No transcript for this section.
Transcript begins at 0:00.
[సంగీతం] శ్రీ సాయిరాం సంగీతం తాతవు సాహిత్యం తాతవు సాహిత్యం లేని సాహిత్యం సాహిత్యం తెలియని సంగీతం రెండు వృథా నిజానికి సాహిత్యానికి శాశ్వత తత్వాన్ని ఇచ్చేది సంగీతం పైగా భక్తి సాహిత్యము భక్తి సంగీతము ఈ రెండూ గనక ఒకచోట కూడినట్లయితే అదే ధ్యానము అదే గానము అదే జ్ఞానము అదే తపస్సు గేయకారులు వాగ్గేయకారులు అని రెండు రకాలు ఉంటారు సంగీతజ్ఞులు ఎవరో రాసినది పాడటం ఒక ఎత్తు తాము కూడా రాసి పాడటం మరొక ఎత్తు కానీ వీటన్నింటికీ అతీతంగా మనోధర్మ సంగీతాన్ని ఆశ్రయించి ఒక జీవుడు నిరంతరాభ్యాసం తో అంటే continuous consistent and constant practice అంటాం చేయగా చేయగా చేయగా ప్రారభీతక న్యాయ విశేషంతో ఆ పాడుతున్నది తానూ ఒకటైపోతారు ఇది చాలా అరుదైన సంఘటన ఈ సంఘటనలో మనకి అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రామదాసు త్యాగరాజ స్వామి పురందరదాసు శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితర్ వంటి మహాత్ములంతా కూడా మన మనస్సులో తారాడుతారు అంటే సంగీతాన్ని కేవలం భక్తి కోసం మాత్రం కాక కేవలం భక్తి కోసమే ఆశ్రయించి తమ తనువునీ మనస్సునీ బుద్ధినీ చిత్తాన్ని అన్నింటినీ కూడా పరమేశ్వరుం ముఖం చేసి తాత్విక చింతనా భూమికలో నెలకొల్పి చెంది తమ నిత్య నైమిత్తిక జీవితాన్ని పరిపూర్ణము పరితుప్తము పారమార్థికము చేసుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఆ అతి తక్కువ మందిలో తొంబై నాలుగు సంవత్సరాల అంటే ఒక సంపూర్ణ జీవితాన్ని శతాయుష్షుని అనుభవించి అందులో సుమారుగా అర్ధభాగం శ్రీరామ గాన సభను పెట్టి దానిలో అనేకమంది వర్ధిష్టములైనటువంటి కళాకారులందరినీ అలాగే ప్రజ్ఞామూర్తులైనటువంటి కళాకారులనీ అలాగే ఔత్సాహికులనీ అట్లాగే రసికులను రసజ్ఞులను రస పారంగ్యము తెలిసినవారిని అందరినీ కూడా ఒక్కచోట చేర్చి ఒక అనాహత నాదంగా జీవితాన్ని జీవించినటువంటి ఒక పూర్ణ పురుషుడు మన సత్యనారాయణ గారు కొణికి సత్యనారాయణ గారు వారిని నేను ప్రత్యేకంగా ఎరుగుదును కారణం సంగీతం పట్ల ఉన్నటువంటి గౌరవం సాహిత్యం పట్ల ఉన్నటువంటి ప్రేమ వీటన్నింటినీ మించి భగవంతుని యందు ఉన్నటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం ఇవన్నీ ఒక వ్యక్తిలో మనం చూట్టం అరుదైన విషయం ఈ మూడింటినీ ఒకేఒక వ్యక్తిలో నేను చూట్టం జరిగింది అది సత్యనారాయణ గారు ఇక సత్యసాయి సేవా సమితి కోటి పి.వి. శాస్త్రి గారు నిరంతరము కూడా ఇటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి వ్యక్తుల కోసం వెతికి వెతికి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ప్రపంచంలోకి తీసుకొని వచ్చి అనేక మందికి పరిచయం చేసి వారి ప్రజ్ఞా భూమికని విస్తరింపజేసేటువంటి ఒక కార్యదక్షత కలిగిన అటువంటి వారు ఆయన ఏం చేశారంటే పుల్లారెడ్డి బిల్డింగ్ లో ఉన్నటువంటి సత్యసాయి సేవా సమితికి వారిని ఆహ్వానం చేసి అనేకమైన విషయాలన్నీ కూడా రికార్డు చేసి అ-అనేక మందికి వారి దర్శన సంభాషణ భాగ్యాన్ని కలిగించారు ఇది విశేషమైనది అంతేకాదు సత్యనారాయణ గారిని ప్రశాంతి నిలయానికి తీసుకొని వెళ్ళి ప్రశాంతి నిలయము దాని వైభవము చూసినటువంటి కడు వృద్ధుడైనటువంటి సత్యనారాయణ గారు ఒక్కసారిగా ఒక ఆనందానుభూతికి లోనై జీవితంలో ఇటువంటి ఒక మహా పుణ్య క్షేత్రాన్ని చూసి ఉండకపోతే నా జీవితం వృధా అయిపోయేది కానీ ప్రశాంతి నిలయం దర్శనంతో నా జీవితం పరిపూర్ణమైందని ఒక మహా సంతృప్తిని వెలిబుచ్చారు వీటన్నింటికీ కూడా అనేక కారణాలు ఉంటాయి మనకి ఆ భగవత్ రూపాల పట్ల ఏ రకమైన అపేక్ష ఉండకపోవచ్చు కానీ భగవంతుడికి ప్రతి జీవి పట్ల అపేక్ష ఉంటుంది కనుకనే పి.వి. శాస్త్రి గారి ద్వారా కొణికి సత్యనారాయణ గారు ప్రశాంతి నిలయానికి చేరుకోవటం అనేది సత్యనారాయణ గారిని స్వామి రప్పించుకున్నారుతప్పించుకొని వారు చేసినటువంటి సంగీత తపస్సుకి ప్రతి శ్వాసలోనూ ప్రతి నిశ్వాసలోనూ ప్రతి క్షణము కూడా రామనామ స్మరణంచితమైన దేహిగా ఉన్న కారణంగానే సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామి తమ సన్నిధికి రప్పించుకున్నారు. రప్పించుకొని ఒక భగవంతుడు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రాన్ని గనక సృష్టిస్తే ఎలా ఉంటుందో, అక్కడ సంగీత సాహిత్యాలకి పెద్దపీట ఎలా వేయబడుతుందో, ఇవన్నీ గమనించినప్పుడు కలిగిన ఒక రసార్ద్రరేఖ సత్యనారాయణ గారి నోటినుంచి ఆ మాట విలువడింది. ఇటువంటి అనేకమైన సందర్భాలు సత్యనారాయణ గారిలోనే చూశాను. నల్లకుంట రామాలయంలో వారు పిల్లలకి నేర్పుతున్నప్పుడు, నేర్చుకున్న వారు పాడుతున్నప్పుడు, తోటి కళాకారులు వచ్చి అక్కడ సభని నిర్వహించినప్పుడు, కచేరీని ప్రారంభించినప్పుడు, అశాంతము ఉండి ప్రతి వ్యక్తిని కూడా మహదాశీర్వచనం చేసిన వినమ్రశీలి సత్యనారాయణ గారు. అయితే, "జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ" ఇది భగవద్గీతలో గీతాచార్యుడి యొక్క రెవలేషన్. అంటే జన్మ ఎత్తక తప్పదు, ఎత్తిన జన్మను ముగించక తప్పదు. ఆ క్రమంలోనే ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన కొణికి సత్యనారాయణ గారు ఈ మధ్యనే మళ్ళీ తమ మూలంలోకి వెళ్లారు. అంటే బ్రహ్మీభూతులైనారు, శివైక్యాన్ని చెందారు. ఆ శివైక్యాన్ని చెందటానికి కావలసిన అన్ని అర్హతలను తన జీవిత విధానంలో నుంచి సంపాదించుకొని ఐశ్వర్యవంతుడు అయినాడు ఆయన. ఈవేళ ఏ సంగీతం ద్వారా అనుభవాన్ని పొందారో, ఏ అనుభవం ద్వారా అనుభూతిని ఒక ఐశ్వర్యంగా సంపాదించుకున్నారో, అనుభవ అనుభూతులను దాటి విభూతి స్వరూపంగా భగవాన్ శ్రీ సత్య సాయి రాముడిలోనూ, నాటి సాకేత రాముడైన పరబ్రహ్మమూర్తి శ్రీరామచంద్రము యందు వారి ఆత్మ సంలీనమై, సంయోగమై, సాయుజ్యమై, పరిపూర్ణమై, దివ్యమై నిలిచిపోయింది. వారి స్మృతి, వారి స్పురణ, వారి ప్రజ్ఞ, వారి నిబద్ధత, వారి నిష్ఠ, ఇవన్నీ కూడా ఆగామి కాలాలకు అంటే రాబోయే కాలాలకి, రాబోయే తరాలకు స్ఫూర్తిమంతమైనటువంటి దివ్య జ్యోతిగా ప్రకాశమానం కావాలని, అవుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ వారి దివ్య మహా స్మృతికి పుర౦జలి ఘటిస్తూ సాయిరాం.
YouTube · audio
Remembrance Of Sri Koniki Sathyanarayana Rao
Remembrance Of Sri Koniki Sathyanarayana Rao
Source: P V S on YouTube
0:00 / 9:12