Skip to content
Transcript తెలుగు
బేన విహీనం యో మాహం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం మే వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనశ్శే జంగలికాయమానే సంసార హాలాహల మోహ శాన్యే అనంతకోటి గురు స్వరూపాలకు కరుణాపూర్ణ సుధాబ్ధేన భగవాన్ శ్రీ రమణ మహర్షి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ భగవాన్ ఉపదేశించిన ఉపదేశ సారం ఒక సార్వకాలికమైన విశ్వజనీనమైన కాలాతీత వాంగ్మయం అది అంటే మానవ జన్మ ఉన్నంత వరకు దానిని ఎంత చక్కగా వాడుకోవాలి జీవితాన్ని యదార్థంగా ఎలా జీవించాలి జీవితాన్ని గాఢంగా ఎలా జీవించాలి లోతుగా ఎట్లా జీవించాలి జీవన విధానాన్ని జీవన దృక్పథాన్ని ఒక జీవన శైలిని పరమాద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఒక ఆధ్యాత్మిక కోణము అదే సందేశము అదే ఉపదేశము అదే నిజానికి ఆదేశం కూడా అదే ప్రత్యేకంగా నువ్ ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే మంచిది అని చెప్పకుండా జనసామాన్యం తమ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎట్లా గడపాలో గడప లేకపోవటానికి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో అవి దైహిక మానసిక ఆధ్యాత్మిక స్థాయిలలో అంటే physical metaphysical and spiritual మూడు levels లో మనం దాన్ని అర్థం చేసుకోలేని ఒక పరిస్థితి ఉన్నది గనుక పరిస్థితిని చక్కదిద్దుతూ ఒక emotion తో అంటే ఉద్వేగభరితమైనటువంటి ఒక కవితా స్వరూపంగా మురుగనార్ అనే భక్తుడు ఆవిష్కరించినటువంటి ఒక విషయాన్ని భగవాన్ దాన్ని జ్ఞాన మార్గం వైపు మళ్ళించి జీవితం అంటే ఏమిటి నేనంటే ఏమిటి జీవితాన్ని ఎలా జీవించాలి అసలు జీవితం ఎందుకు జీవించాలి జీవించవలసి వస్తే కోణంలో దానిని ఆవిష్కరించుకుంటూ ఉండాలి అని అనేకమైనటువంటి విషయాలని మనకి అర్థం అయ్యేటువంటి రీతిలో భగవాన్ పరమ దయా పూరితమైనటువంటి తమ ఆత్మానుభవాన్ని కూడా రంగరించి సమన్వయం చేసి ఒక బోధగా చేశారు అయితే ఇవాళ అది పారాయణమై అనేకమంది రమణ భక్తుల పెదవులపై నిత్య నూతనంగా అది ఆలపించబడుతూనే ఉన్నది అయితే ఇది ఆలపించి పారాయణం చేసి ముక్తిని పొందే విషయం కాదిది ఇది చాలా లోతుగా అధ్యయనం చేయవలసిన విషయం ఎంత తీవ్రమైన విచారణ చేస్తే అంత లబ్ధి ఉన్నది గనుక ఇవాళ సమాజాన్ని గనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చిన్న వైఫల్యాలు జీవితాలను కొలిక్కి తెచ్చేస్తున్నాయి లేదా ఒక విషాదకరమైన రీతిలో అవి ముగింపుకు వస్తున్నాయి జీవితం పోగొట్టుకోవటానికి వచ్చింది కాదు జీవితాన్ని మనం జీవించటానికై ఇక్కడికి వచ్చాం అయితే జీవితాన్ని అందంగా బహుసుందరంగా ఒక వ్యవస్థగా ఒక అవస్థగా అనేకమైనటువంటి స్థాయిలలో దాన్ని మనం విచారణ చేసుకోవలసి ఉన్నది గనుక భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారం ఇవాళ ఆధునిక కాలానికి మనం కాస్త సమన్వయం చేసుకుందాం అది కేవలం యువకులు మాత్రమే కాదు వృద్ధులైన వారు ఇక జీవించటం వృధా అనుకున్నటువంటి వాడు జీవితాన్ని త్వరగా ముగించుకోవాలనుకుంటున్నాడు జీవితంలో తాను ఆశించింది పొందనప్పుడు ఇక పొందలేనేమో అన్నటువంటి ఒక ఆశాభంగం చేత జీవితాన్ని ముగిస్తున్నాడు చిన్న చిన్న వైఫల్యాలు ముగింపును విషాదమయం చేస్తున్నాయి కానీ ఇక్కడ ఒక జ్ఞాని అయినటువంటి గురువు గురు స్థానంలో ఉన్నటువంటి ఒక పరమ పురుషుడు ప్రపంచానికి ఒక అతి వాస్తవిక దృష్టితో తన అనుభవాన్ని కూడా జోడించి అనేకమైనటువంటి శాస్త్రాలు ప్రధానంగా భగవద్గీత అలాగే దక్షిణామూర్తి స్తోత్రం అట్లాగే అనేకమైనటువంటి హైందవ ధర్మం బోధించినటువంటి సనాతనమైనటువంటి ధర్మాన్ని పాటిస్తూనే అనుసరిస్తూనే ఇది ఇక్కడిది ఇది ఇట్లా అని చెప్తూ మనకి హితోపదేశం చేస్తూ ఉన్నారు విచారణ చేద్దాం అసలు నిజానికి జీవితం అంటే ఏమిటి పుట్టటం పెరగటం ఏదో ఒకరోజున గిక్కటం ఇంతేనా ఇది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనిషికి తప్ప ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశుల విషయంలో ఇది సత్యం అవి పుడతాయి కొన్నాళ్ళు ఉంటాయి రోజున మరణిస్తాయి కానీ మానవుడు అట్లా కాదు ఒక జన్మ ఎత్తినందుకు జీవితాన్ని అర్థం చేసుకోవాలి వ్యర్థమైన ఆలోచనల నుంచి మనస్సును వైదొలగించుకోవాలి తనను తాను తెలుసుకునే ఒక ప్రయత్నం చేయాలి తాను ఒక పవిత్రమైనటువంటి ఒక పనిముట్టుగా మలచుకోవాలి తనకు తాను ఉపయోగపడుతూనే తన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఒక హితైషి కావాలి ఉపయోగకరం కావాలి ఇది మానవ జన్మకి పరమార్థం అద్వైతా మృత ధార కురియ అంతరంగ మనిడి పాత్ర తెరచి ఉంచు బోర్లించి ఉండగా బుట్టైన చిక్కదు తెరచి ఉంచిన చాలు తరచనగును ఆకాశంలో వర్షం కురుస్తూనే ఉంది పైనుంచి చాలా తీవ్రంగా కురుస్తూ ఉన్నది అటువంటి ఆగని వర్షంలో ఎవరికో ఒక ఆలోచన వచ్చింది బిందెడు నీళ్లు పట్టుకుందాము అని అనిపించింది తృతతొందర ఒక ప్రమత్తత వీటి అన్నింటి కారణంగా అంటే attention లేని కారణంగా పట్టుకోవాలన్న ఆలోచన ఉన్నది ఆతృత తొందరపాటు ఉన్నది గాని పట్టుకునే సమయంలో మాత్రం బిందె తీసుకుని వెళ్లి పడుతున్నటువంటి వర్షంలో బోర్లించి ఉంచింది. వర్షం వెలిసిపోయింది చూస్తే ఏముంది బిందె ఖాళీ. ఇది అద్వైతామృతధార కురియ అంతరంగమనిడి పాత్ర తెరచి ఉంచు తెరచి ఉంచినట్లయితే open mind గనక మనకివ్వేళ ఉన్నట్లయితే ఒక విశాల దృక్పథం గనక మన యందు ఉన్నట్లయితే జీవితం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమవుతుంది తెరచి ఉంచిన చాలు తరచనగును. తెరచి ఉంచినట్లయితే తరచటానికి అంటే విచారణ చేయటానికి అర్థం చేసుకోవటానికి తద్వారా ఆచరించటానికి ఆచరణలో నుంచి ఒక అనుభవాన్ని పొందటానికి ఒక అనుభూతిని చందించుకోవటానికి ఎన్ని కారణాలు అవుతున్నాయి. కానీ బోర్లించి ఉండగా బోర్లించి ఉంచామనుకోండి a closed mind cannot perceive అంటే బోర్లించి ఉండగా బుట్టైన చిక్కది వర్షం కురుస్తూనే ఉంది. ఎంతో మంది లబ్ధి పొందారు మనం తప్ప కారణం మనసును మూసి ఉంచాం. పైగా మనం విచారణ చేస్తున్నట్లుగానే అహం, మమతా, మమకారం, దంభం, ప్రగల్భం, గర్వం, అభిమానం, ఆభిజాత్యం ఇవన్నీ కూడా మనిషిని అతలాకుతలం చేస్తాయి. ఎక్కడ మానసిక స్థాయిలో. ఎప్పుడైతే మనసు ఇన్నింటితో కప్పబడి ఉన్నదో అసలు మనసు బయటకు రాదు. మనసు శుద్ధ మనస్సని, పూర్ణ మనస్సని, ఆనంద తారకమైన మనస్సని, ఆనంద రసతుందిరమైన మనస్సు అని ఎప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది? మనసుని తెరచి ఉంచాలి. అయితే ఇవన్నీ పుస్తకాల్లో ఉన్నాయా? వీటన్నింటిని మనం ఎక్కడి నుంచి పట్టుకోవాలి అంటే అంతరంగము కన్నా జాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమగురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. పెద్ద పుస్తకం ఏది అసలైన పుస్తకం ఏది అంటే మన చుట్టూ ఉన్న సమాజం మన చుట్టూ ఉన్న ప్రపంచం గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే. అట్లాగే ఎవడు స్నేహితుడు? ఈశ్వరుడే స్నేహితుడు. ఈశ్వరుడు అంటే దేవుడా? రాముడా? మహేశ్వరుడా? శివుడా? రుద్రుడా? ఎవరు? వీటన్నింటిలలో ఒక scientist అంటే శాస్త్రవేత్త fluid అంటాడు, power అంటాడు, current అంటాడు. వేదాంతి లోపల ఉన్నటువంటి పరమాత్మ అంటాడు. భక్తుడు రాముడంటాడు, కృష్ణుడంటాడు, శివకేశవులంటాడు, మరొకటంటాడు ఏదో పేరు పెట్టుకుంటాడు. ఇక్కడ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఒక పూర్ణాద్వైతమూర్తి గనుక శుద్ధాద్వైతమూర్తి గనుక ఆయన దేవుడు అన్న మాట వాడలేదు. ఆయన జీవన కాలంలో క్షణాన దేవుడు అన్న మాట వాడలే. ఆయన వాడినవి రెండే మాటలు ఒకటి శక్తి అంటే energy లేదా కర్త causation అంటున్నాం కదా ఇవ్వేళ. కర్త, కర్త ఎవడు? అంటే దీన్ని నడిపిస్తున్నటువంటి ఒక జగన్నాయకుడు ఎవడో ఉన్నాడన్నమాట. వాడు మన కంటికి కనపడ్డు, ఇంద్రియాలకి తోచడు, మనసుకి పట్టని వాడు. అన్నింటినీ దాటి గనక వెళ్లగలిగినట్లయితే వాడు అక్కడున్నాడు. వాడి పేరు ఆత్మ, కర్త అయినట్లయితే కర్త గురించి చెప్తున్నారు. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం చాలా అందమైనటువంటి మొట్టమొదటి శ్లోకమిది. ఏది? ఉపదేశ సారంలో. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్త అనేవాడు ఒకడున్నాడు. వాడు ఆజ్ఞాపిస్తే తప్ప మనకు ఫలితాలు రావు. భగవద్గీతలో ఇలా ఏదో ఇటువంటిదేదో చెప్పినట్లున్నదే అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడుగా జగద్గురువు. కర్మఫల త్యాగం చాలా గొప్పదని ఫలితాన్ని ఆశించకుండా నువ్వు పని చేయమని అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. ఫలితాన్ని ఆశించకుండా జీవుడు పని చేయలేడు. ఎవరు అనేవాడితో సహా ఏదో ఫలితం ఉండాలి అంటున్నదానికి. ఏమీ దొరక్కపోతే కనీసం చెప్పిన తృప్తి ఉండాలి. అది కూడా లేకుండా ఒక రాతి బొమ్మవలె, కట్టె వలె, జడం వలె పనులు చేసుకుంటూ పోతాడా? పోడే. తన అవసరాలకి, తన ఆలోచనలకి, తన ఆశలకి, ఆశంశలకి, ఆకాంక్షలకి దగ్గరగా ఫలితం వస్తుందా తగిన ఫలితం ఏది వస్తుందా అని ఎదురుచూస్తూనే ఉంటాడు. దిశగా ఆలోచించినప్పుడు రమణులు మరొక కోణంలో దీన్ని ఆవిష్కరిస్తున్నారు. కర్త్రురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. జీవితం అంటే అసలు ఏమిటి? సిద్ధాంతం మీద మానవుడి జీవితమైనా వాడు పామరుడు గాని, పండితుడు గాని, వాడు రాజు గాని, బంటు గాని, జ్ఞాని గాని, అజ్ఞాని గాని అంటే మనకి వ్యాకరణంలో చెప్తారు కర్త, కర్మ, క్రియ. అంటే కర్త చేసేవాడుండాలి, కర్మ చేయబడేది ఉండాలి, క్రియ చేయబడినది ఉండాలి. అంతే కదా! మూడు అయినట్లయితే మనకేదో ఒక విషయం జరుగుతుంది. దానిలో నుంచి లాభనష్టాలు ఏర్పడతాయి. మన మనసు యొక్క స్థితిని బట్టి మనం దాన్ని పంచిపెట్టడమా, దాచి పెట్టుకోవటమా, ఎవరికీ ఇవ్వకుండా ఉండటమా, గుప్తంగా ఉంచుకోవటమా మనిషి సంస్కారం మీద ఆధారపడి ఉన్నది. అక్కడిదాకా వెళ్లే ముందు కర్త అంటే భగవాన్ దృష్టిలో ఎవరు అని. కనపడకుండా జరిపిస్తున్నవాడు కర్త. నేను దేవుణ్ణి చూశాను అన్నవాడు దేవుణ్ణి వస్తువుగా చూశాడా, ఆకారంగా చూశాడా, బొమ్మగా చూశాడా, బ్రహ్మగా చూశాడా, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వంగా చూశాడా, ఒక భావనామయ స్థితిలో అనుభవించాడా, తన భావం పర భావం రెండూ ఒకటైనట్టు చూశాడా, పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి అన్నటువంటి వైదాంతిక భూమిలలో పరా అంటే చూడవలసిన దానిని, పశ్యంతి అంటే చూసి, మధ్యమా అనుభవించి, వైఖరి చెప్పాడా? నేను రాముణ్ణి చూశాను, కృష్ణుణ్ణి చూశాను అంటున్నాడే చూసినవాడు రాముడో కృష్ణుడు అని ఖచ్చితంగా తనకు తెలుసునా? రామకృష్ణాది రూపాలన్నీ అవి అంతేనా అని ఆలోచించినట్లయితే రూప వర్ణన, గుణ వర్ణన చేసిన కవులున్నారే తప్ప రూపాన్ని చూసిన వాడు లేడు.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -05

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -05

Source: TFC Spiritual on YouTube

0:00 / 14:23

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

    Now playing
  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77