ఒక మాట అన్నాడు. నేను అందరికీ గురువుని కావచ్చేమో కానీ, ప్రకృతిలో ఉన్న ఇరవై నాలుగు శక్తులు నాకు గురువులు అన్నాడు ఆయన. ఒక గాలి, ఒక పక్షి, ఒక పశువు, ఒక పసరము, ఇవన్నీ వీటన్నింటి నుంచి నేను ఎన్నో నేర్చుకుని జీవితాన్ని నేను గడుపుతున్నాను. మీరందరూ కలిసి నన్ను ఒక్కడినే గురువుని చేస్తున్నారంటే దత్త గురువులకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు at a time. కాబట్టి ప్రకృతి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి గనుక, పాఠం నేర్చుకోవటం అంటే దాన్ని observe చేయాలి. దానిని గమనిస్తూ ఉండాలి. ఒక మొక్క ఎలా పెరుగుతున్నది? ఒక చెట్టు ఎలా పెరుగుతున్నది? నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉన్న ఒక చెట్టు ఒక్కసారిగా అటు ఇటు ఎలా ఊగుతున్నది? ఎవరు ఊపుతున్నారు? ఒక మానుని ఎవరు ఊపగలరు? గాలి. అది కంటికి కనపట్టం లేదు. కాబట్టి చలత్ చలితమై మాయావరణంలో ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా ఇంకెవరి అధీనంలోనూ ఉన్నది ఇది. చెట్టు ఎండిపోయింది, అడవుల్లోకి వెళ్ళండి. మనం పేపర్లో చదువుతుంటాం, తిరుపతి దగ్గర శేషాచలం అడవుల్లో అగ్ని పుట్టింది అని పేపర్లో చదువుతాం. ఎవరు పుట్ట-పుట్టించారు అక్కడ? పుడు-పుడుతుంది అక్కడ. ఎందుకంటే చెట్లు ఎప్పుడైతే ఎండిపోయి ఉంటాయో గాలికి కొమ్మలు, కొమ్మలు రాసుకుని auto combustion అంటాం. దానిలో నుంచి అగ్ని పుడుతుంది. కాబట్టి అగ్ని అక్కడే ఉంది, నీరు అక్కడే ఉంది, గాలి అక్కడే ఉంది. ప్రకృతిలో ఏది ఎన్నాళ్ళు ఎంతవరకు భూమ్మీద ఉండాలో అది నిర్ణయమై పోయి ఉన్నాయి. అట్లాగే మనం కూడా. మనకి ఒక hundred years ప్రమాణం చెప్పారు అంతే. ఒక hundred years ఉండవచ్చు నువ్వు అన్నారు. మనం గనుక సక్రమంగా ప్రపంచాన్ని అర్థం చేసుకుని ప్రపంచం మీద యజమానిగా కాకుండా ప్రపంచానికి సేవకుడిగా, లేదు ప్రపంచమంతా, అంతా ఒక తల్లి గనుకైతే మనం ఒక బిడ్డగా జీవించగలిగినట్లయితే మనకి ప్రమాదం లేదు. కానీ మానవులందరూ కూడా ప్రకృతి విరుద్ధమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. దీనికి సత్యసాయి భగవానుడు ఒక మాట చెప్పారు. "Every animal has got a reason and a season, only man has neither" అన్నారు. మనిషికి reason లేదు. అంటే ఎందుకు చేస్తున్నాడో తెలియదు, ఎందుకు సంపాయిస్తున్నాడో తెలియదు, ఎందుకు పరిగెత్తుతున్నాడో తెలియదు, ఎందుకు అసలు పని చేయటం లేదో తెలియదు, ఎందుకు workaholic అవుతున్నాడో తెలియదు.ఎప్పుడు ఏం చేయాలో, ఎందుకు చేయాలో, ఎంత చేయాలో, దేనికోసమై చేయాలో, ఇవి ఏమీ ఎరుక లేకుండా చేస్తున్నాడు గనుక ప్రకృతిలో నుంచి మనం తెలుసుకోవలసిన అనేక విషయాలు. చూడండి, వర్షాకాలం వచ్చింది. వర్షం కురుస్తుంది దాని ధర్మం. అది మనం వద్దన్నా, కాదన్నా, ఎక్కువ, తక్కువ అన్నా, అది కురుస్తూనే ఉంటుంది. కానీ, ఋతువు మారుతున్నటువంటి సమయంలో వర్షం ఆగిపోతుంది, చలి ప్రారంభం అవుతుంది. మనకేవో కండు గుర్తులు, thumb rules ఉంటాయి. శివ-శివరాత్రి కాగానే శివ శివా ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవి. అంటే thumb rules. కానీ ప్రకృతి నీ rules ప్రకారం ఉండదు. ప్రకృతి తనంతట తాను ఋతువు వెంట ఋతువు ప్రకృతి తనను తాను మార్చుకుంటూ వెళుతుంది. ఇంతలోకే ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో చెట్లన్నీ కూడా అప్పటిదాకా ఉన్న ఆకులన్నీ కూడా పండి, ఎండి, రాలిపోతాయి. మళ్ళీ చక్కగా కొత్త ఆకులు, కొత్త కొమ్మలు, కొత్త కొత్తవన్నీ వస్తూ ఉంటాయి. మానవుడు కూడా అంతే. పుడుతుంటాడు, పెరుగుతుంటాడు, ఒరుగుతుంటాడు. ఇది చాలా అత్యంత సహజమైనటువంటి పరిణామం. దీనిలో ఎవరికీ exception లేదు. ఇది జీవితం యొక్క సమగ్రమైనటువంటి ఒక స్వరూపం ఇది. ప్రకృతితో పోల్చుకున్నప్పుడు ఒక రూపం. మరి జీవితానికి పరమార్థం ఏమిటి విచారించమంటుంది ఈశావాస్యోపనిషత్. చెట్టుకి పరమార్థం ఏమిటి? చెట్టు, మనిషి ఒకటే. జాగ్రత్తగా ఆలోచిస్తే. ఇది ఎట్లాగైతే విత్తనాల ద్వారా అనేక చెట్లకు ప్రాణం, ఊపిరి పోస్తున్నదో, లేదు అవి రావటానికి కారణం అవుతున్నదో, సంసారి కూడా సంసార ఉత్పత్తి చేస్తూ వెళుతున్నాడు. సంతానం జరుగుతున్నది. సంసారం అంతా expand అవుతున్నది. అలాగే చెట్టు కూడా కొన్నాళ్ళు ఉండి ఉండి ఉండి ఏదో ఒక రోజున కూకటి వేళ్లతో కింద పడిపోతున్నది. మనిషి కూడా అంతే. కానీ, వృక్షం ఏం చేస్తున్నది? నీకు ఆకులు కావాలంటే ఆకులు ఇస్తున్నది. నీడ కావాలంటే నీడ ఇస్తున్నది. కాయలు కావాలంటే కాయలు, పళ్ళు కావాలంటే పళ్ళు ఇస్తున్నది. పెరుగుతూ వెళుతున్నది. దానికి ఇవ్వటం మాత్రమే తెలుసు. ఎవరికి ఇస్తున్నది? అందరికీ ఇస్తున్నది. దాంట్లో జాతి, మత, వర్గ, వర్ణ భేదాలు లేవు. ఎవరైనా పండు కోసుకోవచ్చు, తినచ్చు. ఎవరైనా నీడలో పడుకోవచ్చు. ఎవరైనా చెట్టు మీద ఎక్కవచ్చు, ఎవరైనా దిగొచ్చు. అట్లాగే అదే చెట్టు రామచిలకకి, దాని పక్కనే గుడ్లగూబకి ఆశ్రయం ఇస్తుంది. అదే చెట్టు కింద నుంచి చీమ పాకుతూ వెళుతుంటుంది, దాని పక్కనుంచి పాము కూడా ఎగబాకుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే, నిమిత్త మాత్రంగా, నిర్మమంగా, ఏదీ పట్టించుకోనట్లుగా, ఏదీ రాని, ఏదీ పోని, తాను ఉన్నన్నాళ్ళు తాను చేయవలసిన పనిని తాను చేస్తున్నది అని అర్థం. మన వైపు వచ్చి గనుక ఈశావాస్యోపనిషత్తు ఆహ్ కోణంలో గనుక విచారణ చేసినట్లయితే మనం ఆశ్రయం ఇవ్వాలి అంటే ఎన్నో ఆలోచిస్తాం. మన చేతిలో నుంచి ఒక వస్తువు ఇంకొకడికి ఇవ్వాలి, ఇంకొకడి ఆకలి తీర్చాలి అంటే, దాని వలన పుణ్యం వస్తుంది అంటే ఎక్కువ పెడతాం. అసలు స్పృహే లేనివాడు పెట్టడు. కానీ చెట్టువలె ఉండాలి మనిషి. చెట్టువలె విస్తృతం కావాలి. "అయ్యా మీ దగ్గర కాసేపు ఒక గంట, నాకు చాలా ఆకలిగా ఉంది, దాహంగా ఉంది" అన్నప్పుడు వాణ్ని పిలవాలి. పిలిచి ఒక చెట్టు ఎట్లా ప్రపంచానికి సేవ చేస్తున్నదో మనం కూడా అలా చేయాలి. అంటే జీవితానికి పరమార్థం ఏమిటి అని గనుక ఆలోచించినట్లయితే, జీవిత పరమార్థం మూడు స్థాయిల్లో, విషయమైనా ఎప్పుడూ చెప్తాను. భౌతిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక మూడు స్థాయిలున్నాయి. భౌతిక స్థాయిలో నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. number one. భౌతిక స్థాయిని దాటి ఆధి భౌతిక స్థాయికి వెళ్ళినప్పుడు అంటే నీ intellect నీకు సహాయ పడుతూ ఉంటుందా? నువ్వు చేసే మంచి పనులను కూడా వెనక్కి లాగుతుందా? అంటే, నీ intellect ఎవరి అధీనంలో ఉన్నదో దాన్ని బట్టి ఉంటుంది. నీ మనస్సు నీ అధీనంలో ఉంటే intellect కూడా నీ అధీనంలో ఉంటుంది. నీవు మనస్సుకి బందీవై ఉన్నట్లయితే, నీ intellect అహంకారం వైపు, దర్పం వైపు, దంభం వైపు, ప్రగల్భం వైపు, గర్వం వైపు నడిపిస్తుంది. దానివలన మానవీయమైనటువంటి ఒక కోణం మన నుంచి దూరమైపోతుంది గనుక చెట్టుని ఉదాహరణగా తీసుకుని మన జీవిత పరమార్థం ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, నేను నా జీవితాన్ని చక్కగా గడపాలి. జీవితం ఒక ఆనందమయమైనటువంటి భావన. దీనిలో చెడు ఉన్నదా? అంటే ఎండాకాలం ఉంది, చలికాలం ఉంది, వేసంకాలం ఉంది. అట్లాగే సుఖదుఃఖాలు ఉన్నాయి, శీతోష్ణాలు రెండూ ఉన్నాయి, ప్రపంచంలో ద్వంద్వాలు అన్నీ కూడా ఉన్నాయి. రెండింటి మధ్య ద్వంద్వాతీతమైనటువంటి స్థితిలో అవి ఎట్లా ఉన్నా, నేను నేనుగా ఉన్నానా, లేదా? నేనుగా అంటే ఆహ్ నా characteristics తో అని కాదు. నేను ఆత్మ స్వరూపంగా ఉన్నానా, లేదా? నేను సాక్షిభూతంగా ఉండగలిగానా, లేదా? నేను ఏదన్నా చిన్న కష్టం రాగానే కుంగిపోయి, లొంగిపోయి ఉండేకంటే, కష్టాన్ని కర్మనిష్ఠగా మార్చుకుంటూ ఒక మహానందం వచ్చి మనకు తెలియకుండా అనాయా-- ఆయాచిత వచ్చి ఒళ్ళో పడిపోతే దానిని కూడా సమర్థవంతంగా, నిబ్బరంగా accept చేస్తూ, "అవునులే, సుఖం ఎన్నాళ్ళు ఉంటుంది? ఇది పోయేదే" అనుకున్నవాడు నిజమైనటువంటి సుఖి. కష్టం ఏర్పడింది. కష్టం ఎన్నాళ్ళు ఉంటుంది? మన ఇంటికి వచ్చిన చుట్టం లాంటిది అది. చుట్టం ఎన్నాళ్ళు ఉంటాడు? వాడి పని అయ్యేదాకా ఉంటాడు. కాగానే పోతాడు. లోగానే మనం బెంబేలు పడిపోవలసిన పని లేదు గనుక కష్టము, సుఖము, వెలుగు, నీడ...ఎత్తు పల్లము మానము అవమానము వీటన్నింటినీ కూడా ద్వంద్వాలు అన్నింటినీ కూడా సమస్థితిలో అనుభవించగలిగినటువంటి ఒక మానసిక స్థితిని గనక నీవు తెచ్చుకోగలిగితే, నువ్వు ప్రపంచాన్ని అర్థం చేసుకోగలవు. ప్రకృతి పట్ల నీ గౌరవాన్ని నువ్వు పెంచగలవు, పెంపొందించుకోగలవు. అలాగే నువ్వు కూడా నీ జీవితాన్ని ఒక ప్రవహించేటువంటి జీవనది లాగా, అలాగే చాలాకాలం ఉండి మనకి అన్నీ ఇచ్చే ఒక చెట్టు లాగా సమస్త ప్రపంచానికి కూడా ఉపయోగపడే రీతిలో మన శరీరాన్ని మనం మలచుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి లేదా శిల్పీకరించుకోవాలి. కనుక-- ఎందుకని అంటే ప్రపంచంలో మన దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది అనుకుందాం. ఆయుధం మన దగ్గర లేదు, ఆయుధం మన చేతిలో ఉన్నది. ఆయుధం లేదనుకోండి మన చెయ్యే ఉన్నది. ముష్టి ఘాతంతో కూడా మనం మనల్ని మనం రక్షించుకోవచ్చు. అంటే మన శరీరంలో లేనిదంటూ లేదు. మిగతా ఏదో దాంట్లో తుపాకీ ఉన్నా, కర్ర ఉన్నా, కట్టె ఉన్నా, ఏదున్నా మనం అడిషనల్ గా తెచ్చుకుంటున్నటువంటి వస్తువే తప్ప మనకి భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కనుకనే శరీరం మాజ్యం ఖలు కర్మ సాధనం శరీరం మాజ్యం ఖలు ధర్మసాధనం. ధర్మంతో కూడిన కర్మ చేయటానికి శరీరం ఇవ్వ-ఇవ్వబడింది. వాటిని గనక గమనించినట్లయితే ఏది ధర్మము అని విచారణ చేసి, ప్రపంచానికి ఏది హితమో, ఏది సమస్త ప్రపంచం నుంచి ఒక అంగీకార ముద్రను పొందగలుగుతుందో, దేనివలన అంటే మనవునికి వ్యక్తులుగా మనల్ని తీసుకున్నట్లయితే మన వలన ప్రపంచానికి గనక హాని జరగకపోతే మనం మంచి వాళ్ళకింద లెక్క. మనం ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంతటి మా-- షట్ చక్రవర్తి అయినా వాడు ఎందు గనక అరిషడ్వర్గాలు విజృంభించున్నట్లయితే దానివలన ప్రపంచానికి అపకారం జరుగుతుంది గనక వాడు మంచివాడు కాదు అని నిర్ణయం అవుతుంది. అంటే ధర్మ నిర్ణయం ఏమిటి అంటే మనం మనంగా ఉండాలి, మనం ధర్మాన్ని ఆచరించాలి, ధర్మం ఒకటి ఉన్నది అని తెలుసుకోవాలి. అది వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము, దేశ ధర్మంగా మనం భావన చేయాలి. నాలుగింట్లలో మనం నిష్ణాతులమై ఉండాలి. వ్యక్తిగా నా ధర్మం ఏమిటి? నేను ఒక బిడ్డని తండ్రి గనక అయినట్లయితే నేను తండ్రిగా ఉండాలి. తండ్రిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి. తల్లిగా నా బాధ్యతలు నిర్వర్తించాలి. నేను నా సోదరుడికి అన్నగానో, తమ్ముడు గానో బాధ్యతను నిర్వర్తించాలి. నా భార్యకు నేను భర్తగా సంపూర్ణమైనటువంటి వాద్యతని భుజస్కంధాల మీద నేను వేసుకోవాలి. చేసి కలిసి సహ ప్రయాణం చేయాలి. అలాగే నేను ఒక యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు యజమానితో నేను నిజాయితీగా యజమాని యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకుంటూ, యజమాని ఒక చెట్టు లాంటి వాడు. చెట్టే గనక పోతే నీడే దొరకదు కాబట్టి నా ద్వారా నా యజమానికి ఎట్టి నష్టమూ కలగకూడదన్న రీతిలో మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. గురువు దగ్గరకు మనం శిష్యులుగా గనక వెళ్లినట్లయితే గురువు దగ్గర సమర్పణ, శరణాగతి, వినయం అన్న మూడు భావనలో సమర్పించుకోవాలి. గురువు కంటే అత్యుత్తమమైన గురోరధికం, అత్యుత్తమమైన వస్తువు లేదు. గురువు మనకంటే సర్వ సమర్ధుడు. ఆయన ముందు సమర్పించుకొని అంతా నీదే, అంతా నీ ఇష్టం అన్నట్లు ఉండాలి. రెండవది శరణాగతి చెంది ఉండాలి. మానసికంగా కూడా శరణాగతి చెంది-- శరణాగతి ఈజ్ నాట్ స్లేవరీ. బానిసత్వం కాదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నాకు ఎవరూ లేరయ్యా నువ్వు తప్ప అనటంలో మనల్ని మనం ఆయనకి సమర్పించుకుంటూ ఉన్నాం. ఎన్ని-- ఎంత పాండిత్యం ఉన్నా, ఎన్ని శాస్త్రాల మీద అధికార ముద్ర మనకున్నా, వేద వేదాంగాలు మొత్తం కంఠ గతమైనా, మనం ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి. సమర్పణ, శరణాగతి, వినయం అనేటువంటి మూడింటి వలన శరీరాన్ని మనం ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. కనుక శరీరమే మనకు ఉన్నటువంటి ఆయుధం గనుక, శరీరం గనక లేకపోతే ఏమీ చేయలేం గనుక శరీరం చూడండి ఉన్నన్నాళ్ళు అది ఆడుతుంది, పాడుతుంది, కూడుతుంది, వీడుతుంది. కానీ వీడేదాకా, కూడేదాకా, పోయేదాకా ఉన్నంతవరకు శరీరమే ఆధారం అవుతున్నది కదా! కాబట్టి శరీరాన్ని మనం ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి. జాగ్రత్త ఎట్లా పెట్టుకోగలం అంటే ఆహార, వ్యవహార, విహారాలలో సత్వగుణంతో ఉండాలి. సాత్విక ప్రధానమైన భోజనం చేయాలి. ఆహారం తీసుకోవాలి. లౌకిక వ్యవహారాలలో మనకు అక్కరలేని దానిలో వేలు పెట్టకూడదు. మనం ఏం చేయాలో చేసి నిమిత్తంగా కూర్చోవాలి. మన బాధ్యత మనం నిర్వర్తించాలి. కానీ ఇంటర్ఫియర్ కాకూడదు, ఇంటర్వీన్ కూడా కాకూడదు. మనం మనంగా ఉండాలి. ఇక విహారం, ఎక్కడికి వెళ్ళాలి? సత్యసాయి భగవానుడు ఉదాహరణకి మనకు నేర్పారు. సాయంకాలం అవగానే హాయిగా భజనకి వెళ్ళండి, మంచి నాలుగు మాటలు విని నేర్చుకోండి అనటంతో మన విహారాలన్నీ కూడా సత్సంఘాలకి, భజనలకి ఆహ్ పరిమితం అయిపోయినాయి. అంటే మనల్ని మనం కండిషన్ చేసుకుంటూ, శరీరం యొక్క శక్తిని మనం ఉద్దీపనం చేసుకుంటూ, మనలో ఉన్నటువంటి ప్రాణైక శక్తిని మరింతగా ప్రబలం చేసుకుంటూ శరీరాన్ని ఒక పదునైన ఆయుధంగా మనం చేసుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈశావాస్యం దీని గురించి చాలా చెబుతుంది. దీని తర్వాత, ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్‌గా చెప్తున్నాను. అవన్నీ ఆఖరి గ్రంథంలోకి గనక వెళితే ఒక ఈశావాస్యోపనిషత్తే మూడు నెలలు చెప్పుకోవచ్చు. అది మనకు అవసరం కాదు. టిప్స్ ఏమిటంటే మార్గం. సూచికలు కావాలి. ఇది అయిన తర్వాత...నువ్వు ఎట్లా అందరికీ సహాయపడగలుగుతావ్? నువ్వు నీ శరీరాన్ని ఒక ధర్మ కర్మ సాధనంగా ఎలా మార్చుకోగలవు అంటే, దానికి ఉపనిషత్ వాక్యమే. ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, "న కర్మణా ప్రజయా ధనేన చాగేనైకే అమృతత్వమానశుహు". నా దగ్గర కర్మణా, నేను అనేక దేవాలయాలు కట్టించి ఉండొచ్చు, చెరువులు తవ్వి ఉండొచ్చు, అనేక సత్కర్మలు చేసి ఉండొచ్చు. అది కాదు, అది మాత్రమే కాదు. అలాగే నాకొక లక్ష మంది పరిచయం అయి ఉండొచ్చు. వారు మాత్రమే కాదు. కర్మణా, ధనయా, డబ్బు. Tons of money ఉంది నా దగ్గర. కానీ అది కూడా కాదు. ప్రజయా, ప్రజలు అంటే మనం కాని వారందరూ కూడా ప్రజలే. వాళ్ళు కూడా కొన్ని అసంఖ్యాకమైన సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు కూడా కాదు. కానీ వీటి వలన నీకు అమృతత్వం రాదు. ఎందుకంటే, వాళ్ళందరూ ఉన్నా నువ్వెళ్ళిపోవచ్చు, నువ్వుండగానే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి డబ్బు ఉండదు, బంధువులు ఉండదు, ఉండరు, పరిచయిస్తులు ఉండరు, స్నేహితులు ఉండరు. నీవు చేసిన సత్కర్మల ఫలితాలని అది ఎప్పుడు అనుభవిస్తామో తెలియదు. కానీ ఇక్కడే, "ఇహమేవా" అన్నది వేదం. ఉపనిషత్ కూడా "ఇహమేవా" అన్నది. "ఇహమేవా" అంటే Now and Here. ఇప్పుడే, ఇక్కడే. అచ్చ తెలుగులో. ఏది ఉన్నా ఇక్కడే ఉందండి. ఏం జరగాలన్నా ఇప్పుడే జరగాలి. రేపు అనకండి. రేపుకు రూపం లేదు. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే ఎట్లా నేను శరీరాన్ని అద్భుతమైన ఆయుధంగా తయారు చేశాను కానీ దాన్ని వినియోగించను, ప్రయోజనం ఏముంది? దాన్ని వినియోగించాలి. "ఛాగేనైకే అమృతత్వమానశుహు" త్యాగం చేయాలి. త్యాగం అనంగానే సందాలు ఇవ్వటం కాదు. త్యాగం అనంగానే మన ఆస్తులన్నీ ఇచ్చి ఇంకొన్ని బాగుపరిచే ప్రయత్నం కాదు. మరి ఏమిటి? మనకి మొదట్లో చెప్పుకున్నాం. చిన్న అంకురం రెండు దళాలతో నమస్కరిస్తూ లోకంలోకి వచ్చిందన్నామే, రెండింటినీ అది వదిలిపెట్టింది. మనం వయస్సు పెరుగుతున్న కొద్దీ మనతోపాటు పెరిగే రెండు ఉన్నాయి. అది ఒకటి అహంకారము, రెండవది మమకారం. నేను మాత్రమే చేయగలను, ఇది నాకు మాత్రమే చెందాలి, అసలు నాకెందుకు ఇట్లా అవుతున్నది, ఇవన్నీ అహంకారానికి గుర్తులు. Ego అని ఇంగ్లీషు పదం. చాలా చిన్న పదం అది. మనం తెలుగులో మాట్లాడుకున్నాం. అహంకారం అంటే అన్నీ దేహ పరమైనటువంటి, ప్రవృత్తి పరమైనటువంటి, మానసికమైన మూల వాసనలకు పరిమితమైనటువంటి, సంస్కారానికి జోడింపబడినటువంటి, సంస్కృతి విలసన-విలసనంతో కూడినటువంటి ఒకమే-ఒక రకమైనటువంటి వ్యతిరిక్త భావం. [దగ్గు] కాబట్టి వ్యతిరిక్త భావము అహంకారంగా పెనవేసుకుంటూ బలాన్ని పెంచుకుంటూ వెళుతుంది. అలాగే మమకారం. ఏదో ఒక వస్తువును చూస్తాం. దాని యందు ముందు ఒక చిన్న ఇష్టం ఏర్పడుతుంది. ఇష్టం లో నుంచి ఇది నాకు దొరికితే బాగుండు అన్న కోరిక పుడుతుంది. నాకు కోరిక పుట్టిన తర్వాత కోరిక బలం అవుతుంది, బలపడుతుంది. బలపడిన కోరికలో నుంచి అది పొందే దాకా నాకు మోహం కలుగుతుంది. సంపాదించే దాకా మోహం అయిపోయిన తర్వాత ఏమైనా నాకు మాత్రమే చెందాలనే వ్యామోహం పెరుగుతుంది. చివరిదాకా మన కర్మలన్నీ, మన విహారాలు, వ్యవహారాలు, ఆహారాలన్నీ కూడా ఏమవుతాయంటే వ్యసనగతం అయిపోతాయి. అందువలన అప్పటికే మనల్ని మనం క్షీణింపజేసుకున్నాం. మన దగ్గర ఆయుధం ఉన్నది ఎట్లా వాడాలో తెలియదు. ఆయుధం ఉన్నది పరిమితంగా వాడుతున్నాం, అపరిమితమైన శక్తి దాని యందు ఉంది, అది వాడటం లేదు. కాబట్టి అహంకారం, మమకారాలు రెండూ గనక నువ్వు వదిలిపెట్టగలిగితే, ముందు తగ్గించుకోగలిగితే ఒకే రోజు పోవు అవి. నెమ్మది నెమ్మదిగా సజ్జన సాంగత్యం చేత, సత్సంగం చేత, సదాచారం చేత, సమ్యక్ సంకీర్తన చేత, విస్తృతమైనటువంటి భావన చేత, ప్రపంచానికంటే కూడా మూలమైన ఒక మహా శక్తి ఉన్నదన్నటువంటి విశ్వాసం చేత, ప్రకృతి నాకు తల్లి వంటిది అన్న భావన చేత అప్పుడు నెమ్మదిగా గనక మనం సంస్కరించుకున్నట్లయితే శరీరం చాలా బలవత్తరమైనటువంటి, బలీయమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన instrument అవుతుంది. సాధనా క్రమంలో జీవుడు తన శరీరాన్ని మలచుకుంటూ ఉన్నాడు. శరీరాన్ని మలచుకుంటూ, చిన్న ఒక చిన్న ఉదాహరణ. ఒక నృత్య కళాకారుడో, నృత్యం చేసే నాట్యకారుడో ఉన్నాడనుకుందాం. వాళ్ళు మొట్టమొదట చేసేటువంటి పని ఏమిటంటే శరీరాన్ని నిలబెట్టుకోవాలి. లేకపోతే వాళ్ళు ఆడలేరు, ఆడించలేరు. కాబట్టి శరీరానికి ఎటువంటి వ్యాయామం చేయాలో వాళ్ళకి తెలుసు. లేకపోతే వాళ్ళు భంగిమలు ప్రదర్శించలేరు. ప్రదర్శించినా ప్రయోజనం లేదు. అట్లాగే శరీరానికి ఆరోగ్యం ద్వారా, అంటే శరీరానికి ఆరోగ్యం ఇవ్వాలి. అది భౌతిక స్థాయి. సంతృప్తిని ఇవ్వాలి, ఇది రెండవది. అది మానసిక స్థాయి. తర్వాత ఆనందాన్ని ఇవ్వాలి. అది పరమ చరమమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయి. కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నది అంటే త్యాగంలో నుంచి వస్తున్నది. త్యాగంలో నుంచి ఏం కలుగుతుంది అంటే తృప్తి కలుగుతుంది. "త్యాగేనైకే అమృతత్వమానశుహు" అన్నాం కదా. తృప్తి అంటే ఏమిటి? ఏదో ఒక వస్తువు కావాలని అనుకొని వస్తువును పొంది, "అమ్మయ్యా! నా-నేనేం కోరుకున్నానో అది వచ్చింది" అది తృప్తి కాదు. మన వాకిట్లోకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు జ్ఞానం కోరి వచ్చాడా, విజ్ఞానం కోరి వచ్చాడా, ఆకలి తీర్చుకోవటానికి వచ్చాడాదాహం తీర్చుకోవటానికి వచ్చాడా? దేనికి వచ్చాడో గమనించి మన పరిధిలో మనం చేయగలిగినంత గనక చేసి అతనికి కొంత ఆనందాన్ని కలిగించగలిగినట్లయితే, ఆతడి ముఖంలో ఇచ్చిన వాడికి కాదు పుచ్చుకున్న వాడి ముఖంలో ఒక తృప్తి కలుగుతుంది. అమ్మయ్య! ప్రపంచం, సమాజం నన్ను వదిలిపెట్టలేదు. నాకే కష్టం వచ్చినా ఎవరో ఒక్కళ్ళన్నా ఉన్నారుగా! అనేటువంటిది ఒకటి. ఆకలి తీరగానే చాలు అంటాం. తృప్తి కలుగుతుంది. వంద రూపాయలు కావాలి, పది వేళ్ళకి వెళితే పది, పది రూపాయలు ఇచ్చిన వంద రూపాయలు వచ్చేస్తాయి. వాడికి వెయ్యి రూపాయలు అక్కర్ల. కావలసింది వందే. అది తృప్తి. ఒక తృప్తి ఒక త్యాగము రెండు ఒకచోట కలిసి ఉండాలి. త్యాగము వలన తృప్తి కలగాలి. తృప్తి కలిగిన వాడు మహా త్యాగి అవుతాడు. తృప్తి అంటే నాకు చాలు, అక్కరలేదు. ఏది? ఎంత? ఎప్పుడు? ఎవరి కోసమై? దేని కోసమై? ఏది కావాలో తెలుసుకోవటమే తృప్తి యొక్క ప్రధానమైనటువంటి అంశం కాబట్టి, త్యాగంలో నుంచి ఒక తృప్తి ఏర్పడింది. తృప్తి లో నుంచి ఒక ఆనందం, చూడండి మంచి ఆకలితో వచ్చాడు. ఆకలే ప్రధానం ప్రపంచం. ఎందుకంటే కలియుగం అంతా అన్నయ గతం. కృతయుగం అంతా అస్థి గతం. త్రేతాయుగం అంతా మాంస గతం. ద్వాపర యుగం అంతా రక్త గతం. కలియుగం మాత్రమే అన్న గతం. అన్నం బహు కురువీత. అన్నంలో నుంచే ప్రాణం. ప్రాణంలో నుంచే మనస్సు. అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు ఏర్పడుతున్నాయి. కడగా ఆనందమయం అది. కాబట్టి తృప్తి మనం వాడికి ఆకలి తీర్చాం, విస్తరేసి అన్నం పెట్టాం, మంచి నీళ్ళు ఇచ్చాం. కాసేపు కూర్చోవయ్యా! ఏం పరిగెత్తుతావ్? ముందు కాసేపు ఉండు అని మనం కాస్త వాత్సల్యంగా చూశాం. అప్పుడు వాడు మా-మనవైపు ఒక చూపు చూస్తాడు. ఎట్లా చూస్తాడంటే తృప్తితో చూస్తాడు. మనం ఇచ్చిన దాని వలన మనకి అహం పెరుగుతుంది. పుచ్చుకున్నందువలన వాడికి ఆనందం కలుగుతుంది. చూశారా? ఇక్కడ మనం ఇచ్చేవాడు కూడా అటువంటి భావనతోనే గనక ఇచ్చినట్లయితే మనకు కూడా ఆతని తృప్తి వలన కలిగిన ఆనందాన్ని చూసి మనకు కూడా ఆనందం కలుగుతుంది గనుక, దానివలన మనం అమృతత్వాన్ని పొందుతామని ఉపనిషద్ వాక్యం. కాబట్టి ఈశావాస్యోపనిషత్తు ఎట్లా ఒక్కొక్క అద్భుతమైనటువంటి పొరలు చీలుస్తూ, తెరలు తొలగిస్తూ మనల్ని అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తున్నదో చూడండి. ఇక ఆనందం కలగాలి. ఆనందం అంటే ఏమిటి? సుఖము, సంతోషము, ఆనందం అని మూడు మాటలున్నాయి. మనం వి-విస్తారంగా వాడేస్తాం వాటిని. చాలా ఆనందంగా ఉందండి వేళ అంటాం. సుఖంగా ఉన్నాం. సుఖం దేహానికి సంబంధించింది. సంతోషం మళ్ళీ మనసుకు సంబంధించింది. ఆనందం హృదయానికి సంబంధించింది. హృదయంలో ఎప్పుడైతే ఆలోచన లేదో, భావ శూన్య స్థితి ఏర్పడుతుందో, ఎప్పుడు నీవు నిర్మలంగా, నిశ్చలంగా, నిర్మమంగా, నికేతనంగా, నిరంజనంగా, హాయిగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంటావో క్షణంలో కలిగే దాని పేరు మనుష్య ఆనందం. మనిషిగా ఆనందాన్ని పొందావ్. ఏదో వస్తువు తెచ్చుకున్నావ్, లేదా ఒక పద్యం నేర్చుకున్నావ్, లేదా వేళ ఈశావాస్యోపనిషత్తు నువ్వొక్కడివై విన్నావ్, నేర్చుకున్నావ్. నీకేదో ఒక ఆనందం కలిగింది. నీలో మరుక్షణం కలిగేటువంటి కోరిక, ఆలోచన ఏంటంటే, నేను ఒక్కడినే కాదు నా స్నేహితులకు కూడా విషయం చెప్పాలి. అది మనీషా ఆనందం. మనీషా ఆనందం తర్వాత గంధర్వా ఆనందం అని ఒకటుంది. గంధర్వా ఆనందం అంటే కళాకారులందరిది కూడా గంధర్వా ఆనందం. గాంధర్వము అంటే కంటికి కనపడకుండానే, ఏది కనపడకుండా ఉన్నదో అది అభివ్యక్తమవుతుంది, దాని పేరు గాంధర్వం అవుతున్నది. కాబట్టి కనపడుతుంది. వ్యక్తీకరణ జరుగుతున్నది. పాటగాడు, ఒక ఆట కత్తె, వీళ్ళందరూ కూడా రంగస్థలం మీదికి రాగానే వాళ్ళలో ఉన్న కళా ప్రదర్శన చేస్తారు చూడండి, అది గాంధర్వ విద్య. గాంధర్వం మనుష్య ఆనందము అవుతుంది, మనీషా ఆనందం అవుతుంది, గంధర్వా ఆనందం అవుతుంది. తర్వాత, మానవ గంధర్వా ఆనందం అను రెండవ భాగం. మానవ గంధర్వా ఆనందం ఏమిటి అంటే, మనకున్నటువంటి ఒక ప్రజ్ఞ, బాగా మంచి హ్యాండ్ రైటింగుతో రాయటం, చక్కని భజన చేయటం, చిన్న చక్కని బొమ్మ గీయగలగటం, మంచి రంగవల్లి వేయగలగటం, ఇవన్నీ మానవ గంధర్వా ఆనందాలు ఇవి. ఇది దాటి దేవగంధర్వా ఆనందం అని మరొకటుంది. నేను చేస్తున్నానని నేను అనుకోవటం లేదు, పరమేశ్వరుడు నా చేత ఎంత బాగా చేయిస్తున్నాడు అని కలుగుతుంది మనకి. కలగాలి. కలిగినప్పుడు మనకు కర్తృత్వం ఉండదు. నేను చేశాను, నేను కూశాను, నేను రాశాను, నేను గీశాను ఇవేం ఉండవు. ఎవరో ఉన్నారు ఆయన నా చేత రాయిస్తున్నాడు, ఎవరో ఉన్నారు ఆయన నాతో పాడిస్తున్నాడు అనుకుంటాం. అది దేవగంధర్వా ఆనందం. అంటే మనకున్నటువంటి ఒక గాంధర్వమైనటువంటి ఒక స్కిల్, ఒక ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని ఈశ్వరునితో సమన్వయం చేసిన కారణంగా దానికి దేవగంధర్వా ఆనందము అని పేరు. ఇది దాటాక ప్రజాపితా ఆనందము అని ఒకటుంది. కళాకారుడు ఇంట్లో సాధన చేస్తాడు, ఇంట్లో ప్రదర్శన చేయడు. సాధన చేసుకుంటాడు. బయటికి వెళ్తాడు. ఆయన ముందు రెండు వే-- మూడు వేల మంది ఆ... శ్రోతలు లేదా ప్రేక్షకులు కూర్చొని ఉంటారు. ఆయన ప్రదర్శన ఆయన చేస్తాడు. అందరూ కరతాళ ధ్వనులు కూడా చేస్తారు. చేయగానే ప్రజాపితా ఆనందం కలుగుతుంది. అంటే ప్రజాపితా అంటే బ్రహ్మ అని కూడా ఒక భావముంది, ఇక్కడ అది relevant కాదు. ఇక్కడ ప్రజల యొక్క ఆనందం అనేక చప్పట్ల రూపంలో, కరతాళ ధ్వనుల రూపంలో వీడు కళాకారుడు అందుకున్నప్పుడు ప్రజాపితా ఆనందాన్ని పొందుతాడు జీవుడు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇంట్లో తల్లి తండ్రి ఉన్నారు.అబ్బాయి బయటికి వెళ్ళాడు అమ్మాయి బయటికి వెళ్ళింది పని చేయటానికి ఎటువంటి బిడ్డలని కన్నారండి? మీ అబ్బాయి మామూలు వాడా? ఎటువంటి ఆడపిల్లని కన్నారండి? ఎటువంటి సుగుణాల రాశి అండి? అని వాళ్ళు బయట వాళ్ళు పక్క వాళ్ళు కింద వాళ్ళు అందరూ వచ్చి మనకి చెప్తూ ఉన్నప్పుడు పితృ పితా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మన వాళ్ళ-- వాళ్ళు బయట చేసే performance మనకు తెలియదు కానీ అందరి వలన విన్నటువంటి మాటల వలన ఒక ఆనందం కలుగుతుంది. "అవునండి మా అబ్బాయి అసలు పుట్టుకతోనే చాలా అద్భుతమైన talent తో పుట్టాడు" అని ఎవరు అనరు. అంటే తెలియక అంటారు అంతే. తెలిసిన వాడు మాట అనడు. అందరూ వచ్చి పరోక్షంగా తాము కన్న బిడ్డలను ప్రశంసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఆనందాన్ని పొందుతారు. దానికే పితృ పితా ఆనందము అని పేరు. ఇక కడగా చిట్టచివరి highest state ఏమిటంటే దాని పేరు హిరణ్య గర్భానందము. హిరణ్య గర్భుడు అంటే పరమాత్మ. హిరణ్య గర్భుడు ఆనందిస్తాడట. ఎప్పుడు ఆనందిస్తాడు అంటే ఇప్పుడు చెప్పుకున్న ఆనంద తారక స్థితులన్నీ దాటుతూ దాటుతూ వెళ్ళి అప్పటికే తృప్తిని సాధన చేసుకుని శరీరాన్ని ఆరోగ్యం ద్వారా ఆయుష్మంతము కాంతివంతము చేసుకుని తన ప్రజ్ఞ ద్వారా లోకానికి శాంతిని క్రాంతిని కాంతిని దాంతిని హాయిని అనుగ్రహిస్తూ ఉన్నాడో, ఎట్లా తన అడుగుజాడల్లో తన భావాలని ప్రపంచానికి ఇస్తున్నాడో గమనించినప్పుడు పరమేశ్వరుడికి ఒక ఆనందం కలుగుతుంది. వీడు ఒక మానవ జన్మ ఎత్తినందుకు ప్రతి క్షణాన్ని దివ్యత్వంలోకి తీసుకు వెళుతున్నాడే, ఏదో ఒక చిన్న ఆలోచన లోపల పుట్టగానే దాన్ని వాడు మానవీయతా భావంతో ఆనందిస్తున్నాడు. అంతేకాదు దానికి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తున్నాడు. పరమేశ్వరుడికి సమర్పించి ఇందాక చెప్పిన సమర్పణ, శరణాగతి, వినయము అన్నటువంటి మూడు aspects తో తన జీవితాన్ని గడుపుతున్నాడే అని ఒక ఆయనకు ఆనందం కలుగుతుంది. ఒక ఆయన ఎవరు అంటే హిరణ్య గర్భుడు అయినటువంటి పరమాత్మ. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? నీ హృదయ స్థానంలో ఉన్నాడు. అంటే నీకు తెలియకుండానే నీలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ యొక్క కిరణమై నీ యందు ప్రవేశించినప్పుడు నీ ద్వారా జరుగుతున్న సమస్తమైన ఆహార, వ్యవహార, విహారాలు, నీలో కలిగిన తృప్తి, నీలో కలిగినటువంటి త్యాగం, నీలో కలిగినటువంటి అమృత భావనలు వీటన్నిటికీ పరవశం చెందుతున్నాడు. దానికే ఆంతరంగికమైన ఆత్మానందము అని మనం పేరు పెట్టాం. ఆత్మకి ఆనందం ఉంటుందా, దుఃఖం ఉంటుందా వేదాంతంలో ఆత్మకు ఏం లేవండి. "నీట నానదు, నిప్పున కాలదు, పుంగదు, పొంగదు" అని చెప్తున్నారే, మరి ఇటువంటి ఆత్మకు కూడా ఒక ఆనందం కలుగుతుందా అంటే అది ఎప్పుడూ ఆనంద స్వరూపమే. దానికి తెలియందంటూ ఉంటే దుఃఖం తెలియదు. దుఃఖం జీవుడికి తెలుసు ఆత్మకి సుఖం, ఆనందం, సంతోషం మాత్రమే తెలుసు. కాబట్టి భౌతిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక స్థాయిలు ఎట్లాగో దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, హృదయము వీటన్నింటినీ గనక సమన్వయం చేసుకున్నట్లయితే మనం కూడా భగవంతుడితో సమానమైన వ్యక్తులమే. "త్వమేవాహం సంశయః", "అహం బ్రహ్మాస్మి", "అయం ఆత్మా బ్రహ్మ", "ప్రజ్ఞానం బ్రహ్మ", "తత్వమసి" నాలుగే వేద మహావాక్యాలు. నాలుగింటల్లో తత్వమసికి వెళ్ళటానికి ఈశావాస్యోపనిషత్తు ప్రపంచాన్ని ఇవాళ భాషలో green channel గా వాడుకుందాం. green channel లో ఏమి ఉండదు. హాయిగా you are permitted to go through అంతే కదా. నిన్ను ఎవరు check చేసేవాడు ఉండడు. ఎప్పుడు check చేయడు అంటే నువ్వు green channel ద్వారా వెళ్ళటానికి అర్హత సంపాదించినప్పుడు నీ జోలికి ఎవరు రారు. అర్హత రావాలంటే తృప్తి ఉండాలి, త్యాగం ఉండాలి, ఆనందం ఉండాలి, శరీరాన్ని కర్మ యోగంలో కొలిమిలో నిప్పులో ఇనప వస్తువును ఎట్లా కాలుస్తాడో అట్లాగే కమ్మరి వాడు కాల్చినట్టుగా మనం కూడా మన శరీరం లోపల ఉన్న మనస్సు మనం గనక పని చేయకపోతే మనం మనసుకు బందీలం అయిపోతాం. మనస్సు ఏం చెప్తే అది చేస్తాం, ఇబ్బందుల్లో పడతాం. మనస్సుని "కాసేపు ఆగు, నువ్వు నన్ను పెడదారి పట్టిస్తున్నావు" అని చెప్పగలిగితే దానికి ఇదిగో సాధన అంతా కూడా మార్గం చెప్తూ ఈశావాస్యోపనిషత్తులో భాగం అయిపోయిన మరుక్షణం అది ఏం చెప్తుంది అంటే ఇది చదివితే ఏమిటి ఏం కలుగుతుంది అని అంటే ఒక వృత్తిలో ఉన్నాం మనం. We are in a job, we are in a profession, we are in business అనుకుందాం. అదే మన వృత్తి కావాలి, ఖచ్చితంగా కావాలి. ఇల్లు గడవాలి, ఇంటిని చక్కగా నడపాలి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆనంద గీతం లాగా రకమైన ఒడుదుడుకులు లేకుండా సంపాదించాలి, సంపదను సృష్టించాలి. అది మనిషి యొక్క బాధ్యత. సంపద చెడ్డది కాదు చెడ్డవాడి చేతిలో సంపద ఉండకూడదు అంతే. కాబట్టి ఇవన్నీ కూడా భావాలు లోపల మన యందు తారాడుతూ, పారాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రవృత్తి మార్గం వైపు వెళ్తాం. మనకో ప్రవృత్తి ఉంటుంది, a tendency అంటాం. tendency రెండు విధాలు negative and positive. ప్రవృత్తి ఏమిటంటే అది అతని ప్రవృత్తిలెండి అందరికీ సాయం చేస్తుంటాడు. ఇతనికి ఇది ప్రవృత్తిలెండి ఎవ్వడికి సాయం చేయ-- చేయడు. చేయగలిగి చేయడు. వాడు చేయగలిగినా, చేయలేకపోయినా సాధ్యమైనంత వరకు చేస్తాడు. అది ప్రవృత్తి. అంటే ఇంద్రియాలకు, సంస్కారానికి, సంస్కృతికి, జీవన వికాసానికి అనేకమైనటువంటి వాసనలకి, మూల వాసనలకి లోబడి అదంతా సాగుతుంది గనుక అది ప్రవృత్తి మార్గం అవుతుంది. ప్రవృత్తి కేవలం భౌతికము, ప్రాపంచికము. ఇది దాటి నివృత్తి మార్గంలోకి జీవుడు వెళ్ళాలి. నివృత్తి అంటే ఉదాత్తమైనటువంటి స్థాయి. అంటే తనకు ఏమీ అక్కరలేదు తాను అందరికీ అక్కరకు వచ్చేట్టుగా బతకాలి. చూశారా?పరమాత్ముని చూడండి ఆయనకేం కావాలి? నిజానికి మన దగ్గర ఉన్నన్ని వస్తువులు ఆయన దగ్గర లేవు. ఉన్నాయా? లేవు. కానీ ఆయన ఆనందంగా ఉన్నారు. మన దగ్గర ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు మన వాకిట్లో ఉన్నాయి కానీ మనకు సుఖం, శాంతి లేదు. కాబట్టి వస్తువు ద్వారా వచ్చేటువంటి సంతోషమైనా, సుఖమైనా ఇక్కడ ఆనందం లేదు. రెండే ఉంటాయి. రెండూ కూడా they are also transient and impermanent. తాత్కాలికం. పెద్ద టీవీ కొనుక్కోవాలి, home theatre పెట్టుకోవాలి అని ఎవడికో కోరిక కలిగింది. వెళ్ళాడు, లక్షలు ఖర్చుపెట్టి తెచ్చాడు. తెచ్చే వరకు ఆతృత ఉంది. తెచ్చాడు, బిగించాడు. ఒక రోజయింది, రెండు రోజులయింది, మూడో రోజయింది. అది కూడా అన్నింటి-- అన్ని వస్తువులతో పాటు అది కూడా ఒక వస్తువు అయిపోయింది. అంటే impermanent సంతోషం. మన అహాన్ని చల్లార్చుకునేటువంటి అట్లా కాకుండా, ప్రకృతి, ప్రపంచము, నదీనదాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు, పిట్టలు, మిట్టలు, గుట్టలు అన్నీ ఎట్లాగైతే ప్రకృతిని కాపాడుతున్నాయో, మానవుడికి స-- సర్వ సంరక్షణ చేస్తున్నాయో అట్లాగే నువ్వు కూడా ఒక rock వలే, ఒక కొండ వలే ఇంకోడి కోసం నిలబడాలి. మనకి చుట్టూ కొండలుంటాయి. ఎన్ని తీవ్రమైన గాలులు, పెనుగాలులు వీచినా మనకేం కావు. ఎందుకు కావంటే మనకి అడ్డంగా మనముంటాం, కొండవలే నిలబడ్డామంటాం. You stood like a rock behind me అంటాం. అంటే ఎవడో ఉన్నాడు మన వెనక. అది నది తీవ్రమైన దాహం వేసింది. మానవ శరీరంలో మన బోటి వాడికి వేసిన దాహం తీర్చటానికి కృష్ణానది అంతా మనకు కావాలా? పిడికెడు నీళ్లు, గుప్పెడు నీళ్లు చాలు మనకి. కాబట్టి కానీ ప్రకృతి అన్నీ మనకి పరచి తరచి ఉంచింది. అలాగే మనం కూడా ప్రకృతి కోసం, ప్రపంచం కోసం, సమాజం కోసం, కుటుంబం కోసం అలాగే దేశం కోసం మనం కూడా సర్వసన్నద్ధంగా ఉండాలి. ఇది ఈశావాస్యోపనిషత్తు జగత్తుని మొత్తం కూడా బ్రహ్మమయంగా చూడమని చెప్తుంది. ఈశావాస్యం ఇదం జగత్ అనేదానికి ఇంత అర్థం ఉన్నది. ఇది మాత్రమే కాకుండా, నివృత్తి మార్గంలోకి వెళ్ళేనటువంటి వాడు అంటే వృత్తిలోనే ఉంటాడు. వాడి ప్రవృత్తి వేరే ఉంటుంది. అంటే వాడు ITకి కావలసిన చదువు చదువుతాడు కానీ మంచి గాయకుడిగా ఉంటాడు. మంచి పోయెట్ గా ఉంటాడు. అద్భుతంగా మాట్లాడే ఒక కళ వాడి యందు ఉంటుంది. అంటే తాను చదువుకున్న చదువుకి తను ప్రదర్శిస్తున్న దానికి సంబంధం ఉండదు. "అదేంటి మీరు ఫలానా అయి ఉండాలే" అని అంటాడు. కానక్కర్లేదు. ఎందుకనంటే వృత్తి వేరు, అది కేవల భౌతికం. ప్రవృత్తి వేరు, అది మానసికం. నివృత్తి దానికంటే భిన్నం, అది హృదయగతం. అందుకనే దయ గలటువంటి హృదయమే దైవ మందిరం అని స్వామి చెప్తూ వచ్చారు. వాటిని మనం ఊరికే quotationsగా calendar మీద అతి rచేసుకుని ఆనందపడ్డాం. కాదు deepగా వెళ్ళాలి. దయ, జాలి, కరుణ దానిని అనుకంప అన్నారు. కరుణ, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు. మన యందు దయ ఉంటుంది, జాలి ఉంటుంది, సానుభూతి ఉంటుంది. కానీ మూడు కూడా అహంకారంతో లేసై ఉంటాయి, కలిసి ఉంటాయి. కరుణ ఒక్క పరమాత్మ యందు మాత్రమే ఉంటుంది. పరమాత్మనే కరుణామయుడు అంటాం, కరుణాపూర్ణ సుదాబ్ది అంటాం adjective. మనిషిని, "ఆయన కరుణామయుడండి" ఆము, "దయగలవాడండి" అంటాం. "ఆయనకి జాలి గుండె ఉందండి" అంటాం. "అబ్బో! ఆయన సానుభూతి మామూలుగా కాదండి" అంటాం. కరుణ దాకా మనిషి దగ్గరికి వెళ్ళడు. ఎందుకనంటే ఒక మానుషమైన, మనీషమైనటువంటి స్థాయిలో అక్కడే వాడు operate అవుతూ ఉంటాడు గానీ కరుణని ఇంకా తన సొంతం చేసుకోడు. దానికి కారణం ఏంటంటే వృత్తిలో ఉన్నవాడు వృత్తిలోనే ఉంటాడు. వాడంటాడు, "ఎందుకండీ భజనలన్నీ? ఎందుకండీ పుస్తకాలన్నీ? ఎందుకండీ ప్రవచనాలన్నీ? నేను నా వృత్తిని perfectగా చేస్తున్నాను, నిజాయితీగా చేస్తున్నాను. నా యజమానికి నేను మోసం చేయటం లేదు. అన్నీ మంచివే." కానీ అది ఒకటే స్థాయి కాదు కదా! నీలో ఉన్నటువంటి ప్రజ్ఞను కూడా ప్రపంచానికి ఆనందం కలిగించాలి కదా? ఏనకేన ప్రకారేణ యేస్య కశ్శాపి దేహినాః సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం అన్నది వేదం. అంటే ఇవాళ చాలా rationalగా గనక ఆలోచించినట్లయితే వేదం చాలా rationalగా చెప్పింది. ఉపనిషత్తులు మరింత rationalగా ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ అవే చెప్పినాయి. భాష వేరు కానీ మంత్రాలు, మాటలు, దాని యందున్నటువంటి ఆ, తార్కికమైనటువంటి ఒక విచారధార అంతా కూడా జీవితంతో సమన్వయం చేసింది గనుక జీవితం మనందరికీ కూడా ఒక chance అండి. ఇక్కడ choice లేదు, ఒక chance భగవంతుడు మనకిచ్చాడు లేదా మనం తెచ్చుకున్నాం. మరి chanceగా వచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేయటానికి లేదు కదా. ఏదో వచ్చాంలే, పుట్టాము, మెట్టాము, గిట్టాము, ఏదో కొన్నాళ్ళు ఉన్నాం తర్వాత పోయినాం, అది కాదు కదా. అట్లా పిపీలికాది అనేకమైనటువంటి జీవరాశులన్నీ అలానే పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, ఉరుగుతున్నాయి, కరుగుతున్నాయి, జారుతున్నాయి, మారుతున్నాయి, పోతున్నాయి. కానీ మనిషి దానికై రాలేదు. అనేక జన్మలు, ఎన్ని జన్మలు ఎత్తామో ఇప్పటికీ స్థాయికి వచ్చాం. ఇక్కడిదాకా వచ్చి జ్ఞానం అంటే ఏమిటి? ఉపనిషత్తు అంటే ఏమిటి? ఇవన్నీ మనం అడుగుతున్నాం. అడుగుతున్నాము అంటేనే మనలో ఒక పరిణామ క్రమం ఏర్పడింది గనుక ముందుగా ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే వృత్తిలో నీవు ఎట్లా ఉన్నా నీకు భగవంతుడు ఒక ప్రజ్ఞ ఇచ్చాడు. ప్రజ్ఞ ఏమిటో? ఒక ఆమె చక్కగా రంగవల్లులు వేస్తుంది. ఒక ఆమె-- ఆమెకు చదువు ఉండకపోవచ్చు, అద్భుతంగా వంట చేస్తుంది. లేదా ఇంకొక ఆమె విద్యాధికురాలై ఉంటుంది. పది మందికి పాఠం చెప్తుంది పిల్లలకి.అనేకమైనటువంటి విషయాలు చేస్తుంది. అంటే తమకున్నటువంటి ఒక్కొక్క ప్రజ్ఞ ద్వారా శరీరానికి మనస్సుకి ఆనందాన్ని కలిగించేటువంటి రీతిలో వృత్తిని ప్రవృత్తిగా మార్చుకోవాలి. అది మన ప్రవృత్తి అయిపోవాలి. మన వృత్తి ఏమిటో ఆవిడకి గుర్తుండకూడదు. అంత చక్క వృత్తి వైయక్తికం individualistic. నువ్వు ఉద్యోగం చేశావో ఎవరికి కావాలి? నీ bank balance ఎవరికి కావాలి? What way it is concerned? కదా! కాబట్టి ఏది concern అంటే నువ్వు ప్రపంచంలో ప్రవృత్తితో జీవిస్తున్నావన్నదే ప్రధానం. అందుకనే మానవుడు ఆ--లో ఒక animal instinct ఉంటుంది. అది residual animal instinct. జంతు స్వభావ రీత్యా కొంత జంతుత్వం ఉంటుంది. దానిని దాటి దాన్నే పశుత్వం అంటాం. దానిని దాటగలిగితే, ఇదిగో నివృత్తి మార్గంలో గనక మనం అడుగుపెడితే పరమేశ్వర తత్వం వైపు మన మనస్సు నడుస్తూ వెళుతుంది గనక, ఈశావాస్యోపనిషత్తు మనకి నిగూఢంగా బోధించే మరొక్క రెండు విషయాలు సందర్భంలో మనం ఇవాళ మాట్లాడుకోవాల్సినవి. మనం ఉన్నాం. మనమంతా పదిమందిని కూర్చొని ఉన్నాం. మనకి రెండు పారిశ్రావాలున్నాయి. ఒకటి మనస్సు రెండవది హృదయం. పాశ్చాత్యుడు mind and heart are one and the same అంటాడు. భారతీయ సిద్ధాంతంలో అది లేదు. భారతీయ సిద్ధాంతంలో మనసు వేరు హృదయం వేరు. మనసుతో ప్రపంచాన్ని చూడండి, అంతా డొల్లతనం కనిపిస్తుంది. ఒక్క ఆనందం ఉండదు. ఏదో అంతా తయారై బయటికి వెళ్ళేటప్పుడు వర్షం కురుస్తుంది అప్పుడు ప్రపంచం మంచిది కాదంటాం. మనకు కావలసింది అనుకున్నట్లుగా అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు అప్పుడు ప్రపంచాన్ని నిందిస్తాం. మరి ఏం మిగులుతున్నదయ్యా అంటే, నువ్వు నెమ్మదిగా ప్రపంచాన్ని హృదయంతో చూడటం మొదలుపెట్టు. హృదయంతో చూడటానికి ఇందాక చెప్పినవన్నీ జరగవలసిందే. అమృత పుత్రత్వం రావాలి, త్యాగం కావాలి, తృప్తి కావాలి, ఆనందానికి సుఖానికి సంతోషానికి తేడా తెలియాలి. ఇవన్నీ తెలిసి పరాప్రకృతి అంతా కూడా ఒక్కటే. పరమేశ్వరుడి యొక్క స్పర్శ లేకుండా అసలు ప్రపంచంలో వస్తువు లేదు, లేదు, లేదు అనే స్థిమిత భావన ఎప్పుడైతే వస్తుందో మనం మనస్సును కూడా వెనక్కి నెట్టేస్తాం. మరి ఏం మిగులుతున్నదయ్యా అంటే హృదయం మాత్రమే మిగులుతున్నది. అందుకని హృదయంతో ప్రపంచాన్ని చూసినప్పుడు ఇది నందనారమమై భాసిస్తుంది. ఇది ఒక ఆనంద సందోహంగా కనిపిస్తుంది. జీవితం కృష్ణ సంగీతంగా వినిపిస్తుంది. జీవితం ఆనంద తారకగా కనిపిస్తుంది. జీవితం ఒక అధ్యాత్మ వేదికగా కనిపిస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నది అంటే కవిత్వంలో నుంచి పుట్టలా మనం హృదయంతో చూడటం వలన కలిగింది. ఉదాహరణకి సత్యసాయి భగవానుని మనసుతో చూద్దాం. మనసు ద్వారా ఆయన్ని దర్శనం చేసుకున్నప్పుడు కలిగే అనుభూతులు, ఆ-ఆయన మంచి సౌందర్యవంతమైన వ్యక్తి, మహాపురుషుడు, ఎన్నో గొప్ప పనులు చేశారు, ఎవరూ చేయలేదు, ఎవరూ చేయలేని పనులు చేయటమే కాదు చేయించారు. ఇవన్నీ మనసుతో చెప్పే మాటలు. స్వామిని మనసుని మన మనసుని పక్కన పెట్టేయండి. హృదయంతో చూడటం మొదలు పెట్టండి. స్వామి యొక్క దివ్యత్వం అప్పుడు కానీ అనుభవంలోకి రాదు. మన వాకిట్లో ఉన్న ఒక చెట్టుని మీరు మనసుతో చూడండి. అది అడ్డంగా కనిపిస్తుంది ఒక్కోసారి. చెట్టే ఇక్కడ లేకపోతే అంతా కనిపించేది అనుకుంటాం. చెట్టే మనకు మన హృదయంతో చూసినప్పుడు నాకు ఎంత చల్లదనాన్ని, కమ్మదనాన్ని, హాయిని, ఒక aesthetic ambienceని నా ప్రయత్నం ఏమీ లేకుండా ఇచ్చిందే అని అంటాం చూడండి. అది హృదయంతో చూడటం. మనసుతో ప్రపంచాన్ని చూసినంత కాలం ఇది స్పర్ధామయం. హృదయంతో చూసినంత సేపు ఇది ఆనందమయం. కాబట్టి మనస్సు ఎక్కడ ఉన్నది హృదయం ఎక్కడ ఉన్నది అంటే రెండూ మన యందే ఉన్నాయి గనుక, మన యందు ఏది ఉన్నదో ప్రపంచం నుండా అది ఉన్నది గనుక, ప్రపంచంలో ఏదైతే ఉన్నదో అదంతా మన యందే ఉన్నది గనుక, పువ్వు పుడుతున్న మొగ్గ వికాసమానం చెందుతున్నది పువ్వు అవుతున్నది రాలిపోతున్నది. జీవుడు మనం పుడుతున్నాం, ఉంటున్నాం, పోతున్నాం. అంతే. కాబట్టి రకమైనటువంటి పోలిక లేని తరం కాదు ఉన్నదంతా కూడా ఒక్కటే. ఇక్కడ మనిషిగా, అక్కడ చెట్టుగా, అక్కడ నదిగా, మరొకటి పుట్టగా మనకు కనిపిస్తున్నాయి. రూపాలు భిన్నం కానీ ఉన్నదంతా ఒక్కటే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఏకం ఏవా ఒక్కటే ఉన్నది అసలు అన్నీ ఇన్నీ లేవు. ద్వితీయం రెండోదంటూ అసలు లేదు. ఎట్లా అంటే బ్రహ్మమై ఉన్నది. కాబట్టి నీవు బ్రహ్మము ఎట్లాగో ప్రకృతి బ్రహ్మమే. ఇప్పటిదాకా కూర్చోని--కూర్చోటానికి నాకు అవకాశం ఇచ్చి నాకు ఒక సుఖాన్ని ఒక comfortని ఇచ్చినటువంటి చిన్న కుర్చీ ఉన్నది చూడండి ఇది బ్రహ్మము. ఇక్కడ మాట్లాడుతున్నది ప్రపంచమంతా వినటానికి వచ్చిన technology ఉన్నది చూడండి అది బ్రహ్మము. నా పాట ద్వారా, ఆట ద్వారా, మాట ద్వారా ప్రపంచానికి నేను ఆనందం కలిగించగలిగితే అదే ಏನಕೇನಾ ಪ್ರಕಾರೇಣ ಯಸ್ಯ ಕಸ್ಯಾಪಿ ದೇಹಿನಃ ಸಂತೋಷಂ ಜನಯೇತ್ ಪ್ರಾಜ್ಞಃ ತದೇವ ಈಶ್ವರಪೂಜನಮ್. అది మాత్రమే ఈశ్వర పూజ అంటే ప్రకృతిని పూజించి ప్రకృతిని ఆరాధించి ప్రకృతికి నమస్కరిస్తూ నిద్ర లేస్తూనే ప్రపంచం--పచ్చటి చెట్టు చూడండి అన్నారు. ఎందుకు చూడాలి? చెట్టెప్పుడు తర్వాత ఇరవై మూడు గంటలు చూస్తాం కదా అని అంటే, నిద్ర లేవగానే పచ్చని చెట్టుని గనక చూస్తే మన లోపల ఉన్నటువంటి అంటే కంటి లోపల ఉన్నటువంటి అనేక పొరలు ప్రపంచంలో ఉన్న రంగులను చక్కగా ఆహ్వానిస్తాయి. అంటే దృశ్యం బాగా కనిపిస్తుంది, eyesight బాగుంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రీయమైన విషయాలు. వాటి జోలికి ఎక్కువ వెళ్ళకుండా ఇవాళ మనిషి ఏం చేయాలి? summing up. number one, అసలు ప్రపంచమంతా ఈశ్వరమయమే.దీనికి ఈశ్వరీయము అని పేరు పెట్టుకుందాం. ఈశ్వరుడు కానిదంటూ, బ్రహ్మ ముట్టనిదంటూ ఏం లేదు. గిలీ ఇక్కడే ఉంది, ఎంగిలి ఇక్కడే ఉంది. రెండూ ఇక్కడే ఉన్నాయి. దాని తర్వాత నేను అమృత లోకంలో నుంచి వచ్చినటువంటి మానవ జన్మ ఎత్తాను. మానవ జన్మ నాకు choice కాదు chance. chance ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నాను? త్యాగం వలన చేస్తున్నాను. త్యాగం వలన నాకేం కలిగింది? తృప్తి కలిగింది. తృప్తి వలన నీకేం కలిగింది? ఆనందం కలిగింది. ఆనందం వలన నీకేం కలిగింది? నా వృత్తి perfect అయింది. నా ప్రవృత్తి యొక్క రూపురేఖలు మారిపోయినాయి. నేను నెమ్మదిగా నివృత్తి మార్గంలో భగవంతుడు ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉండాలనేటువంటి ఆలోచనతో వెళుతున్నాను. అలాగే ప్రపంచాన్ని విషయాలన్నీ తెలియననాడు నేను నా మనసుతో చూసి ప్రపంచాన్ని చాలా నిందించాను. ప్రపంచం మీద కోపం పెంచుకున్నాను. కానీ నాకు హృదయం ఉన్నదని తద్వారా నేను ప్రపంచాన్ని చూడటం నేర్చుకున్నాను అని అనుకున్నప్పుడు, చూడటం మొదలు పెట్టినప్పుడు నాకు ప్రపంచం ఇందాక అన్నట్లు అది వనమూ అదే, బృందావనమూ అదే, నవనవోన్మేషమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్ణమాలిక అదే, సర్వమూ అదే "సర్వం ఖల్విదం బ్రహ్మ" అంటే ఉన్నదంతా బ్రహ్మమే అనేటువంటి భావనలోకి మనకి ఈశావాస్యోపనిషత్తు తీసుకొని వెళుతుంది గనుక అటువంటి దివ్య భావనలోకి మనందరం కూడా ఉపనిషత్తులని rational గా చదవాలి. మంత్రాలు అవి తర్వాత చదువుదురు గాని ముందు core దాంట్లో ఏముందో తెలిస్తే మంత్రాల ద్వారా అనుభూతిని ఎవరికి వాళ్ళం పొందుతాం. కానీ మంత్రాలన్నీ decode చేస్తే ఉన్నది మాత్రం ఇంతే. దీన్ని చక్కగా సత్య సాయి భగవానుడు కూడా ఉపనిషద్వాహిని ఆయన రాయటానికి కూర్చొని రాయటానికి గల-గల కారణం ఏమిటంటే దానిని కోణంలో కూడా మీరు చూడండి. పరమేశ్వరుడికే ప్రపంచంలోకి రాక తప్పలేదు కదా. ఇక్కడికి వచ్చారు కదా ఆయన కూడా. ఆయనకిష్టమున్నా లేకపోయినా మనవంటి దేహాన్ని ధరించారు కదా. కానీ దేహాన్ని ధరించి, మానవ దేహాన్ని ధరించి ఇదే ప్రకృతిలోకి, ఇదే ప్రపంచంలోకి వచ్చి ఆయన ఎట్లా ఉన్నారు? మనం ఎట్లా ఉన్నాము? ఇది నేర్చుకోమంటుంది ఈశావాస్యోపనిషత్. ఆయన ముందు కూర్చున్నటువంటి ఇరవై వేల మంది, ఆయన్ని గమనిస్తున్నటువంటి కోటానుకోట్ల మంది అందరియందు ఒక సమత్వము, ఏకత్వము, విస్తృతమైన మమకారం. ఆయనకి మమత కంటే, మమకారం కంటే విస్తృతమైన మమత. మమతాభావం ఏమిటంటే, అందరూ నా వారు. కనుకనే నేను అందరికీ చెందగలిగాను. అనేటువంటిది మనం కూడా సాధన చేయాలి. అటువంటి దిశగా ఈశావాస్యోపనిషత్తు మరింతగా మనల్ని లోతుల్లో లోలోతులకు తీసుకు వెళ్లాలని, అటువంటి యోగ్యతని, ప్రాప్తిని సర్వేశ్వరుడైన స్వామి ఒక మహా యోగంగా మనకు అనుగ్రహించు గాక అని మంగళాశాసనం చేస్తూ సాయి రామ్.
YouTube · audio

UPANISHAD VAHINI - I Part-2

Home

UPANISHAD VAHINI - I Part-2

Source: SSSHNR Himayath Nagar Samithi on YouTube

0:00 / 2:12:26

More in this series

Upanishad Vahini

4 episodes · 7 hr 32 min

  1. 56 min 1

    Upanishad Vahini

  2. 1 hr 9 min 2

    UPANISHAD VAHINI - I Part-2

    Now playing
  3. 1 hr 4 min 3

    UPANISHAD VAHINI - I Part-3

  4. 1 hr 6 min 4

    UPANISHAD VAHINI - I Part-4