No transcript for this section.
Transcript begins at 0:00.
[సంగీతం] సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయిశ్వరం ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాం మే. పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి అవతరించి తొంభై రెండు సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ మహా సంమంగళ వేళ సమస్త సృష్టి సుమారు నూట ఎనభై ఎనిమిది దేశాలలో సత్యసాయి భగవానుడి యొక్క ఆ సేవా భావన ప్రేమతత్వం జమిలిగా సాగినటువంటి తొమ్మిది శతాబ్దాల సఫల అవతారం ఇది. అసలు అవతారం అంటేనే అవతరించటము అని అర్థం. అవతారం ఎప్పుడు వస్తుంది అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు. యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మగ్లాని జరిగినప్పుడు సనాతన ధర్మం నుంచి మానవుడు వైదొలగినటువంటి సందర్భంలో ఎప్పుడైతే ధర్మం నుంచి మానవుడు వైదొలుగుతాడో ప్రపంచంలో ఆందోళన, అవిద్య, అస్పష్టత, అనాచారం, అహంకారం, దంభం, గర్వం అన్నీ కూడా ఏర్పడతాయి గనుక వీటన్నింటినీ కూడా సమసింపచేసి మళ్ళీ మానవుణ్ణి ధర్మమార్గం వైపు నడిపించటానికి ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై పరమేశ్వరుడు ఒక దేహాన్ని తీసుకుని అంటే మన బోటి పాంచభౌతికమైనటువంటి దేహాన్ని తీసుకుని ఈ జగత్తులోకి వస్తాడు. ఈ అవతార ప్రవాహము, ఈ అవతార పరంపర భారతదేశానికి కొత్త కాదు. అనాది కాలం నుంచి ఏర్పడినటువంటి అనేకానేకమైనటువంటి అవతార స్ఫూర్తులు, అవతార మూర్తులు అన్నీ కూడా మానవ జాతిని భద్ర జాతిగా, ముక్త జాతిగా, తత్వ జాతిగా, భక్త జాతిగా రూపాంతరీకరణం చెందించి మానవుడు మానవుడిగా జీవించగలిగినటువంటి ఒక అధ్యాత్మ స్థాయిని వరదానం చేస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ సాకల్యంగా మనం గనుక గమనించినట్లయితే పుట్టలు ఎక్కువై ఇల్లు తక్కువై మనుషులు తక్కువై పాములు ఎక్కువై ఒక చుక్క నీరు కూడా దొరకని మెతుకే దొరకనటువంటి పుట్టపర్తి గ్రామాన్ని ఎంచుకొని వచ్చినటువంటి ఒక అవతార మూర్తి సత్యసాయి భగవానుడు. ఇది సమకాలీనంగా మనతో పాటే వారు ఉన్నారు గనుక ఒక అవతారాన్ని విశ్లేషించటం, వర్ణించటం, వ్యాఖ్యానించటం కొద్దిగా కష్టం అయినప్పటికీ కూడా మన కాలం కంటే ముందు వచ్చినటువంటి కాలంలో అంటే బాబా వారు రావటానికి ముందు వచ్చినటువంటి అనేక అవతారాలతో సమన్వయం చేసుకుంటూ ఒక అధ్యయనం గనుక చేసినట్లయితే ఈ దేహంలో, ఈ అవతార కాలంలో వారు సాగించిన కార్యకలాపాలను మనమే బేరీజు వేసుకుంటూ వెళ్లినట్లయితే ఇది సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయినటువంటి ఒక అద్భుత అవతారం ఇది. కారణం ఏమిటి అని విచారణ చేసినట్లయితే మానవ జాతిని సముద్ధరించడానికి అవతార మూర్తులు కొన్ని ప్రమాణాలు చేస్తారు. కొన్ని చెప్పి కొన్ని చెప్పక. ఉదాహరణకి శ్రీరామచంద్రుడి అవతారానికి ముందు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అంటే ఇది త్రేతాయుగం నాటి మాట నారదాది మహర్షులంతా వెళ్లి ఆనాటి దేశ కాల పరిస్థితులు అన్నింటినీ కూడా ఆయనకి విన్నవించుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉండగా ఆయన చేసిన ప్రమాణం ఏమిటంటే దశరథుడు ఇంట పుడత దశకంధరుడి కుత్తుకలు ఉత్తరిస్త దశయుగాల వరకు రామనామం వినపడేట్లుగా శ్రీరామచంద్ర నామంతో వస్తాను ఇది ప్రమాణం. అంటే రాముడు తన అవతారానికి ముందే తాను ఎందుకు వస్తున్నాడో చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఇదేం చెప్పలే. ద్వాపర యుగం వచ్చేసరికి ద్వాపరం అంతమై కలియుగం ప్రారంభం కావలసినటువంటి సంధి యుగంలో ఇగో ఇందాక అనుకున్నటువంటి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. యుగే యుగే అంటే క్షణే క్షణేని యుగానికి ఒక్కసారి అని కాదు. ప్రతిక్షణము మన యందు ఆయన అవతరిస్తూనే ఉంటాడు. ఎట్లా అవతరిస్తాడు? అంటే నేనుగా స్పురిస్తాడు, మేనుగా అవతరిస్తాడు. కలియుగానికి వచ్చేప్పటికి దైవమే లేదన్న భావనతో ప్రారంభమైనటువంటి యుగం కాబట్టి ఈ యుగంలో కోటి సూర్యమండల మధ్యస్థమైనటువంటి మహా త్రిపురసుందరి దేవి దత్తావతారిణిగా ఈ ప్రపంచంలోకి వచ్చి శ్రీ లలితాదేవిగా ఈ ప్రపంచాన్ని నడిపించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయ ప్రకారం వచ్చినటువంటి అవతార మూర్తులే దత్తాత్రేయ అవతారాలు. ఈ అవతారాలలో ప్రప్రథమమైనటువంటి అవతారం పిఠాపురం లో వచ్చింది శ్రీపాద శ్రీవల్లభులు. ఆపై అనేకమైనటువంటి కళావతారాలు, అంశావతారాలు, అర్చావతారాలు, ప్రభవావతారాలు, ప్రసవావతారాలు, అనుప్రవేశావతారాలు, ఆవేశావతారాలు, కారణావతారాలుగా మహాపరిపూర్ణ అవతారాలుగా ఆవిష్కరింపబడుతూ కాలం నెమ్మదిగా సాగుతున్నటువంటి వేళ సంతదేశమైనటువంటి మహారాష్ట్రలో షిరిడి సాయినాథునిగా వచ్చినటువంటి ప్రప్రథమ పరిపూర్ణ దత్తావతారం అది. అది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ముగియగా కేవలం ఎనిమిది సంవత్సరాల విరామ కాలం తర్వాతనవంబరు ఇరవై మూడు, పందొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇదిగో ఈ పుట్టపర్తిలో సత్య సాయి భగవానుడిగా అవతరించినటువంటి ఈ స్వామి ఒక ప్రమాణం చేశారు. ఆ ప్రమాణం ఎప్పుడు చేశారు అంటే తన పద్నాలుగవ ఏట అంటే మే ఇరవై మూడు, పందొమ్మిది వందల నలభైలో నేను సాయిబాబాను అని ప్రకటించి పందొమ్మిది వందల నలభై అంటే అదే సంవత్సరం అక్టోబర్ ఇరవై వ తారీఖున వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ. ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ అవతారం సాగుతుంది. అందుకై నేను వచ్చాను. నేను పాత దారిని మార్చటానికో, కొత్తది మళ్ళీ ప్రతిపాదించడానికో వచ్చినటువంటి వాడిని కాదు. "అహం సత్యబోధకః" నేను సత్యం అంటే ఏమిటో చెప్పాలి అని వచ్చాను అన్నారు. సత్యము అంటే సతతము ఉండేది సత్యం. కాలాజ్య విచ్ఛిన్నమైనటువంటిది, అపరిణామమైనది, ప్రాప్తమైనటువంటిది, పూర్ణమైనటువంటిది, ధవళమైనటువంటిది, తరళమైనది, సరళమైనది, గంభీరమైనది, ఉదాత్తమైనది, అచ్చ తెలుగులో సత్యమైనది. కాబట్టి ఈ నిజాన్ని చెప్పటానికి వచ్చినటువంటి అవతారం. ఏది నిజం? ఈ సృష్టి అంతా కూడా శంకర భగవత్పాదులు అన్నట్లుగా <|diarize|>"విశ్వం దర్పణ దృశమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా, యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే". ఈ సమస్త సృష్టి కూడా అద్దంలో బొమ్మలాగా కనిపిస్తుంది. ఇది నిజం కాదు. ఇది కల. కాబట్టి యదార్థమైనటువంటి, ఏ పదార్థంగా కనిపిస్తున్న దాని యొక్క మూలంలోకి వెళ్ళండి. ఆ మూలాన్వేషణలో మీకు దొరికేది సత్యం. ఆ సత్యానికి మరొక రూపం, మరొక నామం నేను అయినట్లయితే అది అహం స్పురణ. ఈ అహం స్పురణలో గనుక జీవుడు ఉన్నట్లయితే ఆందోళనాయత్తమైనటువంటి, అనేకమైనటువంటి విరుద్ధ భావజాలంతో కూడినటువంటి కలియుగంలో సంఘర్షణ లేని ఒక సమన్వయ రీతిలో సాగాలి గనుక దేనిని ఉద్ధరించాలి అన్నప్పుడు సత్య సాయిబాబా వారి ప్రమాణంలో వారు చేసినటువంటి ప్రతిజ్ఞలో మొట్టమొదటిది వేదోద్ధరణ. వేదాలను ఉద్ధరించటం. ఇది మానవుడి వలన అయ్యే పని కాదు. వేదాలు మానవుణ్ణి ఉద్ధరిస్తాయి. అంటే ఏం చేయాలి? వేదాన్ని పరిపోషించాలి. వేదాన్ని అర్థం చేసుకోవాలి. వేద సారాన్ని గ్రహించాలి. జీవితానికి సమన్వయం చేసుకోవాలి. ఇది వేదోద్ధరణ. తర్వాత ధర్మోద్ధరణ. ధర్మాన్ని కూడా దానికి హాని, గ్లాని జరిగినప్పుడల్లా మళ్ళీ మహాత్ములంతా వచ్చి ఆ ధర్మ మార్గాన్ని ఉపదేశనం చేసి మానవుణ్ణి మంచి మార్గంలో పెట్టాలి, ధర్మ మార్గంలో నడిపించాలి గనుక ఇది ఏ ధర్మము అని గనుక విచారణ చేసినట్లయితే ఇది సనాతనమైనటువంటి, అనాది అయినటువంటి ఒక ధర్మమే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం యొక్క స్వరూపం ఏమిటి అంటే అది హైందవంగా ఉన్నది గనుక జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతంగా అంటే అన్నింటినీ కలుపుకొని సమన్వయం చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనా రీతి ఏదైతే ఉన్నదో అది సమాజాన్ని అంటే సంఘ నీతి, పాపభీతి, దైవ ప్రీతి. ఈ మూడు కూడా ఏకకాలంలో ఒక పరిణామ క్రమంలో జరుగుతూ ఉండాలి గనుక ఈ ధర్మోద్ధరణ కార్యక్రమాన్ని కూడా సత్యసాయిబాబా వారు చేపట్టారు. ఆపై దీనజనోద్ధరణ. దీనుడు ఎవరు అంటే డబ్బు లేనివాడు కాదు. భగవంతుడంటే విశ్వాసం లేనివాడు దీనుడవుతున్నాడు. కాబట్టి మానవుడి యొక్క మనస్సుని భగవంతుని యందు భక్తి వైపు, సత్కర్మ మార్గం వైపు, జ్ఞాన మార్గం వైపు ఒకే సమయంలో నడిపించాలి గనుక వారు దీనజనోద్ధరణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా అవతారంలో భాగం చేసుకొని వారు తమ పాంచభౌతికమైనటువంటి దేహంలో ఎనభై ఆరు సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా మొదటి పధ్నాలుగు ఏళ్ళు ఆ బాల్యావస్థను పక్కన పెట్టినట్లయితే డెబ్బై రెండు సంవత్సరాలు ఆయన బౌద్ధగా అనేకమైనటువంటి ప్రసంగాలు చేసి అనేకమైనటువంటి అంటే భారత, భాగవత, రామాయణ, భగవద్గీతాది, బ్రహ్మసూత్ర భాష్యాలు రాసి వాహిని స్వరూపంగా మళ్ళీ వాంగ్మయాన్ని ఈ ప్రపంచానికి స్వయంగా వారు కూర్చొని రాసి అందించారు. అంతే కాదు జాతి, మత వర్గాలు దాటి, దేశాలు దాటి, ఈ సనాతన ధర్మాన్ని తాను ఎక్కడ పుట్టారో అంటే ఎక్కడ అవతరించారో అక్కడే తాను కూర్చొని తాను కదలకుండా సర్వ ప్రపంచాన్ని కూడా తన దగ్గరకు రప్పించుకున్నారు. కనుకనే సత్యసాయి భగవానుడు ఎక్కడ పుట్టారో అక్కడ ప్రశాంతి నిలయం ఏర్పడితే ఆ ప్రశాంతి నిలయం ఆవరణలో ఈ మతాతీతమైనటువంటి, కాలాతీతమైనటువంటి అనేకమైనటువంటి శాస్త్రజ్ఞులు, విజ్ఞానవేత్తలు అట్లాగే పండితులు, వేద పండితులు, ప్రముఖులు, కవులు, గాయకులు రానివారెంటూ లేరు. వీళ్ళంతా వచ్చి ఏం చేశారు అని మౌలికమైనటువంటి, ప్రాథమికమైనటువంటి సనాతన ధర్మానికి జయకేతనం ఎత్తారు. అక్కడ మతం లేదు, కులం లేదు. వారంతా కూర్చొని హైందవ పరమైనటువంటి, పరమాద్భుతమైనటువంటి ఆహ్ వేదోచ్చారణ, భజన సాంప్రదాయంలో భజనలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ మానవుడిలో నీతిని పూర్ణంగా ఆవిష్కరించేటువంటి దిశగా సత్యసాయి భగవానుడు ప్రశాంతి నిలయాన్ని తీర్చిదిద్దారు. కనుకనే ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా ప్రతిరోజూ కరెక్టుగా సరిగ్గా ఎనిమిది గంటలకల్లా ఉదయం వేద ఆహ్ పఠణం ప్రారంభమవుతుంది. ఆపై భజన ప్రారంభమవుతుంది. ఇది రెండు కాలాలలోనూ పొద్దున, సాయంత్రం జరుగుతూ ఉంటుంది. వేలాది, లక్షలాది, కోట్లాది మంది భక్తులు అన్ని దేశాలలోనూ ఇదే సాంప్రదాయాన్ని, ఇదే పద్ధతిని తూచా తప్పకుండా క్రమశిక్షణతో వారు ఆ కార్యకలాపాన్ని సాగిస్తారు. అయితే ఇక్కడ సత్యసాయి భగవానుడి యొక్క అవతారానికి ఇంకొక పరమార్థం ఉన్నది.భగవద్గీత లో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకం ఏదైతే ఉన్నదో, "యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ" అన్నట్లుగా ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వంటి అత్యద్భుతమైనటువంటి గురువు ఉంటాడో, ఎక్కడ సర్వసన్నద్ధుడు, సిద్ధుడు, శుద్ధుడైనటువంటి అర్జునుడు వంటి శిష్యుడు ఉంటాడో, ఈ గురు శిష్యులిద్దరూ కలిసి ఈ బోధ ప్రతిబోధ సాగినట్లయితే, ఇదంతా సమాజ పరము, సమాజహితము, సమాజగతము చేసినట్లయితే అంటే మన-- మన శరీరము, మన శిరస్సు, మన ఆలోచన, మన భావన, మన సంస్కారము, మన సంస్కృతి, స్వాధ్యాయము, సదాచారము, సమ్యక్ సంకీర్తనము అన్నీ కూడా సమాజహితం గనక అయినట్లయితే ఆ సమాజం ఆధ్యాత్మిక సమాజం అవుతుంది. కనుకనే ఉద్యమాలు చేపట్టకుండా వారు సనాతనమైనటువంటి ధర్మాన్ని ఈ ప్రపంచానికి అతి తేలికగా, అతి సుందరంగా దానిని ఆవిష్కరిస్తూ వెళ్లారు. అయితే మానవ దేహాన్ని తీసుకొచ్చినటువంటి పరమాత్మ ఆనాటి రాముడు వలె, కృష్ణుడు వలె, ఇవ్వేళ సత్యసాయి భగవానుడు కూడా ప్రతి వ్యక్తి యందు భగవంతుని యందు ప్రీతి కలిగేటువంటి పనులు చేశారు. అయితే అది అక్కడే ఆగిపోకుండా మానవత్వాన్ని మాధవత్వం వైపు అంటే అతి సన్నిహితం చేసేటువంటి ఒక ప్రయత్నంలో వారు చేసినటువంటి కార్యకలాపాలు విద్యా, వైద్య రంగాలలో ఆ కృషి పరమాద్భుతమైనటువంటి కృషి. ఎందుకంటే ఎనభై ఆరు సంవత్సరాల క్రితమే విద్య దాని వ్యవస్థ నెమ్మదిగా మసకబారి పోతున్నటువంటి వేళ "వైద్యో నారాయణో హరిః" అనిపించుకున్నటువంటి ఒక వైద్య విధానం ఈ దేశంలో నమ్మకాన్ని కోల్పోతూ అమ్మకం వైపు అడుగు వేస్తున్నటువంటి సమయంలో సత్యసాయి భగవానుడు ఆ రెండింటి యొక్క ఆహ్ విశిష్టతని, ప్రాముఖ్యతని, వాటికివ్వవలసినటువంటి గౌరవాన్ని, అది వాటిని నడిపించవలసినటువంటి తీరుతెన్నులని చక్కగా సమన్వయం చేస్తూ ఇటు విద్యారంగాన్ని అటు వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తూ అనేకమైనటువంటి వైద్యాలయాలు, విద్యాలయాలన్నీ కూడా ప్రారంభించి మానవజాతిని మళ్ళీ సమున్నతమైనటువంటి మానవీయ పరిమళంతో శోభిల్లేట్టుగా చేశారు. వీటన్నింటితో పాటుగా దాహార్తులైనటువంటి అనేకమంది లక్షలాది జనులకి ఆ దాహార్తిని తీర్చటానికి ఏ ప్రభుత్వము కూడా లేదా ఎన్ని ప్రభుత్వాలైనా కలిసినా చేయలేనటువంటి పనిని కేవలం పదకొండు నెలల కాలంలో అద్భుతంగా దానిని ఆవిష్కరిస్తూ అనేక ప్రాంతాలకు ఎక్కడెక్కడ నీరు లేదో వాటన్నింటినీ కూడా అందించి ఈ సేవాదళం అనబడేటువంటి అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థకి రూపకల్పన చేసి దాని యందు ప్రతి వాడికి ఒక్కొక్క పాత్రను ఇస్తూ సమన్వయం చేస్తూ అంటే మానవ మేధని, మానవ శక్తిని, మానవ ప్రజ్ఞని మూడింటిని కూడా మహా త్రివేణిగా పారించినటువంటి ఒక పరమాద్భుతమైన దృశ్యాన్ని మనం సమకాలీనంగా చూశాం. అంతే కాదు క్రమబద్ధత, క్రమశిక్షణ, ఒక నిష్ఠ, ఒక నియతి, ప్రేమ, సేవ వీటన్నింటినీ కూడా ప్రపంచానికి అందించి పాశ్చాత్యులు అడిగారు, "మాకు ఒక మత గ్రంథం ఉంది. మీకేమో పద్దెనిమిది పురాణాలున్నాయి. వీటి అవసరం ఏమిటి? దీని ఆంతర్యం ఏమిటి?" అని అడిగినప్పుడు ఏమీ లేదు వ్యాస భగవానుడు సృష్టించినటువంటి అంటే రచించినటువంటి పద్దెనిమిది పురాణాల సారము రెండే రెండు మాటలు Help ever hurt never. ఇవాళ ఆంగ్ల భాషలో దాన్ని చెప్పారు. అంటే ఎవరినీ బాధించకు అందరికీ కూడా ఆనందాన్ని కలిగించు. Help ever సహాయం చేస్తూ ఉండు. అట్లాగే అది మాత్రమే కాదు Love all serve all అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని దానిని భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, physical, metaphysical, spiritual ఈ మూడు స్థాయిలలో కూడా దీన్ని గనక స్వాధ్యాయం చేసి మానవ జీవితాన్ని గనక మనం సఫలం చేసుకోవాలి అంటే Help ever మనస్సుని ఎప్పుడూ కూడా రాగరంజితము, అనురాగరంజితము, ప్రేమరంజితము చేయాలి. చేసినట్లయితే తోటి మానవుడికి మనం సహాయం చేయగలుగుతాం. Hurt never మన మాట చేత, చూపు చేత, భావన చేత, సంకల్పం చేత, ఆలోచన చేత కూడా ఎవరినీ కూడా మనం బాధించకూడదు. అట్లాగే అందరినీ ప్రేమించాలి. మనం ఎట్లాగైతే ఒక వ్యక్తి నుంచి అంటే మరొక వ్యక్తి నుంచి ప్రేమని పొంది మహదానందాన్ని పొందుతున్నామో అట్లాగే మనం కూడా మన నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ ప్రవాహాన్ని ఈ ప్రపంచ క్షేత్రంలో పారించి దాన్ని సస్యశ్యామలం చేయాలి. ఇది ఋగ్వేద ప్రమాణమైనటువంటి ఒక మాట. ఈ Love all serve all అనేది వేద ప్రమాణమే. బాబా గారు ఏం చెప్పినా వేదము, శాస్త్రము ప్రమాణం చేశారు. అందుకనే వేలూరి శివరామ శాస్త్రి గారు వంటి మహనీయులు కూడా వాళ్ళు ఏమన్నారంటే, "ఆయన రమణ మహర్షి వంటి వారు కాదు, రామకృష్ణ పరమహంస వంటి వారు కాదు. సత్యసాయిబాబా వారు సత్యసాయిబాబా వారే." అది అవనిపై సంచారం చేసేటువంటి బ్రహ్మ పదార్థం. పండితులకు అది పరీక్ష, పామరుడికి శ్రీరామ రక్ష అంటూ అనేకమైనటువంటి ఆహ్ విద్యా విధానంలో, వైద్య విధానంలో మార్పులు తీసుకొని వస్తూ ఇవాళ మనం women empowerment అని ఏదైతే చెప్తున్నామో, స్త్రీ శక్తిని గురించి ఇవాళ ఎంతగా మాట్లాడుతున్నామో, పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటికే అనంతపూర్ మహిళా కళాశాల పెట్టి అనేకమైనటువంటి ఆహ్ స్త్రీ శక్తులను అన్నింటినీ కూడా సమన్వయము, సమగ్రము చేయాలని చెప్తూ ఆయన అన్నారు, "ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి ఆడపిల్ల రేపు పొద్దున house wife గా ఉండవద్దు. గృహలక్ష్మిగా ఉండాలి." భారతీయమైనటువంటి ఒక ఔదార్యాన్నిఔద్ధాతిని దాని యందు దాగి ఉన్నటువంటి పూర్ణతను పవిత్రతని గాంభీర్యాన్ని మర్యాదను సమస్తాన్ని కూడా ఈ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఇక్కడి నుంచి ప్రతి విద్యార్థిని కూడా అద్భుతమైనటువంటి స్త్రీ స్వరూపంగా శక్తి స్వరూపిణిగా అంటే ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తుల యొక్క త్రిపుటిగా మారాలి అని అంటూ వారు ప్రారంభించినటువంటి ఆ కళాశాల కానీ అక్కడ ఉండేటువంటి విద్యార్థులు గానీ ఇవాళ కొన్ని లక్షల మంది విద్యార్థులు అక్కడ తయారై ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కాక సర్వ ప్రపంచంలోనూ కీలక స్థానాలలో తమదైనటువంటి రీతిలో ఈ సమాజాన్ని ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు అందుకనే శ్రీరామనవమి ఎట్లా చేస్తామో కృష్ణాష్టమి ఎట్లా చేస్తామో నవంబరు ఇరవై మూడు అంటే సత్యసాయి భగవానుడి యొక్క జన్మదినం పుట్టు పండుగ అంటారు ఆ పుట్టు పండుగని నూట ఎనభై ఎనిమిది దేశాలలో సేవా కార్యక్రమాల ద్వారా కళా స్వరూపాల ద్వారా సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక ధర్మాన్ని ఒక వాంగ్మయాన్ని కళా తీరుతెన్నులని అన్నింటిని కూడా ఆవిష్కరిస్తూ అన్నింటి యందు భగవత్ తత్వాన్ని ప్రేమ తత్వాన్ని సేవాభావాన్ని ప్రతిఫలించే అటువంటి రీతిలో కార్యక్రమాలన్నీ సాగుతూ ఉంటాయి ఇక్కడ సత్యసాయి భగవానుడు మోక్షం ఇస్తాను మరణానంతర సుఖం ఏమిటో చూపిస్తాను అన్నటువంటి అవతారం కాదు. యదార్థమైనటువంటి సత్య జీవనాన్ని గడపాలి మానవుడు మానవుడిగా జీవించాలి వారిని అడిగారు అధ్యాత్మ అంటే ఏమిటి అన్నప్పుడు తొలినాళ్లలో వారు ఇచ్చిన జవాబు ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్లగలిగితే అది అధ్యాత్మ. మళ్ళీ అదే ప్రశ్నని పదేళ్ల తర్వాత అడిగితే ప్రభావంలో నుంచి స్వభావంలోకి రావాలి అది అధ్యాత్మ మళ్ళీ పదేళ్ళకి అదే ప్రశ్న వేసినప్పుడు మానవుడు మానవుడిగా జీవించగలిగితే అది అధ్యాత్మ అంటే మానవుడు తన యందు ఉన్నటువంటి దానవత్వాన్ని దీనత్వాన్ని పరిదీనత్వాన్ని దాటి మానవత్వాన్ని మాధవత్వాన్ని సమన్వయం చేసుకోవటానికి తాను పొందినటువంటి అపూర్వమైనటువంటి మానవ జన్మని సార్ధకం చేసుకోవాలి సేవ ద్వారా అహంకార మమకారాలను తగ్గించుకోవాలి లేదా నిర్మూలనం చేసుకోవాలి అందరినీ ప్రేమించటం ద్వారా మహోన్నతమైనటువంటి ఉదార స్వభావాన్ని సరళమైనటువంటి రీతిని తాను గ్రహించాలని అనేకమైనటువంటి ప్రబోధాలు అనేకమైనటువంటి ప్రసారాలు చేశారు ప్రచారము అక్కరలేనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి పుణ్య కీర్తిగా సత్యసాయి భగవానుడి యొక్క అవతారం అది మహా ప్రవాహమై సాగుతూనే ఉన్నది. ఇవాళ సత్యసాయి భగవానుడు తమ దేహాన్ని ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల పదకొండున దానిని ముగుంచినప్పటికి కూడా వారి యొక్క భావాలు వారి యొక్క స్ఫూర్తి వారి అనుగ్రహం ఈ ప్రపంచాన్ని అన్ని వేళల అన్ని కాలాల సర్వదా సర్వదా సహదా బ-బహుధా దీనిని మహదాశీర్వచనంతో పులకింప చేస్తూనే ఉంటుంది. ఈ-ఇవాళ మనం ఏం చేయాలి? ఈ అవతారం పరిసమాప్తి తర్వాత ఏమిటంటే దేహం ఆగిపోయింది కానీ స్ఫూర్తి చైతన్యము మహా ప్రవాహమై సాగుతున్నది గనుక ఇటువంటి ఈ మహా సన్మంగళ వేళ మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి భారతావరణి ప్రశాంత నిలయమైనటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టించుకునేటువంటి దిశగా మనం నెమ్మదిగా దీనిని సాగిస్తూ స్వామి దేనిని చెప్పారో అనేకమైనటువంటి మాటలు కొన్ని వేల ప్రబోధాలు వీటన్నింటినీ కూడా కొనసాగిస్తూ నిత్య జీవితాన్ని అధ్యాత్మమయం చేసుకుందాం అధ్యాత్మగా జీవిద్దాం అధ్యాత్మ గోడమీద రాతగా కాక గుండెలో బొమ్మగా హృదయంలో కలిగే ప్రతిస్పందనగా దానిని మన భావన చేస్తూ ఆత్మ విచార మార్గం వైపు మన మనస్సును నడిపిస్తూ ఈ సత్యసాయి భగవానుడి యొక్క ఈ పుణ్య జన్మదినాన మళ్ళీ మనం పునరంకితమవుతూ ఈ సమస్త ప్రపంచానికి శాంతిని కాంతిని దాంతిని హాయిని ఫలాదాన్ని ప్రహ్లాదాన్ని సంపూర్ణంగా మనవంతుగా మనం కూడా అను-అందించేటువంటి ఒక ప్రయత్నం మనం చేయాలని ఆ దిశగా మన జీవితాలు చల్లగా హాయిగా ప్రసన్నంగా పారమార్థికంగా సాగుగాక అని మంగళాశాసనం చేస్తూ సత్యసాయి భగవానుడి యొక్క దివ్యానుగ్రహ మహామృత వృష్టి ఈ ప్రపంచాన్ని ముంచెత్తు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం. [outtro music]
YouTube · audio
సత్యసాయిబాబా | Satyasaeesam | జన్మదిన ప్రత్యేక కార్యక్రమం
సత్యసాయిబాబా | Satyasaeesam | జన్మదిన ప్రత్యేక కార్యక్రమం
Source: Sreepeetam on YouTube
0:00 / 22:57