No transcript for this section.
Transcript begins at 8:20.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం సురియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శిల స్థితాం మజ్ జన్మాంతర పుణ్యపాక విసత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్వరతాంబుజే పరమవాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లా సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించిన ఈ స్వామి జయంతి ఉత్సవాలు తొంబై ఐదవ జయంతి ఉత్సవాలలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి అవతార వైభవాన్ని తలాస్పర్శగా కాలి పులాక న్యాయంగా మన అనుభవ పరిధిలో దానిని ఎట్లా మనం అనుభవించామో ఎలా అనుభవించాలో ఆ రీతి ఆ తీరు ఆ తెన్ను ఇవన్నీ కూడా మూడు రోజులుగా సాగిస్తూ ఉన్నాం ఈ వేళ మూడో రోజు. ముందుగా వారందరికీ శుభాభివందనం తెలియజేస్తూ ఏ స్వామి చల్లని చిరునవ్వు తల్లి దీవెనయై తనరారునో ఏ స్వామి మెల్లని గమనమున ఆగామి సంచితములు నెమ్మనగునో ఏ స్వామి దర్శన స్పర్శన సంభాషణమ్ములు ప్రస్థానత్రయ ప్రస్థాన యాన యాజమగునో ఏ స్వామి పిలుపుతో అంగాంగమ్ము పులకాంకుర ప్రకరమొనో అట్టి నా స్వామి రూపు సౌందర్య లహరి అట్టి నా స్వామి ఫలపు శివానందలహరి అట్టి నా స్వామి పిలుపు అమదానందలహరి అట్టి నా స్వామితో చెలిమి జన్మ జన్మాల కలిమి ఇదే సంపాదించుకున్నటువంటి సంపద స్వామి వైభవంలో మన వైభవం కూడా ఒక రూపు దిద్దుకొని ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సర్వోన్నతమైనటువంటి మానవ జన్మ ఎత్తిన మనం సాక్షాత్తు గురువే లేని గురువులకు గురువైన సత్యసాయి భగవానుడి యొక్క అవతార వైభవంలో సుమారు ఐదున్నర దశాబ్దాలకు పైగా ప్రతి క్షణాన్ని పవిత్రీకరించుకుంటూ సాగుతున్నటువంటి అధ్యాత్మ ప్రస్థానంలో స్వామి సత్యసాయిని ఫిజికల్ మెటా ఫిజికల్ స్పిరిట్యుయల్ అనే మూడు స్థాయిల్లో మనం చూడాలి. కేవల భౌతికంగా గనుక చూసినట్లయితే ఆయన ఒక మహనీయ మూర్తి ఒక సుందర స్వరూపం మర్యాద పురుషోత్తముడు లలిత లలితమైనటువంటి భావనలతో చరణాలతో కదలికలతో మదలికలతో సర్వ ప్రపంచాన్ని కూడా ఒక అద్భుతమైన ఆకర్షణావలయంలోకి ఆహ్వానించినటువంటి దివ్య సుందర స్వరూపమే భగవాన్ శ్రీ సత్యసాయి. అయితే భగవంతుణ్ణి ఒక దేహంతో ఒక రూపంతో ఒక నామంతో చూసి తృప్తి పడటానికి వీలు లేదు దానిని దాటాలి దాటి ఈ అవతారం ఎందుకు వచ్చింది మనం ఎప్పుడైతే రామాయణం చదువుతామో రాముడు ఎందుకు వచ్చాడో తెలుసుకుంటాం వచ్చి ఏం చేసాడో తెలుసుకుంటాం రామాయణం అంతా కూడా కంఠస్తం అయినప్పుడు అనుభవగతం అయినప్పుడు మరి మనం ఏం చేయాలి ఈ రామాయణం చదివిన తర్వాత అని ఒక ప్రశ్న వేసుకుంటే ఒకే ఒక్క జవాబు వస్తుంది రామో విగ్రహవాన్ ధర్మః కాబట్టి రాముడి లాగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి అంతే. అలాగే కృష్ణ పరమాత్ముని గురించినటువంటి భారత భాగవతాలు భగవద్గీతలు చదివినప్పుడు వాటి లోతైనటువంటి అర్థాలన్నీ మనకు తెలిసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వలె నిస్వార్థంగా నిర్మమంగా నిరంజనంగా నికేతనంగా ఈ జగత్తుకి సేవ చేయాలి. ఈ సేవ ఎలా చేయాలి కృష్ణుడు ఎలా చేశాడు ఒక్కసారి మహాభారతంలో గనుక మనం వెళ్ళినట్లయితే ప్రతిరోజూ యుద్ధం జరిగిన ప్రతిరోజూ రాత్రి అంటే సాయంకాలం సంధ్యా సమయంలో యుద్ధానికి విరామ సమయం ప్రకటిస్తారు అప్పుడు శత్రువులందరూ కూడా వారి వారి గుడారాలలోకి వెళ్లి విశ్రమించాలి మళ్ళీ రేపు రణరంగానికి ఆయత్తం కావాలి సిద్ధం కావాలి. మరి అందరూ అలసిపోయినారు యుద్ధం చేసి కౌరవ శిబిరాలు అట్లాగే ఉన్నాయి పాండవ శిబిరాలు అట్లాగే ఉన్నాయి పాండవ శిబిరాలలో పంచ పాండవులు హాయిగా ప్రసన్నంగా నిద్రపోతున్నారు శక్తిని కూడగట్టుకుని మళ్ళీ రేపటి యుద్ధానికి సిద్ధం కావటానికి అర్జునుడు ఎంత యుద్ధం చేసాడో కృష్ణుడు అంతగాను యుద్ధం చేయించాడు రథసారథి అయిన కృష్ణుడికి అలసట లేదు మరి ఆయన కూడా అలసట చెంది పడుకోవాలి కదా నిద్రపోవాలి కదా మరి ఆయన ఏం చేశారు భగవత్ ప్రమాణం ఏంటంటే దశమ స్కంధంలో ఈ విషయం స్పష్టంగా ఉన్నది రాత్రిపూట గుర్రాల కాలి గిత్తలలో ఇరుక్కున్నటువంటి ఇనప ముక్కలన్నీ కూడా ఏరేవాడాయన.శరీరానికి గాయాలైతే వాటన్నింటిని కూడా ఆక్టివ్ ప్రెషర్ ఇచ్చి మళ్ళీ యోగ విద్యలో తనదైనటువంటి స్పర్శ అనేటువంటి ఆ చాలనంతో చేయి కదుపుతూ గుర్రాలకు మాలిష్ చేశాడు. గుర్రాలని గుర్రాలని కడుగుతూ ఉన్నప్పుడు గుర్రాల మీద ఉన్నటువంటి దుమ్మంతా కూడా శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క నీలి కురుల మీద పడి ఉంటే కృష్ణుడు ఎలా ఉంటాడో ఊహించండి. మళ్ళీ తెల్లవారేసరికి పాండవులతో సమానంగా రథం బయటకు తీసి యుద్ధం చేశాడు అని. అంటే జీవుడికి నిద్ర ఉన్నది పరమాత్మకి యోగ నిద్ర ఉన్నది. నిద్రాం సఖే కేవల కుంభకామ్ అంటారు శంకర భగవత్పాదులు. మరి కృష్ణుడికి అలసట ఎందుకు రాలేదు పాండవులకు ఎందుకు వచ్చింది అని. అందరూ కలిసే యుద్ధంలో పాల్గొన్నారు కదా అంటే యోగ నిద్రలో అలసట లేదు. అది చి అయి చలి అయి పరమాత్మతో కూడి ఉండి యోగ నిద్రని అనుభవి-- అనుగ్రహిస్తుంది గనుక దానికి యోగశాస్త్రంలో కేవల కుంభక యోగము అని పేరు. అంటే విషయాలు మనం చాలా స్వామిని ఇప్పుడు స్వామిని గురించిన చరిత్ర గాని స్వామితో అసంఖ్యాకమైన భక్తుల యొక్క కథలు గాథలు మనందరికీ తెలుసు. వాటిని మళ్ళీ మనం పారాయణం చేస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. దాన్ని చదువుకోవాలి ఆనందించాలి అంతే. కానీ స్వామిని అవతార వైభవంలో అసలు కీలకమైన సన్నివేశాలు ఏమిటి? వాటిని మనం విచారణ చేయాలి. అందుకే ఈ భూమిక ఏర్పడింది గనుక మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఫిజికల్ మెటాఫిజికల్ అయింది ఇవాళ స్పిరిట్యువల్ స్థాయిలో స్వామిని గనుక మనం విచారణ చేసినట్లయితే అసలు నిజానికి అధ్యాత్మ అంటే ఏమిటి? అక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. అధ్యాత్మ అందరికీ అందుతుందా? అది మోక్షాన్ని ఇస్తుందా? సుఖప్రదమైన మరణాన్ని అనుగ్రహిస్తుందా? వ్యాకులన్ లేనటువంటి జీవితాన్ని ఇస్తుందా? అసలు ఈ అధ్యాత్మ లోకి మనం ఎందుకు వెళ్ళాలి? ప్రపంచంలో ఇన్ని సుఖాలు ఇన్ని భోగాలు ఇంత సంపద ఇంత కీర్తి ఇంత అందం మన చుట్టూ పరచుకొని ఉన్నప్పుడు ఇవన్నీ కాదని మనకు ఇంకా అవగాహనకు లోను కానటువంటి ఒక అధ్యాత్మ వైపు ఎందుకు వెళ్ళాలి అనేటువంటిది మౌలికమైన ప్రశ్న ప్రధానంగా ఇవాళ యువకులలో రేకెత్తుతున్నటువంటి ప్రశ్న ఇది. అన్నీ ఉన్నాయి కదండి మళ్ళీ ఇది కాకుండా ఇంకెక్కడో ఏదో అంటున్నారు అది ఏమిటి అని అడిగిన వాళ్ళకి సత్య సాయి భగవానుడు ఈ అవనిలో భూమండలి కృత పుణ్య కృతావతారుడు భగవాన్ సత్యసాయి అంటే అది కేవలం ఐదు అడుగుల మూడు అంగుళాల పాంచభౌతిక దేహం కాదది. రూపం చిన్మయ రూపం దేహం యోగ శరీరం. ఆ యోగ శరీరం కనుకనే అలసట లేకుండా ఎనభై ఆరు సంవత్సరాలు కృష్ణ పరమాత్మ వలె శాంతి ప్రేమలను ఈ ప్రపంచానికి ఇచ్చారు. ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. అలాగే శ్రీరామచంద్ర ప్రభు వలె దివ్యమైనటువంటి ఈ ధర్మాన్ని అంటే వ్యక్తి ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, సామాజిక ధర్మాన్ని, ఆర్థిక ధర్మాన్ని, విశ్వ ధర్మాన్ని, సృష్టి ధర్మాన్ని అంటే సమస్తమైనటువంటి ప్రకృతిని కూడా గౌరవిస్తూ తన కార్యకలాపాలను కూడా ప్రకృతి భావనకి లోబరచి స్వామి సాగించినటువంటి పరమాద్భుతమైనటువంటి శైలి విధానమే అధ్యాత్మ. అంటే అధ్యాత్మ అంటే నాకి ఉపనిషత్తులన్నీ వచ్చు భాగవతంలో పద్యాలన్నీ వచ్చు భారతం అంతా అటు ఇటు గట్టిగా చదివాను రామాయణం నాకు వాల్మీకి రామాయణం తెలుసు వేద రామాయణం తెలుసు అంటే అది అధ్యాత్మ కాదు. అధ్యాత్మ అంటే ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు వెనక ఉన్న గాథ ఏమిటి? దాని మూలం ఏమిటి? ఇది తత్వ అన్వేషణ. ఈ తత్వ అన్వేషణ తత్వము అంటే తత్ ను గురించి తెలుసుకోవాలి తత్ అంటే దట్. దానిని గురించి తెలుసుకున్నట్లయితే అది ఇది ఒకటే త్వమేవహం న సంశయః అది కదా. దాన్నే స్వామి ఇవాళ ఇంగ్లీషులో ఏమన్నారు యు ఆర్ మీ ఐ యామ్ యు అని ఆయనే చెప్పారు మనం కొత్తగా చెప్పింది ఏం లేదు. మీరు నేను ఒకటే అని పదే పదే చెప్పినటువంటి అవతార మూర్తి భగవాన్ శ్రీ సత్య సాయి. అంటే స్వామి అలా అన్నారు కనుక మనం కూడా స్వామి వలె జీవించటం మొదలు పెట్టాలి అధ్యాత్మ అంటే అది. అధ్యాత్మ అంటే ఆహ్ టైం చూసుకోవటం లేకపోతే ఆ విధివిధానాలన్నీ చక్కగా శౌచం ఇవన్నీ కూడా ఆచరించటం ఇది మాత్రమే కాదు అవన్నీ ఉండాలి. స్వామి కూడా వాటన్నింటినీ కూడా చక్కగా ఆచరించమని చెప్పారు. అందుకనే అధ్యాత్మ అనగానే మనస్సుకి, బుద్ధికి, చిత్తానికి, అహంకారానికి దాటినటువంటి స్థాయిలో ఉన్నదంతా బ్రహ్మము అనేటువంటి భావనతో గనుక మనం జీవించగలిగితే అది నిజమైన అధ్యాత్మ. సరే జీవితాన్ని దాటి మనం జీవిస్తున్న విధానాన్ని దాటి జీవితానికి అనంతరం ఏమున్నదో గనుక విచారణ చేస్తే అది అధ్యాత్మ కాదు ప్రానేరదు. అంటే జీవిత-- అభివాస్తవికంగా అబ్సల్యూట్ రియాలిటీ అంటాం అది సవాళ్లు విసురుతూనే ఉంటుంది, ఆకర్షణ వలయాలు సృష్టిస్తూనే ఉంటుంది, ఆయావరణంలో మనల్ని ముసుగేసి దాచి పెట్టే ప్రయత్నం చేస్తుంది, మనకి కీర్తిని తెస్తుంది అహాన్ని పెంచుతుంది, సంపదని ఇస్తుంది అహాన్ని పెంచుతుంది, విద్యాభారాన్ని విద్యా వీరాన్ని మనకు అనుగ్రహిస్తుంది అలాగే సాత్వికాహంకారాన్ని కూడా పెంచుతుంది. అంటే ప్రాపంచికమైనటువంటి వస్తువుల వలన శాస్త్రాధ్యయనం వలన జరిగే ప్రయోజనం ఎంత అయితే ఉన్నదోకాబట్టి ప్రమాద ప్రమోదముల మేలికలయికగా జీవితం సాగుతుంది. మనం చక్కగా ప్రసన్నంగా ప్రశాంతంగా మన దారిన మనం వెళుతూ ఉంటాం అనుకోని ఆఘాతాలు ఏర్పడతాయి. ఆ ఏర్పడినప్పుడు మనం చదువుకున్నటువంటి ఏ చదువు ఆ రోజున అక్కరకు రాదు. దీనికి స్వామి ఒక చిన్న కథ చెప్పారు. ఆ కథ ఏంటంటే ఒక పండితుడు ఒక ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళి అక్కడ ఆయన విద్వత్తు వలన, ఆయన పాండిత్యం వలన, ఆయనకున్న శాస్త్రం మీద అధికారం వలన పుర ప్రజలందరి చేత లేదా గ్రామ ప్రజలందరి చేత గౌరవాన్ని పొంది బాగా విరివిగా చాలువాలు, దండలు, డబ్బు అన్నీ ఏర్పరచుకొని సంపాదించుకొని మూటగట్టుకొని మళ్ళీ తన ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతున్న సమయంలో అక్కడ ఊరికి, ఈ ఊరు నుంచి ఆ ఊరుకు వెళ్లాలి అంటే ఒక చిన్న నది అడ్డం వచ్చింది. ఆ నదిలో ఒక పడవ కూడా రెడీగా ఉంది. పడవను నడపటానికి నావికుడు కూడా ఉన్నాడు అంటే సరంగు అంటాం. ఆ పడవ నడిపేవాడు ఉన్నాడు. ఉంటే ఈయన ఎక్కాడు ఎవరు మన పండితుడు చక్కగా కాలు మీద కాలు వేసుకున్నాడు పడవ నడపవోయ్ అన్నాడు. అట్లాగే బాబాయ్యా నడుపుతాను అన్నాడు. ఈయన నెమ్మదిగా తనకు జరిగినటువంటి వైభవాన్ని, తాను పొందిన సత్కారాన్ని అన్నీ కూడా తలుచుకుంటూ కాలు మీద కాలు వేసుకొని తాంబూల సేవనం చేస్తూ తన ఒంటి మీదున్నటువంటి నగలు అవి ఇవి సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ పడవ సరంగుని ఒక ప్రశ్న వేశారు. ఒరేయ్ అబ్బి! నీకు వ్యాకరణం వచ్చునా? అని అడిగాడు. బాబాయ్యా! నాకు రాదు. అది అంటే ఏమిటి? అని అడిగాడు. నీకు రానప్పుడు అదేమిటో చెప్పినా నీకెందుకు? తలకెక్కదులే. పోనీ తర్కం ఏమన్నా వచ్చా? అన్నాడు. అదే రానప్పుడు ఇది ఎక్కడ వస్తుందయ్యా? అన్నాడు వీడు. నీకు వ్యాకరణం రాదు తర్కం రాదు. పోనీ మీమాంస వచ్చా? అన్నాడు. ఏదీ రాదయ్యా నాకు అన్నాడు. ఈ పడవ నడపటం ఒక్కటే వచ్చు. ఇదే నాకు జీవనాధారం. నా తాత పడవ నడిపాడు. నా తండ్రి పడవ నడిపాడు. నా తండ్రి వెళ్ళిపోతూ నాకీ పని అప్పజెప్పాడు. నా పని అల్లా ఇదిగో ఈ గట్టున మీరెక్కితే ఆ గట్టున భద్రంగా దింపటం వరకే నా పని అన్నాడు. పండితుడు చాలా నిరాశగా పడవ సరంగు వైపు చూసి చెదవి విరిచి ఒరేయ్ అబ్బి! జీవితమంతా వృధా చేసుకున్నావు రా. అక్షర జ్ఞానం లేకుండా అయిపోయింది నీకు. ఏమీ చదువుకోకుండా అయిపోయినావు ఏమిటి? ఇట్లైతే ఎట్లా? నీ కొడుకుకు కూడా నువ్విదే చేస్తావా? అని కాస్త తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఏమో బాబాయ్యా! ఇది ఇంతవరకు కడుపునిండా రెండు పూట్ల అన్నందినే సంపద ఇస్తోంది. మా పిల్లలు బుద్ధిమంతుల్లా ఉన్నారు. నా తాత ఎట్లా ఉన్నాడో, నా తండ్రి ఎట్లా ఉన్నాడో, నా తండ్రి ఎట్లా ఉన్నాడో, నేను అట్లా ఉన్నాను. అట్లాగే నా పిల్లలు. ఇదంతా పైన భగవంతుడి దయ. మీరు చక్కగా కూర్చోండి. హాయిగా ఉండండి. మంచి విషయాలైనా చెప్తూ ఉండండి బాబాయా. సరే మంచి విషయాలు చెప్పటానికి నా దగ్గర బోలెడు ఉన్నాయిరా. కానీ అవి అర్థం చేసుకునే శక్తి నీ దగ్గర లేదు గనుక నేను చెప్పనురా అన్నాడు. సరే పాపం అతనేమీ అనలేదు. అప్పటివరకు ఆకాశం చాలా ప్రసన్నంగా, ప్రశాంతంగా చల్లటి మలయ పవనాలు వీస్తున్నటువంటి ఆ వేళ అనుకోకుండా ఒక్క క్షణంలో వాతావరణం మారిపోయింది. సన్నటి గాలి పెనుగాలిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమైపోయింది. వర్షపు చినుజల్లులు ప్రారంభమై కుంభవృష్టి ప్రారంభమైంది. నీటిలో పడవ అటూ ఇటూ ఊగుతున్నది. పడవ సరంగు యొక్క శక్తి దాన్ని నిరోధించటానికి చాలటం లేదు. అటువంటి సమయంలో పండితుడు భయపడిపోతున్నాడు. ఎందుకంటే కాలికి కడియాలున్నాయి, చేతికి కంకణాలున్నాయి, మెళ్ళో ఆభరణాలున్నాయి, గుడ్డు నిండా కావలసినంత దస్కం ఉంది అంటే డబ్బుంది. అప్పడ-- పైగా వాళ్ళందరూ ఇచ్చినటువంటి బట్టలన్నీ కొత్త బట్టలన్నీ ఉన్నాయి. ఇవి ఏమైపోతాయో అనేటువంటి భోరణలో భయంతో ఏరా! పడవ అవతలికి చేర్చేవా? అన్నాడు. అయ్యా! అంతా భగవంతుడి దయ. నడుస్తుంటుంది. ఇట్లాగే నడుస్తూ ఉంటుంది అన్నాడు. కానీ అయ్యా! ఒక్కమాట. నీకు ఈత వచ్చా? అని అడిగాడు. ఒరేయ్ అబ్బి! భగవద్గీత వచ్చు గాని నాకు ఈత రాదురా అన్నాడు. అయితే బాబాయ్యా! ఈత రాకపోతే గల్లంతే అన్నాడు. అంటే ప్రపంచంలో ఏ విద్య కూడా అల్పమైనది కాదు. నేను ఒక రంగంలో చాలా సుప్రసిద్ధుడిని, చాలా మేధావిని కావచ్చు. కానీ మిగతా రంగాలని కించపరచకూడదు. సరే ఇంతలోగా నిజానికి జరిగింది ఏమిటంటే పడవ అటూ ఇటూ అయింది. గట్టు కాస్త దగ్గర్లో ఉంది. ఆ మూటని, పండితుడిని కూడా భద్రంగా తన తెలివితేటలతో, ఉడుపుతో, నేర్పుతో అన్నింటికంటే భగవంతుని యందు విశ్వాసంతో పడవ సరంగు ఇతన్ని అవతలికి చేర్చాడు. ఈత రాకపోయినా ఈత వచ్చినవాడు మన పక్కనుండాలి. గీత రాకపోయినా గీత నేర్పేవాడు మన దగ్గర ఒకడుండాలి. ఇది అధ్యాత్మ. ఇద్దరి ప్రాణాలు ఈత వచ్చినవాడు, గీత తెలిసినవాడు కలిసే ప్రయాణం చేశాడు. చదువుకున్నవాడు వాడిది అక్కడే ఉన్నాడు. చదువులేని వాడు అక్కడే ఉన్నాడు. కానీ ఇద్దరినీ గట్టున చేర్చిన వాడు ఎవరు? పరమాత్మ. దుస్తర భవసాగర తరణం అంటే అది దాని అర్థం.మనంతట మనం ఈ సంసార సాగరాన్ని దాటలేము మనకు ఆ శక్తి చాలదు మనం అనుకుంటాం పడవ ప్రయాణం ఏటవాలుగా ఉన్నప్పుడు తెరచాపని గాలి నెడుతూ వెళుతూ ఉన్నప్పుడు మనమే ఆ పడవను నడిపాము అనుకుంటాం అంతెందుకు ఆ తెరచాప మీద ఒక చిన్న పిట్ట గనుక కూర్చుని ఉన్నట్లయితే ఆ పిట్ట అనుకుంటుంది ఇవాళ పడవను నేను నడుపుతున్నాను అని మనం కూడా అహంకారం చేత అజ్ఞానం చేత అవిద్య చేత మనమంతా మన జీవితాలని సంసారాన్ని మనం నడుపుతున్నాం అని మనం అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే ఒక ప్రచ్ఛన్న హస్తం hidden hand అంటాం అది భగవంతుని యొక్క హస్తం కాబట్టి చేయి కాబట్టి అది మనల్ని భద్రంగా ఇవతలి గట్టు నుంచి అవతలి గట్టు ఇవతలి గట్టు ఏమిటి జన్మ అవతలి గట్టు ఏమిటి మరణం వీటి వివరాలు తెలుసుకోవటమే అధ్యాత్మ విద్య అందుకే చదువులన్నీ చదివి సావంగనేటికి చావులేని చదువు చదువవలయు అన్నాడు పోతన భాగవతంలో మనం chemistry లో phd ఇంకోదాంట్లో phd ఇంకోదాంట్లో ఇంకోటి అంతేకాదు అనేక subjects లో అనేక శాఖల్లో అనేక phd లు ఉన్నవాళ్ళం ఉన్నాం కానీ ఇవన్నీ కూడా మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం గనుక చేయకపోతే మనకి chemistry perfect గా వచ్చు maths వచ్చు languages వచ్చు అన్నీ వచ్చు పద్యాలు కూడా వచ్చు శ్లోకాలు కూడా వచ్చు పురాణ కథలు అన్నీ కూడా తెలుసు కానీ అవి ఏవీ అధ్యాత్మ కంటే ముందున్నవే తప్ప అధ్యాత్మలో భాగం కావు చావులేని చదువు the education which is eternal is to be studied in depth అది ఆ చావులేని చదువు అంటే ఆత్మను గురించినటువంటి విద్య దానికి ఆత్మవిద్య అని శ్రీవిద్య అని బ్రహ్మవిద్య అని మూడు పేర్లున్నాయి మూడు పేర్లున్నా ఉన్నది ఒకటే అది ఆత్మవిద్య ఆత్మ ఒక్కటే కాబట్టి సత్యసాయి భగవానుడు మనకు ఆత్మారామంలో అనేకమైనటువంటి దిశానిర్దేశాలు మనకు చేశారు మనం పారాయణం చేయవలసినటువంటి గ్రంథాలలో ఆత్మారామం ఒకటి అది చదవాలి బాగా deep గా చదవాలి మామూలుగా ఒక పారాయణం చేసి ఏదో ఒక పుస్తకం పట్టుకొని పారాయణం చేసుకుంటూ ఉంటే విన్నదే విని విన్నదే విని మనకేం పెద్ద ప్రయోజనం ఉండదు పారాయణార్హమైనటువంటిది ఏది అంటే సత్యసాయి భగవానుడు ఈ ఆత్మవిద్యా విలాసాన్ని గురించి సుస్పష్టంగా బోధించినటువంటిది అది ఆత్మారామం అనేటువంటి అత్యుత్తమ గ్రంథం అది భారతీయమైనటువంటి ఆత్మవిద్య భారతీయమైనటువంటి spiritual science వాటి అన్నింటిని గురించి చాలా గట్టిగా నిర్దుష్టంగా విస్పష్టంగా మనందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పిన గ్రంథం కాబట్టి ఇలాగే స్వామి జయంతి ఉత్సవాలలో ఆత్మారామాన్ని చదవండి అర్థం కాదు చాలా కష్టం అవుతుంది కష్టమైనా ఇష్టపడి చదవాలి ఏది కష్టం ఏదీ కష్టం కాదు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు సముద్రాన్ని కన్నెత్తి గనక కనురెప్పలు ఎత్తి చూస్తే సముద్ర స్నానం చేయగలవా అని భయం వేస్తుంది పాదాలు తడిచి-తడిచి కడిసి మనం దాంట్లో నిలబడే దాకా భయం వేస్తుంది కాళ్ళు మోకాళ్ళు నీళ్ళు మోకాళ్ళ దాకా వచ్చేప్పటికీ భయం తీవ్రత తగ్గుతుంది అలాగే నడుము దాటి కంఠం వరకు నీళ్ళు వచ్చేప్పటికీ భయం పోతుంది ఇది కూడా అంతే ఆత్మవిద్యను చెప్పటానికి వచ్చినటువంటి అవతారమూర్తే సత్యసాయి భగవానుడు కనుకనే ఆయన దగ్గరికి తాత్వికులు పండితులు కవులు వీళ్ళంతా వస్తే కవులు వస్తే కవిత్వం ద్వారా చెప్పమన్నారు ఆత్మవిద్యని పాండిత్యం ఉంటే పాండిత్యం ద్వారా చెప్పమన్నారు తత్వజ్ఞులు వస్తే తత్వం ద్వారా చెప్పమన్నారు ఆ వచ్చిన వారికి గనక దాన్ని సులువుగా చెప్పే శక్తి లేకపోయినట్లయితే స్వామి స్వయంగా చెప్పారు మనకందరికీ తెలుసు ఆ విషయాలు బృందావనంలో జరిగినటువంటి summer showers ఏ అవతారమూర్తి చేశాడు ఆ summer showers అనేటువంటివి ఈనాటికి సప్రమాణికంగా అవి ఎన్ని రకాలుగా ఎప్పుడు చదివినా నిత్యా నూతనంగా అనేకమైనటువంటి భావాలని అమృత భావాలని మనలో ఉత్పాదనం చేస్తూ మనల్ని పరవశుల్ని చేస్తూనే ఉంటుంది అది కాబట్టి ఆ తర్వాత స్వామి ప్రారంభించినటువంటి ఈ అవతార వైభవ విశేషంలో చేసినటువంటిది ఏమిటి అంటే అనేకమైనటువంటి విషయాల మీద స్వయంగా మాట్లాడటం అనేటువంటిది ఒకటి అంటే స్వామి దివ్యోపన్యాసాలు అని మనం సత్య సాయి speaks volumes అవి English లో ఉన్నాయి తెలుగులో ఉన్నాయి అన్ని భాషల్లో ఉన్నాయి వాటిని మనం చదవాలి వాటిని మనం చదవకుండా స్వామి మనకు అర్థం కారు ఎందుకంటే English లో ఒక మాట ఉంది we have to read between the lines పై పైన చ-చదివితే పై పైన చూస్తే అర్థమయ్యేటువంటి పదార్థం కాదు సత్యసాయి మహా పండితుడు అయినటువంటి వేలూరి శివరామశాస్త్రి గారు ప్రశాంతి నిలయానికి వెళ్ళిన తొలినాళ్ళలో అంటే ఒక ఉద్యమంలో ఆయన library అంతా కాలిపోయి బూడిదైపోయింది బూడిదైపోతే ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఆయన అరవింద సాహిత్యాన్ని భారతీయ తత్వ సిద్ధాంతాలని పరిపూర్ణంగా పరిశోధన చేసినటువంటి ఒక ప్రజ్ఞామూర్తి ఆయన కానీ ఆయనకి స్వామి యొక్క అనుగ్రహం వలన ప్రశాంతి నిలయానికి వెళ్ళే అవకాశం వచ్చింది ఆయన వెళ్లారు ఏదో మన బట్టి వాళ్ళం ఇప్పుడు చిన్న పిల్లలం మనమంతా ఉంటాం వేలూరి శివరామశాస్త్రి గారే ఇక్కడికి వచ్చారా అంటే ఏదో ఉన్నది విశేషం అనుకొని ఆయన దగ్గరికి రోజూ వెళ్లి కూర్చునేవారు ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ కొద్ది రోజులు అయిన తర్వాత కాస్త వయసులో పెద్దవాళ్ళు శివరామశాస్త్రి గారు ఒక మాట చెప్పండి ఎవరు ఈ సత్యసాయిరమణ మహర్షి వంటి వారా? రామకృష్ణ పరమహంస వంటి వారా? కాస్త చెప్పండి. మాకు అర్థం కావట్లే. వస్తున్నారు, ఆనందం అనుభవిస్తున్నాం. దర్శనం ఇస్తున్నారు, ఇంకా ఆనందం అనుభవిస్తున్నాం. కొందరిని దగ్గర తీసుకుంటున్నారు, మేము ఇంకా ఆనందిస్తున్నాం. ఆ రూప లావణ్య రేఖానితాంతం అయినటువంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఈ కళ్ళతో చూశాం అంతే. కానీ మీరు చెప్పండి మీరు పెద్దవారు అనుభవజ్ఞులు గనుక, తత్వశాస్త్రాన్ని మధనం చేసిన వారు గనుక చెప్పండి మీరు రామకృష్ణ పరమహంస వంటి వారా? రమణ మహర్షి వంటి వారా? అని అడిగారు. అడిగితే, నాకు తెలియటం లేదు. నేను వెతుక్కుంటూ ఉన్నాను. అసలు ఎవరు ఈ సత్యసాయి అని ఈరోజు నేను మీతో పాటే దర్శనం చేసుకుంటున్నాను. వారి దివ్య ఉపన్యాసాలు, మధురమైన మాటలు, మంజులమైన మాటలు వింటున్నాను. ఎవరినీ కష్ట పెట్టని, నొప్పించని దివ్య విధానాన్ని చూస్తున్నాను కానీ అంతేనా? వీను ఎప్పటికైనా నా పంచు చిక్కుతారా? అని అనిపిస్తున్నది. నాకు ఇంకా తెలియలేదు తెలిస్తే మీకు తప్పకుండా చెప్తాను అన్నారు. సరే ఈ ప్రశ్న ప్రధానంగా ఆయన మేధావి గనుక అక్కడ ప్రశాంతి నిలయంలో ఉన్నారు గనుక సహజం గానే ఆయన దగ్గరికి నేను వెళ్ళటం అనేది దోషం ఏం లేదు వెళ్ళారు. వెళ్ళిపోయి ఈ ప్రశ్న మాత్రం వేయకుండా మానలే. ఎవరు సత్యసాయి ఎవరో మాకు చెప్పండి. ఆయన దేవుడా? ఏత? యోగియా? మహా సత్పురుషుడా? పురాణ పురుషుడా? ఎవరు? How to define సత్యసాయి? How to understand him? మాకు మార్గం చూపించమని అడిగారు. ఇది జరిగిన ఆరేడు నెలల తర్వాత ఒకసారి మళ్ళీ ఇటువంటి ప్రశ్నని ఆయన ఎదుర్కున్నప్పుడు ఆయన అన్నారు. ఆయన రామకృష్ణ పరమహంస వంటి వారు కాదు, రమణ మహర్షి వంటి వారు కాదు. సత్యసాయి భగవానుడు సత్యసాయి భగవానుడే. అది అన్నారు. వారు అవన్నీ ఆయన మానేశారు. అది ఇలపై నడుస్తున్నటువంటి బ్రహ్మ పదార్థం. అది చేతనా చేతన నికేతనమది. పరమాద్భుతమైనటువంటి ఒక సద్వస్తువు. ఈ ప్రపంచం ఒక పుణ్యం చేసుకున్న కారణంగా అవనీతలనికి దిగి వచ్చినటువంటి పరమ చైత్య పురుషుడే సత్యసాయి అని ఒక విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణ జరిగి నలభై సంవత్సరాల పైన అయిపోయింది. ఎప్పుడైనా మనం ఇటువంటి స్థాయిలో సత్యసాయిని అనుభవించే ప్రయత్నం చేశామా? చేయలే. స్వామి చేస్తున్న ప్రతి పనిని మనం ఆనందించాం స్వామి కాబట్టి చేశారు అని ముగించేశాం. స్వామి చేశారు మనమేం చేయగలం అన్న ప్రశ్న మాత్రం మనం వేసుకోకుండానే మన కాలం మనం గడుపుతూ ఉన్నాం. అవతార వైభవంలో స్వామి Demonstrative గా నిరూపించారు ఈ ప్రపంచానికి. ఏమిటి అంటే, మీ సంకల్ప శక్తి బలీయం గనుక అయినట్లయితే, ఆ సంకల్పం స్వార్థ రహితం అయినట్లయితే, అది సర్వజన సమ్మతమైనట్లయితే, అది దేశ కాల కర్ణా వైచిత్ర చిత్రీకృతం అంటారు భగవత్పాదರು దక్షిణామూర్తి స్తోత్రంలో అట్లాగే దేశాన్ని, ప్రాంతాన్ని, వస్తువుని అన్నింటినీ దాటి సమస్తమైనటువంటి మానవ జాతికి ఈ అపురూపమైనటువంటి అధ్యాత్మ శాస్త్రాన్ని గనుక అందించగలిగితే అది అసలు సిసలైనటువంటి జ్ఞాన విశేషము, జ్ఞాన విభూతి అని స్వామి మనందరికీ కూడా చెప్పారు. వాటిని కాస్త శ్రమపడి ఆలోచించాలి, శ్రమపడి అధ్యయనం చేయాలి, చెప్పగలిగిన వారి దగ్గరకు వెళ్ళాలి. కానీ మూలాలను కూడా స్వామి మనకు వాహినీ స్వరూపంగా అందించారు. నా దృష్టిలో సత్యసాయి అవతార వైభవంలో మనం స్వామే చెప్పారు, నేను కట్టిన ఈ building లు ఏవీ నాకోసం కాదు మీకోసం కట్టించాను. మీరొచ్చి చెట్టు కింద, పుట్ట కింద పడుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. అసంఖ్యాకమైన జనం వచ్చినప్పుడు వాళ్ళు ఏం యతులు, యోగులు వస్తారా? సామాన్య జనులు గనుక వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి గనుక ఇవన్నీ కట్టబడ్డాయి. వీటికి దీనికి సంబంధమే లేదు అన్నారు స్వామి. అంటే, అకర్తృత్వంలోది పరాకాష్ట. చాలా విశేషం ఏంటంటే, ఇవాళ రమణ మహర్షి స్మరణకి రావటానికి గల కారణం కూడా ఒకటి అయి ఉండాలి. సెప్టెంబర్ ఒకటి అరుణాచలానికి రమణ మహర్షి వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఇది. ఈ అవతార వైభవంలో మిగతా గురువులు, సాధారణ గురువులు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు అటు వెళ్ళద్దు, ఇటు వెళ్ళద్దు, ఇక్కడే ఉండు, ఇక్కడే అన్నీ ఉన్నాయ్ అని చెప్తారు. సత్యసాయి భగవానుడు అట్లా చెప్పలే. స్వామి ఉపన్యాసాలు వినండి కాస్త. విన్నట్లయితే రామకృష్ణ పరమహంసని పదే పదే స్వామి చెప్పేవారు. రమణ మహర్షి ప్రస్తావన తెచ్చేవారు. ఇక శంకర భగవత్పాదుల భజగోవిందం గాని, ఆబోధ గాని ఆయన ఉపన్యాసాలలో చోటు చేసుకోని రోజు లేదు. ఏది అంటే స్వామికి ఈ వ్యక్తులు, పరిసరాలు, ప్రాంతాలు పరిమితమైనటువంటి అవతారం కాదిది. ఉదాహరణకి నన్నే గనక తీసుకున్నట్లయితే, ఇలాంటివి నేను చెప్పను కానీ ఇవాళ చెప్పాలి అవతార వైభవంలో ఇవన్నీ విశేషం గనుక. నాకు పద్దెనిమిది ఏళ్ళు వస్తున్న సమయంలో స్వామి చెప్పిన మాట, "జీవితంలో ఎప్పుడైనా నువ్వు అరుణాచలానికి వెళ్ళాలి" అన్నారు. అరుణాచలం ఎక్కడుందో తెలియని ఆనాటి పరిస్థితి నాది. కానీ, అది ఎక్కడుంది? అది మీరు చెప్పండి ఇవన్నీ అడిగే ఇది ఉండదు స్వామి దగ్గర. చెప్పారు అంటే చేయాలి, చేయాలి అంటే మనం చేస్తాం ఆయన చేయిస్తారు. సరే అన్నారు, విన్నాము, అయిపోయింది. అయిన తర్వాత నాకు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చే సమయానికి నేను అరుణాచలంలో వరల్డ్ బ్యాంక్ project చేయటానికి వెళ్ళా.నూట ఎనభై ఎనిమిది రోజులు అక్కడ ఉన్నా. వంద గిరి ప్రదక్షిణాలు చేసుకున్నా. ఈ చూడండి, వెళ్ళా, వచ్చా, చేశా, చూశా అంటున్నామే! అది కేవలం చెప్పడం కోసమే. పంపింది స్వామి, ఉంచింది స్వామి, చేయించింది స్వామి, ఆనందాన్ని కలిగించింది స్వామి. ఎందుకని అంటే స్వామి మాట పాలు మాట కాదు. ఎందుకంటే అది తోలు నోరు కాదు కదా! దాని నుంచి శుద్ధ చైతన్యంలో నుంచి విలువడేటువంటి మాట అది తొల్లుపోదు, అది ఎక్కడా ఆ వృధా కాదు. ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు, ఎనభై ఐదు ప్రాంతంలో అరుణాచలం నుంచి నేను ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు స్వామి-- స్వామికి నేను చెప్పాను "అరుణాచలం నుంచి వస్తున్నాను, నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను స్వామి". ఒక గంట, గంటన్నర సేపు మాట్లాడారు స్వామి, అనేక విషయాలు మాట్లాడారు. ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వస్తుండగా నా షర్టు పట్టుకొని నెమ్మదిగా లాగారు. ఇవన్నీ స్వామి చేయనివి పనులు. కానీ చేశారు. చేసి కళ్ళల్లో సూటిగా చూస్తూ ఒక స్టేట్మెంట్ అంటారు, డిక్లరేషన్ అంటారు, ప్రొనౌన్స్మెంట్ అంటారు ఒక సత్యాన్ని ఆవిష్కరించారు. "రమణులంటే ఎవరిని అనుకున్నావు బంగారు? సాక్షాత్తు ఈశ్వరుడే మరచుకు" అన్నారు. ఒక గురువు ఇంకొక గురువుని గురించి చెప్పడమనేది లౌకిక స్థితిలో జరగదు. అరుణాచలానికి వెళ్ళక్కర్లేదని చెప్పొచ్చు కానీ వెళ్ళాలి అని చెప్పారు. ఆ తర్వాత నా보టి వాళ్ళు చాలా మందిని స్వామి అక్కడికి పంపారు. అవతార వైభవంలో ఏ రకమైనటువంటి పరతమ భేదములైనటువంటి గురు స్వరూపం ఏదన్నా ఉంటే, నా అనుభవంలో అది పరమాత్మ సాయి మాత్రమే. ఎందుకంటే ఆయన కేవలం గురువు కాదు, ఆయన పరమాత్మ, దివ్యాత్మ. అందుకనే ఎప్పుడూ అంటారు "హరయ ప్రశాంతినలయంబు జీవహంసల దేవి". జీవహంసలందరం అక్కడికి వెళ్ళాం. పరమహంస పరమాత్మ సాయి. ఈ జీవహంసల మధ్యలో ఒక్క పరమాత్మ, పరమహంస నడుస్తూ ఉంటారు ఆయన. చిన్మయ శరీర ధారియై చెన్నార చెన్న చిత్ర స్వామి. చెన్నార అందగించెన్న అంటే అందం. అందం ప్రకాశమానం అవుతుంది. మనందరికీ వింటున్న మనందరికీ తెలుసు స్వామి దర్శనాలు ఎలా ఉండేవి అంటే, ఆ వైభవంలో వారు స్వామి నడిచి వస్తూ ఉంటే ఒక్కొక్క కళ పదహారు కళలు అరవైనాలుగు చిత్ కళలు ఒక్కసారి విజృంభమానం అయ్యేవి. ఒక్కోసారి అసలు స్వామి సౌందర్యాన్ని చూడ్డానికి రెండు కళ్ళు పట్టేవి కావు. అంత కాంతివంతమైన దేహం అది. ఇక చూపులలో చిప్పిల్లేటువంటి కరుణారస ప్రవాహం ఏదైతే ఉన్నదో, మన లోపల లోక-లోకాంతర ప్రాణాలు మొత్తము కూడా శుద్ధం చేసేటువంటి పవిత్ర గంగా స్నానంగా మారిపోయే. కాబట్టి స్వామిని కేవలం భౌతిక రూపంలో దర్శనం చేసి "నేను స్వామితో ఉన్నాను, స్వామితో తిరిగాను" కాదు. అసలు స్వామితో ఎట్లా ఉన్నాం? ఆ అసలు స్వామి లోపల ఉన్నారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా [తుమ్ము] యః సాక్షాత్కరుతే ప్రబోధ సమయే స్వాత్మానమైవాద్వయః దక్షిణామూర్తి వలె మౌన భూమికలో మన అంతరంగంలో ప్రసన్నంగా, ప్రశాంతంగా నిలకడ చెందినటువంటి సత్య సాయి భగవానుణ్ణి ఆంతరంగిక దర్శనం చేయాలి. [తుమ్ము] నిజానికి అవతార వైభవంలో ఇది ఒక aspect అయినట్లయితే స్వామి రామకృష్ణ పరమహంస గురించి చెప్పారనుకున్నాం, రమణ మహర్షి గురించి, శంకరుల గురించి. మనం-- స్వామి స్వయంగా సంస్కృతంలో ఉన్నటువంటి భజగోవిందాన్ని తెలుగులోకి స్వయంగా translate చేశారు. చేసి వదిలేశారా? పాడారు. మృదు మధురమైనటువంటి మంజుల గానం చేశారు, సంకీర్తన చేశారు. ఈ సమయంలో, ఈ కోవిడ్ సమయంలో స్వామి భజగోవిందాన్ని వినండి. అంటే ఒక కృష్ణుడు వేణుగానం చేసినట్లు ఒక సత్య సాయి భగవానుడు భజగోవింద గానాన్ని చేశారు. అంటే పరమేశ్వరుడు పరిమితమైనటువంటి శక్తిని ఈ ప్రపంచానికి చూపించాడు. ఒక విరాట్ మూర్తి మూడు వందల అరవై డిగ్రీలలో కూడా ఆవిష్కరిస్తూ వెళ్తారు. ఇవన్నీ కూడా అధ్యాత్మలో spiritual level లో స్వామిని మనం అర్థం చేసుకోవలసిన విషయం. ఇవన్నీ మళ్ళీ భౌతిక అవస్థతో కూడా కూడే ఉంటాయి. ఇదిగో నన్ను అక్కడికి ఎళ్ళమన్నారు, ఇప్పుడు చెప్పినదంతా భౌతికం కానీ అది ఆధ్యాత్మికం. అది అయి ఉండకపోతే అసలు వారు ఎందుకు పంపించారు? అంటే దేనినైనా లోతుని ఎరగాలి, లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళుతూ వెళుతూ స్వామి చెప్తారు చూడండి, "గోడ కట్టేవాడు పైకి వస్తాడు, బావి తవ్వేవాడు లోపలికి దిగుతూ ఉంటాడు" అని. అంటే బావి తవ్వేవాడు తక్కువని కాదు. వీడు భౌతికంగా పైకి వస్తుంటాడు గోడ కట్టేవాడు. బావి తవ్వేవాడు లోతుకి అంటే తన లోపలికి వెళుతూ ఉంటాడు, వరలు వేసుకుంటూ వెళ్తాడు. ఎక్కడిదాకా అంటే ఆ నీరు చిక్కేదాకా. నీర-నీరు నిలబడేట్లుగా నిర్మాణం చేస్తాడు. కాబట్టి రెండు రకాల సాధనలు కూడా మనం చేయాలి. పైకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. సంపదను సృష్టించాలి, సత్కార్యాలకు వినియోగించాలి. అందుకే స్వామి spiritual parlance లో ఒక plane లో అద్భుతమైన మాట చెప్పారు. "డబ్బు పాపిష్టిది కాదు కానీ పాపిష్టి వాడి చేతిలో డబ్బు ఉండకూడదు". ఇది ఒక సూక్తి, అద్భుతమైన నిర్వచనం అధ్యాత్మలో. అలాగేస్వామి తొలినాళ్లలో స్వామి సాహిత్యంలో నుంచే మళ్ళీ తీసుకున్నా మూడు ప్రధానమైన నిబంధనలు సాధకుడికి చెప్పారు స్వామి ఎందుకంటే మీరంతా నా భక్తులు అని ఎన్నడూ చెప్పలే సాధకులకు చెప్పింది ఏమిటంటే అబద్ధం చెప్పకండి అసత్యం చెప్పకూడదు ఎవరిని బాధించేట్టుగా ఏ విషయము చెప్పకండి సత్యమే చెప్పండి సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్ న బ్రుయాత్ సత్యం అప్రియం అప్రియమైనదాన్ని కూడా ప్రియంగా చెప్పండి you need not to oblige all the time but speak obligingly రెండు మూడవది వృధాగా ఏ రకమైన సంభాషణ ఎప్పుడూ చేయకండి వృధా మాటలు మాట్లాడుకోకూడదు ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి ఇరవై నాలుగు పేజీల పేపర్ వచ్చి వాకిట్లో పడిపోతుంది దానితో మనకేమన్నా సంబంధం ఉందా అయినా అవే మాట్లాడుకుంటూ ఉంటాం it's a waste of breath మన జీవన క్షణాలన్నీ కూడా జీవితం అంతా కూడా పొడి ఇసుక అరచేతుల వేల సందుల్లో నుంచి రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటుంది ఇంత అశాశ్వతమైనటువంటి ఈ వస్తువును పట్టుకొని మీరసలు పరమాత్మ భావనలోకి గనక వెళ్లకపోతే ఎట్లా అని ప్రశ్నించింది భగవాన్ శ్రీ సత్యసాయి అంతే కాదు నాల్గవది gossip అనేటువంటి దానికి gossip అంటే వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే ఉన్నదే అంతా gossip కాబట్టి పుకార్లు ఎప్పుడూ కూడా నమ్మవద్దు వాటిని ఇంకొకడికి చెప్పవద్దు మరొకమాట spiritual direction ఏంటంటే ఏ వ్యక్తిని గురించి కూడా ఆ వ్యక్తి వెనక ఎప్పుడూ మాట్లాడొద్దన్నారు ఎందుకంటే మీరు మాట్లాడే కొద్ది ఆ పాపమంతా మీకు అంటుకుంటుంది వాడికేం తెలియదు కదా ఏం మాట్లాడుకుంటున్నారో ఇవన్నీ కూడా అధ్యాత్మ కిందనే వస్తాయి అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదు మోక్షానికి దారి కాదది జీవితం చక్కగా జీవించటానికి గల దారి ఆ దారంతా స్వామి చెప్పారు స్వామి మిమ్మల్నే గురువుగా భావిస్తున్నాను చెప్పండి అంటే అప్పుడు స్వామి చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి అహంకారం ఉండనా గురువు చిక్కడు గురువు చిక్కనా అహంకారం ఉండదు చూడండి నీకు అహంకారము నేను నేను నేను అన్న భావన ఉన్నంత కాలం నీకు గురువు దొరకడు దొరికినా దొరికినట్లు ఉండి జారిపోతాడు నిజమైనటువంటి గురువు నీకు దొరికాడనుకో నీలో అహంకారం ఉండదు ఎందుకంటే నీ ఉనికి నీ అస్తిత్వం వ్యక్తిత్వం అంతా కూడా గురు హృదయంలోకి గురు ఆవరణలోకి వెళ్ళిపోతుంది గనక నీకూ దానికీ ఏటి సంబంధం లేదు లేకుండా హాయిగా శుద్ధంగా చైతన్యంగా ఉంటావు గనక అసత్యం ఆడొద్దు పుకార్లు నమ్మదు మనిషి వెనక మాట్లాడొద్దు అట్లాగే ఇంద్రియ నిగ్రహాలలో చాలా ప్రధానమైనటువంటి ఒక అంశం ఏమిటంటే నాలుకను వశం చేసుకోవటం స్వామి మాటే నాలుక వశం చేసుకుంటే నాకము వశమవుతుంది అన్నారు నాకము అంటే స్వర్గము తెలుగులో రెండు అక్షరాలున్నాయి ఒకటి రా రెండవది పో ఎవరన్నా మన వాకిట్లోకి వచ్చారు రా అని ప్రేమపూర్వకంగా పిలిస్తే ఆ వచ్చిన వాడు మనవాడవుతాడు పో అంటే మళ్ళీ వాడు మన-మన వైపు రానే రాడు ఎందుకొస్తాడు మనకి ఎట్లాగైతే ఒక self esteem గౌరవం ఉందో అతడికి కూడా అదే ఉంటుంది గనక అధ్యాత్మ అంటే మరణించిన తర్వాత స్వర్గలోకానికో ఆ మరొక చోటికో వెళ్ళటం కాదు ఉన్నదంతా ఇక్కడే నువ్వు అనుభవించాలి తల్లి గర్భంలో పుట్టి కడదాకా కూడా చివరి శ్వాస వరకు కూడా నువ్వు జీవితాన్ని నడపకూడదు జీవితాన్ని గడపకూడదు జీవితాన్ని ప్రతిక్షణం జీవించాలి ఎలా జీవించాలి ఎరుకతో జీవించాలి ఎరుక అంటే అసలు ఈ వస్తువులేవి నావి కావు ఈ కీర్తి నాతో రాదు ఈ సంపాదించిన సంపద నాతో రాదు వైదాంతికంగా కనిపిస్తుంది కానీ ఇవన్నీ సత్యాలు ఈ సత్యాన్ని జీవితాన్ని గురించి క్షుణ్ణంగా చెప్పేదే దాని పేరే spirituality ఇవాళ spiritual spiritual అనే మాట వాడుతుంటాం all spiritual activities are reduced to ritual activities ritual దాటితేనే దాని పేరు spiritual కాబట్టి ఇటువంటి ఆ spiritual activity అనేటువంటిది it is a mental activity it is a state దాని ద్వారా అన్నీ కూడా దాగి ఉన్నాయి కాబట్టి ఒక పరిపూర్ణమైన పరితృప్తమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి అంతే కాదు మనం చేయగలిగినటువంటి పనిని స్పష్టంగా చేయాలి చేయలేని పనిని నేను చేయలేను అని చెప్పగలగాలి ఈ రెండింటి మధ్య గనక తేడా వస్తే చాలా స్పర్ధ మొదలవుతుంది అలాగే money never united people money always divided people డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ అధ్యాత్మ సూత్రాలు స్వామి చూడండి ఎక్కడా మీరు స్వర్గానికి వెళ్ళే దారి చెప్పలే ఇటువైపు వెళితే నరకం వస్తుందని చెప్పలే ఎందుకంటే అవి మన అనుభవ ఎవరి అనుభవంలోనూ లేవు గనక యదార్థమైనటువంటి యాదార్దికమైనటువంటి ఈ నిత్య జీవితాన్ని అధ్యాత్మ అనేటువంటి ఒక ఆయుధం తీసుకుని ఎలా నడవాలో స్వామి మనకు సూచించారు గనక మిగతా అవతారాల వైభవాలన్నీ వారేవో చిన్న చిన్న కా పళ్ళు పెట్టుకొని వచ్చారు స్వామి అట్లా చేయలే మనిషిని మనిషిగా నిలబెట్టనిది ఏదంటే ప్రతివాడి యందు ఉన్నటువంటి మనస్సే ఆ మనస్సు యొక్క మూలాలు ఎట్లా ఉన్నాయి అది ఎట్లా ఏర్పడుతూ ఉన్నది వాటన్నింటిని గురించి చెప్తూ ముందు మీ మనస్సుని శుభ్రపరచుకోండి దాన్ని దైవీకరం చేయండి అప్పుడు మీ మనస్సులో దైవం ప్రవేశిస్తాడు.మీ మనసులో దైవం ప్రవేశించిన తర్వాత దైవం ఎట్లా ఉంటాడో నువ్వు కూడా అట్లాగే ఉంటావు కాబట్టి మీకు తెలియకుండానే ఒక పరిణామ ప్రాప్తి జరుగుతుంది అంటే transformation అనేదానికి అది అందమైన పదం పరిణామ ప్రాప్తి జరగాలి. నేను నలభై ఏళ్ల నుంచి స్వామి దగ్గరికి వెళ్తున్నాను అండి I am a great devotee of Baba I am very close to him అని అన్నామా స్వామి మనల్ని చాలా దూరం విసిరేస్తారు. ఎంత దూరం విసురుతారంటే అసలు మళ్ళీ పుడపర్తికి దారి ఎక్కడ అనేట్టుగా విసిరేస్తారు. రెండోది నేను స్వామికి ఎప్పటికైనా చేరువ కాగలనా? ఒక్కసారైనా దివ్య పాదాలను నేను తాకగలనా? స్వామి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని స్పృశించగలనా? ఒక్క సంభాషణైనా ఆయనతో చేయగలనా? అని అనుకోండి ఇరువది ఒక్క రోజుల్లో మూడు ఏకకాలంలో తీరుస్తారు. అంటే సర్వజ్ఞుడైన సర్వాత్మకుడైన సత్యబోధకుడైనటువంటి సత్యసాయిని ఒక spiritual level లో అధ్యాత్మలో అనుభవించటం మనం నేర్చుకోవాలి. ఇంకా fundamental గా కాసేపు miracles జరిగి నాకిలా జరిగింది నా భార్య ఆరోగ్యం ఆయనే సరిదిద్దారు నాకు ఉద్యోగం పోతే ఉద్యోగం ఇప్పించారు ఇది కాదండి. దీనిని దాటాలి మనం దాటించాలి అందరికీ ఇవి చాలా కష్టంగా అనిపిస్తాయి ఎప్పుడు మొట్టమొదటి రోజుల్లో తర్వాత తర్వాత తర్వాత నెమ్మదిగా స్వామి అర్థమవుతున్నప్పుడు మన కష్టాలన్నీ కూడా స్వామి తీరుస్తారు అనేటువంటి ఒక భావనలో నుంచి అట్లా కాదు ఆయన తీర్చటం కాదు మన కష్టాలని మనం ఎదుర్కుందాం స్వామి ఆ శక్తిని మనకిస్తారు అని అక్కడికొచ్చి స్థిమిత పడాలి. అందుకే స్వామి స్వామి దివ్యోపన్యాసాలలో ఒక మాటన్నారు స్వామి కష్టం తొలగించు తొలగించు అని అడక్కండి తొలగించటం పెద్ద కష్టమైన పని కాదు కానీ మీరు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మూటలు మోసుకుంటూ మీరు వెళ్ళాలి మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు పునరపి జననం పునరపి మరణం కదా! పునరపి జననీ జఠరే శయనం కాబట్టి మళ్ళీ రాక తప్పదు మీరు ఎలా వస్తారు మళ్ళీ పాత మూటలన్నీ మోసుకుంటూ మళ్ళీ ఇక్కడికి రావాలి కాబట్టి ఇక్కడివి ఇక్కడే clean చేసుకొని clear చేసుకుంటూ. దశాంత్ చూడండి ఒకసారి. ముత్తిరెడ్డి గారు సాయిరాం సార్. దశాంత్ చూడండి. ఆ సాయిరాం భరత్ ఒక నిమిషం ఆగి మీటింగ్ ఏందోకష్టాలన్నీ కూడా [వెనక శబ్దం] ప్రశాంత్ music కాంపోజ్ చెయ్ [వెనక శబ్దం] కష్టాలన్నీ కూడా మన నుంచి వైదొలగిపోయి ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు ఎలాగైతే పక్కకు జరిగిపోతాయో, ఎంత దట్టంగా కమ్ముకున్నట్లుగా అనిపించిన ఒక్క గాలి వీస్తే గాని చల్లార్చబడినట్లుగా ఈ కష్టాలన్నీ మన నుంచి దూరం అవుతాయి. ఇటువంటి ప్రబోధాలు ఈ అవతార వైభవం లో spiritual level లో చెప్పిన విషయాలు ఇవి. మిగితావాన్ని చెప్పడానికి శంకర్లు చెప్పారు, పండితులు చెప్పారు, కవులు చెప్పారు. అనేకమైనటువంటి తాత్విక సిద్ధాంతాలు వచ్చినాయి. అవన్నీ ఒక ఎత్తైనట్లయితే స్వామి ఏది చెప్పినా నిత్య జీవితంతో అనుసంధానం చేయమన్నారు. అధ్యాత్మ జీవితం వేరు, నిత్య జీవితం వేరు అనే రెండు లేవు. మందిరంలో ఒక రకంగా, మైదానంలో మరొక రకంగా ఉండే అవకాశం మన స్వామి భక్తులకి ఎవరికీ లేదు. మందిరంలోనో, మైదానంలోనో, ఏకాంతంలోనో, సమూహంలోనో అన్ని వేళలా ఒక్క రీతి ఉండాలి. ఒకే విధంగా ఉండాలి, చిరునవ్వును ధరించి ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. ఎవరి నుంచి ఏది ఆశించనటువంటి స్థితిలో జీవితాన్ని గడపాలి. అంతేకాదు స్వామి చెప్పిన పరమాద్భుతమైన spiritual direction లో మరొకటి ఏమిటంటే, ఏది చేయగలవో అదే నొసలు. ఏది చెప్పాలో అది కచ్చితంగా చెయ్. చూడండి! ఎంత అందమైన మాట ఇది. పైకి చాలా సులభంగా, చాలా సూటిగా ఏముందని అనిపిస్తుంది. చాలా కష్టం. ఎందుకంటే "వచః ఏకం మనః ఏకం కర్మణ్యేకం మహాత్మనః" అది కదా! మాట, చేత మధ్య పొంతన ఉండాలి. అలాగే కలలో, ఇలలో, మెలకువలో ఎవరి నుంచి ఏది ఆశించకూడదు. భగవంతుడు మనకు ఏమిచ్చాడో దానిలో పరితృప్తమైన జీవితాన్ని గడపాలి. రెండు ఉదాహరణలు మళ్ళీ మనం పునః పునః ఆ మాటలు స్వామివి ఎప్పుడూ చెప్పుకోవాల్సిందే. నీకంటే సింహద్వారం గనక ఎత్తులో ఉన్నట్టయితే ఈజీగా సింహద్వారం నుంచి లోపలికి పోవచ్చు. సింహద్వారమే నీకంటే తక్కువగా ఉంటే ఒక్క క్షణం తల వంచు ఏంచాలు. అలాగే సంపదను గాని, మనసుని గాని, ఏదైనా ఈ ప్రపంచంలో పొందినప్పుడు నువ్వు ఎట్లాగైతే నీ కాలికి చెప్పు నంబరు ప్రకారం ఎట్లా కొనుక్కుంటావో సంపదను కూడా అట్లాగే ఆచి తూచి వాడాలి. ఒక నంబరు ఎక్కువైతే నడక సాగదు, ఒక నంబరు తక్కువైతే పడిపోతాం. అలాగే దుప్పటి, పెద్ద దుప్పటి దొరికింది కాలికి బాయికి తప్పి పడుకోమన్నారు. దొరకలేదు శరీరాన్ని సగమే కప్పుతున్నది కాసేపు కురుచుకొని పడుకోవాల. అంటే ఇవన్నీ మనకు ఇంకొకళ్ళు చెప్పక్కర్లేదు, కానీ ఇవి కూడా స్వామి చెప్పారు. ఇవ్వేళ అనేకమైనటువంటి అనేక స్థితుల్లో అనేక రీతిలో చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి. ఇది మూడు రోజుల్లో, మూడు గంటల్లో అయ్యేది కాదు. అయినా దానిలో ఉన్నటువంటి స్వారస్యాన్ని మనం గనక గ్రహించినట్లయితే, మా గురువుగారు నందునేని రామకృష్ణమాచార్య వారు ఒకసారి మా ఇంటికి వచ్చారు. "ఇగో కరెక్ట్ గా ఈ ఈ పటాన్ని చూస్తూ ఏమో నువ్వు కూడా ఈ మాయలో పడిపోయావా I had great expectations" అన్నారు నవ్వుతూ. నేనేమీ మాట్లాడలే. ఒక వారం, పది రోజులు అయిన తర్వాత ఆయన తొమ్మిది పద్యాలు నవనీరాజనం అని రాశారు. ఆ నవనీరాజనం ఎవరి గురించి రాశారంటే సత్యసాయి భగవానుడి గురించి రాశారు. ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే స్వామిని పై పైన చూస్తే తెలియదు. ఒక్కసారి చూసినా కొంతమందికి ignite అయిపోతుంది. ఆయన అనంతపురం వెళ్ళి అక్కడి నుంచి పురపతి వెళ్ళినప్పుడు స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఆయన రెండు పద్యాలు, ఆ తొమ్మిది పద్యాల్లో రెండు పద్యాలు ఏం రాశారంటే, మొన్న ఒకటి చెప్తున్నా, "అవతరించె నేడు ఆంధ్రదేశమందు జగతిం ఉద్ధరింప సత్యసాయి, ఆతని ఉపన్యసింపె యావత్ ప్రపంచాన దేవభాషయై తెలుగు నేడు" తెలుగు భాష గురించి ఇలా మాట్లాడుతున్నారు. అలాగే ఇంకొక మాట ఈయన దైవమా? మానవుడా? ఎందుకంటే ఆయనకి ఇంకా అనుభవం కలగా. ఆయన ఒక పద్యం చెప్పేశారు చాలా చిన్న అందమైన పద్యం. "అరయ సత్యసాయి పరదేవుడైనచో ఆయన మానవీయతకు అంజలి, అరయ సత్యసాయి నరమాత్రుడైనచో ఆయన దివ్యతకు అంజలి" అన్నారు. అర్థం అయ్యిలేదు. చాలా సూటి అయిన అర్థం, గంభీరమైన అర్థం ఏమిటంటే ఈయన పరమాత్మ అని భావిద్దామా అంటే ఏ పరమాత్మని నేను ఇంకా చూడలేదు కదా! కాబట్టి ఈయనలో ఉన్నటువంటి మానవీయ ధర్మమే ఆయన్ని పరమాత్మ చేసింది గనుక దానికి నమస్కరిస్తున్నా రెండవది. కాదు కాదు ఈయన మామూలు మన బోటి మనిషే. అరయ సత్యసాయి నరమాత్రుడైనచో, కేవల మానవుడైనట్లయితే ఆయన దివ్య గరిమకు అంజలి. ఏ మానవుడు మాత్రం ఇన్ని పనులు చేయగలిగాడు జీవితంలో. జన్మ ఎత్తాం, వచ్చాం, ఏదో రోజున పోతాం ఇంతే కదా! కానీ ఆయన చేసిన పనులు, ఏ ఒక్క పనిలో స్వార్థం లేనటువంటి పనులు ఈ ప్రపంచానికి నేర్పారు, చూపించారు. అధ్యాత్మలో జీవితాన్ని ఆ స్వామి చెప్పిన మాట ఏంటి What is worship మనందరికీ తెలుసు. మనం దాన్ని worship is work గా మార్చేశాం. ఆరు గంటల ధ్యానం, ఎనిమిది గంటలు యోగం, మూడు గంటలు ఇంకోటి అయిపోయింది. కాదు, "కర్మాణుబంధీ మనుష్య లోకే" కర్మ పని చేయటానికి మనం జన్మ ఎత్తి వచ్చాం. ఒక్కసారి మనందరం కూడా ప్రశాంతి మేడలో స్వామిస్వామిని దర్శించిన కొన్ని వేల దర్శనాలలో ఒక దర్శనాన్ని మనం గుర్తు చేసుకుందాం స్వామి ఎలా నడుస్తారు టైం అని. సుప్రభాతం [స్పీచ్ ఎకో] మనం లేస్తాం తయారయ్యే టైం కి స్వామి తయారై ఉంటారు. ఆశ్చర్యం. నగర సంకీర్తన చేసినంత సేపు స్వామి బాల్కనీలో ఉండి మనతో పాటే ఉంటారు. అయిపోతుంది మళ్ళీ మనమందరం వెళ్తాం మళ్ళీ గంట వస్తాం స్వామి దర్శనానికి కూర్చుంటాం. ఏడు నలభై ఐదు కి సమ్మర్ లో దర్శనం కనుక అయితే ఏడు నలభై ఐదు కి కరెక్ట్ గా ఒక నిమిషం అటు ఇటు లేకుండా వస్తారు. వింటర్ అయితే ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్. ఖచ్చితంగా ఎనిమిది గంటలకు గడియారం దిద్దుకోవచ్చు. వచ్చి మనందరం ప్రపంచంలో అందరూ గురువు దగ్గరకు నడిచి వెళ్తారు. గురువు గారి దగ్గరికి వెళ్లి ఏవో ఇచ్చేస్తూ ఉంటారు. ఆయన ప్రతి భక్తుడి దగ్గరికి నడిచి వచ్చారు. ఎవరి దగ్గర నుంచి ఏ విన్నపం వేడుకోలు తీసుకోవాలో అవన్నీ తీసుకున్నారు. అంటే తన శరీరాన్ని కర్మ యోగంలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చెప్పవలసిన మంచి మాటలు చెప్పారు. మర్యాద పురుషోత్తముడుగా అందరినీ కలకరించారు. ఏ ఒక్కరినీ నా వాడు అనుకోలేదు ఏ ఒక్కరినీ కూడా పరాయి వాడు అనుకోలేదు. అందరిలో స్వామి మనందరం గనక చిన్న అట్టము పైలన్ అట్ట ముక్కలుగా పడి ఉంటే ఒక సూర్యునితో సమస్త జీవులకు తాను ఒక్కొక్కడికి చూచు రీతి మనందరిలో సత్య సాయి భగవాన్ ను ప్రతిఫలించారు. అంటే అందరిలో దర్శనం చేసి చూశారు స్వామి. ఎవర్ని చూశారంటే మన ఇళ్ళున్న ఆత్మను మన రూపు దానికి సంబంధం లేదు, మాకున్న పండిత్యంతో సంబంధం లేదు, డిగ్రీలతో సంబంధం లేదు, మన సంపదలతో అసలే సంబంధం లేదు అటువంటి ఒక నిరావయమైనటువంటి జ్ఞాన వైరాగ్యమూర్తి భగవాన్ శ్రీ సత్య సాయి. అది అయిపోతుంది. దర్శనం అయిపోయాక మనకు మళ్ళీ సాయంకాలం దాకా పనే ఉంటుంది అనుకునే వాళ్ళం ఆ రోజుల్లో. కానీ స్వామి ఆ మధ్య కాలంలో ఎందరెందరో వందల మందితో స్వామి మాట్లాడేవారు. One to One మాట్లాడేవారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇటు school ఇటు college అంటే అక్కడ ఉన్న ప్రతి activity లోనూ స్వామి ప్రతి క్షణము connect అయి ఉన్నారు. వీటి మధ్యలో ఒక్కసారి అట్లా బయటకు వెళ్ళి గోశాలకు వెళ్ళేవాళ్ళు గోకులం. వాటన్నింటినీ పరిశీలించి వచ్చేవాళ్ళు. వాటి బాగోగులు చూసేవారు. వస్తూ వస్తూ సాయి గీతలను చూసేవారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉండేవారు. వచ్చి construction సేవల్లో ఉంటే వాటన్నింటినీ స్వయంగా చూసేవారు. instructions ఇచ్చేవారు. ఇవాళ మనం outsourcing విధానంలోకి వచ్చేసాం. ప్రతీదీ ఎవరో మనకు చేస్తారు. ప్రతీదీ ఎవరో మనకు తెచ్చిస్తారు. మనల్ని దేనికీ నడవక్కర్లేదు అనేటువంటి స్థితికి మనం వచ్చేసాం. జాతి వచ్చేసింది. ప్రపంచం అంతా అట్లా అయిపోయింది. కానీ స్వామి ఈ ఇరవై నాలుగు గంటలలో స్వామి అంతా జాగ్రత్తగా వస్తే ఆయనకు నిద్ర అనే వస్తే లేదు. మనం కూడా అట్లాగే సుమారు పదహారు, పద్దెనిమిది గంటలు దరిద్ర వేషంలో ఉన్న వాళ్ళందరం గురించి అని. దీనితో పాటుగా సేవా కార్యక్రమాలు అనేక పండగలు, పబ్బాలు అన్నింట్లో ఒక spiritual. అక్కడ ఒక నాటకం వేసినా, నాటిక వేసినా, ఒక భువన భవన విజయాలు సాగినా దాని వెనుక ఆ ఉత్సాహమే. ఏమిటి మీరు స్వామి దగ్గరికి వెళ్లి ఏం మాట్లాడుతారు అనుకున్న వాళ్ళు అద్భుతమైన కవితా రచనలు చేశారు. కలకాలం నిలిచిపోయే పద్యాలు రాశారు. స్వామిని వాళ్ళు-వారు దర్శించిన కీర్తనలన్నీ కూడా ఆ సాహిత్య రూపకాలుగా మనకు అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఏంటి? జీవితాన్ని సంపూర్ణంగా, సమర్థంగా, అర్థంగా, పారమార్థికంగా జీవించాలి. మనం relax అవటం అంటే ఏమిటో స్వామి ఒకసారి అడిగారు. relaxation అంటే ఏంటి? అని అడిగారు. ఏదో ఒక సినిమాకి వెళ్తా ఉన్నాడు, ఇంకేదో బయటికి వెళ్తా ఉన్నాడు, చేసే పని మానేసి వెళ్తా ఉన్నాడు, ఒక రెండు రోజులు ఆ work ని ఆపేస్తే అదే relaxation అయిపోతుంది అని అనేక రకాలు వస్తాయి. Change of work is relaxation అని చెప్పారు స్వామి. ప్రతి పని నుంచి ఒక విరామం కొద్దిగా విరామం తీసుకుని ఇంకో కొత్త పనిలోకి వెళ్ళాలి. కానీ అవన్నీ చేయవలసిన పనులే. ముందు ప్రపంచానికి ఉపయోగపడే పని చేయాలి. మనకు ఆనందాన్ని కలిగించే పని చేయాలి. ఈ రెండూ కలిసి పరమాత్మకి సంతోషం కలిగించే పని మనం చేయాలి. అంటే కర్మ యోగాన్ని నిర్దుష్టంగా పాటించిన అవతారమూర్తి స్వామి. తానే సర్వదేవతా అతీతమైన లేదా సర్వదేవతా స్వరూపం అయినప్పటికీ కూడా ఏ రాముణ్ణి, ఏ కృష్ణుణ్ణి, ఏ చంద్రశేఖరుణ్ణి ఎవరినీ కూడా స్వామి పక్కన పెట్టలేదు. భారతీయమైనటువంటి ఒక హైందవ ధర్మంలో మిగతా మతాలలో ఉన్నటువంటి మహత్ పూర్ణమైనటువంటి పురుషుల పట్ల వారి పరంగా స్వామి నేర్పిన భజనలు ఎన్ని అంటే ఏమో అసంఖ్యాకం. అవి ఎవరు పాడుతున్నారు? హిందువులేనా? ఆంగ్లులేనా? భారతీయులేనా అంటే చైనీస్ వాడు వచ్చి చాగరాజ కృతి పాడతారు స్వామి దగ్గర చూడండి. కాబట్టి ఇదంతా కూడా ఏ వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలని వేదం ఘోషించిందో, ఏ వేదం చెప్పిందో, అసలు ఈ వసుధంతా కూడా ఒకే ఒక్క కుటుంబంగా, ఒక్క జాతిగా, ఒక్క భాషగా ఉంటుంది అంటే అట్లా ఎట్లాగండి భాషలు అనేకం ఉన్నాయి కదా అంటే భాషలు లిపులు వేర్వేరుగా ఉందని మానవజాతికి ఒక్కటే భాష ఉంది హృదయ భాష అని చెప్పిన ఏకైక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్య సాయి. మీరు మనసుతో మాట్లాడండి ఖచ్చితంగా గందరగోళం ఏర్పడుతుంది. హృదయంతో మాట్లాడండి ఏమీ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏమన్నామో అవతల వాడి హృదయంలోకి వెళ్ళిపోతుంది. సూటిగా అర్థం అయి ఉండు అండి అంటాడు. కారణం ఏంటంటే హృదయ భాషకున్నటువంటి సారల్యము, సారల్యము, భావల్యము అంటే చల్లదనం, తేట చల్లదనం దాని యందున్నాయి అని అర్థం.కాబట్టి "అహం సత్యభోధకాః" అని ఇచ్చిన స్వామి పశుపక్షాదులని, పాముల్ని అందరినీ కూడా ప్రేమించారు. అందరినీ దగ్గర తీసుకున్నారు. మనం అనుకుంటాం బాగా స్వామితో దగ్గరగా ఉన్న వాళ్ళకే స్వామి, లేదు వాడు మహాయోగం చేశారు అందుకని దగ్గరైనారు, ఇవన్నీ మనం చేసుకునే మనోభ్రాంతులే తప్ప అవి ఏవీ కావు-కావు-కావు. కష్టంలో ఉన్న ఏ జీవి అయినా వాడు, ఏ జాతి వాడు అయినా స్వామి ఆదరణకి, ప్రేమకి వాళ్ళు మంచుకోకుండా లేరు. ఎవరినీ కాదన్నది లేదు. మీరంతా నా వారే అన్నది లేదు. కానీ తటస్థ కూటస్థుడై ఉన్నటువంటి స్వామి త్రికూటస్థా-త్రికూటస్థానంలో స్థిరితంగా ఉన్నటువంటి ఒక అంతరంగ సాయి ఇవాళ ఒక అవతార వైభవం ప్రపంచంలో వేనోళ్ళ, వేనోళ్ళ అనేది చిన్నమాట. కోటి కోటి నోళ్ళలో సత్యసాయి భగవాన్ ని యొక్క దివ్య చరిత్రము, చరిత్రము, స్వామి యొక్క వైభవము, గుణగణాలు సంకీర్తనలు జరుగుతూ ఉన్నాయి అంటే స్వామి ఈ భూమండలం మీద మానవ దేహం ధరించి ఎట్లా జీవించారో మనం గమనించాలి. అందుకనే స్వామి చెప్పిన మాట "మీ-మీ జీవితాన్నే నాకు సందేశంగా మార్చండి" అని స్వామి చెప్పారు. అవును నిజం. ఎందుకంటే ఆ మన జీవితాలు అందరికీ సందేశం ఇచ్చే రీతిలో ఉండవు. కానీ మన జీవితం సాయి సందేశం కావాలి అంటే స్వామి ఎట్లా జీవించారో, స్వామి ఎట్లా అందరినీ ప్రేమించగలిగారో, స్వామి నుంచి మనం ఎటువంటి ప్రేమని పొందామో, ఎటువంటి ధైర్యాన్ని, శైర్యాన్ని, శక్తిని పొందామో వీటన్నింటినీ కూడా మనం మన పక్క వాడికి transmit చేస్తూ ఉండాలి. ఇది చాలా అవసరం. ఇది పరమ పవిత్రమైనటువంటి సేవ. మిగతా సేవా కార్యక్రమాల గురించి నేను చెప్పటం లేదు. ఎందుకంటే సత్యసాయి organization world wide గా ఈ సంస్థ చేసినట్లుగా ఏ ఒక్క సంస్థ కూడా దీనికి సమానమైనది కాదు. ఎందుకంటే అది ఏది రానివ్వండి, ఏది పోనివ్వండి, అది ఎంత భయంకరమైనటువంటి విపత్తు కానివ్వండి ముందుగా మొట్ట మొదట ఉండే front warrior ఎవరు అంటే సత్యసాయి devotees. సత్యసాయి సేవా organization అక్కడ ముందు అందరికంటే ముందు అక్కడ వాలుతుంది గనుక, అవన్నీ మనం విడమర్చి వేళ ప్రచార సాధనంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. స్వామి ప్రచారాన్ని నిరసించారు. ప్రచారం మనకు వద్దు పంజాబ్. మనం అన్నీ జరుగుతూ వెళుతూ ఉంటాయి. వాళ్లకు అందించటం ప్రధానం. ఎవరు చేశారన్నది ప్రధానం కాదు, ఎవరు చేయించారన్నది ప్రధానం కాదు, ఆతని మూతికి ముద్ద అందిండా లేదా అది గమనించండి అన్నారు. ఒక్క-ఒక్క సంఘటన మాత్రం మీతో పంచుకుంటాను. స్వామిజీ యొక్క birthday జరిగింది. అందరికీ దుప్పట్లు పంచిపెట్టారు. కంబళ్లు పంచిపెట్టారు. సుమారుగా రాత్రి ఆరున్నర, ఏడు గంటలు అయిపోయింది. అందరూ అనుకున్న ప్రకారం కంటికి కనిపించినంత మేర అందరికీ కూడా దుప్పట్లు పంచిపెట్టి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. కానీ స్వామి ఒక్కడే ఆ రోజు వరండాలో వెనక్కి చేతులు పెట్టుకొని నిల్చుని ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు వస్తారా అని. ఒకసారి వచ్చి స్వామి దగ్గరికి వెళ్లి, "స్వామి మీ అనుగ్రహంతో ఇవన్నీ చక్కగా జరిగాయ్" అని చెప్తే, "చాలా సంతోషం. మీరు చాలా అలసిపోయినారు. స్వామికి ఎంతో సంతోషం కలిగింది. కానీ ధర్మవరం, కొత్తచెరువు దాటి ధర్మవరం వెళ్లేటువంటి మూల మీద ఒక చెట్టు కింద పాపం సత్యసాయిబాబా నాకు కూడా దుప్పటి పుంతాడు అని కూర్చున్నాడు. మీరు అక్కడికి వెళ్లి రండి పంజాబ్" అన్నారు. ఇక్కడ already seven PM. ఒక్కళ్ళు, మేము అలసిపోయాం అన్నవాళ్ళు లేరు. స్వామి అనగానే నమస్కరించుకున్నారు. ఒక్కసారి వెనుతిరిగితే ఆశ్చర్యకరంగా స్వామి ఏ ప్రత్యేకమైన ప్రదేశం చెప్పారో అక్కడ కూర్చుని ఉన్నాడు. వెళ్ళగానే సాయిరాం అని దుప్పటి ఇవ్వగానే, "బాబా నాకు, సత్యసాయిబాబా నాకు పంపిస్తాడని నాకు తెలుసు" వాళ్ళకి ఏకవిశ్రాంతంగా మనమంతా మనం మలయాళ పురుషోత్తములం కదా! కాస్త పండిత భాష ఎక్కువ కాబట్టి ఆ అంటాం వాళ్ళు ఏమంటారు, సత్యసాయిబాబా అన్నారు, సత్య-సత్యసాయి అన్నారు, బాబా అన్నారు, గు అంటారు, గు అంటారు వాళ్ళిష్టం. అని వాళ్ళ, అతను ఏమన్నాడో తెలుసునా? "సాయిని మనం వెతుక్కోక్కర్లా, సాయి ఇక్కడ దగ్గర ఉండబట్టే మీరందరూ ఇక్కడికి వచ్చి నన్ను పిలిచారు" అన్నాడు. అతడు పండితుడా, పామరుడా? మళ్ళీ వేలూరు శ్రీరామశాస్త్రి గారే అన్నట్లు ఆ రోజున నేలమీద నిలిచే బ్రహ్మ పదార్థం అని చెప్పిన ఆయనే ఏమన్నారంటే, "ఈ సత్యసాయి ఒకటి గుర్తు పెట్టుకోండి. పండితులకు మాత్రం ఈయన పరీక్ష, పామరులకు మాత్రం శ్రీరామ రక్ష" అన్నారు. అంటే పామరుడు ఎవరంటే, దదివయందు చెప్తారు కదా భగవత్పాదులు మూఢమతేయ అని. నాకు బాగా చదువు ఉన్నది అన్నవాడు పామరుడు. ఎందుకంటే నా-నేను ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇదివరకు వచ్చాను అనుకోవాలి తప్ప అనంత మహాసాగరాన్ని నువ్వు కొలిక్కిట్ట పట్ట-కొలిక్కిట్ట పట్టగలవా? లేదే. కాబట్టి ఈ విజ్ఞానం, ఈ భూమిక చాలా పెద్దది. నాకెంత వచ్చు అని అనుకోవద్దు అన్నారు. అనుకుంటే అది పామరత్వం. మానసికమైన పామరత్వం. కాబట్టి పండితుడు, పండితునికి శాస్త్రాలు అక్కర్లేదు. పామరుడికి అర్థం కావు. మరి ఏం చేద్దాం ఈ శాస్త్రాలని? పండితులు అర్థం చేసుకుని, చదివి, అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, అనుభవాన్ని పొంది పక్కవాడికి చెప్పాలి. అది వారి బాధ్యత. పాండిత్యాన్ని, మాటని నమ్ముకోవాలే తప్ప అమ్ముకోకూడదు. ఇది రెండవది. ఇవన్నీ స్వామి చెప్పిన మాటలే. పత్తాభింగారు వీటన్నింటినీ మనం పునః-పునః, పునః-పునః చూసుకుంటూ ఉన్నట్లయితే, అందుకే స్వామి ప్రారంభించిన అధ్యయన మండలి చాలా ప్రాణమైనటువంటి అంశం అది. ఎక్కడా study circles లో subject మీద మాట్లాడి ఒక speaker monologue ఇచ్చి వెళ్ళిపోతాడు. సత్యసాయి దాంట్లో అట్లా ఉండదు.మనందరికీ స్వామి devotees కానీవారు కూడా వింటున్నారు గనుక ఈ మాటలు చెప్తున్నాను అన్నింటికంటే సత్యసాయి వైభవంలో నా దృష్టిలో పరమోన్నతమైనటువంటిది ఏది ప్రాథమికమో ఏది అత్యుత్తమము ఏది అన్ని కాలాలకు relevant ఏ దేశ కాల పరిస్థితులు ఎట్లా ఉన్నా అత్యంత అవసరమో దాని పేరు బాల వికాస్. బాల వికాస్ అంటే పిల్లలకు కేవలం శ్లోకాలు చిలక పలుకులు చెప్పటం కాదు ఒక నైతిక ధార్మిక కార్మిక యౌగిక శక్తులను ఒక బిడ్డ యందు ప్రవేశపెట్టగలిగినటువంటి ఒక పరమాద్భుతమైన బాల వికాస్ వ్యవస్థను స్థాపిస్తే ఆ బాల వికాస్ పిల్లవాడే కౌమారంలోకి వెళ్తాడు వాడే యవ్వన దిశగా వెళ్తాడు ఆ తర్వాత మధ్య వయసుకు వెళ్తాడు జీవితమంతా వికాసమానమైన జీవితాన్ని గడుపుతాడు గనుక ఈ తొంబై ఒకవ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా బాల వికాస్ ఇంకా పటిష్టం కావాలి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు బాలబడి స్థాయికి రావాలి ఏం తాతగారు వచ్చి మనవడి దగ్గరికి వచ్చి చిలక పలుకులు పలకటం లేదా తనకు మాటలన్నీ వచ్చినా పిల్లవాడు మాట్లాడినట్టు మాట్లాడలేదా పిల్లవాడి దగ్గర పిల్లవాడి భాషలో మాట్లాడాలి. వాడిని వాడి మనసుని భగవంతుడి వైపు నడిపించాలి భగవంతుడు అంటే మూఢత్వము చాదస్తము కాదు అది భయానకమైన విషయం కాదు నువ్ ఇది చేయకపోతే అది అయిపోతుంది నువ్ ఇది చేస్తే ఇది వచ్చేస్తుంది ఇవి చెప్పకూడదు జీవితం అంటే ఇది భగవంతుడు అంటే ఇది జీవ జగత్తు జగదీశ్వరుడు ముగ్గురు ఒకటే. ఏశ్వరో గురుర్ ఆత్మతి మూర్తి భేద విభాగే మూడు విడివిడిగా కనిపిస్తాయి జగత్తుంది జగత్ ఎట్లా ఉంది జీవుల వల్ల ఉంది జీవుడు ఎలా ఉన్నాడు జగత్తుతో బతుకుతున్నాడు మరి ఈ రెండింటిని నడిపిస్తున్న వాడు ఎవరు జగదీశ్వరుడు మరి ఈ ముగ్గురు ఒకటే కదా కాబట్టి జీవ జగత్ జగదీశ్వరుల యొక్క ఏకత్వాన్ని మనం గ్రహించి బాల వికాస్ ని అలా పరిపుష్టం చేసి స్వామి hundred years. ఆ సమయం వచ్చే సమయానికి బాల వికాస్ అగ్రగామి కావాలి అనేటువంటిది స్వామి భక్తుడిగా స్వామిని అతి చిన్న వయస్సు పన్నెండు సంవత్సరాల వయస్సులో స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని తలుచుకోవాలి ఆ వెళ్ళటం ఎంత కష్టపడి ఇష్టపడి స్వామిని చూడాలని వెళ్తే స్వామి చేసిన పని నన్ను ఈశ్వరమ్మ తప్ప చెప్పేశారు మూడు రోజులు ఉన్నా చెప్పారు అరిటాకులో అన్నం పెట్టు కొత్త గిన్నెలు తెప్పించు ఏమి వద్దు ముద్ద పప్పు నెయ్యి పెరుగు అన్నం వేసి పెట్టు సాత్విక భోజనం పెట్టు నీకు అప్ప చెప్తున్నా ఈశ్వరమ్మ అని చెప్పారు స్వామి ఆమె నన్ను వెంబడి పెట్టుకొని చిటికెన వేలు పట్టుకొని ఇంటికి తీసుకెళ్తుంటే దారిలో వాళ్ళంతా అడిగారు ఎవరీ బిడ్డ అని అడిగారు ఈ బిడ్డ ఎవరిట్లా వస్తున్నాడు నాకు చెవిపోగులు ఉండేవి. దగ్గర వెళ్తూ ఉంటే ఆమె మౌనంగా స్వామి అప్పజెప్పారని ఆ జాసలోనే వెళ్తూ తీసుకెళ్తున్నది. వెళ్తూ ఉంటే ఒకరిద్దరికి జవాబు ఇవ్వలే కానీ ఈశ్వరమ్మతో బాగా అసలు ఉన్న ఒక ఆమె ఇంటి దగ్గర పడింది ఏం ఈశ్వరమ్మ ఎవరికీ జవాబు చెప్పటం లేదు ఎవరీ అబ్బాయి అని అడిగింది ఏమో నాకు మాత్రమే తెలుసు స్వామి పిలిచినాడు అప్పజెప్పినాడు ఒకటే ఒకటి చెప్పాడు మూడు రోజులు ఉంచుకోమన్నాడు ఇదిగో ఈ వేస్తప్పుడేగా నీకు నాకు సంబంధాలు లేవని వెళ్ళిపోయినాడు బహుశా ఆ రోజు తీర్చడం కోసం ఈ బిడ్డను నాకు ఇచ్చి పంపించాడేమో అన్నది అది మాత్రం శ్రీ ఈశ్వర ఇది యదార్థం ఇది సత్యం ఎందుకంటే కథ కాదు కల్పన కాదు ఇది ఆ రోజున మళ్ళీ నన్ను ఈశ్వరమ్మ మూడు రోజులు అయిపోయిన తర్వాత ఆ స్వామి దగ్గరికి తీసుకెళ్తుంటే నాకు తెలుసు కదా నేను వెళ్తా లేక అవ్వ మీరు ఉండండి అన్నా అట్లా కాదు స్వామి సంగతి నీకు తెలీదు నేను అప్పజెప్పిన బిడ్డ ఎక్కడ ఉన్నాడు నన్ను అడుగుతారు అప్పుడు నువ్వేం పండక్కి వెళ్ళిపోతావ్ నేనేం చేయను కనుక స్వామి ఎట్లా అప్పజెప్పారో మళ్ళీ నిన్ను స్వామికి అక్కడ అప్పజెప్తాను బాబు అని నన్ను తీసుకెళ్ళి స్వామి దగ్గర అప్పజెప్పింది. అంటే ఈ ప్రత్యేకమైన ఒక వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పటం ఒకనాడు స్వామి ఒక మాట చెప్పారు ఇది అందరికీ తెలియాలి అని నేను చెప్తున్నాను. inside room లో పిలుస్తారు ఆ రోజుల్లో పిలిస్తే వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడుతారు స్వామి చెప్పారు ఇద్దరు మనుషుల మధ్య ఒక సంభాషణ ఏమైతే జరిగినట్లయితే అది ఆ ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి. ఈ ప్రపంచంలో అనాచారం రావటానికి గల కారణం ఏంటంటే ఈ ఇద్దరి మధ్య జరిగినది మూడో వాడికి చెప్తారు మూడో వాడు ముప్పై మందికి చెప్తాడు ముప్పై మంది ముప్పై వేల మందికి చెప్తారు అసలు జరిగింది వింటున్నది మారిపోతాయి కనుక ఈ నియమాన్ని పాటించండి అంటే నా వరకు నేను సత్య సాయి భగవానుడితో జరిగిన సంభాషణ నావైతే వ్యక్తిగతంగా ఏమీ లేవు ఉన్నవన్నీ ఆధ్యాత్మిక పరమైనవే ఉదాత్తమైనవే. Sanskirt quote Sanskirt quote అంటూ మొట్ట మొదటి భగవద్గీత శ్లోకం నాకు చెప్తూ అనన్య చింతనతో ఉండాలి వేరే చింతన ఉండకూడదు అంటే ఇంకొకళ్ళని చూడొద్దని కాదు ఇంకొకళ్ళని గురించిన బుక్కు చదవొద్దని కాదు చింతన ఒక్కరి యందు ఉండాలి అనన్య చింతన ఉండాలి ఏ జనాః ఎటువంటి వారైతే ఉన్నారు పరి ఉపాసతే పరి ఉపాసన ఒట్టి ఉపాసన చేయడం కాదు పరి ఉపాసనే ఉపాసన అంటే దగ్గరగా ఉండటం ఉపనిషత్తు అంటే దగ్గరగా కూర్చోవటం కాబట్టి పరి ఉపాసన నీవు స్వామి నుంచి దూరంగా నివసిస్తున్నా స్వామి దగ్గర ఉన్నట్టు భావించాలి. మీ స్వామి నిన్ను విడిచి ఎప్పుడూ బయట ఉండడు నీతోనే ఉంటాడు one to one అందరి యందు ఉంటాడు. Sanskirt quote ఇది ఎప్పుడో పది రోజుల నుండి పదకొండవ రోజు మారిపోకూడదు nityamu abhiyuktanam చూడండి అక్కడ paryupasate ఇక్కడ abhiyuktanam.కూడి ఉండాలి చిక్కిరిసి ఉండాలి ఉన్నట్లయితే వాడి యోగక్షేమాలు నేను చూస్తాను యోగక్షేమాలని నిర్వచించడానికి మన దగ్గర పదబద్ధలు లేవు అది పరాత్పరుడు అయినటువంటి ఈశ్వరుడు మనకు ఏ యోగాన్ని ఇవ్వాలనుకున్నాడో ఆ యోగాన్ని ఇస్తాడు ఎట్లా మనల్ని ఈ ప్రపంచపు ఆకర్షణ వలయంలో నుంచి ఒక చక్కని కొండవారు బుద్ధగా ఎట్లా నిలబెట్టాలో ఆయనకు తెలుసు గనుక స్వామి spiritual level లో అనేకమైన ఆధ్యాత్మిక భావనా భూమికలు అర్థం చేసుకున్నట్లయితే అది రాంమూర్తి ఒక రామధర్మం ఒక కృష్ణుడి [సంగీతం] ప్రేమ ఒక శంకర భగవత్పాదుల అద్వైత భావనా భూమిక ఒక రమణ మహర్షి యొక్క జ్ఞానైక స్వరూపం ఇవన్నీ కలబోసి ఒక్కటి గనక అయినట్లయితే అది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. దీన్ని మనం మర్చిపోకూడదు అన్నిటిని మన కాళ్లు చేతులు కళ్ళు అన్ని ఎట్లా ఉన్నాయో ఈ గురు స్వరూపాలన్నీ కూడా అట్లా ఒకటో ఉన్నాయి అందుకనే కానీ స్వామి మన బోటి వాళ్ళ కోసం ఒక చిన్న హెచ్చరిక చేశారు ఒక స్థాయిలో all gurus are one అంటే ఒక సత్య సాయి రమణ మహర్షి ఒక అరవింద వారు వీళ్ళంతా అంటే all gurus are one but all are not gurus. గురువుగా జీవించాలి గురువుల ఒక చేయంతో ఉండాలి జీవంతుడై ఉండాలి శక్తివంతుడై ఉండాలి దేనినైనా ఎవర్ట్ చేయగలిగిన దేనినైనా ఢీ కొట్టగలిగిన మానసికమైనటువంటి శక్తితో ఉన్నటువంటి వాడు ఆంతరంగికమైన ఆత్మ ప్రజ్ఞని ఈ ప్రపంచంలోకి పారించగలిగినటువంటి వాడే సద్గురువై అన్నివేళలా సత్తును గురించి బోధించేవాడు సద్గురువు అంతేగాని సద్గురువు అంటే మంచి గురువు అని కాదు అట్లాగే సజ్జనులు అంటే మంచివాళ్ళు అని అర్థం కాదు సత్జనుడు నిరంతరము అన్ని అవస్థలలో నేను ఆత్మను అన్నటువంటి ఒక స్పురణలో నిలకడ చెంది ఉండటమే నిజమైనటువంటి ఆత్మజ్ఞానం గనుక భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అంటే మన స్వామి నిత్యమూ ఒక ఆత్మ స్ఫురణ నిత్యమూ ఒక ఆత్మ శక్తి ఈ ప్రపంచాన్ని ఇవాళ చూడండి మిగతా ఇరవై ఒక్క మంత్రాలు చెప్పాలు జరగొచ్చు హోమాలు జరగొచ్చు యజ్ఞాలు జరగొచ్చు యాగాలు జరగొచ్చు సత్యసాయి సేవా సంస్థలు మాత్రం చేస్తున్నటువంటి సేవలన్నీ ఒకసారి చూస్తే ఎట్లా సాధ్యమవుతున్నది ఇది అనేది పెద్ద ప్రశ్న. సాధ్యం అవుతుంది ఎందుకంటే పరమాత్మ సంకల్పంలో నుంచి ఏర్పడిన ఇట్లాగే కేవలం తన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మాత్రమే కాక దేశదేశాల్లో భారతీయమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని పరిచయం చేసి ప్రబల్ధమానం చేయగనుక స్వామి సేవా కార్యక్రమాలు స్వామి మనందరికీ మిగిల్చినటువంటి ఒక కర్తవ్యం ఏమిటంటే సేవా కృతులుగా సేవా మూర్తులుగా ఉండండి దానిలో అహంకారాన్ని రానివ్వకండి వినయంగా ఉండండి ఏం చేసినా స్వామి చేయిస్తున్నారు అనుకోండి వినూత్నంగా చేయండి సమాజాన్ని చదవండి గ్రంథాలు చదవండి అనేక భాషలు వస్తాయి మా పాఠాలు వస్తాయి. అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అదయ కాలమే నీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఇరుంది. అంతరంగం విన్చిన గురువు లేడు మిగతా వాళ్ళంతా బాహ్య గురువులు వీళ్ళంతా కూడా. ఆ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతిసారీ మనం ఏ తప్పు చేసినా నువ్వు చేస్తున్నది తప్పు అని హెచ్చరిస్తారు నువ్వు ఏ చిన్న మంచి పని చేసినా సంతోషం పడుతున్నారు బంగారు అంటారు మరి ఎక్కడున్నారు ఈ స్వామి. He is a form or he is formless both నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అదయ కాలమే నీకు పరమ గురు కాలమే అన్ని నేర్పిస్తుంది సహనాన్ని క్షమని దయని కరుణని సానుభూతిని దాలిని మానవీయమైనటువంటి ధర్మాలు అన్నింటిని కూడా కాలం నేర్పిస్తుంది కన్నీళ్లు చెప్పిస్తుంది కన్నీళ్లను అదే తర్పిస్తుంది ఎన్నిసార్లు కన్నీళ్లు కార్చలేదు ఎన్నిసార్లు కన్నీళ్లు ఆరిపోలేదు జరుగుతూ ఉంటాయి సాక్షిభూత స్థితిలో ఉండాలి. కానీ ఇయన్ని నేర్చుకోవాలి ఈ స్థాయికి రావాలంటే గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే నువ్వు ఉన్నటువంటి అటు పది ఇళ్ళు ఇటు పది ఇళ్ళు అది చిన్న సామ్రాజ్యం చిన్న ప్రపంచం ఆ ప్రపంచాన్ని గమనించు సత్యసాయి devotees ఇవాళ చేస్తున్నది అదే నేను నా మనస్సు ఆనంద తరంగితమే ఈ మాటలన్నీ చెప్తున్నాను ఎందుకనంటే ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ సత్యసాయి devotee నిలడం చూస్తున్నాను ఎవరికీ ఆపద వచ్చినా అది ఆసుపత్రియ ఇంకోట ఇంకోట అన్ని చోట్ల స్వామి ముద్ర స్వామి యొక్క దయని వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు గనుక అటువంటి ఆ సేవా భాగ్యాన్ని సేవా యోగాన్ని భక్తి సామ్రాజ్యాన్ని స్వామి మనకు అనుగ్రహం అనుదానం చేశారు మరి ఎవరు స్నేహితుండు ప్రశ్న వేశారు ఆయన మనకి ఎవరు నీ స్నేహితులు అంటే పరిచయస్తులు పదిమంది మోసేవాళ్ళు నలుగురు అంతే కదా కలుసుకునే వాళ్ళు వెయ్యి మంది లక్ష మంది పోనివ్వండి కానీ స్నేహితులు ఎవరు పంచ ప్రాణాలు ఈ దేహంలో పంచ దీపాలు వెలుగుతున్నాయి అవి నెమ్మదిగా మలగిపోతాయి ఏర్పడే ఆ సందర్భం వరకు కూడా మనలో అంతర్జ్యోతి జ్యోతిర్మయంగా వాంగ్మయంగా చరాచర మయంగా శ్రీమయంగా నిలకడగా చెందిన ఆత్మ స్వరూపి ఎవరు అంటే భగవంతుడే గనుక ఎవరు మనకు స్నేహితుడు అంటే భగవంతుడే మనకు స్నేహితుడు భగవంతుడే మనకు స్నేహితుడు అయిన తర్వాత ఒంటరితనం లేదు ఉన్నదంతా ఏకాంతమే యోగమే అది ఈ ప్రపంచం ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి నుంచి ఇది ఎందుకంటే అలవాటైంది కాదు ఎప్పుడో ఒకసారి వచ్చింది కాదు అట్లా రాదు కూడా ప్రకృతిలో నిత్యానుతనంగా అనేకమైనటువంటివి వస్తూ ఉంటాయి.అట్లాగే ఈ పేరుతో ఇది వచ్చింది. దీన్ని మనం నెమ్మదిగా బయటకు వెళ్లగలుగుతాం, నెట్టగలుగుతాం. ఎట్లా అంటే, నాస్తే నాస్తి కాలౌ నాస్తే హరి నామ విన గతిహి. భగవన్ నామ సంకీర్తన చేత, నామ జపనం చేత నిరంతరము భగవంతుని యొక్క రూప, నామ, భావ తత్వాల్ని చక్కగా అర్థం చేసుకుంటూ ఆ రీతి మనం అతి త్వరగా ప్రపంచమంతా మళ్లీ ప్రశాంత నిలయం కావాలని, ప్రతి ఇల్లు, ప్రతి హృదయము ప్రశాంత నిలయం కావాలని సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి స్వామి ఈ ప్రపంచానికి జగత్ రక్షకుడై, జయ రక్షకుడై అంటే కంటితో చూస్తూ దీన్ని రక్షిస్తూ అందరికీ కూడా స్వేచ్ఛా జీవితాన్ని, ప్రశాంత-- ప్రసన్నమైన హాయి కలిగే జీవితాన్ని అతి త్వరలో అనుగ్రహించు గాక అని స్వామిని మనసా, వచసా, శరసా ప్రార్థిస్తూ ప్రధానంగా ఈ మూడు రోజుల ఈ కార్యక్రమాన్ని 18 పశ్చిమ గోదావరి జిల్లా సత్యసాయి సేవా సమితిలకు, ఎందుకంటే ఇవాళ మన మధ్య ఇంకా చక్కగా ఒక పడి పాకం చెందినటువంటి ఒక సాధకుడు కుమారెడ్డి భాస్కర్ రావు గారు ఇంకా మన మధ్యలో ఉన్నారాయన. పరమాత్మకు సంతోషం కలిగించినటువంటి వ్యక్తి ఆయన. స్వామి మనందరికీ సంతోషం కలిగించాడని పలు కథలు చెప్తాం. కానీ పరమాత్మకి సంతోషం కలిగించిన ఏకైక వ్యక్తి కుమారెడ్డి భాస్కర్ రావు గారు, డాక్టర్ గారు. ఆయనకి చక్కగా శేష జీవితం ఇంకా ఎంత మిగిలి ఉందో ఆ మిగిలిందంతా కూడా ప్రసన్నంగా, ప్రశాంతంగా, హాయిగా ఉండాలని, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సమస్త జనులకీ కూడా స్వామి యొక్క అనుగ్రహం పొందాలని, పొందించాలని, మీరందరి ద్వారా ఈ ప్రపంచానికి సాయి నామ వైభవం అందాలని, స్వామి కరుణాదృకులు ఈ ప్రపంచానికి ఆతపత్రమై రక్షించు గాక అని స్వామిని మరొక్కసారి, మరొక్కసారి ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మూడు రోజులు నిరంతరము సత్యసాయి భగవాన్ యొక్క అనేకమైన పాదుకా లను తడిమి ఆనందించగలిగినటువంటి ఒక సంతోష సౌభాగ్యాన్ని కలిగించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతా బద్ధుడనై ఉంటూ పరమా ఆనందమైనటువంటి రీతిలో సాగిన ఈ సాయంకాలాలని సాయికి సమర్పిస్తూ శపం తీసుకుంటున్నా. సాయి రామ్.
YouTube · audio
Sri Sathya Sai Avatara Vaibhavam | Day-3
Sri Sathya Sai Avatara Vaibhavam | Day-3
Source: Sri Sathya Sai Seva Organisations, West Godavari on YouTube
0:00 / 1:32:11
More in this series