Skip to content
Transcript తెలుగు
లారవింద సుహృద సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన బ్రాహ్మణ్యం స్థితోతు పితరం వటమూల వాసం సంస్మారయంతమచలం తమనుస్మరామి భగవాన్ శ్రీ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ భగవాన్ అధ్యాత్మ మార్గంలో ప్రయాణించాలి సంచారం చేయాలి ఆత్మానంద పద లబ్దిని పొందాలి అని ఆశించే సాధకులకి ఒక మార్గోపదేశనం చేస్తూ ఉపదేశ సారాన్ని అనుగ్రహించారు. సదసద్వివేక విచారణలో భాగంగా నిన్న మనం అనేక విషయాలు మాట్లాడుకున్నాం జగత ఈశది యుక్త సేవనం అంటూ జగత్తుని పరమేశ్వరుడి యొక్క ప్రతిరూపంగా భావించమని సేవనం అంటే భావనం అని అర్థం. భావించాలి దేనినైనా ఆలోచన చేయాలి సంభావన చేయాలి పరిపూర్ణమైనటువంటి ఒక విచార ధారలోకి వెళ్ళబోయే ముందు ఏవి మన గమనాన్ని గతిని అడ్డుకుంటున్నాయో ఏవి నెమ్మదిస్తున్నాయో దేనివలన మన అడుగు ముందుకు పట్టం లేదో దేనివలన మన అడుగు వేగంగా సాగటం లేదో వాటన్నింటినీ కూడా చక్కగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని విషయాన్ని అర్థం చేసుకుని చేసేదే సాధన ఎందుకంటే అర్థం లేకుండా చేసే పనైనా వ్యర్థమే గనుక ఇక్కడ ఈశ్వరుడితో కూడిన ప్రపంచము నిజానికి ప్రపంచం ఈశ్వరుడితోనే కూడి ఉన్నది అని చెప్తూ ఈశావాస్యమిదం అన్నటువంటి ఈశావాస్యోపనిషత్తుకి ఒక సమగ్ర వ్యాఖ్యానం చేస్తూ జడ చైతన్యాలతో కూడిన ప్రపంచము అటువంటి జడ చైతన్యాలతో కూడినటువంటి దేహము రెండూ పరస్పరం ఆధార ఆధేయాలుగా ఉన్నాయి అంటే వ్యక్తి లేకపోతే వ్యవస్థ లేదు వ్యవస్థ ప్రపంచము సృష్టి లేకపోతే వ్యక్తి కూడా లేడు. ఇటువంటి ఒక దివ్య భావనా గరిమ లో నుంచి భగవాన్ మనల్ని ఇంకా ముందుకు తీసుకు వెళ్తున్నారు ఏం చెప్తున్నారు సేవ చేయాలి భావన చేయాలి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాలి ప్రకృతిని పరమేశ్వరుడిగా భావించు అరుణాచలాన్ని నేను శివుడిగా భావించాను కదా అని అంటూ నిజానికి అరుణాచలం క్షేత్రంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఒక పక్కన కదలని కొండ దానికి ఒక పక్కన అరుణాచలేశ్వర దేవాలయం మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి దేవాలయాన్ని దర్శనం చేయాలి అక్కడ అమ్మవారు అయ్యవారు విడివిడిగా ఉంటారు అర్ధనారీశ్వర తత్వంలో ఉండరు అయ్యవారు లింగాకృతిలో ఉంటారు ఆయన అరుణాచలేశ్వరుడు అమ్మవారు వేరే దేవాలయంలో పక్కనే ఉంటుంది ఆమె పేరు అపీత కుచాంబిక. అక్కడ అది దేవాలయం గనుక శివుడు జంగమదేవుడు గనుక స్థాణువు గనుక ఆయన మాట్లాడడు అరుణాచలేశ్వర దేవాలయం అంతా కూడా మహానిశ్శబ్దాన్ని ఆవరించి ఉన్-ఉంటుంది కొండ పలకదు గుడిలో ఉన్న దైవము పలకదు అతి విచిత్రం ఏమిటంటే రమణాశ్రమంలో ఉన్నటువంటి భగవాన్ రమణులు పలకరు అంటే అరుణాచల క్షేత్రం అంతా కూడా శబ్దాలయం కాదు అది నిశ్శబ్ద మహిమా స్వరూపం మౌన వ్యాఖ్యలు జరుగుతూ ఉంటాయి అక్కడ మన మనసును కూడా మౌనంలోకి నెట్టుకోగలిగినట్లయితే మనం కూడా వాచక తపస్సు నుంచి నెమ్మదిగా బయటపడి మానసికం వైపు వెళ్ళగలిగినట్లయితే ఏమీ లేదు ఊరకుండండి అన్నటువంటి భగవాన్ ఆలోచనని వారి సూచనని వారి బోధనని మనం ఆచరణాత్మకం చేసుకోగలిగినట్లయితే అది మనల్ని నెమ్మదిగా మనో బుద్ధి చిత్ అహంకారములు దాటి ఆత్మ వైపు నడిపిస్తుంది ఇది తజ్యం. నిన్న అనుకున్నాం చింతన అనేటువంటి శబ్దాన్ని గురించి పదాన్ని గురించి విచారణ చేశాం. చింతన అంటే మన మూలాలు వెతుక్కోవటమే అంటే నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకోవటమే నేను ఎవరు అన్నటువంటి ప్రశ్న వేసుకోవటానికి ముందు అనేక అధ్యాత్మిక ప్రక్రియలున్నాయి. పూజ అన్నాం వాక్కు అన్నాం స్తోత్రి గీతాలు అనుకున్నాం ఇగో ఉపన్యాసాలు ప్రవచనాలు ఇవన్నీ ప్రపంచంలో ఉండనే ఉన్నాయి కానీ ఇవన్నీ విజ్ఞాన కోశానికి చెందిన విషయాలే. విజ్ఞానాన్ని దాటి సుజ్ఞానం వైపు ప్రజ్ఞానం వైపు మనిషి వెళ్ళాలి అందుకనే ప్రజ్ఞాన పీఠం వరకు వెళ్లగలిగిన వాడు బ్రహ్మమే అవుతున్నాడు. ఇక నిజానికి అక్కడ తెలుసుకోవాల్సిందంటూ ఏమీ లేదు తెలుసుకున్న దానిని ఒక స్వాత్మానంద స్థితిలో అనుభవిస్తూ ఉండటమేఆ స్వాత్మానంద స్థితికే బ్రహ్మానందం అని, పరమానందం అని అనేకమైనటువంటి పేర్లు. అది ఒక ఘాడత్వాన్ని, గాంభీర్యాన్ని సంతరించుకున్నప్పుడు, ఒక నిశ్చలమైన, నిర్మలమైన స్థాయికి చేరుకున్నప్పుడు అది ఏమవుతున్నది అంటే హిరణ్యగర్భానందం అవుతున్నది. మౌనాన్ని ఆశ్రయించాలి. మౌనమే ని-- అసలైనటువంటి భాష. ఒక నిరంతర వాక్ప్రవాహం కంటే మౌనంలో స్థగితమైనటువంటి, తనను తాను నిలబెట్టుకున్నటువంటి, తాను రమిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని గనక పొందగలిగినట్లయితే మౌనమే శుద్ధమౌనం. "నేను ఈవేళ మౌనంలో ఉన్నాను, ఎవరితో మాట్లాడను" అంటూనే మనం చీటీల మీద instructions రాస్తూ ఉంటాం. అది మౌనం కాదు. వాచామౌనాన్ని దాటాలి, మానసిక మౌనంలోకి మనం వెళ్ళాలి. అనేకమైన ఆలోచనలు మనల్ని ముంచెత్తుతున్నప్పుడు, పరస్పర విరుద్ధ భావజాలాలు మనల్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు, జరిగిన దానివలన కలిగిన బాధను, జరగబోయే దానిని ఊహించుకొని భయాన్ని జీవుడు గనక అనుభవిస్తూ ఉంటే వర్తమానంలో తాను జీవించేది ఎప్పుడు? ఇది ప్రశ్న. మనిషికి ముప్పై ఏళ్ళు, నలభై ఏళ్ళు వస్తాయి. అంటే జీవితాన్ని కొంత గడిపాడన్నమాట. గడిపాడు గనుక కొన్ని సంఘటనలు, సందర్భాలు, సన్నివేశాలు ఏర్పడున్నాయి. తద్వారా కొన్ని అనుభవాలు కూడా కలిగినాయి. అనుభవాలన్నీ కూడా కొన్ని ఫలితాలు ఇచ్చినాయి. ఫలితాలు మంచివా చెడ్డవా మనం చేసిన కర్మలను బట్టి ఉన్నాయి. అవి నెమ్మదిగా కాలగర్భంలో సందర్భాలు వెనక్కి పోయినా అవి జ్ఞాపకాలుగా, స్మృతులుగా మిగిలిపోయినాయి. స్మృతులు మనస్సుని వీడకుండా మనస్సు మీద ఒక చిర ముద్ర, imprint అంటాం, అది వేసుకున్నప్పుడు కాల గమనంలో మళ్ళీ అవే మరొక్కసారి, మరొక్కసారి పునః పునః. మళ్ళీ మనకు గుర్తొచ్చినప్పుడల్లా ఆనందాన్ని, సుఖాన్ని, కష్టాన్ని, పరివేదనని మనం అనుభవిస్తూ ఉన్నాం. పని జరిగి చాలా ఏళ్ళు అయిపోయింది. కాలగర్భంలో అది కలిసే పోయింది. జరిగిన సంఘటనకి మనకు ఎట్టి సంబంధం లేకుండా పోయింది. కానీ స్మృతి మనల్ని వీడటం లేదు. జ్ఞాపకం వదిలిపెట్టడం లేదు. జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా ఆనందమన్నా అనుభవిస్తున్నాడు, దుఃఖమన్నా అనుభవిస్తున్నాడు. మరి వీటిని ఏం చేయాలి? వర్తమానాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి పలచన చేసేటువంటి బాధని మన దగ్గర ఉంచుకుందామా? రేపు తెల్లవారితే ఏమవుతుందో, రాబోయే కాలాలు ఎట్లా ఉంటాయో, అసలు మనం జీవించగలమా, ఆనందం ఎప్పుడన్నా పొందుతామా, దుఃఖం ఎప్పటికైనా తీరేనా, భవిష్యత్తు ఏమిటి అని ప్రశ్నించుకొని దాని వలన ఒక భయాన్ని మనమే సృష్టించుకొని ఇటు బాధకి, అటు భయానికి మధ్య ఆనందకరంగా సాగించవలసిన వర్తమానాన్ని మనం చేజేతులా పోగొట్టుకోవటం లేదా? ఇది ప్రశ్న. ఉపదేశ సారంలో భగవాన్ రమణులు జరుగుతున్న వాటన్నింటికీ సాక్షిభూతంగా ఉండటం నే-నేర్చుకోమన్నారు. ఏది ఎప్పుడు ఎట్లా జరగవలసి ఉన్నదో అది జరిగి తీరుతుంది. నీవు ఎంత ప్రయత్నించినా జరగరానిది జరిగే అవకాశం లేదు. కాబట్టి నువ్వు ఎవరివి నిమిత్త మాత్రుడవై ఉండాలి. ఎప్పుడైతే సాక్షిభూతమైన స్థితి non-doership నేను చేశానని కానీ, నాది అన్న మమకారం కానీ మనల్ని వదిలిపెట్టవో మనం అధ్యాత్మలో ముందుకు వెళ్ళలేం. అద్భుతమైన ప్రసంగాలు చేసినా, గంభీర ఉపన్యాసాలు చేసినా, ప్రచండమైన ప్రబోధాలు చేసినా నిజానికి వాడు జ్ఞాని కాడు. విజ్ఞానమయ కోశంలో కాస్త కుదుట పడ్డవాడు అనర్థం. మరి జ్ఞాని ఎవరు? ఎవరైతే సాక్షిభూతంగా ఉంటున్నాడో, ఎవరిని ఏదీ అంటకుండా ఉన్నదో, పద్మపత్రం ఇవాంబస అన్నాడు జగద్గురువైన కృష్ణ పరమాత్మ. తామరాకు మీద నీటి బొట్టు వలె ఏది రాని, ఏది పోని, తనలో తాను నెలకొన చెంది ఉన్నటువంటి వాడు తన ఉనికి వలన, అస్తిత్వం వలన, వ్యక్తిత్వం వలన తన చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఒక శాంతిని, ఆనందాన్ని, ఒక పరితృప్తిని, ఒక సమాధానాన్ని, ఒక తెలియనటువంటి చల్లదనాన్ని, హాయిని, ప్రసన్నతను, ప్రశాంతతను అనుగ్రహించేటువంటి వాడు జ్ఞాని అవుతున్నాడు. జ్ఞానికి మాటలతో నిజానికి పనిలేదు. ఇవాళ మాట్లాడుకుంటున్న నాలుగు మాటలు, వింటున్నటువంటి నాలుగు మాటలు పంచకోశాలకు బయటే ఉన్నాయన్నారు రమణ మహర్షి. పంచకోశాల బయట జరిగేదంతా నిజానికి తంతే. మాట్లాడటము ఒక తంతే, వినటం కూడా ఒక తంతే. మాటలు మలగి, మౌనం వెలిగి మన లోపలికి మనం గనక ప్రయాణం చేయగలిగితే, మన బాహ్య దృష్టిని అంతర్దృష్టి చేసుకోగలిగినట్లయితే, వస్తు ప్రపంచం నుంచి సద్వస్తువు వైపు మన మనస్సుని మరల్చగలిగినట్లయితే అది అత్యుత్తమమైనటువంటి సాధన.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -18

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -18

Source: TFC Spiritual on YouTube

0:00 / 13:10

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

    Now playing
  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77