Skip to content
Transcript తెలుగు
[ back ground music] తర్వాత వీటిలో నుండి తర్వాత మీరు చానా books రాశారు ఉమ్ శంకర భగవత్పాదుల మీద గానీ అవును రమణ మహర్షి మీద గానీ రమణ మహర్షి గారు కూడా అప్పట్లో ఏందంటే ఆయన దైవం అనేది ఇది కాకుండా అంత ఆధ్యాత్మికం వైపు నడపాలి అనేవారు అది ఎట్లా ఉండేది అసలు మీకు అందులో నుంచి మీరు తీసుకున్న స్ఫూర్తి ఏంటి మీ ప్రవచనాల ద్వారా మీరు చెబుతున్నారు అసలు ఆయన గ్రహించిన అందులో ఉన్న తత్వం ఏంటి అండి? ఇక్కడ మూడు aspects ఉన్నాయండీ ముగ్గురు మహాత్ములు బహుశా నన్ను తీవ్రంగా ప్రభావితం చేశారు. ఒకరు ఒక కాలానికి చెందిన శంకర భగవత్పాదులు. మన కాలానికి చెందిన భగవాన్ శ్రీ రమణ మహర్షి. మూడు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. ఆశ్చర్యం కలుగుతుంది. శంకర భగవత్పాదులకి రమణులకి పోలిక ఎక్కడ? ఆయనేమో మాటల పుట్ట, ఈయనేమో మౌని. రమణ మహర్షి కి సత్యసాయి కి సంబంధం ఏమిటి? ఆయన మహా యోగంలో ఉన్నట్టున్నాడు, ఈయన మహా భోగంలో కలిపించాడు ఈయన. ఇది పైకి కనిపించేటువంటిది. లోతుకు వెళితే శంకర భగవత్పాదులు ప్రపంచానికి మనం మరిచిపోయినటువంటి ఒక వేద వాంగ్మయాన్ని, ఒక పురా సంస్కృతిని వైభవోపేతంగా ఆవిష్కరించిన వాఙ్మయ కర్త. అంటే వాఙ్మయం లేకపోతే ఇవాళ నాలుగు మాటలు మనం మాట్లాడగలిగే వాళ్ళం కాదు. నూట నలభై మూడు గ్రంథాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు మన ఇవాళ మనం స్మరించవలసింది వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి Managing Director, Chairman. ఆయన గొప్ప అవకాశం. భగవద్ శంకర భగవత్పాదుల గురించి ఆంధ్రజ్యోతి లో నేను కూర్చుని స్వయంగా రాసిన articles అవి. శంకరాచార్యుల వారు ఆయన్ని అధ్యయనం చేయాలంటే అమ్మో మనకే శ్లోకాలు రావు పాటలు రావు పద్యాలు రావు మనకెందుకు అనుకునే వాళ్ళకి ఇవాళ తరం సమకాలీన సమాజం ఆయన్ని ఎలా అధ్యయనం చేయాలి అన్నప్పుడు సరళమైన టువంటి భాషలో కాలం అంటే మీకు తెలుసు ఒక journalist గా space తక్కువ ఉంటుంది. కానీ ఎక్కడ భగవత్పాదుల ఆలోచనకి మన ఆలోచన జోడించకుండా యధాతథంగా పిండి రసాన్ని ఇవ్వాలి. బహుశా నేను extraction expert ని కాబట్టి శాస్త్రీయంగా నాకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు. One and half page దాటకుండా వ్యాసం తీసుకున్న ఒక మనీషా పంచకం one and half page లో రాసినప్పుడు అది యువతని చాలా ఆనంద పరిచింది. ఓహో ఇదా భగవత్పాదులు అంటే. వారెవరో పీఠాధిపతులు వాళ్ళు మాట్లాడుకునే భాష వేరు ఇది ఎంత అందంగా ఉంది జీవితానికి ఎంత దగ్గరగా చెప్పారు భజగోవిందాన్ని జీవితంలో గనక అన్వయించగలిగితే ఒక వైరాగ్య విభూతి ఎట్లా కలుగుతుంది అని ఇవన్నీ దాని నిండా ఉన్నాయి గనుక భగవత్పాదుల సాహిత్యం ఆయన సాహిత్యం మనకిచ్చారు. మళ్ళీ పండగలు పబ్బాలు ఏముంది సహజీవనం పండగ జరిగింది అంటే పది మందిని కలుస్తాం అంతే కదా అదొక సన్నివేశం అంతే తర్వాత మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతాం. పండగలే లేకపోతే ఒక ఉత్సవమే లేకపోతే ఎవరిని కలవం ఎవరి జీవన వ్యాపారంలో వాళ్ళు మునిగిపోయి ఉంటాం. కాబట్టి సమాజాన్ని అంతా ఒక చోటికి తెచ్చేటువంటి సమాజిక బంధాలు బంధాలను పెంచి మానవతావాదాన్ని ఒక ఆధ్యాత్మిక వేదనాదంగా వినిపించినటువంటి కరుణాపూర్ణ సుధాబ్ధి కరుణాలయం ఎవరంటే శంకర భగవత్పాదులు. అది దానిలో ఒక భాషా సంక్రాంతం ఒక మంచి పంట అలాగే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. కరుణ ఉండాలి దయా, జాలి, సానుభూతి మానవ లక్షణాలు. కరుణ భగవంతుని లక్షణం. కరుణకి ఒక ఆలయం ఒక స్వరూపం ఉన్నట్లయితే అది శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా. ఆయనే శంకర భగవత్పాదులు. కనుక దేశానికి ఒక ధర్మ బంధన చేసి నాలుగు ఆమ్నాయ పీఠాలని సృష్టించి నాలుగు గడి square or rectangle ఏదైతే ఉందో దాని లోపల గనక మానవుడు జీవించగలిగితే దానిని మించినటువంటి ఆనందం మరొకటి లేదని ఆయన నిరూపించారు అదే నన్ను ఆకర్షించింది. సంస్కృత భాష పట్ల ఒక అవగాహనని తీవ్రమైనటువంటి అధ్యయన వేదికగా మార్చింది శంకర వాఙ్మయం. సరళ సుందరమైనటువంటి సంస్కృతమాది. తర్వాత మన కాలానికి వచ్చేప్పటికి భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆయన rituals దాటి spiritual గా వెళితే శరీరాన్ని దాటి మనస్సుని దాటి బుద్ధిని దాటి చిత్తాన్ని దాటి అంటే intellect ని దాటి మన పూర్వ పర రంగాలు అన్నీ దాటి అన్నింటికంటే మహోన్నతమైనటువంటి ఒక స్థితి అంటూ ఏదన్నా ఉన్నదా అని ప్రశ్నించుకున్నప్పుడు ఉన్నది అని సమాధానం పొంది ఉన్నది ఏదైతే తత్ అయి ఉన్నదో అది నేనే నాకంటే అది భిన్నం కాదు తత్ త్వం అసి యది అదే నేనై ఉన్నాను అనే వేద మహా వాక్యానికి జ్ఞాన మార్గంలో ప్రమాణం చూపించినటువంటి వారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అంటే ఎంత నిరాడంబరమైన జీవితాన్ని ఆయన గడిపారో, ఎంత స్థితప్రజ్ఞా మూర్తిగా ఉన్నారో, కోతుల యెడ, కాకుల యెడ, పాముల యెడ పిచ్చుకల యెడ, నెమళ్ళ యెడ జీవరాశుల సమస్త జీవరాశులు. ఆయన కట్టెదుట నుంచున్నటువంటి వస్తువైనా ఆయన కంటి ముందు పారాడుతున్న ఒక చీమలో కూడా ఆత్మని దర్శనం చేసి వారి జీవిత కాలంలో ఆయన వాడని మాటలు రెండే ఒకటి వాడు అది అన్నమాట ఎవరిని గురించి వారు అనేవారు.ఆఖరికి వారి శరీరం మీద ఏర్పడ్డ రాక్ష పుండును కూడా వారు వచ్చారు వారిని ఉండనివ్వండి అనేవారు. అది వారు ఇది ఒక పుండు అతను నన్ను కబళించబోతున్నాడు అని నాకు తెలుసు వారిని ఉండనివ్వండి మేము పిలిస్తే వచ్చారా? మీరందరూ ఎలా వచ్చారో వారు వచ్చారు మీరు ఎలా వెళ్తారో వాళ్ళు వెళ్తారు. అది ఇది కావచ్చు అది కాబట్టి వారు అనేటువంటి గౌరవ వాచకాన్ని వాడ-ఆయన వాడారు వాడు అది ఏకవచనం వాడలేదు రెండవది దేవుడు అన్న మాట ఆయన వాడకుండా జ్ఞాన మార్గంలో దేవుడు అనేటువంటి concept ఏమిటి భగవాన్ దేవుడంటే మీ దృష్టిలో ఏమిటని మన బోటి వాళ్ళు అడిగితే, "God is nothing but a force and feeling within" అది బయటకు చెప్పేది కాదు "It is a force within and it is a feeling within" భావనే భగవంతుడు అనేటువంటి ఫీల్ అయ్యే భావన అనుభవించేది ఒక పూర్ణాత్-- అది శుద్ధాద్వైతానికి అతీతమైనటువంటి ఒక మహా స్థితిలో తాను ఏది అనుభవించారో, ఆత్మని తానును తానుగా పరిచయం చేసుకున్నారో, తనను తానుగా identify చేసుకున్నారో, తాను synonym కాగలిగారో అదే భావంతో అనుభూతి కలిగిన తర్వాత అదే పాంచభౌతిక దేహంలో యాభై నాలుగు ఏళ్ళు ఉన్నారు అట్లాగే ఉన్నారు. అట్లాగే మళ్ళీ ఒక వ్యవహార నిష్ఠ, బ్రహ్మ నిష్ఠ అని రెండు ఉన్నాయి బ్రహ్మ నిష్ఠ అనే నేను జ్ఞానిని కావచ్చు కాక కానీ వ్యవహార నిష్ఠలో నేను సమాజగతమైన అన్ని మర్యాదలు నేను పాటించవలసిందే నాకు escape లేదు exemption లేదు సమాజంతో నేను మమేకమై ఉండాలి నేను సమాజానికి పరువు కావాలి తప్ప సమాజానికి నేను బరువు కాకూడదు. అందుకనే ఆయన ఆశ్రమం తనదే అయినా అందరితో పాటు భోజనానికి లేచేవారు అందరితో పాటు కూర్చునేవారు కూర్చుని ఒక మాట అనేవారు "ఇవాళ నాకు ఏం పని ఉన్నది ఆశ్రమంలో చెప్పండి" అనేవారు. ఎవరో వచ్చో proof reading చేయమంటే చేసేవారు భగవాన్ ఇవన్నీ ఎందుకు కళ్ళజోడు పెట్టుకొని ఇంత కష్టపడి రాస్తారు? ఎందుకని పుస్తకానికి అట్ట వేస్తారు? మీ బట్టలు మీరు ఎందుకు ఉతుక్కుంటారు? ఇవన్నీ వీళ్ళ భక్తులు అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాధానం మరి మన బోటి వాళ్ళకి చాలా ఆనందాన్ని అందరికీ కలిగిస్తుంది. కష్టపడకుండా ముద్ద ఎత్తే అధికారం ఎవరికీ లేదు. ఆశ్రమం నాదే నన్ను మీతో పాటు ఉంచారు నాకు అందుకే ఆనందం. కోతుల్ని పంపించేయండి పాముల్ని చంపేయండి అంటున్నారే అవి ఉండే ప్రదేశానికి మనం వచ్చి వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేయటం అధర్మం కాదా? సహజీవనం చేద్దాం మనల్ని ఏం చేస్తాయ్? అనేటువంటి ఒక ఔదార్యం చూశారా? ఇవన్నీ దైవీ సంపదగా దైవీ లక్షణాలుగా ఒక జ్ఞాని ఇదే సమాజంలో మనం ఉన్న సమాజంలోనే ఆయన ఉన్నారు ఎలా చేయగలిగారు? అన్నప్పుడు భగవాన్ రమణులు శంకర భగవత్పాదుల యొక్క వ్యాఖ్యానానికి ఒక మౌన ముద్ర ద్వారా దక్షిణామూర్తి స్వరూపంగా ప్రపంచానికి జ్ఞానానుభవాన్ని కలిగించిన ద్రష్టగా, సాక్షాత్ మహర్షిగా, మహత్సుని దర్శించిన వాడిగా, ఆత్మ దర్శనం ఎరిగిన వాడిగా, ఆత్మానుభూతిని పొందిన వాడిగా ఆయనకి ఆయన నా వరకు నిత్య స్మరణీయులు ఆయన. ఈజే inner guidance ఏది అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి. వైరుధ్యం లేదు నాకు. ఇక మూడవ aspect కి వచ్చేప్పటికి సమకాలీనంగా ఉండేటప్పటికీ మనం అంగీకరించటానికి మన మనస్సు ఒప్పుకోదు. కాస్త హృదయం గనక తెరిచి ఒక విశాల భావనా స్థితిలోకి మనం వెళ్లగలిగితే నాకు సత్యసాయిబాబా వారు శంకరులకంటే రమణుల కంటే భిన్నమైన వ్యక్తిగా నాకు అనిపించలే. ఆయన చేసిన మహిమలు ఏదో అందరూ ఉంగరాలు ఇచ్చారు బంగారాలు ఇచ్చారు అవి అందుకున్నారు వెళ్లిపోయినారు ఆయన అవతార మూర్తి మత్వంలో నుంచి పొందవలసినంత ఆధ్యాత్మిక అనుభూతిని ఎక్కువ మంది పొందలేకపోయారు అనేది నా భావన. అయితే ఇవన్నీ పొందారో పొందలేదో అది పక్కన పెట్టినట్లయితే ఒక భగవంతుడు మానవ దేహం తీసుకుని వస్తే సమాజానికి ఎంత సేవ చేయవచ్చునో నిరూపించారు ఆయన. సమాజ నిర్మాణం ఆధ్యాత్మిక భూమిక మీద ఉండాలని సనాతన ధర్మం అనేటువంటి foundation మీద సాగాలని అది గాలిలో ప్రయాణం చేసే విమానం వలె కాలానికి చెందినట్లు వేగవంతంగా ఆవేగవంతంగా ఉండాలని అందులో అందరూ కలిసి పనిచేయాలని ఎవరికీ కర్తృత్వం లేదని అనేకమైనటువంటి సనాతన వైదిక భావాలు అంటే వేద పరమైన భావాలని సరళీకృతం చేసి ఉదాహరణకి వ్యాసులవారు పద్దెనిమిది పురాణాలు రాశారు స్వామి పద్దెనిమిది పురాణాలు ఎందుకుండాలి? మాకు ఒకే ఒక్క గ్రంథం ఉందే అందులో అన్నీ ఉన్నాయి మీకు పద్దెనిమిది ఎందుకుండాలి? అని అంటే అప్పుడు ఆయన చెప్పారు పద్దెనిమిది ఉన్నా నూట ఎనభై ఉన్నా essence ఒకటే Help ever hurt never అంతే. ఇవాళ నాకు తేలిగ్గా అర్థమైపోతుంది. పద్దెనిమిది పురాణాల సారం చదివిన తర్వాత నాకేమిటి లాభం అంటే మరణానంతరం వచ్చే ముక్తి గురించి నాకు పెద్దగా ఆశలు లేవు ఎందుకంటే ఇక్కడ దేహం వదిలిపెట్టిన వ్యక్తి ఇంతవరకు మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి స్వర్గం ఇట్లా ఉంటుందని నరకం ఇట్లా ఉంటుందని విన్నామే గాని చెప్పిన వాడు లేడు. కాబట్టి దాన్ని ఊహించి ఆలోచించే కంటే ప్రపంచాన్ని గనక ఇహమేవా అన్నది వేదం Now and here ఇప్పుడే ఇక్కడే. ఇక్కడే అన్నీ ఉన్నాయి అనేటువంటి భావనా స్థితిని గనక అర్థం చేసుకోగలిగితే Help ever చేయగలిగినంత పరోపకారం చేస్తూ వెళ్ళు Hurt never ఎవరినీ కూడా నీ తలపు చేత కూడా బాధించకు ఇదే essence of eighteen పురాణాస్. ఆధ్యాత్మికతకి కొలమానం ఏమిటి? సాధనా మార్గం ఏంటి? అని అడిగినప్పుడు You love all and you serve all. అందరినీ ప్రేమించు అందరినీ సేవించు దాన్ని మించి ఇంకొక ఆలోచనే లేదే అందరినీ లో అన్నీ ఉన్నాయి సమస్త జీవరాశులు ఉన్నాయి నువ్వున్న సమాజం ఉంది అసలు ముందు నీ దేహంతో ప్రారంభించు You love your body.You love you serve your body అప్పుడే ఒక perfect instrument తయారవుతుంది కానీ perfect instrument ఒక ఒక వీణ వైణికురాలు అది వాయిస్తే దానికి విలువ. ఉరికే మూల గుడ్డగా పేస్-పెడితే వీణకి value ఏముంది? లేదు కదా! కాబట్టి తంత్రులు మీటాలి. వీణానాదాన్ని ప్రపంచానికి ప్రస్తారం చేయాలి. అద్భుతమైనటువంటి మానవ దేహం శరీరం ఆజం ఖలు కర్మ సాధనం శరీరం ఆజం ఖలు ధర్మ సాధనం ధర్మ కర్మతో కూడిన ధర్మాలు ధర్మంతో కూడిన కర్మలు చేయాలంటే శరీరం కావాలి. వైరాగ్యంతో చెప్పేటువంటి ఇది తుచ్ఛము నీచము అల్పము బుద్బుదము నీటి బుడగ అవి నన్ను పెద్దగా ఆకర్షించవు. పగిలేదాకా నేను బుడగనే కాదా? నేను బుడగనే గనుక పగిలి తీరుతా అది తెలుసుగా? స్పృహ ఉన్నప్పుడు నాకు మరణ భయం ఎక్కడుంది? నాకు ప్రపంచం నుంచి ఇది కావాలి అది కావాలి అనే ఆశ ఎక్కడుంది? ఎప్పుడైతే నేను వీటన్నింటికీ అతీతమైనటువంటి ఒక మనోనిర్మాణాన్ని నేను చేసుకున్నానో నాకు దేని అవసరం ఉంది? అవసరం ఎప్పుడైతే నాకు ఏదీ లేదో ఇది కావాలన్న కాంక్ష లేదో నేను ముక్తుడ్నే అయినా. ఇది మూడింటిని అటు శంకర భగవత్పాదులు, ఇటు రమణ మహర్షి, భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. మానవతా ధర్మాన్ని మాధవీయమైనటువంటి భావనతో ప్రపంచానికి మార్గోపదేశం చేసిన మహనీయ మూర్తులుగా నాకు సదా ఆరాధనీయులు, నిత్య స్మరణీయులు, ప్రాతఃస్మరణీయులు. ఇక తర్వాత వారి మహిమలు నన్ను ఎప్పుడూ ఆకర్షించలేదు. నాకు వాటితో పని కూడా లేదు. ఇప్పుడు వారి మహిమల కంటే కూడా వారి తత్వాన్నే మీరు ఎక్కువగా గ్రహించి అవును అవును వి చేశాారు. అయితే సాయిబాబా వారు మిమ్మల్ని ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని అన్నప్పుడు మీలో ఏమి చూసి అలా అన్నారని మీరు అనుకుంటున్నారు actually మీకు- ఆయన అన్నప్పుడు అదే అదే ఆయన అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయా. అయితేనే మంచి scientist అవ్వాలి. అది ఆశీర్వచనం అవుతుంది. scientist అయ్యేటువంటి శక్తి నా దగ్గర లేకపోతే, లేదు దాన్ని కూడా నడిపించగలిగిన శక్తిమంతుడిని అయితే రెండు కారణాలు ఉండాలి. నేను ఒక saint ని కావాలి. ఒక spiritual personality ని కావాలి. పీఠాధిపత్యం ఒక పీఠాధిపత్యం ఇంకోదానికో ఏదో అవ్వాలి. ఇటూ కాక అటూ కాక రెండూ కలిపి అన్నారేమిటి అన్న ఒక ఆలోచన అంతరంగంలో ఒక తరంగమై భాసించిన సన్నివేశం అది. చాలా చక్కగా గుర్తు చేశారు. నలభై రెండు సంవత్సరాల నాటి మాట ఇది. ఇలా ఆశీర్వదించారేమిటి అనుకున్నా. మరి భగవంతుడికి మన తలుపులు తెలుస్తాయి అనుకుంటా వెంటనే చెప్పారు chemistry, mathematics, languages తెలుగుంది. తెలుగుకు భాషా శాస్త్రం ఉంది కదా అట్లాగే అధ్యాత్మకు కూడా అధ్యాత్మ శాస్త్రం ఉంది. ఒక ఊకదంపుడు ఉపన్యాసం. ఒక మనిషిని మూఢత్వంలోకి చెప్పేటువంటి కాలక్షేపం, కథా కాలక్షేపం మనిషికి తాత్కాలికమైన శాంతిని కాసేపు సంతోషాన్ని కలిగిస్తాయేమో కానీ అవి చిరముద్ర వేయలేవు. కానీ అధ్యాత్మ శాస్త్రం ఉంది. విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి, అధ్యయనం చేసిన దానిని ఆచరించి, ఆచరించిన దానిని అనుభవంలోకి తెచ్చుకుని, అనుభవంలోకి తెచ్చుకున్న దానిని అనుభూతిగా మార్చుకుని పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి నాలుగు మళ్ళీ వేదమే. పరా దర్శించవలసిన దానిని, పశ్యంతి చూసి, మధ్యమా అనుభవించి, వైఖరి చెప్పటం అది ప్రవచనం అంటే. ప్రవచనం అంటే ఒక అరగ-అరగంట గడ గడ గడ చెప్పటం కాదు. దానిలో ఒక తులనాత్మకమైనటువంటి విశేషమైన పరిజ్ఞానం ఉండాలి. సామాన్యార్థం నుంచి, విశేషార్థం నుంచి, అంతరార్థంలో నుంచి, పరమార్థంలో నుంచి అతీతమైన యదార్థవాదాన్ని సమాజానికి అందిస్తే మానవుడు మహోన్నతుడు అవుతాడు. అందుకై అధ్యాత్మ శాస్త్రం దేశంలో ఉన్నది. That is called spiritual science అన్నారాయన. అన్నప్పుడు నాకు ఒక్కసారి మహాదాశీర్వచనంగా భావన చేశా. science ద్వారా వచ్చే కీర్తి spirituality ద్వారా కలిగే ఆనందం రెండూ గనక జీవికి, దేహానికి లేదు నాకు కలిగితే అంతకంటే ఏం కావాలి? science ని నేను వదిలిపెట్టకుండా spiritual అంచులు గనక నేను చూడగలిగితే ఆశీర్వచనం ఫలించినట్లే అని మనసులో అనుకున్నాను. ఇవాళ అది ఫలించినట్లుగా అందరూ అంటున్నారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది కానీ ఇంకా ఏదో ఉందేమో అని అన్వేషణ నడుస్తూనే ఉంది. అన్వేషణ అనేదానికి ఎండ్ ఉండదు కాబట్టి ఎండ్ లేదు కాబట్టి వేలటికి వచ్చేసాను అనటానికి లేదు. ఇంకా చేయవలసినది చాలా ఉన్నది. మనం చేయవలసింది ఒక్కొక్క వ్యక్తికి భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఒక యోగాన్ని ఇస్తాడు. యోగాన్ని స్వార్థం కోసం కాక సద్వినియోగం చేసుకొని సమాజహితం గనక చేయగలిగినట్లయితే అది పూర్ణ విద్య. అందుకే చూడండి భగవద్గీతలో నీకు అన్ని శ్లోకాలు వస్తే మంచిదే. శ్లోకాల మీద నువ్వు జ్ఞాన యజ్ఞాలు చేస్తే మరీ మంచిదే. పది మందిని ఒకచోట కూర్చోబెడతావు. కానీ, నీవు ఆచరించనప్పుడు, నీవు పొందినటువంటి జ్ఞానాన్ని సమాజపరం చేయనప్పుడు, నీవు పొందిన విశేషమైన జ్ఞానం వృథా. यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः। तत्र श्रीविजयो भूतिध्रुवा नीतिर्मतिर्मम।। ఒక్క శ్లోకం గనకవేళ మన పిల్లలకు చెప్తే, అంటే యోగీశ్వర స్థాయిలో ఉన్నటువంటి ఒక బోధకుడు, అర్జునుడి వంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక సాధకుడు ఇద్దరూ కలిసి ఆలోచనలు గనక పంచుకున్నట్లయితే సమాజానికి దృఢమైనటువంటి ఒక నీతి, ఒక విజ్ఞాన రేఖఒక శాశ్వతమైనటువంటి సంపద కలుగుతుంది అనేది జగద్గురువు యొక్క ప్రథమ భావన కాబట్టి నా దృష్టిలో శంకర భగవత్పాదులు కృష్ణ తత్వంలో గనక తీసుకున్నట్లయితే గురు స్థానంలో వారు. రమణులు జ్ఞాన దృష్టితో చూస్తే రమణులు స్థానంలో. అలాగే సత్యసాయి భగవానుడు అక్కడ ఉన్నట్లయితే ముగ్గురు కృష్ణ శబ్దంలో ఆకర్షణ ఉన్నది ముగ్గురికి, ఆనందం ఉన్నది ముగ్గురికి. ముగ్గురూ కృషి చేసిన వాళ్ళే. కాబట్టి కృష్ణత్వానికి పూర్ణమైన స్వరూపాలు మూడు ఏవంటే శుద్ధ అద్వైత జ్ఞానంలో గనక వెళ్లినట్లయితే మూడు, మూడు ఉపాధులుగా ఉన్న ముగ్గురు కూడా ప్రపంచానికి జ్ఞానాన్నే వరదానం చేశారు. ఇప్పుడు మీరు వీటి మీద అంటే శంకర భగవత్పాదులు వారి దగ్గర నుంచి పుట్టపర్తి సాయిబాబా వారి వరకు కూడా ఆధ్యాత్మిక వారిలో ఉన్న తత్వాన్ని మీరు గ్రహించి ఇది చేశారు. అయితే దీని మీద బాగా అధ్యయనం చేసిన, చేశారు కాబట్టి అసలు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకి మతం అనేదానికి అసలు సంబంధం ఏమైనా ఉందా? అస్సలు లేదండి. అది విచిత్రం. ఊ. మతంలో బాగా మత ప్రచారకులు అనుకుంటారు మేము ఆధ్యాత్మిక వేత్తలం అయిపోయినాము అని. లేదు ఒక subject మీద పది నిమిషాలు మాట్లాడి కింద మన వాళ్ళు title కూడా వేస్తుంటారు ఆధ్యాత్మిక వేత్త. ఏమిటో మరి తెలియదు నాకైతే. ఆధ్యాత్మిక వేత్తలు అంత తేలిక ఎవరండీ. ఆధ్యాత్మికం అంటే rituals ని దాటింది spiritual. మతం అనేది ఒట్టి మార్గమే. మార్గంలో ఏం లేదు నడక అంతే. సిమెంట్ రోడ్డు, కచ్చా రోడ్డు లేదు మంచి black top రోడ్డు మీరు ఏదన్నా చెప్పండి. రోడ్డు మీద నడక దానికేముంది? మతం మార్గం అయినట్లయితే మార్గాలు అనేకం ఉంటాయి. కానీ గమ్యం ఏమిటని విచారించేది spirituality. We all meet at one point. నేను ఇవాళ మీ దగ్గరికి రావాలన్నా, నేను ఇక్కడికొచ్చి మాట్లాడాలన్నా రావటానికి అనేక మార్గాలున్నాయి. నడిచి రావచ్చు, రిక్షాలో రావచ్చు, car లో రావచ్చు. అలాగే మీరు నా దగ్గరికి. కానీ గమ్యం ఏమిటంటే మనమందరం కలిసి మంచి విషయాలు కాసేపు మాట్లాడుకోవాలి అంతే కదా. మతం దానిని మించి పెద్ద moral philosophy ని moral conduct ని కొంతవరకు అది శాసిస్తుంది. శాసించినందు వలన మూఢత్వం కూడా పెరుగుతుంది. spirituality లో శాసించటం ఉండదు, సూచించటం ఉంటుంది. ఇలా వెళ్లి మార్గంలో వెళ్ళండి అంటారు. కాస్త పది నిమిషాలు late గా ముందుగా వెనగ్గా వచ్చి చేరుతాం. కాబట్టి spirituality శుద్ధ జ్ఞానం. అజ్ఞానం యొక్క ఒక అంచు ఏదన్నా ఉంటే అది నిజానికి మతమే. మతం వల్ల యుద్ధాలు జరుగుతాయి, spirituality వల్ల యుద్ధాలు ఆగుతాయి. అంతే. యుద్ధం అనేది మనిషి మనసులో పుట్టేటువంటి ఒక ఆలోచన. ఒక negative thought. అంటే ఇంకోడిని జయించటము అంటే అహంకారమే. నా అహం చల్లారే వరకు నేను జయిస్తూ ఉంటా. మా-మామూలుగా ప్రపంచంలో విజేతలు అని photos వేస్తూ ఉంటారు. వీళ్ళందరూ విజేతలు కాదు. subject లో కాస్త మంచి marks లు వచ్చాయ్ అంతే. కాస్త ప్రజ్ఞ ఉంది అంతే. మరి మీ దృష్టిలో విజేత ఎవరు అని నన్ను ప్రశ్నిస్తే నన్ను నేను జయించుకున్న రోజున తప్పకుండా నేను విజేతను అని నేనే చెప్తా. కానీ నన్ను నేను జయించుకోవటానికి మతం నాకు ఆధారం కాదు. నాకది అక్కరకు రాదు. నేను spirituality ని మతాతీతమైనటువంటి ఒక మానవీయ భూమికని మాధవతా పరిమళంతో గనక సమన్వయం చేసుకోగలిగితే, అంటే జీవ ప్రజ్ఞని దైవ ప్రజ్ఞని గనక blend చేయగలిగితే నన్ను నేను జయించుకోవటం చాలా తేలిక. అంటే నాకు ఏం అక్కర్లేదో తెలియాలి, నాకు ఏమి కావాలో కూడా తెలియాలి. నాకు ఏం కావాలో తెలిసిన తర్వాత నాకు అక్కర్లేని తెలుసుకోవాల్సిన ప్రయే-- పనేం లేదు. నాకు ఏం కావాలో తెలుసు, దానివైపు వెళ్తూ ఉంటా. నాకు అక్కర్లేనిది ఏదో తెలుసుకోవటానికి మాత్రం చాలా time పడుతుంది. అది మతం మనల్ని ఎదగనివ్వదు. అందువల్ల నా దృష్టిలో మతానికి రకమైన గౌరవం నేను పెద్దగా ఇవ్వను. అయితే హైందవ సమాజం ఇవాళ గుర్తించవలసినది మిగతా మతాల గురించి నేను వ్యాఖ్యానం చేయను, చేయకూడదు. We are not supposed to pronounce on the other. అది ఒక fundamental principle in spirituality. కానీ హైందవ ధర్మం ఈ, దేశానికి సంబంధించింది గనుక హైందవ ధర్మం ఇవాళ ఏదో వెనకబడి పోయిందని, పలచబడి పోయిందని దానికోసం మేము ఉద్యమాలు చేస్తామనే వాళ్లకు మాత్రం నా అంతరంగంలో కలిగే మెదిలే, పారాడే తారాడే ఒక భావన ఏమిటంటే అవి ఏమీ చేయొద్దు. హైందవ ధర్మం అనేది హైందవ మతం అనేది లేదసలు. ఉన్నదే సనాతన ధర్మం. It is nothing but a way of living అండి. జీవన విధానం. జీవన విధానంలో నా వల్ల ప్రపంచంలో ఎవరికీ హాని జరగనంతవరకు నేను మంచివాడినే. నా వలన ప్రపంచానికి జరగకూడదు. ఇది ఉదాత్త భావన. వేద ప్రామాణికమైన దీనికంటే ఉదాత్త భావన ఏముందో తెలుసునా? ప్రపంచం వల్ల కూడా నాకు హాని జరగకూడదు. అంటే హాని చేసే ప్రపంచ నిర్మాణంలో నేను భాగస్వామిని కాకూడదు. నన్ను నేను ప్రపంచం యొక్క స్థూల రూపంగా నన్ను అనుకున్నట్లయితే నేను ఎట్లా ఉండగోరుతున్నానో నా చుట్టూ ఉన్న సమాజం కూడా అట్లాగే ఉండాలి. అది ప్రయాణం నాతో ప్రారంభం కావాలి. నేను సమాజం మొత్తాన్ని redeem చేయటానికి refine చేయటానికి redefine చేయటానికి redesign చేయటానికి నేను రాలే. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. భగవంతుడు అనేక జన్మ పరంపరలో హైందవ ధర్మం బోధించినటువంటి లేదా సనాతన ధర్మం, దానికి మతమే లేదు. మతాతీతమైన భావనే సనాతన అంటే పురాతనమైన. దానిని ఇవాళ సనూతన చేసుకుందాం కాసేపు.ఈ కాలానికి కావలసినట్టుగా మార్చుకుందాం. త్రేతాయుగన్నాటి ధర్మాన్ని ఇవాళ సమాజంలో మనం చూపించలేం. వర్తమానానికి- వర్తమానానికి ఎంతవరకు కావాలో అంతవరకు గనక మనం తీసుకోగలిగినట్లయితే మతాలన్నీ-- అందుకే "మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి వెలిచి నిలుచును" ఎవరన్నా-- నిలుచును. ఎవరన్నారు? గురజాడ అప్పారావు గారన్నారు. మతాలన్నీ పోతాయి. పుడతాయి, పోతాయి నీటిమీద బుడగలవలె. వాటిని గురించి మనం పట్టించుకోకూడదు. We should not identify ourselves. బ్రాండ్ కాకూడదు. ముద్ర ఉండకూడదు. విశాలమైన భావన ఉన్నప్పుడు నాకు వెరపే లేదు, భయమే లేదు. నాకెప్పుడైతే భయం లేదో నాకు ఆశ లేదు. ఎప్పుడైతే ఆశ లేదో దురాశ, పేరాశ, నిరాశ లేదు. కనుక నాకు దుర్దశ లేదు. నాకు అంటే వి.ఎస్.ఆర్. మూర్తికి కాదు, మనందరికీ అని. అది. మన ఆలోచన రీతిలో ఉండాలని నా స్పష్టమైన భావన. ఓకే అండి. Thank you sir. ఇప్పుడు ఎన్నో విలువైన విషయాలు మా పాఠకులకు కూడా, మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఇలాగే మీ ఛానల్ ఒక ఉదాత్తమైనటువంటి భావనా స్థితిని ఒక పేపర్లో పడే ఒక వార్త గాని, ఒక ఉపన్యాసం గాని చాలా తక్కువ మందిని ప్రభావితం చేస్తుంది. కానీ ఈవేళ మీడియం ఏదైతే ఉందో, ఇది భగవంతుడి యొక్క ప్రజ్ఞగా నేను భావన చేస్తున్నాను. ఇవేళ ఇది కొన్ని లక్షల మందికి ఆలోచన రేకెత్తించేదిగా, మంచి ఆలోచన చేసే దిశగా మీ ఛానల్ ఇలాగే ఇటువంటి బృహత్తర, మహత్తర కార్యక్రమాలు చేపట్టి విజ్ఞానాన్ని నలుదిశల చల్లగా పంచిపెట్టాలని, దానికి కావలసినటువంటి సర్వశక్తులు మనకి కనిపించని కానీ మనల్ని నడిపిస్తున్నటువంటి దైవం మీకు అన్ని విధాలా ఉండాలని నేను మంగళాశాసనం చేస్తూ అంటే కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇది ఈరోజు అంతరంగం. వి.ఎస్.ఆర్. మూర్తి గారు చెబుతున్నట్లుగా మనకి మతం అనేది మన ఒక ఆధ్యాత్మిక భావనకు గాని, మనిషిలో ఒక ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక తత్వానికి అనేది ఒక అడ్డు కాకూడదు. మతం అనేది ఏమిటంటే ఉన్నంతా ఒకటే సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని మన వర్తమాన స్థితి-పరిస్థితులకి, వర్తమాన కాలానికి అనుగుణంగా మనం అన్వయించుకుంటా ఒక సనూతన ధర్మంగా మార్చుకొని మనమందరం ఆధ్యాత్మిక వైపు చేస్తే అంతా సుఖశాంతులతో వర్ధిల్లుతారని చెప్పి వారు ఆకాంక్షిస్తున్నారు. వారు... వారి ఆధ్యాత్మిక ప్రయాణం ఇలా మరింత మందికి మేలు చేకూర్చాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఇది ఈరోజు అంతరంగం. వచ్చే వారం మరో ప్రముఖ అంతరంగంతో కలుసుకుందాం. నమస్కారం. [అవుట్ ట్రో మ్యూజిక్]
YouTube · audio

Antharangam | Part 2 | By Harika Cable Vision

Home

Antharangam | Part 2 | By Harika Cable Vision

Source: SSP GUNTUR on YouTube

0:00 / 28:09

More in this series

Antharangam (Harika Cable Vision)

2 episodes · 1 hr 1 min

  1. 29 min 1

    ANTHARANGAM | Part 1 | By Harika Cable Vision

  2. 28 min 2

    Antharangam | Part 2 | By Harika Cable Vision

    Now playing