Skip to content
Transcript తెలుగు
ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాత్ మే. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఉపదేశ సారంలో భగవాన్ మనలను నెమ్మది నెమ్మదిగా యోగ మార్గంలోకి తీసుకొని వెళుతున్నారు. మనోలయాన్ని గురించి తీవ్ర విచారణ చేసి బాహ్య వస్తువుల నుంచి దృష్టిని అంతర్ముఖం ఎలా చేయాలో చెప్తూ దానిలో చిత్తైకాగ్ర స్థితిని అంటే మనస్సు ఒక వస్తువు మీద నిరంతరము ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనస్సు నెమ్మదిగా నశించిపోతుంది అని ఒక సూత్రాన్ని మనకు అందించి, మనం కూడా అంతే ఒక వస్తువును అక్కడ పెట్టుకొని దానిని అలా చూస్తూ ఉన్నట్లయితే స్వరూపం, అరూపం అయిపోతుంది. దాని ప్రాకారమంతా నశించిపోయి దాని మూలతత్వంలోకి మనం వెళ్ళిపోతాం. ఇది చిత్తైకాగ్ర స్థితి. అంటే చిత్తాన్ని ఏకాగ్ర స్థితిలో ఉంచటం అని అర్థం. [స్వాస] ఇటువంటి సాధన మనోలయానికి దారితీస్తుంది గనుక, మనస్సు లయం కావటం అంటే హృదయ స్థానం దాకా వెళ్లటం అని మనం అనుకున్నాం గనుక, భగవాన్ అదే చెప్తున్నారు గనుక. ఇక తర్వాత ఏం జరగాలి అని. లయం కావటం అంటే నాశనం కావటం కాదు. లయం కావటం వేరు, నాశనం కావటం వేరు. ఇది మనం పునః పునః రెండు పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లయం కావటం అంటే దగ్గరకు వెళ్లి ఉండటం. ప్రాంతం కావటం, ప్రా అంతం కావటం, దగ్గరగా వెళ్లి ఆగిపోవటం. ఒక ఇనుప రజను అయస్కాంత క్షేత్రంలోకి వెళ్లి ఎప్పుడో నెమ్మదిగా కదా అది అయస్కాంతం అయ్యేది. భ్రమర కీటక న్యాయంలో ఒక పురుగు ఉన్నది. భ్రమరం తిరుగుతున్నది, జంకారం చేస్తున్నది. చేయగా, చేయగా, చేయగా పురుగు విని, విని, విని తాను భ్రమరం అయిపోతున్నది. కానీ దానికి కొంత సమయం పడుతుంది. చిత్తైకాగ్ర స్థితిలో కూడా ఇది ఒక సాధారణమైన అలవాటు నుంచి ఒక తీవ్ర సాధనా మార్గంగా మనం గనుక ఎంచుకోగలిగినట్లయితే మనకి ఖచ్చితంగా, స్పష్టంగా మనస్సు లయిస్తుంది. మనం కూడా చూడండి మనసుతో ప్రపంచాన్ని చూసినంత కాలం మనకి స్పర్ధలు ఉన్నాయి. రెండు కాదు వేరు వేరుగా కనిపిస్తున్నాయి. వేలు వేలే కాదు అన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. మనలాగే ప్రతిరోజూ భగవాన్ భోజనం చేసేవారు కదా! ఒకరోజున వంటశాలలో భోజనం తయారు చేసేటువంటి వ్యక్తి పాపం మంచి ఆలోచన చేసిందామె. భగవాన్ కి చాలా రుచికరమైనవి ఇవాళ చేసి పెట్టాలి, రుచికరమే కాదు రకరకాలు చేసి పెట్టాలి అని ఒక ఆలోచన కలిగింది ఆమెకి. ఆమె చేతిలో ఉన్నది ఆమె చేయగలిగింది చేసింది. భగవాన్ భోజనానికి వచ్చారు. ఆమె వడ్డిస్తూ "భగవాన్ దీన్ని ఇట్లా చేశాను, దీన్ని ఇట్లా చేశాను, ఇవన్నీ వీటికవి చక్కగా తినండి, మీరు చక్కగా తింటే మాకు తృప్తి" ఇట్లా చెబుతూ ఉన్నది, వడ్డిస్తున్నది, వెళుతున్నది. కానీ భగవాన్ విన్నట్లుగా విన్నారు కానీ, ఆయన తన అలవాటు ప్రకారం విస్తట్లో అన్నీ కలుపుకొని ఒక ముద్ద చేసుకున్నారు. కలుపుకొని తినటం ప్రారంభించారు. తిన్నారు. చెయ్యి కడుక్కుంటున్నారు. వంటకత్తె భగవాన్ ని సమీపించింది, "భగవాన్! ఎంతో కష్టపడి, ఎంతో ఆలోచించి మీకు ఒక్కొక్కటి రుచికరంగా ఉండాలి అని శ్రద్ధ పెట్టి చేశాను. మీరు ఇవాళ కూడా అన్నీ కలిపి ఒక ముద్ద చేసి తినేశారే. విడివిడిగా తినొచ్చు కదా?" అని అడిగింది. భగవాన్ తటపటాయించలే, సూటిగా సమాధానం ఇచ్చారు. "మీ అందరికీ వేరువేరుగా ఉండటం ఇష్టం. మరి ఇక్కడ మాకు అన్నారు కదా, అంతా ఒకటే అనుకోవటం ఇక్కడ ఇష్టం. నిజానికి అన్నీ కలిసేదే కదా. ఇది ప్రత్యేకం అనుకోవటంలో స్పర్ధ ఉంది కదా, మళ్ళీ బాగుంది, బాగాలేదు, ఏదో అది ఎక్కువ, ఇది తక్కువ, విచారణ, సమయం అంతా వృథా. అన్నీ కలిపేసి రెండు ముద్దలు తినేస్తే దేహ పోషణ జరిగిపోతుందిగా" అన్నారు భగవాన్. అంటే మనకి అనేకం ఇష్టం, వైరుధ్యం ఇష్టం, వైవిధ్యం ఇష్టం. వైరుధ్యం కూడా అప్పుడప్పుడు ఇష్టమే. ఎందుకంటే మనకి సమయం చాలా ఉందని అనుకుంటాం జీవితంలో. దాన్ని ఎలా చెల్లగొట్టుకోవాలి అనే ఆలోచనలో వ్యర్థ వాదాలకు దిగుతాం. వాడు ఇట్లా, వీడు ఇట్లా, కాలక్షేపం చేస్తాం. మనస్సుని gossipస్ వైపు నడిపిస్తాం. దానివలన ప్రయోజనం ఏమీ లేదు. సత్యాన్వేషణలో ఉన్నటువంటి, నిజమైనటువంటి సాధకుడు ఉపదేశ సారం యొక్క అంతరార్థం గ్రహించి తదనుగుణంగా జీవించాలి అంటే భగవాన్ జీవితాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే చాలు. వారు నాలాగ ఉండమని ఎక్కడా చెప్పలే, కానీ వారిలాగా ఉండే ప్రయత్నం కొంత మనం చేయాలి, ఆలోచనా రీతిలో.భగవాన్ కి ప్రపంచంలో వస్తువు పట్ల అయిందన్నా అపేక్ష ఉన్నదా? అంటే లేదు. ఎందుకని లేదు అంటే, ఏది తనకంటే భిన్నంగా ఆయన చూడలేదు. అన్నీ తనలాగే కనిపిస్తున్నాయి, అన్నింటి వల్లే తనకు తాను గోచరిస్తున్నారు. సర్వాత్మ భావన కలగటం అంటేనే మనోనాశనం కావటం అని అర్థం. మనం మనోలయం అయింది అటువంటి మనసుతో ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, ఇదంతా "జగతి యెల్ల మధుర సౌందర్యమయమంచు కన్నుమూసి కలలు కాంచినాను కన్నువిప్ప తెలిస కర్తవ్యమును చేయవసయోగ్యమగును వసుధయెనుచు". ప్రపంచంలో అనేకమైనటువంటి విశేషాలున్నాయి. మనం కూడా మన కర్తవ్యాన్ని మన డ్యూటీ మన బాధ్యతను మనం నిర్వర్తించాలి అనే స్పృహ కలుగుతూ ఉన్నది గనుక ఇది ఒక స్థితి అని మనం అనుకుంటున్నాం. ఇది మనోలయానికి ఒక చిన్న గుర్తు. రెండవది, మనల్ని ప్రపంచం పొగిడినా పొంగుతున్నది లేదు, తెగిడినా యాతన పడుతున్నది లేదు. ఇది మనోలయానికి గుర్తు. అనేకమైనటువంటి వస్తువులు కావాలి అన్న కాంక్ష నెమ్మదిగా నశించి పోతున్నది. ఇది మనోలయానికి గుర్తు. వస్తువు మనల్ని ఆకర్షించటం లేదు. ఇది మనోలయానికి గుర్తు. జీవితంలో విజయాలు మనం పరమైనా మనము దాని పట్ల పెద్దగా పొంగి పోవటం లేదు. మనోలయానికి ఇది ఒక గుర్తు. దుఃఖాలు కలుగుతున్నాయి, సన్నివేశాలు ఏర్పడుతున్నాయి. వీరంతా మన వారు అనుకున్నటువంటి వారు దూరమై పోతున్నారు. వీరు ఎప్పటికైనా మనవారు అవుతారో కాదో అనుకున్న వాళ్ళు మన వాళ్ళు అవుతున్నారు. జీవితం చాలా వర్ణవర్ణాంచితంగా చిత్రవిచిత్రంగా సాగిపోతున్నది. కానీ ఎక్కడా ఒడిదుడుకులు మనసుకు లేవు. ఇది మనోలయానికి గుర్తు. ఏదో ఒక అద్భుతమైన వింత జరుగుతున్నది, ప్రపంచంలో ఒక అద్భుతమైన వస్తువు ఆవిష్కరించబడింది అని మనం వింటున్నాం. చూడాలన్న ఆసక్తి లేదు. మనోలయానికి గుర్తు. అంత అందమైన వస్తువు కంటికి కనబడుతున్నది, చేతికి దగ్గరగా ఉంది, అందుకోవటానికి చాలా తేలికగా ఉంది, కానీ మనసుకు ఆతృత లేదు. ఇది మనోలయానికి గుర్తు. అంటే మనస్సు హృదయము యొక్క ఒక పార్శ్వ అయిపోతున్నది నెమ్మదిగా. ఇది వైరాగ్యంలో నుంచి, అపజయాల్లో నుంచి, నిస్సహాయతలో నుంచి, అందుకోలేని స్థితిలో నుంచి ఏర్పడితే అది మనోలయం కాదు. అందుకోగలిగి, అన్ని శక్తులు ఉండి, దేనినైనా పొందగలిగినటువంటి ఒక సౌభాగ్యం ఉండి, ఇవి ఏవి మనకు అక్కరలేదు అనుకుంటామే అది మనోలయం. ఎవరైనా సరే స్థితిలో గనుక ఉన్నట్లయితే మనోలయ సాధన జరిగినట్లే. మనోలయము అంటే ఆకర్షణకి లోను కాకుండా ఉండటం ఒకటి. ఏది అవసరము అని అనిపించకపోవటం రెండవది. ఇది నాకు కావాలి అనిపించుకో-- అనిపించే ఒక స్థితి లేకుండా ఉండటం ఒకటి. ఇది నాది అన్నటువంటి మమతా బంధం లేకుండా ఉండటం మరొకటి. ఇవన్నీ కూడా మనస్సు యొక్క లయం చెందింది మనోలయానికి గుర్తులుగా ఎన్నెన్నో ఉన్నాయి.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -48

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -48

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:03

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

    Now playing
  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77