Skip to content
Transcript తెలుగు
అవతరించె నేడు ఆంధ్రదేశము నందు జగతినుద్ధరింప సత్యసాయి తడుపన్యసింప యావత్ప్రపంచాన దేవభాషయి తెలుగు నేడు స్వామి తరచుగా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ముందుగా ఒకటి రెండు పద్యాలు చదువుతారు. రెండు పద్యాలు స్వామి ఉపన్యాసానికి కీలకమైనటువంటివి ఉండాలి. ఇంతవరకు చదివినటువంటి అనేకమైనటువంటి పద్యాలలో నుంచే మనం గ్రహించి స్వామి యొక్క రూపభావ తత్వార్ధాలలోకి చక్కగా నెమ్మదిగా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం. చూడండి మొదటిగా పద్యం "అంతరాత్మకన్న అధ్యాపకుడు లేడు హరయ కాలమే మీకు పరమగురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే" ఒక వేదసారం ఇది. ఒక ఉపనిషత్ సారం. స్వామి ఏం చేస్తున్నారో తెలుసునా? ఏం బోధిస్తున్నారో తెలుసునా? అంతరాత్మను మించినటువంటి గురువు లేడయ్యా! బోధకుడు లేడు. నీ అంతరాత్మ నీకు గురువుగా లోపల బోధకుడిగా ఉన్నాడు. అంతేకాదు అంతరాత్మని నీవు జాగ్రదవస్థలో, నిద్రావస్థలో, సుషుప్తిలో అన్ని అవస్థలలో గనుక వినగలిగిన శక్తి నీకు ఉన్నట్లయితే "హరయ కాలమే మీకు పరమగురువు" కాలమే అన్ని నేర్పుతుంది మీకు. ప్రత్యేకంగా బెత్తం పట్టుకొని క్లాస్ రూమ్ లో బోర్డు మీద రాసినట్లుగా కాకుండా కాలం నీకు అనేక అనుభవాల ద్వారా, అనేక సన్నివేశాల ద్వారా బోధిస్తుంది. అయితే మరి ప్రత్యక్షంగా ఉన్న లోకం ఏమిటంటే "గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే" ఏం పుస్తకాలు చదవాలి, చదివితే లోకాన్ని చదువు. లోకంలోనే పుస్తకాల్లో నిక్షిప్తమైన పరమ రహస్యాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. అటువంటి ప్రపంచంతో నువ్వు కూడి ఉన్నావు. అయితే పరమమిత్రుడు, పరమగురువు, అధ్యాపకుడు ఉన్నారు గాని స్వామి మాకు స్నేహితుడు ఎవడు అని గనుక మీరు చింతించినట్లయితే "స్నేహితుండెవ్వడు ఈశ్వరుండే" నీకు నిజమైన స్నేహితుడు మైత్రి నెరిపేవాడు ఎవడు అంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుని మించిన స్నేహితుడు నీకు లేడు సుమా! ప్రపంచాన్ని మించిన గ్రంథరాజం మరొకటి లేదు సుమా! నీ అంతర్వాణిని మించిన పరమగురువు లేడు సుమా! కాలాన్ని మించినటువంటి, పరమోత్కృష్టమైనటువంటి బోధకుడు లేడు సుమా! అని ఎంత అందంగా, దివ్యంగా బోధించారో చూడండి. స్వామి ప్రపంచంలో మనం జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని అన్ని ఉన్నా పరమాత్మ అనుగ్రహం మనకు ఎట్లా అక్కరకు వస్తుందో మరొక పద్య సూక్తంలో మనకు చెప్తున్నారు. విందాం. "అనుకూలవతియైన అర్ధాంగి యున్నను తనను పూజించెడి తనయుడున్న తగిన సేవలు చేయు దాసదాసీలున్న గుణవంతురాలైన కోడలున్న అమిత ప్రేమగ జూచు అక్కచెల్లెండ్రున్న తన ఆజ్ఞ పాలించు తనయులున్న మైత్రి నిత్యము Gooru మిత్ర బృందంబున్న తగు అధికారము ఉద్యోగమున్న విశ్వవ్యాప్తిని గాంచు కవిత్వమున్న నవనిధులు మించిన ధనములున్న దైవ ప్రేమయ లేకున్న ధరణి యందు సర్వమును వ్యర్థమైపోవు చనడు వేళ" జీవించి ఉన్నంత కాలం అనుకూలవతి అయిన భార్య, పూజించేటువంటి కొడుకు, సేవలు చేయటానికి దాసదాసీలు, గుణవంతురాలైన కోడలు, అమితమైన ప్రేమను చూపించేటువంటి అక్కచెల్లెళ్ళు, చెప్పిన మాటని వేదంగా భావించి ఆచరించే కొడుకులు, నిత్యము మైత్రి స్నేహం ఇచ్చేటువంటి మిత్ర బృందాలు, అధికారము, ఉద్యోగం, కవిత్వం, పాండిత్యం, నవనిధులను మించినటువంటి ధనం, ఇవన్నీ ఉన్నా దైవ ప్రేమ గనుక లేకపోయినట్లయితే అన్నీ కూడా సున్నా అయిపోతాయి. ఎప్పుడు? చనడు వేళ. మనం ప్రాణం వదిలిపెట్టినటువంటి వేళ. ఇవన్నీ ప్రపంచంలో ఉండగా అక్కరకు వస్తాయి గాని దేహాన్ని పరిత్యాగం చేసి మనం కూడా అవనీ సంచారాన్ని పూర్ణం చేసుకొని శరీరాన్ని వదిలి పెడుతున్నటువంటి వేళ ఏమిటయ్యా నీకు కావలసింది, అక్కరకు వచ్చేది అంటే దైవ ప్రేమయే. అంటే అనిత్యమైనటువంటి వస్తువులలో నుంచి నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక దివ్య వైభోగాన్ని స్వామి జగత్తుకు పరిచయం చేస్తున్నారు. దైవ ప్రేమ గనుక నీకు ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లే. అన్నీ ఉండి గనుక దైవ ప్రేమ ఒక్కటి లేకపోయినట్లయితే వాటి వలన ఏం ప్రయోజనం లేదు. నరుడా జాగ్రత్త! మానవుడా జాగ్రత్త! సాధకుడా జాగ్రత్త! అని స్వామి హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే స్వామి తాను ఎందుకు వచ్చారో, ఎట్లా వచ్చారో, ఎప్పుడెప్పుడు వచ్చారో, అవతారానికి ముందు అనేక అవతారాలను స్వామి స్వయంగా స్పృశించారు. వాటిని స్వామి మాటల్లో, స్వామి చెప్పిన ఒక పద్యంలో మనం గనుక అర్థం చేసుకున్నట్లయితే పరమేశ్వరుడు మానవ దేహాన్నే ధరించి వస్తాడు అని స్పష్టంగా మనకి బోధపడుతుంది. "ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు గుణంబు గణించి ఏతెంచెనో నాడు కరినిగా జడితరి కమలనయనుడు గుణంబు గణించి ఏతెంచెనో నాడు ధ్రువకుమారుని సాక వైకుంఠవాసి"ఏ గుణంబు గణించి తెంచెనో నాడు పేద కృచేలుని బ్రోవ వేద చరితుడు గుణంబె గణించి అమర వంజుడు ఆర్తజనులను పాలింప అవతరించే అనాధ నాధ శ్రీనాధ లోకనాధ సచ్చిదానందమూర్తి పుటపర్తి సత్య సాయి ఎంత అందంగా తాను ఏమిటో చెప్పారు ఏదో ప్రహ్లాదుడిలో ఉన్న ఒక్క గుణాన్ని గణించి రోజున లక్ష్మీనరసింహుడినై వచ్చారు అట్లాగే గజేంద్రుని రక్షించటానికి ఒక గుణాన్ని గణించి నేను శ్రీ మహావిష్ణువునై జగత్తులోకి వచ్చా ధ్రువ కుమారున్ని ఒకే ఒక్క గుణాన్ని గుర్తించి సాకటానికి వైకుంఠవాసిగా నేను వచ్చాను అంతే కాదు పేద కుచేలున్ని బ్రోవటానికి శ్రీకృష్ణ చైతన్యంగా వచ్చాను అటువంటి గుణాన్ని అనేక యుగాలు దాటిన ఏదో ఒక గుణాన్ని మాత్రం నేను గుర్తించి వేళ అమరవంతుడు ముప్పై మూడు వేల కోట్ల దేవతలని ఆనంద పరుస్తూ అనుగ్రహ వరదానం చేస్తున్నటువంటి నేను ఆర్తజనులను పాలించి రక్షించటానికి ఇదిగో ఎట్లా వచ్చానో తెలుసా అనాధనాధుడినై శ్రీనాధుడినై లోకనాధుడినై సచ్చిదానంద గురుమూర్తినై పుటపర్తి సత్యసాయి నై వచ్చాను ఎంత అద్భుతమైన ప్రకటన ఇంకా సాయి దేవుడా అన్న ప్రశ్న ఎక్కడ నేను దేవుడ్నే అని ప్రకటించి ఎట్లా ఎట్లా వచ్చానో స్వామి స్పష్టంగా చెప్తున్నారు దేవుడ్నే అని ప్రకటించటం సాయికి కొత్త కాదు కృష్ణావతారంలో కూడా అసలు నేను దేవుడ్నే అని చెప్పాడు తత్వమే మళ్ళీ ఈరోజున సాయి తత్వంగా స్వామి తన మాటల్లోనే తన నిజ తత్వాన్ని ప్రకటన చేశారు ఆనందాన్ని మనం అనుభవించే దిశగా మన అధ్యాత్మ సాధన కొనసాగిద్దాం ఇదంతా బానే ఉంది స్వామి దేవుడు ప్రపంచం ఒక గ్రంథ రాజ్యం అని చెప్పారు కదా ఇంకో పద్యంలో భక్తుడు ఎలా ఉండాలో స్వామి చెప్తున్నారు అంటే స్వామి ఆవరణంలోకి స్వామి భావనావరణలోకి ఒక జీవుడు ఒక సాధకుడు ప్రవేశించిన తర్వాత స్వామి పరదైవమే అన్న ఎరుక కలిగిన తర్వాత వీడు చేయవలసినటువంటి సాధకుడు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని స్వామి స్పష్టంగా బోధిస్తున్నారు కులమత ద్వేషాలు కులదోయుడటంచు చేయెత్తి బోధనల్ చేయవలయు దీనుల సేవయే దివ్యమార్గమటంచు పలుమార్లు గట్టిగా పలుకవలయు నామచింతన నరున్ నామి సన్నిధి చేర్చి అమృతతత్వమందించు అనగవలయు భక్తి విశ్వాసముల్ బగుగా కలిగిన వారలు మనవారలని వచించు జ్ఞానబోధలు నరులకు చేయు వారు ఇష్టులవుదురు స్పష్టము యెంతయేని భేదభావంబు విడనాడి ప్రీతితోడ కలసి ఉన్నచో సాయికి కలుగు ప్రేమ భక్తులు ఏం చేయాలట అంటే కులమతాతీతమైనటువంటి ఒక దివ్య భవ్య సామ్రాజ్యాన్ని ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని సృష్టించే బోధన చేయమంటున్నారు దీనుల సేవను మించిన దివ్య మార్గం లేదు అంటూ దీనజనోద్ధరణని స్వామి పదే పదే ప్రకటిస్తూ వచ్చారు పరమేశ్వరుడి యొక్క నామాన్ని గనక స్మరిస్తూ ఉన్నట్లయితే నామి అంటే పరమేశ్వరుడి దగ్గరకు చేరుస్తుంది అని చెప్పాలి అది అమృతత్వాన్ని సిద్ధింపజేస్తుంది అంటే మళ్ళీ పునర్జన్మ లేకుండా చేస్తుంది భక్తి విశ్వాసాలు పరమేశ్వరుని యందు ఎవరికి కలిగి ఉన్నారో వారు మనవారులు అని యధార్థతి చెప్పమంటున్నారు స్వామి అటువంటి వారలట స్వామికి చాలా ఇష్టమట స్వామికి మనం ఇష్టులమని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇవన్నీ చేస్తేనే ఇష్టమని అంతే కాదు భేదభావం లేకుండా పెద్దవారు గొప్పవారు చిన్నవారు జ్ఞానులు అజ్ఞానులు పామరులు పండితులు అన్న భేదభావం లేకుండా మనమందరం ఒక్కటే అనేటువంటి స్వామి బోధించే యూనిటీ ప్యూరిటీ డివినిటీ మూడు గనక ఎక్కడ కలిసి ఉన్నాయో వారందరి యందు స్వామికి ప్రేమ కలుగుతుంది అంటే అట్లా అనువర్తించమని స్వామి మనకు బోధ చేస్తున్నారు వేదాంత భూమికలో సర్వం ఖల్విదం బ్రహ్మ అని ఒక భావన అంటే కనిపిస్తున్నదంతా బ్రహ్మమే తప్ప అన్యం కాదు చెట్టు పుట్ట గుట్ట మిట్ట నది కొండా కోన వాగు వంక నేల నింగి నిప్పు అన్నీ కూడా ఇది కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమేనా అని గనక మనం అనుకున్నట్లయితే అసలు బ్రహ్మం అంటే ఏమిటి బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి బ్రహ్మ పదార్థంలో నుంచి బ్రహ్మంలోకి వెళ్ళాలి పదార్థంలో నుంచి పరమార్థం పరమార్థంలో నుంచి యదార్థం ఇది మహా ఒక అందమైన ప్రస్థానం ఒక ఆధ్యాత్మిక ప్రస్థానం దానినే స్వామి సర్వం ఖల్విదం బ్రహ్మ అన్న దాంట్లో చాలా అందమైనటువంటి ఒక పద్యం సూక్తం చెప్పారు ఏమిటది అంటే కనిపిస్తున్న ప్రతిదీ బ్రహ్మమే అని అనుకో ఏమిటి కనిపిస్తున్నది నీకు చూడు చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ తల్లియన్నను బ్రహ్మ మరియు తండ్రి బ్రహ్మ భాగ్యమన్నను బ్రహ్మ వాలభ్యమది బ్రహ్మ జీవరాసులు బ్రహ్మ జీవి బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మ కాలంబు బ్రహ్మ ప్రకృతంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును బ్రహ్మ సభయు బ్రహ్మ.సత్యమును తెలుపు సత్య సాయి బ్రహ్మ స్వామికి మాత్రమే సాధ్యమైనటువంటి ప్రకటన ఇది. ఎందుకంటే బోధించేవాడు మీరంతా బ్రహ్మ పదార్థం అంటాడు గాని తానేమిటో చెప్పడు. అందమైన తెలుగు పద్యంలో చుక్కలు అంటే నక్షత్రాలు చంద్రుడు తల్లి తండ్రి ప్రపంచం మనసు ఊహిస్తున్న కైలాసం వైకుంఠం అన్నీ కూడా బ్రహ్మమయమై ఉన్నాయి కాలమే బ్రహ్మం కర్మలన్నీ బ్రహ్మం ప్రకృతి బ్రహ్మ దీనికి మూలమైన చిచ్ఛక్తి బ్రహ్మ అంతేకాదు మాటలన్నీ వింటున్న సభ బ్రహ్మ అంటే స్వామి ఎలా అవుతారు? అన్ని చెప్తూ అసలు సత్యమును తెలుపుతున్న సాయి కూడా బ్రహ్మంలో భాగమేనన్నారు. అందం అది పరమ రమణీయంగా ఉంటుంది ఎక్కడో లోక లోకాంతర ప్రాణాలలో శ్రీదళాలు వికసిస్తాయి అది స్వామి యొక్క దివ్య బోధ. చూడండి కనిపిస్తున్నదాన్ని అంతటా బ్రహ్మాన్ని చూడగలిగితే దానిని మించిన పూర్ణాద్వైత స్థితి ఉన్నదా? పరిపూర్ణమైన అటువంటి అధ్యాత్మ యోగంలోకి స్వామి ఎంత అందంగా నడిపించారు చుక్క వేరు చంద్రుడు వేరనలేదు అంతా బ్రహ్మమే సర్వం ఖల్విదం బ్రహ్మ అయితే ఇదే స్వామి నేను ఎప్పుడో ఒకసారి స్వామిని చూశాను నాకు ఒక interview ఇచ్చారు ప్రపంచాన్ని నేను కొల్లగొట్టేశాను అని గనుక నువ్వు ఆనంద పడుతుంటే సాయి అంత తేలికగా అర్థమయ్యే సాయి కాదని తన గురించి తాను స్వామి చెప్తున్నారు. అంటే పరమాత్మ అనేకమైన dynamics ని అనేక dimensions ని మనకు పరిచయం చేస్తున్నారు. స్వామిని పరీక్ష చేయటం మానేసి అనుభవించటం గనక మొదలు పెడితే మన అంతరంగం శుద్ధి చెందుతుంది. దానికే రకంగా బోధ చేస్తున్నారో చూడండి ఇది బహుశా అంటున్నా వింటున్న మనందరికీ ఎప్పుడో ఒకరోజున కలిగిన అనుభవమే. [పద్య పఠనం] చెంత చేర నటించు సంతసించెద రన్న వెంటనే ఎడబాటు చింత కూర్చు ఏడిపించుటే సాయి వేడుకందురా కడుపుబ్బన విల్చు నడువ నడుమా పగడుచున్నాడని పొంగిపోయెద రేము తప్పుకు అప్పుడే ఎగతాళి చేయు అభయమిచ్చెను గాన హాయిగా ఉండెద రన్న పడు బాధలకు అంతుపట్టకుండు వెనుకకేగ నీడు తన నీడు ముందుకు మనసు మరులు గొల్పి మదన పెట్టు ఇట్టి చిన్ని సాయి చిన్మయ మూర్తిని ఎటులెరుగ గలరు ఇలను మీరు. స్వామి మాకు ఎప్పుడో అర్థమైపోయారండి ఎప్పుడో మాకు ఆయన దేవుడని తెలిసిపోయింది అన్న వాళ్ళకి ఇది హెచ్చరిక ఇది తొలి హెచ్చరిక సదా హెచ్చరిక. పొగుడారు స్వామి వేళ పొద్దున్నే అనుకుందామా సాయంకాలం కల్లా ఎగతాళి చేస్తా స్వామి is very close to me I am very close to భగవాన్ అని గనక మనం అనుకున్నట్లయితే అంటే స్వామికి నేను ఎంతో సన్నిహితుడిని అని గనక అనుకుంటే ఎంత దూరమో మనకు వెంటనే తెలియజెప్తారు. అభయమిచ్చేసారు ఇంకేం భయం లేదు హాయిగా ఎట్లా కావాలంటే అట్లా ఉండొచ్చు అనుకున్నట్లయితే పడుతున్న బాధ అంతుపట్టకుండా ఉంటుంది స్వామి త్వమేవ శరణం మమ అన్యదా శరణం నాస్తి అనే భావనలోకి స్వామి తీసుకుని వెళతారు. ఎట్లా తీసుకెళ్తారు అంటే ముందుకు పోనివ్వరు వెనక్కి రానివ్వరు. మదన రాచిరంప అని అంటారు చూడండి అలా పెట్టే స్వామి ఎలా మీకు అర్థం అవుతాడు. [పద్య పఠనం] ఇట్టి చిన్ని సాయి చిన్మయ మూర్తిని ఎట్టులెరుగ గలరు ఇలను మీరు. మీరు ఎరుగలేరు అందుకే స్వామి ఎప్పుడో చెప్పారు నన్ను పరీక్షించటం మానేసేయండి first. ఈయన దేవుడా కాదా అని మీ మాంసం అదిరి పెట్టండి నా ఆవరణంలోకి రండి అనుభవాన్ని పొందండి ఆనందాన్ని మూటలు కట్టుకొని వెళ్ళిపోండి అన్నారు స్వామి అనేక ఉపన్యాసాలలో. కానీ జీవుడిగా మన మూటలు మన దగ్గర ఉంచుకోవటమే మనకిష్టం. పరమేశ్వరుడు, జీవుడు, జగత్తు ఏకకాలంలో ఒకేచోట ఉంటాయి అది యుగం కానివ్వండి. జగత్తు ఒక భూమిక, పరమేశ్వరుడు భావనా భూమిక, జీవుడు సాధనా భూమిక. మూడు కలిస్తేనే పూర్ణం. జీవుడు లేక జగత్తు జగదీశ్వరుడు లేడు ఆయన ఆడుకోవాలంటే ఆయనకు ఒక భూమిక కావాలి అది ప్రపంచం. ప్రపంచం లేకపోతే ప్రపంచం ద్వారా ప్రపంచం అనే అద్దం ద్వారా మాత్రమే పరమేశ్వరుని చూడగలం గనుక జీవుడికి ప్రపంచం కావాలి. ప్రపంచానికి జీవుడు కావాలి దేవుడు కావాలి ఎందుకంటే రాలుతున్న ప్రతి ఆకు మళ్లీ చిగురించాలన్నా, మొగ్గ వికసించాలన్నా, కాయ కాయాలన్నా, పండు పండాలన్నా పరమేశ్వరుడి యొక్క దివ్య కృప కావాలి. అలాగే దివ్యమైనటువంటి పరిణామ క్రమాన్ని అనుభవించటానికి జీవుడు కావాలి. ముగ్గురూ సమాన కర్తలు ఇందులో అధికులు లేరు. అందుకే [పద్య పఠనం]ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే ఈశ్వరుడు, గురువు, ఆత్మ మూడు ఒకటే అన్నట్లుగా జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు ఒకటే మూడు స్థితులు అవి. దానిని జీవుడికి సమన్వయం చేస్తూ స్వామి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడో స్వామి చెప్తున్నారు చూడండి. మనం అనుకుంటాం ఎంత సంపాదించాం చిన్న చినుకుగా ప్రారంభమయినాం మహా ప్రభంజనం అయిపోయినాం రూపాయి బిళ్ళ పెట్టాం కోటీశ్వరులం అయిపోయాం అని ఇవాళ అనుకుంటాం. స్వామి మూలంలోకి వెళ్ళమంటున్నారు ఒక వేదాంత భూమికలో వైరాగ్య భూమికను మనకి బోధ చేస్తున్నారు. [పద్య పఠనం] జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలనేవి కానరావు మంచి ముత్యపు సరుల్ మచ్చునకు లేవు మేల్మి బంగారు దండ మెడకు లేదు రత్నాలహారముల్ రంజిల్లగా లేవు పచ్చల కెంపులు పొదగ లేదు వజ్రాలహారముల్ వర్ధిల్లగా లేవు గోమేధికంబులు తోడలేవు కలదు కలదొక్క మాల మీ కంఠమందు ఎన్ని చేసిన అవియన్ని ఎంచి ఎంచి మంచియైన చెడునైన తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నియు చేర్చిన కంఠమాలఇంత అందంగా అవతార పురుషుడు అయినా బోధ చేసాడా? తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చాం? కంఠంలో మాలలు లేవు, దండలు లేవు, ముత్యాల సరాలు లేవు, బంగారు దండలు లేవు, గొలుసులు లేవు, రత్నాల హారాలు లేవు, పచ్చళ్ళు లేవు, గోమేధికాలు లేవు, వజ్రాలు లేవు కానీ ఒక్క మాల మాత్రం ఉన్నదట. మంచి చేశామో చెడు చేశామో పరమేశ్వరుడు కేవలం మంచి ఇవ్వలేదు, కేవలం చెడు ఒక మాల చేయలేదు. నువ్వేం చేశావో కర్మల యొక్క పుణ్యాల మాల, పాపాల మాల రెండు ఎంచి ఎంచి ప్రారబ్ధాన్ని అనుభవించటానికి దానిని మాలగా చేసి గుదిగుచ్చి నీ మెడలో వేసి ఒక బరువు మాలగా పంపాడు. బరువు మాల ఏమిటో తెలుసునా? కర్మలన్నియు చేర్చిన కంఠమాల. కనబడుతున్నదా? అయ్యో! నేను సత్య సాయి భగవానుడికి చాలా ప్రీతిపాత్రమైన భక్తుడినే, నాకెందుకు కష్టాలు వచ్చినాయి అంటే, "నీ కర్మమాల నీది, నీ పుణ్యాలు నీవి, నీ సాధన నీది, నీ ప్రాప్తి నీది, నీ అనుభవం నీది, దాటవలసిన స్థితి నీది" అందుకే యోగీశ్వర కృష్ణుడైనటువంటి పరమేశ్వరుడైన కృష్ణుడు సత్య సాయి భగవానుడి బోధ ఎంత సామీప్యంగా ఉన్నదో చూడండి. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. ఇదిగో నీకు జీవము, జగత్తు, జన్మ ఇచ్చాను. ఎలా వాడుకుంటావో చూసుకో. నీ మెడలోనే ఒక కంఠమాల ఉన్నది. పుణ్యాలున్నాయి, పాపాలున్నాయి. పుణ్యాల వలన ఆనందాన్ని అనుభవించు, పాపాలను పోగొట్టుకునేటువంటి సాధన చేయి. దానికి నేను శరణు. నేనే నీకు అక్కరకు వస్తాను అంటున్నారు భగవాన్. సాధారణంగా స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళిన ప్రతి వాళ్ళు తమ ఇంటికి వెళ్ళి తమ మిత్ర బృందానికి ఒక మాట చెప్తారు. మేము మొట్టమొదటిసారిగా భగవంతుణ్ణి మానవ దేహంతో చూశాం ఒకటి. అసలు స్వామి మాతో ఏం మాట్లాడలేదు గాని దర్శనం ఇస్తూనే అనేకమైనటువంటి ఆనందాలు పొందాం. అంతేకాదు మనం జీవిస్తున్న జీవన విధానం సరిగా లేదు, దీనిని మార్చుకోవాలి అని అనిపిస్తుంది అని భక్తుడికి అనిపిస్తే మార్గ నిర్దేశం చేస్తూ గురు స్వరూపమైన సచ్చిదానంద గురుమూర్తి అయిన స్వామి ఏం చెప్తున్నారో వినండి. ధనము రాసిగ పోసినను కానగరాని ఆనందమిచట మీరు అందుకొనుడి తీర్థయాత్రలు ఎన్నో తిరిగి నన్ కనరాని ఆనందమిందు మీరు అందుకొనుడి విద్యలల్లియు వల్లెవేసి నన్ కనరాని ఆనందమును మీరలు అందుకొనుడి ప్రాణముల్ బిగబట్టినను కానగారాని ఆనందమిందు మీరు అందుకొనుడి కాసు ఖర్చు లేదు కాయ కష్టము లేదు లేదు లేదు లేదు చదువు సాధనాది బాధ మనసొకింత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా. ఎంత అందం అండి పద్యం. మీరు ఏం చేయొద్దు. అనేకమైనటువంటి శాస్త్రాలు చదివాం, మా దగ్గర అపారమైనటువంటి సంపద ఉంది, సంపదతో ఆనందం కొనుక్కుంటాం అంటే మీ వల్ల కాదు. తీర్థయాత్రలు ఎన్నో చేశాను ఆనందం కలిగిస్తున్నది అంటే దాని ఆనందం వేరు. అనేక విద్యలు, అనేక శాస్త్రాలు పుక్కిట పట్టాను కానీ అదిచ్చే ఆనందం కంటే ఇక్కడ పుట్టపర్తికి మీరు రండి. డబ్బుతో పని లేదు తీర్థయాత్రలు చేసిన పుణ్య ఫలాలు అన్నీ, ఆనందాలు అన్నీ ఇక్కడే లభిస్తాయి. ప్రాణాలు విగబట్టి ప్రాణాయామం చేసి, యోగాభ్యాసం చేసి అనేకమైనటువంటి యోగ మార్గాలలో నీవు ప్రయాణం చేసిన కనరాని ఆనందాన్ని మీరు ఇక్కడ పొందండి. కానీ ఖర్చు లేదు, కాయ కష్టం లేదు, చదువు, సాధన అనేటువంటి బాధలు లేవు. మరి ఏమున్నదయ్యా అంటే మనసొకింత ఇచ్చి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా. మీరు చేయవలసింది ఒక్కటే, మీకున్న మనసులో, మనసులో కొంత భాగాన్నైనా, అంతా అనటం లేదు మళ్ళీ స్వామి, కొంత స్వామికి ఇచ్చేసి సాయి కడనున్న, స్వామి దగ్గర గనుక మీరు ఉన్నట్లయితే అంటే భౌతిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక మూడు స్థితులలో స్వామి దగ్గర ఉండాలి. కేవలం సాయి కడనున్న అంటే స్వామి దగ్గరే ఉండమని కాదు. స్వామి మూడు స్థితులలో, ఎందుకంటే అవస్థాత్రయాతీతుడైనటువంటి స్వామి గనుక, దేశకాలಾದ్యవిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ స్వరూపం గనుక, స్వామి లేని ప్రదేశం ఏది అని భావించుకొని స్వామి ఆవరణంలో, భావనావరణంలో గనుక మీరు ఉన్నట్లయితే, కొంత మీ మనస్సును నాకు ఇచ్చినట్లయితే ధనము వలన, తీర్థయాత్రల వలన, అనేకమైనటువంటి కార్యకలాపాల వలన, అనేక విద్యల వలన, అనేకమైన యోగాభ్యాసనాల వలన కలగనటువంటి ఆనందం మాత్రం మీరు గనుక చేసుకున్నట్లయితే మీకు లభిస్తుంది. ఇదిగో మార్గం మీకు సూచిస్తున్నాను అంటున్నారు. అంటే మనం చేయవలసింది ఇవాళ ఒక్కటే, స్వామికి మన మనస్సు అనేటువంటి పుష్పాన్ని ఇచ్చేద్దాం. స్వామి యొక్క దివ్యమైనటువంటి భావనావరణంలో ప్రవేశిద్దాం. స్వామే సంకల్పం చేస్తారు, స్వామే నడిపిస్తారు, స్వామే అంతా చూసుకుంటారు అన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని స్వామి యందు మనం ప్రకటన చేసి హాయిగా ప్రపంచంలో సంచారం చేద్దాం. వీటన్నింటితో పాటు మనకి గనుక గుర్తున్నట్లయితే స్వామి ఇంకో పద్యం చెప్పారు. చాలా చిన్న పద్యంగా అనిపిస్తుంది అది. కానీ దాన్ని చదువుతూ ఉన్నప్పుడు, మరణం చేసుకున్నప్పుడు ఒళ్ళు పులకలు తేలిపోయి నేను పంచభౌతిక దేహంలో ఇటువంటి జీవితాన్ని గడుపుతూ కూడా పరమాత్మని దర్శనం చేసుకున్నానా, ఎంత అదృష్టవంతుడిని అనేటువంటి ఆనందం కలిగించారు స్వామి. చూడండి, ఏను దైవంబు...తద్భిన్నమేమికాను అఖండ పరబ్రహ్మమౌదు నేను వ్యధ యు క్లేశము నన్ను స్ఫురింపగలేవు సచ్చిదానంద ఉడ సత్యసాయి విభుడ ఇంతకంటే ప్రమాణం ఏం కావాలి ఏను దైవంబు దైవాన్ని రాముడుగా కృష్ణుడుగా శివుడుగా భవుడుగా మాధవుడుగా కేశవుడుగా ఉపాసన చేస్తూ నువ్వు వెళ్తున్నావో ఏను నేను దైవాన్ని నాకంటే భిన్నమైనది లేదు తద్భిన్నమేమికాను తత్ అంటే that తత్త్వమసి లో ఉన్నటువంటి తత్ బ్రహ్మమును గురించి మీరు విచారణ చేస్తున్నారో బ్రహ్మ లోక సాధన బ్రహ్మ పదాన్ని మీరు పొందాలని అనుకుంటున్నారో దానికంటే నేను భిన్నం మాత్రం కాదు అది నేనే నేనే దైవాన్ని అంతేకాదు అఖండ పరబ్రహ్మమౌదు నేను అఖండ పరబ్రహ్మం మీరంతా పరబ్రహ్మం ఖండ ఖండాలుగా ఉందేమో కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు ఉండదేమో అనుకుంటున్నారేమో మీరు ఉన్నా లేకపోయినా నేను ఉన్నా ఇది అఖండమైనటువంటి చిద్ఘన రసమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించారు అంతేకాదు వ్యధ గాని ప్రాపంచికమైన క్లేశము గాని నన్ను స్పృశించలేవు నా దగ్గరకు రావు తాకవు అన్నారు మనకి దుఃఖం తప్ప తెలియదు స్వామికి ఆనందం తప్ప తెలియదు స్వామికి తెలియని ఒకే ఒక్క విషయం ఏమైనా ఉన్నదా ప్రపంచంలో అంటే దుఃఖం మనకు తెలియని విషయం ఏదన్నా ఉన్నదా అంటే అది ఆనందం కాబట్టి ఆనందం తెలియాలి అంటే ఎవరు ఆనంద స్వరూపుడో ఆయన దగ్గరికి వెళ్ళాలి దుఃఖం పోవటం సుఖం కాదు కష్టం తీరటం ఆనందం కాదు ఆనందాన్ని పొందటమే ఆనందం అది ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి మాత్రమే అనుగ్రహించగలిగిన వరదానం గనుక స్వామి ఇంకో మాట అంటున్నారు సచ్చిదానంద ఉడను సత్ చిత్ ఆనందము మూడు త్రిపుటీకరణం చెందినటువంటి నేను ఎలా ఉన్నాను అప్పుడు రాముడిని తర్వాత కృష్ణుడిని తర్వాత మరొకడిని కానీ ఇవాళ సత్యసాయి విభుడ విభుడు అంటే ప్రపంచాన్ని భరించిన వాడు ప్రపంచాన్ని నడిపించేవాడు ప్రపంచమే తానైన వాడు ప్రపంచానికి మూలమైన సృష్టికర్త అయిన వాడు గనుక నేనే రోజున సత్యసాయి రూపంలో మీ ముందున్నాను గ్రహించుడి అన్నారు స్వామి స్వామిని అంటే అనేకమైన కారణాల వలన ఈతి బాధల నుండి ప్రాపంచికమైనటువంటి ఇబ్బందులు అననుకూలాల నుండి స్వామికి ఉత్తరం రాస్తాం ఫ్యాక్స్ ఇస్తాం ప్రార్థన చేస్తాం భజనలు చేస్తాం ఏదో ఒకటి చేసి స్వామి నుంచి అనుగ్రహాన్ని ప్రేమని పొంది కష్టం నుంచి బయట పడదామనుకుంటాం ఇది సాధారణ స్థితి కానీ స్వామిని తలచుకున్నప్పుడు స్వామి మాటల్లోనే మనం ఆయన్ని ఏం కోరాలో చెప్పారు అసలు మీరు నన్ను ఏది అడగండి అని చెప్పిన వాడెవడు అడిగితే తీర్చిన వాళ్ళు ఉన్నారు గాని కోరిక కోరితే తీర్చినట్లయితే దాని పేరు వరం మనం అసలు ఏదీ కోరలేదు కానీ అన్నీ తీరుస్తున్నాడు దాని పేరు కరుణ వరం కావాలా కరుణ కావాలా అంటే సాయి నుంచి వరాలు పొందేకంటే సాయి కరుణ పొందితే చాలు కరుణ ముందు వరం చాలా చిన్నమాట ఎందుకంటే మనసు ఉన్నంతవరకు దేహం ఉన్నంతవరకు జీవితం ఉన్నంత వరకు కోరికలు ఆగవు కోరికలు ఉన్నంత వరకు అవి తీర్చుకునే దాకా వ్యధ ఆగదు మన కోరికలు తీర్చేదాకా స్వామి ఆగరు కనుక కరుణ ఒక్కటి ఉన్నట్లయితే కోర్కెలే లేనటువంటి పరిపూర్ణ నిర్మల నిశ్చల నికేతన నిరంజనమైనటువంటి ఆనంద రేఖ మనకు కలుగుతుంది గనుక మనం స్వామిని ఇలా ప్రార్థించాలట ప్రతిరోజు పటం ముందు కూర్చొని సిరులకేమి ప్రసన్న చిత్తుండవైనచో చాలు నాకు అదే పదివేలు తండ్రి సుఖ సంపదలకేమి సుముఖుండవైనచో చాలు నాకదే పదివేలు తండ్రి కోర్కెలకేమి నీ కటాక్షమున్నచో చాలు నాకదే పదివేలు తండ్రి విభవానికేమి నీ అభిమానమున్నచో చాలు నాకదే పదివేలు తండ్రి ఇచ్చినవి ఏవొ ఉన్నవి ఇంతే చాలు అధికములకేమి అవి ఎప్పుడైనా కలుగు వీడు నా భక్తుడని ఎల్లవేళ నీకు ఒక్కరీతి అనుగ్రహమున్న చాలు ఇది అడగాలట ఏమనంటే సిరులన్నీ వాటిని పక్కన పెడదాం స్వామి నా యందు ప్రసన్న చిత్తుడవై ఉండవయ్యా ఇవొక్కటి చాలు సిరులు తర్వాత చూద్దాం సుఖ సంపదలు అంటావా వాటిని పక్కన పెడదాం ఎందుకంటే సుముఖుడువై గనుక ఉన్నట్లయితే నీ దివ్యమైనటువంటి ముఖారవిందాన్ని అన్నివేళలా దర్శించగలిగినటువంటి స్థితిని నాకు అనుగ్రహించి నా పట్ల సుముఖుడువై గనుక ఉన్నట్లయితే అదే పదివేలు తండ్రి అంతేకాదు కోర్కెలంటావా వాటిని ఉండని నీ కటాక్షం గనుక ఒక్కటి ఉంటే చాలు తండ్రి అది నాకు పదివేలు విభవం వైభవానికేమున్నదిలే నీ అభిమానం ఉంటే చాలు స్వామి అది నాకు పదివేలయ్యా ఇచ్చినవేవో ఇచ్చావు ఇచ్చినంత వరకి ఇప్పటికి చాలు ఇంకా ఏవో అది కావాలి ఇది కావాలి అంటే అవి ఎప్పుడైనా నీ అనుగ్రహం ఉంటే ఎలాగూ కలుగుతాయి కానీ వీడు నా భక్తుడే అని అన్నివేళలా ఒక్క భావన గనుక ఒకే రీతిలో ఉండాలి స్వామి నేను పుట్టిన దాదిగా తల్లి గర్భంలో గర్భస్థ పిండంగా ఉన్నప్పట్నుంచి ఒక జన్మ ఎత్తి జగత్తులో సంచారం చేసి నా ప్రాణం వదిలిపెట్టే వేళ వరకు అంటే జన్మ తరువు చాలించే వరకు నీ యొక్క అనుగ్రహము నా యందు ఒక రీతిలో ఉండాలి స్వామి మార్పు లేకుండా ఉండాలి స్థిర సంపదలు వైభవాలు సుఖ సంపదలు కోరికలు ఇవన్నీ పక్కన పెట్టవయ్యా ఇచ్చినవేవో ఇచ్చావు ఇంతవరకు చాలు ఇంకా కావాలంటే ఎప్పుడైనా ఇస్తావ్ అనుకున్నాం కదా కానీ వీడు నా భక్తుడే అన్నటువంటి ఒక భావన నా యందు ఒక రీతిలో నిలుపు తండ్రి అది నాకు పదివేలు పదికోట్లు పది జన్మల యొక్క సారం అని సత్యసాయి భగవానుడి మనం కోరుకుంటే ఇలా గనక అంటే సిరులు ఇస్తాడు వైభవం ఇస్తాడు కోరికలు తీరుస్తాడు ఆనందాన్ని ఇస్తాడు ఇవ్వకుండా ఏదీ ఉండదు అయితే జీవుడు ఒకటి గమనించాలి భగవంతుడు మనం అడిగింది ఇవ్వడు మనకి ఏం కావాలో ఇస్తాడు మనం అడిగిందంతా ఇవ్వడు ఎంత ఇస్తే మనం బాగుపడతామో అంతే ఇస్తాడు అడిగిన అన్ని వస్తువులు ఇవ్వడు ఏది ఇస్తే మనం అధ్యాత్మ మార్గంలో ఉండి పరమేశ్వరుడిని మనం భావించగలుగుతామో దానిని ఇస్తాడు అంతేకాదు సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో ఉన్న మనం స్వామిని పరదైవంగా భావించి దైవతంగా భావించి గనుక మన అధ్యాత్మ జీవితాన్ని గడిపినట్లయితే ఏమిస్తాడయ్యా సలోక్యంగా ఉన్నారు మనతోనే ఉన్నారు ఇదే లోకంలో మనం ఉన్న లోకంలోనే వారు ఉన్నారు సామీప్యంగా ఉన్నారు మనం స్వామికి దగ్గరగా ఉన్నామని మనం అనుకుంటున్నాం స్వామి కూడా మనకు దగ్గరగానే ఉన్నారు సాన్నిధ్యంగా ఉన్నారు అంతా కలిసి ఉన్నాం ఏమివ్వటానికి వచ్చారు సాయుజ్యం ఇవ్వటానికి వచ్చారు సాయుజ్యం ఎప్పుడిస్తారంటే రీతిగా జీవితాన్ని గనుక మనం ఒక సద్భక్తుడిగా ఒక అంతర్వాణి విలసితమైనటువంటి భావనా భూమికలో సంచారం చేస్తే పరమాత్మ సాయి అన్నివేళలా వీడు నా భక్తుడు అనేటువంటి ఒక్కరీతి అనుగ్రహాన్ని మాత్రం మనకు అనుగ్రహిస్తారు అనుగ్రహం కోసం మనం మన జీవితాన్ని చక్కగా అధ్యాత్మ జీవితంగా మార్చుకోవాలి యోగాన్ని స్వామి మనకు అనుగ్రహించుగాక సాయిరాం
YouTube · audio

Sri Sathya Sai Ultimate life lessons in the form Telugu Poems - commentary

Home

Sri Sathya Sai Ultimate life lessons in the form Telugu Poems - commentary

Source: Shiva Palle on YouTube

0:00 / 32:28