No transcript for this section.
Transcript begins at 0:00.
ఎన్నో జన్మల చివర ఎన్నెన్ని రకాలుగానో పుట్టి ఇదిగో ఇక్కడికి వచ్చాం. రోహీశ్వర కృష్ణుడు ఇక్కడికి వచ్చాం అన్న వాళ్ళకి ఏం చెప్పాడంటే "బహూనాం జన్మనామంతే జ్నానవాన్ మాం ప్రపద్యతే" ఎన్నో జన్మలు చాలా ఎత్తినా జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడు అంటే ఏమిటి? అసలు ఈ జన్మ ఎందుకు ఎత్తాము? ఎత్తి వచ్చి ఏం చేసాము? ఎటువంటి పని చేసాము? జీవించినంత కాలం మాత్రమే జీవించబోతున్నామా? మరణానంతరం కూడా జీవించబోతున్నామా? మరణించిన తర్వాత కూడా జీవించిన వాడు అమృత పుత్రుడు అవుతున్నాడు. అంటే వాడికి మృతి లేదు. స్మృతి మాత్రమే ఈ ప్రపంచాన్ని స్ఫూర్తిమంతంగా నడిపిస్తుంది. అటువంటి పరమ ఉదారమైనటువంటి పరమాద్భుత అవతారం భగవాన్ శ్రీ సత్య సాయి. అంటే అవతారం అనగానే ఎవరినో సంహారం చేయడానికి వచ్చినవే అవతారాలు కాదు. వేదోద్ధరణ కోసం శ్రీ మహావిష్ణువు వచ్చాడు. మూడడుగుల నేల తీసుకుంటూ దానవ అహంకారాన్ని తుంచడానికి ఒక అవతారం ఇచ్చి-ఇట్టాడు. కలావతారాలుగా, హంసావతారాలుగా, హర్షావతారాలుగా, ప్రథావతారాలుగా, ప్రసవావతారాలుగా, అనుప్రవేశావతారాలుగా, ఆవేశావతారాలుగా, పూర్ణావతారాలుగా ఎన్నెన్ని అవతారాలు వచ్చినాయి. శ్రీ, మత్స్య, కూర్మ, వరాహ, వటు, నరసింహ ఇవన్నీ ఎంతెంత అవతారాలు. చిన్న చిన్న అవతారాలు. అంటే అవతారం పెద్దది, ఘనమైంది కానీ దాని పరిమాణం, కాలం చాలా చిన్నది. కానీ సుదీర్ఘమైనటువంటి పరిణామ క్రమంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వచ్చేదాకా మానవ రూపంలో అవతార మూర్తులు రాలేదు. అందుకని ప్రప్రథమ మానవ అవతారం, మానవ వేషంలో ఉన్న అవతారం ఏది అంటే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు రావటానికి గల కారణం ఏమిటి అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో శివకేశవులకు భేదం చెప్పబడుతున్నటువంటి సమయంలో శివుడు మాత్రమే ఉన్నాడన్న రావణ బ్రహ్మ విష్ణువు కూడా ఉన్నాడు అన్నటువంటి మిగతా లోకమంతా ఉన్నప్పుడు శివకేశవుల ఇద్దరికీ కూడా భేదం లేదు, ఇద్దరూ ఒకటే. "ఏకమేవా ద్వితీయం బ్రహ్మ" బ్రహ్మమును గురించి, ప్ర-ప్రమాత్మను గురించి రెండు భావాలు నీవు ఉన్నదంటే, రెండు రూపాలు ఉండొచ్చు గాక అని చెప్పడానికి శ్రీ మహావిష్ణువు తన అవతారాన్ని దశగ్రంధరుడి కుతూహలు ఉత్తరించడానికి అంటే రావణ బ్రహ్మను చంపడానికి దశరథుడి ఇంట పుట్టి దశయుగాల వరకు తన నామం వినబడేట్టుగా శ్రీరామచంద్ర నామంతో వస్తామని ఆయన ప్రమాణం చేశాడు. ఆయన చేసిన ప్రమాణం అది. అది రాముడిగా వచ్చాక ప్రమాణం చేయలా, మహావిష్ణువుగా ఉండగా ప్రమాణం చేశాడు. రాముడిగా వచ్చిన తర్వాత లోకమంతా ఆయన్ని ఏమన్నదంటే "నువ్వు దేవుడివి, అతిమానుషమైనటువంటి కార్యక్రమాలు చేశావు నువ్వు. దానవ సంహారం చేశావు, అహల్య సర్ప మోక్షం చేశావు, శివధనుస్సుని చిటికెన వేలితో ఒక రెండు ముక్కలు చేశావు, సేతువు కట్టావు, నువ్వు దేవుడివి కాక ఏమవుతావు?" అని అడిగితే "అదేం లేదు, నేను మానవుడినే, రఘువంశంలో పుట్టాను, క్షత్రియ వంశంలో పుట్టాను నేను, నేను రాజుగా వచ్చాను, నేను మానవుడిగా ఉండటానికే ఇష్టపడి వచ్చాను, నన్ను అట్లాగే ఉంచండి, నన్ను దేవుడు చేయొద్దు" అన్నాడు రాముడు. త్రేతా అయిపోయింది. కృష్ణావతారం వచ్చింది. కృష్ణావతారం వచ్చేప్పటికీ కృష్ణావతారంలో ఉన్నటువంటి సమకాలీనమైనటువంటి జాతి కృష్ణుణ్ణి దేవుడు అని అంగీకరించలేదు. చూశారా, రాముణ్ణేమో అంగీకరించింది. ఆయనన్నాడు "నేను దేవుణ్ణి కాదు" అన్నాడు. "నన్ను వొట్టి మనిషిగా ఆగి ఇట్లా ఉండనివ్వండి" అన్నాడు. కృష్ణుడు ఒక లీలా వైభవం, పరమాద్భుతంగా ఒక అర్ధరాత్రి, అష్టమి నాడు, చరసాలలో అంటే అంధకారంలో మహోత్కృష్టమైనటువంటి జన్మ ఎత్తి సర్వాభరణాలతో పుట్టాడాయన. పుట్టగానే పాపం తల్లి దేవకి "నాయనా! మామూలుగా పుడితేనే నీ మేనమామ బతకనివ్వటం లేదు, ఇట్లా అతిమానుషంగా, లోకోత్తరింగా పుడితే ఇంకొక్క క్షణం కూడా నిన్ను నిలవనివ్వడు. కనుక వెళ్లి ఉపసంహారం చేసుకో, మామూలు బిడ్డవై అక్కడ ఉండు" అన్నది. తల్లి మాట మన్నించాడే. రాముడు తండ్రి మాట మన్నించడు, అడవులకు వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ తల్లి మాట అప్పుడే పుట్టిన మరుక్షణమే, కానీ ఆయన అక్కడ ఉన్నది చాలా తక్కువ సమయం. కానీ అప్పటికే ఆయన భగవంతుడు గనుక దేవకి వసుదేవులిద్దరితో కూడా ఒక మాట చెప్పాడు ఇది భాగవత ప్రమాణం. ఇవన్నీ తెలిస్తే తప్ప స్వామి ఎటువంటి అవతారమో మనకు అర్థం కాదు. అది మనం చూశాం కనుక మన స్వామి మన స్వామి మన స్వామి అంత తేలిక కాదు. అందుకని ఇవన్నీ చెప్పాలి మనం, అనుకోవాలి. "సరే అమ్మా! ఒకానొక జన్మలో నన్ను కృష్ణి గర్భుడు అని పిలిచేవాళ్ళు, అప్పుడు కూడా నువ్వు నాకు తల్లిగా ఉన్నావు. ఆ తర్వాత ఆ సమయంలో నన్ను నారాయణ అని పిలిచేవాళ్ళు. తరువాత వటువుగా వచ్చాను వామనావతారంలో, అప్పుడు మీరు అదితి కశ్యపులుగా ఉన్నారు. అప్పుడు నన్ను మాధవ అని పిలిచారు. మా-ధవ అంటే మా అంటే భూమి. భూమికి తండ్రి అయినటువంటి వాడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు గనుక అట్లా పిలిచేవాళ్ళు. ఇదిగో ఇప్పుడు నన్ను కృష్ణ నామంతో పిలుస్తారమ్మా, నా పేరు కృష్ణుడు" అన్నాడు. ఆయన పేరు ఆయనే పెట్టుకున్నాడు. రాముడి పేరు రాముడే పెట్టుకున్నాడు. అయింది. ఈ మాట చెప్పి మరుక్షణం ఏమన్నాడంటే "నేను తెచ్చినటువంటి యోగ మాయని నీ దగ్గర వదిలిపెడుతున్నాను. నేను నీ తల్లి ఋణం తీర్చుకోవాలి. నీ గర్భాలయం నుంచి నేను ఈ భూమిలోకి ప్రవేశించాను కాబట్టి ఏ యోగ మాయని తీసుకొని వైకుంఠం నుంచి నేను ఇక్కడికి వచ్చానో దాన్ని నీ దగ్గరే ఉంచి లోక సంబంధ కార్యం చేయాలి గనుక లోక మాయని తీసుకొని నేను నుంచి విడిపోతున్నాను" అన్నాడు కృష్ణ పరమాత్మ. ಆಗಾನೇ తలుపులు తెరుచుకున్నాయి, తళాలు ఓపెన్ అయిపోయినాయి, యమునా పాయలు చేరింది, పడుతున్న వర్షం ఆగిపోయింది. ఆ సన్నని వెలుగు దారిలో, ఆ బాటలో ప్రజాభూమికి చేరాడు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ అక్కడికి చేరి యశోదానందరుడయినాడు. దేవకీనందనుడయినాడు, యశోదానందరుడయినాడు. జిహానం జిహానం సుధానేన మౌక్త్యం దుహానం దుహానం సుధాం వేణునాదై, దిహానం దిహానం సువీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమేతన్ నమస్తామ్ అంటాడు లీలాశుకు శ్రీకృష్ణ కర్ణామృతంలో. "ఏమి కృష్ణా! నీకు వసితాం బోధ, వృద్ధాప్యం రాదా? నీ దేహంలో ఈ కాంతి ఎప్పటికీ వర్చేస్సు తగ్గదా? ఏడాదికి ఏడాది నువ్వు ఇంత తేజోమయంగా ఎట్లా ఉంటున్నావు?" అంటున్నాడు. అంతేకాదు "నీ వేణునాదాన్ని నేను పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాను. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తున్నది. ఇక చాల్లే బానే ఉందని అనుకోవటంలా, మళ్ళీ ఎప్పుడు వేణువు వాయిస్తావు?" అని. దుహానం దుహానం సుధా.
YouTube · audio
92th Birthday celebration kukatpally part 2
92th Birthday celebration kukatpally part 2
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 7:26