Skip to content
Transcript తెలుగు
అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మికత లో అ-ఆలు దిద్ది తీవ్ర స్వాధ్యాయనంతో ఆత్మజ్ఞానాన్ని పొంది పది మందికి పంచుతున్న ప్రముఖులు శ్రీ వల్లూరు శ్రీరామచంద్ర మూర్తి గారు. ఇంతే కాదు లోతైన పరిశోధనలు చేసి శాస్త్రవేత్తగా సత్యాన్ని అన్వేషించిన రచయితగా పరిశోధకులుగా ఎంతో విలువైన సంపదని తరానికి యువతరానికి అందిస్తున్న ఘనులు వారి జన్మని సార్థకం చేసుకున్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్త గురువు గారు. వారితో సంభాషించి గురు శిష్యుల బంధాన్ని గురించి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. [భక్తి సంగీతం] అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మికత లో అ-ఆలు దిద్ది తీవ్ర స్వాధ్యాయనంతో ఆత్మ జ్ఞానాన్ని పొంది పది మందికి పంచుతున్న ప్రముఖులు శ్రీ వల్లూరు శ్రీరామచంద్ర మూర్తి గారు. లోతైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తగా సత్యాన్ని అన్వేషించిన తత్వవేత్తగా విలువైన రచనలను అందించి యువతరంలో స్ఫూర్తిని నింపే వక్తగా వెరసి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా జన్మను సార్థకం చేసుకున్న నిరాడంబరులు శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు. తమ విశిష్ట వ్యక్తిత్వంలోని సేవా సాహిత్య ఆధ్యాత్మిక వైజ్ఞానిక ప్రజ్ఞ విశేషాలను ఎన్నడూ వెలుగు చూడని భారతీయ గురుతత్వం పై వారి విశ్లేషణాత్మకమైన విశేష ధారను మనతో పంచుకుంటున్న శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారితో ఈనాటి గురుదేవు భవ. [భక్తి సంగీతం] గురుదేవోభవ ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురుదేవోభవ గురువు గారు సాదర నమస్కారాలు. శుభం. గురుదేవోభవ కార్యక్రమం గురువు గారు కాబట్టి మామూలుగా గురువులతో మొదలు పెడతాం గురువుల గురించి మొదలు పెడతాం మొట్టమొదటి ప్రశ్న ఉమ్ శిష్యులు అంటే ఎవరు? వందే గురు మాం చరణారవిందే సందర్శిత స్వత్మ సుఖావబోధే జనశ్శయే జంగలికాయమానే సంసార హారా హలమోహ శానియై. ఇది భారతీయమైనటువంటి గురువు యొక్క సమగ్ర స్వరూపం ఇది. ఉమ్ లోకంలో అనేక మంది గురువులున్నారు అందులో ప్రధానంగా ఆత్మవిద్యను బోధించేటువంటి గురువు యొక్క దర్శనం చేత, స్పర్శన చేత, సంభాషణ చేత జన్మ జన్మాంతరంగా తెచ్చుకున్నటువంటి అనేకమైనటువంటి కర్మ ఫలాలు అన్ని కూడా శానియై నశిస్తాయి. ఉమ్ క్షమిస్తాయి. ఉమ్ సాధకుడి యొక్క సాధన ద్వారా. ఎందుకంటే గురు శిష్య సంప్రదాయంలో శిష్యుడిదే ప్రధానమైన భూమిక. గురువు కుండడి పాలకి తోడైన తోడుచుక్క. అంతే కదా మరి శిష్యుడు అన్నదానికి ఒక నిర్వచనం ఏమిటంటే ఎవరు తనను తాను నిశ్శేషం చేసుకుంటారో తన ఉనికి, తన అస్తిత్వం, తన వ్యక్తిత్వం, నేను అన్నటువంటి భావన, నాది అన్నటువంటి మమకారం వీటన్నింటినీ కూడా దాటి తాను నిలకడగా చెంది గురు సంప్రదాయాన్ని, గురు వాణిని, గురువుని అనుకరించకుండా గురువుని అనుసరిస్తూ ఉమ్ ఎవరైతే జీవిస్తారో సాధనా ఫలాన్ని సంపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకుంటారో అటువంటి వాడు శిష్యుడై ఉంటాడు. అది శిష్యత్వం అంటే. శిష్యుడు చేసేది చాకిరీ కాదు శిష్యుడు చేయవలసింది సాధన. గురు హృదయాన్ని గురువు చెప్పే వాక్యం వెనుక ఉన్న భావాన్ని దాని అంతరార్థాన్ని, శబ్దార్థాన్ని విశేషమైనటువంటి అర్ధాన్ని అంతకు మించి ఒక ఆధ్యాత్మిక భావనా భూమికని అందుకోగలిగిన స్థితిని పొందగలిగిన వాడు శిష్యుడు అవుతాడు. ఉహు ఒక జీవితకాలం చాలదు. గురువు గారు రెండు పదాలు వాడారు అనుకరిస్తూ అనుసరిస్తూ మరి గురు శిష్యులు ఇద్దరూ ఒకటే అయితే శిష్యుడు గురువులో లీనమైపోతే మరి తోడుచుక్క అనుకరించడం అనుసరించడం అంటూ ఉంటుందా? అనుకరించటం ఉండదు అసలు అనుకరించితే వాడు ఏమవుతాడు అంటే వాసుదేవుడు పౌండ్రక వాసుదేవుడు అయిపోతారు. ఊహూ అంతే కదా కాబట్టి గురువుని అనుసరించటం అంటే గురు మార్గం. గురువు ఏం చెప్తున్నాడు? దేనికై చెప్తున్నాడు? వ్యక్తి వికాసం చెందాలని చెప్తున్నాడా? సమాజం వికాసమానం చెందాలని చెప్తున్నాడా? ఒక జాతి ప్రభావితం కావాలని చెప్తున్నాడా? ఇవన్నీ కూడా దానిలో నుంచి తనంతట తాను ఏరుకొని, అల్లుకొని, అందుకొని, అలదుకొని తనను తాను ఒక రూపాంతరీకరణం చేసుకోవాలి. ఊహూ అంటే ఒక raw diamond నుంచి వజ్ర సమానమైనటువంటి కాంతులీనేటువంటి వజ్రం లాగా ఒక రాయి ఎలా మారిపోతున్నదో శిష్యుడు అలాగే వెళ్తాడు. గురువు భావావరణలో నుంచి బయటకు వచ్చినప్పుడు అతడు ఎలా ఉంటాడంటే గురువు వలె ప్రకాశిస్తాడు. ఊహూ గురువు లాగా ప్రకాశిస్తాడు. గురువు అంతటిగా ప్రకాశిస్తాడు. కొన్ని చోట్ల గురువుని దాటుతాడు. గురువు గారు మీరు శాస్త్రవేత్తగా ఉన్నారు. ఉమ్ మామూలుగా సైన్స్ బాగా నమ్మేవారు లేదా శాస్త్రవేత్తలుగా ఉండేవారికి ఇటువంటి అంటే పరిధి దాటి ఉండే ప్రపంచాల గురించి అలౌకిక విషయాల గురించి నమ్మకాలు ఉండవని అంటుంటారు. గురువు గారికి బీజం ఎలా పడిందో చెప్పగలరా? నా నాల్గవ ఏట ఉమ్ రఘువరదాసు గారిని ఈశాన్య భారతంలో చైతన్య మహాప్రభువు ఎట్లాగైతే భక్తి ప్రవాహాన్ని పరవళ్ళు తొక్కించారో ఆంధ్రదేశంలో తెలుగునాట రఘువరదాసు గారు హనుమాన్ చాలీసాని పరవళ్ళు తొక్కించారు. ఉత్తరాది సాంప్రదాయ సంగీతాన్ని ఇటు కర్ణాటక సంగీతాన్ని సమన్వయం చేస్తూ ఆయన సంకీర్తన స్వరూపంగా ప్రపంచానికి ఆమహా ఆదర్శంగా నిలిచారు. వారిని నా నాలుగవ ఏట దర్శనం చేసుకున్నప్పుడు నాకు హనుమాన్ చాలీసా ఇచ్చి ఇది గనక చదివితే అరిటి పండు ఇస్తానన్నారు. సాయంకాలానికి అప్పజెప్పమన్నారు. ఉమ్ ఒక అరగంటలో నేను దాన్ని ధారణ చేశా. fourth year. చేస్తే నిజానికి అది ఆశ్చర్యం. భాష మంది కాదు లిపి మాత్రమే తెలుగు. కానీ లిపిని బట్టి భాష అర్థమైంది. ఆహ్ అక్కడ ప్రారంభమైంది. అప్పటికి నేను శాస్త్రవేత్తని కాదు నాలుగేళ్ళకి శాస్త్రవేత్తని ఎలా అవుతాను? అవును కాన కదా. ఆధ్యాత్మికత అంటే తెలియదు. కేవలం భక్తి ఉండి ఉండొచ్చు లోపల ఎక్కడో బీజ ప్రాయంగా. అట్లా అట్లా నెమ్మదిగా ఆహ్ తర్వాత పన్నెండేళ్ళు వచ్చేప్పటికీ జల్లెడ మూడు అమ్మని నేను చూశా. ఆహా! ఆమె మూడు రోజులు మూడు సార్లు మూడు రోజులు నేను ప్రకాశం జిల్లాలో చదువుకున్నా. ఒక కుగ్రామం ఇంకొల్ల అని అక్కడ. అక్కడి నుంచి ఆవిడ సెలవులకు వచ్చినప్పుడు వెళ్లి చూస్తూ ఉండేవాడిని. ఆవిడ నన్ను దగ్గర పెట్టుకునేది. ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు. రకంగా ఆమెతో కొంత ఆధ్యాత్మిక అనుభవం తెలియకుండా ఏర్పడి ఉండాలి లోపల. రూపుదిద్దుకొని ఉంటుంది. ఒక నెల ఆహ్ gapలో సత్యసాయి బాబా గారిని చూశా at the age of twelve, 1962. అది యాభై నాలుగేళ్ళు కొనసాగింది. ఇక అసలు వ్యక్తిత్వము, ఆధ్యాత్మికత ఇవన్నీ అది ప్రధానమైనటువంటి వేదిక అయినప్పుడు తర్వాత నేను science and technology లోకి వెళ్ళటం. science and technology spirituality రెండూ భిన్నం కాదు. అని ఒకదానికి ఒకటి complementary. sci-science లేకుండా శాస్త్రం లేదు. శాస్త్రం అంటే నిజానికి scienceఏ. scientificగా చెప్పాల. ఇవాళ చెప్పే termsలో చెప్పాల. కానీ ఖగోళ శాస్త్రం గాని, జ్యోతిశ్శాస్త్రం గాని మన పురాణాల నిండా వైదిక విజ్ఞానం అంతా కూడా ఉంది. దీన్నంతా బయటకు తీసుకువచ్చినటువంటి వాడు వరాహమిహిరుడు. ఊ. కాబట్టి influence వల్ల నేను ఏం చేశానంటే అధ్యాత్మ అంటే కేవలం భక్తిభావనతో కూడిన విషయం మాత్రమే కాదని, భక్తిలో ఉన్న తర్వాత జీవితాన్ని ఎట్లా సంపూర్ణత్వం వైపు నడిపించుకోవాలి. అవరోధాలు ఉంటాయి, కష్టాలు, సుఖాలు అన్ని ఇబ్బందులు, ద్వంద్వాలు అన్నీ ఉంటాయి. అన్నింటినీ దాటుతూ ఎట్లా వెళ్ళాలి అని అనుకుంటూ science ఏమో ప్రాపంచికమైన కీర్తిని ఇస్తే ఆధ్యాత్మికత మానసిక ప్రశాంతతనిచ్చింది. రెండూ సమన్వయమే. అంతే. గొప్పగా ఉంది గురువు గారు. ఇంకా కొన్ని విషయాలు మీ ప్రయాణాన్ని గురించి తెలుసుకోవాలని ఉంది. ఓ. అంటే ఎప్పుడైనా మీరు గురువుతో గురువు ఆహ్ సన్నిధిలో ఉన్నప్పుడు ఉమ్ లేకపోతే ఇతర సమయాల్లో ఎప్పుడైనా దివ్య అనుభూతులు పొంది ఉంటారు కదా. వాటిని ఏమన్నా చెప్ పంచుకోగలుగుతారా మాతో? తప్పకుండా, తప్పకుండా. ఇక్కడ గురువు అనగానే కేవలం భౌతిక గురువు అని మాత్రమే కాదు. విషయాన్నైనా మనం భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక మూడు స్థాయిల్లో విచారణ చేయాలి. ఊ. భౌతిక స్థాయిలో గురువుగారి దగ్గరికి వెళితే ఆయన ఏదో మనకివ్వటం, మనమేదో పుచ్చుకోవటం, మనం స్వామి వారికి ఏదో ఇవ్వటం, రావటం ఇది కాదు. intellect ఒకటి మానవుడికి ప్రజ్ఞాభూమిక ఒకటుంది కాబట్టి ప్రజ్ఞాభూమికలో ప్రతి విషయాన్ని తరచి తరచి లోతులు చూడవలసిన విషయం ఉంది కాబట్టి అక్కడ పనిచేసేది మనది intellect కదా. intellect లేకపోతే ఏం చేయలేం. దాన్ని ఆధారం చేసుకుని కడగా intellect కాదు intuition. ఊ. అనేటువంటి స్థాయికి వెళితే అధ్యాత్మ లోకి వస్తాం. దీంట్లో నాకు ప్రథమంగా శంకర భగవత్పాదులు అంటే చాలా ఇష్టం. ఊ. ఆయన వాంగ్మయం అంతా కూడా ఒక కవితా ప్రవాహం. సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి ఒక భాషా విన్నానం అది. వైనం వేరు. అలా రా సంస్కృతం అలా రాయగలిగిన వాళ్ళు అంత rhythmicగా, అంత అద్భుతంగా, అంత భావస్ఫోరకంగా, పైగా కరుణాస్ఫోరకంగా ఊ. ఒక భగవంతుని గురించి ఆయన రాసిన ఒక శ్లోకం చదివితే భగవంతుడు మన కట్టెదుట సాక్షాత్తు సాకార స్వరూపంగా మనకు కనిపిస్తాడు. కాబట్టి భగవత్పాదుల యొక్క వాంగ్మయం వారిని చూసే అవకాశం లేదు కదా. వారితో కలిగినటువంటి అనుభవాలు కూడా వాటిని అపరోక్షానుభూతి అంటాం. ఊ. ప్రత్యక్షంగా కనిపించని ప్రత్యక్షానుభవాలు. ఏమిటి అంటే ఒక చరణం చదువుతూ వెళుతున్నప్పుడు, ఒక శ్లోకం అర్థం చేసుకుంటూ అనుభవిస్తున్నప్పుడు మూర్తిమత్వాన్ని దర్శనం చేయించినటువంటి మహానుభావులు శంకర భగవత్పాదులు. ఇట్లా ఉంటుంది. పరమేశ్వరుడు అంటే ఇలా ఉంటాడు. శ్రీవేంకటేశ్వరుడు అంటే ఇలా ఉంటాడు. కేవలం అర్చా మూర్తి మాత్రమే కాదు దానిని దాటినటువంటి స్థాయికి వెళితే నువ్వు అనుభవించే రీతులు వేరు అన్నట్టుగా కాశీవిశ్వనాథుడు గాని ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి సమస్త దేవీదేవతల యొక్క స్తోత్రాల నిండా దాని వెనక దాగినటువంటి సగుణాన్ని అనుభవంలోకి తెచ్చిన వారు భగవత్పాదులు. శంకర భగవత్పాదుల తర్వాత ఆహ్ వారిని చూడకపోయినా అసలు మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఊ. అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, అవును నన్నేమో ఇంట్లో తండ్రి అంటారు, మరొక చోట గురువు అంటారు, ఇంకో చోట శిష్యుడు అంటారు, ఇంకో చోట మీరన్నట్టు శాస్త్రవేత్త అంటారు ఇంతకీ అసలు నేనెవరు? ఊ. అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రశ్నని తరచి తరచి తరచి వేసుకున్నప్పుడు నన్ను నేను ఒక్కటొక్కటి కూడా eliminate చేసుకుంటూ వెళ్ళినప్పుడు అదే నేతి నేతి అంటామే elimination processలో నేను కేవలం దేహాన్ని మాత్రమే కాదు, నేను దేహాతీతమైన ఒక అంతః చైతన్యాన్ని నేను. అది నేను. అసలు నేను. నేనే నేను నేనైన నేనుగా ఉన్నా. ఊ. నేనుగా మేనులో ఇప్పుడు కనిపిస్తున్నా. ఒక స్వాప్నిక అనుభూతిలో స్వప్నానుభూతిలోకి నేను వెళ్ళినప్పుడు నన్ను నేను పరామర్శించుకుంటున్నా, నన్ను నేను తడుముకుంటున్నా, నన్ను నేను చూసుకుంటున్నా. అక్కడ నా చుట్టూ ఉన్న ప్రపంచం, నా చుట్టూ అల్లుకున్నటువంటి నా సంపద, నా కీర్తి, నా పరివారం ఎవ్వరూ లేరు. నేను ఒక్కడివే ఉన్నా. నా దేహమే నా ఆహ్ అధీనంలో లేని పరిస్థితి. దాని నుంచి నెమ్మదిగా మళ్ళీ జాగ్రవస్థలోకి వచ్చేటువంటి సుషుప్తిలో కలిగేటటువంటి అనుభవం ఏమిటంటే అది వరి గింజ మీద ఉన్నటువంటి ముల్లు ఎంత చిన్నది ఉంటుందో అంత సూక్ష్మ సూక్ష్మేతరంగా ఉంటుంది. అక్కడ అసలు నేను అని అనుభవిస్తా.అందువల్లనే నిద్ర లేవగానే ఎంత హాయిగా ఉన్నదో అంటూ లేచా. ఎందుకని అంటే ఎన్నో పనులు చేసిన నేను హాయిగా ఉన్నాను అనట్ల అలసిపోయాను అంటున్నా. ఏమీ చేయకుండా నికామంగా రాత్రంతా గడిపి తెల్లవారుతున్నటువంటి వేళ నేను లేస్తున్నానే అది నాకు హాయిని ఇచ్చింది. హాయి అంటే నన్ను నేను చూసుకున్నా. నన్ను నేను తాకా. నన్ను నేను స్పష్టంగా అనుభవించా. ఉమ్ నేను ఎవరో నాకు తెలుస్తున్నది అది. ఇవన్నీ అంటే మాటల్లో చెప్పడం కష్టం ఎవరికి వారు అనుభూ-- అనుభూతి పొందవలసిందే. అనుభూ-- చేయవలసిందే. అయితే గురువుతో పొందేటువంటి అనుభూతి ద్వంద్వానికి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్పిందంతా స్వాత్మకి. అంతర్ గురువు. అంతర్ గురువు. మరి బహిరంగంగా ఇప్పుడు ఇందాక కొన్ని పేర్లు చెప్పాను జిల్లెళ్ళ మూడమ్మ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు కలిగిన అనుభూతి ఏమిటి? అనుభూతిని వర్ణించలేం గానీ అనుభవాలు చెప్పగలం. ఉమ్ ఏమిటి అనుభవం అంటే ఒక మానవ జన్మ ఎత్తి ఒక వంద సంవత్సరాల క్రితం సమాజం అంతా కూడా సంప్రదాయ బద్ధంగా కులమతాలతో తల్లడిల్లుతున్నటువంటి వేళ కునారిల్లుతున్నటువంటి వేళ అసలు ఇదేం లేదు ఉన్నదంతా ఒకటి మానవ జన్మే మానవ జీవితమే మానవ జాతి అంతా ఒకటే తారతమ్య భేదాలు లేవని మనిషికి కావలసింది అన్నం ప్రధానం అని కలియుగం అన్నగతం అని అన్నం వెతుకులో నుంచి ప్రాణము ప్రాణం నుంచి మనస్సు మనస్సు నుంచి విజ్ఞానము విజ్ఞానం నుంచి ఆనందం అంటే పంచకోశాలు ఇవి ఏర్పడతాయి అని చెప్తూ అన్నం ప్రధానం అని పైకేమో ఆకలి తీర్చే అన్నంగా అనిపిస్తుంది మనస్సును నిర్మించే అన్నం అది. ఉహు శుద్ధ మనస్సును నిర్మించే అన్నం అది. దానిలో నుంచి ఒక ప్రాణం విజ్ఞానం expansion ఇవా-- బహు విస్తృతమైనటువంటి వేదిక దానిలో నుంచి మనం మనం draw చేసుకోవలసినటువంటి ఒక ఆనంద అతిశయ రేఖ. ఇవన్నీ నేను జిల్లెళ్ళమూడి అమ్మలో నేను గ్రహించింది అది. ఉమ్ ఎందుకంటే ఆనాటికే అన్నం పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ జ్ఞానాన్నాన్ని ఇచ్చేవాళ్ళు లేరుగా. ఉమ్ అది ఆమె దగ్గర నాకు కలిగినటువంటి అనుభవాలు. ఉమ్ ఇక రెండవది సుదీర్ఘమైనటువంటి అనుభవం సత్యసాయి బాబా గారు. అయితే ప్రపంచం మొత్తం ఆయన్ని a miracle man గా చూసింది. నేనట్లా చూడలా. ఒక man making process ఆయన ప్రారంభించారు. ఒక మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని, ప్రేమని, సత్యాన్ని సకల శాస్త్రాలు సకల ధర్మాలు ఏమి నేర్పినయో వాటన్నింటినీ కూడా కేంద్రీకృతం చేసి నీలో ఉన్నటువంటి సంస్కారము, సంస్కృతి, విశేషమైనటువంటి ప్రజ్ఞ, ప్రతిభ, ఉత్పత్తి ఇవన్నీ కూడా ప్రేమగా మారకపోతే మానవ జన్మకి పరమార్థం ఏముంది? అంటే రాగము వేరు అది ప్రేమ కాదు. అనురాగము వేరు అది ప్రేమ కాదు. రాగ అనురాగాలను దాటినటువంటి ప్రేమానుభూతి ఏదైతే ఉన్నదో ఎవరినైనా ప్రేమించగలిగిన ఎవరినైనా own చేసుకో-- ఇవాళ భాషలో inclusiveness అని వాడుతున్నారు. వీరందరూ నా వాళ్ళే నేను కూడా వాళ్ళందరికీ చెందిన వాడినే అనేటువంటి ఒక త్వమేవాహం సంశయః ఏమీ తేడా లేని ఒక అద్భుతమైన భావనకి ప్రేమ అనే రూపం తీసుకు వచ్చి జాతి, మత, కుల, వర్గ, వర్ణాలు దాటి ప్రేమని ఆయన ప్రపంచానికి చెప్పారు. గురువు గారు నిజానికి మీరు చెప్తున్న స్థితి ఒకరి వైపు ఉం-- కలిగే లేదు మానవాళి వైపు కలిగే భావన మన-- మనలో ఉండే స్థితా? Is it a constant state? It is. constant state కావటానికి అసలు అదేంటో ముందు తెలియాలిగా. ఉమ్ తెలిసిన తర్వాతగా మనం దాన్ని అభ్యాసం చేస్తాం. అయితే ఇది కేవలము మానవుడికి మానవుడికి ఉన్న సంబంధం మాత్రమే కాదు సమస్త జీవరాశుల యందు ఒకే రకమైనటువంటి ప్రేమ భావన గనక ఉంటే అది నిజమైనటువంటి ప్రేమ. ఒట్టి ప్రేమ ఎట్లా నేను నా కడుపున పుట్టిన బిడ్డకి నా ప్రేమను ఎలా ప్రకటించాలి? ఏదో వస్తువు ఇచ్చి తనకు కావలసింది చేసి అట్లాగే సేవ. అహంకారం, మమకారాలు రెండు తెంచుకోవాలి అంటే సేవ బినా నిర్వాణ నహి. ఇవాళ మోక్షానికి మరణానంతర సుఖం మోక్షం కాదు. నీ చుట్టూ ఉన్న సమాజం యొక్క అవసరాలను గమనించి నీవు చేయగలిగినంత నువ్వు గనక చేయగలిగితే అది సేవ మిగతాదంతా చాకిరీయే అంతే. చాకిరీకి కూలి డబ్బులు దొరుకుతాయి సేవకి ఆత్మానందం కలుగుతుంది. మరి మానవుడి మానవ జీవన పరమార్థం ఏమిటి ఆనందాన్ని అందుకోవటమే కదా అది. అది ఆయన దగ్గర ఇక అనుభవాలంటే physical level అనుభవాలు ప్రపంచానికి అవసరం లేదు ఆధ్యాత్మిక అనుభూతులు సనాతనమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని ఒక ధర్మాన్ని విశేషమైనటువంటి అంతరార్థాలని వాటిని నేను ఆయన సన్నిధానంలో చాలా గ్రహించా. నా-నా అనుభవం గానీ నేను ఆయన్ని దర్శించిన తీరుతెన్నులు గానీ అవి. గొప్పగా ఉంది గురువు గారు ఉమ్ ఇప్పుడు ఈ-ఈ తరం గురువు గారు చాలామందికి ఒక ప్రశ్న కలుగుతుంది ఎందుకు నేను అధ్యాత్మిక సాధనలో నేను ఎందుకు ఉండాలి? ఉమ్ అనే ప్రశ్నకి అంటే నాకేమిటి ఎక్కువ విజయం ప్రసాదిస్తాడా భగవంతుడు లేదు నాకు వచ్చే ఒత్తిడి నుంచి నేను తప్పుకుంటానా లేదు నాకేమన్నా కవచం ఏర్పడుతుందా నేను అడిగిన వరాలన్నీ ఇస్తాడా ఉమ్ ఇలాంటి ప్రశ్నలు చాలా సా-సామాన్యమైన ప్రశ్నలు ఎప్పటికీ ఉంటాయి అవును అవును సమాధానంతో వారిని convince చేయొచ్చంటారు గురువు గారు? అంటే ఒక బిడ్డ చిన్న పాప తన తల్లితో ప్రయాణం చేస్తుంది నిర్భయంగా ప్రయాణం చేస్తుంది ఎవరు-ఎవరిచ్చారు నిర్భయత్వాన్ని? తల్లి ఉనికి తల్లి స్పర్శ నా పక్కన మా అమ్మ ఉన్నది గనుక నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధైర్యం అది natural inbuilt అన్నమాట. ఉమ్ తల్లి స్థానంలో ఒక పరాయి స్త్రీని ఎవరినో కూర్చోబెట్టండి భయపడిపోతుంది. వాళ్ళ అమ్మ కోసం తిరుగుతుంది. భగవత్ తత్వం కూడా మాతృ తత్వానికి సమానమైనటువంటి స్థితి అది. ఎవరో మనల్ని కాపాడటానికి ఉన్నారుమనం ఏదన్నా అడిగితే ఇవ్వటానికి ఎవరో ఒకాయన ఉన్నాడు. ఆయనో ఆమో ఎవరో ఉన్నారు. అని అన్నప్పుడు నిస్సంకోచంగా అడగటానికి కూడా మనం ఒక అడుగు ముందుకేస్తాం. అసలు నాకు ఎవరూ లేరు, అడిగేది లేదు, నాకు ఇచ్చే, ఇచ్చేవాళ్ళు లేరు అనుకున్నట్లయితే, ఆహ్ వాడి ఆలోచనలు అయిపోయి నిస్సహాయుడు అవుతాడు. కాబట్టి భగవంతుడు బంగారు కంచానికి అంచు లాంటిది. జీవ ప్రజ్ఞలన్నీ ఉన్నాయి, మనందరికీ ఉన్నాయి. ఇందులో ఒక్కరికీ ప్రజ్ఞ లేని వాడు లేడు. కానీ, దైవ ప్రజ్ఞ కూడా కావాలి. కేవలం దైవ ప్రజ్ఞ ఉంది, అన్నీ ఆయనే చూసుకుంటాడంటే ఒప్పుకోము. జీవ ప్రజ్ఞ ప్లస్ దైవ ప్రజ్ఞ అది మానవుడికి, సమాజానికి అవసరం కాబట్టి ఆహ్ ఇవాళ యువత ఎందుకు అధ్యాత్మలోకి రావాలి? ఎందుకు భగవంతుడి గురించి విచారణ చేయాలి? ఎందుకని ఇలా మాట్లాడాలి అంటే మనం ప్రపంచంలో ఎంత సమూహంలో ఉన్నా మనం ఏకాకులం. ఎంత ఏకాకులం, ఒంటరితనంలో ఉన్నా సమస్త ప్రపంచంతో మనం కూడి ఉంటాం. సంయోగంలో వియోగము, వియోగంలో సంయోగము ఎప్పుడూ మిశ్రితమై ఉంటాయి. అవును చీకటి, చీకటి అంటే ప్రత్యేకంగా లేదు. వెలుగు పోతే చీకటి. అవును చీకటి వస్తే వెలుగు లేదు. ఈ, రెండు అవినాభావంగా ఉన్నాయి. అట్లాగే భగవంతుడు మనం వేరువేరుగా లేము. ఎక్కడున్నాడు? భాగవతం అంతా చెప్తున్నది కదా అసలు ఆయన చోటు లేని చోట ఎక్కడ అని. కానీ సూక్ష్మంగా ఒక్క వాక్యంలో చెప్పాలంటే యువతనండి, మనమనండి, ఎవరినైనా కానివ్వండి భగవంతుణ్ణి ఎక్కడ పట్టుకోవాలి, ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన నయనాంజన రేఖ వలె ఉన్నాడు. ఉమ్ కంటి కాటుక రేఖ వలె ఉన్నాడు. ఒక స్త్రీ తన కంటికి కాటుక పెట్టుకునేటప్పుడు ఆమెకు అలవాటైనప్పటికీ అద్దం వైపు చూస్తుంది. సరిగ్గా పెట్టుకున్నానో లేదో అని. భగవంతుణ్ణి చూట్టానికి కూడా ప్రపంచం కావాలి. కావాలి కదా. ప్రపంచం ద్వారా భగవంతుణ్ణి అన్వేషించాలి. అందుకనే బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్తుందంటే అసలు ప్రపంచమే భగవంతుడు. ఉమ్ భగవంతుని యొక్క సహస్ర శీర్షా పురుషః అని చదువుతాం. అంటే ఆయనకు వెయ్యి తలలు, పదివేల తలలు ఉన్నాయని కాదు. ఉన్న అన్ని తలలు ఆయనే. తలపులు వేరుగా ఉన్నాయంతే. తలలన్నీ ఒకటే. తలపులు వేరు వేరు. జీవుడి యొక్క సంస్కారాన్ని బట్టి. కాబట్టి, ఇవాళ ఎందుకని అధ్యాత్మలోకి రావాలి అంటే ప్రపంచం మనల్ని నిరాదరించినప్పుడు, ప్రపంచం మనకు అక్కరరానప్పుడు, ప్రపంచం మనల్ని లాలించే స్థాయిలో లేనప్పుడు, ప్రపంచం మన కష్టాన్ని గుర్తించని సమయంలో గుర్తించి, లాలించి, పాలించి, ఆలించి, అదలించే వాడు ఒక్కడే. అతడు పరమాత్మ. భౌతికంగా చూస్తే అర్చా మూర్తి, ఆంతరికంగా చూస్తే ఆత్మే గురువు అవుతున్నాడు. అది సంపూర్ణంగా ఉమ్ ఎక్కడా కూడా సందేహాలకు తావు లేకుండా గురువు గారు వివరిస్తున్నారు. అవును, అవున గురువు గారు, గురు శిష్యుల బంధం గురించి ఇవాళ మాట్లాడుతున్నాం కనుక అవును మన పురాణాలలో లేకపోతే నేల మీద నడయాడిన ఎంతోమంది మహానుభావులు వారి గు, గురువులతో పొందిన అనుభవాల్ని కూడా ఉమ్ తమరు పరిశోధించారు, శోధించి తెలుసుకున్నారు. ఉమ్ రమణ మహర్షి గురించి ఉమ్ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అందరూ. ఉమ్ వారు చెప్పిన సరళంగా అర్థం చేసుకోవాలంటే వారు చెప్పిన సందేశం ఏంటి గురువు గారు రమణ మహర్షి కంటే ముందు కొద్దిగా వెనక్కి వెళ్దాం. మన పురాణ కాలంలో కూడా గురు శిష్యులు ఉన్నారు. గురువు గారు గురు శిష్యులు ఒకడు రాజు, శిష్యుడు రాజై ఉండవచ్చు, గురువు రాజగురువై ఉండొచ్చు. ఉమ్ ఉమ్ ఉదాహరణకి వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తి కథ. నీ రాజ్యం పోతుంది, నీ ఇంద్ర పదవి పోతుంది, నీ కుల వంశాలు నాశనమైపోతాయి. వీడికి దానం ఇవ్వద్దు అంటే, నేను యజ్ఞం చేస్తున్నదే విష్ణు దర్శనం కోసం. ఉమ్ ఆయనే నా వాకిట్లోకి వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఇవ్వాలి కదా. నన్ను ఇవ్వని అన్నాడు. రాజ్యం పోతుందని భయపెట్టాడు. కానీ, రాజులు రాజ్యములు కలుగవే అంటూ అద్భుతమైనటువంటి భావన చెప్పి ఒక ఆత్మ స్థితి వైపు, భగవత్ తత్వం వైపు నేను వెళుతున్నాను, నన్ను వెనక్కి లాగకండి అని గురువుని పక్కకు నెట్టాడు బలి చక్రవర్తి. ఆహా గురువు ఎవరు శుక్రాచార్యుడు. సో దేవగురువులున్నారు, రాక్షస గురువులున్నారు, బోధ గురువులున్నారు, బాధ గురువులున్నారు, లోక గురువులున్నారు, శోక గురువులున్నారు, విశిష్ట గురువులున్నారు, దీక్షా గురువులున్నారు, మంత్ర గురువులున్నారు, నిషిద్ధ గురువులున్నారు, వాచక గురువులున్నారు, సూచక గురువులున్నారు, మోచక గురువులున్నారు, సద్గురువులున్నారు, జగత్ గురువులున్నారు. భారతదేశం అదృష్టం ఇది. ఆహా ఇన్ని రకాల వాళ్ళు మనకి మార్గోపదేశనం చేయటానికి. కదా. తర్వాత ప్ర, ప్రథమంగా మనం గనుక లోక గురువు ఎవరు? పురాణ కాలానికి వెళ్దాం, వెళ్ళాలి. అసలు పురాణము అంటే పాతది అని అర్థం. సనాతనమైంది. సనాతనమైన దానిని ఇవాళ సనూతనంగా మాట్లాడుకోవాలి, అంతే. సనూతనంగా హాయిగా ఆవిష్కరించుకోవాలి. ఆవిష్కరించుకున్నప్పుడు ప్రథమ గురువు ఎవరు అంటే లోక గురువు వ్యాసులవారు. భారతీయ వాఙ్మయానికి మూలం ఎవరంటే ఆయన. వాఙ్మయ స్వరూపం. అదే సమయంలో జగద్గురువు ఎవరు యోగీశ్వర కృష్ణుడు జగద్గురువు. అవును కనుకనే జీవితకాలం మొత్తము చెప్పనటువంటి ఒక యోగ శాస్త్రాన్ని అర్జునుడి ద్వారా మనకు అందించాడు. కాబట్టి గురు శిష్యులలో ఎవరు అంటే గురువు కృష్ణుడు భగవంతుడు అయితే ఇక్కడ శిష్యుడు అర్జునుడు అయినాడు. అర్జునుడు ఎవరంటే మన ప్రతినిధి. కృష్ణుడు ఎవరు అంటే కర్షతీతి కృష్ణః. కృష్ణ నామం వినగానే ఒక ఆకర్షణ ఉంటుంది. కుషతీతి కృష్ణః. ఆనందం యొక్క స్వరూపం ఏమిటి చెప్పండంటే కృష్ణుడి పేరే. కర్షతీతి కృష్ణః. ఆయన పండించాడు. జ్ఞానం విత్తులు చల్లి మానవుణ్ణి అధ్యాత్మ మార్గంలోకి వెళ్ళమని బోధించాడు. ఎవరికీ? అంతరించుతున్నటువంటి ద్వాపరకి చెప్పలా. అవతరించబోతున్న కలియుగానికి చెప్పాడు. అంటే, మనం అన్ని సందేహాలతో వచ్చే యుగం ఇది. సందేహాలు ఉండాలి. ఎందుకంటే దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటుంది కదా. కాబట్టి వాటన్నింటికీ సమాధానాలు భగవద్గీత. సాంప్రదాయం అయిపోయిన తర్వాత శంకర భగవత్పాదులు.అది ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఏళ్ల తర్వాత మళ్ళీ శంకర భగవత్పాదులు లోకంలోకి వచ్చి నలుగురు శిష్యులతో లోకంలోకి వచ్చారు. ఇది వాయు పురాణంలో ఒక భవిష్యత్ దర్శనం ఉంది. జ్ఞానాదిత్యుడు అంటే జ్ఞాన స్వరూపుడు అయినటువంటి ఒక సూర్యుడు. శివ స్వరూపమై శంభోర్ మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. పరమ మహేశ్వరుడే శివుడి రూపంలో శంకర రూపంలో ప్రపంచంలో నడుస్తారు. వస్తూ వస్తూ ఏం చేస్తారంటే నలుగురు శిష్యులను వెంబడి పెట్టుకుని వస్తారు అని. జరిగింది కదా. ఉమ్ కాబట్టి శంకరుల వరకు వచ్చేప్పటికీ ఒక గురువు నలుగురు శిష్యులు అయినారు. ఆహా ఉమ్ శంకర భగవత్పాదులు తర్వాత మళ్ళీ మనం ఆత్మ విచార మార్గం చూస్తే మీరు అడిగిన రమణ మహర్షి. రమణ మహర్షికి శిష్యులు లేరు. కానీ ఎవరైతే ఆత్మని ఎరగాలని అనుకున్నారో ఆత్మ విచార మార్గ సాధనలో ఎవరైతే మనస్సును ప్రవేశపెట్టారో ఎవరు జీవిత పరమార్థాన్ని స్పష్టంగా అతి వాస్తవికంగా absolute reality అంటాం. దానిలో అర్థం చేసుకుని జీవితం అంటే ఇంతే. ఇంతకు మించి మరొకటి లేదు. జీవితం అంటే కష్టం లేనిదే జీవితం అని సుఖం ఉన్నది మాత్రమే జీవితం అని అది సమర్థనీయం కాదు కాబట్టి కష్టసుఖాలు పడుగు పేకలుగా ఎక్కడ ఉన్నాయో ద్వంద్వాలు ఎక్కడ ఉన్నాయో వీటన్నింటినీ దాటి అతిమానసిక స్థితి supra mental consciousness కి వెళ్లగలిగినట్లయితే అక్కడ రమణ మహర్షి అనేటువంటి ఆయన ప్రతి వారికి ఆంతరంగికమైనటువంటి గురువై తోస్తారు. రమణ మహర్షి చెప్పిన దానికి శిష్యులు లేరన్నాంగా. గురు శిష్య సంబంధం లేదు. ఆయన అన్నారు అసలు ఆత్మే గురువు అన్నారు. నిజమేనా అంటే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని అని ఒక మాట ఉంది. అంటే కంటికి కనిపించని ఈశ్వరుడన్నా కనుగొనవలసిన ఆత్మ అన్నా రెండూ కలబోసుకున్న స్వరూపం గనక అయితే దాని పేరు గురువు అని చెప్పింది. ఆహా ఈశ్వరుడు కనపడ్డు సగుణంగా కనపడ్డు. ఆత్మ కనుక్కోవాలి. ఎక్కడుందో పట్టుకోవాలి. మరి రెండూ కలిసి ఎక్కడన్నా ఒక మూర్తి మనకు దొరకాలి కదా అంటే మూర్తి మత్వమే గురువు కాబట్టి ఈశ్వరో గురురాత్మ ఇతి. మూర్తి భేద విభాగిని. బొమ్మలు వేరుగా ఉన్నాయి బ్రహ్మం ఒక్కటే అది. అదైపోయింది. శంకర అదొక చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే భారతదేశం ఒక స్వర్ణ యుగాన్ని అనుభవించింది ఆధ్యాత్మిక స్వర్ణయుగం. అవును పద్దెనిమిది చివర పంతొమ్మిదవ దశ శతాబ్దం అంతా కూడా ఈశాన్య భారతానికి వెళ్ళండి. రామకృష్ణ గురుదేవులు వివేకానంద స్వామి. అంతే కదా. సందేహాలు నివృత్తి చేసుకొని ఒక వివేకం కలిగి వివేకంలో నుంచి ఒక ఆనందాన్ని పొంది వివేక ఆనందములు రెండూ కలిసి జ్ఞానాన్ని పొంది ఆయన స్వామి అయినాడు. వివేకము ప్లస్ ఆనందము ప్లస్ జ్ఞానము వివేకానంద అది. మూడు కలగాలి. కాబట్టి ఇద్దరు గురు శిష్య పరంపర అదొక అద్భుతం. ఇట్లా దక్షిణ భారతానికి వచ్చేసరికి మీకు శృంగేరి ఉమ్ లో చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఉమ్ అది సాంప్రదాయ బద్ధమైన శిష్యులు. కంచికి వచ్చేప్పటికి పెరియవ మహాస్వామి. అందరూ నడిచే దేవుడు అంటారు గానీ నేనంటాను నడిపించిన దేవుడు అంటా. ఆహాహా అది. అది మనల్ని నడిపించాలి. ఆయన నడిపించారు. కాబట్టి ఆయన ఆయన శిష్యులు. ఇట్లా ఇట్లా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ గనక వస్తే గురు శిష్య పరంపరలో ఒకటి నుంచి నాలుగై నాలుగు నలభైయి నలభై నాలుగు వందలై నాలుగు వేలై వేల అసంఖ్యాకమైన శిష్యులు ఒక గురువో ఇద్దరు గురువులో నిజమైనటువంటి గురువులు అంతకు పరిమితమైనారు. మరి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ప్రభావంలో నుంచి నువ్వు స్వభావంలోకి రా. ప్రపంచం విసిరే సవాళ్లను ఎదుర్కుంటూ వా వానలో వెళ్తూ ఉంటాం తడుస్తాం తప్పదు. గొడుగు లేకపోతే. గొడుగు ఉన్నా కొంత తడుస్తాం. ఎండలో కూడా అదే గొడుగు మనల్ని కాపాడుతుంది. ఇక్కడ గొడుగు ఎవరంటే గురువు. రెండింట్లలో ఆయన అవసరం ఉంది. కానీ మనం అట్లా వెళుతూ వెళుతూ ఉన్నట్లయితే అనేకమైనటువంటి భావాలు కలిగినప్పుడు గురువు సాంప్రదాయంలో మనం ఉన్నప్పుడు మనకి కొన్నేమో verbatim ప్రశ్న వేయటం జవాబు పొందటం సమాధానాలు. దక్షిణామూర్తి స్థాయిలో ఏమీ మాట్లాడక్కర్లేదు. ఏమీ అడగక్కర్లేదు. సందేహాలతో వెళ్లి కూర్చుందాం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం. నిత్య యౌవ్వనమైనటువంటి భావనలో ఉన్నటువంటి ఒక గురువుగారు వృద్ధులైనటువంటి శిష్యులందరూ అనేక సందేహాలతో కూర్చుంటే ఆయన ఏమీ మాట్లాడలేదట. ఎందుకని అంటే గురువులు మరి మూడు రకాలు కదా ఉమ్ ఒకాయనేమో translator ఉమ్ పుస్తకంలో ఉన్నది ఇది ఇట్లా ఉన్నది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఉమ్ రెండవ వాడు transporter దానిలో నుంచి తాను ఏది గ్రహించాడో చెప్తాడు. ఉమ్ మూడోవాడు transporter transmitter transmitter ఉహు transmitter ఏం చేయడు మన ఇంట్లో స్విచ్, బల్బు మనం వేస్తే వెలుగుతున్నాయి. transmitter కాదు transformer దగ్గరికి మనం వెళ్ళం కదా ఉమ్ It will transmit power. గురువు దక్షిణామూర్తి transmitter అన్నమాట. ఉమ్ గురువులు ఎక్కువ మాట్లాడరు. కూర్చొని ఉంటారు. వాళ్ళ మనస్సు శుద్ధ మనస్సులో ఉంటుంది. శుద్ధ మానస సరోవర్ విహారంలో నుంచి పరమాద్భుతమైన భావ తరంగాలు వాటిని scientists vibrations అంటారు కానీ నేను వాటికి emanations అని పేరు పెట్టుకున్నా. ఉమ్ vibration అంటే వస్తువు నుంచి పుట్టేది. వస్తువు నుంచి పుట్టేది శాశ్వతం కాదు. సద్వస్తువైనటువంటి ఆత్మ నుంచి emanate ఏదవుతుందో అది నిత్యమూ సత్యమూ శాశ్వతమూ. ఉమ్ ఉమ్ కాబట్టి ఇట్లా అనేకమైనటువంటి గురు శిష్య సాంప్రదాయంలో శిష్యుణ్ణి తీర్చిదిద్దే వాడు ఒకడు. శిష్యుడి సమాధానాలు ఇస్తూ సందేహాలు తీర్చేవాడు రెండోవాడు. తర్వాత లౌకిక కామ్య సిద్ధుల కోసం గురువుగారు ఏదో ఒంట్లో బాలేదు అంటే తీర్థం ఇచ్చేవాడు ఒకడు. వీళ్ళందరి పాత్ర ఉన్నది. కానీ అన్నింటికంటేశాశ్వతమైనటువంటి ఒక ఆత్మానుభూతిని ఆత్మానందాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు మాత్రమే సద్గురువు అవుతున్నాడు ఉమ్ సద్గురువుకి ఇందాక చెప్పిన గురువులకి మంత్ర గురువులు, దీక్షా గురువులు, ఏదో వ్రతాల గురువులు అందరూ ఉన్నారు కదా. వీళ్ళతో జగద్గురువు ఉన్నారు. జగద్గురువును గురించి అర్థం చేసుకుని మనం జగద్గురువు అనగానే మనం అంటాం జగత్తు గురువు అనుకుంటాం. మళ్ళీ మహాస్వామి వారే clarify చేశారు. జగత్తుని గురువుగా భావించిన వాడు జగద్గురువు అన్నారాయన ఆహా అది, అది, అదొక level అంటే సర్వ జగత్తు దా, మన దత్త సంప్రదాయంలో కూడా జగత్తుని గురువుగా భావిస్తారు. నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు అన్నాడు ఆయన. మరి దత్త సంప్రదాయం ఉంది ప్రపంచంలో, భారతదేశంలో. కాబట్టి జగద్గురువులు వేరు జగద్గురువు వేరు సద్గురువు ఎవరు అని? ఎవరైతే సత్ ఆత్మను గురించి బోధ చేస్తాడో, ఎవడు ఆత్మానుభూతిని పొందాడో, ఎవరు తనదైనటువంటి స్వీయ అనుభవాన్ని ప్రపంచానికి నిరపేక్షంగా ఇస్తున్నాడో, నమ్మకమే కలిగించి అమ్మకాన్ని దూరం చేసేటువంటి వాడు సద్గురువు అవుతున్నాడు. భగవంతుని యందు, సృష్టి యందు, ప్రకృతి యందు, తన చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలయందు ఒక పరస్పర ఆశ్రితమైన గౌరవాన్ని ఇస్తూ తాదాత్మ్యం చెంది తనకు దానికి కనిపిస్తున్న దానికి కనుగొనవలసిన దానికి అభేదాన్ని absolutely there is no difference ఉమ్ This is found that is not found అంతే తేడా. unfound unmanifest ను కూడా తన అనుభూతిగా మార్చుకోగలిగినటువంటి వాడు సద్గురువు అవుతున్నాడు. బలి చక్రవర్తి కథ చెప్పారు ఉమ్ అక్కడ శుక్రాచార్యుడు గురువుగారినే కాదు అని కాదు అని ముందుకెళ్ళాడు. అక్కడ శుక్రాచార్యుడి అనుభవం అంతా పూర్తయ్యాక మరి ఆయన నేర్చుకున్నది ఏమిటో ఇందులోంచి? ఆయన స్పందన ఎలా ఉండి ఉంటుందో అని అంటే గురువులు పరిపక్వ అపరిపక్వ అని కూడా ఉన్నాయి కదమ్మా. పరిపక్వమైనటువంటి గురువు అయితే ముందు సలహా ఇవ్వడు కదా ఉమ్ ఉమ్ విష్ణువుకి నువ్వు దానం చేయొద్దు దానం చెయ్యి మంచి పని చెయ్యి అని చెప్పాలి. నీ ప్రాణం పోతే పోయింది నువ్వు దానం చేయమని చెప్పాలి. కానీ ఆయన చెప్పలేదు కదా. రాజ్యం పోతుంది, పదవి పోతుంది, ఇంద్ర పదవి రాదు, వచ్చిన వాడు విష్ణువు, ఆయన మాయావి, ఇవన్నీ చెప్తున్నాడు. మరి గురువు ఏమన్నా నేర్చుకున్నాడా అంటే అది గురువు యొక్క జీవ సంస్కారాన్ని బట్టి, గురువు యొక్క ఆత్మోన్నతిని బట్టి, అతని ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, అర్హతను బట్టి, సాధనా తీవ్రతను బట్టి, తపస్స్వాధ్యాయ శక్తులను బట్టి అక్కడి నుంచి ఆయన elevate అయినాడా కాదా అయి ఉంటాడు అని అవ్వాలి అని మనం కోరుకుందాం. అనేక సందర్భాల్లో అనేకమంది గురువులు మనకి ఉమ్ దర్శనమిచ్చి వారు, వారు మనలో చేయవలసిన ఉమ్ మేల్కొలపోవలసిన చైతన్యాన్ని తీసుకొచ్చి ఉమ్ తర్వాత వారు వారి ప్రయాణం మీద వెళ్ళిపోతారు. మనం మన ప్రయాణంలో కొనసాగుతాం అని వినికిడి. ఇది పెద్దలు చెప్పేది. ఉమ్ సద్గురు దర్శనం అయినప్పుడు ఉమ్ అనుభూతి చాలా గొప్పగా ఉంటుందంటారు మరి. అవును నమ్మకం ఎలా కలుగుతుంది విషయంపై? అంటే సద్గురువు యొక్క ప్రభావం మన మీద పడింది అని ఎలా తెలుస్తుంది అనే? మనం సద్గురుని, సద్గురువుని చూశాం అనే ప్ర-- కన్ఫర్మేషన్ అంటే నేను చూసిన వాడు సద్గురువు అని నాకు ఎలా తెలుస్తుంది? అదే అంతే కదా అంతే నేను చూసిన వాడు సద్గురువు అని కాదు. మనం ఒకరి దగ్గరికి-- గురువుని ఇక్కడ అసలు మౌలికమైన ప్రశ్న ఏంటంటే గురువు మనల్ని ఎంచుకుంటాడా? మనం గురువుని ఎంచుకుంటామా? మొదటిదే అని పెద్దలు అంటారు అంతే రెండోది కాదు. మనల్ని గురువుని ఎంచుకోలేం. గురువే మన జీవితంలో ఆయా దేశకాల పరిస్థితులను బట్టి వస్తాడు. దాన్నే కృష్ణుడు అవతారానికి సమన్వయం చేసి "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత" అని చెప్పారు. కాబట్టి దేశకాల పరిస్థితులను బట్టి, శిష్యుడి యొక్క పరిపక్వతను బట్టి గురువు మన జీవితంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించాడు అంటేనే ఎప్పుడు ప్రవేశిస్తాడు అంటే కామ్య గురువు కాదు. కామ్య సిద్ధులను అనుగ్రహించే గురువు, గురువు కాదు. కామ్యం వరకు ఆయన గురువే. కామ్యాన్ని మించి ఉంది కదా. ప్రాపంచికమైన అవసరాలు సద్గురువు. సద్గురువు వచ్చి మనకు ఏం చెప్తాడు? ఎలా చేస్తాడు? మనల్ని ఎలా ప్రభావితం చేస్తాడంటే అప్పటివరకు మనం చేసుకున్నటువంటి అధ్యాత్మ సాధనకి clarification ఇస్తాడు. స్పష్టత ఇస్తాడు. conviction ఇస్తాడు, భద్రతనిస్తాడు. నువ్వు చేస్తున్నది ఖచ్చితం అంటాడు. దాన్ని శంకర భగవత్పాదులు శ్లోకంలో చెప్పారు. "ప్రౌఢః ప్రౌఢనిజానుభూతిః కరితదైతేంద్రజాలౌ గురుః స్వచ్ఛుష్యబోధయా తత్సత్యమశ్రితావన్" అంటే ఏం లేదు తనన్-- తాను పొందినటువంటి ఒక మహానుభూతిని ప్రపంచానికి రకమైన ఆంక్షలు లేకుండా చక్కగా ఇవ్వగలిగినటువంటి వాడు. అనుభూతి అనండి, అనుభవం అనండి మనం ఉంటాం. మనం గురువు దగ్గరికి వెళ్తాం. వెళ్ళాం ఆయన గురువు అని అందరూ అన్నారు గనుక మనం కూడా వెళ్ళాం అనుకుందాం. అక్కడ ఏమీ కలక్కపోవచ్చు. It just like meeting another great personality. కానీ ఒకరి దగ్గరికి వెళ్తాం. ఆయన మామూలు గురువు ఉండేటువంటి వేషంలోనూ ఉండడు ఆయన. మామూలుగా ఉంటారు. వెళ్ళగానే ఒక పరమ ప్రశాంతి, మనకు తెలియని ఒక శాంతి. ఉమ్ మనకు తెలియనటువంటి ఒక ఆనందానుభూతి. మన లోకలోకాంతర ప్రాణాలను తట్టి లేపగలిగినటువంటి ఒక మహా శక్తి. ఒక నిశ్శబ్ద మాధుర్యం. ఒక వైరాగ్యం. అద్భుతమైనటువంటి ఆయన దగ్గర ఏమీ ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి కౌపీనం కట్టుకున్నారు, చేతి కర్ర పట్టుకున్నారు, బండరాయి మీద కూర్చుని ధ్యానం చేశారు. ధ్యానంలో ఉన్నారు. నేను ధ్యానం చేస్తున్నాను అనటమే తప్పు కదా. ఏమీ చేయకపోవటమే ధ్యానం. అంతే కదా నాది గొప్పగా ఉంది. ఏమీ చేయకపోవడం చేయకపోవటమే ఏమీ చేయాల్సిన అవసరం లేకపోవడం అవసరం లేకపోవడం ధ్యానం. తర్వాత అది ధ్యానానికి మళ్ళీ మూలం ధ్యానం. ఇవన్నీ చెప్పేటటువంటి, ఇన్ని ఆలోచనలు కలిగించేటువంటి, కలిగించగలిగినటువంటి వాడు మాత్రమే సద్గురువు అవుతాడు. ఉమ్ Quotations ఇచ్చేవాడు కాదు. No. మన లోపల ఇందాక చెప్పిన conscious, subconscious, supra conscious, supra mental conscious అంటే అతిమానసిక స్థాయి దాకా వెళ్ళిమనల్ని నిలబెట్టగలిగినటువంటి వాడు తట్టి లేపగలిగినటువంటి వాడు సద్గురువు అవుతాడు గురువు గారు States of consciousness మీరు చెప్పినవి ఇది శాస్త్రీయంగా మనకి నిరూపించబడినవా? అవసరం లేదంటారా? ఇవన్నీ శాస్త్రీయమే శాస్త్రగతమైనవే శాస్త్ర పరమైనవి ఎందుకంటే భారతదేశంలో యోగశాస్త్రం ఉంది భగవద్గీత మొత్తం యోగశాస్త్రమే దాన్ని వాళ్ళ భక్తి గీతంగా మార్చుకొని పాడుకుంటున్నాం అంతే తేడా ఉమ్ ఉమ్ లోపలికి వెళ్లి చూస్తే అసలు మానవుడి యొక్క గుణగణాలు అన్నింటినీ కూడా ఒక చోట రాసిపోసి నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రజ్ఞా భూమికిని ఆధారం చేసుకొని నువ్వు అనంత మహా చైతన్యాన్ని లోపల ఆవిష్కరించుకోగలిగినటువంటి ఒక అద్భుత అవకాశాన్ని ఇచ్చేది భగవద్గీత ఉమ్ మన లోకాంతర ప్రాణం లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి లోపలికి ఎలా వెళ్ళటం వెళ్ళటానికి మార్గం ఏంటి బయటకు వెళ్ళటానికే మార్గాలు తెలియటం లేదే లోపలికి వెళ్లాలంటే స్వాధ్యాయము అభ్యాసము వైరాగ్యము వివేకము చైతన్యము నిత్య స్ప్రుహ ఇవన్నీ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం లోపలికి వెళ్లగలుగుతాం. ఇవి చాలా ఇవన్నీ శాస్త్ర పరమైనవి మీరు వరాహమిహిరుడు ఇందాక చెప్పా బృహత్ సంహిత అని ఒక కావ్యం ఉంది బృహత్ సంహిత కావ్యంలో నుంచి ఒక్క instrument లేకుండా ఖగోళాన్ని దర్శనం చేశాడు ఆయన ఉమ్ ఉమ్ ఎలా చూశారు ఆయన? అంటే third eye. మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో అక్కడ అంతర్నేత్రం ఉంది. శివుడికే కాదు జీవుడికి కూడా ఉంది. శివుడు తెరిస్తే ఇదంతా భస్మం అయిపోతుంది మనం తెరిస్తే మన ఆత్మ పరిపూర్ణమైన అమృతానందమైన స్థితికి మనం వెళ్లగలుగుతాం ఉమ్ కాబట్టి త్ రెండు తోలు కళ్ళు ప్రపంచాన్ని వస్తువుని చూపిస్తాయి అంతర్నేత్రం ముకుళించి ఉంటుంది లోపల అది ఒక్కసారి తెరుచుకున్నప్పుడు సర్వ ప్రపంచము మనకు కనిపించని పధ్నాలుగు లోకాలు మన లోపల ఉన్నటువంటి రెండు లక్షల డెభై రెండు వేల యోగ నాడులు ఇవాళ వైద్య విద్యకి అందుబాటులో ఉన్న డెభై రెండు వేల నాడులు నాడీ మండలం అంతర్గతంగా ఉన్నటువంటి సమస్తము కూడా మనకి తెరమీద బొమ్మలాగా కనిపిస్తుంది. గురువు గారు అంతిమంగా గురు శిష్యుల బంధంలో శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకట నాయక [పాట] శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతీ వల్లభ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతీ వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకట నాయక శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకట నాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతీ వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకట నాయక భగవంతుడికి శరణాగతి మనల్ని మనం అర్పించుకోవడానికి గురువుకి అర్పించుకోవడానికి ఏమన్నా తేడా ఉంటుందా? గురువు కంటికి కనిపిస్తున్నాడు కాబట్టి అది physical level. ఆత్మ కనిపించటం లేదు పరమాత్మను ఇంకా మనం దర్శనం చేయవలసి ఉన్నది కాబట్టి unmanifested గా ఉన్నదానికి surrender కావటం చాలా గొప్ప విషయం కనిపించే గురువుకి surrender కావటం తేలిక. అయితే శరణాగతి అనేటువంటి దానికి ఒక అర్థం ఉంది దేనికి శరణాగతి చెందాలి ముందుగా ఉదాహరణకి భారతీయ వాంగ్మయంలో శరణాగతి చెందినట పొందినటువంటి జ్ఞాని ఎవరంటే రమణ మహర్షి. పదహారేళ్ళ వయసులో వైగై నదీ తీరంలో అందరిలాగా ఆడుకుంటున్నటువంటి ఒక పిల్లవాడికి ఒక మరణానుభవం కలిగినప్పుడు ఏది పోతున్నది ఏది ఉంటున్నది ఏది నిత్య సత్య శాశ్వతం అని ఒక మృత్యు భావన కలిగినప్పుడు అరుణాచల అనేటువంటి ఒక పదం ఆయన చెవి సోకగానే ఒక భావోద్వేగానికి లోనై సత్యాన్వేషణకి తనకు తెలియని ప్రదేశమైన అరుణాచలానికి ఆయన అంతట ఆయన చేరుకున్నారు. చేరుకొని అరుణాచల దేవాలయానికి వెళ్ళినప్పుడు రోజు గర్భాలయానికి తలుపులు వేటి దగ్గరగా వేసి వెళ్ళిపోయినారు పూజారి. తలుపు తెరుచుకొని లోపలికి వెళ్లారు అరుణాచల లింగాన్ని ఆలింగనం చేసుకున్నారు ఉమ్ "తండ్రీ! నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను" ఆయన అన్న మాటలివి "తండ్రీ! నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను ఇకపై అంతా నీ ఇష్టం" ఇది శరణాగతి. రేపు నాకు అన్నం ఎవరు పెడతారు? అయ్యో అనవసరంగా మా అమ్మ వాళ్ళను వదిలిపెట్టి వచ్చేసానే! ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే! అనుకోలే. శరణాగతి అంటే ఒక irreversible process అంటాం ఉమ్ యా మళ్ళీ తిరిగి వెళ్ళటం అనేది లేదు వెళ్ళటం అంటే ముందుకు వెళ్ళటమే. శరణాగతికి ముందు ఒక సమర్పణ అని ఒక భావం ఉంది ఉమ్ సమర్పణ లేని శరణాగతి ప్రయోజనం లేదు. సమర్పణ అంటే మన కానుకలు కైంకర్యాలు కైవారాలు ఇది సమర్పణ కాదు యోగశాస్త్రం వేదాంత శాస్త్రం ఏం చెప్పిందంటే "చేయగలిగితే అంగ సమర్పణ చేయవయ్యా" అన్నారు. అంగ సమర్పణ మన శరీరంలో ఉన్న సర్వ అవయవాలని పరమేశ్వరుడికి అదే మీరు భాగవతం గనుక చదివినట్లయితే కన్ను కన్నులన్నీ కూడా భగవంతుణ్ణి చూడాలి నీ రూపాన్ని చూడాలి చెవులన్నీ నీ నామం వినాలి నాలుక నీ మధుర సంకీర్తనం చేయాలి ఇవన్నీ ఉన్నాయి కదా సమర్పణ అయిన తర్వాత నేనంటూ ఉండకూడదు అంతా నువ్వై ఉండాలి ఉమ్ నేను నీవు కావాలి నీవు నేను ఒకటే అనేదే కదా భారతీయ తత్వ సిద్ధాంతం అవును అవును అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమునై ఉన్నాను అయం ఆత్మ బ్రహ్మ నేను ఆత్మ స్వరూపంగా ఉన్నాను నాలో ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మ కడగా తత్వమసి తత్తత్వం అసి ఇది అది ఒకటి స్థాయికి వెళ్ళటానికి శరణాగతి చాలా ప్రధానమైనటువంటి విషయం మీరు మంచి ప్రశ్న ఇది ఎందుకంటే ఇవాళ శరణాగతి లేదు.ఎవరికీ ఏది శరణాగతి లేదు. అవసరము అవకాశము రెండు కలిగితే మనం ఒకటే అంటున్నాం. రెండూ దాటి మనం ఒకటే అనగలిగితే అంటే జీవాత్మ పరమాత్మలకి ఒక అభేద అద్వయ అద్వితీయ రమణీయ మనోజ్ఞ భావనా భూమికలోకి వెళ్లగలిగితే దాని పేరు శరణాగతి. కనిపిస్తున్న జడాత్మక ప్రపంచం నా యందున్నది. నేను సర్వ ప్రపంచంలో నేనుగా ఉన్న ఆత్మనై ఉన్న అఖండంగా ఉన్న చిద్ఘనంగా ఉన్న నిరంతరము ఉన్న నిరంజనంగా ఉన్న నికేతనంగా ఉన్నాను. అనేటువంటి ఒక భావన ఎప్పుడైతే కలుగుతుందో అది శరణాగతి. శరణాగతి స్థితికి చేరుకోవడానికి గురువు గారు చాలా కనిపించని ఒక శత్రువు ఆధ్యాత్మిక అహంకారం. అది దాన్ని ఎలా గుర్తించాలి? అది అదే అంటే అది చాలా తీవ్ర సాధన చేసిన వారికి మాములుగా ఉందని అది కూడా వినికిడి మీదే ఇతరులు చెప్పే పెద్దలు చెప్పే విషయాన్ని బట్టి. దాన్ని ఎలా జయించాలి గురువు గారు? ఆధ్యాత్మిక అహంకారం అని అనద్దు సాత్వికాహంకారం అన్నారు దాన్ని. ఆహా! ఏ! అన్నారా? అన్నారు అన్నారు. దానికి పేరు లేదు పేరు ఉంది. ఊహూ నేను దానాలు చేశా, విపరీతమైన దానాలు చేశా. నేను కూడా ఒక ఇరవై వేల ప్రవచనాలు చేశా. నేను కూడా అనేక పుస్తకాలు రాశా. అని నేను అనుకుంటే లోకం అనుకోనివ్వండి. నేను అనుకుంటే నాకు సాత్వికాహంకారం ఉన్నట్టు లెక్క. ఆహా! ఇవన్నీ నా ద్వారా జరిగినయి అనుకోగలిగితే సాత్వికాహంకారం నెమ్మదిస్తుంది. అసలు నా ద్వారా ఏమిటి? భగవంతుడే చేసేశాడు నేను అది చూస్తూ ఉన్నా. మూడు అది నేను ఒకటే. We are synonym with each other అనుకున్న తర్వాత అభేదం ఏర్పడిందిగా. అది కాబట్టి స్థాయికి మనం వెళ్ళాలి. మనం ఎవరో అంటారు ఈయన ఇన్ని చేశారు, అని చేశారు, ఇన్ని మంచి పనులు. లోకం చెప్తుంది లోకం తూకం వేస్తుంది దాంతో మనకి పని లేదు. తూకంలో మనం ఎప్పుడూ కూడా నెగ్గకూడదు, మొగ్గకూడదు. మనం ఎలా ఉండాలంటే పద్మపత్రం ఇవాంభస తామరాకు మీద నీటి బొట్టు వలే ఉండాలి. చాలా శాస్త్రీయంగానూ సరళంగానూ అందరికీ అర్థం అయ్యేలా అంటే ఎక్కడా గోడలు లేవు అవును గంటి మధ్య అని అమ్మ మన పురాణాలని ఆధారం చేసుకుని గురువు గారు చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. గురువు గారు అంతిమంగా మనిషి జీవిత లక్ష్యం ఉన్నతమైన ఉదాత్తమైన జీవితం సేవా ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ప్రేమను పంచుతూ అదేనా ఇంకా అంతకుమించి ఏది దీనికి ఇది, ఇది నేను ఒకటే అని గ్రహించుకునే స్థితి అంతిమ స్థితి అంటారా? అదే అంతిమ స్థితి. What is the goal of human life? Goal of human life ఏం లేదు. మనల్ని మనం తెలుసుకోవటమే. మనల్ని మనం తెలుసుకున్నప్పుడు సహజంగానే ప్రేమని ఇప్పుడు నేను ప్రేమని పంచుతున్నాను. నేను ఉన్న, పంచబడుతున్న ప్రేమ ఉంది, అందుకుంటున్న వ్యక్తి ఉన్నాడు. ముగ్గురు దాటి ఒక అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు అత్యంత సహజంగా ప్రేమ పంచబడుతుంది. It's very natural. ఇప్పుడు మనం కోటానుకోట్ల జీవరాశులు ఉన్నాం. కొన్ని కోటానుకోట్లు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. మరి అవన్నీ కూడా ఒక పరమాత్మ వైపు ఒక్క పరమాత్మ వైపు ఎందుకు ఎదురు చూస్తున్నాయి? ఆయన ఆర్చగలడు, తీర్చగలడు అనే కదా. ఆయన ఎలా తీర్చగలుగుతున్నాడు ఇంతమందికి? ఇన్ని అప్పుడు ఏమనుకోవాలి అంటే, ఇవన్నీ చేయగలిగినటువంటి ఒక అనంత మహా చైతన్యం ఏదైతే ఒక శక్తి స్వరూపంగా దేవీ దేవతా స్వరూపంగా ఒక దైవతంగా మనకు అనుభవంలోకి వస్తున్నదో అది అన్నమాచార్యుల వారు మళ్ళీ చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం అంతే కదా. ఆయన్ను శివుడన్నాడు, భవుడన్నాడు, మాధవుడన్నాడు, ఉమాధవుడన్నాడు, ఇంకోటన్నాడు. అసలు ఆయన కానిదంటూ లేదని ముప్పై మూడు వేల సంకీర్తనలు రాసి చివరికి ఏమన్నాడు చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం. నువ్వు అక్కడా ఇక్కడా బయట పాటలు రాసినవన్నీ బయట ఉన్న నీ గురించి రాశా. నాలో చిత్తజ చిత్తము నందు పుట్టిన గురువా చిత్తము నందు పుట్టే ఆత్మ. ఆత్మ స్వరూపమే నువ్వు గనుక ఆత్మకి కైవారం చేశాడు అన్నమాచార్యుల వారు. ఇది మన వెంకటేశ్వర స్వామి పరంగా ఆయన ఆంతరంగికంగా అనుభవించినప్పుడే ఆయన జీవితం పూర్ణంగా పరమార్థికమైన స్థాయికి వెళ్ళి అంతవరకే ఆయన మహాకవి, వాగ్గేయకారుడు సంగీతకారుడు, సద్భక్తుడు, తపించిన వాడు ఇవన్నీ గుణగణాలే అన్నీ గుణగణాలే. They are all adjectives కానీ అసలు అన్నమాచార్యుల వారు ఎవరంటే చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం అన్న ఆయన మాత్రమే అన్నమాచార్యుల వారైనారు. [సంగీతం] చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం మా చిత్తములో హరి నీకు శ్రీమంగళం చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం అచామూర్తిని దాటాడిగా, ఆరాధనా స్ఫూర్తిని దాటాడిగా, దాటి లోపల ఉన్నటువంటి అంతర్జ్యోతిని తాను అనుభవించాడు. జ్యోతి జ్యోతిలో కలపుకోగలిగాడు. ఇది చరిత్ర, ఇది శాస్త్రం. చాలా గొప్పగా ఉంది గురువు గారు. ఈరోజు మనసుని మేలుకొలుపు చేశారు. ఈరోజు మీ సమాధానాలతో అందరం ధన్యులమయ్యాం గురువు గారు. సంతోషమ్మా. నమస్కారం. నమస్తే శుభం. ఇది ఈనాటి గురుదేవో భవ కార్యక్రమం. వచ్చే వారం మరొక గురువు అనుగ్రహం పొందుదాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.
YouTube · audio

గురుదేవోభవ | Gurudevobhava | Ep 44

Home

గురుదేవోభవ | Gurudevobhava | Ep 44

Source: SVBCTTD LIVE TV on YouTube

0:00 / 51:54