Skip to content
Transcript తెలుగు
ఓం నమో వెంకటేశాయ గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం [ఇంట్రో సంగీతం] గురు సన్నిధి కార్యక్రమంలో మనము పురాణ పురుషోత్తముడు తెలుసుకునే క్రమంలో భాగంగా పురాణ వాహిని క్రమంలో భాగంగా ఈరోజు వామన పురాణం గురించి ఆధ్యాత్మిక వేత్త ఎస్.ఆర్.మూర్తి గారిని తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ గురువు గారు అసలు ఇది అన్ని పురాణాలు ఉన్నాయి. దాంట్లో ఇది ఎన్నో పురాణం వామన పురాణం? పద్దెనిమిది పురాణాల్లో పురాణం పద్నాలుగోవ పురాణం. అవతారం ఏమో ఐదవ అవతారం వామనావతారం. వామన పురాణం ఎన్ని శ్లోకాలు ఉంది? ఎన్ని సంహితలు ఉంది? అంటే పదివేల శ్లోకాలు మనకి ఇవాళ దొరుకు-- లభ్యమైనవి ఎన్ని అంటే పదివేలు. పూర్వ భాగం ఉత్తర భాగం అని రెండు ఉన్నాయి. ఉత్తర భాగం అందుబాటులో లేదు. అది చరిత్రకారులు ఏమైపోయిందో తెలీదు కాలగర్భంలో వెళ్ళిపోయినట్లుంది తెలీదు. కానీ పూర్వభాగంలో మాత్రం పదివేల శ్లోకాలు ఉన్నాయి. పదివేల శ్లోకాలలో ఏమున్నది అనేటువంటిది చాలా important అంతే కాదు అదే ప్రధానమైన అంశం. కానీ వామన పురాణం అనేటువంటి చిన్నదిగా కనిపించిన పదివేల శ్లోకాలతోనే ఉన్నా అనేకమైనటువంటి మూల వస్తువులన్నీ దాంట్లో ఉన్నాయి. చాలా మూలం. అంటే మనం చూడండి దీనికి మూలం ఎక్కడ అంటాం. మూలం వెతుక్కోవాలి అంటే వామన పురాణం చదవాలి. ఇందులో సంహితలు కూడా ఉన్నాయంటారు కదా - ఉన్నాయి నాలుగు సంహితలు ఆహ్ ఉన్నాయి మహేశ్వరి సంహిత - సంహిత భాగవత సంహిత - అవును సౌర సంహిత, గణేశ్వరి సంహిత అదే పేర్లను బట్టే మనకు తెలుస్తున్నది. సౌరము అంటే సూర్యుడు. గణేశ గణేష్ అంటే - గణేశ్వరుడు కేవలం గణేష్ మాత్రమే కాదు శివాత్మ కుటుంబం శివ మాత్యం శివ కుటుంబం మాత్య కుటుంబం కార్తికేయ జననం కార్తికేయ జననం. ఇవన్నీ శివ పురాణంగా ఉంటాయి. దీన్లో మహేశ్వరి సంహితలో ఏమేమున్నాయి? మహేశ్వరి సంహితలో శక్తిని గురించి ఉంది. సంపూర్ణమైన శక్తిని ఎలా ఆవిష్కరించాలి శక్-- అందుకనే దీంట్లో దుర్గాదేవి ఆహ్ విషయాలు కూడా ఉన్నాయి. అంటే అసలు ఉన్నదంతా శక్తే. ఉమ్ మనం రూపాలు దుర్గగా ఇంకోటిగా ఇంకోటిగా చెప్తాము. పార్వతీదేవిని గురించి ఉంది, దుర్గాదేవి గురించి, నరనారాయణ ఉపాఖ్యానం అని ఇంకోటుంది. ఆహ్ శ్రీ దుందు అని ఇంకోటుంది. ఇట్లా రకరకాల కథా కథనం అంతా దేనికి అంటే మనకు తెలిసిన జన బాహుళ్యంలో అందరికీ తెలిసినటువంటి దక్ష యజ్ఞం అదే ఆహ్ అక్కడికి వెళ్ళటం పిలవని పేరంటానికి వెళితే ఏమవుతుంది ఇవన్నీ సందేశాత్మకమైనటువంటి పురాణం ఇది. అలాగే ఇవాళ ఆహ్ వెంకటేశగిరి మహత్యం, సుదర్శన చక్రం ఎలా ఆవిర్భవించింది, అది ఎవరు ఎవరికి ఇచ్చారు ఆహ్ శివ కేశవ శక్తి మూడు కూడా ఒకే పురాణంలో చెప్పబడింది ఇక్కడే. అందువల్ల వామన పురాణం చాలా చాలా మామూలుగా ఆయన కథలో వామనుడు త్రివిక్రముడు అంటాం కదా ఇక్కడ కథ కూడా వామనమే కానీ దాని శక్తి త్రివిక్రమం. సౌర సంహితలో సూర్యదేవుని - సూర్యుడు సూర్యుడు గణేశ్వరుని సంహితలో గణేషుడి గురించి - అంతే అంతే తర్వాత ఇది ఎవరు ఎవరికి చెప్పారు గురువుగారు? ఇది చాలా ప్రధానం. మామూలుగా ఈవేళ ఆహ్ అం-అందరూ చెప్పేది ఏంటంటే బ్రహ్మదేవుడు చెప్పాడు అని. బ్రహ్మదేవుడు చెప్పలే. పులస్త్య బ్రహ్మ పులస్-- బ్రహ్మని బ్రహ్మతో కలుపుకున్నారు పొరపాటున. కానీ మొట్టమొదటి మూల వక్త ఆయన పేరు మూల వక్త చెప్పిన వాడు ఎవరంటే పులస్త్య బ్రహ్మ. ఎవరికి చెప్పారు? ఎవరి-- నారదుడు విన్నాడు. నారదుడు నారదుడు అంటేనే నారము అంటేనే జ్ఞానం. జ్ఞానం జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి నారదుడికి చెప్పినటువంటి వాడు పులస్త్య బ్రహ్మ. ఎవరు పులస్త్య బ్రహ్మ అంటే రావణ బ్రహ్మకు మూలమైన వాడు. నారదుడు అందుకనే మనం ఆయన్ని పౌలస్త్య బ్రహ్మ అని అంటాం పౌలస్త్య బ్రహ్మ పౌత్రుడు పౌలస్త్య హృదయము, పౌలస్త్య వధ ఇవన్నీ పులస్త్య లో నుంచి వచ్చినాయి. కాబట్టి ఎవరు చెప్పారు అంటే పులస్త్య బ్రహ్మ చెప్పాడు. విన్నవాడు ఎవరు అంటే నారద మహాముని. నారదుని నుంచి మళ్ళా వ్యాసుని నారదుని నుంచి వ్యాసుడు, వ్యాసుని నుంచి సూతుడు, సూతుని నుంచి శౌనకాది మునులు ఇవి అక్కడి నుంచి అది అక్కడ మొదలై ఇవాళ ఇక్కడిదాకా. అవును మనం కూడా అదే చెప్తున్నాం. మనం కూడా చెప్తున్నాం. అదే ఉమ్ ఇదీన్లో మంతమైన ప్రత్యేకత ఏంటి గురువుగారు? చాలా ఉందమ్మా. ఉపకథలుగా, వ్యాఖ్యానాలుగా, ఉపాఖ్యానాలుగా వాటిని గురించి మనం చెప్పుకున్నాం. మూలం తెలియాలి మనకి మూల-మూలాన్వేషణకు వెళ్ళాలి అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అందులో ప్రధానంగా నరనారాయణ ఉపాఖ్యానం నరనారాయణ అనగానే కృష్ణార్జునులు అనుకుంటాం మనం కాదు. నరనారాయణ ఇప్పుడు హిమాలయాల్లో నరనారాయణ గుహలున్నాయి. అవును బద్రికాశ్రమం బద్రికాశ్రమం దగ్గర నరనారాయణ గుహలున్నాయి. అక్కడికి వెళ్లి నిజంగా గనుక స్వచ్ఛమైనటువంటి అచ్చమైనటువంటి ధ్యానంలోకి వెళ్ళాలి అంటే భూమండలం మొత్తం మీద మహా సృష్టిలో నరనారాయణ గుహలోకి వెళ్ళాలి. నరనారాయణ గుహలోకి వెళ్ళినప్పుడు నరుడిలో ఉన్నటువంటి నారాయణుడిని అన్వేషించేటువంటి స్థాయి అది. అంటే మనల్ని మనం తెలుసుకునేటువంటిది. అంటే మనం వ్యావహారికంగా అకాడమిక్ గా ఇది ఇట్లా అది ఇట్లా విచారణ కంటే అది ఏమిటో అనుభూతి పొందాలి అనుభవం తెచ్చుకోవాలి అంటే నరనారాయణ ఉపాఖ్యానం ఆహ్ అది గుహల గురించిన విచారణ. అలాగే సుదర్శన చక్రం. ఎందుకని శివ కేశవ శక్తి అన్నాం కదా. అవును అయితే కాలగమనంలో శైవాచారాలు ప్రబలినప్పుడు శైవం ప్ర-ప్రబలినప్పుడు విష్ణువుని secondary స్థాయికి తీసుకువెళ్ళింది పురాణం. పురాణం తీసుకెళ్లారు పురాణం చెప్పేవాళ్ళు తీసుకెళ్లారు. కాబట్టి వేళంతా శివ పరం గానే సాగుతుంది అది. శివ పరం గా ఎట్లా సాగింది అంటే సుదర్శన చక్రం ఎవరు ఎవరికి ఇచ్చారు అని కదా ప్రశ్న. అవును అసలు విష్ణువుకి ఎవరు ఇవ్వగలరు అంటే శివుడిచ్చాడు. శివుడు వెళ్ళి శివుడి దగ్గరికి విష్ణువు వెళ్ళి అనే కథ అది. అంటే ఒక energy ని ఇచ్చాడు ఎవరికీ విష్ణువుకి ఇచ్చాడు. ఇచ్చి సుదర్శన చక్రం యొక్క కాల ప్రమాణం ఏమిటి అంటే కల్పాంతాలు యుగాంతాల వరకు అది ఉంటుంది. తర్వాత దేనినైనా ఖండించగలిగినటువంటి దాంట్లో అనేక కోణాలున్నాయి దా-దంతా mathematics ఉంది దాంట్లో. తర్వాత mechanical engineering ఉంది.అది దాని మీద ఒక్క దాని మీదే మూడు నాలుగు గంటలు మాట్లాడొచ్చు. ఏది? సుదర్శన చక్ర నిర్మాణం మీద. అద్భుతం అది. అంటే, ఈవేళ మనం మెటలర్జీ, లోహశాస్త్రం అంటున్నామే! దానినిండా లోహశాస్త్రం పెట్టారు. అందువల్ల ఇది శాస్త్రము, శాస్త్రీయము రెండు. శాస్త్రము భౌతికంగా. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. తర్వాత దుర్గాదేవి. దుర్గ అంటే ఏమిటి? మామూలుగా సుదర్శన చక్రము సూర్యుని దగ్గర నుంచి వచ్చిందంటారు. అని అంటారు. అంటే మన- సూర్యశక్తిని తగ్గించడం కోసమని అన్ని ఆయుధాలు వచ్చినాయి. ఆ, అంటే మన పద్దెనిమిది పురాణాలు గనక ఒకరోజు వరుసగా పెట్టి చదువుకుంటే, పరస్పర భిన్నమైనటువంటి వాదనలు దాంట్లోనే కనిపిస్తాయి. భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు ఇచ్చాడు అనేది ఒకచోట ఉంటుంది. శివుడు ఇచ్చాడు ఇక్కడ ఉంటుంది. సూర్యుడు ఇవ్వడు. సూర్యశక్తిని తగ్గించడానికి చేసిన క్రమంలో భాగంగా ఆయుధాలు వస్తాయి. తగ్గించడానికి. అంతే, అంతే. కానీ ఆయుధాలన్నీ కూడా విష్ణువుకి ఎక్కడ అవసరం? విష్ణు లోకంలో సుదర్శన చక్రం అవసరమే లేదనే- అవసరం లేదు. -కూర్చోవలసిందే. అవును. మరి లోకంలో దుష్ట సింహారం చేయాలి, ధర్మ సంస్థాపన చేయాలి. దేనిని ఖండించాలో ఖండించటానికి శక్తి కావాలి. మానవ శక్తి చాలదు గనుక, దైవం కూడా మానవ రూపంలో వచ్చినప్పుడు శక్తి కూడా పరిమితం గనుక, ఆయనకు అడిషనల్ గా ఇంకో శక్తి కావాలి. శక్తే సుదర్శనం. అదే. నిజానికి సుదర్శనానికి అర్థం ఏమిటంటే మనం మాట్లాడుకునే instrument కాదు. సు దర్శనం. మంచి దర్శనం. మంచి దర్శనం. ఎవరి దర్శనం? ఆత్మ దర్శనం. అది. అన్ని దర్శనాలకి నిదర్శనాలున్నాయి. ఆత్మ దర్శనానికి నిదర్శనం లేదు. నిదర్శనం లేదు. ఎవరైతే వాళ్ళ అనుభవం. ఎవరిది వాళ్ళదే. వాళ్ళ అనుభవం, వాళ్ళ అనుభూతి. కాబట్టి అది అసలు. అసలు సుదర్శనం అది. దాని వెనుక. అట్లా దుర్గాదేవి కథ. దుర్గము అంటే కోట. కోట అంటే అందరూ వెళ్ళలేరు కదా. దాటి వెళ్ళేది కాదు. కానీ దుర్గమమైన దానిలో కూడా తీసుకువెళ్లగలిగినటువంటి శక్తి అమ్మవారికి ఉన్నది గనుక, ఆమెను మించిన మరొక శక్తి లేదు గనుక, శక్తిని దుర్గా శక్తిగా మనం భావన చేస్తాం. దుర్గా శక్తిని నడిపించాలి అంటే, ఆ, జ్ఞానం కావాలి. అది సరస్వతీ శక్తి. రెండూ కలవాలి అంటే రమా శక్తి కావాలి. ఉహుం. రమా శక్తి అంటే ఒక ఐశ్వర్యం. ఐశ్వర్యం. అష్టైశ్వర్యాలు. కాబట్టి దుర్గ, అందుకనే మనం ఇప్పుడు దసరా అంటామే. అంటే దుర్గ, అంటే సరస్వతి, రా అంటే రమ. మూడు ఒకే ఎనర్జీ. అంతే. ఇవి ఒకటే ఎనర్జీ మూడు భాగాలుగా విభజించబడి మూడు మళ్ళీ ఒకే, ఆ, ఆవరణంలో పనిచేస్తూ ఉంటాయి గనుక దాని గురించిన ప్రస్తావన చాలా ఉంటుంది. ఇవాళ మన దుర్గా సప్తశతి, ఆ, ఇవన్నీ కూడా దానిలో మూలం నుంచి పుట్టినయి. ఇవన్నీ వేళ్ళు. అక్కడ పళ్ళు, ఆకులు ఏం కనపడవు. కానీ మూలం మాత్రం అది. మూలకథ కావాలంటే దానికి వెళ్ళాలి. అలాగే ఇవాళ మనం తిరుమల వేంకటేశ్వరస్వామి, ఆ, వేంకటేశ్వర అంటే రోజుల్లో వేంకటేశ్వర లేదు. వెంకటేశ- వెంకటేశగిరి అన్నమాట. వెంకటేశగిరి. వెంకటేశగిరి ఒక్కొక్కటి ఇవాళ, ఆ, ఏడుగా మనకి అనుభవంలోకి వస్తూ ఉన్నాయి. దీని మూలం కూడా అక్కడే ఉంది. వామన పురాణంలో. ఆ, వామన పురాణంలో మాత్రమే ఉంది. మిగతా పురాణాల్లో ప్రస్తావన లేదు. అది. అందులో పులస్త్య బ్రహ్మ అంటే పులస్త్య వంశంలో పుట్టినటువంటి బ్రహ్మ. బ్రహ్మ ఎవరు అంటే బ్రహ్మమును ఎరిగిన వాడు బ్రహ్మ. మనకు తెలిసిన చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కారకుడు. ఆయనకు అదొక ఉద్యోగం. అసలు బ్రహ్మ అంటే బ్రహ్మమును తెలిసిన వాడు బ్రహ్మ అవుతున్నాడు. పరబ్రహ్మ తత్వం. ఆ, బ్రహ్మము అంటే ఏమిటి? మూలతత్వం. మూలతత్వం. మూలతత్వం అంటే సృష్టి అంటే ఏమిటి? ఇది ఎందుకు వచ్చింది? సత్ అనేటువంటి దానిలో నుంచి ఒకటి ప్రవేశించింది. ప్రవేశిస్తే దానికి విశ్వం అని పేరు పెట్టాం. విశ్వంలో నుంచి ప్రపంచం వచ్చింది. పంచభూతాత్మక ప్రపంచం. ప్రపంచంలో నుంచే సంసారం ఏర్పడింది. సంసారంలో నుంచి వ్యక్తి ఏర్పడ్డాడు. మళ్ళీ వ్యక్తిలో నుంచి వ్యవ-- ఆ, వ్యష్టి, వ్యష్టి, వ్యవస్థ ఏర్పడింది. మళ్ళీ దాని నుంచి సృష్టి ఏర్పడింది. సృష్టి నుంచి పరమేష్టి ఏర్పడ్డాడు. అంటే ఏది ఒక, ఒక పెద్ద- అవును. -శున్నం, శూన్యాగా ఉన్నదో పూర్ణమే ఇక్కడ పూర్ణం అవుతున్నది గనుక వామన పురాణం దిశగా చాలా గొప్ప పురాణం. ఇందులో ప్రధానమైన కథ గురించి చెప్పుకుందాం. ఉమ్. ప్రధానమైన కథ దక్షయజ్ఞం సరే మనం చెప్పుకున్నాం. అది, అది సందేశం ఏమిటి అంటే, ప్రధాన కథకు వెళ్ళబోయే ముందు ఉన్నటువంటి ఒక మహత్తర సందేశం ఏమిటంటే, మానవజాతి, పురాణాలు, వామన పురాణం ఇవాళ అసలు ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకు చదవాలి? చదవాలంటే ఒకనాటి మహాత్ముల దర్శనాలనేది ఇందులో ఉన్నాయి. ఉమ్. వాళ్ళు మనలాగా ఇంజనీరింగ్ చేయలే, మనలాగా యూనివర్సిటీలోకి పోలే. కేవలం జ్ఞానైక దృష్టితో భూగోళంలో ఉంటూ ఖగోళాన్ని దర్శనం చేశారు. ఖగోళంలో ఉంటూ భూలోకాన్ని దర్శనం చేశారు. వాళ్ళకి అవని, ఆకాశము, పంచభూతాలు అన్నీ కూడా వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతాయి. అందుకే ఇందాక చెప్పినట్లుగా దాంట్లో కెమిస్ట్రీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉన్నాయి, కొలతలున్నాయి. ఇప్పుడు మేరు, మేరు నిర్మాణం చేయండి అనగానే, ఆ, ఆయన కొలతలు తెలియకపోతే మేరు రాదు. కాబట్టి దాంట్లో సమస్త శాస్త్రాలు కూడా శాస్త్రీయమైనటువంటి కోణంలో చెప్పబడ్డాయి. అందులో చాలా ప్రధానమైనటువంటి, పేరే వామన పురాణం. కాబట్టి ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఏమిటి ప్రధానమైన కథ అంటే వామనావతార ఘట్టం. ఏముందండి? ఆయన వచ్చాడు, మూడు అడుగులు నేల అడిగాడు. అది కాదు. చాలా విస్తృతమైనటువంటి కథ అది. దాన్ని భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక మూడు స్థాయిల్లో అర్థం చేసుకోవాలి. మామూలు కథ సరే చెప్పుకుందాం, అది కూడా చెప్పుకోవాలి. సరే అదితి కశ్యపుడు కదా. అదితికి ఒక కోరిక కలిగింది. ఏం కోరిక అంటే ఎప్పటికైనా నారాయణమూర్తి లాంటి కొడుకు కావాలి. దాని వెనుక ఒక బాధ కూడా ఉందనుకుంటాను. అందుకే. రాక్షసులు దేవతలను జయించినారు కాబట్టి- అందుకనే, అందుకనే. -మళ్ళీ తనకు బిడ్డలు ఇది కావాలని. ఇది కావాలి. తర-- తరతరాల గురించిన ఆలోచన చేసి ఆవిడ శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేసింది. ఇది కథగానే చెప్పుకుందాం.చేస్తే ఆయన మామూలు ప్రార్థిస్తే వస్తాడు కదా వచ్చాడు ఏం కావాలి అని అడిగాడు నీలాంటి కొడుకు నాకు కొడుకు కావాలి ఉమ్ నాకు ముందు నాకు ఆనందం కలగాలి ఇగో నా పక్కన నా భర్త ఉన్నారు ఆయనకు కూడా ఆనందం కలగాలి నీలాంటి వాడు అని అడిగింది అప్పుడు ఆయన ఏమంటా-- ఏమన్నాడంటే నువ్వు నీలాంటి వాడు నీలాంటి వాడు అని అంటున్నావు నాలంటి వాడు మరొకడు లేడు ఇంకొకడు లేడు కనుక నేనే నీ గర్భంలోకి వస్తాను నేనే నీ బిడ్డగా వస్తాను మహా ఆనంద పడిపోయింది నీలాంటి వాడు అని దాటి అసలు వాడే వస్తున్నప్పుడు మరి తల్లికి ఆనందం కదా ఆయన ఏం చేశాడు వామనుడిగా వచ్చాడు వామనుడు అంటే మరుగుజ్జు అని కాదు వమనం చేశాడు ఆయన వమనం చేసి వామనుడు అయింది వమనం అంటే ఇవాళ బయటకు రావటం సర్-- బయటకి తనకున్నటువంటి వైష్ణవ శక్తినంతా బయటకు తెచ్చి వమనం చేసి వామనుడిగా వచ్చాడు ఆయన వయస్సు మనం అనుకున్నట్లుగానే ఇవాళ ఎనిమిదేళ్ళు పదేళ్ళు పన్నెండేళ్ళు ఇట్లా అనుకున్నట్లే రోజుల్లో కూడా చిన్నవాడిగా వచ్చాడు వామనుడు మరుగుజ్జు అని రాస్తున్నారు కవి-- కవులు రాయకూడదు ఆయన మరుగుజ్జు కాదు రూపంలో వయస్సులో వెళ్ళాడు యజ్ఞం దగ్గరికి ఇది అదితి కథ అక్కడ అయిపోయింది ఆవిడ ఆయన బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగింది అదితి మరి ప్రతి అవతారానికి ఒక పరమార్థం ఉంది కదా కాల కార్య కారణ కర్తవ్య మూడింటితోనే వస్తాడు పరమాత్మ పరమాత్మే కాదు మనం కూడా మనం కూడా కార్యకారణ సంబంధం లేకుండా రా లేకుంటే రామోస్లు కాలానికి లోబడే ఉంటాం అది యాభై ఏళ్ళా డెభై ఏళ్ళా తొంభై ఏళ్ళా అది కాలానికి వదిలేద్దాం అవును కాలం అయింది కార్యము ఇక్కడికొచ్చి ఏదో పని చేయాలి పని ఉద్యోగమా వ్యాపారమా కాదు భగవంతుడు నిర్దేశించినటువంటి ఏదో ఒక పని మనకున్నది అది మనకు తెలియదు అది కాలం నెమ్మదిగా దాన్ని బయటకు తీసి ఇదిగో నువ్వు దీనికై వచ్చావు అని చెబుతుంది అందుకనే దానిలో ఒక స్థాయికి వెళ్ళిన వాడిని మనం ఏమంటున్నాం కారణ జన్ముడు అంటాం కారణ జన్ములందరూ ఒక పక్కన రణ జన్ములందరూ ఒక పక్కన జీవితంతో యుద్ధం చేస్తూనే వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి అంటే వీళ్ళకి కారణం తెలుసుకునేంత స్థితి ఉండకపోవచ్చేమో రణజన్-- రణజన్ములకు రణ జన్ములకు అసలు దాంతోనే టైం అయిపోతుంది ఇప్పుడు జీవితం విసిరే సవాళ్ళు ఒత్తిళ్ళు వీటితో వాటిని ఎదుర్కోవటంతోనే అందుకే రణం అంటే యుద్ధం కదా యుద్ధంలోనే టైం అయిపోతుంది కారణ జన్మునికి అంత టైం ఉండదు కారణ జన్మునికి అసలు ఆయనకు రణమే లేదు ఆయన కారణం కనుక్కొని వచ్చాడు కనుక్కొని నిర్ణయించుకొని తల్లిని తండ్రిని లేకపోతే అదితి గర్భంలోకి ఆయన ఎలా వచ్చాడు అడగ్గానే వచ్చాడా ఆవిడకి అర్హత ఉంది గనుక వచ్చాడు కాబట్టి కాలం కార్యం కార్యం కూడా తెలుసు దాన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎంత కాలంలో చేయాలి ఇవన్నీ ఉన్నాయి అవును వీటన్నింటికీ ఒక కారణం ఉంది కారణం ఏమిటి ఇందాక మీరు అన్నట్లుగా రాక్షసుల యొక్క విజృంభణ వాళ్ళలో ఉన్నటువంటి అవిద్య అనాచారం అస్పష్టత అహంకారం అభిజాత్యం గంభీరం గర్వం ప్రగల్భం క్రూరత్వం ఇవన్నీ ఉన్నాయి వీటిని సమసింప చేయాలి అంటే ఒక పరమేశ్వరుడు తప్ప పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు కాదు అది కాబట్టి ఆయన ఒక అవతారం రూపం తీసుకుని రావాలి అలా కార్య కారణం అదైంది ఇక కర్తవ్య మిగిలింది ఏమిటంటే మూడింటిని నిర్వహించటం అది ఎలా నిర్వహించాలి దాంట్లో యుక్తి ఉంటుంది చమత్కారం ఉంటుంది ప్రేమ ఉంటుంది అవసరమైనటువంటి కాఠిన్యం ఉంటుంది దాంతో పాటే పూరేకులలో ఉన్నటువంటి మార్దవం ఉంటుంది లాలిత్యం ఉంటుంది అనేక రకాల అనేక రసపోషణ చేస్తూ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయన అలా వచ్చాడు వచ్చినప్పుడు ఇవి తల-- ఈయన కథ ఇలా ఉంటే ఆయన బయలుదేరే టైం కి యజ్ఞం జరుగుతున్నది యజ్ఞం ఎవరు చేస్తున్నారు బలి చక్రవర్తి ఆధ్వర్యవం ఎవరిది శుక్రాచార్యుడిది శుక్రాచార్యుడు ఎవరు రాక్షస గురువు రాక్షస గురువు ఇక్కడ బలి నిజానికి రాక్షస భావం కలిగిన వాడు కాదు బలి దైవభక్తుడు దానశీలుడు కానీ దాన అహంకారం ఉంది దానవ అహంకారం లేదు దానవ అంటే రాక్షసులకుండే అహంకారం లేదు అహంకారం లేదు దానాహంకారం నన్ను మించిన దాత ప్రపంచంలో లేడు అని ఒకటి రెండవది దానం చేస్తూ గనుక వెళితే ఇంద్ర పదవి స్పష్టంగా ఖాయంగా నాకే ఉంటుంది అని నమ్మినవాడు కాబట్టి ఇంద్ర పదవి వల్ల తను తన వంశము తనకు సంబంధించిన వారు అంతా బాగుండాలి అని కోరుకున్నాడు నేను నా వాళ్ళు నాతో పాటు ప్రపంచం అన్నవాడు సర్వోత్తముడు ఓకే నేను నా వాళ్ళు అంటే చాలా చిన్న పరిధి కదా అది ఎంత ప్రపంచం మొత్తం వాడి చేతిలో పెట్టాం అనుకోండి అనుభవించగలడా? లేడు లేదు కాబట్టి నేను ఉండాలి నాతో ఉండాలి ఉన్న వాళ్ళు ఉండాలి బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు ప్రపంచం ప్రపంచం తర్వాత ప్రపంచంలో ఉన్న అందరూ నా వలన సుఖపడాలి ఇది మూడవది నా వలన సుఖపడాలి ఇప్పుడు నా సుఖం నేను ఒక్కడినే ఎక్కువ కాలం అనుభవించలేను కదా అందుకనే మనకి నాలుగు విషయాలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా ముందు మనం ఎవరో మనం తెలుసుకోవటం లాస్ట్ విచిత్రం అది కానీ ముందే మనం తెలుసుకుంటే అసలు జీవితంలో యాతనే ఉండదు కానీ మనకి మనం ఎప్పుడూ మన చదువు చేత శాస్త్రాధ్యయనం చేత సంపద చేత పాండిత్యం చేత సౌందర్యం చేత కీర్తి చేత మనకి అదే మనం అనుకుంటాం అది మనం కాదు మన వలన అవన్నీ మన చుట్టూ ఏర్పడ్డాయి ఏర్పడిన వాటి మధ్యలో మనం ఉన్నాం అంతే కదా కానీ ఇది ఎంతో కాలం వాడు అనుభవించలేడు ఇట్లా మీరు ఒక్కరే కూర్చొని మీకున్న సంపదనంతా మీరు అనుభవించగలరా? ఇంపాజిబుల్ కాబట్టి మీరు ఏం చేస్తారు? ఇంకో నలుగురు ఇంకో నలుగురు ఉంటే బాగుండు నలుగురు వచ్చి మనం దాంతో ఎంజాయ్ చేస్తే మనకు సంతోషం సంతోషం నలుగురు సంతోషంగా ఉన్న సంతోషమే మీకు మిగిలేది మీరు పొందేది మీ దగ్గర ఉండదు అది ఎప్పుడూ ఆవిరైపోతూ ఉంటుంది కాబట్టి అది రెండవ స్థాయి మూడవ స్థాయికి వెళ్ళిన తర్వాత నేను నేను పిలిచిన పది మంది కాదుప్రపంచంలో కొన్ని వేల లక్షల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆనందంలో భాగం కావాలని మూడవ స్థాయి. మూడు స్థాయిలు అయిపోయిన తర్వాత ఇక మీరు కాక ఆనందాన్ని అనుభవించడానికి వేరే వ్యక్తి లేడు. వేరే వ్యక్తి ఎప్పుడైతే లేడో సర్వాత్మ గా ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఆనందమయ స్థితిలో ఉండటానికి నేను ఎలా ఉండాలి అని ప్రశ్నించుకుంటాడు. సంపద పంచి పెట్టాను. ఇవ్వవలసినవి ఇచ్చాను కానీ నాకేమి ఆనందం కలగటంలే ఏదో ఇస్తున్నాను పుచ్చుకుంటున్నాను ఇస్తున్నాను పుచ్చుకుంటున్నాను కానీ ఎక్కడో ఇది ఆగటం లేదే అనేటువంటి స్థాయి వాడికి మనసుకు ఏర్పడినప్పుడు అసలు నేను ఎందుకు వచ్చాను దేనికోసమై వచ్చాను ఇవన్నీ నా ద్వారా ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి ఒక వైరాగ్య విభూతి పూర్తి సమర్పణ దానిలో శరణాగతి పొందుతాడు శరణాగతి పొందిన వాడు వినయంగా ఉంటాడు. మూడు జరగాలి అంటే ముందు అహంకారం ఉండాలి అంతే కదా. అహంకారం దాన అహంకారంతో ఉన్నటువంటి బలి. సరే మహా ముహులు, జ్ఞానులు, సిద్ధ పురుషులు మామూలు యజ్ఞమా? సర్వ ప్రపంచం శాంతిధామంగా ఉండాలని కోరుకున్నాడు బలి చక్రవర్తి. సరే ఇంతలోకే ఆయన రానే వచ్చాడు. వస్తున్నటువంటి వారిని చూడగానే పసివాడు ఆయన కంటే ఉన్నవారు వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులు, కర్మవీరులు, ధీర, వీర, శూర, గంభీరమైనటువంటి స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి లేచి నిల్చున్నారు. శుక్రాచార్యుడికి అనుమానం వచ్చింది. ఇంతమందిని ఆకర్షించింది ఇతని రూపమా? ఇతని వెనుక ఉన్న శక్తే. అతను రాక్షసుల గురువైనా అతడు కూడా ఒక జ్ఞాని. జ్ఞానానికి రెండు పార్శ్వాలు ఉన్నాయమ్మా. ఒకటి negative రెండవది positive. ఇవాళ మన భాషలో negative intelligence, positive intelligence ఉంది కదా. Negative intelligence శుక్రాచార్యుడు, positive intelligence బృహస్పతి. బృహస్పతి. కాబట్టి బృహస్పతికి story లో ఆయనకి అవకాశం లేదు లేదు అవకాశం లేదు ఎందుకంటే ఆయన- So negative intelligence పనిచేస్తుంది negative intelligence ఉంది ఆవరణలో. ఎక్కడ? యజ్ఞశాల మొత్తంలో. ఇంకా వచ్చినటువంటి వాడు తేజోమయుడై నడిచి వస్తున్నాడు. బలిలో ఉన్నటువంటి బలి చక్రవర్తి లో ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి సంస్కారం ఒక్కసారి లేచి నుంచొని ఎదురెళ్ళాడు. ఎదురెళ్లి ఆయన్ని ఆహ్వానం చేశాడు. ఆహ్వానం చేసి సముచితమైనటువంటి ఒక ఆసనం ఇచ్చి "ఇక్కడ కూర్చోండి" అన్నాడు. "ఎక్కడి వాడివి? ఎందుకు వచ్చావు? అసలు నేను ఎంత పుణ్యం చేస్తు-" మామూలుగా అయితే ఏదో చిన్న పిల్లోడు వచ్చాడులే వచ్చాడు అడుక్కు పాడుకుంటాడులే అని అనుకుంటాం అనుకుంటాం మనం కానీ వచ్చినవాడు గమనించం మనం గొడుగు, జంజం, కమండలం, పావుకోళ్ళు వేసుకుని వచ్చినటువంటి వాడు ఎట్లా ఉన్నాడు? ఒక మహా విస్తృతమైనటువంటి విరాట్ మూర్తి సంక్షిప్త స్వరూపంగా వచ్చినట్టు బలికి అర్థమైంది. కానీ అతను విష్ణువు అని శివుడు అని ఏం తెలియదు. దేవుడని కూడా తెలియదు. ఎవరో కుర్రాడు వచ్చాడు మంచి ఆకర్షణ కూర్చోబెట్టాడు అప్పుడు సంవాదం ప్రారంభమైంది. ప్రారంభమైతే "నీకేం కావాలి?" అని అడిగాడు. "ముందుగా అసలు నా యజ్ఞశాలలోకి ప్రవేశించావు నాకు మహదానందంగా ఉంది" అని మామూలు ప్రశ్నలు వేస్తుంటే పక్కన శుక్రాచార్యుడు అన్నాడు "మాయలో పడకు నిన్ను మోసం చేయడానికి వచ్చాడు. ఏం అడుగుతాడు ఏం అడగడు కాదు నువ్వు అడక్కు అతను ఏమడుగుతాడో విను అప్పటిదాకా ఆగమన్నాడు" కానీ ఇతనికి దానాహంకారం ఉంది. అవును నేనే ఇస్తాను ఏదో ఒక జంజం వేసుకుని వచ్చాడు ఈయనకు ఒక పది రూపాయలు ఇద్దాం అన్నట్లుగా "ఏం ఇవ్వాలి?" అని అడిగాడు. ఆయన ఎక్కువ మాట్లాడకుండా మౌనం వహించి కాసేపు అయిన తర్వాత "ఏముంది నాకు? నా నా వయస్సు ఎంత? నా శరీరం ఎంత? నేను ఎంత? ఒక మూడడుగులు నేల ఇస్తే చాలు." మూడడుగుల నేల. నిజానికి ఇక్కడొక మీమాంస ఉందమ్మా. మూడడుగులు అడిగాడు అని కథా ప్రపంచంలోకి వచ్చేసింది. పురాణాలు, బుర్రకథలు, హరికథలు అందువల్లనే మనకు కూడా తెలుసు ప్రవచనాలు, సినిమాలు అన్నీ. మూడడుగులు అడిగా- ఆయన అట్లా అడగలా. రెండు మూడడుగులు అన్నాడు. ఓహో ఇది చాలా సూక్ష్మంగా చదవాలి. "ఏముంది" అంటాం. "ఏదో ఒకటో రెండో ఇవ్వండి" అంటాం. అంటే ఒకటి కానీ రెండు గానీ అని అర్థం. అంతే కదా. రెండు మూడు అడుగులు అన్నాడు. నిజానికి ఆయన అడిగింది ఐదు అడుగులు. ఆహా రెండు ప్లస్ మూడు రెండు ప్లస్ మూడు. చాలా tactful గా అడిగాడు ఆయన. అడిగితే సరే సూక్ష్మ బుద్ధి కాదుగా, దా- అహంకారంతో ఉన్నాడుగా. సరే ఏదో అడిగాడు మూడు అడుగులు ఇస్తే పోలేదా అని ఈయన అనుకున్నాడు. అన్న తర్వాత అస్సలు బలి చక్రవర్తి లో ఉన్న దానాహంకారం బయటికి వచ్చింది. ఏమంటాడంటే "ఏమిటిది? నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఎక్కడిదాకా వచ్చావు? నీకు ఎవరో తెలుసా?" స్థాయి తగ్గట్టడగాలి కదా "నేను నువ్వు అడగవలసింది ఏమిటో తెలుసా? ఒక పదివేల గోవులు అడగాలి. ఒక మణుగు బంగారం అడగాలి." స్థాయి తగ్గట్టడగాలి స్థాయి చీని-చీనాంబరాలు అడగాలి. ఏదో మూడడుగులు కాదు ఒక ముప్పై అగ్రహారాలు అడగాలి. అసలు దాత స్థితిని నువ్వు అర్థం చేసుకోకుండా ఏదో ఒక పిల్ల చేష్ట వలే అడుగుతున్నావే మళ్ళీ ఆలోచించుకో" అన్నాడు. "అవన్నీ నాకు నేనేం చేసుకోలేను అవి." "మాడలు మాడలు కావాలా?" అని అడిగాడు. "ఏవీ నాకు వద్దు" అన్నాడు. "మరి మూడడుగులు ఏం చేసుకుంటావు?" అన్నాడు. "నాకది చాలు" అన్నాడు. "ఏం చేసుకుంటానో నాకు తెలియదు. నాకు మూడడుగులు చాలు" అన్నాడు. ఉన్న technique అంతా అడగటంలో ఉన్నది. సరే శుక్రాచార్యుడు పక్కనే ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు "నువ్వు మూడడుగులతో మూడడుగులతో అయ్యేది లేదు పోయేది లేదు. అంతేగా." అడగవలసి వస్తే అతను కూడా ఏదన్నా అడగాలి. ఎకరమో, పది ఎకరాలు, వంద ఎకరాలు ఇట్లా అడగాలి. అడగటం లేదు కదా. జాగ్రత్తగా ఆలోచించు వచ్చిన వాడు మామూలు వాడు కాదు నాకు అర్థమవుతున్నది. దేవతల పక్షాన వచ్చినటువంటి విష్ణువుగా నాకు కనిపిస్తున్నాడు" అన్నాడు. శుక్రాచార్యుడికి జ్ఞానం ఉన్నట్లేగా కనిపిం- కనిపెట్టాడుగా. సరే ఇది జరుగుతూ ఉంటే ఆయనేమీ అడిగాడు కూర్చున్నాడు అంతే. ఇతనిలో అహంకారం ప్రబలి పోతున్నది. ఏంటి ఇంత ఇంత చిన్న దానం చేసిన దాన చక్రవర్తినే అనిపించుకోవాలి నేను. వీడు ఇలా నన్ను చిన్నపరిచాడు చిన్నవాడిని చేసేస్తున్నాడు అని అనుకుంటే అప్పుడు ఆయన చెప్పాడు. ఏమనంటే "చూడు నీ వంశం నాశనమైపోతుంది."నువ్వు యజ్ఞం చేస్తున్నది పైకి విశ్వజిత్ యాగంగా చేసి విశ్వాన్ని జయించాలన్న భావనతో చేసినా నీ మనసులో నా సంకల్పంలో ఉన్నది ఇది కాదు. నీకు ఇంద్రపదవి కావాలి. ఒక్కసారి ఇంద్రపదవి వచ్చాక దాన్ని నిలబెట్టు-- ఎలా నిలబెట్టుకోవాలో నేను చెప్తా. కానీ నువ్వు యాగం ఇంద్రపదవిని పొందటం కోసం చేస్తున్నావు. నీ-- దీంట్లో భాగమైనా గనక ఎక్కడైనా పొరపాటు పడితే నీకు ఇంద్రపదవి ఎప్పట్లో రాదు. ఇంద్రపదవి ఆ, యజ్ఞం fail అయిపోయినట్లే. fail అయిపోతుంది. అని అంటే అక్కడ బలిచక్రవర్తి ఏమంటాడంటే, "అసలు నేను ప్రపంచం మొత్తాన్ని జయించాలని చేయటం లేదు. నాకు ఇంద్రపదవి కావాలనేది చిన్నదేది-- చిన్న పదవి అది, అది కాదు. ఇవన్నీ పక్కన పెట్టండి. పరమాత్మ ఒక యజ్ఞఫలంగా, యజ్ఞరూపంగా ఇక్కడికి రావాలని కోరుకొని, సంకల్పించుకొని నేను ఇది ప్రారంభించానో ఆయనే వచ్చేసాడు. యజ్ఞం ఇంకా పూర్తే కాలే. పూర్తి అయ్యాక కదా, పూర్ణాహుతి అయ్యాక అనుభవాలు కలుగుతాయి, రావాలి. కానీ ఆయన వచ్చేసాడు. నా యజ్ఞం అయిపోయినట్లే లెక్క. యజ్ఞం అయిపోయిన తర్వాత నాకు ఏమి రావాలి, ఏమి పోవాలి భగవంతుడు నిర్ణయిస్తాడు." అన్నాడు. అంటే "నువ్వు నా మాట వినటం లేదు" అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, "నా మనస్సు ఆయన అడిగిన మూడడుగులు ఇవ్వాలనే ఉన్నది. ఉమ్! కార్య రాజులు రాజ్యమును కలుగవే, నా కంటే ఎంతమంది రాజులు భూమండలాన్ని పరిపాలన చేశారు. నేను ఒక్కడినేనా? నేను మొదటి వాడిని కాదు, చివరి వాడిని కాదు. ఉమ్! నా తర్వాత ఇంకా ఎవరెవరో వస్తూ ఉంటారు. వసుంధరా బ్రహ్మదత్త. ఇది ప-- పరమేశ్వరుడు ఇచ్చినటువంటిదే భూమి. భూమి మీద నా ఒక్కడికి అధికారం ఉండదు. ఆయన మూడడుగుల భూమి అడిగాడంతే. నేను ఇస్తాను. నాకు అనిపిస్తోంది నేను చేసిన యజ్ఞ సంకల్పం గొప్పది. అందుకనే మీరన్నట్లుగా ఆయన విష్ణువే గనక అయితే విష్ణువు లాంటి వాడికి నేను మూడడుగులు ఇవ్వటం అనేది మామూలు విషయం- ఆయన చెయ్యి ది, కింద నా చెయ్యి పైన. ఆ, మీద ఉంటే మేలు కాదే. రాజ్యము, విద్యమున్ సతతమే కాయంబు నాపాయమే" అన్నాడు. నా అపాయమే, కాయం శరీరానికి అపాయం లేకుండా ఎప్పుడన్నా ఉందా? అపాయం అంటే మరణం. కాబట్టి మరణం అనేది దాన్ని వదిలేసెయ్ శరీరం దగ్గర మనం ఆగకూడదు, నేను ఇస్తాను అన్నాడు. ఒప్పుకోలే. బలిచక్రవర్తి మనస్సు శుక్రాచార్యుడు ఏమన్నాడంటే, "ఆలోచన చేసి చెయ్. ఏం చేసినా ఆలోచన నీకు గురించి చెప్తున్నాను" అన్నాడు. అప్పుడు తన భార్యని పిలిచాడు. పిలిచి ఒక బంగారు బిందెతో నీళ్ళు తెమ్మన్నాడు. ఒక పళ్ళెం, బంగారు పళ్ళెం. దాంట్లో పాదాలు పెట్టమన్నాడు. అంటే దానం ఇచ్చేటప్పుడు దానాన్ని తీసుకునే వాడి యొక్క పాదాలు కడగాలి. కడగాలి. తీసుకునే వాడికి ఎవరు ఎవరి దగ్గర తీసుకు-- ఇచ్చేవాడు తలవంచుతాడు. తీసుకునేవాడి ముందే. తీసుకునేవాడే లేడనుకుందాం. సందేశం. ఎవరికిస్తారు? ఎవరికిస్తారు? ఏం చేసుకుంటారు? ఇంత బంగారం ఉంది తీసుకునేవాడు లేడు. ఇంత అన్నం వండారు తినేవాడు లేడు. భవతి భిక్షాందేహి అని వాకిట్లోకి రాలేదు. ఏం చేస్తారు? దాచిపెట్టేది అంతా పాచిపోతుంది కదా. చేసి ఆయన బంగారు పళ్ళెంలో పెట్టి పాదపూజ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే బలి చక్రవర్తికి ఒక కూతురు ఉంది. కూతురు పేరు రత్నావళి. రత్నావళి యుక్త వయస్సులో ఉంది. ఆవిడ పక్కన నుంచుంది, చూస్తున్నది. వామనుడి యొక్క తేజస్సు ఆమెను ఆకర్షించింది. ఎంతమాత్రం ఎంతగా ఆకర్షించిందంటే, నేను-- నాకు ఎలాగో పెళ్లి అవుతుంది. పెళ్లైనప్పుడు నేను తల్లిని కావాలి. తల్లిని అయినప్పుడు ఇటువంటి బిడ్డ నాకు కావాలి అని కోరుకుని ఆగిపోయింది. ఆవిడ మనస్సు అక్కడ ఉంది. శుక్రాచార్యుడు కంగారు పడుతున్నాడు. ఏమైపోతుందో, ఏమైపోతుందో. బలిచక్రవర్తి నిశ్చిత బుద్ధితో ఉన్నాడు. ఉమ్. భార్య, భర్త దంపతులిద్దరూ కూడా వామనుడి యొక్క పాదాలకు అడుగుతున్నారు. "బలిదైచ్ఛేంద్ర కరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తకిన్ జలజాతాక్షుడు సాచే యోగిస్సు మనస్సం ప్రార్థిత శ్రీదమున్ కలితానంబ్ర రమాలలాట పదవీ కస్తూరికా శ్యాదమున్ నళినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్" పోతనగారు రాశారు ఇది. ఆయన అక్కడ ఉన్నట్టే రాశాడు. అది భక్తి, మకరందం అది. అందులో నానా వేదాలు, మనకేమో నాలుగు వేదాలు చెప్తాం. నాలుగు వేదాల కంటే ముందు నానా వేదాలు, నానా విద్యలు అవన్నీ కూడా ఆయనకి పాదం నిండా ఉన్నాయి అని ఒకటి. తర్వాత పాదం ఎటువంటిది అంటే అమ్మవారు నుదుటన పెట్టుకున్నటువంటి గంధం, పచ్చిగా ఉన్నటువంటి గంధం మీద అయ్యవారి పాదం ఉన్నట్లయితే ఎలా ఉన్నదో అటువంటి పాదం అంట. అంటే ఆమె అక్కడ కూర్చుని ఉంటుందిగా లక్ష్మీదేవి పాదం దగ్గర. నేను- ఆయన కాలు అలా కదిపితే- పాదధూళి తగులుతుంది. తగిలింది కదా. చూడండి ఎంత అద్భుతంగా రాశారు. "కరద్వయీ కృత- వింటుంటేనే మనకి లోపల- ఆనందం కలుగుతుంది ఆనందం కలుగుతుంది. "ప్రక్షాళన వ్యాప్తకిన్ జలజాతాక్షుడు సాచే". జలజాతాక్షుడు అంటే విష్ణువు అని మనకు కూడా చెప్పేస్తున్నాడు కథలో. వచ్చినవాడు వామనుడు, ఎదో పిల్లవాడు కాదని. సంప్రార్థిత శ్రీదమున్ సుమనస్కులైనటువంటి మహాత్ములు ప్రార్థిస్తే నిత్యమూ ప్రార్థించి పూజించేటువంటి పాదానికి ఆయన అభిషేకం చేశాడు. పాదపూజ చేసుకున్నాడు, పాద నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు అడిగాడు, "ఇప్పుడు మూడడుగులు నాకు నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను." బలి చక్రవర్తి భార్య మనస్సులో ఏమీ లేదు. మూడు అడుగులు ఏమిటి? రత్నావళి ఆలోచనలు ఏమిటి? బలి చక్రవర్తి ఆలోచనలు ఏమిటి? గురువుగారు శుక్రాచార్యులవారు ఏం చెప్తారు? అవి-- అవేం పట్టలా. అంతే వచ్చి కూర్చుంది, పక్కన నుంచుంది. భర్త చెప్పింది- తన భర్త చేస్తున్న దానమే కదా. దానవ్రతశీలుడు అయినటువంటి బలి చక్రవర్తి యొక్క భార్య మనస్సు సుమనస్సుగా ఉన్నది. నిర్వికారంగా ఉన్నది, నిరామయంగా ఉన్నది, నికేతనంగా ఉన్నది, నిరంజనంగా ఉన్నది. రకమైనటువంటి ఆందోళన లేదు. పరమాన్-- పరమానంద స్వరూపంగా ఆమె కూర్చుని ఉన్నది. సరే, రెండు మూడడుగుల నేలలోకి వచ్చాం. వచ్చినప్పుడు మొదటి పాదం చూపించాడు. భూమి చూపించాడు. తీసేసుకో అన్నాడు. తన చేతిలో ఉన్నదేగా! అయిపోయింది. రెండో కాలు. ఆకాశం. ఆకాశం. అంటే ఏమిటి? అవని, ఆకాశము రెండూ ఆక్రమించినటువంటి విష్ణుతత్వానికి ఇది సంకేతం.విష్ణువు అంటే వ్యాపకుడు అని అర్థం. వ్యాసుడు అంటే విస్తృతంగా చెప్పగలిగిన వాడు వ్యాసుడు అని. ఎవరో ఒక రెండు పద్యాలు చెప్తారు, రాస్తారు. రాసిన ఆయన పని అక్కడ రాయటంతో అయిపోతుంది. దాని మీద వ్యాఖ్యానం యాభై పేజీలు రాస్తారు ఇంకొకరు, ఆయన వ్యాసుడవుతాడు. అది విస్తృతంగా చెప్పాలి మనం. ఉమ్ కాబట్టి రెండో పాదం అయిపోయింది. ఆకాశమంతా నిండిపోయింది. నెమ్మది నెమ్మదిగా బాలుడు పెరిగిపోతున్నాడు. ఎలా పెరుగుతున్నాడు అంటే నభోమండలం దాకా ఆకాశం దాకా వెళ్ళిపోయింది శిరస్సు. త్రివిక్రముడు. త్రివిక్రముడు అయినాడు. త్రివిక్రమత్వానికి వచ్చినప్పుడు ఆయన అడిగింది ఏంటంటే నేను, నేను మూడో నేల అడిగాను అది ఎక్కడ నేల లేదు. మరి ఇక్కడ నేల అంటే భూమి అని మనకు అర్థమైపోయింది. మరి రెండోది ఆకాశం నేల కాదు కదా! కాదు కదా! కాదు. భూమి అంటే సంపూర్ణమైనటువంటి ఒక స్త్రీ గర్భాలయం అది. మనం అందుకనే మాతృభూమి అంటాం. దానిలో గర్భాలయంలో ఏమున్నాయి? ఔషధులున్నాయి, నదులున్నాయి, బుగ్గు ఉన్నది, వజ్రాలున్నాయి, చెట్ల మూలాలున్నాయి. అనేకమైనటువంటివన్నీ వసుంధరా గర్భంలో ఉన్నాయి. అది పైకి ఉపరితలం మీద మనం జీవిస్తున్నాం. దీని అడుగున ఏముందో మనకు తెలియదు. కానీ తెలిసినంత వరకు ఇవి ఉన్నాయి. కానీ ఇవి కూడా దాటినటువంటిది ఏదన్నా ఉన్నదా? మరి ఆకాశం భూమి ఎలా అయింది అనే ప్రశ్న, తర్కం. మరి మూడు అడుగుల నేల అన్నాడు. రెండు మూడు అడుగుల, రెండు మూడు అడుగుల రెండు అంటే అవని ఆకాశము రెండు ఒకటే. రిఫ్లెక్షన్. అది శబ్ద బ్రహ్మం. దానిలో మేఘాలు ఉన్నాయి అంటే మేఘాలు ఆకాశంలో ఏం లేవు, ఆకాశం దగ్గర కనిపిస్తున్నాయి. సూర్యుడు ఆకాశంలో ఉన్నాడా? లేడు. చంద్రుడు, తారకలు ఏవన్నా అక్కడ అంటించారా? లేదు కదా. అంటే ఏమిటి ఏదైతే స్థిమితంగా కనిపిస్తున్నదో భూమిగా, ఆకాశం కూడా ఒక భూమి కింద లెక్క. భూమి అంటే ఆధారము అని అర్థం. భూమి అంటే ఆధారం. ఉమ్ కాబట్టి ఇది ఒక భూమి, ఇది భౌతిక భూమి. ఆధ్యాత్మిక భూమి ఆకాశం. దహరాకాశము, చిదాకాశము, ఆకాశం అని అనేక పేర్లున్నాయి. కాబట్టి రెండోది ఆయన దాన్ని తీసేసుకున్నాడు. తీసుకున్నాడు. ఇక మూడోది ఎక్కడ? ఇవ్వటానికి లేదు. దాన వ్రతం fail అయిపోతున్నది. తనకి ఇంతవరకే తెలుసు. తన జ్ఞానం పరిమితి అంతవరకే. అప్పుడు వామనుడు, అప్పుడే త్రివిక్రముడు అయినాడుగా, ఆయన ఏం చెప్పాడంటే "నీకు నీ కన్ను చూడగలిగినంత వరకు నువ్వు ఇవ్వగలిగావు. నీ కన్ను, నీ మనస్సు, నీ బుద్ధి, నీ చిత్తము, నీ అహంకారము" అహంకారం అంటే స్పర్శ, స్పుర్ha. "ఇవి చూడనటువంటి ఒక లోకం ఉంది. లోకం పేరు పాతాళం. నువ్వు అక్కడ ఉండు" అన్నాడు. శుక్రాచార్యుడు అర్థం చేసుకున్నాడు. మూడో చోట ఆపేయాలనుకున్నాడు. మరి మూడో పాదంకి మళ్ళీ నీళ్ళు పోయాలిగా! time లో ఈయన ఏం చేశాడంటే అడ్డుపడ్డాడు. అడ్డుపడ్డప్పుడు ఆయన దర్భంలో దర్భ పెట్టి పొడిచాడు అది కథ. అంటే శాస్త్ర జ్ఞానంలో ఎప్పుడైతే రాజస, తామస గుణాలు రెండు ప్రవేశిస్తాయో, భగవంతుడు రెండు కళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అజ్ఞానం చేత ఒక కన్ను గుడ్డిది అయిపోతుంది. అది కథ, అది సందేశం. శుక్రాచార్యుడు తక్కువ వాడు కాదు. అసలైతే వస్తూ ఉండగానే వస్తున్నవాడు విష్ణువు అని చెప్పగలిగాడే, కానీ దాన్ని negative గా వాడుతున్నాడు అని విష్ణువుకి తెలుసు గనుక, ఇటువంటి గురువులు గనుక ఉన్నట్లయితే ఏం చేయాలి? బలి చక్రవర్తి ఏం చేయాలి? గురువుగారు చెప్పినట్లు నేను ఇవ్వను, నాకు నీ మీద నమ్మకం లేదు, ఏంటి మూడు అడుగులతో నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను వెళ్ళిపో అనాలి. కానీ అనలా. అంటే ఏమిటి? ఒక ఆత్మోన్నతిని పొందాలి. దానం ద్వారా, ధర్మం ద్వారా తనలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని, తన జన్మ సార్థకతని చక్కగా నిలబెట్టుకోవాలి అనుకున్నటువంటి వాడు ఆత్మోన్నతికి అడ్డుపడుతున్నాడు ఈయన. గురువుని ధిక్కరించాడు. కదా! గురువు యందు ప్రేమ లేక కాదు, గౌరవం లేక కాదు. కానీ తన పనికి అడ్డుపడుతున్నాడు. తన తన ఉద్ధరణ, తన ఆత్మను తాను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించుకునే అవకాశం వచ్చింది. సాక్షాత్తు భగవంతుడు వస్తే, ఆయన పాదాలు కడిగితే, ఆయన అడిగిన మూడు అడుగుల నేల ఇవ్వబోతుంటే, ఈయన వద్దంటాడేమిటని అక్కడ ఆలోచించి గురువుని పక్కన పెట్టేశాడు. గురువుని పక్కన పెడితే జరిగేది పైకి అనర్థంగా కనిపిస్తుంది. చూడండి మీరు కథా కథనాలన్నీ మనం మీరు గాని నేను గాని ఏది వింటూ పెరిగాం అంటే బలి చక్రవర్తిని విష్ణుమూర్తి పాతాళంలోకి తొక్కేశాడు. తొక్కేశాడు. మూడోది ఎందుకు రెండు మూడు అడుగులలో రెండోది అయిపోయింది. మూడోది third dynamics అంటాం. third dynamics లో ఏమన్నాడంటే పాతాళం నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. పాతాళ లోకమే నీకు సరైన ప్రదేశము అన్నాడు. పాతాళ లోకం అంటే నాగలోకాన్ని దాటినటువంటిది, ఇంకా కిందకి. అది అధోలోకము అంటాం. ఊర్ధ్వలోకం occupy చేశాడు. తానున్నటువంటిది occupy చేశాడు. అధోలోకం పవనాంధో లోకం అంటాం. అక్కడ గాలి మాత్రమే ఆడుతుంది ఇంకేం ఉండదు. చీకటి. చీకటి, గుయ్యారం, ఏం ఉండదు. మహా నిశ్శబ్దం. పాముల బుసలు తప్ప ఏం ఉండవు. ఇదంతా వర్ణన. శిరస్సు వహించాడు. అప్పుడు శిరస్సు మీద తన పాదాన్ని పెట్టాడు. పాదాన్ని పెట్టాడే గాని బలి చక్రవర్తిని తొక్కలేదు. మనం చెప్పేవాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేసి చెప్పాలి ఇది. ఎందుకని అంటేమ్మా, పరమేశ్వరుడి యొక్క పాదాల అడుగున అగస్త్య రేఖలుంటాయి. అది గురువు దగ్గర కూడా ఉంటాయి, సద్గురువు దగ్గర ఉంటాయి. గురువు వేషం వేసుకునే వాడి దగ్గర అవేం ఉండవు. మనలాగానే ఉంటాయి. కానీ నిజమైనటువంటి గురువు పాదం అడుగున శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదభిరంచితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం అని గురువు యొక్క పాదం అడుగున అగస్త్య రేఖలుంటాయి. అగస్త్యుడు అంటే ఎవరు? సముద్రాలను తీసి కమండలంలో పెట్టుకోగలిగిన శక్తి కలిగిన వాడు. సముద్రాలు ఏమిటి?జన్మ చేత, ప్రాప్తి చేత, అనుభూతి చేత, కర్మల చేత, జన్మాంతర సంస్కారం చేత, ప్రారబ్ధం చేత ఏర్పడినటువంటి కర్మానుభవాలన్నీ ఒక మహా సముద్రమై ఉత్తుంగ తరంగాలై ఉన్నటువంటి వాటిని గురువు అనేటువంటి వాడు దానిని కమండలంలో పెట్టగలడు. అవి అగస్త్య రేఖలు. మన చేతిలో అరచేతిలో కర్మ రేఖలు ఉంటాయి. అవును ఇవన్నీ ఏర్పడితే ఇదా మారుతూ ఉంటాయి. మారుతూ ఉంటాయి మన పన్నెండేళ్ళకోసారి అరచేతిలోన్ని మారిపోతూ ఉంటాయి. కర్మ రేఖలు గనక వెళ్ళి కర్మ రేఖలు వెళ్ళి గురువు పాదం కింద అంటే బొటనవేలు కింద గనక వెళ్ళినట్లయితే అప్పటి వరకు జరిగినటువంటి కర్మలు వాటి వలన ఏర్పడినటువంటి అనుభవాలు ఫలితాలు నశించిపోతాయి అని శాస్త్రం. ఉమ్ ఇక్కడ కర్మ నశిస్తుంది. కర్మ నశిస్తుంది. లే మామూలుగా మనం పైన ముక్కుంటాం కదా చేయకూడదు అది. అది పద్ధతి కాదు. గురువు కూడా రెండు పాదాలు పాదం కిందకి పెట్టలేం కదా. పెట్టలేం అందుకని బొటనవేళ్లు రెండింటి కింద పెట్టాలి. అది అసలు గురువుకి నమస్కారం. అసలు గురుపాద పూజ, గురుపాద నమస్కారానికి అర్థాలు మారిపోయినయి. ఇవాళ ఎక్కడో వామనుడి పెట్టినట్టుగా ఇవాళ గురువులందరూ మీరు చూడండి ఒక సంప్రదాయ పీఠాలు, ఆమ్రాయ పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు కంచి శంకర విజయేంద్ర స్వామి వారు. వారేమి పాదాలు పెట్టరు. అక్కడ పాదుకలు ఉంటాయి. పాదుకలు they represent పీఠం. పీఠానికి మనం నమస్కారం చేస్తున్నామని తప్ప వారి పాదాలకు మనమేం చెయ్యం. వారు చెయ్యనివ్వరు. అవును తాకనివ్వరు తాకనివ్వరు, చెయ్యనివ్వరు. అక్కడ వేయండి అంటారు. దానికి నమస్కారం చేసుకోండి అంటారు. అక్కడ కుంకుమ ఇస్తారు. ఇవాళ అట్లా ఉన్నదా? ఇవాళ గురువులు అలా లేరు కదా. తెలియక. మీకు తెలుసు వాళ్లే పాదం పెట్టేస్తున్నారు. పైనుంచి నీళ్లు కిందకు వస్తాయి తప్ప కింద నుంచి నీళ్లు పైకి వెళ్ళవు కదా. కాబట్టి మన నుంచి గురువుకు వెళ్లేదంటూ ఏమీ లేదు. గురువు నుంచి మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి పాదాలకి ఇక్కడ ఇది మామూలు ఒక విషయం. ఇక్కడ అగస్త్య రేఖలతో ఉన్నటువంటి శ్రీ విష్ణు పాదము ఎక్కడ పెట్టాడాయన? తల మీద పెట్టాడు. తల మీద పెట్టాడు తల మీద అంటే తొక్కేయటానికి పెట్టాడా? బ్రహ్మ రంధ్రం మీద పెట్టాడు. ఏమ్మా అది, అది పాయింట్. అంటే మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు దాటి సహస్రారం దాటినవేళ చంద్రకళ స్థానాన్ని ఆక్రమించి అది ద్వాదశాంత స్థానం అంటాం. దానిమీద శ్రీవిష్ణు పాదం వచ్చి తాకినప్పుడు బ్రహ్మపదంగాక ఇంకేం లభిస్తుంది? బ్రహ్మ పదము బ్రహ్మ రంధ్రం మీద ప్రకృతిలో ఉన్నటువంటి అనేక శక్తులు అంటే positive గా ఉన్నటువంటి ఒక energy మనకి నోటితో తీసుకునే ఆహారంతో రాదు. ఉమ్ కంటితో చూసే దృశ్యంలో నుంచి రాదు. చెవితో వినేటువంటి అంటే ఇంద్రియాల ద్వారా మనకు energy రాదు. మరి ఇంద్రియాతీతమైనటువంటి ఒక స్థాయిలో చెప్పాలి అంటే బ్రహ్మ రంధ్రమే. అందుకనే సౌందర్యలహరిలో పదో శ్లోకం. ఒకసారి ఇంటికి వెళ్ళాక చదవండి అది. పదో శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు "అమ్మా! నువ్వు ప్రపంచం మొత్తానికి తల్లివి. ఒక అద్భుతమైన శక్తి రూపిణిగా నువ్వున్నావు. నేను పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు. నువ్వొక ఆనంద బిందువై" అంటే చంద్రకళ స్థానం అంటే ఇప్పుడు మన బ్రహ్మ రంధ్రం నుంచి పన్నెండు అంగుళాల దూరంలో చంద్రకళ స్థానం అని ఉంది. అది ఎవరికీ? జ్ఞానులకి, పండితులకి, బాగా డబ్బున్నవాడికి. జన్మ ఎత్తిన ప్రతి వాడికి బ్రహ్మ రంధ్రం ఉన్నది. బ్రహ్మ రంధ్రానికి పన్నెండు అంగుళాలు, పన్నెండు అంగుళాలు అంటే ఒక అడుగు అని కాదు. మన కుడిచేతి బొటనవేలు పై కణుపు ఉంది కదా into twelve. అది పన్నెండు అంగుళాలకి గనక లెక్క వేస్తే ఆవృతమై ఉంటుంది. ఇప్పుడు మనందరికీ ఉంటుంది ఇది. అది చంద్రకళగా ఉన్నది. చంద్రకళ అంటే ఒక ఐసు ముక్క లాగా ఉంది. ఇందాక చెప్పిన దీంట్లో నుంచి వాయు ప్రసారం జరిగి జరిగి సుషుమ్నా నాడిని దాటి, ఇదంతా యోగశాస్త్రం, వెళ్లి వేడి గాలి బ్రహ్మ రంధ్రం నుంచి బయటకు వెళ్ళినప్పుడు వేడి గాలి మంచు ముక్కకు తాకినప్పుడు ఏమవుతుంది? కరుగుతుంది. కరిగినప్పుడు ఒక బిందువు ఏర్పడుతుంది. నీరవుతుంది కదా. నీరు ఎక్కడికి పోవాలి? బ్రహ్మ రంధ్రంలో పడాలి. గాలి వెళ్లి చంద్రకళని కరిగిస్తున్నది. కరిగించినటువంటి కరిగినటువంటి చంద్రకళా బిందువు ఏదైతే ఉన్నదో అది మళ్లీ మన శరీరంలో 2,72,000 యోగ నాడులని ఉద్దీపనం చేస్తూ ఉన్నది. దాన్నే అమృతం అంటారు. అదే అమృత బిందువు అంటాం. చంద్రకళా బిందువు. దీన్ని మన పదో శ్లోకం ఒక అద్భుతం అది. రసాత్మకమైనటువంటి వర్ణన. వర్ణన అంటే ఆయన అనుభవించారు అది. ఇలాగు మీరు కూడా మీరు అర్థం చేసుకోవాలి అని. కాబట్టి ఎప్పుడైతే శ్రీవిష్ణువు యొక్క పాదం వచ్చి బ్రహ్మ రంధ్రం మీద తాకిందో అగస్త్య రేఖల అన్నింటి వలన అప్పటి వరకు అతనిలో ఉన్న దానాహంకారం నశించిపోయింది. అంతే కదా! ఇప్పుడు రత్నావళి ఎక్కడో, నా భార్య ఎక్కడో, నా గురువు ఎక్కడో, నేను పాతాళ లోకానికి వెళ్ళాలి ఇచ్చిన మాట ప్రకారం. వీళ్లందరూ ఏమిటిది? అని ఆయనకు వైరాగ్యం కలిగింది దానం చేసే ముందు. కానీ వైరాగ్యం ఎటువంటిది అంటే స్మశాన వైరాగ్యం లాగా కనిపి-- అప్పటి వరకు అందరూ అనుభవించిన వైరాగ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు తాను స్వయంగా అనుభవించబోతున్న వైరాగ్యం గుర్తొచ్చింది. అన్నీ తన కళ్ళముందు మాయమైపోయినాయి. యజ్ఞశాల లేదు, యజ్ఞానికి వచ్చిన అతిథులు లేరు, మహాత్ములు లేరు, జ్ఞానులు లేరు, జిజ్ఞాసువులు లేరు, భార్య లేదు, సామ్రాజ్యం లేదు. రాబోయేటువంటి ఇంద్రపదవి ఏమో. ఇవి-- వీళ్ళెవరూ లేకుండా ఇంద్రపదవి నేనేం అనుభవించను అని వైరాగ్య విభూతిని అనుగ్రహించాడు. బలి చక్రవర్తిని తొక్కేశాడు అని చెప్పకండి. అద్భుతమైన అంతటితో ఆగలేదు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, రాజ్యం లేదు నేను వెళ్తాను పాతాళ లోకానికి నేను ఏం చేయాలి అక్కడ అన్నాడు. నేను చెప్పేదాకా నువ్వు అక్కడుండు నారాయణ మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ ఉండు అన్నాడు. నారాయణ మంత్రాన్ని స్మరణ చేసుకో. ఒక్కడుండాలి అంటే జైలు లాంటిది అది. ఒక్కడే ఉండాలి. ఏం చేస్తాడు? అదే ఎంతసేపు చేస్తాడు? చేస్తాడా? చేయగలడా? అలవాటు ఉందా?నారాయణ మంత్రాన్ని ఇంతకుముందు ఎప్పుడైనా ఉపాసన చేశాడా? అనుభవం ఉందా? ఇవన్నీ మనసులో కలిగినయి. కానీ విష్ణువు అనేటువంటి ఒకాయన దాన గ్రహీతగా వచ్చాడు. దానం నేను ఇచ్చాను. దాత దాన గ్రహీత ఏం చెప్తాడో అది చేయాలి. నాకు ఇంత ఇవ్వండి అంటే ఆయన ఇచ్చాడు అన్న తర్వాత అది ఏం చేయాలో ఆయన ఇష్టం. ఇష్టం కూడా వదిలేసుకున్నాడు. వదిలేసినప్పుడు ఎంత కరుణాపూర్ణ సుదాబ్ది అయినటువంటి విష్ణువు మాటన్నాడు. చూడు ప్రహ్లాదుడు నీకు తాత. ప్రహ్లాదుడికి ఇంకా ఉత్తమ పదవి రాలే. దీనికినూ నరసింహోపాఖ్యానానికి ప్రహ్లాద చరిత్రకి సంబంధం ఉంది. తర్వాత చెప్పబడిన ప్రహ్లాద చరిత్ర గాని, గజేంద్ర మోక్షణము గాని, మోక్షము వేరు మోక్షణము వేరు. కదా. గజేంద్ర మోక్షణము గాని, రెండూ కూడా దీంట్లో మూల గ్రంథాలు. ఇది ఇది మూలం వామన పురాణం. తర్వాత తర్వాత దాన్ని expand చేస్తూ రాసుకుంటూ వెళ్లారు. ప్రహ్లాదుడు నీకు తాత. ఆయనకి ఇంకా విముక్తి కలగలే. జీవన్ముక్తుడు కాలే. ఆయనకి ఇంకా భగవద్భక్తిలోనే మునిగిపోతున్నాడు. తత్వచింతన స్పర్శ కలగలే. కనుక నీ తాతని నీకు తోడుగా పంపుతా. ప్రహ్లాదుడికి మంత్రం ఇష్టం? నారాయణ మంత్రం ఇష్టం. నీ తాత చదువుతూ ఉంటాడు, నువ్వు కూడా అంటూ ఉండు. రెండింటిని కలుపుతూ మళ్ళీ నీకు ఎప్పుడైనా ఇంద్ర పదవి ఎప్పుడో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడో వచ్చినప్పుడు నేను దాన్ని నేను అనుగ్రహిస్తా. అప్పటిదాకా అక్కడే ఉండు అన్నాడు. మరి ఇది నేను నేను చీకటి గుయ్యారంలో పోతూ నా తాతను కూడా తీసుకెళ్తున్నా అని బాధపడ్డాడు. అప్పుడు మహావిష్ణువు అన్నాడు మీ ఇద్దరినే పంపటం లేదు కల్ప కల్పాంతము వరకు మీ తాతకి ఉత్తమ గతులు వచ్చేదాకా, నీకు ఇంద్ర పదవి వచ్చేదాకా నేను మీరు ఉన్నటువంటి పాతాళంలో నేను సుదర్శన చక్రమై మీ చుట్టూ ఆవరించి మీకు రక్షణ కల్పిస్తాను. నీకు శిక్ష వేయలే, శిక్షణకి పంపిస్తున్నా. కానీ మామూలుగా మనం నేను ఇంటి కాపలాగా ఉండమని అడిగే- అవును అది ఇవన్నీ తర్వాత డ్రామా రాసే వాళ్ళు వాళ్ళు పాత్రల-- సుదర్శన చక్రం కాపలా. కాపలా అంటే రక్షణ. రక్షణ. ఇప్పుడు సుదర్శన చక్రం రక్షణ అంటే మనం బలి చక్రవర్తి కథకి చెప్తున్నాం. అవును. కానీ సుదర్శన చక్రం మీకు నాకు ఇక్కడున్న అందరికీ ఇవాళ ఉందిగా ఇక్కడ. అవును. లేకపోతే అసలు ఆవరణలోకి రాంగా. ఇవే మాట్లాడుకోంగా. ఇది ఎక్కడో భిన్నంగా దూరంగా లేదు. సమస్త సృష్టికి సుదర్శన చక్రం ఉన్నది. ఆయన తీసుకున్న ఆకాశానికి ఉన్నది. మూడడుగులకి ఉంది. రెండు మూడడుగులలో రెండు అయిపోయిన తర్వాత ఏర్పడిన మూడవది ఇవాళ అందుకనే ఓణం పండుగ వస్తుంది కదా. ఓణం పండుగనాడు ఆయనకు ఒక్కరోజు permission ఉంది. భూమిపైకి వచ్చి తను ఇంతవరకు బతికిన సమాజం ఎట్లా ఉన్నది, సుభిక్షంగా ఉందా లేదా, అసలు దీని పరిస్థితి ఏమిటి కనుక్కొని వెళ్లిపోవాలి అంతే. బాగుంది అంటే ఆనందపడటానికి లేదు. బాగా లేదు- బాగా లేదు అంటే బాగు చేద్దాం అనేటువంటి ప్ర-- ఒక కర్తవ్యం లేదు. జస్ట్ ఒకరిగా చూస్తాం. ఒకరిగా చూసి అంటే ఏంటి? ఆత్మ వలే క్షీభూతంగా ఉండటం. ఏది మంచి? ప్రపంచం మంచా చెడా అంటే ప్రపంచం చెడు కాదు మంచి కాదు అదంతే. దానిలో మనం ఉన్నాం. మనం ఎట్లా ఉన్నాం అన్నదే ప్రశ్న. మనం మంచిగా ఉంటే సమస్త ప్రపంచం నందనవనం కదా. యద్భావం తద్భవతి. ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనం ఎలా ఆలోచిస్తామో అదే మనం. రఘువంశంలో కాళిదాసు రఘువంశం రామ వంశం లేదు చూడండి రఘువంశం ఉంది. రఘువంశమేనన్న. ఆ. రఘువంశంలో ఆయన గురించి మొట్టమొదటి మాట ఏముంటుందంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వీరందరూ రఘువంశంలో ఉన్నటువంటి వారందరూ ఆజన్మ శుద్ధులై వస్తారు. వాళ్ళకి అసలు శుద్ధులయ్యే జగత్తులో ఒక స-సత్యహరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘుమహారాజు, రామచంద్రుడు, కుశమహారాజు వీళ్ళంతా శుద్ధత్వం లేకపోతే చేయలేరు. శుద్ధత్వం పొందటం పెద్ద process. కానీ వాళ్ళు అసలు ఆజన్మ శుద్ధులు. అలా వచ్చారు. ఆజన్మ శుద్ధులు. అట్లా మన కాలంలో కూడా ఆజన్మ శుద్ధులు ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచాన్ని మేము బాగు చేస్తున్నాము, ఇది మా వల్ల అవుతోంది అనేది ఉండదు. ఉండదు. వాళ్ళు తమ తపఃశక్తిని, ఇక్కడ ఒక ఒక పేరు చెప్తాను ఒక ఉదాహరణ. అంటే మన కళ్ళ ముందు కంచి పెద్దస్వామి వారు మహాస్వామి వారు ఆజన్మ శుద్ధులు ఆయన. ఎందుకంటే తన శరీరం తొంభై తొమ్మిది ఏళ్ళు ప్రపంచం కోసం సుష్కింపజేసుకున్నారు. ఇది మీకు కష్టం అవుతున్నది కదా, వయస్సు పెద్దది అయింది అంటే మాకిది అట్లా అలవాటైపోయింది. అలవాటైపోయింది. తర్వాత తపోనిష్ఠ. అంటే ఇవాళ ప్రపంచంలో ఒక తపస్వి ఎలా ఉండాలి. ఆయనని దేవుడు అంటారు అది పక్కన పెడదాం. దేవుడు అనేది మన భావన. మహా తపస్వి ఆయన. అవును. తపస్సు యొక్క శక్తి ఏమిటో ఆయన చూపించారు. ఉమ్ కాబట్టి ఇట్లా ఇవాళ బలిచక్రవర్తి ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే ఓణం పండుగనాడు వస్తాడని కేరళ వాళ్ళంతా ఎదురు చూస్తారు, మనం కూడా ఎదురు చూస్తాం. ఆయన వస్తాడా, చూస్తాడా అది కాలానికి వదిలిపెడదాం. అంటే ఇందులో నీతి అంతా కథంతా అయ్యాక ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి రత్నావళి ఏమైపోయింది అని. రత్నావళి- పూతనగా. మనం పూతనగా వచ్చి పగ పగతో పుట్టింది పూతన. కానీ అలా అంటాం గానీ పూతన అంటే పూచిన తనువు అని అర్థం. శరీరం వికాసమానం చెందింది. ఆమెకు కూడా ఉద్ధారణ కావాలి. పూతన వచ్చింది. వచ్చి బాలకృష్ణుడి దగ్గర స్తన్యం ఇచ్చి అక్కడి నుంచి తన శరీరాన్ని వదిలిపెట్టింది. శరీరాన్ని నందుడు రంపాలతో కోస్తుంటే దానిలో నుంచి పరిమళాలు, సుగంధాలు వెదజల్లెనని భాగవతం చెప్తుంది మనకి. ఉమ్ విషం ఏదో పగ ఏముందో తల్లి స్థానంలో తల్లి పాలు ఎలా ఇస్తుందో కోరిక తీర్చాడు. ఆవిడ లోక లోకాంతర ప్రాణాలలో ఉన్న కోరిక నెరవేరింది. అంటే మొత్తం మీద అద్భుత సందేశం ఏమిటంటే గురువు అనేటువంటి వాడు తనను గురువుగా భావించినటువంటి తన శిష్యుడికి సరైన మార్గాన్ని ఉపదేశనం చేయాలి. చేయాలి అంటేఇప్పుడు శుక్రాచార్యుడు అలా ఎందుకు అన్నాడంటే బలి చక్రవర్తికి గనక ఇంద్రపదవి వస్తే తను ఇంద్రపదవి మళ్ళీ గురువు అవుతాడు. అంటే తన పోస్టు నిలబెట్టం కోసం అతను ఉండాలి అని కోరుకున్నాడు. తన పోస్టు పోకుండా ఉండాలి గనక స్వలాభం స్వలాభం స్వార్థం అహంకారం ఎప్పుడూ నేను ఉండాలి అనేటువంటి ఒక తీవ్రమైన అసహజమైన కోరిక ఇది ఒకటి. ఆత్మోన్నతి వైపు శిష్యుడు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గురువుకు ఒక ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటామ్మా తన శిష్యుడు తన కంటే గొప్ప స్థాయికి వెళుతున్నప్పుడు ఆనందం కలుగుతుందే అతడే నిజమైన గురువు. నన్ను దాటి వెళ్ళిపోతున్నాడే అన్నవాడు చాలా అల్పగురువు స్వల్ప గురువు. నిజమైనటువంటి గురువు నన్ను దాటి వెళుతున్నాడు. శిష్యాధిచ్ఛేత్ పరాజయం. ఉమ్ పరాజయం అంటే వాడి చేత జయింపబడ్డాడు భావన జయింపబడింది. చాలు నా-నా నేను నాలుగు శ్లోకాలు చెప్పాను వాడు ఎలుకుపోయినాడు. నేను మార్గం చూపించాను వాడు నిర్మాణం చేశాడు. ఇది గురువు యొక్క సద్గురువు యొక్క స్థాయి. ఇది శుక్రాచార్యుడి పరం. తర్వాత అడ్డుపడకూడదు మంచి పనే చేస్తున్నాడు అతను దానం చేసుకుంటున్నాడు అతని సహజ ప్రవృత్తి అది. దానం ఇచ్చే మనసే లేకపోతే నువ్వు దానం ఇప్పించగలవా? ఇప్పించలేవు. ఇప్పించలేవు కదా. రెండోది తను బోధ చేయాలి. రాక్షస గురువుగా మాత్రమే ఉండగలిగాడు. ఇతడు రాక్షస గురువు అయితే బృహస్పతి సాక్షర గురువు. ఇదే మాటల్లో తేడా. అక్షర పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో ఏది అనంతమై, అవ్యయమై, అచ్యుతమై, అఖండమై, చిద్ఘనమై, పూర్ణమై, ధవళమై, తరళమై, సత్యమై, నిత్యమై, శాశ్వతమై అన్ని వేళలా అన్ని కాలాలు అన్ని యుగాలలో ఉండేటువంటి ఒక ఆత్మతత్వానికి గురువుగా ఉన్నటువంటి వాడు బృహస్పతి. ఈయన పరిమితమైన ఇంద్రియాలకు లోబడిన ఇంద్రియాల చేత నడపబడే మనసు కలిగిన ఒక శిష్యుడికి శిష్య సమూహానికి గురువుగా ఉండిపోయినాడు. కనుక శుక్రాచార్యుడు వంటి గురువు మనకు జీవితంలో ఉండకూడదు. ఇది మహత్తర సందేశం. తర్వాత భారతీయ గృహస్థ ధర్మంలో భార్య భర్త-- అంటే ఆనాడు మనుధర్మ శాస్త్రంలో అది ఇవాళ relevant irrelevant పక్కన పెడదాం. భర్త మంచి పని చేస్తున్నప్పుడు భార్య చేదోడుగా ఉండాలి అంతే. నువ్వు ఎందుకు దానం చేస్తున్నావు? తర్వాత పదవి పోతే ఏమైపోతాం? ఏమైపోతాం నీకంటే ముందు పదవులు ఎంతో మంది ఉన్నారు. కొనుక్కునే వాడు అక్కడికి వెళ్తాడు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత భూమి దగ్గరికి ఇద్దరు వెళ్తాడు. వదిలిపెట్టలేని మమకారం వలన అమ్మిన వాడు. పొందే ఆనందంతో వీడు. ఇద్దరు వెళ్ళి కరతాళాలు పట్టుకుంటారు. పెట్టుకొని ఈరోజు నుంచి భూమి నాది అంటాడు కొన్నవాడు. అప్పుడు భూమి నవ్వుకుంటుందట. నవ్వుకొని ఇట్లా ఎంతమంది అన్నారు ఎన్ని వేల మంది లక్షల మంది ఇది వాళ్ళదా? అందుకనే దానికి మన వేదంలో చెప్పబడింది వసుంధరా బ్రహ్మదత్త. వామన పురాణంలో ఎక్కువ వైష్ణవ క్షేత్రాల గురించి విష్ణు మందిరాల గురించి ధర్మకర్తల గురించి చెప్పారట. అవును. అది కొంచెం. అది చెప్తాను. శివ, కేశవ, శక్తి. ఇప్పుడు శక్తి కేశవుడు వచ్చాడుగా. దీనిలో శివుడి యొక్క మహత్యం చాలా ఉంది. కానీ దాన్ని వీరశైవులు చేశారని-- దీని నిండా ఉన్నది ఏమిటంటే వైష్ణవ సంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవ శక్తి ఉన్నది. విష్ణు పురాణంలో ఉన్నటువంటి దానిలో ఉన్న అనేకమైనటువంటి విషయాలని మళ్ళీ అనేక ఉపాఖ్యానాల ద్వారా ఇప్పుడు వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. అవును. దాన్ని మనం శివ కేశవ శక్తి అని మనం అంటంల. అది వైష్ణవ వైష్ణవ సంప్రదాయానికి మనం కుదించుకున్నాం. కానీ అది కాదు. విష్ణుమూర్తి వచ్చాడని అనుకుంటున్నాం. అంటున్నాం. ఒక విష్ణుమూర్తికి పరిమితం చేశాం. అవును. కానీ ఆయన వెనుక శివుడు ఉన్నాడు. అమ్మవారు ఉన్నది. అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు. నిఖిల దేవతల నికమైనటువంటి రూపం అంటాడు అన్నమాచార్య. నిఖిల దేవతలు అంటే ముప్పది ముక్కోటి దేవతలు. అంతే కదా. వాళ్ళంతా తిరుమల కొండ మీద ఉంటారని అందుకనే వెంకటేశగిరి. అది వెంకటగిరి కాదు వెంకటేశగిరి. వేం అంటే పాపం కట అంటే పోగొట్టేవాడు. ఈశ ఈశ్వరుడు ఉన్నాడు. ఇది. తర్వాత దక్షయజ్ఞం అనేటువంటి దాంట్లో విష్ణువుకి పెద్ద పీట వేసి శివుడ్ని అవమానించినటువంటి ఘట్టంలో మళ్ళీ శివకేశవులకి శక్తి ఎవరు సతీదేవి. మళ్ళీ శివకేశవ శక్తి స్వరూపాన్ని దక్షయజ్ఞంలో నిరూపణ అయింది. శివుడే సుదర్శన చక్రాన్ని విష్ణువుకి ఇచ్చాడు అని అన్నప్పుడు వైష్ణవులను శైవులు కొట్టుకోవలసిన పని ఏముంది? అవసరం లేదు. ఉమ్ నారాయణ మంత్రంలో ఉన్నటువంటి నారాయణలో రా నమశ్శివాయలో మా కలిపితే రామా అయిందిగా. రామా అయింది. వదతు వదతు వాణీ రామ రామేతి మంత్రం అని ఒకటుంది. నేనంటూ అంటే రామా రామా రామా అనే పదమే నేను వాడుకుంటాను. అంటే వైష్ణవ శక్తిని అంతా కూడా వామన పురాణంలో చాలా చెప్పారు చాలా. అనేకమైనటువంటి కథా కథనాల్లో అవి చాలా విస్తృతంగా చెప్పుకోవాలి అవన్నీ. కానీ ఉన్నది ఏమిటంటే విష్ణు శక్తిని నిక్షిప్తం చేయటం ఒకటి, శివకేశవులకు అభేదం చెప్పటం ఒకటి, శివుడికి కేశవుడికి ఆధారభూతమైనది ఎవరంటే అమ్మవారిని. అమ్మవారు అమ్మవారు అంటే దుర్గాని, దుర్గ అంటే పార్వతి సతీదేవని కాబట్టి దుర్గా అనేటువంటి అతిక్రమించటానికి వీలులేని అవధులు లేని అనంతమైనటువంటి ఒక మహా శక్తి ఏదైతే ఉన్నదో దానికి లోబడే శివుడైనా కేశవుడైనా నడుస్తారు అనేటువంటి ఒక భావనని చాలా ఉదాత్తంగా ఆవిష్కరించినటువంటిది వామన పురాణం. గురువు గారు చాలా బాగా వామన పురాణం అంటే అందరూ మామూలుగా కథలు దాంట్లో ఉండే మహత్యాలు చెప్తారు గానీ ఇంత విశదీకరంగా దాని వెనక ఉండే తత్వాన్ని చాలా బాగా విపులీకరించి చెప్పారండి ధన్యవాదాలు. శుభం
YouTube · audio

Gurusannidhi | Y.Swarna Latha garu | EP117

Home

Gurusannidhi | Y.Swarna Latha garu | EP117

Source: SVBC TTD on YouTube

0:00 / 57:00

More in this series

Gurusannidhi (with Y. Swarna Latha Reddy)

3 episodes · 2 hr 41 min

  1. 51 min 10

    Gurusannidhi | Smt Y Swarna Latha Reddy | EP10

  2. 46 min 11

    Gurusannidhi | Smt Y Swarna Latha Reddy | EP11

  3. 54 min 117

    Gurusannidhi | Y.Swarna Latha garu | EP117

    Now playing