Skip to content
Transcript తెలుగు
నాముతో పెట్టుకున్నాడు అంటే ఒక రాయి అరగదీసి పెట్టుకున్నాడు. అంటే భోగంలో ఉండవలసిన శ్రీరామచంద్రుడు యోగిగా ఉన్నాడు రామయోగి వలె ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ఆయన రాజు కాదు, రాజుల్ని చేశాడు ఆయన గురువు. గురువు ఏం చేశాడంటే భోగాన్ని ప్రపంచానికి చూపించాడు సౌందర్యం కాబట్టి. జిహానం జిహానం సుజానేన మౌథ్యం దుహానం దుహానం సుధాం వేణునాదైహి లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమేతన్ నమస్తాత్. ఇది కృష్ణ పరమాత్మ ఆయన ఏం చేశాడు కస్తూరి తిలకం ఎక్కడ? లలాట ఫలకే, వక్షఃస్థలే కౌస్తుభం అవన్నీ పక్కన పెడితే ఆయన నాముతో పెట్టుకోలే, కస్తూరిని తిలకంగా పెట్టుకున్నాడు. మృగమదం అది. మృగమదాన్ని పెట్టుకున్నాడు. ఇది సౌందర్యంలో ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువు అది. The at most costliest and beautiful cosmetic. దాన్ని కృష్ణుడు వాడుకున్నాడు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఆజ్ఞాచక్రం దగ్గర దాన్ని ధరించారు చెప్పుకోవాల్సింది అది. ఎందుకని అంటే వారు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చారు. ప్రపంచాన్ని ఉద్ధరిస్తూ ఉద్ధరిస్తూ తాము ప్రపంచంలో ఉంటూ, ప్రపంచాన్ని తమలో ఉంచుకోకుండా, ధర్మమార్గావలంబనం చేసి, ఆచరణ చేసి, ధర్మోద్ధరణ చేసి, అరాచకాన్ని, అన్యాయాన్ని, అవిద్యను, అస్పష్టతను, అహంకారాన్ని సమసింపజేసి, ఒక పూర్ణ వికాసమానమైనటువంటి చైతన్యాన్ని ప్రపంచానికి కలిగించాలి కనుక శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రుడు ఇద్దరూ కూడా వైరాగ్య విభూతులను రెండింటినీ కూడా చైతన్యవంతమైన స్థాయిలో తీసుకువెళ్లారు గనుక వాళ్ళిద్దరూ నామధారణ చేశారు. తిలకధారణ అంటే నామధారణ బొట్టు పెట్టుకోని జ్ఞానులు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు? విచారణ చేసినట్లయితే భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆయన జీవిత కాలంలో ఎప్పుడో ఒకటి రెండు సందర్భాలలో ఎవరో తెచ్చి కుంకుమ ఇస్తే వారిని కాదనలేక, విభూతి ఇస్తే వారిని సంతృప్తి పరచాలని పెట్టుకున్నారే తప్ప వారు పెద్దగా నా-తిలకధారణ చేసిన సందర్భాలు లేవు. మరి ఆయన ఎందుకు పెట్టుకోలేదు? అంటే ఆయన ధర్మ మార్గాన్ని అనుష్ఠానం చేస్తూనే జాతిని జ్ఞాన మార్గం వైపు నడిపించాలి గనుక ఇవన్నీ దాటినటువంటి స్థాయికి జీవుడిని తీసుకు వెళ్లటానికి ఆయన ఒక ప్రతీక, ఆయన ఒక symbol. కనుకనే భగవాన్ కి బొట్లు మనం పెట్టకూడదు. ఆయన దానికి అతీతమే. రామకృష్ణుల ఇద్దరూ వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళు అతీతులే కానీ ప్రాపంచికమైనటువంటి ఒక ధర్మాన్ని, లోకాన్ని ఉద్ధరించాలి. అధర్మం ధర్మానికి గాని జరిగినప్పుడల్లా తమను తాము సృష్టించుకొని వచ్చినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపాలు గనుక వాళ్ళు చక్కగా లోకంలో మనకి ఒక ఉదాహరణ ప్రాయంగా నిలిచారు. నిజానికి [ఆ] రాముడికి తిలకం అక్కర్లేదు, కృష్ణుడికి అక్కర్లేదు. ఎందుకంటే వారిద్దరూ కూడా పూర్ణాద్వైతమైనటువంటి పురాణ పురుషులు. సాక్షాత్తు భగవద్ రూపాలవి, పూర్ణావతారాలు. భగవాన్ రమణులు కాస్త భిన్నం. భిన్నమైనటువంటి స్థాయిలో ఒక వైరాగ్యాన్ని, ఒక విభూతిని, ఒక ఆనందాన్ని, ఒక పరమానందాన్ని ధ్యాన మార్గంలో సరళంగా చేయండి. సరళమైనటువంటి మార్గాన్ని ఎంచుకోండి. ఎడతెరిపి లేనటువంటి ధ్యానిగా ఉండండి. నిరంతరము బ్రహ్మము నందు రమించండి అని చెప్తూ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఏడవ శ్లోకాన్ని చాలా critical ఇది. ఇది అర్థం కాకపోతే తర్వాత ఉపదేశ సారం అర్థం కాదు. కనుక ఆర్జ్య ధారయా శ్రోత సాసమం సరళ చింతనం విరళ తత్పరం. నీలారవింద సుహృద సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయయ బాంధవీన బ్రాహ్మణ్యం స్థితో తుపితరం వటమూల వాసం సంస్మారయంతమచలం తమనుస్మరామి. భగవాన్ శ్రీ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఏడవ శ్లోకంలో ఆర్జ్యధారయా శ్రోత సాసమం సరళ చింతనం విరళ తత్పరం అంటూ సరళ చింతనే అత్యున్నతమైనటువంటి ధ్యాన మార్గం. సరళ చింతన, చింతన నేనెవరు? కదా. చింతన అన-అనటంలోనే నేనెవరన్న ప్రశ్న. నేను ఎవరో తెలియని తనం, నేను ఎవరో తెలుసుకోవాలన్న ఆతృత. ఇది సాధనా మార్గం. ఇక అది సరళంగా ఉండాలి. ఎత్తుపల్లాలతో గజిబిజిగా ఉంటే మనల్ని మనం తెలుసుకోలేం. మన స్థితిగతులు తెలుసుకోవాలంటే గజిబిజిగా ఉండాలి. ఇవన్నీ ప్రాపంచికం. అలౌకికమైనటువంటి ఒక భావనా స్థితిలోకి మనం వెళ్ళాలి, మనల్ని మనం తెలుసుకోవాలి, ఎరుకలో ఉండాలి అని గనుక అనుకున్నట్లయితే consistent continuous uninterrupted contemplation ఏదైతే ఉన్నదో దానికి ధ్యానం అని పేరు పెట్టుకోమన్నారు.అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అని శంకర భగవత్పాదులు ఇంతకుముందే చెప్పారు మనకి. పరమానందదాయిని ధ్యానం. ఆనందాన్నివ్వాలి, రుణాలు పోగొట్టటం, రోగాలు పోగొట్టటం కాదు. వాటన్నింటినీ ఎదుర్కోగలిగిన ఆత్మ స్థైర్యాన్ని, మనో నిబ్బరాన్ని, మనో నిగ్రహాన్ని అనుగ్రహించాలి. ఇక్కడ సరళ చింతన ఏర్పడినప్పుడు అజ్ఞా చక్రం దగ్గర జరిగేటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. అజ్ఞా చక్రం దగ్గర దృశ్యాలు కనిపిస్తాయని, దర్శనాలు అవుతాయని, దర్శనాల వలన ఏదో జరిగిందని తృప్తి పడతామని, మనకేవో సిద్ధులు ఏర్పడ్డాయని, కదలకుండా అన్నీ చూడగలిగిన ఒక స్థితి మనకు ఏర్పడిందని, అది మాత్రమే నిజమైన ధ్యానం కాదని చెప్తూ సరళమైన, సూటి అయిన, గంభీరమైన, ఉదాత్తమైనటువంటి ఒక రాజమార్గాన్ని ప్రతిపాదన చేస్తున్నారు భగవాన్ శ్రీ రమణులు. ఏమిటా ప్రతిపాదన? సరళ చింతనం. ఇక్కడ షట్చక్రాల గురించి కాసేపు మాట్లాడుకోవాలి మనం. షట్చక్రాల గురించి గనక తెలియకపోతే సరళ చింతనం అర్థం కాదు. సూటి అయినటువంటి మార్గం ఏమిటో మనకు తెలియదు. సూటి అయిన మార్గాన్ని తర్వాత పాశ్చాత్యులు చాడ్విన్ను, చాడ్విక్కు, కోహెన్ను, పరమహంస యోగానంద, వారు భారతీయులైన పాశ్చాత్య దేశంలో గురుస్థానంలో ఉన్నటువంటి వారు. ఇటువంటి వారంతా కూడా "డైరెక్ట్ పాత్" అని పేరు పెట్టుకున్నారు. భగవాన్ దానికి "డైరెక్ట్ పాత్" అని ఆయన పెట్టలే, మనం అనుకున్నాం. అదే సరళ చింతనం. సూటి మార్గం, సూటిగా వెళ్ళాలి. "తిన్నగా వెదికి తెలుసుకుంటినయ్య" జాగరాజ స్వామి. తిన్నగా వెళ్ళాలి మనం. తిన్నెల మీద వెళ్ళకూడదు. తిన్నగా, సూటిగా వెళ్ళాలి, హాయిగా వెళ్ళాలి. ఇక్కడ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆజ్ఞా చక్రం మీద ధ్యానం చేసినప్పుడు కలిగే అనుభవాలు అవి విరళ-విరల ధ్యానమేనని చెప్తూ ఇక్కడ సూటైన మార్గాన్ని చెప్తున్నారు. వారు చక్రాల గురించిన ప్రస్తావన చేయలేదు. కానీ మన ఎకడమిక్ డిస్కషన్ కోసం ఎనర్జీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, చక్రాలు అంటే ఏమిటి? డిస్కులు కావు అవి. మనకొక వెన్నుపూస ఉంది. వైదాంతికమైనటువంటి పరిభాషలో దాని పేరు వీణాదండం. వీణాదండంలో ఇడా, పింగలా నాడులు మధ్యలో తామరతూడులో ఉన్నటువంటి తంత్రి వలె ఎట్లాగైతే ఒక దార పోగు వలె ఉంటుందో, సుషుమ్నా నాడి కూడా ఉంటుంది. సుషుమ్నా నాడి మూలాధారంలో ప్రారంభమై సహస్రారంలో ఆగుతుంది అని మనకి యోగశాస్త్రం చెప్తున్నది. మూలాధారం అంటే ఏమిటి? అది పృథ్వీ భాగం, అజ్ఞాన భూమిక. కానీ అది ప్రారంభ దశ. అక్కడే ఎవరికైనా ప్రారంభ దశ ఉంది. తొలి అడుగు లేకుండా మలి అడుగు లేదు. మలి అడుగు లేకుండా నడక లేదు, ఆపై పరుగు లేదు. కాబట్టి పరిగెత్తుతున్న వాడికి కూడా మూలం తొలి అడుగే. తొలి అడుగు అక్కడొక బీజాక్షరం ఉంది, దాని పేరు "గం". అలాగే సహస్రారం ఉంది, బ్రహ్మ రంధ్రం అంటాం. అక్కడ ఒక బీజాక్షరం ఉన్నది, "గ". "గం", "గ" కలిపితే "గంగ". అది జ్ఞాన గంగ. జ్ఞాన గంగ ఇడా పింగలా నాడుల మధ్య ఉన్నటువంటిది ఏమిటంటే, అది గంగా, యమునా నదుల మధ్య సాగేటువంటి అంతర్వాహిని అయినటువంటి సరస్వతీ నది. అది జ్ఞానం. ఇవన్నీ ప్రతీకలు. సరే, మూలాధారంలో మనం చెప్పుకునేటువంటి ప్రాథమికమైన అంశాలన్నీ అక్కడే ఉంటాయి. అక్కడే కుండలిని చుట్టలు చుట్టుకొని ఉంటుందని, పడగ తల వాల్చి ఉంటుందని, కానీ నెమ్మది నెమ్మదిగా సాధనా స్థితులు ఏర్పడినప్పుడు నెమ్మదిగా చుట్టలు పులుసులు విప్పుకుంటూ తనను తాను పైకి లేపుకుంటూ స్వాధిష్ఠానం అంటే ఒక్కడుగా ఉన్నది అనేకమవుతున్న సందర్భం అది. అనేకమైన సందర్భం మణిపూరకానికి వచ్చేప్పటికీ అంతా పరచుకున్నటువంటి సందర్భం. అది దాటి అనాహత చక్రానికి వచ్చినప్పుడు ప్రపంచం మనల్ని గుర్తించిన సందర్భం. ప్రపంచాన్ని కూడా మనం గుర్తించిన సందర్భం. ఇది అనాహత చక్రం. సాధకుడైనా, కవైనా, గాయకుడైనా, పండితుడైనా, శాస్త్రవేత్త అయినా అనాహతం దాకా తేలిగ్గా వెళ్ళిపోతాడు. వెళ్ళాలి. ఎందుకంటే నడుస్తున్నాడు కదా! ప్రయాణం చేస్తున్నాడు. బయట ప్రయాణం చేస్తున్నాడు, కొంత లోపల విచారణ జరుగుతున్నది. దాని కారణంగా అనాహతం వరకు వస్తున్నాడు. అనాహతం దాటినప్పుడు, దాటబోయేటప్పుడు ప్రపంచం మనల్ని ఒక విశిష్టమైన వ్యక్తిగా గుర్తిస్తుంది. అది గౌరవిస్తుంది, మర్యాదనిస్తుంది, సన్మానిస్తుంది, స్తుతిస్తుంది, నుతిస్తుంది, కీర్తిస్తుంది. "అయ్యా! మీ అంతటి వారు లేరు." అంటుంది. అనాహతంలో జారని వాడు పట్టించుకోకుండా పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఇంకా దాటవలసినవి ఉన్నాయి కదా! అక్కడితో తృప్తి పొందినవాడు అంటే ప్రపంచం చేత గుర్తింపబడి కీర్తిని అందుకున్నటువంటి వాడు, అది నిజమే అని భ్రమించినటువంటి వాడు అనాహతం దగ్గర ఆగిపోతాడు. మళ్ళీ ఎప్పుడో ఒక జన్మ వస్తే తప్ప అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేడు. ప్రపంచం నన్నేదో గొప్పవాడిని అంటున్నది కానీ, నేనేం కాదు అది. నాకు తెలుసు. నా బలాలు తెలుసు, నా ఇబ్బందులు తెలుసు, నా బలహీనతలు తెలుసు, నా అశక్తులు, అస్పష్టతలు ఇంకా ఉండనే ఉన్నాయి. ఇంకా నేను చేరవలసిన గమ్యం చాలా దూరంలో ఉంది అనుకున్నాడా, విశుద్ధ చక్రం దగ్గరికి వెళ్తాడు. వెళ్లి తన ప్రజ్ఞాపాటవాలన్నీ కూడా ప్రపంచానికి అందించాలి. "ప్రౌఢ: ప్రౌఢనిజానుభూతి: కలిత దైతేంద్రజాలౌ గురు: స్వచ్ఛిష్యబోధయా తత్సత్యమశ్రితావన్" అనేటువంటి భావనలో తాను పొందినటువంటి ఆత్మానుభూతిని మాట ద్వారా, పాట ద్వారా ప్రపంచానికి అందించే ఒక తపన పడతాడు. అది సరస్వతీ స్థానం. అక్కడి దాటిన తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గరికి గనక రాగలిగితే అక్కడ దృశ్యాలు చూస్తున్నవాడు ఆజ్ఞా చక్రం దగ్గర ఆగిపోతాడు. దృశ్యాన్ని దాటినవాడు బ్రహ్మ రంధ్రమైన సహస్రారం దాకా వెళతాడు. ఆరు చక్రాలు సహస్రారము కదలనిది కానీ కదిలించేది. మొదటి ఆరు చక్రాలు కదులుతూ ఉంటాయి. వాటికొక పేస్, ఒక వేగం ఉంది. మన సాధనా తీవ్రతను బట్టి వేగాలు మారుతుంటాయి గనుక ఎనర్జీ సెంటర్స్ అన్నీ కూడా సెన్సిటైజ్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి, అక్కడి నుంచి మనల్ని తీసుకొని వెళుతూ ఉంటాయి.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -24

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -24

Source: TFC Spiritual on YouTube

0:00 / 15:02

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

    Now playing
  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77