No transcript for this section.
Transcript begins at 3:19.
అందరికీ నమస్కారం. ఆధ్యాత్మికీ మతం అవసరం లేదు. మతానికే ఆధ్యాత్మిక అవసరం. మతం ఎప్పుడూ మౌఢ్యం కాకూడదు అని చాటి చెప్పిన అవధూతలు చాలా మంది ఉన్నారు. వారందరూ మన జీవితంలో శాశ్వతంగా ఒక ముద్ర వేసి ఈ భూమి మీద నడయాడి వారి సందేశాన్నిచ్చి భౌతికంగా వెళ్ళిపోయినప్పటికీ వారి ఆత్మ స్వరూపం ఎప్పుడూ మన మధ్యనే మనతోనే ఉంటుంది. అటువంటి గొప్ప అమ్మ అమ్మత్వాన్ని బోధిస్తూ అమ్మత్వమే జీవితం అని తన జీవితం ద్వారా అందరికీ చాటి చెప్పిన గొప్ప మాతృశ్రీ జిల్లేలు ముడి అమ్మ. [ఇంట్రో మ్యూజిక్] అంటే అనకూడదు గాని గురువు గారు ఇది ప్రశ్న మరి ఇది అపశృతి అయితే మనం తీసేద్దాం. చాలామంది కేవలం మాటలకి పరిమితమై కానీ వాళ్ళ చుట్టూ ఉండే కట్టుబాట్లు అన్నిటినీ కూడా గోడలు కట్టేసుకుని వాళ్ళు ఒక మరొక ఉన్నత స్థాయిలో ఉన్నామని పదే పదే చాటి చెప్తూ కానీ మనం అందరం సర్వ ప్రాణులకి ఒకటే అంతరూ భగవంతుడు ఒక్కడే అని చెప్తున్న వాళ్ళు గురువులు చూస్తున్నాం మనం. వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉండే హడావిడి చూస్తేనే ముందు భయం వేస్తుంది దగ్గరికి వెళ్లాలంటే. అవును అసలు ఎంత భిన్నంగా కేవలం simple గా ఏ విధమైన ఈ హంగామా లు అవి లేకుండా హంగులు లేకుండా ఇదే అసలు జీవితానికి మౌలిక సూత్రం అని చెప్పారు అమ్మ. అవును ఎంత జ్ఞాని! అందులో ప్రపంచం ఆమెని ఒక అమ్మగా అంగీకరిస్తున్న సమయంలో ఉమ్ తెలుగునాట ఒక ప్రముఖ పాత్రికేయుడు కోటన్ రాజు వారి పేరు. ఆయన వెళ్లి "అమ్మా నా చేతిలో పేపర్ ఉంది. నేను నీ మీద articles రాస్తానమ్మ ఇంకా పది మందికి తెలుస్తావు నువ్వు" అని అన్నారాయన. "ఏ పేపర్లో ఏ article చదివి నువ్వు వచ్చావు నాన్నా చెప్పు" అంది. అబ్బా! అయింతే అంతే ఒకటే మాట "ఏ పేపర్లో ఏం చదివి ఇక్కడికి వచ్చావు వద్దులే" అని. ఉమ్ ఇవాళ, ఇవాళ వస్తు వినిమయ ప్రపంచం ఇది. ప్రచారం. ఇక్కడ ప్రతిభకి గౌరవం లేని రోజులివి. అవును ఇవాళ ప్రచారం ఉంటే వాడు మహానుభావుడు అవుతాడు. అంతే కదా! అలా కాకుండా అమ్మ చాలా నిర్దుష్టమైనటువంటి ఒక వ్యక్తి అమ్మ. సంపూర్ణమైనటువంటి స్త్రీత్వానికి స్త్రీత్వం కంటే కూడా అమ్మత్వము అనేది ఆ నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అట్లా లాలించటం అలా దగ్గర తీసుకోగలగటం ఆ ఉమ్ తల్లి అనగలగటం ఆ ఆ హక్కును చేర్చుకోగలగటం అది అసాధ్యం. మళ్ళీ అటువంటి ఆ aspect ఇంకా మళ్ళీ రాకూడదనే కోరుకుంటున్నాను. రావలసిన అవసరం లేదు ఆమె వచ్చింది కదా. అవును వందేళ్ళు అయినా మనం మాట్లాడుకుంటున్నాం గా. ఆమె శరీరం వదిలిపెట్టి ముప్పై ఏడు ఏళ్ళు అయిపోయింది. అయినా మాట్లాడుకుంటున్నాం అంటే అది ఆ కాలం మీద ఆవిడ పద ముద్రలు చాలా గంభీరంగా వేసింది. ఉమ్ ఇది కొనసాగుతూ ఈ ప్రవాహం ఇలా కొనసాగుతుంది గురువు గారు ఉమ్ కానీ ఇది మనం స్వస్తి పలికే లోపు రెండు మూడు ఉమ్ చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి అడగండి తప్పకుండా ప్రత్యేకంగా అమ్మ మీకేమన్నా చెప్పారా? నాకు చెప్పింది నాకు ఇచ్చింది బా-బాగా చదువుకోవాలి నువ్వు కాప-నువ్వు కాకపోతే ఇంకెవరు నీకు కాకపోతే ఎవరికొస్తుంది నాన్నా అని అది ఆశీర్వచనం అనుకున్న ఇప్పుడు. అప్పుడేం అనుకోల. బాగా చదువుకోవాలి సమాజానికి సేవ చేయాలి నాన్నా అన్నది. అది ఆశీర్వచనం బాబా గారు దాన్ని expand చేశారు. దాన్ని బాగా బలంగా దృఢం చేశారు. ఉమ్ కాబట్టి అది ఒక వ్యక్తిత్వంలో ఒక మంచి ఆ ఏమంటాం పారిశం ఉమ్ ఆ మంచి పారిశవాన్ని అమ్మ ఇచ్చింది. ఉమ్ ఇక ప్రత్యేకంగా ఉపదేశాలు సందేశాలు నేను అసలు నేను ఉన్నదే మూడేళ్ళు కానీ నలబై నాలుగు ఏళ్ళ తర్వాత నేను నన్ను పిలిచి, టీవీల వల్ల నన్ను పిలిచి నన్ను మంచి speaker ని పిలిస్తే నేను వెళ్ళినప్పుడు అవన్నీ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటి జిల్లేలు మూడి అరవై రెండులో ఎలా ఉందో నలబై నాలుగు ఏళ్ళకు కూడా మార్పు లేకుండా ఇలా ఉంది. మాతృ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలనము అని ఒక ఆలోచన పుటమరించింది. ఉమ్ బహుశా ప్రేరణ ఇది ఇవాళ అమ్మ వల్ల కలిగింది అనొచ్చు. నాకే కలిగి ఉండొచ్చు. సుమారు ఆరు సంవత్సర-ఏడు సంవత్సరాలు పదకొండు నుంచి పంతొమ్మిది 2019, eight years. ఉమ్ ప్రతి నెల ఐదు రోజులు జిల్లేలు మూడి వెళ్ళా. అక్కడ ఏం చేయగలనో చేశా. అప్పుడు ఆ సేవ చేయాలి నాన్నా అని అన్నది కదా. సేవ చేయాలి అంటే నాకు శక్తి ఉండాలి కదా. శక్తి అంటే ఒక్క డబ్బే కాదుగా. నలుగురు-నలుగురికి చెప్పి కూడా చేయించొచ్చుగా. అవును అవన్నీ జరగటం అనేది నాకు చాలా ఆనందాన్ని, ఓ గోశాల వచ్చినా ఉమ్ ఒక water plant వచ్చినా, ఆ ఒక girls hostel ఒకటి కట్టాలని ఒక సంకల్పం కలిగినా, ఇవన్నీ ఇవాళ చెప్తే ఇవి మనం చేశామని కాదు. మన-ఆ సేవ చేసే దాంట్లో మనం ఉండగలిగాం. అది మనం కూడా ఉండగలిగాం. ఇప్పుడు మన ఆంధ్రజ్యోతి లో జ-జిల్లేలు మూడి అమ్మ గురించి నలభై ఐదు articles వరసగా అసలు అనాహతంగా వెళ్ళిపోయినాయి. అదే తర్వాత అమ్మత్వం అనే book వచ్చింది. ఆ దాన్ని అమ్మని అనేక పారిశ్రాంలో ఇప్పుడు ఎలా మనం మాట్లాడుకున్నామో మాట్లాడుకున్నవన్నీ దాంట్లో లేవు. ఉమ్ దాన్లో ఇంకా చాలా ఉన్నాయి. ఉమ్ అవన్నీ సేవ కిందే భావన. అవును నేను వెళ్ళి అక్కడ వడ్డించక్కర్లేదు. ఉమ్ నేను వెళ్ళి అక్కడ డబ్బు కట్టక్కర్లేదు. చీటి పండక్కర్లేదు.లేదు నేను రోజు అక్కడుండి లేకపోతే ఈ సంస్థ నడవదు అని అనుకోక్కర్లేదు కానీ మనదైనటువంటి రీతిలో మనం చేయగలిగింది మనం చేద్దాం. ఇవాళ శతజయంతి సందర్భంగా అమ్మ గురించి కాసేపు మాట్లాడుకుందామనేది సేవే కదమ్మా అవును దీన్ని మించిన పూజ ఉందా? ఇది సేవ, ఇది పూజ, ఇది సత్సంగం సత్సంగం, ఇది ధ్యానం, ఇది తపస్సు అవును అంతే నా దృష్టిలో ఖచ్చితంగా గురువు గారు. ఉమ్ గురువు గారు అమ్మ భౌతికంగా వెళ్లిపోయినప్పుడు ఉమ్ వాతావరణం ఎలా ఉండేది అంటే ఎంత అంతా నేనే నేను అన్ని చోట్లా మీలో ఉన్నాను అని అమ్మ చెప్పినా అమ్మ వెళ్ళిపోతే మరి బిడ్డలకు కష్టం కదా? ఇది-ఇది కూడా చాలా ఇవాళ అందరూ తెలుసుకోవలసినటువంటి పొందవలసిన జవాబు. ఎందుకంటే అమ్మ శరీరం వదిలిపెట్టిన మరుక్షణం ప్రతి ఆశ్రమంలో జరిగే ఘర్షణలే అక్కడ జరిగాయి. కానీ మామూలుగా గనక అయితే ఘర్షణ వారసుల వల్ల వస్తుంది. నేను వారసుడిని ఆమె కన్న బిడ్డలనుకో కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే భక్తుల మధ్యనే జరిగింది. ఉమ్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు దీనికి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు ఏమి అది అమ్మ విషయం అమ్మ అందరిల్లు చేసింది ఇంకా వాళ్ళదేం లేదు. అవును దే-- వాళ్ళు కంట్రిబ్యూట్-కంట్రిబ్యూట్ చేయలే. చేసింది ఎవరంటే భక్తులు తమలో తామే ఆధిపత్య పోరు ఉంటుంది. అక్కడైతే అపారమైన సంపదలు లేవు. దాని మీద ఘర్షణ లేదు. ఆధిపత్యము అమ్మ కుర్చీలో మనం కూడా కాసేపు కూర్చుందామనుకునే కోరికలున్న వాళ్ళు అయ్యనే ఆ అన్నీ అయ్యినాయి. కాలక్రమేణా అవన్నీ సర్దుబాటు అయిపోయినాయి ఇప్పుడు పరమ వైభవంగా ఉంది. మామూలు అయితే అమ్మ ఉన్నప్పుడు ఉన్నంత స్థాయి ఉన్నదా అంటే వస్తుంది మళ్ళీ దానికి ఒక టైం రావాలి. ఎందుకంటే nineteen fifty ఏప్రిల్ fourteenth న భగవాన్ రమణ మహర్షి దేహం వదిలిపెట్టినప్పుడు కంచి పరమాచార్య ఒక మాట చెప్పారు. నాకు బాగా గుర్తుంది నేను నిన్న సత్సంగాల్లో చెప్పా. మళ్ళీ ఈ వైభవం రావటానికి యాభై ఏళ్ళు పడుతుంది అన్నారు. కరెక్ట్ గా రెండు వేల సంవత్సరం నుంచి మళ్ళీ ఇవాళ రమణ మహర్షి గురించి మాట్లాడుతున్నాం. బహుశా ఈ శతజయంతికి ఒక పూర్వరంగం ఏర్పడింది. ఆ రోజుల్లో ఆమె బీద పిల్లల కోసం అంటే remote areas నుంచి వచ్చే పిల్లల కోసం కాలేజీ పెట్టింది. ఉమ్ ఓరియంటల్ కాలేజ్ పెట్టింది. ఆ అలాగే విగ్రహారాధన ఎందుకమ్మా అని అడిగితే ఏం లేదు నాన్న మనోనిగ్రహం కోసమే విగ్రహాలు అంది. అన్నామె మళ్ళీ ఆమెకు గుడి ఉంది ఇప్పుడు అక్కడ. ఆ గుడిలో మామూలుగా శాస్త్రం ప్రకారం పూజలవి జరుగుతాయి. అవన్నీ ఆమె కోరుకోలే కానీ ఆమె చుట్టూ అలా జరుగుతూ ఉంటాయి. ఉమ్ వాటిని మనం గౌరవిస్తూనే అది ఆమె పని కాదు ఆమె కోరుకోలేదు నాకు ఒక గుడి కట్టండి, వీడు పలానా వాడు పూజారి, వాడికి పధ్నాలుగు ఎకరాల పొలం ఉంది ఆ మాన్యం తెచ్చి నాకు నడప-- అవేమీ ఆమె కోరుకోలే. నిరామయంగా ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి. అందరూ ఆమె చుట్టూ చేరి ఉంటం బాగాలేనప్పుడు అమ్మా నువ్వు కొద్ది కాలం ఉండాలి ఇంకొద్దిగా అరవై మూడేళ్లేగా ఇంకా కొద్ది కాలం ఉండాలనా అని అమ్మను అడిగితే ఆమె అన్నది ఒట్టెమ్మ-- నన్ను వెళ్ళనివ్వండ్రా నేను వచ్చినప్పుడు మీరందరూ లేరే ఆ వెళ్ళేటప్పుడు కూడా నన్ను ఒంటరిగా వెళ్లిపోనివ్వండి అన్నది. అయ్యో! ఉమ్ అంటే ఆ దేహాతీతమైన భావన ఉందని మనం గ్రహించాలి దాని వెనక. ఖచ్చితంగా గురువు గారు ఆ అంటే అన్ని-అన్నిటి-అన్నిటి-అన్ని లోకముల జ్ఞానము ఉన్న జ్ఞానం వారిలో ఉన్న అవును ఉంది అయ్యగారు గురువు గారు? ఆయన ఆమె కంటే ముందే వెళ్లారు. ముందే వెళ్లిపోయినారు. ఎలా స్వీకరించారు గురువు గారు? అంటే మామూలుగా అమ్మకి ఇది పెద్ద విషయం అయి ఉండకపోవచ్చు. మామూలుగా, ఆమె గంభీరంగా ఆయన ఆలయ ప్రవేశం అంటారే ఆయనకు కూడా ఆలయం ఉంది. ఆ ఆలయంలో అంటే సమాధిగతం చేసేటప్పుడు she led the procession. ఊహూ అంతే. ఎవరన్నా వెళ్లి ఇట్లా ఏదో భర్త పోయినాడమ్మా కాస్త ఇబ్బందులుగా ఉన్నాయంటే నాకు తప్పిందా నాన్న అనేది. నాకే తప్పలేదు కదా దాన్ని వదిలేసేయండి అనేది. అది. గురువు గారు అమ్మ అంటే మనము అమ్మ జీవిత సారాన్ని కుద్దో గొప్పో గ్రహించి ఈ తరం అందుకోవాలంటే మంచి పనులు చేయడం అవన్నీ ఒక ఎత్తయితే అంటే కాలేజీలు కట్టించడం అది ఈ తరం మనకి చాలామంది ఫిలాంత్రపిస్ట్ లు వాళ్ళు కనిపిస్తారు. చేస్తారు core essence అంటే నాకు ప్రపంచానికి ఉండే అనుబంధం ఏమిటి? అని చాటి చెప్పారు ప్రతిక్షణం. నేను అమ్మని ఉమ్ అందరూ నా బిడ్డలు బిడ్డలు ఆ అమ్మ ప్రేమ అందరిలో ప్రవహిస్తే ఉమ్ మరి అంతకంటే మించినది ఏమన్నా ఉంటుందా గురువు గారు? ఇవాళ మనం ఆమె నుంచి నేర్చుకోవాల్సింది కూడా అదేనమ్మా. ఇప్పుడు నువ్వున్నావ్, నీ కడుపున పుట్టిన బిడ్డలు ఉంటారు. వాళ్ళిద్దరినీ నువ్వు ఎలాగూ ప్రేమిస్తావు. దానికి ఎవరు చెప్పక్కర్లే, నీ బిడ్డను ప్రేమించని ఎవరు చెప్పాలా? కానీ ఏ కన్నతల్లి బిడ్డనైనా మన బిడ్డగా భావించగలిగితే అది ఇచ్చే ఆనందం వెయ్యి రెట్లు గొప్పది. అది అమ్మ demonstrate చేసింది తన life లో. ఆ జీవిత కాలంలో ఆవిడ చేసింది. ఇవాళ అందరూ కూడా అలా ఉండాలి. అలా ఉండాలి అలాగే మన దగ్గర డబ్బు లేదు గనుక మనం ఏం చేయలేము, మన దగ్గర శక్తి లేదు గనుక ఇంకేమీ చేయలేం ఇగ అనుకోవద్దు. ఉన్నంత వరకు ఇప్పుడు బాబాగారున్నారు పెద్ద సూపర్ స్పెషాలిటీ కట్టారు. మనం ఒక దుప్పటి కొనివ్వగలం కదా, medicines కొనివ్వగలం కదా, అట్లాగే అమ్మ ఇది పెట్టింది. ఆ ఒక పిల్లవాడిని ఎవరన్నా వస్తే వాడి చదువుకు ఎంత అవుతుందో డబ్బు ఇవ్వగలం కదా, వాడికి బట్టలు సరిగ్గా లేవు ఇవ్వగలం కదా. అంటే ఆ త్యాగేనైకే అమృతత్వమానశుః త్యాగం వలననే వాళ్ళు అమృత పుత్రులవుతారు. అమ్మ కూడా అమృతత్వాన్ని, అమ్మత్వాన్ని ఏకకాలంలో demonstrate చేసింది అమ్మ. ఊ ఉమ్ ఖచ్చితంగా చాలా చాలా గొప్ప జీవితం, గొప్ప ఉదాహరణ మనకి. ఉమ్ మన మధ్య నడయాడిన ఉమ్ ఈ అవధూతకి ఉమ్ ఆ దేవతా మూర్తికి ఉమ్ మనం ఏమిచ్చుకోగలుగుతాం గురువు గారు? ఏం లేదమ్మా, ప్రస్తావన చేశావు గనుక అసలు అవధూత గురించి ఓ మాట చెప్తా. అవధూత అనగానే ఒక ఉన్మత్తుడి వలెప్రాపంచిక rags and దీంట్లో ఉంటాడని సరైన బట్టలు వేసుకోడని ఏదో తనదైన ప్రపంచంలో ఉంటాడని మనం అనుకుంటాం కదా. అసలు దానికి అర్థం ఏంటో తెలుసునా? ఆ వా దూ త అంతే కదా. అమదానందము విమల ధామమై. వాళ్ళెక్కడ ఆ ధామం ఏంటి? ఆ ఉన్న ఇల్లు కాదు. అమదానందము అనంతమైన ఆనందమే వాళ్ళ నివాసం. వర్తమాన వర్తిత అవ్యధాకారకమై మనతోనే ఉంటూ మన ఏ దుఃఖానికి వాళ్ళు కారణం కాకుండా ఉంటారు. మనకు దుఃఖాలు రావటానికి బోలెడు కారణాలు ఉంటాయి కానీ ఆమె కారణం కాదు. అవ్యధాకారకమై. తమోరహిత తపోతత్వ తారకమై. తమస్సు లేదు. తపస్సు వల్ల కలిగేటువంటి ఒక తత్వానికి వాళ్ళు కారణం అవుతారు. They become the cause. అవధూత. ధూమ కామ రహిత ధ్యాన ధారణాతీత చారణమై. అబ్బా! ధూమం లేదు, కామం లేదు, ధారణ లేదు, ధ్యానం లేదు, ఏమీ లేదు. ఏమీ లేదు అంటే అన్నీ ఉన్నాయి. అదే ఆ అన్నీ ఉన్న స్థాయిలో సంచారం చేసి నిలుచుని- అద్భుతం ఆ అను నిలుచుని ఈ జగతి. మళ్ళీ వాళ్ళు ఈ జగత్తులోనే ఉంటారు. ఎట్లా ఉంటారు? అవధూత నిర్మల నిశ్చల సచ్చరిత. నిర్మలంగా ఉంటారు, నిర్మమంగా ఉంటారు, నికేతనంగా ఉంటారు, నిరంజనంగా ఉంటారు, నిరామయంగా ఉంటారు. కానీ ప్రాపంచికమైన మన దుఃఖం వెళ్లబుచ్చుగా అయ్యో దుఃఖం వచ్చిందా అంటారు. కానీ ఆ దుఃఖాన్ని వాళ్ళు own చేసుకోరు. మా అమ్మాయి పెళ్లి కలెక్టర్ గారు అబ్బాయి IAS చదివాడు. వాడికి అవుతుంది అని చెప్తే సంతోషం అంటారు అంతే. ఈ సంతోషానికి, ఆ దుఃఖానికి, ఆ ప్రకటానికి, వాళ్ళకి, నిజానికి, ఆమెకి, మనకి సంబంధం ఉన్నదా అంటే జ్ఞానైక స్థితిలో చూస్తే absolutely there is no relation. అదే కర్మానుబంధి మనుష్య లోకే. వాళ్ళు ఆ జిల్లెళ్ళమూడి అమ్మ ఆమె ఆ పని చేయటానికి ఆమె వచ్చింది, ఆమె చేసుకుంటూ వెళ్ళింది. ఆ చేసుకుంటూ వెళ్లిన దాంట్లో మనం కూడా కాసేపు ఉన్నాం. ఊ? మనం దాన్ని నడిపించింది కాదు. ఆ? అలాగే మనం claim చేయటానికి లేదు. ఆమె కూడా ఎక్కడా చెప్పలే, మీ అందరినీ నేను నడిపిస్తాను రండి అని ఆమె చెప్పలే. కానీ మనం కూడా దీనిని doership లేకపోవడం అంటాం. అకర్తృత్వం గనక మనం అలవాటు చేసుకుంటే సగం దుఃఖ భారం ఉండదు. అదే నే చేశాను, నా వల్ల జరిగింది, నేనే చేయగలను- మంచైనా చెడైనా మంచిగాని చెడు గాని ప్రతి దానికి మనమే కా-కారణం. We are the reason. సో మరి దానికి తగినటువంటి ఫలితాన్ని ఎవరు పొందాలి? సర్వం బ్రహ్మమయం. మనం ఫలితం అంటే మనము చేస్తున్నాం అనే ఆ ఒక, ఒక, ఒక duality నుంచి బయటపడాలి. అవును. అందుకనే అహం మమత్వ శిథిలాయమానే అంటారు శంకర భగవత్పాదులు. ఆ శిథిలం ఏం కావాలి? ఏది మన నుంచి పోవాలి అంటే అహం. నేనుతో కూడిన నేను భావన పోవాలి. అసలు నేనుతో కూడిన నేను అది అనంతమై, చైతన్యమై, ప్రపంచానికి ఆవిష్కృత ఒక అమ్మ లాగా, ఒక బాబాగారు లాగా, ఒక రమణ మహర్షి లాగా. వీళ్ళందరూ కూడా అసలు నేను గా వాళ్ళు ఈ నేను ధరించారు. అమ్మ కూడా అటువంటి మేనే ధరించింది. ధరించడమే కాదు, ప్రపంచంలో దాన్ని భరించింది. ప్రపంచం ధరించింది. ప్రపంచం ధరించింది. దీంతో అమ్మ అవతార వైభవం సంపూర్ణంగా జరిగింది. ఇంకా చాలా ఎన్నెన్నో చెప్పుకోవచ్చు కానీ ఇవాళ శతజయంతి నాడు- ఊ అమ్మకి మనం ఏం చేయాలి? అమ్మ పరంగా ఏం చేయాలి? ఇదొక సందేశం వెళ్ళాలి కదా. ఖచ్చితంగా గురువుగారు. ఆ, ఏదో buildings కట్టాము, రోడ్లు వేయించాము, ఆ ఎల్ఈడి బల్బులు పెట్టాము, దీపాలంకరణ చేశాం. ఇదంతా జాతర. ఇదంతా ఒక వైభోగం. ఒక ఆ ఉత్సవం. ఊ? ఇవాళ చేయవలసింది ఏంటంటే అమ్మ వాక్యాలను చిలక పలుకుల వలే మాట్లాడుకోకుండా ప్రతి వ్యక్తి తనకు, ఇందాక అమ్మే చెప్పిందిగా, నీకు ఏది సాధ్యమో అదే సాధన అన్నదిగా. అవును మనం ఏం చేయగలమో, నేను చేయగలిగింది ఇంకొకడు చేయలేడు, ఇంకొకడు చేయగలిగింది నేను కూడా చేయలేను. కానీ ఎవరికి వాళ్ళమే మనం ఒకటి నిర్ణయించుకొని, ఏదో నీకున్నది తిని ఇతరులకు పెట్టుకో నాన్న అన్నది. పెట్టటం వేరు, పెట్టుకోవటం వేరు అన్నది మళ్ళీ అమ్మ. పెట్టటం వేరు, టేబుల్ మీద పెట్టాను తిను అని వెళ్ళిపోవచ్చు. అది పెట్టటం. పెట్టుకోవటం, నేను పెడతా, అమ్మ పెట్టలేదు పెట్టుకున్నది. మరి మనం అది నేర్చుకోవాలి కదా. అయ్యో! ఊ? అవును గురువుగారు. ఊ. అలాగే ఆ కలిగిన వాళ్ళందరూ నలిగిన వాడిని కాపాడుకోగలిగితే కావలసింది ఏముంది? తర్వాత అమ్మ డబ్బు విషయంలో ఏనాడూ నాకిది కావాలని కోరుకోలేదు. ఇంకొక అద్భుతమైన సందర్భం చెప్పి అమ్మ పాదుష్లో యాభై ఏళ్ళు వచ్చినాయి అమ్మకి. భక్త సమాజం ఏర్పడిపోయింది. దాంట్లో అన్ని ఆ వర్గాల వాళ్ళున్నారు. బాగా డబ్బున్న వాళ్ళున్నారు, ఏమీ లేని వాళ్ళున్నారు, అందరూన్నారు. ఓ పది మంది సమాజం ఒకటి ఏర్పడతారుగా. అమ్మా! నీకు యాభై ఏళ్ళు వచ్చాయి. నీకేం కావాలమ్మా? కాస్త ఓ పది గాజులు, జతలు చేయించమంటావా? ఓ నగ చేయించమంటావా? ఇవన్నీ అడుగుతు-అడగటం మొదలు పెట్టారు. అలా శూన్యంలోకి చూస్తూ ఏం లేదు నాన్న ఒక లక్ష మంది ఏకపంక్తిలో భోంచేస్తే చూడాలని ఉంది అన్నది. జిల్లెళ్ళమూడి అన్నీ కలిపి యాభై ఇళ్ళు లేవు అక్కడ. district మొత్తం పిలిచినా లక్ష మంది రారు. ఒకవేళ వచ్చినా అన్ని అంత డబ్బు లేదు. చూడాలని ఉంది నాన్న అన్నది. అంటే వీళ్ళు ఇది అవదేమో అని అనుకున్నారు. కానీ చరిత్రలో ఒక నిదర్శనం ఏంటంటే ఆ యాభైయవ birthday నాడు స్వర్ణోత్సవాలు అంటారు. ఊ ఒక లక్ష అరవై వేల మంది భోజనం చేశారు. డెబ్బై ఎకరాల స్థలంలో. పొలాలన్నీ చేసి చలువ పందిళ్ళు వేస్తే అమ్మ వాళ్ళందరినీ చూట్టానికి జీప్ లో వెళ్ళవలసి వచ్చింది, అందరినీ కలవటానికి. ఆవిడేమి ఇక్కడి నుంచి అక్కడికి గంతు వేసుకుంటూ వెళ్ళటం మాయమైపోయి అక్కడ అట్లా చేయలే. జీప్ లో వెళ్ళింది. మనుషులతో వెళ్ళింది. అందరినీ పలకరించింది. అందరికీ అన్నం పెట్టింది. అది కామ్యసిద్ధి అంటే అది.ఇవాళ మనల్ని అడుగుతారు, "నీ birthday ఎలా celebrate చేస్తున్నావ్?" మొన్న నన్ను కూడా ఎవరో అడిగారు. నేనేం celebrate చేసుకోకపోవటమే celebration అని చెప్పా. అవును. ఎందుకంటే, ఇన్నాళ్ళు చేసుకున్నాం కదా ఇంకా ఏమిటి చేయాలి? ఇంకొడికి గనక చేయగలిగితే, అదే రోజు ఇంకో మనిషికి చేయగలిగితే, ఇవాళ జల్లెళ్ళ మూడి అమ్మ తత్వాన్ని ప్రపంచానికి గనక చెప్పకపోతే, ఇవన్నీ గోడ మీద రాతలుగా ఈ మాటలు మిగిలిపోతాయమ్మ. మనలో అసూయ, దంభము, గర్వము, ఆ, మాత్సర్యము, ఆ, ఆగ్రహము, ఇవన్నీ కూడా నిగ్రహించుకోకుండా, పోగొట్టుకోకుండా "I am a devotee of జల్లెళ్ళ మూడి అమ్మ" అనుకున్నట్లయితే అది ఆత్మవంచన, ఆపై జగద్వంచన. ఇవాళ శతజయంతి సందర్భంలో ఒకే ఒక్క నివాళి ఒకటి ఎత్తాలి ఏంటంటే, అమ్మ కొన్ని ఆదర్శాలు పెట్టుకున్నది. అవును. తదనుగుణంగా జీవించింది. అనేక కష్ట నిష్టూరాలు భరించింది. అన్నింటికంటే డబ్బు లేని రోజులు ఆమె ఎక్కువ చూసింది. ఉహు. ఇవాళ మన దగ్గర సిరి ఉన్నది, హరి లేడు. ఆహా! గుణం లేదు. అందరిల్లు అయింది. ఆ అందరిల్లు కూడా గుణమందిరం కావాలి. We must become the embodiment of purity plus divinity. ఊ. హరి. అక్కడి నుంచి పుట్టుకొచ్చే- అక్కడి నుంచి వచ్చేదే unity. Unity. అవును. చాలా గొప్ప సందేశం గొప్పగా చెప్పారు గురువుగారు. అమ్మా. ఇవన్నీ అసలంటే మీరు ఎంత మేధావి కంటే అతీతం, ఎంత జ్ఞాని గురువు గారు. ఎందుకంటే ఈ జరుగుతున్న విషయాలను మీరు గ్రహించడమే కాదు, వాటిని వెంటనే ఆ immediate గా దాన్ని process చేయడం, ప్రపంచానికి ఏ పద్ధతిలో కావాలో, ఏ పదాలతో కావాలో ఇంత హృద్యంగా, ఇంత అందంగా చెప్తారు గురువు గారు. మీ మాటలు వినడమే మేము ధన్యులం-అయ్యం. అమ్మా నీరాజనం ఒకటుంది. ఊ. అందరూ పాడుకునేది. ఊ. పాడమ్మా. [పాట] పరమాత్మవైన మా అమ్మ నీరాజనమ్ముగై కొమ్మ. పరమాత్మవైన మా అమ్మ నీరాజనమ్ముగై కొమ్మ. సుడిగాలిలో సొక్కి సోలి సడి లేని నీ ఒడిలో రాలి జడ ప్రాయమైన జీవాళి దరిచేర్చు తల్లి నివాళి. భేదమెరుగని నీ విధానాలు బోధించు మాకు వేదాలు. వేదాలు తెలుపు సారాలు మా నుదుట నీ చేతి వ్రాలు. అమ్మ అమ్మ అమ్మ అమ్మ. అద్భుతం అమ్మ స్వప్న, ఎంత బాగా పాడావు. అమ్మకి నీరాజనం ఎత్తినట్లు అయింది. అవును గురువు గారు. ఊ. ఆ గురువు గారు ఒక సున్నితమైన విషయం. అమ్మా. గొప్ప వాళ్ళ, ఆ, అవధూతల జీవితాల్లో కూడా ఎక్కడో అక్కడ ఒక కష్టం ఒక-ఒక సందర్భం వస్తుంది. దానికి ప్రపంచానికి సమాధానాలు దొరకవు. ఉదాహరణకి అమ్మ, సుపుత్రిక హేమవతి గారు. ఊ. హేమవతి గారి జీవితంలో జరిగిన విషయాలు- ఊ. ఆ రోజుల్లో కొంత వివాదాస్పదం అయిందని వినికిడి. ఊ. జరిగిన దాన్ని మీరెలా అర్థం చేసుకున్నారు? ఆ, ఇది కూడా ప్రపంచానికి చాలా అవసరమైనటువంటి ఒక వివరణ మనం మాట్లాడుకోవాలి. ఊ. ఇప్పుడు హేమవతి దేవి అనేటువంటి ఆమె, నేను చూశాను ఆమెని. ఊ. నేను ఎప్పుడూ మాట్లాడలే, చూశా. చాలా సున్నితంగా ఉండేది ఆమె. twenty five years వస్తున్నాయి ఇంకా అప్పటికి. ఆయన అడుగుతున్నారు, "మరి అందరి పెళ్లిళ్లు అవుతున్నాయి, మన అమ్మాయి పెళ్లి కూడా చేయాలి కదా, ఎప్పుడు చేద్దాం" అని. "ఇరవై ఐదు దాటాక చూద్దాంలే" అని వదిలేసింది అమ్మ. ఇరవై ఐదు దాటింది ఆమె శరీరం వదిలిపెట్టేసింది. వదిలిపెడితే అప్పుడు ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారం పెళ్లి కాలేదు గనుక, కానీ కుమార్-కుమారే కదా, కన్య. సో సమాధి చ్-చేసింది. ఎవరు చేయాలి? అమ్మ చేసింది కూర్చొని. అక్కడ ఆ రోజుల్లో అందరూ అనుకున్నారు, "ఏంటి ఇంత కఠినం? ఈమె గుండె అన్న బండరాయే, అసలు అమ్మ అని ఎందుకంటున్నారు ఈమెని?" అని విమర్శించిన వాళ్ళు లేకపోలేదు. కానీ వాళ్ళందరికీ ఒక సమాధానం, ఒక పెద్ద నిదర్శనం ఆ రోజుల్లో ఏం చేసిందంటే, సమాధిలో శరీరాన్ని, హేమ శరీరాన్ని కూర్చోబెట్టినప్పుడు కుడి చేతితో బ్రహ్మ రంధ్రం అంటాం కదా, నడి నెత్తి అనుకోండి అచ్చ తెలుగులో, దాని మీద బొటనవేలు పెడితే దానిలో చైతన్యం ఉంది. చైతన్యాన్ని చూసిందమ్మ. అంతే, అయి-అయిపోయింది అని. అంటే శరీరం పోయింది గానీ చైతన్యం అక్కడే ఉన్నది గానీ ఒక శరీరం పోవచ్చు, అది హేమవతి కావచ్చు, రేపు ఇంకొకళ్ళు కావచ్చు, అంతకు ముందు పోయినా, ఎవరు పోయినా దేహం పోయిన దేహం ఇక్కడే ఉంటున్నది, చైతన్యం విస్తృతమవుతున్నది. పరిమితమైనటువంటి ఒక మమకారం నుంచి అపరిమితమైనటువంటి మమకారం వైపు ఎలా వెళ్ళాలో అమ్మ demonstrate చేసింది. "నా బిడ్డని నేను దేవీదేవతగా మీరు భావిస్తున్నారు, నా పిల్లను రక్షించుకోలేకపోయానా? మా అమ్మాయిని కాపాడుకోలేకపోయానా?" అని ఏం మాట్లాడలేదు ఆమె. ఒక అనంత చైతన్యాన్ని అక్కడ నిక్షిప్తం చేసింది. ఇలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండాలి. ఊ. మన వాళ్ళని మనం పోగొట్టుకున్నప్పటికీ కూడా, ఆ పోయేది శరీరమే తప్ప లోపల ఉన్న చైతన్యం కాదు. ఆ consciousness is forever and it is eternal అని అక్కడ ఆ తర్వాత దాన్ని దేవాలయం కట్టారు. అక్కడేదో కోరుకున్న వాళ్ళ కోరికలు సిద్ధిస్తాయి అనేటువంటి నమ్మకం అయితే చాలామందికి ఉన్నది. నేను దాన్ని, ఆ ప్రస్తావన దాని జోలికి వెళ్ళకుండా ఒకటి మాత్రం చెప్పగలను. అది అవధూత గానీ, ఇంకొకరు గానీ, ఇంకొకరు గానీ, ఇవి ఏవీ కానీ సామాన్యుడు గానీ, జీవిత కాలంలో నేర్చుకోవాల్సింది ఒక్కటే. We discard the body. ఊహూ.And we remain as we are Eternal Eternal గా ఏదైతే ఉందో ఆ చైతన్యమే నేను అన్న భావనలో గనక రాగలిగితే ఈ దేహము దానికి వచ్చే రోగాలు దానికి వచ్చే ఇబ్బందులు మానవమానాలు dualities ఉన్నాయి కదా, ఇవి ఏవీ అంటవు అంటుకోకూడదు అని మనం చెప్పుకుంటాం దాన్ని అమ్మ she demonstrated వారు అంత చిన్న వయసులో దేహం చాలించడానికి మ్ కారణాలు శరీరం ఒక మసూచి లాంటిది ఏదో వచ్చింది ఏదో కారణం అంటే నింద లేనిదే బొంద పోదు అని ఒక మాట ఉంది కదా కాబట్టి కారణాలు ఉంటాయి అయితే ఆమె ఆపచ్చు కదా ఆపచ్చు కదా అన్న వాళ్ళు అన్న వాళ్ళున్నారు అన్న వాళ్ళున్నారు రమణ మహర్షిని ఆయనకి సార్కోమా వచ్చింది భుజం మీద. అందరూ భక్తుల మధ్యలో కూర్చుంటే అది కాడుతూ ఉండేది ఎర్రగా ఉండేది పుండు ఉ-ఉంటే చూస్తున్న వాళ్ళంతా బాధపడుతూ ఏమడిగేవారంటే మాకు కష్టాలు వచ్చాయి మాకు రోగాలు వచ్చాయి మిమ్మల్ని తలుచుకుంటే అవన్నీ పోయినాయి మరి మీరు కూడా ఒకసారి తలుచుకుంటే అది పోతుంది కదా చూడలేకుండా ఉన్నాము అన్నారు. మీ ప్రశ్నకి జవాబు దీంట్లో ఉంది అదేంటో తెలుసా? నిజమే! సంకల్పించుకోండి సంకల్పించుకోండి అని మీరందరూ నన్నంటున్నారే, సంకల్పించుకోవటానికి మీ దగ్గర మనస్సులున్నాయి ఇక్కడ మనసే లేదుగా దేంతో సంకల్పించాలి అబ్బా మీరు ఎలా వచ్చారో వారు అలాగే వచ్చారు మిమ్మల్ని ఎవరినన్నా ఇక్కడికి ఆశ్రమానికి రమ్మని పిలిచామా? మీరు వచ్చారు. మీరు ఎట్లా వచ్చారో వారు కూడా వచ్చారు. వారు ఉండాలనుకున్నంత కాలం ఉంటారు లేకపోతే వీరిని కూడా తీసుకుని వెళతారు. అదిబ్బా ఇది ఒక జ్ఞాని మాత్రమే చేయగలడు ఇంకెవ్వరూ కాదు జ్ఞానికి జ్ఞాని యొక్క మానసిక స్థితి అట్లాగే ఉంటుంది. ఇంకో విషయం చెప్తా అమ్మ సందర్భం అయినా ఒక అద్వైత మూర్తి అయినటువంటి రమణ మహర్షి ఒకసారి పదకొండు గంటలకు భోజనాలకు లేస్తున్నారు. ఆయనే అందరితో పాటు క్యూలో నుంచునేవారు. అందరితో పాటు ప్రత్యేకం ఏం లేదు అందరితో కలిసి భోంచేసేవారు. ఇంతలో ఒకాయన పరిగెత్తుకొని వచ్చాడు ఒకతను వచ్చి భగవాన్ నలుగురు ఇప్పుడే ఒక శవదహన కార్యక్రమం చేసి వచ్చారు. వాళ్ళు గంట కొట్టేస్తే మూసేస్తారని భోజనానికి నుంచున్నారు అంటే అతను అయితే వాళ్ళని బయటికి పంపించని అనాలి ఈయన అప్పుడు ఆయన అన్నారు ఏది ఆ నలుగురి గురించి ఆలోచిస్తున్నారా? వారు శవ వాహకులు అంటున్నారు కదా మనం నిత్య శవ వాహకులం మన శవాన్ని మనమే మోస్తున్నాం గా వారిని భోంచేయనివ్వండి. ఇప్పుడు మనం మోస్తున్నాము దేహం వదిలాక నలుగురు మోస్తారు అంతే తేడా. అంటే జ్ఞాని యొక్క లక్షణం అట్లా ఉంటది. అంటే అంత అలవోకగా అంత స్పష్టంగా రావడమే Spontaneity అంటే ఎప్పుడూ ఆ యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతి ఏవ అని మనం కూడా నమ్మా ఏ profession లో ఉండు, ఏ సంపాదించు భౌతికంగా ఎట్లాగా ఉండు చిత్తాన్ని మాత్రం ఆ universal consciousnessతో గనక అనుసంధానం చేసుకోగలిగితే దానికి హిమాలయాలు వెళ్ళక్కర్ల గడ్డాలు మీసాలు పెంచుకో అక్కర్ల దానికి ఒక ప్రత్యేకమైన వేషం అక్కర్ల you be normal you live as you are దాన్ని అప్పుడు ఘర్షణ ఉండదు. నువ్వు కానీ ఇంకొకని నిన్ను నీలో ఆవేశింపజేసుకుంటే ఘర్షణ ఎవరికీ ముందు నీకే అవును కదా ఆ నీకేంటి ఈ ప్రపంచానికి, ప్రపంచం దాని నుంచి కాస్త బయట పడాలి. అమ్మ అందరూ రాజరాజేశ్వరి అన్నా తాను అమ్మగానే ఉంది. అందువల్లే నాకు ఆవిడంటే ఇష్టం. అమ్మని వాళ్ళ అందరూ వెంట పెట్టుకుని మ్ ఈరోజు వీలైతే ఈ వారం ఇంకా వీలైతే ఈ నెల ఈ సంవత్సరం ఈ జీవితం గడపాలని కోరుకుంటున్న గురువు గారు. శుభం నిజంగా మీకు నమస్కారాలు.
YouTube · audio
అమ్మ వాత్సల్యం... | Remembering Jillellamudi Amma on her Birth Centenary Celebrations
అమ్మ వాత్సల్యం... | Remembering Jillellamudi Amma on her Birth Centenary Celebrations
Source: iDream Media on YouTube
0:00 / 31:42
More in this series