No transcript for this section.
Transcript begins at 0:51.
తే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనశ్యే జంగలికాయమానే సంసార హాలాహల మోహ శాన్యై సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం మే అనంతకోటి గురుస్వరూపాల దివ్య మహాస్మృతికి ప్రాంజలి ఘటిస్తూ అతి పవిత్రము దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి షిరిడీ సాయినాధుని దివ్య సన్నిధిలో ఈ సాయంకాలం మనం కూర్చొని మనందరం ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఆధ్యాత్మిక జీవితంలో భావనలో అనేకమైనటువంటి మహాపురుషులను సంస్మరించవలసిన ఒక అవసరము అది ఒక అవకాశము కనుక ఈ క్షేత్ర ఫౌండేషన్ ప్రారంభం చేసిన తర్వాత ప్రజా బాహుళ్యంలోకి ధర్మ ప్రచారాన్ని ధర్మ ప్రబోధాన్ని దాటి ధర్మ ప్రసారాన్ని చేసేటువంటి దిశగా ఈ ఫౌండేషన్ ప్రారంభించటం దాని తొలి సత్సంగం షిరిడీ సాయినాధుని దివ్య పాదాల దగ్గర ప్రారంభం కావటం ఇది సాయినాధుని యొక్క దివ్య అనుగ్రహ విశేషంగా నేను భావన చేస్తూ [చప్పట్లు] రాబోయే శత వసంతాలు నూరు సంవత్సరాలు ఇలాగే ఈ క్షేత్ర ఫౌండేషన్ రాంబాబు వారి నేతృత్వంలో వారి సారధ్యంలో వారి ఆంతరంగికమైన భావనా స్ఫురణతో కలిసి పనిచేస్తున్న వారందరికీ కూడా సాయినాధుడు దీర్ఘమైనటువంటి ఆయుష్షుని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రశాంతతను ప్రసన్నతను హాయిని కలిగించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ ఇవాళ లోకోత్తరమైనటువంటి ఒక మహాపురుషుడి యొక్క వైభవాన్ని మనం తలుచుకోవటానికి ఇవాళ కలుసుకున్నాం. ఆ వైభవ పురుషుడు ఎవరు అంటే నిజానికి మహాత్ములు ఇక్కడికి రావటమే మానవజాతి పొందినటువంటి వైభవం. వారికంటూ ప్రత్యేక వైభవాలేం ఉండవ్. కానీ వారు ఈ అవనీ సంచారంలో మన బోటి వారితో సాలోక్యంగా ఉంటూ సామీప్యంగా ఉంటూ సాన్నిధ్యంతో మనకి అనుగ్రహాన్నిస్తూ సాయుజ్య భావన స్థితిలోకి నడిపించేటువంటి మహా చైత్య పురుషులు కాబట్టి వారందరినీ కూడా మనం స్మరిస్తూ ఉండాలి. ఎందుకంటే కలియుగంలో యజ్ఞ యాగాదులు వేదాధ్యయనము ఉపనిషత్ భావనలు ఇవన్నీ అందరికీ అందుబాటులోకి లేవు కనుక వచ్చిన వాటిని ఆచరించే అవకాశం లేదు గనుక నాస్తి నాస్తి కలౌ నాస్తి హరి నామ వినా గతిహి హరి నామస్మరణమే సర్వోన్నతమైనది అని భావన చెప్పినా భక్తిరేవ గరీయసీ అని నారద భక్తి సూత్రం చెప్పినా అంటే భక్తి మాత్రమే సర్వోత్కృష్టమైనది అని. కానీ కర్మ ఒట్టి పువ్వైనట్లయితే భక్తి కాయ అయినట్లయితే జ్ఞానము పండు అవుతున్నది. పండు కావాలి అంటే కాయ కావాలి కాయ రావాలి అంటే ముందు పువ్వు కావాలి. మనస్సు అనేటువంటి పుష్పం భగవంతుడు మనకిచ్చి పంపాడు. దీనికి జాతి మత వర్గ వర్ణ ఇవన్నీ ఏవీ లేవు. ఉన్నదంతా కూడా ఒకేఒక్క జాతి అది మానవజాతి. ఈ మానవజాతి ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలియదు. సాధారణంగా అందరూ వేదకాలం అంటారు వేదం కాలాతీతం. కాలం వేదకాలము ఏది అని నిర్ణయించడానికి వీలు లేదు గనుక అనేకమైనటువంటి మహాయుగాలు దాటి, దాటి, దాటి ఇదిగో కలియుగానికి మనం వచ్చాం. నాలుగు లక్షల ఇరవై రెండు వేల సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ కాలంలో కేవలం మనం ఇప్పటి గడిపింది ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే. ఇంకా ఎంత ఉన్నదో, జీవుడు ఇంకా ఎంత చూడవలసి ఉన్నదో, కలి ప్రభావము, కలి కార్పణ్యము, కలి పారుష్యము. ఈ కలి ప్రభావం మానవ జీవితాన్ని, మానవ మేధని అతలాకుతలం చేస్తూనే ఉంటుంది గనుక మనము దేనికి ఎదరెక, బెదరెక, చెదరెక, కదలక మనదైనటువంటి ఒక సమున్నతమైన మానవీయ భావనలో నిలబడాలి అంటే దీనికి రెండు మార్గాలు చెప్పబడ్డాయి. ఒకటి ప్రేమ, రెండవది సేవ. కర్మ, భక్తి, జ్ఞాన అనబడేటువంటి ఈ మూడు యోగాలని మనం గనుక సమన్వయం చేసుకోగలిగితే మానవ జీవితం ఒక పరిపూర్ణతని, ఒక సార్ధకతను పొందుతుందని భావన చేస్తూ, భగవాన్ రమణ మహర్షి అనగానే ఆయన ఎవరితో మాట్లాడలేదట కదా, జీవితాంతం మౌనం వహించారట కదా, ఇవన్నీ ఈ లోకం ఊహించుకున్న భావనలు. ఆయన మాట్లాడారు. అవసరమైంది మాట్లాడారు. అక్కరకు వచ్చేది మాట్లాడారు. ఏది అవసరమో, దేనివలన మానవ జీవితం సుసంపన్నమవుతుందో, దేనివలన ఒక ఆధ్యాత్మిక భావనా భూమిక బలపడుతుందో, దేనివలన నిత్య నైమిత్తికమైనటువంటి జీవితం అతలాకుతలమై ఆందోళనాయత్తమై ఉన్నటువంటిది ఒక పరమ ప్రశాంతిని, స్థిర ప్రజ్ఞని, స్థిమితమైనటువంటి బుద్ధిని ఎలా కలిగిస్తుందో ఆ మాటలు మాత్రమే చెప్పారు. ఈ చెప్పబడినవన్నీ కూడా వేదాలకి, శాస్త్రాలకి అనుగుణమైనటువంటి ఒక దివ్యమైనటువంటి భావన. ఈ నేపథ్యంలో ఇవాళ మనం అనుకుంటాం మీరు ఆధ్యాత్మిక రంగంలోకి ఎప్పుడొచ్చారు?ఆధ్యాత్మికత ఎప్పుడు నేర్చుకున్నారు? మిమ్మల్ని ఎవరు ఎవరికి పరిచయం చేశారు? ఇవన్నీ మౌలికమైన ప్రశ్నలు మనం సాధారణంగా వేస్తూ ఉంటాం. ఇక్కడ అధ్యాత్మ లోకి ఎవరు ఎవరినీ తీసుకుని రాను. జీవుడి యొక్క జన్మాంతర పుణ్య విశేషం చేత ఆయా కాలాలు ఏర్పడినప్పుడు ప్రాప్తి చేత, గురువు అనుగ్రహం చేత వారంతట వారే గురు సన్నిధానంలోకి వస్తారు. ఇక్కడ గురువు దగ్గరకు మనం వెళ్ళటం అంటూ లేదు. గురువే మనల్ని దగ్గరకు లాక్కుంటాడు అది. మనం ఎంత దూరంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ చదువులు చదివినా, ఏ లౌకిక విద్యలలో ఒక పారంయాన్ని, ఒక అంచులను, ఒక శిఖరాన్ని మనం చూసినప్పటికీ కూడా గురుపాద సన్నిధిని మించినటువంటిది మరొకటి లేదు, లేదు, లేదు. ఇక్కడ ప్రారంభం అవుతుంది భారతీయ అధ్యాత్మ. కాస్త రమణ మహర్షి ఆగమనాన్ని గురించి మనం తెలుసుకుంటే, ఆయన ఎందుకు వచ్చారో, వచ్చి ఏం చేశారో, వారిని గురించి తెలుసుకున్నందువలన మనం ఏం జీవితంలో నేర్చుకోవాలో, ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలుగా కాసేపు మాట్లాడుకుందాం. ఒకటి, ఆత్మ, మీరందరూ ఆత్మని పట్టుకోండి, ఆత్మ వైపు వెళ్ళండి అని వేదాంతులు చెప్తూ ఉంటారు. ఆత్మని పట్టుకోండి అంటే వేదాల నిండా ఎక్కడా కూడా ఆత్మను గురించిన ప్రస్తావన లేదు. ఏ మంత్రంలోనూ సామవేదంలో లేదు, ఋగ్వేదంలో లేదు, యజుర్వేదంలో లేదు. సామవేదం అంతా గాన ప్రవాహం అది, నాద ప్రవాహం. అంటే పాటగా సాగేటువంటి మాంత్రికమైన మంత్రాత్మకమైనటువంటి భావన. ఋగ్వేదం అంటే ఋక్ అంటే మాట. అదంతా మాటల పుట్ట. చక్కగా మంచి మాటలు. ఆ మాటల్లో ఎక్కడా ఆత్మ గురించిన విచారణ లేదు. యజుర్వేదం అంటే యజ్ఞం, కర్మకాండ. ఈ మూడు మాత్రమే మూడు వేదాలుగా మనం భావన చేయాలి. అందుకే ఆ విద్యకి త్రయీ విద్య అని, బ్రహ్మ విద్య అని, శ్రీ విద్య అని, ఆత్మ విద్య అని పేరు. మరి నాలుగోవది ఉంది కదా చతుర్వేదము అధర్వణ వేదం అంటే ఏమిటి అంటే, చూడండి సామవేదానికి ఋషి పేరు లేదు. ఋగ్వేదానికి ఋషి పేరు లేదు. యజుర్వేదానికి ఋషి పేరు లేదు. కానీ ఇవన్నీ పోగా కాగా మిగిలినటువంటి అనేకమైనటువంటి వేదాంతకమైనటువంటి భూమికలన్నీ కూడా ఒకచోట చేర్చి అధర్వనుడు అనబడేటువంటి ఒక మహాఋషి వచ్చి, అయ్యా ఇవి కూడా లోకానికి పనికొస్తాయి కదా దీన్ని ఏం చేద్దాము అన్నారు. అంటే ఆనాటి ఋషులు ఇది మీ పేరు మీదగా అధర్వణ వేదంగా ప్రాచుర్యంలోకి వస్తుంది. దాని నిండా కూడా చాలా నేర్చుకోవలసినవి ఉన్నాయి అని చెప్పారు. కనుక దక్షిణ భారతంలో మనమంతా త్రయీ విద్యని ఉపాసన చేస్తాం. వేదత్రయీ, త్రయీవిద్య, మూడు వేదాలు ఆ-ఆ అనేటువంటి భావన ఉన్నది. కానీ ఉత్తర భారతంలో మాత్రం చతుర్వేదము దానికి కూడా వాళ్ళు ప్రాధాన్యతనిచ్చి చతుర్వేద పండితులు అక్కడున్నారు. ఇక్కడ మూడు వేదాలకు సంబంధించిన వారు ఉన్నారు. అంటే ఏతావాతా వేదాలలో మనిషికి ఒక ఆనందాన్ని, ఒక ఉత్తేజాన్ని 2,72,000 యోగనాడులు కదలి మెదలి మానవుణ్ణి పరమోన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళే దిశగా అవన్నీ ఏర్పరచి ఉన్నాయి గనుక అవి మంత్ర పూరితమైనటువంటి భావాలు. ఇక రెండవది, మరి ఆత్మను గురించిన విచారణ ఎప్పుడు వచ్చింది అని వస్తే ఉపనిషత్తులలో మనకి ఈ ఆత్మ విచారణ, ఆత్మము అంటే ఏమిటి, నేనెవరు, తైత్తిరీయ ఉపనిషత్తు వాటి జోలికి వెళ్ళకుండా ముందు ప్రపంచంలో ఉన్న సర్వ శాస్త్రాలు తెలిసినా, ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని లక్షల మందికి నీవు పరిచయమై ఉన్నా, ప్రపంచంలో ఉన్న సంపదంతా నీకు కైవసమైనా, అపారమైన, అనంతమైన, విమల, అమల, కమల కీర్తి నీవు సంపాదించినా నిన్ను నీవు తెలుసుకోకపోతే వృధా. ఇది భావన. మనం అన్నీ తెలుసుకుంటాం. ప్రపంచంలో ఇవాళ ఆ technology ప్రకారం ఒక మీట నొక్కితే ప్రపంచం మన చేతిలోకి వస్తోంది. కానీ దాంట్లో ఉన్నదంతా సత్యం అని కాదు. కానీ మనకి information ఉన్నది. information ఉంది గానీ దాన్ని implementation ఎలా చేయాలో ఇప్పుడు చెప్పడంలే. ఇవన్నీ చెప్పటానికి ఏర్పడినటువంటివే అనేకమైన ఉపనిషత్తులైతే, శంభోర్ మూర్తి శరతి భవనే శంకరాచార్య రూపా, శంకర భగవత్పాదులు ఈ ప్రపంచంలోకి వచ్చి మీరు ఇవన్నీ తట్టుకోలేరు, అర్థం చేసుకోలేరు. అనేకమైనటువంటి ఉప-ఉపనిషత్తులన్నీ ఉన్నాయి. ప్రధానంగా 1180 ఉపనిషత్తులు. కాలగమనంలో అవి 180 కి వచ్చినాయి. భగవత్పాదులు వచ్చి ఆ సారమంతా కలిపి దశోపనిషత్తులు అని మనకి అప్పజెప్పారు. ఈ కఠోపనిషత్తు చాలా ప్రధానమైనటువంటిది. దీనిలో ఆ ఈశావాస్యోపనిషత్తుతో ప్రారంభమై అనేకమైనటువంటి మార్గాలలో జీవుణ్ణి సమున్నతమైన మార్గంలో నడిపిస్తూ ఉపనిషత్తులన్నీ మనకు అధికారాన్ని, ఒక హక్కుని సంక్రమింపజేసినాయి. అది ఏమిటంటే ప్రశ్నించటం, తెలుసుకోవటం. అప్పటిదాకా ఇది ఇంతే అని చెప్పబడింది. ఉపనిషత్తులు వచ్చాక ఇది ఇట్లా అని చెప్పబడింది. ఇది ఇంతే అంటే గోడ మీద రాత. ఇది ఇట్లా అంటే చెప్పే బోధకుడు, వినే సాధకుడు, ఆచరించేటువంటి ఆధ్యాత్మిక భూమికలో ఉన్న వ్యక్తి, వీళ్ళందరూ కలిసి ఈ ప్రపంచ భావర నుంచి పారలౌకికమైన ఉదాత్త భావనా భూమికలోకి వెళతాడు గనుక ఉపనిషత్తులు దశోపనిషత్తులై మనకందినాయి. దశోపనిషత్తులలో ఈ ఆత్మను గురించిన ప్రస్తావన ఉన్నది. ప్రధానంగా నచికేతసుడు, యమధర్మరాజు ఇద్దరూ కలిసి కూర్చొని చిన్న పిల్లవాడు యమలోకానికి వెళ్ళి, నీకు బ్రహ్మవిద్య తెలుసుట కదా, ఆత్మ అంటే తెలుసుట కదా, నాకదేమిటో ఆ బ్రహ్మవిద్య చెప్పమని అంటే, నువ్వు చిన్నపిల్లవాడివి నీకు బంగారం ఇస్తాను, అగ్రహారాలు ఇస్తాను అని అనేక విధాల ప్రలోభ పెడితేఈ నచికేతసుడు యముడ్ని ఏమడిగాడో తెలుసునా? "ఎందుకయ్యా అన్నీ పోయేవన్నీ ఇస్తానంటావు పోనిదేదన్నా ఉంటే ఆ వస్తువు సంగతి కాసేపు చెప్పు" అన్నాడు. "నువ్వు బంగారం ఇస్తావు ఉండదు, ఆ-అందం ఇస్తావు ఉండదు, ఐశ్వర్యం ఇస్తావు ఉండదు, గోసంపద ఇస్తావు. నువ్వు ఏది ఇస్తా అని అంటున్నావో అది ఏదీ కూడా ఉండేది కాదు గనుక ఏది కదలకుండా ఉంటుందో, ఏది నేను, దేనివలన నేను నిజమైన ఆనందాన్ని పొందుతానో, నువ్వు చెప్పేవి నువ్విస్తానంటున్నవన్నీ సుఖాన్నిస్తాయి, సంతోషాన్నిస్తాయి కానీ ఆనందాన్నివ్వవు కదా. ఆ ఆనందం ఏమిటో నాకు చెప్పమని" అడిగాడు. అప్పుడు యమధర్మరాజు ఆత్మవిద్యా విలాసాన్ని బోధ చేసి "నువ్వు మళ్ళీ భూలోకంలోకి వెళ్ళాలి. వెళ్ళి ఈ విద్య, ఏ విద్యను నేను నీకివ్వాళ చెప్పానో దీనిని నచికేత విద్య అని లేదా నచికేత అగ్ని, అగ్ని అన్నా కూడా విద్య అనే అర్థం. మనమిక్కడ దీప ప్రజ్వలనం చేయటం స్వామివారి పట్ల గౌరవం అని మాత్రమే కాదు, ఈ జ్యోతిని తీసుకుని అంతర్జ్యోతి వైపు మనం ప్రయాణం చేయాలి. ఇదిగో ఇంతవరకు నేను వెలిగించగలిగాను, లోపల దాన్ని వెలిగించవలసిన బాధ్యత నీదే" అని ఆయనకి చెప్పి ఇక్కడ కూర్చుంటాం. కనుక ఈ దీప ప్రకాశనం అంటాం. ఆ ప్రకాశనం చేసినట్లుగా "ఇదిగో ఈ ఆత్మవిద్యను తీసుకుని నచికేతసుడు ఈ లోకంలోకి వచ్చి మళ్ళీ పరమాద్భుతమైనటువంటి అధ్యాత్మ విద్యా విధానాన్ని, ఆత్మను గురించిన విచారణని తన తండ్రితో పాటు కొన్ని వేల మందికి ఆ ఉపాయనం చేశాడు. ఆ తర్వాత కాలగమనంలో ఇతిహాసాలు వచ్చినాయి, భారతం వచ్చింది. వీటన్నింటికంటే ముందు ఆదికావ్యమైనటువంటి రామాయణం వచ్చింది. రామాయణం వచ్చినప్పుడు ఆ రామాయణంలో రాములవారు రాజు కాబోయే సమయంలో ఒక రధాన్నిచ్చి "లోకాన్ని చూసిరా రామా" అని దశరథుడు పంపితే లోకమంతా తిరిగొచ్చి "ఏముంది ఈ లోకంలో? నాకీ లోకమంతా దుఃఖారామంగా ఉంది, ఎక్కడా ఆనందమే లేదే, ఎందుకు నేను ఇక్కడికొచ్చాను?" అన్నాడు రాముడు. అప్పుడు వశిష్టుల వారికి అర్థమైంది. సాక్షాత్తు పరబ్రహ్మ మూర్తి అయినటువంటి నారాయణుడు రాముడై వచ్చి "ఏముంది ఇక్కడ?" అని గనక అంటే కథ నడిచేదెట్లా? రావణ వధ జరిగేదెట్లా? ధర్మసంస్థాపన జరిగేదెట్లా? సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన భారతీయ సంస్కృతి విలసనం జరిగేదెట్లా? అని ఆలోచించి అప్పటికప్పుడు పన్నెండేళ్ళ రాముడి దగ్గర కూర్చొని రెండు వందల, ఆనాటి కాల ప్రమాణం ప్రకారం, రెండు వందల ఎనభై సంవత్సరాల వయస్సున్నటువంటి వశిష్టులవారు పక్కన కూర్చొని చక్కగా మాట్లాడారు. మాట్లాడి మనస్సు యొక్క మర్మాన్ని చెప్పారు. అదే యోగవాశిష్టంగా వచ్చింది. దానినే వశిష్ఠ గీత అన్నాం. ఆ వశిష్ఠ గీత భగవద్గీత కంటే ఒక యుగం ముందు వచ్చినటువంటి గీత. దానిలో మనస్సు యొక్క మర్మం, ఇవాళ మానవుడు ఉన్నాడు, మనందరం ఉన్నాం. ఒక్క క్షణం చాలా ఆనందంగా ఉంటాం, ఎందుకున్నామో తెలీదు. మరో క్షణం గుబులు పడతాం, దుఃఖంగా కూరుకుపోతాం, దిగులు పడిపోతాం, ఎందుకో తెలీదు. ఈ రెండూ శాశ్వతం కాదని తెలిసినా దుఃఖం వస్తే దుఃఖం అనుభవిస్తున్నాం, సుఖం వస్తే సుఖం అనుభవిస్తున్నాం. ఏదో కావాల్సింది చేతికి దొరకగానే దాన్ని ఆనందము అనుకుంటున్నాం. కానీ నిజమైన ఆత్మానందాన్ని మాత్రం పొందలేని స్థితిలో జీవుడు ఉన్నాడు గనుక ఈ వశిష్ఠ గీత లేదా యోగవాశిష్ఠము లేదా యోగవాశిష్ఠ మహారామాయణం అనే పేరు మీద ఆత్మను గురించిన విచారణ కొంత జరిగింది. కానీ యోగవాశిష్ఠంలో ఆత్మ గురించిన విచారణ ఒక five percent అనుకున్నట్లయితే ninety five percent మనస్సును గురించి ఉన్నది. కాబట్టి తొంభై ఐదు percent మనస్సును గనక మరంమత్తు చేసుకుంటే మిగతా పనులన్నీ చక్కగా సజావుగా సాగిపోతాయి. కాబట్టి ఆ యుగము అయిపోయింది. ద్వాపర యుగం వచ్చింది, ద్వాపర యుగం వచ్చింది కృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా లీలాకాండ చేశాడు, మహిమాకాండ చేశాడు, ఆనందతాండవం చేశాడు, భారతమంతా ఆక్రమించి లౌకిక కృష్ణుడిగా ఉన్నాడు, భాగవతమంతా ఆక్రమించి ఆ భగవంతుడిగా ఉన్నాడు. కానీ ద్వాపర అంతం కాబోయే ముందు జరగబోతున్నటువంటి మహాభారత సంగ్రామ వేళ ఆయన ఎంచుకున్నటువంటి కార్య స్థలం చూడండి. జ్ఞానోపదేశం చేయటానికి అంతఃపురాల్లోకి వెళ్ళలే, అడవుల్లోకి వెళ్ళలే. మానవుడి మనస్సులో ఎక్కడ స్పర్ధ జరుగుతున్నదో, యుద్ధం జరుగుతున్నదో, కౌరవులు అనబడేటువంటి నూరు వ్యతిరిక్త భావాలు, మంచి భావాలు కేవలం ఐదే ఉన్నాయి. ఈ రెండింటి మధ్య యోగీశ్వర కృష్ణుడిగా తనను తాను నిలబెట్టుకొని ఆ యోగీశ్వర కృష్ణుడు యుద్ధ ఆరంభ వేళ మహాభారతం సంగ్రామం జరగటానికి కొన్ని క్షణాల ముందు శ్రీమద్భగవద్గీతని ఇచ్చాడు. ఎవరికిచ్చాడు? అంతరించబోతున్న ద్వాపర యుగానికి మాత్రం కాదు, ఎందుకంటే ఆ తర్వాత అది ఉన్నది చాలా తక్కువ కాలం. అవతరించబోతున్న కలియుగానికి భగవద్గీతని ఇచ్చాడు. ఎందుకంటే ఈ యుగం దేవుడు లేడు అంటూ ప్రారంభమయ్యే యుగం. దేవుడు కనపడనివాడు దేవుడు, కనపడ్డ వాడు కూడా దేవుడనని వేదాంతం చెప్తూ ఉంటే మనిషిలా ఉన్నవాడు దేవుడెలా అవుతాడు అని. అంటే మానవుడి యొక్క ఊహలో దైవం యొక్క స్వరూపం వేరు, దైవం యొక్క గుణం వేరు, దైవం యొక్క శక్తి వేరు. కానీ అన్ని శక్తులు తీసుకుని మానవ దేహం తీసుకునే భగవంతుడు గురువుగా, అవధూతగా లేదు ఒక అధ్యాత్మ షట్చక్రవర్తిగా అనేక రీతుల్లో ఈ జగత్తులోకి వస్తాడు గనుక అట్లా వచ్చినటువంటి అనేక అవతారాలలో పూర్ణ కృష్ణ చైతన్యమే చాలా ప్రధానమైనది గనుకనే ఆయన భగవద్గీతని మొదటి ఆరు అధ్యాయాలు కర్మయోగంగా, మధ్యలో ఉన్న ఆరు భక్తియోగంగా, చివరి ఆరు కర్మయోగంగా. మానవ జీవితం కూడా అంతేమనం తొంభై ఆరేళ్లు మన పూర్ణాయుర్ధాయం తొంభై ఆరేళ్లలో మొదటి ఆరు కాండాలు-- ఆరు కాండంలో మొదటి రెండు కాండలు కర్మయోగం సంపాదించాలి, సంపదని పెంచాలి, సంసారాన్ని వృద్ధి చేయాలి, ప్రాపంచిక లౌకిక భౌ-భౌతికమైనటువంటి విషయాలన్నీ జయించాలి, నడపాలి, గడపాలి, వాటి రుచి తెలియాలి, కడగా ఏం లేదు అని తెలుసుకోవాలి. అసలు అనుభవించకుండా దీంట్లో ఏమీ లేదు అనటానికి లేదు గనుక కర్మకాండ ఉంది. మరి ఈ మనస్సుని దేని మీద లగ్నం చేయాలి అంటే భగవంతుడి యొక్క ఒక రూపాన్ని సంతరించుకొని, ఒక భావాన్ని అనుభవంలోకి తెచ్చుకొని, ఒక గుణాన్ని ఆపాదించి, ఆయన యందు నా మనసు భక్తితో నిలబడింది అని గనుక ఉన్నట్లయితే మనం ఆయనకి కట్టుబడి ఉంటాం. పొరపాటు చేయం, పాపం చేయం, చేస్తే అమ్మ నా తండ్రి, నా గురువు భగవంతుడేమన్నా చేస్తాడేమోనని భయం వల్ల చేయం కాబట్టి ఇది రెండవది అయిపోతుంది. నిజమే మంచి పనులు చేశాను, మంచి భక్తుడిగా ఉన్నాను మరి అసలు నేను ఎందుకు వచ్చాను ఈ ప్రపంచంలోకి? ఇదిగో ఇట్లా సంపాదించడానికైనా? సంపద వృద్ధి చేయటం కోసమేనా? కీర్తి సంపాదించటం కోసమేనా? మరి అసలు ఎందుకు వచ్చానంటే అన్ని శబ్దాలు పుట్ట నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితం. నారాయణున్ని అన్వేషించడానికి వచ్చినటువంటి జన్మే బృహత్తర మహత్తరమైనటువంటి మానవ జన్మ గనుక, ఈ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ, భగవద్గీత అంతా చదవండి, ఏడు వందల శ్లోకాలు పుక్కిట పట్టండి, కొన్ని వేల జ్ఞాన యజ్ఞాలు చేయండి, అతి విశేషమైన రెండు భావాలు గ్రహించాలి. ఒకటి ఎక్కడా కూడా ఒకే ఒక్క చోట మాత్రం తప్ప అన్ని చోట్ల ఆయన భగవాన్ ఉవాచ అని చెప్పాడు. శ్రీ కృష్ణ ఉవాచ అనే మాట ఆయన వాడలేదు. అంటే కృష్ణుడుగా దేహం, దేహానికి పెట్టబడిన పేరది. కనుక ఒకే ఒక్క చోట మధుసూదన ఉవాచ అని మాత్రం వాడాడు. మరి అన్ని చోట్ల వాడకుండా ఇక్కడ మాత్రమే ఎందుకు వాడాడు అంటే ఆ మధువు అనబడేటువంటి రాక్షసుడు మన యందు అన్ని నాడులలో అణువణువులో కూడా ఉంటాడు గనుక వాణ్ని సంహారం చేయడం కోసమే నేను భగవద్గీత చెప్తున్నానని మధుసూదన ఉవాచ అని మొదలుపెట్టి, ఒకే ఒక్కసారి వాడి తర్వాతంతా ఎక్కడా శ్రీ కృష్ణ ఉవాచ అని వాడకుండా భగవాన్ ఉవాచ. ఆ భగవాన్ అంటే భా అంటే వెలుగు, గ అంటే జ్ఞానము. వెలుగు జ్ఞానము రెండూ జమిలిగా కలిసి ఉన్నటువంటి వాడు భగవాన్. అటువంటి వాళ్ళు ద్వాపర యుగంలో మొట్టమొదటి భగవాన్ ఎవరు అంటే భగవాన్ వ్యాస మహర్షి. అది కృష్ణాంశలో వచ్చింది. రెండవవారు కృష్ణ భగవానుడు. అయితే ఇవాళ లోకంలో కాస్త ఆధ్యాత్మికంగా నాలుగు ప్రసంగాలు చేయగలిగిన వాడు కూడా భగవాన్ పదం వాడుతున్నాడు. అలా వాడకూడదు, అది మహాపాపం. మనం వ్యాసులవారంతటి వారైతే, కృష్ణుడంతటి వారైతే, ఆయనకున్నటువంటి ఆ జ్ఞాన శక్తి మన దగ్గర ఉంటే, లోకం గనుక అంటే అప్పుడు అంగీకరించవచ్చు. కానీ జ్ఞాని అయిన వాడు దానిని కూడా అంగీకరించడు. కనుక ఈ భగవాన్ శబ్దం అది ఆత్మకి సంకేతం కాదు. ఇక భగవద్గీత ప్రస్తావన ఎందుకంటే అహం నేను, నేను, నేను అని వాడుతుంటాడు. కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఆ నేనుని కృష్ణుడికి మనం ఆపాదించాం. కానీ కృష్ణుడి భావం అది కాదు. నేనుగా కనిపిస్తున్న ఈ నేను కాదు, కృష్ణుడుగా కనిపిస్తున్నది మేను, శరీరమే. కానీ ఈ మేను లోపల అసలు నేనున్నది అది అధ్యాత్మ చెప్తున్నదని, ఆ ఆధ్యాత్మికమైన ఆత్మ భావన గురించి చెప్తూ అది నీట నానదు, నిప్పున కాలదు, కూలదు, తూలదు, వంగదు, లొంగదు, పొంగదు, ఎట్టి పరిస్థితులలోనూ కుంగదు అని చెప్తూ ఆత్మ యొక్క స్వభావాన్ని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ద్వాపర అయిపోయింది. కలియుగం ఇదిగో వచ్చింది. బౌద్ధం వచ్చింది. నీలోనే పరమాత్మ ఉన్నాడని ఆయన సత్యం చెప్పాడు. నాలోనే భగవంతుడు ఉన్నాడని అన్నాడు గనుక నేనే భగవంతుడిని అనుకున్నాడు మనిషి. కొన్ని దశాబ్దాలు సాగిపోయింది. ఈ దేశం నిరీశ్వరవాదానికి లోబడింది. దేవుడు లేడు అన్న భావన ప్రబలిపోయింది. దేవాలయాలు మూతపడిపోయినాయి. ధూపదీప నైవేద్యాలు పోగొట్టుకున్నది ఈ జాతి. హైందవం నెమ్మదిగా వెనక్కి వెళ్లిపోయింది. నిరీశ్వరవాదము, నాస్తికవాదము, చార్వాక వాదము వచ్చినాయి. ఆ సమయంలో సాక్షాత్తు జ్ఞానాదిత్యుడు అయినటువంటి పన్నెండు సూర్యులలో ఒకడు, సాక్షాత్తు శంభువు అంటే పరమేశ్వరుడు మళ్ళీ శంకరాచార్య రూపంలో ఈ జగత్తులోకి వచ్చి, అందుకే వారిని ముందే ప్రస్తావన చేశాం. శంభోర్ మూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా. ఆ శివుడు ఎక్కడుంటాడో, ఆ కైలాసం ఎక్కడో మనకు తెలియదు గానీ, ఆయనే మానవ దేహం తీసుకుని ఈ జగత్తులో శంకరాచార్య రూపంలో సంచారం చేశారు అన్నప్పుడు కేవలం మూడు సంవత్సరాల వయస్సులో వారు వేదాలు మొత్తం ఆయన నోటికి వచ్చినాయి. వచ్చినయి ఏమిటి ఆయన వేద స్వరూపం. సరే కాలడి నుంచి కేదారం వరకు ఆయన సాగించినటువంటి ఆధ్యాత్మిక ప్రస్థానం ముప్పై రెండేళ్లకు మాత్రమే పరిమితమైంది. ఈ ముప్పై రెండేళ్లలో నా-నూట నలభై మూడు భాష్యాలు రాశారు, ప్రకరణాలు రాశారు, వేద వేదాంత డిండిమలను బద్దలు కొట్టారు. ప్రపంచంలో పాదుకొని ఉన్నటువంటి అనేకమైనటువంటి విపరీత, వ్యతిరిక్త, అసామాజిక, అనాగరిక, అస్పష్ట భావాలన్నింటికీ కూడా ఒక స్పష్టతని, ఒక రూపాన్ని, ఒక స్ట్రక్చర్ ని మనకి అనుగ్రహించి స్తోత్రాలు, అలాగే అనేకమైనటువంటి కావ్యాలు, అనేకమైనటువంటి దేవీదేవతల పరమైనటువంటి భావాలు ఇవన్నీ కూడా ఇచ్చి భారతీయమైనటువంటి సనాతనమైనటువంటి వాంగ్మయానికి ఆయన ఒక స్వరూపంగా నిలబడ్డారు గనుక, అందుకనే మీకు శంకర భగవత్పాదులు స్థాపించిన ఆమ్నాయ పీఠాలలో శారదాదేవి ఉంటుంది.గుడి మాత్రం శివుడు మరి శివుడి పక్కన పార్వతి ఉండాలి కదా మరి సరస్వతిని ఎందుకు పెట్టారు అంటే పెట్టిన వారే సరస్వతీ స్వరూపం గనుక ఒకటి ఇక రెండవది దశ మహా విద్యలలో సరస్వతీ దేవికి ఉన్నటువంటి పేరు తాంత్రిక సరస్వతీ అని పేరు ఇదిగో ఇవాళ మనం వినగలిగిన ఒక వ్యక్తి అనగలిగిన తాంత్రికమైన సరస్వతీ లోపల గనక లేకపోయినట్లయితే తంత్రము లేకపోతే యంత్రము పనిచేయదు. ఈ తంత్రము యంత్రము నడవాలంటే మధ్యలో మంత్రము ఉండాలి. ఇది ఏవో కులానికో మతానికో చెందింది కాదు మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడి దేహము మంత్రాత్మకము తంత్రాత్మకము అది యంత్రాత్మకము కాబట్టి ఇక్కడ ఈ అహం అనేటువంటి మాట నేను అనేటువంటి మాట లేదా ఆత్మ అనేటువంటి మాట కృష్ణ పరమాత్మ కేవలం అహం అనేటువంటి ఒక పదంతో వాడితే ఆ తర్వాత శంకర భగవత్పాదులు వచ్చి ఆత్మ బోధ చేశారు. దేవాలయాలకు వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి ఉపాసనా మూర్తుల్ని ఇలా స్తోత్రం చేయండి లేదా జపం చేసుకోండి మీ లేదా చదువుకోండి విచారణ చేయండి ఇవన్నీ కూడా చెప్పారు చెప్తూ వస్తూనే వారు ఏం చెప్పారంటే చిట్టచివర మాట ఇది చాలా గంభీరమైన మాట వారు రెండు విషయాలు ఈ ప్రపంచానికి అప్పజెప్పారు. వాటిని మనం అనుసరించాలి దక్షిణామూర్తి స్తోత్రం ప్రవచనానికి పరిమితం చేయకండి అది మీరు పెండాల్స్ లోనో ఎక్కడో తెలియని వాళ్ళ మధ్య చెప్పే విషయం కాదు. తత్వమసి అనేటువంటి స్థాయికి వెళ్ళిన వాడికి మాత్రమే దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి అన్నారు. అది అంటే ఆ స్థాయికి మనిషి ఎదిగిన తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం అర్థమవుతుంది ఇప్పుడే మొదటి రోజునే దక్షిణామూర్తి స్తోత్రంతో మొదలుపెట్టి నాకవన్నీ తెలుసు అని చెప్పడానికి కాక ఎవరికి తెలియబడవలసి ఉన్నదో ఇంకా తెలుసుకోవటానికి కొసరంత పిసరంత మిగిలిందో వాడికి గనుక దక్షిణామూర్తి స్తోత్రం చెప్తే వారికి అన్ని విధాలా ఫైన్ ట్యూనింగ్ అంటాం అది జరిగి ఇక ఈ నాలెడ్జ్ వైపు వాడు రాడు. ఈ మాట్లాడుతున్నది అంతా కూడా విజ్ఞాన భూమికకు చెందింది జ్ఞాన భూమికకు చెందింది కాదు ఇప్పటిదాకా చెప్పింది అంతా సరే శంకర భగవత్పాదులు చెప్పిన రెండవ పదం ఏంటంటే ఇంత చెప్పి మీరు ఏం అనుకోకండి ఆత్ అంటే ఏమీ మా అంటే లేదు ఏమీ లేదు అదే ఆత్మ అన్నారు కానీ ఆత్మను పట్టుకోమన్నారు ఆత్మసాక్షాత్కారం అయిందన్నారు ఆత్మవిద్యను నేర్చుకోమన్నారు మరి మీరే ఏమీ లేదంటున్నారు అంటే నీవు అనుకుంటున్నట్లుగా అది ప్రత్యేకంగా లేదు ఉన్నదంతా బ్రహ్మమే సర్వం ఖల్విదం బ్రహ్మ నీవు నిజానికి ఆత్మ అనేటువంటి పరాప్రకృతిలో ఈ సమస్తమైన కంటికి కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా కూడా ఆత్మే కనుక నీవు దాని యందే ఉన్నావు తెలియటం లేదు. మాయ వలన అహంకారం వలన శాస్త్రాలు చదివినందువలన కలిగే కొద్దిగా అభిజాత్యం వలన నేను ఓ చాలా చదివాను అనుకున్నందువలన నిన్ను నీవు మరిచిపోయి అన్నీ వెతుకుతున్నావు అంతటా వెతుకుతున్నావు అది ఉన్నదంతా ఆత్మే దానికి వేద ప్రామాణికమైన మాట సర్వం ఖల్విదం బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ అయిపోయింది. బానే ఉంది కొంతకాలం గడిచింది శంకర భగవత్పాదులు ఏది అనుగ్రహించారో దాన్ని ఆచరిస్తూ వస్తున్నాం. శైవాలయానికి వెళితే శివ పూజలున్నాయి వైష్ణవాలయానికి వెళితే విష్ణు సహస్రనామం ఉంది శివ సహస్రనామం ఉంది ఒక పక్కన ఓంకార ప్రణవ నాదం ఉంది ఒకవైపు ఏమో గాయత్రీ మహా మంత్రాలున్నాయి. ఇవన్నీ దాటి దాటి దాటి మానవుడి మనసులో ప్రశ్న వేసుకునే వాడి మనసులో ఒక్క ప్రశ్న మాత్రం మిగిలింది సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నారు శంకర భగవత్పాదులు బానే ఉంది ఆ సర్వంలో నేను కూడా ఉన్నాను కదా నేనుగా ఉన్నాను కదా మరి నాలో ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది? ఇది ప్రశ్న ఇది చెప్పగలిగినటువంటి వాడు ఎవరు? మనసు ఎక్కడ ఉన్నది అని మనల్ని ఎవరైనా అడిగితే మనసు ఉందని తెలుసు గాని అది ఎక్కడుందో మాకు తెలియదంటాం. బాధ కలిగితే కన్నీళ్లలో ఉంది ఆనందం కలిగితే కళ్ళ మెరుపులో ఉంది సంపద సంపాదిస్తే తృప్తిలో ఉంది ఎవరికన్నా సేవ చేస్తే కలిగిన ఆనందంలో మనసున్నది ఎవరినన్నా బాధించిన దానిలో మనసున్నది కానీ శరీరంలో మనసు ఎక్కడ ఉన్నదో తల వెంట్రుక చిట్టచివరి కొస నుంచి కాలి చిటికెన వేలు గోరు చివరి వరకు మనసు ఆక్రమించి ఉన్నది. కాబట్టి మనసుని చూసిన వాడు లేడు అనుభవించిన వాడే తప్ప. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత వేదాంత భూమికలో మనం చాలా స్థిమితంగా నిలకడ చెందినా సర్వ శాస్త్రాలు కైవసమైనా దేని మీదైనా వ్యాఖ్యానం చేయగలిగినా మనసు ఒక్కొక్కసారి కుంగదీస్తుందే ఎందుకని అని ప్రశ్నించినప్పుడు వాడికి దానికంటే ఉదాత్తమైన ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి ఆత్మ ఒకటి తన యందు ఉన్నది అని తెలియదు కనుక అందువల్లే ఆత్మ ఉన్నది ఆత్మను ఎరిగిన వాడు దుఃఖ పడ్డు ఆత్మ భావనలో ఉన్నవాడికి సుఖం దుఃఖం రెండూ ఒకటే పగలు రాత్రి ఒకటే మాన, అవమానాలు రెండూ ఒకటే జనన మరణాలు రెండు కూడా ఒకటే కాబట్టి మరణ భయం పోవాలి అంటే ఆత్మ విచార మార్గంలోకి రావాలి ముందు ఈ ఆత్మ ఎక్కడ ఉన్నదో మనకు తెలియాలి కనుక అది చెప్పటానికి వచ్చినటువంటి ఒక మహా చైత్య పురుషుడు ఎవరంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి అంద-
YouTube · audio
Bhagawan Sri Ramana Maharshi Vybhavam Part I
Bhagawan Sri Ramana Maharshi Vybhavam Part I
Source: P V S on YouTube
0:00 / 31:31
More in this series