Skip to content
Transcript తెలుగు
యజ్ఞ యాగాదులు రెండు వందల యాభై జ్ఞాన యజ్ఞాలు చేశానంటున్నాడు. రెండు వందల యాభై ఒకటి చెయ్యాలన్న కోరిక ఇంకా లోపల ఉంది. వంద కోట్లు సంపాదించానన్నాడు, రెండు వందల కోట్లు సంపాదించాలన్న ఆలోచన ఉంది. ఇప్పటికే ముందు వెనక ఐదు PhDలు తెగిలించుకున్నాం, ఇంకో రెండు మూడు ఉంటే బాగుండునుకున్నాం. ఎవరో స్నేహితుడికి తొమ్మిది ఉన్నాయని తెలిసింది. వాడి కంటే ఇంకోటి పొందాలనుకుంటాం. పొందుతున్నాం, పొందాలి. కానీ, అవి ఏవీ మనవి కాదు, అవి మనం కాదు. మనం ఏమిటి అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వమే ఒక ఆత్మయై సంస్థితమై ఏదైతే ఉన్నదో, "యహం మహామితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి" మన యందున్న నేను అసలు నేను గా. ఎందుకంటే మనకు పెట్టింది, మన పేరు ఎవరో పెట్టారు, మనది అనుకున్నాం. నువ్వు అప్పుడు పుట్టావు అన్నారు, అవునా అనుకున్నాం. ఇగో నువ్ ఇది అన్నారు, అవునా అనుకున్నాం. మరి మనం ఎవరము అని ప్రశ్న గనక వేసుకున్నట్లయితే వెనక్కి వెనక్కి వెనక్కి ఎంత లోతుకు వెళితే మనకు అర్థమయ్యే విషయం ఒకటే. నేను దేహాన్నే గనక అయితే దేహం ఊడిపోయేది, ఎప్పుడో రాలిపోతుంది. నేను సంపాదించిన కీర్తి అంతా ఓచోట ఉండిపోతుంది. కానీ, నేను ఉండిపోతా. నేను ఎవరంటే మళ్ళీ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఓమాట చెప్పాడు, "వాసాంసి జీర్ణాని యథా విహాయ" అందమైన శ్లోకం అది. జీవుడు తాను ధరించినటువంటి ఒక వస్త్రాన్ని, ఇగో ఈవేళ ఉన్నాం మనం ఇప్పుడు ఒక dress వేసుకున్నాం. కాసేపైతే మరొకటి, సాయంకాలం అయితే మరొకటి, మళ్ళీ రాత్రిపూట మరొకటి, మళ్ళీ తెల్లవారిగనే ఇది కాదని మరొకటి. ఎట్లాగైతే వస్త్రం మారుతున్నదో కానీ మనం మారటం లేదో, ఆత్మ కూడా దేహాన్ని మారుస్తున్న తప్ప తాను మారటం లేదు. మారని, చెదరని, మసిబారని, మాపెరగని, రూపు కోల్పోని ఒక అఖండమైనటువంటి ఆత్మ మన యందున్నది. తదనుగుణంగా మనం జీవించాలి అంటే ఆత్మానుభూతిని మనం పొందవలసిన అవసరం ఉన్నదని చెప్తూ అటువంటి పనులు చేయండి. అటువంటి పనులు ఎక్కడి నుంచి అంటే యజ్ఞ యాగాదులలో, జ్ఞాన యజ్ఞాలలో ఏమున్నది? విచారధారలో మనకు తెలిసిన దాన్ని పది మందికి చెప్తున్నాం, దానికి జ్ఞాన యజ్ఞం అని మనం పేరు పెడుతున్నాం. అది జ్ఞాన యజ్ఞం కాదు, అది విజ్ఞాన యజ్ఞం. ఎందుకంటే భగవాన్ రమణుల్ని కె. స్వామినాథన్ అని ఒకాయన ఒక ప్రశ్న వేశాడు. భగవాన్ శాస్త్రాల మీద, scriptures మీద తీవ్రంగా మాట్లాడేవారు, చాలా అధ్యయనం చేశారే. వాళ్ళందరూ జ్ఞానులే కదా? అన్నాడాయన. అడిగాడు. భగవాన్ ఇచ్చిన సమాధానం మనబోటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న హెచ్చరిక. Intellectual interpretation is not జ్ఞాన, it is only విజ్ఞాన అన్నారు. అంటే నాకు చాలా information ఉంది నా దగ్గర, అంతే. నా దగ్గర ఉన్న information ని నేను implement గనక చేయగలిగితే, implement చేస్తూ చేస్తూ నాలో transformation తెచ్చుకోగలిగితే అది నిజమైనటువంటి IIT అనమాట. Information ఉండాలి, అది పదార్థం, ముడి పదార్థం. దాన్ని implement చేయాలి, ఆచరించాలి, అది రెండవ ఐ. final గా ఏం కావాలంటే నేను నిన్నటికంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు, రేపటి కంటే పైరోజు ఒక పరిణామాన్ని నేను చెందాలి. చెందకపోయినట్లయితే showcase లో పుస్తకాల వలె తల నిండా, మస్తిష్కం నిండా పుస్తకాలు గనక ఉన్నట్లయితే ప్రయోజనం లేదని చెప్తూ, ఇవన్నీ కూడా కార్యకలాపాలన్నీ కూడా, ఇగో పతనానికి దారితీస్తే మనం చూపిస్తాం. ఇదిగో చూడండి certificate వాడిచ్చాడు, శాలువా వాడు కప్పాడు, కంకణాలు వీడిచ్చాడు, కాలి కడియాలు వాడు తొడిగాడు చూపిస్తూ ఉన్నాం. అన్నీ వదిలిపెట్టవలసిందే. ఒక వైరాగ్యాన్ని వైభోగంగా ఆవిష్కరిస్తున్నారు. ఆయన negative గా చెప్పటంలే positive గా యదార్థం చెప్తూ ఉన్నారు. ఒక relative గా చెప్పటంలా reality ని చెప్తున్నారు. radical గా చెప్పటంలా rational గా చెప్తున్నారు. కనుకనే ఏమవుతుంది అంటే "కృతి మహోదధౌ పతన కారణం, ఫలమశాశ్వతం, గతి నిరోధకం" ఫలం అంటే పొందినటువంటి ఫలితాలున్నయే అశాశ్వతాలు. ప్రపంచంలో మనం ఎన్నిసార్లు, ఎన్ని వేల లక్షల భోజనాలు ఇప్పటికి చేశామో. ఫలితం కలిగింది కదా. ఏం ఫలితం కలిగింది? ఇవాళ మంచి భోజనం చేశామని, చాలా తృప్తిగా తిన్నామని లేదా చాలా మంచి పని చేశామని ఒక ఫలితాన్ని పొందాం. కానీ, అది అశాశ్వతమే. మళ్ళీ తెల్లవారగానే ఇంకో పుస్తకం, ఇంకో ఫలితం, ఇంకొక ఆలోచన, ఇంకొక విజయం పాత విజయాలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నది. విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని రాసి ప్రపంచానికి అందించినప్పుడు వారిని ఒక ప్రశ్న వేశారు. అయ్యా! భారతదేశంలో కొన్ని వందల రామాయణాలు ఉన్నాయి కదా, మీ దగ్గర ఉన్నటువంటి ప్రజ్ఞతో మీరు మళ్ళీ ఎందుకు రామాయణమే ఎందుకు రాశారు? ఇంకోటి కొత్తది రాయొచ్చు కదా? అని-- అంటే, ఆయన సమాధానం ఇచ్చారు. "మరల ఇదేల రామాయణంబు అన్నచో, ప్రపంచకము ఎల్లవేళల తినుచున్న అన్నమే, తినుచున్న దినాళ్ళు, తన రుచి బ్రతుకులు తనవి గాన, చేసిన సంసారమే చేయుచున్నది, తనదైన అనుభూతి తనది గాన, కొలిచిన రామునే తలతును నేనును, నా భక్తి రచనలు నావి గాన" ఆయన రాముడి గురించి అలా రాశాడు, నేను కూడా రాస్తా. "కవి ప్రతిభ యుండును కవ్య శతాంశమున తొంబదియైన పాండ్లు, ప్రగ్వ్యపశ్చన్ మంతంబున రసము వెయ్యిరెట్లు గొప్పది, నవకదాదృతిరి మించి" కొత్త కథ రాసి ప్రపంచంలో controversy అయ్యేకంటే, ప్రాచీనమైన శ్రీరామ కథ గనక రాసినట్లయితే దానిలో అది రసాత్మకమైన కావ్యం కదా అన్నారు.అంటే ఇక్కడ మనం విచారించవలసింది ఆయన కృతి మహోదధౌ ఎన్ని కృతులో ఎన్ని కర్మలో చేశారు. రచయితగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా అనేక సాహిత్య ప్రక్రియలు చేశారు. కానీ ఆయనకు ఆనందం కైవల్యానందం ఎప్పుడు కలిగింది అంటే రాముడి కథ రాసిననాడే. రాముడి కథ రాయటానికి మళ్ళీ ప్రేరణ ఎవడో ఉండాలి. ఎవరో ఎవరంటే ఆయన తండ్రిగారే. తండ్రిగారు వారిని దగ్గరకు పిలిచి అప్పటికే ప్రఖ్యాతి పొందారు విశ్వనాథవారు అంటే తెలియని వాళ్ళు లేరు. శిష్య ప్రశిష్యులు ఏర్పడ్డారు. ఏది రాసినా వారికే చెల్లిందన్నారు. వారు ఏది రాసినా చెల్లుబాటైనటువంటి రోజుల్లో తండ్రి పిలిచారు. "రాసిన రామచంద్రు కథ వ్రాసితివని పించుకో వృధాయాసము గాక కట్టుకథలు ఐహికమా పరమాయటన్న ఆనా తండ్రి ఆజ్ఞయును జీవుని వేదన రెండు ఏకమై నా సకలోహ వైభవ సనాతనాథ కథన్ రచించెదన్" అంటే నా తండ్రి అడిగాడు "ఎందుకురా నాయనా ఇవన్నీ రాస్తావ్ రాస్తే రాముడి కథ రాశానని పించుకో. సరస్వతీపుత్రుడివేలే పుట్టావ్. రాముడి కథ రాయి మిగతావన్నీ ఏవన్నా ఐహికమా పరమా? అది ఐహికానందమా ఆముష్మికానందమా కైవల్యానందానికి ప్రయత్నించు" అని నా తండ్రి ఆజ్ఞాపించటం ఒకటైతే, నాయందు ఒక జీవుని వేదన ఉన్నది. వేదనని నేను నివేదన, సంవేదన చేశా. చేస్తూ సకల ఊహలు కూడా పెడతా. పెట్టి శ్రీమద్రామాయణ కల్పవృక్షమనే రామకథ రాస్తా" అన్నాడు. అనేప్పటికి ఏమైంది? గతి తప్పవలసిన వాడికి సుగతి ఏర్పడింది. చూశారా? గతి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఫలం అశాశ్వతం మిగతావన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. రామాయణ కల్పవృక్షం నిలబడిపోతుంది. పోతనగారు భోగిని దండకం రాశాడు వెనక్కి వెళ్ళిపోయింది, భాగవతం నిలబడింది. దూర్జటి అనేక పద్యాలు చెప్పాడు అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఎందుకని? రాయలవారి ఆస్థానంలో కామ్యసిద్ధి కోసం పద్యం చెప్పాడు. పోయినాయి. కాళహస్తీశ్వర మహత్యం నిలబడిపోయింది. శతకం నిలబడిపోయింది. కాబట్టి ఏది భగవన్మయమైన భావనతో దేనిని ఆశించకుండా ఫలితాన్ని ఆశించకుండా ఇదంతా దైవం చేయిస్తున్నాడు అన్న భావనలో గనక మనం చేయగలిగితే అవన్నీ కూడా కైవల్యానందానికి దారితీస్తాయి. గతి నిరోధకం. ఫలం అశాశ్వతం. అశాశ్వతమైన ఫలితం కాదు శాశ్వతమైన ఫలితం కావాలి. ఐహికానందం ముందే విచారణ చేశా మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది, మళ్ళీ ఇవే యాతనలు. ఆముష్మికానందం అనేకమైనటువంటి ఆనందాలు లోపల కలుగుతాయి. కానీ ఆనందాన్ని మించిన బ్రహ్మానందాన్ని పరమానందాన్ని హిరణ్యగర్భానందాన్ని పొందవలసినటువంటి రీతిలో కార్యకలాపాలు చేసుకున్నట్లయితే అది నిత్యమై, నూతనమై, నవనవోన్మేషమై, గంభీరమై, ఉదాత్తమై, ప్రవాహమై, వాహిని స్వరూపమై నీకు ఒక ఆనందాన్ని కలిగిస్తుంది గనుక ఆనంద రేఖాంచితమైనటువంటి కార్యకలాపాలు చేయమని చెప్తూ ఫలమశాశ్వతం గతి నిరోధకం. నువ్వు వెళుతున్న మార్గంలో ఇవన్నీ అడ్డు. ఎవరో పిలుస్తారు "నీ అంతటి వాళ్ళు లేడు" అంటారు. ఎవరో పిలుస్తారు "నీకీ సన్మానం చేస్తున్నాను" అంటారు. ఎవరో పిలుస్తారు "నీకీ లక్ష రూపాయలు ఇస్తున్నాను" అంటారు. ఇవన్నీ అశాశ్వతమే అంటున్నారు. గతి నిరోధకం నువ్వెళుతున్న దారికి ఇవన్నీ అడ్డంకులు అంటున్నారు. భగవాన్! నువ్వు వెళ్ళవలసిన దారి ఏది? నీ లక్ష్యం ఏమిటి? నీ గమ్యం ఏమిటంటే నిన్ను నీవు ఎరుగు ఎరుకలోకి వెళుతున్నావ్. ఎరుకలో అనటం కూడా ఒక సాధనే, వినటం కూడా ఒక సాధనే. అనటం తీవ్రమైన సాధన, వినటం అంతకంటే తీవ్రమైన సాధన. ఎందుకంటే నవవిధ భక్తులు గనక మనం చూసుకున్నట్లయితే శ్రవణానికి ప్రాధాన్యత ఇచ్చారు. ముందసలు మనం వినకపోతే, విన్నది మరణం చేసుకోకపోతే, మరణం చేసుకున్న దాన్ని జీర్ణించుకోకపోతే, జీర్ణించుకున్న దానిని ఆచరించకపోతే విన్నదంతా వృధా. మరి అన్నవాడికేమిటి లాభం అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఎక్కడో ఒక తోటలో గుమ్మడి పాదు ఉంటే తీగ సాగి సాగి ఎక్కడో పక్కవాడి పొలంలోకి వెళ్ళినా అక్కడ పుష్పించి ఫలించి ఒక పెద్ద గుమ్మడికాయ ఎట్లాగైతే ఎవ్వరికీ చెప్పకుండా తుడిమెనించి తనను తాను విడుదలచుకొని విడిపించుకొని విముక్తమైపోతుందో అన్నవాడికి కూడా ఫలితం ఉంటుంది. అయితే అలా అవ్వాలి అని చెప్పాడా? మళ్ళీ కృతి మహోదధౌ పతన కారణం. నేను ఎన్ని ఉపన్యాసాలు చేశాను. ఉపన్యాస కేసరి అంటున్నారు నన్నంటే రెండో వాడు అంటున్నాడు ఉపన్యాసమునకే సరి అంటున్నాడు. అంటే ఆచరించాలి. ఆచరణాత్మకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక భావనా భూమికని ఒక యావార్థికమైనటువంటి అతి వాస్తవికమైనటువంటి ఒక అబ్సల్యూట్ రియాలిటీతో ఉన్నటువంటి ఒక తెరమీద ఒక యవనిక మీద రమణులు ఆవిష్కరిస్తున్నారు. ఆవిష్కరిస్తూ వీటి కోసం మీరు పని చేయకండి. మీరు చేస్తూ వెళ్ళండి, అవన్నీ మీకు ఏర్పడతాయి. ఏర్పడినవి కర్త ఇచ్చాడు అనుకోండి. ఏదిస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఆనందంగా స్వీకరించండి. ఇది ఇంతేనా అని నిరాశ చెందకండి. ఇంకా పొందవలసినవి చాలా ముందు ముందు ఉంటాయి గనుక ఇప్పుడు క్షణాన్న నీవు చేసిన కర్తవ్యాలలో నుంచి నీవు పొందినటువంటి లబ్ధిని గనక నీవు ఆనందించగలిగినట్లయితే, ఎందుకంటే చేతిలో ఉన్నదానిని ఆనందించాలి. పట్టుకున్నదే కొమ్మ, పట్టనిది కొమ్మ కాదు. చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నా మనం పట్టగలిగింది ఒక్క కొమ్మే. ఇది మానవుడు నేర్వవలసింది. విశాలమైన విస్తృత ప్రపంచంలో ఒక మహానది ఉన్నా సముద్రం దగ్గరకు వెళ్ళినా మన పాత్ర ఎంత ఉన్నదో అన్ని నీళ్లే తెచ్చుకోగలం. సముద్రమంతా మన ఇంట్లోకి రావాలంటే మనం మునిగిపోతాం. అలాగే నదంతా మనవైపు రావాలంటే కొట్టుకుపోతాం. మరి ఏం చేయాలి? పాత్రని, పాత్రతనిఅంటే మన అర్హతని, మన eligibility ని, మన ప్రజ్ఞని, మన శక్తి యుక్తులని, మన కర్మ సుకౌశలాన్ని అన్నింటినీ సమన్వయం చేసి మనము ఏర్పరచుకున్నటువంటి లక్ష్య గమ్యాల వైపు మనం వెళ్ళవలసి ఉన్నది. వెళ్లి తీరాలి. కర్మలు చేయవలసిందే కానీ ఉపేక్షతో కాదు, అపేక్షతో కాదు, నిరపేక్షతో చేయాలి. ఉపేక్ష అంటే a state of indifference. పోనీ జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు వాడెవడో చూసేవాడున్నాడు అట్లా చేయమనలే. లేదు కర్మలు చేస్తూ ఉంటా ప్రతి దానికి నాకు ఫలితం రావాలి, రాదు. మరి ఏం చేయాలి? నిరపేక్షతో చెయ్. అపేక్ష అవద్దు, ఉపేక్ష అవద్దు మధ్యే మార్గం ఎంచుకో. నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నీకు రావలసినది, పొందవలసినది, నీకు చెందవలసినది, కర్త తప్పకుండా ఇస్తాడు. అందుకనే రెండవ శ్లోకం కర్త యొక్క దయాగుణాన్ని, కర్తృత్వం వహిస్తున్న వాడికి, నీవు నేను చేస్తున్నాను అనే భావన నుంచి విడిపడమని, దాని వలన కైవల్యానందాన్ని నీవు పొందగలవని, పొందాలి అని భగవాన్ రమణులు సూచిస్తూ "కృతి మహోదధౌ పతన కారణం, ఫలమశాశ్వతం, గతి నిరోధకం" కవులు, పండితులు, శాస్త్రజ్ఞులు వీళ్లంతా మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత దాకా హాయిగా వచ్చేస్తారు. ఎవరైనా రావచ్చు అక్కడి దాకా. వచ్చేప్పటికి లోకం మనల్ని గుర్తిస్తుంది. నువ్వు జ్ఞానివి అంటుంది. అవునా? అనక్కర్లే. మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే. లేకపోయినట్లయితే, అవును నువ్వన్నది నిజమే అని మన మనస్సు అంగీకరించిందా అయిపోతాం. అనాహతంలో నుంచి హతమైపోతాం గనుక అక్కడి నుంచి పతనమై మళ్ళీ మూలాధారంలోకి వైకుంఠపాళిలో ఎట్లాగైతే మళ్ళీ తోక దగ్గరకు వస్తామో, పడగ దాకా చేరుకోలేమో అట్లాగే మానవ జీవితంలో కూడా నేను ఇన్ని పనులు చేశాను, ఇన్ని గుళ్ళు కట్టాను, ఇన్ని సంస్థలకు చందా ఇచ్చాను, ఇంతమందిని పోషించాను. నిన్ను పోషిస్తున్నది ఎవరు? ప్రశ్న వేసుకోమన్నారు. నువ్వు పోషిస్తున్నది నిజమే కానీ నిన్ను పోషిస్తున్నది ఎవరు? నీకు అవకాశం ఎట్లా కల్పించబడింది? నువ్వు స్థాయికి ఎలా రాగలిగావు? నీ కర్మ ఉదాత్తమైన కర్మల ద్వారా నువ్వు స్థాయికి వెళ్లగలిగావు. వెళ్లగలిగిన నువ్వు మిగతా వారందరికీ ఆదర్శప్రాయమైనావు అని చెప్తూ "ఫలమశాశ్వతం, గతి నిరోధకం" ఎక్కడైనా ఫలితాలన్నీ నావే, నావే, నా వల్లే, నా వల్లే అనుకున్నావా? నిన్ను నీవు display చేసుకుంటూ వెళ్ళావా? ప్రపంచానికి project చేసుకుంటూ వెళ్ళావా? గతి నిరోధకం. నీ గమ్యం వైపు నిన్ను అది వెళ్ళనివ్వదు. నీ ఆత్మానుభూతిని పొందేటువంటి స్థాయి నుంచి నిన్ను పతనం చేస్తుంది గనుక కర్మలు కూడా ఆలోచించి, విచారించి, ఎంతవరకు చేయగలమో దానికి పరిమితులు ఎరిగి చేయమని చెప్తూ భగవాన్ కర్మానుష్ఠాన భూమికని స్పష్టం చేస్తూ ఉపదేశ సారంలో మనకి రెండవ శ్లోకాన్ని సమర్థవంతంగా, అర్థవంతంగా, పూర్ణంగా, జ్ఞానమండితంగా, అద్వైత భావనలో మనకి విస్పష్టం చేస్తున్నారు. తదుపరి విచారణ మనం నెమ్మదిగా కొనసాగిద్దాం.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -11

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -11

Source: TFC Spiritual on YouTube

0:00 / 16:31

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

    Now playing
  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77