No transcript for this section.
Transcript begins at 3:09.
ఇవాళ భగవాన్ గురించి కొన్ని విషయాలు స్మరించుకునేటువంటి ఒక అవకాశం ఈ వేదిక అందరికీ కల్పించింది. ఇది ఒక తాత్విక విచారధారకి లోనైనటువంటి విషయం కాదిది. ఏ మనిషైనా ఎవరైనా సాక్షాత్తు భగవంతుడైనా సరే పాంచభౌతిక దేహాన్ని ధరించి వచ్చినప్పుడు కాల కార్య కారణ కర్తవ్యమై నిమిత్తమై వచ్చి ఆ కార్యక్రమం పూర్తి కాగానే దేహాన్ని వదిలిపెట్టటం అత్యంత సహజ పరిణామం. అది జరిగి తీరుతుంది. Death is inevitable. దేనికి? శరీరానికి. భగవాన్ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు, నిజానికి వదిలిపెట్టడానికి ముందు వారు ఎప్పుడో దేహాత్మ భావన నుంచి దూరమైపోయినటువంటి జాగృత చైతన్యమూర్తి ఆయన. ఎప్పుడైతే మరణానుభవాన్ని వారు పొందారో దేహంతో పని లేకుండా పోయింది ఆయనకి. మనందరినీ అలా అనుకోమని చెప్పలేదు. మనందరినీ కూడా ఆత్మ స్వరూపులుగా వెలిగిపోండి అని చెప్పారంటే, మీరు అంటే దేహం కు మాత్రమే కాదు మీరు అంటే ఒక అఖండ చిద్ఘనమైనటువంటి ఆత్మ అని ప్రబోధం చేశారు. ఒకానొక సందర్భంలో మధురై నుంచి వచ్చినటువంటి ఒక భక్తుడు "భగవాన్ మీరు మృత్యుంజయులు కదా" అని ఒక మాట అన్నప్పుడు ఆ సాయం సంధ్యలో చాలా నిష్కర్షగా చాలా స్పష్టంగా భగవాన్ ఒక మాట చెప్పారు. "మృత్యువుని జయించగలిగిన వారు లేరు. మృత్యు భావన నించి జయించ దానిని దాటవచ్చునేమో గానీ శరీరము ఎలా వస్తుందో కాలాంతరంలో అది ముగిసిపోతుంది. కాబట్టి ఇక్కడ మృత్యుంజయులు ఎవరూ లేరు. మృత్యుం మృత్యు భావన జయించగలగటం ఆత్మ భావనలోకి వెళితే మృత్యువు అనేటువంటి ఆలోచన ఉండదు." అందుకనే ఈ మధ్యనే ఎవరో నన్ను అడిగినప్పుడు మనిషి మరణానికి భయపడతాడు అని. మరణానికి భయపడడు He is not afraid of death He is terrified by the very thought that he was going to die. అంటే Dying అతన్ని ఆ Dying అనేటువంటి ఒక Process మరణించనుట అనేటువంటి ఒక Process అతన్ని చాలా బాధ పెడుతుంది తప్ప when actually death occurs there is neither to fear nor to enquire. It is a very natural process where one vacates the body. దానిని ఆ ఆనందవల్లి నుంచి ఒక మంజు ప్రసవాల్లాగా తీగ ఒకచోట పుట్టి మరొక చోటకు పాకి ఎక్కడో ఒక గుమ్మడికాయ ఆ తొడిమె నుంచి విడిపోయినట్లుగా విడిపోవటమే మృత్యువు అని మనకి తెలుసు. ఏది మనం మృత్యుంజయ మహా మంత్రం చదువుకున్నప్పుడు అది అర్థమైపోతుంది. కానీ భగవాన్ దేహాన్ని వదిలిపెట్టడానికి ముందు కొన్ని కొన్ని సంఘటనలు జరిగినాయి. వారికి సార్కోమా ఏర్పడినప్పుడు అందరూ కూడా "భగవాన్ మీరు పడుతున్న యాతన మేము చూడలేకపోతున్నాం. మా అందరి బాధలు, మా రోగాలు అన్నీ కూడా మీరు తొలగిస్తున్నారు కేవలం మిమ్మల్ని తలుచుకుంటేనే. కానీ మీ మీరు మాత్రం ఈ సార్కోమా అనుభవిస్తున్నప్పుడు మేము భరించలేకపోతున్నాం. మీరు మీరు సంకల్పించుకొని దాన్ని మాన్పించుకోండి." అని అడిగారు. అది ఎర్రగా ఒక వ్రణం లాగా ఉండేది. చూడ్డానికి భయంకరంగా ఉండేది. బాధ వారు అనుభవించను లేదు, అభినయించను లేదు. అది అలా ఉంది. వారిన్నారు "అది శ్యమంతక మణిలే, అలాగే వచ్చి పోతూ ఉంటాయి." అన్నారు తేలిగ్గా. అది సామాన్యుడు అనలేని మాట. అయినా భక్తులు భగవాన్ యందు ఉన్నటువంటి భక్తి విశేషం చేత "మీరే సంకల్పించి దాన్ని మాన్పించండి." అని అడిగారు. అప్పుడు భగవాన్ రమణలో ఉన్నటువంటి ఆ అంతస్చేతన బహిర్గతమై ఒక పసి పిల్లవాడి వలే ఒక సమాధానం ఇచ్చారు. "అవును నిజంగా సంకల్పించవలసిందే. చూడండి మీ అందరినీ ఇక్కడికి రమ్మని ఎవరూ పిలవలేదు. మీ అంతట మీరే వచ్చారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేవారు లేరు. మీ అంతట మీరే మీ పని కాగానే మీ ఇళ్లకు వెళ్ళిపోతారు. అలాగే వారు వచ్చారు ఉండనివ్వండి." అన్నారు. అయినా భక్తులకి సంతోషం కలగలేదు, ఆ సమాధానం తృప్తినివ్వలేదు. అప్పుడు అన్నారు, "మీరందరూ కూర్చుని వేళ సంకల్పించండి సంకల్పించండి అంటున్నారే, సంకల్పిద్దాం అంటే ఇక్కడ మనసే లేదే, దేనితో సంకల్పించను?" అన్నారు. ఇది ఒక శుద్ధ చైతన్యమూర్తి హృదయంలో నుంచి, అంటే చైతన్యం గనక మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ ఒక్క వాక్యం చాలు భగవాన్ రమణులు మనోతీతమైన భావనా స్థితిలో ఎలా నెలకొని చెందారో తెలుసుకోవటానికి. ఇక దాని తర్వాత ఎవరూ కూడా భగవాన్ ని ప్రార్థన చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే భగవాన్ కి తెలుసు ఆ శరీరం ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు వదిలిపెట్టాలో. పౌర్ణమి నాడు ఎట్లాగైతే ఒక పాము పొదలలోకి వెళ్లి తన శరీరం మీద ఏర్పడినటువంటి కుబుసాన్ని గరపుగా ఉన్నటువంటి ఒక ఆకు పొ-పొదలలో నుంచి గాని రాతిలో నుంచి గాని ఎట్లా వదిలిపెడుతుందో దాన్ని Effortless effort అన్నారు భగవాన్. ప్రయత్నమే లేని ఒక అద్భుత ప్రయత్నమే దాని పేరు మరణం. భగవద్గీతలో మరణము అంటే మార్పి అని అన్నాడు యోగీశ్వరుడు.ఇవాళ భగవాన్ రమణులు మరణానుభవాన్ని పొందిన యాభై నాలుగు సంవత్సరాలు అదే దేహంలో ఉండి, అవసరమైనప్పుడు ఆ కించిత్ మనస్సును బయటకు తెచ్చి దైనందికమైనటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించి, నిర్వహించి అందరినీ జ్ఞానమార్గం వైపు నడిపించి తాను నిమిత్త మాత్రులై ఎలా ఉన్నారో వారి చరిత్ర మనకి సుబోధకంగా తెలియజేస్తూ ఉంటుంది. మరి భగవాన్ ఇంకా కొన్నేళ్ళు ఉండొచ్చు కదా, కేవలం డెబ్బై ఒక్క సంవత్సరాలకే శరీరాన్ని ఎందుకు వదిలిపెట్టాలి మనకు అనిపిస్తుంది. జీవామ శరదమ్మమ అని ఉంది కదా ప్రమాణం. అంటే వంద ఏళ్ళు బతకాలని ప్రతి మనిషి కోరుకోవాలి అని ఉంది. అది సామాన్యుడికి వర్తిస్తుంది. ఈ life జీవితాన్ని, జీవన కాలాన్ని extend చేయగలిగిన contract చేయగలిగిన ఆ శక్తి వారి యందే ఉంటుంది గనుక వారు నిర్ణయించుకున్నటువంటి ప్రకారమే నిన్న రాత్రి, అంటే ఈ వేళ పదిహేనవ తారీఖు కాబట్టి, నిన్న రాత్రి ఆ ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకి జ్ఞాని తమ శరీరాన్ని వదిలిపెట్టారు. ఇది విశేషం కాదు. విశేషం ఏమిటంటే ఆ వదిలి పెడుతున్నప్పుడు వారు ఎలా ఉన్నారు. ఇంకా కొన్ని క్షణాల్లో శరీరం ఉండదు. ఒక స్మృతిగా మిగలబోతున్నారు. అటువంటి సమయంలో భగవాన్ ఎలా ఉన్నారు అని ఆలోచించినట్లయితే అప్పటి వరకు ప్రతిరోజూ తన దుప్పటి మార్చేటువంటి మాధవ స్వామిని పిలిచారు. సౌజన్యం చేశారు. అతనికి English రాదు సేవ చేయటం మాత్రమే తెలుసు. ఒక మాట అన్నారు. "భగవాన్! మీరు మీకు ఒంట్లో బాగాలేదని, మీరు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నారని విని చాలా దుఃఖం కలిగింది." అని అన్నాడు. భగవాన్ దానికి answer ఇవ్వలేదు. ఏమన్నారంటే, "రేపటి నుంచి దుప్పటి మార్చవలసిన అవసరమే లేదు." అన్నారు. అర్థమైంది. అంటూ అతని వైపు సూటిగా చూస్తూ ఆ వీక్షణ దీక్ష అనండి, కరుణాపూర్ణమైనటువంటి ఆ అమృతధార, అనుగ్రహ అమృతధార అతని వైపు సారిస్తూ, ప్రసారం చేస్తూ "Thanks" అన్నారు. అతనికి అర్థం కాలేదు. "Thanks అంటే ఆనందం. Thanks అంటే కృతజ్ఞత." అన్నారు. పరమాత్మ తమ జీవిత కాలంలో పశుపక్షాదుల పట్ల, మానవుల పట్ల, జడాత్మకమైనటువంటి ప్రకృతి పట్ల, అనాత్మ పట్ల వారు చూపించింది కృతజ్ఞత. అది మనందరం కూడా మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. అలాగే ఆనందాన్ని ప్రకటించాలి. ఎవరైనా మనకు ఒక చిన్న సహాయం చేసినప్పుడు Thanks అనేది English పదం కావచ్చేమో గాని ఆనందాన్ని ప్రకటించవలసిన బాధ్యత మన యందు ఉన్నది. ఆనందంతో కూడిన ఒక కృతజ్ఞత వలన మనం ఋణ విముక్తులం అయిపోతాం. లేకపోయినట్లయితే వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం చేయించుకుంటూ ఉంటాం. ఎక్కడా ఆనందాన్ని ప్రకటించం. దాన్ని cognize చేయం, recognize చేయం, appreciate చేయం. ఎట్లా? కనుక కేవలం ఇంకా రెండు నిమిషాల సమయమే ఉన్న ఆ time లో భగవాన్ మాధవ స్వామికి ఇచ్చిన సందేశం ద్వారా మనందరికీ కూడా జాగరూకతతో ఉండాలి అని బోధించారు. రెండు నిమిషాల ఆ వ్యవధిలో జాగ్రదవస్థలో సంచారం చేయాలి. ఏమో ఇల్లు, వాకిళ్లు, పిల్లలు, సంసారం, ఇదంతా ఏమైపోతుందో అంటే, ఏమైపోతుందో మనకెందుకు అనేటువంటి ఒక నిర్లిప్తమైన వైరాగ్య భూమికలో ఉండాలి. అక్కడ వైరాగ్యము లేదు, వైభోగము లేదు, నిర్లిప్తత లేదు ఒక సమాన్వయమైనటువంటి ఒక పరమాద్భుతమైన పూర్ణ స్థితిని అనుభవించారు భగవాన్. దానికంటే ముందు, అంటే ఒక గంట ముందు చాలామంది రోదిస్తూ ఏ రకమైనటువంటి ఆ భగవాన్ పట్ల ఉన్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ప్రేమను ప్రకటిస్తూ "మీరు లేకపోతే మేము ఎట్లా బతకాలి?" అని అడిగినప్పుడు వారన్నారు "నేను ఎక్కడికి పోతున్నాను, ఇక్కడే ఉంటాను." అన్నారు. ఇది మామూలు statement గా కనిపిస్తుంది మనకి, మామూలు వాడికి. ఆ నేను అనేది ఆత్మకు పర్యాయపదం కాబట్టి రమణ శరీరం పోవచ్చు గాక, అది సమాధిగతం కావచ్చు గాక, కానీ ఆ నేను ఇక్కడ ఎక్కడికి పోతుంది, వెళ్ళటానికి ఎక్కడుంది, దానికి వేరే చోటున్నదా? సర్వ సృష్టిని పరివ్యాప్తమైనటువంటి ఆ ఆత్మ కాలాజ్య విచ్ఛిన్నమై ఉంటుంది, కాలాతీతమై ఉంటుంది, కాలానికి లొంగకుండా ఉంటుంది, అనంత కాలాలుగా సాగిపోతుంది. కనుక నేను ఎక్కడికి పోతున్నాను, ఇక్కడే ఉంటాను అన్నారు. ఆ ఇక్కడే ఉండటం అనేది ఒక గంట ముందు చెప్పారు ఆ మాట. గంట తర్వాత భగవాన్ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆనాడు సర్వ ప్రపంచము చూసినటువంటి ఒక అద్భుతమైన విశేషం ఏమిటంటే భగవాన్ హృదయంలో నుంచి ఒక అనంతమైనటువంటి కాంతిపుంజం ఒక బంతి వలే గిరగిరా తిరుగుతూ వెళ్ళి ఎక్కడైతే ఈవేళ మనం దీపం వెలిగించుకుంటున్నామో ఆ ప్రాంతంలో అది లీనం కావటం ఆనాడు ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా record చేసినాయి. చరిత్రకారులు కూడా దీనిని సమర్థించారు. ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వ్యక్తి కూడా ఇటువంటి అనుభవాన్ని అక్కడ పొందారు.ఆ రోజున దాన్ని ఆయన కూడా గమనించుకున్నారు. కాబట్టి ఏది వెళ్ళిపోతున్నది అంటే మనలో ఉన్న కాంతి వెళ్ళిపోతున్నది, భ్రాంతి మిగిలిపోతున్నది. శరీరము భ్రాంతి, ఆత్మ భాంతి. భ్రాంతి వేరు, భాంతి వేరు. భాంతి అంటే నిత్యమై, సత్యమై, శాశ్వతమై వెలుగు ఉండేటువంటి ఒక వెలుగు ముద్ద, అది ఆత్మ. "యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి" కదా! కాబట్టి అది లో వెలుగుగా ఉన్నది, వెలుగుగా ఉన్నది, అది నడిపిస్తున్నది. మనస్సుని, ఇంద్రియాలని నడిపిస్తున్నది కానీ సాక్షిభూతంగా ఉన్నది. అన్నీ తానే చేయిస్తున్నది కానీ నేను చేస్తున్నానని మాత్రం అనటం లేదు. అది అకర్తృత్వ భావన. భగవానే ఒక యుగాన్ని నడిపించినా, ఓ కాలాన్ని నడిపించినా, ఏనాడు ఇది నేను చేశాను అని అనలేదు. అలా-అలా జరిగిపోతూ ఉంటాయి. ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అంటే ఆత్మ యొక్క energy అంటే the energy of the self. దాన్ని శక్తి అని అక్కడ వాడారు. దేవుడు అనే పదం వాడని ఒక దివ్య స్వరూపం ఏదంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి. అంటే ఉన్నదంతా దైవమే అయినప్పుడు దే-- ఏది దైవం కాదో చెప్పమన్నారు. God exists everywhere అని మామూలు statement అది. But whatever exists is God. ఇది ఒక నిరూపణ. ఇది అంటే జ్ఞాని ఒక అంతిమ కాలంలో శరీరాన్ని వదిలిపెట్టేటువంటి సమయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఎంత attentive గా ఉంటాడు అనేటువంటి భగవాన్ మనకి సూచిపాయంగా మాత్రమే కాక నిదర్శన పూర్వకంగా ప్రపంచానికి ఆ క్షణాల్లో నిరూపణ చేశారు. అంతే కాదు భగవాన్ కి ఒంట్లో బాగా లేదన్నప్పుడు అంతకు ముందే ఒక వారం రోజులుగా అనేకమైనటువంటి స్తుతులు జరుగుతున్నా వారు నిర్లిప్తులై, నిర్మములై తనలో తాను స్వాత్మానంద స్థితిలో ఎప్పుడూ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. మనం భగవాన్ భక్తులుగా భగవాన్ తత్వాన్ని ఒక ఆచరణాత్మక దివ్య జీవన విధానంగా మనం గనక తీసుకున్నట్లయితే జీవితంలో ఏది రాని, ఏది పోని, ఏది దొరకని, ఏది దొరకకపోని, ఏ-ఏ సంకల్పాలైనా వికల్పాలై పోని, మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగక పోని, కాలానికి వదిలిపెట్టాలి. అందుకనే భగవాన్ కర్త అనే పదం వాడారు. ఆ కర్త ఎవడు అంటే అన్నిటా వాడే ఉన్నాడు. ఈ మాట్లాడిస్తున్నది కర్త, వింటున్నది కర్త, వినబడుతున్నది కర్త. కర్తను మించి మరొకటి లేదు. కనుక ఆ కర్త కూడా ఒక శరీరాన్ని ధరించి తాను వచ్చినటువంటి కార్యక్రమాన్ని తాను నిర్ణయించుకున్నటువంటి కాల పరిమితిలో ఆ కార్యాన్ని నిర్వర్తించి, కర్తవ్యంగా భావించి శరీరాన్ని వదిలిపెడతాడు. చారిత్రక మహాపురుషుల మహాభినిష్క్రమణలు కూడా ఇలాగే ఉన్నాయి. అయితే వారెంత అనుభవించారా అంటే రామకృష్ణ పరమహంస వారికి throat cancer వచ్చినప్పుడు పాలు మింగలేకపోయేవారు. ఇలాగే భక్తులు విషాదభూమికలో అడిగితే, రామకృష్ణుడు అంటే ఈ శరీరం అనుకుంటున్నారా మీరందరూ కాదా? మీరందరూ తాగుతున్నట్లే మీరు తాగుతున్నప్పుడు అది ఈ రామకృష్ణులు కూడా తాగినట్లే, విచారించకండి అని ఆయన చెప్పారు. నలభైయవ ఏడు నా జీవితంలో ఈ జన్మలో చూడను అని డైరీలో రాసుకున్నటువంటి వివేకానంద స్వామి ముప్పై తొమ్మిది సంవత్సరాల, ఎనిమిది నెలల, కొద్ది రోజులకి యోగాభిముఖులై తనంతట తానే నేలమీద పడుకొని తనలో ఉన్నటువంటి ఇంద్రియాలు అన్నింటినీ కూడా withdraw చేసుకొని అంటే కుంభించి అంటాం, తమ శరీరాన్ని సునాయాసంగా వదిలిపెట్టారు. కాస్త వెనక్కి వెళ్లినట్లయితే శ్రీరామచంద్రుడు త్రేతాయుగ కాలంలో తన అవతార కార్యక్రమాన్ని పూర్తిచేసుకొని, కర్తవ్యాలను నిర్వహించి కుశలవులకు రాజ్యభాగాన్ని అప్పజెప్పి, రాజ్యాన్ని అప్పజెప్పి యోగ మహాపురుషుడై నదీ ప్రవాహంలోకి ఆయన వెళ్లిపోయినారు. శ్రీకృష్ణ పరమాత్మ యుగాంతంలో తాను వచ్చిన పని తాను పూర్తిచేసుకున్న తర్వాత ఎవరికీ కానరాని చోటికి వెళ్లి ఒక బండరాయిని తలదిండుగా మార్చుకొని, కాళ్ళమీద కాళ్ళు వేసుకొని, ఇవన్నీ భాగవత ప్రమాణాలు, కాళ్ళమీద కాళ్ళు వేసుకొని నీలమేఘశ్యాముడు గనుక బొటనవేలు ఆడిస్తూ ఉండగా ఒక వేటగాడికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బొటనవేలు చిన్న పక్షిలాగా కనిపించింది. ఒక అందమైన నీలి రంగులో ఉన్న పక్షి వలె. దాన్ని బాణంతో అనుసంధానం చేశాడు, సంధించాడు. అక్కడ నుంచి సుషుమ్నానాడి ఎప్పుడైతే withdraw అయిపోయిందో, ఇడా పింగళ నాడులు, రెండు అంటే సూర్యనాడి, చంద్రనాడి అనబడేటువంటి అంటే మామూలు భాషలో మనకి ముక్కుకి రెండు రంధ్రాలు ఉన్నాయి. కుడి రంధ్రము సూర్యనాడి, ఎడమ రంధ్రము చంద్రనాడి. దానివల్లనే మనం గాలి పీల్చుకుంటాం, దానిని పూరకం అన్నాం. కాసేపు నిలబెట్టుకుంటాం, దాన్ని కుంభకం అన్నాం. మళ్ళీ వదిలిపెడతాం, అది రేచకం. ఆ మూడింటిని కూడా కుంభించి వదిలిపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ తన దేహయాత్రని అక్కడ ముగించాడు. ఇట్లా ఒక్కొక్క వ్యక్తిని మనం గనక అంటే మహాపురుషులను గనక చూసినట్లయితే వాళ్ళు ఆ మరణ కాలాన్ని నిర్ణయించుకుంటారా అనేది debatable కాదు. వారు నిర్ణయించుకొనే వస్తారు ముందే.ఎన్ని క్షణాల వరకు ఈ భూమండలంలో ఉండాలో ఉంటారు. ఉన్నంత కాలము పనిచేస్తూనే ఉంటారు. అది మనం నేర్చుకోవాల్సింది. ఇవాళ "భగవాన్ నేను ఎక్కడికి పోతాను, ఇక్కడే ఉంటాను" అని అన్నప్పుడు నా అనుభవంలో, నా అధ్యయనంలో, నా దర్శనంలో శరీరాన్ని వారు వదిలిపెట్టి, ఇదిగో మనకే తెలుస్తున్నది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిపోయింది. అయినప్పటికీ కూడా అరుణాచలము అరుణాచలం అంటే It is a Sri Ramana Maharshi. వారికంటే ముందు ఎంతమంది వచ్చినా, ఏ మళ్ళీ వారి తర్వాత వచ్చిన వాళ్ళంటూ లేరు గనుక భగవాన్ వల్ల అది రమణాచలం అయిపోయింది. వారు అరుణ రమణులు అయిపోయినారు. కాబట్టి ఒక అభేద్య అద్వై అద్వితీయ రమణీయ మనోజ్ఞ భావనా భూమిక ఏర్పడింది. వారు దేహాన్ని వదిలిపెట్టారు, అక్కడే ఉన్నారు, రమణ లింగ రూపంలో ఉన్నారు. నిదర్శనమంటే మన జీవితాల్లో జరిగేటువంటి అనేకానేక సంఘటనలు మహా దుఃఖం వచ్చినప్పుడు ఎక్కడా కుంగిపోకుండా, మహా ఆనందం మన ఒళ్ళో పట్టిన పడినప్పుడు ఎప్పుడూ కూడా తొట్రుపాటు చెందకుండా, ఏ విశృంఖలత్వము లేనటువంటి ఒక మనోనిర్మాణం జరగటానికి కారణభూతులు అయినటువంటి భగవాన్ నిత్యస్మరణీయులై, ప్రాతఃస్మరణీయులై అరుణాచలంలో సుస్థిరమై ఉన్నారు. వారు నిజంగా ఎక్కడికి వెళ్ళలేదు. మరి నిజానికి వారి శరీరము వెళ్ళలేదు. సమాధి గతమై ఉన్నది అది. వారి శరీరము, వారి మనస్సు, వారి వక్ వాక్కు, వారి ఉనికి, వారి అస్తిత్వము, వారి వ్యక్తిత్వము, వారి దివ్యత్వము, వారి సంపూర్ణత్వము అరుణాచలం నుంచి ఇవాళ ఈ సర్వ సమస్త ప్రపంచానికి కూడా పరమాద్భుతమైనటువంటి అనుగ్రహ కిరణాలను ప్రసరిస్తూనే ఉన్నది. అందుకనే భగవాన్ ని తలుచుకుంటే చాలు అని ఎందుకంటాం అంటే భగవానే చెప్పారు "అరుణాచల మనుచు స్మరియించు వారల అహము నిర్మూలింపు అరుణాచల" అహము అంటే ఏమిటంటే నేను, నాది. ఈ రెండే అహంకార మమకారాలు. ఈ రెండూ జీవ లక్షణాలు. ఎప్పుడైతే నేను పోయిందో దాంతోపాటే నాది కూడా పోయింది. నాది పోయిందో నాకూ పోయింది. నాకూ పోయిందో నాకే పోయింది. అహం అట్లా నెమ్మది నెమ్మదిగా ఆహ్ తన స్వరూపాన్ని మార్చుకొని ఒక సంపూర్ణమైనటువంటి స్వస్థితిలో తాను నెలకొల్పు చెంది ఒక పరిపూర్ణమైన భావనా భూమికలో ఈ ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంటుంది. అందుకనే మొన్ననే అన్నారు మూర్తి గారు డెబ్బైలలో మీరు చూసిన అరుణాచలం, ఈ అరుణాచలం చాలా తేడా ఉన్నది. అంటే చూడటంలో తేడా ఉన్నది. అప్పుడు వంద మంది ఉన్నారు, ఇప్పుడు లక్ష మంది ఉన్నారు. అప్పుడు లక్ష మంది ఉన్నారు, ఇప్పుడు పది లక్షల మంది ఉన్నారు. కానీ అరుణాచలం అట్లాగే సంస్థితంగా ఉన్నది. భగవాన్ అరుణాచలానికి చేరుకున్న రోజున దేవాలయ ప్రాంగణంలో వారొక్కరే ఉన్నారు. వారు అరుణాచలేశ్వరుడు తప్ప మరెవరూ లేరు. పాతాళ గుహలో ఉన్నంత కాలము వారొక్కరే ఉన్నారు. అరుణాచలం పైకి వెళ్ళినప్పుడు వారొక్కరే ఉన్నారు. వారి చుట్టూ మిగతావన్నీ ఏర్పడినాయి. ఎలా ఏర్పడినాయి అంటే వాళ్ళ ద్వారా, వారు భగవాన్ తో ఏర్పరచుకున్నటువంటి ఒక సంపర్కం ద్వారా సంయోగం ద్వారా వారు వారి జీవితాలని స్పష్టంగా అర్థం చేసుకొని జీవించగలిగినటువంటి ఒక స్థాయిని చరిత్ర బద్ధం చేసే విధంగా జీవించారు గనుక, ఇవాళ భగవాన్ కి చరిత్ర లేదు, భగవాన్ భక్తుల చరిత్రే ఆయన చరిత్రగా మారింది భాగవతం లా లాగా. భాగవతంలో దశమ స్కంధం దాటి మిగతాదంతా భాగవతుల కథే. భగవంతుని కథ తక్కువ. అలాగే ఈ భగవాన్ మహా అభినిష్క్రమణ సమయంలో కూడా తమను తాము ఎలా నిగ్రహించుకున్నారో, నిలబెట్టుకున్నారో, ఎంత ప్రశాంతంగా, ఎంత ప్రసన్నంగా శరీరాన్ని వదిలిపెట్టారో, మీరు తప్ప మాకు ఎవరూ లేర లేరు అన్నప్పుడు మీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటేనని అనేక విధాల ప్రపంచానికి తెలియజెప్పిన భగవాన్ తనకు సేవ చేసినటువంటి సేవకుడికి, పరిచారకుడికి, తనను నమ్మి ఆశ్రయించి వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ఏకకాలంలో అనేకమైనటువంటి సాధనా మార్గాలు పూజ, జపము, ధ్యానము, యోగము, గానము, జ్ఞానము ఇవి మాత్రమే కాదు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి, ఆత్మ విచార మార్గంలోకి వెళ్ళండి. నేను ఎవరన్నా ప్రశ్న వేసుకున్నట్లయితే నేను దేహం కాదని తేలిపోతుంది. దేహము మాత్రమే కాదని తేలిపోతుంది. మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, అహంకారము కాదు, ఏమీ కాదు. కానీ ఏది అంటే ఆత్మ. సర్వాత్మకమై సర్వ కాలముల యందు నడిపించేటువంటిది గనుక నేను ఎక్కడికి వెళుతున్నాను, ఎక్కడికి వెళ్ళటం లేదు ఇక్కడే ఉన్నాను అనటంలో Now and Here అనేటువంటి వేద ప్రామాణికమైన అంటే ఇహమేవా అన్నది. దాన్ని మనం ఇవాళ Now and Here అన్నాం. ఆ Now is a constant presence. అది Integrated presence, consistent presence. ఈ presence దాటిపోతే అది future అవుతుంది. కాబట్టి నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక అతి వాస్తవిక స్థితిలో భగవాన్ రమణల్ని గనక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే వారి మహా అభినిష్క్రమణ వేళంతా కూడా చాలా సమున్నతమైనటువంటిది. అంతేకాదు అరుణాచలానికి వెళ్ళినప్పుడల్లా మన ఆలోచనలన్నీ గిరి ప్రదక్షిణం చేసినప్పుడల్లా పౌరాణిక గతమైనటువంటి భావనలను దాటి మనం భగవాన్ ఆలోచనలలో, భగవాన్ యొక్క స్మరణలో, భగవాన్ యొక్క రూప, నామ, భావ, తత్వ మనస్సుని అనుసంధానం చేసుకొని గిరి ప్రదక్షిణం గనక చేసినట్లయితేదాని ఫలితాలు చాలా ఉదాత్తంగా ఉంటాయి. ఉదాత్తము, ఉన్నతమైనటువంటి భావనా జరిని మనం ఒడిసి పట్టుకోవాలి. ఆనందంగా ఉండాలి. సంతోష సుఖాలను రెండింటిని దాటాలి. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఓహో అనుకోండి, కష్టం వచ్చినప్పుడు కర్మ నిష్టగా మార్చుకోండి, దాన్ని జయించండి, దాటండి. అలాగే ఒకానొక స్థితికి వెళ్ళిన తర్వాత పడుగు పేకల వలె ఒక రూపాయి బిళ్ళకి బొమ్మా బొరుసు వలె కష్టసుఖాలు జీవితంలో ఉంటాయి. కష్టం లేని జీవితం లేదు, సుఖం ఎరగని జీవితమూ లేదు. సుఖమూ ఉంటుంది, కష్టమూ ఉంటుంది. అది నిలువు పోగు అడ్డం పోగు అంటే పడుగు పేక. దాంతోనే వస్త్రం, దేహం అనే వస్త్రం ఆధార వస్త్రం తయారవుతుంది. ఎప్పుడైతే నిలువు పోగులు తీస్తామో అడ్డం పోగులు కింద పడిపోతాయి. అడ్డం పోగులు పక్కకి లాగేశామో నిలువు పోగులు కూడా పడిపోతాయి. అప్పటి దాకా ఒక కర్చీఫ్ లాగా ఒక వస్త్రంగా మన చేతిలో ఉన్నటువంటిది ఏమీ లేని ఒక మూరు పోగుల యొక్క చిన్న మూటగా, గుట్టగా కింద పడి ఉంటుంది. కనుక దేహం కూడా అంతే. పంచభౌతికమైనటువంటి దేహం పంచభూతాలలో మాత్రమే లీనమవుతుంది. ఎక్కడికి వెళ్ళదు. దానికే దేహము ఇక్కడే ఉంటుంది, పంచభూతాలుగా ఉంటుంది. ఆత్మ ఇక్కడే ఉంటుంది. నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక ఆనంద వారాసిగా, ఆనంద పాదోధిగా, ఆనంద మహాసముద్రంగా, కరుణా సముద్రంగా ఈ ఆత్మ భగవాన్ రమణ మహర్షి అనబడేటువంటి ఒక పరమాద్భుతమైన పరమాత్మ స్వరూపము అరుణాచల పరమాత్మన్ అరుణోదయ విశ్వకంజ సువికాసాయ. ఈ విశ్వము నిరంతరము కూడా వెలుగుతూ ఉంటుంది. ఆత్మ వెలుగుతుంటుంది. ఆత్మగా శోభిల్లుతుంటుంది. భగవాన్ మరణం It is only a transition మరణం అంటే మార్పు. మరణం అంటే దేహాన్ని మాత్రమే వదిలిపెట్టారు. ఆత్మ ఇక్కడే ఉన్నది గనుక అరుణాచలానికి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి? అక్కడ నిశ్చలంగా నిర్మలంగా ఉన్నటువంటి రమణ మహర్షి యొక్క పరమాత్మతో ఈ ఆత్మలు అనుసంధానమయ్యే దిశగా అరుణాచల యాత్రలు సాగాలి. కామ్యసిద్ధుల ఎన్ని కోరుతామో, ఎన్ని పొందుతామో, ఎన్ని పోగొట్టుకుంటామో మనకే తెలియదు. కోరికల అంతులేదు. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అదే కావాలి, అది మాత్రమే కావాలి. ఇవన్నీ కూడా మానసిక జాడ్యాలుగా భావన చేస్తూ వీటన్నింటి నుంచి విముక్తమైనటువంటి ఒక దివ్య భావనలోకి అనేక సంవత్సరాలు యాభై నాలుగు ఏళ్ళది వారి శరీరం పరిమితం. కానీ ఆ శరీరము ఆత్మ రెండింటికీ అపరిమితమైన అనంత మహాశక్తి ఉన్నది గనుక ఆ శక్తిని భగవాన్ గా మనం భావించి మన జీవితాలని ఉన్నంత ఉన్న జీవితాన్ని పరమ పవిత్రమూ, శక్తిమంతము, సమాజహితము, పరోపకార సంబంధము అయినటువంటి జీవితంగా గడపాలని ఏకాత్మ భావనలో నెలకొలి చెందాలని, సమూహంలో ఏ-ఏక-ఏకాత్మగా ఏకాత్మగా ఉన్నప్పుడు సమూహంగా సంయోగంలో వియోగంగా వియోగంలో సంయోగంగా ఈ అద్వైత భావనా స్ఫురణలో మనం జీవించాలని దానికి కావలసినటువంటి అన్ని శక్తులనీ, అవకాశాలనీ, ఆ అదృష్టాలనీ, యోగాలనీ, ప్రాప్తినీ, ప్రారబ్ధాన్నీ పరమేశ్వర స్వరూపమైనటువంటి భగవాన్ శ్రీ రమణులు మనకి సంపూర్ణంగా అనుగ్రహించగా అని మంగళాశాసనం చేస్తూ ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
YouTube · audio
Bhagawan Maha Samadhi Viseshalu - Saket Ramana Satsang,Hyderabad
Bhagawan Maha Samadhi Viseshalu - Saket Ramana Satsang,Hyderabad
0:00 / 31:22