No transcript for this section.
Transcript begins at 0:00.
[మంత్ర వాక్యం] [మంత్ర వాక్యం] వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనశ్శయే జంగలికాయమానే సంసార హాలాహల మోహ శాంతయే, ఇవాళ భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో, విశ్వ సంగీత మహా ప్రపంచంలో, ఈ సృష్టిలో ఒక మహత్ పూర్ణమైనటువంటి రోజు. ఏ సరస్వతీ దేవి పునరా రూపమై మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనబడేటువంటి ఒక దేహాన్ని ఆశ్రయించి సర్వ ప్రపంచాన్ని కూడా స్వర తరంగాలపై, ఆనందలహరులపై సుమారుగా ఎనిమిది దశాబ్దాలు ఓలలాడించినటువంటి మూర్తిమంతమైనటువంటి దర్శనం ఇవాళ. మామూలు విషయం కాదు. అట్లాగే సుమారుగా తొమ్మిది దశాబ్దాలు భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో సనాతనమైనటువంటి వైదిక, ఆర్ష, భారతీయమైనటువంటి ఒక తత్వ చింతని సామాన్య జనులకు కూడా అందించి, కడుపు నింపి, కన్నీరు తుడిచి, మానవుడు మానవుడిగా జీవించాలని ప్రబోధించిన సత్యసాయి భగవానుడి యొక్క మహత్ పూర్ణ అవతార వైభవంలో ఇది ఒక ఆనంద రేఖ. ఈ రెండూ కలిసింది ఇది గురు కాలం. గురు కాలానికి రెండు కారణాలున్నాయి. ఒకటి జూలై ఆరున సరస్వతీ దేవి ఏ కృష్ణుడు ఏ మురళి వాయించాడో ఎవరికీ తెలియదు, అదో దేహాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చింది. అలాగే ఇరవై రెండు అదే నెలలో వ్యాస భగవానుడు వచ్చినటువంటి రోజు గురుపూర్ణిమ. కనుక ఈ క్ష-- ఈ క్షణాలన్నీ కూడా గురు కాలమే. ఈ గురు కాలంలో మీ అనేకమైనటువంటి కచేరీలు సుమారుగా ఈ ఉపాధి కూడా యాభై ఏళ్లుగా వింటూ ఉన్నది గనుక, గురువుకి మీరు ఎప్పుడూ కూడా పెద్ద పీట వేశారు. భారతీయమైన తత్వ చింతలో గురు స్థానం చాలా గొప్పది. ఇవాళ నూట యాభై ఐదు దేశాలలో ఉన్నటువంటి జాతి, మత, వర్గ, వర్ణాలకి అతీతంగా స్వామి సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా, అలాగే భారతీయ తత్వాన్ని అందించే దిశగా స్వామి చేయవలసినటువంటి పని ఆయన చేశారు. ఈరోజు ముందుగా మీ నుంచి ఆ గురుతత్వాన్ని ఇవాళ ఈ తరం, మా తర్వాత రాబోయేటువంటి తరాలు గురువుని ఎట్లా అసలు ఆరాధించాలి, అసలు ఆ గురువు ఎవరు, ఎందుకు? అది కాసేపు మాట్లాడుకుందాం. ఉమ్, అలా చెప్పు. అలా అటువంటి ముఖ్యమైన విషయాలు గురించి మాట్లాడుకోవడం ఆరోగ్యదాయకం. ఆత్మకి, మనసుకి సంతోషం కలిగించేది. "గురువు లేక ఎటువంటి గుణికీ తెలియకపోదు" అని త్యాగరాజ స్వామి చెప్పినట్టు. దేనికైనా అసలు గురి ఉండాలి. ఆ గురి లేకపోతే ఏ పని చేయలేము. అర్జునుడికి బాణం ఇస్తే కూడా గురి సరిగ్గా పెట్టకపోతే మూలానే పని జరిగేది లేకపోతే. అటువంటి గురి, దాని గురుత్వం అని పేరు. ఈ గురువులు, శిష్యులు, విద్యాభ్యాసం, విద్య నేర్పడం, ఇవన్నీ కూడా అనంతమైనటువంటి విషయాలు. అందుకనే గురు భక్తికి మించినది లేదన్నారు పెద్దలు. నాకు నా అనుభవంలో మా అమ్మగారు వీణా విదుషి. మా నాన్న ఫ్లూట్. చాలా ఆదర్శంగా మె-- కళ్యాణం జరిగింది వాళ్ళకి. పద్దానుగు కొం-- కొద్ది నెలల్లోనే మా అమ్మగారు గర్భిణీతో ఉండడం, నేను పుట్టడం. నేను పుట్టిన వెంటనే మా అమ్మగారు ఎక్కడో ఒక పల్లెటూరులో ఉండేవారు, మా నాన్న విజయవాడలో ఉండేవారు. మరి ఆవిడకి ఏం తట్టిందో అక్కడి నుంచి టెలిగ్రామ్ ఇప్పించారు మా నాన్నను, అమ్మని. ఆ రోజుల్లో టెలిగ్రామ్ అంటే మరి వెళ్లాలంటే విజయవాడ నుంచి ఆ శంకర్ గుప్తా వెళ్లాలంటే ఒక ఇరవై నాలుగు గంటలు మినిమమ్ పడుతుంది. పట్టింది, వచ్చా-- వచ్చేదాకా మా అమ్మగారు బతికున్నది. ఆవిడ నన్ను గురించి సమస్తము, ఈరోజు జరిగే విషయాన్ని గురించి కూడా తా-- సహా మా నాన్నకి చెప్పి, ఇటువంటి ఒక కుమారుణ్ణి కల-- కలగడం కోసమని, సృష్టి కరగడం కోసమని చెప్పి నన్ను పుట్టించాడు దేవుడు. దానికి మీరు నాకు పతిగా ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు "ఈ కుర్రవాణ్ణి గురించి నేను చెప్పవలసిన మాటలు కొన్ని ఉన్నాయి" అని అన్నీ చెప్పేసి "నాకు సెలవు ఇవ్వండి, శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలి, నాకు సెలవు ఇవ్వండి."నేను ఎందుకు పుట్టాను ఆ కారణం అయిపోయింది నాకు. నన్ను అమ్మవారు పిలుస్తున్నారు నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. మళ్ళీ మా నాన్న ఇంకో వివాహం చేసుకోడానికి గాని ఏదీ లేదు. మా తల్లి, మా తల్లులు ఐదుగురు అప్ప చెల్లెళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అందులో మా ఆవిడ ఆఖరి ఆవిడ. మొట్ట మొదటి పెద్ద ఆవిడేమో ఆవిడకి తొమ్మిదో ఏట పెళ్లి అయి పదకొండో ఏట వైధవ్యం వచ్చింది. ఆవిడకి ఎవ్వరు లేరు ఆవిడ చూసుకుంటారు అని చెప్పేసి ఆవిడ చూసుకున్నారు. ఆవిడే నాకు అమ్మగా తెలుసు. సరే జీవితం అంతా తర్వాత ఎక్కడెక్కడో ఉన్నాము రాజమండ్రి, ఏ ఊరు, ఈ ఊరు, ఆ ఊరు ఉండి ఆఖరికి మా నాన్న బెజవాడలో settle అయిపోయాడు అప్పుడు ఏదో మూడు పాఠశాలలు చెప్పుకునే వాళ్ళు యాభైయో నలభైయో వచ్చేది విపరీతమైన డబ్బు అది సుఖంగా నాకు ఒక life settle చేసి పెట్టి. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం తప్ప ఇంకేమీ తెలియదు. మా నాన్న ఎవరికైనా పాఠం చెబుతుంటే ఎక్కడైనా తప్పు పడితే పాకుతూ వెళ్ళిన ఆ ఆ అని అంటా తప్పు పడుతోంది నాన్నకి . అది నాకు జన్మతా వచ్చింది గానీ సంగీతాన్ని గురించి నాకేం తెలియదు అని చెప్పాను. సంగీతాన్ని గురించి నాకేమీ తెలియదు. ఐ-ఐ-ఐ డోంట్ నో మ్యూజిక్ అని statement ఇచ్చా ఇప్పుడు recently గా. మరి ఎలా పాడుతున్నావ్ అన్నారు music because music knows me. నాకు నేను ఒక instrument ని. నీకు కావలిస్తే వచ్చి పాడుకో లేకపోతే వదిలేయ్ నాకేమిటి ఇలాగే ఎలాగో బతుకుతాను. అందువల్ల నాకు సంగీతం వేరు సంగీతం వచ్చి నాతో పాడుతోంది గానీ నాకు సంగీతం తెలుసు అని గానీ నేను పాడుతున్నాను గానీ ఈ క్షణం వరకు ఎప్పుడూ అనుకోలేదు. వచ్చినప్పుడు సంగీతం వస్తుంది, పోతుంది. దానికి రుజువు ఏమిటంటే మా ఇంట్లో ఇంతవరకి తంబురా సృష్టించడం గానీ hum చేయడం గానీ ఇంతవరకు ఎవరూ కనలేదు. మామూలుగా కూడా పాడుకోను. సంగీతం తక్కిన వాళ్ళు చేస్తారు గానీ పాడటం మాత్రం ఉండదు. ఎవరికైనా శిష్యులకు పాఠం చెప్తే చెప్పడం తప్ప. లేకపోతే ఏమీ సంగీతం నేను పాడతానని విషయం మా ఇంటి ఎవరికీ తెలియదు. నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించను. గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. పారుపడి రామకృష్ణ అయిపంతులు గారు. వారి గురువు గారు సుశీల లక్ష్మమ్మ శాస్త్రి గారు. వారి గురువు గారు మహానంబు జాడు వెంకట సుబ్బయ్య గారు. వారి గురువు గారు జాగర్లమూడి స్వామి. నేను ఐదో పరంపరలో వాడిని. అందులో జాగర్లమూడి స్వామి ఎలా పాడారో అవన్నీ కూడా స్వరంతో రాసుకుని ఆ tunes correct గా నాకు లభించాయి. చాలామంది ఇష్టమొచ్చినట్లు పాడేయడం కొత్త సంగతులు వేసేయడం అని నేను అలా చేయను. మా గురువు గారి దగ్గర ఏం చెప్పారో ఆ సంగతే పాడతా. రాగాన్ని ఇష్టమొచ్చినట్లు స్వరకల్పన చేయగలను కీర్తన మాత్రం నేను మార్చను. అందువల్ల నేను కీర్తన పాడుతున్నప్పుడు అర్థం తెలుస్తుంది. సాహిత్యం తెలుసుకుని పాడతాను. ఈ జాగర్లమూడి స్వామి ఎలా పాడి ఉంటారు అలా పాడటానికి ప్రయత్నిస్తాను నేను అంతేగాని. ఇగో మరి వ్యాపారం అయిపోయింది కాబట్టి రాగం పాడటం స్వర వేయడం ముక్తాయ స్వరాలు, వయొలిన్, మృదంగం, తనియా, వర్త, వేణుగోపాలం అన్నీ వచ్చాయి కాబట్టి అది వేరు. కీర్తన పాడేప్పుడు మాత్రం నేను ఏవీ మార్పులు చేయను గానీ సొంత సంగతులు వేయను గానీ నేను చేయను. ఇందులో విశేషం ఏమి పోయిందంటే జాగర్లమూడి స్వామి వారి దగ్గర శిష్యులు కూడా రకరకాలుగా ముందు ఉంటారు కదా. వాళ్ళకి పైకాలను పలకదు. అవన్నీ ఆ పైకాలం తీసేశారు. వాళ్ళు నిదానంగా దానం ఇస్తూ పాడలేడు. వాళ్ళు తీసేశారు. అప్పుడు జాగర్లమూడి స్వామే నా దగ్గరికి వచ్చి ఇలా ఇలా పాడాలబ్బాయి అని చెప్పారు. నేను పాడుతున్నాను. అది అందువల్లనే నేను పాడుతుంటే సాహిత్యం అర్థమవుతుంది, రసం ఉంటుంది, కల్పనా శక్తి ఉంటుంది అన్నీ ఉంటాయి. మా నాన్నగారు flute వాయించేవారు. నన్ను flute మాత్రం నువ్వు వాయించకూడదు అని నా దగ్గర ప్రామిస్ చేసుకున్నారు ఆయన. నేను ఇంక అని flute ముట్టుకోలేదు. instrument ఏదైనా వాయించే వేణువు వాయించడం కూడా ఆయనకి ఇష్టం లేదు మా అమ్మగారు వేణువు వాయస్తారు కాబట్టి. ఆయన వయొలిన్ వాయించేవారు మా నాన్నగారు. వయొలిన్ కూడా వాయించొద్దు అన్నారు. నాకు వయొలిన్ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను ద్వారా వెంకటస్వామి నాయుడు గారి వయొలిన్ వినీ వయొలిన్ పట్ల నాకు ఆసక్తి పుట్టింది. ఒకసారి మా నాన్నగారు ఊరికి వెళ్లారు. వెళ్ళినప్పుడు వయొలిన్ ఉంది అక్కడ నాకు కాగబట్టలేక ఆ వయొలిన్ తీసి వాయించేశాను first time. చాలు పెట్టి మా అమ్మగారు చూసి సంతోషిం-- ఆ ఏం అనలేదు. నాన్న వచ్చాక చూశారా వయొలిన్ వాయిస్తేగా అబ్బాయి కుర్రాడు బాగాను అని. ఏమరా వయొలిన్ వాయించావా? అవును. ఏం వాయించావ్? వెడిపోతు వర్ణం వాయించాను. వాయించు, వాయించాను. first time మెత్తగానే. అప్పటి నుంచి వయొలిన్ వాయించడానికి మా నాన్న permission ఇచ్చారు. ఆ వయొలిన్ లేదా మృదంగం వాయించుతుంటే అది వింటాం. ఓ రోజు మృదంగం ఒకసారి ఏమైందంటే మృదంగం వాయించుతుంటే ఒక తప్పు వాయించితే కచేరీలోనే నేను మృదంగం తీసి నేను వాయించేశాను first time. కంజీరా. వీణ ఇంకొకళ్ళకి చెప్పేంత వరకు నేను వీణ వాయించగలను. ఎందుకంటే వీణ వాయించితే ఏమవుతుందంటే ఇక్కడ ఒక రకమైన మృదుత్వం పోతుంది. అప్పుడు వాయొలిన్ వాయించడం కుదరదు. అందుకని వీణ వాయించను. నేర్పేంత వరకు వాయించగలను. ఆ విధంగా నా సంగీత జీవితం ఇప్పటికే-ఇప్పటికే ఆ దాదాపు ఏడున్నర, ఎనిమిది దశాబ్దాల నుంచి ఆ సంగీతం తప్ప నాకేమీ తెలియదు. ఏవో కొన్ని కొన్ని కారణాలు రావడం దాంట్లో నాకు ఒక inspiration రావడం ఎలా అయ్యిందంటే నేను ఆలింద రేడియోలో పనిచేశాను. నాకు రేడియో నాకు దేవాలయం. సంగీత ఆలయంగా నేను భావిస్తాను. నాకు అందులో ఉద్యోగం చేయాలి. నాకు చదువు రాదు. ఎలాగా? నేను మద్రాసు రేడియోలో పాడాను. ఇక్కడ పాడాను, ఇక్కడ పాడాను. ఆఖరికి బెజవాడలో రేడియో స్టేషన్ వచ్చింది. అప్పుడు నేనే, నేనే ఇనాగరేషన్ పాడాను. మద్రాసు రేడియో స్టేషన్ కూడా సొంత హోమ్ వచ్చిన తర్వాత ఆఖరికి నేనే ఇనాగరేషన్ పాడాను. సరే అందులో నాకేదైనా ఉద్యోగం కావాలని చెప్తే అప్పుడు వీరభ-- అయ్యగారు వీరభద్రరావుగారు అని general manager గా ఉంటే, నువ్వేం చేస్తావ్ ఉద్యోగం? నీకేముంటుంది ఉద్యోగం? నాకేం చదువు రాదు కదా. ఏముందని ఇప్పుడు నేను ఏదో announcer గా వేయండి లేకపోతే ఏదైనా నాటకాల్లో వ్యాఖ్యలు వేసేవాళ్ళుగా మీరు ఉపయోగించుకోండి. లేకపోతే తంబూరా వేస్తాను. తంబూరా artist గా appoint చేయండి నన్ను. అప్పుడు ఆయనేం చేశారు ఓ రోజు నన్ను పిలిచి రేపు పొద్దున్న జాయిన్ అవ్వాలి అని రేడియోలో. music supervisor అని ఒక post create చేసి రెండు వందల యాభై రూపాయలు జీతం.చేసి లేదా చేద్దాం అదే. ఇదేం సార్ మా ఇంటి ఏమిటి ఏదైనా ఉద్యోగం చేయ్ ఉద్యోగం చేద్దాం అంటే మీరు చదువుకోలేదు మీకు ఏం ఉద్యోగం వస్తుంది అని పాపం అనుకుంటుంటే నేను చదువుకోలేదు మరి నేనేం చేయాలి చెప్పండి. ఆఖరికి నేను ఒక నాన్నతో చెప్పి నాకు చదువుకోవాలని మేనమ్మ మాస్టర్ ని పెట్టానంటే ఒక మాస్టారు వచ్చి చెప్తే వచ్చి కూర్చునేవాడిని, నన్ను పాఠం అనేవాడిని వినేవాడిని, వెళ్ళిపోయేవాడిని అంతే ఏం చెప్పడానికి లేదు. మరి సంగీతం అంటే ఇష్టం లేని ఆయన ఒకాయన ఉన్నారు సంగీతం మంచిది కాదు సంగీత పారు good మంచి వాళ్ళు కారు ఆయన అభిప్రాయం అది నాకు ఎంత మంచి పని జరిగిందో. ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆయన సంగీతం ఒక్కటే నేర్చుకున్నాను ఎంత మూడు నెలలు. ఆయన వచ్చి వీడికి చదువు రాదు చదువుకో అంటే వాడేదో ఒకటా వెళ్ళిపోయారు. అప్పుడు మా నాన్న ఏం చేశారంటే అక్కడ ఒకరోజు అరుస్తుంటే మీ మీద వాళ్ళది మున్సిపల్ హైస్కూల్ అని ఒకటి ఉంది అక్కడికి తీసుకెళ్లారు. హెడ్ మాస్టారు దగ్గరికి వెళ్ళాం మీరు అంటే మీరు పాడతారు కదా పాట పాడవయ్యా అన్నారు అప్పుడే పాడేసాం సంతోషించి Sixt standard లో join చేసేశారు Sixt standard ఓరమ్మాళ్ రావు. సరే మూడు నెలలు అయింది లెక్కల పేపర్ వచ్చింది జీరో వచ్చింది ఆయన్ని పిలిచి ఇచ్చా ఇప్పుడు వద్దులెండి తర్వాత అడిగి తీసుకుంటా అన్నా. ఆ జీరో అయితే మా నాన్న మళ్ళా వచ్చి నీకు సిగ్గుగా లేదా సున్నా తెచ్చుకున్నావు అంటే కాదు నాన్న అంత గుండ్రంగా నేను సున్నా చుట్టాను ఎంత ప్రయత్నిస్తున్నా నాకు రాలేదు రావటం లేదు [నవ్వు] అన్నాను నేను. అలా నా జీవితం గడిచిపోయింది తర్వాత కొన్ని కొన్ని కొన్ని జరిగాయి ఒకప్పుడు ఒక నేను రేడియో లో పాడుతుంటే ఒక english announcer ఆడ వచ్చి ఇలా అంది ఇలా అంటే ఏం చేయాలో నాకు తెలియదు english లో మాట్లాడింది బ్యా అన్నాను ఒక చూపు చూసింది నన్ను ఏమిటి దాన్ని ఏమంటారంటే ఎదురుపడితే వెడవ వెడవల ఒక చూపు ఆ చూపు వెళ్ళి ఇక్కడ గుచ్చుకుందన్నట్టు. అప్పుడు మాస్టారు ని పిలిచి ఏమిటి కావాలి నీకు అన్నా ఇంగ్లీషు మాట్లాడాలి ఇంగ్లీషు రాయాలి english మా చెప్పి ఎవరైనా మాట్లాడినా నాకు అర్థం కావాలి దాని దగ్గర ఒక మాస్టారు ని పెట్టి six months seventh month I gave a lecture in um rotary club in english. ఆ విధంగా కొంచెం english నేర్చుకోవడం వల్ల నాకు మంచి పని జరిగింది. సంగీతం ఎలా వచ్చిందో నాకు తెలియదు. తర్వాత వీటన్నిటికీ ఒక మా విమలానంద భారతి స్వామి వారిని మా గురువు గారికి ఆధ్యాత్మిక గురువు ఆయన చాతూరు మాది చేసి మా ఇంటికి ఎదురుగుండానే ఉన్న ఇంట్లో ఉంటే ఆయన రోజూ పిలిచేవారు ఏదో పాడేవాడిని అయిపోయేది. అప్పుడు ఒకరోజు ఆయన ఒక ప్రశ్న వేశారు చాగరాయ స్వామి ఎందుకని అంత గొప్పోడు అయిపోయాడోయ్ అన్నారు. నాకేం తెలుసు అన్నా. ఎవ్వరూ చేయని పని ఆయన చేశారు నువ్వు కూడా ఎవరు చేయని పని చెయ్యి. అంతేగాని అవే పాడుతూ కూర్చుంటే లాభం లేదు. అప్పుడు రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఆలోచిస్తే ఈ సంగీతానికి మెట్లు డెబ్బై రెండు మెలకత్తలు ఈ డెబ్బై రెండు మెలకత్తల్లోంచే ప్రపంచ సంగీతం అంతా పుట్టింది అది నేను prove చేశా. కానీ డెబ్బై రెండు మెలకత్తలు ఎవరు సరిగ్గా పాడటం తెలియదు మంచి కీర్తనలు లేవు ఎవడో ఆయన్ని ఇంకా అరవై రాశాడు కానీ ఆ మెలకత్త రాగం రాగం ప్రతి ఒక రాగం ఒక శంకరాభరణం ఉంది ఒక ఒక చారుకేశి రాగం ఉందనుకోండి కింద శంకరాభరణం పైన తోడి అది చారుకేశి కానీ అలా పాడుతున్నారు కానీ చారుకేశి పాటల్లా. దానికి కారణం ఏమిటంటే గమకాలు యొక్క వివరాలు తెలియకపోవడం. ఇలాంటి రహస్యాలు నాకు రావడం వల్లని మొదట డెబ్బై రెండు మెలకత్తల రాగాల స్వరూపాలు చెప్పాలని కూర్చుని ఆరు నెలల్లో డెబ్బై రెండు మెలకత్తలు సంస్కృతంలో తెలుగులో రాశాను నాకు సంస్కృతం రాదు. తర్వాత పెద్దవాళ్ళు చూపిస్తే ఎంత బాగుందోయ్ సంస్కృతం ఒక్క తప్పు లేదు యతి ప్రాసలన్నీ correct గా ఉన్నాయోయ్ అన్నారు. నేను చేస్తే కదా అది బాగానే ఉండి తీరాలి అన్నాను. అలాగే అరవం నేర్చుకున్నాను అరవంలో పోయెట్రీ అయ్యాను పోయెట్రీ చేశాను నేను కన్నడంలో పాడాను మలయాళంలో పాడాను Hindi పాడాను Bengali పాడాను Orissa పాడాను. బెంగాలీలో పాడినందుకు నాకు two రెండు doctorates వచ్చాయి రవీంద్ర సంగీతానికి రెండు doctorates వచ్చాయి. ఏది పట్టి బెంగాలీలో పాడి వాళ్ళు వచ్చి బెంగాలీలో మాట్లాడ అన్నారు నేను ఏమో తల ఊపి వేయడం. ఇందువల్ల పాడేటప్పుడు దాని అర్థం ఉచ్చారణ తెలుసుకుని పాడటం అలవాటు నాకు. ఆ విధంగా జీవిత చరిత్ర ఇలా అయిపోతుంది ఇలా ఉండగా ఒక ఒకసారి ఏమైందంటే నాకు ఒక ఉత్తరం వచ్చింది నాన్నా అని అబ్బాయిని పిలిచి మొన్న ఆ రోజున ఒక కచేరీ నేను విన్నాను చాలా బాగుంది ఈ పాట అని ఉత్తరం దానికి నేను reply ఇవ్వడం ఇలా correspondence జరిగాయి. సరే ఆయన ఎవరో సంగీత విద్వాంసుడు కాబోలు కాబోలు అనుకున్నాను తీరా చూస్తే ఆయన సత్యసాయి బాబా. ఆయన నాకు మేము ఇద్దరం correspondence ఉత్తరాలు రాసుకోవడం. ఆయన పిలిచి ఆయన దగ్గర పాడించుకున్నారు. పాడించుకుంటే నేను పాడాను ఆయన విబుది అది ఇచ్చారు అంతా బానే ఉంది. తిరిగి ఆ మొన్న నేను మద్రాసు వచ్చి చేరాలంటే చాలా కష్టం ఆ ఊరు అక్కడి నుంచి ఒక నదిలో బల్లకట్టు దాటి అక్కడి నుంచి బండి మీద వెళ్లి railway station కి వెళ్లి రైలు ఎక్కాలి. ఆయన కచేరీ అయిపోయింది కచేరీ అయిపోగానే మొన్నటి పొద్దున్నే బయలుదేరాం బయలుదేరితే ఆ వరద వరదలు వచ్చేసాయి మేము బల్లకట్టి పోయము అన్నారు. ఎవరు సరే గాని ఒక boat లో బయలుదేరి వచ్చేసాం. పొత్తే రైలు దాటిపోయింది. ఒకొక్క వాడిని పట్టుకుని car లో మద్రాసు చేరి మొత్తం మీద కట్టి, ఇది అన్ని కష్టాలే నాకు. ఆయన్ని మొట్టమొదట చూసినప్పుడు అన్ని పరీక్షలు. ఆయన తర్వాత నేను లేనప్పుడుగా ఆయన అందరితోపోయినా వాడి కష్టపడి వెళ్ళాడు ఈ కష్టం చాలా మంచిది అతనికి అని చెప్పారు. ఇది చెప్పంటే ఆయనతో నాకు సంబంధం వచ్చి ఒక నా దృష్టిలో ఆయన భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని ప్రజలకు చెప్పడం కోసమని అవతరించినటువంటి మహాపురుషుడని నా అభిప్రాయం అని చెప్పారు. ఇది సత్యం ఆయనే మనకి సాయం.ఆయన బాబా, గురువు. ఆ విధంగా నాతో-- నాకు ఆయనతో ఎంత పరిచయం అయ్యిందంటే, ఒకటే చెప్పారు ఆయన, "పిలవకుండా ఎక్కడికి వెళ్లి పాడొద్దు. నా దగ్గర కూడా పాడొద్దు" అని చెప్పారు. అది తూ.చ. ఈ రోజు వరకు నేను పాటిస్తున్నాను. ఆయన్ని పిలిచినప్పుడే వెళ్ళాను, పిలవనప్పుడు వెళ్ళలేదు. చివరి దశలో ఆయన నన్ను పిలవలేదు. నేను వెళ్ళకాయన, మేమిద్దరు నూతనాలు ఆసుగుతూ ఉండేవాళ్ళం. నా దృష్టిలో భగవంతుడు అనే వాడు ఉన్నాడబ్బాయ్ అనేటటువంటి-- అని ఒక నిరూపించడం కోసమని అవతార ఎత్తినటువంటి మహానుభావుడు శ్రీ సాయిబాబా. పోవడమా? రాముడు పోలేదా? కృష్ణుడు పోలేదా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తులు పోలేదా? అందరూ పోయారు. పోవడం పుట్టుట, గిట్టుట కొరకే. ఎవరు పుట్టినా పోవడం కోసమేగాని. ఎందుకు పుట్టాలి? అని దాని మీద పెద్ద discussion పెద్ద పెద్ద వాళ్ళంతా. అందరూ మాట్లాడేవారు. చి-- చివరికి నన్ను మాట్లాడమన్నారు. "ఈ పుట్టుక ఎందుకంటే? పోవడం కోసం సార్" అన్నాను, అంతే. యదృశ్యం తన్నశ్యం అంతే. అలాగే చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ పురాణాలు ఇంకా వినడం, నాకు తెలిసిన మాటలు మాట్లాడడం, నాకది సరిగ్గా పడలేదని చెప్పడం, ఇవన్నీ జరగడం వాళ్ళు ఉప్పు ఓడడం కూడా ఈ చదువులన్నిటికీ తెలుసు. మాతో బాబా గారు ప్రాసంగికంగా కాస్త ఏకాంతంలో మాట్లాడేటప్పుడు చాలాసార్లు మీ ప్రస్తావన వచ్చేది. ప్రధానంగా నేను పొందినటువంటి అనేక విషయాలు. ఇవాళ మీరు ఎట్లాగైతే స్వామి భగవంతుడు ఉన్నాడు అని చెప్పటానికి వచ్చినటువంటి ఒక సత్యం, ఒక నిదర్శనం అని ఎట్లా చెప్పారో, అసలు భారతీయమైనటువంటి అచ్చమైన సంగీతం, అందునా త్యాగరాజ స్వామి వారి original వారు ఎలా పాడారో అది పాడటానికి వచ్చిందే బాలమురళీకృష్ణ గారు అని స్వామి వారు చెప్పారు. ఇది-ఇది సత్యం. ఇక్కడ ఒక చిన్న విషయం, మీకు పదిహేనేళ్ళు మీ వయస్సు అప్పుడు. డెబ్బై రెండు మేళకర్త రాగాలకు మీరు స్వరకల్పన చేసేశారు, అందులో ముప్పై రెండోది. సాహిత్యం కూడా. సాహిత్యం కూడా, అదే. ముప్పై రెండో దానికి "ఆ నారదాది" ఆ! "హనుమదునిర-నిరంతరము ఉపాసించు సుదాసు". ఆ నారదా, ఆ నారదా. ఆ అది ఉందే, అది ఒక్క త్యాగరాజ ముద్ర. ఇంకా ఎవ్వరూ పట్టుకోలేకపోయినారు. ఎందుకని అంటే "ఆ నారదాది" అన్నది ఆయనే, ఆ తర్వాత మళ్ళీ మీరే. ఈ విషయము స్వామి చెప్పారు. అంటే ఎంత-- మీరన్నట్లు స్వామి దగ్గరకు వచ్చి మీరు పాడలేదనే లోకం అనుకుంటుంది గానీ. పాడాను. పాడారు. రెండు సార్లు పాడారు. పిలిచారు, పిలిచారు. పాడాను. అశోకా హాల్లో పాడారు. ఆయన ఎందుకు చెప్పారు? ఆయన చెప్పిందే నేను పాడా-- "పిలుస్తే గానీ వెళ్ళి పాడొద్దు" అన్నారు. ఆయన పిలవలేదు కనుక పాడలేదు, అంతే. ఆ మాట ఆయన చెప్పారు. నేను-నేను కొన్ని-- నువ్వు-నువ్వు పుట్టిని పెరిగి ఉంటే అక్కడ కూర్చొని ఇక్కడ పాడకు నువ్వు. నేను పిలుస్తాను. రెండవది మీరు పాడిన చోటికెల్లా ఆయన వచ్చారు. ఆ అది ఈ మధ్య జరిగింది. అది, సరే. ఈ మధ్య ఏం జరిగిందంటే, ఆయన భక్తులు చాలామంది వెళ్లి అక్కడికి వెళ్తూ ఉన్నాం, పాడుతూ ఉన్నాం. జరిగింది. నన్ను అడిగారు "ఎందుకు వెళ్ళట్లేదూ?" అంటే, "స్వామి వారు నన్ను పిలుస్తా ఉన్నారు. పిలిచేదాకా పాడొద్దన్నారు ఎక్కడా, నేను వెళ్ళట్లేదు" అన్నా. వాళ్ళనడిగారు-- ఆయన్ను అడిగారు వెళ్లి, "ఏమండీ! అందరం ఏమో వచ్చి పాడుతున్నాం కదా, ఆయన మిమ్ముల్ని పిలుస్తే గానీ రాదన్నారటా? రావుద్దన్నారటా? ఎందుకని మీరు అక్కడికొచ్చి ఆయనకి పాడేటువంటి అవకాశం కలిగించట్లేదూ?" అన్నారట. ఆయన, "ఎప్పుడూ అన్న ప్రతి కచేరీలోనూ మొట్టమొదట నేను ఎదురుగుండా కూర్చొని వినేవాడిని నేనే, మీకెవరికీ తెలీదు" అన్నారట. అర్థం అవుతుంది. "మొట్టమొదట వినేవాడిని నేనే, చివరిదాకా ఉండేవాడిని నేనే. ఒక్క కచేరీని ఇప్పటివరకు miss అవ్వలేదు." మరి అటువంటి ఒక మహాదాశీర్వాదం నాకు లభించింది నా జన్మలో అంటే, జన్మ సాఫల్యమైందని నేను అనుకుంటున్నాను. ఆయన గురించి మనం ఇవాళ అనుకోవడం కూడా నాకు జరగబోయేటువంటి కాలం మహోన్నతంగా ఉంటుందని, ఉత్కృష్టింగ్-- ఉత్కృష్టంగా ఉంటుందని, ఈ మధ్య కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగి ఏమో ఎట్లా ఉంటుందో future అనుకునే స్థితి వచ్చినప్పుడు, ఆయన గురించి ఇవాళ మాట్లాడటం దానికి అవకాశం మీరివ్వడం ఉందే, అంతకంటే ఇది మరో అదృష్టం లేదు నాకు. ఏనుగు అంత బలం వచ్చింది. ఇవాళ స్వామి దేహంలో ఉండగా ప్రశాంతి నిలయానికి వచ్చి మీరు పాడి ఉంటే అందరితో పాటు ఒకరై ఉండేవారు. ఇవాళ వారు స్వామి దేహంలో లేరు, సర్వాత్మగా ఉన్నారు. ఆ సమయంలో ఈ చల్లని సాయంకాలం మనమిద్దరం కూర్చొని స్వామి గురించి ఇంత చక్కగా మాట్లాడుకోవటం అంటే ఘనవదనుగ్రహం అది. అందులో సందేహం లేదు. చిన్న-చిన్నది కాదు అలలు, తుంపరలు వస్తూ ఉంటాయి, సముద్రం కదలకుండానే ఉందిగా. అదే, అందులో ముఖ్యంగా నేను ఇప్పుడు కొన్ని కర్ణాటక కొన్ని చికాకుల్లో ఉండటం, ఏమిటో ఆలోచించేటువంటి సందర్భంలో వారిని గురించి మాట్లాడు, వారిని గురించి తెలుసుకోవడానికి వచ్చిన నాకు అవకాశం ఇదే. దాంతో నాకు ఏనుగు అంత బలం వచ్చింది. ఆయన మిమ్మల్ని పంపారు నా దగ్గరికి. నాకీ మంచి మంచి మంచి సమయం కాబట్టి, "నాయనా! నువ్వెళ్ళు ఆయనతో మాట్లాడు కొంచెం. ఆయనకీ బాగుంటుంది" అని ఆయన మీకు-మీకు ఆజ్ఞాపిస్తే మీరొచ్చి వారు మాట్లాడారు. అందువల్ల నేను చాలా పర్వదినం, చాలా మంచి రోజు. ఇంక నాకు ఏ future గురించి నాకు ఏం జరగబోతుందనేటువంటి భయం లేదు. హాయిగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడిని, ఈ మధ్య నవ్వు లే-- నవ్వు రావట్లేదు అని చెప్పి ఇగో మన ముఖ్య మా బాయ్ ప్రకాష్ రావు, మీరొచ్చి నాకినే కొంచెం-- ఒం-- బయటకొచ్చి చెప్పి ఇక్కడికి, ఐదు నిమిషాల పాటు వచ్చి చెప్పా, నన్ను చూడడానికి కోసం అని. ఈ మధ్య ఎలా ఉన్నావ్ అంటే, ఊ అంతా-- వాళ్ళని చూడగానే నాకన్నీ పాదాలు జ్ఞాపకం చే-- అన్నీ మర్చిపోయాను. సుఖంగా ఉన్నాను. ఏవో చిన్న చిన్నవి వస్తాయి అనుకోండి, కానీ ఈసారి కొంచెం serious గా వచ్చాయి. కొన్ని కొన్ని ముఖ్-పెద్ద ముఖ్యమైన విషయాలు జరిగినప్పుడు కొన్ని serious గానే ఉంటాయి కదా. వాటి ఉదృతి ఉంటుందిగా. ఉదృతి ఉంటాయి. ఉంటుంది. ఉండడం వల్ల దాన్ని మనం దాటించేస్తే ఇంక మనకి ఆ ఉదృతి అంతా పోతుంది. ఒకటి మీరు సమస్త ప్రపంచాన్ని మీ సంగీతం అనేటువంటి ఆత్మ ప్రజ్ఞతో సుషుమ్నా గీతంతో ఇంతమందిని తరింపజేశారే, మీది ఏమున్నది సత్యసాయి భగవానుడు ఇవాళ మీ-మీరన్నట్లు మిమ్మల్ని చల్లగా చూడాలి, ఈ ప్రపంచానికి మీరు వందో సంవత్సరం కూడా ఇలా పాడుతూనే ఆ చిరునవ్వుతో మీరుండాలి.ఇది ప్రపంచం కోరుకునేటువంటి కోరిక. ఇంకా ఇ--ఇప్పుడేమిటంటే సంగీతంలో ఇవి సంప్రదాయాలు మార్పు ఇవి ఏంటంటే మన భారతీయ సంగీతం ముఖ్యంగా కర్ణాటక సంగీతం అనేటువంటి పేరులో ఒక సంగీతం ఉంది. నేను చెప్పాను కదా కర్ణాటక సంగీతం అనేది లేదన్నాను. కర్ణాట సంగీతం అంటే అర్థం ఏమిటంటే కర్ణాః అటతి కర్నేషు అటతి ఇది కర్ణాటక. చెవికి ఇంపుగా ఉన్నది ప్రతిదీ ఇది కర్ణాట సంగీతమేనను. నాకు ముఖ్యంగా అదృష్టం అంటే నాకు సరస్వతి గారు నా జీవితంలోకి రావడం. ఎందుకని మా అమ్మగారు చెప్పారు "నా వేణువు ఒక స్వరూపంగా వచ్చి అబ్బాయిని చూసుకుంటుంది." అది ఆశీర్వచనం. బాధ పడద్దు. ఆశీర్వచనం. అలాగే ఆ సరస్వతి అవతారం ఇవిడ రావడం. ఇంక నాకు ఏ విషయంలోనైనా దేనికి ఆలోచన చేయొద్దు అన్నీ ఆవిడ చూసుకుంటుంది. ఒక ఊరు వెళ్లాలంటే ఎక్కడికెళ్తే, పొద్దున్న లేదే ఉన్నా నాలుగింటికి కారు వస్తుంది ఊరు వెళ్లాలి అంటే. ఇవన్నీ సమస్తం ఆవిడ పట్టుకొస్తుంది. ఎక్కడ ఏం తినాలి, ఎప్పుడు భోంచేయాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎవరు లేకపోతే ఏం చేయాలి. సమస్తం నేను ఇవాళ ఇలా ఉండడానికి కారణం సరస్వతి గారే. ఆవిడ మా అమ్మ వేణు ఈ స్వరూపంగా వచ్చి నన్ను కాపాడుతుందని మా అమ్మగారు చెప్పింది వాక్యం వేదవాక్యం. అందువల్ల ఇప్పుడు నాకు సంగీతాన్ని గురించి మీరు ఎవరో జ్ఞాపకం చేస్తే తప్ప సంగీతం నాకు వస్తాదని గాని, నేను పాడతానని గాని ఎప్పు--హం చేయడం కానీ ఎప్పుడూ లేదు. ఎందుకంటే "ఏమయ్యా నువ్వు ప్రాక్టీస్ చేయవు ఏమిటి?" ఎందుకండీ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి నేను. "ఎవరికి వస్తది మీరు సంగీతం ఎప్పుడూ హం కూడా చేయరు" అన్నారు. మీరు అలా అంటే నాకు సంగీతం తెలియదు అన్నాను. "ఏమిటండీ ఇలా అంటారు" అంటే నేను "ఎలా పాడతాను సంగీతానికి నన్ను తెలుసు? ఒక వేణువు ఉంది అక్కడ వయోలిన్ ఉంది, దానికి సంగీతం వస్తదా? ఎవరన్నా వహిస్తేనే కదా. అలాగే నేను సంగీతాన్ని ఎవరన్నా వచ్చి పాడితే పాడతాను, వాయించమంటే వాయిస్తాను లేకపోతే లేదు. నాతోటి నేను సంగీతం పాడదు సంగీతానికి ఏం తెలియదు." అది. [నవ్వు] ఇక్కడ ఒక విషయం మీ గురించి స్వామి గురించి అంటే ఒక ఎనాలజీలో సమాంతరంగా ఎంత అద్భుతంగా ఈ ఎనిమిది దశాబ్-- తొమ్మిది నిజానికి. ఆ ఈ తొమ్మిది దశాబ్దాలు మీరిద్దరూ ఉత్తరాలు ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు. ఆ అది నాకు తెలుసు. అవును. ఆ స్వామి చెప్పినందువల్ల తెలిసింది. అది వేళ మీరు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసేశారు. ఆయన సర్వ దేశాలని ఏకం చేస్తే మీరు సర్వ ప్రపంచాలని సంగీతం ద్వారా ఏకం చేశారు. అలాగే ఉత్తర దేశపు సంగీతం, దక్షిణ దేశ సంగీతం లేదంటూ నేషనల్ ఇంటిగ్రేషన్ లో ఫస్ట్ జుగల్బంది మీరు. మీరే పాడాం. మీరే పాడారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో పెద్ద, పెద్ద విద్వాంసులందరూ కూడా, విద్వాంసులందరికీ నేను గురువుని. గురువు. వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పాడింది నేను పాడేసాను, నేను పాడింది వాళ్ళు వేళ్ళేపోతున్నారు. ఇది నా గొప్పతనం కాదు నాయనా సంగీత యొక్క గొప్పతనం అది. ఇది తెలుసుకోండి మీరు అని చెప్పారు. నాకు బాగా గుర్తు మీరు భీమ్ సేన్ జోషి గారి చేత తెలుగులో పాడించటం అనేది ఒక అపురూప సన్నివేశం. తెలుగు ఆయన పాట ఆయన భాషలో మా-- పాడారు. నా భాషనే పాడనీయలేదు. ఆయన మాట మరిచిపోయి నేను ఏ పాడిందే పాట మరిచిపో- పాట మొదలు పెట్టారు. మే--మీ నుంచి ఆయన ఆ ప్రవాహాన్ని అందుకున్నారు. చాలా అది రమణీయ సన్నివేశం. అలా అందరితోనూ మా విద్వాంసులతో అందరితో పాడాను, ఇన్స్ట్రుమెంటలిస్టుతో పాడాను, అందరితోనూ పాడాను. పు-- నేను చెప్పాను భారతీయ సంగీతం కర్ణాటక సంగీతం అంటే అర్థం ఇదబ్బాయ్ చెవికి, చెవికి ఇంపుగా ఉండాలి. మీరు, మీరు పాడుతున్నది మీరు వాయించినది కర్ణాట సంగీతమే, నేను పాడేది కర్ణాట సంగీతమే. నవరాగ సృష్టి, గణేశ, సిద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా. ఓంకారంతో వీటన్నింటినీ ఒక సృష్టించాలి అనేటువంటి భావన రావటం కూడా అది త్యాగరాజ పరంపరలో వచ్చినటువంటిదేనా? అంటే త్యాగరాజ స్వామి పరంపర అంటే ఏమిటంటే త్యాగరాజ స్వామికి పరంపర ఏమిటంటే కొన్ని రాగాలకి స్వరూపం ఇది అని సృష్టించారు. సృష్టించారు. ఆ. ఆయన కావాలని ఏమీ చేయలేదు. ఆ. ఆయనకి అంతే. అంతే. అది జరిగిపోయింది. శిష్యులు ఉన్నారు కాబట్టి అవి పైకి రాసుకున్నారు కాబట్టి పైకి వచ్చాయి. అందుకనే శిష్యుల్ని, శిష్యులు, శిష్యులు లేకపోతే నన్ను అందరూ మరిచిపోతారు. వాళ్ళుండాలి ఏం పాడుతున్నా వినాలి. ఇప్పుడు ఏమిటి మనకి? ఆ రోజుల్లో ఏం సౌకర్యాలున్నాయండి. పైగా సముద్రం దాటితే మంచిది కాదని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు దాటలేదు కాబట్టి. ఆ. మనం చేయలేని పని- మంచిది కాదు అన్నాం. ఇప్పుడేమిటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ప్రపంచమంతా చూడచ్చు, వినచ్చు. మరి ఎక్కడికి వెళ్లి అలా ఆ విధంగా ఎన్ని ఆరు వేల క్యాసెట్లు ఇవిడి దగ్గర ఉన్నాయి సరస్వతి గారి దగ్గర కచేరీలు. సరే మీవే ఇరవై ఏడు వేల కచేరీలు దాటిపోయింది కదా. దాటిపోయింది. దాటిపోయింది లెక్కలేదు ఇప్పుడు. ఇరవై ఏడు వేలు రికార్డ్ చేశారు. అప్పటికి ఈ సౌకర్యాలు లేవు కాబట్టి మనం ఏమీ దాటిపోయిందని వీల్లేకపోతుంది. ఇప్పుడు నేను చేసిన ప్రతి పని, ప్రతి కవిత్వం, ప్రతి సంగీతం ఆవిడ ఎప్పటిదో జేసిస్తుంది. ఆ ఉమ్ ప్రయత్నంగా రాని-- ఆ పనిలో ఉండేసి ఎన్ని ఉన్నాయి మీరు ఒక్కసారి వాళ్ళ ఆఫీస్ ఒకసారి చూద్దురు గాని. సరే. మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అది చూడు చాలదు ఇంకో బిల్డింగ్ కొనాలి ఇప్పుడు. అక్కడికి వెళ్తే మీకు నేనేవడో తెలిసిపోతుంది. ఒకసారి చూసిరి, చూసిరండి తప్పకుండా. ఆవిడకి ఇంకేం పని లేదు. ఇదే పని. దాంతో నాకు ఏమైపోయింది నాకు ఇంకేం పనుల్లేకపోయినాయి. పాడటం తప్ప. వచ్చి లర్చి, లర్చి వస్తూ ఉంటాయి అనుకోండి అవి. అవి వాటిని పట్టించుకోనక్కర్లే దూది పింజుల వలే పోతాయి. అవేమీ మన దగ్గర కాపురం చేసేవేం కాదు. వెళ్ళిపోతాయి. అవన్నీ లెక్కచేయవు. స్వామి అవతార వైభవంలో ఇ-ఇది రెండు పారుశ్వాలు ఆ చిచ్ఛక్తి యొక్క రెండు పారుశ్వాలని కళ్లారా చూసినటువంటి, వాటితో కూడి ఉన్నటువంటి యోగాన్ని కూడా మా బోటి వాళ్ళందరం కూడా మేము పొందాం. మాకు అటువంటి అనుగ్రహం- తో ఇంటిమసీ. సవి-- తో ఇంటిమసీతో. ఇంటిమసీ. తో ప్రేమతో. ప్రేమతో. ఆయనకి అసలు ప్రేమ స్వరూపమే కదా నాయనా. ప్రేమకి ఒక స్వరూపం ఆయన. స్వరూపం స్వామి. రూపం అది. మరి నేను ఆయన్ని చూసి అదృష్టం నాకు కలిగింది కదా. ఆయన ఆశీర్వాదం తీసుకుని అదృష్టం నాకు కలిగింది కదా. అంతకంటే ఏం కావాలి చెప్పండి.అతి త్వరలో మీరు ప్రశాంతి నిలయానికి వచ్చి స్వామి సన్నిధానంలో వారు అందరూ అంటారు form to formless form to formless అంటారు form గా ఉన్నప్పుడే ఆయన formless Correct Formless గా ఉన్నప్పుడే ఆయన form జగరాజ స్వామి వారు ఉన్నారా లేదా రాముడు ఉన్నాడా లేదా కృష్ణుడు ఉన్నాడా లేదా సత్య సాయి భగవానుడు ఉన్నట్లే అంతే మరి ఎందుక [నవ్వు] అది అత్యంత సమీప కాలంలో గురు స్వరూపం అయినటువంటి మీరు ప్రశాంతి నిలయానికి రావాలి ప్రశాంతి నిలయంలో తప్పకుండా అంతకన్నా అన్ని దేశాలు వచ్చి మిమ్మల్ని ఆ మీ సంగీతాన్ని విని ఆ ఆయన సంకల్పం జరుగుతుంది మీ ద్వారా వచ్చింది అది జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది అంతే జరుగుతుంది అంతకంటే ఏమి లేదు దాని సందేహం ఏమి లేదు [నవ్వు] ఇవాళ ఈ రేడియో సాయి శ్రోతలు ఉమ్ వాళ్ళకి కూడా పర్వదినం ఎందుకని అంటే తెలుగు జాతి అంతా కూడా ఆ జాతులు ఎక్కడ ఉండనివ్వండి ఏ దేశంలో ఉండనివ్వండి బాలమురళీకృష్ణ గారు స్వామి మీద పాడితే ఎప్పుడు వింటాము అన్నటువంటి సందర్భంలో ఆ తరుణం ఇప్పుడు ఆసన్నమైంది అదా మాట అంతే కదా మరి ఆ తరుణం ఆసన్నమైంది ఇక మీరు కరుణ గురిపించాలి ఆయనేమో వచ్చి రాసి వెళ్ళిపోతారు పాడి వెళ్ళిపోతారు అంతే అవును అంతే అంతకంటే ఏముంది [నవ్వు] మీకు ప్రశాంతి నిలయానికి సంపూర్ణమైనటువంటి హృదయంతో సప్రేమకంగా ఆహ్వానం పలుకుతూ ఉమ్ స్వామిని గురించి మీరు చాలా చాలా చాలా subtle గా సుదీర్ఘంగా కాకపోయినా చాలా నిర్దుష్టంగా ఖచ్చితంగా ఈ ప్రపంచానికి ఆయన ప్రేమ స్వరూపమని సత్య స్వరూపమని దైవం ఉన్నాడా లేడా సందేహం అక్కర్లేదు విడువగానే ఊహూ అని చెప్పడానికి వచ్చారని తప్పకుండా మీరు సంపూర్ణంగా అంటే ఒక తండ్రిని తండ్రి ఎలా ఎల్లకాలం మనతో ఉండాలి అని ప్రతి బిడ్డ కోరుకుంటాడో నా గురువు నా అభివృద్ధిని చూసి అన్నివేళలా physical level లో కూడా ఎట్లా ఉండి ఆశీర్వదించాలని కోరుకుంటాడో మేము మీరు మీ వందవ సంవత్సరం నాడు కూడా ఒక్క కచేరీ చెయ్యాలి ఆ వందేళ్లు నూరు శరత్తులు మీ జీవితం పండు వెన్నెల లాగా పరమాద్భుతం అని మీరే పాడారుగా జీవితమే కృష్ణ సంగీతం అని ఆ కృష్ణ సంగీతంలో లీల ఉంది హేల ఉంది కేల ఉంది దాంట్లో లేనిదేమీ లేదు ఆ కృష్ణత్వాన్ని స్వామి దయ మీ నోటి వాక్యం బట్టి వల్ల అన్నీ తప్పకుండా జరుగుతాయి అంతే మీరు వస్తున్నారు వస్తాను అంతే సాయిరాం [కీ బోర్డ్ ధ్వని]
YouTube · audio
Conversation with PADMA VIBHUSHAN Dr. M BALAMURALI KRISHNA - (TELUGU)
Conversation with PADMA VIBHUSHAN Dr. M BALAMURALI KRISHNA - (TELUGU)
0:00 / 33:01